Wikibooks
tewikibooks
https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.39.0-wmf.21
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
Wikibooks
Wikibooks చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/I
0
3001
33306
33221
2022-07-22T03:55:43Z
Vemurione
1689
/* I */
wikitext
text/x-wiki
=నిఘంటువు=
*This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
==I==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
*
* '''I, pron. నేను;
* iamb, n. పద్యంలో వచ్చే లగం అనే గణం; ఒక లఘువు, తరువాత ఒక గురువు ఉన్న గణం; (rel.) foot అంటే గణం; iamb అంటే లగం; line అంటే పాదం;
* iambic pentameter, n. లఘువు, గురువు చొప్పున ఐదు వరుసగా వచ్చే పద్య పాదం; అయిదు లగాలు ఉన్న పద్య పాదం; (note) iambic pentameter is a metrical speech rhythm that is natural to the English language, and one that Shakespeare made use of; ex: EVery TIME we TALK, we STRING toGETHer ACCented and UNACCented SYLLables withOUT even THINKing aBOUT it;
* iambus, n. లగం; ఛందస్సులో లఘువు వెంబడి గురువు ఉన్న గణం;
* iatrogenic disease, n. వైద్యుడి వల్ల కాని వైద్య సిబ్బంది వల్ల కాని కలుగజేయబడ్డ రుగ్మత; వైద్యం చెయ్యడం వల్ల వచ్చిన వ్యాధి;
* ibex, n. స్కీను; [[మేషం]]; కాప్రా; హిమాలయాలలో ఉండే మేకని పోలిన జంతువు;
* ibis, n. కంకణపు కొంగ; ఒక జాతి కొంగ; పొడవాటి ముక్కు చివర కిందికి తిరిగి ఉండడం ఐబిస్ ల ప్రత్యేకత; సైబీరియా ప్రాంతాలలోని విపరీతమైన చలికి తట్టుకోలేక ఈ పక్షులు చలికాలంలో దక్షిణభారత దేశానికి వలస వస్తుంటాయి;
** American White Ibis, ph. అమెరికన్ తెల్ల కంకణపు కొంగ; [bio.] ''Eudocimus albus'' of the Threskiornithidae family;
** black-headed ibis, ph. నల్ల తల కొంగ;
** white ibis, ph. తెల్ల కంకణము; తెల్ల కంకణపు కొంగ; ఎర్ర కాళ్ళ కొంగ;
* ice, n. [[మంచు]]; మంచుగడ్డ; హిమం; గడ్డమంచు;
** ice age, ph. మంచు యుగం; హిమనీ యుగం;
** ice cube, ph. మంచుముక్క; మంచుగడ్డ;
** ice water, ph చల్లటి నీరు;
* iceberg, n. సముద్రంలో తేలియాడు మంచుకొండ;
* ichthyology, n. మత్స్య శాస్త్రం; మీను శాస్త్రం; మీన విజ్ఞానం; చేపల శాస్త్రం;
* icicle, n. మంచుకాడ; పొడుగ్గా కాడ రూపంలో పేరుకున్న నీరు; సాధారణంగా చూరుల వెంబడి కారే నీరు గడ్డ కట్టి ఇలా తయారవుతుంది;
* icon, n. (1) ప్రతిమ; విగ్రహం; అర్చ; మూర్తి; చిత్రకం; (2) గురుతు;
* iconoclast, n. (1) విగ్రహాలని ధ్వంసం చేసే వ్యక్తి; (2) సంప్రదాయపు ఆచారాలని, సంస్థలని వ్యతిరేకించే వ్యక్తి; (ety.) Iconoclast came from two Greek words "eikon" and "klastes." In Greek, 'eikon' means 'image' and 'klastes' means 'breaker';
* icosahedron, n. [math.] వింశతిముఖి; ఇరవై ముఖములు ఉన్న ఘన బహుముఖి;
* idea, n. ఊహ; భావం; భావన; ఆలోచన; ఉద్దేశం; వెరవు; సాధనం; తలపు; స్ఫురితం; ఉపాయం; అవపారిక;
** central idea, ph. ముఖ్యాంశం;
* ideal, adj. ఆదర్శ;
* ideal, n. ఆదర్శం; ఆదర్శ ప్రాయం; ఆశయం;
* idealism, n. (1) ఆదర్శవాదం; భావవాదం; జీవితం గానీ, లోకం గానీ ఆదర్శప్రాయంగా ఉండటం ఎలాగో చిత్రించి చెప్పే నిర్వచనం ఆదర్శవాదం; (2) ఒక తత్త్వం; మౌలికంగా ఇది జ్ఞానానికి సంబంధించినది; వాస్తవికత అనేది ఏదో విధంగా మనస్సు మీదనే ఆధారపడి ఉందనేది పాశ్చాత్య తత్త్వవేత్తల ‘ఐడియలిజం’; తన అనుభవంతో మేళవించినదే ప్రపంచమని చెప్పే సిద్ధాంతం కనుక స్వీయానుభవ ఆధ్యాత్మిక వాదమని అనవచ్చు; స్థూల ప్రపంచము కల్ల యను వాదము; see also realism;
** absolute idealism, ph. అఖండ ఆదర్శవాదం; అఖండ భావవాదం;
** subjective idealism, ph. స్వీయాత్మక ఆదర్శవాదం; స్వీయాత్మక భావవాదం;
* idealist, n. ఆదర్శవాది;
* idealistic, adj. ఆదర్శ ప్రాయమైన; ఆదర్శవంత;
* identical, adj. సర్వసమం; సర్వసమానం;
* identification, n. (1) గుర్తు; ఆనవాలు; అభిజ్ఞానం; (2) తాదాత్మ్యం; సాయుజ్యం;
* identify, v. t. (1) గుర్తుపట్టు; గుర్తించు; పోలిక పట్టు; పోల్తి పట్టు; (2) తాదాత్మ్యం చెందు;
* identify, n. (1) సర్వసమానత్వం; తాదాత్మ్యం; ఏకత్వం; సర్వసమానత్వం; (2) తత్సమరాశి; (3) గుర్తు; (4) వైయక్తికత;
* identity, n. గుర్తు; ఆనవాలు; అభిజ్ఞానం;
* idiocy, n. (1) మూఢత్వం; వెర్రిబాగులతనం; (2) పిచ్చితనం; బుద్ధిమాంద్యం;
* ideogram, n. చిత్రలిపి; భావలిపి; భాషతో నిమిత్తం లేకుండా ఒక భావాన్ని తెలిపే బొమ్మ;
[[File:Perros_No.svg|thumb|right|ఈ బొమ్మలో కుక్క ముట్టె పిక్టోగ్రాము, ఎర్రటి వృత్తము, అడ్డు గీత ఇడియోగ్రాము]]
* idiopathic, adj. తెలియని కారణం వల్ల; కారణరహితంగా;
* idolatry, n. [[విగ్రహారాధన]];
* idiolect, n. వైయక్తిక వ్యావహారికం; వ్యక్తిపరమైన శైలీ భేదాల సంపుటి; (rel.) dialect;
* idiot, n. ఒక రకమైన బుద్ధిమాంద్యతతో పుట్టిన వ్యక్తి;
** idiot savant, n. బుద్ధిమాంద్యతతో పుట్టినా ఒకే ఒక శాఖలో (ఉ. సంగీతంలో కాని, చిత్రకళలో కాని, గణితంలో కాని) విశేషమైన ప్రతిభ చూపించే వ్యక్తి;
* idiom, n. జాతీయం; [[నుడికారం]]; పలుకుబడి; భాషీయం; భాషాసంప్రదాయం;
* idiosyncrasy, n. విలక్షణం; విలక్షణ స్వభావం; తిక్క; ఉలిపికట్టెతనం; చమత్కార స్వభావం;
* idiot, n. శుంఠ;
* idle, adj. సోమరి; అక్రియ; ఏ పనీ చెయ్యకుండా ఉన్న స్థితి;
* idleness, n. సోమరితనం;
* idler, n. సోమరి;
* idol, n. ప్రతిమ; [[విగ్రహం]]; అర్చ; మూర్తి;
* idolator, n. విగ్రహారాధకుడు;
* if, conj. అయినచో; అయితే; ఇలా అయితే;
* ifs and buts, ph. అయతే గియితేలు;
* igneous, adj. అగ్నిక; అగ్నిజ; అగ్ని;
** igneous rock, ph. అగ్నికశిల; అగ్నిశిల;
* ignite, v. i. రాజుకొను; రగులుకొను; అంటుకొను;
* ignite, v. t. రగుల్చు; రగిలించు; అంటించు; ముట్టించు; వెలిగించు; మండించుట;
* ignition, n. రగుల్పాటు; రగుల్చుట; జ్వలనం; ప్రజ్వలనం;
** ignition point, ph. జ్వలన స్థానం; జ్వలన బిందువు;
* ignoble, adj. నీచమైన;
* ignominy, n. అపకీర్తి; అప్రతిష్ఠ;
* ignorance, n. అజ్ఞానం; అవజ్ఞాత; ఎరుకమి; తమస్సు; అవిద్య; అరయమి; తెలియమి; మరకువ; see also nescience;
** ignorance is bliss, ph. అజ్ఞానమే ఆనందం;
* ignore, v. i. విస్మరించు; ఉపేక్షించు; నిర్లక్ష్యం చేయు; ఆధారం లేదని ఒదిలిపెట్టు;
[[File:Varanus_benghalensis.jpg|thumb|right|బెంగాలీ ఉడుం]]
* iguana, n. పెద్ద [[ఉడుము|ఉడుం]]; గోధిక; see also guana;
* ileum, n. తుంటి ఎముక; కుండలిని; శేషాంత్రం;
* ill-bred, adj. వెకిలి; మోటైన; సరి అయిన పెంపకం లేని;
* illegal, adj. అక్రమమైన; చట్టవిరుద్ధమైన; వికర్మ; దొంగ;
** illegal act, ph. అక్రమం; చట్టవిరుద్ధం; వికర్మం; అడ్డగోలు;
** illegal construction, ph. అక్రమ నిర్మాణం; అడ్డగోలు కట్టడం;
** illegal encroachment, ph. అక్రమ ఆక్రమణ; అడ్డగోలు ఆక్రమణ;
* illegible, adj. అస్పష్టమైన; చదవడానికి స్పష్టత లేని; కొక్కిరి బిక్కిరి;
* illegitimate, adj. చట్టవిరుద్ధమైన; జారజ;
** illegitimate child, ph. చట్టవిరుద్ధమైన వివాహం వల్ల పుట్టిన బిడ్డ; జారజుడు;
* Illiad, n. (ఇలియాడ్) ట్రాయ్ నగరపు యుద్ధం గురించి గ్రీకు మహాకవి హోమర్ రాసిన గ్రంథం;
* ill-fated, adj. దుర్గతికీ పాలైన; అదృష్టం వక్రించిన; దైవోపహతులైన;
* ill-health, n. అనారోగ్యం; నలత;
* illicit, adj. నిషిద్ధమైన; చట్టవిరుద్ధమైన; దొంగ; దొంగచాటు;
** illicit liquor, ph. దొంగ సారా;
* illiteracy, n. [[నిరక్షరాస్యత]]; చదువనేర్చని;
* illiterate, n. నిరక్షరాస్యుడు; చదవడం రాయడం తెలియని వాడు;
* illness, n. నలత; సుస్తీ; అనారోగ్యం; అస్వస్థత; జబ్బు; రోగం; రుగ్మత; జాడ్యం; see also disease and sickness;
** terminal illness, ph. అవసాన అస్వస్థత; ప్రాణం తీసే జబ్బు;
* illogic, n. కుతర్కం;
* illogical, adj. కుతర్కమైన; తర్కాభాసమైన;
* ill-repute, n. అప్రతిష్ఠ;
* ill-tempered, adj. కోపిష్టి; కోపదారి;
* illuminate, v. t. ద్యోతించు; కాంతివంతం చేయు;
* illuminated, adj. ద్యోతితం; జ్వలితం; కాంతివంతం చేయబడ్డ;
* illuminating, adj. ఉద్దీపక;
** illuminating power, ph. దీప్తి; ద్యోతక శక్తి; ఉద్దీపక శక్తి;
* illumination, n. ఉద్దీపనం; వెలుగు; వెలుతురు; ప్రకాశం; ఉద్భాసం; ద్యోతకం; ద్యూతి; పొద్దు;
* illusion, n. భ్రమ; భ్రాంతి; ఆరోపం; కనికట్టు; మాయ; మోళీ; ఇంద్రజాలం; illusions pertain to the mind and delusions pertain to a belief;
* illustrated, adj. (1) సచిత్ర; (2) సోదాహరణ;
* illustrative, adj. నిదర్శనాత్మక;
* illustration, n. (1) బొమ్మ; చిత్రం; చిత్తరువు; (2) ఉదాహరణ; దృష్టాంతం; ఆఖ్యాయికం;
* illustrious, adj. ఘనతకెక్కిన; ప్రఖ్యాత; ప్రముఖ; ప్రసిద్ధ;
* ill-will, n. వైమనస్యం; వైరస్యం;
* image, n. ప్రతిరూపం; ప్రతిబింబం; ప్రతిమ; బింబం; చిత్రం;
** virtual image, ph. మిధ్యాబింబం; కాల్పనిక బింబం;
* imagery, n. (1) బొమ్మకట్టుడు; పదచిత్రం; (2) ఉత్ప్రేక్ష; ఉత్ప్రేక్షాలంకారం;
** concrete imagery, ph. మూర్త పదచిత్రం;
* imaginary, adj. కాల్పనిక; కల్పిత; అసత్య; ఊహ్య; భావుక; భావకల్పిత; ఊహాత్మక;
** imaginary axis, ph. కాల్పనిక అక్షం; భావుకాక్షం; ఊహాత్మక అక్షం; కల్పన అక్షం;
** imaginary number, ph. కాల్పనిక అంకం; భావుకాంకం; ఊహాత్మక సంఖ్య; కల్పన సంఖ్య;
** imaginary line, ph. ఊహాత్మక రేఖ; భావుక రేఖ; కల్పన రేఖ;
** imaginary part, ph. కాల్పనిక భాగం;
* imagination, n. ఊహ; ఊహాశక్తి; భావన; కల్పన; భావుకత్వం; కల్పనాశక్తి; ఊహాశీలత; ఉత్ప్రేక్ష;
* imagine, v. i. భావించు; ఊహించు; అనుకో;
* imagism, n. a type of poetic philosophy popularized by poets like Ezra Pound;
* imbecile, n. బుద్ధిహీనుడు; మూఢుడు;
* imbibe, v. t. తాగు; పీల్చు; సేవించు; ఆస్వాదించు;
* imbue, v. t. నానబెట్టు; నాటు; మనస్సులో ఉంచుకొను;
* imitate, v. t. అనుకరించు; పోలునట్లు చేయు; ప్రతిరూపం నిర్మించు;
* imitation, adj. నకిలీ; దొంగ;
* imitation, n. అనుకరణ; అనుకారం; అనుకృతి; నకిలీ; అనుసృజన;
* immanent, adj. అంతర్భూతమైన; లోనున్న; అంతర్వ్యాప్తమైన; స్వాభావికమైన;
* immanent, n. అంతర్యామి; అంతర్భూతుడు;
** God is immanent, ph. దేవుడు సర్వాంతర్యామి; దేవుడు అన్నిటిలోను ఉన్నాడు;
* immeasurable, adj. అప్రమేయ; అపరిగణనీయ; కొలవలేనంత; కొలతకు రాని;
* immediate, adj. తక్షణ; వెంటనే; అవశ్య; సద్యో;
** immediate address, ph. [comp.] తక్షణ విలాసం; సద్యో విలాసం;
* immediately, adv. వెంటనే; తక్షణం; ఎకాయెకీ; సత్వరం; అవశ్యం: అప్పటికప్పుడు; అవ్యవధానంగా;
* immense, adj. అపార;
* immerse, v. i. మునుగు;
* immerse, v. t. ముంచు;
* immersion, n. ముంపు; నిమజ్జనం; పరిప్లుతం;
* immigration, n. రావలస;
* immobile, adj. స్థిరమైన; స్థావర; నిశ్చలమైన; అచల; అచర; కదలని; కదల్చలేని; ప్రచలిత;
** immobile object, ph. స్థాణువు;
* immodest, adj. సిగ్గులేని;
* immolate, v. t. త్యాగం చేయు; అగ్ని ప్రవేశం చేయు;
* immorality, n. దుర్నీతి; అవినీతి; వ్యభిచర్యం;
* immortal, adj. అమర; అమర్త్య; చావులేని; నిత్య;
* immortality, n. అమరత్వం; అమర్త్యం; నిత్యత్వం; చావులేకపోవడం;
* immovable, adj. కదలని; కదల్చలేని; స్థావర; స్థిర; అచల;
** immune response, ph. రక్షక ప్రతిస్పందన; రోగనిరోధక స్పందన;
** immune system, ph. రక్షక వ్యవస్థ;
* immunity, n. రోగ నిరోధక శక్తి; అసంక్రామ్యత; రక్షణ; రక్షకశక్తి; రక్షరేకు; అభయప్రదానం; శరీరం రోగగ్రస్తం కాకుండా రక్షించుకోగలిగే శక్తి;
* immunization, n. అసంక్రమకరణం; అభయప్రదానం; రోగం సంక్రమించకుండా శరీరాన్ని పదిలపరచడం;
* immutable, adj. మార్పుచెందని; మార్పులేని; స్థిరమైన;
* impact, n. తాకిడి; ప్రభావం; అభిఘాతం;
* impair, v. t. బలహీనపరచు; పాడుచేయు; చెడగొట్టు; విలువ తగ్గించు;
* impart, v. t. ఇచ్చు; ఒసగు; అబ్బించు;
* impartial, adj. సమశీల; నిష్పాక్షిక; పక్షపాత రహిత;
** impartial person, ph. సమశీల వ్రతయుతుడు; పక్షపాత రహితుడు; నిష్పాక్షికుడు;
* impassable, n. దుస్తరం; దాటరానిది; చొరరానిది;
* impasse, n. (ఇంపేస్) కఠిన పరిస్థితి; విషమ స్థితి; దిగ్బంధ స్థితి; తప్పించుకోలేని పరిస్థితి;
* impassioned, adj. ఉద్రేకముతోఁ గూడిన, మనస్సునకు తగులునట్లు చెప్పిన,
** impassioned plea, ph. మనస్సునకు తగులునట్లు చెప్పిన విజ్ఞప్తి;
* impatient, adj. ఓర్పులేని; సహనం లేని; ఆతురత;
* impatience, n. ఆతురత; ఓరిమి లేకపోవడం; విసుగు; చిరాకు;
* impatiens, n. సోకుడుముడుగు; రంగురంగుల పూలు పూసే ఒక రకం మొక్క; see touch-me-not; ok
* impeach, v. t. అభిశంసించు; దోషారోపణ చేయు;
* impeachment, n. అభిశంసన; దోషారోపణ;
* impeccable, adj. మచ్చలేని; నిష్కళంకమైన; దోషం లేని; తప్పులెన్నరాని;
* impede, v. t. అడ్డగించు; నిరోధించు; అవరోధించు;
* impedance, n. అవరోధకం; అవరోధం; అర్గళం; అంకిలం; క్లేశకం; స్తోభకం; స్తోభం;
* impediment, n. ప్రతిబంధకం; ఆటంకం; అంకిలి; విఘాతం; అర్గళం; పురోగతికి పెద్ద దెబ్బ;
* impel, v. t. ప్రేరేపించు; ముందుకు తోయు;
* impeller, n. ప్రేరేపకి; ముందుకు తోసేది;
* impending, adj. కాగల; జరగబోయే;
* impenetrable, adj. చొరరాని; దుర్గమ; గహన;
* imperative, adj. విధివాచక; ఆజ్ఞారూపక;
** imperative language, ph. [comp.] విధాయక భాష; Any programming language that specifies explicit manipulation of the state of the computer system e.g. SQL ; Not to be confused with a procedural language, which specifies an explicit sequence of steps;
** imperative mood, ph. [gram.] విద్యర్ధకం; విధివాచకం; ప్రార్థనార్ధకం; ఉభయ ప్రార్థనార్ధకం;
* imperative, n. విధివాచకం; విధాయకం;
* imperceptible, adj. ఇంద్రియగోచరం కాని;
* imperfect, adj. అసంపూర్ణమైన; అసమాప్త; అసమగ్ర; లోపం ఉన్న; కొరత ఉన్న; లోపభూయిష్టమైన;
* imperfection, n. లోపం; లోటు; తయారీలో వచ్చిన లోపం;
* imperial, adj. సార్వభౌమత్వ; సామ్రాజ్యవాద;
* imperialism, n. సామ్రాజ్యవాదం;
* imperil, v. t. ఆపద కలిగించు;
* imperishable, adj. నాశనం లేని; కుళ్ళని; పాడుకాని; నిల్వ చేసినా పాడు కాని;
* impersonal, adj. అవ్యక్త; వ్యక్తి సంబంధం లేకుండా;
* impervious, adj. అప్రవేశ్య; అభేద్యమైన; లోనికి చొరజాలని;
* impetuousness, n. దురుసుతనం;
* impish, adj. చిలిపి; తమాశాకి అల్లరి చేసే తత్త్వం;
* implant, v. t. రోగి శరీరాన్ని వైద్యుడు కోసి లోపల మరొక వస్తువుని పెట్టడం;
* implant, v. t. నాటు; విత్తు నాటు;
* implement, n. పనిముట్టు; సరంజాము; సరకు;
* implement, v. t. ఉపయోగించు; వాడు; వాడుకలో పెట్టు; అమలు చేయు; అమలు పరచు; ఆచరించు;
* implementation, n. కార్యాచరణ; ఆచరణ; అమలు;
* implication, n. అన్యాపదేశం: అంతస్సూచన; ధ్వనింపు;
* implicit, adj. అవ్యక్త; అంతర్లీన; అంతర్గత; గర్భితమైన;
* implore, v. t. ప్రార్థించు; బ్రతిమాలు; బుజ్జగించు; విన్నపం చేసుకొను; విన్నవించుకొను;
* implosion, n. అంతస్పోటనం;
* imply, v. t. భావమునిచ్చు; ధ్వనించు;
* import, n. (1) దిగుమతి; (2) అంతర్భావం;
** import of a sentence, ph. వాక్యం యొక్క అంతర్భావం;
* importance, n. ప్రాముఖ్యం; ప్రాధాన్యం;
* important, adj. ముఖ్యమైన; ప్రధానమైన; మేటైన;
** important person, ph. ముఖ్యుడు; మేటరి; ప్రెగడ;
* imported, adj. సీమ; కిరానా; దిగుమతి చేసికొన్న;
** imported stuff, ph. సీమ సరుకు; కిరానా సామాను;
* impose, v. t. ఇబ్బంది కలిగించు; పిలవని పేరంటం వలె వచ్చు; శిక్షించు;
* imposition, n. ఇబ్బంది; పిలవని పేరంటం; శిక్ష;
* impossible, adj. అసంభవమైన; అసాధ్యమైన; దుస్సాధ్యమైన; వల్లమాలిన;
* impossible, n. అసంభవం; అసాధ్యం; దుస్సాధ్యం; మృగ్యం;
* impostor, n. మరొకరివలె నటించేవాడు; దొంగ; మోసగాడు; దగుల్బాజీ;
* impotence, n. నపుంసకత్వం; నిర్వీర్యత్వం; పుంసత్వలోపం; ధ్వజభంగం; పిరికితనం; క్లెబ్యం;
* impotency, n. ధ్వజభంగం; నపుంసకత్వం; నిర్వీర్యత్వం; క్లీబ్యం;
* impotent, adj. నిర్వీర్యం; శక్తిహీనం; బలహీనం;
** impotent person, ph. నిర్వీర్యుడు; ఖొజ్జా; పేడి;
* impound, v. t. దాచిపెట్టు; బంధించు; సామానులని అటకాయించి బంధించు;
* impoverish, v. t. దారిద్య్రం కలిగించు; శక్తిహీనం చేయు; క్షీణింపజేయు;
* impractical, adj. అఘటిత;
* imprecate, v. t. శపించు;
