Wikibooks
tewikibooks
https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.4
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
Wikibooks
Wikibooks చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/J-K
0
3002
39206
39134
2026-06-01T19:22:00Z
Vemurione
1689
/* Part 1: J */
39206
wikitext
text/x-wiki
=నిఘంటువు=
*This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
==Part 1: J ==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
*
* '''jamboree, n. మహానాడు; తిరుణాలు;
* jack, n. (1) పనస; (2) జాకీ; పేకముక్కలలో ఒకటి; (3) బండి యొక్క ఇరుసును పైకెత్తు సాధనం;
** jack of hearts, ph. ఆఠీను జాకీ;
* jackfruit, n. [[పనస]] పండు;
* jackal, n. గుంటనక్క; కొంకనక్క; వరడు;
* jackass, n. మగ [[గాడిద]]; మూఢుడు;
* jacket, n. రవిక; చోళకం; చోళీ; తొడుగు; కంచుకం; కంచెల; కుప్పసం; పేరణం; చట్టి;
* jade, n. పచ్చ; see also emerald;
* jagged, adj. రంపపు పళ్ళ వలె ఉన్న;
* jaggery, n. [[బెల్లం]]; గుడం; గడోలం; చెరకడం; ద్రుపజం; అమృతరశాజం;
* jaguar, n. దక్షిణ అమెరికాలో నివసించే చిరుతపులి;
* jail, n. ఖైదు; కారాగారం; చెరసాల; జైలు;
* jailer, n. కారాగారపు అధికారి; చెరసాలని నడిపే అధికారి;
* jam, n. (1) తాండ్ర; మురబ్బా; a fruit preserve; Jam is more fruity than jelly and it involves slight crushing or jamming of pieces of fruit; (2) ముంజె, ద్రవమునుగాక గట్టియునుగాక కొంచెము జిగటగానుండు పదార్థము; (note) an Indian word corrupted from Telugu; (ety. ) జిల్లిరాళ్లు = pebbles; see also jelly; (3) ఇరకాటం; నొక్కుడు; దిగ్బంధం;
** traffic jam, ph. ఇరకాటంలో చిక్కుకున్న వాహనాలు;
* jam, v. t. అడ్డగించు; నొక్కు; బంధించు;
* jamboree, n. మహానాడు; పెద్ద సభ; సమారోహం; తిరణాలు;
* janitor, n. ఊడిగాడు; భవనాలని లోపల శుభ్రం చేసే వ్యక్తి;
* jar, n. జాడీ; జారీ; కూజా;
* jargon, n. పరిభాష; ఏదైనా ఒక శాస్త్రంలో ఒక మాటని ఒకే ఒక అర్థంతోనే వాడుకోవాలని నిర్ణయించగా తయారైన భాష;
* jasmine, n. [[మల్లె]];
* jasper, n. సూర్యకాంతం; పచ్చరాయి; క్వార్జ్ జాతి పొడి;
* jaundice, n. [[పచ్చకామెర్లు]];
* javelin, n. శలాకం; బల్లెకోల; ఈటె;
* jaw, n. దవుడ;
* jawbreaker, n. (1) నమలడానికి కష్టమైన పదార్థం; (2) ఉచ్చరించడానికి కఠినమైన మాట;
* jay, n. [[పాలపిట్ట]];
* jealous, adj. ఈర్ష్యపడే; అసూయపడే;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: jealous, envious
* ---If someone is ''jealous'', s/he feels angry or unhappy because s/he cannot have something that others have: Kavitha is jealous of her sister's success. If someone is ''envious'', s/he wants to have qualities or things that someone has: Linda was envious of Radha's new home; envy is an active expression of jealousy;'''
|}
*
* jealousy, n. ఈర్ష్య; అసూయ; మాత్సర్యం; ఓర్వలేనితనం; ఎరుసు; కాంతాళం;
* jeer, v. t. వెక్కిరించు; కూతలు కూస్తూ వెక్కిరించు;
* jelly, n. జిల్లిక; జిగిలి; జల్లిక; జల్లి; తాండ్ర; శ్లేషి; పాకం పట్టిన పండ్లరసం; jelly is made from fruit juice and is smooth in texture; the elastic or gel like consistency is how the name is derived from;
* jellyfish, n. నీటికాయ; ఒక రకం జలచరం;
* jeopardy, n. అపాయం; ప్రమాదం;
* jerk, v. t. కుదుపు; తటాలున ఈడ్చు;
* jest, v. i. నవ్వులాటలాడు; సరదాకి కొంటె పని చేయు; ఆగడం చేయు;
* jest, n. ఆగడం;
* jester, n. విదూషకుడు; హాస్యగాడు;
* jet, adj. (1) ధారా; ధారగా; (2) నల్లటి;
** jet black, ph. నల్లటి నలుపు; కారు నలుపు;
** jet propulsion, ph. ధారా చాలనం; ఇంధనం మంటతో బాగా వ్యాకోచం చెందిన గాలిని వెనకకి తోస్తూ బండిని ముందుకు నడిపే పద్ధతి;
* jet, n. ధార;
* jewel, n. నగ; ఆభరణం; [[మణి]]; [[రత్నం]];
* jeweler, n. (1) నగలు అమ్మే వ్యక్తి; జవాహర్ వాలా; (2) కంసాలి; అగసాలె; బంగారం పని చేసే కంసాలి;
* jewelry, jewellery (Br.) n. నగలు; జవాహరీ;
** jewelry store, ph. నగల కొట్టు; జవాహర్ ఖానా;
* jihad, n. (జిహాద్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ ' అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; మౌలిక ముస్లింలలో మతం కోసం ఏంచేసినా తప్పులేదనే అభిప్రాయం ఉంది. మతేతరులంతా ముస్లిం మౌలికవాదుల దృష్టిలో కాఫిర్లు. సాతాను ప్రభావంలో ఉన్న తమ మతస్థులను కాపాడుకోవడం మాత్రమేకాదు. సాతాను ప్రభావంలో ఉన్న మతేతరులను నిర్మూలించడం ఇస్లాం మౌలికవాదులు తమ పవిత్ర కర్తవ్యంగా భావించి అందుకు మతయుద్ధం చేయడం తప్పనిసరి అని భావిస్తారు. అందుకే వారు మతం విషయంలో సహనం తక్కువగా ఉన్న వారిగా పేరొందారు;
* jinx, n. అచ్చిరాని మనిషి లేక వస్తువు; అపశకునం; అపశకునపక్షి;
* job, n. (1) ఉద్యోగం; (2) పని;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: job, work, occupation, profession, trade, career, position
* ---Use '''work''' as a general word to talk about what you do every day in order to earn money: I have to go to work. Your ''job'' is the particular type of work that you do: Lila got a job as a stewardess. ''Occupation'' is a formal word for job. ''Position'' is the formal word used when a job is advertised. A ''trade'' is a skilled job you do with your hands. A ''career'' is a professional job that you do for most of your life. A profession is a career for which you need a lot of training.'''
|}
*
* jog, v. i. వ్యాయామం కొరకు నెమ్మదిగా పరుగెత్తు;
* join, v. i. చేరు; అంటుకొను; కలుసుకొను; కూడు; జతగూడు; కవయు; కవగొను;
* join, v. t. చేర్చు; కలుపు; లకించు; తగిలించు; జోడించు; జతగూర్చు; సంధించు; అంటించు; జమిలించు; జమాయించు;
* joining, n. చేరడం; సంధానం;
* joint, adj. ఉమ్మడి; పొత్తు; సంయుక్త; సమష్టి; తొల్లుగడ;
** joint business, ph. ఉమ్మడి వ్యాపారం;
** joint cultivation, ph. పొత్తు సేద్యం;
** joint family, ph. సమష్టి కుటుంబం; ఉమ్మడి కుటుంబం:
* joint, n. (1) కీలు; అస్థి సంధి; బంధు; సంధికర్మ; గణుపు; (2) స్థలం; ప్రదేశం;
** ball and socket joint, ph. బంతిగిన్నె కీలు; ఉలూఖల సంధి;
** carpenter's joint, ph. బందు; సంధికర్మ;
** folding joint, ph. మడతబందు కీలు;
** gliding joint, ph. జారెడి కీలు;
** hinged joint, ph. మడతబందు కీలు;
** pivot joint, ph. బొంగరపు కీలు;
* jointly, adv. జతగా; కలసి;
* joints, n. [[కీళ్లు]]; సంధులు;
** maxillary joints, ph. అంకీళ్ళు; అంగిలి కీళ్ళు;
* joist, n. దూలం;
* joke, n. హాస్యోక్తి; సయ్యాట; వేళాకోళం; పరిహాసం; పరాచకం; ఛలోక్తి; చమక్కు; చమత్కారం; చమత్కార బాణం; ఆగడం; ఉపహాసం; ఉక్కిదం; హాస్యవాదం;
** practical joke, ph. క్రియాత్మక పరిహాసం;
* joke, v. t. సయ్యాటించు; పరిహసించు;
** jokes and riddles, ph. పరిహాసాలు, పొడుపు కథలు;
* jolt, n. కుదుపు; ఘాతం;
** jolt of electricity, ph. విద్యుత్ ఘాతం;
* journal, n. (1) పత్రిక; (2) చిట్టా; (3) దినచర్య రాసిన పుస్తకం;
* journalist, n. పత్రికా రచయిత; పత్రికా విలేఖరి; m. పాత్రికేయుడు;
* journalists, n. పాత్రికేయులు; పత్రికా రచయితలు; పత్రికా విలేఖరులు;
* journey, n. ప్రయాణం; పయనం; పైనం; యాత్ర; యానం; ప్రస్థానం;
** great journey, ph. మహాప్రస్థానం;
** return journey, ph. తిరుగు ప్రయాణం; ప్రతియానం;
* joy, n. ఆనందం; సంతోషం;
* jubilant, adj. ప్రఫుల్ల; ఉల్లాసప్రద; అత్యధిక సంతోషమును చూపే మనోస్థితితో;
* jubilee, n. వార్షికోత్సవం; ఉత్సవం;
** golden jubilee, ph. 50వ వార్షికోత్సవం; సువర్ణోత్సవం;
** silver jubilee, ph. 25వ వార్షికోత్సవం; రజతోత్సవం;
* judge, n. న్యాయమూర్తి; నిర్ణేత; న్యాయనిర్ణేత; తగవరి; తీర్పరి; జడ్జి; see also arbitrator;
* judge, v. t. న్యాయవిచారణచేయు; తీర్పుచెప్పు;
* judgment, judgement (Br.), n. తీర్పు; తీర్మానం; అభిప్రాయం; జడ్జిమెంటు;
* judicious, adj. తగిన; వివేకవంతమైన;
* jug, n. కూజా; ద్రవ పదార్ధాలు పోసుకుందుకి చిన్న మూతి, చేత్తో పట్టుకుందుకి హస్తకం ఉన్న లోతైన బిందె వంటి పాత్ర;
* juggler, n. గారడీవాడు; దొమ్మరి;
* jugglery, n. గారడీ; [[ఇంద్రజాలం]]; కనుకట్టు;
* jugular, adj. మెడకి సంబంధించిన;
** jugular artery, ph. గళ ధమని;
** jugular vein, ph. గళ సిర;
* juice, n. రసం; ద్రవం; పసరు; సారం;
** juice of fruits, ph. రసం;
** juice of leaves, ph. పసరు; అసరు;
** intestinal juice, క్లోమరసం; స్వాదురసం;
** salivary juice, లాలాజలం;
* juicy, adj. పసందైన; రసవంతమైన;
* julep, n. పానకం;
* julienne, adj. సన్నగా, కోలగా తరగబడ్డ;
* jumbo, adj. బృహత్; మహాత్; పెద్ద; చాలా పెద్ద; ఏనుగంత పెద్ద;
* jumbo, n. (1) ఏనుగు; (2) పెద్దది;
* jumble, v. t. కలగాపులగం చేయు;
* jumbled, adj. జమిలి; కలగాపులగం చేయబడ్డ;
* jumbled, n. కారాకూరం;
* jump, v. i. ఉరుకు; దుముకు; దూకు; దాటు; గెంతు; కుప్పించు; జవుకళించు;
** jump down, ph. దూకు;
** jump up, ph. ఎగురు;
** jumping from topic to topic, ph. [[శాఖాచంక్రమణం]];
* junction, n. మొగ; సంధి; కూడలి; సంగమం; సంగం;
* juncture, n. సందర్భం; అవకాశం;
* jungle, n. [[అడవి]]; జాంగలం;
* junior, adj. చిన్న; కింద;
** junior wife, ph. చిన్న భార్య;
** junior officer, ph. కింద ఉద్యోగి; చిన్న ఉద్యోగి;
* junior, n. (1) తండ్రి పేరు పెట్టుకున్న కొడుకు; (2) నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో మూడవ ఏటి విద్యార్థి;
* junk, n. పనికిరాని వస్తువులు; చెత్త;
** junk food, ph. చెత్త తిండి; పోషక విలువ లేని తిండి;
** junk yard, ph. చెత్తల దొడ్డి;
* Jupiter, n. (1) శుక్రగ్రహం; రోమనుల పురాణాలలో రాజు; (2) గురుడు; బృహస్పతి; ఈ రెండు మాటలకీ ఎంతో పెద్ద అనే వాచ్యార్థం;
* jurisdiction, n. పరిధి; అధికార పరిధి; ఇలాకా; చట్టసమ్మతమైన పరిధి; అధికార మండలం; అజమాయిషీ; హయాం;
* jurisprudence, n. న్యాయశాస్త్రం; న్యాయశీలం; న్యాయశీలత; ధర్మశాస్త్రం; న్యాయమీమాంస;
* jury, n. ప్రమాణగణం; జూరీ;
* just, adj. (1) సమర్ధించదగిన; న్యాయమైన; (2) సరియైన;
** just about, ph. సుమారుగా;
** just this, ph. ఇదొక్కటే;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: just, already, yet
* ---In formal or written English, you must use these words with the present perfect tense: I have ''already'' seen him; The bell has ''just'' rung; Have you eaten ''yet''? However, in informal speech, we often use them with simple past tense: I already saw him; the bell just rang; did you eat yet?'''
|}
*
* justice, n. (1) న్యాయం; ధర్మం; ధర్మబలం; పాడి; (2) న్యాయమూర్తి;
* justifiable, adj. సమర్ధనీయ;
* justification, n. సమర్ధన;
* justify, v. t. సమర్ధించు;
* jut, v. i. ముందుకి పొడుచుకొని వచ్చు;
* jute, n. [[జనుము]]; ఈ మాట జట అనే సంస్కృత పదం నుండి పుట్టింది; (ety.) this word is derived from the Sanskrit word Jata which means a braid of hair. The Hindu word Juta, which means shoes, probably has the same root suggesting that the earliest shoes were nothing but hairy skins of animals;
** jute fiber, ph. జనుప నార;
* juvenile, adj. తరుణ; బాల;
** juvenile offenders, ph. తరుణాపరాధులు; నేరము చేసిన పిల్లలు; బాల నేరస్థులు;
* juxtapose, v. t. పక్కపక్కని పెట్టు;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 2: K==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
[[File:Kaleidoscope_tube.jpg|thumb|right|Kaleidoscope_tube]]
[[File:Kaleidoscopes.jpg|thumb|right|viewPattern-Kaleidoscopes]]
* '''kafkaesque, adj. కలతతో కూడిన పీడకలవంటి వాతావరణం; కాఫ్కా రచనలలో కనిపించే లాంటి వాతావరణం;
* kaleidoscope, n. కదంబిని; వర్ణకదంబిని; వర్ణపగడము; సాధారణంగా మూడు దీర్ఘచతురస్రాకారపు అద్దపు బద్దీలని, వాటి మధ్య 60 డిగ్రీలు కోణం వచ్చేటట్లు అమర్చి, ళోపల రెండు మూడు రంగు పూసలని వేసి కట్టకట్టి పిల్లల ఆట వస్తువుగా అమ్ముతారు;
* Kantakari, n. నేలములక; [bot.] ''Solanum surattense'' Burm. of the Solanaceae family; ''Solanum xanthocarpum'' Schard; An Ayurvedic herb used to treat coughs, colds, asthma, and such other respiratory diseases;
* kaolin, n. మెత్తటి మట్టి; soft clean clay; People use it to make medicine; Kaolin is used for mild-to-moderate diarrhea, severe diarrhea (dysentery), and cholera; [[Aluminium|Al]]<sub>2</sub>[[Silicon|Si]]<sub>2</sub>[[Oxygen|O]]<sub>5</sub>([[hydroxide|OH]])<sub>4</sub>
* karaoke, adj. (కేరయోకీ), వాద్యబృందం లేకుండా;
** Karaoke singing, ph. A form of interactive entertainment where individuals sing along to pre-recorded instrumental tracks of popular songs; The word "karaoke" originates from Japanese, roughly translating to "empty orchestra".
* karate, n. కరాటే; చేతివిద్య;
* karma, n. (1) [[కర్మ]]; (2) అనుభూతి;
* keel, n. పడవ యొక్క మట్టు; వెన్నుదూలం;
** on an even keel, ph. తొణకకుండా;
* keen, adj. వాడి; చురుకైన; నిశితమైన;
* keep, v. i. ఉండు; కాపాడు;
* keep, v. t. ఉంచు; నిలుపు; ఉంచుకొను; సంరక్షించు;
* keeper, n. కాపాడువాడు; కావలివాడు;
* keg, n. చిన్న పీపా;
* kelp, n. వారిపర్ణి; సముద్రపు పాదు; సముద్రపు నాచు; Kelps are large seaweeds (algae) belonging to the brown algae (Phaeophyceae) in the order Laminariales; (note) see also seaweed;
* kennel, n. (1) కుక్కలదొడ్డి; (2) కుక్కలగుంపు;
* kerchief, n. చేతిరుమాలు;
* kernel, n. (1) గుజ్జు; గింజ; విత్తు; పప్పు; [[టెంక]]; కురిడి; నుంగు; (2) ప్రధానాంశం;
* kerosene, n. గడ్డనూనె; మట్టినూనె; [[కిరసనాయిలు]];
* ketchup, n. కెచప్; టొమేటో, సిరకా, పంచదార, మసాలా ద్రవ్యాలతో చేసిన ఒక "పచ్చడి" వంటి నంచుకునే పదార్ధం; ఈ మలేసియా వంటకం పాశ్చాత్య దేశాలకి వెళ్ళింది;
* kettle, n. కొప్పెర; డేగిసా;
* kettledrum, n. భేరీ; నగారా;
* key, adj. ముఖ్యమైన
* key, n. (1) తాళంచెవి; బీగపు చెవి; బిస; తల్లిక; (2) కీలకం; మూలం; (3) కుంచిక; కీ; (4) చింతామణి;
* keyboard, n. (1) కుంచికాఫలకం; కుంచిక పలక; మీటల పలక; మీటపలక; మీటమాను; మీటగం; కీపలక; కీఫలకం; బీగం పలక; (2) హార్మనీ బల్ల;
* keynote, n. కీలకోపన్యాసం;
** keynote speech, ph. కీలకోపన్యాసం;
* keystone, n. (1) టాకీరాయి; కొలికి పూస; (2) మూలవిషయం; మూల సూత్రం;
* khaki, n. ఖాకీ; లేతాకు పచ్చ, బూడిద రంగు కాని, లేదా లేత పసుపు, బూడిద రంగు ఉన్న ముతక రకం బట్ట; (ety.) Hindi, Persian, Urdu;
* kick, n. తాపు; పార్ణిఘాతం;
* kick, v. i. తన్నుకొను;
* kick, v. t. తన్ను;
* kickstand, n. తన్నుదన్ను;
* kid, n. (1) మేకపిల్ల; (2) m. కుర్రాడు; పిల్లవాడు; f. కురద్రి; బొట్టె; పిల్ల; (3) శాబకం;
* kidnapping, n. నరస్తేయం; శాబకగ్రహణం; దొంగతనంగా పిల్లలని ఎత్తుకుపోవుట;
* kidney, n. [[మూత్రపిండం]]; వృక్కం; వస్తి; గురదం;
* kill, n. చంపబడ్డ జంతువు;
* kill, v. t. చంపు; సంహరించు; వధించు; హతమార్చు; పరిమార్చు; తెగటార్చు; మన్ను కరిపించు; వెంపరలాడు;
* kill time, ph. కాలక్షేపం చేయు; కాలం గడుపు;
* killer, n. సంహర్త; నిహంత; m. హంతకుడు; f. హంతకురాలు;
** killer application, ph. సంహర్తోపయోగం;
* killing, n. సంహారం; సంహరణ; వధ; చావు; హసనం;
* kiln, n. ఆవం; బట్టీ;
** brick kiln, ph. ఇటిక ఆవం;
** lime kiln, ph. సున్నపు బట్టీ;
** potter's kiln, ph. కుమ్మరావం; కుమ్మరాము; కుమ్మరి బట్టీ;
* kilo, pref. వెయ్యి; 1000;
* kilobits, n. వెయ్యి ద్వింకములు; కంప్యూటరు రంగంలో మాత్రం 1024 ద్వింకములు; (note) ఇక్కడ కిలో అంటే వెయ్యి కాదు, 1024;
* kilobyte, n. కంప్యూటరు పరిభాషలో 1024 బైట్లు; (note) ఇక్కడ కిలో అంటే వెయ్యి కాదు, 2<sup>10</sup> = 1024;
* kilogram, n. [[కిలో]]; వెయ్యి గ్రాములు; ఇక్కడ కిలో అంటే 1,000;
* kilometer, n. కిలోమీటరు; వెయ్యి మీటర్లు; ఇక్కడ కిలో అంటే 1,000;
* kin, n. దగ్గర బంధువులు;
** kith and kin, ph. చుట్టపక్కాలు; ఆత్మీయులు;
* kind, adj. (1) రకం; (2) దయగల;
* kindergarten, n. బాలవిహార్; చిన్నపిల్లల పాఠశాల;
* kind-hearted, n. దయాళువు;
* kindly, adv. దయతో;
* kindness, n. దయ; కరుణ; కటాక్షం;
* kindle, v. t. రగుల్చు; రగిలించు; రాజవేయు; అంటించు; ముట్టించు;
* kinematics, n. శుద్ధగతిశాస్త్రం; వస్తువుల కదలికలు గురించి (కదలికల కారణాలతో నిమిత్తం లేకుండా) విచారించే శాస్త్రం; Kinematics explains the terms such as acceleration, velocity, and position of objects. The mass of the object is not considered while studying kinematics. Dynamics explains the "why" behind the movement as opposed to just describing the "how" of kinematics;.
* kinetics, n. (1) [chem.] రసాయన చర్యలు (సంయోగ వియోగాలు) ఎంతెంత జోరుగా జరుగుతున్నాయో అధ్యయనం చేసే శాస్త్రం; (2) [phys.] వస్తు సముదాయాల మీద బలాబలాలు ఎలా ప్రవర్తిస్తున్నాయో అధ్యయనం చేసే శాస్త్రం; Kinetics is focused on understanding the cause of different types of motions of an object such as rotational motion in which the object experiences force or torque.
** kinetic energy, ph. చలన శక్తి; గతిశక్తి; గతిజశక్తి;
*
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: kinetics, kinematics, dynamics
* ---Dynamics studies objects with acceleration. Dynamics is divided into kinematics and kinetics. In physics, "kinematics" refers to the study of motion without considering the forces causing it, focusing solely on describing an object's position, velocity, and acceleration, while "dynamics" analyzes the forces acting on an object and how they affect its motion, essentially explaining the "why" behind the movement as opposed to just describing the "how" of kinematics;
|}
*
* king, n. m. రాజు; మహారాజు; సమ్రాట్టు; సార్వభౌముడు; నృపతి; నృపాలుడు; పృథివీపతి; ఱేడు; లోకపాలుడు; వల్లభుడు; నరేంద్రుడు; చక్రవర్తి;
* kingdom, n. (1) రాజ్యం; సామ్రాజ్యం; సంస్థానం; (2) కోటి; సామ్రాజ్యం; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు అన్నిటి కంటే ఉన్నత వర్గానికి పెట్టిన పేరు; [see also] kingdom (రాజ్యం), phylum (విభాగం, వర్గం), class (తరగతి), order (క్రమం), family (కుటుంబం), genus (ప్రజాతి), and species (జాతి); There is no standardized consistency in the Telugu equivalents;
** animal kingdom, ph. జంతుకోటి; జంతు సామ్రాజ్యం;
** plant kingdom, ph. వృక్ష సామ్రాజ్యం; వృక్షకోటి;
* kingfisher, n. [[లకుముకి పిట్ట]];
* kinship, n. బంధుత్వం; చుట్టరికం;
** kinship terms, ph. బంధుత్వ వాచకాలు;
* kinsman, n. సగోత్రుడు; సగోత్రీకుడు; జ్ఞాతి; బంధువు; దాయాది;
* kiosk, n. చవికె; చౌక్;
* kismet, n., ప్రారబ్దం; కర్మ; destiny; fate;
* kiss, n. ముద్దు; చుంబనం;
* kiss, v. t. ముద్దు పెట్టుకొను; చుంబించు;
* kitchen, n. వంటగది; వంటయిల్లు; వంటిల్లు; వంటసాల; పొయ్యిల్లు; బానసం; మహాసనం; కుసిని; పాకగేహం; పాకశాల; అడసాల;
** improvised kitchen, ph. అడసాల;
* kite, n. (1) [[గాలిపటం]]; గాలిపడగ; పతంగి; (2) గద్ద; గరుడ పక్షి; గృధ్రము; see also hawk;
* kitten, n. పిల్లిపిల్ల; పిల్లికూన; కూన;
* kiwi, n. (1) [[న్యూజీలాండ్]] లో ఉండే ఎగరజాలని ఒక పక్షి; (2) కీవీ పండు; new name for Chinese gooseberry;
* kleptomania, n. చౌర్యోన్మాదం; దొంగతనం చెయ్యవలెనన్న హేతురహిత బుద్ధి;
* knack, n. నేర్పు; కౌశలం; లాఘవం;
* knead, v. t. పీండ్రించు; మాలీసు చేయు; పిసికికలుపు, మర్దింౘు, నొక్కు; అప్పడాల పిండి, చపాతీల పిండి వంటి పదార్థాన్ని చేతితో మర్దనా చెయ్యడం;
* knee, n. మోకాలు; జానువు;
* knee-cap, n. మోకాటి చిప్ప; జానుఫలకం;
* knee-deep, adj. మోకాటిబంటి; మోకాటి లోతు;
* knife, n. కత్తి; కఠారం; ఛురిక; చాకు; క్షురము; చురకత్తి; సూరకత్తి; తమాలం; ఆడిదము; ధారాధరం; రిష్టి; ఇవన్నీ చిన్న కత్తుల పేర్లు; see also sword;
** folding knife, ph. కీలుకత్తి;
** kitchen knife, ph. ఈలకత్తి;
** knife edge, ph. క్షురధార; అసిధార; వాదర; సున్నితపు త్రాసులో కాడిని నిలిపే ప్రాపు;
* knit, v. t. అల్లు; (rel.) weave; braid; plait; compose; fabricate;
** knitting needle, ph. అల్లిక పుల్ల; అల్లిక కాడ;
* knob, n. పిడి; గుబ్బ; గుబురు;
* knock, v. t. కొట్టు; తట్టు;
* knock-knees, n. ముడిగాళ్లు; ఈ రకం కాళ్ళు ఉన్నవాళ్ళు నడిచినప్పుడు మోకాళ్ళు కొట్టుకుంటాయి; (ant.) bow-legs;
* knocking, n. (1) కొట్టుకొనుట; విస్పోటనం; (2) పెట్రోలు నిలచి కాలకుండా టప్ అని పేలిపోవడం;
* knoll, n. తిప్ప; ఎత్తయిన ప్రదేశం; ఎత్తయిన మైదానం;
* knot, n. (1) ముడి; బంధనం; (2) నీటి మీద (గాలిలో) ప్రయాణం చేసేటప్పుడు వేగాన్ని కొలిచే ఒక కొలమానం; One knot equals one nautical mile per hour, or roughly 1.15 statute (or land-measured) miles per hour, one nautical mile equals one minute of latitude at the equator; A mile is an arbitrary measure of distance with no rational basis; In Roman times, a mile was defined as 1000 paces, a pace being 5 feet; A nautical mile is based on the length of one degree along the Equator;
** slip knot, ph. జారు ముడి;
** knotted hair, ph. సిగ; జుట్టు ముడి;
* knotty, adj. ముడిపడ్డ; చిక్కుపడ్డ; క్లిష్ట; ఇబ్బందికరమైన;
* know, v. i. (1) తెలుసుకొను; తెలుసు; ఎరుగు; (2) వచ్చు;
** know it, ph. తెలుసుకో;
** do not know, ph. తెలీదు; తెలియదు; రాదు;
** I know Telugu, ph. నాకు తెలుగు వచ్చు;
** I do not know Telugu, ph. నాకు తెలుగు రాదు;
* know-how, n. పరిజ్జానం; వేత్తృత;
* knowledge, n. (1) జ్ఞానం; బోధము; పరిజ్ఞానం; వైదుష్యం; పాండిత్యం; ప్రమ; సాంఖ్యం; (2) సారస్వతం; సాహిత్యం; విద్య; వేదం; (3) ఎరిక; ఎరుక; వేత్తృత;
** domain knowledge, ph. ప్రాదేశిక జ్ఞానం; విషయ పరిజ్ఞానం;
** half-baked knowledge, ph. మిడిమిడి జ్ఞానం;
** lack of knowledge, ph. అజ్ఞానం;
** scientific knowledge, ph. విజ్ఞానం;
** sound knowledge, ph. సుజ్ఞానం;
** thirst for knowledge, ph. జ్ఞాన పిపాస; ఆదిష్ట;
** knowledge base, ph. సాంఖ్య ఖని; జ్ఞాన ఖని;
* known, n. విదితం; తెలిసినది;
* knuckles, n. pl. చేతివేళ్ల కణుపులు; అంగుళీపర్వాలు; మెటికలు;
* knul koal, n. [Ind. Eng.] నవలకంద; ఒక రకం కూరగాయ;
[[File:R%C3%A4ndelwerkzeug.jpg|right|thumb|knurled wheel]]
* knurled, adj. కల్దారు; రూపాయ కాసు వంటి నాణేల అంచు చుట్టూ ఉండేటటువంటి గరుగ్గా ఉండే నగిషీ;
** knurled edge, ph. కల్దారు అంచు;
* kosher, adj. (1) యూదుల మతాచారం ప్రకారం వండబడ్డ; (2) న్యాయబద్ధం, చట్టబద్ధం, సాధు సమ్మతం అయిన;
* kowtow v. i. అతి వినయం ప్రదర్శించు; act in an excessively subservient manner; kneel and touch the ground with the forehead in worship or submission;
* kudos, n. అభినందన;
* krait, n. కట్లపాము; భారతదేశంలో కనపడే విషసర్పం; [biol.] Bungarus caeruleus;
* kymograph, n. తరంగలేఖిని; ఒక డ్రమ్ము చుట్టూ కాగితం చుట్టి దాని మీద కలంతో రాయడనికి వీలుగా అమర్చిన పరికరం; దీనితో పైకీ కిందకీ ఉన్న కదలికని కాగితం మీద చూపడానికి వీలు అవుతుంది;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
69eh6af3awx1xyic828tmseobifoui2
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/M
0
3004
39207
39142
2026-06-01T19:27:49Z
Vemurione
1689
/* Part 1: Ma-Me */
39207
wikitext
text/x-wiki
పరువు
<br />
=నిఘంటువు=
*This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as n added feature.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
==Part 1: Ma-Me ==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
'''
[[File:Blue-and-Yellow-Macaw.jpg|right|thumb|/Blue-and-Yellow-Macaw]]
* macaw, n. మాకా; రామ చిలుకని పోలిన పెద్ద చిలుక; దీని తొట్టతొలి జన్మస్థలం దక్షిణ అమెరికా ఖండం; [bio.] ''Ara ararauna'' of the Psittacidae family;
* mace, n. (1) గద; (2) జాపత్రి; జాజికాయ లోపల ఉన్న గింజ చుట్టూ వలలా ఉన్న కవచమే జాపత్రి; జాజికాయ ని nutmeg అనిన్నీ, జాపత్రిని mace అనిన్నీ అంటారు;
* machination, n. పథకం; కుట్ర;
* machine, n. యంత్రం; మర; జంత్రం; మిషను;
** sewing machine, ph. కుట్టు మిషను;
** machine learning, ph. యాంత్రికాభ్యాసం; యాంత్రిక అభ్యాసం; యంత్రాలకి స్వయం ప్రతిభతో పనులు చెయ్యడం ఎలాగో నేర్పే శాస్త్రం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: machine, appliance, device, gadget, tool.
* ---''Machine'' is a generic word for a piece of equipment that needs electricity or another type of power. An ''appliance'' is a large machine that is used in the home.'''
|}
*
* machinery, n. యంత్రాంగం; యంత్రసముదాయం;
* Machiavellian, n. మేకీవిల్లియం; కౌటిల్యం; కుటిల రాజనీతి;
* macro, adj. స్థూలమైన; పేద్ద; మహా;
* macrocosm, n. స్థూలప్రపంచం; విశ్వం; ప్రపంచం;
* macrophage, n. మహాబక్షణి; కణబక్షక కణాలలో కల్లా పెద్దగా తినమరిగిన కణం; ఈ కణాలు పైనుండి చొరబడ్డ సూక్ష్మజీవుల వంటి లాతి జీవులని, చచ్చిపోయిన స్వంత కణజాలన్నీ కబళించెస్తాయి;
* mad, n. పిచ్చి; వెర్రి; ఉన్మత్తత;
* madam, n. స్త్రీ;
* mademoiselle, n. (మేమ్యుజెల్) కుమారి; అవివాహిత;
* made, pt. & pp. make;
* madness, n. పిచ్చితనం; వెర్రితనం; ఉన్మత్తత;
* maelstrom, n. (1) సుడిగుండం; (2) గందరగోళమైన పరిస్థితి;
* mafia, n. ముష్కరమూక; చట్టవ్యతిరేకమైన పనులు చేసే రహస్య ముఠా;
* magazine, n. (1) పత్రిక; సంచికల వారీగా ప్రచురితమయే పత్రిక; (2) తుపాకీలో గుళ్ళు అమర్చే సొరుగులాంటి సదుపాయం; గుళ్ళగిడ్డంగి;
* maggot, n. ఈగ గుడ్డు; మక్షిక డింభం;
* magic, n. ఇంద్రజాలం; కనికట్టు; మాయ; మంత్రం;
** magic wand, ph. మంత్ర దండం;
* magician, n. ఇంద్రజాలికుడు; మాంత్రికుడు; మాయలాడి;
* magma, n. భూగర్భంలో ద్రవరూపంలో ఉండే రాయి; see also lava;
* magnate, n. ఘనుడు; అగ్రగణ్యుడు; పెద్ద;
** business magnate, ph. పెద్ద వ్యాపారస్తుడు;
* Magnesium, n. మగ్నం; [[మెగ్నీషియం|మెగ్నీసియం]]; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 12, సంక్షిప్త నామం, Mg);
** Magnesium sulfate, ph. మగ్నగంధకితం; మహాగ్నీషగంధకితము; MgSO<sub>4</sub>;
* magnet, n. సూదంటురాయి; అయస్కాంతం; స్కాంతం; లోహకాంతం; చుంబకం;
** bar magnet, ph. అయస్కాంతపు కడ్డీ; అయస్కాంత దండం; దండాయస్కాంతం;
** iron magnet, ph. అయస్కాంతం;
* magnetic, adj. అయస్కాంత తత్వం; చుంబక; చుంబకీయ;
** magnetic field, ph. అయస్కాంత క్షేత్రం;
** magnetic pole, ph. అయస్కాంత ధ్రువం;
* magnetism, n. (1) అయస్కాంత తత్వం; లోహచుంబకత్వం; (2) ఆకర్షణ;
* magnetite, n. కాకిరాయి; ఇనుము యొక్క ముడి పదార్థం; Fe<sub>3</sub>O<sub>4</sub>;
* magnetization, n. అయస్కాంతీకరణం; స్కాంతీకరణం; ఒక వస్తువుకి అయస్కాంతపు లక్షణాలు వచ్చేలా చెయ్యడం;
* magnetized, adj. అయస్కాంతీకృత;
* magnetosphere, n. అయస్కాంతావరణం; భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం;
* magnification, n. ఆవర్ధనం; పెద్దగా చెయ్యడం;
* magnitude, n. పరిమాణం; పరిమేయత; స్థూలత్వం; కాయస్తం; మహత్వం; ప్రాముఖ్యం; తరగతి;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: magnitude, brightness, absolute and apparent of stars
* ---నక్షత్రం నిజంగా ఎంత వెలుగుని వెలిగక్కుతున్నాదో చెప్పడం కష్టం; ఒక నక్షత్రం తన ఉపరితలం నుండి ఎంత కాంతిని వెదజల్లుతున్నాదో (దీనినే తేజస్సు లేదా luminosity అంటారు) ఆ నక్షత్రం ఉపరితలం దగ్గరకి వెళ్లి కొలవలేము కదా! కనుక ఆ నక్షత్రాన్ని ఒక ప్రామాణికమైన దూరంలో (అనగా 10 పార్సెక్కుల దూరంలో) నిలిపి చూసినప్పుడు కంటికి కనిపించే దీప్తి ఎంతుంటుందో అంచనా వేస్తాం. ఈ అంచనాని absolute magnitude of a star అని అంటారు; it is the brightness with which a star would appear if placed at a standard distance of 10 parsecs or 32.6 light-years; దీనిని మనం శుద్ధ దీప్తి (absolute brightness) అని కాని శుద్ధ శ్రేణి (absolute magnitude) అని కాని అందాం. ఆ నక్షత్రం తన నిజ స్థానంలో ఉన్నప్పుడు మన కంటికి కనిపించేది దృశ్య దీప్తి (apparent brightness) లేదా దృశ్య శ్రేణి (apparent magnitude).
* ఉదాహరణకి మృగవ్యాధుడు-ఎ భూమికి 8.6 జ్యోతిర్వషాల (light-years) దూరంలోఉన్నాడు. భూమి నుండి చూసినప్పుడు ఈ తార దృశ్య దీప్తి -1.46. ఇదే తారని 10 పార్సెక్కుల (= 32.6 జ్యోతిర్-వర్షాల) ప్రామాణిక దూరంలో నిలిపి చూస్తే కనిపించే శుద్ధ దీప్తి +1.4. మన సూర్యుడు భూమికి 8.0 జ్యోతిర్-నిమిషాల దూరంలో ఉన్నాడు. భూమి నుండి చూసినప్పుడు సూర్యుడి దృశ్య దీప్తి - 26.74. సూర్యుడిని 10 పార్సెక్కుల (= 32.6 జ్యోతిర్-వర్షాల) ప్రామాణిక దూరంలో నిలిపి చూస్తే కనిపించే శుద్ధ దీప్తి +4.83. కనుక సూర్యుడి కంటే మృగవ్యాధుడు స్వతహాగా చాలా ఎక్కువ దీప్తి అయిన నక్షత్రం; ఎంతో దూరంగా ఉండబట్టి మినుక్కు, మినుక్కు మంటూ కనబడుతోంది!'''
|}
*
** star of the first magnitude, ph. మొదటి తరగతి తార; మొదటి తరగతి తార ఆరవ తరగతి తార కంటె 100 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; మొదటి తరగతి తార రెండవ తరగతి తార కంటె 2.5 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; రెండవ తరగతి తార మూడవ తరగతి తార కంటె 2.5 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది; ఒక తరగతి తేడా ఉంటే వాటి ప్రకాశత్వంలో ఉరమరగా 100 కి పంచ-మూలం (fifth-root of 100) అంత తేడా ఉంటుంది. ఉదాహరణకి సిరియస్ నక్షత్రం ప్రకాశత్వం -1.47. అక్కడ నుండి 40 డిగ్రీలు ఈశాన్యంగా కనిపించే వసాత్ నక్షత్రం ప్రకాశత్వం 3.53. కనుక వసాత్ అయిదవ తరగతి నక్షత్రం అవుతుంది కనుక వసాత్ కంటె సిరియస్ ప్రకాశత్వం 100 రెట్లు ఎక్కువ!
** star of the fourth magnitude, ph. నాల్గవ తరగతి తార;
** magnitude of a star (absolute), ph. శుద్ధ శ్రేణి; శుద్ధ దీప్తి; పరమ ప్రకాశత్వం; నక్షత్రాన్ని 10 పార్సెక్ లు = 36.6 జోతిర్వషాల దూరంలో ఉంచితే ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తుందో అదే ఆ నక్షత్రం యొక్క పరమ ప్రకాశత్వం;
** magnitude of a star (apparent), ph. దృష్ట ప్రకాశత్వం; మామూలుగా నక్షత్రాన్ని కంటితో చూసినప్పుడు కనిపించే ప్రకాశత్వం; ఇది ఆ నక్షత్రం యొక్క స్వయం ప్రకాశత్వం మీదా, ఆ నక్షత్రానికీ, ప్రేక్షకునికీ మధ్య ఉండే దూరం మీదా ఆధారపడి ఉంటుంది; దీనిని బట్టే నక్షత్రం యొక్క తరగతి నిర్ణయిస్తారు;
* magnify, v. t. పెద్దదిగా చేయు;
** magnifying glass, ph. భూతద్దం;
* maid, n. (1) కన్య; వివాహము కాని బాలిక; (2) ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి;
** maid servant, ph. దాసి; పనిమనిషి; ఇంట్లో చిల్లరపనులు చేసే పనిమనిషి;
* maiden, n. కన్య; పెళ్లి కాని పిల్ల;
* maiden, adj. ప్రప్రథమమైన;
* maim, v. t. గాయపరచు; అంగవైకల్యం చేయు; అవిటిగా చేయు;
* main, adj. ప్రధాన; ముఖ్య;
** main points, ph. ముఖ్యాంశాలు;
* mainstay, n. ఆధారం;
* maintain, v. t. (1) కాపాడు; రక్షించు; పోషించు; (2) నడిపించు;
* maintainer, n. పరిపోషణ కర్త; సంరక్షకుడు; పోషకుడు;
* maintenance, n. (1) పరిపోషణ; సంరక్షణ; పోషణ; కాపు; భృతి; ఆలన; (2) భరణం; మనువర్తి; (3) నిర్వహణ;
* maize, n. మొక్కజొన్న; corn;
* majestic, adj. గంభీరమైన;
* major, n. యుక్తవయస్సు వచ్చిన వ్యక్తి; (ant.) minor;
* major, adj. భారీ; పెద్ద; దీర్ఘ;
* major axis, n. దీర్ఘ అక్షం; బృహదక్షం; దీర్ఘ వృత్తంలో కేంద్రం నుండి దూరబిందువు దిశలో గీసిన రేఖ;
* majority, n. (1) సంఖ్యాధికత్వం; అధికసంఖ్యాకులు; మెజారిటీ; (2) యుక్తవయస్సు; మెజారిటీ;
** silent majority, ph. అధికసంఖ్యాక మౌనభూషణులు;
* make, n. చేత; పని;
* make, v. t. చేయు;
** make believe, ph. నమ్మేటట్లు చేయు; నటన; కనుకట్టు;
* makeup, n. (1) [cinema] ముస్తాబు; అలంకరణ; అంగరచన; రూపశిల్పం; కైసేత; (2) నిర్మాణం; నిర్మాణక్రమం;
* mal, pref. తప్పు; చెడు; దుర్; వక్ర; కు; మల;
* Malabar catmint, n. మాభేరి; [bot.] ''Anisomeles malabarica'';
* Malabar nightshade, n. అల్లుబచ్చలి;
* Malabar nut, n. అడ్డసరం;
* malady, n. వ్యాధి; జబ్బు; రోగం;
* malaise, n. వ్యాకులత; ఆవేదన; అశాంతి; సుస్తీ; కారణం ఐడియాని చెప్పలేని అనారోగ్యపు స్థితి;
* malapropism, n. అర్థం లేని శబ్ద ప్రయోగం;
* malaria, n. మన్నెపు జ్వరం; కొండ జ్వరం; చలిజ్వరం; మలేరియా; (lit.) చెడుగాలి;
* male, adj. మగ; కోడె; పోతు; పుంజు; గండు;
** male bee, ph. పోతుటీగ;
** male buffalo, ph. ఎనుబోతు;
** male cat, ph. పోతుపిల్లి;
** male cuckoo, ph. గండు కోయిల;
** male elephant, ph. పోతుటేనుగు;
** male fowl, ph. పుంజు;
** male fox, ph. నక్కపోతు;
** male snake, ph. కోడె త్రాచు;
* male, n. మగవాడు; పురుషుడు; మగ జంతువు;
* malevolence, n. అక్షాంతి; [see also] envy;
* malice, n. ద్వేషం; కార్పణ్యం; ఈర్ష్య; జుగుప్స; శత్రుత్వం; పగ; దుష్టభావం;
* malicious, adj. ద్వేషపూరిత; ద్రోహచింతగల;
* malign, v. t. దుర్భాషలాడు; దూషించు;
* mall, n. అంగడిల్లు; ఒకే చోట అనేక విక్రయ సాలలు ఉన్న భవనం;
* malleable, adj. సుతిమెత్తని; సుత్తితో కొట్టుటవలన సాఁగునట్టి; అవాంతరనీవ్యత; ఒత్తిడి వల్ల రూపం మారే గుణం కల;
* mallet, n. కొయ్యసుత్తి; కొయ్యగూటం; కర్ర సమ్మెట; కాజం;
* malleus, n. కూటకాస్తి; మధ్య చెవిలో సుత్తి ఆకారంలో ఉండే ఒక చిన్న ఎముక;
* malnutrition, n. కుపోషణ; పోషణ చాలకపోవడం; పోషణచాలిమి;
* malodor, n. దుర్వాసన; దుర్గంధం; కంపు; నీచుకంపు; గవులు; పూతిగంధం; వసాగంధం; గబ్బు కంపు;
* malodorous, adj. పూతిగంధిల; వసాగంధిల; దుర్గంధ పూరిత; దుర్గంధమైన; కంపుకొట్టే;
* malt, n. నారు; మొలక; మోక; నిసువు; ఈరిక; ఉప్పిళ్లు; మొక్క మొలిచేవరకు నానబెట్టి ఎండబెట్టిన గింజలు; ఈ గింజలు ఏవైనా కావచ్చు (ఉ: గోధుమ, శనగ, బటానీ, బార్లీ, మొదలైనవి కాని అనేక కారణల వల్ల ఈ సందర్భంలో బార్లీని ఎక్కువ వాడతారు; Malt is a cereal grain, most commonly barley, that's soaked, germinated (sprouted), and then dried (kilned) to develop sugars and enzymes, making it sweeter and easier to digest, and is essential for brewing beer, distilling whiskey, making malted milk, and flavoring baked goods. The process, called malting, transforms the grain, adding flavors from nutty to chocolatey depending on the kilning temperature, while providing starches, proteins, and sugars for fermentation and brewing.
** malt liquor, ph. నారునీరా; మొక్క మొలిచే వరకు బార్లీ గింజలని నానబెట్టి, వాటితో చేసిన సారా;
* mammal, n. s. క్షీరదం; స్తన్యదం; పిల్లలకి పాలిచ్చే జంతువు; జరాయుజములు;
* mammalia, n. క్షీరదాలు; జీవశాస్త్రంలో క్షీరదాలు ఒక తరగతి (class);
* mammilla, n. ౘనుమొన;
* man, n. (1) మానవుడు; మనిషి; జంతువు కాదనే భావం; (2) మగాడు; పురుషుడు; స్త్రీ కాదనే భావం; (3) పెద్దవాడు; పిల్లవాడు కాడనే భావం;
** family man, ph. గృహమేధి; గృహస్థు;
** middle man, ph. మధ్యవర్తి;
** respectable man, ph. గృహమేధి;
* man-made, adj. పౌరుషేయము; మనిషి చేసినది;
* manage, v. t. నిర్వహించు; పెత్తనముచేయు; పరిపాలించు; అదుపులోపెట్టు; నడిపించు; నెట్టుకువచ్చు; అజమాయిషీ చేయు;
* manager, n. నిర్వాహకుడు; అధినేత; పెత్తందారు; అజమాయిషీదారు; వ్యవహర్త; ప్రవర్తకుడు; ఉపదర్శి; మేనేజరు; (rel.) యజమాని;
* management, n. అజమాయిషీ; అధ్వర్యం; నిర్వాకం; పెత్తనం; యాజమాన్యం; యోజన;
** financial management, ph. విత్తయోజనం;
* mandate, v. t. శాసించు; విధించు; ఆజ్ఞాపించు;
* mandatory, adj. విధాయకమైన; తప్పనిసరి;
* mandible, n. చిబుకాస్తి;
* mane, n. జూలు; గుర్రం, సింహం మొ. జంతువుల మెడమీద వెంట్రుకలు;
* man-eater, n. (1) నరమాంసానికి మరగిన పులి; (2) నరమాంస భక్షకుడు; పొలదిండి;
* maneuver, n. జిత్తు; యుక్తి; ఉపాయం;
* Manganese, n. మంగనం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 25, సంక్షిప్త నామం, Mn); [Lat. magnes = magnet];
* manger, n. కొల్లం; పశువులకు మేత వేసే తొట్టి;
* mango, n. (1) మామిడి; మావి; రసాలం; మాకంద పండు (2) మామిడిపండు; మామిడికాయ;
** mango jelly, ph. మామిడి తాండ్ర;
** mango juice, ph. మామిడి పండు రసం;
** mango fruit, ph. మామిడి పండు; మామిడి కాయ;
** mango stone, ph. మామిడి టెంక;
** mango pulp, ph. మామిడి పండు ముద్ద;
* mangoes, types of, ph. పలురకాల మామిడిపళ్ళు; చెరకు రసాలు; పెద్ద రసాలు; చిన్న రసాలు; పంచదార కలశ; ఎండ్రాసు; నూజివీడు రసాలు; సువర్ణరేֻఖ; బంగినపల్లి; కలక్టరు; జహంగీరు; కోలంగోవా; నీలాలు;
* mangrove, n. మడ; మడచెట్టు; నల్లమడ; సముద్రపు ఉప్పునీటి వాతావరణంలో పెరిగే నీటి చెట్లు;
** forest mangrove, ph. మడాడవి; మడారణ్యం;
* mania, n. వెర్రి; వేలంవెర్రి; వ్యామోహం; ఉన్మాదం; మేనియా; మేనియా అంటే డిప్రెషన్ కి వ్యతిరేకంగా ఉండే ఒక వింత మానసిక పరిస్థితి. మేనియాతో కూడిన డిప్రెషన్ ని బైపోలార్ డిజార్డర్ (Bipolar Disorder) అంటారు. బైపోలార్ డిజార్డర్ సంక్లిష్టమైనది,ప్రమాదమైనది; మేనియా లక్షణాలు కొన్ని: (1) అత్యుత్సాహం, అతిశక్తి, అతిసంతోషం (ఒకోసారి మనసులో చెప్పుకోలేని బాధ dysphoria); (2) నిద్ర లేమి (నిద్ర లేకపోయినా శక్తి తగ్గదు); (3) నిర్లక్ష్యం (అప్పులు చేయటం, జూదమాడటం, నగలు కొనెయ్యటం, వివాహేతర సంబంధాలు కలిగించుకోవటం);
(4) చాలా గొప్పవాడిని/దానిని అని భ్రమించడం (Delusions of grandeur); (5) ఆలోచనల పరంపరలు (Flight of ideas), ఒక ఆలోచన పూర్తికాకముందే మరొక ఆలోచన, ఏకాగ్రత లోపించడం;
** kleptomania, ph. దొంగతనం చెయ్యాలనే వెర్రి కోరిక; చౌర్యోన్మాదం;
** nymphomania, ph. విపరీతమైన లైంగిక వాంఛ;
* maniac, n. వెర్రివాడు; అదుపులో లేని బుద్ధులు కలవాడు; ఉన్మాది;
** kleptomaniac, ph. అసంకల్పచోరుడు; చౌర్యోన్మాది;
** nymphomaniac, ph. రిరంసువు; విపరీతమైన లైంగిక వాంఛగల స్త్రీ; see also succubus and incubus;
* manifestation, n. సాక్షాత్కారం; వ్యంజితం; వివర్తం; వ్యాకృతం; ఆవిర్భావం; వ్యక్తి;
* manifested, n. వ్యక్తము; వ్యంజితం;
* manifesto, n. ఆదర్శ తరంగిణి; ఆదర్శాలు రాసిన ప్రచురణ; ప్రణాళిక;
** communist manifesto, ph. కమ్యూనిష్టు వారి ఆదర్శాలు రాసిన ప్రచురణ;
** election manifesto, ph. ఎన్నికల ప్రణాళిక;
* manifold, n. (1) కారు ఇంజనులో ఒక భాగం; లోపల నుండి బయటకి రెండు, మూడు రంధ్రాలు ఉన్న గది; (2) [math.] a curved surface in a higher-dimensional space; a topologically closed surface or an analog of this in three or more dimensions; a flat surface in a higher-dimensional space is called a hyperplane;
* Manila envelope, ph. టపా చెయ్యడానికి అనుకూలమైన గోధుమ రంగు కాగితపు సంచి;
* mankind, n. మానవజాతి;
* manliness, n. మగతనం; మగటిమి;
* manner, n. తీరు; తరహా; వరస; వాటం; వైఖరి; వ్యవహారం; రీతి; విధం; ఫక్కీ; ప్రకారం; బాపతు; పగిది, pagidi
* manners, n. నడవడి; ప్రవర్తన;
* manor, n. భవనం;
* manpower, n. అంగబలం; బలగం;
* mansion, n. భవనం; సౌధం; హర్మ్యం; పటారం; హవేలీ;
* manslaughter, n. నరవధ; నరహత్య;
* mantel, n. తీనె;
* mantis, n. గొల్లభామ; మిడత;
** praying mantis, ph. దండాల మిడత;
* mantissa, n. ఘాతభిన్నాంకం;
* mantle, n. (1) ముసుగు; కప్పు; పైపొర; ప్రావారం; ఉత్తరీయం; వల్కలం; ఆచ్ఛాదనం; (2) ఒక రకం దీపపు వత్తి; (3) భూగర్భంలో ఉండే ఒక పొర;
** Earth's mantle, ph. భూ ప్రావారం;
* manual, adj.(1) కై; చేతి; కాయిక; కాయ; చేతికి సంబంధించిన; (2) మానవీయ; ఆటోమేటిక్ కాని;
** manual labor, ph. కూలి; కాయ కష్టం;
** manual support, ph. కై దండ;
** manual work, ph. కైసేత; చేతితో చేసే పని;
* manual, n. చేతి పుస్తకం; కైపొత్తం; a book of instructions, especially for operating a machine or learning a subject;
* mantis, n. గొల్లభామ; large, usually green, insects distributed worldwide in temperate and tropical habitats. They have triangular heads with bulging eyes supported on flexible necks. They feed on other insects and clasp their prey in forelimbs held up as if in prayer;
* mantle, n. (1) ముసుగు; కప్పు; వల్కలం; ఆచ్ఛాదనం; (2) ఒక రకం దీపపు వత్తి;
* manufacture, n. తయారీ; ఉత్పత్తి;
* manufacturers, n. ఉత్పత్తిదారులు; తయారీదారులు;
* manure, n. ఎరువు; గత్త; గొబ్బరం; పాంశువు;
** leaf manure, ph. ఆకెరువు;
** cow manure, ph. పేడెరువు; సస్యార్ధసంచిత గోమయం;
* manuscript, n. చేతితో రాసినది; చేతితో రాసిన గ్రంథం; (rel.) typescript;
* many, adj. చాల; ఎన్నో; పెక్కు; పలు; అనేక;
** many people, ph. ఎంతోమంది; పెక్కురు; పలువురు; అనేకులు;
* map, n. దేశపటం; నక్ష; మానచిత్రం; మేరతేనం; మేపు;
* mar, v. t. పాడుచేయు; చెడగొట్టు;
* maraud, v. i. కొల్లగొట్టు;
* marble, n. (1) పాలరాయి; చలువరాయి; సున్నపురాయి; సంగమల; (2) గోలీకాయ; అల్లికాయ;
* march, v. i. నడుచు; పోవు;
* march, v. t. నడిపించు;
* mare, n. (1) ఆడగుర్రం; ఘోటిక; గోడిగ; బడబ; (2) ఆడ గాడిద;
** mare's nest, ph. [idiom] గాడిద గుడ్డు; అసంభవమైనది; కుందేటి కొమ్ము;
* margarine, n. వనస్పతి; మార్జరీను; a soft hydrogenated oil;
* margin, n. బద్దె; అంచు; ఉపాంతం; వార; మార్జిన్;
** bottom margin, ph. నీచోపాంతం;
** left margin, ph. వామోపాంతం; ఎడమ అంచు;
** right margin, ph. కుడి బద్దె; కుడి అంచు; దక్షిణోపాంతం;
** top margin, ph. మీద బద్దె; మీద అంచు; శీర్షోపాంతం;
* marginal, adj. (1) ఉపాంతర; అంచున వ్రాసిన; (2) బొటాబొటీ; పరిమిత; నామమాత్ర;
** marginal output, ph. ఉపాంతర ఉత్పాదన;
** marginal return, ph. ఉపాంతర లబ్ది;
* marginalization, n. ఉపాంతీకరణ; ఒక సమూహంలో కొందరిని తక్కువ ప్రాముఖ్యత లేదా ద్వితీయ స్థానానికి బదిలీ చేసే ప్రక్రియ;
* marginalize, n. ఉపాంతరీకరించు; ఉపాంతీకరించు;
* margosa, n. వేప; same as neem;
* Mariana trench, n. మరియానా కందకం;
* marigold, n. బంతి; బంతిపువ్వు;
* marinate, v. t. ఊరబెట్టు;
* marine, adj. సాగర;
* mariner, n. నావికుడు;
* marital, adj. వైవాహిక; దాంపత్యపు;
** marital problems, ph. దాంపత్యపు స్పర్ధలు;
* marjoram, n. (1) మరువం; (2) పాశ్చాత్యదేశాల వంటలలో వాడే ఒక సుగంధ పత్రి; [bot.] Origanum marjorana; ok
* marijuana, n. గంజాయి; మేరువానా; [bot.] ''Cannabis sativa''; గంజాయి మొక్క నుండి వచ్చిన మొగ్గలు, పువ్వులు, ఆకులు, వగైరా ని ఎండబెట్టి. చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు; (rel.) హషీష్ అన్నది గంజాయి మొక్క నుండి స్రవించే పాలని ముద్దలా చేసి అమ్ముతారు; దీనిని కూడా చుట్టల మాదిరి చుట్టి కాల్చుతారు;
* mark, n. (1) సూచిక; కెతనం; ఆనవాలు; (2) మరక; (3) గుణాంకం; మార్కు;
** diacritical mark, ph. శబ్దసూచిక; శబ్దలక్షణ సూచిక;
** first mark, ph. ప్రథమ గుణాంకం;
* mark, v. t. గుర్తువేయు;
* Markab, n. పూర్వాభాద్ర; ఒక నక్షత్రం పేరు;
* marker, n. సాభిజ్ఞానం; గుర్తు;
* market, v. t. అమ్ము; విక్రయించు;
* market, n. సంత; అంగడి; బజారు; విపణి; మార్కెట్;
** black market, ph. నల్ల బజారు; చీకటి వ్యాపారం;
** black money, ph. అక్రమ సంపాదనలో వచ్చిన డబ్బుని నల్ల డబ్బు అంటారు; నల్ల డబ్బును ఆదాయ వనరులలో చూపకుండా దాచిపెట్టు విధానము
మనీ లాండరింగ్ అంటారు; మన దేశమున దీనిని హవాలా కార్య కలాపాలు అని కూడా పిలుస్తారు;
** fish market, ph. మైలసంత; చేపల బజారు;
** meat market, ph. మైలసంత;
** vegetable market, ph. మడిసంత;
** market street, ph. విపణి వీధి; అంగడి వాడ;
* marketable, adj. అమ్ముడు పోగల;
* marketing, n. విక్రయం; వ్యాపారప్రచారం; క్రయవిక్రయాదులు;
* marking nut, n. నల్ల జీడిపిక్క;
* marks, n. గుణాంకాలు; అంకాలు; పరీక్షలో వచ్చే “మార్కులు”;
* marmalade, n. same as fruit preserve; పండ్ల రసం, గుజ్జు, తొక్కలు అన్నీ కలిపి పాకంపట్టి నిల్వ ఉండేటట్లు చేసిన పదార్ధం.
* maroon, n. ముదరెఱుపు రంగు;
* marriage, n. వివాహం; పెండ్లి; పెళ్ళి; దాంపత్యం; ఉద్వాహం; ఉద్వహం; ఉద్వాహనం; ఉద్వహనం; (rel.) wedding;
** hypergamous marriage, ph. అనులోమ వివాహం;
** hypogamous marriage, ph. ప్రతిలోమ వివాహం;
* marrow, n. (1) మజ్జ; మూలుగు; మేద; మేదస్సు; కుల్యిక; అస్థిసారం; ఎముక సొన; ఎముకల లోపల ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం; (2) దవ్వ;
* marry, v. i. వివాహమాడు; చేపట్టు; పెండ్లి చేసుకొను; పెండ్లాడు; చేసుకొను;
* marry, v. t. వివాహం చేయు; పెండ్లి చేయు;
* Mars, n. అంగారకుడు; అంగారక గ్రహం; మంగళ గ్రహం; కుజుడు;
* marsh, n. చిత్తడినేల; పంకభూమి; మురుగునేల; ఉబ్బనేల; పర్ర; కరవాక;
** salt marsh, ph. కరవాక;
** marsh gas, ph. చిత్తడి వాయువు; పంక వాయువు;
[[File:Trainyard.bradleygee.jpg|thumb|right|మారుగుళ్ల దొడ్డి]]
* marshalling yard, n. మారుగుళ్ల దొడ్డి; రైలు పెట్టలని ఒక వరసలో అమర్చడానికి వాడే ప్రదేశం;
* mart, n. వ్యాపారస్థలం; కొట్టు; షాపు;
* martin, n. ఏట్రింత పిట్ట;
* martynia, n. తేలుకొండి కాయ;
* martyr, n. త్యాగాళువు; త్యాగి; తన లక్ష్యసిద్ధికి ప్రాణాన్ని త్యాగం చేసిన వ్యక్తి;
* marvel, n. వింత; విడ్డూరం; విచిత్రం; అద్భుతం;
* mascara, n. కాటుక; కళ్ళకి పూసుకునే ఒక అలంకారం; అంజనం;
* macerated, adj. భావన; నానబెట్టిన; ఊరబెట్టిన;
** macerated ginger, ph. భావన అల్లం; పంచదారలో ఊరబెట్టిన అల్లం;
* masculine, adj. మగ; పుంభావ; పుం;
** masculine gender, ph. పుంలింగం;
* masculinity, adj. మగతనం; మగటిమి; పుంభావం;
* mashed, adj. ఎనిపిన; ముద్ద చేసిన;
* mask, n. ముసుగు; ప్రచ్ఛాదకి; బురఖా;
* mask, v. t. ముసుగు వేయు; కప్పు; ప్రచ్చాదించు;
* masochism, n. ఆత్మ హనన కారుణ్యం; మజోకిస్టులా ప్రవర్తించే తత్వం; తన శరీరానికి బాధ కలిగించే పనులు జరిగితేనే కాని రతి క్రీడలో ఆనందం పొందలేని వింత మానసిక తత్వం; తనకు హాని జరిగే విధంగా ప్రవర్తించే తత్వం; see also sadism;
* masochist, n. మజోకిస్టు; శరీరానికి బాధ కలిగించే పనులు జరిగితేనే కాని రతి క్రీడను ఆనందించలేని వ్యక్తి; తనకే హాని జరిగే విధంగా ప్రవర్తించే వ్యక్తి;
* mason, n. తాపీ పనివాడు; కాసీదు; కాసే పనివాడు; రాతి పనివాడు; ఇటిక పనివాడు; కుడ్యకారుడు;
* mason's level, n. మూలమట్టం;
* masonry, n. కట్టడం; రాతి కట్టడం; ఇటిక కట్టడం;
** brick masonry, ph. ఇటిక కట్టడం;
** stone masonry, ph. రాతి కట్టడం;
* mass, adj. తండ; సామూహిక; మూకుమ్మడి;
** mass action, ph. తండ చర్య;
** mass arrests, ph. మూకుమ్మడి నిర్భంధాలు; మూకుమ్మడి ఆపుదలలు;
** mass burial, ph. సామూహిక ఖననం; తండ ఖననం;
** mass number, ph. గరిమ సంఖ్య; ఒక మూలకపు అణుగర్భంలో ఉండే ప్రోటానులు, నూట్రానుల మొత్తపు సంఖ్య; ఉదాహరణకి సాధారణ కర్బనంలో 8 ప్రోటానులు, 4 నూట్రానులు ఉంటాయి కనుక కర్బనం గరిమ సంఖ్య 12; ఒక మూలకానికి సమభాగులు ఉన్నయెడల ప్రోటానులని, నూట్రానుల సగటు విలువని కలపగా వచ్చిన సంఖ్య;
* mass, n. రాసి; ద్రవ్యరాసి; ధుర; తండం; పుద్గాలం; గరిమ; ముద్ద; భారం; కాయస్థం;
** center of mass, ph. గరిమనాభి;
** inertial mass, ph. గరిమ గురుత్వం; జడత్వ గురుత్వం;
* massacre, n. జనసంహారం; నరమేధం;
* massage, n. మర్దనా; మాలీసు; సంవహనం;
* massage, v. t. మర్దనా చేయు; మాలీసు చేయు; ఒత్తు; పిసుకు;
* masseur, n. m. సంవాహకుడు; అంగమర్ధనుడు; మర్దనా చేసే పరిచారకుడు;
* masseuse, n. f. మర్దనా చేసే పరిచారిక; సంవహనకి;
* masses, n. జనాలు; ప్రజ; ప్రజానీకం; మంది; జనసామాన్యం; జనబాహుళ్యం; జనసందోహం;
* massive, adj. గురుతరమైన; స్థూల;
* massiveness, n. గురుత్వం; గరిమత్వం; భారీతనం;
* mast, n. కూపకం; స్తంభం; తెరచాప కొయ్య; కంబం;
* master, n. (1) యజమాని; ఓజు; ఖామందు; (2) గురువు; ఆచార్య; (3) ప్రవీణుడు; నేర్పరి; (4) సంధాత;
** master of ceremonies, ph. కార్యక్రమపు సంధాత;
** master plan, ph. బృహత్ ప్రణాళిక; పెద్ద ప్రణాళిక;
* masterpiece, n. కళాఖండము;
* masticate, v. t. నములు;
* mastication, n. నములుట; చర్వణం;
* mastitis, n. స్తనసోఫ; స్తనముల వాపు;
* masturbation, n. ముష్టిమైథునం; హస్తప్రయోగం; మర్మస్థానాలని చేతితో తాకి లైంగిక కోర్కెలు తీర్చుకోవడం;
* mat, n. చాప; కిలంజం;
** mat for meditation, ph. చిత్రాసనం;
* match, n. (1) అగ్గిపుల్ల; (2) ఉజ్జీ; ఉద్ది; జత; సమానమైనది; ఎన; పొంతన; (3) ఆట; పందెం; ఎదురు; పోటీ; (4) సంబంధం; వివాహనిర్ణయం;
* matchbox, n. అగ్గిపెట్టె;
* matchstick, n. అగ్గిపుల్ల;
* matching, adj. నప్పిన; జోడు కుదిరిన;
* matchless, adj. ఎనలేని; సాటిలేని; అతులిత;
* matchmaker, n. పెళ్ళిళ్ళ పేరయ్య;
* mate, n. భార్య; సహధర్మచారిణి; భార్య; సహధర్మచారుడు; సహాధ్యాయి; సహాధ్యాయుడు;
* mate, v. i. జత చేరు; వివాహం చేసికొను; రతిక్రీడ చేయు;
* Materia medica, n. పదార్థ గుణ సంహిత; ఔషధ లక్షణ సంగ్రహం; వస్తుగుణ ప్రకాశిక; వస్తుగుణ దీపిక;
* material, adj. భౌతికమైన; స్థూల; వస్తు; ఉపాదాన; పాదార్థిక;
** material body, ph. స్థూల దేహం;
** material cause, ph. ఉపాదాన హేతువు; పాదార్థిక హేతువు;
** material reason, ph. పాదార్థిక కారణం;
** material resources, ph. భౌతిక వనరులు;
** material world, ph. భౌతిక ప్రపంచం; స్థూల ప్రపంచం;
** material universe, ph. భౌతిక ప్రపంచం; వస్తు ప్రపంచం;
* material, n. (1) పదార్థం; సరుకు; సంభారం; (2) విషయం; (3) గుడ్డ;
** raw material, ph. ముడిపదార్థం; ముడిసరుకు; ముడి సంభారాలు;
* materialist, n. కుక్షింభరుడు; కుక్షింభరి; భౌతికవాది; ప్రత్యక్షంగా కనిపించేదే ప్రధానమని వాదించే వ్యక్తి; అనాత్మవాది; లోకాయతికుడు;
* materialistic, adj. కుక్షింభర; ప్రాపంచిక; భౌతిక; లోకాయత;
* materialism, n. కుక్షింభరత్వం; భౌతికవాదం; లోకాయతం; భోగలాలసం;
* materialize, v. i. (1) జరుగు; సంభవించు; (2) మూర్తీభవించు; కార్యరూపం దాల్చు; అకస్మాత్తుగా కనబడు;
* maternal, adj. తల్లివైపునుండి; తల్లికి సంబంధించిన;
** maternal uncle, ph. మేనమామ;
** maternal uncle's daughter, ph. మేన వదిన; మేన మరదలు;
** maternal uncle's son, ph. మేనబావ; బావ;
** maternal uncle's wife, ph. మాతులాని; అత్త; అత్తమ్మ;
** maternal grandmother, ph. అమ్మమ్మ;
* maternity, adj. గర్భవతికి సంబంధించిన; ప్రసవానికి సంబంధించిన; పురిటికి సంబంధించిన; ప్రసూతి;
** maternity hospital, ph. ప్రసూతి వైద్యశాల;
** maternity ward, ph. పురుళ్ల వార్డు; ప్రసూతి విభాగం;
* mathematical, adj. గణితాత్మక; గణిత; లెక్కల;
** mathematical brain, ph. లెక్కల బుర్ర;
** mathematical operation, ph. గణితాత్మక సంక్రియ; గణితాత్మక పరికర్మ;
* mathematics, n. గణితం; లెక్కలు; గణిత శాస్త్రం; అంకశాస్త్రం; అంకవిద్య; అంకతంత్రము; ధూలికర్మ;
* mathematician, n. గణిత శావేత్త; గణితాచారి;
* matinee, n. పగటాట;
* matriarch, n. f. మూలమగువ; కుటుంబానికి అధిపతిగా ఉన్న స్త్రీ;
* matriarchal, n. మాతృస్వామ్య; మాతృతంత్ర; మాతృయజమాన;
* matriarchy, n. మాతృస్వామ్యం; మాతృతంత్రం; మాతృ అధికారం;
* matricide, n. మాతృ హత్య; మాతృఘాతం;
* matrix, n. (1) అచ్చు; మూస; వరుధారణి; ప్రస్థారం; (2) చిక్కు; అల్లుడు; పడుగు, పేకలతో అల్లబడ్డది; (3) మాతృక; అడ్డు వరుసలు, నిలువు వరుసలు ఉన్న ఒక గణిత విన్యాసం; (ety.) an arrangement of ites with rows and columns; (4) ఖనిజ నిక్షేపాలతోపాటు కనిపించే శిలామయ, మృత్తికామయ నేపథ్య పదార్థం;
** matrix algebra, ph. మాత్రిక బీజగణితం;
* matter, n. (1) పదార్థం; ద్రవ్యం; మూర్త వసువు; (2) విషయం; బాపతు; ఎడాటం;
** anti matter, ph. నిష్‌పదార్థం; ప్రతిపదార్థం;
** dark matter, ph. కృష్ణపదార్థం; అజ్ఞాత పదార్థం; గుప్త పదార్థం;
* mattress, n. పరువు; తల్పం; తలిమం;
* matty, adj. చాపీయ; చాపలా ఉన్న; అల్లబడ్డ;
** matty cloth, ph. అల్లినట్టు కనిపించే బట్ట;
* mature, adj. ఎదిగిన; ఈడువచ్చిన; ముదిరిన; పక్వమైన; పండిన; ముగ్గిన; సిద్ధమైన; తయారైన; ప్రౌఢ;
* maturity, n. ఈడు; పరిపక్వత; పరిపాకం; ప్రౌఢిమ; ప్రౌఢత్వం;
* maul, v. t. చీల్చి చెండాడు;
* mausoleum, n. మసోలీ; అద్భుతమైన గోరీ; సమాధి;
* maw worm, n. నులి పురుగు;
* maxilla, n. దవడలు;
* maxi, pref. పెను; పెద్ద;
* maxim, n. సూక్తి; నీతివాక్యం; పన్నా; నిజం అని అందరూ ఒప్పుకున్న సూత్రం; see also paradox;
* maximization, n. గరిష్టీకరణం;
* maximum, n. అత్యధికం; గరిష్ఠం; పరమం; మహత్తమం; ఊర్ధ్వతమం;
** maximum limit, ph. గరిష్ఠ పరిమితి;
* maze, n. చిక్కు; వ్యూహం;
* meadow, n. మైదానం; పచ్చిక బయలు; క్షేత్రం; బీడు;
* meager, n. చాలీచాలని; బహుకొద్దిగా;
* meal, n. (1) భోజనం; బోనం; భుక్తి; కూడు; ప్రాశనం; ఒక నిర్ధిష్టమైన వేళకి తినే తిండి; (2) పిండి;
** corn meal, ph. మొక్కజొన్న పిండి;
* meals, n. భోజనాలు; బోనాలు;
* mealtime, n. భోజనాల వేళ;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage note: mealtime
* ---The first meal of the day is ''breakfast'', which is eaten after getting up. ''Lunch'' is the meal that is eaten around 12.00 p.m. In most western countries, ''dinner'', which is eaten around 6.00 p.m., is the main meal of the day. ''Supper'' is an informal or light evening meal. ''Brunch,'' a hybrid between breakfast and lunch, is eaten fairly late in the morning.'''
|}
*
* mean, adj. నీచ; అల్పబుద్ధిగల;
** mean fellow, ph. నీచుడు; లుచ్ఛా;
* mean, n. సగటు; సరాసరి;
** arithmetic mean of x and y = (x+y)/2;
** geometric mean of x and y = sqrt(x times y);
* meander, v. i. మెలికలు తిరుగు;
* meandering river, n. తిరుగుళ్ల గంగ;
* meaning, n. అర్థం; ఉద్దేశం; భావం; తెల్లం;
** figurative meaning, ph. గౌణార్థం; ఉద్దిష్టార్థం;
** literal meaning, ph. వాచ్యార్థం; శాబ్దికార్థం;
** precise meaning, ph. రూఢ్యర్థం;
** special meaning, ph. విశిష్టార్థం;
** word by word meaning, ph. ముక్కస్య ముక్కార్థం;
* meaningful, adj. సార్థక; అర్థవంత; అర్థయుక్త;
* meaningfulness, n. సార్థక్యం; అర్థవంతం; అర్థయుక్తం;
* meaningless, adj. అర్ధంలేని; అర్థరహిత; నిరర్థక; భావశూన్య; కదర్థ;
** meaningless task, ph. అర్ధంలేని పని;
* means, n. సాధనం; తెరువు; మార్గం; వెరపు;
* meanwhile, adv. అందాకా; అంతలో; ఈలోగా;
* measles, n. పొంగు; తట్టు; రోమాంతిక; చిన్న అమ్మవారు; ఎర్రని నూకల వంటి తట్టుతో ఒక జాతి వైరస్ వల్ల వచ్చే జబ్బు; (rel.) chicken pox;
* measure, n. (1) కొలత; మానం; ప్రమ; ప్రమాణం; ప్రస్థం; తన్మాత్ర; (2) కొలబద్ధ;
* measurement, n. కొలత; మితి; మానం; మాపనం; కొలువడి;
* measuring, adj. కొల; కొలత;
** measuring cup, ph. కొలమానిక; ప్రస్థమానం;
** measuring instrument, ph. కొలమాపకం;
** measuring jar, ph. కొలజాడీ; కొలముంత; ప్రస్థమానం;
** measuring rod, ph. కొలబద్ధ; మానదండం;
** measuring tape, ph. కొలపట్టీ; మానసూత్రం;
** measuring tool, ph. కొలముట్టు;
** measuring vessel, ph. కొలజాడీ; కొలత గిన్నె; ప్రస్థమానం;
** measuring wire, ph. కొలత్రాడు; మానరజ్జువు;
* meat, n. మాంసం; పొలసు; పిసితం; పలం;
** chicken (meat), ph. కోడిమాంసం;
** mutton (meat), ph. మేఁకమాంసం;
** beef (meat), ph. గోమాంసం; గొడ్డుమాంసం;
** pork (meat), ph. పందిమాంసం;
** human (meat), ph. పొల; నరమాంసం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: Meat
* --- The meats of some animals have special names: The meat from a cow (or bull or ox) is ''beef.'' The meat from a calf is ''veal.'' The meat from a pig is ''pork'' or ''ham.'' The meat from a goat is ''mutton.'' The meat from a deer is ''venison.'' Usually the meat from birds is same as the bird’s name: chicken, duck, etc.'''
|}
*
* meatless, adj. ఆమిష శూన్య;
* mechanic, n. యంత్రసూరి;
* mechanical, adj. యంత్ర; యాంత్రిక; కీలు;
** mechanical advantage, ph. యంత్రలాభం;
** mechanical behavior, ph. యాంత్రిక ప్రవర్తన;
** mechanical doll, ph. కీలు బొమ్మ; మర బొమ్మ;
** mechanical energy, ph. యాంత్రిక శక్తి;
** mechanical horse, ph. కీలు గుర్రం;
* mechanic, n. యంత్ర సూరి; యంత్రములని మరమ్మత్తు చేసే వ్యక్తి;
* mechanics, n. యాంత్రిక శాస్త్రం; యంత్ర శాస్త్రం; యంత్రగతి శాస్త్రం; ప్రయోగించిన బలాన్ని, దానివల్ల కలిగే కదలికనీ అధ్యయనం చేసే శాస్త్రం; (note) mechanics is that area of science concerned with the behaviour of physical bodies when subjected to forces or displacements;
** celestial mechanics, ph. ఖగోళ యంత్రగతి శాస్త్రం; ఖగోళ యంత్రశాస్త్రం; నక్షత్రాలు, గ్రహాలు, ఇతర ఖగోళ శాల్తీల కదలికలకి సంబంధించిన శాస్త్రం
** classical mechanics, ph. సంప్రదాయక యంత్రగతి శాస్త్రం; సంప్రదాయక యంత్రశాస్త్రం;
**. fluid mechanics, ph. ప్రవాహి యంత్రశాస్త్రం;
** Hamiltonian mechanics, ph. హేమిల్టనీయ యంత్రశాస్త్రం;
** Lagrangian mechanics, ph. లగ్రాంజీయ యంత్రశాస్త్రం;
** Newtonian mechanics, ph. నూటనిక యంత్రశాస్త్రం;
** orbital mechanics, ph. కక్ష్యలని నిర్ణయించే యంత్రశాస్త్రం;
** quantum mechanics, ph. గుళిక యంత్రశాస్త్రం; క్వాంటం యంత్రశాస్త్రం;
** relativistic mechanics, ph. సాపేక్ష యంత్రగతి శాస్త్రం; సాపేక్ష యంత్రశాస్త్రం; కాంతి వేగం దరిదాపుల్లో ప్రయాణించే రేణువుల కదలికలకి సంబంధించిన శాస్త్రం
** statistical mechanics, ph. సాంఖ్యక యంత్రశాస్త్రం; పదార్థాల సమూహ ఉష్ణగతి లక్షణాల గురించి వివరించే శాస్త్రం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: Difference between Newtonian and Lagrangian mechanics
* --- Newtonian mechanics starts with the three laws, but mathematically, the important one is 𝐹 = 𝑚𝑥¨. When Newton discovered the laws of motion, he had no idea about Lagrangian mechanics (in fact, Lagrange came almost 50 years after his death), so at the time, the laws were essentially empirical laws. So when you first learn about them, you’re usually just told, F = ma is just true.