* impregnate, v. t. సిక్తం చేయు; నింపు; గర్భం కలిగించు; గర్భాదారణ చేయు;
* impress, v. i. నచ్చుకొను;
* impress, v. t. ముద్ర వేయు; మనస్సుకి హత్తుకునేటట్లు చేయు; మంచి అభిప్రాయం కలుగజేయు;
* impressed, adj. ముద్ర వేయు; ముద్రాంకిత; నిహిత; నచ్చు; మంచి అభిప్రాయం కలుగు;
** impressed force, ph. నిహిత బలం;
* impression, n. (1) ముద్ర; ముద్రణ; గురుతు; (2) ముద్రాంకితం; వాసన; సంస్కారం; (3) అభిప్రాయం; భావముద్ర; భావం;
** positive impression, ph. ఆదరణ భావం;
* impressionistic, adj. అనుభూతాత్మక;
** impressionistic painting, ph. అనుభూతాత్మక వర్ణచిత్రం;
* imprint, n. ముద్ర; గుర్తు; అచ్చు; చిహ్నం;
* imprinting, n. మనోముద్రణ; జంతువులలో పిల్ల మనోఫలకం మీద తల్లిదండ్రుల ముద్ర పడటం;
* imprisonment, n. నిర్భంధం; కారాగార శిక్ష; ఖైదులో పెట్టడం;
* improbable, adj. అసంభవమైన; అసంభావ్యమైన; సత్యదూరమైన;
* improper, adj. అనుచిత; అపసవ్య; తగని; అక్రమ; అపక్రమ; విషమ;
** improper fraction, ph. అపక్రమ భిన్నం;
* improper, n. అనుచితం; తగనిది; అక్రమమైనది;
* improve, v. t. బాగుపరచు; అభివృద్ధి చేయు; పురడించు;
* improved, adj. మెరుగుపరచబడ్డ; పురడించిన;
* improvement, n. అభివృద్ధి; మెరుగుదల; బాగుపడడం;
* improvisation, n. మనోధర్మం; ఆశువుగా ప్రామాణికమైన సంగీతానికి చిలవలు, పలవలు చెక్కడం; ముందుగా తయారవకుండా అక్కడికక్కడ కల్పించి ప్రదర్శించడం; అభివృద్దీకరణ;
* improvise, v. t. మనోధర్మం చేయు; ఆశువుగా విద్యని ప్రదర్శించు; ముందుగా తయారవకుండా అక్కడిక్కడ కల్పించి ప్రదర్శించు;
* impudence, n. (1) నీలుగడం; అమర్యాదకరమైన ప్రవర్తన; (2) సిగ్గు లేకపోవడం;
* impulse, n. ప్రచోదనం; సంవేగం;
* impulsive, adj. సంవేగ;
** impulsive force, ph. సంవేగ బలం;
** impulsive pressure, ph. సంవేగ పీడనం;
* impure, adj. కల్తీ; అశుద్ధ; అవిశుద్ధి; స్వచ్ఛం కాని; ములుకువ;
* impurity, n. అశౌచం; కల్మషం; అపరిశుద్ధం; కల్తీ పదార్థం;
* imputation, n. అపవాదు; ఆరోపణ;
* inability, n. అశక్తత; సమర్ధత లేకపోవడం;
* in absentia, adv. పరోక్షంగా; గైరుహాజరులో;
* inaccurate, adj. సరికాని; ఖరారు కాని; తప్పు అయిన;
* inadequacy, n. చాలమి; కొరత; అసమగ్రత;
* inadequate, adj. సరిపోని; చాలని; కొరవడిన; అసమగ్ర;
* inadvertently, adv. ఏమరుపాటున; పరాకుగా; అనుకోకుండా; అనవధానంగా;
* inanimate, adj. అచర; స్థిర; చలనం లేని; ప్రాణం లేని;
* inapplicable, n. అవర్తితం; వర్తించనిది; పొసగనిది; ఉపయోగించనిది;
* inappropriate, adj. సరికాని; అసందర్భ; అసమంజస; అక్రమమైన; తగని; అయుక్త; యుక్తముకాని;
* inappropriate expenditure, ph. అక్రమ వ్యయం; యుక్తముకాని ఖర్చు;
* inappropriate income, ph. అక్రమ ఆర్జన;
* inattention, n. ఏమరుపాటు; అనవధానం; పరధ్యానం;
* inauguration, n. ప్రారంభోత్సవం; అంకురార్పణం; స్నాతకం; స్నాతకోత్సవం;
* inauspicious, adj. అమంగళ; అశుభ;
* inborn, adj. సహజమైన; జన్మసిద్ధ; పుట్టుకతో వచ్చిన; స్వాభావిక;
* in-camera, adv. [legal] చాటుగా; రహస్యంగా; గదిలో
* incandescence, n. తాపదీప్తి;
* incandescent, adj. తాపదీప్త; వేడి చేత వెలుగు పుట్టించే;
* incantation, n. అభిచారం; [[మంత్రం]];
* incarcerate, v. t. ఖైదులో పెట్టు; బంధించు;
* incapability, n. అసమర్ధత;
* incarnation, n. అవతారం;
* incendiary, adj. ఇళ్ళని కాల్చే స్తోమత గల;
* incense, v. i. కోపోద్దీపమగు;
* incense, n. సుగంధ ద్రవ్యం; ధూపం;
** incense stick, n. అగరువత్తి;
* incentive, n. ప్రచోదనం; ప్రోత్సాహకం; ఉసి కోల్పేది; ప్రేరేపకం; ప్రేరకం;
* inception, n. ప్రారంభం;
* incessant, adj. ఎడతెగని; నిరాఘాటంగా; అనవతరంగా;
* incest, n. వావిడికము; వావివరసతప్పడము; అగమ్యాగమనము; ఒకే కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధం; వివాహము కూడని వరుస (వావి) గలవారితోడి వ్యభిచారము;
* inch, n. అంగుళం;
* inch, v. i. నెమ్మదిగా జరుగు;
* incident, adj. పతన;
** incident angle, ph. పతన కోణం;
** incident light, ph. పతన కాంతి;
** incident ray, ph. పతన కిరణం;
* incident, n. సంఘటన;
* incidental, n. ఆగంతుకం; అప్రధానం; అనుషంగికం;
* incidental, adj. అనుషంగిక; అప్రధాన; ప్రధాన కార్యక్రమంతోపాటు, అప్రయత్నంగా జరిగిన; (అనగా, ప్రమాదవశాత్తూ కాదు);
* incidentally, adv. అనుషంగికంగా; (see also) accidentally;
* incineration, n. భస్మీకరణం;
* incinerator, n. భస్మి; భస్మం చేసే ఉపకరణం;
* incipit, n. ప్రారంభ వాక్యం; కథన ప్రారంభం;
* incision, n. కోత; గంటు; నాటు;
* incisors, n. కుంతలాలు; కొరకడానికి వాడే పళ్ళు; the front teeth present in most mammals;
* incite, v. t. రేకెత్తించు; రెచ్చగొట్టు; ప్రేరేపించు; ఉసికొలుపు; ఉత్తేజపరచు;
* inclement, adj. పాడుగా ఉన్న; జడివాన, తుపాను మొదలైన పరిస్థితుల వల్ల పాడుపడిన;
* inclination, n. (1) అభిమతం; అభిరుచి; చిత్తవృత్తి; (2) అభిలాష; ఉబలాటం; (3) వాలు; మొగ్గు; నతి;
* incline, n. వాలు; ఆస్థ; తటం;
* inclined, adj. వాలు; వాలిన; మొగ్గిన; దోర; తొంగలి; నత;
** inclined plane, ph. వాలు తలం; దోర తలం; మొగ్గుబల్ల; తొంగలి బల్ల; ఆస్థ ఫలకం;
* incoherent, adj. అసంబద్ధమైన; పొంతనలేని; అకటవికటమైన; అసంగతమైన;
* income, n. [[ఆదాయం]]; రాబడి; వచ్చుబడి; వరుమానం; (rel.) earnings;
** low-income, ph. అల్పాదాయం;
** net income, ph. నికరాదాయం;
** income tax, ph. ఆదాయపు పన్ను; రాబడి పన్ను;
* incomparable, adj. సాటిలేని; అనన్య సామాన్యమైన; అసదృశమైన; అసమానమైన; నిరుపమాన;
* incompatible, adj. సామరస్యం లేని; అసంగతమైన; పొసగని;
* incompetence, n. అప్రయోజకత్వం; అసమర్ధత;
* incomplete, adj. అర్ధాంతర; అసంపూర్ణ; అరకొర; అసమగ్ర;
* incomplete, n. అసంపూర్ణం; అర్ధాంతరం;
* incomprehensible, n. అప్రమేయం; దుర్‌గ్రాహ్యం; అవిజ్ఞేయం;
* inconceivable, n. అచింత్యం; ఊహించడానికి కూడా వీలు లేని;
* incognito, n. ఇతరులకి దొరకకుండా తప్పించుకోగల జ్ఞానం; మారువేషం;
* incongruity, n. అసంగతత్త్వం;
* inconsequential, adj. ఆషామాషీ;
* inconsiderate person, ph. అసమీక్ష్యకారి;
* inconsistency, n. వైరుధ్యం; పరస్పర వైరుధ్యం;
* inconsistent, adj. అసంగతమైన; అసంబద్ధమైన; పరస్పర విరుద్ధమైన;
* incontinent, n. మల మూత్ర విసర్జనలపై పట్టు తప్పటం;
* incontrovertible, adj. తిరుగులేని;
* inconvenience, n. ఇబ్బంది;
* inconvenient, n. ప్రతికూలం; (ant.) అనుకూలం;
* incorporate, v. t. సంస్థీకరించు; వ్యవస్థీకరించు;
* incorporation, n. సంస్థ; వ్యవస్థాపన;
* incorporation, v. t. సంస్థాపన;
* incorrigible, adj. మూర్ఖ; మొండి;
* increase, v. i. ఎసరు; ఎసరేగు; ఎసలారు;
* increase, v. t. పెంచు; ఎక్కువ చేయు; ఎక్కించు;
* incredible, adj. నమ్మశక్యంకాని; వింతైన; విడ్డూరమైన; అపురూపమైన;
* incredulous, adj. నమ్మతగని; నమ్మరాని;
* increment, n. (1) పెరుగుదల; (2) జీతంలో పెరుగుదల;
* incriminate, v. t. నేరారోపణ చేయు; అభియోగించు;
* incrimination, n. నేరారోపణ; అభియోగం;
* incubation, n. పొదుగుట; ఉద్భూతం; డింభోషణం;
** incubation period, ph. ఉద్భూత కాలం; డింభోషణ కాలం;
** incubation period of a disease, ph. రోగం యొక్క ఉద్భూత కాలం;
* incubator, n. పొదుగుపెట్టె; డింభోషణి;
* incubus, n. ఆడదానితో రతిని కాంక్షించే మగ దయ్యం; (ant.) succubus;
* incur, v. t. పొందు; పడు;
* indebted, adj. రుణపడియుండు; రుణగ్రస్తమైయుండు; అప్పుపడి ఉండు;
* indeed, inter. అలాగా;
* indefinite, adj. అస్పష్టమైన; అపారమైన; అనిర్దిష్ట;
* indefinable, adj. అనిర్వచనీయ;
* indelible, adj. చెరగని;
* indemnity, n. నష్టపరిహారం;
* indentation, n. (1) లోత్త; (2) గంటు; పేరా మొదటి వరసని మార్జిన్ నుండి దూరంగా జరిపి రాయడం;
* indenture, n. ఒడంబడిక; ఒప్పందం; ఖరారునామా; ముచ్చిలికా;
** indentured labor, ph. ఒప్పందపు కూలి; ముచ్చిలకా దాస్యం;
* independent, adj. స్వతంత్ర; నిరాలంబ;
* independence, n. స్వతంత్రం; నిరాలంబం;
* indestructible, adj. అవ్యయ;
* indestructible, n. అవ్యయం;
* indeterminate, adj. అనిర్దిష్ట;
* index, n. సూచిక; పదపట్టిక; అనుక్రమణిక; పదసూచి; చింతామణి; ఒక పుస్తకంలోని ముఖ్యమైన మాటలు ఏయే పుటలలో కనిపిస్తాయో చెప్పే సూచిక; సాధారణంగా ఈ సూచిక పుస్తకం చివర ఉంటుంది;
** index finger, ph. తర్జని; చూపుడువేలు;
** index register, ph. [comp.] సూచిక పల్టీపేరు; తర్జని పల్టీపేరు;
* India, n. భారతదేశం; ఇండియా;
** India ink, ph. త్వరగా ఆరే (నల్ల) సిరా; భారతీయులలా నల్లగా ఉంటుందని మొదట్లో ఈ సిరాకి ఈ పేరు పెట్టారు, బ్రిటీష్‌వారు. దరిమిలా ఈ రకం సిరాని అన్ని రకాల రంగులలోనూ చేస్తున్నారు. పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదన్నట్లు ఈ పేరు మాత్రం మిగిలింది.
** India rubber, ph. సందర్షిణి; same as natural rubber; [bot.] Hevea brasiliensis;
* Indian, adj. భారత్; భారతీయ; భారతదేశానికి సంబంధించిన; ఇండియా ఉపఖండానికి సంబంధించిన;
** Indian aconite, ph. నాభి;
** Indian airspace, ph. భారతీయ గగనతలం;
** Indian aloe, n. ph. కలబంద;
** Indian beech, n. ph. కానుగ;
** Indian birthwort, ph. ఈశ్వర వేరు;
** Indian butter tree, ph. ఇప్పచెట్టు;
** Indian coral, ph. పారిజాతం;
** Indian gum arabic, ph. తుమ్మ;
** Indian jalap, ph. తెగడ చెట్టు;
** Indian kino, ph. వేగిస చెట్టు;
** Indian lilac, ph. తురక వేప చెట్టు;
** Indian mulberry, ph. మద్ది;
** Indian olibanum, ph. పరంగి [[సాంబ్రాణి]];
** Indian pennywort, ph. [[బ్రహ్మీ]] మొక్క;
** Indian spikenard, n. జటామాంసి; [bot.] ''Nardostachys jatamansi'' of the valerian family;
** Indian spinach, ph. [[బచ్చలి]];
** Indian Subcontinent, ph. ఇండియా ఉపఖంఢం; ఈ ఉపఖండంలో భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక; భూటాన్, పాకిస్తాన్, మయాన్‌మార్, హిందూ మహాసముద్రంలోని చిల్లర దీవులు ఉన్నాయి;
* Indian, n. m. భారతీయుడు;
* Indian-ness, n. భారతాత్మ;
* indicate, v. t. సూచించు;
* indicator, n. సూచి; సూచిక; సంసూచిక; ముల్లు; అర్థకం; స్పోరకం;
** indicator function, ph. స్పోరక [[ప్రమేయం]];
** indicator of depth, ph. దఘ్నార్థకం; లోతుసూచిక;
** indicator of direction, ph. దిక్సూచి;
** indicator of meaning, ph. భావార్థకం; భావసూచిక;
** indicator of plural, ph. బహువచన స్పోరకం;
** indicator of size, ph. పరిమాణార్థకం;
* indictment, n. నేరారోపణం;
* indifference, n. ఉపేక్ష; ముభావం; ఉదాసీనత;
* indigenous, adj. దేశవాళీ; స్వదేశీ; దేశీయ;
* indigestion, n. అజీర్ణం; అగ్నిమాంద్యం; అజీర్తి;
* indignation, n. రోషం; ఆగ్రహం; కోపం;
* indigo, n. నీలిమందు; ಅవిరి;
** indigo plant, ph. నీలిమొక్క; రంజని; నీలిగోరింట; మధుపర్ణిక; అవిరి;
* indirect, adj. పరోక్ష; అపసవ్య;
* indirectly, adv. చూచావాచాయగా; పరభారిగా;
* indiscreet, adj. విచక్షణారహిత; ఆలోచనలేని; అనాలోచిత;
* indiscriminately, adv. విచక్షణా రహితంగా;
* indispensable, adj. అనివార్య; ఆవశ్యక; అపరిహార్య; తప్పనిసరి అయిన;
* indisposed, adj. అస్వస్థ; విముఖ;
* indisputable, n. నిర్వివాదాంశం;
* indistinct, adj. అస్వచ్ఛం;
* Indium, n. ఇండియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 99, సంక్షిప్త నామం, In); (ety.) from the indigo blue spectral line; has nothing to do with India;
* individual, adj. వ్యష్టి; వైయక్తిక; ప్రత్యక్;
* individual, n. (1) వ్యక్తి; ఆసామీ; నఫరు; (2) వైయక్తికం;
** individual incidents, ph. వ్యష్టి సంఘటనలు; వైయక్తిక సంఘటనలు;
** individual souls, ph. ప్రత్యగాత్మలు;
* individualistic, adj. వ్యక్తివాద;
* individuality, n. వ్యక్తిత్వం; వైయుక్తికత;
* individualization, n. వ్యష్టీకరించడం;
* individually, adv. నఫరుగతిగా;
* Indo-Aryan, adj. హిందార్వ; ఔత్తరాహ;
* indoctrinate, v. t. బోధించు; బోధచేయు; బలాత్కారంగా సమ్మతింపజేయు;
* indoctrination, n. బోధ;
* indolent, n. మొండి;
* indolence, n. సోమరితనం; బద్ధకం;
* induce, v. t. ప్రేరేపించు; ప్రోత్సహించు; ఉన్ముఖుని చేయు; లోభపెట్టు;
* induced, adj. ప్రేరిత;
* inducement, n. ప్రేరణ; ప్రోత్సాహం;
* induction, n. అర్థాపత్తి; ఆగమనం; నిగమనం; వ్యష్టి సంఘటనల పరంపర నుండి సాధారణ సూత్రాన్ని ప్రతిపాదించే పద్ధతే ఆగమనం; (ant.) deduction
** induction method, ph. ఆగమన పద్ధతి;
* indulge, v. i. అనుభవించు;
* industrial, adj. పారిశ్రామిక;
** industrial chemistry, ph. పారిశ్రామిక రసాయనం;
** industrial estate, ph. పారిశ్రామిక వాడ;
** industrial revolution, ph. [[పారిశ్రామిక విప్లవం]];
** industrial wastes, ph. పారిశ్రామిక వ్యర్ధాలు;
* industrialist, n. పారిశ్రామికుడు; పారిశ్రామికవేత్త;
* industrialization, n. పారిశ్రామికీకరణం; పరిశ్రమల విస్తరణ;
* industrious, adj. శ్రమించెడు;
* industry, n. శ్రమ; పరిశ్రమ;
* inedible, adj. అఖాదీ; తినడానికి పనికిరాని;
** inedible oil, ph. అఖాదీ తైలం;
** ineffable, adj. వర్ణనకి లొంగని; వర్ణింఫశక్యముకాని; వాచామగోచరమైన; అనిర్వచనీయమైన; చెప్పనలవికాని;
* ineffectual, n. వ్యర్థం;
* inelastic, adj. అస్థితిస్థాపక; స్థితిస్థాపక రహిత; స్థితిస్థాపకత లేని;
* inept, adj. అప్రయోజక; చతురత లేని; నైపుణ్యం లేని;
* inert, adj. జడ; స్తబ్ధ; మంద; అచేతన; తామసిక;
** inert gas, ph. జడ వాయువు; మందవాయువు; స్తబ్దవాయువు;
* inequality, n. వైషమ్యం;
* inertia, n. జడత్వం; జడత; జడిమ; స్తబ్ధత; తమస్సు;
* inertial, adj. జడత్వ;
** inertial frame, ph. జడత్వ చట్రం;
** inertial frame of reference, ph. ప్రమాణ జడత్వ చట్రం;
** inertial mass, ph. జడత్వ గురుత్వం; తామస గురుత్వం;
* inestimable, adj. అగణ్య;
* inequality, n. అసమానత్వం; విసమీకరణం; వైషమం; న్యూనాధిక్యత;
* inequity, n. అసమానత; ప్రతిసమం;
* inevitable, n. నియతం; అనివార్యం; విధాయకం;
* inexhaustible, adj. అవ్యయ; అవ్యయమైన;
* inexhaustible, n. అవ్యయం;
* inexpensive, n. అగ్గువ; చవుక;
* infallible, n. అచ్యుతం; తప్పుకి అతీతం;
* infamy, n. అపకీర్తి; అప్రతిష్ఠ; దుర్యశం;
* infancy, n. శైశవం; శైశవావస్థ; పసితనం;
* infant, adj. శిశు; శైశవ;
* infant, n. శిశువు; పసిబిడ్డ; పసికందు; నెత్తురుకందు; నెలకూన; చిరుత; బుడుత; బొట్టె; కిశోరం;కందు; పసివాడు; ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శైశవ దశ;
* infanticide, n. శిశుమేధం; శిశుహత్య;
* infantry, n. కాల్బలం; పదాతిబలం;
* infarct, n. శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోయిన భాగం; ప్రాణరహిత కణజాలం;
* infarction, n. శరీరంలో రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం; కణజాల మరణం;
** coronary -, ph. గుండెలోని కండరాలకి రక్తపు సరఫరా లేక కొద్ది మేర చచ్చిపోవడం;
* infatuation, n. మోహం; చిత్తమోహం; వ్యామోహం; మూఢ ప్రేమ; అభినివేశం; తేలగింపు;
* infect, v. t. సూక్ష్మజీవులని శరీరంలో చొరబడేట్టు చేసి రోగం కలిగించడం;
* infection, n. తిష్ట; తిష్ట రోగం; లాతికణావేశం; అన్యకణావేశం; సోకుడు; అంటునలత; జాడ్యం; సూక్ష్మజీవులు శరీరంలో చొరబడి ఒక చోట స్థావరం ఏర్పరచుకోవడం; see also infestation;
** vaginal infection, ph. యోని తిష్ట;
* infectious, adj. తిష్ట; సంక్రామిక;,
** infectious disease, ph. తిష్ట రోగం; సంక్రామిక రోగం; అంటునలత;
* inference, n. అనుమాన ప్రమాణం; అనుమితి; అనుభావనము; అర్థాపత్తి; ఉత్తరపక్షం; గ్రాహ్యం; ఒక అంశం నుండి గ్రహించే సారాంశం, ఆకళింపు,
** inference engine, ph. అనుమితి సాధకం;
** inference rule, ph. అనుమితి నియమం;
* inferior, adj. చవకబారు; తీసికట్టు; తక్కువైన; నీచ; నీచమైన; కింది; బీడు; అల్కా; హీన; అధో; కీత; న్యూన; అవాచీ; అవద్య;
** inferior land, ph. కీతనేల;
* inferiority, n. న్యూనత; లోకువ; హీనత; అప్రధాన్యత;
** inferiority complex, ph. ఆత్మన్యూనతా శంక; ఆత్మన్యూనతా భావం;
* infertile, adj. నిస్సారమైన; పండని; గొడ్డు;
* infestation, n. సూక్ష్మజీవులు, పరభుక్కులు జీవి ఉపరితలం మీద స్థావరం ఏర్పరచుకోవడం; see also infection;36.