* --- Lagrangian mechanics start from a deeper principle and through which, you can derive Newton’s laws. We start with a scalar function of position and velocity (as a function of position) which basically encodes possible paths in space (so you also need to add in a "start" point and an "end" point). Lagrangian mechanics then asks: “I have all these possible paths in space, how do I select a path that is physically correct?”'''
|}
*
* mechanism, n. యంత్రాంగం; సంవిధానం;
** balance mechanism, ph. సంతులన యంత్రాంగం;
* mechanized, adj. యంత్రసజ్జిత;
* medal, n. పతకం; బిరుదుబిళ్ళ; మెడలు;
* media, n. pl. [phys.] (1) యానకాలు; (2) మాధ్యమాలు; ప్రసార మాధ్యమాలు; (sing.) medium;
** multimedia, ph. బహుళ మాధ్యమాలు;
** yellow media, ph. పచ్చ మాధ్యమాలు; ప్రజలని ఉద్రేకపరచడానికి నిజంతో నిమిత్తం లేకుండా రంగురంగుల బొమ్మలతోటీ, పతాక శీర్షికలతోటీ వార్తలని ప్రసారం చెయ్యడం;
* median, n. నడిమి; మధ్య రేఖ;
* median strip, ph. రహదారి యొక్క ఇరువైపుల బాటలకీ మధ్యనున్న జాగా;
* mediation, n. మాధ్యస్థం; మధ్యవర్తిత్వం;
* mediator, n. మధ్యవర్తి; మాధ్యస్థుడు;
* medical, adj. వైద్యసంబంధమైన; ఆరోగ్య సంబంధమైన;
** medical treatment, ph. చికిత్స;
* medicated, adj. ఔషధీకృత;
* medicine, n. (1) (మెడ్సిన్) మందు; ఔషధం; ఆయుర్‌ద్రవ్యం; (2)(మెడిసిన్) వైద్యశాస్త్రం; వైద్య విద్య;
* medicinal, adj. ఔషధీయ; రోగనాశక; మందులకు పనికివచ్చే;
** medicinal herb, ph. ఓషధి;
* meditation, n. మననం; జపం; ధ్యానం; ఉపాసన;
** meditation room, ph. మనన మందిరం; ధ్యాన మందిరం;
* medium, adj. మధ్యస్థమైన;
* medium, n. (1) యానకం; (2) మాధ్యమం;
** aqueous medium, ph. జల మాధ్యమం; నీటి మాధ్యమం;
** communication medium, ph. ప్రసార మాధ్యమం; ప్రసార యానకం;
** organic medium, ph. కర్బన మాధ్యమం;
** reaction medium, ph. చర్యా మాధ్యమం;
** Telugu medium, ph. తెలుగు మాధ్యమం;
* Mediterranean sea, n. మధ్యధరా సముద్రం; నడిపుడమి కడలి;
* Medulla, n. దవ్వ; దూట; ఏ శరీరాంగానికి అయినా అంతర్భాగంలో ఉండే కట్టడం;
** Medulla oblongata, ph. మజ్జా ముఖం; మెదడు వెనక ఉండి మన శ్వాసని నియంత్రించే ఒక కట్టడం;
* medulloblastoma, n. చిన్న పిల్లలకి మెదడులో వచ్చే ఒక రకమైన కేన్‌సరు కంతి;
* meet, v. t కలుసుకొను; తగులు;
* meeting, n. సభ; సమావేశం; కలయిక; మీటింగు;
** closed-door meeting, ph. జనాంతిక సమావేశం;
** orientation meeting, ph. దృగ్విన్యాస సమావేశం;
** summit meeting, ph. శిఖరాగ్ర సమావేశం;
* mega, adj. మహత్; బృహత్; స్థూల; మెగా;
* Mega, pref. (1) మిలియను; 1,000,000; (2) కంప్యూటరు రంగంలో మెగా అంటే 1,048,576=220;
* Megabits, n. మిలియను ద్వింకములు; కంప్యూటరు రంగంలో మాత్రం 1,048,576=220 ద్వింకములు; మెగా బిట్లు;
* Megrez, n. అత్రి నక్షత్రం; సప్తర్షి మండలం (Big Dipper) లో కాంటివిహీనమైన తార;
* melanosis, n. శరీరపు రంగు నల్లగా మారటం; మెలనిన్ తయారీ ఓపం వల్ల వచ్చే లక్షణం;
* melee, n. (మేలే) తొక్కిసలాట;
* mellifluous, adj. తేనెవలె తియ్యనైన; మధురమైన; కోమలమైన; శ్రావ్యమైన; ఇంఫైన; తియ్యని ప్రవాహముకల;
* melodrama, n. మోతాదు మించిన ఉద్వేగంతో, సాధారణంగా సుఖాంతం అయే నాటకం కాని, సినిమా కాని; నాటకీయత ఎక్కువ, పాత్ర పోషణ తక్కువ ఉన్న నాటకం కాని, సినిమా కాని; ఎత్తిపొడవడానికి వాడే మాట; A melodrama is a story or play in which there are a lot of exciting or sad events and in which people's emotions are very exaggerated. Key constitutive factors: pathos, overwrought or heightened emotion, moral polarization (good vs. evil), non-classical narrative structure (e.g., use of extreme coincidences);
* melodious, adj. శ్రావ్య; శ్రవణపేయ; కర్ణపేయ; సుశ్రావ్య;
* melody, n. శ్రావ్యత; రక్తి; మాధుర్యము; స్వర మాధుర్యం; a sweet and agreeable relation between successive notes; The fundamental difference between Western and Indian classical music is that the latter is based on melody. Melody means ``one note at a time.'' Western Classical music, on the other hand, is based on harmony; పాశ్చాత్య సంగీతం ప్రధానంగా హార్మనీ (Harmony) ఆధారితం. అంటే, ఒకే సమయంలో పలువురు గాయకులు లేదా వాయిద్యాలు కలిసి వినిపించే స్వరాల సమాహారాన్ని హార్మనీ అంటారు. ఒర్కెస్ట్రా సంగీతం పూర్తిగా హార్మనీపై ఆధారపడి ఉంటుంది.
* melon, n. కర్బూజా; పుచ్చపండు; తర్బూజా;
** muskmelon, ph. కర్బూజా; పుచ్చపండు;
** watermelon, ph. పుచ్చపండు;
* melt, v. i. కరుగు; v. t. కరగించు; చలించు;
* melting point, ph. కరుగు స్థానం; ద్రవీభవన స్థానం; కరిగే ఉష్ణోగ్రత;
* member, n. సభ్యుడు; సభ్యురాలు; కూటరి; మెంబరు;
* membrane, n. పొర; త్వచం; త్వక్కు; పటలం; కుబుసం; జిలి;
** cell membrane, ph. కణ త్వచం; కణ పటలం;
* meme, n. అనుకరణ; హాస్యానుకరణ; అంతర్జాలంలో ఒకరిని చూసి మరొకరు అనుకరించడం; an image, video, piece of text, etc., typically humorous in nature, that is copied and spread rapidly by internet users, often with slight variations; a word coined by Richard Dawkins, the evolutionary biologist, to represent a unit of "social gossip" (that rhymes with gene) that gets mutated and transmitted in social circles;
* memento, n. జ్ఞాపిక; స్మృతి చిహ్నం;
* memo, n. రాసిన ప్రతిపాదన; short for memorandum;
* memorable, adj. చిరస్మరణీయ;
* memorandum, n. నివేదిక; వినతిపత్రం; విన్నపం; మనవి; విజ్ఞాపన; యాదాస్తు; జ్ఞాపిక; స్మరణలేఖ్యం; గిల్లుపత్రం; దరఖాస్తు; తాఖీదు; మెమో; మెమొరాండం;
* memorial, adj. సంస్మరణ;
* memorial, n. (1) స్మారక సభ; (2) స్మారక చిహ్నం;
* memorize, v. i. కంఠస్థం చేయు; ధారణ చేయు;
* memory, n. (1) జ్ఞాపకం; జ్ఞాపకశక్తి; స్మృతి; ధారణ; (2) [comp.] కొట్టు; కోఠీ; గరిస; కంప్యూటరులో దత్తాంశాలని, ఆదేశాలని దాచే ప్రదేశం;
** eidetic memory, ph. తత్కాల జ్ఞాపక శక్తి; తాత్కాలిక జ్ఞాపక శక్తి;
** long-term memory, ph. దీర్ఘకాలిక జ్ఞాపక శక్తి;
** photographic memory, ph. బొమ్మకట్టు జ్ఞాపక శక్తి;
** short-term memory, ph. తత్కాల జ్ఞాపక శక్తి;
* memoirs, (మెమ్వార్స్) n. pl. జీవితానుభవాలు; పూర్వస్మృతులు;
* men, n. పురుషులు; మగవారు; (note) man అన్నది ఉభయ లింగాలకీ వర్తిస్తుంది కాని, men అంటే మాత్రం పురుషులు అనే అర్థమే వస్తుంది;
* menarche, n. సమర్తాడడం; పెద్దమనిషి అవడం; రజస్వల అవడం; పుష్పవతి అవడం;
* mendacity, n. అబద్ధం;
* menorrhagia, n. ఎరక్రుసుమ; రక్తప్రద; స్త్రీ రుతు కాలంలో అతిగా జరిగే రక్త స్రావం;
* menses, n.ముట్టు; రుతు స్రావం; రుతు కాలం; బయటుండుట; వాకిటుండుట;
* mend, v. t. మరమ్మత్తు చేయు; బాగు చేయు;
* mendicant, n. m. అవధూతుడు;
* menial, n. గులాము; దాసుడు;
* menopause, n. రజోనివృత్తి; ముట్లుడుగు కాలం;
* menstruation, n. రుతువు; రుతుకాలం; బయటుండడం; వాకిటుండడం; ముట్టవడం;
* menstrual, adj. రుతు;
** menstrual discharge, ph. రుతు స్రావం;
** menstrual period, ph. రుతు కాలం;
* mensuration, n. మాపన శాస్త్రం; మాపనం; కొలతలకి సంబంధించిన లెక్కలు; కొలత; భూమి కొలత; క్షేత్రమితి;
* mental, adj. మానసిక; మానస; మనస్; మనో;
** mental debility, ph. మానసిక దౌర్బల్యం; కశ్మలం;
** mental hospital, ph. పిచ్చాసుపత్రి;
* mentality, n. మానసికతత్వం; మనస్తత్వం; మనోగతి; చిత్తవృత్తి;
* menthol, n. పుదీనా కర్పూరం; పుదీనా ఆకులలో నుండి తీసిన ఒక సుగంధ ద్రవ్యం; రసాయన శాపు దృష్ట్యా ఇది ఒక ఒలంతం (alcohol); see also mint camphor;
* mention, v. i. పేర్కొను; చెప్పు; నుడువు;
* menu, n. (మెన్యూ) (1) వడ్డనకి తయారైన వంటకాల జాబితా; వాటి ధరలు; మెన్యూ; (2) ఎంపిక అంశాల పట్టిక; ఎంపిక జాబితా;
* mephitic, adj. దుర్గంధభరితమైన; దుర్వాసనతోకూడిన; కంపుకొట్టే;
* mercenary, n. కిరాయి సైనికుడు; కూలికి యుద్ధం చేసే వ్యక్తి;
* merchandise, n. సరుకులు; సామానులు; దినుసులు; వస్తువులు; సామగ్రి; సార్థములు;
* merchant, n. వణిజుడు; వ్యాపారస్తుడు; సార్ధవాహుడు; సెట్టి; సాహుకారు;
** merchant marine, ph. వాణిజ్య నౌకాదళం;
* Mercury, n. (1) బుధుడు; బుధగ్రహం; (2) పాదరసం; రసం; పారదం; రసపతి; రసరాట్టు; తడివెండి; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 80, సంక్షిప్తనామం = Hg [Lat. hydrargyrum = liquid silver];
** mercuric chloride, ph. రసహరితం; ఖాండవ కర్పూరం; Mercury (II) chloride; corrosive sublimate; HgCl<sub>2</sub>;
** mercuric sulfide, ph. ఇంగిలీకం; రససింధూరం; Mercury (II) sulfide; HgS;
** mercurous chloride, ph. రసకర్పూరం; Mercury (I) chloride; white sublimate of mercury; Hg<sub>2</sub>Cl<sub>2</sub>;
* mercurial, adj. చంచల; చపలమైన; అస్థిర;
* mercy, n. దయ; కనికరం; కృప; కరుణ;
* mere, adj. కేవలం; ఉత్త; వడారము;
* merely, adv. కేవలం; ఫక్తు; వడారము;
* merger, n. కలిస, పోవుట; ఐక్యమగుట; లయమగుట; లీనీకరణ;
* meridian, n. (1) మధ్యాహ్న రేఖ; యామ్యోత్తర రేఖ; ధ్రువరేఖ; భూగోళంలో ఉత్తరం నుండి దక్షిణానికి వెళ్లే ఊహా రేఖ; (2) ధ్రువవృత్తం; మయామ్యోత్తర రేఖ; ఖగోళంలో ఉత్తరం నుండి దక్షిణానికి ప్రేక్షకుని శిరస్సు మీదుగా వెళ్లే ఊహా వృత్తం;
** prime meridian, ph. భూగోళం మీద ఉత్తరం ధ్రువం నుండి దక్షిణ ధ్రువానికి ఇంగ్లండు లోని గ్రీన్విచ్ వేధశాల మీదుగా వెళ్లే ఊహా రేఖ; భూగోళం మీద, దీనికి ఎట్టఎదురుగా, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఊహా రేఖని "అంతర్జాతీయ తేదీ రేఖ" (International Date Line) అంటారు. తూర్పుకి ప్రయాణం చేస్తూ ఈ రేఖని దాటినప్పుడు మీ కేలండరులో ఒక రోజు ముందుకి జరుపుకోవాలి;
* merit, n. యోగ్యత; శ్రేష్టత;
** merit certificate, ph. యోగ్యతా పత్రం; ప్రశంసాపత్రం;
* merits, n. యోగ్యతలు; సలక్షణాలు;
** merits and demerits, ph. గుణగణాలు; లాభనష్టాలు;
* mermaid, n. మత్స్య కన్య; సగం స్త్రీ, సగం చేప అయిన వింత కల్పిత జీవి; see also echidna;
* merry-go-round, n. రంగులరాట్నం; మెర్రీగుర్రం;
* mesa, n. నెత్తం; కొండనెత్తము; పీఠభూమి; సానువు; కోన; కొండ మీద చదునైన ప్రదేశం;
* mesh, n. వలయం; జల్లి; జాలీ; see also grid;
* mesh, v. i. సరితూగు; అమురు; జతపడు;
* mesmerism, n. మెస్మరీయం; [[మెస్మరిజం]]; ఒక వ్యక్తికి ఒక విధమైన మైకం కల్పించి ఆ వ్యక్తిచేత చెప్పిన విధంగా ప్రవర్తింపజేసే పద్ధతి;
* meso, pref. మధ్య;
* mesoblast, n. మధ్యాస్తరం; అంతశ్చర్మానికి, బహిశ్చర్మానికి మధ్యనున్న పొర; mesoderm;
* mesosphere, n. మధ్యావరణం; ఆస్తరావరణము పైన 85కి మీ వరకు విస్తరించి ఉంటుంది. ఇక్కడ ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇదే భూ వాతావరణంలోో చల్లని పొర. ఇక్కడే వాతావరణంలో ప్రవేశించిన ఉల్కలు కాలి మండిపోయేది;
* mesozoic era, n. మధ్య జీవయుగం;
* mess, n. (1) భోజనశాల; పాకశాల; మెస్సు; (2) చాలా చిందరవందరగా ఉన్న స్థితి;
* message, n. సందేశం; వర్తమానం; వార్త; వేగు; మాట; దూతిక; దూతం; కబురు; సమాచారం; కచేలం;
* messenger, n. వార్తాహరుడు; దూత; వార్తికుడు; చారుడు; pl. హర్కారాలు అనగా వార్తాహరులు;
** messenger RNA, ph. దూతిక రైకామ్లం; the form of RNA in which genetic information transcribed from DNA as a sequence of bases is transferred to a ribosome;
* meta, pref. (1) మధ్య; తో; ఆవలి; సంబంధించిన; అసలుది కానిది; (2) లోకోత్తర; బీజాతీత; అధిభౌతిక; ఉన్నత;
** meta data, ph. "డేటా" కి సంబంధించిన సమాచారం; ఉదా. సినిమా ని "డేటా" గా ఊహించుకుంటే ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు "మెటా డేటా" అవుతుంది;
** metaverse, ph. అసలది కాని విశ్వం; ఊహాత్మక విశ్వం;
* metabolism, n. పాచకం; జీవనప్రక్రియ; చయాపచయం;
* metacarpals, n. కరభాస్థికలు; పాణి శలాకలు; అరచేతిలోని ఎముకలు;
** metacarpal bones, ph. పాణిశలాకలు; కరభాస్థికలు; అరచేతిలోని ఎముకలు;
** metatarsal bones, ph. ప్రపాదాస్థికలు; పాద శలాకలు; పాదము లోని ఎముకలు;
* metastasis, n. శరీరంలో వ్యాధి ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రయాణం చేయుట; ముఖ్యంగా కేన్సరు వ్యాధి యెడల ఈ పదం ఉపయోగిస్తారు
* metal, n. (1) లోహం; ధాతువు; (2) కంకర;
** base metal, ph. హీన ధాతువు; పరుష లోహం; ఇనుము, రాగి, సీసము, మొ.;
** noble metal, ph. రాచ ధాతువు; వెండి, బంగారము, మొ.;
** metal collar, ph. పొన్ను;
* metallic, adj. లోహ; ధాతు;
** metallic luster, ph. లోహ ద్యుతి; ధాతు ద్యుతి;
* metallurgy, n. లోహ సంగ్రహణ శాస్త్రం;
* metamorphosis, n. మార్పు; పరిపూర్ణమైన మార్పు; రూపవిక్రియ; రూపపరిణామం;
* metaphor, n. రూపకాలంకారం; అధ్యారోపం;
* metaphysics, n. అధిభౌతిక శాస్త్రం; పారలౌకిక శాస్త్రం; ఆధ్యాత్మిక విద్య; ఇది తత్వశాస్త్రం (ఫిలాసఫీ)లో ఒక విభాగం. మనకు తెలిసిన వాస్తవ ప్రపంచాన్ని అన్ని రకాలుగా అధ్యయనం చేసేదే అధిభౌతిక శాస్త్రం. దీనికి ఊహాప్రపంచంతో సంబంధం లేదు. Metaphysics is the branch of philosophy that examines the fundamental nature of reality, including the relationship between mind and matter, between substance and attribute, and between potentiality and actuality; meta = beyond or above; metaphysics deals with things beyond physical experience;
* metathesis, n. [ling.] వర్ణవ్యత్యయం; శబ్ద ఉచ్చారణలో అక్షరాల వరస మారుగుళ్లు అవడం; ఉదా: ఇంగ్లీషులో రెండు హల్లులని వరస తప్పించి ఉచ్చరించడం (ask ని aks అని ఉచ్చరించడం);
* metempsychosis, n. పరకాయప్రవేశం;
* meteor, n. ఉల్క; వాతావరణం లోనికి ప్రవేశించిన తల తెగిన తోకచుక్క; అంతరిక్షం నుండి వాతావరణం గుండా కిందకి పడే ఒక ఘన పదార్థం;
** meteor shower, ph. ఉల్కాపాతం;
* meteorite, n. ఉల్కాశిల; భూపతనమైన ఉల్క; కింద పడ్డ ఉల్క;
* meteoroid, n. తల తెగిన తోకచుక్క; శిధిలమైన తోకచుక్క; సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూన్న రాయి వంటి ఘనపదార్థం; సౌర కుటుంబంలో ఇటువంటివి చాలా ఉన్నాయి; ఇవి భూమి వాతావరణంలో ప్రవేశించి భూపతనమైతే అప్పుడు వాటిని ఉల్కలు అంటారు;
* meteorology, n. వాతావరణ శాస్త్రం; [Gr. meteoron = గాలిలో ఉండేది];
* meter, metre [Br.] n. (1) మీటరు; మాపకం; కొలమానం; మితి; (2) పద్యపాదంలో ఉన్న గణాల సమాఖ్య;
** barometer, n. భారమితి; వాతావరణంలోని గాలి బరువుని కొలిచేది;
** thermometer, n. ఉష్ణమితి; ఉష్ణంపుల్ల; వేడిని కొలిచేది; థర్మామీటరు;
* methanal, n. పాడాల్; కాష్టాల్; మెతనాలు; ఫార్మాల్డిహైడు; CH<sub>2</sub>O;
* methane, n. ఏకేను; పాడేను; మెతేను; చిత్తడి వాయువు; పంక వాయువు; CH<sub>4</sub>;
* methanoic acid, n. పాడోయిక్ ఆమ్లం; పిపీలికామ్లం; ఫార్మిక్ ఆమ్లం; HCOOH;
* methanol, n. పాడోల్; కాష్టోల్; మెతనోలు; మెతల్ ఆల్కహాలు; CH<sub>3</sub>OH;
* method, n. పద్ధతి; మార్గం; విధి; విధానం;
** common sense method, ph. లౌకిక పద్ధతి;
** historical method, ph. చారిత్రక పద్ధతి;
** systematic method, ph. క్రమ పద్ధతి;
* methyl alcohol, n. కాష్టోల్; పాడోల్; కర్రసారా; మెతనోలు; మెతల్ ఆల్కహాలు;
* methyl group, n. మెతల్ గుంపు;
* methyl radical, n. మెతల్ రాసి;
* meticulously, adv. అతి జాగ్రత్తగా;
* metonymy, n. ఇంగ్లీషు భాషలో ఒక అలంకారం; ఒక మాటకి బదులు దానికి దగ్గర సంబంధం ఉన్న మరొక మాటని వాడడం; ఉ. సనాతన ధర్మం నశించి పోతోందని శృంగేరీ మఠం ఆక్రోశించింది అన్నప్పుడు శృంగేరీ మఠాధిపతి సంతాపం వెలిబుచ్చేరని అర్థం చెప్పుకోవాలి;
* metre, n. మీటరు; (note) మెట్రిక్ పద్ధతిలో ఈ వర్ణక్రమాన్నే వాడాలి;
* metric system, n. మెట్రిక్ పద్ధతి; శతాంశ పద్ధతులని ఉపయోగించి, బరువులని, దూరాలని కొలవడం;
* metropolis, n. మహానగరం; ప్రధాన నగరం; కస్బా; ముఖ్య పట్టణం;
* Mexican poppy, n. బ్రహ్మదండి; బలురక్కెస;
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 2: Mf-Mz ==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
* miasma, n. దోషం; మౌలిక దోషం; రోగకారణం; హోమియోపతీ శాస్త్రం ప్రకారం, శరీరంలో ఒక మౌలికమైన దోషం ఉన్నప్పుడు శరీరం రోగగ్రస్త మవుతుంది;
* mica, n. అభ్రకం; గిరిజం; కాకిబంగారం; గనులలో దొరికే ఒక రకం అల్లూమినో సిలికేటు అనే ఖనిజం;
* micro, adj. సూక్ష్మ;
* microbe, n. సూక్ష్మజీవి; రోగకారకమైన సూక్ష్మజీవి; same as microorganism;
* microgravity, n. సూక్ష్మ గురుత్వం; ఒక కక్ష్యలో తిరుగుతున్న నభోనౌకలో అనుభవానికి వచ్చేఅతి కొద్ది గురుత్వ బలం;
* micrometer, n. మీటరులో మిలియనో వంతు పొడుగు; మైక్రాను;
* micron, n. మీటరులో మిలియనో వంతు పొడుగు; మైక్రోమీటరు;
* microorganism, n. సూక్ష్మజీవి; మైక్రోబు; బేక్టీరియాలు, వైరసులు, రికెట్సియాలు, స్పైరోకీట్లు, ప్రోటోజోవాలు సూక్ష్మజీవులకి ఉదాహరణలు;
* microprocessor, n. సూక్ష్మసంకలిని; మైక్రోప్రాసెసర్; వేలి గోరు ప్రమాణంలో ఉన్న అర్ధవాహిని చితుకు మీద నిర్మించిన కలన యంత్రం;
* microscope, n. సూక్ష్మదర్శిని; కంటికి కనబడనంత చిన్నగా ఉన్న వస్తువులని చూడడానికి వాడే పరికరం;
* microsome, n. సూక్ష్మకాయం; (lit.) small body;
* mid, adj. మధ్య; నడు; అర్ధ;
* middle, adj. మధ్య; నడుమ; అంతరాళ;
** middle man, ph. మధ్యవర్తి; దళారి;
** middle point, ph. అంతరాళం;
* midnight, n. అర్ధరాత్రి; నడురేయి; నడిరేయి;
* midrib, మధ్యశిర; ఈనె;
* midwife, n. మంత్రసాని;
* migrain, n. అనంతావర్తం; పార్శ్వపు నొప్పి; ఒక రకమైన విపరీతమైన తలనొప్పి; ఉదయం మొదలై రోజంతా ఉంటుంది. వెలుగు, ధ్వనులు నొప్పిని అధికం చెయ్యొచ్చు. ఒక్కోసారి నొప్పి రావడానికి ముందు వాంతిరావడం, కడుపులో తిప్పినట్లుంటుంది.
* migrant, n. ప్రవాసి; వలస పోయిన వ్యక్తి;
* migration, n. వలస;
** migration routes, ph. వలస వీధులు;
* mil, n. సహస్రాంశము; వెయ్యవ భాగం;
* mild, adj. సన్న; మంద; మేదక;
** mild breeze, ph. మందమారుతం;
* mildew, n. బూడిద తెగులు; మజ్జిగ తెగులు;
* mile, n. మైలు; (note) 8 కిలోమీటర్లు 5 మైళ్లకి సమానం; దూరాన్ని కొలిచే ఒక కొలమానం;
** nautical mile, ph. Nautical miles are used to measure the distance traveled through the water. A nautical mile is slightly longer than a mile on land, equaling 1.1508 land-measured (or statute) miles. The nautical mile is based on the Earth’s longitude and latitude coordinates, with one nautical mile equaling one minute of latitude;
* milestone, n. మైలురాయి;
* milieu, n. సంగతి, సందర్భం; సామాజిక వాతావరణం;
* military, n. సైన్యం; మిలిటరీ;
* militia, n. పౌరసేన;
* milk, adj. పాల; క్షీరం; గొల్ల;
* milk, n. పాలు; క్షీరం; దుగ్ధం; పయస్సు;
** breast milk, ph. చనుబాలు; స్తన్యం;
** condensed milk, ph. చిలువాలు;
** homogenized milk, ph. పాలని అతి సన్నటి బెజ్జాలు ఉన్న జల్లెడ గుండా ఎక్కువ పీడనంతో పోనిచ్చి, వెన్నని అతి సూక్ష్మ కణాలుగా విభజించి, పాలు, వెన్న విడిపోకుండా చేసే పధ్ధతి;
** Pastuerized milk, ph. పాలని వేడి చేసి పాలల్లోని సూక్ష్మజీవులని చంపగా మిగిలిన ఆరోగ్యకరమైన పాలు;
** powder milk, ph. పాలపొడి;
** skimmed milk, ph. వెన్న తీసేసిన పాలు;
** milk products, ph. పయస్యములు; పాలనుండి వచ్చే పదార్థాలు; పెరుగు, వెన్న, నెయ్యి, చీజు, వగైరాలు;
* milk, v. t. పితుకు; పిండు;
* milkmaid, n. గొల్లభామ;
* milkshake, పాలసుగంధి; పాలల్లో ఐస్‌క్రీమ్ కలిపి రంగరించగా వచ్చినది;
* milk teeth, n. పాలపండ్లు;
* Milky Way, n. పాలపుంత; పాలవెల్లి; పాలకడలి; ఆకాశ గంగ; సోమధార; దివిజ గంగ; మన క్షీరసాగరం (గేలక్సీ) పేరు;
** thicker Milky Way, ph. పాలకడలి;
** thinner Milky Way, ph. ఆకాశ గంగ; దివిజ గంగ;
* mill, n. మర; గానుగ; తిరుగలి; మిల్లు;
** flour mill, ph. పిండి మర;
** rice mill, ph. ధాన్యం మర; జిన్ను;
* mill, v. t. మరపట్టు; ఆడించు; మరపట్టించు; ఆడు; ఆడించు;
* milled, adj. మరపట్టిన; మరాడించిన;
* millennials, n. pl. జనాభాలో సా. శ. 1980 - 2000 మధ్యలో పుట్టినవారు;
* millennium, n. సహస్రాబ్దం; వెయ్యి సంవత్సరముల కాలం;
* millets, n. (1) చిరు ధాన్యాలు; సిరి ధాన్యాలు; జొన్నలు, సజ్జ, రాగి, మొదలగునవి; (ety.) చిరు ధాన్యాలు because of smaller seeds compared to rice, wheat, corn, and other larger ones; సిరి ధాన్యాలు is a more recent coinage to promote their use;
** barnyard millets, ph. ఊదలు; ఊదర్లు;
** brown-top millets, ph. అండు కొర్రలు;
** finger millets, ph. రాగి; రాగులు;
** foxtail millets, ph. కొర్ర; కొర్రలు;
** great millets, ph. జొన్న; జొన్నలు;
** Italian millets, ph. కొర్ర; కొర్రలు;
** Kodo millets, ph. ఊద; ఊదలు; అరికె; అరికెలు;
** little millets, ph. సామ; సామలు;
** pearl millets, ph. సజ్జలు;
** spiked millets, ph. సజ్జ; సజ్జలు;
* million, n. పది లక్షలు; మిలియను;
* millipede, n. రోకలిబండ; గాజుపురుగు; సహస్ర పాది; ఎన్నో కాళ్లుగల ఒక క్రిమి; (lit.) వెయ్యి పాదములు కలది; నిజానికి సహస్రపాదికి 200-400 కాళ్లే ఉంటాయి; ప్రతి శరీర ఖండానికి (body segment) రెండు జతల కాళ్ళు ఉండటం వీటి లక్షణం;
* millstone, n. తిరగలి; తిరుగలి; తిరుగలి రాయి;
* Milkyway, n. పాలపుంత; ఆకాశగంగ; మన సూర్యమండలం ఉన్న క్షీరసాగరం (galaxy) పేరు;
* mime, n. మూకాభినయం;
* mimesis, n. అనుకరణ;
* mimic, v. t. అనుకరించు;
* mimicry, n. పరిహాసానుకరణ; స్వరవంచన; ధ్వన్యనుకరణ;
* mince, v. t. పొట్టుచేయు; చిన్న ముక్కలుగా తరుగు;
** minced jackfruit, ph. పనస పొట్టు;
* mind, n. మనస్సు; మది; అంతఃకరణం; అంతరంగం; ఉల్లము; డెందము; ఎద; ఎడద; చేతనం; చేతస్సు; చిత్తము; భౌతికమైన మెదడులో, కంటికి కనపడని విధంగా, భౌతికమైన ఉనికి లేని మనస్సు ఉంటుందనే భావం ఒకటి ఉంది; ఈ మెదడుకి, మనస్సుకీ మధ్య ఉండే లంకెనే ఆత్మ అంటారని తాత్వికుడు రెనే డెకార్ట్ అంటారు; ఇంగ్లీషులో mind అనే మాటలో వేదాంతం నాలుగు స్థాయిలను గుర్తిస్తుంది: (1) మనస్సు - ఆలోచనలకు మూలం. (2) బుద్ధి అంటే వివేకము. అనగా, ఈ ఆలోచన మంచిది, ఆ వాక్యము సత్యము అనుకునే తెలివితేటలు. (3) చిత్తము. ఇంగ్లీషు అనువాదం consciousness. Krishna consciousness అంటే చిత్తములో కృష్ణునికి తప్ప ఎవరికీ స్థానం ఉండకపోవడం. అందుకే ఆయన చిత్తచోరుడు. (4) అహంకారము. అహం అంటే నేను. మమ అంటే నాది. నేను చాలాగొప్పవాణ్ణి అనుకోవడం అహంకారం. అన్నీ నావి అనుకోవడం మమకారము.
** frame of mind, ph. చిత్తవృత్తి;
** peace of mind, ph. మనశ్శాంతి;
** presence of mind, ph. సద్యస్ఫూర్తి;
** state of mind, ph. చిత్తవృత్తి;
** subconscious mind, ph. ఉపచేతనం;
** mind-body system, ph. దేహేంద్రియ మనస్సంఘాతము;
* mine, n. (1) గని; ఖని; (2) ఆకరం; (3) మందుపాతర;
* mine, poss. pron. నాది; నావి; అస్మదీయం;
* miner, n. m. ఖనకుడు;
* mineral, n. ఖనిజం;
** mineral salt, ph. ఖనిజ లవణం;
** mineral oil, ph. ఖనిజ తైలము; ఖనిజపు చమురు;
** mineral pitch, ph. గంజిత్తు; గని+జిత్తు; శిలాజిత్; a dark, semisolid, bituminous substance that is used in India and Nepal to treat a variety of ailments, including inflammation, weakness, bone fractures, bleeding, and wounds;
** mineral spring, ph. గనిజబ్బుగ్గ;
* mineralogy, n. ఖనిజ శాస్త్రం;
* mini, pref. పిట్ట; పిల్ల; చిన్న;
* miniature, adj. చిట్టి; బుల్లి; లఘు;
* minimal, adj. అల్పిష్ఠ; కనిష్ఠ; కనీస;
* minimization, n. కనిష్ఠీకరణం;
* minimize, v. t. అత్యల్పించు; కనిష్ఠీకరించు;
* minimum, n. అత్యల్పం; కనిష్ఠం; కనీసం; అధమం;
** at the minimum, ph. హీనపక్షం;
* minister, n. (1) మంత్రి; అమాత్యుడు; సచివుడు; (2) క్రైస్తవ మత గురువు; చర్చిలో ఒక మతాధికారి;
* ministry, n. (1) మంత్రివర్గం; అమాత్య కూటమి; (2) మంత్రాలయం; మంత్రిత్వం;
* minor, adj. చిరుత; చిన్న; లఘు; మంద;
** minor axis, ph. లఘు అక్షం;
** minor crime, ph. ఉపపాపం; చిన్నతప్పు;
** minor offense, ph. స్వల్పనేరం; మందాపరాధం;
* minor, n. చిరుత; అయుక్తుడు; బాలుడు; బాలిక; 18 సంవత్సరముల వయస్సు నిండని వ్యక్తి; మైనరు;
* minorities, n. బడుగు వర్గాలు; అల్పసంఖ్యాక వర్గాలు;
* minority, n. (1) చిరుత ప్రాయం; బాల్యదశ; లేబ్రాయము; అయుక్తవయస్సు; కౌమారత్వం; (2) అల్పసంఖ్యాక వర్గం;
* mint, n. (1) టంకశాల; (2) పొదీనా; [bot.] ''Mentha viridis'';
* minuend, n. వియోజ్యం; శోధనీయము; 4 నుండి 3 ని తీసివేసినప్పుడు, 4 వియోజ్యం; 3 వ్యవకలితం; see also subtrahend;
* minute, adj. (మైన్యూట్) స్వల్పమైన; అతిచిన్నదైన; సూక్ష్మమైన; అణు;
* minute, n. (మైన్యూట్) స్వల్పం; అల్పం; అల్పిష్ఠం; ఆణకం; అణుప్రమాణం; (rel.) tiny; subtle;
* minute, n. (మినిట్); (1) నిమిషము; గంటలో అరవైయ్యవ వంతు; లిప్త; కల; (2) డిగ్రీలో అరవైయ్యవ వంతు;
* minutes, n. pl. (మినిట్స్) సభలలో జరిగే వ్యవహార సంగ్రహం;
* miracle, n. మహాత్మ్యం; మహాద్భుతం;
* mirage, n. ఎండమావి; మృగతృష్ణ; మరీచిక; మంచి ఎండలో కళ్ళకు దూరంలో నీళ్ళు ఉన్నట్టు గోచరించడాన్ని ఎండమావులు అంటారు. ఎడారుల్లో ఈ స్థితి ఏర్పడుతుంది. తృష్ణ అంటే దప్పిక. మృగతృష్ణ అంటే జంతువులకు దప్పిక కలిగించేది;
* mire, n. రొంపి; ఊబి; బురదనేల; రొచ్చు; అడుసు; పంకం; పంకిలం; జంబాలం; ఉబ్బలి;
* mirror, n. అద్దం; దర్పణం; కర్కరం; ఆదర్శనం; ముకురం;
** framed mirror, ph. చెక్కుటద్దము;
** mirror image, ph. బింబం; ప్రతిబింబం; దర్పణ బింబం;
** mirror symmetry, ph. దర్పణ సౌష్ఠవం;
* misanthrope, n. మానవద్వేషి; నరద్రోహి;
* miscarriage, n. (1) గర్భస్రావం; గర్భపాతం; అకాల ప్రసవం; కట్టుక; (2) అక్రమరీతి; అక్రమ వైఖరి; అన్యాయం; భంగపాటు; వ్యాఘాతం; విఘాతం;
** miscarriage of justice, ph. న్యాయానికి అన్యాయం జరిగిపోవడం;
* miscellaneous, adj. వివిధ; చిల్లర మల్లర; చిల్లర; నానా; నానావిధ;
* miscellaneous, n. అమాంబాపతులు; చిల్లర మల్లర; చిల్లర; మ్రుక్కడి;
* miscellany, n. కలగూరగంప; కదంబం;
* mischief, n. పెంకితనం; అల్లరి; దుండగం; ఆగడం; రాలుగాయితనం; ఆకతాయితనం; తుంటరితనం;
** mischief maker, ph. పెంకి పిల్ల; అల్లరి పిల్ల; పెంకివాడు; అల్లరివాడు; దుండగీడు;
* mischievous fellow, ph. పెంకి పిల్లాడు; రాలుగాయి; ఆకతాయి;
* mischievousness, n. పెంకితనం; రాలుగాయితనం; ఆకతాయితనం; తుంటరితనం; దుడుకుతనం;
* misconception, n. అపోహ; భ్రమ, తప్పుభావము; అపార్థము; దురూహ;
* misconduct, n. దుష్‌ప్రవర్తన; దుర్నడత;
* misdeed, n. పొరపాటు; చెడ్డపని; దుష్కృత్యం; కాకృత్యం;
* misdemeanor, n. కపటచేష్ట; చెడ్డపని; కీలు; అకృత్యం; దుష్‌కృతం; దుష్‌ప్రవర్తన; దురాకృతం; దుశ్చేష్ట; వికర్మ; ఉన్మార్గం; చెడు దారి; చట్టవిరుద్ధమైన పని;
* miser, n. లోభి; పిసినిగొట్టు; పిసినారి; పీనాసి; కింపచానుఁడు; అడియరి; టక్కుఁడు;
** extreme miser, ph. పరమ లోభి;
* miserliness, n. లోభం; లోభత్వం; కాపీనం; పిసినారితనం; పిసినిగొట్టుతనం;
* misfortune, n. దురదృష్టం; ఓగు;
* misgiving, n. సందేహం; సంశయం;
* mishap, n. దుర్ఘటన; విపత్తు; అశ్రి;
* misinformation, n. అపసమాచారం;
* misinterpretation, n. వక్రీకరణం; తప్పు అర్థం చెప్పడం; దురర్థం చెప్పడం;
* mislead, v. t. తప్పుదారిలో పెట్టు; మభ్యపరచు;
** misleading statement, ph. విప్రలంభం;
* mismatch, n. విజ్జోడు; జత కలవకపోవడం;
* mismatched pair, ph. విజ్జోడు;
* misnomer, n. దుర్నామం; లక్షణాలకి సరిపడని పేరు;
* misogynist, n. ఆడవారంటే చులకన భావం కల వ్యక్తి; పురుషాహంకారి; ఆడ జాతి యెడల వివక్ష చూపే వ్యక్తి;
* misprint, n. అచ్చుతప్పు; ముద్రారాక్షసం;
* misrepresentation, n. మభ్యపరచుట; అసత్యకథనం; తప్పుగా వర్ణించడం;
* missile, n. కంపణము; అవాయి; క్షిపణి;
** guided missile, ph. మార్గణ క్షిపణి; మార్గణం;
** heat-seeking missile, ph, ఉష్ణ మార్గణం;
* miss, v. i. ఏమారు;
** how did I miss this, ph. నేను ఎట్లు ఏమారితిని?
* missing, adj. తొస్సి;
** missing tooth, ph. తొస్సి పన్ను;
** missing syllable, ph. తొస్సి మాట;
* mission, n. (1) మఠం; (2) ప్రచారక వర్గం; (3) బృహత్కార్యం;
* missionaries, n. మతబోధకులు; మతప్రచారకులు; మిషనరీలు;
* mist, n. కుహేళి; తుషారం; సూక్ష్మమైన బిందువులు గాలిలో తేలియాడిన పరిస్థితి;
* mistake, n. పొరపాటు; తప్పు; కైతప్పు;
** printing mistake, ph. అచ్చుతప్పు; ముద్రారాక్షసం;
* mistrust, n. అపనమ్మకం;
* mistletoe, n. బదనిక; పరభుక్కి అయిన ఒక జాతి మొక్క;
* mistress, n. ఉపపత్ని; ఉంపుడుకత్తె; దయిత; ధర్మకార్యాలకు పీటల మీద భర్త ప్రక్కన కూర్చునే అర్హత గల వాళ్లనే ధర్మపత్నులంటారు.
మిగిలిన వాళ్లందరూ వల్లభలు, దయితలు;
* misunderstanding, n. అపార్థం; అపావబోధము;
* misuse, n. దుర్వినియోగం;
* mite, n. తవుటి పురుగు;
* mitigation, n. ఉపశాంతి;
* mix, v. t. కలుపు; రంగరించు; కలబోయు; మిళాయించు; మేళవించు;
* mix, n. మాదక ద్రవ్యాలలో కలిపే పళ్లరసం వంటి పానీయం;
* mixed, adj. కలగలసిన; కలగలుపు; కదంబ; మిళిత; చంపూ;
* mixture, n. మిశ్రమం; కలగలుపు; కరంబం; కదంబకం; మిళితం;
* mix-up, n. తారుమారు; గందరగోళం; తికమక;
* Mizar, n. వసిష్ట నక్షత్రం; Mizar and Alcor are two stars forming a naked eye double in the handle of the Big Dipper (or Plough) asterism in the constellation of Ursa Major. Mizar is the second star from the end of the Big Dipper's handle, and Alcor, its fainter companion. Mizar is really four stars, and Alcor is really two stars. So what we see as two stars are really six in one!
* mnemonics, n. pl. స్పోరకములు; జ్ఞాపకార్థం ఉంచుకొనే గుర్తులు;
* moan, n. మూలుగు; నిట్టూర్పు;
* moat, n. కందకం; ఆగడ్త; పరిఖ; దవంత్రి;
* mob, n. మూక; దండు; తొంబ; మూకప్రజ; గుంపు, అల్లరిమూక; క్రమశిక్షణ పాటించని జన సమూహం;
** mob battle, ph. సంకుల సమరం;
** mob disorder, ph. దొమ్మీ;
* mobile, adj. చర; చలన; చంచత్; చంచత్వ; జంగమ; జంగమాత్మక; చరిష్ణు; గమనశీల; కదలాడునట్టి;
** mobile computing, ph. చలన కలనం; జంగమ కలనం;
** mobile phone, ph. చరవాణి; జంగవాణి;
* mobility, n. చలనశీలత; చంచలత; చంచత్వం; జంగమత్వం; కదలే గుణం; గమనశీలత;
* mock, v. t. (1) పరిహసించు; ఎకసక్కేలాడు; ఎగతాళి చెయ్యు; ఎద్దేవాచేయు; (2) అనుకరించు
** mock parliament, ph. శాసన సభని అనుకరిస్తూ విద్యార్థులు తరగతిలో చేసే ప్రయోగం;
** mock trial, ph. న్యాయస్థానంలోని విచారణని అనుకరిస్తూ విద్యార్థులు తరగతిలో చేసే ప్రయోగం;
** mock theta function, ph. [[శ్రీనివాస రామానుజన్]] కనిపెట్టిన కొత్త రకం [[ప్రమేయం]];
* mockery, n. అపహాస్యం; గేలి; అవహేళన;
* mode, n. వెరవు;
* model, n. (1) నమూనా; మాదిరి; మచ్చు; మూదల; ప్రతిరూపం; మోస్తరు; (2) మేలుబంతి; ఒరవడి;
* moderately, adv. మితంగా; పరిమితంగా;
* moderator, n. మధ్యవర్తి; సంచాలకుడు; మితవాది; మితి మీరకుండా అడ్డు పెట్టేది; one that restrains or regulates;
* moderates, n. మితవాదులు;
* moderation, n. మోతాదు; మితి;
* modern, adj. అధునాతన; ఆధునిక; నూతన; నవీన; నవ్య; నవయుగ; అభినవ; ప్రత్యగ్రమ; నాజూకైన; కొత్త; ఇటీవలి; అర్వాచీన;
* modernity, n. ఆధునికత; ఇందీవలికం; నవ్యత;
* modernization, n. నవీకరణ; అధునీకరణం; ఆధునికీకరణ; ఇందీవలింపు;
* modest, adj. వినీత;
** modest person, ph. వినీతుడు; సొంత డబ్బా కొట్టుకోని మనిషి;
* modesty, n. వినయం; నమ్రత; అణకువ;
* modicum, n. మోతాదు;
* modification, n. మార్పు; సవరింపు;
* modular, adj. గుళిక; ఘడీ;
** modular arithmetic, ph. గుళిక గణితం; ఘడీ గణితం;
** modular form, ph. ఘడీ స్వరూపం;
* module, n. గుళిక;
* Modus operandi, ph. A Latin phrase meaning, "a distinct pattern or method of operation especially that indicates or suggests the work of a single criminal in more than one crime."
* Modus ponens, ph. A Latin phrase meaning, "a form of deductive argument and a rule of logical inference that involves reasoning from a hypothetical proposition. If the antecedent is true, then the consequent must also be true. For example, "If A is true, B is true; but A is true; therefore, B is true;"
* Modus tollens, ph. A deductive argument form in propositional logic that involves denying the consequent of an "if-then statement;" For example, if you know that it's not raining and you also know that "If it rains, then the streets are wet", you can conclude that the streets are not wet;
* Modus vivendi, ph. A Latin phrase meaning, "an agreement or arrangement that allows conflicting parties to coexist peacefully. For example, "Our two countries must put aside the memory of war and seek a modus vivendi."
* mofussil, adj. [Ind. Engl.] గ్రామీణ; నగరేతర; పరిసర;
* mogul, n. వ్యాపార రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగల వ్యాపారస్తుడు; see also tycoon;
* moist, adj. తేమగల; చెమ్మగిల్లిన; తడిసిన; క్లిన్న;
* moisten, v. t. తడుపు; తడిపి పెట్టు; పదును పెట్టు;
* moisture, n. తేమ; చెమ్మ; తడి; నెమ్ము;
* molar, adj. (1) బుగ్గకి సంబంధించిన; (2) రసాయనశాస్త్రంలో మోల్ అనే కొలమానానికి సంబంధించిన;
* molars, n. pl. దంతములు; చర్వణకములు; బుగ్గవైపు పళ్లు; మానవులలో ఇవి మూడు జతలు ఉంటాయి; వీటిలో మూడవ జతని జ్ఞానదంతాలు అంటారు.
* molasses, n. ఇక్షుసారం; బెల్లపుపాగు; మొలాసిస్; Molasses is the thick, brown syrup left over after sugar crystals are removed from the juice. Molasses is a rich source of minerals, including iron, calcium, magnesium, potassium, and manganese. These minerals are essential for good health and play a role in maintaining strong bones, a healthy immune system, and proper muscle function;
[[File:Fuligo_septica_bl1.JPG|thumb|right|slime mold=ఒక రకం బూజు]]
* mold, [Br.] mould, n. (1) బూజు; బూడిద తెగులు; చెమ్మగానున్న ఆహారపదార్థాలపై మొలిచే బూజు; ఒక రకం శిలీంధ్రం; (2) అచ్చు; మూస;
** slime mold, ph. జిగురు బూజు;
* mold, [Br.] mould, v. t. తీర్చిదిద్దు; మలుచు;
* mole, n. (1) పుట్టుమచ్చ; (2) భూమిలో బొరియ చేసికొని బతికే ఒక ఎలుక జాతి చిన్న జంతువు; (3) మన మధ్యలో చేరిన శత్రుపక్షం వారి గూఢచారి; (4) ఒక బణువులో పదార్థం ఎంతుందో చెప్పే ఒక కొలమానం;
* molecule, n. బణువు; (ety.) బహుళంగా, అంటే మెండుగా, ఉన్న అణు సముదాయం;
** molecular formula, ph. బణు సాంఖ్యక్రమం; ఒకొక్క బణువులో ఎన్నెన్ని అణువులు ఉన్నాయో సూచించే పద్ధతి; ఉదా. నీరు = H<sub>2</sub>O, పంచదార = C<sub>6</sub>H<sub>12</sub>O<sub>6</sub>;
** molecular weight, ph. బణుభారం;
* molt, n. పాము కుబుసం; పాము పొర; నిర్మోకం;
* molten, adj. కరిగించిన; కరగబెట్టిన;
* molting, v. i. కుబుసం విడవడం; పొర విడవడం; ecdysis;
* Molybdenum, n. మోలిబ్డినం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 42, సంక్షిప్త నామం; Mo) [Gr. molybdos = lead];
* Mom, n. అమ్మ;
* moment, n. (1) క్షణం; సమయం; (2) ఘాతిక; భ్రామకం;
** dipole moment, ph. ద్విధ్రువ భ్రామకం;
** every moment, ph. క్షణక్షణం; అనుక్షణం;
** moment of inertia, ph. జడత్వ భ్రామకం;
* momentum, n. (1) [Phy.] భారగతి; (exp.) భారం అంటే weight, గతి అంటే motion అనీ అనుకోవాలి; రయజాతం; (exp.) రయం అంటే velocity కనుక రయం నుండి పుట్టినది రయజాతం; ద్రవ్యవేగం; (exp.) ద్రవ్యం అంటే mass, వేగం అంటే velocity అనీ అనుకుంటే దీని అర్థం అవగతం అవుతుంది; momentum = mv = mass x velocity; (2) ఊపు; ఉద్వేగం; ఆవేగం;
** angular momentum, ph. కోణీయ ఉద్వేగం; కోణీయ రయజాతం; angular momentum = mvr = momentum x radius;
** orbital angular momentum, ph. గతి కోణీయ ఉద్వేగం; ప్రదక్షణం చెయ్యడం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం;
** spin angular momentum, ph. భ్రమణ కోణీయ ఉద్వేగం; ఆత్మభ్రమణం వల్ల కలిగే కోణీయ ఉద్వేగం;
* monad, n. సూక్ష్మాత్మ;
** finite monad, ph. ప్రత్యగాత్మ;
* monarch, n. m. ఏకరాజు; సార్వభౌముడు; చక్రవర్తి;
* monarchy, n. సార్వభౌమత్వం; రాచరికం; ఏకరాజాధిపత్యము; government by a monarch or single sovereign ruler;
* monastery, n. విహారం; సాధువులు, భిక్కులు, మొదలైన మత నిష్ఠాపరులు నివసించే చోటు;
* Monday, n. సోమవారం; ఇందువారం;
* mondegreen, n. ఒక పాటలో కానీ, పద్యంలో కానీ అసలు మాటలకి బదులు మరేవో మాటలు వాడడం; (1) A word or phrase inspired by misheard language; (2) A made-up lyric or line that replaces a song's real words;
* monetary, adj. ద్రవ్యసంబంధ; డబ్బు సరఫరా, ప్రసరణలకి సంబంధించిన; (rel.) fiscal;
* money, n. డబ్బు; ధనం; ద్రవ్యం; సొమ్ము; అర్థం; పైకం; రొక్కం; విత్తం; దుడ్డు;
** black money ph. నల్ల ధనం; అక్రమంగా ఆర్జించిన డబ్బు;
** coin money, ph. నగదు; నాణేల రూపంలో ఉన్న డబ్బు;
** earnest money, ph. ధరావత్తు; బయానా;
** hush money, ph. నోరు మూసుకుని ఉన్నందుకు ఇచ్చే లంచం;
** ready money, ph. రొక్కం;
** money laundering ph. అక్రమ ఆర్జనలపై పన్నులు కట్టకుండా తప్పించుకోడానికి నల్ల ధనాన్ని తెల్ల ధనంగా మార్చే పద్ధతి;
* monger,n. వ్యాపారి; వర్తకుడు;
** fishmonger, ph. చేపల వ్యాపారి;
* mongoose, n. ముంగిస; నకులం; [bio.] ''Viverra ichneumon'';
* mongrel, n. కంచరం; వేరు వేరు జంతువులకి పుట్టినది;
* monism, n. అద్వైతవాదం; ఏకేశ్వరవాదం; ఏకసత్తావాదం;
* monitor, n. పరివీక్షకి; పరివీక్షకుడు;
* monitor, v. t. పరివీక్షించు;
* monk, n. సన్యాసి; క్రైస్తవ సన్యాసి; ముని; [Gr. monakos = one who is alone];
** Monk fruit, ph. బుద్ధ ఫలం; లోహాంగువో; ముని పండు; [bot.] Siraitia grosvenorii; Lo Han Guo) translates to "Buddha fruit". A zero-calorie, natural sweetener, it is increasingly popular among diabetic patients in India as a healthy sugar alternative.
* monkey, n. కోతి; మర్కటం; వానరం; తిమ్మడు; తిమ్మి; మల్లు;
* mono, pref. ఏక;
* monoaction, n. ఏకపాత్రాభినయం;
* monochloromethane, n. ఏకహరితఏకేను; క్లోరోమెతేను; మెతల్ క్లోరైడ్; ఒక కర్బన రసాయనం పేరు; CH<sub>3</sub>Cl;
* monochromatic, adj. ఏకవర్ణపు;
* monogram, n. ఏకరాత; గొలుసుకట్టు రాత; కలం పైకి ఎత్తకుండా పేరు రాయడం; పేరులోని పొడి అక్షరాలని ఈవిధంగా రాయడం;
* monograph, n. ఒకే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ రాసిన గ్రంథం;
** monozygotic twins, ph. ఏక సంయుక్త బీజ కవలలు;
* monolith, n. ఏకశిల;
* monologue, n. ఏకభాష్యం; ఏకభాషణ; ఏకాంతభాషణ;
* monopolist, n. గుత్తదారు; గుత్తాధిపతి; ఏకాధికారి; మస్తాౙరు; ఒక సరకును తాను మాత్రమే అమ్ముటకు అవకాశము పొందినవాఁడు;
* monopoly, n. గుత్తవ్యాపారం; గుత్తాధిపత్యం; ఇజారా; ముస్తాజరీ; మక్తా; [Gr. mono = one, poly= trade];
* monosaccharide, n. ఏకచక్కెర; గ్లూకోజు ఒక ఉదాహరణ;
* monosodium glutamate, n. చైనా ఉప్పు; గ్లూటామిక్ ఆమ్లంతో సోడియం కలవగా వచ్చే లవణం; చైనా, జపాను వంటలలో ఈ ఉప్పుని విరివిగా వాడతారు; MSG; C<sub>5</sub>H<sub>8</sub>NNaO<sub>4</sub>;
* monotheism, n. ఏకేశ్వరోపాసన; ఏకేశ్వరవాదం; ఒకడే దేవుడు ఉన్నాడు అనే నమ్మకం;
* monotone, n.ఏకదిష్టం; ఏకశృతం;
* monotonic, adj. ఏకదిష్ట; ఏకశృత;
** monotonic function, ph. ఏకదిష్ట ప్రమేయం;
* monotonous, adj. ఏకస్వన; ఏకరూప; ఒకే విధంగా ఉండడం వల్ల విసుగు పుట్టించెడు;
* monotony, n. ఏకరూపత; ఏకస్వరత; విసుగు;
* monotype, n. అక్షరాల కూర్పు; పాత రోజులలో అచ్చు వేసే పద్ధతి; (rel.) linotype;
* monsoon, n. (1) వర్షాకాలం; వర్షరుతువు; (2) రుతుపవనాలు;
** monsoon winds, ph. రుతుపవనాలు;
* month, n. నెల; మాసం;
** anomalistic month, ph. 27.55455 రోజులు; చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చేస్తూన్నపుడు ఒక సమీప బిందువు నుండి, అదే సమీప బిందువుకి చేరుకోవడానికి పట్టే కాలం;
** draconic month, ph. 27.21200 రోజులు;
** excalary month, ph. లుప్తమాసం; క్షయమాసం;
** intercalary month, ph. అధికమాసం;
** last month, ph. పోయిన నెల; గత మాసం;
** nodical month, ph. 27.21200 రోజులు;
** per month, ph. నెలకి; నెలసరి; నెల ఒక్కంటికి; మాసానికి;
** sidereal month, 27.32166 రోజులు; దూరంగా ఉన్న నక్షత్రాల నేపథ్యంలో చంద్రుడు భూమి చుట్టూ ప్రదక్షిణం చెయ్యడానికి పట్టే కాలం;
** supernumerary month, ph. అధిక మాసం,
** synodic month, ph. 29.530588 రోజులు; అమావాస్యనుండి అమావాస్య వరకు ఉన్న కాలం;
** month by month, ph. నెల నెలా;
* monthly, adj. నెలవారీ; నెలసరి; నెల ఒక్కంటికి;
* monthly, n. మాసపత్రిక; మాసికం;
** bi-monthly, ph. ద్వైమాసికం; ద్విమాస పరిమితమైనది;
** tri-monthly, ph. త్రైమాసికం; త్రిమాస పరిమితమైనది; quarterly;
** six-monthly, ph. షాణ్మాసికం; షట్ మాస పరిమితమైనది; half-yearly;
* monument, n. స్మారకం; స్మారక భవంతి; స్మారక కట్టడం;
* mood, n. మనస్సు; మనస్థితి; మనోభావం; మనోదశ; మానసికావస్థ; భావావేశం;
** imperative mood, ph. [gram.] విధ్యర్థం; ఆజ్ఞార్థకం;
** indicative mood, ph. నిశ్చితార్దకం;
** infinitive mood, ph. తుమున్నర్ధకం;
** subjunctive mood, ph. సంశయార్ధకం;
* moody, adj. ముసురు మూతితో ఉండు; మూతి ముడుచుకుని ఉండు;
* moon, n. చంద్రుడు; నెల; నెలరాజు; రేరాజు; జాబిల్లి; శశి; ఇందు; ఉడుపతి; కడలి మీగడముద్ద; కడలి వెన్న;
** blue moon, ph. రాకా చంద్రుడు; చంద్రుడు భూమి చుట్టూ తిరిగే కక్ష్యలో ఒక్కోసారి ఒకే నెలలో రెండు పూర్ణిమలు వస్తాయి. అందులో రెండవదానిని "రాకా పూర్ణిమ" అంటారు;
** crescent moon, చంద్రవంక; నెలవంక; శశిరేఖ; బాలచంద్రుడు;
** full moon, ph. పూర్ణచంద్రుడు; రాకాచంద్రుడు; నిండు చంద్రుడు;
** half moon, ph. అర్థచంద్రుడు;
** new moon, ph. అమావాస్య; అమావాస్య తిధిలో చంద్రుడు పూర్తిగా సూర్యమండలాన్వర్తియై - అనగా ఆసాంతము సూర్యుని పరిధిలోనికి వెళ్లకుండా - ఒక దారపుపోగంత చంద్రకళ సూర్యోదయాని కంటే ముందుగా కన్పడినపుడు దానినే "సినీవాలీ " అమావాస్య అంటారు; సిద్ధాంత పరంగా నైతే కృష్ణ చతుర్దశి తో కూడిన అమావాస్యే "సినీవాలీ" అమావాస్య;
** once in a blue moon, ph. ఏటికో, కోటికో, యుగానికో ఒకసారి;
** waning moon, ph. క్షీణచంద్రుడు;
** waxing moon, ph. వర్ధమాన చంద్రుడు;
* moonlight, n. వెన్నెల; నెలవెలుగు; రేయెండ; చంద్రరశ్మి; చంద్రకాంతి; చంద్రిక; చందిరిక; చంద్రగోళి; చంద్రద్యుతి; చంద్రబాల; చంద్రశాల; చంద్రాతపము; చంద్రాలోకము; చాంద్రి; చార్వి; సుధాకర భాతి; కౌముది; అకల్క; అమృతతరంగిణి; ఐందవాతపము; కామవల్లభ; కైరవి; జ్యోత్స్న; జ్యోత్స్నిక; మాలతి; శాతపత్రకము; శాతపత్రకి; హేల;
* moonquake, n. చంద్రకంపం;
* moonshine, n. పరిపక్వం చెందని విష్కీ జాతి మాదక ద్రవ్యాలు
* moonstone, n. ఏణాంక మణి;
* moor, n. బీడు; బీడు భూమి; మెరక; వ్యవసాయానికి పనికిరాని మెరక భూమి;
* mooring, n. ఠావు; తావు;
** moot point, ph. చర్చనీయాంశం; a fact that doesn't matter because it's not relevant to the current situation;
* mop, n. అలుగ్గుడ్డ; అలుకుజుట్ట;
* moral, adj. నైతిక;
** moral governor, ph. నైతిక పాలకుడు;
** moral normativity, ph. నైతిక ధార్మికత; నైతికత;
** moral values, ph. నైతిక విలువలు;
* moral, n. నీతి; కథయొక్క ముఖ్య ఉద్దేశం;
* morality, n. నీతి; నీతి, నియమం;
* morass, n. బాడవ నేల;
* morbid, adj. (1) అనారోగ్యాన్ని సూచించే; రోగాన్ని సూచించే; రోగసూచక; (2) మరణసూచక;
** morbid dilation, ph. రోగాన్ని సూచించే ఉబ్బు;
* morbidity, n. అనారోగ్యం; రోగగ్రస్తం; అనారోగ్యానికి కారణం;
* more, adj. మరిన్ని; మరికొంచెం; ఇంకా; హెచ్చుగా;
** more or less ph. ఇంచుమించుగా; దాదాపు; ఉరమరగా; దరిదాపుగా;
* mordant, n. వర్ణబంధకి; వర్ణలగ్ని; వర్ణస్థాపకి; color binder;
* moreover, adv. పైపెచ్చు; పైగా; అంతే కాకుండా;
* morning, n. ఉదయం; ప్రొద్దు; ప్రభాతం; వరువాత; వేఁకువ; ప్రాతఃకాలం; దివాది; పూర్వాహ్ణము;
** early morning, ph. వేఁకువ; ప్రభాతం; తెల్లవారుజాము;
** good morning, ph. శుభోదయం; సుప్రభాతం;
** morning sickness, ph. వేవిళ్లు;
* moron, n. మొద్దు; మొద్దావతారం; పశుప్రాయుడు;
* morph, n. రూపం; పదాంశం;
* morphemes, n. pl. [ling.] శబ్దాలు; పదాంశాలు; ఒక్క మాటలో అర్థవంతమైన కనిష్ఠాంశాలు; ఉ. చురుకుతనం అనే మాటలో "చురుకు" "తనం" అనే రెండు పదాంశాలు ఉన్నాయి;
** bound morpheme, ph. నిబద్ధ రూపం; విసంధి లేని మాటలు; ఉదా. ఇంగ్లీషులో inept ని in, ept అని విడదీసి అర్థాలు చెప్పలేము; తెలుగులో చెలులు అన్న మాటని చెలు, లు అని విడదీయలేము;
* morphine, n. అభిని; నొప్పిని తగ్గించే ఒక బలమైన మందు;
* morphology, n. రూపనిర్మాణ శాస్త్రం; రూపనిర్మాణం; స్వరూప శాస్త్రం;
* mortal, adj. మరణించేది; మరణం కలిగించేది;
* mortal, n. మర్త్యుడు; మరణించే స్వభావం కలవాళ్ళు అని వ్యుత్పత్తి;
* mortality, adj. మరణించేది; చావు; మృత్యువు; మర్త్యత్వం;
* mortar, n. (1) పొత్రం; ఱోలు; గార; కల్వం; (2) బెందడి; సున్నం; చెక్కసున్నం; సిమెంటు; ఱాతి సున్నం; గార;
* mortgage, n. గిరవు; తనఖా; కుదువ; అడమానం; ఆయకం;
** mortgage loan, ph. ఆయకం; గృహార్ణ; ఇల్లు కొనడానికి చేసే అప్పు;
* mortician, n. శవసంరక్షకుడు; కాటికాపరి;
* mortise, n. కుసి బెజ్జం; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రలో పెట్టే బెజ్జం; రెండవ కర్రకి ఉండే ముక్కుని కుసి అంటారు;
* morsel, n. ముద్ద; కబళం; కరుడు; పిడచ;
* mosque, n. మసీదు;
* mosquito, n. దోమ; చీకటీగ; దంశము; మశకము;
** mosquito net, ph. దోమతెర;
* most, adj. గరిష్థ;
* moss, n. నాచు; పాకుడు; పాచి; శైవాలం; green slime floating in dirty water;
* mote, n. నలుసు; త్రసరేణువు; చూరు చోంచి వచ్చే కిరణవారంలో తేలియాడుతూ కనిపించే దుమ్ము రేణువు;
* motel, n. (మొటేల్) కార్లలో ప్రయాణం చేసే ప్రయాణీకుల సౌకర్యం కొరకు కట్టిన హొటేల్; motor + hotel;
* moth, n. చిమ్మెట; చిల్లక; శలభం; వడ్లచిలుక; బట్టలను తినే పురుగు; ఇవి రాత్రించరులు; Lepidoptera జాతికి చెందిన పరుపు రెక్కల పురుగు; see also butterfly;
** hawk moths, ph. ఆరు అంగుళాల వరకు పరిమాణం కలిగి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఎగురగలవు. పూదేనియ కోసం మూగే హమ్మింగ్ బర్డ్స్ (Hummingbirds) లాగే ఈ హాక్ మాత్స్ కూడా తరచుగా పూలచెట్ల వద్దనే కనిపిస్తాయి;
** vampire moth, ph. మరో రకం వడ్లచిలుకలు తమ ముల్లువంటి పదునైన తొండాన్ని మనుషులు, పశువుల చర్మం మీద గుచ్చి రక్తం తాగుతాయి. ఈ రక్తపిపాసి మాత్స్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి;
* mother, adj. తల్లి; మాతృ;
** mother board, ph. మాతృ ఫలకం; కంప్యూటర్ లోపల ఉండే ప్రాథమిక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్; మదర్‌బోర్డులు చిప్స్, మెమరీ స్లాట్‌లు, ఫర్మ్‌వేర్ చిప్స్ మరియు పవర్ కనెక్టర్ కోసం సాకెట్‌లను కలిగి ఉంటాయి.