* infidelity, n. అవిశ్వాసం;
** conjugal infidelity, ph. వ్యభిచారం;
* infinite, adj. అనంతమైన; అనంత; అపరిమిత; అంతూ దరీ లేని;
** infinite regress, ph. అనవస్థా దోషం; ఏదైనా ప్రతిపాదన మరొక ప్రతిపాదనపై ఆధారపడి, ఆ ప్రతిపాదన ఇంకొక దానిపై, అది మరొక దానిపై, ఇలా అనంతంగా ఆధారపడుతూ పోవడాన్ని అనవస్థా దోషం (Infinite Regress) అంటారు. అలాంటి దోషమున్న ప్రతిపాదన తర్కసమ్మతం కాదన్న మాట.
** infinite series, ph. అనంత శ్రేణి;
* infinitesimal, adj. అత్యంత;
** infinitesimal calculus, ph. అత్యంత కలనం;
* infinitive, n. తుమర్థం; తుమున్నర్థకం; క్రియ యొక్క సామాన్య రూపం; క్రియ యొక్క దాత్వర్ధక రూపం;
* infinity, n. అనంతం; దిగంతం; మహత్తు; అంతులేనిది;
* infirmary, n. ఆసుపత్రి;
* infirmity, n. అశక్తి; నిస్త్రాణ; నలత; సుస్తీ;
* infix, adj. మధ్యలో వేసిన; మధ్యలో వచ్చే;
* inflammable, adj. జ్వలనశీలమైన; మండే గుణం కల; మండే;
* inflammation, n. వాపు; శోఫ; ఉబ్బు; ఉలుపు;
* inflammatory, adj. (1) వేడిని పుట్టించే; తాపజనక; (2) కోపం కలిగించే; రెచ్చగొట్టే;
* inflate, v. t. ఊదు; గాలితో నింపు;
* inflation, n. ద్రవ్యోల్బణం; దివాలేషం; డబ్బు సరఫరా ఎక్కువవడం వల్ల వస్తువుల ధరలు, చాకిరీల ధరలు అదేపనిగా పెరుగుతూ పోవడం; దివాలేషం అంటే కరువు కాదు. కరువు రోజులలో ధరలు పెరగడానికి కారణం వస్తువులు దొరకక పోవడం;
* inflection, n. [gram.] రూపభేదం; (note) his is an inflection of he; ఇంటి is an inflection of ఇల్లు;
* inflow, n. ఆన;
** barrier to inflow, ph. [[ఆనకట్ట]];
* influence, n. ప్రభావం; ప్రభ; ప్రాబల్యం; పలుకుబడి; మాట చెల్లుబడి;
* influence, v. t. ప్రభావితం చేయు;
* influenza, n. ఫ్లూ; విషపడిశం;
* inform, v. t. తెలియజేయు; (rel.) tell;
* informal, adj. అనియత;
** informal education, ph. అనియత విద్య;
* information, n. సమాచారం; వార్త; విశేషం; వక్కాణం; తెలిమానం;
** information highway, n. సరదా; సమాచార రహదారి; సమాపథం; సమాచార మహాపథం;
** information theory, n. సమాచార సిద్ధాంతం;
** informed sources, ph. అభిజ్ఞ వర్గాలు;
* informer, n. వేగులవాడు; ఆచూకీదారు;
* infra, adj. అధో; నీచ; తక్కువ; కింద;
* infraction, n. అతిక్రమణ;
* infrared, adj. అథోలోహిత; అత్యారుణ; పరారుణ;
** far infrared, ph. దూర పరారుణ;
* infrastructural, adj. ఉపనిర్మాణ;
* infrastructure, n. అవస్థాపన సౌకర్యాలు; ఉపనిర్మాణం; ఉపకరణ సౌకర్యాలు;
* infringement, n. అతిక్రమణం; ఉల్లంఘనం;
* in good faith, ph. విశ్వాసంతో; నమ్మకంతో;
* ingenious, adj., అబిరుచి చూపించు; తెలివయిన; ఊహాశక్తితో నిండిన;
* ingenuous, adj., అమాయకమయిన; నిగర్వమయిన; దర్పములేని;
* ingot, n. పాళా; లోహపు కడ్డీ;
* ingrained, adj. అస్థిగతమైన; గట్టిగా పట్టిన;
* ingredients, n. pl. అంశములు; ఘటకద్రవ్యములు; ఘటకాంశాలు; అంగములు; సంబారాలు; సరంజామా; ఒక అంశాన్ని తయారు చెయ్యడానికి కావలసిన వస్తువులు;
* ingress, n. లోనికి పోయే దారి;
* inhabit, v. i. నివసించు; అధివసించు;
* inhabitant, n. నివాసి; వాస్తవ్యుడు; సాకీను;
* inhabited, adj. జనసంకీర్ణ;
* inhalation, n. ఉచ్ఛ్వాసం; పూరకం;
* inhalation and exhalation, ph. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు; పూరక రేచకాలు;
* inhale, v. i. ఎగపీల్చు;
* inherent, adj. స్వతస్సిద్ధమైన; స్వాభావికమైన; ప్రాకృతిక; స్వయంసిద్ధ; సిద్ధం;
* inheritance, n. వారసత్వం; వంశానుగతం; పారంపర్యం; ఉత్తరాధికారం; మిరాసి; దాయభాగం; దాయం; తల్లిదండ్రులనుండి పిల్లలకి సంక్రమించే సొత్తు;
* inhibitory, adj. నియామక;
* inhospitable, adj. నిరాదరణ;
* inhuman, adj. అమానుష;
* inhumane, n. అమానుషం;
* inhumanely, adv. అమానుషంగా;
* inimitable, adj. సాటిలేని;
* initial, adj. ఆరంభ; ప్రథమ; మొదటి; ముక్తాయి;
* initials, n. pl. పొడి అక్షరాలు; ఆద్యక్షరాలు;
* initiation, n. ప్రారంభ ఉపదేశం; దీక్ష; ప్రారంభ కార్యక్రమం;
* initiative, n. చొరవ; ఉపక్రమం; ప్రథమయత్నం;
* injunction, n. నిషేధాజ్ఞ; ఉత్తర్వు;
* injure, v. i. గాయపడు; దెబ్బ తగిలించుకొను;
* injure, v. t. గాయపరచు; దెబ్బ తగిలించు;
* injured, n.m. గాయపడ్డవాడు; క్షతగాత్రుడు; దెబ్బతగిలినవాడు;
** injured person, ph. క్షతగాత్రుడు;
* injurious, adj. క్షతకరం; హానికరం;
* injury, n. దెబ్బ; [[గాయం]]; క్షతం;
* injustice, n. అక్రమం; అన్యాయం;
* ink, n. సిరా; మషి; మసి;
* ink bottle, n. సిరాబుడ్డి; మషీమణి;
* inkblot, n. సిరామరక;
* inlaid, adj. ఖచిత; ఆఖచిత;
** inlaid with precious stones, ph. రత్నఖచిత;
* inland, adj. దేశాంతర్గత; అంతర్దేశీయ;
* in-laws, n. pl. అత్తవారు; వియ్యాలవారు;
* inlay, v.t. పొదుగు; తాపడం చేయు; చెక్కు;
* inlet, n. (1) సముద్రం భూమి లోనికి చొచ్చుకు వచ్చిన చోటు; (2) యంత్రం లోనికి వాయువుని గాని ద్రవాన్ని గాని పంపే గొట్టం;
* in lieu of, ph. బదులుగా; స్థానంలో;
* inmate, n. బందీ; ఖైదులోగాని, పిచ్చాసుపత్రిలోగాని బందీ అయిన వ్యక్తి;
* inn, n. (1) సత్రవ; (2) హొటేలు;
* innate, adj. సహజమైన; అంతర్జనిత; అంతర్లీన;
* inner, adj. అంతర్గత; అంతర్గతమైన; అంతర్భూత; అంతరంగ;
** inner planets, ph. అంతర్ గ్రహాలు;
** inner voice, ph. అంతర్వాణి;
* innocent, adj. దోషము లేని; నేరములేని; అపకారము చెయ్యని; తప్పులేని; నిరుపద్రవమైన; అమాయక; సాధువైన;
** innocent person, ph. నిర్దోషి; నిరపరాధి; అమాయకుడు;
** innocuous, adj. అపకారము చేసే సమర్ధత లేని; అపాయకరంగాని; హాని చేయని; అమాయకపు;
* innovation, n. నవకల్పన; నవసృజన; అవిశ్య;
* innuendo, n. వ్యాజ్యోక్తి; చాటూక్తి; అన్యాపదేశం; ఉపాలంభం; ఆక్షేపణ; అసలు అనుభూతిని మనస్సులో దాచిపెట్టి పైపైన మరొక విధంగా ప్రవర్తించడం;
* innumerable, adj. అసంఖ్యాక; అసంఖ్యేయ; హేరాళము; లెక్కలేనన్ని; లెక్కపెట్టలేనన్ని;
** inoculate, v. t. (1) రోగకారక పదార్థాన్ని కానీ ప్రతిజనిని కాని శరీరం లోకి ప్రవేశపెట్టే ప్రక్రియ; వైద్య రంగంలో ఈ "రోగకారక" పదార్థం సర్వసాధారణంగా "వేక్సీను" అవుతుంది. ఆ పరిష్తితులలో inoculation ని vaccination అంటారు; (2) ఒక సూక్ష్మజీవిని లాతి పర్యావరణంలోకి ప్రవేశపెట్టడం;
* inorganic, adj. అనాంగిక; వికర్బన; అసేంద్రియ;
** inorganic chemistry, ph. అనాంగిక రసాయనం; వికర్బన రసాయనం; అసేంద్రియ రసాయనం;
* input, adj. అంతర్‌హిత; అంతర్యాన; అంతర్యాగ; ఆగత; నివిష్ట; నివేశ్య;
** input data, ph. దాపతాంశాలు; ప్రవేశాంశాలు; ఆగతాంశాలు; ప్రవేశిక దత్తాంశాలు; అంతర్యానాంశాలు; అంతర్యాగాంశాలు;
** input device, ph. నివేశ్యన సాధనం; నివేశ్యనోపకరణం;
* input, n. దాపలం; ఆదానం; ప్రవేశాంశం; ప్రవేశికం; నివేశ్యనం; ఆగతం; ఆన; అంతర్యానం; అంతర్యాగం; లోరవానా (లోనికి రవానా); మేత; పెట్టు; అంతర్హితం; యాతం;
* inquest, n. పంచాయతీ; అపమృత్యు విచారణ;
* inquiry, n. భోగట్టా;
* inquisition, n. ధర్మపరీక్ష;
* inquisitiveness, n. జిజ్ఞాస; ఆదిత్స;
* inradius, n. [math.] అంతర్ వ్యాసార్ధం; the radius of a circle (sphere) inscribed in a polygon (polyhedron); see also circumradius;
* insanity, n. వెర్రి; పిచ్చి; ఉన్మాదం; చిత్తవిభ్రమం; చిత్తచాంచల్యం;
* inscription, n. రాత; అభిలేఖనం;
** inscription on copper plate, ph. తామ్ర పత్రాల మీద రాత;
** inscription on stone, ph. రాతి మీద రాత; శిలాభిలేఖనం; శిలాశేసనం;
* insect, n. కీటకం; క్రిమి; పురుగు;
** insect pest, ph. చీడ; చీడపురుగు;
* insecticide, n. కీటక సంహారి; కీటకారి;
* insecurity, n. భద్రతారాహిత్యం; అభద్రత;
** insecure feeling, ph. అభద్రతా భావం;
* inseparable, adj. అవినాభావ;
* insemination, n. వీర్యదానం;
** artificial insemination, ph. కృత్రిమ వీర్యదానం; కృత్రిమ గర్భాదానం;
* insert, v. t. దోపు; దూర్చు; జొప్పించు; జొనుపు; ఆగమించు;
* insert, n. జొప్పించబడ్డది; దోపినది; ప్రక్షిప్తం;
* insertion, n. దోపడం; దూర్చడం; జొప్పించడం; జొనుపడం; ఆగమనం;
* inside, n. లోపల;
* insiders, n. pl. అస్మదీయులు;
* insight, n. సూక్ష్మాక్షిక; లోచూపు; దివ్యచక్షువు;
* insignificant, n. అల్పం; స్వల్పం;
* insinuation, n. నిందారోపణ; వ్యంగ్యోక్తి;
* insipid, adj. చప్ప; చప్పని; చప్పనైన; చప్పిడి; నిస్సారమైన; రుచిలేని; పేలవమైన;
* insist, v. t. పట్టుబట్టు; బలవంతం చేయు; హఠం చేయు;
* insistent, adj. హఠ; బలవంతపు;
* insolence, n. తృణీకారం; నిర్లక్ష్యం;
* insolent, adj. మర్యాద లేని; తృణీకార భావంతో;
* insolvency, n. దీవాలా;
* insolvent, n. దీవాలా తీసిన వ్యక్తి;
* insomnia, n. నిద్రలేమి; నిద్ర పట్టకపోవటం;
* inspection, n. విలోకనం; తనిఖీ; పరీక్ష;
* inspector, n. తనిఖీదారు;
* inspiration, n. (1) ప్రేరణ; ఉత్తేజం; స్ఫూర్తి; ఉద్దీపనం; దైవావేశం; (2) ఉచ్ఛ్వాసం; గాలి పీల్చడం;
* install, v. t. తురుము; కూర్చు; కీల్కొల్పు; సంఘటించు; సిద్ధపరచు;
* installment, instalment (Br.), n. విడత; వాయిదా; కంతు; దాటు; దఫా; కిస్తు; కిస్తీ;
** installment payment, ph. కిస్తీ; వాయిదా వాయి;
* installments, n. విడతలు; వాయిదాలు; దఫాలు; కిస్తీలు; కంతులు;
** by installments, ph. వాయిదాల మీద; కిస్తీ బందీ; కంతులవారీగా;
** first installment, ph. మొదటి వాయిదా; మొదటి దఫా; మొదటి కంతు;
* instance, n. (1) ఉదాహరణం; (2) మారు; సారి; మచ్చు;
* instant, n. క్షణం;
* instantaneous, adj. క్షణిక; యుగపత్తు; సద్య; సద్యో;
** instantaneous acceleration, ph. సద్య [[త్వరణం]];
** instantaneous position, ph. సద్య స్థానం; యుగపత్ స్థానం;
** instantaneous velocity, ph. సద్య ధృతిగతి; సద్య వేగం;
* instead, prep. బదులుగా; మారుగా; ప్రతిగా; ప్రత్యామ్నాయంగా;
* instigate, v. t. ప్రేరేపించు; ప్రోద్బలం చేయు; పురికొలుపు; ఉసిగొలుపు;
* instigation, n. ప్రేరేపణ; ప్రోద్బలం; దుర్బోధ చేసేవ్యక్తి; పుల్లలు పెట్టే వ్యక్తి;
* instill, v. t. (1) బొట్లు బొట్లుగా దిగజార్చు; (2) బోధ చేయు;
* instinct, n. ఉపజ్ఞ; సహజేచ్ఛ; సహజజ్ఞానం; సహజాతం; సహజ స్ఫురణ; వాసన; ప్రవృత్తి; అంతఃప్రవృత్తి; ఇంగిత జ్ఞానం; జంతుజ్ఞానం;
** killer instinct, ph. జిఘాంస; యుయుత్స; గెలిచే వరకు పోరాడాలనే కోరిక;
** person with a killer instinct, ph. జిఘాంసువు;
* instinctive, adj. సహజాత;
* institute, n. సంస్థ; పీఠం;
* institution, n. సంస్థ; పీఠం;
* institutional, adj. సంస్థాగత;
* instruction, n. (1) ఉపదేశం; బోధన; అధ్యాపన; (2) ఆదేశం; సమాదేశం; నిర్దేశం;
** instruction set, ph. ఆదేశ గణం;
* instructional, adj. ఉపదేశాత్మక; బోధనాత్మక;
* instrument, n. (1) సాధకం; సాధనం; ఉపకరణం; పనిముట్టు; కొరముట్టు; పరికరం; ఎత్తళి; జంత్రం; ఆతోద్యం; (2) దస్తావేజు;
** musical instrument, ph. ఆతోద్యం; ఉ. జంత్రవాద్యం;
** percussion instrument, ph. అవనాధం; ఉ. డప్పు; మృదంగం; తబలా, వాయులీనం, వీణ;
** wind instrument, ph. సుషిరం, ఉ. వేణువు;
** instrument of accession, ph. విలీన పత్రం;
* instrumental, adj. (1) కరణార్థక; (2) జంత్ర;
** instrumental music, ph. జంత్ర వాద్యము;
* insubordination, n. అవిధేయత; ఆజ్ఞాధిక్కారం;
* insulator, n. బంధకి; బంధకం; అవాహకం; నిరోధకం;
* insult, n. అవమానం; పరాభవం; తిరస్కారం; న్యక్కారం;
* insurgence, n. తిరుగుబాటు; విద్రోహం;
* insurance, n. [[బీమా]];
** life insurance, ph. జీవిత బీమా;
** permanent insurance, ph. అతైంతిక బీమా; శాశ్వత బీమా;
** temporary insurance, ph. తైంతిక బీమా; అశాశ్వత బీమా;
** insurance policy, ph. బీమా పట్టా; బీమా పట్టా పత్రం;
** insurance premium, ph. బీమా అడితి; బీమా ప్రీమియం;
* insurrection, n. ఉపప్లవం; తిరుగుబాటు; విప్లవం;
* intact, adv. చెక్కుచెదరకుండా;
* intake, n. ఆన;
* integer, n. పూర్ణాంకం; పూర్ణసంఖ్య; అభిన్న సంఖ్య; అభిన్నాంకం;
** integer data type, ph. పూర్ణాంక దత్తాంశ ప్రకారం;
* integrability, adj. సమాకలనీయత;
* integral, adj. సమాకలన; అవినాభావ;
** integral calculus, ph. సమాకలన కలనం;
** integral connection, ph. అవినాభావ సంబంధం;
* integrable, adj. సమాకలనీయ; సమాకలన ప్రక్రియకి లొంగే;
* integrand, n. సమాకల్యం; సమాకలన ప్రక్రియకి లొంగబడ్డది;
* integrated, adj. సమాకలిత;
** integrated circuit, ph. సమాకలిత విద్యుద్వలయం
* integration, n. (1) సమాకలనం; చయనకలనం; (2) కలపడం; వీలీనత; ఏకీకరణ; సమన్వయం;
* integrity, n. చిత్తశుద్ధి; న్యాయవర్తన; పెద్దమనిషితనం;
* intellect, n. (1) బుద్ధి; జ్ఞానశక్తి; ధిషణ; చిత్తం; (2)బుద్ధజీవి;
** sharp intellect, ph. కుశాగ్ర బుద్ధి;
* intellectual, adj. వివేచనాత్మక; శేముష్య; బౌద్ధిక; మేథో;
** intellectual evolution, ph. బౌద్ధిక పరిణామం;
** intellectual mirage, ph. జ్ఞానమరీచిక;
** intellectual property, ph. మేథో సంపత్తి; మేథో సంపద; శేముషీ సంపద;
* intellectual, n. మేధావి; శేముషీవంతుడు; మనీషి;
* intelligence, n. (1) వివేకం; తెలివి; తెలివితేటలు; ప్రజ్ఞానం; (2) గూఢసమాచారం; వర్తమానం; అపసర్పము; వేగు;
** artificial intelligence, ph. విశ్వామిత్ర వివేకం; కృత్రిమ మేధ;
** intelligence gatherer, ph. వేగరి; అపసర్పుడు
** intelligence quotient, ph. బుద్ధిబలం; బుద్ధలబ్దం;
* intelligentsia, n. pl. విజ్ఞులు; మేధావర్గం; వివేకవంతులు;
* intend, v.i. ఉద్దేశించు; తలపెట్టు;
* intended, adv. ఉద్దేశించిన;
* intended, n. ఉద్దిష్టం; అభిలషణీయం; వాంఛనీయం;
* intense, adj. తీవ్ర; తీక్షణ; ఉద్ధృత;
* intensely, adv. ముమ్మరంగా; తీవ్రంగా; ఉధృతంగా;
* intensity, n. తీవ్రత; తీక్షణత; ఉద్ధృతి;
* intent, n. ఉద్దేశం; తలపోత;
* intention, n. ఉద్దేశం; సంకల్పం; తలపోత; వివక్షత; మనోగతం;
* intentionally, adv. ఉద్దేశపూర్వకంగా; సంకల్పశుద్ధితో; బుద్ధిపూర్వకంగా; చెయ్యాలని చేసిన;
* inter, adj. అంతర్; పరస్పర; ఒండొంటి; అన్యోన్య;
* inter, v. t. పాతు; పాతిపెట్టు; భూస్థాపితం చేయు;
* interaction, n. సంకర్షణ;
** short-range interaction, ph. లఘు సంకర్షణ;
* intercalary month, n. అధిక మాసం; లుప్త మాసం; పురుషోత్తమ మాసం; మల మాసం; మలిమ్లుచం; సూర్యసంక్రమణం లేని చంద్ర మాసం;
* intercede, v. t. అటకాయించు;
* intercept, v. t. అడ్డగించు; ఆపు; నిలుపు;
* inter-cellular, adj. కణాంతర;
* interchangeability, n. పరస్పర పరివర్తకత;
* interchangeable, n. పరస్పర పరివర్తకం;
* intercontinental, adj. ఖండాంతర;
* intercourse, n. సంభోగం; రతిక్రీడ;
* inter-crop, n. [[అంతర పంట]]; ఒక పొలంలో ఒక జాతి మొక్కల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో మరొక పంట వెయ్యడం; ఉదాహరణకి అల్లం, పసుపు, జొన్న పొలాలలో పెండలం వేసి పండించడం;
* interdependence, n. పరస్పరావలంబనం; అన్యోన్యాశ్రయం; పరస్పరాధీనత;
* interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం; అంతరవర్తనం;
** graphical interface, ph. చిత్రాంతరాననం;
** command-line interface, ph. అక్షరాంతాననం;
* interest, n. (1) వడ్డీ; ఫాయిదా; మిత్తి; తేమానం; (2) శ్రద్ధ; మొగ్గు; (3) అభిరుచి; ఆసక్తి;
** compound interest, ph. చక్ర వడ్డీ;
** simple interest, ph. బారు వడ్డీ;
** vested interest interest, ph. స్వార్ధం; స్వకార్యం;
* interesting, adj. ఆసక్తికరమైన; ఆసక్తివంతమైన;
* interface, n. అంతరాననం; అంతరముఖం; అంతరవదనం; అంతరవర్తనం; అంతర్ముఖం; పరస్పర ఫలకం; ప్రతిముఖం; కలనయంత్రా నికి బాహ్య ప్రపంచానికి మధ్య సంభాషణలు జరగడానికి మధ్యవర్తిగా పనిచేసే శాల్తీ;
** graphical interface, ph. చిత్రాంతరాననం; చిత్రాంతరవర్తనం;
** command line interface, ph. అక్షరాంతాననం;
* interference, n. జోక్యం;
* interim, adj. అందాకా; తాత్కాలిక; మధ్యంతర;
** in the interim, ph. ఈ మధ్యలో;
* interior, adj. అభ్యంతర; లో; లోపలి;
** interior room, ph. అభ్యంతర మందిరం; లోపలి గది;
* interjection, n. సాధువాదార్థకం; ఆశ్చర్యార్థకం;
* interlude, n. విష్కంభం; విరామ సమయం;
* intermediate, adj. మధ్యంతర; మాధ్యమిక; అంతస్థ; నడుమంతరపు;
* intermediate, n. మధ్యంతరం; మాధ్యమికం; అంతస్థం; నడుమంతరం; మధ్యస్థం;
* interment, n. పాతిపెట్టడం; శవాన్ని భూస్థాపితం చేయడం;
* intermission, n. విరామం; విరామ సమయం;
* intermittent, adj. విడచి విడచి వచ్చే; అడపా తడపా వచ్చే; అంతరాయిక;
** intermittent catastrophe theory, ph. అంతరాయిక వినిపాత వాదం;
* intermittently, adv. అంతరాయికంగా; అప్పుడప్పుడు; ఒక్కోసారి;
* internal, adj. ఆంతరంగిక; అంతరంగ; అంతర్గత; అంతర్ గర్భిత; అంతర్; అంతర; అంతర్భూత; లోపలి;
** internal combustion, ph. అంతర్ దహన;
** internal forces, ph. అంతర్గత శక్తులు;
** internal planets, ph. అంతర్ గ్రహాలు; సౌరకుటుంబంలో సూర్యుడికి, గురుడికి మధ్యనున్న గ్రహాలని అంతర్‌గ్రహాలు అంటారు;
* international, adj. అంతర్జాతీయ;
* International Monetary Fund, n. అంతర్జాతీయ ద్రవ్య నిధి;
* internationalist, n. అంతర్జాతీయతా వాది;
* Internet, n. [[అంతర్జాలం]]; ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కలన యంత్రాలు ఒకదానికొకటి సమాచారం పంపుకుందుకి వీలుగా ఉండే ప్రసారక సదుపాయం; మనుష్యులు మాట్లాడుకుందికి టెలిఫోను సౌకర్యం ఎలాగో అలాగే అంతర్జాలం కలనయంత్రాలు మాట్లాడుకుందికి ఉపయోగపడుతోంది;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: Internet
* ---The '''Internet''' is a system that facilitates communication among many interconnected computers and devices throughout the world. You can use the Internet to send e-mail or to access information available on the World Wide Web (WWW). The Internet is the highway and the WWW is the repository of information;'''
|}
*
* internode, n. కణుపుల మధ్యనున్న కాండం;
* interpolation, n. అంతర్వేశనం; ప్రక్షేపణ;
* interpret, v. t. వివరించు; వ్యాఖ్యానించు; అనువదించు;
** interpreted programming language, ph. అనువదిత విధిభాష; అనుదిత విధిభాష; A programming language, such as JavaScript, that is designed to be translated into executable code on the fly as the program is executed line by line;
* interpreter, n. ద్విభాషి; దుబాసీ; ఒకరి నోటి మాటని తన నోటితో అనువాదం చేసే వ్యక్తి; see also translator;
* interrogate, v. t. ప్రశ్నించు; అడుగు;
* interrogation, n. ప్రశ్న;
** interrogation mark, ph. ప్రశ్నార్థక చిహ్నం; క్వొశ్చెన్ మార్కు;
* interrogative, adj. ప్రశ్నార్థక; ప్రశ్నవాచక;
* interruption, n. అంతరాయం; ఆటంకం;
* intersection, n. ఖండన; మిళితం;
** point of intersection, ph. ఖండన బిందువు; మిళిత బిందువు;
* interstellar, adj. తారాంతర;
* interstitial, adj. మధ్యంతర;
* intertwine, v. i. ముడిపడు;
* intertwined, adj. జమిలి;
* interval, n. అంతరం; వ్యవధి; వ్యవధానం; మధ్యకాలం; ఎడతెరిపి;
** time interval, ph. కాల వ్యవధి;
* intervene, v. t. కలుగజేసుకొను;
* interview, n. అభిముఖ సమావేశం; పరిపృచ్ఛట; భేటీ; ముఖాముఖీ; అడబల్కు; అడబల్కరం; see also rendezvous;
* intestate, n. మరణశాసనం లేని పరిస్థితి;
* intestinal, adj. ఆంత్ర; పేగుకి సంబంధించిన;
* intestine, adj. పేగు; ఆంత్రం;
** large intestine, ph. పెద్ద పేగు;
** small intestine, ph. చిన్న పేగు;
* intimacy, n. స్నేహం; లీయత; చనువు; ఆత్మీయత;
* intimate, v. t. తెలియజేయు;
* intimidate, v. t. బెదిరించు; బెదరగొట్టు;
* intimidation, n. బెదిరింపు;
* intolerable, adj. సహించరాని; భరించరాని; దుస్సహ;
* intolerable, n. దుర్భరం; వెక్కసం;
* intolerance, n. అసహనం;
* intonate, v. t. స్వరభేదాలని పాటిస్తూ మాట్లాడు; నొక్కవలసిన చోట నొక్కుతూ మాట్లాడు;
* intonation, n. వాక్యస్వరం;
* intone, v. i. వంతపాడు;
* intoxicant, n. మత్తుపదార్థం; నిషాపదార్థం; మద్యం;
* intoxication, n. ముయికం; మత్తు; మత్తా; కైపు; నిషా; దిమ్ము; లాహిరి;
** intoxicating drink, ph. మత్తు ఎక్కించే పానీయాలు; మద్యం; కల్లు; సారా మొదలయినవి;
* intracranial, adj. కరోట్యంతర;
** intra-syllabic symbols, ph. గుణింతాలకి వాడే గుర్తులు;
* intricacy, n. చిక్కు; తికమక; జటిలత;
** intricate procedure, ph. [idiom] ద్రావిడ ప్రాణాయామం; క్లిష్టమైన పద్ధతి;
* intrigue, n. [[తంత్రం]]; కుతంత్రం; గూడుపుఠానీ;
* intrinsic, adj. సహజమైన; స్వాభావిక; నిజ;
** intrinsic value, ph. సహజమైన విలువ; సహజసిద్ధమైన విలువ; యదార్థమైన విలువ; నిజం విలువ;
* introduction, n. (1) ఉపోద్ఘాతం; ఉపక్రమణం; ప్రస్తావన; ప్రవేశిక; see also preface; prologue; prelude; foreword; (2) పరిచయం;
* introspection, n. ఆత్మపరిశోధన; ఆత్మశోధన; అంతర్లోకన; ఆత్మావలోకనం;
* introvert, n. అంతర్ముఖత్వం; m. అంతర్ముఖుడు; f. అంతర్ముఖి;
* intrude, v. t. చొరబడు;
* intruders, n. pl. చొరబాటుదారులు;
* intruders, n. pl. చొరబాటుదారులు;
* intrusion, n. చొరబాటు;
* intuition, n. ఉపజ్ఞ; ఉపజ్ఞాతం; అంతర్బుద్ధి; అంతఃప్రబోధం; అంతఃస్పురణ; అర్ధాపత్త; కారణ కార్య సమీక్ష లేకుండా సూక్ష్మగ్రాహ్యత ప్రదర్శించడం; knowledge acquired without instruction;
* intuitive, adj. అతీంద్రియ; సూక్ష్మగ్రాహ్య; ఉపజ్ఞామూలక;
* inundate, v. t. ముంచు; ముంచెత్తు;
* invade, v. t. దండెత్తు; దాడి చేయు; ముట్టడించు;
* invalid, adj. (ఇన్ వేలిడ్) చట్టపరంగా ఆమోదయోగ్యం కాని;
* invalid, n. (ఇన్ వెలిడ్) అనారోగ్యం వల్ల కాని, ముసలితనం వల్ల కాని తన పని తాను చేసుకోలేని వ్యక్తి;
* invariant, adj. కూటస్థ; మార్పు చెందని; గణిత ప్రక్రియల వల్ల మార్పు చెందని;
** invariant embedding, ph. [math.] కూటస్థ తాపడం;
* invasion, n. దండయాత్ర; దాడి; ముట్టడి;
** invasive plant, ph. బెడద మొక్క;
* invective, n. దూషణ; సాధించు; తిట్టు; కించపరచేలా విమర్శ;
* invent, v. i. కనిపెట్టు; సృజించు; see also discover;
* invention, n. సంజనితం; అభిసర్గం; సృజనం; పరికథ; పరికల్పనం; ఉపేతం; ఒనరిక; ఆవిష్కరణ; ఆవిష్కారం;
* inventiveness, n. సృజనాత్మకం; ఒనరిక;
* inventor, n. స్రష్ట; ప్రణేత; నిర్మాత; సృష్టికారకుడు; కల్పనకర్త; ఉపేత; ఆవిష్కర్త;
* inverse, adj. విలోమ; విపర్య; (ant.) అనులోమ;
** inverse square law, ph. విలోమ వర్గ సూత్రం;
** inversely proportional, ph. విలోమానుపాతం;
* inversion, n. విపర్యాసం;
** thermal inversion, ph. తాప విపర్యాసం;
** invert sugar, ph. త్రిశంకు చక్కెర; Sucrose = Glucose-Fructose (attached together), Invert Sugar = Free Glucose + Free Fructose (apart);
* inverted, adj. అధోముఖ; తలకిందులయిన;
* inverted, n. వ్యత్యాస్తం; తలకిందులు;
* invertebrate, n. అకశేరుకం; అపృష్ట వంశి; వెన్నుపూస లేని జంతువులు;
* invest, v. t. మదుపు పెట్టు; పెట్టుబడి పెట్టు;
* investors, n. pl. మదుపర్లు; పెట్టుబడిదారులు;
* investigative, v. t. విచారించు; అన్వేషించు; పరిశోధించు;
* investigative, adj. అన్వేషణాత్మక; పరిశోధనాత్మక;
* investigation, n. పరిశోధన; దర్యాప్తు; విచారణ; అరయిక; అన్వేషణ;
* investigator, n. m. పరిశోధకుడు; శోధకుడు; అన్వేషకుడు; విచారకుడు;
* investment, n. పెట్టుబడి;
* invincible, adj. అజేయ;
* invisible, adj. అదృశ్య; అశరీర; అసదృశ; కనపడని; అగుపడని;
** invisible hand, ph. అసదృశ్య హస్తం;
** invisible ink, ph. అశరీర సిరా;
** invisible universe, ph. అదృశ్య విశ్వం;
** invisible voice, ph. అశరీర వాణి; ఆకాశవాణి;
* invitation, n. ఆహ్వానం; పిలుపు;
* invite, v.t. ఆహ్వానించు; పిలుచు;
* invited guests, ph. ఆహూతులు; ఆహ్వానితులు;
* invocation, n. ఆవాహన; ప్రార్థన; నాందీశ్లోకం;
* invoice, n. ఉల్లాకు; కొన్న సరకుల పేర్లు, ధరలు చూపించే జాబితా;
* invoke, v. t. ఆమంత్రించు;
* involuntary, adj. అసంకల్పిత; అసంకల్ప; అప్రయత్న; అనైచ్ఛిక; అనియంత్రిక; ఐచ్ఛికం కాని;
** involuntary action, ph. అనియంత్రిక చర్య;
** involuntary muscles, ph. అనైచ్ఛిక కండరములు;
** involuntary reflex, ph. అసంకల్ప ప్రతీకారం;
* involvement, n. తాదాత్మ్యం;
* inward, adj. అంతర్గత;
* inundation, n. వరద; ముంపు; జలప్లుతం;
* ion, n. అణుశకలం; అణువులో భాగం; అణువులోని ఎలక్ట్రానులని కొన్నింటిని విడగొట్టినప్పుడు మిగిలిన శకలాలు;
* ionized, adj. ప్రోద్ధుత; (Br.) ionised;
* ionizing, adj. ప్రోద్ధుత; (Br.) ionising;
** ionizing radiation, ph. ప్రోద్ధుత వికీర్ణం; ప్రోద్ధుత వికిరణం;
* ionosphere, n. అణుశకలావరణం; శకలావరణం; అయనోవరణం;
* ionization, n. శకలీకరణం; అణువులు విద్యుదావేశం పొందడం;
* iota, n. (1) గ్రీకు భాషలో ఒక అక్షరం; (2) పల్లెత్తు; కించిత్తు; ఈషత్తు; ఇంచుక; ఇసుమంత; రవంత; లవలేశం;
* IOU, n. రిణపణ్ణా; రుణపత్రం;
* ipso facto, n. దానంతగా అది; అంతటితోనే;
* irascibility, n. చిరాకు; చికాకు;
* ire, n. ఆగ్రహం;
* Iridium, n. ఇరిడియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 77, సంక్షిప్త నామం, Ir); [Lat.]. iris = rainbow;
* iris, n. (1) కానీనికా పటలం; నేత్ర విభాజకం; కంటిపాప చుట్టూ ఉండే గుండ్రని పొర; ఈ పొరకి ఉండే రంగే కంటి రంగు; (2) ఇంద్ర ధనుస్సు; హరివిల్లు; (3) శీతల దేశాలలో పూసే ఒక రకం పువ్వు;
* iron, adj. ఇనప; అయో;
** iron filings, ph. ఇనప రజను; అయోచూర్ణం;
** iron tip, ph. అయోముఖి;
* Iron, n. (1) [[ఇనుము]]; అశ్మసారం; ఆయసం; ఒక రసాయన మూలం; (అణుసంఖ్య 26, సంక్షిప్త నామం; Fe); [Lat.] ferrum; (2) ఇస్థిరి; (3) ఇస్థిరి పెట్టి;
** pig iron, ph. పోత ఇనుము; దుక్క ఇనుము; దంప ఇనుము;
** wrought iron, ph. చేత ఇనుము; పోత ఇనుముని కరగించి మలినములను పోగొట్టగా మిగిలిన ఇనుము;
* iron, v. t. ఇస్థిరి చేయు;
** Iron Age, ph. ఆశ్మయుగం; ఇనప యుగం; క్రీ.పూ.1000 నుండి క్రీ.శ. 100 వరకు; కంచుయుగం తరువాత వచ్చిన కాలం;
** iron horse, ph. ఆశ్మాశ్వం; రైలింజను;
** ironing box, ph. ఇస్త్రీపెట్టి;
* ironical, adv. ఇత్సితంగా;
* irony, n. వ్యాజస్తుతి; వక్రోక్తి; వ్యంగ్యం; ఇత్సితం; అన్నది ఒకటి, దానివల్ల స్పురించే అర్ధం మరొకటి అవడం;
* irradiation, n. ఉద్యోతనం; (lit.) to expose to light;
* irrational, adj. (1) అకారణమైన; హేతుబద్ధం కాని; తర్కబద్ధం కాని; (2) అనిష్ప; నిష్పత్తిలా రాయడానికి వీలు పడని;
** irrational fear, ph. కారణం లేని భయం; అకారణమైన భయం;
** irrational number, ph. అనిష్ప సంఖ్య; అనిష్పాంకం; కరణీయ సంఖ్య; a number that cannot be expressed as a ratio;
* irregular, adj. వ్యతిక్రమ; క్రమభంగ; క్రమవిపర్య; అవకతవక; అపవాద; ఉచ్చావచ;
** irregular form, ph. అపవాద రూపం; వ్యతిక్రమ రూపం; క్రమభంగ రూపం;
** irregular number, ph. అనిష్ప సంఖ్య; అనిష్పాంకం;
** irregular prime, ph. వ్యతిక్రమ ప్రధాన సంఖ్య;
* irregularity, n. వ్యతిక్రమం; క్రమభంగం; క్రమవిపర్యం; అవకతవకతనం;
* irregularly, adv. అడ్డగోలుగా; వరసావావీ లేకుండా; తర్కరహితంగా;
* irrelevant, adj. అప్రస్తుత;
* irresponsibility, n. బాధ్యతారాహిత్యం;
* irreversible, adj. అప్రత్యావర్తక; అనుత్క్రమణీయ;
* irreversible, n. అప్రత్యావర్తకం;
* irrigated, adj. సాగు; సాగు చెయ్యడానికి సమకూర్చే నీటి పారుదల;
** irrigated land, ph. నదీమాతృకం; సాగుభూమి; ఆయకట్టు; పారకం;
** irrigated water, ph. సాగు నీరు;
* irrigation, n. సాగు; సేద్యం; నీటి పారుదల; నీటికట్టు;
** lift irrigation, ph. కపిలె సాగు; ఎత్తిపోతల సేద్యం; ఎత్తిపోతల సాగు;
* irritability, n. చికాకు;
* irritation, n. బాధ; వ్యధ; చికాకు;
* ischium, n. తుంటి ఎముక;
* isinglass, n. [[అభ్రకం]]; గిరిజం;
* island, n. (ఐలెండ్) దీవి; [[ద్వీపం]]; [[లంక]];
** offshore island, ph. తీరస్థ దీవి;
* islet, n. చిన్న దీవి; దీవిక;
* ism, suff. ఇజం; ప్రపంచాన్ని ఒక మూస పోసిన దృష్టితో చూసే తత్త్వం;
* iso, pref. సమ;
* isobar, n. సమవాయి; సమభార రేఖ; సమపీడన రేఖ;
* isogamy, n. [bio.] సమ సంయోగం; ఒక రకం లైంగిక పునరోత్పత్తి; (ant.) anisogamy;
* isogloss, n. [ling.] భేదకరేఖ; ఒక భాషలో గమనించదగ్గ మార్పులని విడదీసే భౌగోళిక రేఖ; గోదావరి దాటితే భాషలో మార్పు వినిపిస్తుంది కనుక గోదావరిని ఒక భేదక రేఖగా పరిగణించవచ్చ;
* isolated, adj. వియుక్త; వివిక్త; వ్యష్ఠి; విడిగా ఉంచిన;
** isolated double bond, ph. వియుక్త జంటబంధం;
** isolated system, ph. వివిక్త వ్యవస్థ; వియుక్త వ్యవస్థ; వ్యష్ఠిగా ఉంచిన వ్యవస్థ;
* isomer, n. సమభాగి; సమాంగి;
* isomerism, n. సమభాగత్వం; సమాంగత; సమాంగత్వం; సాదృశ్యం; అనేక భాగములతో రకరకాల విన్యాసాలు కలిగిన నిర్మాణ క్రమాలతో ఒప్పారే రసాయనాలు; రెండు మూలకాల సాంఖ్య క్రమాలు ఒక్కటే అయి, నిర్మాణ క్రమాలు తేడాగా ఉంటే ఆ రెండింటిని సమభాగులు అంటారు;
** chain isomerism, ph. శృంఖల సమాభాగత్వం; శృంఖల సమాంగత; శృంఖల సమాంగత్వం; శృంఖల సాదృశత్వం;
** conformational isomerism, ph. అనురూపాత్మక సమభాగత్వం; అ. సమాంగత్వం; అ. సాదృశ్యం;
** group isomerism, ph. సామూహిక సమభాగత్వం; సా. సమాంగత; సా. సమాంగత్వం; సా. సాదృశ్యం;
** optical isomerism, ph. దృక్ సమభాగత్వం; దృక్ సమాంగత; దృక్ సమాంగత్వం; దృక్ సాదృశ్యం;
** positional isomerism, ph. స్థాన సమభాగత్వం; స్థాన సమాంగత; స్థాన సమాంగత్వం; స్థాన సాదృశ్యం;
** stereo isomerism, ph. ప్రాదేశిక సమభాగత్వం; ప్రా. సమాంగత్వం;
** structural isomerism, ph. నిర్మాణాత్మక సమభాగత్వం; ని. సమాంగత; ని. సమాంగత్వం;
* isomorphism, n. [[సమరూపత]];
* isopropyl alcohol, n. రబ్బింగ్ ఆల్కహాలు; ఉద్వర్తన ఒలంతం; జ్వరం వచ్చినప్పుడు దీనిని శరీరం మీద వేసి రుద్దితే ఉష్ణం తగ్గుతుంది కనుక ఈ పేరు వచ్చింది; C<sub>3</sub>H<sub>7</sub>OH;
* isosceles, adj. సమద్విబాహు;
* isotherm, n. సమతాపి; సమతాపరేఖ; ఒక మేపులో ఒకే తాపోగ్రత ఉన్న బిందువలని కలుపుతూ గీసే గీత;
* isothermal, adj. సమతాప;
* isotope, n. ఏకస్థాని; ఆవర్తన పట్టికలో ఒకే గదిలో ఉంచవలసిన రసాయన మూలకాలు;
** radio-isotopes, వికీర్ణ ఏకస్థానులు;
* isotropic, adj. సమదైశిక; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోయే;
* isotropy, n. [[సమదైశికత]]; ఏ దిశలో కొలిచినా లక్షణాలలో మార్పు లేకపోవడం;
* issue, n. (1) సంచిక; (2) సంతతి; (3)సమస్య; (4) విషయం; అంశం;
** life and death issue, ph. జీవన్మరణ సమస్య;
** issue at hand, ph. ప్రస్తుతపు సమస్య;
* issue, v. t. జారీ చేయు;
* isthmus, n. భూసంధి;
* it, pron. proximate. ఇది;
* it, pron. remote. అది;
* italics, n. pl. వాలు అక్షరాలు;
* itch, n. దురద; గుల; జిల; దూల; తీట; కండూతి; కసిమిరి;
* item, n. మూర్తి; శాల్తీ; అంశం; ఉరువు;
* iterate, v. t. ఆమ్రేడించు; పదే పదే చేయు;
* iterative, adj. ఆమ్రేడిత; పునరుత్థాన;
** iterative method, ph. పునరుత్థాన పద్ధతి; చేసిన లెక్కనే చిన్న చిన్న మార్పులతో పదే పదే చేయడం;
* itinerary, n. కార్యక్రమం;
* itis, suff. వాపు; శోఫ; ఆర్తి;
* its, pron. proximate. దీని;
* its, pron. remote. దాని;
* ivory, n. దంతం;
** ivory tower, ph. [idiom] దంతపు మేడ; ఒంటి స్తంభపు మేడ; విశ్వవిద్యాలయం;
* ivy gourd, n. దొండ; దొండ పాదు;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
m95yhzj7noi2nvt71vlj96yurvdd6ec
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/N-O
0
3005
33307
33296
2022-07-22T03:57:10Z
Vemurione
1689
/* Part 2: O */
wikitext
text/x-wiki
=నిఘంటువు=
*This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as n added feature.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
==Part 1: N==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
* '''nadir, n. నీచ; అధోబిందువు;
* nag, v. t. సాధించు; నసపెట్టు; సణుగు; వేధించు;
* nail, n. (1) గోరు; నఖం; కరజం; (2) మేకు;
** nail clipper, ph. నఖోత్పాటని; గోళ్ల కత్తెర; కరజ కత్తెర;
* naive, adj. (నయీవ్) అమాయకపు; కుటిలం కాని; వెర్రిబాగుల; పిచ్చి; కపటరహిత; బోళా; పున్నపూస;
** naive man, ph. వెర్రిబాగుల వాడు; అమాయకుడు;
** naive woman, ph. వెర్రిబాగులది; అమాయకురాలు;
* naivetè, n. (నయీవెట్టే) అమాయకత్వం; ముగ్ధత్వం; బోళాతనం; సరళత;
* naked, adj. (1) నగ్న; దిగంబర; దిసమొల; అంగమొల; దడ్డు; అనావృత; బిత్తలి; (2) అలంకారంలేని;
** naked beauty, ph. నగ్న సౌందర్యం;
** naked eye, ph. నగ్న నయనం;
** naked man, ph. దిగంబరుడు; నగ్నుడు; అవధూత; బిత్తలి;
** naked truth, ph. నగ్న సత్యం; పచ్చి నిజం;
* name, n. (1) పేరు; నామధేయం; నామం; (2) కీర్తి;
** christian name, ph. పెట్టిన పేరు; (ఇంటి పేరు కాదని తాత్పర్యం);
** descriptive name, ph. అన్‌వర్థ నామం; సార్థక నామం;
** family name, ph. ఇంటి పేరు;
** fanciful name, ph. యౌగిక పదం;
** first name, ph. పెట్టిన పేరు; సంప్రదాయికంగా మొదట రాసుకునే పేరు;
** given name, ph. పెట్టిన పేరు;
** last name, ph. ఇంటి పేరు; సంప్రదాయికంగా చివర రాసుకునే పేరు;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: names
* ---Use ''first names'' when you know the person well. Use someone's ''title and last name'' in formal situations : Professor Mitra, could I make an appointment to see you? You can use title alone without using their last name: What is wrong with me, Doctor? However, the titles Mr., Mrs., Ms. Can only be used if you are also saying someone's last name : Hello! Mrs. Gupta, how are you? Last names are rarely used alone, unless you know each other very well. When someone has the ''title Sir,'' use the title with their first name : Say, Sir Winston, not Sir Churchill.'''