** mother cell, ph. తల్లి మాతృ;
** mother planet, ph. మాతృగోళం; మాతృగ్రహం;
** mother tongue, ph. మాతృభాష; తల్లిబాస;
* mother, n. అమ్మ; అంబ; తల్లి; మాత; జనని; జనయిత్రి; ధాత్రి; తాయి;
** adoptive mother, ph. పెంపుడు తల్లి; పెంచుకున్న తల్లి;
** birth mother, ph. జనక తల్లి; కన్న తల్లి;
** step mother, ph. సవతి తల్లి; మారటి తల్లి;
* mother-in-law, n. అత్తగారు; భార్య తల్లి; భర్త తల్లి;
* mother-of-pearl, n. ముత్యపు చిప్ప; ఆలిచిప్ప; ముత్యపు చిప్పలో ఉండే పొర;
* mothers-in-law, n. pl. అత్తలు;
* motherhood, n. మాతృత్వం;
* motherland, n. మాతృభూమి;
* motif, n. పదే పదే ప్రత్యక్షమయే ప్రసక్తి; కళాత్మక రచనలో ప్రధాన ఆంశం;
* motility, n. చలనశక్తి; చలనత్వం;
* motion, n. (1) గతి; చలనం; గమనం; కదలిక; చారణం; చోపనం; (2) విరేచనం; (3) అర్జీ దాఖలు చేయుట; ప్రతిపాదన;
** forward motion, ph. ఋజుర్గతి; ఋజుగతి;
** proper motion, ph. నిజ గమనం; నక్షత్ర నిజగతి;
** retrograde motion, ph. వక్రగతి; పశ్చగమనం; గ్రహచేష్ట; గ్రహం వెనక్కి నడచినట్లు కనబడడం;
** motion picture, ph. చలన చిత్రం; సినిమా;
* motionless, adj. నిశ్చల;
* motivate, v. i. అభిముఖీకరించు; అంగీకరించునట్లు చేయు; ప్రేరేపించు;
* motivation, n. ప్రచోదనం; ప్రేరణ; ప్రేరణకారణం;
* motive, n. ప్రేరణ; ప్రేరణకారణం; ఉద్దేశము; నిమిత్తము;
* motor, adj. చలన; చాలక; గతివాహక; జంగమ;
** motor nerves, ph. చలన నాడులు; చాలక నాడులు;
** motor strip, ph. చలనచార; మెదడులో ఈ చెవి వద్దనుండి ఆ చెవి వరకు ఉన్న మేర;
* motor, n. చాలకం;
** electrical motor, ph. విద్యుచ్చాలకం; విద్యుత్ చాలకం;
** mechanical or manual motor, ph. చేచాలకం; కైచాలకం; మానవచాలకం;
** hydro motor, ph. జలచాలకం; వాశ్చాలకం;
* mottle, n. డాగు; మచ్చ; మరక;
* mount, n. (1) శిఖరం; (2) వాహనం;
* mound, n. తిప్ప; దిబ్బ; గుట్ట;
* mount, n. వాహనం; తత్తడి; సవారీ చెయ్యడానికి అనువైన సాధనం;
* mount, v. t. (1) ఎక్కు; సవారీ చేయు; (2) తొక్కు; పొర్లు;
* mountain, n. పర్వతం; నగం; గిరి; అద్రి; కొండ; చట్టు; traditionally a hill is not considered to be a mountain if the summit is under 1,000 feet; If a hill eventually becomes tall enough to be generally classified as a mountain, it must be located on shifting fault lines that cause an increase in size. For example, the Himalayas once used to be small hills that grew — over millions of years — into the tallest mountain range on Earth, thanks to ongoing collisions between two large tectonic plates. Conversely, mountains can become hills after millions of years of erosion causing them to shrink.
** Mountain peak, ph. పర్వత శిఖరం; నగ శృంగం;
* mourn, v. i. దురపిల్లు;
* mouse, n. చుంచు; చుంచెలుక; చిట్టెలుక; అంజలిక; గిరిక; ఆఖువు;
** field mouse, ph. కల్లెలుక;
* mouth, n. నోరు; మూతి; వాయి;
* movable, adj. చర; జంగమాత్మక;
** movable property, ph. చరాస్తి;
* move, n. (1) ఎత్తు; ఆటలో ఒక ఎత్తు; (2) బదిలీ;
* move, v. i. (1) జరుగు; (2) కదులు; మెదులు; అదురు; చలించు; (3) తిరుగు; మసలు; చెరలాడు; త్రిమ్మరు; క్రుమ్మరు;
** do not move, ph. జరగకు; కదలకు; మెదలకు;
** move with gusto, ph. అదురు;
* move, v. t. జరపు; కదపు; మెదపు; తరలించు; నప్పు;
** do not move, ph. జరపకు; కదపకు; మెదపకు;
* moved, v. i. జరిగిన; కదలిన; మెదలిన;
* movement, n. (1) చలనం; కదలిక; ఇసిరింత; ధూపనం; గతి; గమనం; (2) ఉద్యమం; (3) ఆందోళన;
** fast movement, ph. ద్రుత గమనం;
** national movement, ph. జాతీయోద్యమం;
** slow movement, ph. మెదలిక;
** women's liberation movement, ph. స్త్రీ విమోచన ఉద్యమం;
* movie, n. చలనచిత్రం; తెరాట;
* moving, adj. కదులుచున్న; ఉచ్చల;
* mrigal, n. ఎర్రమీసు; ఎరమీను; ఒక రకం చేప;
* mowing, n. లవనము; గడ్డిని కోయడం;
* mucilage, n. తెమడ; క్లేదము; జిగురు;
* mucus, n. అమత్వక్కు నుండి స్రవించే ద్రవం; ఇది శ్లేష్మం, కఫం, కళ్లె, చీమిడి, ఏదయినా కావచ్చు; see also phlegm;
** mucus membrane, ph. అమత్వక్కు;
* mud, n. బురద; బెందడి; పంకము; అడుసు; ఉబ్బలి;
* muddy, adj. బురద; పంకిలము;
* muddy-up, adj. కెలుకు; బురద చేయు; పంకిల పరచు;
* mud minnow, n. మట్టగిడస; ఒక జాతి చేప;
* muffle, v. t. నొక్కు; అణచివేయు;
* mug, v. t. మీదపడి కొట్టు;
* mug, n. పాన పాత్ర; చేతితో పట్టుకోడానికి చెవి ఉన్న పాత్ర; ఒక రకం కప్పు;
* muggy, adj. ఉక్కగా ఉన్న; ఉమ్మదముగా ఉన్న; వాతావరణంలో వేడి, చెమ్మదనం ఉన్నప్పుడు అసౌకర్యంగా ఉండే అనుభూతి;
* mujahideen, n. (ముజహిదీన్) విశ్వాసులు అవిశ్వాసులపై జరిపే మత యుద్ధాన్ని అరబ్బీ భాషలో 'జిహాద్ ' అంటారు. ఈ యుద్ధంలో పాల్గొనే యోధుడిని 'ముజాహిద్' అంటారు; బహువచనంలో ముజహిదీన్;
* mule, n. కంచర గాడిద; వేసడం; వేష్ట్రం; అతిభారగం;
* Mulligatawny, n. మిరియాల చారు; మిలగు రసం; (ety.) మిళగు = మిరియాలు, తన్నీ = నీరు; This is the name given by the British;
* multi, pref. బహు;
* multidimensional, adj. బహుప్రమాణ;
* multifaceted, adj. విశ్వతోముఖ; బహుముఖ; బహుముఖీన;
* multilingual, adj. బహుభాషా;
** multilingual center, ph. బహుభాషా కేంద్రం;
* multilingualism, n. బహుభాషితం;
** multimedia, n. pl. బహుళ మాధ్యమాలు;
* multinationals, n. pl. బహుళజాతి కంపెనీలు;
** multiple choice, adj. ph. బహూత్తర; బహుళైచ్చిక;
* multiplex, adj. బహుముఖ;
* multiplexer, n. బహుముఖి; ఒక వాకేతాన్ని అనేక దిశలలో పంపిణీ చేసే యంత్ర సాధనం;
* multiplicand, n. గుణ్యం;
* multiplication, n. గుణకారం; హెచ్చవేత; నిహతం;
** cross multiplication, ph. వజ్రగుణకారం; అడ్డగుణకారం;
** multiplication table, ph. ఎక్కం; గుణకార సారణం; గుణసారణి;
* multiplier, n. గుణకం;
* multiply, v. i. వృద్ధిపొందు;
* multiply, v. t. గుణించు; హెచ్చవేయు;
* multipurpose, adj. బహుళార్థక; బహుళార్థసాధక;
* multitude, n. సందోహం;
* mumble, v. i., v. t., సణుగు; గొణుగు;
* mummy, n. చిరకాలం శిధిలమైపోకుండా ఉన్న శవం;
* mumps, n. గవదలు; గాలిబిళ్లలు; పాషాణగర్ధభం; చెవుల వెనక ఉన్న గ్రంథులు వాచడం; ఒక వైరస్ వల్ల వచ్చే జబ్బు;
* mundane, adj. (1) ప్రాపంచిక; లౌకిక; ఇహలోక సంబంధమైన; (2) నిరుత్తేజమైన; ఉత్సాహం లేని; బోరు కొట్టే;
* municipal, adj. పురపాలక;
** municipal high school, ph. పురపాలక ఉన్నత పాఠశాల;
* municipality, n. పురపాలక సంఘం;
* munificence, n. ధాతృత్వం;
* murals, n. భిత్తి చిత్రాలు; గోడ మీద చిత్రించబడే చిత్రాలు;
* murder, n. హత్య; ఖూనీ; హననం;
* murderer, n. హంత; m. హంతకుడు; f. హంతకి; హంతకురాలు;
* murmur, n. మురముర; గుసగుస; ముర్మర ధ్వని; గొణుగుడు;
* muscle, n. కండరం; స్నాయువు; పేశి;
** biceps muscle, ph. ద్విసిర కండరం; దండ;
** triceps muscle, ph. త్రిసిర కండరం;
** musculo-skeletal system, ph. కంకాళ-కండర వ్యవస్థ;
* museum, n. సంగ్రహణాలయం; చిత్రవస్తు ప్రదర్శనశాల;
* mushroom, n. పుట్టగొడుగు; పుట్టకొక్కు; అహిచ్ఛత్రం; కవకం; క్యాకువు; ఒక రకమైన శిలీంధ్రం; -- see also toadstool
* music, n. (1) పాట; గానం; సంగీతం; నాదం; వాద్యం; గీత వాద్య సమ్మేళనం; (2) స్వరకల్పన; (3) వీనులవిందు;
** Carnatic music, ph. (lit.) చెవికి ఇంపైన సంగీతం; దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన సంగీతపు బాణీ:
** classical music, ph. శాస్త్రీయ సంగీతం;
** extempore music, ph. మనోధర్మ సంగీతం; మనోధర్మం;
** folk music, ph. జానపద సంగీతం;
** instrumental music, ph. వాద్య సంగీతం; వాదనం;
** orchestra music, ph. బహువాద్య సమ్మేళన సంగీతం; బహువాద్య సమ్మేళనం;
** vocal music, ph. గాత్ర సంగీతం; గాత్రం;
** Western music, ph. పాశ్చాత్య సంగీతం;
* musical, adj. సంగీత; స్వర;
** musical composition, ph. సంగీత రచన; స్వరకల్పన;
** musical notes, ph. స్వరములు; భారతీయ సంగీతంలో స, రి, గ, మ, ప, ద, ని అనే 7 స్వరములు వాడతారు. పాశ్చాత్య సంగీతంలో ఇవి Do, Re, Mi, Fa, Sol, La, Si (C, D, E, F, G, A, B) కి సమానం;
** musical instruments, ph. వాద్యములు;
** musical score, ph. స్వరకల్పన;
* musical, n. సంగీత నాటకం; యక్షగానం;
* musician, n. పాటకుడు; గాయకుడు, గాయని, సంగీత వేత్త/శాస్త్రజ్ఞుడు; భాగవతార్;
* musings, n. ఊహాగానాలు;
* musk, n. కస్తూరి; మృగనాభి; కురంగనాభం; ఇఱ్ఱి గోరజం; హరిణమదం; ఒక జాతి లేడి పొట్ట దగ్గర ఉండే తిత్తులలో దొరికే ఎరుపు రంగు బంక లాంటి పదార్థం; దీన్ని సుగంధ అత్తరుల తయారీలో వాడతారు;
* musk deer, n. కస్తూరి మృగం; కుచ్చుల మెకం; కస్తూరి కురంగం; ఇఱ్ఱి;
* muskrat, n. కంపెలుక; చుచ్చుందరం;
* muslin, adj. ఉలిపిరి;
* muslin cloth, ph. ఉలిపిరి బట్ట; పలుచని బట్ట;
* mustache, n. మీసం; శ్మశ్రువు;
** wearing a mustache, ph. మీస ధారణ;
* mustard, n. ఆవాలు;
** black mustard, ph. నల్ల ఆవాలు; [bot.] ''Brassica nigra'';
** Indian mustard, ph. ఎర్ర ఆవాలు; [bot.] ''Brassica juncea'';
** white mustard, ph. తెల్ల ఆవాలు; కదంబకం; [bot.] ''Brassica alba'';
* muster, n. పనివాళ్ల పేర్ల జాబితా;
* musty, adj. గవులు కంపు; ముక్క వాసన; గుహల వాసన;
* mutability, n. మార్పు; మారే తత్త్వం;
* mutatis mutandis, ph. వివరములలో తగిన మార్పులతో; ఉదా: "what is true of undergraduate teaching in England is equally true, mutatis mutandis, of American graduate schools"
* mutagen, n. ఉత్పరివర్తకం;
* mutation, n. ఉత్పరివర్తన; యాధృచ్ఛిక పరివర్తన; మార్పు;
** dominant mutation, ph. ప్రబల ఉత్పరివర్తన;
** recessive mutation, ph. మసక ఉత్పరివర్తన;
* mutilation, n. వైకల్యం; వికలత్వం; వికలత;
* mutiny, n. తిరుగుబాటు;
* muttering, n. గొణుగుడు; సణుగుడు;
* mutton, n. మేకమాంసం; గొర్రె మాంసం; యాటకూర;
* mutual, adj. పరస్పర; పారస్పర్య; అన్యోన్య; ఉభయ;
** mutual agreement, ph. పరస్పర అంగీకారం; ఒకరితో మరొకరు అంగీకరించడం;
** mutual dislike, ph. ఒకరినొకరు నచ్చుకోకపోవడం;
* mutually, adv. ఉభయతారక; పరస్పర;
** mutually beneficial, ph. ఉభయతారకం; పరస్పరం లాభకరం;
** mutually complementary concepts, ph. పరస్పర పూరక భావాలు;
** mutually dependent, adj. పరస్పరాశ్రయ;
** mutually dependent, n. పరస్పర ఆశ్రయాలు;
** mutually exclusive, adj. పరస్పర వ్యావర్తక;
** mutually exclusive environments, ph. పరస్పర వ్యావర్తక పరిసరాలు;
** mutually opposed, ph. విప్రతిపన్నం;
* muzzle, n. (1) ముట్టె; పశువుల మూతి భాగం; (2) తుపాకి; ఫిరంగి మొదలైన ఆయుధాల మూతి;
* my, pos. pron. నా; నాది; మదీయ; నా యొక్క;
* mycelium, n. బూజు; శిలీంధ్రజాలం;
* mycology, n. శిలీంధ్రశాస్త్రం;
* myna, n. మైనా పిట్ట; గోరువంక; గోరింక;
* myopia, n. హ్రస్వదృష్టి; దగ్గర వస్తువులు మాత్రమే కనబడే దృష్టి దోషం; (ant.) presbyopia;
* myriad, n. అయుతం; చెప్పలేనన్ని; బోలెడు; లెక్కకు మీరిన;
* myrrh, n. సాంబ్రాణి; బోళము; గోపరసము; పరిమళము గల ఒక రకం బంక;
* mystery, n. (1) హేత్వాతీతం; హేతువుకి అందనిది; గుహ్యము; (2) అపరాధ పరిశోధక కథ;
* mystic, n. m. తాంత్రికుడు; ఆధ్యాత్మికుడు; మార్మికుడు;
* mystique, n. (మిస్టీక్)(1) కొందరి వ్యక్తుల చుట్టూ ఉండే భయ-భక్త వాతావరణం; (2) కొన్ని కార్యక్రమాలచుట్టూ ఉండే రహశ్య వాతావరణం;
* mystical, adj. ఆధ్యాత్మిక; తాంత్రిక; దురవగాహమైన; సులభంగా ఆకళింకు లొంగని;
* myth, n. (1) సత్యదూరం; బూటకం; కల్పిత గాథ; పుక్కిటి పురాణం; (2) పురాణము; పురాణ కథ; నిజంగా జరిగేయా, లేదా అనే వివేచన లేకుండా తరతరాలుగా చెల్లుబాటు అవుతూ వస్తూన్న వీర గాథలు; ఇటువంటి కథలలో మానవులు, దేవుళ్ళు, వింత జంతువులు కూడ కనబడుతూ ఉంటాయి;
* mythological, adj. పౌరాణిక;
* mythology, n. పౌరాణిక కథ; పురాణ గాథా సర్వస్వం; పురాణం;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
dxpifk40y5q2woval4rumppfk4ocugz
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/S
0
3007
39204
39188
2026-06-01T15:20:12Z
Vemurione
1689
/* Part 1: sa-sc */
39204
wikitext
text/x-wiki
<br />
=నిఘంటువు=
*This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* This dictionary uses American spelling as the primary entry word. British spelling is also shown, whenever possible.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
25 Aug 2015.
==Part 1: sa-sc==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
*
* '''sac, n. సంచి; తిత్తి; బస్తా; గోతం;
* sacramental offering, ph. నైవేద్యం; ప్రసాదం;
* sacred, adj. మంగళప్రదమైన;
** sacred necklace, ph. మంగళసూత్రం; తాళిబొట్టు; శతమానం;
** sacred thread, ph. యజ్ఞోపవీతం; జందెము;
* sacrifice, n. (1) బలి; (2) త్యాగం; ఆహుతి;
** human sacrifice, ph. నర బలి;
* sacrilege, n. దేవదూషణ; చెయ్యరాని పని; అపవిత్రం; ధర్మోల్లంఘన;
* sacrum, n. త్రికాస్థి;
* saddle, n. జీను;
* sadism, n. హనన క్రౌర్యం; ఒకరిని హింసించి చూసి ఆనందించడం; రతి క్రీడలో ఎదుటి వారి శరీరానికి బాధ కలిగే పనులు చేసి ఆనందం పొందడం; see also masochism;
* sadist, n. హింసాళువు; ఎదుటి వారి శరీరానికి బాధ కలిగే పనులు చేసి ఆనందం పొందే వ్యక్తి; (ety.) Marquis de Sade అనే వ్యక్తి పేరు మీదుగా వచ్చిన మాట;
* safe, adj. సురక్షితమైన; నిరపాయమైన; నిక్షేపంగా;
* safe, n. (1) ఇనప్పెట్టి; మందసం; ఖాయిదా; (2) నిరపాయం; నిక్షేపం;
* safeguard, n. చేకాపు;
* safeguard, v. t. కాపాడు; రక్షించు; బ్రోచు; సాకు;
* safely, adv. క్షేమంగా; భద్రంగా; పదిలంగా;
* safety, n. క్షేమం; యోగక్షేమం; భద్రత;
[[File:Illustration Carthamus tinctorius0.jpg|thumb|right|250px|''Carthamus tinctorius'']]
* safflower, n. కుసుంభం; కుసుంభ పువ్వు; కుసుంభా పుష్పం [bot.] Carthamus tinctorius;
** safflower oil, ph. కుసుంభ తైలం; కుసుంభ నూనె;
* saffron, n. కుంకుమ పువ్వు; కేసరి; అగ్నిశిఖ;
* sag, v. i. కుంగు;
* sagacity, n. జాణతనం; సూక్ష్మగ్రాహత్వం; గడుసుతనం;
* sage, n. (1) ముని; రుషి; (2) వంటలలో వాడే ఒక సుగంధ ద్రవ్యం; [bot.] Salvia officinalis; Salvia splendens;
* saggy, adj. కుక్కి;
* sagittal suture, n. బ్రహ్మరంధ్రం.; the soft spot on the top of an infant's head;
* Sagittarius, n. (1) ధనూరాశి; (2) ఉత్తరాషాడా నక్షత్రం; ధనూరాశిలో ఉన్న ఒక చిన్న నక్షత్ర సమూహం;
** Delta, Epsilon of Sagittarius, ph. పూర్వాషాఢ నక్షత్రం;
* sagittate, adj. బాణపు మొన ఆకారం కల;
* sago, n. సగ్గుబియ్యం; కొన్ని తాళ జాతుల మొక్కల కాండములలో లభించే పిండి పదార్థముతో చేయబడ్డ కృత్రిమ ధాన్య విశేషం; starch from sago palm ([bot.] ''Metroxylon sagu;'' [see also] tapioca, which is derived from cassava;
* sail, n. తెరచాప;
* sailor, n. ఓఁడంగి, కళాసి; ఆరకాటి;
* saint, n. m. పుణ్యాత్ముడు; దైవసమానుడు; f. పుణ్యాత్మురాలు; దైవసమానురాలు;
* sal, n. ఏపి చెట్టు;
* salable, adj. విక్రేయం; see also sale; seller;
* salary, n. జీతం; సాధారణంగా నెల నెలా ఇచ్చేది; ఒక యజమాని లేదా సంస్థ వద్ద పనిచేయడానికి వచ్చిన ఉద్యగి, పనిలో చేరడానికి ముందు, వ్రాతపూర్వకంగా, వారు చేసిన ఉద్యోగానికి "ఎంత చెల్లిస్తారో, ఒప్పందం చేసుకోబడిన" పరిహారం లేదా ప్రతిఫలం అని చెప్పవచ్చు; దీనికి ఇతర భత్యాలు కలిపే అవకాశం కూడా ఉంటుంది; ఇది సంవత్సరానికి లేదా నెలకి ఒకసారి చెల్లిస్తారు; (rel.) pay; emoluments; stipend; wages;
* sale, n. (1) అమ్మకం; విపణం; వ్యాపారం; విక్రయం; (2) తెగుబడి; ప్రత్యేకంగా తగ్గింపు ధరకి అమ్మకం;
* salient, adj. విశిష్టమైన; ప్రముఖమైన;
* saline, adj. ఊసర; చవిటి; ఉప్పని;
** saline land, ph. ఊసర క్షేత్రం; ఊసర నేల; చౌడు నేల;
** saline soil, ph. ఊసరం; ఊసర నేల;
** saline solution, ph. చవిటి నీరు; ఊసర జలం;
* saline, n. (1) చవిటి నీరు; ఊసర జలం; (2) [med.] లవణోదకము; సేలీను;
* salinity, n. ఉప్పదనం;
* saliva, n. లాలాజలం; ఉమ్మినీరు; నోటూట; చొంగ;
** salivary ducts, ph. లాలాజల నాళములు;
** salivary glands, ph. లాలాజల గ్రంథులు;
* salivation, n. నోటి ఊట; లాలాస్రావం; చొంగ కారడం;
* salt, n. లవణం; ఉప్పు; చవి;
** chemical salt, ph. లవణం; రసాయనపు ఉప్పు; a compound formed when the hydrogen of an acid is replaced by a metal or other cation. Salts are typically crystalline solids and are often formed through neutralization reactions between acids and bases. Common table salt, sodium chloride (NaCl), is a specific example of a salt.
** grain of salt, ph. ఉప్పు కల్లు; ఉప్పు రాయి; ఉప్పు బెడ్డ;
** Roman salt, ph. రోమక లవణం; రాతి ఉప్పు;
** rock salt, ph. రాతి ఉప్పు; సైంధవ లవణం; గని ఉప్పు; రవుమకం; రోమక లవణం; (note) రాతి ఉప్పుని సైంధవ లవణం అంటారు. సింధువు అంటే సముద్రం కనుక సైంధవ లవణం అంటే సముద్రపు ఉప్పే. కాని గనిలోకి మాత్రం ఉప్పు ఎక్కడనుండి వచ్చింది? అక్కడ ఒకానొకప్పుడు సముద్రం ఉండడం వల్లనే కదా.
** sea salt, ph. సముద్రపు ఉప్పు; సైంధవ లవణం;
** salt crypt, ph. ఉప్పు పాతర;
** salt marsh, ph. కరవాక; ఉప్పళం; ఉప్పు పర్ర;
** salt warehouse, ph. ఉప్పు కొఠారు;
** salt bed, ph. ఉప్పు మడి;
** Himalayan salt, ph. Salt mined in Pakistan some 300 km from the Himalayas; this salt is pink due to traces of iron oxide (rust) and contains several minerals but is essentially the same as 99%.NaCl;
** kosher salt, ph. పెద్ద స్పటికముల రూపంలో ఉన్న ఉప్పు; Usually large, flaky crystals of pure Sodium chloride; The word "kosher" here has no religious connotation, as in "kosher meat;"
** table salt, ph. ఉప్పు; ఉప్పుబెడ్డ; చవి; బిడము; usually, small, dense crystals of sodium chloride + impurities + additives such as iodine;
* saltpeter, n. పెట్లుప్పు; సురేకారం; యవక్షారం; Potassium nitrate; KNO<sub>3<sub>;
* saltworks, n. ఉప్పురేవు;
* saltiness, n. లావణ్యం; ఉప్పతనం;
* saltless, adj. ఉప్పిడి; చప్పిడి;
* saltpeter, n. యవక్షారం; సురేకారం; పెట్లుప్పు;
* salty, adj. చవిటి; ఉప్పని;
* salty soil, n. ఊసరం;
* salutation, n. అభివందనం; వందనం; నమోవాకము; జోత; నమస్కారం; కయిమోడ్పు; ప్రణతి; ప్రణామం;
** salutation at dawn or dusk, ph. సంధ్యావందనం;
* salvation, n. నివృత్తి; నిర్వృతి; నిష్కృతి; మోక్షం; కైవల్యం;
* salve, n. లేపనం; గాయాలకి పూయు మందు;
[[File:Sambar_%28Cervus_unicolor_unicolor%29_male.jpg|right|thumb|మగ కణుజు]]
* sambur, n. సాంబా; కణితి; కణుజు; భారతదేశపు అడవులలో ఉండే పెద్ద లేడి వంటి మృగం; sambar; [bio.] ''Rusa unicolor'';
* sample, n. మచ్చు; మాదిరి; మచ్చుతునక; ప్రతిరూపం;
** sample lessons, ph. మాదిరి పాఠాలు;
* sampling, n. మచ్చు చూడడం; స్థాలీపులక న్యాయం;
** sampling theory, ph. స్థాలీపులాక సిద్ధాంతం; స్థాలీపులాక వాదం;
* sanction, v. t. (1) మంజూరు చేయు; ఆమోదించు; అనుమతించు; (2) సరఫరాని నిలిపివేయు; ఆంక్షలు విధించు; (note) ఒకే మాటకి వచ్చిన వ్యతిరేకార్థాలు గమనించునది;
* sanctity, n. పవిత్రత;
* sanctuary, n. (1) శరణ్యం; శరణాలయం; ఆశ్రయం; అభయాలయం; (2) పుణ్యస్థలి; గర్భగుడి;
** bird sanctuary, ph. విహంగ శరణాలయం;
** forest sanctuary, ph. అభయారణ్యం;
** wildlife sanctuary, ph. వన్యమృగ శరణాలయం; వన్యమృగ శరణారణ్యం;
* sanctum, n. గుడి;
** inner sanctum, ph. గర్భగుడి;
** outer sanctum, ph. ముఖమండపం;
** sanctum sanctorum, ph. గర్భగుడి; పరమ పవిత్రమైన;
* sand, n. సైకతం; సికత; వాలుక; ఇసుక; కూర్పం;
** sand clock, ph. వాలుకాయంత్రం; ఇసక గడియారం; ఇసుక గడియారము;
** sand dune, ph. ఇసక దిబ్బ; ఇసక తిన్నె; సైకతం; ఇసుక దిబ్బ; ఇసుక తిన్నె;
* sandbank, n. ఎక్కిలి; ఇసక మేట; ఇసుక మేట;
* sandals, n. pl. ఆకుచెప్పులు; ఆకుజోళ్లు;
** sandalwood paste, ph. చందనం; గంధం; మంచిగంధం; గంధపు ముద్ద; చందన ఖమీరం;
** sandalwood tree, ph. చందనపు చెట్టు; గంధపు చెట్టు; పటీరవిటపి; భద్రశ్రీ;
* sandbar, n. ఇసక మేట; ఇసుక మేట;
* sandpaper, n. ఉప్పుకాగితం; గరుకుకాగితం; హంస కాగితం;
* sandpiper, n. ఉల్లంకి; ఒక రకం పక్షి;
** common sandpiper, ph. సాదా ఉల్లంకి; సాధారణ ఉల్లంకి;
** spotted sandpiper, ph. చుక్కల ఉల్లంకి;
** solitary sandpiper, ph. ఒంటరి ఉల్లంకి;
** spotted redshank sandpiper, ph. కెంపుకాలి ఉల్లంకి;
** green sandpiper, ph. ఏరుల్లంకి పిట్ట; పచ్చ ఉల్లంకి;
** greater yellowlegs sandpiper, ph. పసుపుకాళ్ల పెద్ద ఉల్లంకి;
** lesser yellowlegs sandpiper, ph. పసుపుకాళ్ల చిన్న ఉల్లంకి;
** common redshank sandpiper, ph. పగడపుకాళ్ల ఉల్లంకి;
** marsh sandpiper, ph. చిత్తడినేల ఉల్లంకి;
** wood sandpiper, ph. కలప ఉల్లంకి;
* sandy, adj. ఇసక; సికతల; ఇసుక సంబంధమైన;
** sandy soil, ph. ఇసక మట్టి; ఇసుక మట్టి;
* sanguine, adj. (1) రక్తిమ; కెంపు రంగుతో; ఎర్రని; (2) ఉల్లాసపూరితమైన; ఆశావహ;
* sanitation, n. శౌచం; పారిశుధ్యం;
* sanity, n. స్థిరచిత్తత; చిత్త స్థిరత;
* sans, prep. వినా; లేకుండా; కాకుండా;
** sans devotion, ph. భక్తి వినా; భక్తి లేకుండా;
* sap, n. రసం; కర్రు; సారం; పస;
* sapphire, n. నీలం; ఇంద్రనీలం; నీలమణి; నవరత్నాలలో ఒకటి; (ety.) Sans. శనిప్రియా;
[[File:Gardenology-IMG 4861 hunt10mar.jpg|thumb|right|saraca=అశోక]]
* saraca, n. అశోకవృక్షం;
* sarsaparilla, n. సుగంధిపాల; అనంతమూల్; [bot.] ''Smilax officinalis;'' ''Smilax regelii;'' ''Hemidesmus indica;'' ఒక సుగంధ ద్రవ్యం;
* sarcasm, n. ఎత్తిపొడుపు; ఉపాలంభం; వ్యంగ్యం; వక్రోక్తి; సంతక్షణ;
** sarcastic speech, ph. వ్యంగ్యోక్తి;
* sari, n. చీర; కోక; శాటి; సాడి;
* Satan, n. సైతాను; క్రైస్తవ మతంలో మంచికి చుక్కెదురు; మానవుని శత్రువు; ఇస్లాం మతంలో సైతాను అంటే మానవుని శత్రువు; ఈ సైతానునే Devil అని కూడా అంటారు;
* satellite, n. (1) ఉపగ్రహం; (2) అనుచరుడు; ఆశ్రితుడు;
** communication channel, ph. సమాచార పథం; వార్తా పథం;
** communication gap, ph. అవగాహన లోపం;
** communication satellite, ph. సమాచార ఉపగ్రహం;
* satire, n. వక్రోక్తి; ఆక్షేపం; అధిక్షేపం; వ్యంగ్యం; వ్యంగ్యకావ్యం;
* satisfaction, n. సంతృప్తి; సంతృష్టి; తృప్తి; తనివి; తుష్టి; ఆపోక;
* satisfactory, adj. సంతృప్తికరమైన;
* saturated, adj. సంతృప్త;
** saturated hydrocarbons, ph. సంతృప్త ఉదకర్బనాలు;
** saturated fatty acid, ph. సంతృప్త ఘృతికామ్లం;
* Saturday, n. శనివారం; స్థిరవారం; మందవారం;
* Saturn, n. (1) శని; శనిగ్రహం; (2) శనైశ్చరుడు; శనైః అంటే నెమ్మదిగా, చరః అంటే నడచే వాడు అని వాచ్యార్థం; వేదాంగ జ్యోతిష్య పరంగా శని గ్రహం తక్కిన గ్రహాలకంటే మిక్కిలి దూరంగా ఉన్నది. అందువల్ల, ఆయన ఒక పూర్తి పరిభ్రమణం చేయడానికి అన్ని గ్రహాలకంటే ఎక్కువ సమయం తీసుకుంటాడు. రాశి చక్రం ఒక సారి చుట్టి రావడానికి, ఆయనకు 30 సంవత్సరాలు పడుతుంది;
* satyr, n. (సేటర్) (1) కామాతురుడు, రిరంసువు; (2) గ్రీకు పురాణ గాథలలో కనిపించే ఒక శాల్తీ; (3) కిన్నరుడు; హిందూ పురాణాలలో కనపడే మనిషి శరీరం, గుర్రపు చెవులు, గుర్రపు తోక ఉండి, కామాతురతతో ఉండే ఒక శాల్తీ; see also centaur;
* saunter, v. i. నెమ్మదిగా, తొందర లేకుండా, నడుచు; పెళ్లి నడకలు నడచు;
* saute, v. t. వేయించు; దోరగా వేయించు; వేపు;
* saucer, n. తాంబాళం; తలియ; తటి;
** flying saucer, ph. ఉడ్డీన తాంబాళం;
* savage, adj. కిరాతక;
* save, adv. వినా; తప్ప;
* save, v. i. ఆదాచేయు; దాచు;
* savings, n. ఆదా; నిల్వలు; పొదుపు మొత్తాలు;
* savory, n. రుచ్యం; రుచి అయిన పదార్థం:
* saw, v. i. చూసెను; చూసితిని; చూసేడు; చూసింది;
* saw, n. రంపం; క్రకచం; కదరం;
* sawtooth, n. రంపపుపన్ను; క్రకచదంతం;
** sawtooth wave, ph. [elec.] క్రకచదంత కెరటం;
* say, v. t. చెప్పు; అను; ఉటంకించు; ఆడు; వచించు; వ్రాక్కుచ్చు; నుడువు;
* saying, n. నానుడి; సామెత; లోకోక్తి; కింవదంతి;
* scab, n. పక్కు; పుండు మీద గడ్డకట్టిన రసి;
* scabies, n. గజ్జి; ఒక రకం చర్మ రోగం; Scabies is an itchy skin condition caused by tiny parasites. It’s passed through skin-to-skin contact, usually during sex. Scabies isn’t dangerous and can be cured;
* scaffolding, n. (1) గోవ; సారువ; పరంజా; (2) మంచె; అరప;
* scalariform, n. నిచ్చెన ఆకారం;
* scalding, adj. మరుగుతూన్న; సలసల మరుగుతూన్న; కాగుతూన్న; దాహక;
[[File:PianoKeyboard.svg|right|thumb|పియానో మీద 12 స్వరముల స్వరదండం]]
* scale, n. (1) పొలుసు; పొర; (2) కొలమానం; కొలబద్ద; గీట్లబద్ద; మానదండం; కాటా; కాకిణి; స్కేలు; (3) ఎత్తు; (4) స్వరమాలిక; స్వరాల శ్రేణి; మేళకర్త; రాగం; a musical scale may contain all the seven ''swaras'' or only a subset of ''swaras''; (5) భారీతనాన్ని సూచించే మాట;
** chromatic scale, ph. పాశ్చాత్య సంగీతంలో 12 స్వరములు కల స్వరదండం; The chromatic scale is a set of twelve pitches ;(more completely, pitch classes), with notes separated by the interval of a semitone; The word chromatic comes from the Greek chroma, color; and the traditional function of the chromatic scale is to color or embellish the tones of the major and minor scales;
** large scale, ph. పెద్ద ఎత్తు; భారీ;
** small scale, ph. చిన్న ఎత్తు; లఘు;
* scale, v. t. (1) ఎక్కు; అధిరోహించు; (2) చేప పొలుసులని ఒలుచు;
* scales, n. (1) తక్కెడ; త్రాసు; తుల; కాటా; కాకిణి; తూనిక; (2) తక్కెడలో ఇటూ అటూ ఉండే సిబ్బిలు; (3) పొలుసులు; చేపల వంటి జీవుల శరీరంమీద ఉండే పొలుసులు;
* scalp, n. మాడు; కపాలం; జుత్తు గీకేసిన తర్వాత కనిపించే శిరోభాగం;
* scam, n. మోసం;
* scan, v. t. ఆలోకించు;
* scandal, n. కళంకం; లజ్జాకర విషయం;
* scanner, n. ఆలోకిని;
* scapegoat, n. బలిపశువు;
* scapula, n. అంసఫలకం; రెక్క ఎముక; భుజంలో ఉన్న పలక వంటి ఎముక;
* scar, n. మచ్చ; కిణం; గాయం మానగా మిగిలే చర్మపు ముడత;
[[File:Scarabaeus.pius.-.calwer.20.12.jpg|thumb|right|Scarabaeus.pius=పేడపురుగు]]
* scarabaeus, n. పేడపురుగు;
* scarce, adj. అరుదైన; అపురూపమైన; దొరకకపోవడం;
* scarce, adv. అరుదుగా; అపురూపంగా; కదాచిత్తుగా;
* scarcely, adv. అరుదుగా; సకృత్తుగా;
* scarcity, n. ఎద్దడి; కొరత; చాలమి; లేమిడి; సంక్షోభం; దొరకకపోవుట;
** scarcity of electricity, ph. విద్యుత్ సంక్షోభం;
** scarcity of water, ph. నీటి ఎద్దడి;
* scare, v. t. భయపెట్టు; హడలగొట్టు; బెదిరించు;
* scarecrow, v. t. బెదురుబొమ్మ; దిష్టిబొమ్మ;
* scatter, v. i. చెదురు; విరజిమ్ము;
* scatter, v. t. జల్లు; విరజిమ్ము; పరిక్షేపించు;
** scatterbrain, n. అపసంతి; a person who is forgetful, disorganized, or unable to concentrate or think clearly;
** scatter diagram, ph. వ్యాకీర్ణ పటం; పరిక్షేప పటం; వ్యాపక పటం;
* scattered, adj. చెదురు మదురుగా; ప్రకీర్ణ; వ్యాకీర్ణ; పరిక్షిప్త; అవకీర్ణ; ప్రకిరణ: ఉద్ధూత;
* scattering, n. జల్లు; చెదరడం; విరజిమ్ముట; పరిక్షేపణం; జల్లడం;
** back scattering, ph. అప పరిక్షేపణం; వెనకకి జల్లడం; పతన వికిరణం పరావర్తనం చెందినప్పుడు, పరావర్తన కోణం పతన కిరణం దిశ నుండి 90 డిగ్రీలకి మించి ఉంటే దానిని అప పరిక్షేపణం అంటారు;
** elastic scattering, ph. స్థితిస్థాపక పరిక్షేపణం; ఈ రకం పరిక్షేపణలో పతన రేణువుల మొత్తం గతిజ శక్తి క్షీణించకుండా పరావర్తన రేణువుల మొత్తం గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An elastic collision is a collision in which there is no net loss in kinetic energy in the system as a result of the collision. Both momentum and kinetic energy are conserved quantities in elastic collisions. Suppose two similar trolleys are traveling toward each other with equal speed. They collide, bouncing off each other with no loss in speed. This collision is perfectly elastic because no energy has been lost.
** inelastic scattering, ph. ఘన పరిక్షేపణం; కేరం బల్ల మీద పిక్కలు గుద్దుకున్నప్పుడు ఈ రకం పరిక్షేపణ జరుగుతుంది; ఈ రకం పరిక్షేపణలో పతన రేణువుల మొత్తం గతిజ శక్తిలో సింహ భాగం క్షీణించి, మిగిలినది పరావర్తన రేణువుల గతిజ శక్తికి ఆపాదించబడుతుంది; An inelastic collision is a collision in which there is a loss of kinetic energy. While the momentum of the system is conserved in an inelastic collision, kinetic energy is not. This is because some kinetic energy had been transferred to something else. Thermal energy, sound energy, and material deformation are likely culprits. Suppose two similar trolleys are traveling towards each other. They collide, but because the trolleys are equipped with magnetic couplers they join together in the collision and become one connected mass. This type of collision is perfectly inelastic because the maximum possible kinetic energy has been lost. This doesn't mean that the final kinetic energy is necessarily zero; momentum must still be conserved.
* scavenger, adj. పాకీ;
* scavenger, n. బలిభుక్కు; బలిభుజం; చచ్చిపోయిన జీవులని తినే జంతువు;
* scene, n. (1) దృశ్యం; ఈక్షితం; సన్నివేశం; (2) ఘట్టం; (3) రాద్ధాంతం;
* scenery, n. దృశ్యం; ఈక్షితం;
* scent, n. (1) వాసన; సుగంధం; (2) తావినూనె; అత్తరు; సెంటు;
* scepter, n. రాజదండం;
* schadenfreude, n. ఎదుటివాడికి తగిన శాస్తి జరిగిందని సంతోషించడం;
* schedule, n. కాలసూచి; కాలపట్టిక; అనుసూచి; సమయాపన; సేపరము; షెడ్యూలు; (2) అధికరణం; రాజ్యామ్గంలో ఒక భాగం;
* scheduling, n. సేపరణ; ఒక సమయం ఎన్నుకుని ఏర్పరచు;
* schema, n. బొమ్మ; వ్యూహం;
* schematic, n. ఒక పథకాన్ని నఖచిత్రంలా చూపించే బొమ్మ;
* scheme, n. ఎత్తు; పద్ధతి; ఉపాయం; పథకం; తంత్రం; వ్యూహం; వ్యూహరచన; యుక్తి; పన్నాగం; కుట్ర;
* schizophrenia, n. మనోవిదళనం; ఒక రకమైన మానసిక వ్యాధి; వాస్తవమేదో, భ్రమ ఏదో తెలియకుండా, ఏవేవో అపోహలతో, సాంఘికమైన లంకెలు లేకుండా ఉండే ఒక తత్త్వం;
* schmooze, n. బాతాకానీ;
* scholar, n. m. పండితుడు; ప్రాజ్ఞుడు; పారంగతుడు; విబుధుడు; భట్టారకుడు; మనీషి; ధీమతి; దీర్ఘదర్శి; f. పండితురాలు; ప్రాజ్ఞి; విదుషి; విదుషీమణి;
* scholarship, n. (1) పాండిత్యం; వైదుష్యం; ప్రజ్ఞ; విద్వత్తు; వేత్తృత్వం; (2) విదార్థి వేతనం;
* school, n. బడి; పాఠశాల; విద్యాలయం; పడగసాల;
** school of thought, ph. వాదం; సిద్ధాంతం; అభిప్రాయం; మతం;
* sciatic, adj. కటి; తుంటి; ఆసన;
* science, n. శాస్త్రం; విజ్ఞానం; విన్నాణం; నీతి;
** applied science, ph. ఉపయుక్త శాస్త్రం;
** mathematical science, ph. గణిత శాస్త్రం;
** penal science, ph. దండనీతి; penal code;
** political science, ph. రాజనీతి;
** pure science, ph. ఔపపత్తిక శాస్రం;
* scientific, adj. శాస్త్రీయ; వైజ్ఞానిక;
** scientific attitude, ph. శాస్త్రీయ వైఖరి;
** scientific method, ph. శాస్త్రీయ విధానం; శాస్త్రీయ పద్ధతి;
** scientific perspective, ph. శాస్త్రీయ దృక్పధం;
* scintillation, n. ప్రస్పురణం; తళుకులు;
* scion, (సియన్) , n. వారసుడు; వంశోద్ధారకుడు;
* scissors, n. కత్తెర; కృపాణి; కర్తరి; కడిదెన; (ety.) కడియు (నరుకు) అనే తెలుఁగు ధాతువుకు ఎన = వెనుజేర్పు అనే ప్రత్యయాన్ని కలిపి రూపొందించినట్టిది.
* sclerosis, n. శరీరంలోని కణజాలం మెత్తదనం కోల్పోయి గట్టిపడడం;
** otosclerosis, n. మధ్యచెవిలోని మూడు బుల్లి ఎముకలు విశృంఖలంగా ఎదిగి చలనం కోల్పోవడం;
* scold, v. t. తిట్టు; నిందించు; మాటలు అను; ఆడిపోసికొను;
* scoot, v. i. డేకు; దేకు; slide in a sitting position;
* scope, n. అవకాశం; ఆస్కారం;
* scorch, v. i. మాడు; మలమల మాడు;
* scorch, v. t. మాడ్చు; మలమల మాడ్చు;
* score, n. (1) అంకాలు; ఆటలలో వచ్చే “గెలుపులు ”; స్కోరు; ఆటల పోటీలలో జట్లకి వచ్చే మార్కులు; (2) స్వరకల్పన; సంగీత దర్శకుడు కుదిర్చే వాద్య సంగీతం; (3) ఇరవై; కోడిగ;
* scorn, v. t. తిరస్కరించు;
* scorn, n. తిట్టు; ఆరడి;
* Scorpio, n. [[వృశ్చికరాశి]]; ఆకాశంలో కనిపించే ద్వాదశ రాశులలో ఒక రాశి;
** Alpha, Sigma, Tao of Scorpio, ph. జ్యేష్ఠ నక్షత్రం;
** Beta, Delta, Pi of Scorpio, ph. అనూరాధ నక్షత్రం;
* scorpion, n. [[తేలు]]; వృశ్చికం;
** black scorpion, ph. నల్ల తేలు; ఎనుప తేలు;
** large black scorpion, ph. మండ్రగప్ప; పుట్టతేలు;
** red scorpion, ph. ఎఱ్ఱ తేలు;
* scoundrel, n. తులువ; కుత్సితుడు; దగుల్భాజి;
* scour, v. t. రుద్దు; పాము;
* scouring rushes, n. అశ్వవాలం; ఒకరకం గడ్డి;
* scout, v.t. పరిశీలన చేయు;
* scrap, adj. చిత్తు; బీడు; రద్దు;
** scrap iron, ph. చిత్తు ఇనుము; బీడు ఇనుము;
** scrap paper, ph. చిత్తు కాగితం;
* scrape, v. t. గీకు; గోకు;
* scratch, n. గీర; గీరిక;
* scratch, v. t. గోకు; గీరు; రక్కు; బక్కురు;
** gently scratch, ph. గోకు; గీరు;
** harshly scratch, ph. రక్కు; బక్కురు;
* scream, n. గావు కేక; అరుపు;
* screen, n. (1) తెర; తెరచీర; యవనిక; ప్రతిసీర; కనాతి; (2) అడ్డు; వ్యవధానం; ముసుగు; (3) గాజుతెర;
* screen, v. t. (1) తెరమీద బొమ్మ వేసి చూపించు; (2) అడ్డు పెట్టు; (3) వైద్య పరీక్ష చేసి ఫలానా జబ్బు ఉందో లేదో నిశ్చయించు; వడకట్టు; ఎంపిక చేయు;
* screenplay, n. చిత్రానువాదం; చిత్రానుకరణ; చిత్రానుసరణ; ఒక కథని సినిమా తియ్యడానికి వీలుగా మలచి రాసిన రాత;
* screenshot, n. తెరపట్టు; కంప్యూటర్ తెర మీద కనిపించే అంశాన్ని బొమ్మ రూపంలో పట్టుకునే ప్రక్రియ ద్వారా సేకరించిన బొమ్మ;
* screw, n. నీల; కీలం; మర; మరమేకు; చీల; మరచీల; మరచుట్టు;
* screwdriver, n. మరచుట్టు ని తిప్పే కొరముట్టు;
* screwpine, n. మొగలి; గేదంగి; గొజ్జంగి;
* screw, v. t. (1) సీలతో బిగించు; (2) పాడు చేయు;
* scribble, v. t. బరుకు; గిలుకు;
* scribe, v. i. రాయు; లిఖించు;
* scribe, n. లేఖరి; లేఖకుడు; రాయసకాడు; రాతకాడు; వ్రాయసకాడు; నోటితో చెబితే కాగితం మీద రాసే ఆసామీ;
* scrip, n. చీటీ; చందా చీటీ;
* script, n. (1) లిపి; వ్రాత; లేఖనము; అక్షర విన్యాసము; see also font; (2) రాతప్రతి; సంభాషణలు రాసిన పుస్తకం;
* scriptures, n. pl. పవిత్ర గ్రంథాలు;
* scroll, n. (1) కాగితపు చుట్ట; చుట్ట చుట్టిన పొడవైన కాగితం; (2) చుట్టచుట్టిన పొడవైన కాగితం మీద రాసిన రాత; (3) జాబితా;
* scroll, v. i. జరుపు; పొడవైన జాబితాని చిన్న తెర మీద చదవడానికి వీలుగా పైకి, కిందకి జరపడం;
** scroll bar, ph. జరుపుడు పట్టా; చిన్న కంప్యూటర్ తెర మీద పొడుగ్గా ఉన్న రాతని పైకి, కిందకి జరపడానికి వాడే ఉపకరణం;
* scrotum, n. బీజకోశం; సాటెం;
* scrub, v. t. తోము; రుద్దు;
** scrub jungle, ph. చిట్టడవి; a plant community characterized by vegetation dominated by shrubs, often also including grasses, herbs, and geophytes;
* scruples, n. ధర్మాధర్మ శంక; పాపభీతి;
* scrupulous, adj.ధర్మాధర్మ శంక గల; పాపభీతిగల;
* scrupulously, adv. నిష్టతో; నమ్మకంగా;
* scrutiny, n. సూక్ష్మపరీక్ష;
* sculptor, n. శిల్పి; కారువు;
* sculpture, n. శిల్పం;
* scum, n. (1) తెట్టు; జల పదార్థాలమీద తేలే మరొక పదార్థం; సాధారణంగా మలిన పదార్థం; (2) మడ్డి; జల పదార్థాలని నిలబెడితే దిగువకి దిగే మరొక పదార్థం; సాధారణంగా మలిన పదార్థం; (3) పాచి; నిల్వ ఉన్న మురికి నీటిలో కనబడే ఆకుపచ్చని పదార్థం;
* scurvy, n. శీతాదం; [[విటమిన్ సి]] లోపం వల్ల కలిగే ఒక జబ్బు;
* Scuttlebutt, n. వ్యర్థప్రసంగం, జల్పనం. సుద్దులు; వదంతి; వినికిడి; జనప్రవాదము; లోకవార్త; (కిం)వదంతి; పుకారు; rumor; gossip;
* scythe, n. కొడవలి; వంకర కత్తి;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 2: sd-sl==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
* '''sea, n. సముద్రం; సింధువు; మున్నీరు; సాగరం; జలనిధి; జలధి; జలరాశి; అర్ణవం; కడలి; కంధి; అబ్ధి; అంబుధి; ఉదధి; నీరాకరము; రత్నాకరము; పారావారము; వారాశి;
** inland sea, ph. తట్టు కడలి;
** sea breeze, ph. సముద్ర మారుతం; కడలి తెమ్మెర;
** sea gull, ph. సముద్రపు పావురం; సముద్రపు గువ్వ;
** sea level, ph. సముద్ర మట్టం; కడలి మట్టం;
** sea shore, ph. సముద్రపుటొడ్డు; పారావారం; చెలియలికట్ట; కడలిటొడ్డు;
* seafarer, n. నావికుఁడు;
* seafood, n. మీనాద్యాహారాలు; కడలి తిండి;
* seal, n. (1) అతుకు; (2) ముద్ర; ముద్రిక; మొహరు; సీలు; (3) నీటి సింహం -- Sea Lion;
* seal, v. t. (1) అతుకు; అంటించు; (2) ముద్రవేయ; సికా వేయు;
** sealing wax, ph. లక్క; సికా లక్క; యావం;
* seam, n. కుట్టు; అతుకు;
* seamstress, n.f. కుట్టు పనిచేసే స్త్రీ;
* sear, v. t. మాడ్చు;
* search, v. t. వెతుకు; అన్వేషించు; శోధించు; గవేషించు; గాలించు; దేవు; తనిఖీ చేయు; నెమకు;
** search in water by dragging, ph. దేవు;
* search, n. అన్వేషణ; శోధన; సోదా; గవేషణ; వెతుకుడు;
** search engine, ph. అన్వేషణ యంత్రం; శోధన యంత్రం; గవేషణ యంత్రం; ప్రపంచ వ్యాప్తంగా కంప్యూటర్ల వాడకం పెరిగిన తర్వాత ఎవరెవరి కంప్యూటర్లలో ఏ విషయాలు లభ్యమవుతాయో వెతికే యంత్రం;
** search for truth, ph. సత్యశోధన;
* searchlight, n. కంచు కాగడా; శోధన జ్యోతి;
* seashell, n. గుల్ల; శంఖం;
* season, n. కాలం; ఋతువు; సమయం; అత్తడి;
** Fall season, ph. శిశిరర్తువు; ఆకురాలు కాలం;
** rainy season, ph. వర్షాకాలం; వర్షర్తువు; వానత్తడి;
** autumn season, ph. శిశిరర్తువు; ఆకురాలు కాలం;
** summer season, ph. ఎండాకాలం; వేసవి; గ్రీష్మర్తువు; ఎండత్తడి;
** winter season, ph. శీతాకాలం; చలికాలం;
* season, v. t. తాలించు;
* seasonal, adj. కాలోచిత;
* seasonable, adv. కాలానుగుణ్యంగా; అత్తడికి అనువుగా;
* seasoning, n. (1) మసాలా; సాంబారం; (2) రుచి కొరకు వేసే ఉప్పు; (3) పోపులు, మసాలాలు వేసి రుచిని ఇనుమడించడం; (4) పదునుపట్టడం; ఇనుముతో చేసిన వంట పాత్రలు, పెనాలు తుప్పు పట్టి పాడవకుండా అప్పుడప్పుడు శుబ్రం చేసి, నూనె రాసి ఉంచడం;
* seat, n. (1) ఆసనం; పీఠం; పీట; ఠేవిణి; వితర్థిక; ఉపవిష్టిక; అదివాసం; కూర్చునే చోటు; ఇరువు; సీటు; (2) ఇరువు; స్థానం; సీటు; కళాశాలలో ప్రవేశార్హత;
** seat of the pants guess, ph. [idiom], ఊహాగానం; ఊహ;
* seaweed, n. సముద్ర శైవాలం; సముద్రపు నాచు; సముద్రపు కలుపు; శైవాలం; కడలి కలుపు; కడలి పాచి; కంబుని; Kelps are large seaweeds (algae) belonging to the brown algae (Phaeophyceae) in the order Laminariales; (see also) kelp;
** sebaceous glands, ph. చమురు గ్రంథులు; తైల గ్రంథులు; నూనె కంతులు; చర్మం కింద ఉండే ఈ గ్రంథులలో ఊరే చమురు వల్లనే మన శరీరాలు ఎండి పోకుండా ఉంటున్నాయి;
* secant, n. (1) ఖండన రేఖ; కోత గెర; ఒక వక్రరేఖని రెండు చోట్ల ఖండించే గీత; (2) ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం పొడుగుకీ, లఘు కోణానికి ఆసన్నంగా ఉన్న చిన్న భుజం పొడుగుకీ ఉన్న నిష్పత్తి; కోసైను యొక్క వ్యుత్క్రమము;
* seclusion, n. ఏకాంతం;
* second, n. (1) లిప్త; క్షణం; సెకను; నిమిషంలో అఱవైయవ వంతు; (2) రెండవది; ద్వితీయం;
* second, adj. ద్వితీయ; రెండవ; మలి;
** second printing, ph. మలి ముద్రణ;
** second to none, ph. అద్వితీయం;
** second hand, ph. గడియారంలో సెకండ్లు చూపించే ముల్లు;
* secondhand, adj. ఒకసారి వాడిన; పాతబడిన;
* secondary, adj. ఉప; పిల్ల; అప్రధాన; గౌణ; ద్వితీయ; రెండవ;
** secondary meaning, ph. గౌణార్థం;
** secondary school, ph. ఉన్నత పాఠశాల; రెండవ పాఠశాల;
** secondary stem, ph. ఉపకాండం; ఉపశాఖ; పిల్ల కొమ్మ;
* secondary, n. అప్రధానం; గౌణం; ద్వితీయం; రెండవది;
* secrecy, n. గుప్తత; గోప్యత; గుట్టుతనం; గోపనీయత; విషయాన్ని దాచి పెట్టడం;
* secret, adj. రహస్య; మర్మ; గుప్త; గోప్య;
* secret organs, ph. మర్మేంద్రియాలు; మర్మావయవాలు;
* secret, n. రహస్యం; గుట్టు; మర్మం; గుప్తం; గోప్యం; గాయకం; గుహ్యం;
** open secret, ph. బహిరంగ రహస్యం; రట్టైన గుట్టు;
** top secret, ph. గుహ్యాతి గుహ్యం; గుహ్యతమం;
** unfathomable secret, ph. చిదంబర రహస్యం;
** chamber of secret, ph. గుట్టుల గది;
* secretly, adv. రహశ్యంగా; చాటుగా; దొంగచాటుగా; గుంభనంగా; గోప్యంగా; గుప్తంగా; గుట్టుగా;
* secretariat, n. సచివాలయం; కార్యదర్శుల కార్యాలయం; ఏలుబడి నెలవు;
* secretary, n. కార్యదర్శి; సచివుడు; ఏలుదోఁడు;
* secretion, n. ఊట; స్రావం; కిట్టు; ఉట్రం;
* secretiveness, n. దాపరికం;
* sect, n. తెగ; శాఖ; కొమ్మ; కోవ;
* sectarian, n. శాఖాభిమాని;
* section, n. (1) సర్గం; పరిచ్ఛేదం; భాగం; గణం; ప్రకరణం; స్కంధం; పాదం; ఖండం; సంపాతం; (2) కోత;
** cross section, ph. అడ్డకోత;
** longitudinal section, ph. నిలుకోత;
* sector, n. (1) రంగం; పేట; (2) వృత్తంలో ఒక భాగం;
** public sector, ph. ప్రభుత్వరంగం;
* secular, adj. (1) లౌకిక; ప్రాపంచిక; (2) మతాతీత; మత సంబంధం కాని;
* security, n. (1) భద్రత; బందోబస్తు; (2) జామీను; తాకట్టు; హామీ; ధరావతు; జమానతు;
** security forces, ph. pl. భద్రతా దళాలు;
** security system, ph. భద్రతా వ్యవస్థ;
* Security Council, n. భద్రతా సంఘం;
* sedative, n. శమనకారి; ఉపశమనికం; ఉపశమనాన్ని ఇచ్చే ఔషధం;
* sedentary, adj. నిలగ్న; ఒకే స్థానమందు ఉండేది;
** sedentary lifestyle, ph. నిలగ్న జీవన సరళి; నిలగ్న బతుకు బాణీ;
* sedge, n. తుంగ; ఒక రకం గడ్డి;
* sedition, n. రాజద్రోహం; దేశద్రోహం; అధికారధిక్కారం;
* sediment, n. మడ్డి; గసి; మష్టు; కల్కం; అవసాదం;
* sedimentary, adj. కల్కిక; అవక్షేప; మస్టు;
** sedimentary rock, ph. కల్కిక శిల; అవక్షేప శిల; మస్టు శిల;
** sedimentary rock formation, ph. కల్కిక ఛిలా విన్యాసం; అవక్షేప శిలా విన్యాసం; మస్టు శిలా విన్యాసం;
* sedimentation, n. కల్కనం; మట్టి దిగజారడం; గసికట్టడం; అవసాదనం;
* sedition, n. రాజద్రోహం; ప్రభుత్వపు అధికారులపై తిరుగుబాటును పురికొలుపుట; దేశద్రోహం; treason;
* seduce, v. t. చెరచు; భ్రష్టం చేయు; మరులుగొల్పు;
* seductively, adv. ఒయ్యారంగా; వయ్యారంగా; విమోహకంగా; కామోద్రేకకరంగా;
* see, v. t. చూడు; కను; కాంచు; అవలోకించు; వీక్షించు; దర్శించు; తిలకించు;
* see, v. t. (1) చూడు; కను; కాంచు; అవలోకించు; వీక్షించు; దర్శించు; తిలకించు; ఆలోకించు; (2) అమర్చు; చక్కబెట్టు;
* seed, n. గింజ; విత్తనం; విత్తు; బీజం; రేతస్సు; పిక్క; టెంక;
** orthodox seed, ph. చెట్టునివీడి, ఎండిపోయిన తరువాత కూడ ఎన్నో సంవత్సరాలు మొలకెత్తే శక్తిని కలిగి ఉండే విత్తనం; ఖర్జూరం ఈ రకం విత్తనాలని ఇస్తుంది;
** recalcitrant seed, ph. కొత్తగా, చెమ్మగా ఉన్నప్పుడే మొలకెత్తగల విత్తనాలు; అవకాడో ఈ జాతిది;
* seed, v. t. నాటు; విత్తనం వేయు;
* seedbed, n. నారుమడి;
* seeded, adj. (1) గింజలతో కూడిన; (2) గింజలు తీయబడ్డ; (3) విత్తులు నాటబడ్డ; ( note) వ్యతిరేకార్థములతో ఉన్న మాట;
** seeded bed, ph. నారు మడి;
** seeded bread, ph. గింజలతో కూడిన రొట్టె;
** seeded tamarind, ph. పిక్కతీసిన చింతపండు;
* seeding, n. నాట్లు; విత్తులు నాటడం;
* seedling, n. మొలక; నారు; ఈరిక, Irika
* seeing, adj. దృష్ట; చూసే వ్యక్తికి సంబంధించిన;
* seek, v. i. వెతుకు; కోరు; ఆపేక్షించు;
* seem, v. i. అనిపించు; కనబడు;
* seen, adj. దృశ్య; చూస్తున్న వస్తువుకి సంబంధించిన;
* seep, v. i. ఇంకు; కారు;
* seer, n. ద్రష్ట; ప్రవక్త; అన్నీ తెలిసిన వ్యక్తి;
* see-saw, n. ఏతాం;
* seethe, v. i. ధుమధుమలాడు; కుతకుతలాడు; మండు;
* seldom, adv. సకృత్తుగా; అప్పుడప్పుడు; ఎప్పుడైనా; ఎప్పుడోకప్పుడు;
* self-destructive, adj. ఆత్మవినాశక;
* self-realization, n. ఆత్మానుభవం; fulfillment of one's own potential;
* self-reliance, n. స్వావలంబన;
* segment, n. తొన; భాగం; ముక్క; ఖండం; పరిచ్ఛేదం;
* segregate, v. t. వేరుచేయు; విడదీయు; దూరంగా ఉంచు;
* segregation, n. వేఱ్పాటు;
* seismic, adj. భూకంప సంబంధిత; గ్రహకంప సంబంధిత;
** seismic data, ph. భూధర్మ దత్తాంశాలు;
** seismic waves, ph. భూకంప తరంగాలు;
* seismology, n. గ్రహకంప శాస్త్రం; భూకంప శాస్త్రం;
* seize, v. t. (1) పట్టుకొను; ఆక్రమించు; (2) జప్తుచేయు;
* seldom, adv. అరుదుగా; ఏదో ఒక సారి; ఎప్పుడో ఒకప్పుడు; ఎప్పుడైనా ఒకమాటు; అపరూపముగా; కదాచిత్తుగా; క్వాచిత్కంగా; సకృత్తుగా;
* select, v. t. ఎంచు; ఏరు; ఎంపిక చేయు;
* selection, n. ఎంపిక; స్వీకరణ; ఎన్నిక; వరణం; వివేచనం; (rel.) election;
** artificial selection, ph. కృత్రిమ వరణం;
** Natural Selection , ph. నైసర్గిక నిర్ణయం; నైసర్గిక వరణం;
** Theory of Natural Selection , ph. నైసర్గిక వరణ వాదం;
* selective, adj. వరణాత్మక;
** selective breeding, ph. వరణాత్మక ప్రజననం;
* Selenium, n. సోమం; ఇందియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 34, సంక్షిప్త నామం, Se); [Gr. selene = moon];
* self, pref. ఆత్మ; స్వ; స్వయం; స్వార్థ; సొంత; స్వంత; తాఁ;
* self-aggrandizement, n. ఆత్మస్తుతి; ఆత్మప్రశంస; సొంతడబ్బా;
* self-acquisition, n. స్వార్జితం;
* self-adjoint, adj. స్వానుబంధ;
* self-assertion, n. ఆత్మనిశ్చయం;
* self-centered, n. ఆత్మాభిమాని; తాఁౘుట్టు;
* self-caused, n. స్వయంకృతం;
* self-cleansing, adj. ఆత్మప్రక్షాళిక;
* self-compliment, n. ఆత్మశ్లాఘనం;
* self-conceited, n. గర్వి; గర్వపోతు; అహంవాది; అహంకారి;
* self-condemnation, n. ఆత్మనింద;
* self-confidence, n. ఆత్మవిశ్వాసం;
* self-conscious, n.ఆత్మచేతనం;
* self-control, n. ఆత్మనిగ్రహం; ఆత్మసంయమనం;
* self-defense, n. ఆత్మరక్షణ; తాఁకాపు;
* self-delusion, n. ఆత్మవంచన;
* self-denial, n. వైరాగ్యం;
* self-discipline, n. స్వయంశిక్షణ;
* self-esteem, n. ఆత్మగౌరవం; అభిజాత్యం; అతిశయం; ప్రకర్ష;
* self-evident, n. స్వయం విదితం; తాఁదెలివి;
* self-explanatory, adj. స్వయంవివరణాత్మక;
* self-fertilization, n. స్వసంపర్కం; స్వసంయోగం;
* self-government, n. స్వపరిపాలనం; తానేల్పు;
* self-help, n. స్వయంకృషి; తాయూత; స్వయం సహాయం;
* self-inflicted, adj. స్వయంకృత;
* self-interest, n. స్వప్రయోజనం;
* self-less, adj. స్వార్థరహితమైన; నిస్వార్థమైన;
* self-luminous, adj. స్వయంప్రకాశక; దివ్య;
* self-pity, ph. ఆత్మకారుణ్యం; ఆత్మానుకంపం;
* self-pollination, n. స్వపరాగ సంపర్కం; స్వజాతి సంపర్కం; ఆత్మపరాగ సంపర్కం;
* self-reliance, n. స్వావలంబన;
* self-respect, n. ఆత్మాభిమానం; ఆత్మగౌరవం; తన్నదటు (తన + అదటు);
* self-rule, n. స్వరాజ్యం;
* self-seeker, m. స్వార్థపరుడు;
* self-sufficiency, adj. స్వావలంబన;
* self-sufficient, adj. స్వయంసమృద్ధ;
* self-supporting, adj. స్వయంపోషకమైన; నిరాలంబ;
* selfish person, n. ఆత్మంభరి; m. స్వార్థపరుడు; స్వార్థకాముడు;
* selfishness, n. స్వార్థం; స్వార్థపరత్వం; ఆత్మంభరత్వం; ప్రలోభం; ఒంటెత్తుతనం; ఒంటెత్తు బుద్ధులు;
* selfless, adj. నిస్వార్థమైన;
* selflessly, adv. నిస్వార్థంగా;
* selflessness, n. స్వార్థరాహిత్యం; నిస్వార్థం;
* sell, v. t. అమ్ము; విక్రయించు;
* seller, n. అమ్మేవాడు; విక్రేత; దాయకుడు; vendor;
* semantic, adj. అర్థ;
** semantic analysis, ph. అర్థ విశ్లేషణ;
** semantic divergence, ph. అర్థ విపరిణామం;
* semanticist, n. మాటల యొక్క అర్థం గురించి కాని, ఆ అర్థం యొక్క మార్పుకి సంబంధించిన విషయాలలో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి;
* semantics, n. అర్థం; పదార్థశాస్త్రం; మాటలయొక్క అర్థానికి సంబంధించిన శాస్త్రం;
[[File:Rail-semaphore-signal-Dave-F.jpg|thumb|right|semaphore=రెక్క]]
* semaphore, n. రెక్క; రెక్కమాను; రెక్కపేడు; లలామం; సంబావుటా; టెక్కెం; వాకేతం;
* semen, n. రేతస్సు; వీర్యం; సాఁడు; పురుష జననాంగాలలో తయారయే తెల్లటి ద్రవం;
* semester, n. అర్ధ సంవత్సరం;
* semi, pref. అర్ధ; అసంపూర్ణ; పూర్తికాని; పదార్థం; ఈ ద్రవంలో వీర్య కణాలు ఉంటాయు; see also sperm;
* semicircle, n. అర్ధవృత్తం;
* semiconductor, n. అర్ధవాహకి; అర్ధవాహకం;
* semicolon, n. అర్ధ బిందువు; వాక్యంలో విరామ చిహ్నం;
* semiconscious, adj. పూర్తిగా స్మారకం లేని;
* seminal, adj. (1) ప్రబలమైన; వ్యాపకత్వము గల; (2) వీర్య సంబంధమైన;
** seminal fluid, ph. రేతస్సు; వీర్యం; సాఁటి నీరు;
* seminar, n. సదస్సు; గోష్ఠి; చర్చాసభ;
* semi-permeable, adj. అర్ధప్రవేశ్య;
* semivowels, n. అంతస్థములు; లఘువులు; అలఘువులు;
** harsh semivowels, ph. అలఘువులు;
** light semivowels, ph. లఘువులు;
* semolina, n. రవ్వ; గోధుమ రవ్వ; సూజీ; the coarse, purified wheat middlings of durum wheat;
* semal tree, n. బూరుగ చెట్టు; శాల్మలీ వృక్షం; [bot.] ''Bombax ceiba'';
* senate, n. శిష్టసభ; పరిషత్తు; భారతదేశంలోని రాజ్యసభ అమెరికాలోని సెనేటుకి సమానం;
* senator, n. శాసనసభలో సభ్యుడు లేదా సభ్యురాలు;
* send, v. t. పంపు; పంపించు;
* sender, n. పంపువాడు; ప్రేషకుడు; ప్రేషకం;
* sendoff, n. వీడ్కోలు; ఉద్యాపన; see also expulsion;
* sendoff, v. t. సాగనంపు; వీడుకొలుపు; పంపించు;
* senescence, n. The aging process; a cell's loss of the ability to divide;
* senility, n. వార్ధక్యంతో వచ్చే మనోదౌర్బల్యం; వార్ధక్యం; వృద్ధాప్యం; ముసలితనం;
* senior, n. (1) పెద్ద; జ్యేష్ఠుడు; గరిష్ఠుడు; (2) నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో నాలుగవ ఏటి విద్యార్థి; (3) పై తరగతి విద్యార్థి; (4) పెద్ద వకీలు;
* senna, n. నేల తంగేడు; సునాముఖి;
* sensation, n. సంవేదనం; సంచలనం;
* sensational, adj. సంచలనాత్మక; ఉద్రేకపూరిత;
* sense, n. (1) ఇంద్రియం; తన్మాత్ర; ఆద (2) తెలివి; జ్ఞానం; (3) భావం; ఉద్దేశం;
** sense of hearing, ph. శ్రవణేంద్రియం;
** sense of sight, ph. చక్షురేంద్రియం;
** sense of smell, ph. ఘ్రాణేంద్రియం;
** sense of taste, ph. రసేంద్రియం; జిహ్వేంద్రియం;
** sense of touch, ph. త్వగింద్రియం;
** sense organs, ph. జ్ఞానేంద్రియాలు;
* senses, n. pl. తన్మాత్రలు;
** five senses, ph. పంచ తన్మాత్రలు;
* sensitiveness, n. సున్నిత తత్వం;
* sensor, n. గోచరి; సంవేదకి; గ్రాహకం;
** glucose sensor, ph. మధు సంవేదకి; మధు గోచరి;
** sensor array, ph. సంవేదక శ్రేణి; గ్రాహక శ్రేణి; గోచర శ్రేణి;
* sensory, adj. సంవేదక;
** sensory information, సంవేదక సమాచారం;
** sensory nerves, ph. సంవేదక నాడులు;
* sensual, adj. శృంగార; విషయాసక్తి గల; ఇంద్రియ సుఖ సంబంధమైన; కామాతురమైన;
* sensuality, n. శృంగారం; కాయువం;
* sensuous, adj. ఇంద్రియాలని ఆకర్షించేటటువంటి శృంగార;
* sentence, n. (1) వాక్యం; మాట (2) శిక్ష;
** complex sentence, ph. సంశ్లిష్ట వాక్యం; చిక్కు మాట;
** compound sentence, ph. ద్వంద్వ వాక్యం; కలగలుపు వాక్యం;
** simple sentence, ph. సరళ వాక్యం; చిన్న మాట;
* sentient, adj. స్పర్శజ్ఞానము కల; చక్షు, శ్రవణ, ఘ్రాణ స్పర్శలతో చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుభవించగల; able to perceive or feel things;
* sentiment, n. (1) మనోభావం, భావవృత్తి, చిత్తవృత్తి, భావానుబంధం, సంవేదన; ప్రబల విశ్వాసం; (2) రసం; ఆర్ద్రత; రాగం;
** sentiment analysis, ph. మనోభావ విశ్లేషణ; వినియోగదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడం;
* sentimental, adj. రసస్పూరిత; మనోభావాలని ప్రదర్శించే విధంగా; లోపలలేని భావాలని పైపైన ప్రదర్శించే విధంగా;
* sentinel, n. కాపు; కావలివాడు; పహరాదారు; రక్షకుడు; సిపాయి;
* sentry, n. కావలి బంటు; హెగ్గాడి;
* sepal, n. [bot.] రక్షకపత్రం; పువ్వు విచ్చుకోకముందు దాన్ని కప్పి ఉంచే మొగ్గ దశలోని ఆకుపచ్చని కప్పు;
* separate, adj. ప్రత్యేకం;
* separate, v. i. ప్రత్యేకం; విడిపోవు;
* separate, v. t. వేరు చేయు; విడగొట్టు; విడదీయు; వింగడించు; అన్యథాకరించు;
* separately, adv. (1) విడిగా; అనామత్తుగా; (2) ప్రత్యేకంగా;
** treat separately, ph. అన్యథాకరించు;
* separation, n. వియోగం; వేఱ్పాటు; ఎడబాటు;
** separatist attitude, ph. వేఱ్పాటు భావం;
* sepsis, n. కుళ్లడం; విషపూరితం అవడం; పూతిదోషం; Sepsis is the body’s extreme, life-threatening response to an infection.
* septic, adj. కుళ్లిన; విషపూరిత; కలుషమైన; పూతిదోష; పూతికర; (ant.) anti-septic = పూత్యారి;
** septic tank, ph. కుళ్లుకోనేరు;
* septillion, n. సెప్టిలియను; అమెరికాలో ఒకటి తర్వాత 24 సున్నలు; 10<sup>24</sup>; బ్రిటన్లో, పాత కాలంలో, 10<sup>42</sup>;
* septuagenarian, n. డెబ్బది, ఎనబది ఏండ్ల మధ్య వయస్సులో ఉన్న వ్యక్తి;
* septum, n. పటి; రెండు కుహరములు మధ్యనున్న గోడ;
* sequel, n. తరువాయి; తరువాయి కథ; తరువాయి గ్రంథం; పరిణామం; ఫలం;
* sequence, n. క్రమం; వరుస; వరుసక్రమం; శ్రేఢి; పరంపర; ఒగి; ఓలి; ఓజ; సొరిది; హాళి; (rel.) series; (note) In mathematics the word sequence (శ్రేఢి) is used to indicate a succession of comma-separated entities whereas the word series (శ్రేణి) is used to indicate partial sums of the same entities; (see also) progression;
** genetic sequence, ph. జన్యు శ్రేఢి;
* sequential, adj. అనుపూర్విత;
* serenade, n. ప్రేమగీతిక;
* serenade, v. t. పాటలతో ప్రేమను వ్యక్తపరచుట;
* serene, adj. ప్రశాంతమైన;
* serendipity, n. కాకతాళీయంగా కలిసొచ్చిన అదృష్టం;
* serf, n. బానిస; కమతగాడు;
* serfdom, n. దాస్యం;
* serial, adj. శ్రేణిక; పరంపరగా; వరుసగా;
* serial, n. శ్రేణిక; ఖండకథ; స్రవంతి; సానుక్రమికం;
* sericulture, n. పట్టుపరిశ్రమ; పట్టుపురుగుల పెంపకం;
* series, n. శ్రేణి; మాల; క్రమం;
** arithmetic series, ph. అంక శ్రేణి; అంకగణిత శ్రేణి; అంకెయొగి; ఉ: 3 + 7 + 11 + 15 + ...
** ascending series, ph. ఆరోహణ శ్రేణి; ఉచ్ఛ శ్రేణి; ఎక్కుయొగి; ఉ: 3 + 5 + 11 + 15 + 16 + ...
** convergent series, ph. పరిచ్ఛిన్న శ్రేణి;
** descending series, ph. అవరోహణ శ్రేణి; దిగుయొగి; ఉ: 16 + 15 + 11 + 10 + ...
** exponential series, ఘాత శ్రేణి; ఘాతీయ శ్రేణి; ఉ: e<sup>−x</sup> =1 − x<sup>1</sup>/1! + x<sup>2</sup>/2! + x<sup>3</sup>/3! + ......
** divergent series, ph. అపసృత శ్రేణి; వెడయొగి;
** geometric series, ph. గుణ శ్రేణి; గుణాత్మక శ్రేణి;
** harmonic series, ph. హర శ్రేణి; హరాత్మక శ్రేణి;
**. hypergeometric series, ph. అతిగుణ శ్రేణి; అతిగుణాత్మక శ్రేణి;
** infinite series, ph. అనంత శ్రేణి;
* serious, adj. (1) ప్రమాదకరమైన; ఘోరమైన; (2) నిజమైన; హాస్యంకాని; గంభీరమైన;
* seriously, adv. నిజంగా;
* sermon, n. ధర్మోపదేశం; ధర్మప్రవచనం;
* serpent, n. సర్పం; పాము; పన్నగం; వ్యాళం; హవ్వరం; ఉరగం;
** serpent stone, ph. మణి; నాగమణి; గోరోచనం ని అరగదీసి నున్నగా చేసిన రాయి; గ్రీకు పురాణగాథ "ఇలియాడ్" లో ఫిలోక్టిటీస్ అనే యోధుడిని పాము కరిస్తే ఆ విషం దిగడానికి మెకేయాన్ అనే వైద్యుడు ఈ రకం నాగమణిని ఉపయోగించేడుట;
* serpentine, adj. మెలికలు తిరిగిన; ఔరగ;
* serrated, adj. దంతురిత; ఱంపపు పళ్ళ వంటి పళ్ళు కల;
* serum, n. లసి; రక్తపు రసిలో కరిగిన ఫిబ్రినోజస్‌ని తీసివేయగా మిగిలినది;
* servant, n. f. సేవకి; సేవకురాలు; పనిమనిషి; కింకరి; భృత్యురాలు; దాసి; పారిక; తొత్తు; చేటకుఁడు; చేటకి;
** son of a servant, ph. తొత్తు కొడుకు;
* servant, n. m. సేవకుడు; పనిమనిషి; భృత్యుడు; దాసుడు; లెంకఁడు; బంటు; కింకరుడు; డింగరి; గులాం; పారికాపు;
* serve, v. t. వడ్డించు; సేవ చేయు; కైంకర్యం చేయు; శుశ్రూష చేయు; ఉపచారం చేయు;
* server, n. (1) ఉపచారి; కింకరి; చేటి; చేటిక; పరిచారిక; సేవిక; (2) ఉపచారం చేసే వ్యక్తి; కైంకర్యం చేసే వ్యక్తి; వడ్డన చేసే వ్యక్తి;
* service, n. (1) సేవ; సపర్య; పరిచర్య; సహాయం; (2) కైంకర్యం; ఉపాసన; పూజ; (3) నౌకరీ; ఊడిగం; దాస్యం; ఒంటరికం; (4) శుశ్రూశ; చాకిరీ; పని; (5) అనువృత్తి; ఉపచర్య; ఉపచారం; (6) క్రియ;
** civil service, ph. ప్రభుత్వానువృత్తి; ప్రభుత్వోపచారం;
** sixteen-fold service, ph. షోడశోపచార పూజ;
** service motto, ph. సేవా ప్రవృత్తి; సేవాభావం;
** service organization, ph. ఉపచార సంస్థ;
** service representative, ph. సపర్య ప్రతినిధి; ఉపచార చారి;
** service to God, ph. కైంకర్యం;
** service to teacher, ph. గురు శుశ్రూష;
* services, n. క్రియలు; ఉపచర్యలు;
** funeral services, అంత్యక్రియలు;
* servitude, n. బానిసత్వం; దాస్యం; ఊడిగం;
* sesame cake, n. తెలకపిండి; తిలపిష్టం;
* sesame seed, n. నువ్వులు; తిలలు; నువ్వు పప్పు; నూపప్పు; తెలికలు;
* sesame oil, n. నువ్వుల నూనె; తైలం; నూనూనె;
* sesquipedalian, adj. బహుపాద సమీకరణ సహిత;
* set, n. (1) సమితి; వర్గం; గణం; సమూహం; కట్టు; తతి; సంపుటం; పటలి; చయము; (2) దృశ్య బంధం; రంగాలంకరణ విశేషం;
** non-empty set, ph. అక్షయ సమితి;
** ordered set, ph. క్రమ సమితి; క్రమ చయము;
** set of hundred (poems), ph. శతకం;
** set of eight (poems), ph. అష్టకం;
** set of five (poems), ph. పంచకం;
** set of two (*), ph. ద్వికం;
* set, v. i. అస్తమించు; క్రుంగు; మునుఁగు; క్రిందకు దిగు;
* set-square, n. మూలమట్టం;
* setting, n. నేపథ్యం;
* settle, v. i. స్థిరపడు; ఇరవుపడు; నెలకొను; అధివసించు;
* settle, v. t. స్థిరపరచు; పరిష్కరించు; తీర్పు చెప్పు; తేల్చు;
** settle down, ph. కుదుటపడు;
* settlement, n. (1) స్థిరనివాసం; స్థావరం; (2) పరిష్కారం; ఫైసలా;
* seven, n. ఏడు; ఆరున్కొక్కటి; సప్తకం;
* seventeen, n. పదిహేడు; పదునేడు;
* seventh, adj. ఏడవ; ఏడో; సప్తమ;
* seventh, n. ఏడవది; సప్తమం;
* sever, v. i. తెగు; తెగిపోవు;
* sever, v. t. త్రెంపు; నరుకు; తెగగొట్టు; తెగటార్చు;
* several, adj. చాలా; పెక్కు; పలు; వేఱ్వేఱు; తమతమ; ఆయా; కొన్ని; కొందఱు;
** several people, ph. చాలామంది; పలువురు; అనేకులు; పెక్కండ్రు; వేవురు;
** several varieties, ph. పలురకాలు;
* severally, adv. ఎవరిమట్టుకు వారు; ఎవరితోవన వారు;
* severance, n. వేఱు చెయ్యడం; విడిపోవడం;
* severe, adj. ఘోర; ప్రచండ; కఠిన; క్రూర;
* severity, n. కఠినత; క్రూరత;
* Seville orange, n. ఇటలీలోని సెవిల్ ప్రాంతంలో దొరికే నారింజ; నారదబ్బ;
* sew, v. t. (సో) కుట్టు;
* sewing, n. కుట్టుపని;
* sewage, n. మురుగు; మురుగునీరు; మురికి నీరు;
* sewer, n. మురుగు గొట్టం; మురుగు కాలవ; మురుగునీటి గొట్టం;
* sewerage, n. మురుగు నీటిని మోసుకుపోయే, శుభ్రపరచే అవస్థాపన వ్యవస్థ;
* sex, adj. లింగ; లైంగిక; శృంగార; కాయువ;
** sex appeal, ph. శృంగారాకర్షణ; కాముకత్వము;
** sex cell, ph. లింగ కణం;
** sex discrimination, ph. లింగ వివక్షత;
** sex education, ph. జననాంగ విద్య; జననాంగ విద్యాశాస్త్రం; కాయువ చదువు;
** sex hormone, ph. లైంగిక ఉత్తేజితం;
** sex organs, ph. జననాంగాలు; జననేంద్రియాలు;
* sex, n. (1) రతి; రతిక్రియ; స్త్రీ పురుష సంయోగం; (2) [gram.] లింగము; ఆడో, మగో తెలిపే పదం; the anatomic and physiological aspects of male versus female bodies; see also "gender;"
** teen sex, ph. కౌమార రతి;
* sexagecimal, adj. షష్టాదశాంశ; షష్ట్యంక; అరవై అంశలు ఉన్న;
** sexagecimal system, ph. షష్టదశాంశ పద్ధతి; షష్ట్యంక పద్ధతి; అరవై అంశలు ఉపయోగించి లెక్కపెట్టు పద్ధతి;
* sextant, n. షడ్భాగి; వృత్తంలో ఆరో భాగం ఆకారంలో ఉన్న ఒక ఖగోళ పనిముట్టు;
* sextillion, n. సెక్స్‌టిలియను; ఒకటి తర్వాత 21 సున్నలు ఉన్న సంఖ్య; 10<sup>21</sup>
* sextuplets, n. pl. షష్ఠకం; షష్ఠకులు; ఒకే కాన్పులో పుట్టిన ఆరుగురు పిల్లలు;
* sexual, adj. లింగ; లైంగిక; దైహిక ప్రేమ;
* sexy, adj. కాముక; కామోద్దీపిక; కామప్రేరిక;
* shackles, n.pl. సంకెళ్ళు;
* shade, adj. లేశం; లవలేశం; పిసరు;
* shade, n. (1) నీడ; ఛాయ;(2) దృగక్షకం;
* shadow, n. నీడ; ఛాయ; క్రీనీడ;
* shaft, n. (1) కాడి: (2) ఏడికోల; బాణం;
* shag, n. ఒత్తుగా, చిందరవందరగా ఉన్న ఉన్ని; ఒత్తుగా చిందరవందరగా పెరిగిన జుత్తు;
* shake, v. i. (1) ఊగు; వీగు; (2) వణుకు;
* shake, v. t. (1) రంగరించు; గిలకరించు; చిలకరించు; (2) ఊపు; ఝళిపించు; కుదుపు; ఆడించు; కంపించు; (3) అసమ్మతిని తెలియజేయడానికి బురన్రి అడ్డుగా ఆడించడం;
* shakeup, v. t. దుళ్లగొట్టు;
* shallow, adj. కాకపేయ; కాకి స్నానం చెయ్యడానికి సరిపడే లోతు గల; లోతు తక్కువైన; సారహీనమైన;
* sham, n. మోసం; నకిలీ; బూటకం; సాకు;
* shambles, n. s. (1) కసాయి గూడెం; (2) చిందరవందరగా, చేపల బజారులా ఉన్న స్థలం;
* shame, n. (1) తలవంపు; అవమానం; అపత్రప; (2) లజ్జ; సిగ్గు;
* shamelessly, adv. సిగ్గు లేకుండా; నిస్సిగ్గుగా;
* shampoo, n. కేశకాంతి; జుత్తుని శుభ్రపరచడానికి వాడే కుంకుడురసం లాంటి పదార్థం;
* shape, n. ఆకారం; ఆకృతి; మూర్తం; రూపం; రూపధేయం;
* shaped, adj. సాకార; ఆకారంతో కూడిన; రూపధేయ;
* shapeful, n. సాకారం; ఆకారం ఉండడం;
* shapeless, n. నిరాకారం; నిరాకృతి; అమూర్తం; (ant.) సాకారం;
* shards, n. పెంకులు; విరిగిన ముక్కలు;
** shards of glass, ph. గాజు పెంకులు;
** shards of pottery, ph. చిల్ల పెంకులు; విరిగిన కుండ ముక్కలు;
* share, n. వాటా; భాగం; వంతు; పాలు; భాగధేయం; దాయం; అంశం; దామాషా; దాయం; హిస్సా; షేరు;
* share, v. i. పంచుకొను;
* sharecropper, n. పాలేరు; కౌలుకి తీసికొన్న రైతు; కామందు దగ్గర పొలాన్ని "అద్దెకి" తీసుకుని, పంటలో ఒక భాగం శిస్తు చెల్లించే వ్యక్తి;
* shareholder, n. వాటాదారుఁడు; భాగస్వామి; భాగస్థుఁడు; భాగధేయుఁడు; పాలివాఁడు; అంశకుఁడు;
* shark, n. ఏలాం; ఏలాంచేప; సొఱచేఁప;
* sharp, adj. వాడిగా; వాడియైన; పదునుగా; పదునైన; చురుగ్గా; చురుకైన; తీక్షణంగా; తీక్షణమైన; తీవ్రంగా; తీవ్రమైన; నిశితమైన; ఉదాత్తమైన; లఘు;
** sharp pain, ph. లఘు శూల; ఉదాత్తమైన నొప్పి;
* sharpen, adj. పదునుపెట్టు;
* sharpness, n. పదును; వాడితనం; నైశిత్యం;
* shave, v. t. గీసు; గొరుగు; కోరు;
* shaved, adj. ముండన;
* shaving, n. ముండనం;
* shavings, n. కోరు; ఛాతనములు; చిత్రిక పట్టడం వల్ల వచ్చే బీడు;
* shawl, n. శాలువా;
** ornamental shawl, ph. దుశ్శాలువా;
* she, pron. (1) remote. అది; ఆమె; (2) respectful. remote. ఆవిడ; (3) proximate. ఇది, ఈమె; (4) respectful proximate, ఈవిడ; (5) sneering. proximate. ఈవిడగారు; (6) sneering. remote. ఆవిడ గారు;
* sheaf, n. కట్ట;
* shear, n. కత్తిరించు;
* shears, n. పెద్ద కత్తెర; మొక్కలని కత్తిరించడానికి వాడే పెద్ద కత్తెర;
* sheath, n. ఒఱ; కోశం;
** intellectual sheath, ph. విజ్ఞానమయ కోశం; తెలివొఱ;
** mental sheath, ph. మనోన్మయ కోశం; మనసొఱ;
* shed, n. పాక; పంచ; శాల; సాల; కొట్టం; గుడిసె:
* shed, v. t. రాల్చు; కార్చు; జల్లు; వదలిపెట్టు;
* sheen, n. జిలుగు;
* sheep, n. గొర్రె; గొర్రెలు; పొట్టేలు; తగరు; ఏడిక; మేషం;
* sheer, adj. కేవలం;
* sheet, n. (1) పత్రం; కాగితం; (2) దుప్పటి; (3) రేకు; తగడు;
* shelf, n. (1) అలమారు; అరమారు; బీరువా; గూడు; (2) స్తరిక; అలమారులో ఒక సొరుగులాంటి అంతస్తు; (2) మేట; ఇసక మేట;
* shell, n. (1) గుల్ల; చిల్లగవ్వ; గవ్వ; చిప్ప; డొల్ల; కంబు; కర్పరం; కోశం; కర్క; (2) కవచం; స్పోటం; తొబక; (3) ఫిరంగిలో గుండు;
** electron shell, ph. ఎలక్ట్రాను కవచం; విద్యుత్కణ కవచం;
** inner shell, ph. అంతర్ కవచం; లోగవ్వ; లోగుల్ల;
** outer shell, ph. బాహ్య కవచం; బాహ్య కోశం; పైగవ్వ; పైగుల్ల;
** pearl shell, ph. ముక్తాస్పోటం; ముత్యపు చిప్ప;
** sea shell, ph. సముద్రపు గుల్ల; సింధుస్పోటం; కడలి గవ్వ; కడలి చిప్ప;
** valence shell, ph. బాలపు కోశం; కడగవ్వ; కడగుల్ల;
* shell lime, ph. గుల్ల సున్నం;
* shellfish, n. గుల్ల చేప;
* shellac, n. పెల్లక్క; అటుకుల లక్క; శుద్ధమైన లక్క; ముడి లక్కని కరగించి, వడపోసి, పెల్లల వలె పోయబడ్డ లక్క;
* shells, n. pl. గుల్లలు;
* shelter, n. ఆశ్రయం; వాసం; మరుగు; రక్షణ;
** food and shelter, ph. ఆశ్రయం; వాసమూ, గ్రాసమూ;
* shelterless, n. ఆశ్రయ హీనులు; ఇల్లులేని;
* shenanigans, n. (1) మోసాలు; (2) లీలలు; అల్లరి చేష్టలు;
* shenanigans, n. pl. (1) కుయుక్తులు;; (2) అల్లరి పనులు;
* shepherd, n. m. గొర్రెల కాపరి; గొఱ్ఱెలవాడు; కురుమువాడు;
* sherry, n. సారాయి; స్పెయిన్ దేశంలో తయారయే తెల్ల సారాని, బ్రాందీని కలపగా వచ్చే ఒక మాదక పానీయం;
* shield, n. డాలు; కవచం;
* shift, n. విస్థాపనం; స్థలం మార్చడం;
** Doppler shift, ph. డాప్లర్ విస్థాపనం;
** paradigm shift, ph. విశ్వవీక్షణ విస్థాపనం;
** red shift, ph. ఎర్ర విస్థాపనం;
* shilly-shally, n. చాదస్తం;
* shin, n. క్రీగాలి ముందు భాగం; మోకాలికీ మడమకీ మధ్యనున్న కాలి ముంభాగం;
* shine, n. ప్రకాశం; రుచి; తేజం; వెలుగు;
* shine, v. i. ప్రకాశించు; రాణించు; భాసిల్లు; అలరు; తేజరిల్లు; వెలుగు; ఉద్యోతించు; హవణిల్లు; పరిఢవిల్లు;
* shingles, n. ఇంటికప్పుకి వాడే పెంకుల వంటి ఉపకరణాలు;
* shining, adj. తేజస్సుతో కూడిన; విద్యోతమాన; ఉజ్వల;
* ship, n. ఓఁడ; నావ; నౌక; తరణి; తరండం; తరి; కలం; కప్పలి;
** cargo ship, ph. కప్పలి;
* ship, v. t. పంపు; బంగీచేసి పంపు;
* shipment, n. ఎగుమతి; ఎగుమతి చేయబడ్డ వస్తువు;
* shipworm, n. సముద్రంలో మునిగిపోయిన కొయ్య పడవలని తినే ఒక రకం సూక్ష్మజీవి; [bio.] ''Teredo navalis'';
* shipwreck, n. నౌకాభంగం; ఓడ పగిలిపోవడం; ఓడ కెడవు;
* shirk, v. t. తప్పించుకొను; కర్తవ్యం త్యజించు;
* shirt, n. చొక్కా; లాల్చీ; కమీజు; జుబ్బా; కంచుకం; అంగీ; ఆంగరకం;
** shirt with a collar and front pocket, ph. చొక్కా; కమీజు;
** shirt without a collar, ph. జుబ్బా;
** short-sleeved inner shirt, ph. జుబ్బా; కంచుకం; బనీను;
** long-sleeved, collar-less, cuff-less (with side pockets) shirt, ph. లాల్చీ; అంగీ; అంగరకా;
* shiver, v. i. వణుకు; కంపించు; కంపరమెత్తు;
* shmear, n. పిసరు;
* shoal, n. మెరక; మేట; ఎక్కిలి; గాధం; లోతు తక్కువగా ఉన్న జలభాగం;
* shock, n. (1) ఘాతం; ఆఘాతం; దెబ్బ; అదురు; గుభిల్లు; (2) నిర్ఘాతం; అకస్మాత్తుగా రక్తపు పోటు పడిపోవడం వల్ల స్మారకం పోయిన పరిస్థితి; (3) మనోఘాతం; విభ్రాంతి; దిగ్భ్రాంతి; కలత; భయోత్పాతం;
** electrical shock, ph. విద్యుత్ ఘాతం; విద్యుదాఘాతం; విద్యుత్ ప్రకోపం; విద్యుత్ గుభిల్లు; షాకు;
** shock absorber, ph. ఘాత శోషణి; చక్రాలున్న బండి కుదుపు లేకుండా నడవడానికి ప్రతి చక్రానికీ తగిలించబడే ఉపకరణం;
* shoddy, adj. చవకబారు; నాణ్యత లేని;
* shoe, n. చెప్పు; పాదుక; పాదరక్ష;
* shoebill, n. తాడిముక్కు కొంగ; తాడితల కొంగ; [zoo.] Balaeniceps rex
* shoemaker, n. గొడారి;
* shoes, n. pl. చెప్పులు; జోళ్లు; పాదుకలు; పాదరక్షలు; పాంకోళ్లు; మెట్లు;
** pair of shoes, ph. చెప్పుల జత;
** wooden shoes, ph. పాంకోళ్లు;
* shoot, n. మొలక; అంకురం; నారు; నవోద్భిజం; అభినవోద్భిజం; ఈరిక; కందళికం; sprout;
* shoot, v. i. మొలకెత్తు; అంకురించు; ఈరికలు ఎత్తు; ముందుకు వచ్చు;
* shoot, v. t. బాణంతో కొట్టు; తుపాకితో కొట్టు;
** shooting stars, ph. ఉల్కలు; తోకచుక్కలు;
* shop, n. కొట్టు; దుకాణం; అంగడి; విక్రయశాల; విపణి; జన్యం; ఆదణం; ఆపణం;
* shop, v. i. కొను; కొనుగోలు చేయు;
* shopkeeper, n. కొట్టువాఁడు; దుకాణదారుఁడు; ఆపణికుఁడు; వైపణికుఁడు;
* shoplifting, n. దుకాణాలలో వస్తువులని దొంగిలించడం;
* shore, n. తీరం; ఒడ్డు; గట్టు; తటి; తటం; దరి; ఈ మాటని పెద్ద పెద్ద జలాశయాల తీరాలని సూచించడానికి వాడతారు; (rel.) beach; bank; coast;
** sea shore, ph. సముద్రతీరం; సముద్రపుటొడ్డు; చెలియలికట్ట;
* short, adj. (1) పొట్టి; కురుచ; గిడస; బుడుగు; నన్న; కుదిమట్టం; లఘు; వామన; హ్రస్వ; (2) తక్కువ; కొరత;
** short story, ph. కథానిక; పిట్ట కథ;
** short syllable, ph. లఘువు; హ్రస్వము;
** short wall, ph. పిట్టగోడ;
** short-sightedness, ph. హ్రస్వదృష్టి;
* shortage, n. కొరత; కొదవ; వెలితి; సంక్షోభం; ఎద్దడి; అభావం; తక్కువ;
** shortage of ideas, ph. భావనాభావం;
** shortage of space, ph. స్థలాభావం;
* short-circuit, n. (1) అడ్డుదారి; దగ్గరదారి; ఉన్మార్గగమనం; (2) లఘు వలయం; ధన, రుణ ధ్రువాల మధ్య అవరోధం లేకుండా విద్యుత్తు ప్రవహించడానికి సులభమైన మార్గం ఏర్పడ్డ పరిస్థితి;
* shortcoming, n. లోటు; లోపం; కొరత;
* short-cut, n. అడ్డుదారి; దగ్గరదారి;
* shorten, v. t. తగ్గించు; కురచ చేయు;
* shortening, n. వనస్పతి; శాక తైలాలతో చేసిన, నెయ్యిని పోలిన ఒక కొవ్వు పదార్థం; While technically shortening is any fat that is solid at room temperature, “shortening” typically refers specifically to hydrogenated vegetable oils. Shortening gets its name from the effect it has on gluten production; the fats shorten gluten strands, making baked goods tender and flaky;
* shortest, n. హ్రస్వతమం;
* shorthand, n. సంక్షిప్తలిపి;
* short-lived, n. ఆకాలికం; పుట్టిన వెంటనే నశించేది;
* short-range, adj. లఘు;
** short-range interaction, ph. లఘు సంకర్షణ;
* shortfall, n. కొరత;
* shortly, adv. కొద్దిసేపట్లో; త్వరలో; స్వల్పకాలంలో;
* shorts, n. లాగు; చల్లడం; అర్ధోరుకము; నిక్కరు;
* short-sighted, adj. దూరాలోచన లేని; దూరదృష్టిలేని;
* short story, n. కథానిక; ఆఖ్యానిక;
* short-tempered, adj. ముక్కోపి అయిన; ముక్కుమీద కోపం ఉన్న;
* short-term, adj. స్వల్పకాలిక;
* shot, n. (1) ; సీసపుగుండు; పడిగల్లు; (2) [cinema] సన్నివేశం లో భాగం;
* should, v. pt. of shall;
* shoulder, n. అంసము; భుజం; భుజశిరం; బాహుశిరం; భుజస్కందం; మూఁపు; అఱక;
** shoulder bag, ph. భుజసేవకం; అఱకడ సంచి;
** shoulder blade, ph. అంసఫలకం; అఱక పలక;
** shoulder joint, ph. భుజసంధి; అఱకంటు;
** shoulder of a bull, ph. మూపురం;
* shoulder, v. t. కొమ్ముకాయు; బాధ్యత తీసుకొను; సహాయ పడు;
* shove, v. t. నెట్టు; గెంటు; తోయు;
* shovel, n. గడ్డపాఱ;
* show, n. (1) ఆట; (2) వేషం;
* show, n. ఆడంబరం;
* show, v.t. చూపించు; చూపు; రుజువు చేయు;
* shower, n. (1) వానజల్లు; (2) స్నానపు జల్లు;
* showy, adj. ఆడంబరంగా ఉన్న;
* shrapnel, n. తూటాతునకలు; తూటాబీడు;
* shred, v. t. ముక్కలు ముక్కలుగా చేయు;
* shredder, n. కాగితాలని చిన్న చిన్న ముక్కలుగా చేసే యంత్రం;
* shrew, n. (1) గయ్యాళి; (2) చుంచు;
* shrewdness, n. గడుసుతనం; యుక్తి; సూక్ష్మబుద్ధి; చాణక్యం; వైదగ్ధ్యం; వ్యవహారిక ఎత్తుగడ;
* shrike, n. కసాయి పిట్ట; కళింగ పక్షి;
** babbler shrike, ph. సైదా పిట్ట;
* shrill, adj. కీచు; కీచుమనే;
* shrimp, n. చిన్న రొయ్య; shrimp are typically placed in the Order Decapoda, which includes other crustaceans like crabs and lobsters.
* shrine, n. చిన్న దేవాలయం; పుణ్యక్షేత్రం;
* shrink, v. t. కుంచించుకొను; తీసిపోవు; ముడుచుకొనిపోవు;
* shrubs, n. pl. తుప్పలు; పొదలు;
* shrug the shoulders, ph. భుజాలు ఎగురవేయు; సందిగ్ధతని తెలియజెయ్యడానికి చేసే చేష్ట;
* shubbalith, n. పడికట్టు మాట; పడికట్టు పదం:
* shut, v. t. మూయు; మూసు;
* shutters, n. తలుపులు; కిటికీ తలుపులు;
* shyness, n. సిగ్గు; బిడియం; మొగపిరికితనం; మొహం చూపించడానికి పిరికితనం;
* shyster, n. నిజాయతీ లేని వ్యక్తి; నిజాయతీ లేని వకీలు;
* siblings, n. pl. తోఁబుట్టువులు; తోడఁబుట్టువులు; అనుజులు; ఏకోదరులు; ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు; సైఁదోఁడులు;
* sic, adv. ఇలా; ఉన్నది ఉన్నట్లు; యథాతథంగా; (ety.) [Lat.] అసలులో ఉన్న తప్పుని యథాతథంగా నకలు తీసినప్పుడు కుండలీకరణంలో sic అని రాస్తారు.
* sick, adj. జబ్బు; జబ్బు పడ్డ; రోగగ్రస్త;
* sickle, n. కొడవలి;
* sickness, n. అస్వస్థత; అనారోగ్యం; జబ్బు; వ్యాధి; రోగం; రుగ్మత; సుస్తీ; తెగులు; కాయిలా;
* side, n. పక్క; సరస; వంక; ఓర; పార్శ్వం; పక్షం; తట్టు; చెంప; గరువు; వాక;
** leeward side, ph. వాలువాక; గాలి వీచే దిశలో;
** on that side, ph. అటు పక్క; అటు తట్టు;
** on this side, ph. ఇటు పక్క; ఇటు తట్టు;
** one side, ph. ఒక పక్క; ఒక తట్టు;
** shore side, ph. కరవాక;
** that side, ph. ఆ పక్క; ఆ తట్టు; ఆ వంక;
** windward side, ph. గాలివాక; గాలి వీచే వైపు;
* side-dish, n. ఉపదంశం; ఓగిరం;
* side-effect, n. అవాంఛనీయ ఫలితం; ఒక రోగాన్ని కుదర్చటానికి మందు ఇచ్చినప్పుడు ఆశించని మరొక ఫలితం;
* side-looking, adj. ఓరచూపుల;
* sideburns, n. pl. చెంపలు; చెంపలమీద జుత్తు;
* sidekick, n. సత్రకాయ; వంతగాఁడు;
* sidereal, adj. (సైడీరియల్) నాక్షత్ర; astral;
** sidereal day, ph. నాక్షత్ర దినం; నడినెత్తి మీద ఉన్న నక్షత్రం మళ్ళా నడినెత్తి మీదకి రావడానికి పట్టు కాలం; నక్షత్రాల నేపథ్యంలో భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం; 23 గంటల 56 నిమిషాలు; భూమి ప్రదక్షణం కారణంగా ఇది 24 గంటల కంటె తక్కువగా ఉంది;
** sidereal month, ph. నాక్షత్ర మాసం;
** sidereal year, ph. నాక్షత్ర సంవత్సరం;
* siege, n. ముట్టడి;
* sieve, n. జల్లెడ; చాలిని;
* sieve, v. t. జల్లించు; జల్లెడపట్టు; see also sift;
* seize, n. ముట్టడి; (rel.) blockade;
* sift, v. t. జల్లించు; వేరు చేయు;
* sigh, n. నిట్టూర్పు;
* sigh, v. i. నిట్టూర్చు;
* sight, n. దృష్టి; లోచనం; దృశ్యం; వీక్షణం; ఈక్షణం; చూఁపు; చూఁడ్కి;
** line of sight, ph. లోచనపథం; అక్ష మార్గం; చూఁగీత;
** long sight, ph. దీర్ఘ దృష్టి; దూరపు వస్తువులే కనిపించడం; చత్వారం; దౌఁజూఁపు;
** short sight, ph. హ్రస్వ దృష్టి; దగ్గర వస్తువులే కనిపించడం;
* sigmoid, adj. ఆంగ్లాక్షరం 'S' ఆకారంలో ఉన్న;
* sign, n. (1) గుర్తు; సన్న; సంజ్ఞ; చిహ్నం; జాడ; సంకేతం; అభిజ్ఞ; (2) రాశి;
** birth sign, ph. జన్మ రాశి; ఆమతి గుర్తు;
** negative sign, ph. ఋణ సన్న;
** positive sign, ph. ధన సన్న;
** sign language, ph. సన్నభాష; కుమ్ముసుద్ధి; సంకేత వృత్తాంతం;
* sign, v. t. సంతకం పెట్టు;
* signal, n. సంకేతం; సంజ్ఞ; సూచకి; వాకేతం = వార్త + సంకేతం;
** analog signal, ph. సారూప్య వాకేతం;
** digital signal, ph. అంక వాకేతం;
** signal processing, ph. వాకేత సంవిధానం; వాకేత సంవిధీకరణ;
* signal, v. t. వాకేతించు; సంకేతించు;
* signatory, n. సంతకం చేసిన వ్యక్తి;
* signature, n. సంతకం; చేవ్రాలు; హస్తాక్షరం; దస్కతు;
* signet, n. ముద్ర; రాజముద్ర; అభిజ్ఞానం;
* significance, n. ప్రాముఖ్యం; మహత్వం; ముఖ్యత; సార్థకత;
* significant, adj. ముఖ్యమైన; విశేష; సార్ధక; గణనీయమైన; అన్వర్థక;
** significant digit, ph. అన్వర్థక అంకం;
** significant half, ph. అర్ధాంగి; సార్థక భాగస్వామి;
* silence, n. (1) నిశ్శబ్దం; (2) మౌనం; మూకీభావం;
* silent, adj. నిశ్శబ్దమైన; మూకీ; మూఁగ; మౌన;
** silent majority, ph. మౌనభూషణులు;
** silent, n. ph. అనుచ్చరితం; తూష్ణీకం;
** silent R, ph. అనుచ్చరిత రకారం;
** silent state, ph. తూష్ణీక స్థితి;
* Silica, n. సిలికాన్ డై ఆక్సైడ్ కి పొట్టి పేరు; ఇసక లో ఎక్కువ భాగం ఇదే; Silica is found naturally in some foods, and it is added to many food products and supplements. It is commonly used in the form of silicon dioxide as an anti-caking agent in foods and supplements to keep ingredients from clumping up or sticking together, and it’s sometimes added to liquids and beverages to control foaming and thickness.
** Silica gel, ph. Silica gel is an amorphous and porous form of silicon dioxide, consisting of an irregular tridimensional framework of alternating silicon and oxygen atoms with nanometer-scale voids and pores. The voids may contain water or some other liquids, or may be filled by gas or vacuum;
* Silicon, n. సైకతము; సిలికాను; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 14, సంక్షిప్త నామం; Si) [Lat] silex;
* Silicon Valley, n. సిరి కోన; (లరయో నబేధః)
* Silicone, n. సిలికోన్; a synthetic polymer built on the backbone of Silicon and Oxygen atoms, whereas a plastic is built on the backbone of Silicon, Oxygen, and Carbon atoms; Extremely versatile material;
* silhouette, n. (సిలూయెట్) ఛాయారూపం; పొడ; నీడబొమ్మ;
* silk, n. పట్టు; చీనాంబరం;
** Chinese silk, ph. చీనీ చీనాంబరం; చీనా పట్టు;
* silkworm, n. పట్టుపురుగు;
* silly, adj. చిలిపి; తెలివితక్కువ; బుద్ధిలేని;
* silo, n. గాదె; ధాన్యాగారం; ధాన్యపు గిడ్డంగి; కోష్ఠాగారం; కొటారం; లిబ్బి; పాతర; అంబారం; అంబర్‌ఖానా;
* silt, n. ఒండుమట్టి; ఒండు; వండలి; పూడిక;
* silt, v. i. పూడు; పూడిక; ఒండలి; ప్రవాహంలోని బురద, మట్టి, వగైరా;
* silting, n. పూడిక; ఒండుమట్టితో పూడిపోవడం;
* Silver, n. వెండి; రజతం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 47, సంక్షిప్తనామం, Ag); [Lat.] Argentum;
** silver nitrate, ph. రజత నత్రితం; AgNO<sub>3 </sub>;
** German silver, ph. రాగి, జింక్ మరియు నికెల్ ల మిశ్రమం; కొన్నిసార్లు సీసం మరియు టిన్ కూడా కలిగి ఉంటుంది. మూడు మూలకాల శాతం దాదాపుగా రాగి (50%), జింక్ (19%) మరియు నికెల్ (30%) వరకు ఉంటుంది. దీనికి మొదట దాని వెండి-తెలుపు రంగు కారణంగా జెర్మన్ సిల్వర్ అని పేరు పెట్టారు, కానీ 'వెండి' అనే పదం ఇప్పుడు ఆ లోహాన్ని కలిగి లేని మిశ్రమాలకు నిషేధించబడింది;
* simian, adj. వానర;
* simian, n. వానరుఁడు;
* similar, adj. సరూప; సారూప్య; పోలినటువంటి;
** similar triangles, ph. సారూప్య త్రిభుజాలు;
** similar units, ph. సారూప్య శాల్తీలు;
* similarity, n. సారూప్యం; సాపత్యం; సాదృశ్యం; పోలిక; ఉపమితి;
* similitude, n. సాజాత్యం; తౌల్యం; సామ్యం;
* simile, n. (సిమిలీ) ఉపమాలంకారం; ఉపమానం;
* simmer, v. i. ఉడుకు; మరగు; నెమ్మదిగా సన్నటి సెగ మీద మరుగు;
* simple, adj. వ్యస్త; సాదా; సాధారణమైన; బారు; అవ్యాజ; అలతి;
** simple interest, ph. బారువడ్డీ; సరళ వడ్డీ;
** simple word, ph. వ్యస్తపదం; అలతి పదం;
* simple, n. వ్యస్తం; సాదా; సాధారణం; బారు; అవ్యాజం;
* simpleton, n. దద్దమ్మ; వెర్రిబాగులవాడు; వెర్రిబాగులది;
* simplification, n. సూక్ష్మీకరణ;
* simplify, v. t. సూక్ష్మీకరించు;
* simultaneous, adj. యుగపత్తు; ఏకకాల; జమిలి; సమాంతర;
** simultaneous elections, ph. జమిలి ఎన్నికలు;
** simultaneous equations, ph. జమిలి సమీకరణములు;
* simultaneously, adv. యుగపత్తుగా; ఏకకాలంలో;
* simulated, adj. పెట్టుకోలు; అభికరణ; అసలు దానివలె;
** simulated pearls, ph. పెట్టుకోలు ముత్యాలు;
** simulated praise, ph. పెట్టుకోలు ప్రశంస;
* simulation, n. పెట్టుకోలు; అభికరణ; విడంబన; అసలు దానివలె ప్రవర్తించడం;
* simultaneity, n. యౌగపద్యం; సమకాలికత్వం;
* sin, n. పాపం; పాతకం; భవం; కసటు; కావలం;
** heinous sin, ph. మహాపాపం; మహా పాతకం; పెంగసటు; పెంగావలం;
** ocean of sin, ph. భవసాగరం; కావలాల కడలి; కసటుల కడలి;
** remover of sin, ph. భవహరుఁడు;
* sincere, adj. నిష్కపటమైన; కపటములేని; హృదయపూర్వక; చిత్తశుద్దిగల; విశ్వాసపాత్ర;
* sincerely, adv. చిత్తశుద్ధిగా; హృదయపూర్వకంగా;
* sincerity, n. చిత్తశుద్ధి; నిష్కాపట్యం; ఆర్జవం;
* sine, n. శంకువు; జ్యా; త్రిజీవా; త్రిజ్యా; కోణం యొక్క ఉన్నతి; లంబకోణ త్రిభుజంలో కోణము ఎదురుగా ఉన్న భుజం; కర్ణము పొడుగుల నిష్పత్తి;
* sine qua non, n. అవసరమైన షరతు; ఆవశ్యకమైనది; అత్యావస్యకమైనది; తప్పనిసరి;
* sinew, n. (1) స్నాయువు; నరం; (2) బలం; శక్తి; త్రాణ; సామర్ధ్యం;
* singer, n. పాటరి; m. గాయకుడు; పాటగాడు; గాణ; గాణుడు; f. గాయని; పాటకత్తె; గాణ; గాణీ;
* single, adj. ఏక; ఒక; ఒంటరి;
* single-file, adj. ఒక వరుసలో; ఒకరి వెనకాతల ఒకరు;
* single-minded, adj. ఏకదీక్షగా; అసహాయంగా;
* singular, adj. ఏకైక; అరుదైన; అసమాన్య; విశిష్ట;
* singularity, n. ఏకైకత్వం; ఏకత్వం; వైపరీత్యం; విశిష్టస్థితి; చోద్యం;
* sink, v. i. మునుగు; ఇంకు;
* sink, v. t. ముంచు;
* sink, n. మునుఁగుతొట్టి; శోషకం; నిమజ్జకం; నిర్గమస్థానం; గ్రాహకం; గమ్యం; సింకు;
* sinistral, adj. ఎడమవైపు; వామావర్త;
* sinner, n. m. పాపాత్ముఁడు; f. పాపాత్మురాలు; కాసటుఁడు; కావలుఁడు;
* sinuous, adj. వంపులు తిరిగిన;
* sinusoidal, adj. తరంగిత; కెరటాకారంలో ఉన్న;
* sir, inter. అయ్యా; స్వామీ; (ety.) short for sire;
* sire, n. తండ్రి; అయ్య; అబ్బ;
* sire, v. i. కను; (exp.) a man sires and a woman bears and delivers;
* Sirius, n. మృగవ్యాధ రుద్రుఁడు; కుక్కచుక్క; శ్వాన నక్షత్రం; (ety.) ఋగ్వేదంలో వచ్చే “శునాశీరా” అనే కుక్క ఉంది (IV-57-5). That became శేర్య that became Sirius, according to Max Muller; ఆకాశంలో అత్యంత ప్రకాశవంతమైన ఈ నక్షత్రం కుక్క ఆకారంలో ఉన్న నక్షత్ర రాశి ముట్టె మీద ఉన్నట్లు అనిపిస్తుంది; మృగవ్యాధుడు (ఒరాయన్ నక్షత్ర రాశి లేదా మృగశీర్ష రాశి) ఉదయించిన కొద్ది సేపట్లో ఈ చుక్క దక్షిణాన కనిపిస్తుంది; మృగవ్యాధుడి పటకాలో ఉన్న మూడు నక్షత్రాలని కలిపే సరళరేఖని దక్షిణానికి పొడిగిస్తే అక్కడ కుక్కచుక్క కనిపిస్తుంది;
* sister, n. అక్క; చెల్లి;
** elder sister, ph. అక్క;
** younger sister, ph. చెల్లెలు; చెల్లి; చెల్లాయి;
* sit, v. i. కూర్చొను; కూర్చుండు;
* site, n. స్థలం;
* sit-in, n. బైఠాయింపు;
* sitomania, n. ఆకలిగొట్టుతనం; తిండిపోతుతనం; తిండిమీద ధ్యాస;
* sitomaniac, n. తిండిపోతు;
* situation, n. (1) పరిస్థితి; అవస్థ; స్థితిస్థానం; (2) స్థానం; ఉద్యోగం;
* sit-ups, n. గుంజీలు;
* six, n. ఆఱు; ఇరుమూఁడు; ఇత్తిగ; షట్కము; షష్ఠి;
** group of six, ph. ఆరుగురు;
** six-pack, ph. (1) ఆరు బీరు సీసాల బంగీ; (2) నిత్యం వ్యాయామం చేస్తూ, మంచి దేహసౌష్టవం ఉన్న వారి పొట్ట మీద స్పుటంగా అందంగా కనిపించే ఆరు కండరాల సముదాయం;
** Six Sigma, ph. సిక్స్ సిగ్మా నియమాలు (Six Sigma Principles) అనేది ఉత్పత్తి, అమ్మకం రంగంలో సవ్యమైన నిర్వహణకు అవలంబించే ఒక పద్ధతి. ఈ పద్ధతి వలన ఒక వాణిజ్య సంస్థ తన కొనుగోలుదారులు, వినియోగదారులకు ఖచ్చితమైన వస్తువులు , ఉత్పత్తులు లేదా సేవలను ఉత్తమ ప్రమాణాలతో ఎటువంటి లోపాలు లేకుండా అందివ్వగలదు. ఈ పద్ధతిలో DMAIC (Define, Measure, Analyze, Improve and Control) అని , DMADV (Define, Measure, Analyze, Design and Verify) అని రెండు శాఖలు ఉంటాయి.
* sixteen, n. పదహారు; షోడశం;
* sixteenth, n. పదహారవది; షోడశం;
* sixth, adj. ఆరవ; షష్ఠము; షష్ఠి;
** sixth sense, ph. దివ్యదృష్టి; షష్ఠేంద్రియం;
* sixty, n. అఱవై; షష్టి; ఇరుముప్ఫై;
** sixty four, ph. అరవై నాలుగు; చతుష్షష్టి;
* size, n. కైవారం; కొలత; పరిమాణం; మట్టు; సైజు;
* skein, n. ఉండ; దారపుండ; బంతి; నూలుకండె; బుడఁత;
** skein of string, ph. దారపు ఉండ;
* skeleton, n. అస్థిపంజరం; కంకాళం; ఎమ్మూట; ఎముకల మూట;
** exo skeleton, ph. బాహ్య కంకాళం; పైయెమ్మూట;
** skeleton in the closet, ph. ఇంటిగుట్టు;
* skeptic, sceptic, n. సంశయవాది; సంశయాళువు; నిత్యశంకితుఁడు; సందేహశీలుఁడు; ప్రతిదానిని శంకించే వ్యక్తి;
* skeptical, adj. అనుమానాస్పద; సంశయాత్మక;
* skepticism, n. సంశయవాదం; సంశయాత్మకం;
* sketch, n. (1) రేఖాకృతి; రేఖాపటం; నఖ చిత్రం; గెఱపటం (2) గల్పిక; చిత్రణ;
** thumbnail sketch, ph. నఖచిత్రం; గోటిగెర;
* skill, n. నైపుణ్యత; కౌశలం; నేర్పు; చతురిమ; చాతుర్యం; పాటవం; ప్రావీణ్యం; చాకచక్యం; దక్షత; విన్ననువు;
** business skill, ph. వ్యాపార దక్షత;
* skim, v. t. (1) మీగడతీయు; (2) పైపైన తాకు, స్థూలదృష్టితో చూచు;
** skimmed milk, ph. వెన్న తీసేసిన పాలు;
* skin, n. చర్మం; తొక్క; తోఁప; తోలు; చమడా; ప్రభాసిని; త్వక్కు; అజినం;
** skin of milk, ph. మీఁగడ;
* skin, v. t. ఒలుచు; చమడాలు ఒలుచు; చర్మం తీయు;
* skink, n, బిందిపాము; నలికళ్ళ పాము; రక్తపుచ్చం; ఇది చిన్న పాములా కనిపించే బల్లి; రక్తపుచ్చం అంటే ఎర్రని తోక గలది అని అర్థం; బిందిపాము గాఢమైన ఆకుపచ్చ, నలుపు రంగులలో మధ్య నిలువు లేత రంగు చారలతో మెరుస్తూ ఎరుపు తోకను కలిగివుంటుంది. కొన్ని మొత్తం ఒకే రంగులో కూడా వుంటాయి. దీనికి రెండు జతల కాళ్లు తల వెనుక, తోక ముందు భాగంలో వుంటాయి. చిన్న చిన్న కీటకాలు వీటి ఆహారం;
* skinny, adj. సన్నని; బక్కపలచని;
* skip, v. t. దాటు; గెంతు; లంఘించు;
** skip a meal, ph. లంఘనం చేయు; లంకణం చేయు;
* skirmish, n. కన్నెకయ్యం; కలఁత; వివాదం; చిన్న యుద్ధం;
* skirt, n. పావడా; చేలాంచలం; లంగా;
** long skirt, ph. పరికిణీ;
** skirt, v. t. తప్పించు; చుట్టుతిరుగు; దాటు;
* skit, n. నాటిక; తక్కువ నిడివిలో నాటకం; ప్రహసనం; హాస్యనాటిక; వ్యంగ్యకావ్యం;
* skittish, adj. బెదిరిపోయే; బెదురు;
** skittish animal, ph. బెదురుగొడ్డు;
* skull, n. పుర్రె; కరోటి; కరంకం; కపాలం; పునుక; (చర్మ, మాంసాదులని తీసివేయగా మిగిలిన శిరోభాగం)
** skull bone, n. పుర్రె ఎముక;
* sky, n. ఆకాశం; అంబరం; గగనం; నింగి; నభం; విను; మిన్ను; అంతరిక్షం; వ్యోమం; ఖ; దివి;
* Sky fruit, n. అడవి బాదం; చేదు బాదం; సుగర్ బాదం; ఇది చాలా చేదుగా ఉంటుంది;
ఆ చేదు వర్ణనాతీతం; పైన పొట్టు తీస్తే లోపల పప్పు తెల్లగా ఉంటుంది దీన్ని కొంచెం చితకొట్టి మాత్ర లాగా మింగేయాలి; [bot.] ''Swietenia Mahogany;''
* skyrocket, n. తారాజువ్వ;
* skyscraper, n. అంబరచుంబితం; అభ్రంకషం; ఆకాశాన్నంటే భవనం; నింగిని తాకే మిద్దెలు;
* sky way, n. వినువీథి; గగనమార్గం; నింగిత్రోవ; దివిబాట;
* sky wheel, n. అరఘట్టం; ఆకాశ చక్రం; వినోదవనాలలో తరచు కనిపించే పెద్ద చక్రం;
* slab, n. కడీ; దిమ్మ;
* slackness, n. అలసత్వం;
* slag, n. తెట్టు; చిట్టెం; మండూరం; లోహమలినం; ధాతుమలం;
** iron slag, ph. ఇనుప చిట్టెం;
* slake, v. t. తడుపు; చల్లార్చు;
* slaked, adj. తడిపిన; చల్లార్చిన;
** slaked lime, ph. తడిసున్నం;
* slander, n. అపవాదు; దూషణ;
* slander, n. పరువు తీసే మాట; పరువు నష్టపు మాట; అపనింద; అపవాదు; ఆడిక; (note) a slander is a spoken word injurious to the reputation of another person; (rel.) libel; ok
* slang, n. ఏస; గ్రామ్య భాష;
* slant, n. వాలు; వాలుదల; వాటం; అధోక;
* slant, v. i. వాలు; దోరగిల్లు;
* slant, v. t. వాల్చు; దోరగించు;
* slantingly, adv. వాలుగా; ఆధోకగా; వాలుదలగా;
* slap, n. చెంపదెబ్బ;
* slat, n. బద్ద; సన్నని కర్ర; చీరిక;
* slate, n. (1) పలక; (2) నాపరాయి; (3) అభ్యర్థుల జాబితా;
** slate pencil, ph. బలపం; పలకపుల్ల;
* slather, v. i. పులుముకొను;
* slather, v. t. పులుము; ఒంటి మీద లేపనం పుష్కలంగా పులుము;
* slaughterhouse, n. కబేళా;
* slave, n. బానిస; గులాం; m. దాసుడు, భృత్యుడు; f. దాసి;
** slave mentality, ph. బానిసత్వపు బుద్ధి; మనోదాస్యం;
* slavery, n. బానిసత్వం;
* slay, v. t. చంపు; సంహరించు; హతమార్చు;
* slayer, n. సంహర్త; చంపువాడు; నిహంత; హంతకుడు; హంతకి;
* slaying, n. హననం; వధ;
* sledgehammer, n. సమ్మెట;
* sleep, n. నిద్ర; సుప్తం; సుప్తి; కునుకు;
** deep sleep, ph. సుషుప్తి;
** disturbed sleep, ph. కలఁత నిద్ర;
** dreamless sleep, ph. సుషుప్తావస్థ;
* sleepiness, n. నిద్రమత్తు;
* sleeping, adj. సుప్త; నిద్రిత; కునుకిన;
** sleeping beauty, ph. సుప్త సౌందర్యవతి; కునుకు వన్నెలాడి;
* sleepy, adj. నిద్రాణమైన;
* sleet, n. మంచువాన; తుషారవృష్టి; హిమవర్షం;
* sleeves, n. pl. చేతులు; దుస్తులలో చేతిమీదకి వచ్చే భాగం;
** puffed sleeves, ph. బుట్ట చేతులు;
* sleuth, n. అపరాధ పరిశోధకుడు; గూఢచారి;
* slice, n. ముక్క; తొన;
* slide, n. (1) పలక; (2) జారుడు బల్ల; జారుడు పలక;
* slide, v. i. జారు; కైజారు;
* slide, v. t. జార్చు; దూర్చు;
* slightly, adv. కొద్దిగా; చూచాయగా;
* slip, adj. జారు;
** slip knot, ph. జారు ముడి;
* slip, n. చీటీ;
* slip, v. i. జారు; దిగజారు; v. t. జార్చు;
* slippery, adj. జారుడుగానున్న;
* slime, adj. తుచ్ఛమైన; నిలకడ లేని;
** slime ball, ph. తుచ్ఛుడు;
* slime, n. పాకుడు; బంకబురద; బెందడి; ఱొంపి; విజ్జలి;
* sling, n. (1) ఉండేలు; వడిసెల; ఒడిసెల; క్షేపణి; పిట్టలబారు; కేటిల్‌బారు; చిన్న చిన్న ఱాళ్ళు ఱువ్వడానికి వాడే ఉపకరణం; (2) భుజంమీద నుండి వస్తువులని వేలాడదీయడానికి వాడే ఉపకరణం;
* slingshot, n. same as sling;
* slip, n. (1) అమ్మాయిలు లోఁపల వేసుకొనే మెత్తటి దుస్తులు; (2) తప్పు దొర్లడం; (3) కాగితం ముక్క;
** slip of the tongue, ph. మాట తడబడి నోరు జారడం;
* slip, v. i. జారు; స్ఖలించు; జారవేయు; జారవిడుచు;
* slip, v. t. జార్చు;
* slip-knot, n. జారుముడి;
* slippers, n. pl. చెప్పులు; పాదరక్షలు;
* slippery, adj. జారుగా ఉన్న; జారెడు;
* slipshod, adj. బిగుతులేని; ఒదులుగా ఉన్న జోళ్ల వలె; పనితనం లేని;
* slit, n. కంత; సన్నంగా, కోలగా ఉన్న రంధ్రం; బీట; చీలిక;
* sliver, n. చిన్న ముక్క; పిసరు; ఏకు;
* slogan, n. నినాదం; ఘోష;
* slope, n. నతి; వాలు; వాలుతనం; వాలుదల; ఏటవాలు; గండీ; ప్రవణత; నతిక్రమం;
* slouch, v. i. నడుం వంచి కూర్చొను; నిటారుగా కాకుండా భుజాలు వేలాడేసిన భంగిమ;
* slough, n. (1) (స్లఫ్) కుబుసం; జీవం లేని కణజాలం; అవసరంలేని పైపొర కాని వస్తువు కాని, ఏదైనా సరే; (2) (స్లవ్) రొంపి; బురద భూమి;
* slough, v. i. (స్లఫ్) రాలు; రాలిపోవు; మాను, మానిపోవు;
* slough, v. t. (స్లఫ్) పారవేయు; రాల్చు; పేకాటలో పట్టు మనదే అయినప్పుడు అక్కరలేని ముక్కని పారవెయ్యడం; see also rough;
* slow, adj. నెమ్మది; మంద; మెల్లని; జడ;
** slow flow, ph. మందాకిని; మంద + అకిని;
** slow motion, ph. మందగతి;
** slow mover, ph. మందగామి;
** slow moving person, ph. మందయానుఁడు; మెల్లగఁబోవువాఁడు;
* slowly, adv. నెమ్మదిగా; నింపాదిగా; మెల్లగా; మందముగా; (rel.) నిదానంగా;
* slug, n. (1) మెట్ట జలగ; అత్త; నత్తలలాగే ఇవి కూడా అతి మెల్లగా ప్రయాణిస్తాయి. అయితే నత్తలకి ఉన్నట్లు వీటికి గుల్లలు (Shells) ఉండవు. నత్తలలాగే మెట్ట జలగలు కూడా గాస్ట్రోపోడా (Gastropoda) తరగతిలోని సిగ్మురెత్రా (Sigmurethra) కుటుంబానికి చెందుతాయి. నీటి జలగల (Leeches) లాగా వీటికి రక్తం పీల్చే స్వభావం లేదు; (2) బద్ధకిష్టి; same as land slug; (3) పురాతన బ్రిటిష్ కొలమానం; The slug is a derived unit of mass in a weight-based system of measures, most notably within the British Imperial measurement system and the United States customary measures system;
* sluggish, adj. బద్ధకపు;
* sluggishness, n. అలసత్వం; బద్ధకత్వం;
* sluice, n. అలుగు; మదుం; తూము; వరద గేటు; నీటిగండి; పరివాహం; తూపరాణ; దేవరాతం;
* slum, n. మురికివాడ;
* slumber, n. నిద్ర; కునుకు;
* slump, n. ధరలు పడిపోయిన పరిస్థితి;
* slur, n. (1) సరిగా ఉచ్చరించకుండా మాటలని నమిలేయడం; (2) సంగీతంలో ఒక రాగంలోంచి మరొక రాగంలోకి జారి స్వరసంకరం చెయ్యడం; (3) దూషణ;
** racial slur, ph. జాత్యహంకారంతో పలికే దూషణ వాక్యం; దూషణ భాషణం;
* slurp, v. i. జుర్రు;
* slut, n. లంజ; నీతి లేని ఆడుది; పలువురు మగవారితో కులికే ఆఁడది;
* sly, adj. టక్కరి;
** sly fox, ph. టక్కరి నక్క; వంచన శృగాలం;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 3: sm-ss==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
* small, adj. చిన్న; చిరు; చిట్టి; చంటి; పిట్ట; లఘు; లవ; లేశ; సన్నకారు;
** small farmer, ph. సన్నకారు రైతు;
** small quantity, ph. కొద్దిగా; రవంత; లవం; లేశం; లవలేశం;
* small caltrop, n. పల్లేరు;
* small-scale, adj. లఘు; కుటీర; సన్నకారు;
** small-scale industry, ph. లఘు పరిశ్రమ;
* smaller, adj. లఘీయ; అల్పీయ;
* smallest, adj. లఘిష్ఠ; అల్పిష్ఠ; కన్య; కనిష్థ;
* smallpox, n. స్పోటకం; మసూచికం; పెద్దమ్మవారు;
* smartness, n. తెలివితేటలు; గడుసుతనం; వైదగ్ధ్యం; ప్రోడతనం;
* smattering of knowledge, ph. మిడిమిడి జ్ఞానం;
* smear, v. t. పూయు; పులుము; అలుకు; అలదు; చరుము;
* smell, n. వాసన;
* smell, v. t. వాసన చూడు; మూర్కొను;
* smell, n. (1) వాసన; (2) కంపు;
** bad smell, ph. దుర్వాసన; కంపు;
** good smell, ph. సువాసన; వాసన;
** musty smell, ph. ముక్క వాసన; గబ్బు కంపు; గబ్బిలాయి కంపు;
* smelt, v. t. కరగించు; ద్రవీకరించు;
* smelter, n. లోహాలని కరిగించే చోటు; కొలిమికొట్టు; కొలిమి;
* smidgen, n. పిసరు;
* smidgen, n. పిసరు; చిన్న పిసరు;
* smile, n. చిరునవ్వు; మందహాసం; దరహాసం; స్మితం; హసితం; విహసితం;
* smiles, n. (1) తొనలు; (2) చిరునవ్వులు;
** orange smiles, ph. నారింజ తొనలు;
* smirk, n. వెకిలినవ్వు;
* smith, n. కంసాలి; కమ్మరి; బత్తుఁడు; శిల్పి; కార్మారుఁడు
** black smith ph. కమ్మరి;
** gold smith ph. కంసాలి;
** wordsmith, n. పదశిల్పి; మాటలని తూచి తూచి వాడడంలో నేర్పరి; % move to W
* smithereens, n. pl. తునాతునకలు; చిన్న చిన్న ముక్కలు;
* smog, n. స్మాగు; పొంచు; పొగ + మంచు = పొంచు; smoke + fog = smog;
* smoke, n. (1) పొగ; పావ; ధూమం; ధూపం; (2) దమ్ము;
** smoke point, ph. ధూమ స్థానం; The smoke point is the temperature at which a cooking oil or fat starts to break down, burn, and produce visible smoke, releasing acrid flavors and potentially harmful compounds like free radicals, which degrade the oil's quality and taste and can damage food.
* smoke, v. i. పొగ తాగడం; దమ్ము కొట్టడం;
* smoke, v. t. పొగ పట్టడం;
* smoked, adj. పొగ పట్టిన; ధూపిత; ధూపాయిత;
** smoked fish, ph. పొగ పట్టిన చేపలు;
* smooth, adj. నునుపైన; నున్ననైన;
* smoothness, n. నునుపు; నున్నదనం; నయగారం;
* smudge, n. మరక;
* smugglers, n. pl. దొంగచాటు రవాణాదారులు;
* smuggling, n. దొంగవ్యాపారం; దొంగరవాణా;
* smut, n.(1) లైంగిక విషయాల గురించి అశ్లీలంగా చెప్పే పుస్తకాలు, సినిమాలు; వగైరా; (2) [bot.] కాటుక; కాటుక తెగులు;
* snack, n. చిరుతిండి; ఉపాహారం; పలహారం (ఫలహారం కాదు); అల్పాహారం; ఓగిరం; తాయిలం; తినుబండారం; నలితిండి; నాస్తా;
* snag, n. చిక్కు; ఇబ్బంది;
* snail, n. నత్త; కురుమింద; శంఖనఖం;
* snake, n. పాము; చిలువ; చిల్వ; సర్పం; చక్షుశ్రవం; భుజంగం; ఉరగం; దందశూకం;
** asp, n. నైలు నదీ ప్రాంతాలలో కనబడే ఒక పాము;
** cobra, n. నాగుపాము; త్రాచుపాము; కృష్ణసర్పము; నల్లనాగు; ఫణకరము; ఫణి;
** green snake, ph. పసిరిక పాము;
** mountain snake, ph. కొండ చిలువ;
** rattlesnake, ph. గిలక పాము;
** Russell's viper = కట్లపాము; A venomous snake with black stripes;
** types of snakes, కూకవేటు; సముద్రపు పాము; రక్తపెంజర; జెర్రిగొడ్డు; గడ్డపాము; గుఱ్ఱపుబెరజు; తుట్టెపురుగు; దాసరిపాము; దుంపనాగులు; పలుగుడుబాము; పుల్లురుకుపాము; పుష్కరము; పెరజు; పొడపాము; బొక్కబెరడు; ముడినాగు; మొగలిత్రాచు(మిన్నాగు);
** snake gourd, ph. పొట్లకాయ;
** snake stone, ph. నాగమణి; మణి; ఇది నున్నగా అరగదీసిన రాయి కాని ఎముక కాని అయి ఉంటుందని కొందరి అభిప్రాయం; దీని ప్రభావం వల్ల పాము విషం దిగిపోతుందనే నమ్మకం కేవలం గుడ్డి నమ్మకమే;
* snap, n. చిటికె; అంగుళిస్పోటనం;
* snap, v. t. తెంచు; తెంపు; ఛేదించు; తునియు;
* snappiness, n. చిరాకు;
* snare, n. ఉచ్చు; వితంసము; గుబ్బిక; పక్షులని జంతువులని పట్టే సాధనం;
** snare for birds, ph. గుబ్బిక;
* sneeze, n. తుమ్ము;
* sniff, v. i. ఎగపీల్చు;
* snip, v. t. కత్తిరించు; చిదుము; తుంచు; తునియు;
** snip with fingers, ph. చిదుము; తుంచు;
* snippet, n. తునక; తునియ;
* snob, n. గర్విష్ఠి; ఎదుటివారిని చులకన చేసే వ్యక్తి;
* snore, v. i. గుర్రుపెట్టు; గురక పెట్టు;
* snore, n. గుర్రు; గురక;
* snot, n. చీమిడి; ముక్కులోని అమత్వక్కు నుండి స్రవించే ద్రవం;
* snout, n. ముట్టె; మోర; కుక్క, పంది, మొ. జంతువుల మూతి భాగం;
* snow, n. హిమం; పొడిమంచు; పిండిమంచు; మంచు; మిహిక; నీహారం; ప్రాలేయం; ధూమిక; తుషారం;
** snowflake, ph. మంచు రేకు;
** snow leopard, n. మంచు కిరుబా; హిమ కిరుబా;
* snowcap, n. హిమశృంగం;
* snowfall, n. హిమపాతం;
* snuff, n. ముక్కుపొడుం; ముక్కుపొడి; నస్యం;
* snuffbox, n. పొడుంకాయ; పొడుండబ్బా;
* so, prep. కాబట్టి;
* soak, v. i. నాను; తడుసు;
* soak, v. t. నానబెట్టు; తడుపు; తడిపిపెట్టు;
* soaked, adj. నానిన; నానబెట్టిన; తడిసిన; సిక్తం;
** blood soaked, ph. రక్తసిక్తం;
* soaking, adj. ఉరుపు;
** soaking pits, ph. ఉరుపు గుంటలు; ఉక్కు కర్మాగారాల్లో ఇవి ఉంటాయి;
* soap, n. (1) సబ్బు; జిడ్డుని పోగొట్టే రసాయనం; Soap is a cleaning agent produced with an alkali metal hydroxide by the chemical reaction of a fatty acid; (2) టెలివిషన్ లో ఒకే నటీనట వర్గంతో ధారావాహికగా వచ్చే సాంఘిక కార్యక్రమం;
** washing soap, ph. బట్టల సబ్బు;
** soap suds, n. సబ్బు నురుగ;
* soapnut, n. (1) కుంకుడుకాయ; (2) సీకాయ; (3) ఇషిరాసి;
* sobriquet, [sō-bri-ˌkā], n. nickname; ex. Big Apple for New York City, Yankee for American, Jack for JFK;
* Sochal salt, n. అక్షము; సౌవర్ఛలము; Hydrated Sodium Carbonate; Natron;
* social, adj. సాంఘిక; సామాజిక;
** social consciousness, ph. సామాజిక స్పృహ;
** social media, ph. సామాజిక మాధ్యమాలు;
** social unrest, ph. సామాజ కల్లోలం;
* socialism, n. సామాజిక వాదం; సమాజవాదం; సామ్యవాదం;
* society, n. సంఘం; సమాజం; సభ; కూటం; మండలి;
** member of a society, ph. సభ్యుడు;
** membership in a society, ph. సభ్యత్వం;
** one present at a society, ph. సభాసదుడు;
** president of a society, ph. సభాపతి;
* socialist, n. సామ్యవాది;
* socialistic, adj. సమాజవాద; సామ్యవాద;
* sociology, n. సాంఘిక శాస్త్రం; సామాజిక శాస్త్రం;
* sociopath, n. (def.) a sociopath is made, whereas a psychopath is born;
* sock, n. కాల్తిత్తి; మేజోడు;
* socket, n. ఉతక; ఉత్తరాసి;
* sod, n. గరికచెక్క; గడ్డ్డి విత్తులు మొలిచిన మట్టి చెక్క;
* soda, n. (1) చవుడు; సోడా ఉప్పు; (2) తాగే సోడా నీళ్లు; కొద్దిగా కార్బన్ డై ఆక్సైడ్ కరిగించిన నీళ్లు;
** baking soda, ph. తినే సోడా; వంట సోడా; NaHCO<sub>3</sub>;
** caustic soda, ph. దాహక సోడా; NaOH;
** washing soda, ph. చాకలి సోడా; Na<sub>2</sub>CO<sub>3</sub>;
* Sodium, n. సోడియం; సోడా; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 11, సంక్షిప్త నామం, Na); [Lat.] Natrium;
** Sodium bicarbonate, ph. వంటసోడా; తినే సోడా; NaHCO<sub>3</sub>;
** Sodium carbonate, ph. చాకలి సోడా; Na<sub>2</sub>CO<sub>3</sub>;
** Sodium chloride, ph. ఉప్పులో ముఖ్యమైన అంశం; ఉప్పు; NaCl;
** Sodium hydroxide, ph. దాహక సోడా;
** Sodium nitrate, ph. సురేకారం; పెట్లుప్పు; ఛిలీ సాల్ట్ పీటర్; NaNO<sub>3</sub>;
* sodomy, n. పుమ్మైధునం; అసహజమైన రతి క్రీడ; ఆడువారి మధ్యకాని, మగవారి మధ్యకాని, మనుష్యులకీ, జంతువులకీ మధ్యకాని జరిగే మైధునం;
* soft, adj. మృదువైన; మెత్తనైన; కోమలమైన; కఠినంకాని; వంగెడు; సుకుమారమైన; దయగల; సుతారమైన; మృదుల;
* soft c, ph. సకారం;
* soft g, ph. జకారం;
** soft drink, ph. ఆల్కహాలు లేని పానీయం; ఉదా. సోడా, కోకాకోలా, మొదలైనవి;
** soft palate, ph. మెత్తని అంగులి; నోటి కప్పు వెనక భాగం;
** soft water, ph సాధు జలం; నిజమైన శసాధు జలంలో ఒక్క సోడియం అయానులు తప్ప మరే ఇతర లవణాలు ఉండవు; ఈ నీటికి కాసింత ఉప్పదనం ఉంటుంది;
* softly, adv. సాఫీగా; మెత్తగా; సున్నితంగా; నెమ్మదిగా; బిగ్గరగా కాకుండా;
* softness, n. మార్దవం; మృదుత్వం; నయగారం;
* software, n. తంత్రాంశం; సూక్ష్మకాయం; మృదులాంగం; కోమలాంగం; మెత్తసరుకు; తోయం; దేహి; కంప్యూటర్ల చేత పనులు చేయించుకోడానికి రాసే క్రమణికలు;
* soil, n. మట్టి; మన్ను; మురికి; నేల;
** alluvial soil, ph. ఒండుమట్టి; ఒండునేల;
** barren soil, ph. ఇరిణం;
** black cotton soil, ph. నల్లరేగడి నేల; కృష్ణమృత్తిక;
** cotton soil, ph. రేగడి నేల; బంకమట్టి; మృత్తిక;
** loamy soil, ph. గరుపనేల; గరుపకొడి నేల;
** loamy clay soil, ph. గరుప బంకనేల; గరుపకొడి బంకనేల;
** loamy sandy soil, ph. గరుప ఇసకనేల; గరుపకొడి ఇసకనేల;
** marshy soil, ph. ఉబ్బ నేల;
** on American soil, ph. అమెరికా గడ్డ మీద;
** rocky soil, ph. మొరప నేల;
** saline soil, ph. ఇరిణం;
** topsoil, ph. మంచిమట్టి;
* soil, v. t. మురికిచేయు; మాపు; ఖరాబుచేయు;
* sojourn, n. మజిలీ; ప్రయాణంలో ఆగడం; కొద్ది కాలం పాటు ఇంటి దగ్గర కాకుండామరొక చోట బస చేయడం;
* sol, adj. అర్ధద్రవ; a colloid in which the suspended particles assume a random pattern; see also gel;
* sol, n. అంగారక గ్రహం మీద ఒక రోజు, అనగా తన చుట్టూ తాను తిరగడానికి పట్టే కాలం; 24 గంటల 39 నిమిషాల 35 సెకన్లు;
* solar, adj. సౌర; సూర్య; సౌరమాన; ఖద్యోత; మార్తాండ;
** solar calendar, ph. సౌర పంచాంగం; సౌరమానం;
** solar cells, ph. సౌర కణాలు; సౌర విద్యుత్ ఘటాలు;
** solar day, ph. సౌర దినం; ఒక సూర్యోదయం నుండి తరువాత సూర్యోదయం వరకు ఉన్న మధ్య కాలం; ఇది దినంవారీగా మారుతూ ఉంటుంది;
** solar eclipse, ph. సూర్య గ్రహణం;
** solar flare, ph. సౌర జ్వాల; సూర్య జ్వాల;
** solar mean day, ph. సగటు సౌర దినం; 24 గంటలు;
** solar system, ph. సౌర కుటుంబం; సూర్యగ్రహ మండలి; ఖద్యోత మండలం; మార్తాండ మండలం;
* solder, n. టంకం; మాటు;
* solder, v. t. మాటు వేయు; మాటు పెట్టు; టంకం వేయు;
** soldering iron, ph. టంకపునాటు; మాటునాటు;
* soldier, n. సిపాయి; బంటు;
** foot soldier, ph. కాలిబంటు;
* sole, adj. ఏక; ఏకైక;
* sole, n. అరకాలు; పాదము అడుగు భాగం;
** sole to crown, ph. నఖశిఖ పర్యంతం;
* solemn, adj. పవిత్ర; గంభీర;
* solemnity, n. హుందాతనం; గంభీరత; పవిత్రత;
* solenoid, n. తీగచుట్ట; చుట్ట ఆకారంలో చుట్టిన తీగ; తూణం; ఇటువంటి చుట్ట గుండా విద్యుత్తుని పంపితే ఆ చుట్ట అయస్కాంతం వలె పనిచేస్తుంది;
* solicit, v. t. (1) వేడుకొను; ప్రార్థించు; విన్నవించు; అర్థించు; (2) న్యాయ సలహాదారుగా పని చేయు;
* solid, n. ఘనం; ఘనపదార్థం;
* solid, adj. ఘన; దిట్టమైన; నమ్మకమైన;
* solidification, n. ఘనీభవనం;
* solidify, v. i. గడ్డకట్టు; పేరుకొను; ఘనీభవించు; ముద్దకట్టు;
* soliloquy, n. స్వగతం; ఏకాంత సల్లాపం; ఆత్మగతం; ఆత్మగతభాషణం; స్వగతభాషణం; తనలో తాను మాట్లాడుకోవడం;
* solitaire, n. ఒంటాట; ఏకాంతపు ఆట; ఒక్కరూ కూర్చుని ఆడుకునే ఒక రకం పేకాట;
* solitary, adj. ఏకాంత; ఎకక; ఐకాంతిక; ఉపాంశు; వివిక్త; ఒకే ఒక్క; ఒంటరి;
* solitude, n. ఏకాంతం; ఏకతం;
* solo, adj. ఎకక;
* solstice, n. అయనాంతం; రవితిష్ట; (ety.) solstice = sun standing still;
** summer solstice, ph. ఉత్తరాయనాంతం; గ్రీష్మ సంక్రమణం; జూన్ 22; ఉత్తరార్థ గోళంలో ఈ రోజున పగలు పొడుగు అత్యధికం; రాత్రి పొడుగు అత్యల్పం; ఈ రోజున సూర్యుడు కర్కాటక రేఖకి నడినెత్తి మీద ఉంటాడు; గ్రీష్మ సంక్రమణం ఏటేటా ఒకే తారీఖున రావాలని నిబంధన లేదు; కొంచెం ఇటూఅటూగా జూన్ 21-23 మధ్య తారట్లాడుతూ ఉంటుంది;
** winter solstice, ph. దక్షిణాయనాంతం; హిమ సంక్రమణం; డిసెంబరు 22; ఉత్తరార్థ గోళంలో ఈ రోజున పగలు పొడుగు అత్యల్పం, రాత్రి పొడుగు అత్యధికం; ఈ రోజున సూర్యుడు మకర రేఖకి నడినెత్తి మీద ఉంటాడు; ఈ రోజున ఉత్త ధృవం దగ్గర సూర్యుడు నామమాత్రం ఉదయించి, ఆకాశంలో పైకి లేవకుండానే అస్తమించెస్తాడు; హిమ సంక్రమణం; ఏటేటా ఒకే తారీఖున రావాలని నిబంధన లేదు; కొంచెం ఇటూఅటూగా డిసెంబరు 21-23 మధ్య తారట్లాడుతూ ఉంటుంది;
* solubility, n. ద్రావణశక్తి; కరగు గుణం;
* solute, n. ద్రావితం; In chemistry, a solution is a homogeneous mixture composed of two or more substances. In such a mixture, a solute is a substance dissolved in another substance, known as a solvent.