|}
*
* name, v. t. పేరుపెట్టు; నామకరణం చేయు;
* nameless, adj. పేరులేని; అనామక;
* namesake, n. పేరింటిగాడు; పేరింటిగత్తె;
* nano, adj. pref. నేనో; అత్యాతి సూక్ష్మ; బిలియనులో ఒక పాలు మోతాదులో ఉన్న భాగాలని సూచించే ప్రత్యయం;
* nanometer, n. నేనో మీటరు; మీటరులో బిలియనో వంతు; 10<sup>−9</sup> మీటరు;
* nanosecond, n. నేనో సెకండు; సెకండులో బిలియనో వంతు;
* nameplate, n. నామఫలకం;
* nap, n. కునుకుబాటు; అల్పనిద్ర;
* napalm, n. భగ్గుమని మండే రసాయనం; naphthalene + palmitic acid
* nape, n. మెడ; కంధరం; గ్రీవం; గొంతుక యొక్క వెనుక భాగం;
* napkin, n. చిరుతుండు; చిన్న తువ్వాలు;
* naphthalene, n. నేఫ్తలీను; ఘాశ్టుగా వాసన వేసే ఒక రసాయనం;
** naphthalene balls, ph. pl. కల్రా ఉండలు; చిమ్మెటలని రాకుండా ఈ ఉండలని బట్టలలోనూ, పుస్తకాల బీరువాలలోనూ వేసేవారు;
* narcissism, n. ఆత్మవ్యామోహం; ఆత్మధీమతాభావం; తానే గొప్ప అని అతిగా అనుకునే ఒక మానసిక రుగ్మత. ఈ జబ్బు ఏ కారణం లేకుండా శరీర తత్త్వం వలన కూడా రావచ్చును;
* narcissist, n. స్వయంమోహితుడు; మోతాదు మించిన ఆత్మాభిమానం కలిగి ఉండే వ్యక్తి; సహానుభూతి లేకపోవడం, గర్వంతోటీ, అహంభావంతోటీ ఉండడం, తానే మొనగాడినని అనుకోవడం, ఇతరుల ప్రశంశలకొరకు ఎదురు చూడడం, వంటి లక్షణాలు ప్రదర్శించే ఒక మానసిక రోగి; ఈ వ్యక్తి ఏదైనా చెడ్డ పని చేసినప్పుడు నలుగురిలోనూ తలెత్తుకు తిరగడానికి ఆత్మాభిమానం అడ్డు వస్తుంది. (rel.) psychopath కూడా స్వయం మోహితుడే కాని ఈ వ్యక్తి చెడ్డ పని చేసినప్పుడు నలుగురు ఏమనుకుంటాఋఓ అనే భయం ఉండదు;(see also sociopath and psychopath);
* narcissistic, adj. స్వయంమోహిత;
* narcosis, n. మత్తు;
* narcotic, n. మాదకం; బుద్ధిని మందగింప చేసే పదార్థం; (ety.) [Gr. narcos = stupor]; English adjective stupid is also derived from this; opium and its derivatives like morphine, codeine, and heroin are examples of narcotics;
* nares, n. ముక్కురంధ్రములు; చెరమలు; ముక్కుపచ్చలు;
* narrate, v. t. చెప్పు; వివరించు;
* narration, n. (1) కథ; (2) కథనం; కథాగమనం; కథితం; ఆఖ్యానం; చెప్పడం;
* narrative, n. కథనం; కథని చెప్పే విధం; కథితం; విశదీకరణ; వర్ణన; కథనం ఒక క్రమబద్ద వ్యక్తీకరణ;
** narrative therapy, ph. కథన చికిత్స; అటు మానసిక వైద్యం లోను,ఇటు వ్యక్తిత్వ వికాస విద్యలోనూ,బహుళ ప్రాచుర్యంలోకి ,ప్రాబల్యంలోకి వస్తోన్న ఒక వైద్యవిధానం;
* narratology, n. కథన శాస్త్రం; కథనాలలోని సాధారణ, తార్కిక, నిర్మాణ ధర్మాలని అధ్యయనం చేసే శాస్త్రం; కథని ఎలా చెబుతారు అనే అంశాన్ని అధ్యయనం చేసే శాస్త్రం;
* narrator, n. ఆఖ్యాత; m. కథకుడు; కథావాచకుడు; ఆఖ్యాయికుడు; f. కథావాచకి;
* narrow, adj. సన్నని; ఇరుకైన; సంకుచితమైన; వెడల్పు కాని;
** narrow mindedness, ph. సంకుచిత మనస్తత్వం; సంకుచిత స్వభావం;
* nasal, adj. అనునాసిక; నాసికా; ముక్కుకి సంబంధించిన;
** nasal cavities, ph. చెరమలు;
* nasals, n. అనునాసికములు; ముక్కుతో పలికే అక్షరాలు; ణ, న, మ, ం;
* nascent, adj. నవజాత; సద్యోజాత; ఉద్భవ; ప్రారంభ దశలో ఉన్న; అప్పుడే పుట్టిన;
** nascent state, ph. నవజాత స్థితి; ఆరంభ దశ; సద్యోజాత స్థితి;
* nasopharynx, n. నాసికా సప్తపథ;
* nasty, adj. ఏభ్య; రోతైన; అసహ్యమైన;
** nasty fellow, ph. ఏభ్రాసి = ఏభ్య + రాసి;
* natal, adj. పుట్టుకకి సంబంధించిన; జన్మకి సంబంధించిన;
* natation, n. ఈత కొట్టడం; నీళ్ళల్లో తేలడం;
* nates, n. pl. పిరుదులు;
* nation, n. జాతి; దేశం; రాజ్యం;
** father of the nation, ph. జాతిపిత;
* national, adj. జాతీయ; దేశ; దేశీయ;
** national anthem, ph. జాతీయ గీతం;
** national consciousness, ph జాతీయ చైతన్యం;
** national debt, ph. జాతీయ రుణం;
** national monument, ph. జాతీయ స్థూపం;
** national wealth, ph. జాతీయ సంపద;
* national, n. m. దేశస్థుడు; పౌరుడు;
* nationalist, n. జాతీయవాది;
* nationality, n. దేశీయత;
* nationalization, n. జాతీయీకరణం;
* nationwide, adj. దేశవ్యాప్తంగా;
* native, adj. సహజ; స్వంత; సొంత; ప్రాకృత; దేశీ; దేశవాళీ; స్వదేశీ; మాతృ; నాటు; నిసర్గ;
** native crop, ph. దేశవాళీ పంట;
** native land, ph. మాతృభూమి; అభిజనం;
** native stuff, ph. నాటు సరుకు; దేశవాళీ సరుకు;
** native tongue, ph. మాతృభాష;
** native place, ph. సొంత ఊరు; స్వంత ఊరు; స్వస్థలం;
** native vocabulary, ph. దేశీ పదజాలం;
* native, n. s. (1) ఒక ప్రదేశానికి చెందినది; (2) జాతకుడు;
* natives, n.pl. నిసర్గములు; నిసర్గులు;
* natural, adj. ప్రకృతి సిద్ధమైన; ప్రాకృతిక; స్వతసిద్ధమైన; స్వభావ సిద్ధమైన; స్వభావికమైన; సిద్ధ; సహజమైన; నైజ; నైసర్గిక; ఆధిభౌతిక;
** natural forces, ph. ప్రకృతి శక్తులు; సహజ శక్తులు;
** natural gas, ph. వంట వాయువు; సహజ వాయువు;
** natural luminosity, ph. నైసర్గిక తేజం;
** natural numbers, ph. సహజ సంఖ్యలు; ధన పూర్ణాంకాలు; 1, 2, 3, ... వగైరా:
** natural oil, ph. సిద్ధ తైలం;
** natural period, ph. [gram.] సిద్ధ బిందువు; వాక్యం చివర వచ్చే విరామ సంకేతం;
** natural philosophy, ph. ఆధిభౌతిక శాస్త్రం;
** natural property, ph. నైసర్గిక గుణం; నైసర్గిక లక్షణం; నైజం;
** natural selection, ph. నైసర్గిక నిర్ణయం; ప్రాకృతిక వరణం; సహజ సంవరణ;
* naturality, n. స్వాభావికత;
* nature, n. (1) ప్రకృతి; నిసర్గము; (2) స్వభావం; స్వయంభు; నైజం; స్వతహా; సహజం; లక్షణం; ప్రవృత్తి;
** by nature, ph. స్వతహాగా;
** nature or nurture?, ph. ప్రకృతా, పెంపకమా?
* naturopathy, n. ప్రకృతి వైద్యం; కూరగాయ వైద్యం;
* naught, n. సూన్యం; సున్న;
* naughty, adj. ఆకతాయ; కొంటె; ఉలిపి;
* nausea, (నాసియా) n. కడుపులో తిప్పు; వికారం; వమనేచ్ఛ;
* nauseating, adj. కడుపులో తిప్పు కలిగించే; వికారం కలిగించే; అసహ్యకరమైన;
* nauseous, (నాషస్) adj. కడుపులో తిప్పుపెట్టు; అసహ్యం కలిగించు;
* nautical, adj. నావిక; సముద్రానికి సంబంధించిన;
** nautical almanac, ph. నావిక పంచాంగం;
** nautical mile, ph. 6080 అడుగులు; 1.508 statute mile; (note) 1 nautical mile/sec = 1 knot; భూమి ఒక గోళంలా ఉందనుకున్నప్పుడు ఆ గోళం కేంద్రం దగ్గర ఒక “నిమిషం” కోణం చెయ్యగలిగే ఒక మహావృత్తం మీద ఉన్న రెండు బిందువుల మధ్య దూరం; the distance measured along the Great Circle joining two points that subtend an angle of 1 minute at the center; దూరాన్ని కొలవడానికి భూమి చుట్టుకొలత ఆధారంగా నిర్ణయించిన కొలమానం; ఒక డిగ్రీలో 60 వ వంతు దూరంలో ఉన్న అక్షాంశం యొక్క దూరం;
* naval, adj. నావిక; నౌకాదళానికి సంబంధించిన;
** naval base, ph. నావికా పీఠం; నావికా స్థావరం;
* navel, n. బొడ్డు; నాభి;
** navel orange, ph. బొడ్డు నారింజ; నాభి నారింజ;
* navigable, n. నావ్యం; పడవలు వెళ్లడానికి వీలైనది;
* navigation, n. మాలిమి; మార్గనిర్దేశకం; నౌకాగమనశాస్త్రం;
* navigator, n. నియామకుడు; మార్గదర్శక్; మాలిమి; మాలిమికాడు; నావని నడపడానికి దారి చూపే వ్యక్తి;
* navy, n. నౌకాదళం; నౌకాబలం;
* near, adj. దగ్గర; సమీప;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: near, close
* ---Use ''near'' and ''close'' to talk about short distances. ''Close'' is usually followed by ''to'', but ''near'' is not: We live close to the temple; There is a market near our house.'''
|}
*
* nearby, adj. దగ్గరలో; సమీపంలో;
* nearsightedness, n. హ్రస్వదృష్టి, దగ్గర వస్తువులని మాత్రమే చూడగలగటం; myopia;
* nebula, n. నీహారిక; తేజోమేఘం; జ్యోతిర్మేఘం; వెలిమబ్బు; శుక్లపటలం; ఆకాశంలో, కొద్ది కాంతితో, తెల్లని మబ్బులా కనిపించే నభోమండలాలకి ఇది సామాన్య నామం;
** planetary nebula, ph. గ్రహరూప నీహారిక;
** ring nebula, ph. అంగుళ్యాకార నీహారిక;
* necessity, n. ఆవశ్యకత; తప్పనిసరి అవసరం; జరూరు;
* neck, n. మెడ; గొంతు; పీక; కంఠం; కుత్తుక; అర్రు;
* neck deep, adj. కుత్తుకబంటి;
* necklace, n. నేవళం; తావళం; కంఠహారం; గొలుసు; ప్రాలంబం; నెక్లేసు; త్రిసరం;
* necromancy, n. భవిష్యత్తుని చెప్పించడానికి ప్రేతాత్మని పిలవడం;
* necropolis, n. శ్మశానవాటిక; శ్మశానం;
* nectar, n. మకరందం; మరందం; పూదేనె; శీధువు;
* nectary, n. మకరంద కోశం;
* need, n. అవసరం; అక్కర; జరూరు; గర్జు; ప్రయోజనం;
** future need, ph. ఊర్జస్సు;
** immediate need, ph. ఇష;
* needful, adj. కావలసిన;
* needle, n. సూది; సూచి; కంటకం; ముల్లు;
** point of a needle, ph. సూది మొన; సూచీముఖం;
* needlessly, adv. అనవసరంగా;
* needy, n. అవసరం ఉన్నవారు; బీదవారు; లేనివారు;
* neem, n. వేప; నింబ; see also margosa;
* nefarious, adj. ఘోర; అధమ; క్రూర; దుర్మార్గ;
* negate, v. t. ఖండించు; తిరస్కరించు; రద్దు చేయు;
* negative, adj. రుణ; రుణాత్మక;
** negative electricity, ph. రుణ విద్యుత్తు;
** negative pole, ph. రుణ ధ్రువం;
** negative quantity, ph. రుణ రాశి;
** negative sign, ph. రుణ సన్న;
* negative, n. వ్యతిరేకం; వ్యతిరేకార్థం;
* neglect, v. i. అశ్రద్ధ చేయు; ఉపేక్షించు; తాత్సరం చేయు;
* negligence, n. అశ్రద్ధ; ఉపేక్ష; తాత్సారం; యాలం;
* negligible, n. అశ్రద్ధచేయదగినంత; ఉపేక్షణీయమైన; ఉపేక్షించదగినంత; స్వల్పమైన;
* negotiate, v. t. సంప్రదించు; చర్చించు;
* negotiations, n. సంప్రదింపులు;
* neighborhood, n. ఇరుగు; పొరుగు; నికటం; వాడకట్టు; చేరువు; చేరుబడి; పరిసరం; పేట; సామంతి; ఆజుబాజు;
* neighboring, adj. సామంత; పరిసర;
* neighbors, n. పొరుగువాళ్లు; ఇరుగువాళ్ళు; ఇరుగు పొరుగులు; సామంతులు;
* nematode, n. నులిపురుగు జాతి పురుగు;
* neo, adj. నూతన; కొత్త; నవ; నవ్య; అధునాతన;
* neoclassical, adj. నవ్యసంప్రదాయిక;
* Neodymium, n. [[నియొడీమియం]] (Nd), అణుసంఖ్య = 60, విరళ మృత్తిక మూలకం, ఇది నిజానికి అంత అరుదైన (విరళ) మూలకం కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది; (note) [[నియోబియం]] (Niobium) అనేది 41వ మూలకం, దీని హ్రస్వనామం Nb)
* neolithic age, n. కొత్తరాతి యుగం; నవశిలా యుగం;
* nephron, n. [[మూత్రపిండం]]లోని సూక్ష్మ కణం;
* nephritis, n. మూత్రపిండముల వాపు; వృక్కశోఫ;
* nepotism, n. బంధు పక్షపాతం; ఆశ్రీత పక్షపాతం;
* Neptune, n. సగరుడు; యముడు; (1) సౌర కుటుంబంలో ఒక గ్రహం; (2) రోమను పురాణాలలో సముద్రాలకి అధిపతి;
* nerve, n. నరం; నాడీతంతువు; మజ్జాతంతువు; నాడి;
** afferent nerve, ph. అంతర్ముఖ నాడి;
** auditory nerve, ph. శ్రవణ నాడి;
** efferent nerve, ph. బహిర్ముఖ నాడి;
** motor nerve, ph. చలన నాడి; చాలక నాడి;
** nerve center, ph. నాడీ కేంద్రం;
** nerve fiber, ph. నాడీ తంతువు;
* nervous, adj. (1) నాడీ మండలానికి సంబంధించిన; (2) ఆత్రుతతో చిరచిరలాడు;
** nervous system, ph. నాడీ మండలం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: nervous, concerned, anxious
* ---Use ''nervous'' when you feel worried or frightened about something that is going to happen soon : Bhaskar was nervous about talking in front of the class. ''Concerned'' also means "worried'' but it is used when you are worried about a specific problem. Padma is concerned about the impact of pollution on public health. Use ''anxious'' when you are worried that something bad has happened to someone you know : Her husband became anxious when her flight was delayed.'''
|}
*
* nescience, n. అవిద్య;
* ness, suff. తనం;
* nest, n. గూడు; పక్షుల నివాసం;
* nestling, n. గూటిపిట్ట;
* net, adj. నికర;
** net income, ph. నికరాదాయం;
* net, n. వల;
* nether world, n. పాతాళం;
* nettle, n. దురదగొండి మొక్క; దూలగొండి మొక్క;
* network, n. జాలం; పరివాహం; వలయం;
** electrical network, ph. విద్యుత్ వలయం;
** neural network, ph. నాడీ వలయం;
* neuralgia, n. నాడీ తంతులు పాడవడం వల్ల వచ్చే పోటు, మంటతో కూడిన నొప్పి; నాడీ తంతులు పాడవడానికి అనేక కారణాలు ఉండొచ్చు;
** trigeminal neuralgia, ph. వాచిన రక్తనాళం మెదడు నుండి ముఖం మీదకి వచ్చే నాడీ తంతిని తాకి ఒత్తిడి పెడితే ఈ రకం నొప్పి వస్తుంది;
* neurology, n. నాడీ మండల శాస్త్రం;
* neuron, n. నాడీ కణం;
* neurosis, n. భౌతిక లక్షణాలు బయటకి పొడచూపని మానసిక రోగం;
* neurotmesis, n. శరీరంలో ఉపరితలానికి చేరువలో ఉన్న నాడీతంతువు తెగిపోవడం; ఇలా జరిగినప్పుడు శరీరం పూర్తిగా కోలుకోలేదు;
* neuter, adj. నపుంసక;
* neutral, adj. తటస్థ; ఉదాసీన; ఉపేక్ష; నిష్పాక్షిక; మధ్యస్థ;
** neutral equilibrium, ph. తటస్థ నిశ్చలత; ఉదాసీన సంతుల్యం;
* neutrality, n. తాటస్థ్యం; ఉదాసీనత;
* neutralization, n. తటస్థీకరణ; ఉదాసీనకరణ; నిర్బలీకరణ; నిరాకరణ;
* neutralize, v. t. తటస్థీకరించు; ఉదాసీనపరచు; నిర్బలీకరించు;
* nevertheless, adv. అయినప్పటికీ; ఎటొచ్చీ;
** never mind, ph. పరవాలేదు;
* new, adj. కొత్త; నూతన; వినూత్న; నవ్య; నవ; అభినవ; నవీన; (rel.) modern;
** brand new, ph. సరికొత్త; క్రొంగొత్త;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: new, recent, modern, current, contemporary, up-to-date, latest
* ---Use ''new'' to talk about something that has existed for a short time: Have you seen Taroor's new book? Is this a new car? Use ''recent'' to talk about something, especially an event, that happened a short while ago: He won first prize in the recent national debates. Use ''modern'' to describe things that exist now and are different from the previous versions: modern machinery, modern English. Use ''current'' to describe something that exists now but that may change: the current stock market crisis. Use contemporary to describe things or people that existed at the same tie: Nehru and Patel were contemporaries. Use ''up-to-date'' to describe the newest: up-to-date technology. Use latest to describe the newest thing in a series of similar things: the latest issue of India Today.'''
|}
*
* newfangled, adj. పిదపకాలపు;
** newfangled ideas, ph. పిదపకాపలు బుద్ధులు;
* new moon, n. కొత్త చంద్రుడు; బాల చంద్రుడు; నెలవంక;
** new moon day, ph. అమావాస్య;
* news, n. వార్త; వార్తలు; సమాచారం; ఉదంతం; వృత్తాంతం; కబురు; కబుర్లు; విశేషాలు; సుద్ది; వర్తమానం; వక్కాణము, వాచికం; జనశ్రుతి; మతలబు;(note) news అనేది ఇంగ్లీషులో ఏక వచనమే అయినా దీనిని తెలుగులో వార్త అని ఏక వచనంలో అనవచ్చు లేదా వార్తలు అని బహు వచనంలో అనవచ్చు;
** orally conveyed news, కబురు; కబుర్లు; వాచికం;
* newsletter, n. వార్తాపత్రం; చిన్న వార్తాపత్రిక;
* newspaper, n. వార్తాపత్రిక;
* newt, n. నల్లికండ్లపాము;
* next, adj. మరుసటి; తర్వాత; వచ్చే; రాబోయే;
** next day, ph. మరునాడు; తర్వాత రోజు; మరుసటి రోజు;
** next of kin, ph. ఆప్తులు; సన్నిహితులు; తర్వాత వారు;
** next week, ph. వచ్చే వారం;
* nib, n. పాళీ;
* nibble, v. t. కొంచెం కొంచెం తిను;
* nice, adj. మంచి; బాగున్న; ఉల్లాసకరమైన;
* nicely, adv. బాగా;
* niche, (నీచ్) n. ఉనికిపట్టు; స్థావరం; గూడు; అరగూడు; గోడలో దొలిచిన బెజ్జం;
* Nickel, n. నికెల్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 28, సంక్షిప్త నామం, Ni);
* nickname, n. ముద్దుపేరు; వేడుక పేరు; మరోపేరు;
* niggard, n. లోభి; పిసినిగొట్టు;
* night, n. రాత్రి; రేయి; నిసి; నిశీధి; మాపు; నక్తము; తమి; రాతిరి; నిశ; విభావరి; రజని; యామిని;
** at night, ph. రాత్రికి; మాపటికి;
** dead of night, ph. అపరాత్రి;
** night blindness, ph. రేచీకటి;
** night stalker, ph. నక్తంచరుడు;
* nightmare, n. పీడకల;
* nightshade vegetables, n. pl. Solanaceae కుటుంబానికి చెందిన మొక్కలని nightshades అని కూడా అంటారు. ఈ కుటుంబంలోని మనం తినే కొన్ని కురగాయలకి nightshade vegetables అని పేరు; బంగాళా దుంపలు, టొమేటోలు, వంకాయలు, మిరపకాయలు, వగైరా ఈ కుటుంబానివే;
* night-vision goggles, n. నిశాదర్శిని;
* nihilism, n. శూన్యవాదం; the rejection of all religious and moral principles, in the belief that life is meaningless; extreme skepticism maintaining that nothing in the world has a real existence;
* nil, n. పూజ్యం;
* nimbus, n. (1) దీప్తి మండలం; దేవతామూర్తుల చుట్టూ ప్రకాశించే దీప్తి మండలం; (2) వర్షాకాలపు మేఘం;
** nimbus cloud, n. వృష్టిక మేఘం; కారుమబ్బు;
* nip, v. t. తుంచు;
* nipple, n. (1) తిత్తి; పీక; చూచుకం; (2) చనుమొన; కుచాగ్రం; స్తనాగ్రం;
* nirvana, n. నిర్వాణం; అపవర్గం; మోక్షం; మహదానందం;
* nit, n. పేను గుడ్లు; ఈపి కట్టు;
* nitration, n. నత్రీకరణ;
* nitre, n. సురేకారం; పెట్లుప్పు;
* nitric acid, n. నత్రికామ్లం;
* Nitrogen, n. నత్రజని; రంగు, రుచి, వాసన లేని ఒక రసాయన మూలక వాయువు; (అణుసంఖ్య 14, సంక్షిప్త నామం, N);
* nitwit, n. తమందం;
* no, adv. కాదు;
* no, it is not so. ph. అలా కాదు;
* nobility, adj. గౌరవ సూచక;
** nobility particle, ph. పేరులో ఎక్కడో ఒక చోట గౌరవ సూచకంగా తగిలించే ప్రత్యయం; ఉదా. టంగుటూరి ప్రకాశం ''పంతులు''; ''మహర్షి'' బులుసు సాంబమూర్తి; వాస్కో ''డి'' గామా; పియర్ ''డి'' ఫెర్మా; మొదలైనవి; ఇవి దేశ, కాల, పరిస్థితులని బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని దేశాలలో వీటిని కేవలం మర్యాదకి మాత్రమే వాడి, చట్టపరమైన దస్తావేజుల వంటి కాగితాలలో వాడరు;
* nobility, n. (1) ప్రభువులు; గొప్పవారు; ఆర్యులు; గౌరవనీయులు; (2) ఉదారత;
* noble, adj. గొప్ప; ఉత్కృష్ట; ఉదాత్త;
* nobleman, n. ప్రభువు; ఘనుడు; ధనికుడు; గొప్పవాడు; అమీరు;
* nocturnal, adj. నిశాచర; రాత్రించర; స్వప్న;
** nocturnal bird, ph. నిశాచర పక్షి;
** nocturnal emission, ph. స్వప్నస్కలనం;
* nod, v. t. తల పంకించు; తల ఆడించు; తల ఊపు; సమ్మతి తెలుపుతూ తలని పైకీ కిందికీ ఆడించడం; see also shake;
* node, n. (1) ముడి; కణుపు; గ్రంధి; స్కంధాంతం; స్కంధశిఖరం; గంటు; పర్వం; కన్ను; (2) [astron.] గ్రహపాతం; కక్ష్యాపాతం;
* nodes, n. pl. [astron.] రాహు,కేతువులు; సూర్య, చంద్రుల కక్ష్యా ఖండన బిందువులు;
* nodule, n. కుదుపం; ప్రావరం; కంతి;
** olfactory nodule, ph. గంధ కుదుపం; గంధ ప్రావరం;
** polar nodule, ph. ధ్రువ కంతి;
* noise, n. రొద; గోల; శబ్దం; సద్దు; సవ్వడి; చడి; సడి; చప్పుడు; ధ్వని; అలికిడి; అలబలం; కలకలం; గొల్లు;
** radio noise, ph. రేడియో రొద;
** thermal noise, ph. తాపపు రొద;
** white noise, ph. తెల్ల రొద;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: noise, sound
* ---''Sound'' is something you hear. ''Noise'' is loud unpleasant sounds.'''