* solution, n. (1) పానకం; ద్రావణం; (2) పరిష్కారం; తెన్ను; సమాధానం; జవాబు; పూరణం;
** liquid crystalline solution, ph. ద్రవస్పాటిక ద్రావణం;
* solve, v. t. సాధించు; పరిష్కరించు;
* solvent, n. ద్రావణి; పంచదారని నీళ్లల్లో కరిగించినప్పుడు నీరు ద్రావణి, పంచదార ద్రావితం, పానకం ద్రావణం;
* soma, n. తనువు; శరీరం; కాయం;
* somatic, adj. తనువు; శారీరకం; కాయ; శరీరానికి సంబంధించిన;
** somatic cell, ph. తనుకణం; శోమకణం; పునరోత్పత్తి చేయలేని కణం;
** somatic pain, ph. శారీరకమైన నొప్పి కండర వ్యవస్థ (muscular system)లో కాని కంకాళ వ్యవస్థ (skeletal system)లో కాని పుట్టి, చర్మం ఉపరితలం మీద ద్యోతకమవుతుంది;
* some, adj. (1) కొంత; కొంచెం; కాస్త; ఇంచుక; (2) కొన్ని; (3) కొందరు;
** some extent, ph. కొంత; కొంతవరకు;
** some money, ph. కొంత డబ్బు;
** some monkeys, ph. కొన్ని కోతులు;
** some people, ph. కొందరు మనుషులు; కొందరు;
** some things, ph. కొన్ని;
* some, adv. దాదాపుగా;
* somebody, pron. ఒకరు; ఒక వ్యక్తి;
* somehow, adv. ఏదో ఒక విధంగా; ఎలాగో ఒకలాగ;
* somersault, n. పిల్లిమొగ్గ;
* sometime, adv. ఎప్పుడో ఒకప్పుడు; కదాచిత్తుగా;
* somewhere, adv. ఎక్కడో ఒక చోట;
* somnalent, adj. నిద్ర మత్తుగా ఉండడం;
* somnambulism, n. నిద్రలో నడవటం;
* somniloquence, n. నిద్రలో మాట్లాడటం;
* son, n. కొడుకు; కుమారుడు; అబ్బాయి; పుత్రుడు; బిడ్డడు; సుతుడు; తనయుడు; ఆత్మజుడు; బొట్టె; పట్టి;
* son-in-law, n. s. అల్లుడు; జామాత;
** co son-in-law, ph. తోడల్లుడు; షడ్డకుడు;
* son-of-a-bitch, n. లంజకొడుకు;
* sons-in-law, n. pl. అల్లుళ్లు;
* song, n. పాట; గానం; గీతం;
* sonic, adj. శబ్దానికి సంబంధించిన; శబ్ద తరంగాలు కదిలే విధానానికి సంబంధించిన;
** hypersonic, adj. శబ్ద తరంగాల వేగానికి 5 రెట్లు మించిన వేగంతో;
** supersonic, adj. శబ్ద తరంగాల వేగానికి మించిన వేగంతో; శబ్ద తరంగాల వేగానికి మించి, శబ్ద తరంగాల వేగానికి 5 రెట్లు తక్కువగా ఉన్న వేగాలు;
* soon, adj. త్వరగా; వేగిరం; శీఘ్రం; సత్వరం;
* soot, n. మసి;
* soothsayer, n. f. ఎరుకలసాని; ఎరుకత; సోది చెప్పే మనిషి; m. ఎరుకల వాడు;
* soothsaying, n. సోది;
* soothingly, adv. అనునయంగా;
* sops, n. pl. ప్రోత్సాహకాలు; తాయిలాలు;
* sophism, n. వంచితర్కం; వంచన తలపుతో చేసే కుతర్కం;
* sophisticated, adj. ఆడంబర; అధునాతన; పరిష్కృత;
* sophomore, n. నాలుగేళ్లపాటు కొనసాగే విద్యార్థి దశలో రెండవ సంవత్సరపు విద్యార్థి;
* sorcerer, n. మంత్రగాడు; మాంత్రికుడు;
* sordid, adj. క్షుద్ర; అసహ్య; నీతిబాహ్య;
* sore, adj. బాధ కలిగించే; నొప్పి పుట్టించే; నొప్పి పెట్టే;
* sores, n. pl. కురుపులు; పుండ్లు;
** mouth sores, ph. నోటిలో పుండ్లు; నోటి పూత; జిహ్వాపాకం;
* sorghum, n. జొన్నలు; [bot.] Sorghum bicolor;
* sorrow, n. విచారం; వ్యాకులం; చింత; వగపు;
* sorry, inter. మన్నించండి; క్షమించండి;
* sort, n. రకం;
* sort, v. t. (1) రకాలవారీగా విడగొట్టు; (2) పేర్చు; క్రమర్చు; క్రమంలో అమర్చు;
* sortie, n. దాడి; వైమానిక దాడి;
* sorting, v. t. విడగొట్టడం; పేర్చడం; క్రమపర్చడం;
** sorting and merging, ph. పేర్చడం; కూర్చడం;
* so so, adj. ఓ మోస్తరుగా; మిడి మిడి;
* sotto voce, ph. (సాటో వోచే) తగ్గు స్వరంలో; మనలో మనమాట;
* soul, n. ఆత్మ; అంతర్యామి; దేహి; క్షేత్రజ్ఞడు;
** manifested soul, ph. జీవాత్మ;
** subtle soul, ph. ఆత్మ; జీవాత్మ;
** Supreme soul, ph. పరమాత్మ;
* soul-searching, n. ఆత్మప్రక్షాళనం;
* sound, adj. మంచి; దృఢమైన; ఆరోగ్యకరమైన;
* sound, n. (1) ధ్వని; శబ్దం; సడి; చప్పుడు; క్వాణం; సద్దు; అలికిడి; సవ్వడి; నాదం; మోత; రొద; రవము; రవళి; నినాదం; మొరపం; (rel.) resound, (2) ఇరుకు మూతి గల సముద్ర శాఖ; (rel.) fjord;
** dependent on sound, ph. శబ్దాశ్రయ;
** non-physical sound, ph. అనాహత్ నాదం; భౌతిక ప్రక్రియల ప్రమేయం లేకుండా జనించిన నాదం; unstruck sound;
** physical sound, ph. అహత్ నాదం; భౌతిక ప్రక్రియల వల్ల పుట్టిన నాదం; struck sound;
** ultrasound, ph. అతిధ్వని; అత్యధికంగా ప్రకంపించే శబ్ద తరంగం;
** sound wave, ph. శబ్దతరంగం; ధ్వనితరంగం;
* sound, v. i. ధ్వనించు; అనిపించు;
* sound, v. t. కదిపి చూడు; కనుక్కుని చూడు;
* soup, n. సూపం; పులుసు; కట్టు; పలచగా చేసిన పప్పు;
* sour, adj. పుల్ల; పుల్లన; పులి;
** sour belch, ph. పులి తేనుపు; పుల్లత్రేన్పు;
** sour cream, ph. పులిమస్తు; కాదంబరం; a dairy product obtained by fermenting regular cream with certain kinds of lactic acid;
* source, n. మాతృక; కాణాచి; ఆధారం; ఆకరం; మూలం; జనకం; జనకస్థానం; ఉత్పత్తి స్థానం; ఉద్గమం; ప్రభవం;
** source code, ph. [comp.] జనక క్రమణిక; మూల భాషలో రాసిన క్రమణిక;
* south, adj. దక్షిణ; తెన్;
* South, n. దక్షిణం; వలపల; వలకడ; తెన్ను; కుడిమట; కుడిపల; అవాచి;
* southeast, n. ఆగ్నేయ;
* southernwood, n. దవనం; సువాసన గల ఒక మొక్క; [bot.] ''Artemisia abrotanum; southern wormwood'';
* southern, adj. దక్షిణ; దాక్షిణాత్య; అవాచీన; తెంకణ; సరాజిత;
** southern planet, ph. సరాజిత గ్రహం;
* Southern Cross, n. త్రిశంకు నక్షత్రం; దక్షిణార్థ గోళంలో ఉన్న వాళ్లకి శిలువ ఆకారంలో కనిపించే నాలుగు నక్షత్రాల సమూహం;
* Southerner, n. దాక్షిణాత్యుడు;
* southpaw, n. కవ్వడి; ఎడంచేతి వాటం మనిషి; according to Reader's Digest, this misnomer was apparently coined by Chicago's sportswriters in the late nineteenth century; they used this word to refer to left-handed baseball pitchers who had to pitch facing the evening sun; in that position, their left arms were toward the south; other words for left-handers are lefties, south paws, sinistrals, and port-siders;
* southwest, n. నైరృతి దిక్కు; నైరృతి; నైఋతి; సోకుమూల;
* souvenir, n. స్మారక సంచిక; స్మృతి చిహ్నం; జ్ఞాపిక;
* sovereign, adj. సర్వసత్తాక;
** sovereign republic, ph. సర్వసత్తాక గణతంత్ర రాజ్యం;
* sovereign, n. (1) సార్వభౌముడు; రాజరాజు; చక్రవర్తి; ప్రభువు; అధిపతి; (2) నవరసు; కాసు;
* sovereignty, n. సార్వభౌమత్వం; సార్వభౌమాధికారం; ఆధిపత్యం; పాలనాధికారం; సర్వసత్తాధికారం; రాజ్యాధిపత్యం;
* sow, n. ఆడ పంది; ఈడొచ్చిన ఆడ పంది;
* sow, v. t. విత్తులు నాటు;
** sowing device, ph. జత్తిగె; జడ్డిగం;
* sox, n. pl. మేజోళ్లు; కాల్తిత్తులు; --also see socks
* soybean, n. సోయాచిక్కుడు; హరేణుచిక్కుడు
* spark, n. నిప్పుకణం; విస్పులింగం; చురక; అగ్నికణం;
* space, adj. స్థల; అంతరిక్ష; వ్యోమ; నభో; దిక్;
* space, n. (1) స్థలం; జాగా; ఎడం; చోటు; దిక్కు; అంతరం; (2) బయలు; ఆవరణ; (3) ఖ; రోదసి; నభం; వ్యోమం; అంతరిక్షం; విష్ణుపదం; అంతరాళం; ఆకాశమండలం;
** Euclidean space, ph. యూక్లిడీయ ఆవరణం; అంతరాళం;
** expanse of deep space, ph. గగనాంగణం;
** intervening space, ph. మధ్యంతర ఆవరణం; అంతరాళం;
** lack of space, ph. స్థలాభావం;
** three-dimensional space, ph. త్రిమితీయ అంతరాళం; త్రిమితీయ ఆవరణం;
** space travel, ph. నభోయానం; అంతరిక్ష యానం;
* spacecraft, n. నభశ్చరం; ఖేచరం;
* spaceship, n. వ్యోమనౌక; నభోతరంగిణి; నభోతరణి; అంతరిక్ష నౌక;
* space-time, n. స్థలకాలం; దిక్కాలం; కాలస్థలం; అంతరాళ కాలం;
** space-time continuum, ph. స్థలకాల అఖండత్వం; స్థలకాల సమవాయం;
* spacious, adj. విశాలమైన;
* spade, n. (1) తౌగోల (తవ్వు + కోల); (2) చీట్లపేకలో నలుపు రంగులో ఉండే ఆకారం;
* span, n. (1) జానెడు పొడుగు; జాన; (2) వంతెనలో రెండు స్తంభాల మధ్య దూరం;
* spanner, n, పానా;
* spark, n. నెరుసు; నిప్పురవ్వ; విస్పులింగం; ఆచిరాంశువు;
** spark plug, ph. నెరసు బిరడా; పెట్రోలు కారు ఇంజనులో ఒక భాగం;
* sparkler, n. కాకరపువ్వొత్తి;
* spasm, n. ఈడ్పు; దుస్సంకోచం; అదుపుతప్పి కండరం సంకోచ వ్యాకోచాలు చెందడం;
** Laryngeal spasm, ph. స్వరపేటిక ఈడ్పు; స్వరపేటిక బిగిసిపోవడం;
** vascular spasm, ph. రక్తనాళ దుస్సంకోచం; రక్తనాళాల ఈడ్పు;
* spasmodic, adj. అప్పుడప్పుడు;
* spate, n. వరద; వెల్లువ;
* spathe, n. మొవ్వు;
* spatial, adj. దేశగత;
** spatial extension, ph. దేశగత వ్యాప్తి;
* spatula, n. అట్లకాడ; సలగ;
* speak, n. మాట్లాడు;
* speaker, n. వాగ్మి; వాచకుడు; వాచకి; అభిభాషి;
* spear, n. ఈటె; బల్లెం; బరిసె; see also javelin;
* special, adj. విశిష్ట; విశేష; ప్రత్యేక; పరిమిత;
** special case, ph. విశిష్ట వ్యవహారం; విశిష్ట సంఘటన;
** special dualism, ph. విశిష్ట అద్వైతం; రామానుజాచార్యుల మత సిద్ధాంతం;
** special purpose, ph. పరిమిత ప్రయోజనం;
** special rule, ph. విశిష్ట నియమం;
** special terminology, ph. విశేష పదజాలం;
** special theory of relativity, ph. విశిష్ట సాపేక్ష సిద్ధాంతం;
* specialty, n. విశిష్టత; ప్రత్యేకత;
* species, n. (1) తెగ; జాతి; ఉపజాతి; వర్గం; (2) జాతి; శాస్త్రవేత్తలు జీవకోటిని ఏడు వర్గాలుగా విడగొట్టినప్పుడు ఏడవ వర్గానికి పెట్టిన పేరు; [see also] genus, family, order, class, phylum and kingdom; two organisms belong to the same species if they tend to mate with each other giving birth to fertile offspring; Horses and donkeys mate if induced, but their offspring - mules - are not fertile;
* specific, adj. నిర్ణీతమైన; నిర్ధిష్టమైన; అవశ్యమైన;
** specific gravity, ph. విశిష్ట గురుత్వం; విశిష్ట గరిమ; అవశ్య గరిమ; తారతమ్య గరిమ;
** specific heat, ph. విశిష్ట ఉష్ణం; విశిష్టోష్ణత;
* specification, n. తబ్సీల జాబితా; చెయ్యవలసిన పనుల పట్టిక;
* specified, adj. వ్యక్తం;
* specificity, n. ప్రత్యేకత; విశిష్టత;
* specify, v. t. వివరించు; నిర్దేశించు; కరతలించు;
* specimen, n. నమూనా; మచ్చు; మాదిరి;
* speck, n. నలక; నలుసు; నెరుసు;
* spectacle, n. దృశ్యం;
* spectacles, n. pl. కండ్లజోడు; ముక్కద్దాలు; సులోచనాలు; ఉపనేత్రాలు;
* spectacular, adj. కళ్లు జిగేలుమనిపించే;
* spectators, n. pl. ప్రేక్షకులు; చూపరులు; ఈక్షకులు;
* spectrograph, n. వర్ణపటలేఖిని; వర్ణమాలాచిత్రం; వర్ణలేఖిని;
* spectrometer, n. వర్ణపటమాపకం;
* spectroscope, n. వర్ణపటదర్శని; వర్ణమాలాదర్శని;
* spectroscopy, n. వర్ణమాలాదర్శనం; వర్ణమాలని అధ్యయనం చేసే శాస్త్రం;
** Raman spectroscopy, ph. రామన్ వర్ణమాలాదర్శనం;
* spectrum, n. వర్ణపటం; వర్ణమాల; కాంతిని గాజు పట్టిక ద్వారా పంపితే కనిపించే సకలవర్ణ పటం;
* speculation, n. సట్టా;
** speculation business, ph. సట్టా వ్యాపారం;
* speech, n. (1) ప్రసంగం; ఉపన్యాసం; (2) వాక్కు; ఉక్తి;
** gracefulness of speech, ph. వాగ్విలాసం;
** keynote speech, ph. కీలకోపన్యాసం;
** telegraphic speech, ph. తంత్యోక్తి;
* speed, n. వేగం; వడి; జోరు; ధృతి; త్వరితం; జవం; see also haste;
** high speed, ph. శరవేగం; జవాతిశయం;
* spell, n. మంత్రశక్తి; మంత్రం;
* spell, v. i. వర్ణక్రమం చెప్పగలుగు;
* spelling, n. వర్ణక్రమం; పదగుణితం; వ్రాకట్టు; స్పెల్లింగు;
* spend, v. i. ఖర్చుపెట్టు; వ్యయపరచు;
* sperm, n. శుక్రం; రేతస్సు;
* sperm cell, n. శుక్ర కణం;
* spermatorrhea, n. శుక్ర నష్టం; శుక్ర స్రావం;
* spermatozoa, n. శుక్ర కణం; పురుష బీజకణం;
* spend, v. i. (1) ఖర్చు పెట్టు; వెచ్చించు; వ్యయపరచు; (2) గడుపు;
** spend some time, ph. కొంత కాలం గడుపు;
* sperm, n. వీర్యం; పురుష జననాంగాలలో తయారయే వీర్య కణాలు; rel. semen;
* spew, v. t. వెళ్లగక్కు;
* sphenoid bone, n. కీలాస్థి; జతూకాస్థి; a compound bone that forms the base of the cranium, behind the eye and below the front part of the brain;
* sphere, n. (1) గోళం; ఉండ; (2) మండలం; ప్రదేశం; ఆవరణం;
** sphere of action, ph. వ్యవహార మండలం;
* spherical, adj. గోళాకార; గోళీయ;
* spheroid, n. గోళాభం;
* spheroidal, adj. గోళాభీయ;
* Spica, n. చిత్ర; చిత్రా నక్షత్రం; కన్యారాశిలో నక్షత్రం;
* spice, n. కటువు; కారము;
* spick and span, ph. [idiom] నిగనిగలాడేటట్లు;
* spicy, adj. కారం; కటు;
** spicy substance, ph. కారపు వస్తువు; కటు ద్రవ్యం;
* spider, n. సాలీడు; సాలెపురుగు; నేతపురుగు; అష్టపాది; తంతునాభం; ఈగపులి; లూతపురుగు; అల్లికపురుగు;
* spies, n. pl. చారులు; గూఢచారులు;
* spike, n. శంకువు;
* spill, v. i. ఒలుకు; పొర్లు;
* spill, v. t. ఒంపు; తొళికించు; ఒలికించు;
* spillway, n. పొర్లుకట్ట; పొర్లుమదుం; తొళకరి తోము; ఒలుకుదారి; ప్రవాహ మార్గం; మరిగొమ్ము; అలుగు; పరీవాహం;
* spin, v. t. వడుకు;
* spin, n. (1) ఆత్మభ్రమణం; భ్రమణం; (2) [idiom] ఉన్న విషయాన్ని తనకి అనుకూలంగా మలిచి చెప్పడం; (3) [phy.] అణుప్రమాణంలో ఉండే రేణువులకి సహజసిద్ధంగా ఉండే ఒక లక్షణం; ఒక ఎలక్ట్రానుకి "స్పిన్" ఉందంటే అది బొంగరంలా తిరుగుతోందని వ్యాఖ్యానించకూడదు; బొంగరం లాగనే కొన్ని పరమాణు రేణువులు కూడ సహజసిద్దమైన కోణీయ భారవేగం (intrinsic angular momentum) అనే గణిత లక్షణాన్ని ప్రదర్శిస్తాయి కనుక వాటికి "స్పిన్" ఉందని చమత్కరిస్తాము;
** spin angular momentum, ph. భ్రమణ కోణీయ భారవేగం;
* spinach, n. గోళికూర; పాలక్; దుంపబచ్చలి వంటి ఆకు కూర; చుక్కాకు; [bot.] ''Spinacia oleracea'';
* spinal, adj. మైరవ; మజ్జా; సుమామ్న;
** spinal canal, ph. మజ్జా నాళిక; సుమామ్న నాళిక;
** spinal cord, ph. వెన్నుపాము; మజ్జా రజ్జువు; సుమామ్న నాడి; కశేరుక నాడి; మేరువు; కుండలి;
** spinal vertebra, ph. వెన్నుపూసలు;
* spindle, n. కదురు; తుర్కం; నూలు వడికే కదురు; తంతుకాష్ఠం;
* spine, n. వెన్ను; వెన్నెముక;
* spinster, n. (1) అవివాహిత; బ్రహ్మచారిణి; ప్రస్తుతం పురుష సంపర్కం లేని ఆడది; భర్త లేని స్త్రీ; విధవ కాదు, కన్య కాదు; (2) నూలు వడికే స్త్రీ;
* spiral, n. సర్పిలం; మురి; శంఖావర్తం;
** right-handed spiral, ph. ఎల మురి;
* spiral, adj. సర్పిల; శంఖాకార; శంఖావర్త;
** spiral-shaped, ph. సర్పిలాకృతి;
* spirit, n. (1) ఆత్మ; జీవాత్మ; అంతరాత్మ; మూలశక్తి; (2) ప్రేతాత్మ; పిశాచం; దయ్యం; (3) మూలార్థం; అంతరార్థం; పరమార్థం; (4) సారా; మద్యం; ద్రావకం; (5) స్పూర్తి; ఉత్సాహం;
** finite spirit, ph. ప్రత్యగాత్మ;
** infinite spirit, ph. అనంతాత్మ;
** spirit lamp, ph. సారా దీపం; మద్యార్కదీపం; స్పిరిట్ దీపం;
** spirit of cooperation, ph. సహకార స్పూర్తి;
* spiritual, adj. ఆధ్యాత్మిక; పారమార్థిక; ఆధిదైవిక; ఆత్మజ్ణాన; ఆత్మిక;
* spiritualism, n. ఆధ్యాత్మిక వాదం;
* spirulina, n. స్పిర్యులీనా; an organism that grows in both fresh and saltwater; It is a type of cyanobacteria, which is a family of single-celled microbes that are often referred to as blue-green algae.
* spit, n. ఉమ్మి; లాలాజలం;
* spit, v. i. ఉమ్ము;
* spite, n. కార్పణ్యం; జుగుప్స;
* spittoon, n. కాళంజి; తమ్మ పడిగె; ఉమ్మి వేసే గిన్నె;
* spittle, n. ఉమ్మి; లాలాజలం;
* splash, v. t. చిందించు;
* splash, v. i. చిందు;
* splatter, v. i. చిందు;
* spleen, n. ప్లీహం; గోళాకారపు ఎరన్రి గ్రంధి;
* splendid, adj. ఉజ్వల; జేగీయమాన;
* splendor, n. వైభవం;
* splice, n. అతుకు;
* splint, n. బద్ద; కొయ్య బద్ద; దెబ్బలు తగిలినప్పుడు కట్టు కట్టడానికి అప్పుడప్పుడు వాడే సాధనం;
* splinter, n. పేడు; పుల్ల; పుడక; చీలిక; యష్టి;
* splinter, v. t. చీలిపోవు; విడిపోవు;
* split, n. చీలిక; చీరిక;
* split, adj. చీలబడ్డ; చీల్చిన;
* split, v. t. చీరు; చీల్చు; చించు; వ్రచ్చు; వ్రక్కలించు; ఛేదించు;
** split chickpeas, n. శనగపప్పు;
** split peas, n. బటానీ పప్పు;
* splitting, n. పరిస్పోటనం;
* spoke, n. శలాకం; ఊస; చువ్వ; ఆకు; లాక; probe; pin; peg;
** spoked wheel, ph. ఆకుల చక్రం;
* spoke, v. t. past tense of "speak;"
* spoil, v. i. చెడు; పాడగు; బెడియు; ఆరుమూడగు; బుసిపోవు; కర్యావైకల్యమగు;
* spondee, n. [prosody] ఛందస్సులో రెండు గురువులు వచ్చే గణం; గగ;
* spondylosis, n. వెన్నుముకలో అరుగుదల (degeneration) వలన వచ్చే జబ్బుని డిజెనెరేటివ్ డిస్క్ డిసీజ్ (degenerative disc disease) లేదా స్పాండెలోసిస్ (spondylosis) అంటారు;
** cervical spondylosis, ph. మెడలో వస్తే సెర్వికల్ స్పాండెలోసిస్ అంటారు; స్పాండెలోసిస్ వలన మెడలో వెన్నుపాము నలిగితే దాన్ని మైలోపతి (myelopathy) అంటారు.
** lumbar spondylosis, ph. నడుములో వస్తే లంబార్ స్పాండెలోసిస్ అంటారు.
* sponge, n. (1) స్పంజి; నీటిని పీల్చే పదార్థం; (2) ఒక రకం సముద్రపు జంతువు;
* sponsored, adj. ప్రాయోజిత; మనకు ఉచితం, వారికి భవిష్యత్తులో ప్రత్యక్షం గా కానీ పరోక్షంగా కానీ ఆర్జనం;
* sponsors, n. ప్రాయోజితులు;
* spontaneous, adj. అయత్నకృత; ఆకస్మిక; ఐచ్ఛిక; సద్యస్పూర్తితో;
** spontaneous process, ph. ఆకస్మిక ప్రక్రియ; ఐచ్ఛిక ప్రక్రియ; In thermodynamics, a spontaneous process is a process which occurs without any external input to the system;
** spontaneous reaction, ph. ఆకస్మిక ప్రక్రియ; ఐచ్ఛిక ప్రక్రియ; A spontaneous reaction is a chemical reaction which is a spontaneous process under the conditions of interest;
* spontaneity, n. సద్యస్పూర్తి;
* spoon, n. చెంచా; ఉద్దరిణి; గరిటె; పాణికి; స్పూను; దర్వి;
** deflagrating spoon, ph. ఒంపు గరిటె; మంట గరిటె; పోపు గరిటె; ఉద్దహన చెంచా;
** perforated spoon, ph. జల్లి గరిటె;
** table spoon, ph. చెంచా; 15 ml ప్రమాణం;
** tea spoon, ph. మెల్లి గరిటె; 5 ml ప్రమాణం;
* spoonerism, n. అస్తవ్యస్త పదప్రయోగం; స్పూనరీయం; a linguistic somersault that turns a "well-oiled bicycle" into a "well-boiled icicle" and "tinglish errors" into "English terrors"; (ety.) named after Rev. William Archibald Spooner (born 1844); Examples in Telugu include, "చొక్కరు, నిక్కా", పుహం, సింలి";
* sporadically, adv. అప్పుడప్పుడు; చిలకేటుగా;
* spore, n. సిద్ధబీజం;
* sport, n. సయ్యాట; అలవోక; క్రీడ; కేళి; హేల; లీల; చీటకం; ఆట;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: sport, game, recreation, hobby
* ---A ''sport'' is an activity that requires physical effort and skill, has rules and is done in competition. Use ''recreation'' to talk about all activities that people do in order to relax. Use ''game'' to talk about a particular competition in a sport. You can also use ''game'' to talk about a competition requiring mental skill, knowledge and luck: a game of cards. A ''hobby'' is an activity that you do in your spare time.'''
|}
*
* sportsman, n. ఆటగాడు; చీటకుడు;
* spot, n. (1) మచ్చ; డాగు; (2) స్థానం; ప్రదేశం;
* spotless, adj. నిరంజన;
* spouse, n. జీవిత భాగస్వామి;
* spout, n. జలదారి;
* spp., suff. జాతిది; ద్వినామ పద్ధతిలో జంతువుల పేర్ల చివరకాని, మొక్కల పేర్ల చివర ఈ అక్షరాలు వస్తే ఆ ప్రాణి జాతి ఇదమిత్థంగా తేలలేదని అర్థం;
* sprain, n. ఇరుకు; బెణుకు;
* spray, v. t. చిమ్ము; జల్లు; ఎగజల్లు; చిలకరించు;
* spray, n. శీకరము; జల్లు;
* sprayer, n. చిమ్మనగ్రోవి; చిమ్ముకారి;
* spread, v. i. వ్యాపించు; విస్తరించు; అత్తమిల్లు; ఉ. "అంగళ్ల ముంగిళ్ల నత్తమిల్లిన ముత్తియంపు రంగవల్లుల మీద" - జైమిని భారతం
* spread, v. t. పరుచు; నెరుపు; వెదజల్లు; జల్లు; పంచారించు; పంచు;
* spread, n. (1) పరుచుకొనేది; నెరుపుకొనేది; పులుముకొనేది; (2) విస్తృతి;
** bed spread, ph. పరుపుమీద పరుచుకొనేది; దుప్పటి;
** bread spread, ph. రొట్టె మీద రాసుకొనేది;
* sprig, n. (1) రెమ్మ; రెబ్బ; (2) మొలక; పిలక; (3) పిల్లకాయ; వంశాకురం;
** sprig of curry plant, ph. కరివేపాకు రెబ్బ;
** sprig of banana plant, ph. అరటి పిలక;
* spring, n. (1) వసంతం; వసంత కాలం; వసంత రుతువు; (2) నీటిబుగ్గ; జల; జెల; ఊట; ఎగదట్టిక; ఉద్గమం; (3) తీగచుట్ట; స్ప్రింగు;
** hot water spring, ph. వేడినీటి జల; వేడినీటి బుగ్గ;
** spring equinox, ph. వసంత విషువత్;
** spring tide, ph. నిండు పోటు; పౌర్ణమికి, అమావాస్యకీ బాగా ఉదృతంగా వచ్చే పోటు;
* sprinkle, v. t. జల్లు; ఎగజల్లు; చిలుకు; చిలికించు; చిమ్ము; ప్రోక్షించు;
* sprinkle, n. తూర; జల్లు; వాన జల్లు;
* sprinkler, n. ప్రోక్షకి; ప్రోక్షకుడు;
* sprint, n. పరిగెత్తు; దౌడుతీయు;
* sprout, v. i. మొలుచు; అంకురించు; పొటమరించు; కందళించు;
* sprouts, n. మొలకలు; నారు; నవోద్భిజాలు; అభినవోద్భిజాలు; అంకురాలు; ఈరికలు; కందళికాలు; shoots;
* spun, adj. వడకిన;
** spun yarn, ph. వడకిన నూలు; దారం;
* spur, n. కయ్య; చీలిక; పక్క దారి;
* spurious, adj. ప్రక్షిప్త;
* sputum, n. ఉమ్మి;
* spy, n. చారుడు; చారిణి; గూఢచారి;
* spycraft, n. గూఢచర్య; అపసర్పణం;
* sphygmomanometer, n. రక్తపు పోటు లేదా BP కొలిచే పరికరము
* squabble, n. తగాదా; తోకపీకుడు; కలహం; జగడం;
* squall, n. జడిజల్లు; జడివాన; కొద్దికాలంపాటు ఉధృతంగా పడే వాన;
* squander, v. t. దుర్వినియోగం చేయు; దుర్‌వ్యయం చేయు; వృధా చేయు; నిర్లక్ష్యంగా ఖర్చు పెట్టు;
* square, adj. చతురస్ర; వర్గ;
** square foot, ph. చతురపుటడుగు;
** square root, ph. వర్గమూలం;
** square wave, ph. చతురస్ర తరంగం;
* square, n. (1) చతురస్రం; సమచతురస్రం; చదరం; నలుచదరం; చవుకం; చచ్చవుకం; ఎదురెదురు భుజాలు సమంగానూ, సమాంతరంగానూ ఉండి నాలుగు సమకోణాలు ఉన్న చతుర్భుజం; (2) వర్గం; (3) కూడలి; శృంగాటకం; రచ్చబండ;
** carpenter's square, ph. మూలమట్టము;
** inverse square, ph. విలోమ వర్గం;
** perfect square, ph. (1) చచ్చవుకం; నలుచదరం; సంపూర్ణ చతురస్రం; (2) సాంగమైన వర్గు;
* squash, n.ఒక రకం గుమ్మడి కాయ; దోసకాయ;
** chayote squash, ph. బెంగుళూరు వంకాయ;
** squash gourd, ph. గుమ్మడి కాయ;
* squat, v. i. గొంతుక్కూర్చొను; గొంతుకలా కూర్చొను;
* squeak, v. i. కిర్రుమను; కీచుమను;
* squeeze, v. t. (1) నొక్కు; పిండు; పిసుకు; (2) ఇరికించు;
* squint, n. మెల్ల;
* squire, n. కామందు; భూస్వామి; a large land owner;
* squirrel, n. ఉడుత;
* squishy, adj. పిసపిసలాడు; పిసకడానికి వీలుగా ఉండు; మెత్తగాను, తడిగాను ఉండు;
* syrup, n. పాకం;
** corn syrup, ph. జొన్న పాకం;
** high-fructose corn syrup, ph. అతి-ఫలోజు జొన్న పాకం;
*
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 4: st-sz==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
* stab, v. t. కత్తితో పొడుచు;
* stability, n. నిశ్చలత; స్థిరత్వం; సుస్థిరత్వం; నిలకడ; స్థయిర్యం; స్థాయిత్వం; ప్రతిష్ఠ;
* stabilization, n. స్థిరీకరణ;
* stable, n. (1) నిశ్చలం; స్థిరం; సుస్థిరం; (2) గుర్రాలసాల; అశ్వశాల; కొట్టం; మందడి; లాయం;
* stack, n. దొంతర; దొంతి; బొత్తు; వాము;
* stack, v. t. దొంతి పెట్టు; పేర్చు;
* staff, n. (1) దండము; కర్ర; గడ; (2) సిబ్బంది; అధికారవర్గం; నౌకర్లు;
* stag, n. మగ లేడి; జింక;
* stage, n. (1) దశ; మజిలీ; అంచె; (2) వేదిక; (3) రంగం; రంగస్థలం; నాటకరంగం;
** backstage, ph. నేపథ్యం; నైపథ్యం;
** stage fright, ph. సభాకంపం; సభలో మాట్లాడడానికి భయపడడం;
** stage lighting, ph. రంగోద్దీపనం;
** stage manager, ph. సూత్రధారుడు;
* stage, v. t. నాటకమాడు; మభ్యపరచు;
* stagnation, n. స్తబ్దత; ఎదుగు బొదుగు లేకుండా ఉండిపోవడం;
* stain, n. మరక; డాగు; కళంకం; చార;
** blood stain, ph. రక్తపు మరక; రక్తపు డాగు;
** water stain, ph. నీటి చార;
* staining, n. వర్ణసంధానం; అభిరంజనం;
* stainless, adj. నిష్కళంకం; మచ్చలేని; అకళంకము;
* staircase, n. మేడ మెట్లు; సోపానశ్రేణి; మెటికలు; తాపలు;
* stairs, n. మేడ మెట్లు; సోపానశ్రేణి; మెటికలు; తాపలు;
* stake, n. (1) శంకువు; (2) పణం; పణితం; ఒడ్డిమి; ఒడ్డిదం; పన్నిదం; జూదంలో ఒడ్డే పందెం;
* stakeholder, n. ఒడ్డిమిదారు;
* stale, adj. అడవ; పాచిపోయిన; తాజాతనం కోల్పోయిన; పాతబడిన;
** stale food, ph. పాచిపోయిన ఆహారం;
** stale smell, ph. ముక్క వాసన; అడవ వాసన;
** stale stuff, ph. అడవ సరుకు;
* stalemate, n. ప్రతిష్టంభం; తట్టు;
* stalk, n. (1) కాండం; గడ; (2) తొడిమె;
* stalk, v. t. వేటాడు; పొంచియుండు;
* stall, n. (1) బడ్డీ; వ్రజం; దుకాణం; అంగడి; కొట్టు; ఖద; (2) సాల; పశువుల సాల; (3) పని చెయ్యడం మాని ఆగిపోవడం; విమానం ఎగురుతూన్నపుడు రెక్కలని పైకి ఎత్తే బలం విమానం బరువుని అధిగమించలేని పరిస్థితి;
* stallion, n. మగ గుర్రం; గుండు;
* stalwart, n. దిట్ట;
* stamen, n. కేసరములు; కింజిల్కములు; పురుషపత్రములు; మగ పువ్వు లోని పుప్పొడి రేణువులు;
* stamina, n. ఓపిక; సత్తా; సహనశక్తి; సామర్థ్యం;
* staminode, n. వంధ్యకేసరం; పుప్పొడితిత్తిలేని పుంకేసరం;
* stammer, n. నత్తి;
* stammer, v. t. నత్తితో మాట్లాడు;
* stamp, n. (1) తపాలాబిళ్ల; సికా; స్టేంపు; (2) ముద్ర; మొహరు;
** postage stamp, ph. తపాలా బిళ్ల; తపాలా ముద్ర;
** stamp of approval, ph. ఆమోద ముద్ర;
* stamp, v. t. ముద్రకొట్టు; ముద్రవేయు; టపటపా బాదు;
* stamped, n. ముద్రాంకితము;
* stampede, n. దొమ్మీ; తొక్కిసలాట;
* stamping, n. ముద్రకొట్టుట; ముద్రవేయుట;
* stance, n. స్థిరచిత్తము; నిశ్చితాభిప్రాయము; ఉద్దేశము; భంగిమ;
* stand, n. (1) నిలిపే స్థలం; స్థావరం; (2) బడ్డీ; మంచె; (3) దిమ్మ;
** bus stand, ph. బస్సులు నిలిచే స్థలం;
** concession stand, ph. రాయితీ బడ్డీ;
** cycle stand, ph. సైకిళ్లు నిలిపే స్థలం;
** lamp stand, ph. దీపపు దిమ్మ;
* stand, v. i. (1) నిలబడు; (2) భరించు; సహించు; తట్టుకొను;
** I cannot stand this heat, ph. ఈ వేడి నేను భరించలేను;
* stand down, ph. తగ్గు; దిగు;
* standard, adj. ప్రామాణిక;
* standard, n. (1) స్థాయి; అంతస్తు; తరగతి; (2) ప్రమాణం; ప్రామాణికం; ఆదర్శం;
** aesthetic standard, ph. అలంకారిక ప్రమాణం;
** aristocratic standard, ph. కులీన ప్రమాణం;
** colloquial standard, ph. వ్యావహారిక ప్రమాణం;
** global standard, ph. భౌగోళిక ప్రమాణం;
** prescribed standard, ph. నిర్దేశిత ప్రమాణం;
** Indian Standard Time, ph. భారతీయ ప్రామాణిక సమయం;
** regional standard, ph. ప్రాంతీయ ప్రమాణం;
** standard time, ph. ప్రమాణ కాలం; ప్రామాణిక సమయం;
** sub-standard, ph. న్యూన ప్రామాణికం;
* standardization, n. స్థాయీకరణం; స్థిరీకరణం; ప్రామాణీకరణం;
* standardize, v. t. స్థాయీకరించు; ప్రమాణీకరించు; స్థిరీకరించు;
* standing, adj. నిలబడి ఉన్న; ప్రస్తుతం అమలులో ఉన్న;
** standing orders, ph. స్థిరాజ్ఞలు;
** standing waves, ph. స్థిర తరంగాలు; నిలకడ తరంగాలు;
* stanza, n. చరణం; పద్యం;
* stapes, n. కర్ణాంతరాస్థి; అంకెవన్నె ఎముక; రికాబు; మధ్య చెవిలో ఒక ఎముక; ఇదే మానవ శరీరంలో అతి చిన్నదైన ఎముక;
* staple, adj. ముఖ్యమైన; ప్రధానమైన;
** staple food, ph. ముఖ్యమైన ఆహారం;
* staple, n. (1) నాగవాసం; మడతపిన్ను; కాగితాలని కట్టడానికి వాడే పిన్నులాంటి ఉపకరణం; (2) పింజ; పత్తి గింజల పరిమాణాన్ని తెలిపే ఒక కొలత;
** long staple, ph. పొడుగు పింజ; పొడుగు గింజ;
** long staple cotton, ph. పొడుగు పింజ పత్తి;
* stapler, n. నాగవాసిని;
* star, n. నక్షత్రం; తార; తారక; చుక్క;
** cinema star, ph. సినిమాతార; తెర తార;
** collapsed star, ph. కూలిన తార; నల్ల నక్షత్రం;
** evening star, ph. పగటిచుక్క;
** morning star, ph. పగటిచుక్క;
** star cluster, ph. నక్షత్రరాశి;
** starboard side, ph. వెలపల; బోడిద; బండికి కుడి వైపు; right side of a boat, ship, aircraft or any vehicle; In ancient times the rudder was located on the right side (the 'Styri' = rudder side) and loading/unloading done from the other side)
* starch, n. పిండి; పిండి పదార్థం; గంజి; మండము;
* starch, v. t. గంజిపెట్టుట;
* star gooseberry, n. రాచ ఉసిరిక; రాచ ఉసిరి; [bot.] ''Averrhoa acida'' of the Oxalidaceae family;
* star fruit, n. కరంబోలా; కమారంగా; [bot.] ''Averrhoa carambola'' of the Oxalidaceae family;
* start, v. i. (1) ఉలిక్కిపడు; తుళ్లిపడు; భయపడు; (2) బయలుదేరు;
* start, v. t. (1) మొదలుపెట్టు; ఆరంభించు; ఉపక్రమించు; ప్రారంభించు; కానివ్వు; (2) నడపడం మొదలు పెట్టు;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: start, begin
* ---Usually, these words mean the same thing. However, ''start'' has some special meanings. Use ''start'' to talk about making a machine work: start your car! You could also use ''start'' to talk about making something begin to exist: He started a new business.'''
|}
*
* startle, v. i. ఉలికిపడు; తుళ్లిపడు; అదరిపడు; భయపడు;
* startle, v. t. భయపెట్టు;
* startup, n. అంకుర సంస్థ; అంకుర వ్యాపారం; అభినవోద్భిజ సంస్థ; మొలక పొత్తు; మొలక కూటమి;
* starve, v. i. పస్తు ఉండు; తిండి లేకుండా ఉండు;
* starve, v. t. పస్తు పెట్టు; తిండి లేకుండా మాడబెట్టు;
* starveling, n. అక్కుపక్షి; ఆకలికి బక్కచిక్కిన జీవి;
* state, n. (1) స్థితి; సంస్థితి; పరిస్థితి; దశ; స్థాయి; అవస్థ; (2) రాజ్యం; రాష్ట్రం;
** drunken state, ph. మందుపట్టు మీద ఉన్న స్థితి;
** equilibrium state, ph. సమతా స్థితి;
** excited state, ph. ఉద్రిక్త స్థాయి; ఉద్రిక్త స్థితి;
** ground state, ph. భూ స్థాయి; భూస్థితి;
** welfare state, ph. శ్రేయోరాజ్యం;
* state, v. t. చెప్పు; నుడువు; వక్కాణించు;
* statement, n. (1) ప్రవచనం; సూక్తం; కంఠోక్తి; (2) వాంగ్మూలం; (3) యాదాస్తు; హిస్సాబు; memorandum;
** deathbed statement, ph. మరణ వాంగ్మూలం;
** oral statement, ph. వాంగ్మూలం;
** written statement, ph. కైఫీయతు;
* statesman, n. రాజ్యతంత్రి; రాజ్యాంగవేత్త;
* statesmanship, n. రాజ్యతంత్ర చతురత; రాజనీతిజ్ఞత; రాజకీయ కుశలత;
* static, adj. స్థిర; నిశ్చల;
** static electricity, ph. స్థిర విద్యుత్తు; a stationary electric charge, typically produced by friction, which causes sparks or crackling or the attraction of dust or hair;
* static, n. (1) స్థిర విద్యుత్తు; (2) రొద;
* statics, n. స్థితి శాస్త్రం; సమతౌల్యం యొక్క లక్షణాల అధ్యయనం; వస్తువులపై బలములు ప్రసరించినప్పుడు అవి సమతౌల్యం మీద చూపే ప్రభావాన్ని గురించి విచారించే శాస్త్రం;
** hydrostatics, ph. జలస్థితి శాస్త్రం;
* station, n. తావు; నిలయం; ఆగాణం; స్థలం; ప్రదేశం; స్థావరం; ఇరవు; చావడి; వ్రజం; కొట్టం; కొటారం; కళ్ళం; లాయం; శాల; ఠాణా; స్టేషను;
** ground station, ph. భూస్థావరం;
** police station, ph. కొత్వాలు చావడి; పొలీసు ఠాణా: ప్రోపోరు ఆగాణం;
** railway station, ph. రైలు కొట్టం; రైలు శాల; రైలు స్టేషను;
* stationary, adj. స్థావర; స్థిర; స్థాన్ను; స్తంభ; స్తబ్ధ; ప్రతిష్ఠిత; అచల; నిష్పంద; నియత; నిలకడ అయిన; చలనం లేని; ప్రచలిత;
* stationary, n. అచలనం; స్థావరం; స్థిరం; నియతం; స్తబ్ధం; ప్రచలితం;
* stationery, adj. రాతకి సంబంధించిన;
** stationery store, ph. కాగితాలు; కలాలు; మొదలైన రాత పనిముట్లు దొరికే కొట్టు;
* statistic, n. విస్తృతమైన దత్తాంశనిది యొక్క లక్షణాలని క్లుప్తంగా సూచించే సంఖ్య; a fact or piece of data from a study of a large quantity of numerical data;
* statistical, adj. సాంఖ్య; గణాంక;
** statistical profile, ph. గణాంక వైఖరి;
* Statistics, n. (1) సంఖ్యాశాస్త్రం; గణాంక శాస్త్రం; మచ్చుకి ఆధారంగా చేసుకుని అసలు నిజస్వరూపం నిర్ధారించే శాస్త్రం; Statistics is the science of gathering, describing, and analyzing data; (2) గణాంకాలు; సంఖ్యాక్రమాలు; Statistics are the actual numerical descriptions of sampled data such as mean, variance, median, etc.;
** Bayesian statistics, ph. బేస్ గణాంకశాస్త్రం;
** official statistics, ph. అధికార గణాంకాలు;
* statue, n. ప్రతిమ; విగ్రహం; మూర్తి;
* status, n. అంతస్తు; హోదా; పరపతి; స్థితి; పదవి; ప్రతిపత్తి;
** independent status, ph. స్వతంత్ర ప్రతిపత్తి;
** special status, ph. ప్రత్యేక ప్రతిపత్తి; ప్రత్యేక హోదా:
** status quo ante, ph. యథాతథస్థితి;
* statute, n. చట్టం;
* statutory, adj. విధ్యుక్త; చట్టబద్ధ; చట్టసమ్మత; శాసనాత్మక; శాసనప్రోక్త; శాసన విహిత;
* stay, v. i. ఉండు; ఉండండి;
** stay on the line, ph. టెలిఫోను మీద ఉండండి;
* steadfastness, n. స్థైర్యం; తితీక్ష;
* steady, adj. నిదానమైన; స్థిమితమైన; అచ్యుతమైన;
* steadily, adv. నిలకడగా; నిదానంగా; స్థిమితంగా; నెమ్మదిగా;
* steadiness n. నిలకడ; కుదిరిక; స్థైర్యం;
* steady state, adj. కూటస్థ; సర్వకాలములలో ఒకేలా ఉండునది;
* Steady State Theory, ph. కూటస్థ వాదం; యథాస్థితి వాదం; అచ్యుత వాదం;
* steal, v. t. దొంగిలించు; ఎత్తుకెళ్ళు; తస్కరించు; అపహరించు;
* stealing, n. దొంగిలించడం; తస్కరించడం; అపహరణం; హరణం;
* stealthy, adv. దొంగచాటుగా; గుప్తంగా; గూఢంగా; నక్కినట్లు; అదృశ్యమానంగా; మరొకరి కంట పడకుండా;
* steam, n. ఆవిరి; నీటి ఆవిరి; ఊష్మం;
** steam engine, ph. ఆవిరి యంత్రం;
* steamer, n. (1) ఆవిరిని పుట్టించే పాత్ర; (2) పొగ ఓడ; ఆవిరి యంత్రంతో నడిచే ఓడ;
* stereotype, n. మూసధోరణి;
* stearic acid, n. ఘృతికామ్లం;
* steel, n. ఉక్కు;
** mild steel, ph. మేదక ఉక్కు;
* steep, adj. ఎక్కువ వాలుగా ఉన్న;
* steep, v. t. నానబెట్టు; తడుపు;
* steeped, adj. భావన; నానబెట్టిన; తడిప్పేట్టిన;
** steeped ginger, ph. భావన అల్లం;
* steerability, n. చోదనార్హత; చోదకశక్తి; చోదకత్వం;
[[File:CopanNSouthCatherwood.jpg|thumb|right|stele=శిల్పాక్షరాలు ఉన్న పొడుగాటి శిల]]
* stele, n. ప్రసరణ స్తంబం; పొడుగాటి రాయి
* stellar, adj. నాక్షత్ర; నక్షత్రాలకి సంబంధించిన;
* stellate, adj. నక్షత్రాకార; తారాకార;
* stem, n. (1) కాడ; కాండం; బోదె; (2) వంశమూలం; అంకురం;
** stem cells, ph. అంకుర కణాలు; మూల కణాలు;
* stem, v. t. (1) అదుపులో పెట్టు; ఆపు; నిరోధించు; (2) పుట్టు; ఉద్భవించు; (note) విరుద్ధార్థములతో ఉన్న మాట;
* stench, n. కుళ్లుకంపు; దుర్వాసన; కంపు;
* stenosis, n. రక్తనాళపు ద్వారం సన్నబడుట; నాళపు ద్వారం సన్నబడుట;
* step, n. (1) మెట్టు; పర్వం; (2) అడుగు;
** step forward, ph. ముందంజ వేయు; ముందుకి వచ్చు; ముందడుగు వేయు;
* stepfather, n. సవితి తండ్రి; మారటి తండ్రి;
* stepmother, n. సవితి తల్లి; మారటి తల్లి;
* steps, n. (1) మెట్లు; సోపానాలు; పావంచాలు; (2) అడుగులు;
** hasty and rash steps, ph. దుందుడుకు అడుగులు;
* stereotype, n. గతానుగతికం; మార్పులేనిది;
* stereotypically, adv. గతానుగతికంగా;
* sterile, adj. బంజరు; గొడ్డుపోయిన; వంధ్య;
* sterility, n. వంధ్యత్వం;
* sterilization, n. బంజరు చెయ్యడం; వంధ్యీంచడం; సంతాన నిరోధక చికిత్స;
* stern, n. పడవ వెనుకభాగం;
* sternum, n. ఉరస్థి; రొమ్ము ఎముక; బోర ఎముక;
* sternutation, n. తుమ్ము;
* steroid, n. ఘృతార్ధం; నెయ్యివంటి పదార్థం;
** steroid hydrocarbon, ph. ఘృతార్థ ఉదకర్బనం;
* sterol, n. [chem.] ఘృతాల్;
* stethoscope, n. పరిశ్రావకము; ఛాతీ శోధిని; గుండె, ఊపిరితిత్తులు, పొట్ట, మొదలైన అంతర్గత అంగధ్వనులని వినడానికి వైద్యులు ఉపయోగించు శ్రవణ పరికరము; from the Greek "stéthos" = chest, and "skopéin" = explore, observe;
* steward, n. m. సారథి; కార్యదక్షుడు;
* stewardess, n. . సారథి; ఆకాశకన్య;
* stewardship, n. సారథ్యం;
* stick, n. (1) పుల్ల; దండం; కర్ర; (2) వత్తి;
* incense stick, ph. అగరువత్తి;
* stick, v. i. అంటుకొను;
* stick, v. t. అంటించు;
* sticklac, n. ముడి లక్క;
* stiff, adv. బింకంగా; బటువుగా;
* stiffness, n. ధార్‌ష్ట్యము; బింకం; ధారుడ్యం; బటుత్వం;
* stigma, n. (1)[bot.] కీలాగ్రం; పుషె్పూని; ఆడ పువ్వు లో పుప్పొడిని అందుకునే భాగం; (2) మచ్చ; నింద; కళంకం;
* still, adj. నిలకడ;
* still, n. బట్టీ; దిగమరిగించే సాధనం; బీరు ని బట్టీ పట్టగా విస్కీ వస్తుంది;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''USAGE NOTE: still and yet
* Use ''still'' to talk about a situation that continues to exist at the present time. ''Still'' is usually used before the verb: I still see Karthik from time to time. If the verb is “be”, ''still'' comes after it: I hope this food is still good. Usually, ''yet'' is used at the end of a sentence: Is Radha back from school yet?'''
|}
*
* still, adv. ఇంకా;
* still more, ph. ఇంకొంచెం; మరికొంచెం;
* stills, n. [cinema] నిశ్చల చిత్రాలు; నిశ్చలన చిత్రాలు;
* stimulants, n. ఉత్తేజకాలు; ప్రచోదనాలు; ఉద్దీపకాలు; many of the caffeine-containing foods such as coffee, cocoa, and chocolate contain mild doses of the stimulant at relatively harmless levels; the stimulant arecoline found in betel nuts is also relatively mild; examples of more potent and dangerous stimulant drugs are nicotine and cocaine;
* stimulus, n. ఉద్దీపకం;
* sting, n. కుట్టు; కాటు;
** bee sting, ph. తేనెటీగ కుట్టు; తేనెటీగ కాటు;
** mosquito sting, ph. దోమ కుట్టు; దోమకాటు;
* stingy person, n. లోభి; అల్పంపచుడు;
* stink, n. కంపు;
* stinking, adj. కంపూయమైన; కంపుగొట్టేటి;
* stink, v. i. కంపుకొట్టు;
* stipend, n. వేతనం; భరణం; వరుమానం; విద్యుక్త;
* stipulated, adj. విహిత; నిర్ణీత; నిర్దేశించిన; విధించబడ్డ; శాస్త్రోక్తంగా చెప్పబడ్డ;
** stipulated duty, ph. విద్యుక్త ధర్మం;
** stipulated functions, ph. విహిత కర్మలు; విధించబడ్డ పనులు;
* stipulated, n. విహితము;
* stir, v. i. కదులు; కదలాడు;
* stir, v. t. కదుపు; కదుల్చు; తిప్పు;
* stirrer, n. తిప్పుడు పుడక; గరిటె; కలువరి; కల్వరి; కలివెన;
* stirrup, n. రికాబు; అంకెము; అంకవన్నె;
* stitches, n. pl. కుట్లు; టాకీలు;
* stochastic, adj. యాదృచ్ఛిక; same as random;
** stochastic process, ph. యాదృచ్ఛిక ప్రక్రియ;
* stock, n. (1) నిల్వ; నిలువ; సరకు; (2) కంపెనీలో వాటా;
* stockings, n. pl. మేజోళ్లు; కాల్తిత్తులు; sox;
* stoic, n. విరాగి; స్థితప్రజ్ఞ;
* stoicism, n. వైరాగ్యం; విరాగం; స్థితప్రజ్ఞతావాదం;
* stolen, adj. దొంగ;
* stomach, n. (1) కడుపు; పొట్ట; డొక్క; కుక్షి; ఉదరం; గర్భం; (2) జీర్ణాశయం; జీర్ణకోశం; జఠరం; ఆమాశయం;
** stomach juices, ph. జఠర రసాలు;
* stomata, n. పత్రరంధ్రములు; ఆకుబెజ్జములు;
* stomatitis, n. నోటిపూత; అస్యపాకం;
* stone, n. (1) రాయి; శిల; అశ్మము; పాషాణం; ప్రస్తరం; పత్తర్; కాంతం; (2) రత్నం;
** etched in stone, ph. శిలాక్షరములు;
** lodestone, ph. అయస్కాంతం;
** moonstone, ph. చంద్రకాంతం;
** precious stone, ph. రత్నం;
** semi-precious stone, ph. ఉప రత్నం;
** sunstone, ph. సూర్యకాంతం; ఒక రకం పొడి;
** stone age, ph. రాతియుగం; శిలాయుగం; అశ్మయుగం; (3) టెంక;
** stone mortar, ph. రుబ్బుఱోలు;
** stone smith, ph. వడ్డెరవాడు; ఱాతి కార్మారుఁడు;
* stones, n. pl. రాళ్లు;
* stool, n. (1) మలము; పురీషము (2) కుర్చీపీట;
* stop, inter. ఆగు;
* stop, n. (1) ఆగే చోటు; ఆగాణం; మజిలీ; విరామం; (2) [ling.] స్పర్శము; కంఠనాళంలో నుండి బయటకు వచ్చే గాలిని రెండు ఉచ్చారణాంగాల సహాయంతో ఆపడం;
** bilabial stop, ph. [phoen.] ఉభయోష్ట్య స్పర్శము; In phonetics and phonology, a bilabial stop is a type of consonantal sound, made with both lips (hence bilabial), held tightly enough to block the passage of air (hence a stop consonant). The most common sounds are the stops [p] and [b], as in English pit and bit;
** bus stop, ph. బస్సులు ఆగేచోటు; బస్సాగాణం;
** full stop, ph. పూర్ణ విరామం; రాతలో వాక్యాన్ని పూర్తి చేసినప్పుడు వాడే గుర్తు;
** velar stop, ph. [phoen.] హనుమూలీయ స్పర్శము; In phonetics and phonology, a velar stop is a type of consonantal sound, made with the back of the tongue in contact with the soft palate (also known as the velum, hence velar), held tightly enough to block the passage of air (hence a stop consonant). The most common sounds are the stops [k] and [ɡ], as in English cut and gut;
* stop, v. i. ఆగు; మజిలీ చేయు;
* stop, v. t. ఆపు; అరికట్టు; కట్టిపెట్టు; మాను; చాలించు; నిలుపు; నిలువరించు; అడ్డగించు;
* stop and go, adj. నివర్తన; ఉండీ ఉడిగి;
* stopcock, n. నిరోధిని; బిరడా;
* stopover, n. మజిలీ; మకాం; ప్రయాణంలో ఆగేచోటు;
* stopper, n. బిరడా; మూత; వారిణి; ఆపేది;
* storage, adj. సంచాయక;
* store, n. (1) కొట్టు; కొట్టుగది; లిబ్బి; కోఠీ; కోష్ఠాగారం; ఖానా; భాండాగారం; గరిస; (2) ఉగ్రాణం; అంగడి; సినం;
** data store, ph. దత్తాలయం; దత్తాఖానా; దత్తాకోఠీ; గరిస;
** drug store, ph. దవాఖానా; మందులకొట్టు;
** provisional store, ph. సినకొట్టు; సినాంగడి;
* store, v. t. దాచు; భద్రపరచు; నిల్వ చేయు;
* stork, n. గూడకొంగ; పెనుకొంగ; పెద్దకొంగ;
** open-bill stork, ph. నల్లకాళ్ళ కొంగ;
** painted stork, ph. ఎర్రకాళ్ళ కొంగ;
* storm, n. తుపాను; గాలివాన;
** dust storm, ph. దుమారం;
** stormy wind, n. ఈదర గాలి;
* story, storey, n. అంతస్తు;
* story, n. (1) కథ; కత; వృత్తాంతం; ఉపాఖ్యానం; ఆఖ్యాయిక; ఆఖ్యానం; గాధ; ఇతిహాసం; నారాశంశ; తిత్తివ; (see also) tale; legend; epic; myth; fable; fiction; parable; allegory; narrative;(2) అంతస్తు; భవనంలో ఒక మట్టం;
** ancient story, ph. ఇతిహాసం;
** epic story, ph. పురాణగాధ; పెద్ద కథ;
** fabricated story, ph. కట్టుకథ;
** mini story, ph. పరికథ;
** prose story, ph. ఆఖ్యాయిక;
** real story, ph. నిజంగా జరిగిన కథ; ఆఖ్యాయిక;
** serialized story, ph. ఖండకథ; స్రవంతి;
** short story, ph. కథానిక; ఆఖ్యానకం;
** topic of story, ph. కథావస్తువు;
** true story, ph. ఆఖ్యాయిక;
** story within a story, ph. పిట్ట కథ; ఉపాఖ్యానం;
* stout, adj. లావైన; బొద్దు; స్థూల;
** stout rope, ph. మోకు;
* stoutness, n. లావుతనం; స్థౌల్యం; స్థాలిత్యం;
* stove, n. కుంపటి; see also range; oven;
* strabilis, n. వాతం;
* straight, adj. తిన్ననైన; సరళ; రుజు; నేరు; నిటారైన; సీదా; సూటి;
** straight carbon chain, ph. సరళ కర్బన శృంఖలం;
** straight line, ph. సరళ రేఖ; ఋజు రేఖ; ఋజు పంక్తి;
* straightforward, adj. సూటి; తిన్న; నికార్సు;
* strain, n. (1) ప్రయాస; శ్రమ; (2) [biol.] జాతి; వంగసం; వంగడం;
** strain of bacteria, ph. సూక్ష్మజీవుల జాతి;
* strainer, n. (1) చిల్లుల సిబ్బి; సిబ్బితట్ట; జల్లిమూకుడు; కర్కరి; చాలని; (2) వడపోత గుడ్డ; వడపోత కాగితం;
* straits, n. s. జలసంధి; దూసేరు; రెండు పెద్ద జలాశయాలని (సముద్రాలని) కలిపే సన్నటి జలమార్గం;
* strand, n. (1) కోవ; పేట; పాయ; పోచ; సరము; తంతువు; యష్టి; (2) ఇసక మేట;
** multiple strand, ph. బహుళ యష్టి;
** single strand, ph. ఏక యష్టి; ఏకావళి;
* strand, v. i. దిగబడు; చిక్కుపడు; నట్టడు;
* strange, adj. విచిత్రపు; వింత; పరిచయము లేని; అపరిచిత;
** strange particle, ph. వింత రేణువు;
* strangeness, n. విచిత్రం; వైచిత్రి; వింత; ఎల్లిదం;
* stranger, n. అపరిచితుడు;
* stratagem, n. s. తంత్రం; పన్నాగం; పన్నుగడ; ఎత్తుగడ; దూరదృష్టితో చేసే తంత్రం; see also tactic;
* strategically, adv. వ్యూహాత్మకంగా;
* strategy, n. pl. పన్నాగాలు; ఎత్తుగడలు; వ్యూహాలు; స్ట్రాటజీ అనేది అంతిమ లక్ష్యాన్ని ఛేదించటానికి ఉండాల్సిన కార్యాచరణ ప్రణాళిక; స్ట్రాటజీ ప్లానింగ్ కి సంబంధించినది. అంటే స్ట్రాటజీ అనేది "ఎందుకు" అనే ప్రశ్న మీద ఆధారపడి "ఎందుకు" చేస్తున్నాం అనేది బయటకు కనిపించదు, నాయకుడికి తప్ప మరొకరికి తెలిసే అవకాశం ఉండదు. see also tactics;
* stratification, n. పొరపొచ్చం; స్థలీకరణం;
* stratified, adj. స్తరిత;
* stratosphere, n. ఆస్తరావరణం; చైతన్యావరణము పైన 51 కిమీ వరకు విస్తరించి ఉంటుంది. ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది, అందుకనే ఇక్కడ కల్లోల స్థితి తక్కువ. ఇక్కడే వాణిజ్య విమానాలు తిరిగేది. ఓజోన్ పొర కూడా ఇక్కడే ఉంటుంది;
* stratum, n. పొర; ఆస్తరం; స్తరం;
* straw, n. (1) గడ్డి; ఎండుగడ్డి; (2) పోచ;
** paddy straw, ph. వరి గడ్డి;
* streak, n. చార; చారిక;
* stream, n. వాహిని; నది; అర్ణం; ఏఱు; ధుని; జంబాలిని; ప్రవాహిక;
* streamers, n. pl. తలాటాలు; అలంకారానికి వాడే సన్నటి రంగురంగుల నగిషీ కాగితాలు; గుర్రాల తలలపై ఎగెరే అలంకారాలు;
* street, n. వీథి; వాటిక; వాడ; రోడ్డు;
** main street, ph. రాజవీధి; మెయిన్ రోడ్డు;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
---USAGE NOTE: street, boulevard, and road
* ---Usually, a street is within a town or city. A boulevard is a wide road, often with a median separator between opposing lanes of traffic. A road is usually in the country. However, the word road is used in the names of streets, especially wide ones, as in “Mount Road.”
|}
*
* strength, n. బలం; బలీయత; సత్వం; సత్తువ; పటిమ; పటుత్వం; పటిష్టత; ఓపిక; త్రాణ; శక్తి; (rel.) energy, power, stamina;
** financial strength, ph. అర్థబలం;
** physical strength, ph. శారీరక బలం; అంగబలం; కండ బలం;
* strengthen, v. t. శక్తివంతం చేయు; పటిష్టపరచు; దిట్టం చేయు; బలపరచు; నిబిడీకరించు;
* stress, n. (1) ఒత్తిడి; రాపాటు; (2) మానసిక ఒత్తిడి; (3) ఊనిక; ఊత;
* stress, v. t. నొక్కి వక్కాణించు; మరీ మరీ చెప్పు; ఒత్తిడి చేయు;
* stretch, v. i. సాగు; జాపు; చాపు;
* stretch, v. t. సాగదీయు; పొడిగించు;
* striate, adj. చారికలు గల;
* striation, n. గాడి; చార;
* strict, adj. నిక్కచ్చి; కరాకట్టు;
* strictly, adv. నిక్కచ్చిగా; కరాకట్టుగా;
* stride, n. అంగ;
* strife, n. కలహం; తగవు;
* strike, n. సమ్మె; హర్తాళ్;
* strike, v. i. తట్టు; అనిపించు; స్పురించు;
* strike, v. t. బాదు; కొట్టు; మోదు;
* strike out, ph. కొట్టివేయు; అడ్డుగా గీత గీయు;
* string, n. (1) దారం; తాడు; (2) తంతి; తీగె; సారె; కమ్మ;
* string, v. t. దారముతో దండగా గుచ్చు; మాల కట్టు;
* stringed instrument, n. తంతి వాద్యం;
* strip, n. బద్ద; పేలిక; పట్టీ;
* strip, v. t. ఒలచివేయు;
* striped, adj. చారల;
* strive, v. i. ప్రయత్నించు; కడంగు;
* stroke, n (1) దెబ్బ; గాతం; ఆఘాతం; ఆహతి; ఉపహతి; కిల్ల; (2) మస్తిగాతం; మెదడులో రక్తనాళం పూడుకుపోవడం వల్ల కలిగే పరిస్థితి; (3) రుద్రవాతం; మస్తకఘాతం; మెదడులో రక్తస్రావం జరగడం వల్ల కలిగే పరిస్థితి;
** heat stroke, ph. వడ దెబ్బ; ఉష్ణ ఘాతం; ఆతప ఆహతి;
* stroke, v. t. నిమురు; దువ్వు;
* strong, adj. బలమైన; బలిష్టమైన; పటిష్టమైన; దృఢ; శక్తివంతమైన; త్రాణ కలిగిన; త్రాణిక; తీక్షణమైన; ప్రబలమైన; ప్రగాఢ; నిబిడమైన;
** strong acid, ph. త్రాణికామ్లం;
* Strontium, n. రేడియో ధార్మికశక్తి ఉన్న ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 38, సంక్షిప్త నామం, Sr);
* structure, n. కట్టడం; కట్టడి; నిర్మాణం; రచన; ఆకారం; ఆకృతి;
** atomic structure, ph. అణువుల నిర్మాణం; అణురచన;
** crystal structure, ph. స్ఫటిక నిర్మాణం; స్ఫటిక రచన;
** molecular structure, ph. బణువుల నిర్మాణం; బణురచన;
** subatomic structure, ph. పరమాణువుల నిర్మాణం; పరమాణు రచన;
** structural formula, ph. నిర్మాణ క్రమం; ఒక బణువులో అణువులు ఎలా అమర్చబడి ఉన్నాయో చూపే బొమ్మ;
** structural universals, ph. నిర్మాణాత్మక సార్వత్రికలు;
* structuralism, n. నిర్మాణక్రమవాదం; ఒక రకం సాహిత్య విమర్శ;
* struggle, v. i. గింజుకొను;
* struggle, n. (1) పెనుగులాట; ఘర్షణ; (2) పోరాటం;
** struggle for existence, ph. జీవన పోరాటం; జీవన సమరం;
** struggle for independence, ph. స్వతంత్ర పోరాటం;
* strychnine, n. ముషిణి; ఒక విషపదార్థం; నక్స్ వామికా గింజలలో ఉండే విషం;
* stubble, n. (1) దుబ్బు; కొయ్యగా మిగిలినది; (2) కొద్దిగా పెరిగిన గెడ్డం;
* stubborn, adj. మొండి;
* stubbornness, n. మొండితనం; పంతం; పెంకితనం;
* stud, n. మగ గుర్రం; గుండు;
* student, n. అధ్యేత; అభ్యాసి; అంతేవాసి; m. విద్యార్థి; f. విద్యార్థిని;
** student's student, ph. ప్రశిష్యుడు; (note) similar to ప్రాచార్యుడు, ప్రపితామహుడు;
* studies, n. విద్య; చదువు సంధ్యలు;
** higher studies, ph. ఉన్నత విద్య; పై చదువులు;
* studio, n. చిత్రశాల;
* study, n. (1) చదువుకొనే గది; (2) పఠన; చదువు; అధ్యయనం;
* study, v. i. చదువు; పఠించు; నేర్చుకొను; అభ్యసించు; అధ్యయనం చేయు; అవగాహించు; గరచు; గ్రహించు; ప్రాపించు;
* stuff, n. సరుకు;
* stuff, v. i. మెక్కు;
* stuff, v. t. కుక్కు; దట్టించు;
* stuffing, n. కూరు; తోపు; పూర్ణం;
* stump, n. శంకువు;
* stun, v. i. నివ్వెరపడు; మ్రాన్పడు; రిచ్చపడు; స్తంభించు; నిర్ఘాంత పోవు;
* stunted, adj. . గిడసబారిన; ఎదగని;
* stunted, adj. గిడస; గిడసబారిన; ఎదగని;
* stupefaction, n. నిర్విణ్ణత; స్తబ్ధత;
* stupefy, v. t. నిర్విణ్ణుని చేయు; స్తబ్ధుని చేయు;
* stupid, adj. మొద్దు; జడ్డు; తెర్ర;
* stupid, n. శుంఠ; మొద్దు; జడ్డి; మూఢమతి; m. మూర్ఖుడు; బుద్ధిహీనుడు; వివేకహీనుడు;
** extremely stupid, ph. వజ్రశుంఠుడు; శుద్ధ మొద్దావతారం;
* stupidity, n. అవివేకం; బుద్ధిహీనత; తెలివితక్కువతనం; మూర్ఖత్వం; జడ్డితనం; ఎడ్డమి;
* stupor, n. మూర్చ; మత్తు; మైకం; జడత్వం; స్తబ్దత;
* stupor, n. మూర్చ; మత్తు; మైకం; జడత్వం; స్థబ్దత; లాహిరి; ఇంచుమించు స్పృహ లేని స్థితి;
* stutter, n. నత్తి;
* style, n. (1) వాటం; వైఖరి; తీరు; పద్ధతి; రీతి; పగిది; చందం; బాణీ; ఫక్కి; పంథా; హావభావాలు; ధోరణి; తరహా; లక్షణం; ఫణితి; శైలి; (2) కీలం; పువ్వుల అండాశయంలో ఉన్న కాడ;
** speaking style, ph. ఫణితి;
** writing style, ph. శైలి;
** style manual, n. లక్షణ గ్రంథం;
** style sheet, n. శైలీ పత్రం;
* stylist, n. లాక్షణికుడు;
* stylus, n. గంటం; కలం ఆకారంలో ఉండే ఒక లోహపు పనిముట్టు;
* suave, adj. సారస్యము; సరసత; లోలోపల ఎలా ఉన్నా పైకి మాత్రం తేలిపోకుండా మాట మంచితో ఉండే ప్రవర్తనతో కూడిన;
* sub, pref. ఉప; క్రీ; కింది;
* subaltern, adj. అధీన; పరాధీన; వలస రాజ్యాలలో బ్రిటిష్ మిలటరీ వారు తరచుగా వాడిన పదం;
** subaltern perspective, ph. అధీన దృక్కోణం; పరాధీన దృక్కోణం;
* subatomic, adj. పరమాణు; పరమాణీయ;
* subcommittee, n. ఉపసంఘం;
* subconscious, adj. వ్యక్తావ్యక్తమైన; సుప్తచేతనమైన; ఉపచేతన;
** subconscious mind, ph. ఉపచేతనం;
* subconsciousness, n. సుప్తచేతనం;
* subcontinent, n. ఉపఖండం; ఖండంలోని మిగిలిన ప్రాంతం నుంచి ఏదోక భౌగోళిక అడ్డంకుల కారణంగా (గొప్ప పర్వత శ్రేణులో, మహా నదులో, ఎడారులో) విడిపోయినట్టుగా ఉండే భారీ ద్వీపకల్పాలను ఉపఖండాలు అంటారు. ఇలా భౌగోళికంగా మిగిలిన ఖండం నుంచి విడిగా ఉంటూ, ఆ ప్రాంతం అంతా కలిసి ఉండడమే ఆ ప్రాంతానికి ప్రత్యేక సంస్కృతినీ, ఉమ్మడి చరిత్రనీ ఇస్తుంది;
* subdue, v. t. అణచు; లోబరచుకొను; వశపరచుకొను; జయించు;
* subject, n. (1) కర్త; వాక్యమందలి కర్త; (2) విషయం; కథావిషయము; (3) విశేష్యం; వ్యాప్యము; (4) అంశం; పాఠ్యాంశం; (5) వ్యవహర్త; పాలితుడు;
* subjective, adj. ఆత్మగత; ఆత్మాశ్రయ; స్వీయాత్మక; వ్యక్తినిష్ట; వ్యక్తిగత; ఆధ్యాత్మిక; ప్రాతీతిక;
** subjective idealism, ph. స్వీయాత్మక భావవాదం; ఆత్మాశ్రయ భావవాదం;
** subjective knowledge, ph. ఆత్మగత జ్ఞానం;
** subjective viewpoint, ph. ఆత్మగత దృక్పథం;
* subjectivism, n. ఆత్మాశ్రయవాదం;
* subjectivity, n. స్వీయాత్మకం; ఆత్మాశ్రయత్వం; వ్యక్తినిష్టత;
* subjugation, n. దమనం; దమననీతి;
* sublimation, n. ఋష్వం; ఉత్పాదం; ఉత్పతనం; ఘనరూపం నుండి నేరుగా వాయురూపంలోకి మారే భౌతిక ప్రక్రియ;
* sublingual, adj. నాలుక కింద; జిహ్వధర;
* submarine, n. నిమజ్జిత నావ; దొంగోడ; జలాంతర్గామి;
* submarine fire, n. బడబాగ్ని; బడబానలం; ఔర్వాగ్ని; అవ్వాగ్గి;
* submerged, adj. నిమజ్జిత;
* submission, n. దాఖలు; ఒప్పగం;
* submit, v. t. దాఖలు చేయు; దఖలు పరచు; ఒప్పగించు;
* subordinate, n. తాబేదారుడు;
* subpoena, n. (సపీనా) సాక్షి సమను; శిక్షా నిర్ణయముతో సాక్షిని రమ్మని పంపు ఉత్తరువు; (rel.) summons;
* subroutine, n. ఉపక్రమణిక;
* subscribe, v. i. చందాకట్టు; ఒప్పుకొను; అంగీకరించు; ఏకీభావం తెలుపు;
* subscriber, n. చందాదారుడు;
* subscript, n. పాదాక్షరం; పాదిక; పాదాంకం; అంత్య ప్రత్యయం;
* subscription, n. చందా; ఉపహారం;
** annual subscription, ph. సాలు చందా;
* subsequently, adv. తదుపరి; పిదప; అనంతరం; తర్వాత; కడపట; దరిమిలాను;
* subservience, n. అణకువ; విధేయత;
* subside, v. i. తగ్గు; మాటు పడు; సమసిపోవు;
* subsidy, n. ప్రభుత్వం ప్రసాదించే సహాయం;
* subsidiary, adj. గౌణ;
* subsistence, n. ఉపాధి; కనిష్ఠ జీవనాధారం; జీవక; భృతి;
* subsoil, n. ఉపమృత్తిక;
* subspecies, n. ఉపజాతి; ఉపగణం;
* substance, n. పదార్థం; ద్రవ్యం;
** gaseous substance, ph. వాయు పదార్థం;
** liquid substance, ph. ద్రవ పదార్థం;
** solid substance, ph. ఘన పదార్థం;
* substandard, n. న్యూన ప్రామాణికం;
* substantial, adj. మోతుబరు;
* substitute, n. బదులు;
* substitute, v. t. ప్రతిక్షేపించు; బదలాయించు; ఆదేశించు;
* substitution, n. ప్రతిక్షేపణ; ఆదేశం; అనుకల్పం; బదిలీ చర్య; మార్పిడి;
* substratum, n. అధస్తరం; దిగువనున్న పొర;
* subsystem, n. ఉపవ్యవస్థ;
* subtext, n. అంతరార్థం; గూఢార్థం; అన్యాపదేశం;
** metaphorical subtext, ph. ఉపమాత్మక అంతరార్థం;
* subtle, adj. (సటుల్) సూక్ష్మ; పట్టుకు దొరకనిది;
** subtle body, ph. సూక్ష్మ శరీరం;
** subtle differences, ph. సూక్ష్మ భేదాలు;
** subtle relationship, ph. సూక్ష్మ సంబంధం;
* subtle, n. సూక్ష్మం; వైదగ్ధ్యం;
* subtlety, n. సూక్ష్మం;
** subtlety of law, ph. ధర్మసూక్ష్మం;
* subtract, v. t. తీసివేయు; కొట్టివేయు; వ్యవకలించు;
* subtraction, n. తీసివేత; కొట్టివేత; వ్యవకలనం;
* subtrahend, n. వ్యవకలితం; శోధకము; తీసివేయబడే సంఖ్య; see also minuend;
* suburb, n. శాఖాగ్రామం; మదురువాడ; శాఖానగరం; pl. శివార్లు;
* succeed, n. జయించు; గెలుచు; నెగ్గు;
* success, n. జయం; విజయం; ఉత్తీర్ణం; సఫలం; కృతార్ధత;
* successful, n. సఫలం; జయప్రదం;
* successfully, adj. సఫలీకృతంగా; జయప్రదంగా;
* succession, n. (1) వంశపారంపర్యం; దాయాధికారం; వారసత్వం; ఉత్తరాధికారం; (2) పరంపరాక్రమం;
* successive, adj. ఉత్తరోత్తర్యా; పరంపరానుగత; అనుక్రమ;
* succinct, (సక్సింట్) adv. ముక్తసరిగా; సంగ్రహంగా; టూకీగా;
* succubus, n. కామినీ; మగవాడితో రతిని కాంక్షించే ఆడ దయ్యం; (ant.) incubus;
* succulent, adj. రసభరిత; రుచికర;
* such, adj. అటువంటి;
** such and such, adj. ఫలానా;
* suck, v. i. (1) చీకు; చప్పరించు; (2) పీల్చు;
** suck the breast, ph. పాలు తాగు;
* sucrose, n. ఇక్షోజు; పంచదారలో ఉండే చక్కెర;
* suction, n. చూషణం;
* sudden, adj. అకస్మిక; ఆకస్మిక;
* suddenly, adv. అకస్మాత్తుగా; ఆకస్మికంగా; అమాంతంగా; అనుకోకుండా; హఠాత్తుగా; ఉన్నపాటున; ఉన్నట్టుండి; గభీమని; గభాలున; పుసుక్కున; చివాలున; చటుక్కున; చట్టున; తటాలున; తటుక్కున; చటాలున; ఠక్కున; దిగ్గున; గ్రక్కున; చివ్వున; జివ్వున; కాదాచిత్కంగా; గుప్పున; గుబుక్కున; గబుక్కున;
* sudorific, n. ఘర్మకారి; చెమటని పుట్టించే పదార్థం;
* suds, n. నురుగ; నురగ; సబ్బు నురగ;
* sue, v. t. దావా వేయు; నష్టపరిహారం కోసం కోర్టులో దావా వేయు;
* suede, n. మెత్తని తోలు; Suede is a soft, fuzzy leather made from the inner layer of hide, while traditional leather (grain leather) is made from the tough, smooth outer layer;
* suffer, v. i. బాధపడు; తల్లడిల్లు;
* suffering, n. బాధ; వ్యధ; వెత; వేదన; దుఃఖం; వగపాటు;
* sufficient, adj. చాలినన్ని; సరిపడినన్ని; సరిపడా; పర్యాప్తమైన;
* sufficient, n. చాలు; సరిపోయింది; పర్యాప్తం;
** barely sufficient, ph. బొటాబొటీ;
** sufficient conditions, ph. పర్యాప్త నిబంధనలు; పర్యాప్త నియమాలు;
* suffix, n. ఉపప్రత్యయం; పరప్రత్యయం; ఉత్తరపదం; అపదం; అంతాంగమమం; తోకమాట; వాలం; వెలపలి తోక;
** causative suffix, ph. ప్రేరణ ప్రత్యయం;
* suffocate, v. i. ఉక్కిరిబిక్కిరి అవు;
* suffocate, v. t. ఉక్కిరిబిక్కిరి చేయు;
* suffocation, n. శ్వాసావరోధన;
* suffrage, n. ఓటు హక్కు; ఎన్నిక హక్కు;
* sugar, n. పంచదార; చక్కెర; శర్కర; పౌండ్రక; తీరవ్వ;
** blood sugar, ph. రక్త శర్కర; రక్తంలో గ్లూకోజ్ మట్టం;
** brown sugar, ph. శుద్ధి చేసిన తెల్ల చక్కెరకి కపిల వర్ణపు రంగు, షాడబం కొరకు మొలేసస్ కలపగా వచ్చినది;
** hexose sugar, ph. షడ్ చక్కెర; షడోజు;
** invert sugar, ph. త్రిశంకు చక్కెర; Invert sugar is a liquid sweetener made by breaking down table sugar (sucrose) into its component parts: 50% glucose and 50% fructose using heat and acid. Sucrose rotates polarized light to the right ($+$66.5°). Once hydrolyzed, the resulting mixture of glucose and fructose rotates light to the left, which is a physical "inversion".
** raw sugar, ph. బూరా చక్కెర; బూరా పంచదార; ముడి చక్కెర;
** synthetic sugar, ph. సంధాన చక్కెర;
** sugar candy, ph. పటికబెల్లం; పటికపంచదార; కలకండ;
* sugarcane, n. చెరుకు; చెరుకు గడ; ఇక్షువు;
** sugarcane juice, ph. చెరుకు రసం; ఇక్షు రసం;
* sugar cubes, n. కండ చక్కెర;
* sugar-phosphate, n. భాస్వరదార;
* suggestion, n. సలహా; సూచన;
* suicidal, adj. ఆత్మఘాతుక;
* suicide, n. ఆత్మహత్య; ప్రాణత్యాగం;
* suit, n. అభియోగం; దావా; వాజ్యం;
* suit, v. i. కుదురు; వీలగు; నప్పు;
* suitability, n. అనువు; ఉరవు; అవుచిత్యం; ఔచిత్యం; ఉచితం; ఒనరిక;
* suitable, n. అనువు; ఉరవు;
* suitable, adj. తగిన; ఉచితమైన; యుక్తియుక్త;
* suite, (స్వీట్) n. (1) హొటేళ్లలో కాని, కచేరీ భవనాలలో కాని రెండు మూడు గదులతో కూడిన వాటా; (2) సంగీతంలో రెండు, మూడు రాగాలతో కూడిన పాట; (3) కంప్యూటర్లలలో రెండు, మూడు అనువర్తన క్రమణికలని గంపగుత్తంగా అందించడం; మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో వర్డ్, పవర్ పోయింట్, ఎక్సెల్ అనే అనువర్తన క్రమణికలు గంపగుత్తంగా ఉంటాయి.
* suitor, n. (1) వ్యాజ్యగాడు; కక్షదారు; దావాదారు; (2) ఉపసర్పింౘువాఁడు; ఉపసర్పికుడు; తన్నుపెండ్లాడుమని ఒక స్త్రీనికోరువాడు;
* sulfate, sulphate (Br.) n. గంధకితం; బహు జాతిఅణువులతో కూడిన అయాను; ఈ అయాను బాహుబలం 2, సాంఖ్యక్రమం SO<sub>4</sub>;
* sulfide, sulphide (Br.) n. గంధకిదం; ఏక జాతి అణువులతో కూడిన అయాను; ఈ అయాను బాహుబలం 1, సాంఖ్యక్రమం S<sub>2</sub>;
* Sulfur, sulphur (Br.) n. గంధకం; మణిశిల; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 16, సంక్షిప్త నామం, S); [Sans.] sulvere
* sulfuric acid, sulphuric acid (Br.) n. గంధకామ్లం; గంధక ధృతి; H<sub>2</sub>SO<sub>4</sub>;
* sulk, v. i. గునుసు; చిటపటలాడు; అలుగు; ముఖము మాడ్చుకొను; కోపముగానుండు;
* sultana, n. బంగారు లేదా ఆకుపచ్చ రంగు ఎండిన ద్రాక్ష. అమెరికాలో సుల్తానాలను ‘గోల్డెన్ రైసిన్స్’ లేదా ‘Sun-maid’ అంటారు;
* sultriness, n. ఉక్క; గుబులు; ఉబ్బ;
* sum, v. t. కూడు; కలుపు;
* sum, n. మొత్తం; కలయిక; కూడిక;
** partial sum, ph. అర్ధాంతర మొత్తం;
* summarize, v. t. క్రోడీకరించు; సంగ్రహించు; టూకించు; ముక్తాయించు; ఉటంకించు;
* summary, n. సారాంశం; సంగ్రహం; క్రోడిక; సంక్షిప్తం; ఉటంకం; టూకీ; ముక్తసరు; ముక్తాయింపు;
** executive summary, ph. నిర్వహణ సంగ్రహం; నిరవాక సంగ్రహం;
* summation, n. సంకలనం; కూడిక;
* summer, n. (1) వేసంగి; వేసవి కాలం; ఎండాకాలం; యాసంగి; ఊష్మకం; (2) సంకలని; కూడేది;
** summer crop, ph. యాసంగి పంట; పునాస పంట; ఖరీఫ్; రబీ;
** summer solstice, ph. ఉత్తరాయనాంతం;
* summing, n. సమసనం; కలపడం;
* summit, n. శిఖరాగ్రం; నగాగ్రం; శృంగం;
* summon, v. t. పిలుచు; పిలిపించు; రమ్మని కబురు పెట్టు; కేకేయు; ఆకరితం;
* summons, n. పిలుపు; తాకీదు; ఫర్మానా; సమను; కోర్టులో హాజరు కమ్మని పంపిన అధికార పత్రం; ఒక వ్యక్తి కోర్టులో కేసు వేసిన తర్వాత, ఆ కేసును విచారణకు స్వీకరించి, కోర్టు అవతలి వ్యక్తికి అధికారిక ఆదేశం పంపిస్తుంది. దీనినే 'కోర్టు నోటీసూ/'సమన్స్' (Court Notice/Summons) అని అంటారు. దీనిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. కోర్టు నోటీసు వచ్చినా హాజరు కాకపోతే, కోర్టు మీపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. లేదా, మీరు లేకపోయినా కేసును ఏకపక్షంగా (Ex-parte) అవతలి వ్యక్తికి అనుకూలంగా తీర్పు ఇచ్చే ప్రమాదం ఉంది. (rel.) subpoena;
* sump, n. కూపం; గొయ్యి;
** sump pump, ph. కూప తోడిక; ఒక గోతి (కూపం) లోకి చేరుకున్న మురికి నీటిని బయటకు తోడే సాధనం;
* sun, n. (1) సూర్యుడు; పొద్దు; మిత్ర; రవి; భాను; భగ; పుష; హిరణ్యగర్భ; నరీచి; ఆదిత్య; సవిత్ర; అర్క; భాస్కర; తరణి; ఖద్యోతుడు; మార్తాండుడు; గ్రహపతి; ప్రభాకరుడు; ద్యుమణి; దినకరుడు; పగటివేల్పు (పగలు + వేల్పు = Day God); ఇరులగొంగ (ఇరులు + గొంగ = Enemy of Darkness); కాకవెలుగు (Light of Heat); మింటితెరువరి (మిన్ను + తెరువరి = Sky Traveller); (2) ఎండ;
** the sun rose, ph. పొద్దు పొడిచింది;
** the sun sank, ph. పొద్దు వాలింది; పొద్దు వాటారింది; పొద్దు గ్రుంకింది;
* sunbath, n. ఆతపస్నానము;
* sunbird, n. తేనెపిట్ట;
* Sunday, n. ఆదివారం; రవివారం; భానువారం; భట్టారక వారం; సూర్యవారం;
* sun-dried, adj. ఎండబెట్టిన; ఎండిన;
* sundry, n. అమాంబాపతులు;
* sunflower, n. సూర్యకాంతం; ప్రొద్దుతిరుగుడు పూవు;
* sunlight, n. ఎండ; సూర్యరశ్మి; రవిరశ్మి; ఆతపం;
** beam of sunlight, ph. తరణి కిరణ వారం;
* sunset, n. సూర్యాస్తమయం;
* sunshade, n. ఆతపత్రం; నీడ;
* sunshine, n. ఎండ; ఆతపము; సూర్యరశ్మి;
* mild sunshine, ph. నీరెండ;
* sunstroke, n. ఎండదెబ్బ; వడదెబ్బ; వడతాకు; వేడిదెబ్బ;
* sunstroke, n. ఎండదెబ్బ; వడదెబ్బ; వడతాకు;
* suo moto, n. [legal] తనంత తానుగా; [ety.) A Latin legal term which means “on its own motion” and implies that an action was taken by a group or person on their own;
* super, pref. గువ; పై; పెద్ద; ఉత్తమ; అతీత; ఉపరి; అత్యంత;
* superconductivity, n. అతీతవాహకత్వం;
* superconductor, n. అతీతవాహకి;
* superficial, adj. (1) బాహ్య; పైపైని; ఉపరితలానికి సంబంధించిన; (2)సారం లేని;
* superfluous, adj. అపేక్షాధిక; అవసరానికి మించిన;
* super-food, n. భృహదాహారం; భృహదాన్నం; ఎక్కువ పోషకశక్తి గల ఆహార పదార్థం;
* superhuman, adj. మానవాతీత; అతిమానుష; అతిమర్త్య;
* superimposition, n. అధ్యాసం; అధ్యారోపం;
* superintendent, n. అవేక్షకుడు;
* superior, adj. ఊర్ధ్వ; ఉన్నత; ఉత్తమ; పరమ; మిన్న;
* superiority, n. అధికత;
* superlative, adj. సర్వోత్తమ; అత్యుత్తమ;
* supernatural, adj. సహజాతీతమైన; ఆధిదైవిక;
* supernova, n. బృహన్నవ్యతార;
* supernumerary, adj. అధికమాసం; అధిక; లెక్కకు మించి; అనుకున్నదానుకంటె ఎక్కువ;
** supernumerary month, ph. అధికమాసం;
* superposition, n. అధ్యారోపితం; ఆచ్ఛాదనం; ఉపరిస్థాపకం; అధిస్థాపనం; ఒకే స్థానంలో, ఒకటి కంటె ఎక్కువ స్థితులు ఆక్రమించి ఉండడం;
** principle of superposition, ph. ఆచ్ఛాదన సూత్రం; ఉపరిస్థాపక సూత్రం; అధ్యారోపనం; అధ్యాస;
* superscript, n. శీర్షిక;
* supersonic, adj. అతిధ్వానిక;
* superstition, n. పిచ్చి నమ్మకం; మూఢ నమ్మకం; గుడ్డి గురి; అంధ విశ్వాసం;
* supervisor, n. పర్యవేక్షకుడు; ఉపద్రష్ట;
* supervision, n. పర్యవేక్షణ; అజ్మాయిషీ;
* supine, adj. వెల్లకిలా;
* supplicate, v. t. బ్రతిమాలుకొను; అర్థించు;
* supplies, n. pl. రస్తు; సంబారాలు;
* support, n. ఆదరువు; ఊత; సమర్ధన; ఆనురాట;
* support, v. t. సమర్ధించు; ఊతనిచ్చు;
* supplicate, v. i. బతిమాలుకొను;
* supplier, n. సరఫరాదారు;
* supplies, n. pl. సరుకులు; దినుసులు; సరంజామా:
* supply, n. సరఫరా; opp of demand;
** excessive supply, ph. ఉల్బణం;
** excessive supply of money, ph. ద్రవ్యోల్బణం; inflation;
** water supply, ph. నీటి సరఫరా;
* supply, v. t. సరఫరా చేయు; సమకూర్చు; అందించు; పోషించు;
** supply chain, ph. సరఫరా చయనిక;
* supply side, ph. సరఫరా వైపు;
* support, n. అండ; దన్ను; ఊత; ఊతం; ఊనిక; ఆసరా; ఆనిక; ఊనిక; ఊత; ఆకరం: ప్రాపకం; ప్రాపు; ఆధారం; ఆస్కారం; దిక్కు; ఆలంబనం; బాసట; ఉద్ధరణ; కాపు; తోడు; మద్దత్తు; జీవగర్ర;
** manual support, ph. చేఁదోడు;
** verbal support, ph. వాఁదోడు;
* supporter, n. దన్నుదారు; మద్దతుదారు;
* supporters, n. pl. బలగం; మద్దతుదార్లు;
* supposition, n. కల్పన; అంచనా; ఊహ;
* suppress, v. t. రేకుమడచు; అణగదొక్కు; అణచు;
* suppressed, adj. (1) అణగఁద్రొక్కబడిన; అణచబడిన; దళిత; వినతములైన; (2) అణగారియున్న;
* suppression, n. అణచివేత; దమనం;
* suppressor, n. దమనకారి; దమనకి;
* suppuration, n. చీము పట్టడం;
* supra, pref. అధి;
* supramental, adj. అపౌరుషేయ; మేధాతీతమైన;
* supreme, adj. ఉన్నతమైన;
** supreme knowledge, ph. బ్రహ్మవిద్య;
* surd, n. కరణి; ఒక సంఖ్య లోని వర్గ మూలాన్ని కాని, ఘన మూలాన్నికాని నిర్మూలించలేకపోతే ఆ సంఖ్యని కరణి అంటారు; (ety.) short for absurd; తెలుగులో కరణి అన్న మాట ఎలా వచ్చిందో తెలియదు; if any number can be written as a+√b, where a, b are integers then that number is called a surd;
* surety, n. జామీను;
* surf, n. ఫేనం; నురుగు;
* surface, adj. ఉపరితల; తల; భూతల;
** surface area, ph. ఉపరితల వైశాల్యం;
** surface water, ph. భూతల జలం; ఉపరితల జలం;
** surface of the Earth, ph. భూతలం; ధరాతలం;
** surface tension, ph. తలతన్యత;
* surface, n. ఉపరితలం; ఉపరిభాగం; తలం;
** curved surface, ph. వట్రుతలం;
* surfboard, n. ఫేనపు చెక్క; సముద్రపు కెరటాల మీద సవారీ చెయ్యడానికి వాడే బల్ల;
* surge, n. తరగ;
** surge tank, ph. తరగ కుండీ; జలవిద్యుత్ కేంద్రాలలో నీటిని ఉత్పాదక యంత్రాల మీదకి మళ్ళించే దారిలో ఉండే ఒక కుండీ;
* surgery, n. శచికిత్స; శల్యక్రియ; శల్యశాస్త్రం;
** surgical operation, ph. శస్త్ర క్రియ; శల్యక్రియ;
* surmount, v. t. అధిగమించు; గట్టెక్కు;
* surname, n. ఇంటిపేరు;
* surpass, v. t. తలదన్ను;
* surplus, n. మిగులు; అధికాదాయం; అతి;
* surprise, n. ఆశ్చర్యం; అచ్చెరువు; నివ్వెర; విస్మయం; అక్కజము;
* surreal, adj. అధివాస్తవిక; కాలాతీత; నమ్మశక్యం కాని; కలో నిజమో తెలియరాని;
* surrealism, n. అధివాస్తవికత; అచేతనమైన మనస్సు ఎలా పని చేస్తున్నాదో వ్యాఖ్యానించడం; కథా వస్తువుని కలలో మాదిరి అసంబద్ధ ధోరణిలో వర్ణించడం;
* surrender, adj. విడత;
* surrender value, ph. విడత కిమ్మత్తు; విడత విలువ;
* surrender, v. t. లొంగిపోవు;
* surrogate, n. ఒకరి స్థానంలో మరొకరు నిలవడం;
** surrogate mother, n. ప్రతినిధి మాత; ఒక స్త్రీ పిల్లని కనలేని పరిస్థితిలో ఆమె తరఫున ఆ బిడ్డని మోసిన కన్నతల్లి;
* surround, v. i. మూగుకొను; ముసురుకొను; ఆవరించుకొను;
* surround, v. t. (1) మూగు; ముసురు; గుమిగూడు; ఆవరించు; పరివేష్ఠించు; పరిక్షేపించు; (2) ముట్టడించు; చుట్టుముట్టు;
* surrounded, n. నివృతం; సమావృతం; పరివేష్ఠితం;
* surroundings, n. పరిసరములు;
* surveillance, n. నిఘా; కాపలా; కాపు; కావలి;
* survey, n. అవలోకన; అవలోడన; పైమాయిషీ; సర్వేక్షణం;
** land survey, ph. పైమాయిషీ; భూమికొలత;
* surveyor, n. కొలగాడు;
* survival, n. బతుకు; మనుగడ; జీవిక;
** means of survival, ph. బతుకు తెరువు;
* survive, v. i. బతికి ఉండు;
* survivors, n. pl. హతశేషులు;
* susceptibility, n. గ్రహణశీలత; మార్పుకి వీలు కల్పించడం; వివశత;
** magnetic susceptibility, ph. అయస్కాంత గ్రహణశీలత;
* suspect, v. t. శంకించు; అనుమానించు; భావించు;
* suspend, v. t. లంబించు; ప్రలంబించు; వేలాడదీయు;
* suspended, n. లంబితం; లంబించబడినది; ప్రలంబితం; వేలాడదీయబడినది; విలంబితం;
* suspense, n. ఉత్కంఠ; తహతహ; ఔత్కంఠ్యము;
* suspenseful, adj. ఉత్కంఠితమైన; ఉత్కంఠభరితమైన;
* suspension, n. ఆపుదల; నిలుపుదల; వ్యాక్షేపం;
** suspension spring, ph. కమానుకట్ట;
* suspicion, n. అనుమానం; శంక; అరగలి;
** mutual suspicion, ph. అరమరిక;
* sustain, v. i. భరించు; మోయు; ఆదుకొను;
* sustainable, adj. పాలనీయ, భరణీయ, నిర్వహణీయ, ధారణీయ, సహనీయ, రక్షణీయ;
** sustainable agriculture, ph. సహనీయ సేద్యం; నిర్వహణియ వ్యవసాయం; ధారణీయ వ్యవసాయం;
** sustainable development, ph. ధారణీయ అభివృద్ధి;
* sustenance, n. జీవనోపాధి;
* suture, n. సీమంతిక; సీవని; సంధి; కుట్టు; స్యూతము;
** continuous suture, ph. అఖండ సీవని;
** cranial suture, ph. మస్తక సీవని;
** dorsal suture, ph. పశ్చాత్ సీవని;
** the sagittal suture, ph. బ్రహ్మరంధ్రం; పసికందుల నడినెత్తిమీద ఉండే మెత్తటి ప్రదేశం;
** ventral suture, ph. పురః సీవని;
* sutures, n. స్యూతులు; కుట్లు; సీమంతికలు;
* suzerainty, n. సర్వసహాధీశత్వం; విదేశాంగ వ్యవహార్రాలలో ఒక రాజ్యం పై అదికారం;
* swaggering swordsman, ph. అడిబీరపు యోధుడు;
* swallow, n. వానకోయిల; ఒక రకం పక్షి;
* swallow, v. t. మింగు; కబళించు; గుటుక్కుమనిపించు; గుటకాయిస్వాహా చేయు;
* swamp, n. చిత్తడినేల; రొంపి;
* swamp, v. i. రొంపిలో దిగబడు; తలమునకగు; ఊపిరాడనంత పనిలో పడు;
* swan, n. హంస; మరాళం; అంచ;
* swap, v. t. మార్చు; తారుమారు చేయు; ఇచ్చిపుచ్చుకొను;
* swarm, n. దండు; మూక;
** swarm of locusts, ph. మిడతల దండు;
** swarm of monkeys, ph. కోతిమూక;
* swarthy, adj. చామనచాయ; ఎండకి నల్లబడ్డ శరీర చాయ;
** swarthy complexion, ph. చామనచాయ;
* sway, v. i. ఊగు; ఆడు; ఊగిసలాడు;
* sweat, n. చెమట; ఘర్మజలం; శ్వేదనజలం; శ్వేదం;
** sweat duct, ph. స్వేదనాళిక; స్వేదనాళం;
** sweat glands, ph. స్వేదగ్రంథులు; చెమటబొడిపెలు; చెమటకంతులు;
* sweat, v. i. చెమట పట్టు; చెమరు; చెమర్చు; చెమరించు;
* sweater, n. ఉన్నిలం; శాముల్యం;
* sweep, v. t. తుడుచు; ఊడ్చు;
* sweeper, n. m. ఊడ్పుకాడు; f. ఊడ్పుగత్తె; ఝాడమాలిని; (ety. ఝాడూ = చీపురు)
* sweeping, adj. విస్తృత; వ్యాపక;
* sweepings, n. ఊడ్చిన పెంట; చెత్త; చెదారం;
* sweet, adj. తీయనైన; తియ్యనైన; తియ్యని; మధురమైన; మధురం;
** sweet basil seeds, ph. సబ్జాగింజలు;
** sweet flag, ph. వస;
** sweet marjoram, ph. మరువం; ప్రస్థపుష్పకం;
** sweet negro coffee, ph. కమ్మకసింద;
** sweet potato, ph. తియ్యదుంప; చిలగడదుంప; గెనుసుగడ్డ; రత్నపురిగడ్డ; తన జన్మ స్థానమైన దక్షిణ అమెరికా నుండి ఇది ప్రపంచం అంతా వ్యాపించింది;[bot.] ''Ipomoea batatas;'' a sweet potato and a yam are not the same thing; Sweet potatoes are in the morning glory family, while yams belong to the lily family; In the US red sweet potato is called yam;
* sweetmeat, n. తీపితిండి; తీపి తినుబండారం; మిఠాయి;
* sweetness, n. తియ్యదనం; తీపి; మధురిమ;
* sweets, n. మిఠాయిలు; మోదకాలు; తీపి సరుకులు; బిళ్లలు;
* swell, n. పొంగు; బూరటి కెరటం; ఉల్భణం;
* swell, v. i. వాచు; పొంగు; ఉప్పొంగు; ఉబుకు; ఉబ్బు; ఉబ్బరించు; ఉబ్బరిల్లు; బూరటిల్లు;
* swelling, n. వాపు; పొంగు; కదుము; ఉబ్బకం; ఉబ్బరింత;
* swiftness, n. జోరు; వడితనం; ఉరవడి;
* swig, n. గుక్కెడు;
* swim, v. i. ఈదు; ఈఁతకొట్టు;
* swimming pool, n. ఈఁతకొలను; కేళాకూళి;
* swindler, n. మోసగాఁడు; వంచకుఁడు;
* swine, n. పంది;
** swine flu, ph. ఒక రకం ఇన్‍ప్లుయెంజా పేరు; ఇది H1N1/09 అనే పేరుగల విషాణువు వల్ల వచ్చే జబ్బు; ఇది 2009 లో మొదటిసారి ప్రజలలో కనిపించింది;
* swing, n. ఊయల; జోల; ఉయ్యాల; తూగుటుయ్యాల;
* swing, v. i. ఊగు; తూగు;
* swing, v. t. ఊపు;
* switch, n. మీట; లాతం; పరీరంభకం;
** electrical switch, ph. విద్యుత్ మీట; విద్యుత్ పరీరంభకం;
* switch, v. t. మార్చు; మారుగుళ్లు చేయు; తారుమారు చేయు; v. i. మారు;
* switches, n. మీఁటలు;
** bank of switches, ph. మీఁటలమాల; see also keyboard
** switching yard, n. మారుగుళ్ల దొడ్డి; రైలు బండిలో పెట్టెల స్థానాలని మారుగుళ్లు చేసే స్థలం;
* swoon, n. మూర్చ;
* swoon, v. i. మూర్చిల్లు; సొమ్మసిల్లు;
* sword, n. కత్తి; ఖడ్గము; బాకు; అడిదం;
** long sword, ph. అఘాయువు; అసితాంగము; అసిధేనుక; అసిపుత్రి; కఠారము;
** medium sword, ph. కరవాలము; కర్కశము;
* sycophant, n. (సైకఫేంట్) భట్రాజు; భజనదాసు; చెంచారాయుడు; ముఖస్తుతిచేసి లాభం పొందేవాడు;
* syllable, n. శబ్దగణం; మాత్ర; మాత్రకం; కారం; అక్షరం;
** accented syllable, ph. ఉదాత్త మాత్రకం; ఉదాత్త అక్షరం;
** Aum syllable, ph. ఓం కారం;
** long syllable, ph. గురువు;
** short syllable, ph. లఘువు;
* syllabus, n. ప్రణాళిక; పాఠ్య ప్రణాళిక; సంగ్రహం; సంక్షేపం;
* syllogism, n. త్రియాంశతర్కం; పంచావయవం; ఉదా. మానవులకి మృతి ఉంది. భారతీయులు మానవులు. కనుక భారతోయులకి మృతి ఉంది, అని తర్కించడం.
* sylvan. adj. మొక్కలతో నిండిన; వన సంబంధమైన;
* symbiont, n. సహజీవి;
* symbiosis, n. సహజీవనం; పరస్పరసేవ; అంధపంగున్యాయం;
* symbol, n. గుర్తు; ప్రతీక; చిహ్నం; సంకేతం;
** graphic symbol, ph. రేఖాత్మక చిహ్నం; రేఖాత్మక సంకేతం; రేఖాత్మక ప్రతీక;
* symbolic, adj. సాంకేతిక; లాక్షణిక; ప్రతీక; ప్రతీకాత్మక;
** symbolic logic, ph. లాక్షణిక తర్కం; ప్రతీక తర్కం; ప్రతీకాత్మక తర్కం; Symbolic logic is the study of symbolic abstractions that capture the formal features of logical inference, often divided into two main branches: propositional logic and predicate logic. Example: A = all mammals feed their babies milk from the mother. B = all cats feed their baby's mother's milk. C = All cats are mammals(C). Then A and B imply C, or in symbols, A ^ B ==> C.
* symbolical, n. సాంకేతికం; ప్రతీకాత్మకం;
* symbolism, n. ప్రతీకాత్మకత; ప్రతీకాత్మకం; ప్రతీక వాదం; భావ ప్రకటన గాక భావ సూచనేు ప్రధానమైన పద్ధతి;
* symmetric, adj. అనురూప; సౌష్ఠవ;
* symmetrical, adj. అనురూప;
* symmetry, n. సౌష్ఠత; సౌష్ఠవం; సొంపు;
** axial symmetry, ph. అక్ష సౌష్ఠత; అక్ష సౌష్ఠవము;
** cyclic symmetry, ph. చక్రీయ సౌష్ఠత; చక్రీయ సౌష్ఠవము;
** lateral symmetry, ph. పార్శ్వ సౌష్ఠత; పార్శ్వ సౌష్ఠవము;
**. mirror symmetry, ph. దర్పణ సౌష్ఠవము;
**. rotation symmetry, ph. భ్రమణ సౌష్ఠవము;
**. translational symmetry, ph. స్థా�నాంతర సౌష్ఠవము;
* sympathetic, adj. సహవేదన; సహానుభూత;
** sympathetic nerves, ph. సహవేదన నాడులు;
** sympathetic nervous system, ph. సహవేదన నాడీ మండలం;(
** sympathetic vibrations, ph. సహవేదన ప్రకంపనలు;
** parasympathetic, ph. పార్స్వసహవేదన; పార్స్వసహానుభూత;
* sympathy, n. సానుభూతి; అనుతాపం; పరితాపం; కనికరం; దయ;
* symphony, n. స్వరసమ్మేళనం;
* symptom, n. లక్షణం; సూచకం; గురుతు; గుర్తు;
* symptom of a disease, ph. రోగ లక్షణం;
* synandry, n. సంయుక్త కేసరావళి;
* synchronization, n. సమకాలీకరణం;
* synchronous, adj. ఏకకాలిక; సమకాలిక; ఒకే సమయంలో జరిగే;
** synchronous motion, ph. ఏకకాలిక చలనం; సమకాలిక చలనం;
* syncope, n. స్పృహ పోవుట; శోషిల్లుట; సొమ్మసిల్లుట; కండరములలో శక్తి పోవడం వల్ల స్పృహ పోవుట;
** heat syncope, వడ సొమ్ము;
* syndrome, n. లక్షణగుచ్ఛం; కొన్ని రోగ లక్షణాల సముదాయం;
* synecdoche, n. అజగర్లక్షణం వంటి అలంకారం; అంతా చెప్పడానికి బదులు కొంచెమే చెప్పడం కాని, కొంచెం చెప్పడానికి బదులు అంతా చెప్పడం కాని ఈ అలంకారం లక్షణం; ఉ. నలుగురితోటీ చెప్పి చూడు అన్నప్పుడు, నలుగురు మనుష్యులతోటే చెప్పమని కాదు, పలువురితో సంప్రదించమని. ఇది అజహర్లలక్షణం. ఉ. రంజి ట్రోఫీ ఆంధ్రా గెలిచిందంటే, ఆంధ్రులంతా అని కాదు, ఆంధ్రా జట్టు అని మాత్రమే అర్థం; ఈ రెండింటినీ ఇంగ్లీషులో సినక్‌డకీ అనే అంటారు. తెలుగులో మాత్రం మొదటిదానినే అజహర్లక్షణం అంటారు;
* synonym, n. పర్యాయపదం; సమానార్థకం; ప్రతిపదం; రూపాంతరం;
* synopsis, n. సారసంగ్రహం;
* syntactic, adj. క్రమబద్ధ; వాక్యనిర్మాణ; భాషానిర్మాణ;
** syntactic analysis, ph. క్రమబద్ధ విశ్లేషణ; వాక్య విశ్లేషణ;
* syntax, n. వాక్యనిర్మాణం; భాషానిర్మాణ సిద్ధాంతం;
* synthesis, n. సంధానం; సంశ్లేషణ; సంయోగం; సమన్వయం; (ant.)విశ్లేషణ;
* synthesizer, n. యోక్త; సంయోక్త;
** music synthesizer, ph. సంగీత సంయోక్త;
* synthetic, adj. పౌరుష; సంధాన; సంశ్లేష; సంయోజిత;
** synthetic chemistry, ph. పౌరుష రసాయనం; సంధాన రసాయనం; సంశ్లేష రసాయనం;
** synthetic drug, ph. సంయోజిత ఔషధం;
** synthetic fibers, ph. పౌరుష తంతులు; సంధాన తంతులు; సంశ్లేష తంతులు;
* synonym, n. పర్యాయపదం; ప్రతిపదం; నానాఅర్థం;
* synonymous, adj. సమానార్థక;
* syphilis, n. కొరుకు సవాయి; ఉపదంశ రోగం; ఫిరంగి రోగం; సవాయి;
* syphilitic ulcers, n. సవాయి పుండ్లు; ఉపదంశం;
* syringe, n. పిచికారి; వస్తి;
* syrup, n. షర్బత్;
* system, n. వ్యవస్థ; పద్ధతి; క్రమం; విధం; సరణి; తంత్రం; మండలం; శరీరం;
** nervous system, ph. నాడీ వ్యవస్థ; నాడీ మండలం;
** planetary system, ph. గ్రహ మండలం;
** political system, ph. రాజకీయ వ్యవస్థ;
** social system, ph. సాంఘిక వ్యవస్థ;
** societal system, ph. సామాజిక వ్యవస్థ;
* systematically, adv. లాంఛనంగా; క్రమపద్ధతిలో; పద్దతి ప్రకారం;
* systematized, n. వ్యవస్థితం;
* systemic, adj. దైహిక; దేహం అంతటికి సంబంధించిన;
* systole, n. ముకుళింత; హృత్సంకోచం; గుండె ముకుళించుకోవడం;
* systolic, adj. ముకుళిత; స్పందన;
* syzygy, n. (సిజిజీ) పర్వస్థానం; సూర్యచంద్రులు ఎదురెదురుగా కాని, ఒకే వైపు కాని ఉన్నప్పటి స్థానాలు;
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలాలు==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
30tlc66uvwosgf8kyhe3x290fyefrtm
వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/బ-భ-మ
0
3021
39209
39165
2026-06-01T21:44:17Z
Vemurione
1689
/* Part 2: బ - ba */
39209
wikitext
text/x-wiki
* This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
* American spelling is used throughout.
* There is no clearly established, standardized alphabetical order in Telugu. The justification for the scheme used here would be too long for discussion here.
16 March 2016.
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
==Part 1: బం - baM==
<poem>
బంక, baMka
-n.
--glue; goo; gum; slime;
బంకనక్కెర, baMkanakkera
-n.
--glue berry; Indian cherry; a tree whose berry-like fruits are sticky; [bot.] ''Cordia dichotoma; Cordia Mixa; Cordia latifolia;''
-- లసోడా పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్దకం తగ్గేలా చేస్తుంది.
-- చల్లచెట్టు; లసోరా; లసోడా;
బంకబడ్డు, baMkabaDDu
-n.
--[bot.] ''Vitis linnaei;'' % ??
బంకమన్ను, baMkamannu
-n.
--clay; (lit.) gooey soil; (rel.) నల్లరేగడి మన్ను;
బంకనెవలి, baMkanevali
-n.
-- [bot.] ''Adiantum bunulantum''; % ??
బంకు, baMku
-n.
--shop; small specialty shop; roadside stall; roadside gas station; పెట్రోలు బంకు;
బంకోలా, bankOlaa
- n.
-- lighthouse;
బంగనబయలు, baMganabayalu
-n.
--open plain;
బంగారు, baMgAraM
-n.
--gold;
---నీ ఇల్లు బంగారంగానూ = [idiom] bless your innocent self!
బంగారు వక్క తాడి, baMgAru vakka tADi
- n.
-- Areca palm; Golden cane palm; Yellow palm; Butterfly palm; [bot.] ''Dypsis lutescens'' of the Arecaceae family; ''Chrysalidocarpus lutescens'';
--ఈ వృక్షం గాలిలోని జైలీన్ (Xylene), టాల్యూన్ (Toluene) వంటి ప్రమాదకర ఆవిరులను సమర్థవంతంగా శుద్ధిచేస్తుందని నిరూపించారు. జైలీన్ ఆవిరిని పీల్చడం కారణంగా కేంద్ర నాడీ వ్యవస్థ (Central Nervous System) పై దుష్ప్రభావం పడి, తలనొప్పి, కళ్ళు తిరగడం, వాంతులు, చిరాకు, బలహీనత, అలసట, నిద్రలేమి, మానసిక ఒత్తిడి, ఆందోళన, చేతులు వణకడం వంటివి వస్తాయి. టాలీన్ పీల్చడం కారణంగా కూడా దాదాపు ఇవే దుష్ఫలితాలు; ప్రాణవాయువును ఎక్కువగా వెలువరించే ఈ జాతి మొక్క ఇంటిలోపల కుండీలలో పెంచుకోదగిందనడంలో ఎలాంటి సందేహం లేదు;
బంగారుతీగ, baMgArutIga,
- n.
-- Chinese dodder; [bot.] ''Cuscuta Chinensis'' of Convolvulaceae family;
---a weedy creeper that grows wildly that seems to have some aphrodisiac properties; This is a pesky weed that the government is trying to eradicate; Spanish moss, found on trees in the Americas, is similar to this;
బంగారు పిచ్చుక, baMgAru piccuka,
- n.
-- baya weaver bird; [bio.] ''Ploceus philippinus'';
బంగారుపూలు, baMgArupUlu,
- n.
-- Canadian Goldenrod; [bot.] ''Solidago canadensis'' of Asteraceae family
-- దీని తొట్టతొలి జన్మస్థలం ఉత్తర అమెరికా ఖండం. అయినా ఇది ప్రస్తుతం ఐరోపా, ఆసియా ఖండాలలోని పలు దేశాలకు విస్తరించింది. ఆ యా దేశాలలో ఇది మొండి బెడద మొక్క (Invasive Plant) గా పేరొందింది. దీని విస్తరణకు తట్టుకోలేక చైనాలోని షాంఘైలో 30 కి పైగా స్థానిక మొక్కల జాతులు నశించిపోయాయంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. అటవీ ప్రాంతంలో ఈ మొక్కల్ని లేళ్ళు, దుప్పులు వంటివి ఇష్టంగా తింటాయి. పాడి పశువులు, గుర్రాలకు ఈ మొక్కలు మేతగా వేస్తారు. ఈ పూలలో తేనె ఎక్కువగా ఉంటుంది. ఈ తేనెకోసం తేనెటీగలు (Honey Bees), తుమ్మెదలు (Bumble Bees) వంటివి ఈ మొక్క పూల చుట్టూ మూగుతాయి;
బంగళా, baMgaLA
-n.
--bungalow;
బంగాళా బంతి, baMgALA baMti
-n.
--Common Zinnia; Elegant Zinnia; [bot.] ''Zinnia elegans'' of the Asteraceae family;
బంగాళా దుంప, baMgALA duMpa
-n.
--potato; [bot.] ''Solanum tuberosum'' of the Solanaceae family;
--This has been in use in India well before CE 1615; Immature tubers and germinating tubers are not fit for eating because they contain "solanaine" a poisonous substance;
--ఆలుగడ్డ; ఉర్లగడ్డ;
బంగీ, baMgI
-n.
--parcel;
బంజరు, baMjaru
-adj.
--waste; dry; non-cultivable;
---బంజరు భూములు = wastelands; heath.
--- see also బాడవ; ఈడవ;
బంటి, baMTi
-suff.
--a comparative measure to indicate the depth of water;
---కుత్తుకబంటి = neck-deep.
---పుక్కిటిబంటి = mouthful.
---మొలబంటి = waist-deep.
---మోకాలిబంటి = knee-deep.
బంటు, baMTu
-n.
--(1) servant; attendant; foot soldier;
--(2) [chess] pawn;
బంట్రోత్తు, baMTrOttu
-n.
--peon; servant; a peon reporting to a government officer;
-- బంటు+రౌతు = బంట్రౌతు > బంట్రోత్తు
బండ, baMDA
-n.
--boulder; big stone; slab; pestle;
బండారం, baMDAraM
-n.
--hidden wealth; treasure trove;
బండి, baMDi
-n.
--(1) vehicle; carriage; cart; wagon;
--(2) bobbin; reel;
---ఎడ్లబండి = ox cart; bullock cart.
---రైలుబండి = railway train. (lit.) a vehicle on rails.
బండిసున్న, baMDisunna
-n.
--[coll.] a big cipher; a big fat zero, nothing at all;
బంగారు పిచ్చుక, baMgAru piccuka
-n.
--baya weaver bird; [biol.] ''Ploceus philippinus'';
బంగినపల్లి, baMginapa-
-n.
--a popular variety of low-fiber, flavorful mango fruits;
బండెడు, baMDeDu
-adj.
--cartload of;
బండారం, baMDAraM
- n.
--secret; true nature;
-- లోగుట్టు;
బండిగురివెంద, baMDiguriveMda
-n.
--Acacia Coral; Coral Wood; [bot.] ''Adenanthera pavonina;''
బంతి, baMti
-n.
--(1) marigold; [bot.] ''Calendula officinalis; Tagetes patula; Tagetes erecta;'' a native of Mexico, the seeds eventually came to India via Spanish and Portuguese traders in the 16th century; the plants adapted quickly and abundantly, eventually usurping the calendula;
--(2) ball; (rel.) ఉండ;
---(3) row;
---దారపు బంతి = ball of string.
---పట్టుదారపు ఉండ = skein of silk string.
---బంతిలో బలపక్షం చెయ్యకూడదు = one should not show partiality toward people in a queue.
బంతిగిన్నె కీలు, baMtiginne kIlu
-n.
--ball and socket joint; such as the one found in the knee;
బంతులబీడు, baMtulabIDu
-n.
--playground; ballpark;
బందరు, baMdaru
-n.
--(1) seaport;
--(2) commonly used name for the city of Machilipatnam;
బదలాయించు, badalAyiMcu
-v. t.
--transfer;
బందారు, baMdAru
-n.
--the Karum timber tree; [bot.] ''Hymenodictyon excelsum; Adina cordifolia'';
బందిపోటు దొంగ, baMdipOTu doMga
-n.
--robber; bandit; dacoit;
బదిలీ చేయు, badilI cEyu
-v. t.
-transfer;
బందీ, baMdI
-n.
--prisoner; inmate;
బందీలదొడ్డి, baMDIladoDDi
-n.
--prison yard;
బందు, baMdu
-n.
--(1) strap; band;
--(2) strike; lock-out; work stoppage;
బందెలదొడ్డి, baMdeladoDDi
-n.
--cattle pound; a place where stray cattle are kept until the owner can claim them;
బందోబస్తు, baMdObastu
-n.
--discipline; security arrangement; (lit.) tying and binding;
బంధం, baMdhaM
-n.
--bond;
---ఉదజని బంధం = Hydrogen bond.
---రుణానుబంధం = a familial bond created due to a debt, as Hindus believe, from a previous incarnation.
---జంట బంధం = double bond.
---త్రిపుట బంధం = triple bond.
---ద్విగంధక బంధం = disulfide bond.
బంధుపక్షపాతం, baMdhupakshapAtaM
-n.
--nepotism;
బంధుప్రీతి, baMdhuprIti
-n.
--fondness of one's relatives;
బంధువు, baMdhuvu
-n.
--relative; relation;
బంధుక, baMdhUka
-n.
--[bot.] ''Calosanthes indica''; ''Oroxylum indicum''; %??
</poem>
==Part 2: బ - ba==
<poem>
బకం, bakaM
-n.
--heron;
బకపుష్పం, bakapushpaM
-n.
--vegetable hummingbird; [bot.] ''Agati grandiflora;'' ''Sesbania grandiflora;''
-- అవిసె;
బక్కపలచని, bakkapalacani
-adj.
--ectomorphic; a slender body structure with long limbs, narrow feet, narrow hands, narrow chest, and narrow shoulders;
బకాయ, bakAya
-n.
--arrears; old debt;
బక్షకుడు, bakshakuDu
-n. m.
--eater;
---నరమాంస బక్షకుడు = cannibal.
బక్షించు, bakshiMcu
-v. t.
--devour; eat; ingest;
బక్షీస్, bakshIs
-v. t.
--tip; gratuity; a fee paid to appreciate good service;
బగ్గీ, baggI
-n.
--horse-drawn carriage;
-- జటకా; జెట్కా; టాంగా; గుర్రబ్బండి;
బగ్గుండీ, bagguMDI
-n.
--aromatic, colorful powder thrown at each other at festive times like the Holi or weddings;
బచ్చలి, baccali
-n.
--Indian spinach; Malabar spinach; [bot.] ''Basella alba'' of the Basellaceae family;
---తీగ బచ్చలి = creeping purslane; [bot.] ''Basella indica;''
---ఎర్ర అల్లుబచ్చలి = [bot.] ''Basella rubra'' (Watts);
---సిలోన్ బచ్చలి = Surinam Purslane; Water Leaf; Ceylon Spinach; Potherb Fame Flower; [bot.] ''Talinum fruticosum'' of the Talinaceae family;
బచ్చలిమంద, baccalimaMDa
-n.
--[bot.] ''Ceropegia tuberosa''; ''Ceropegia candelabrum'';
-- The tuberous roots are edible and are eaten especially by the poorest raw or cooked. The plant is also used for various medicinal purposes, so for hemorrhoids, indigestion, headaches and against bites of poisonous animals;
--Ceropegia candelabrum is now in the original area has become quite rare. There are already projects for artificial propagation;
బచ్చు, baccu
-n.
-a person of the Vaisya caste;
---బచ్చుపేట = sector of a town where the Vaisya community lives.
బచ్చెన, baccena
-adj.
--painted;
---బచ్చెన పెట్టె = painted box.
బజంత్రీలు, bajaMtrIlu
-n. pl.
--musical instruments played at wedding functions;
బజారు, bajAru
-n.
--bazaar; marketplace; a permanent market or street of shops; see also సంత;
--market street;
---బజారు మనిషి = a street person; a prostitute;
బజ్జీ, bajjI
-n.
--(1) a baked vegetable chutney;
--(2) a savory snack made by deep frying sliced vegetables after dipping them in batter;
బట్ట, baTTa
-adj.
--bald;
-n.
--cloth;
బట్టతల, baTTatala
-n.
--bald head; [anat.] alopecia;
బట్టమేక పిట్ట, baTTamEka piTTa
- n.
-- The great Indian bustard; [bio.] ''Ardetois nigriceps;'' A large bird of the bustard family (Otididae), one of the heaviest flying birds in the world. The great Indian bustard inhabits dry grasslands and scrublands on the Indian subcontinent; its largest population is found in the Indian state of Rajasthan.
-- పేరుకు పిట్టేకానీ మగపక్షి నాలుగడుగులు, ఆడుపక్షి మూడున్నర అడుగుల పొడవు, 15-20 కిలోల బరువు ఉంటుంది. దీని ఆకారం వల్ల వేటగాళ్ళు మాంసంకోసం సులభంగా వేటాడి నిర్మూలించారు. బట్టమేకపిట్ట పూర్వం గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ మొదలయిన 12 రాష్ట్రాల్లో కనబడేదని తెలిసింది. ఈ పక్షిజాతి విస్తృతమైనది. ఎటువంటి ఆటంకాలు, ఇది మనుషుల పొలుపులేని ఏకాంత వ్యవసాయయోగ్యమైన పొలాల్లో, బీళ్ళల్లో నివాసం ఉంటుంది. దీని జీవితకాలం షుమారు 12 సంవత్సరాలు. గూడు కట్టకుండా మట్టిలో ఒకేగుడ్డు పెట్టి, 27 రోజులపాటు పొందుతుంది. మగపక్షి కూడా గుడ్డును సంరక్షించడం లో సహకరిస్తుంది .కుక్కలు వీటి శత్రువులు, ఇప్పడు కొత్తగా ఏర్పాటయిన గాలిమరలు, గాలి విద్యుత్ కేంద్రాలు, హై టెన్ షన్ తీగలు పక్షులు సంచరించే దారుల్లో అడ్డదిడ్డంగా వేయడంతో చాలా పక్షులు చనిపోయాయి. చాలా రాష్ట్రాలలో అంతరించిపోయాయి. దాదా సలీం అలీ ప్రమేయంతో కర్నూల్ జిల్లా రోళ్ళపాడు గ్రామం వద్ద బట్టమేక పక్షి సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇవి రయితు నేస్తాలు, పంటలను పాడుచేసే క్రిమి కీటకాలను భక్షించి రైతుకు సాయపడతాయి.
బటానీ, baTAnI
-n.
--pea; [bot.] ''Pisum sativum'' of Leguminosae (pea) family; sativum అంటే సాగు చెయ్యబడేది
--పొలం బటానీ = field peas; arvensis అంటే పొలాల్లో పెరిగేది;
--తోట బటానీ = garden peas; [bot.] ''Pisum sativum;'' hardensis అంటే తోటలలో పెరిగేది;
--[Sans.] కళాయః; వర్తులః
బటానీతీగ, baTAnItIga
-n.
--Mexican Creeper; Coral vine; Bee bush; [bot.] ''Antigonon leptopus'' of Polygonaceae family;
--మనం తినే బటానీలకూ, ఈ పూలతీగకూ ఎలాంటి సంబంధమూ లేదు; దీని పూలు చూసేందుకు ఆకర్షణీయంగా ఉన్నా ఇది త్వరత్వరగా వ్యాపించి ఖాళీ స్థలాలను, ఇతర మొక్కలను ఆక్రమించివేస్తుంది కనుక దీనినొక బెడద మొక్క (Invasive Plant) గా భావిస్తారు;
బట్వాడా, baTvADA
-n.
--distribution;
బట్టీ, baTTI
-n.
--retort; kiln;
బట్టీపట్టు, baTTIpaTTu
-v. t.
--(1) to distill;
--(2) getting something by heart; to memorize;
బటువు, baTuvu
-adj.
--(1) round; circular; spherical (2) firm; stiff;
బడబ, baDaba
-n.
--mare; female horse;
బడాయి, baDAyi
-n.
--(1) ego; vanity;
--(2) boasting; bragging; ostentation;
బడి, baDi
-n.
--(1) school;
--(2) case as in upper case and lower case in English alphabet;
బడితె, baDite
-n.
--a long smooth stick; perhaps a stick derived from బాడితచెట్టు;
బడుద్ధాయి, baDuddhAyi
-n.
--fat and lazy person; idler; vagabond;
బడ్డు, baDDu
-adj.
--fat;
-n.
--(1) fatso;
--(2) the male genital organ;
బడేమియా, baDEmiyA
-adj.
--ill-fitting; hand-me-down; (ety.) బడా + మియా;
---బడేమియా బట్టలు = ill-fitting clothes; hand-me-down clothes.
బణుభారం, baNubhAraM
-n.
--molecular weight;
బణువు, baNuvu
-n.
--molecule;
-- (rel.) అణువు; పరమాణువు; పరమాణు రేణువు;
బణుసంధానం, baNusaMdhAnaM
-n.
--condensation of (two) molecules; attaching together of molecules;
బత్తా, battA
-n.
--daily allowance;
బత్తాయి, battAyi
-n.
--Batavia; Batavian orange; [bot.] ''Limonia trifoliata;''
-- a type of sweet orange with a thin skin; (ety.) this fruit tree was imported into India from Batavia by the Dutch East India Company; this English translation is extant only in India;
బతిమాలు, batimAlu
-v. t.
--plead; implore; beg;
బతుకు, batuku
-n.
--(1) life;
--(2) livelihood; survival; also బ్రతుకు;
---బతుకు తెరువు = a means of survival.
---బతుకు బాణీ = life style.
బదరి, badari
-n.
--the jujube tree; [bot.] ''Zizyphus jujuba; Zizyphus mauritiana'' Lamk.;
-- రేగు; గంగరేగు;
బద్ద, badda
-n.
--(1) strip; slat; narrow wooden strip;
--(2) broken half of a seed as in కంది బద్ద;
---అడుగు బద్ద = foot ruler; a foot-long strip with inches or centimeters marked.
బద్ధ, baddha
-adj.
--(1) tied; bound;
--(2) intense;
---బద్ధ వైరం = intense enmity.
బద్ధకం, baddhakaM
-n.
--laziness;
బద్ధకిష్టి, baddhakishti
-n.
--lazy fellow;
బద్మాష్, badmaash
- n.
-- కుటిలమైన బ్రతుకు బతికే వాడు; కుటిలుడు;
-- బద్ అంటే పర్షియన్ భాషలో చెడ్డ ,కుటిల అన్న అర్థం; మాష్ అంటే అరబిక్ లో జీవితం, బతుకు అని అర్థం.
బదిలీ, badilI
-n.
--transfer;
బద్దింపు, baddiMpu
-n.
--the arithmetic process of repetitive calculation to estimate a value;
బదులు, badulu
-adv.
--instead; in place of;
-n.
--(1) exchange; substitution;
--(2) loan; small loan;
బద్దెపురుగు, baddepurugu
-n.
--tapeworm; a parasite that grows in the human intestines; an invertebrate of the Platihelmonth family;
బనాయించు, banAyiMcu
-v. t.
--(1) attach; add;
--(2) fabricate; make;
బబ్బస, babbasa
-n.
--marsh pennywort; [bot.] ''Hydrocotyle rotundifolia''; ''Hydrocotyle sibthorpioides;''
-- It can grow in a wide variety of habitats and is considered a weed; This plant has been used for medicinal purposes in Asia;
బబ్రు, babru
-adj.
--brown;
బయట, bayaTa
-adj.
--outside;
బయలుదేరు, bayaludEru
-v. i.
--start on a journey; set out;
బయానా, bayAnA
-n.
--advance payment; earnest money;
బరగడం, baragaDaM
-n.
--Asian indigo, three-leaved indigo; [bot.] ''Indigofera glandulosa'';
-- The plant is grown as green manure; the seeds are edible and can be eaten in times of food scarcity;
-- గోరంటి నీలి;
బరక, baraka
-adj.
--rough; coarse; % to e2t
బరణిక, baraNika
-n.
--[bot.] ''Trophis aspera'' of the Moraceae family;
బరబర, barabara
-adj.
--onomatopoeia for the act of dragging;
బరమ, barama
-n.
--drill; a tool to make a hole; gimlet; a hand-held, manually operated drill;
బరమబావి, baramabAvi
-n.
--drilled well;
బరవానా, baravAnA
-n.
--output; (ety.) short for బయటకి రవానా;
బరాతం, barAtaM
-n.
--written order; bank check; bank draft;
బర్తరఫ్, bartharaph
- n.
-- పదవిలోనుండి/ ఉద్యోగములోనుండి వెడలఁగొట్టుట (dismissal);
-- 'బర్తరఫ్' అనునది ఫార్శీభాష నుండి ఉత్పన్నమైన ఉర్దూ మాట. ఇది 'బర్' అను ఉపసర్గ (prefix) తో కూర్చిన 'తరఫ్' అను నామవాచకము (noun). దీనికి గల నిౙమైన అర్థము - వేఱు చేయుట/ ప్రక్కకు తీసిపెట్టుట.
-- దీనికి తెలుఁగులో మన పత్రికలవారు 'ఉద్వాసన' అను ఆధ్యాత్మిక శబ్దమును వాడుచున్నారు. ఉద్వాసన అనఁగా ఉద్యాపన. పండుగ నాడు ప్రతిష్ఠించిన దేవుని/ దేవిని పునఃపూజ చేసి, నైవేద్యము పెట్టి, హారతి పాడి, "పునరాగమనాయ చ" (మరల రండి) అని చెప్పి కదిలించుట. అనఁగా సాఁగనంపుట. ఇది 'ఆవాహన’ కు విపర్యయమన్నమాట;
బరాబరు, barAbaru
-n.
--O.K.; proper; equal;
--- బరాబరు చేయు = equate
--- వందిమాగదులు బరాబరులు పలికేరు = so and so spoke words of praise; used to praise kings by saying that they are equal to Gods;
బరివెంక, bariveMka
- n.
-- Siamese rough bush; khoi; toothbrush tree; [bot.] ''Streblus asper'';
-- దీని ఆకులు బాగా గరుకుగా ఉండి బొమ్మలను నున్నగా పాలిష్ చేసేందుకు పనికివస్తాయనీ, అందుకని ఆ ఆకుల్ని Sandpaper Leaves అంటారు; ఏటికొప్పాక లో ఆ వృక్షాలను పెంచుకుంటే బాగుంటుంది;
-- Various parts of this plant are used in Ayurveda and other folk medicines for the treatment of different ailments such as filariasis, leprosy, toothache, diarrhea, dysentery and cancer;
బరితెగించు, baritegiMcu
-v. t.
--behave without decorum; to go beyond one’s limits of decency;
బరిషింత, bariShiMta
- n.
-- Lilac Bauhinia; Malabar Bauhinia; [bot.] ''Bauhinia malabarica'' Roxb. of the Fabaceae family;
బరుకు, baruku
-v. t.
--(1) scratch;
--(2) tear; lacerate;
బరువు, baruvu
-n.
--(1) weight; the force acting on a mass in a gravitational field. Two bodies with identical masses but in different gravitational fields will register different weights;
--(2) load;
--(3) tare;
బలం, balaM
-n.
--force;
--- gravitational force = [[గురుత్వాకర్షక బలం]].
--- electromagnetic force = [[విద్యుదయస్కాంత బలం]].
--- weak force = త్రాణిక బలం.
--- strong force = నిస్త్రాణిక బలం.
బలగం, balagaM
-n. pl.
--retinue; supporters;
బలపం, balapaM
-n.
--slate pencil;
బలపక్షం, balapakshaM
-n.
--partiality;partiality toward the stronger;
బలవంతం, balavaMtaM
-adj.
--forceful; insisting; compelling;
-n.
--(1) compulsion;
--(2) rape;
బలవర్ధకం, balavardhakaM
-adj.
--nutritious; strength giving;
బలసిన, balasina
-adj.
--fat; fatty;
బలహీన, balahIna
-adj.
--(1) weak;
--(2) backward; disadvantaged;
---బలహీన వర్గాలు = backward classes; disadvantaged communities.
బల్ల, balla
-n.
--(1) table;
--(2) bench;
--(3) plank;
--(4) enlarged spleen;
బల్లపరుపు, ballaparupu
-n.
--flat; flat as a table; two-dimensional;
బలి, bali
-n.
-- (1) a religious offering - typically in the form of food - made to gods; (lit.) బలి అంటే బలకరమైన ఆహారం. ఆలయాలలో రోజూ బలిపీఠాల దగ్గర బలి అన్నం సమర్పిస్తారు. ఆలయాలలో అన్ని దిక్కు లలోనూ బలిపీఠాలుంటాయి; బలి అనగానే జంతు బలి— అని పొరపాటు పడుతూ ఉంటాము; (2) a tribute paid to a king;
-- [Sans.] 'బల్యతే దీయతే దేవతాదిభ్యః' = దేవతలకు ఇచ్చునది. 'బల్యతే దీయతే రాజ్యే రాజగ్రాహ్యా భాగః' రాజ్యమునందు ఇవ్వబడునది. రాజు తీసుకొను పన్ను.
-- see also భూతబలి;
బలిష్టం, balishTaM
- adj.
--strong;
బలిష్టత, balishTata
- n.
--strength;
బల్లి, balli
-n.
--gecko; wall lizard;
బలీయం, balIyaM
-n.
--powerful; strong;
బలీయత, balIyata
-n.
--power; strength;
బలురక్కెస, balurakkesa
-n.
-- (1) [bot.] ''Arum macrorhizon'' (Reeve)
-- గజకర్ణము, గణహాసకము, బ్రహ్మరాకాసిచెట్టు, బృహచ్ఛదము.
-- (2) American aloe; [bot.] ''Fourcroya cantala'';
బలుసు, balusu
-n.
-- The thorny Caray; [bot.] ''Canthium parviflorum;'' ''Plectronia parviflora;''
-- నల్లబలుసు = the black species, [bot.] ''Canthium umbellatum;''
-- బంజరునేలల్లో పొదగా పెరిగే ముళ్ళకంచె మొక్క; పసుప్పచ్చటి పూలు పూస్తుంది; దీని పళ్ళు తింటారు; ఆకును కూరగా వండుకొంటారు; కరువుకాలాల్లో బీదలు ఈ ఆకును తింటారు;
-- "బ్రతికుంటే బలుసాకు తినవచ్చు" అనేది సామెత;
-- [Sans.] బారదాజి; బలాక;
బస, basa
-n.
--lodging; a place of stay during a travel;
బస్తం, bastaM
-n.
--calomel; mercurous chloride; Hg<sub>2</sub>Cl<sub>2</sub>;
బస్తా, bastA
-n.
--(1) bale; sack; bundle;
--(2) a specific volumetric measure used for grains whether or not they come in bales or in boxes;
బసివి, basivi
-n.
--temple girl; a female child in a family dedicated in infancy for life-long service at a Shiva temple; as temple endowments dwindled, in these days these woman usually end up as prostitutes;
బస్కీలు, baskIlu
-n.
--pull-ups;
బస్తీ, bastI
-n.
--city;
బహిరంగం, bahiraMgaM
-n.
--public; open;
బహిరంగ సభ, bahiraMga sabha
-n.
--public meeting; open meeting;
బహిర్గత జన్యువు bahirgata janyuvu
-n.
--dominant gene; (ant.) అంతర్గత జన్యువు = recessive gene.
బహిర్గత జీను, bahirgata jInu
-n.
--dominant gene; bright gene; (ant.) అంతర్గత జీను;
బహిర్హితం, aMtbahirhitaM %e2t
-n.
--output;
బహిష్టు, bahishTu
-n.
--menses; monthly period in fertile women;
బహు, bahu
-adj. pref.
--poly-; multi-; many;
బహుఅసంతృప్త, bahuasaMtRpta
-adj.
--[chem] polyunsaturated;
బహువృత్తి కళాశాల, bahuvRtti kaLASAla
-n.
--polytechnic college;
బహుగ్లయిసీను, bahuglaisInu
-n.
--[biochem.] polyglycine;
బహుగ్లయిసీను కాండం, bahuglaisInu kAMDam
-n.
--[biochem.] polyglycine backbone;
బహుగ్లయిసీను వెన్ను, bahuglaisInu vennu
-n.
--[biochem.] polyglycine backbone;
బహుచక్కెర, bahucakkera
-n.
--[biochem.] polysaccharide;
బహుజీర్ణమాల, bahujIrNamAla
-n.
--[biochem.] polypeptide chain;
బహుదళ హస్తాకార, bahudaLa hastAkAra
-adj.
--[bot.] multifoliate;
బహుదాకరణ, bahudAkaraNa
-n.
--proliferation;
బహుఫలకం, bahuphalakaM
-n.
--[math.] polyhedron; a solid geometrical object with several sides;
-- బహుముఖి;
బహుఫీనాల్, bahuphInAl
-n.
--[chem.] polyphenol;
బహుభర్తుత్వం, bahubhartutvaM
-n.
--polyandry; the practice of having several husbands at the same time;
బహుభాగి, bahubhAgi
-n.
--[chem.] polymer; a chemical with many monomers connected together;
బహుభార్యాత్వం, bahubhAryAtvaM
-n.
--Polygamy; the practice of having several wives at the same time;
బహుభుజి, bahubhuji
-n.
--[math.] polygon; a flat geometrical figure with several straight sides; the word is often used to refer to figures with more than four sides;
బహు దేవతారాధన, bahudEvatArAdhana
-n.
--Polytheism; the practice of worshipping several gods or deities;
బహుప్రమాణ, bahupramANa %e2t
-adj.
--multi-dimensional;
బహుమతి, bahumati
-n.
--award; gift; prize;
బహుమానం, bahumAnaM
-n.
--award; gift; prize; present;
బహుముఖ, bahumukha
-adj.
--multi-faceted;
---బహుముఖ ప్రజ్ఞ = multi-faceted talent.
బహురూపత, bahurUpata
-n.
--allotropy; typically used to refer to the existence of a chemical element in more than one form;
బహువచనం, bahuvacanaM
-n.
--(1) plural; the plural number;
--(2) respectful; addressing of an elder or a person in high esteem;
బహువిదీను, bahuvidInu
-n.
--[chem.] polyethylene; polyethene; polythane; a plastic widely used in making transparent sheets and bags;
బహువ్రీహి, bahuvrIhi
-n.
-- (1) an exocentric compound word; a figure of speech in which a compound word suggests a meaning which is not a combination of the meanings of the individual component words; an example in English is “hotdog” which is neither hot nor dog but something that is entirely different; అన్యపదప్రధానమైన సమాసము. ఉదా. ముక్కంటి;
-- (2) wealth;
-- (lit.) lots of rice grains; బహు = many; వ్రీహి = grain of rice;
బహుసాయం, bahusAyaM
-n.
--polyculture; rotating crops;
బహుళం, bahuLaM
-n.
--(1) plentiful; abundant; frequent;
--(2) one that can happen in a variety of ways; in grammar, this means the rule in question may not apply, may optionally apply, or may always apply;
బహుళంగా, bahuLaMgA
-adv.
--abundantly; plentifully;
బహుళార్ధసాధక, bahuLArdhasAdhaka
-adj.
--multi-purpose;
బహుశ, bahuSa
-adv.
--perhaps; in general;
బ్రహ్మ, brahma
-adj.
--(1) huge; large; heavy-duty;
--(2) divine;
-n.
-- Lord Brahma, the creator of the Hindu trinity;
-- see also బ్రహ్మము;
బ్రహ్మకమలం, brahmakamalaM
-- n.
-- (1) Queen of the night; Princess of the night; Brhtleham lily; [bot.] ''Epiphyllum oxypetalum''; ''Saussurea Obvallata;'' epi = మీద + phullon = ఆకు + Oxypetalum = ఎక్కువగా రేకలు కలిగిన. (2) [bot.] ''Saussurea Obvallata;''
-- ఈ పువ్వులు రాత్రివేళ వికసించిన సమయంలో మత్తెక్కించే సువాసనను కలిగివుంటాయి. హిమాలయ పర్వత సానువుల్లో సముద్రమట్టానికి 4500 మీటర్ల పైన ఈ మొక్క కనిపిస్తుంది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి, ముఖ్యంగా టిబెట్ లో ఇది ఒక ముఖ్యమైన మూలిక. ఇది యురోజెనిటల్ రుగ్మతలు, కాలేయ తిష్టలు, లైంగిక సంక్రమణ వ్యాధులు, ఎముక నొప్పులు, జలుబు, దగ్గుకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. ఇది చేదు రుచిని కలిగి ఉంటుంది. మొత్తం మొక్క ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ మొక్కలను ఎక్కువగా ఔషధాలలో వాడడం వల్ల, బ్రహ్మ కమలాలు అంతరించే ప్రమాదం లేకపోలేదు; దీనిని పారసీక భాషలో గుల్-ఎ-బకావళి అంటారుట!
బ్రహ్మగుప్త, brahmagupta
-n.
-A great Indian mathematician who lived in the 7th century A.D.
బ్రహ్మచర్యం, brahmacaryaM
-n.
--celibacy; continence;
బ్రహ్మచారి, brahmacAri
-n. m.
--bachelor; novice;
బ్రహ్మచారిణి, brahmacAriNi
-n. f.
--bachelorette; spinster; unmarried woman;
బ్రహ్మచింత, brahmaciMta
-n.
-- Cream of Tartar tree; Monkey-bread tree; This tree, a native of Africa, was introduced into India by the British and can be seen along roadside in Andhra and Telangana; [bot.] ''Adansonia digitata'' of the Bombacaceae family;
-- దీని ఆకులను కూరగా, పులుసుగా, పప్పుతో కలిపి వండుకుంటారు. పుల్లగా ఉండే ఈ ఆకుల కారణంగా ఈ చెట్టుకు ‘బ్రహ్మ ఆమ్లిక', ‘బ్రహ్మ చింత', ‘సీమ చింత' అనే పేర్లు వచ్చాయి. కొందరు దీనినే ‘బ్రహ్మమాలిక' అని కూడా అంటున్నారు.
-- ఈ వృక్షం ఆకులను వెచ్చజేసి ఆ గాయాలమీద కడతారు. జ్వర నివారిణి (Febrifuge) గానూ, స్రావాలను నిరోధించేది (Astringent) గానూ, చెమట పట్టించేది (Sudorific) గానూ, బలవర్ధక ఔషధం (Tonic) గానూ ఈ ఆకుల రసానికి పేరుంది. చెవి పోటుకూ, కళ్ళు వాచి నొప్పి పెడుతున్నప్పుడు ఈ ఆకుల పసరు పిండి పోస్తే ప్రయోజనం ఉంటుంది. శ్వాస సంబంధమైన, జీర్ణకోశ సంబంధమైన అవ్యవస్థలకు ఈ వృక్షం ఆకులు, పూల కషాయం బాగా పనిచేస్తుంది.
బ్రహ్మచెవుడు, brahmacevuDu
-n.
--deafness; excessive loss of hearing;
బ్రహ్మజెముడు, brahmajemuDu
-n.