|}
*
* noma, n. నోటిపూత;
* nomad, n. దిమ్మరి; దేశ దిమ్మరి; సంచారి;
* nomenclature, n. పరిభాష; see also jargon; notation;
* nominal, adj. నామకః; నామకార్థం; నామమాత్రం; పేరుకి మాత్రం; నామ్‌కే వాస్తే;
* nominate, v. i. ప్రతిపాదించు; నియమించు; నియోగించు; పేర్కొను; నామినేటు చేయు;
** nominative case, n. [gram.] కర్తృకారకం;
* nomination, n. ప్రతిపాదన; నియామకం; నామనిర్దేశం; నామినేషన్;
* nominator, n. ప్రతిపాదకుడు; ప్రతిపాదకి;
* nominee, n. ప్రతిపాదితుడు; నియుక్తుడు; నియోజితుడు;
* non, pref. ఇతర;
* non-aligned, adj. అలీన; తటస్థ;
** non-aligned countries, ph. అలీన దేశాలు; తటస్థ దేశాలు;
* non-Andhras, n. ఆంధ్రేతరులు;
* non-committal, adj. ఉదాసీన;
* non-empty, adj. అక్షయ;
* non-conventional, adj. సంప్రదాయేతర;
* non-entity, n. అపదార్థం;
* non-existence, adj. నకించనత్వం;
* non-formal, adj. నియతేతర;
* non-ideal, adj. ఆదర్శేతర;
* non-stop, adj. ఎకాయకీ; ఎడతెరపి లేకుండా; ఆగకుండా; ఏకబిగిన; ఏకధాటిగా;
* nonagon, n. నవభుజి;
* nonane, n. నవేను; తొమ్మిది కర్బనపుటణువులు ఉన్న ఉదకర్బనం;
** non-detailed text, ph. ఉపపాఠ్యం;
* non-dual, adj. అద్వైత;
* none, adj. ఎవరూ కాదు; ఏదీకాదు; (ety.) no one; a rare example of sandhi in English;
* non-edible, adj. అఖాదీ;
** non-edible oil, ph. అఖాదీ తైలం;
* non-existent, adj. అభూత;
* nonlinear, adj. విరళ; వక్ర; నరాళ; వంకర అయిన;
** nonlinear equation, ph. విరళ సమీకరణం; నరాళ సమీకరణం;
** nonlinear differential equation, ph. విరళ అవకలన సమీకరణం;
** nonlinear partial differential equation, ph. విరళ పాక్షిక అవకలన సమీకరణం;
* non-metal, n. అలోహం; లోహం కానిది; ఉ: ఉదజని, కర్బనం, మొదలైనవి 20+ ఉన్నాయి;
* non-productive, adj. అనుత్పాదక;
* non-profit organization, ph. లాభాపేక్షలేని సంస్థ;
* nonsense, n. కొక్కిరాయి మాటలు;
* non-stop, adj. ఏకధాటిగా; ఏకబిగిన; నిరంతరం; అవిరతం; అశ్రాంతం;
* non-uniform, adj. చాపు;
* nonviolence, n. అహింస;
* noon, n. మధ్యందినం; మిట్టమధ్యాహ్నం; మధ్యాహ్నం;
* noose, n. ఉచ్చు;
* nori, n. ఎండబెట్టిన కడలికలుపు; dried edible seaweed used in Japanese cuisine, made from species of the red algae genus Pyropia including ''P. yezoensis'' and ''P. tenera''. It has a strong and distinctive flavor, and is often used to wrap rolls of sushi or onigiri (rice balls); Seaweed can be a good source of omega-3 fats and vitamin B12. It appears that dried green and purple seaweed contain substantial amounts of vitamin B12. One study found 2.4 mcg or 100% of the RDI (Recommended Dietary Intake) of vitamin B12 in only 4 grams of nori seaweed;
* normal, adj. (1) సాధారణమైన; ప్రమాణాంకిత; ప్రమాణయుక్త; (2) అభిలంబ; నిట్ర;
* normal, n. (1) సామాన్యం; (2) లంబం; నిట్రం;
* normalization, n. ప్రమాణాంకితం; ప్రమాణాంకీకరణ;
* normally, adv. సామాన్యంగా; సాధారణంగా;
* normative, adv. నిర్ణాయక;
* north, n. ఉత్తరం; ఉత్తరపు దిక్కు;
* northeast, n. ఈశాన్యం; ఈశాన్య దిశ; ఈశాన్య మూల;
* northwest, n. వాయవ్యం; వాయవ్య దిశ; వాయవ్య మూల;
* northern, adj. ఉత్తర; ఔత్తరాహ; ఉదీచీన;
** northern direction, ph. ఉత్తర దిశ;
** northern lights, ph. ఉత్తర జ్యోతులు; ఉదీచీన ఉద్యోతాలు; ఉదీచీన జ్యోతిర్వస్త్రాలు; ఉత్తర ధ్రువ జ్యోతులు;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: north, south, east, west
* ---Use ''north'' / ''south'' / ''east'' /''west'' as an adjective phrase to tell where a place is located: Goa is south of Mumbai: Vindhya mountains are to the north of Mumbai. However you must use northern, southern, eastern, or western with the name of a place: He has a job somewhere in northern India.'''
|}
*
* Northern cross, [astron.] ph. రాజహంస మండలం;
* northerner, n. ఉత్తరాదివాడు; ఔత్తరాహ్యుడు;
* northeast, n. ఈశాన్యం;
* nose, n. ముక్కు; నాసిక; ఘ్రాణం;
** saddle nose, ph. తప్పట ముక్కు;
** stout nose, ph. బుర్రముక్కు;
* nostalgia, n. జ్ఞాపకాలు; భావోద్రేకంతో కూడిన జ్ఞాపకాలు;
* nostril, n. ముక్కు చెరమ; ముక్కు రంధ్రం; నాసాపుటం; మంజెరం;
* not, n. కాదు; లేదు;
* notable, n. గమనార్హం; గణనీయం; గుర్తింపదగ్గది;
* notation, n. సంజ్ఞామానం;
* notch, n. గంటు; గాటు; కచ్చు; పరిఖ;
* notch, v. t. గంటుపెట్టు; నరుకు;
* note, v. i. గమనించు;
* note, n. (1) చీటీ; పత్రం; కాగితం; యాదాస్తు; పురోణి; నోటు; (2) గమనిక; షరా; (3) స్వరం; (4) షడ్జమం (స), రిషభం (రి), గాంధారం (గ), మధ్యమం (మ), పంచమం (ప), దైవతం (ద), నిషాదం (ని), స;
** flat note, ph. కోమల స్వరం;
** non-movable note, ph. అచల స్వరం; ఉదాహరణకి స, ప లు అచల స్వరాలు; స, ప ల తరచుదనం (frequency) ఎప్పుడూ స్థిరంగానే ఉంటుంది;
** pure note, ph. శుద్ధ స్వరం; శుద్ధ స్వరం కంటే తక్కువ తరచుదనం ఉన్నదానిని కోమల స్వరం అంటారు;
** sharp note, ph. తీవ్ర స్వరం; మ కి తీవ్ర స్వరం ఒక్కటే ఉంది; మ కి కోమల స్వరం లేదు;
** high note, ph. తార స్వరం;
** one rupee note, ph. రూపాయి కాగితం;
* notebook, n. పుస్తకం; యాదాస్తు పుస్తకం; నోటు పుస్తకం;
* noted, adj. పేరున్న; ప్రసిద్ధికెక్కిన;
* noteworthy, adj. గమనార్హమైన; చెప్పుకోతగిన;
* noteworthy, n. గమనార్హం;
* nothing, n. పూజ్యం; ఏమీ లేదు;
* notice, n. ప్రకటన; గమనిక; తాఖీదు; నోటీసు;
* notice, v. i. గమనించు; చూడు;
* noticeable, adj. గమనార్హం; గమనార్హమైన;
* noticeability, n. గమనార్హత;
* notification, n. తెలియపరచుట; చాటింపు; ప్రకటన; విజ్ఞాపన; అధిసూచన;
* notify, v. t. తెలియపరచు; ప్రకటించు;
* notion, n. తలంపు; భావం; ఊహ; కల్పన; అభిప్రాయం;
* notwithstanding, conj. అయినప్పటికి;
* noun, n. [gram.] నామవాచకం; విశేష్యం; వాచకం;
** abstract noun, ph. గుణ వాచకం;
** collective noun, ph. సామూహిక వాచకం;
** common noun, ph. జాతి వాచకం;
** compound noun, ph. సంయుక్త వాచకం;
** concrete noun, ph. ఇంద్రియ వాచకం;
** proper noun, ph. సంజ్ఞా వాచకం;
** verbal noun, ph. క్రియా వాచకం; కృదంతం;
** noun phrase, ph. వాచక పదబంధం;
** noun with post-positive adjective, ph. విశేషణోత్తర కర్మధారయము; ఉ. కపోతవృద్ధము; president elect;
* nourishing, adj. పోషకమైన; బలవర్ధకమైన;
* nourishment, n. పుష్టి; పరిపోషణ;
* nova, n. నవ్యతార;
* nove, n. pl. (నోవీ) నవ్యతారలు; కొత్తగా పుడుతూన్న నక్షత్రాలు;
* novel, adj. కొత్తదైన; కొత్త; వింత అయిన;
* novel, n. నవల;
* novelette, n. నవలిక; చిన్న నవల;
* novella, n. నవలిక; చిన్న నవల;
* novelty, n. (1) కొత్తదనం; నవ్యత; అభినవత్వం; (2) తాయం; తాయిలం;
* novice, n. (1) శిశువు; (2) కొత్తగా నేర్చుకున్న వ్యక్తి; ప్రావీణ్యత లేని వ్యక్తి; (3) m. అర్భకుడు;
* now, adv. ఇప్పుడు;
** now and then, ph. అప్పుడప్పుడు;
* nowadays, adv. ఈ రోజుల్లో; ఈ కాలంలో;
* nozzle, n. నాసిక;
* nuance, n. మెళుకువ;
* nucleic acid, n. కణికామ్లం; కణామ్లం; కదష్ఠికామ్లం;
* nucleolus, n. గర్భకణిక; గర్భాష్ఠి; కేంద్రకాంశం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''...USAGE NOTE: atomic, nuclear
*... The words "atomic" and "nuclear" are used carelessly and interchangeably in both English and Telugu. The nucleus is the central core of an atom as well as the central core of a living cell. An "atomic bomb" uses either uranium or plutonium and relies on fission, a nuclear reaction in which a nucleus of an atom breaks apart into two pieces. ... The "hydrogen bomb" relies on fusion, the process of taking nuclei of two separate atoms and fusing them together to form the nucleus of a third atom.'''
|}
*
* nuclear, adj. [biol.] జీవకణ కేంద్రానికి (కదష్ఠికి) సంబంధించిన; [phys.] అణు కేంద్రకానికి సంబంధించిన; అణుకేంద్ర; అణుకేంద్రక;
** nuclear device, ph. కేంద్రక విస్పోటన పరికరం; అణు బాంబు;
** nuclear energy, ph. అణు శక్తి; కేంద్రక శక్తి;
** nuclear fission, ph. అణుకేంద్ర విచ్ఛిన్నం;
** nuclear fusion, ph. అణుకేంద్ర సంయోగం;
** nuclear propulsion, ph. అణు చాలనం; కేంద్రక చాలనం;
** nuclear reaction, ph. అణుకేంద్రక ప్రక్రియ;
** nuclear reactor, ph. అణువిద్యుత్ కేంద్రం;
** nuclear reactor vessel, ph. కేంద్రక క్రియాకలశం;
* nucleus, n. (1) [biol.] కణిక; బీజం; అష్ఠి; కదష్ఠి; (2)[phys.] కేంద్రకం; అణుకేంద్రకం;
* nudity, n. నగ్నత్వం;
* nudge, v. i. తొయ్యడం; తట్టి లేపడం; ఉసి కొల్పడం; మోచేత్తో తోసి ప్రేరేపణ చెయ్యడం;
* nugget, n. కణిక; తునక;
** gold nugget, ph. బంగారు కణిక;
* nuisance, n. నస; గొడవ; చీడ; కంటకం;
** public nuisance, ph. లోకకంటకం;
* null, n. శూన్యం; పూజ్యం;
* numb, n. అచేతనం;
* numbness, n. తిమ్మిరి;
* number, adj.. [నమ్మర్] ఎక్కువ తిక్కిరిగా ఉండు; ఎక్కువ అచేతనంగా ఉండు;
* number, n. [నంబర్] (1) సంఖ్య; నెంబరు; అంకె; అంకము; (2) వచనం;
** binary number, ph. ద్వియాంశ అంకము; ద్వింకము;
** cardinal number, ph. ముఖ్య సంఖ్య; ఉ. ఒకటి; రెండు, మూడు, మొదలగునవి.
** complex number, ph. సమ్మిశ్ర సంఖ్య; సంకీర్ణ సంఖ్య; జంట సంఖ్య;
** consecutive number, ph. క్రమానుగత సంఖ్య;
** even number, ph. సరి సంఖ్య;
** finite number, ph. పరిమితాంకం; మితాంకం; మితసంఖ్య;
** fractional number, ph. భిన్నాంకం; భిన్నం;
** imaginary number, ph. కల్పన సంఖ్య;
** irrational number, ph. అనిష్ప సంఖ్య; కరణీయ సంఖ్య;
** natural number, ph. సహజ సంఖ్య; ఏకోత్తర సంఖ్య;
** negative number, ph. రుణ సంఖ్య;
** odd number, ph. బేసి సంఖ్య;
** ordinal number, ph. క్రమ సంఖ్య; ఒకటవ, రెండవ, మూడవ, మొదలగునవి;
** perfect number, ph. పరిపూర్ణ సంఖ్య;
** plural number, ph. బహువచనం;
** prime number, ph. ప్రధాన సంఖ్య; అభేద్య సంఖ్య; అభేధ్యాంకం; ప్రధానాంకం; అవిభాజ్యం; అభాజ్య సంఖ్య;
** positive number, ph. ధన సంఖ్య;
** rational number, ph. నిష్ప సంఖ్య; అకరణీయ సంఖ్య;
** real number, ph. నిజ సంఖ్య; వాస్తవ సంఖ్య;
** roll number, ph. వరుసవారీ సంఖ్య;
** serial number, ph. క్రమానుగత సంఖ్య; క్రమ సంఖ్య;
** singular number, ph. ఏక వచనం;
** whole number, ph. పూర్ణాంకం; పూర్ణ సంఖ్య;
** number theory, ph. సంఖ్యా శాస్త్రం; అంకెలలో కాని, సంఖ్యలలో కాని కనిపించే బాణీలని అధ్యయనం చేసి గణితశాస్త్ర సూత్రాలని వెలికి లాగే శాస్త్రం;
* numbers, n. pl. సంఖ్యలు;
** amicable numbers, ph. కలుపుగోలు సంఖ్యలు;
** consecutive numbers, ph. క్రమానుగత సంఖ్యలు;
* numeral, n. అంకె; అంకం; సంఖ్యావాచకం; అంకెల రాత గుర్తు; అంకెల లేఖా సంకేతం;
** Arabic numeral, ph. అరబ్బు అంకె; అరబ్బాంకం;
** Roman numeral, ph. రోమక అంకె; రోమకాంకం;
* numerator, n. లవం;
* numerical, adj. సంఖ్యావాచక; సంఖ్యాత్మక;
** numerical analysis, ph. సంఖ్యావాచక విశ్లేషణ;
* numerology, n. సంఖ్యల వరుసలలో ఏదో మార్మికత ఉందని నమ్మి సంఖ్యలలో కనిపించే బాణీని బట్టి జోశ్యం చెప్పడం; ఇది ఒక నమ్మకమే కాని శాస్త్రం అనిపించుకోదు;
* numerous, adj. చాలా; బహు; మెండు; ఎక్కువ; అసంఖ్యాక;
* numismatics, n. రూప్యశాస్త్రం; నాణెముల గురించిన శాస్త్రం;
* nurse, n. ఉపమాత; నర్సు; f. దాది; పరిచారిక; నరసమ్మ; m. పరిచారకుడు; నరసయ్య;
* nurse, v. t. శుశ్రూష చేయు; పరిచర్య చేయు;
* nursery, n. (1) వృక్ష సంవర్ధని; మొక్కలను పెంచి అమ్ము స్థలం; (2) బాలవిహార్; క్రీడాగృహం; పసి పిల్లలకి నర్సు పర్యవేక్షణలో ఆటలు, పాటలు నేర్పే స్థలం;
** nursing mother, ph. బాలెంతరాలు;
* nurture, n. పెంపకం;
[[File:Nut-hardware.jpg|thumb|right|/220px-Nut-hardware.jpg]]
* nut, n. (1) పిక్క; గింజ చుట్టూ పెంకు లాంటి కవచం ఉన్న విత్తు; ఉ. చింత పిక్క; బాదం పిక్క; జీడి పిక్క; (2) మరచుట్టు; మర ఉంగరం; (rel.) bolt; screw; (3) పిచ్చి మనిషి;
* nutcracker, n. అడకత్తెర; వక్కలని, పిక్కలని విరగ్గొట్టడానికి వాడే కత్తెర వంటి ఉపకరణం;
* nutmeg, n. జాజికాయ; ఈ జాజికాయ తొక్కనే జాపత్రి అంటారు;
* nutrient, n. పోషకం; పోషక పదార్థం; పోషకాహారం;
* nutrition, n. పోషణ; ప్రోది; పరిపోషణ;
* nutritional, adj. పోషక; పౌష్టిక;
** nutritional value, ph. పౌష్టిక విలువ; పోషక విలువ;
* nutritious, adj. పోషకమైన; పుష్టికరమైన; పౌషిక;
* nux vomica, n. ముషిణి; ముసిడి; ముసిని; Loganiaceae జాతి చెట్టు;
* nymph, n. ఎలనాగ; యువతి;
* nymphomania, n. కామాతురత;
* nymphomaniac, n. f. రిరంసువు; కాముకి; విపరీతమైన కామేచ్ఛ గల స్త్రీ; వివిధమైన పురుషులతో రతిని కోరే స్త్రీ;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 2: O==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
* O, inter. ఒహో; అలాగునా;
* oak tree, n. సిందూర వృక్షం;
* oar, n. తెడ్డు; అల్లీసకర్ర; క్షేపణి;
* oasis, n. విరామారామం; ఎడారిలో నీళ్లు, నీడ దొరికే ప్రదేశం;
** like an oasis, ph. [idiom] కుంపట్లో తామర వలె;
* oats, n. ఓట్లు; ఓటు ధాన్యము; ఒక ధాన్యపు దినుసు; [bot.] ''Avena sativa'' of the Poaceae family;
* oatmeal, n. (1) అటుకులులా దంచబడ్డ ఓటు బియ్యం; (2) ఓటు బియ్యాన్ని బాగా చిమడబెట్టి అంబలిలా కాచిన భోజన పదార్థం;
* oath, n. ఒట్టు; ప్రమాణం; శపథం; ఆన, Ana
* obdurate, adj. మూర్ఖమైన;
* obedience, n. విధేయత; వినయం; నమ్రత; ప్రణతి;
* obediently, adv. సవినయంగా; విధేయతతో;
** obedient person, ph. విధేయుడు; ప్రణతుడు; విధేయురాలు;
* obese, adj. లావైన; స్థూలమైన; వలంగా; బడ్డుగా;
* obesity, n. స్థూలకాయత్వం; స్థౌల్యం;
* obey, v. i. కట్టుబడియుండు; పాటించు; చెప్పినట్లు నడుచుకొను;
* obituary, n. వార్తాపత్రికలో ప్రచురించబడ్డ మరణ వార్త; సంస్మరణ; స్మృతి;
* object, n. (ఆబ్‌జెక్ట్) (1) భౌతిక పదార్థం; వస్తువు; (2) కర్మ, వ్యాకరణంలో; (ant.) subject;
* object, v. t. (అబ్‌జెక్ట్) వారించు; అభ్యంతరపెట్టు; ఆక్షేపించు;
* objection, n. అభ్యంతరం; ఆక్షేపణ; ప్రతిబంధకం;
** groundless objection, ph. దురాక్షేపణ;
* objectionable, adj. ఆక్షేపణీయ; కూడని;
* objective, adj. వస్తుగత; (ant.) subjective;
* objective, n. వస్తుగత గమ్యం; లక్ష్యం; ఆశయం; ప్రయోజనం; గమ్యం ఎంతవరకు చేరుకున్నామో కొలిచి చెప్పడానికి వీలయిన చలరాసి; (rel.) goal;
* objectively, adv. నిష్పక్షపాతంగా;
* objectivity, n. విషయనిష్టత; వస్తునిష్టత;
* oblation, n. నైవేద్యం; నైవేద్యాది ఉపచారం;
* obligation, n. (1) అనివార్యకార్యం; తప్పనిసరి అయిన పని; (2) మొహమాటం; నిర్బంధం; విద్యుక్తం; విధాయకం;
** obliging person, ph. ఉపకారబుద్ధిగల వ్యక్తి;
* oblique, adj. తిర్యక్; వాలివున్న; వాలుగా ఉన్న; ఒరిగిన; transverse;
** oblique line, ph. తిర్యక్ రేఖ; వాలు గీత; transversal;
* obliquely, adv. వాలుగా; ఐమూలగా;
* obliterate, v. t. సర్వనాశనం చేయు; తుడిచిపెట్టు;
* oblong, adj. కోల; కోలగా ఉన్న;
* obnoxious, adj. అసహ్యకరమైన; హేయమైన;
* obscene, adj. అసభ్యమైన; అసహ్యకర మైన; అశ్లీలమైన; అవాచ్యమైన; సాధుసమ్మతంకాని; బూతు;
* obscure, adj. స్పష్టతలేని; ఎక్కడో మారుమూలని ఉన్న;
* obsequies, n. అపరకర్మలు; ఉత్తర క్రియలు; మరణానంతరం చేసే కర్మ;
* observable, adj. గమనార్హమైన; అవలోకనార్హమైన;
* observation, n. (1) పరిశీలనం; అవలోకనం; వీక్షణ; విలోకనం; ప్రేక్షణం; దృశ్యం; (2) పరిశీలన;