--cactus; Giant club cactus; Peruvian apple cactus; [bot.] ''Cereus Repandus;''
-- బ్రహ్మ దేవుడి ముఖాలు నాలుగువైపులకూ ఉన్నట్లే వీటి ముఖాలు కూడ అన్ని వైపులకూ ఉంటాయి. ఇవి సన్నగా, పొడుగ్గా ఉంటాయి. వీటి పుష్పాలు చాలా పెద్దవిగా వుంటాయి. పువ్వుకు క్రింద పొడవైన, బలమైన కాడ కనిపిస్తుంది.
-- see also నాగజెముడు;
బ్రహ్మజ్ఞానం, brahmajnaanaM
- n.
-- హిందూ బోధనల ప్రకారం, బ్రహ్మ జ్ఞానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానోదయం, విముక్తి (మోక్షం) మరియు జనన మరణ చక్రం (సంసారం) ముగింపుకు దారితీసే అత్యున్నత జ్ఞానంగా పరిగణించబడుతుంది. ఇది ఒక వ్యక్తి యొక్క అవగాహనలో లోతైన పరివర్తనను తీసుకువస్తుందని చెప్పబడింది. ద్వంద్వత్వం యొక్క భ్రాంతిని విచ్ఛిన్నం చేస్తుంది. అన్నిటి ఉనికిలో గల అంతర్లీన ఐక్యత మరియు దైవత్వాన్ని బహిర్గతం చేస్తుంది.
బ్రహ్మదండి, brahmadaMDi
- n.
-- (1) Cultivated Liquorice; Sweetwood; [bot.] ''Argemone mexicana; Glycyrrhiza glabra;'' (2) Indian Globe Thistle; [bot.] ''Echinops echinatus;'' (3) Mexican poppy; yellow thistle; prickly poppy; [bot.] ''Argemone mexicana''; a prickly annual shrub; leaf juice is used for skin diseases;
-- బలురక్కెస; [Hin.] Bharbhar;
-- This is different from Milk thistle (పాలు ముల్లు) ([bot.] ''Silybum marianum''); It is important to distinguish this from Tippa Teega ([bot.] ''Tinospora cordifolia'') or Bodataram ([bot.] ''Sphaeranthus indicus''), which are common, different medicinal plants in Andhra Pradesh and Telangana.
బ్రహ్మదారువు, brahmadAruvu
-n.
-- portia tree; Pacific rosewood; Indian tulip tree; [bot.] ''Hibiscus populneus'';
-- గంగరావి చెట్టు;
బ్రహ్మద్వారాలు, brahmadvArAlu
-n. pl.
--(lit.) the gates of the Brahman; according to Hindu belief, there are eleven gates of the Brahman: two eyes, two nostrils, one mouth, two evacuation organs, the navel, and the opening at the top of the head, called "Brahma randhra," the fontanelle; In fact, this accounting is only correct for men; in women, the genital opening is distinctly different from the urinal opening;
బ్రహ్మ పదార్థం, brahma padArdhaM
-n.
--Supreme Reality; Universal Self; The Truth; Cosmic Self; the constant Universal Principle; Unchanging Reality;
బ్రహ్మమండూకి, brahmamaMDUki
-n.
--Indian pennywort; [bot.] ''Centella asiatica'';
-- This wild creeper is found throughout India and has many medicinal properties;
బ్రహ్మము, brahmamu
- n.
-- Supreme Reality; The Truth; Universal Self; Cosmic Self; the constant Universal Principle; Unchanging Reality; What is to be known; Everything we perceive with our senses is made out of బ్రహ్మమ;
-- ఈ జగత్తుకు బ్రహ్మము కంటే వేరుగా విలక్షణమైన ఉనికి లేదు; సత్, చిత్, ఆనందముల స్వరూపము; సర్వవ్యాపకత్వము కలది; సర్వోన్నత వాస్తవికత; బ్రహ్మమే ఈ విశ్వం యొక్క ఏకైక, అంతిమ వాస్తవం (Reality); ఇది సృష్టి, స్థితి, లయాలకు అతీతమైనది;
బ్రహ్మ ముహూర్తం, brahma muhoortaM
- n.
-- ఒక ముహూర్తం అంటే రెండు ఘడియల సమయం. ఒక ఘడియ అంటే 24 నిమిషాలు. అంటే ముహూర్తం అంటే 48 నిమిషాలన్నమాట. సూర్యోదయానికి ముందు 30 నిమిషాల పాటు ఉండే కాలాన్ని సంధ్యాకాలం అంటారు. ఈ సంధ్యాకాలానికి ముందు 30 నిమిషాలను ఉషోదయం అంటారు. దానికి ముందు ఉండే 48 నిమిషాల సమయాన్నే బ్రహ్మముహూర్తం అంటారు. అంటే సూర్యోదయానికి దాదాపుగా 2-3 గంటల ముందు సమయాన్ని బ్రహ్మమూహూర్తంగా చెప్పుకోవచ్చు;
బ్రహ్మమేఖలం, brahmamEkhalaM
-n.
--[bot.] ''Saccharum munjia;''
బ్రహ్మమేడి, brahmamEDi
-n.
--[bot.] ''Ficus glomerata; Ficus hispida;''
బ్రహ్మరంధ్రం. brahmaraMdhraM
-n.
--sagittal suture; the soft spot on the top of an infant's head;
బ్రహ్మరాక్షసి, brahmarAkshasi
-n.
--(1) big fiend;
--(2) a spirit formed after the death of a Brahmin scholar who did not teach his knowledge to others in his lifetime;
-- ద్విజనిశాచరుడు; బ్రాహ్మణుడిని బ్రహ్మ అని కూడా వ్యవహరిస్తూ వుంటారు కాబట్టి ‘బ్రహ్మ రాక్షసుడు’ అనగా తన ధర్మానికి విరుద్ధంగా నడిచి రాక్షసునిగా మారిన బ్రాహ్మణుడు అని అర్థం;
--(3) giant aloe; [bot.] ''Fourcroy cantala;'' బ్రహ్మజెముడు; బ్రహ్మరాకాసి చెట్టు;
బ్రహ్మవిద్య, brahmavidya
-n.
--(1) Supreme Knowledge; divine knowledge;
--(2) [idiom.] rocket science; any difficult task;
బ్రహ్మాణువు, brahmANuvu
-n.
--primeval atom; (epithet for the earliest universe);
బ్రహ్మాండం, brahmAMDaM
- adj. great; super; very big;
-n.
--primeval egg; (epithet for the earliest universe); the universe;
బ్రహ్మాండ విచ్ఛిన్న వాదం, brahmAMDa vicchinna vAdaM
-n.
--the Big Bang theory;
బ్రహ్మీ, brahmI
-n.
--Indian pennywort; a medicinal plant; [bot.] ''Hydrocotyle asiatica; Bacopa monnieri;''
-- see బ్రహ్మమండూకి;
%బా - bA
బాంధవ్యం, bAMdhavyaM
-n.
--relationship; kinship;
బాకా, bAkA
-n.
--trumpet;
బాకా గులాబీ, bAkA gulAbi
- n.
-- Pink trumpet flower; Port St. John's Creeper; [bot.] ''Podranea ricasoliana'' of the Bignoniaceae family;
బాకీ, bAkI
-n.
--(1) debt; arrears; balance of a loan;
--(2) remainder; rest; balance;
బాకు, bAku
-n.
--dagger; (rel.) చాకు - knife; pen-knife;
బాగా, bAgA
-adv.
--(1) well; properly;
--(2) much greatly; thoroughly;
బాగు, bAgu
-inter.
--good;
-n.
--wellness; welfare; (ant.) ఓగు;
బాగుపడు, bAgupaDu
-v. i.
--thrive; prosper;
బాజాలు, bAjAlu
-n. pl.
--drums and trumpets; band;
బాట, bATa
-n.
--path; way; road; track;
బాటసారి, bATasAri
-n.
--wayfarer; traveler; one who is traveling along a road;
బాడవ, bADava %e2t
-n.
--land suitable for cultivation every year; (2) low-lying land; swampy land; bog;
--- బాడవ పొలం అంటే వాకపొలం, పల్లపు పొలం, ఏటి ఒడ్డున ఉండే కారణంగా ఎప్పుడూ తేమగా ఉండే భూమి (మాగాణి పొలం);
--- (ant.) ఈడవ;
బాడిజువ్వి, bADi juvvi
-n.
--[bot.] ''Ficus lacor'';
బాడిస చెట్టు, bADisa ceTTu
-n.
--coral tree; [bot.] ''Erythrina indica'';
-- [Sans.] బలభద్రిక;
బాడిస, bADisa
-n.
--adze; a carpenter's tool;
బాడుగ, bADuga
-n.
--fare; rent;
బాణం, bANaM
-n.
--arrow; సాయకం;
బాణలి, bANali
-n.
--pan for deep-frying;
బాణామతి, bANAmati
- n.
-- a black magic targeting a whole community;
-- బాణామతి ఒక క్షుద్ర విద్య; చేతబడి ఒక మనిషికి కీడు చెయ్యడానికి చేస్తే బాణామతి తో మొత్తం ఊరంతటికి కీడు చెయ్యడానికి చేస్తారు; ఇది ఒక రకమైన మూఢ నమ్మకము;
-- see also చేతబడి;
బాణీ, bANI
-n.
--pattern; style; trend;
బాతాఖానీ, bAtAkhAnI
-n.
--banter; chit-chat; small talk to spend time; excessive talk;
బాతు, bAtu
-n.
--duck; m. drake; a tribe is group of ducks; (rel.) a goose is a duck-like bird with a bigger body and longer neck; a goose can fly long distances;
బాదం చెట్టు, bAdaM ceTTu
-n.
--Indian almond tree; [bot.] ''Terminalia catappa'';
బాదరబందీ, bAdarabaMdI
-n.
--botheration;
-- (ety.) ‘బారా బందీ’ పన్నెండు బొందె ముడులు వేసిన అంగీ; నవాబుల కాలంలో (బహుశా గోలకొండ నవాబుల కాలం కావచ్చు) ఒక ప్రత్యేకమైన శైలిలో ఉడుపులు ధరించి దర్బారుకో/కార్యాలయానికో వెళ్ళాల్సినపుడు లేక కార్యార్థమై ఏ ముఖ్యవ్యక్తినో కలవాల్సిన అవసరం కలిగినపుడు ఈ మాట తెలుగులో ప్రవేశించి ఉండచ్చు … మామూలు కుర్తా /లాల్చీ కాదు ఇది. దాదాపు మోకాలిని దాటి కిందకి వచ్చే గల్లాబందు పై ఉడుపు. ఇందులో పై నుండి కిందికి పన్నెండు వరసల కాజాలు… అందునా పన్నెండు వరసలతాళ్ళు;
--it is a coincidence that this can also be interpreted as 'imprisoned by botheration' which also makes sense;
బాదు, bAdu
-v. t.
--beat; bombard; blow; strike;
బాధ, bAdha
-n.
--pain;
బాధ్యత, bAdhyata
-n.
--responsibility;
బాన, bAna
-n.
--large vessel;
బానిస, bAnisa
-n.
--slave; servant;
బానిసత్వం, bAnisatvaM
-n.
--slavery; servitude;
బాపతు, bApatu
-n.
--kind; type; variety; sort;
బాపన గద్ద, bApana gadda,
- n.
-- the Brahminy kite; [bio.] ''Haliastur indus'';
-- A medium-sized raptor with a rounded tail unlike other kites;
బాబు, bAbu
- n.
-- (1) father's younger brother;
-- (2) respectful person; venerated person;
-- (3) a male child;
బాయి, bAyi
-n.
--breast milk;
[[గంటుబారంగి|బారంగి]], bAraMgi
-n.
--[bot.] ''Clerodendron serratum'';
బార, bAra
-n.
--a measure of length equal to the span from the tip of the shoulder joint to the tip of the middle finger of the arm; 1 బార = 2 మూరలు;
బారకి, bAraki
-n.
--[bot.] ''Adiantum lunulatum'';
బారకాసులు, bArakAsulu
-n.
--barracks;
బారసాల, bArasAla
- n.
-- ceremony of giving gifts to a new baby and the mother, usually on the 12th day or thereabouts;
-- (ety.) ఇది మరాఠీ బారసా (ద్వాదశ = 12వ రోజు) నుండి వచ్చింది; మనకూ మాహారాష్ట్రీయులకూ, శాతవాహనుల కాలంనుంచీ, గాథాసప్తసతి కూర్చిన కాలం నాటి నుంచీ సంబంధం ఉంది కదా!
-- (ety 2) బారసాల ఒక అచ్చ తెలుఁగు మాట. దీనికి సంబంధించిన మరొక మాట - బాలింత. ఈ రెండు మాటలకు మూలమైన మాట 'పాలు'. బారసాల వాస్తవముగా 'పాలసారె'. చూలాలికి వివిధ దశలలో వివిధమైన వేఁడుకలున్నవి. సీమంతము మొ౹౹ వాటిలో పాలసారె ఒకటి. క్రొత్త తల్లికి పాలు వచ్చిన సందర్భముగా పాల సారె. ఈ వేడుకకు గల పాల ప్రస్తావన వలన కాలక్రమములో స్త్రీలకు సిగ్గు కలిగి దీనిని బాలసారెగా 'బాలునికి' సంబంధించినదిగా మార్పు చేయడమైనది. పాలసారె అంటే పాలు వచ్చిన సందర్భముగా ఇచ్చు కానుకలు;
బార్లీ, bArlI
-n.
--barley; [bot.] ''Hordei semina''; యవలు;
బారు, bAru
-adj.
--straight; in a line; తిన్ననైన;
-n.
--[math.] row; array;
బారువ, bAruva
-n.
--a measure of weight in pre-independence India; 1 బారువ = 20 మణుగులు; 1 మణుగు = 8 వీసెలు;
బారువడ్డీ, bAruvaDDI
-n.
--[econ.] simple interest; (lit.) straight interest;
బార్లు, bArlu
-n. pl.
--lines;
బార్లు తీరేరు, bArlu tIrEru
-ph.
--they lined up;
---సిపాయిలు బార్లుతీర్చి నిలబడ్డారు = the soldiers stood in a line.
బాలం, bAlaM
-n.
--[chem.] valancy; short for బాహుబలం;
---కర్బనం యొక్క బాలం నాలుగు = carbon's valancy is four.
బాల, bAla
-adj.
--child; baby; kid;
బాలక, bAlaka
- n.m.
-- boy;
బాలపాపచిన్నె, bAlapApacinne
-n.
--[med.] petit mal; a mild form of epilepsy;
బాలబందితీగ, bAlabaMditIga
-n.
--bay hops; bay-hops; beach morning glory; goat's foot; [bot.] ''Ipomoea pescaprae'' of the Convolvulaceae family;
బాలరిష్టాలు, bAlarishTAlu
-n.
--(1) dangerous periods in the life of a child;
--(2) teething troubles;
బాలవిహార్, bAlavihAr
-n.
--kindergarten; preschool;
బాలింత, bAliMta
-adj.
--post-natal; బాలెంత;
-- (ant.) చూలింత = prenatal;
బాలింతరాలు, bAliMtarAlu
-n.
--the woman who just delivered a child; (ant.) చూలింతరాలు; = a woman carrying a child;
బాలిక, bAlika
- n. f.
-- girl; (not బాలకి)
బాలీసు, bAlIsu
-n.
--bolster; big, long, cylindrical shaped pillow; to recine against;
బాల్చీ, bAlcI
-n.
--bucket; a metal bucket; బొక్కెన; చేద is a bucket made of a palm leaf;
బావి, bAvi
-n.
--well;
---బొక్కెన బావిలో పడెను = the bucket fell in the well.
---దిగుడు బావి = a well with steps to go down to the water level.
బావుటా, bAvuTA
-n.
--banner; flag;
బాస, bAsa
-n.
--(1) vow;
--(2) language;
బాసు, bAsu
-n.
--boss; officer; superior; manager; supervisor;
బాష్పం, bAshpaM
-n.
--(1) vapor; fume;
--(2) tears; కన్నీరు;
బాష్ప వాయువు, bAshpa vAyuvu
-n.
--tear gas;
బాష్పశీలత్వం, bAshpaSIlatvaM
-n.
--volatility;
బాష్పశీల వాయువు, bAshpaSIla vAyuvu
-n.
--volatile gas; (lit.) having the property of volatality;
బాష్పిక, bAshpika
-n.
--asafetida tree;
బాష్పీభవనం, bAshpIbhavanaM
-n.
--evaporation;
బాహ్య, bAhya
-adj.
--outer; external; exterior;
బాహ్యప్రకోష్ఠిక, bAhyaprakOshTika
-n.
--radius; name of one of the two bones in the forearm;
బాహ్యావరణం, bAhyAvaraNaM
-n.
--[phy.] exosphere;
బాహుబలం, bAhubalaM
-n.
--(1) strength of the arms;
--(2) [chem.] valency;
బాహుమూలం, bAhumUIaM
-n.
--arm-pit; చంక;
బాహుశిరం, bAhuSiraM
-n.
--shoulder; (lit.) the head of the arm;
బాహుళ్యం, bAhuLyaM
- n.
-- a majority;
బ్రాహ్మణుడు, brAhmanuDu
- n.
-- (1) brahmin; a person belonging to the Brahmin "varNa" (caste) in the Hindu social system;
-- (2) brahmin; a person who attained transcendental enlightenment, regardless of the "varNa" at birth; everyone is Sudra by birth; they become "dvija" (twice-born) by performing a religious ritual; by learning the Vedas, they become a "Vipra;" by transcendental enlightenment, they become a Brahmana.
-- పుట్టుకతో బ్రాహ్మణుడు అయినవాడు సంస్కారం/ఉపనయనంతో "ద్విజుడు" అవుతాడు. ఈ ద్విజుడు వేదాల్ని అభ్యసించి "విప్రుడు" అవుతాడు. ఈ మూడు అర్హతలు పొందినవారిని శ్రోత్రియులు అంటారు.
--శ్లో. జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేదపాఠం తు విప్రాణాం
బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణః
--see also విప్రుడు;
-- బ్రాహ్మణుని స్థాయిని బట్టి ధర్మశాస్త్రాలు అతనిని 8 విధాలుగా వర్ణించాయి.
🌷 మాత్రుడు -- బ్రాహ్మణకులంలో జన్మించినా ఉపనయనము, అనుష్ఠానము లేనివాడు.
🌷 బ్రహ్మణుడు -- --వేదాలను కొంతమేరకే అధ్యయనం చేసినవాడు. అయితే ఆచారము, శాంతి, సత్యము, దయ కలవాడు, బుద్ధి కలిగినవాడు.
🌷 శ్రోత్రియుడు
కనీసం ఒక వేదం శాఖను కల్ప సూత్రాలతో, షడంగములతో,అధ్యయనం చేసి, యజ్ఞాది షట్కర్మలను చేసేవాడు.
🌷అనుశాసనుడు
వేదాలను, ఉపనిషత్తులను అధ్యయనం చేసి అర్థం చేసుకున్నవాడు, నిర్మలమైన చిత్తం కలిగి శ్రోత్రియ లక్షణాలు కలవాడు.
🌷 బ్రూణుడు
యజ్ఞయాగాదులు, వేదాధ్యయనము, వ్రతాలు చేస్తూ, ఇంద్రియాలను జయించినవాడు. అనుశాసనుడి లక్షణాలు కలవాడు.
🌷 ఋషికల్పుడు
వైదిక, లౌకిక వ్యవహారములు తెలిసి, గృహస్థుగా ఉన్నవాడు బ్రూణుడి లక్షణాలు కలవాడు.
🌷ఋషి
తపస్వి, కామమును, ఆకలిని జయించినవాడు, సత్యసంధత కలిగినవాడు. వరములను, శాపములను ఇవ్వగలిగినవాడు.
🌷ముని
అరిషడ్వర్గములను, ఇంద్రియములను, జయించినవాడు. వస్తుసంపదలపై మోహము లేనివాడు. మౌనియై సమాధి స్థితి పొందినవాడు.
%బిం - biM, బి - bi, బీ - bI
బింకం, biMkaM
-n.
--stiffness; pride;
బింబము, biMbamu
- n.
-- (1) the round shape of heavenly bodies like the sun or moon; (2) the lower lip'
బిందువు, biMduvu
-n.
--(1) [math.] point;
--(2) dot; period; full stop;
--(3) a small circle or cipher to represent the letters ణ, న, ము; పూర్ణానుస్వారం;
--(4) a drop; drop of water;
---సమీప బిందువు = perigee.
---దూర బిందువు = apogee.
బిందుసేద్యం, biMdusEdyaM
-n.
--drip irrigation;
బిందె, biMde
-n.
--a metal pot, usually to hold water;
బింబం, biMbaM
-n.
--disc; (esp.) full disc of the sun or moon; image;
బింబి, biMbi
-n.
--[bot.] Coccina indica;
బికారి, bikAri
-n.
--vagabond; vagrant; unemployed;
బిక్కి, bikki
-n.
--[bot.] Gardenia gummifera; [Sans.] నాడీహింగు;
బిక్కుబిక్కుమను, bikkubikkumanu
-v. i.
--feel scared;
బిగపట్టు, bigapaTTu
-v. t.
--to hold; hold back; withhold;
బిగ్గరగా, biggaragA
-adv.
--loudly;
బిగించు, bigiMcu
-v. t.
--tighten;
బిగువైన, biguvaina
-adj.
--tight;
బిచ్చం, biccaM
-n.
--alms;
బిచ్చగాడు, biccagADu
-n. m.
--beggar;
బిడ్డ, biDDa
-n.
--child; kid; baby; infant;
బిడాయించు, biDAyiMcu
-v. t.
--shut tight; cover;
బిడారు, biDAru
-n.
--a group of camels with their riders;
-- బిడారం;
బితుకుబితుకుమను, bitukubitukumanu
-v. i.
--feel scary; feel apprehensive; anxious;
బినామీ, binAmI
- adj.
-- the illegal practice of putting someone else's name on registration papers to bypass a law or to avoid taxes or payments;
-- బే - నామీ (అసలు మనిషి పేరు కాకుండా, ఇంకొకరి పేరు పై)
బియ్యం, biyyaM
-n.
--rice;
---అడవి బియ్యం = wild rice; [bot.] ''Zizania palustris;''
---ఉప్పుడు బియ్యం = parboiled rice.
--- సేసబ్రాలు = అక్షతలు = sactified rice = rice + turmeric paste;
-- తలంబ్రాలు = rice sprinkled on each other by bride and groom;
బిరడా, biraDA
-n.
--stopper; plug; cork; cork used to close a bottle;
---చెవులు బిరడాలు పడిపోతున్నాయి = ears are getting plugged.
--- బిర్రు + అడ = బిరడా = బిగించే పనిముట్టు;
బిరబిర, birabira
-adj.
--onomatopoeia for fast and rustling motion;
బిరుదు, birudu
-n.
--title; a title given in recognition of some accomplishment;
బిరుసు, birusu
-adj.
--rough; not soft and tender; hard; firm to bite; al dente;
---తలబిరుసుతనం = headstrongness.
బిర్రు, birru
-n.
--uptight; tense;
బిలం, bilaM
-n.
--tunnel; hole; cave; any opening with only one entrace;
బిలింబి కాయలు, biliMbi kAyalu
- n.
-- పులుసు కాయలు; [bot.] ''Averrhoa bilimbi;''
-- రాచ ఉసిరి చెట్టుకి, స్టార్ ఫ్రూట్ చెట్టు (కరంబోలా- Carambola) కి దగ్గర బంధువు అనదగిన ఈ చెట్లు అందరి పెరటి దొడ్లలో పెంచేవారట. అప్పట్లో అందరూ ఈ పుల్లటి కాయల్ని కూరలలో వాడుకునేవారట. ప్రస్తుతం ఈ చెట్లు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి.
బిల్లు, billu
-n.
--a timber tree; the Indian satinwood tree whose wood resembles the box wood; [bot.] ''Swietania chloroxylon'';
బిళ్ల, biLla
-adj.
--flat;
---బిళ్లగోచీ = a style of wearing a dhoti or sari with a flat-pleated back.
---బిళ్లపెంకు = flat tile.
---బిళ్లబంట్రోత్తు = peon who wears a badge; a peon reporting to a government officer.
-n.
--(1) tablet;
--(2) coin;
--(3) hard candy drop;
--(4) badge;
బిళ్లగన్నేరు, biLlagannEru
-n.
--Jalap plant; Periwinkle; [bot.] ''Catharanthus roseus'' of the Apocynaceae family; ''Vinca rosea'' of the Catharanthus family;
-- the drug Vincistrene, extracted from its roots, is being investigated for its medicinal values;
-- ఈ మొక్కలలోని ఆకులు, పూలు, వేర్లు మొదలైన అన్ని భాగాలలో చాలా ఎక్కువగా ఉండే ఆల్కలాయిడ్స్ వైద్యపరంగా ఎంతో విలువైనవి. విన్ బ్లాస్టిన్ (Vinblastine), విన్ క్రిస్టిన్ (Vincristine), ల్యూరోసైడిన్ (Leurosidine), ల్యూరోసైన్ (Leurosine) వంటి ఆల్కలాయిడ్స్ కాన్సర్ నివారణకు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధనలలో తేలింది. ల్యుకేమియా (Leukaemia) కూ, హాడ్కిన్స్ డిసీజ్ (Hodgkin's disease), విల్మ్స్ ట్యూమర్ (Wilms' Tumour), న్యూరోబ్లాస్టోమా (Neuroblastoma) వంటి వాటికి ఈ ఆల్కలాయిడ్స్ దివ్యౌషధాలుగా పనిచేస్తాయని వైద్య పరిశోధనలలో తేలింది.
బిళ్లజువ్వి, biLlajuvvi
-n.
--[bot.] ''Ficus nitida'';
బిళ్లు, biLlu
-n.
--[bot.] ''Chloxylon swietenia'';
బిళ్లుగడ్డి, biLlugaDDi
-n.
--[bot.] ''Saccharum spontaneum'';
బీజం, bIjaM
-n.
--(1) seed;(2) semen; (3) root of an equation; (4) essential part;
బీజగణితం, bIjagaNitaM
-n.
--algebra;
బీజాశయం, bIASayaM
-n.
--gonad;
బీజాక్షరం, bIjAkSharaM
- n.
-- the essential syllable in a sacred mantra, the absence of which would render the word into an antonym;
--- నమశ్సివాయ = నమ + శివాయ means "I salute the auspicious energy". If the syllable మ is removed న + శివాయ means "not auspicious"
బీట, bITa
-n.
--crack; fissure; chink;
బీటుదుంప, bITuduMpa
-n.
--beet root; sugar beet;
బీడీ, bIDI
-n.
--beedi; a small cigar-like smoking item in which tobacco is wrapped in a beedi leaf (leaf of coromandel ebony);
బీడీ ఆకు, bIDI ఆకు
-n.
--beedi leaf; leaf of ebony or coromandel ebony; tobacco rolled in these leaves is a popular as native cigarettes among villagers; [bot.] ''Diospyros melanoxylon'';
-- తుమికి; [[తునికి చెట్టు]];
బీడు, bIDu
-n.
--(1) ground; meadow; field;
--(2) waste; inferior; low; second rate;
--(3) zinc filings used in fireworks;
--(4) any scrap metal;
---బంతుల బీడు = play ground.
---బీడుది నాకెందుకు = I do not want the inferior one.
బీదరికం, bIdarikaM
-n.
--poverty.
బీభత్స, bIbhatsa
-adj.
--disgusting; loathsome; estranged in mind; abhorrent; savage; మనస్సుకి రోత పుట్టించేది;
బీమా, bImA
-n.
--insurance;
బీర, bIra
-adj.
--big; large;
బీరకాయ, bIrakAya
-n.
--ribbed gourd; ridged gourd; sharp edged cucumber; [bot.] ''Petula sinqua; Luffa acutangula'';
--[note) In Arabic Luffa means plant fiber. so the name means acute-angled vegetable with fiber;
--same as బీర; ఊరబీర;
-- చేదు బీర = [bot.] ''Luffa acutangula'' var amara;
-- not same as నేతిబీర = sponge gourd; [bot.] ''Luffa cylindrica; Luffa egyptiaca'';
--[Sans.] స్వాదు కోశాతకీ; తిక్త కోశాతకీ; కటు కోశాతకీ; ఘృతకోశాతకీ;
బీరువా, bIruvA
-n.
--bureau; shelf with doors; almirah;
%బు - bu, బూ - bU
బుంగ, buMga
-n.
--(1) balloon;
--(2) a round pot;
బుంగమూతి, buMgamUti
-n.
--sulky face;
బుకాయించు, bukAyiMcu
-v. i.
--bluff; hoodwink;
బుకాయింపు, bukAyiMpu
-n.
--bluffing; hoodwinking;
బుక్కా, bukkA
-n.
--rouge (రూజ్ ); a fragrant powder (containing musk, civetone, etc.) often applied to the cheeks; sandalwood powder;
బుక్కావాడు, bukkAvADu
-n.
--perfumer; a person who sells (or makes) perfumes;
బుక్కెడు, bukkeDu
-adj.
--mouthful;
బుగబుగ, bugabuga
-n.
--bubbling sound;
బుగత, bugata
-n.
--big landlord;
బుగ్గ, bugga
-n.
--(1) cheek;
--(2) artesian spring; as in నీటి బుగ్గ;
బుగ్గబావి, buggabAvi
-n.
--artesian well;
బుగ్గమీసం, buggamIsaM
-n.
--whisker;
బుగ్గి, buggi
-n.
--(1) ashes;
--(2) dust; dirt;
బుగ్గిపాలు, buggipAlu
-ph.
--[idiom] wasted effort; (lit.) fell into the ashes;
బుచ్చిగాడు, buccigADu
-n.
--white-breasted kingfisher; [bio.] ''Halcyon smyrnensis''; also లకుమికి పిట్ట;
---నీళ్ల బుచ్చిగాడు = pied kingfisher; [bio.] ''Ceryle rudis'';
బుజ్జగించు, bujjagiMcu
-v. t.
--lull; pacify; console; caress;
బుట్ట, buTTa
-n.
--basket; typically made out of tightly woven palm leaf strips or flat bamboo strips; (rel.) సజ్జ = a basket with loosely woven wooden strips or twigs;
---వాడు బుట్టలో పడ్డాడు = [idiom] he got duped; he fell victim to a ploy.
బుడగ, buDaga
-n.
--bubble; balloon;
బుడమ, buDama
-n.
--(1) short round cucumber; [bot.] Cucumis pubescense; Bryonia callosa; (2) [bot.] Physalis minima Linn.; the juice of this is used as a remedy for ear-ache;
బుడమకాయ, buDamakAya
-n.
--(1) [idiom] short fellow; బుడంకాయ;
-- (2) [bot.] ''Bryonica callosa;'' ''Cucumis utilissinus'' of Cucurbitaceae family
--- ఇది దొండ, ఆనప, గుమ్మడి జాతికి చెందిన ఒక రకం దోసకాయ;
--- రకాలు: కూతురు బుడమ; కోడి బుడమ; వెర్రి పుచ్చకాయ;
బుడ్డ, buDDa
-adj.
--short; dwarf; బుడమ;
-n.
--hydrocele; a collection of fluids in the scrotum;
బుడ్డకాకర, buDDakAkara
-n.
-- a tendril climber; [bot.] ''Cardiospermum halicacabum'' Linn.;
బుడ్డతుమ్మ, buDDatumma
-n.
--[bot.] ''Acacia roxburghii;''
బుడ్డబూసర, buDDabUsara
-n.
--[bot.] ''Physalis peruviana'';
బుడితగుల్ల, buDitagulla
-n.
--arc shell; [bio.] ''Anadara granosa'' of the Arcidae family;
బుడిపెలు, buDipelu
- n.
-- [bot.] tubercles; little projections on a fruit or stem of a plant;
బుడ్డి, buDDi
-n.
--(1) bottle; vial; bottle with a narrow mouth;
--(2) slang for a alcohol habit;
---సారాబుడ్డి = wine bottle.
---సిరాబుడ్డి = ink bottle.
---వాడు బుడ్డి వేస్తున్నాడు = he is drinking (alcoholic beverage).
బుడ్డిదీపం, buDDidIpaM
-n.
--(1) alcohol lamp; spirit lamp;
--(2) a small lamp;
బుడ్డోడు, buDDoDu
-n.
--small boy; young fellow;
బుద్బుదం, budbudaM
-n.
--water bubble;
బుద్బుదప్రాయం, budbudaprAyaM
-n.
--transitory; fleeting; (lit.) like a water bubble;
బుధగ్రహం, budhagrahaM
-n.
-- Mercury; a planet in the Solar System;
బుద్ధ ఫలం, buddha phalaM
-- Monk fruit; Lo Han Guo; [bot.] ''Siraitia grosvenorii;'' A zero-calorie, natural sweetener. Around 300 times sweeter than sugar. It is increasingly popular among diabetic patients in India as a healthy sugar alternative.
-- ముని పండు;
బుద్ధి, buddhi
-n.
--cleverness; intellect; the faculty of mind that gives assurance; see also చిత్తం;
---కుశాగ్ర బుద్ధి = razor-sharp intellect; (lit.) an intellect as sharp as the blade of కుశ grass.
బుద్ధికుశలత, buddhikuSalata
-n.
--cleverness; smartness;
బుద్ధిహీనుడు, buddhihInuDu
-n.
-imbecile; %to e2t
బుబ్బస, bubbasa
-n.
--[bot.] ''Hydrocotyle rotundifolia'';
బురద, burada
-n.
--mud; slime;
బుర్ర, burra
-n.
--(1) head;
--(2) the stone inside a palm fruit; usually there are three stones in each palmyrah palm fruit;
బుర్రగుజ్జు, burragujju
-n.
--the pulp inside the stone of a palm fruit;
-- తాటికాయలు కోయకుండా చెట్టుకే వదిలేస్తే పండిన తరువాత ముంజలు ముదిరి గట్టి టెంకలుగా మారుతాయి. వాటిని భూమిలో పాతితే కొన్నిరోజుల తరువాత వాటినుంచి వేరు (అదే తేగ అవుతుంది) వస్తుంది. అలాగే వదలి వేస్తే ఆ వేరు తాటి చెట్టు అవుతుంది. తేగలు కొంత పక్వానికి వచ్చిన తరువాత భూమిలో నంచి వాటిని తవ్వి, టెంకలు పగల గొట్టినప్పుడు టెంకల లోపల ఉన్న లేత కొబ్బరి లాంటి పదార్థమే బుర్రగుజ్జు. తేగ బలమయ్యే కొద్ది బుర్రగుంజు తగ్గుతుంది. తేగ మధ్యలో వివిధ పొరలతో కూడిన మెత్తని పుల్ల లాంటిది ఉంటుంది దాన్ని చందమామ అంటారు. దాని చివరన మెత్తగా ఉండి చాల తీయగా ఉంటుంది. తేగని భూమి నుంచి తీయకుండా ఉంచి ఉంటే ఈ చందమామే తాటి ఆకు చిగురు అవుతుంది
బురుజు, buruju
-n.
--tower; lookout bastion;
---కోట బురుజు = tower of a fort; lookout of a fortification.
---నీటి బురుజు = water tower.
---విమానాశ్రయపు బురుజు = airport tower.
బురోనీ, బురోణి, burOnI, burONi,
-n.
--1. [bot.] ''Ficus rubescens; Ficus heterophylla'';
--2. పరాటాని పోలిన ఒక ఆఫ్ఘనిస్థాన్ వంటకం;
బుల్ బుల్, bul^-bul^
-n.
--(1) bulbul;
--(2) పిగిలిపిట్ట లాంటి పక్షి;
బుల్లి, bulli
-adj.
--small; tiny;
బుల్లెమ్మ, bullemma
-n.
--girl; a small girl; lass;
బుల్లోడు, bullOdu
-n.
--boy; a small boy; lad;
బువ్వ, buvva
-n.
--baby language for food; cooked rice;
బువ్వంబంతి, buvvaMbaMti
-n.
--feast at a wedding, often involving singing and poking fun at each other;
బుస, busa
-n.
--hiss; hiss of a snake;
బుసబుస, busabusa
-n.
--onomatopoeia for the sound of effervescence;
బ్రుంగుడుపడు, bruMguDupaDu
- v. i.
-- fell out of use; went into the background; get destroyed;
బూకరించు, bUkariMcu
-v. t.
--bluff;
బూచాడు, bUcADu
-n.
--(1) same as బూచి;
--(2) ghost;
బూచి, bUci
-n.
--(1) bad man; a term used primarily to scare children as a means of disciplining them;
-- (ety.) believed to be an adaptation of the French General Bussy who assisted the Vijayanagara king in a skirmish against the Bobbili king in which the former prevailed;
--(2) ghost;
బూజు, bUju
-n.
--(1) mold; bread mold; [bio.] ''Neurospora crassa'';
--(2) cobweb;
---జిగురు బూజు = slime mold.
బూటకం, bUTakaM
-n.
--trick; falsity; guile;
బూడిద, bUDida
-n.
--ashes;
బూడిదగుమ్మడి, bUDidagummaDi
-n.
--ash gourd; white gourd; white gourd melon; ash melon; wax gourd; [bot.] ''Benincasa cerifera; Benincasa hispida'' of the Cucurbitaceae family; (note) In Latin ''ceriferus'' means "with wax" and ''hispidus'' means "with rough hair; Benincasa is the name of a scientist who lived in Pisa, Italy;
---[Sans.] శ్వేత కూష్మాండః; కూష్మాండః; కకుభాండ; పుష్యఫలం;
బూడిదతెగులు, bUDidategulu
-n.
--mold; mildew;
బూతపిల్లి, bUtapilli
-n.
--civet cat; a cat-like fish-eating animal of Africa, India and Malaysia,
బూతి, bUti
adj.
-- బూయి (యోని) కి సంబంధించినది;
బూతి మాట, bUti mATa
- n.
-- స్త్రీగుహ్యమునకు సంబంధించిన శబ్దము;
బూతు
- n.
-- స్తోత్రపాఠకుఁడు; భట్రాజు; మాగధుడు; వంది; వర్ణకుడు; స్తుతిపాఠకుడు; స్తుతివ్రతుడు; స్వస్తికారుడు;
బూరగడ్డి, bUragaDDi
-n.
--[bot.] Ambrosinia unilocularis;
బూరా, bUrA
-n.
--toot; horn; trumpet; bugle;
బూరిచెట్టు, bUriceTTu
-n.
--[bot.] ''Ehretia buxifolia'';
బూరిజ, bUrija
-n.
--[bot.] ''Hymenodictyon excelsum'';
బూరుగు చెట్టు, bUrugu ceTTu
-n.
--silk cotton tree; kapok; [bot.] ''Bombax ceiba; Bombax malabaricum; Eriodendron anfractuosum; Ceiba pentandra; Cochlospermum gillivraei;''
బూరుగు దూది, bUrugu dUdi
-n.
--(1) silk cotton; an inferior variety of kapok; cotton-like material inside the fruits of Bombax ceiba; or Ciba pentandra;
--(2) kapok; Cochlospermum gillivraei;
బూర్జువా, bUrjuvA
-n.
--bourgeois; a person of middle class mentality;
బూసరకాయ, bUsarakAya
-n.
--Brazil cherry; [bot.] ''Physalis peruviana'';
బూసి, bUsi
-n.
--[bot.] Vitex abborea;
బృందం, bRMdaM
-n.
--group; same as వృందం;
బృంద, bRMda
-n.
--the sacred basil plant;
-- తులసి;
బృందగానం, bRMdagAnaM
-n.
--chorus; a song sung by several people;
బృహత్, bRhat
-adj.
--big; jumbo; large; mega;
బృహత్ తార, bRhat tAra
-n.
--(1) mega star;
--(2) a cinema star commanding great popularity;
--(3) large stellar object, much bigger than the Sun.
బృహద్ధమని, bRhaddhamani
-n.
--[anat.] aorta; main vessel carrying blood out of the heart;
బృహస్పతి, bRhaspati
-n.
--[astron.] the planet Jupiter; గురుడు;
బెంగ, beMga
-n.
--worrying; pining; yearning; anxiety;
[[File:Chayote_BNC.jpg|right|thumb|బెంగుళూరు వంకాయ]]
బెంగుళూరు వంకాయ, beMguLUrU vaMkAya
-n.
--chayote squash;
బెంగుళూరు మిరప, beMguLUrU mirapa
-n.
--capsicum;
--బుట్ట మిరప; బొండు మిరప;
బెండకాయ, beMDakAya
-n.
--okra; gumbo; lady's finger; [bot.] ''Hibiscus longifolius; Hibiscus esculentus; Abelmoschus esculentus'' of the Malvaceae family;
--- [note]. In Greek "moschos" means fragrance and Abel refers to Dr. Clarke Abel (1780-1826), physician of Lord Amherst, Governor General of India. The phrase "esculentus" tells that this is edible. Thus the scientific name means Abel's fragrant edible.
--- also known as ఎద్దునాలుక చెట్టు;
---కస్తూరి బెండ;
--- [Sans.] భేండా, భేండీ; భిండక; భిణాదక;
బెండు, beMDu
-n.
--cork; pith; [bot.] ''Aeschynomene indica; Aeschynomene aspera'';
---జీలుగుబెండు = cork made out of pith.
బెండుచాప, beMDucApa
-n.
--[chem.] linoleum; a plastic sheet used to cover floors;
బెందడి, beMdaDi
-n.
--soft mud; (esp.) mud used as a cement in building construction;
బెకబెక, bekabeka
-adj.
--onomatopoeia for the croaking of frogs;
బెగటికంద, begaTikaMda
-n.
--[bot.] ''Amberboa indica'';
బెజ్జం, bejjaM
-n.
--hole; orifice; aperture; perforation; puncture;
బెట్టిదం, beTTidaM
-n.
--harshness; cruelty;
బెట్టు, beTTu
-adj.
--uppity; a shortened form of బెట్టిదం;
బెడలిక, beDalika
-n.
--[bot.] ''Griffithia fragrans'';
బెణుకు, beNuku
-n.
--sprain; muscle sprain;
బెడద మొక్కలు, beDada mokkalu
- n. ph.
-- invasive plants;
బెడిసికొట్టు, beDisikoTTu
-v. i.
--backfire;
బెత్తం, bettaM
-n.
--rattan; [bot.] ''Calamus Rotang''; cane; stick; thin bamboo rod;
-- (rel.) లాఠీ = a thick wooden rod with a metal tip;
---బెత్తాన్ని బొత్తిగా వాడకపోతే పిల్లాడు పూర్తిగా పాడయిపోతాడు = spare the rod and spoil the child.
బెత్త, betta
-n.
--a measure of length equal to the width of 4 fingers; 3 అంగుళాలు; 7.62 సెంటీమీటర్లు; same as బెత్తెడు;
-- see also జాన, మూర;
బెబ్బులి, bebbuli
-n.
--tiger;
బెరడు, beraDu
-n.
--bark; dry surface layer of a tree trunk;
బెర్తు, bertu
-n.
--(1) berth; a full-length bench for sleeping in a railway compartment;
--(2) mooring place for a ship in a harbor;
బెల్లం, bellaM
-n.
--(1)jaggery; dark, crude, raw sugar;
--(2) penis; membrum virile, as applied to children only;
---చెరకుబెల్లం = jaggery; made from the juice of sugar cane.
---తాటిబెల్లం = gur; made from the juice of East Indian palm tree fruits; గుడం.
బెల్లమాకు, bellamAku
-n.
--a native of S. America and naturalized to India; fresh leaves are chewed to relieve toothache; crushed leaves stop bleeding; [bot.] ''Tridax procumbens'' Linn.;
బెల్లించు, belliMcu
-n.
--coax; cajole; wheedle;
బ్రెయిల్, breyil
-n.
--Braille; a script of raised dots on paper to help blind people read; named after Louis Braille, its inventor;
బేక్టీరియాబక్షిణి, bEkTIriyAbakshiNi
-n.
--[biol.] bacteriophage;
బేజరూరు, bEjarUru
-adj.
--not urgent; not essential;
బేజారు, bEjAru
-adj.
--displeasure; annoyance; scary;
బేడతీగ, bEDatIga
-n.
--[bot.] Ipomaea pescaprae;
బేడలు, bEDalu
-n. pl.
--dal; split cereals such as split peas and other leguminous cerelas;
బేడా, bEDA
-n.
--bedroll; bedding;
బేడీలు, bEDIlu
-n.
--handcuffs; cuffs; shackles;
బేమరమ్మత్తు, bEmarammattu
-n.
--disrepair; out of repair; damaged;
బేరం, bEraM
-n.
--(1) bargain; deal;
--(2) business; trade;
బేరసారాలు, bErasArAlu
-n. pl.
--negotiations; dealings; transactions
బేరిపండు, bEripaMDu
-n.
-- klip dagga; Christmas candlestick; lion's ear; [bot.] ''Phlomis nepetifolia; Leonotis nepetifolia'';
బేరీజు, bErIju
-n.
--tally;
---లాభనష్టములు బేరీజు వేసికో = tally the profits and losses.
బేవార్సు, bEvArsu
-n.
--unclaimed; in the absence of the owner; free;
-- ఊరికినే, పనీపాటా లేకుండా తిరిగే; బాదరబందీ లేకుండా;
--(ety.) బే అనేది పర్షియన్ లో "లేని, లేమి, కాని" వంటి అర్థాలలో వాడతారు. వారిస్ అనేది అరబిక్ లో వారసుడు. "బే- వారీస్" అంటే పిల్లలు లేని వాడు అని అర్థం.
బేషరుతుగా, bEsharatugA
-adv.
--unconditionally;
బేసబబు, bEsababu
-adj.
--unreasonable; improper; not right;
బేసి, bEsi
-n.
--odd; (ant.) సరి;
బేస్తు, bEstu
-n.
-- marginal victory in a card game;
--కుందేలు = less than marginal victory in a card game;
--ఆట = more than marginal victory in a card game;
బైట, baiTa
-n.
--outside;
బైతు, baiTu
-n.
--country bumpkin;
బైరాగి, bairAgi
-n.
--hermit; religious mendicant; altered form of విరాగి;
బైలు, bailu
-n.
--an open field;
బైలుదేరు,
-v. i.
--start; begin a journey;
బైలుపరచు, bailuparacu
-v. t.
--expose;
%బొం - boM, బొ - bo, బో - bO, బౌ - bau
బొంకు, boMku
-n.
--lie; fib; untrue;
బొంగరం, boMgaraM
-n.
--top; a spinning toy; a gyrator;
బొంగు, boMgu
-adj.
--hollow;
- n.
-- hollow bamboo; [bot.] Bambusa arundinaceae
బొంగు బిర్యానీ, boMgu biryAnI
-n.
--Biryani cooked in the hollow of a bamboo;
-- బొంగు వెదురు; ముళ్ళ వెదురు; పెంటి వెదురు;
బొంగురు, boMguru
-adj.
--hoarse; (ant.) కీచు;
బొండుమల్లె, boMDumalle
-n.
-- Arabian Jasmine; [bot.] ''Jasminum sambac'';
-- బొడ్డుమల్లె;
బొంత, boMta
-n.
--quilt;
బొంతకాకి, boMtakAki
- n.
-- a large black forest crow; కాకోలం;
బొంతచామలు, boMtacAmalu
-n.
--[bot.] ''Populismus frumentacea'';
బొంతజెముడు, boMtajemuDu
-n.
-- antique spurge; a large, bushy shrub; [bot.] ''Euphorbia antiquorum'';
బొంతటేకు, boMtEku
-n.
-- Kath Sagon; Desi Sagon; Karen Wood Tree; [bot.] ''Haplophragma adenophyllum'' of the Bignoniaceae family; ''Bignonia adenophylla'';
బొంద, boMda
-n.
-- (1) hole; hole in the ground; pit; grave;
-- (2) channel for water;
-- (3) small palm or date tree;
-- This word is often used as a rebuke, but it is not recommended because it refers to the act of burying the dead;
బొంది, boMdi
-n.
--physical body; mortal coil;
బొందు, boMdu
- n.
-- a thin strap or cord, usually made of folded cloth, used to tie and support a garment around the waist; a skein, a bundle of fibres or thread;
బొంబాయి, boMbAyi
-n.
--(1) faucet; tap; water tube;
--(2) hand pump to pull any liquid from a barrel, especially kerosine;;
--(3) Telugu name for the city of Bombay;
బొక్క, bokka
-n.
--(1) hole;
--(2) jail;
--(3) loss in a business transaction;
బొక్కసం, bokkasaM
-n.
--treasury;
బొక్కు, bokku
-v. i.
--gobble up; eat greedily with a mouthful;
బొక్కుడు, bokkuDu
-n.
--brahmi; Indian pennywort; Asiatic pennywort; [bot.] ''Hydrocotyle asiatica'';
బొక్కెన, bokkena
-n.
--(1) bucket;
--(2) [bot.] ''Zapania nodiflora'';
బొగడ, bogaDa
-n.
-- a flowering tree widely found in India; [bot.] ''Mimusops elengi;''
-- చిరు తీపి, ఎక్కువ వగరు వుండే బొగడ పండ్లు నోటి ఆరోగ్యానికి, ముఖ్యంగా చిగుళ్ళకు చాలా మంచివి. ఈ చెట్టు పుల్లలను వేప పుల్లలలాగే పళ్ళు తోముకోడానికి వాడవచ్చు - నోటి దుర్వాసన పోవడం, చిగుళ్ళ ఆరోగ్యం పెరగడం జరుగుతుంది;
బొగడబంతి, bogaDabaMti
-n.
-- gomphrena; [bot.] ''Gomphernia globosa;''
-- బొగడబంతి మొక్కకు పువ్వులే వుంటాయి. ఇది అందానికి ఆహ్లాదానికి పెంచుకొనే మొక్క. చెట్టు కాదు. కాయలు కాయవు. Globe amaranth అని పిలువబడే ఈ మొక్క తోటకూర జాతికి చెందిన మొక్క. ఇది అమెరికా నుండి మన దేశం వచ్చిందట. దీనికి కూడా ఆరోగ్యపరమైన ఉపయోగాలున్నాయని అమెరికా వారే చెప్పారు.
బొగ్గు,
-n.
--(1) charcoal;
--(2) coal; (rel.) రాక్షసి బొగ్గు;
బొగ్గుపులుసు గాలి, boggupulusu gAli
-n.
--carbon dioxide;
బొచ్చు, boccu
-n.
--fur; wool; hair;
బొచ్చె, bocce
-n.
--(1) Katla; Catla; a fish of the Cyprinidae family; [bio.] ''Catla catla'';
--(2) a pot or cooking vessel; shards of a pot;
-- బోలె, బొచ్చె పదాలు కుండ, కుండ పగులగా మిగిలిన ముక్కను సూచిస్తాయి.
బొజ్జ, bojja
-n.
--(1) belly; tummy;
--(2) potbelly;
-- బొర్ర;
బొటబొట, boTaboTa
-adj.
--onomatopoeia for trickling or dripping flow;
---రక్తం బొటబొట కారింది = the blood trickled.
---కన్నీరు బొటబొట కారింది = the tears trickled.
బొటనవేలు, boTanavElu
-n.
--(1) thumb;
--(2) big toe;
బొట్టకడపచెట్టు, boTTakaDapaceTTu
-n.
--[bot.] ''Nauclea parvifolia''; ''Mitragyna parvifolia'' of the Rubiaceae family;
-- Its leaves alleviate pain and swelling, and are used for better healing from wounds and ulcers. Its stem bark is used in treatment of biliousness and muscular pains;
బొట్టు, boTTu
-n.
--(1) the dot on the forehead of Hindus;
--(2) drop;
బొటాబొటి, boTAboTI
-adj.
--marginal; barely sufficient; approximate;
బొట్టె, boTTe
-n.
--child;
బొడ్డ, boDDa
-n.
--[bot.] ''Ficus glomerata'';
బొడ్డ చెట్టు, boDDa ceTTu
-n.
--[bot.] ''Ficus asperima'';
-- కరక బొడ్డ; [Sans.] ఖరపత్ర;.
బొడిపె, boDipe
-n.
--bud-like projection on the skin or tongue;
బొడ్డు, boDDu
-n.
--navel; umbilicus;
బొడ్డు తాడు, boDDu tADu
-n.
--umbilical cord;
బొడ్డు నారింజ, boDDu nAriMja
-n.
--navel orange; a sweet, seedless orange with a structure resembling a navel;
బొడ్డుమల్లె, boDDu malle
-n.
--double jasmine; Arabian jasmine; [bot.] ''Jasminum sambac''; same as బొంతమల్లె;
బొడ్డూడనివాడు, boDDUDanivADu
-n.
--[idiom] infant; kid; child, any person who acts like a child; (lit.) a person whose umbilical cord has not yet dropped;
బొత్తాం, bottAM
-n.
--button;
బొత్తిగా, bottigA
-adv.
--entirely, absolutely;
బొద్దింక, boddiMka
-n.
--roach; cockroach; [bio.] ''Blatta orientalis''; ''Blatta Americana'';
-- an insect belonging to the order Orthoptera; తిన్నని రెక్కలు గల కీటకం;
బొద్ది, boddi
-n.
--[bot.] ''Macaranga roxburghii''; ''Macaranga peltata'' of the Euphorbiaceae family;
-- the major use of Macaranga peltata is for making wooden pencils and in the plywood industry
బొద్దికూర, boddikUra
-n.
-- [bot.] ''Portulaca tuberosa'' Roxb.;
-- a famine food; roots eaten raw;
బొద్దు, boddu
-adj.
--(1) chubby; plump; fat; stout;
--(2) sturdy;
--(3) thick;
--(4) block as in "block lettering"
బొప్పాయి, బొబ్బాసి, boppAyi, bobbAsi
-n.
--papaya; [bot.] ''Carica papaya'' of the Caricaceae family; this S. American plant was brought to India in the seventeenth century;
--కొండ బొప్పాయి = [bot.] ''Carica pubescens''; grows in the Nilgiris;
బొప్పి, boppi
-n.
--bump; contusion; swelling;
బొబ్బ, bobba
-n.
--(1) yell; scream; roar; loud cry;
--(2) blister; bulla;
--(3) child language for water;
బొబ్బతెగులు, bobbategulu
-n.
--tobacco mosaic disease;
బొబ్బర్లు, bobbarlu
-n. pl.
--(1) Catjang cowpeas; Hindu cowpeas; [bot.] ''Vigna unguiculata'' of the Fabaceae family; ''Vigna catjang'';
--(2) black beans; [bot.] ''Dolichos sinensis''; ''Dolichos catiang'' Rox
--(3) Yardlong Beans; Asparagus beans; [bot.] ''Vigna sinensis'';
--అలసందలు; దంటుపెసలు; [Sans.] దీర్ఘబీజ;
బొమ్మ, bomma
-n.
--(1) figure; diagram; image;
--(2) doll;
--(3) head of a coin;
--(4) toy;
బొమ్మకట్టుడు, bommakaTTuDu
-n.
--imagery; a style of writing in which images are created by the power of words;
బొమ్మ మర్రి, bomma marri
-n.
--[bot.] Focus cunia;
బొమ్మా బొరుసు, bomma borusu
-ph.
--head and tail of a coin;
బొమ్మజెముడు, bommajemuDu
-n.
--prickly pear; cactus;
బొమ్మపాపట, bommapApaTa
-n.
--[bot.] stylocorine webera;
బొమ్మమేడి, bommamEDi
-n.
--[bot.] ''Ficus oppositifolia'';
బొమ్మరిల్లు, bommarillu
-n.
--doll-house;
బొమ్మసున్నం, bommasunnaM %e2t
-n.
--plaster of Paris; CaSO<sub>4</sub>;
బొమ్మిటిక, bommiTika
-n.
--toy-brick;
బొర్ర, borra
-n.
--(1) belly; tummy;
--(2) potbelly;
-- బొజ్జ;
బొరియ, boriya
-n.
--burrow; pit; a hole in the ground usually made by an animal;
బొరిగె, borige
-n.
--a small hand-held tool to scrape grass; a small hoe;
బొరుగులు, borugulu
-n. pl.
--(1) fried grain or pulses, often eaten as a snack;
--(2) puffed rice;
బొరుసు, borusu
-n.
--tail side of a coin;
బొల్లి, bolli
-n.
--(1) vitiligo; leukodermia; a disease with white patches on the skin;
--(2) lie; fib;
---కల్లబొల్లి కబుర్లు = lies and tall tales.
బోగన్ విల్లీ, bOgan^villi
-n.
--[bot.] Bougainvillea spectabilis;
బోగీ, bOgI
-n.
--bogie; a rail car;
బోడంట, bODaMTa
-n.
--Mountain ebony; [bot.] Bauhinia variegata of the Fabaceae family;
-- a flowering plant found in China and India;
బోడతరం, bODataraM
-n.
--[bot.] ''Sphaeranthus hirtus'';
బోడమామిడి, bODamAmiDi
-n.
-- cluster fig; udumbara tree; [bot.] ''Ficus glomerata'';
-- According to the Shatapatha Brahmana, the Audumbara tree was created from the force of Indra; From his hair his thought flowed, and became millet; from his skin his honour flowed, and became the aśvattha tree (ficus religiosa); from his flesh his force flowed, and became the udumbara tree (ficus glomerata); from his bones his sweet drink flowed, and became the nyagrodha tree (ficus indica); from his marrow his drink, the Soma juice, flowed, and became rice: in this way his energies, or vital powers, went from him;
బోడి, bODi
-adj.
--(1) barren; empty;
--(2) hairless; esp. when the hair is shaven off rather than bald;
---బోడిగుండు = hairless scalp; clean-shaven head.
---బోడిపలక = slate without a frame.
---బోడిమెట్ట = treeless hillock.
---బోడికబురు = empty message.
బోడిగ చెట్టు, bODiga ceTTu
- n.
-- Large-leaf beauty berry; [bot.] ''Callicarpa tomentosa;'' A medicinal, evergreen shrub used in Ayurveda for medicinal pastes in treating wounds.
-- The leaves are velvety, and when dipped in oil, they burn like a wick, popular in South Indian traditions.
-- పాండవ బత్తి; [Sans.] ప్రియంగు;
బోణీ, bONI
-n.
--first transaction in a day's business;
బోదకాలు, bOdakAlu
-n.
--filarial leg; filariasis; elephantiasis; a parasitic disease endemic to eastern part of India;
బోదె, bode
-n.
--stem; particularly stem of a plant like banana plant;
బోధ, bOdha
-n.
--teaching; indoctrination;
బోధపడు, bOdhapaDu
-n.
--understand; comprehend;
బోధించు, bOdhiMcu
-v. t.
--teach; indoctrinate;
బోధిసత్వుడు, bOdhisatvuDu
- n.
-- బోధ సత్తు గా కలవాడు బోధిసత్వుడు. కష్టసుఖాలకి, జీవన్మరణాలకి గల కారణం బోధపడినవాడు. సృష్టి రహస్యం తెలిసినవాడు. జీవిత పరమార్థం గ్రహించిన వాడు. జీవాత్మ, పరమాత్మ ఒకటే అని అనుభవైకవేద్యంగా జీర్ణించుకున్న వాడు. తనలో ఇతరులని, ఇతరులలో తనని చూసుకోగలిగినవాడు. పరమపదం చేరిన వాడు బుద్ధుడు. పరమపదం ద్వారానికి చేరుకుని, తాళంచెవి చేతిలో ఉన్నా తాళం తీయటానికి సమయం కావాలి అని నిర్ణయించుకుని సహానుభూతితో తోటి ప్రయాణీకుల కోసం వేచి ఉన్న వ్యక్తి బోధిసత్వుడు.
-- బోధిసత్వుని స్త్రీభాగం డాకిని. తార. డాకిని శక్తి స్వరూపిణి. ఆకాశ రూపిణి. ఊర్ధ్వ సంచారిణి. బోధిసత్వునికి బుద్ధత్వానికి గల అంతరం. బోధిసత్వుని బుద్ధుడికి చేర్చడానికి ఏకైక సాధనం.
బోను, bOnu
-n.
--(1) cage; especially, animal cage;
--(2) trap; snare;
--(3) witness stand;
బోయ్‍కాట్, bOykAT^
-n.
--boycott; to collectively refrain from buying a product or using a service as an act of protest; named after Capt. Charles C. Boycott;
బోయా, bOyA
-n.
--buoy; a floating ball or drum used as a marker in harbors and waterways;
బోర, bOra
-n.
--chest; thorax;
---బోర విరుచుకుని నడుస్తున్నాడు = he is proud and arrogant; (lit.) he is walking with an uplifted chest.
బోర్లా, bOrIA
-adj.
--prone; up-side down; topsy-turvey; face downward;
బోర్లాపడు, bOrlApaDu
-v. i.
--fall face down; capsize;
బోరు, bOru
-n.
--bore; tedium;
బోరుకొట్టు, bOrukoTTu
-v. i.
--to be boring;
బోల్తాపడు, bOltApaDu
-v. i.
--fall prey to; get cheated;
బోర్లించు, bOrliMcu
-v. t.
--invert; put face down; put a vessel or a dish face down;
బోలు, bOlu
-adj.
--hollow;
బోసి, bOsi
-adj.
--(1)naked; blank; empty;
--(2) toothless;
---బోసి మెడ = a neck without any ornament.
---బోసి మొహం = blank face.
---బోసి నోరు = mouth without teeth.
బౌల్య సమీకరణం, baulya samIkaraNaM
-n.
--Boolean equation;
</poem>
==Part 3: భం - bhaM, భ - bha, భ్ర - bhra==
<poem>
భంగం, bhaMgaM
-n.
--(1) breakage; disruption;
--(2) interruption;
---అస్థి భంగం = breaking of the bones
---శృంగ భంగం = removing the horns; [idiom] to cut one down to size;
భంగకర, bhaMgakara
-adj.
--disruptive;
భంగపడు, bhaMgapaDu
-v. i.
--(1) to be broken; to be shattered; (2) to be disappointed;
భంగపాటు, bhaMgapATu
-n.
--failure; defeat; disappointment; frustration;
భంగిమ, bhaMgima
-n.
--pose; posture; manner;
భంగురం, bhaMguraM
-n.
--transient; changeable; fleeting;
భంజకం, bhaMjakaM
-n.
--breaker; destroyer;
భంజనం, bhaMjanaM
-n.
--breaking; destroying;
భండారం, bhaMDAraM
-n.
--(1) treasury;
--(2) collection;
--(3) store room;
భక్తి, bhakti
-n.
--devotion; attachment; reverence;
భక్తుడు, bhaktuDu
-n.
--devotee; fan;
భక్షక కణాలు, bhakshaka kaNAlu
-n. pl.
--phagocytes;
భక్షణ, bhakshaNa
-n.
--eating;
భక్ష్యాలు, bhakshyAlu
-n.
--food prepared for events;
భక్షించు, bhakshiMcu
-v. t.
--eat;
భగం, bhagaM
-n.
--vagina;
భగందరం, bhagaMdharaM
-n.
--fistula;
భగ, bhaga
-n.
-- Fire;
భగభగ, bhagabhaga
-n.
--onomatopoeia for the sound of flames, for a burning sensation, or for expressing blazing anger; can be used for a burning sensation as well as the burning of an object;
భగవంతుడు, bhagavaMtuDu
-n. m.
--God; Almighty; one who is surrounded by fire; 'భగ' మును ఆవరించి / ఆవహించి ఉన్నవాడు/ఉన్నది;
భగవతి, bhagavati
-n.f.
-goddess;
భగ్నం, bhagnaM
-adj.
--broken; shattered;
భగీరథ ప్రయత్నం, bhagiratha prayatnaM
-ph.
--Herculian task; monumental task;
బాగోణి, bhagONi
- n.
-- a shallow, wide-mouthed vessel used in cooking;
-- మూతి వెడల్పుగా, లోతు తక్కువగా ఉండు మట్టి పాత్ర.
భజంత్రీలు, bhajaMtrIlu
-n. pl.
--musicians who play bands, esp. while referring to bands at wedding ceremonies and processions;
-- భాజా భజంత్రీలు = musical instruments and players;
భట్టారకుడు, bhaTTArakuDu
-n.
--scholar; a scholar who is also a poet;
-- విద్వాంసుడు కవి కూడా అయితే అతడు ‘భట్ట’ లేక ‘భట్టు’ లేక ‘భట్టారకుడు’ అనబడతాడు. కేవలం పాండిత్యమే కాక చక్కగా కవిత్వం చెప్పగలిగే భావనా చాతుర్యం కలవాడు భట్టు. ఉదా: (1) నన్నయ భట్టు, (2) కుమారిల భట్టు జైమిని ‘మీమాంస సూత్రాల’కు భాష్యకారునిగా ప్రసిద్ధి పొందాడు, (3) ప్రత్యక్ష, ఆనుమాన, ఉపమాన, శబ్ద పరిచ్ఛేదాలతో జ్ఞాన సముపార్జనా మార్గాలైన ప్రమాణాలను (valid sources of knowledge) అందరికీ అర్ధమయ్యే సులభ శైలిలో వివరిస్తూ ‘తర్క సంగ్రహ’ పేరిట గౌతముని న్యాయ సూత్రాలను వ్యాఖ్యానించిన తర్క శాస్త్ర పండితుడు వారణాసి అన్నంభట్టు;
భడవా, bhaDavA
-inter.
-- a term of endearment widely used in coastal Andhra while reprimanding young boys;
-- [Hindi] "bhad" means a pimp, a broker for call girls;
-- ఇతర భారతీయ భాషలలో ఇది బూతు పదం; సరి అయిన అర్థం తెలియక కోస్తా ఆంధ్రలో దీనిని ముద్దు పేరుగా వాడెస్తూ ఉంటారు;
భత్యం, bhatyaM
-n.
--allowance; stipend;
---కరువు భత్యం = dearness allowance.
భద్రంగా, bhadraMgA
-adv.
--safely;
భద్రత, bhadrata
-n.
--security; safety;
భద్రతా సంఘం, bhadratA saMghaM
-n.
--Security Council of the United Nations;
భద్రతుంగ, bhadratuMga
-n.
--coco-grass; Java gras;, nut grass; purple nutsedge; red nutsedge; [bot.] ''Cyperus rotundus'' of the Cyperaceae family;
-- The plant is mentioned in the ancient Charaka Samhita (circa 100 AD). Modern Ayurvedic medicine uses the plant, known as musta (in musta moola churna), for fevers, digestive disorders, dysmenorrhea, and other maladies;
[File:Gul-Abas-4-O%27clock_plant.JPG|right|thumb|Mirabilis jalapa=భద్రాక్షి]]
భద్రాక్షి, bhadrAkshi
-n.
--four o'clock flower; [bot.] ''Mirabilis jalapa'' of the Nyctaginaceae family;
-- Mirabilis in Latin means wonderful and Jalapa (or Xalapa) is the state capital of Veracruz in México.
భయంకరమైన, bhayaMkaramaina
-adj.
--scary; grisly;
భయం, bhayaM
-n.
--fear; trepidation; terror; phobia;
భయకంపితం, bhayakaMpitaM
-n.
--shudder;
భయపడు, bhayapaDu
-v. i.
--dread; fear; be afraid;
భయపెట్టు, bhayapeTTu
-v. t.
--scare; intimidate;
భయస్తుడు, bhayastuDu
-n. m.
--timid person;
భయాందోళన, bhayAMdOLana
-n.
--panic; % to e2t
భయానక, bhayAnaka
-adj.
--frightening; horrible;
భరణం, bharaNaM
-n.
--(1) compensation;
--(2) alimony;
భరణి, bharaNi
-n.
--(1) the star, 35 Arietis; Musca; Yoga tara of the second lunar mansion;
--(2) The second of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
భరతవాక్యం, bharatavAkyaM
-n.
--epilog; epilogue;
భరద్వాజపక్షి, bharadvAja pakshi
-n.
--King-crow; Drongo-shrike; a bird commonly seen on the backs of cattle;
-- ఎట్రిత; పశులపోలిగాడు; నల్లంచి పిట్ట;
భర్త, bharta
-n.
--husband.
భరించు, bhariMcu
-v. t.
--tolerate; support; bear; endure; sustain;
---భరించువాడు భర్త = the one who supports is the husband.
భరిణె, bhariNe
-n.
--a small box; pill-box;
భరిత, bharita adjvl.
-suff.
--full of; filled with;
భర్తీ చేయు, bhartI cEyu
-v. t.
--fill; fill up;
భరోసా, bharOsA
-n.
--assurance; guarantee; trust;
భల్లాటకం, bhallATakaM
-n.
--marking nut tree; [bot.] ''Semecarpus anacardium'';
-- నల్లజీడి;
భవం, bhavaM
-n.
-- birth; rebirth;
-- పుట్టుక; జన్మ; పునర్జన్మ; కుమార సంభవం = the birth of Kumara;
భవసాగరం, bhavasaagaraM
- n.
-- this cycle of life and death punctuated by pleasures and hardships;
-- సంసారం అనే సముద్రం; కష్ట సుఖాలతో నిండింది జీవితం; ఈ చావు పుట్టుకల క్రమం అనంతం, సముద్రం అంత;
భవనం, bhavanaM
-n.
--mansion; big building; manor;
భవదీయుడు, bhavdIyuDu
-n. m.
--yours; used in closing a letter;
భవము, bhavamu
- n.
-- birth; birth and death;
భవసాగరము, bhavasaagaramu
- n.
-- the ocean of birth; the ocean of birth and death; the cycle of birth and death;
భవిష్యత్ కాలం, bhavishyat kAlaM
-n.
--(1) [gram.] future tense;
--(2) future;
భవిష్యత్తు, bhavishyattu
-n.
--future;
భస్మం. bhasmaM
- n.
-- Ashes; calx;
-- బూడిద; బుగ్గి; బూతి; బూది; విబూది;
--- తామ్రభస్మము = calx of copper;
--- సువర్ణ భస్మం" (బంగారు బుగ్గి), "మౌక్తిక భస్మం" (ముత్యాల బుగ్గి), "హీరక భస్మం" (వజ్రాల బుగ్గి) ఆయుర్వేద, యునాని ఔషధాలలో కూడా వాడేవారు.
భస్మీకరణం, bhasmIkaraNaM
-n.
--(1) incineration;
--(2) calcination;
భృంగామలక తైలం, bhRMgAmalaka tailaM
- n. ph.
-- An Ayurvedic hair oil made from boiling coconut oil with "bhRMga" (గుంటగలగరాకు) (''Eclipta alba'') and "amla" (ఉసిరి) (''Emblica myrobalan'');
భ్రంశం, bhraMSaM
-n.
--movement; prolapse; sliding;
---స్థానభ్రంశం = displacement.
---గుదభ్రంశం = prolapse of the anus.
భ్రమ, bhrama
-n.
--illusion; delusion;
-- (ant.) ప్రమ = true knowledge; యథార్థజ్ఞానము;
భ్రమకం, bhramakaM
-n.
-- palindrome; any word or phrase that reads the same both forward and backward. "Able was I ere I saw Elba" is a well-known palindromic sentence. "Malayalam" is English's longest known palindromic word (though a proper noun). There are palindromic poems in Telugu.
-- same as కచికపదం;
భ్రమణం, bhramaNaM
-n.
--whirling; turning; going around; revolution;
భ్రమరం, bhramaraM
-n.
--bee;
-- తుమ్మెద; సారంగము; చంచరీకము; కందిరీగ;
-- భ్రమరకీటక న్యాయం. ఆకుపురుగు (కేటర్ పిల్లర్) శరీరంలో తన గుడ్లను పెట్టి తుమ్మెదో (కందిరీగో) మట్టితో దాన్ని మూసేస్తుంది. నాలుగు వారాల్లో ఆకుపురుగు దేహంలో కందిరీగ పెట్టిన గుడ్లు పిల్లలై ఆకుపురుగు దేహాన్నే ఆహారంగా భుజించి ప్యుపా దశకు చేరి అందమైన భ్రమరాలుగా, (కందిరీగలుగా) మట్టిని తొలుచుకొని వెలుపలికి వస్తాయి. ఆకుపురుగు తుమ్మెదగా మారుతోందని భ్రమపడ్డారు. ఇది కేవలం కవిసమయం;
భ్రష్టం, bhrashTaM
-n.
--one that has fallen;
భ్రష్టుడు, bhrashTuDu
-n. m.
--one who has fallen in stature or social values;
==Part 3: భాం - bhAM, భా - bhA==
భాండం, bhAMDaM
-n.
--pot; vessel;
భాండాగారం, bhAMDAgAraM
-n.
--a storehouse; repository; archive; depository;
భాగం, bhAgaM
-n.
--share; part; portion; quarter; side;
భాగస్వామి, bhAgasvAmi
-n.
--shareholder; partner; participant; భాగస్తుడు;
భాగలబ్దం, bhAgalabdaM
-n.
--[math.] quotient;
భాగ్యం, bhAgyaM
-n.
--fortune; (ant.) నిర్భాగ్యం;
భాగ్యవంతుడు, bhAgyavaMtuDu
-n. m.
--wealthy person;
భాగ్యవతి, bhAgyavati
-n. f.
--wealthy person;
భాగారం, bhAgAraM
-n.
--[math.] division;
భాగినేయి, bhAginEyi
-n.
-- sister's daughter;
భాగినేయుడు, bhAginEyi
-n.
-- sister's son;
భాగోతం, bhAgOtaM
-n.
--(1) a dance drama;
--(2) farce;
---వీధి భాగోతం = a dance drama performed at the street corner;
భాజకం, bhAjakaM
-n.
--[math.] divisor;
భానువారం, bhAnuvAraM
-n.
--Sunday;
భారం, bhAraM
-n.
--(1) [phy.] mass;
--(2) weight;
--(3) burden; responsibility;
భారగతి, bhAragati
-n.
--[phy.] momentum; mass times the velocity of an object; % to e2t
భారతీయ, bhAratIya
-adj.
--Indian;
భారమితి, bhAramiti
-n.
--barometer; an instrument to measure the weight of air and therefore the pressure of the atmosphere;
భార్య, bhArya
-n.
--wife;
భార్యాభర్తలు, bhAryAbhartalu
-n. pl.
--wife and husband; couple;
భారీ, bhArI
-adj.
--massive; heavy-duty; large-scale;
---భారీ పరిశ్రమలు = heavy industry.
భారీతనం, bhArItanaM
-n.
--massiveness;
భావం, bhAvaM
-n.
--meaning; concept; opinion; idea; [drama] emotion;
---స్థాయీభావం = dominant emotion.