* observatory, n. వేధశాల;
* observe, v. i. పరిశీలించు; గమనించు; అవలోకించు; వీక్షించు; పాటించు; పారజూచు;
* observer, n. పరిశీలకుడు; ప్రేక్షకుడు; ద్రష్ట; పారజూడరి;
* obsession, n. రంధి; యావ; పరమ చాదస్తం; స్వీయభావ అవరోధం; దూరంగా ఉన్న, అర్ధం లేని, చొరబడే (intrusive), పదేపదే వచ్చే ఆలోచనలను ఆబ్సెషన్ లేదా స్వీయ భావ అవరోధం అంటారు. అనుచితమైనవి, ప్రేరేపించేవి, అసమంజస మైనవి, పునరావృతం అయ్యేవి, నిషిద్ధమైనవి అయిన ఆలోచనలు;
** obsessive compulsive disorder, ph. స్వీయభావ అవరోధ రుగ్మత; ఉదా: (1) మెట్లు ఎక్కేటప్పుడు లెక్క పెట్టడం, పెట్టకపోతే ఎదో జరుగుతుంది అనుకోవడం, ఫోన్ ఒక కోణంలో పెట్టక పొతే ఎదో దుర్వార్త వస్తుందని నమ్మటం. అలా పెట్టక పొతే ఆందోళన చెందటం. (2) అశుభ్రత, క్రిమి సంకులత, దుమ్ము, ధూళి, అంటువ్యాధుల పై మితిమీరిన భయం, (3) తమకి, తమవారికి, ఇతరులకి హాని జరుగ బోతుందనే అకారణ భయం
* obsolete, n. విలుప్తం; వ్యవహారబ్రష్టం; వ్యవహారచ్యుతం; అప్రచలితం; వాడుకలో లేనిది;
* obsolescence, n. అప్రచలనం;
* obstacle, n. అడ్డంకి; అవరోధం; అవాంతరం; ప్రతిబంధకం; విఘ్నం; విష్కంభం;
** without obstacle, ph. నిర్విఘ్నంగా;
* obstetrics, n. సూతిక శాస్త్రం; ప్రసూతి శాస్త్రం; ప్రసవ శాస్త్రం; పురిటి వైద్యం;
* obstinacy, n. మొండితనం; పిడివాదం; మూర్ఖపు పట్టు;
* obstinate, adj. మొండి; మూర్ఖపు పట్టుగల; హఠం చేసే; refractory;
* obstruct, v. t. అడ్డు; ఆటంకపరచు; అటకాయించు; అవరోధించు; నిరోధించు; అభ్యంతరపెట్టు; వారించు;
* obstructed, n. ప్రతిహతం;
** one that was obstructed, ph. ప్రతిక్షిప్తం;
* obstruction, n. అడ్డంకి; ఆటంకం; రోధం; రుద్ధం; అవరోధం; నిరోధం; ఆక; ప్రతిఘాతం; ప్రతిబాధకం; ప్రతిబాధి; ప్రతిబంధం; ప్రతిబంధకం; ప్రతిరోధకం;
* obtain, v. i. పొందు; సాధించు; సంపాదించు;
* obtrude, v. i. ముందుకు చొచ్చుకొని వచ్చు;
* obtuse, adj. [geom.] గురు; బహిర్లంబ; సూదిగాలేని;
** obtuse angle, ph. గురు కోణం; బహిర్లంబ కోణం;
* obverse, adj. బొమ్మవైపు; ప్రతిలోమ;
* obverse, n. బొమ్మ; బొరుసు కానిది; సీదా; (ant.) reverse;
* obvious, n. స్వయంవిదితం; విదితం; విస్పష్టం; వివరణ లేకపోయినా అర్థం అయేది;
* occasion, n. సందర్భం; సమయం; అవకాశం; కారణం;
* occasional, adj. అప్పుడప్పుడు; కాదాచిత్క; నైమిత్తిక;
* occasionally, adv. అప్పుడప్పుడు; అడపాదడపా; కదాచిత్తుగా;
* occident, n. పాశ్చాత్య దేశాలు; పశ్చిమ దేశాలు;
* occidental, adj. పాశ్చాత్య; పశ్చిమ దేశాలకి సంబంధించిన;
* occipital, adj. కపాలాస్థి; కపాలాస్థిక; తల వెనక భాగాన్ని ఉన్న ఎముకకి సంబంధించిన;
** occipital lobe, ph. కపాలాస్థిక తమ్మె; మెదడులో ఒక భాగం;
* occlusion, n. అంతర్ధారణ; ఆటంకం; అడ్డు;
* occult, adj. నిక్షిప్త; రహస్య; మానవుడి అవగాహనకి అందని;
* occultation, n. ఒక్కొక్కసారి చంద్రుడు బుధ , శుక్ర, కుజ, గురు, శని గ్రహాలను కప్పివేయడం కూడా జరుగుతుంది. ఉదాహరణకు శుక్రునికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినపుడు దానిని శుక్రుని గ్రహణం (eclipse) అని అనరు; Lunar occultation of Venus అంటారు;
* occupation, n. (1) వృత్తి; ఉద్యోగం; (2) వ్యాపకం; (3) ఆక్రమణ;
* occupant, n. ఆక్రమించినవాడు; ఆక్రమితుడు;
* occupy, v. t. ఆక్రమించు; ఆవరించు;
* occur, v. i. సంభవించు; తట్టు; స్ఫురించు; తటస్థించు;
* occurrence, n. సంఘటన; స్ఫూర్తి;
* ocean, n. మహాసముద్రం; మహార్ణవం; అబ్రాసి; కడలి; విషధి; ఉదధి; అంబుధి; జలధి; సాగరం;
* oceanography, n. సాగరశాస్త్రం;
* ocellus, n. కృష్ణపాదం; the characteristic marking on the hood of a cobra;
* ochre, n. గోపీచందనం; ఒక రంగు పదార్థం;
* octadecane, n. అష్టాదశేను; ఒక ఉదకర్బనం; C<sub>18</sub>H<sub>38</sub>;
** octadecanoic acid, ph. అష్టాదశాయిక్ ఆమ్లం; C<sub>18</sub>H<sub>38</sub>O<sub>2</sub>;
* octagon, n. అష్టభుజి; అష్టకోణి;
* octahedron, n. అష్టముఖి; ఎనిమిది సమత్రిభుజములు ముఖములుగా గల ఒక ఘనరూపము;
* octal, adj. అష్టాంశ;
** octal number system, ph. అష్టాంశ పద్ధతి;
* octane, n. అష్టేను; ఒక ఉదకర్బనం పేరు; CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>6</sub>CH<sub>3</sub>;
** octane number, ph. అష్టేను సంఖ్య; పెట్రోలు నాణ్యతని కొలిచే సూచికాంకం;
* octave, n. (1) సప్తకం; సంగీతంలో f అనే పౌనఃపున్యం నుండి 2f పౌనఃపున్యం వరకు ఉన్న మధ్య దూరం; ఈ దూరంలోనే సప్త స్వరాలు ఇమిడి ఉంటాయి; భారతీయ శాస్త్రీయ సంగీతంలో ఈ దూరాన్ని సరిగమపదని వరకే లెక్కపెడతారు, పాశ్చాత్య సంగీతంలో సరిగమపదనిస అని లెక్క పెడతారు; (2) అష్టపది; అష్టకం;
* octet, n. అష్టకం; అష్టకి; ఎనిమిది అంశాలు కలది;
* octanoic acid, n. అష్టనోయిక్ ఆమ్లం; కేప్రిలిక్ ఆమ్లం; ఎనిమిది కర్బనపు అణువుల దండ ఉన్న గోరోజనామ్లం;
* odd, adj. (1) బేసి; బేసరి; ఓజ; విషమ; సరి కాని; (2) వింతైన; ఎబ్బెట్టు; విజ్జోడు; (3) విషమ; చికై్కన;
** odd behavior, ph. వింత ప్రవర్తన;
** odd looking, ph. వింతగా కనిపించే;
** odd number, ph. బేసి సంఖ్య;
** odds and ends, ph. చిల్లర మల్లర వస్తువులు, పనులు;
* ode, n. కీర్తన; స్తుతి; పదం; భావగీతం;
* odious, adj. హేయమైన;
* odor, n. వాసన; గంధము; (Br.) odour; (rel.) malodor;
* oeuvre, n. (ఓవ్ర), ఒక కళాకారుని (కవి) సంపూర్ణ రచనా సంపుటి;
* of, prep. యొక్క; గురించి;
* offend, v. t. నేరం చేయు; కోపం పుట్టించు; నొప్పించు;
* offense, n. నేరం; తప్పు; తప్పు పని;
** cognizable offense, ph. వారంటు లేకుండా అరెస్టు చెయ్యడానికి పోలీసులకి హక్కు ఉన్న నేరం; ఇండియాలో ఇటువంటి నేరం జరిగిందని అనిపించగానే పోలీసులు తప్పనిసరిగా FIR (first information report) నమోదు చేసి తీరాలని చట్టం చెబుతోంది;
** punishable offense, ph. శిక్షార్హమైన నేరం;
* offer, v. t. అర్పించు; సమర్పించు; భక్తితో ఇచ్చు; కానుకగా ఇచ్చు;
* offering, n. ముడుపు; కానుక; నైవేద్యం; బలి;
* off-guardedly, adv. ఏమరుపాటుగా;
* office, n. కచేరీ; కార్యాలయం; పనిపట్టు; కృత్యాగారం; దప్తరు; ఆఫీసు;
** office bearer, ph. కార్యకర్త;
* officer, n. అధికారి; ఉద్యోగి; సచివుడు; ఆఫీసరు;
** executive officer, ph. కర్మాధికారి; కర్మసచివుడు;
** investigative officer, ph. విచారణాధికారి;
* official, adj. అధికార; అఫీషియల్;
* official, n. అధికారి;
* officinalis, n. ఉపయోగం ఉండి దుకాణాలలో కొనుగోలుకి దొరికేది;
* offshore, adj. తీరస్థ;
** offshore islands, ph. తీరస్థ దీవులు;
* offspring, n. s. బిడ్డ; సంతానం; తోకం; కేపు, kEpu
* offspring, n. pl. తనుజులు; సంతానం; సంతతి; బిడ్డలు;
* often, adv. తరచుగా;
* ogre, n. మనుష్యులను తినే రాక్షసుడు;
* oil, n. నూనె; చమురు; తైలం; ఆయిలు;
** animal oil, ph. జాంతవ తైలం;
** cooking oil, ph. వంట నూనె;
** crude oil, ph. ముతక నూనె; క్రూడాయిలు;
** fuel oil, ph. మంట చమురు; ఇంధనపు చమురు;
** kerosine oil, ph. కిరసనాయిలు;
** mineral oil, ph. ఖనిజపు చమురు;
** refined oil, ph. రిఫండాయిలు;
** til oil, ph. నువ్వుల నూనె;
** sesame oil, ph. నువ్వుల నూనె;
** vegetable oil, ph. శాకీయ తైలం;
** oil cake, ph. తెలక పిండి; పిణ్యాకం; నూనె చెక్క;
* oily, adj. నూనెలా ఉండే; జిడ్డుగా ఉండే; జిడ్డయిన;
* ointment, n. అంజనం; లేపనం; విలేపనం; మలాము; పైన పూసే మందు;
* o.k., n. సరే;
* okra, n. బెండ; ఎద్దునాలుక చెట్టు; గంబో;
* ol, suff. ఆల్కహాలు జాతికి చెందిన రసాయనాల పేరు చివర విధాయకంగా వచ్చే ప్రత్యయం; ఉదా. alcohol; menthol; phenol;
* old, adj. పాత; ముసలి;
** old age, ph. ముసలితనం; వృద్ధాప్యం; ముదిమి;
** old people, ph. ముసలివారు; వృద్ధులు; వయోవృద్ధులు;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: old, elderly
* ---Use ''old'' to talk about the age of things or people: This is an old car; How old are your children? Use ''elderly'' to be more polite when talking about people who are very old.'''
|}
*
* oleander, n. గన్నేరు; కరవేరం; [bot.] ''Nerium oleander'' of the Apocynaceae family;
* olfactory, adj. ఘ్రాణ; వాసనకి సంబంధించిన;
** olfactory nerves, ph. ఘ్రాణ నాడులు;
** olfactory nodes, ph. [bio.] గంధప్రవరాలు,
* oligarchy, n. స్వల్పజన పరిపాలనం; స్వల్పజనాధిపత్యం;
* oligosaccharide, n. స్వల్పచక్కెర; తక్కువ ఏకచక్కెరలు ఉన్న కర్బనోదక కట్టడం; a carbohydrate whose molecules are composed of a relatively small number of monosaccharide units.
* olive, n. జిత చెట్టు; జిత వృక్షం; మానుగాయ; కుదురు జువ్వి; ఆలివ్; మధ్యధరా వాతావరణాలలో కాసే ఒక చిన్న కాయ;
** olive branch, ph. [idiom[ మైత్రీ సందేశం;
** olive oil, ph. జిత తైలం; మానుగాయ నూనె;
** olive green, ph. మానుగాయ రంగు;
* oma, suff. [med] వైద్య రంగంలో వచ్చే ఈ ఉత్తర ప్రత్యయానికి అర్థం "కంతి"; అనగా, శరీరంలోని జీవకణాలు మితిమీరి పెరిగి కాయలా తయారవడం; ఈ కంతి కేంసరు కావచ్చు, కాకపోవచ్చు;
** carcinoma, ph. అంగాలని చుట్టి ఉండే పొరలలో కాని, చర్మపు పొరలలో కాని వచ్చే కేంసరు;
** cytoma, ph. కణాలకి సంబంధించిన కంతి;
** melanoma, ph. మెలనిన్ అనే రంగు పదార్థం ఉన్న చోట (సాధారణంగా చర్మం) పెరిగే కంతి;
** sarcoma, ph. శరీరపు కట్టడానికి ఉపయోగపడే భాగాలకి (అనగా, ఉ. ఎముకలు, కండరాలు, వగైరాలకి) వచ్చే కేంసరు;
* ombrophobia, n. వానపిరికి; వర్షం అంటే భయం;
* ombudsman, n. లోకపాల్;
* omelet, n. గుడ్డట్టు; (rel.) scrambled eggs;
* omen, n. శకునం;
** bad omen, ph. అపశకునం; దుర్నిమిత్తం; దుశ్శకునం;
** fatal omen, ph. మారకం;
* ominous, adj. దుశ్శకునమైన; అశుభసూచకమైన;
* omit, v. t. మినహాయించు; పరిహరించు; వదలివేయు; విడచిపెట్టు;
* omission, n. పరిహార్యం; మినహాయింపు; పరిహరింపు; చేయమి;
* omni, adj. సర్వ; అన్ని; సమస్థ;
* omnidirectional, n. సర్వదిశాత్మకం;
* omniscience, n. సర్వజ్ఞత;
* omniscient, n. సర్వజ్ఞుడు; అన్నీ తెలిసినవాడు;
* omnipotent, adj. సర్వశక్తిసంపన్నత; సర్వసమర్ధత; సర్వశక్తిత్వం;
* omnipotent, n. సర్వశక్తిసంపన్నుడు; సర్వసమర్ధుడు;
* omnipresence, n. సర్వవ్యాప్తి; సర్వవ్యాపకత్వం;
* omnipresent, n. సర్వోపగతుడు; సర్వవ్యాపకుడు;
* omnivorous, adj. సర్వభక్షక;
* omnivore, n. సర్వభక్షిణి; సర్వాహారి; సర్వభక్షకి;
* on, prep. మీద; పైన; గురించి;
** on behalf, ph. తరఫున; పక్షమున;
** on demand, ph. అడగ్గానే; అడిగిన వెంటనే;
* once, adv. (1) ఒకప్పుడు; ఒకానొకప్పుడు; (2) ఒకసారి; ఒకమారు; ఒకతడవ; ఒక పర్యాయం; ఒక తూరి;
** once upon a time, ph. అనగా అనగా; తొలి; తొల్లి;
* one, adj. ఏక; ఒంటి;
* one, n. ఒకటి;
** increment by one, ph. ఏకోత్తరించు; ఏకోత్తరవృద్ధి; ఒకటొకటిగా పెంచు;
** one-by-one, ph. ఒకదాని తరువాత మరొకటి చొప్పున; ఐకాఇకంగా;
** one-to-one correspondence, ph. ఏకైక సంబంధం;
** one and only, ph. ఏకైక;
* one's, adj. స్వ; స్వకీయ; తన; తనదైన;
* one's own duty, ph. స్వధర్మం;
* one-dimensional, adj. ఏకమాత్రక; ఏకప్రమాణ; ఏక దిశమాన; ఒకే కొలత గల;
* onion, n. (1) ఉల్లి; ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం; (2) నీరుల్లి; పెద్ద ఉల్లి; ఎరగ్రడ్డ; సుకంద;
** green onion, ph. ఉల్లికాడలు;
** yellow onion, ph. లతార్కం; దుద్రుమం;
** onion bulb, ph. ఉల్లిపాయ; ఉల్లిగడ్డ; అల్లియం; ఎరగడ్డ;
* onionskin, n. ఉల్లిపొర; ఉలిపిరి;
** onion skin paper, ph. ఉల్లిపొర కాగితం;
* onlooker, n. చూపరి; దారిన పోయే దానయ్య; కలుగజేసుకోకుండా పక్కనుండి చూసే వ్యక్తి; ప్రేక్షకులు;
* only, adj. ఏక; ఒకే ఒక;
* only, adv. మాత్రం;
* onomastics, n. సంజ్ఞానామ పరిశీలన; పేర్ల పూర్వాపరాలని పరిశీలించే శాస్త్రం;
* onomatopoeia, n. ధ్వన్యనుకరణం; భావమును వ్యక్తపరచు శబ్దం; ఒక రకమైన శబ్దాలంకారం; అన్నం కుతకుత ఉడుకుతున్నది అన్నప్పుడు ‘కుతకుత’ అన్నం ఉడికే శబ్దాన్ని అనుకరించడమే ఈ అలంకారం లక్షణం;
* onset, n. మొదలు; ఆరంభం;
* onslaught, n. ఆక్రమణ; పైబడడం; ఆఘాతం;
* ontology, n. లక్షణ శాస్త్రం; సత్త్వమీమాంశ; దృశ్యమాన ప్రపంచంలో వస్తువుల మూల స్వభావాన్ని తెలుసుకొనడానికి ప్రయత్నించే ఆధిభౌతిక విజ్ఞాన శాస్త్రం;
a set of concepts and categories in a subject area or domain that shows their properties and the relations between them; Ontology లో సత్తా (అంటే ఉనికి) గల పదార్థాల తత్త్వము ముఖ్యం;
* ontological, adj. లక్షణ శాస్త్ర సంబంధమైన;
* onus, n. బాధ్యత; పూచీ; భారం;
* onyx, n. గోమేధికం; క్వార్‍ట్జ్ (quartz) జాతికి చెందిన రాయి; SiO<sub>2</sub>;
* oodles, n. pl. కొల్లలు;
* oogamy, n. అండ సంయోగం;
* oogenesis, n. అండజననం; అండోత్పత్తి;
* oogonium, n. స్త్రీ బీజాశయం;
* oology, n. అండాధ్యయనం; గుడ్లని అధ్యయనం చేసే శాస్త్రం:
* ooze, v. i. ఒలుకు; కారు; చెమర్చు; ఊరు; శ్రవించు;
* opal, n. క్షీరోపలం; ఒక విలువైన రాయి;
* opaque, n. కాంతి కిరణాలని చొరనీయని లక్షణం గల;
* open, adj. తెరచిన; తీసిన; విడిన; వికసించిన; విప్పిన; వివృత; విరళ; ఉపరితల;
** near-open, ph. ఉప వివృత; జారుగా తెరచిన;
** wide open, ph. బార్లా తెరచిన; బారుగా తెరచిన; బార్లా తీసిన;
** open set, ph. వివృత సమితి;
** open society, ph. వివృత సమాజం;
** open circuit, ph. వివృత వలయం; వివృత పరివాహం;
** open door, ph. విరళారళం; విరళ అరళం;
** open drainage system, ph. ఉపరితల నీటిపారుదల వ్యవస్థ;
** open forcibly, ph. పెగుల్చు; పెగలదీయు;
** open gently, ph. విడదీయు; జాగ్రతగా తెరచు;
* open, v. i. వికసించు;
* open, v. t. తెరుచు; విప్పు; విడదీయు; పెగుల్చు; పెగలదీయు;
* opening, n. (1) వివారం; వివరం; కన్నం; బెజ్జం; (2) ఖాళీ; ఖాళీ స్థలం; సందు; బీటిక; (3) ఎత్తుబడి; మొదలు;
* openly, adv. బాహాటంగా; బహిరంగంగా; వెల్లడిగా; దాపరికం లేకుండా; నిష్కపటంగా;
* opera, n. గేయ నాటకం; Originally understood as an entirely sung piece, in contrast to a play with songs, opera has come to include numerous genres, including some that include spoken dialogue;
* operate, v. t. (1) తోలు; నడుపు; చోదించు; (2) శ చికిత్స చేయు;
* operating system, n. నిరవాకి; ఉపద్రష్ఠ; కలనాత్మ; ఆత్మ లేని శరీరం ఎలాంటిదో అలాగే కలనాత్మ లేని కలనయంత్రం ప్రాణం లేని బొందె వంటిది; ఒక కలనయంత్రంలో పనిచేసే క్రమణికల (ప్రోగ్రాముల) మీద అజమాయిషీ, లేదా నిరవాకం, చేసే మరొక పెద్ద క్రమణిక; the software that supports a computer's basic functions, such as scheduling tasks, executing applications, and controlling peripherals;
* operation, n. (1) [math.] సంక్రియ; పరిక్రియ; పరికర్మ; సముచ్చయం; (2) శస్త్ర చికిత్స; కోత; (3) చర్య; కార్యము;
** algebraic operation, ph. బీజీయ పరిక్రియ; బీజీయ సముచ్చయం;
** mathematical operation, ph. గణిత పరిక్రియ;
** surgical operation, ph. శస్త్ర పరిక్రియ; శస్త్ర సముచ్చయం;
* operator, n. [math.] పరికర్త; కర్మచారి; నిర్వాహకుడు;
** difference operator, ph. భేద పరికర్త;
** differential operator, ph. అవకలన పరికర్త;
* operative, n. కర్మచారి;
* ophidiophobia, n. అహిభయం; పాము జడుపు; పాము అంటే భయం;
* opinion, n. అభిప్రాయం; మతం; ప్రవాదం; అనుకోలు;
** difference of opinion, ph. అభిప్రాయ భేదం;
** good opinion, ph. సదభిప్రాయం;
** in my opinion, ph. నా అభిప్రాయం ప్రకారం;
** of the same opinion, ph. సమత;
** popular opinion, ph. లోక ప్రవాదం;
* opinionated, adj. దిట్టమైన అభిప్రాయాలు గల;
* opium, n. నల్లమందు; అభిని; అహిఫేనం;
** opium poppy seeds, ph. గసగసాలు; అభిని;
* opponent, n. ప్రత్యర్థి; ప్రతిద్వంది; ప్రతిస్పర్ధి; ప్రతిపక్ష; ప్రతికక్షి; ఎదిరి; వ్యతిరేకి; ప్రతికూలుడు; విరోధి; ప్రతిరోధి; ప్రతిరోధి, pratirOdhi
* opportune, adj. సానుకూల; సమయానుకూల;
** opportune idea, ph. తరుణోపాయం;
** opportune moment, ph. సానుకూల పరిస్థితి;
* opportunist, n. అవకాశవాది;
* opportunity, n. అవకాశం; తరుణం; వీలు; సమయం; ఎసలిక;
** good opportunity, ph. సదవకాశం; మంచి తరుణం;
* oppose, v. t. ప్రతిఘటించు; ఎదిరించు;
* opposite, adj. విరుద్ధ; విపరీత; అభిముఖ; వ్యతరిక్త; వ్యతిరేక; ప్రాభిముఖ; ఎదురెదురుగా; ఎదుటి;
* opposites, n. పరస్పర విరుద్ధములు;
* opposition, n. (1) ప్రతిపక్షం; విపక్షం; (2) వ్యతిరిక్తం; (3) (astro.) సూర్యుడిని, మరొక బాహ్య గ్రహాన్ని కలిపే ఊహాత్మక రేఖ మీదకి భూమి వచ్చినప్పుడు ఉన్న స్థితి; Opposition is when a planet is opposite the Earth from the Sun. This is when we are able to observe it best, as it is normally nearest Earth at this point. Opposition is typically used to describe a superior planet’s position; (ant.) conjunction; conjunction occurs when any two astronomical objects (such as asteroids, moons, planets, and stars) appear to be close together in the sky, as observed from Earth;
** opposition party, ph. ప్రతిపక్షం; విపక్షం;
* oppression, n. జులుం;
* optic, adj. దృష్టి; దృక్; చక్షు; నేత్ర;
** optic nerve, ph. నేత్ర నాడి;
* optical, adj. చక్షుష;
** optical axis, ph. చక్షుష అక్షం; చక్షుషాక్షం;
** optical fiber, ph. చక్షుష తంతువు; దృక్ తంతువు;
** optical illusion, ph. చక్షుష భ్రమ;
** optical instruments, ph. చక్షుష పరికరాలు;
** optical microscope, ph. చక్షుష సూక్ష్మదర్శిని;
* optician, n. కళ్లద్దాలని తయారు చేసే వ్యక్తి;
* optics, n. (1) కాంతిశాస్త్రం; నేత్రజ్ఞానశాస్త్రం; దృశాశాస్త్రం; తేజశ్శాస్త్రము; (2) ప్రచారం కొరకు ఛాయాచిత్రాలలో కనబడే తీరు;
* optimism, n. ఆశావాదం;
* optimistic, adj. ఆశాజనక;;
* optimization, n. ఉన్న ప్రత్యామ్నాయాలలో సర్వోత్తమమైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకునే పద్ధతి;
* optimum, n. సర్వోత్తమం;
* option, n. వైకల్పికం; వికల్పం; వైభాషికం; ఐచ్ఛికం; ఐచ్చికాంశం;
* optional, n. వైకల్పికం; వికల్పం; వైభాషికం; ఐచ్ఛికం; ఐచ్చికాంశం;
* ophthalmologist, n. కంటివైద్యుడు; కంటి జబ్బులని నయం చేసే వైద్యుడు;
* ophthalmology, n. నేత్రవైద్యం; కంటివైద్యం;
* option, n. వికల్పం; విభాష: అభిరుచి; కోరి ఎన్నుకున్నది;
* optional, adj. ఐచ్ఛిక;
* optometrist, n. దృష్టిదోషాన్ని కొలచి కళ్లజోడుని అమర్చే వ్యక్తి;
* opulence, n. ఐశ్వర్యం; అయిస్వర్యం;
* opulent, adj. విలువైన వస్తువులతో అలంకరించబడ్డ;
* or, conj., కాని; లేక; కానిపక్షంలో; లేకపోతే; లేనియెడల;
* oracle, n. సర్వజ్ఞుడు; ద్రష్ట; ప్రవక్త; గ్రీకు గాథలలో వచ్చే అన్నీ తెలిసిన వ్యక్తి;
* oral, adj. (1) నోటిద్వారా; వాక్; వాగ్రూపంగా; వాచా; వాచ్య; వాచారంభ; మౌఖిక; మూజువాణీ; (2) నోటికి సంబంధించిన; నోటితో; ఆశ్య;
** oral cavity, అంగిలిగుంట; ఆశ్య కుహరం;
** oral commitment, ph. వాగ్దానం;
** oral examination, ph. వాచ పరీక్ష;
** oral exegesis, ph. కథాకాలక్షేపం;
** oral medicine, ph. నోటిద్వారా వేసికొనే మందు; మూజువాణీ మందు;
** oral testimony, ph. వాగ్మూలం;
** oral thrush, ph.తెల్ల పూత;
** oral tradition, ph. మౌఖిక సంప్రదాయం;
* orally, adv. వాచ్యంగా; నోటి;
* orange, n. నారింజ; నాగరంగం; కిచ్చిలి;
** batavian orange, ph. బత్తాయి; మోసంబి;
** navel orange, ph. బొడ్డు నారింజ; నాభి నారింజ;
** sweet orange, ph. బత్తాయి; చీనీకాయ; మోసంబి; తియ్య నారింజ; [bot.] Citrus sinensis;
** mandarin orange, ph. కమలాఫలం; [bot.] Citrus reticulata;
* orator, n. వక్త; వాంగ్మి; ప్రవక్త;
* oratory, n. వక్తృత్వం;
* orb, n. (1) బింబం; (2) గోళం;
* orbicular, adj. మండలాకార;
* orbit, n. కక్ష్య; చారగతి; వివర్తకం; భచక్రం;
** inner orbit, ph. అల్ప వృత్తం; అల్ప కక్ష్య;
** outer orbit, ph. అధిక వృత్తం; అధిక కక్ష్య;
* orbital, adj. కక్షీయ; కక్ష్యకి సంబంధించిన; గ్రహగతికి సంబంధించిన;
** orbital mechanics, ph. కక్షీయ యంత్రశాస్త్రం; (note) mechanics is that area of science concerned with the behavior of physical bodies when subjected to forces or displacements;
* orbital, n. విగతి; విస్తృతమైన గతి; ఒక ఎలక్ట్రాను ఎక్కడ ఉందో సూచించడానికి వాడే తరంగ ప్రమేయపు లక్షణం; గుళిక వాదంలో వచ్చే ఒక సంక్లిష్ట భావన;
* orchard, n. పండ్లతోట; తోట; తోపు;
** palm orchard, ph. తాటి తోపు;
* orchestra, n. వాద్యబృందం; భజంత్రీలు; పక్కవాద్యాలు;
* ordeal, n. అగ్ని పరీక్ష;
* order, n. (1) ఆనతి; ఆన; ఆజ్ఞ; ఆజ్ఞాపన; అనుశాశనం; ఉత్తర్వు; తాకీదు; (2) ఆజ్ఞా పత్రిక; ఫర్మానా; (3) క్రమం; వరుస; (4) క్రమం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు నాలుగవ వర్గానికి పెట్టిన పేరు; [see also] genus, family, order, class, phylum and kingdom;
** alphabetical order, ph. అక్షర క్రమం;
** money order, ph. మనియార్డరు; పైకపు బరాతం;
** out of order, ph. క్రమం తప్పడం; తారుమారు అవడం;
** written order, ph. బరాతం; పరవానా;
** ordered pair, ph. [math.] క్రమ యుగ్మం; (x, y) అనేది క్రమ యుగ్మం;
* orderly, n. ఆసుపత్రిలో పనివాడు;
* ordinal, adj. వరసవారీ; వరసలోని; వరసలోనుండి ఎంచిన; క్రమ;
** ordinal number, ph. వరసవారీ సంఖ్య; క్రమ సంఖ్య;
* ordinance, n. ఆజ్ఞ; అధికార శాసనం;
* ordinarily, adv. సామాన్యంగా; సాధారణంగా;
* ordinary, adj. సామాన్య; సాధారణ; సాదా; లౌకిక; మామూలు; తందురుసు;
** ordinary person, ph. సామాన్యుడు; సామాన్యురాలు; తందురుసు రెంచ; తందురుసువాడు;
* ordnance, n. యుద్ధసామగ్రి; తోపులు;
* ore, n. ఖనిజం;
* oregano, n. పాశ్చాత్య దేశాల వంటకాలలో వాడే ఒక సుగంధ పత్రి; [bot.] Origanum;
** Greek oregano, ph. [bot.] ''Origanum vulgare hirtum'';
** Italian oregano, ph. [bot.] ''Origanum majoricum'';
* organ, n. (1) అంగం; అవయవం; (2) ఒక రకం పియానో;
* organism, n. జీవి;
* organic, adj. ఆంగిక; సేంద్రియ; చేతన;
* organization, n. (1) సంస్థ; వ్యవస్థ; (2) సంవిధానం;
* organized, adj. వ్యవస్థిత; సంఘటిత;
** organized labor, ph. సంఘటిత శ్రామిక వర్గం;
* organizers, n. pl. కార్యకర్తలు; నిర్వాహకులు; వ్యవహర్తలు; సంధాతలు;
* orgasm, n. రతిక్రీడలో పరాకాష్ఠని అందుకున్న సన్నివేశం;
* oriel, n. వీధి అరుగు; వీధి వసారా; చీడీ;
* oriental, adj. పూర్వ; ప్రాక్; ప్రాచ్యదేశ;
* orientation, n. దృగ్విన్యాసం; దిక్సాధన;
* orifice, n. బెజ్జం;
* origin, n. మూలం; ప్రభవం; ప్రభూతి; సంభవం; పుట్టుక; హేతువు; మూల బిందువు;
* original, adj. అసలు; మొదటి; మూల;
** original copy, ph. అసలు ప్రతి;
* original, n. (1) అసలు; మొదటిది; మాతృక; మూలం; (2) అసలు ప్రతి;
** Telugu original, ph. తెలుగు మాతృక; తెలుగు మూలం;
* originality, n. అపూర్వత; నూతనత్వం; ఉపజ్ఞ;
* orgon, n. నిమ్మ గడ్డి;
* originator, n. m. కారణభూతుడు;
* oriole, n. కల్ల పిట్ట;
* Orion, n. మృగవ్యాధుడు; వృత్రాసురుడు; మృగశిర; మృగశీర్షం; అగ్రహాయిణి; ఇది క్రమంగా అగ్రాయిని, తరువాత ఒరాయన్ అయేయని అంటారు; నిజానికి మృగశిర అనే కూటమి మృగవ్యాధ రాశిలో ఒక భాగమే;
** Orion's Belt, ph. త్రిపురములు; ఇన్వకములు; గొల్లకావడి చుక్కలు;
* ornate, adj. అలంకృతమైన; సాలంకృత;
* ornament, n. నగ; భూషణం; ఆభరణం; తొడవు; రవణం; అలంకారం;
* ornamentation, n. అలంకారం; సంగీతంలో అలంకారం అంటే సాదా, సీదాగా పాడకుండా స్వరాలకి చిన్న ఊపో, గమకమో, కంపిత గమకమో, వగైరాలు చేర్చి పాడడం; భాషలో అలంకారం అంటే ఉపమ, రూపక, మొదలైన అలంకారాలు వాడడం;
* ornithology, n. పక్షిశాస్త్రం;
* orphans, n. అనాథలు; తల్లిదండ్రులు లేని పిల్లలు;
* orphanage, n. అనాథ శరణాలయం;
* ortho, pref. తిన్ననైన; ఉదగ్ర;
* orthodontist, n. ఎత్తుపల్లాలు ఉన్న పంటి వరసని తిన్నగా చేసే వైద్యుడు;
* orthodox, adj. పూర్వాచార; సదాచార; శ్రోత్రియ; ఆస్తిక;
* orthodoxy, n. పూర్వాచార పద్ధతి; శ్రోత్రియ సంప్రదాయం; ఆస్తికత్వం; ఛాందసం; వేదాలని ప్రమాణంగా నమ్మడం;
* orthogonal, adj. లంబీయ; లంబకోణీయ; ఉదగ్రకోణీయ;
* orthonormal, adj. లంబనిట్రీయ;
* orthography, n. వర్ణక్రమం; వర్ణక్రమదోషం లేకుండా రాయడం;
* orthotropous, adj. [bot.] ఉదగ్రముఖ; having the nucleus of a plant ovule straight;
* oscillating, adj. డోలాయమాన; స్పందన; నివర్తన;
** oscillating universe theory, ph. విశ్వస్పందన వాదం;
* oscillation, n. స్పందనం; డోలనం; నివర్తనం; ఊగడం; ఆందోళనం;
* oscillator, n. [phys.] ఆందోళిక;
** harmonic oscillator, ph. [phys.] హరాత్మక ఆందోళిక; స్వరాత్మక ఆందోళిక; In classical mechanics, a harmonic oscillator is a system that, when displaced from its equilibrium position, experiences a restoring force F proportional to the displacement x;
* oscillatory, adj. స్పందించే; డోలాయమానమైన; ఊగే;
** oscillatory universe, ph. స్పందించే విశ్వం;
** theory of the oscillatory universe, ph. విశ్వ స్పందన వాదం; see also big bang theory;
* oscilloscope, n. డోలన దర్శిని;
* osculation, n. వేష్టనం; చుంబనం;
* osmosis, n. అభిసరణం; ఉత్సరణం; ద్రవాభిసరణ;
** osmotic pressure, ph. అభిసరణ ప్రేషం;
** reverse osmosis, ph. వ్యతిరేక ద్రవాభిసరణం;
* ostentation, n. ఆడంబరం; డంబరం;
** verbal ostentation, ph. వాగాడంబరం;
* osteomalacia, n. అస్తిమాల్యం; ఎముకల బలహీనతకు చెందిన వ్యాధి;
* ostrich, n. నిప్పుకోడి; ఉష్ట్రపక్షి; ఆఫ్రికాలో ఉండే ఎగరలేని పెద్ద పక్షి; [bio.] ''Struthio camelus'';
* other, adj. మరొక; వేరే; లాతి; అన్య; పరాయి; (rel.) another;
** other countries, ph. అన్య దేశాలు; పరాయి దేశాలు;
** other people, ph. లాతి వాళ్లు;
** other side, ph. అవతల; అవతల పక్క;
* otiose, adj. పనికిమాలిన;
* otter, n. ఆటర్; నీళ్ళల్లో ఉండే కుక్కని పోలిన ఒక క్షీరదం;
* otherwise, adv. అలాకాని పక్షంలో; అట్లుకాకున్న; కానిచో; అన్యథా; అథవా; పక్షాంతరమున;
* ounce, n. అవున్సు; (1) ద్రవ పదార్థాలని కొలవడానికి వాడే ఒక మానం; (2) బరువుని కొలిచేటప్పుడు పౌనులో పదహారో వంతు;
* our, poss. pron. (1) inclusive, మన; (2) exclusive; మా; మాయొక్క;
* out, adv. బైట; బైటకి;
* outbreak, n. అకస్మాత్తుగా చెలరేగిన విప్లవ సంఘటన; the sudden or violent start of something unwelcome, such as war, disease, etc.
* outcast, n. అప్రాశ్యుడు; వెలి వేయబడ్డవాడు;
* outcome, n. ఫలితార్థం; ఫలం; పరిణామం;
* outcropping, n. గుట్ట; మట్టిలోంచి బయటికి పొడుచుకు వచ్చిన శిలా సంస్తరం;
* outcry, n. పెద్ద గోల; గొడవ; ఉద్ఘోషం;
* outdoor, adj. బయటి; లోపలి కాని;
* outer, adj. బహిర్గత; బాహ్య;
* outfit, n. (1) దుస్తులు; (2) సరంజామా; సాధన సంపత్తి;
* outlaw, v. t. నిషేధించు;
* outlay, n. పెట్టుబడి; మొత్తపు ఖర్చు; వ్యయం;
* outlet, n. నిర్గమ ద్వారం; నిర్గమం;
* outline, n. రూపురేఖ;
* output, adj. వెలపట; బహిర్గత; అంతర్యాన; అంతర్యాగ;
** output data, ph. బహిర్గత దత్తాంశం; బహిర్యానాంశం; బహిర్యాగాంశం;
** output pressure, ph. బహిర్గత పీడనం;
* output, n. వెలపలం; వెలపటంశం; నిర్గమాంశం; నిర్గతం; బహిర్గతం; బహిర్హితం; బహిర్యానం; బహిర్యాగం; బరవానా; పోత; ఫలితం; పరిణామం; ఉత్పన్నం; ఫలోత్పత్తి; నిర్గళితం; ఆయాతం; ప్రదానం; బైపెట్టు;
* outrage, n. దౌర్జన్యం; దురంతం; దురాగతం;
* outside, n. బయట;
* outsiders, n. pl. బయటివారు; తస్మదీయులు;
* outskirts, n. పొలిమేరలు; శివార్లు;
* outstanding, adj. (1) విశిష్టమైన; (2) బాకీ ఉన్న; మిగిలిన;
** outstanding exhibition, ph. విశిష్టమైన ప్రదర్శన;
** outstanding debt, ph. మిగిలిన అప్పు;
* outstretched, adj. బారజాపిన; చాపిన;
* outward, adj. బహిర్; బాహరమైన;
* ova, n. గుడ్లు; అండములు;
* ovary, n. స్త్రీబీజకోశం; అండకోశం; గర్భాగారం;
* oven, n. (అవెన్) ఆవం; ఆశ్మంతం; హసంతి; కమటం; పొక్కలి; పొయ్యి;
** goldsmith's oven, ph. కమటం;
** oven bird, ph. పొయ్యిపిట్ట; ఆవపిట్ట;
** oven to fire bricks, ph. ఇటుకలావం;
* over, prep.కంటె; మీద; పైన;
* over-bar, n. [math.] శిరోవారం; గణితంలో బీజాక్షరాల తల మీద గీసే అడ్డు గీత;
* overbearing, adj. దాష్టీకమైన;
* overcast, adj. మబ్బు కమ్మిన; మందారముగానున్న;
* overcoat, n. అంగరఖా;
* overcome, v. i. అధిగమించు; నిస్తరించు; గెలుచు; జయించు;
* overdose, n. మితిమీరిన మోతాదు;
* overdue, n. నిల్వ బాకీ; బకాయ;
* overflow, v. i. పొంగు; ఉప్పొంగు;
* overhang, v.i. వేలాడు;
* overhead, n. అమాంబాపతులు; పై ఖర్చులు;
* overlook, v. t. (1) చూడకపోవు; గమనించకపోవు; (2) ఒకరు చేసిన తప్పుని పట్టించుకోకుండా వదలిపెట్టు; (3) పైనుండి కిందకి చూచు;
* overripe, adj. ఆరముగ్గిన;
* oversee, v. i. అజమాయిషీ చేయు;
* overseer, n. తలవరి; ఓర్సీలు;
* oversight, n. (1) ఏమరుపాటు; ఏమరుపాటుతో చేసిన పొరపాటు; (2) ఏమరుపాటుతో పొరపాట్లు జరగకుండా అజమాయిషీ చేయు; (note) a word with opposing meanings;
* overtake, v. t. అధిగమించు; అతిక్రమించు; పట్టుకొను;
* overtly, adv. బాహాటంగా; బహిరంగంగా;
* overtone, n. అతిస్వరం; ప్రాధమిక ధ్వని తరంగం కంటె ఎక్కువ తరచుదనం (పౌనఃపున్యం) తో కంపించే తరంగం;
* overture, n. (1) పూర్వరంగం; (2) ఆరంభవాద్యం; సంగీత సభలలో ఉపోద్ఘాతంగా వాడే సంగీతం; (3) స్నేహభావాన్ని ప్రదర్శించడం;
* overturn, v. t. (1) తలకిందులు చేయు; బోల్తా కొట్టించు; (2) దిగువ కోర్టులో చేసిన తీర్మానాన్ని ఎగువ కోర్టువారు కొట్టివేయు;
* overview, n. పర్యావలోకనం; విహంగావలోకనం;
* overwhelming, adj. అతిశయించిన;
** overwhelming response, ph. అతిశయించిన స్పందన;
* oviduct, n. అండవాహిక;
* oviform, adj. అండాకార;
* ovulation, n. అండోత్సర్గం;
* oviparous, adj. అండజమైన; గుడ్డులోంచి పుట్టిన;
* ovum, n. స్త్రీబీజం; అండం; శోణితం;
* owing to, prep. వల్ల; నుంచి;
* owl, n. గుడ్లగూబ; పులుగుపిట్ట; ఘూకం; ఉలూకం; దివాంధం; వాయసారాతి; వాయసారి; ధ్వాంక్షారాతి; పేచకం;
* owlet, n. గుడ్లగూబ పిల్ల;
* own, adj. స్వంత; ఖాసా; కాసా;
* owner, n. స్వామి; కామందు; యజమాని; స్వంతదారు; సొంతదారు; పట్టాదారు;
* ownership, n.స్వంతం; హక్కు; స్వామ్యం; స్వామిత్వం;
* ox, n. s. ఎద్దు; గిత్త; వృషభం;
* oxen, n. pl. ఎడ్లు; గిత్తలు;
* oxidation, n. భస్మీకరణం; ఉపచయం;
** exothermic oxidation, ph. ఉష్ణమోచక భస్మీకరణ;
* oxidant, n. భస్మీకరి; భస్మం చేసేది;
** antioxidant, n. ప్రతిభస్మీకరి;
* oxide, n. ఆమ్లజనితో సంయోగం చెందగా వచ్చిన తుప్పు;
* ox gall, n. గోరోచనం;
* oxy-acetylene, n. ఆమ్లవిదీను;
** oxy-acetylene torch, ph. ఆమ్లవిదీను దివ్వె; ఈ రకం దివ్వెతో ఉక్కుని సునాయాసంగా కోయవచ్చు;
* Oxygen, n. ఆమ్లజని; ప్రాణవాయువు; రంగు, రుచి, వాసన లేని ఒక రసాయన మూలక వాయువు; (అణుసంఖ్య 8, సంక్షిప్త నామం O)
* oxymoron, n. విరుద్ధోక్తి; విరోధాభాసాలంకారం; సంసృష్టి; రెండు విరుద్ధమైన అర్థాలు వచ్చే మాటలని ఒకే సందర్భంలో వాడడం; ఉ. మా చెడ్డ మంచోడు;
* oxide, n. భస్మం;
** iron oxide, ph. తుప్పు;
* oyster, n. సీపి; గుల్లచేప; ఆల్చిప్ప;
* ozone layer, n. ఓజోను పొర; అంతరిక్షం నుండి హాని చేసే కిరణాలు భూమిని సోకకుండా ఆపు చేసే వాయువుల పొర;
* '''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
53tq0kjf0luy4biivq2n782biw7b78d