---సాత్విక భావం = responsive emotion.
---సంచార భావం = transitory emotion.
---భావచౌర్యం = stealing of an idea.
భావంజి, bhAvaMji
-n.
--Babchi; [bot.] ''Psoralea corylifolia'' of the Fabaceae family;
--a plant used in Indian and Chinese traditional medicine for treatment of lichen-induced dermatitis by psoralen extract combined with sunlight exposure;
భావకవిత్వం, bhAvakavitvaM
-n.
-- see భావగీతం;
భావగీతం, bhAvagItaM
-n.
--lyrical poem; romantic poem; imaginative poem;
--- భావకవిత్వ నిర్వచనము Lyrical Poetry;
--- భావకవిత్వంలో శాఖలు - ప్రణయకవిత్వము (Love Poetry), ప్రకృతికవిత్వము (Nature Poetry), భక్తికవిత్వము (Mystic Poetry), దేశభక్తికవిత్వము (Patriotic Poetry), సంఘసంస్కరణ కవిత్వము (Reformative Poetry), స్మృతికావ్యములు (Elegies).
--- భావకవిత్వంలో కవినక్షత్రములు - రాయప్రోలు, విశ్వనాథ, వెంకటపార్వతీశులు, కృష్ణశాస్త్రి, దువ్వూరి, బసవరాజు, నండూరి, వేదుల, నాయని, పింగళి, కాటూరి, జాషువా, తుమ్మల, తల్లావజ్ఝల, బాపిరాజు;
--- భావకవులవలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడాలోయ్ -- ఎవరికీ తెలియని లేదా అర్థంకాని పాటలు రాసేవాళ్లే భావకవులు
భావజాలం, bhAvajAlaM
-n.
--conceptual cluster; a stirring of a thought;
భావమిశ్ర, bhAvamisra
-n.
--Bhava Misra; an eminent Ayurvedic physician of the 16th century; he described the circulation of blood and made many contributions to anatomy and physiology;
భావన, bhAvana
-adj.
--treated; steeped; the steeping process involves immersing the subject substance in a mixture of rock salt and lime juice overnight, drying the subject substance in sunlight, and repeating the whole immersion, drying cycle. Lime juice is added every night to keep the subject substance immersed all through the night;
-- భావన చేయడం అంటే ఆయుర్వేదం ప్రకారం ఏడుసార్లు నిమ్మరసం, సైంధవలవణం లో భావన చేయాలి. ఎండబెట్టడం మరలా రసంలో వేయడం మరలా పక్క రోజు ఎండబెట్టడం ఇలా ఏడు రోజులు చేసాక అల్లం జిలకర్ర ను బాగా ఎండబెట్టి నిలవచేసుకోవాలి.
---భావన అల్లం = ginger steeped in a special solution; శొంఠి.
---భావన కరక్కాయ = aloe steeped in a special solution.
---భావన జీలక్రర = steeped cumin seeds.
-n.
--concept;
భావనాత్మక, bhAvanAtmaka
-adj.
--(1) conceptual; (2) romantic;
భావసంకల్పన, bhAvasaMkalpana
-n.
--concept formation;
భావసేకరణ, bhAvasEkaraNa
-n.
--abstraction;
భావార్థకం, bhaavaarthakaM
- n.
-- [gram.] affirmative; infinitive mood; revealing inherent property;
భావోద్రేకం, bhAvOdrEkaM
- n.
-- emotion;
భావోద్వేగం, bhAvOdvEgaM
- n.
-- emotion;
భావ్యం, bhAvyaM
-n.
--proper; appropriate; fair;
భావి, bhAvi
-n.
--future; prospects;
భాస్వరం, bhAsvaraM
-n.
--the element phosphorous;
భాస్వర చక్కెర, bhasvara cakkera
-n.
--[biochem.] sugar-phosphate;
భాష, bhASha
- n.
-- language;
--- గ్రాంథిక భాష = literary language
--- ప్రామాణిక భాష = standard language
--- భాషులు = people speaking that language
భాష్యం, bhAshyaM
-n.
--annotation; exposition; exegesis; commentary on a written text;
భాషాంతరీకరణం, bhAshAMtarIkaraNaM
-n.
--translation;
భాషాభాగం, bhAshAbhagaM
-n.
--[gram.] part of speech;
భాసం, bhAsaM
-n.
--radiation; brightness; radiance;
భాసబ్బదిలీ, bhAsabbadilI
-n.
--[phy] radiative transfer; % to e2t
బాధ్యత, bhAdyata
-n.
--responsibility;
భ్రాంతి, bhrAMti
-n.
--illusion;
భ్రాత్రియం, bhrAtriyaM
-n.
--brotherhood; fraternity;
భిత్తి, bhitti,
-n.
--wall;
---భిత్తి చిత్రం = wall painting.
---భిత్తి శిలాంచలాలు = strips of sculpture on walls telling a story, somewhat like the modern cartoon strips in newspapers.
---భిత్తి శిల్పాలు = wall scupture; relief sculpture on walls.
భిన్నం, bhinnaM
-n.
--[math.] fraction; a rational number; (2) one that is broken; (3) distinct; separate;
-- భిన్నము అంటే భేదింపబడినది. అంటే పగలగొట్ట బడినది. దుర్భిన్నము అంటే పగలగొట్ట డానికి వీలుకానిది;
భిన్నత్వం, bhinnatvaM
-n.
--diversity;
భిన్నాంకం, bhinnaMkaM
-n.
--[math.] fractional number; rational number;
భిన్నాభిప్రాయం, bhinnAbhiprAyaM
-n.
--dissent; disagreement; different opinion;
భీతి, bhIti
-n.
--fear; scare; phobia;
భీరుడు, bhIruDu
-n. m.
--coward; (ant.) ధీరుడు;
భుక్త, hukta
- n.
-- the eater; the person who enjoys the crops;
భుక్తి, bhukti
-n.
--livelihood;
భుగభుగ, bhugabhuga
-adj.
--onomatopoeia for effervescence;
భుజం, bhujaM
-n.
--(1) shoulder;
--(2) the side of a rectilinear geometrical figure;
భుజంగనాడి, bhujaMganADi
-n.
--the name of a Tamil book in which many predictions about the future can be found;
భుజగం, bhujagaM
-n.
--snake; serpent;
భుజపత్రం, bhujapatraM
-n.
--Himalayan birch; [bot.] ''Betula bhojpatra;''
-- Bhojpatras have been used by priests for over 2100 years for writing mantras and Shlokas. It has been recorded that Raja Vikramaditya used the Bhojpatra for writing Mantras. It was only when the Mughals introduced paper, the use of Bhojpatra became obsolete;
భుజాంతరం, bhujAMtaraM
-n.
--chest; (lit.) the space between the arms;
భుజాస్థి, bhujAsti
-n.
--bone in the arm;
భుజించు, bhujiMcu
-v. t.
--eat;
భూకంపం, bhUkaMpaM
-n.
--earthquake; earth tremor;
భూగర్భం, bhUgarbhaM
-n.
--the interior of the Earth;
భూగర్భజలం, bhUgarbhajalaM
-n.
--groundwater;
భూగోళం, bhUgOLaM
-n.
--(1) the globe;
--(2) the planet Earth; the sphere of Earth;
భూచక్కెరగడ్డ, bhUcakkeragaDDa
- n.
-- (1) Alligator Yam, Milky Yam; [bot.] ''Ipomea digitata;''
-- In India, Alligator Yam is used as a general tonic, to treat diseases of the spleen and liver and prevent fat accumulation in the body.
-- (2) Ram Kandamool; రామకందమూలం; [bot.] ''Maerua oblongifolia;''
-- ఒక పెద్ద దుంగలాంటి చెట్టు కాండాన్ని రామ్ కంద అంటారు. దీన్ని చిరుతిండిగా చాలా ప్రాంతాలలో అమ్ముతారు. ఈ దుంగ మొత్తం కొబ్బరి మొవ్వలా మెత్తగా వుంటుంది. రుచిగా, తియ్యగా కూడా వుంటుంది. రామ్ కంద దుంగను పలుచని పొరలుగా, ముక్కలు కోసి అమ్ముతారు. దీన్ని కంద అని పిలుస్తారు గాని నిజానికి ఇది చెట్టు కాండమే. మన దేశపు అడవుల్లో ఇవి విరివిగా దొరుకుతాయి;
భూతం, bhUtaM
-n.
--(1) demon; ghost; imp; hobgoblin;
--(2) any one of the five elements of the ancient sciences of Hindus;
-- భూతం (Sanskrit) = దయ్యం (Telugu) = ఆత్మ of a dead person; ప్రేతం అన్నా ఆత్మ అనే లెక్క. కానీ సంస్కరించనిది;
-- భూత ప్రేతాలకు యజ్ఞ, యాగాదుల్లో బలి వేస్తారు. ఆ ధర్మ కార్యం లో ఇయ్యబడిన తిండి వాటికి కడుపు నింపుతుంది. ప్రపంచాన్ని పీడించకుండా ఉంటాయి. ఇదే కాక బ్రాహ్మణులు భోజనం తర్వాత వదిలిన ఉత్తర పరిషేచనం, వారు వదిలిన అన్నం కూడా తిని సంతృప్తి చెందుతాయి ట;
-- పూజాది కార్యక్రమాలు చేసేటప్పుడు "ఉత్తిష్ఠ న్తు భూత పిశాచా:" అనే మంత్రం చదువుతాము. వాటిని, మేము పూజ చేసుకుంటాం దయచేసి ఈ జాగా ఖాళీ చేసి వెళ్ళమని విజ్ఞప్తి చేయడం;
భూత, bhUta
-adj.
--(1) the one that comes into being;
--(2) elemental;
--(3) big; huge; demonic;
--(4) past;
--(5) life; living things;
భూతకాలం, bhUtakAlaM
-n.
--[gram.] past tense;
భూతద్దం, bhUtaddaM
-n.
--magnifying glass;
భూతబలి, bhootabali
- n.
-- The sacrificial killing of an animal to please gods;
-- see also బలి;
భూతబ్బల్లులు, bhUtabballulu
-n.
--dinosaurs; (lit.) giant lizards;
-- రాక్షసి బల్లులు;
భూతదయ, bhUtadaya
-n.
--compassion for the living things;
భూతల జలం, bhUtala jalaM
-n.
--[geol.] surface water;
భూతవైద్యం, bhUtavaidyaM
-n.
--exorcism;
భూతాంకుశం, bhUtAMkuSaM
-n.
--croton; [bot.] ''Croton oblongifolius'';
భూతావాసం, bhUtAvAsaM
-n.
--[bot.] ''Terminalia belerica'';
-- The seeds are called "bedda" nuts. In traditional Ayurvedic medicine, Beleric is known as "Bibhitaki." Its fruit is used in the popular Indian herbal Rasayana treatment Triphala.
-- [Sans.] Bibhītaka
భూతి, bhooti
- n.
-- wealth;
-- విభూతి = the superior wealth = శివస్పర్శ పొందినది గాబట్టి అది విశేష శక్తి సమన్వితమై విభూతి ఔతున్నది;
భూతులసి, bhUtulasi
-n.
-- Sweet basil; [bot.] ''Ocimum basilicum'' of the Lamiaceae (mints) family;
భూనభోంతరాళాలు, bhUnabhOMtarALAlu
-n. pl.
--Earth, heaven, and the intervening space;
భూనింబ, bhUniMba
-n.
--creat; chrietta; King of Bitters; [bot.] ''Andrographis paniculata'' of the Acanthaceae family;
-- one of the most popular medicinal plants used traditionally for the treatment of an array of diseases such as cancer, diabetes, high blood pressure, ulcer, leprosy, bronchitis, skin diseases, flatulence, colic, influenza, dysentery, dyspepsia and malaria for centuries;
-- నేలవేము;
భూమధ్యరేఖ, bhUmadhyarEkha
-n.
--equator;
భూమ్యాలకి, bhUmyAlaki
-n.
-- Gale of the wind; stonebreaker; seed-under-leaf; [bot.] ''Phyllanthus niruri'' of the Phyllanthaceae family;
-- the juice of this herb plant is used for the treatment of jaundice, chronic dysentery, dyspepsia, cough, indigestion, diabetes, urinary tract diseases, skin diseases, ulcer, sores and swelling;
-- నేల ఉసిరి;
భూమి, bhUmi
-n.
--(1) ground;
--(2) acreage;
--(3) the planet Earth;
భూమిక, bhUmika
-n.
--(1) role in a drama;
--(2) preface;
భూములు, bhUmulu
-n.
--lands; landed property; estate;
భూయిష్టం, bhUyishTaM
-suff.
--full of; very widespread;
-- బహుళం; విస్తృతం;
---కరుణ భూయిష్టం = full of mercy.
---దోషభూయిష్టం = full of errors.
---పాప భూయిష్టం = full of sins.
భూర్జం, bhUrjaM
-n.
--birch tree; [bot.] ''Betula bhojpatra'';
భూర్జ, bhUrja
-adj.
--related to birch tree;
భూరి, bhUri
-n.
--(1) plenty; generous;
--(2) one followed by 33 zeros in the traditional Indian method of counting;
భూసంధి, bhUsaMdhi
-n.
--isthmus; a land bridge joining two land masses across a sea;
భూస్వామి, bhUsvAmi
-n.
--landlord; (lit.) the lord of the land;
భ్రూణం, bhRUNaM'
- n.
-- fetus;
-- (note) మానవులలో యుగాండం (zygote) అన్న పేరు శిశుసంకల్పన (conception) సమయం నుండి ఐదో వారం వరకు వర్తిస్తుంది. ఐదవ వారం నుండి పదవ వారం వరకు దీనిని పిండం (embryo) అని పిలుస్తారు. పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు భ్రూణం (ఇంగ్లీషులో ఫీటస్, fetus) అంటారు. ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శిశువు (infant) అంటారు - ఇంగ్లీషులో ఇన్^ఫెంట్ అంటే మాటలు రాని పసిబిడ్డ అని అర్థం. మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత బిడ్డ (child) అంటారు. బిడ్డ అనే మాట ఆడ, మగ కి వర్తిస్తుంది.
%భృ - bhR, భే - bhE, భొ - bho, భో - bhO, భౌ - bhau
భృంగప్రియ, bhRMgapriya
-n.
--Jequirity bean; Rosary pea; [bot.] ''Abrus precatorius'' of the Fabaceae family;
--A perennial climbing vine whose small seeds are astonishingly deadly; They contain a toxic protein called abrin that is so poisonous that a single seed can kill you within 36 hours; Abrin has some potential medicinal uses, such as in the treatment to kill cancer cells;
భృంగరాజు, bhRMgarAju
-n.
--a medicinal plant; [bot.] ''Eclipta alba'';
-- గంటగలగరాకు; బృంగరాజ్ ఆకుని కేస్ రాజు అని కూడా పిలుస్తారు. జుట్టుకు కావలసిన ప్రోటీన్లు విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఈ ఆకులో ఉంటాయి;
భృతి, bhRti
-n.
--support; maintenance; salary; wages;
భృత్యుడు, bhRtyuDu
-n.
--servant; slave;
భృహన్నవ్య తార, bhRhannavya tAra
-n.
--[astron.] supernova;
భేటీ, bhETI
-n.
--interview;
భేదం, bhEdaM
-n.
--disparity; separation; division; dissention;
భేదక, bhEdaka
-adj.
--dividing;
భేదకరేఖ, bhEdakarEkha
-n.
--(1) dividing line;
--(2) (ling.) isogloss;
భేది ఉప్పు, bhEdi uppu
-n.
--Epsom salt; magnesium sulfate; Mg<sub>2</sub>SO<sub>4</sub>;
భేషజం, bhEshajaM
-n.
-- (1) medicine; remedy; (2) pretense; humbug;
భైరవాసం, bhairavAsaM %e2t
-n.
--benzene;
భోక్తలు, bhOktalu
-n.
--consumers; (ant.) ఉత్పాదకులు;
భోగట్టా, bhOgaTTA
-n.
--information; news; enquiry;
భోగం, bhOgaM
- n.
-- comfort; wealth; meal;
భోగంమేళం, bhOgaMmELaM
- n.
-- a group dance performed by a clan of prostitutes with indecent language and exposure; it was customary to have such performances at weddings in bygone days;
-- నాచ్ పార్టీ; మేజువాణీ;
భోగట్టా, bhOgaTTA
- n.
-- news about welfare; news;
-- భోగవార్తలు; క్షేమసమాచారాలు;
భోగపరాయణ, bhOgaparAyaNa
- adj.
-- epicurean; Devoted to refined pleasures and the deliberate avoidance of pain or suffering; Relating to enjoyment and gratification, especially through fine food and drink;
భోగభాగ్యాలు, bhOgabhAgyAlu
-n. pl.
--luxuries;
భోగలాలస, bhOgalAlasa
- adj.
-- epicurean; Devoted to refined pleasures and the deliberate avoidance of pain or suffering; Relating to enjoyment and gratification, especially through fine food and drink;
భోజనం, bhOjanaM
-n.
--(1) food;
--(2) meals; సేంద్రియముల ద్వారా గ్రహించునది;
భోజనప్రియుడు, bhOjanapriyuDu
-n.
--gourmand;
భోజ్యాలు, bhOjyAlu
-n.
--routine meals;
భోరున, bhOruna
-adv.
--heavily; greatly;
భౌతిక, bhautika
-adj.
--(1) physical;
--(2) material; materialistic;
భౌతిక దేహం, bhautika dEhaM
-n.
--physical body; physical remains; mortal coil; term used to refer to the dead body of a distinguished person; with ordinary people, it is simply a శవం; also పార్థివ దేహం;
భౌతిక ధర్మం, bhautika dharmaM
-n.
--physical law; physical function;
భౌతిక రసాయనం, bhautika rasAyanaM
-n.
--physical chemistry;
భౌతిక వాది, bhautika vAdi
-n.
--materialist;
భౌతిక శాస్త్రం, bhautika SAstraM
-n.
--physics;
భ్రమ, bhrama
-n.
--illusion; delusion;
భ్రష్టత, bhrashTata
-n.
--degeneration; ruin;
భ్రష్టుడు, bhrashTuDu
-n. m.
--(1) degenerated person; fallen person;
--(2) wretched fellow;
భ్రాంతి, bhraNti
-n.
--illusion; delusion;
భ్రూణం, bhrUNaM
-n.
--embryo; fetus;
</poem>
==Part 4: మం - maM==
<poem>
మంకు, maMku
-adj.
--obstinate; stubborn;
మంకుతనం, maMkutanaM
-n.
--obstinacy; stubbornness;
మంకుపట్టు, maMkupaTTu
-n.
--obstinacy; stubbornness;
మంకెన, maMkena
-n.
--Noon Flower; Midday Flower; Midday Mallow; Copper Cups; [bot.] ''Pentapetes phoenicea'' of the Malvaceae family;
-- మధ్యాహ్న మందార; రిక్షమల్లి; [Sans.] అర్కవల్లభ; బంధూకమ్; [Hin.] దో పహరియా;
-- ఐదు రేకుల పువ్వునుబట్టి పెంటాపెటెస్ అనీ, పువ్వుల రక్తవర్ణాన్నిబట్టి దీనికి ఫీనీషియా అనీ దీని లాటిన్ పేరు ఏర్పడింది. మంకెన ఆకులతో కొందరు టీ కాచుకుంటారు. మంకెన కాయలలోని గింజలను ఉదరసంబంధమైన వ్యాధులలో కషాయం కాచుకుని తాగుతారు. మంకెన వేరు కషాయం శరీరంలో స్రావాలను నిరోధిస్తుంది. జ్వరహారిణిగా పనిచేస్తుంది. వాతరోగాల నివారణకు కూడా పనిచేస్తుంది. అజీర్తి కారణంగా వచ్చే తీవ్రమైన కడుపునొప్పి, జ్వరాలను మంకెన వేర్ల కషాయం పోగొడుతుంది.
[[file:Mamkena_Flower.jpg|thumb|right|మంకెన పూలు]]
మంగ, maMga
-n.
-- mountain pomegranate; [bot.] ''Randia dumetorum'' of the Rubiaceae family;
-- మంగముళ్ళ చెట్టు; [Sans.] పిండీతకము;
మంగనం, maMganaM
-n.
--manganese; one of the chemical elements with the symbol Mn;
మంగలం, maMgalaM
-n.
--frying pan; popper; a pan used to pop grain; (ety.) మన్ + కలం;
మంగలి, maMgali
-n.
--barber; barber caste;
మంగలి కొట్టు, maMgali koTTu
-n.
--barber shop;
మంగు మచ్చలు, mangu macchalu
- n.
-- Melasma; hyperpigmentation of skin; Melasma is a condition in which areas of the skin become darker than the surrounding skin;
మంచం, maMcaM
-n.
--cot; bed; bedstead; (rel.) పరుపు;
---మడత మంచం = folding cot.
---పందిరి మంచం = canopy bed.
మంచి, maMci
-adj.
--(1) good;
--(2) fresh; (ant.) చెడు;
మంచి కంద, maMci kaMda
- n.
-- Elephant foot yam; [bot.] ''Amorphophallus companulatus'' Bl.
మంచినీళ్లు, maMcinILlu
-n.
--fresh water; potable water;
---పచ్చిమంచినీళ్లు = raw fresh water;
మంచు, maMcu
-n.
--(1) ice; solidified water;
--(2) dew;
--(3) snow;
మంచుతుఫాను, maMcutuphAnu
-n.
--snow storm; blizzard;
మంచుకాడ, maMcukADa
-n.
--icicle; a rod of ice hanging from a roof or tree;
మంచు పొర, maMcu pora
-n.
--floe; sheet of ice; sheet of ice formed on the surface of water;
మంచు ముక్క, maMcu mukka
-n.
--ice cube; piece of ice;
మంచు రేకు, maMcu rEku
-n.
--snow flake;
మంచె, maMce
-n.
--rack; stand; platform;
మంజరి, maMjari
- n.
-- bouquet; a collection of flowers; often used as a suffix to book titles to indicate a collection of literary items;
మంజిష్ట, maMjishTa
-n.
--Indian madder; common madder; a medicinal creeper; [bot.] ''Rubia cordifolia'' of the Rubiaceae family;
--Manjishta is a famous herb for blood detoxifying. Its root is extensively used in many skin disease medicines of Ayurveda.
--this plant also gives a bright red dye;
మంజుల, maMjula
-adj.
--sweet; delicious;
మంజూరు, maMjUru
-n.
--sanction; approval;
మంట, maMTa
-n.
--flame;
మండ, maMDa
-n.
--(1) the back part of the hand from the wrist to the fingertips;
--(2) a twig with leaves that can be used as a whisk;
--- వేపమండ = a twig of neem tree.
--- కంపమండ = twig or branch of a thorny bush;
మండపం, maMDapaM
-n.
--portico; gazebo; an elevated covered structure built on pillars; also మంటపం;
మండలం, maMDalaM
-n.
--(1) orb of a celestial body;
--(2) region; province; district;
--(3) a group of people;
--(4) cycle; circumference; circuit;
--(5) forty days; వేదాలలో, “మండలం” అనేది సాధారణంగా 40 రోజుల కాలాన్ని సూచిస్తుంది.
ఇది “తపస్సు” లేదా “దీక్ష” లేదా “ఉపాసన” యొక్క సంపూర్ణ చక్రంగా పరిగణించబడింది;
---వ్యవహార మండలం = jurisdiction.
---మందలాధిపతులు = regional officers;
మండలి, maMDali
-n.
--society; committee;
మండ్రగబ్బ, maMDragabba
- n.
-- Large Black Scorpion; Emperor Scorpion; [bio.] ''Pandinus imperator'' of the Scorpionidae family;
-- పుట్టతేలు; మండ్రగబ్బలు నల్లగా వుంటాయి ఇవి తేలు కన్నా చాలా విషపూరితమైనవి. వీటిని చంపినపుడు రక్తం నల్లగా బురదలాగ వస్తుంది; ఇవి తేలు కంటె కొంచెం లావుగా వుంటాయి;
మండించు, maMDiMcu
-v. t.
--burn;
మండిపడు, maMDipaDu
-v. t.
--get angry and show it externally;
మండీ, maMDI
-n.
--(1) wholesale market;
--(2) warehouse; godown;
మండు, maMDu
-v. i.
--burn;
---ఒళ్లు మండుతున్నాది = my blood is boiling.
మండువా, maMDuvA
-n.
--(1) courtyard; an open space surrounded by a verandah in the central part of a house;
--(2) verandah;
--(3) booth;
-- (4) A stable for horses, గుర్రాలపాక; గుర్రపుసాల;
మండూకపర్ణి, maMDUkaparni
-n.
-- Gotu kola; Centella; Tiger grass; Indian pennywort; [bot.] ''Centella asiatica;'' Widely used in Ayurvedic and traditional Chinese medicine, this herb is also referred to as the "herb of longevity,"
-- [Sans.] Mandukaparni; [Hin.] Brahma Buti;
మండూకబ్రహ్మి, maMDUkabrahmi
-n.
--Brahmi, Indian pennywort; Asiatic pennywort; [bot.] ''Hydrocotyle asiatica'' of the Apiaceae family;
-- a herbaceous, perennial plant native to the wetlands in Asia;
-- Apart from wound healing, the herb is recommended for the treatment of various skin conditions such as leprosy, lupus, varicose ulcers, eczema, psoriasis, diarrhea, fever, amenorrhea, diseases of the female genitourinary tract, and also for relieving anxiety and improving cognition;
మంతనం, maMtanaM
-n.
--discussion; negotiation;
మంత్రం, maMtraM
-n.
--(1) mantra; hymn; chant; a secret word or phrase with mystical power; (lit.) one that holds your thought process and gives you ideas;
--(2) spell; charm; incantation;
-- "మననాత్ త్రాయతే ఇతి మంత్రం" అంటే మననం చేయడం వల్ల మనల్ని రక్షించేది అని అర్ధం; గురుముఖంగా పొందేది మంత్రం. మంత్రం కొన్ని బీజాక్షరాల సంపుటీకరణం. దాని అర్ధం తెలియవలసిన అగత్యం లేదు; అది శ్లోక రూపంలోగూడా ఉండవచ్చు. విష్ణు సహస్రనామం 108 శ్లోకాలున్న మహా మంత్రం.
మంత్ర దండం, maMtra daMDaM
-n.
--magic wand;
మంత్రసాని, maMtrasAni
-n.
--midwife; a native nurse specializing in child delivery; (lit.) a woman who works secretly, i.e., behind the doors;
మంత్రాంగ సభ, maMtrAMgasabha
-n.
--council;
మంత్రి, maMtri
-n.
--(1) minister;
--(2) queen in chess;
మంతుడు, maMtuDu
- suff.
-- having the property of;
-- -మంతం అనాలా?, -వంతం అనాలా? -వంతుడు, -వతి అని ఎక్కడ చేర్చాలి, -మంతుడు,-మతి అని ఎక్కడ చేర్చాలి అనే విచికిత్స తరచు కలుగుతుంది.
-- అ-కారాంత, ఆ-కారాంత పదాలకు –వంతుడు, -వంతము, -వానుడు, -వతి ప్రత్యయాలుగా అమరుతాయి.
-- ఉదా: సౌభాగ్య -> సౌభాగ్యవతి; గుణ -> గుణవంతుడు; బల -> బలవంతం; విద్యా -> విద్యావంతుడు; అమరా -> అమరావతి
-- ఇ-కారాంత, ఈ-కారాంత, ఉ-కారాంత పదాలకు –మంతుడు, -మంతము, -మానుడు, -మతి ప్రత్యయాలుగా అమరుతాయి
-- ఉదా: బుద్ధి -> బుద్ధిమంతుడు; కీర్తి -> కీర్తిమతి; శక్తి -> శక్తిమంతం; శ్రీ -> శ్రీమతి; ధీ -> ధీమంతుడు; హను -> హనుమంతుడు; అంశు -> అంశుమంతుడు; ఇందు -> ఇందుమతి;
మందం, maMdaM
-n.
--(1) slow; lazy; dull; inert;
--(2) thickness;
మంద, maMda
-adj.
--dull; not sharp;
-n.
--herd; flock; colony; troop; mob; drove; crowd;
---ఆవుల మంద = herd of cows.
మందగతి, maMdagati
-n.
--slow motion;
మందగామి, maMdagAmi
-n.
--slow moving thing;
మందగించు, maMdagiMcu
-v. i.
--(1) slow down; thing; decline;
--(2) become dull;
మందడి గోడ, maMdaDi gODa
-n.
--partition wall;
మందడి ప్రమేయం, maMdadi pramEyaM
-n.
--[math.] In number theory, the partition function {\displaystyle p(n)}p(n) represents the number of possible partitions of a non-negative integer {\displaystyle n}n. For instance, {\displaystyle p(4)=5}{\displaystyle p(4)=5} because the integer {\displaystyle 4}4 has the five partitions {\displaystyle 1+1+1+1}{\displaystyle 1+1+1+1}, {\displaystyle 1+1+2}{\displaystyle 1+1+2}, {\displaystyle 1+3}1+3, {\displaystyle 2+2}2+2, and {\displaystyle 4}4.
--[phys.] In physics, a partition function describes the statistical properties of a system in thermodynamic equilibrium;
మందమతి, maMdamati
-n.
--dunce; dull-witted; తమందం;
మందమరుపు, maMdamarupu
-n.
--absent-mindedness; forgetfulness;
మందరస్థాయి, maMdarastAyi
-n.
--[music] half an octave below the main octave;
మందల, maMdala
-n.
--limit; boundary; % in e2t
మందలించు, maMdaliMcu
-n.
--rebuke; reprimand;
మందవాయువు, maMdavAyuvu
-n.
--inert gas; also స్తబ్దవాయువు;
మందసం, maMdasaM
-n.
--chest; box; safe;
మందాకిని, maMdAkini
-n.
--the legendary river in Heaven which fell to the Earth to be known as the Ganges; in this context, the heavenly river is identified with the Milkyway;
మందార, maMdAra
-n.
--Hibiscus; China rose; shoe flower; [bot.] ''Hibiscus rosa sinensis; Calotropis gigantea''; దాసాని;
-- జూకా మందార = Japanese Lantern; [bot.] ''Hibiscus schizopetalus'' of the Malvaceae family;
[[File:Hibiscus_schizopetalus_%28Botanischer_Garten_TU_Darmstadt%29.jpg|thumb|right|Hibiscus_schizopetalus, జూకా మందార]]
మంది, maMdi
-n.
--crowd; people;
---మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన = as the crowd grows, the buttermilk gets thinner.
---ఎంత మంది? = how many people?
మందిరం, maMdiraM
-n.
--(1) house;
--(2) temple; shrine;
మందీమార్బలం, maMdImArbalaM
-n.
--retinue; main troops and reserve troops;
మందు, maMdu
-n.
--(1) medicine; drug;
-- మోతాదులో తినేది మందు; మూలికలతో (వృక్షజాతుల నుండి) తయారు చేసినది మందు; ఓషధి అంటే మూలిక; ఓషధులతో తయారయినది ఔషధం; మాను నుండి తయారు చేసినది మాకు; మందు మాఁకు అన్నప్పుడు "మాఁకు" పదానికి చెట్టు బెరడో, వేరో అనుకోవచ్చు.
--(2) cure; remedy;
--(3) as a slang, alcoholic beverage;
---వాడు మందు కొట్టేడు = he had a couple of drinks.
మందుబాబులు, maMdubAbulu
-n.
--drug lords; powerful bosses who illegally deal in illicit and dangerous drugs;
</poem>
==Part 5: మ - ma==
<poem>
మకరం, makaraM
-n.
--crocodile; alligator;
మకరందం, makaraMdaM
-n.
--nectar; nectar of flowers;
మకరరాశి, makararASi
-n.
--Capricorn, the constellation; one of the twelve signs of the Zodiac; (note.) literally Capricorn means antelope or goat, and the Telugu name Makara means a crocodile; apparently there has been an error in translation;
మకర రేఖ, makara rEkha
-n.
--Tropic of Capricorn;
మకర సంక్రమణం, makara saMkramaNaM
-n.
--entrance of the Sun into the Zodiacal sign Capricorn;
మకాం, makAM
-n.
--temporary lodging; camp; halting place;
మకిలి, makili
-n.
--dirt; grime; tarnish;
మక్కీకి మక్కీగా, makhIki makhIgA
- idiom
-- verbatim; an exact copy;
-- ఉన్నది ఉన్నట్లుగా; యధాతధంగా;
మక్కువ, makkuva
-n.
--affection;
మక్కె, makke
-n.
--bone;
మక్షికం, makshikaM
-n.
--fly; house fly;
మక్షిక డింభం, makshika DimbhaM
-n.
--maggot;
మగ, maga
-adj.
--male;
మగడు, magaDu
-n.
--(1) husband;
--(2) male person;
మగవాడు, magavADu
-n.
--man; male; guy; husband; see also మొగవాడు;
మగవారు, magavAru
-n. pl.
--men; males; guys; husbands;
మగత, magata
-n.
--doze; drowsiness;
మగతనం, magatanaM
-n.
--(1) masculinity; manliness;
--(2) bravery;
మగసిరి, magasiri
-n.
--masculinity;
మగపంతం, magapaMtaM
-n.
--male chauvinism;
మగ్గం, maggaM
-n.
--loom;
మగాడు, magADu
-n.
--male; brave person; husband;
మగువ, maguva
-n.
--woman;
మఘ, magha %updated
-n.
--(1) Alpha Leonis; Regulus; Yoga tara of the tenth lunar mansion; located in the constellation Leo;
--(2) The tenth of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
మచ్చ, macca
-n.
--blemish; scar; mottle; a spot caused by a healed injury;
---పుట్టుమచ్చ = mole; birthmark.
మచ్చిక, maccika
-n.
--tameness; attachment;
మచ్చు, maccu
-n.
--sample; specimen; model;
---మచ్చు చూపించవోయ్ = show a sample.
మజ్జ, majja
-n.
--marrow; మూలగ;
మజాకా, majAkA
-n.
--joke; jest;
మజిలి, majili
-n.
--sojourn; way-ward stop; brief stopover in a journey;
మజ్జిగ, majjiga
-n.
--buttermilk;
మజూరీ, majUrI
-n.
--day wages paid to a goldsmith;
మట్టం, maTTaM
-n.
--(1) level;
--(2) leveling instrument used by masons;
---నేల మట్టం = ground level.
---సముద్ర మట్టం = sea level.
---సగటు సముద్ర మట్టం = mean sea level; ససమట్టం.
మట్ట, maTTa
-n.
--[bot.] frond; bough of a palm tree; leaf of a palm tree;
-- a fern leaf;
మట్టగిడస, maTTagiDasa
-n.
--mud minnow; mud skipper; a type of fish that lives in muddy water;
మట్టి, maTTi
-n.
--(1) soil; dirt;
--(2) ground;
మట్టిచెట్టు, maTTi ceTTu
-n.
--[bot.] ''Terminalia arjuna'';
-- తెల్ల మద్ది;
మట్టినూనె, maTTinUne
-n.
--crude oil; petroleum; శిలతైలం;
మట్టు, maTTu
-n.
--a place holder for round-bottomed pots or flasks; a support;
-v. t.
--to step on;
మట్టుకు, maTTuku
- adv.
-- as far as; up to;
-- అంత మట్టుకు = as far as; up to;
-- ఇంత మట్టుకు = this far;
-- ఎంత మట్టుకు? = how far?;
మట్టుబచ్చలి, maTTubaccali
-n.
-- [bot.] ''Atriplex hortensis'' Linn.; see also దుంప బచ్చలి; ఉపోదకం;
మట్టెలు, maTTelu
-n.
--a pair of toe rings, usually made of silver and worn by married women;
మడచు, maDacu
-v. t.
--fold; crease; pleat;
మడత, maData
-n.
--fold; crease; pleat;
మడతపిన్ను, maDatapinnu
-n.
--(1) staple;
--(2) folding clip;
మడి, maDi
-adj.
--sacral;
---మడిబట్ట = sacral cloth; clothing that was ceremoniously cleaned for the purpose of maintaining a clean environment during acts like cooking, worshiping, etc.
-n.
--(1) paddy; rice paddy;
--(2) plot of land prepared for seeding;
--(3) soil around a plant prepared to hold water;
--(4) kosher; the customary rules of maintaining cleanliness associated with the preparation of food, storage of food, etc.
మడ్డి, maDDi
-n.
--sediment; precipitate; scum; dregs; a layer of substance that settles to the bottom of a liquid;
మడ్డిపాలు, maDDipAlu
-n.
--(1) rich milk;
--(2) latex; gummy juice secreted from plants;
మడుగు, maDugu
-n.
--(1) pond; lake; puddle; pool;
-- (2) Clothing that was washed and dried; a clean cloth;
---అడుగులకి మడుగులు ఒత్తడం = spreading a clean cloth on the ground as a person walks on it as a mark of respect;
---పండగపూట కూడ పాత మడుగేనా? = old clothing on a festive day?
మణి, maNi
-n.
--(1) a gem, believed to be in the hood of a king cobra;
--(2) snake-stone, a "stone" believed to have magical powers in neutralizing the ill effects of snake venom; there is no scientific evidence to back up either of these claims;
--(3) any precious stone;
--(4) as a suffix, this denotes unrivaled excellence, such as సుందరీమణి - the loveliest of women;
--(5) wrist;
మణికట్టు, maNikaTTu
-n.
--wrist; మనికట్టు;
మణిశిల, maNiSila
-n.
--sulfur;
మణుగు, maNugu
-n.
--a measure of weight in pre-independence India; 1 మణుగు = 8 వీశలు = 40 సేర్లు = 960 తులాలు;
మణేలా, maNElA
-n.
--the nine piece in a deck of playing cards;
మతం, mataM
-n.
--(1) opinion;
--(2) religion;
మతకం, matakaM
-n.
--deception;
మతలబు, matalabu
-n.
--topic; content; purport; intent; news;
మత్సరం, matsaraM
-n.
--envy;
మతాబా, matAbA
-n.
--roman candle; a kind of fireworks;
మతి, mati
-n.
--mind;
మతుబర్థకం, matubarthakaM
- n.
- [gram.] a particle attached to the end of a word to indicate posession;
-- కలవాడు, కలది, మంతుడు, వంతుడు, కాడు, కత్తె, మొదలగునవి;
మత్తు, mattu
-n.
--intoxication;
మత్తుమందు, mattumaMdu
-n.
--intoxicating drug; anesthetic drug;
మథనము, mathanamu
-n.
--churning;
మదం, madaM
-n.
--fat; arrogance; conceit;
మదనగింజలు, madana giMjalu
-n.
--Linseed; [bot.] ''Linum usitatissimum;''
మదనము, madanamu
- n.
-- (1) wax; (2) thorn apple; Indian nightshade; Beladona;
మద్దత్తు, maddattu
-n.
--backing; support;
మద్యం, madyaM
-n.
--any intoxicating drink like wine or liquor; మద్యసారం;
మదుపు, madupu
-n.
--(1) investment;. venture capital;
--(2) support;
మదాం, madAM
-n.
--(1) madam,
--(2) the Queen in a deck of playing cards;
మదాత్యం, madAtyaM
-n.
--alcoholism; % to e2t
మద్ది, maddi
-n.
--[bot.] ''Terminalia glabra''; Mentaptera arjuna; there are many other varieties of this tree;
మద్ది చెట్టు, maddi ceTTu
-n.
--(1) Indian mulberry; [bot.] ''Morinda citrifolia'', of the coffee bean family (the Rubiaceae);
---తెల్ల మద్ది = [bot.] ''Terminalia arjuna'' of the Combretaceae (బాదం) family;
---నాటు బాదం = [bot.] ''Terminalia Terminalia catapa'';
-- (2) [bot.] ''Morinda citrifolia'' belonging to the coffee bean family (the Rubiaceae). This is called the Indian Mulberry.
---మొలఘ;
మదుం, maduM
-n.
--(1) sluice; waterway; spillway; (2) waterway under a street;
--same as మదుగు; అనుకదనము; అనుకు; తొళక;
మద్దెల maddela
-n.
--small drum used in Indian classical music;
మధ్యంతర, madhyaMtara
-adj.
--interstitial; intermediate; midterm;
మధ్య, madhya
-adj.
--middle; median;
మధ్యజీవ యుగం, madhyajIva yugaM
-n.
--Mesozoic era;
మధ్యధరా సముద్రం, madhyadharA samudraM
-n.
--Mediterranean sea;
మధ్యమం, madhyamaM
-n.
--(1) middle one; median;
--(2) not so good; not so bad;
--(3) fourth musical note in a seven-note scale;
మధ్యమధ్య, madhyamadhya
-adv.
--now and then; from time to time;
మధ్యరకం, madhyarakaM
-adv.
--medium type;
మధ్యవర్తి, madhyavarti
-n.
--mediator; arbitrator;
మధ్యస్థంగా, madhyastaMgA
-adv.
--halfway;
మధ్యస్థ, madhyastha
-adj.
--intermediate;
మధ్యస్థాయి, madhyasthAyi
-n.
--[music] main octave;
మధ్యావరణం, madhyAvaraNaM
-n.
--mesosphere;
మధ్యాహ్నం, madhyAhnaM
-n.
--afternoon; strictly, fron noon to 4.00 PM;
మధ్యాహ్న రేఖ, madhyAhna rEkha
-n.
--celestial meridian; The Great Circle that goes through the zenith of the observer and the poles of the celestial sphere;
మధుకరం, madhukaraM
-n.
--bee; (lit.) manufacturer of honey;
మధుమూత్రం, madhumUtraM
-n.
--diabetes; (lit.) sweet urine;
-- మధు అంటే తేనె కానీ అన్ని తియ్యటి పదార్థాలకూ మధు శబ్దం వర్తిస్తుంది. మేహము అంటే మూత్రము, మూత్ర వ్యాధి, మూత్ర విసర్జనము అని శబ్దార్థ చంద్రిక చెప్పింది.
మధుపర్ణిక, madhuparNika
-n.
--indigo plant; also నీలిమొక్క;
మధుమేహం, madhumEhaM
-n.
--diabetes mellitus;
మధువు, madhuvu
-n.
--(1) wine;
--(2) nectar of flowers;
--(3) honey;
మధూకం, madhUkaM
-n.
--Butter tree; Mahwa tree; [bot.] Bassia latifolia; the flowers are used to make a wine and seeds are used to make oil; also ఇప్ప;
మధూకరం, madhUkaraM
-n.
--the tradition of students making a living by gathering food from households;
మనం, manaM
-pron.
--incl. we; (includes the person or persons addressed); (rel.) మేము;
మన, mana
-pos. adj.
--our;
మనకు, manaku
-pron.
--for us;
మననం, mananaM
-n.
--thinking reflection;
మనలో మన మాట, manalO mana mATa
-ph.
--just between us; just among us;
మనవి, manavi
-n.
--appeal; petition;
-pos. pron.
--ours;
మనవి చేయు, manavi cEyu
-v. i.
--make an appeal; petition;
మనస్తత్త్వ విశ్లేషణ, manastattva viSlEshaNa
- ph.
-- psychoanalysis; the process of analyzing dreams and hesitations using "free associations" promoted by Sigmund Freud; This is somewhat similar to Abhinava Gupta's "AbhijnAna theory;"
మనసా, manasA
-adv.
--whole-heartedly;
మనస్తాపం, manasthApaM
-n.
--distress; sorrow; grief;
మనస్సాక్షి, manassAkshi
-n.
--conscience;
మనస్వి, manasvi
-n.
--good-natured person;
మనస్సు, manassu
-n.
--mind; lower mind that collects sensory perceptions; short term memory;
మన్నన, mannana
-n.
--the social art of expressing respect by using plural to address a person or appending the suffix "gAru" to a name and so on;
మన్వంతరం, manvaMtaraM
-n.
--the Manu-Interval; according to Hindu belief, a Manu-Interval is fourteenth part of a Kalpa; each Manu-Interval is comprised of 71 and a fraction of Maha Yugas; The present age is called the Interval of Vaivasvata Manu;
మనికట్టు, manikaTTu
-n.
--wrist; carpus; see also మణికట్టు;
మనిషి, manishi
-n.
--human being; person;
మన్నించు, manniMcu
-v. i.
--show respect in addressing; use a respectful form of addressing;
మన్నించు, manniMcu
-v. t.
--pardon; excuse;
మన్నిక, mannika
-n.
--durability; endurance;
మన్నిటోజు, manniTOju
-n.
--mannitose; a sugar with the formula, C<sub>6</sub>H<sub>12</sub>O<sub>6</sub>;
మన్నిటోల్, manniTol
-n.
--mannitol; an alcohol with the formula C<sub>6</sub>H<sub>8</sub>(OH)<sub>6</sub>;
మనీషి, manIshi
-n.
--intellectual person; wise man; Homo Sapiens;
మను, manu
-v. i.
--survive; live; exist;
మనుగడ, manugaDa
-n.
--survival; living; life;
మనుగుడుపులు, manuguDupulu
- n.
-- the practice of a groom spending time at the in-law's place after wedding, presumably to eat well and get strong and virile;
-- మనువు అంటే పెళ్లి. కుడుపు అంటే తినిపించటం. పూర్వకాలం పెళ్లి అయిన తరువాత అల్లుడు అత్తగారింట్లోనే ఆరునెలలు వుండేవాడట. ఈ సమయంలో అతనికి చిన్నమెత్తు పని చెప్పరు. వీర్యవృద్దికరమైన ఆహారపదార్థాలు చేసి బాగా తినబెడుతుంటారు. దీనితో నవదంపతులు యిద్దరూ బాగా పుష్టిగా ఆరోగ్యవంతంగా తయారవుతారు. పెళ్లి అయింతర్వాత జరిగే మర్యాదలు కాబట్టి మనువు కుడుపు (మనుగుడుపు) అన్నమాట ఇదంతా. దీన్ని కొన్ని ప్రాంతాల్లో అల్లెం అంటారు;
-- మనువు + కుడుపు;
మనుపాల, manupAla
-n.
--Linseed; [bot.] ''Wrightia antidysenterica'';
మనుమడు, manumaDu
-n. m.
--grandson;
మనుమరాలు, manumarAlu
-n. f.
--granddaughter;
మనువాడు, manuvADu
- v. t.
-- to wed; to marry;
మనువు, manuvu
- n.
-- wedding;
మనుష్యుడు, manushyuDu
-n. m.
--man;
మన్ను, mannu
-n.
-- (1) soil; dirt; earth; (2) The Gayal, commonly called the Bison, ఋశ్యము; (3) మనుబోతు; మన్నుబోతు; the male of a species of antelope, the painted or white-footed antelope, gayal, bison.
-v. i.
--last; endure;
--- మన్ను తిన్న పాము = like a snake (python) that has swallowed an antelope;
మనోగతం, manOgataM
-n.
--intention;
మనోగతి, manOgati
-n.
--line of thought;
మనోజ్ఞ, manOj~na
-adj.
--pleasing; appealing; delightful;
మనోధర్మం, manOdharmaM
-n.
--(1) [music] improvisation; extempore addition of elements to a standard rendition of a song;
--(2) mentality;
మనోరంజితం, manOraMjitaM
-n.
--[bot.] Artabotrys odoratissima;
మనోరథము, manOrathamu
- n.
-- కోరిక; మనసే రథముగా గలది … బహువ్రీహి సమాసం.
మనోవర్తి, manOvarti
-n.
--(1) alimony; payments to a wife from a husband after a divorce; Maintenance; support; an allowance; stipend;
--(2) palimony; payments to a husband from a wife after a divorce;
మనోవాక్కాయకర్మలా, manOvAkkAyakarmalA
-adv.
--whole-heartedly; (lit.) by thought, word and deed;
మప్పిదాలు, mappidAlu
-n.
--thanks;
మబ్బు, mabbu
-n.
--cloud;
మభ్యపరచు, mabhyaparacu
-v. i.
--conceal with a view to deceive;
మమకారం, mamakAraM
-n.
--attachment; love; affection; fondness;
మమత, mamata
-n.
--interest or affection toward people or objects;
మమ్మల్ని, mammalni
-pron.
--us;
మమేకం, mamEkaM
- n.
-- inseparable;
-- కలిసిపోవటం; ఒకటైపోవటం; విడతీయలేని భాగం అవడం;
-- మమ + ఏకం = మమైకం ఔతుంది (మేక కాదు) - వృద్ధి సంధి;
-- మరొకరితో అవినాభావంగా -— అతడూ నేనూ ఒకటే, ఆ వస్తువు నేనూ ఒకటే అనన్న అర్థంలో వాడుతూ ఉంటాము. ఇది తెలుగువాళ్ల వాడుక. తప్పు కాదు;
మయం, mayaM
-suff.
--full of;
మయికం, mayikaM
-n.
--intoxication;
మయిలుతుత్తం, mayilututtaM
-n.
--copper sulfate; blue vitriol; also మయూరకం;
మయూరం, mayUraM
-n. m.
--peacock;
మయూరశిఖి, mayUrasikhi
-n.
--[bot.] ''Adiantum melanocaulum''; ''Actiniopteris radiata'';
మయూరి, mayUri
-n. f.
--peahen;
మర, mara
-n.
--screw; machine; mill;
---పిండిమర = flour mill; machine to grind grain into flour.
---నూనెమర = oil mill; machine to grind oilseeds into oil; see also గానుగ.
మరక, maraka
-n.
--stain (on a fabric); blot; smudge; spot; also blemish caused by dirt, grime, ink and so on; డాగు;
---రక్తపు మరక = blood stain.
---సిరా మరక = ink blot.
మరకట్టు, marakaTTu
-n.
--brake; a device to stop a rotating wheel;
మరకతం, marakataM
-n.
--emerald; (ety.) from Prakrit maragada; a bright green, transparent precious stone; green variety of beryl;
-- పచ్చ; దట్టమైన ఆకుపచ్చని రంగు గల ఒకానొక రత్నము;
-- మరకతశ్యామా - అంటే పచ్చ అనే రత్నపు ఛాయతో ఒప్పారుతున్న నలుపురంగు;
మరగాలు, maragAlu
-n.
--artificial leg; mechanical leg; prosthetic leg;
మరగించు, maragiMcu
-v. t.
--boil;
మరగు, maragu
-v. i.
--(1) get accustomed; get addicted;
--(2) boil;
మరచు, maracu
-v. i.
--forget;
మరణం, maraNaM
-n.
--death;
మరణించు, maraNiMcu
-v. i.
--die;
మరదలు, maradalu
-n.
--(1) wife's younger sister;
--(2) younger brother's wife;
మరమగ్గం, maramaggaM
-n.
--power loom; mechanical loom;
మరమరాలు, maramarAlu
-n.
--puffed rice;
మరమేకు, maramEku
-n.
--screw;
మరమ్మత్తు, marammattu
-n.
--repairing; mending; fixing;
మర్దనం, mardanaM
-v. t.
--rubbing; pounding; kneading; also మర్దనా;
మర్దనాలు, mardanAlu
-n.
--rubbing alcohol; isopropyl alcohol; see also మర్దనోలు;
మర్మం, marmaM
-n.
--(1) secret;
--(2) duplicity;
మర్మగర్భం, marmagarbhaM
- adj.
-- secretive; pregnant with a hidden message;
-- "ఈ మాటల వెనక ఏదో ఉంది " అనిపించేట్టు మాట్లాడడం మర్మ గర్భ సంభాషణ. తాను చెప్పేది అందరూ కాక తాను ఉద్దేశించిన వాళ్ల కే అర్థం అయ్యేట్టు మాట్లాడడం అది. మర్మం అంటే రహస్యం.
-- see also నర్మగర్భం;
మర్మస్థానం, marmasthAnaM
-n.
--vital place; secret place; the groin where sex organs are located;
మర్యాద, maryAda
-n.
--civility; courteousness; taking care of the needs of a guest; (ant.) అమర్యాద;
-- తెలుగు రాష్ట్రాల్లో మర్యాద పదాన్ని గౌరవం ఇవ్వడం (courteous) అన్న భావనలో వాడుతాము. ఉత్తరభారతంలో మర్యాద పదాన్ని హద్దులు తెలియడం (boundaries/ limits తెలియడం) అన్న భావనలో వాడతారు. మర్యాద రామన్న అంటే తన హద్దులు దాటని రాముడు అని ఆర్ధం;
మరి, mari
-adv.
--time; turn; season;
---ఒక్కమరి = one time; once.
మరికొన్ని, marikonni
-n.
--few more;
మరిడివ్యాధి, mariDivyAdhi
-n.
--(1) cholera;
--(2) infectious disease;
మరిది, maridi
-n.
--(1) husband's younger brother;
--(2) a woman's younger sister's husband;
మరియొక, mariyoka
-adv.
--another;
మర్రిచెట్టు, marriceTTu
-n.
--banyan tree; [bot.] Ficus bengalensis; Ficus indica;
మరీచి, marIci
-n.
--ray of light;
మరీచిక, marIchika
- n.
-- mirage; an optical illusion caused by atmospheric conditions, especially the appearance of a sheet of water in a desert or on a hot road caused by the refraction of light from the sky by heated air;
మరుగు, marugu
-n.
--privacy; cover; shelter; screen;
---మరుగుదొడ్డి = latrine; urinal; toilet; rest room; powder room.
మరుగుజ్జు, marugujju
-n.
--dwarf;
మరునాడు, marunADu
-n.
--the next day;
మరులమాతంగి, marulamAtaMgi
-n.
-- [bot.] ''Xanthium strumarium'' Linn.;
మరులుదీగ, maruludIga
-n.
--[bot.] ''Xanthium orientalis'';
మరువం, maruvaM
-n.
--sweet marjoram; [bot.] ''Majorana hortensis;'' ''Origanum majorana'' of the Labiatae (Mint) family;
-- [Sans.] ప్రస్థపుష్పకం;
మరుసటి, marusaTi
-adj.
--next; subsequent; following;
మర్సూపియం, marsUpiyaM
-n.
--pouch; bag; (as in a kangaroo's pouch);
మర్మేంద్రియాలు, marmEMdriyAlu
-n. pl.
--genitals; the sex organs;
మరాటితీగ, marATitIga
-n.
--[bot.] ''Spilanthes acmella'';
మరిగ, mariga
- n.
-- a cup made of stone;
మరుభూమి, marubhoomi
- n.
-- desert; waste land; rocky land;
-- శూన్య ప్రదేశం; ఎడారి; నిర్జల ప్రదేశము;
మరొక, maroka
-adv.
--another;
మరొకసారి, marokasAri
-adv.
--(1) once more;
--(2) some other time;
మరొక్కసారి, marokkasAri
-adv.
--one more time; encore;
మలం, malaM
-n.
--feces; excrement; stool; dung;
మలచు, malacu
-v. t
-- mold; shape; give shape to;
మలబద్ధం, malabaddhaM
-n.
--constipation; (rel.) అజీర్ణం;
మలబార్ చింతపండు, Malabar tciMtapaMDu
- n.
-- Malabar tamarind; [bot.] ''Garcinia cambogia;''
-- 10 నుంచి 20 మీటర్ల ఎత్తు పెరిగే ఈ చెట్టు నుంచి పండిన కాయల్ని కోసి, తోలు వేరుగా చేసి, తోలును ఎండ బెట్టి సుగంధ ద్రవ్యంగా వాడతారు. ఎండ బెట్టగా వచ్చిన నల్లటి చింతపండు పోలిన పదార్థాన్ని మందుల తయారీ వాడతారు. వీటి కాయలు పండినపుడు పసుపురంగులో వుండి కాయల మీద గాడులు ఉంటాయి. 6 నుంచి 8 దాకా విత్తనాలుంటాయి. విత్తనాల చుట్టు అరిల్ అనే ఒక రకమైన కణజాలం వుంటుంది. దీని ప్రాముఖ్యాన్ని వెలుగులోకి తెచ్చాక మలబార్ చింతపండు విలువ అనేక రెట్లు పెరిగింది;
మలమల, malamala
-adv.
--fiercely; violently;
మలయమారుతం, malayamArutaM
-n.
--gentle fragrant breeze; the Malabar breeze;
మలయా ఏపిల్, malayA apple
- n.
-- [bot.] ''Syzygium malaccense'' of the Myrtaceae family;
-- మలయా యాపిల్ పళ్లను మన ప్రాంతంలో గులాబ్ జామూన్ పళ్లు అని కూడా అంటారు. వీటి పూలు పౌడర్ పఫ్ (Powder Puff) లాగా అనిపిస్తాయి. కొన్ని పూలు తెల్లగా ఉంటే ఇంకొన్ని ఎర్రగా గులాం (గులాల్) రంగులోనూ, కొన్ని రక్త వర్ణం లోనూ ఉంటాయి. పూల రంగును బట్టే కాయల రంగు ఉంటుంది. ఈ పండ్లనుంచి కొన్ని దేశాలలో వైన్ (Wine) తయారు చేస్తారు. మలేషియా, ఆస్ట్రేలియాలు ఈ పండ్ల మొక్క తొట్టతొలి జన్మస్థానాలు. ఇక సాధారణ నేరేడు వృక్షం శాస్త్రీయ నామం Syzygium cumini కాగా ఇదే కుటుంబానికి చెందిన లవంగ వృక్షం శాస్త్రీయనామం ''Syzygium aromaticum;''
మలవిసర్జన, malavisarjana
-v. i.
--emptying of the bowels; defecation;
మల్లశాల, mallaSAla
-n.
--gymnasium;
మలి, mali
-adj.
--next; second;
మలినం, malinaM
-n.
--dirt; filth; pollution;
మలామా, malAmA
-n.
--plating; plating of gold or silver;
మలారం, malAraM
-n.
-- (1) rack; holder; a cord on which bangles are held for display; (2) rake; a rough broom used for sweeping streets or gathering leaves;
---గాజుల మలారం = a cylindrical tube or wire on which bangles are strung together for easy display and dispensation;
మలు, malu
-adj.
--pref. second; (rel.) తొలి; మలి;;
---మలుచూలు = second pregnancy.
మలుచు, malucu
-v. t.
--mold; create by molding stone, clay, etc.
మల్లె, malle
-n.
--jasmine; [bot.] ''Jasminum officinalis'';
-- సిరిమల్లె = Star Jasmine; [bot.] ''Trachelospermum jasminoides'' of the Apocynaceae family; దీని రేకలు బాగా విచ్చుకుని ఉంటాయి;,
-- మరుమల్లె, బొండుమల్లె; సన్నజాజి; విరజాజి; కాగడా మల్లె; వగైరాలు మల్లెలలో రకాలు; రేకలు ఎంత ఒత్తుగా ఉన్నాయో, ఎంతలా విచ్చుకుంటాయో వగైరాలలో తేడాలు;Pass
-- జూకా మల్లె = Pink Passion Flower); [bot.] ''Passiflora incarnata'' of the Passifloraceae family;
మళ్లా, maLlA
-adv.
--(1) again;
--(2) however; yet;
మళుపు, maLupu
-n.
--turn; turning;
మళ్లు, maLlu
-v. i.
--turn;
మళ్లించు, maLliMcu
-v. t.
--turn; divert;
మసక, masaka
-adj.
--dim; not clear visually; translucent;
మస్తకం, mastakaM
-n.
--head;
మసాలా, masAlA
-n.
--a special mixture of spices;
మసాలా ఆకు, masAlA Aku
-n.
--[bot.] ''Pimenta dioica'';
మస్కాకొట్టు, maskAkoTTu
-v. i.
--cheat; cheat by flattering;
మసి, masi
-n.
--soot; (rel.) నుసి = ashes; ash covering on charcoal;
మసిపాతలో మాణిక్యం, masipAtalIO mANikyaM
- ph.
- diamond in the rough; unrecognized and hidden talent;
మస్తిష్కం, mastishkaM
-n.
--brain;
---మస్తిష్కం = cerebrum.
---అనుమస్తిష్కం = cerebellum.
మసీదు, masIdu
-n.
--mosque; a place of worship for people of Islamic faith;
మస్తుగా, mastugA
-adv.
--plentifully; abundantly;
మసూచికం, masUcikaM
-n.
--smallpox; variola;
-- స్పోటకం; (rel.) ఆటలమ్మ;
మసోలీ, masOlI
-n.
--mausoleum; a magnificent tomb; named after the tomb of King Mausolus of fourth century B.C.;
మహజరు, mahajaru
-n.
--petition;
మహత్, mahat
-adj.
--pref. long; great; big; high;
మహత్తర, mahattara
-adj.
--longer; greater; bigger; higher; taller;
మహత్వం, mahatvaM
-n.
--greatness; superiority;
మహా, mahA
-adj.
--pref. long; great; big; high; (ant.) లఘు = abridged; short;
మహాసముద్రం, mahAsamudraM
-n.
--ocean;
మహాక్షితి, mahAkshiti
-n.
--one followed by 21 zeros;
మహాక్షోణి, mahAkshONi
-n.
--one followed by 16 zeros;
మహాక్షోభం, mahAkshObhaM
-n.
--(1) the great suffering;
--(2) one followed by 23 zeros;
మహాఖర్వం, mahAkharvaM
-n.
--ten trillion; one followed by 13 zeros in the traditional Indian method of counting;
మహాగొనీ, mahAgonI
-n.
--mahogany; [bot.] Sweitenia mahogani;
మహాత్మ్యము, mahAtmyaMu
-n.
--greatness;
మహానింబ, mahAniMba
-n.
--Pusian lilac; a plant closely related to neem; [bot.] ''Melia azaderach'';
మహానిధి, mahAnidhi
-n.
--(1) the great treasure;
--(2) one followed by 25 zeros in the traditional Indian method of counting;
మహాపద్మం, mahApadmaM
-n.
--(1) the great lotus;
--(2) one followed by 15 zeros in the traditional Indian method of counting;
మహాబీర, mahAbIra
- n.
-- [bot.] ''Hyptis suaveolens'';
-- తులసి, చియా జాతి మొక్క; రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటే మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అని అంటారు. సబ్జా గింజలు నానితే ఎలా ఉంటుందో అలాగే ఈ మహాబీర గింజలు కూడా ఉంటాయి;
మహాప్రస్థానం, mahAprasthAnaM
-n.
--great journey; journey leading to enlightenment;
మహాభూరి, mahAbhUri
-n.
--(1) the great big one;
--(2) one followed by 34 zeros;
మహాయుగం, mahAyugaM
-n.
--the Great Yuga; according to Hindu belief, the Great Yuga is comprised of Krita, Treta, Dvapar and Kali Yugas, Duration of a Maha Yuga is ten times that of Kali Yuga, namely, 4, 320, 000 years;
మహావృత్తం, mahAvRttaM
-n.
--Great Circle; circle formed on the surface of a sphere, such as the Earth, by the intersection of a plane that passes through the center of the sphere;
మహాశంఖం, mahASaMkhaM
-n.
--(1) the great conch shell;
--(2) one followed by 19 zeros in the traditional Indian method of counting;
మహాశయుడు, mahASayuDu
-n.
--a person with highly regarded opinion;
మహిమ, mahima
- n.
-- (1) greatness; (2) the power of working miracles;
మహిళ, mahiLa
-n.
--woman; (lit.) one who charms by her wiles and graces;
మహిషం, mahishaM
-n. m.
--he buffalo;
మహిషాక్షి, mahishAkshi
-n.
--[bot.] ''Balsamodendron agallocha'';
మహిషి, mahishi
-n. f.
--she buffalo;
మహీంద్రుడు, mahIMdruDu
- n.
-- king; lord of the land; see also మహేంద్రుడు;
-- మహీ + ఇంద్రుడు = మహీంద్రుడు = భూ పాలుడు = రాజు; (సవర్ణ దీర్ఘ సంధి)
మహేంద్రుడు, mahEMdruDu
- n.
-- Indra; lord of the heavens;
-- మహా + ఇంద్రుడు = మహేంద్రుడు = గొప్ప వాడైన ఇంద్రుడు (గుణ సంధి)
మహోదరం, mahOdaraM
-n.
--ascites; (lit) means swelling of the abdominal area; refers to accumulation of fluid in the abdominal (peritoneal) cavity; The most common cause of ascites is cirrhosis of the liver; Treatment of ascites depends on its underlying cause;
-- edema; dropsy; An old term for the swelling of soft tissues due to the accumulation of excess water; In years gone by, a person might have been said to have dropsy;
-- (rel.) కడుపు ఉబ్బరం means flatulence;
%మాం - mAM, మా - mA
మాండలికం, mAMDalikaM
-n.
--dialect; the version of a language predominantly used in a geographical region;
--- వర్గ మాండలికం = class dialect
--- ప్రాంతీయ మాండలికం = regional dialect; ఉదా: ఉర్ల గడ్డలు — బంగాళా దుంపలు;
--- వైయక్తిక వ్యవహార మాండలికం = idiolect
మాంత్రికుడు, mAMtrikuDu
-n. m.
--(1) magician;
--(2) conjurer;
--(3) sorcerer;
మాంద్యం, mAMdyaM
-n.
--laziness; dullness; weakness; inactivity;
మాంసం, mAMsaM
-n.
--meat; flesh;
---ఆవుమాంసం = beef; the flesh of a cow.
---కుళ్లిన మాంసం = carrion.
---మేకమాంసం = mutton; the flesh of a goat.
---పందిమాంసం = pork, ham, bacon.
---లేడిమాంసం = venison.
---మనిషిమాంసం = flesh.
మాంసకృత్తులు, mAMsakRttulu
-n. pl.
--proteins; ప్రాణ్యములు;
మాంసరోహిణి, mAMsarOhiNi
-n.
--Indian redwood; (lit.) healer of flesh; [bot.] Soymida febrifuga;
మాంసాహారి, mAMsAhAri
-n.
--(1) non vegetarian;
--(2) carnivore;
మా, mA
-pos. pron. pl.
--our;
మాకా, mAA,
- n.
-- Macaw; a large parrot-like bird native to S. America; [bio.] ''Ara ararauna'' of the Psittacidae family;
మాకు, mAku
-pron.
--for us;
-n.
--(1) tree; tree trunk; చెట్లు పెద్దవై గట్టి బోదెతో ఉంటే “మాను/మాకు” అంటారు. మానుకట్టడమనేది అన్ని చెట్లకూ వర్తించే లక్షణంకాదు.
--(2) medicine; drug; (esp.) herbal medicine; వృక్షజాతుల నుండి తయారు చేసినది మందు; మాను నుండి తయారు చేసినది మాకు;
మాగాణి, mAgANi
-n.
--(1) a fertile land with plenty of water resources;
--(2) wet cultivation; నంజె;
మాగు, mAgu
-v. i.
--ripen fully;
మాఘం, mAghaM
- n.
-- (1) the name of the eleventh month of the Telugu calendar; (2) a classical Sanskrit literary work written my Maagha; the book deals with the story of Krishna killing Sisupala during the Rajasuya Yaga performd by Yudhisthara; The offiial title of the book is Sisupalavadha (శిశుపాలవధ). మల్లినాథసూరి దీనికి వ్యాఖ్యానము చేసి ఉన్నాఁడు. అది సర్వంకషము అనఁబడును. "దండినః పదలాలిత్యం భారవేరర్థ గౌరవమ్ ఉపమాకాళిదాసస్య మాఘస్యేతే త్రయోగుణాః" అని విద్వాంసులు మాఘమును మిక్కిలి శ్లాఘింతురు;
మాచిపత్రి, mAcipatri
-n.
--sweet wormwood; [bot.] ''Artemisia indica''; 'Artemisia absinthum'';
--the active ingredient of this plant, Artemisinin, is known to have a curative effect in treating malaria; This medicinal aromatic herb, while native to Europe, grows readily across various climates, including parts of Asia, Africa, South America, and the United States;
మాజీ, mAjI
-adj.
--former; erstwhile; late; ex-;
మాట, mATa
-n.
--word; pledge;
మాటకారి, mATakAri
-n.
--clever speaker;
మాటవరసకి, mATavarasaki
-adv.
--for instance; for example; just for the sake of discussion;
మాట్లాడు, mATlADu
-v. i.
--speak; talk; converse;
మాటిమాటికీ, mATimATikI
-adv.
--again and again;
మాటు, mATu
-n.
--weld; welded patch; soldered patch;
మాటున, mATuna
-adv.
--behind; hidden by; screened by;
మాటుమణుగు, mATumaNugu
-v. i.
--quiet down; become quiet;
మాడ, mADa
-n.
--fontanel; soft central part on the top of an infant's head;
మాడు, mADu
-v. i.
--(1) scorch; sear; burn;
--(2) suffer from hunger pangs;
- n.
-- anterior fontanelle; పసిపిల్లల నడినెత్తి మీద ఉండే మెత్తటి భాగం;
మాణిక్యం, mANikyaM
-n.
--ruby; one of the nine gems or semi-precious stones;
--కెంపు;
-- మాణిక్యం అన్నది సంస్కృత పదం. అది కెంపుకు పర్యాయ పదమే. "మాణిక్య వీణాముపలాలయంతీం, మదాలసాం మంజుల వాగ్విలాసాం" అన్న కాలిదాస కృత దేవీ స్తోత్రం వినే ఉంటారు. కన్నడ భాషలో కెంపు అన్న మాట మాణిక్యానికే కాక 'ఎరుపు రంగు' అన్న అర్థంలో కూడా వాడుతారు. కెంపు యొక్క నాణ్యతను, రంగులోని స్వచ్ఛతను బట్టి 'పద్మ రాగం', 'కురువిందం', 'సౌగంధికం', 'నీలగంధి' అన్న పేర్లతో కూడా పిలుస్తారు;
మాతగొరక, mAtagoraka
-n.
--Rice Fish;
మాతృ, mAtR
-adj.
--mother;
మాతృక, mAtRka
-n.
--source; original of a written work;
మాతృగోళం, mAtRgOLaM
-n.
--mother planet;
మాతృత్వం, mAtRtvaM
-n.
--motherhood;
మాతృభాష, mAtRbhAsha
-n.
--mother tongue;
మాతృభూమి, mAtRbhUmi
-n.
--mother land;
మాతృస్వామ్యం, mAtRsvAmyaM
-n.
--matriarchy the system where the female heads the family;
మాత్ర, mAtra
-n.
--(1) dimension;
--(2) pill; dose;
--(3) syllable;
--(4) duration of time necessary to snap the fingers; duration of time necessary utter a short vowel;
---ఏకమాత్రకం = one-dimensional.
---మూడు మాత్రలు ఒక మోతాదు = three pills is one dose.
మాత్రా ఛందం, mAtrA chaMdaM
-n.
--a prosody that stipulates a strict and specific sequence of short and long characters,
మాత్రుక, mAtruka
-n.
--[math.] matrix; % to e2t
మాదకం, mAdakaM
-n.
--liquor; alcoholic beverage;
మాదక, mAdaka
-adj.
--intoxicating; stupefying;
మాదీఫలం, mAdIphalaM
-n.
--a citrus fruit used in Ayurvedic medicine; [bot.] Citrus medica; దబ్బపండు;
మాది, mAdi
-pos. pron. pl.
--ours;
మాదిరి, mAdiri
-n.
--sample; model;
మాధవి, mAdhavi
-n.
--a white flowering creeper; [bot.] ''Hiptage madablota; Gaertnera racemosa'';
మాధ్యమిక, mAdhyamika
-adj.
--middle;
మాధ్వీకం, mAdhvIkaM
-n.
--a wine made from the ippa flower;
మాధుర్యం, mAdhuryaM
-n.
--sweetness;
మానం, mAnaM
-n.
--(1) a table of weights and measures;
--(2) measure;
--(3) personal and private honor; dignity;
మానచిత్రం, mAnacitraM
-n.
--map % to e2t
మానదండం, mAnadaMDaM
-n.
--measuring rod;
మాననీయ, mAnanIya
-adj.
--respectable; deserving honor; venerable;
మానభంగం, mAnabhaMgaM
-n.
--(1) rape;
--(2) dis-robing by force; loss of personal honor;
మానవ వనరులు, mAnava vanarulu
-n.
--human resources;
మానవత్వం, mAnavatvaM
-n.
--humanity;
మానవాతీత, mAnavAtIta
-adj.
--superhuman;
మానవాళి, mAnavALi
-n.
--humanity; mankind; the human race;
మానవుడు, mAnavuDu
-n.
--human being; Homo Sapiens; man; (ety.) descendent of Manu;
మానస, mAnasa
-adj.
--mental;
మానసిక, mAnasika
-adj.
--psychological; mental;
మాన్య, mAnya
-adj.
--honored; venerable;
మాన్యం, mAnyaM
-n.
--(1) land;
--(2) land given by a ruler on a quit-rent, for a favorable tenure, or as a gift for services rendered;
మానిక, mAnika
-n.
--a volumetric measure used in pre-independence India; 1 మానిక = 1 సేరు = 2 తవ్వలు = 4 సోలలు;
మాను, mAnu
-n.
--tree trunk;
-v. i.
--(1) heal;
--(2) suspend; quit;
-v. t.
--stop doing; put a stop to;
మానుగాయ, mAnugAya
-n.
--olive; a small fruit tha grows in the Mediterranian area;
మానుప్పు, mAnuppu
-n.
--carbonate of potash;
మానుపెండలం, mAnupeMDalaM
-n.
--[bot.] Manihot utilissima;
మానుపసుపు, mAnupasupu
-n.
--[bot.] Cosinium fenestratum;
మాన్యులు, mAnyulu
-n.
--honorable person; when used in front of a name, a title equivalent to "Honorable";
మాపకం, mApakaM
-n.
--(1) measuring instrument; meter;
--(2) destruction;
ఉష్ణమాపకం = thermometer.
అగ్నిమాపక దళం = crew of firefighters.
మాపు, mApu
-v. t.
--make dirty; soil; make something to look like it has been used;
-n.
--the tendency to get soiled or dirty;
ఈ రకం రంగు బట్ట మాపు ఓర్చుతుంది = this type of colored cloth can withstand the tendency to get soiled or dirty.
మాబీర, mAbIra
-n.
--[bot.] ''Ajuga disticha;''
మాభేరి, mAbhEri
-n.
--Malabar batmint; [bot.] ''Anisomeles malabarica;''
మామ, mAma
-n.
--(1) maternal uncle;
--(2) father-in-law;
మామ్మ, mAmma
-n.
--(1) grand mother; father's mother;
--(2) any old lady;
మామిడల్లం, mAmiDallaM
-n.
--mango ginger; a tuber that tastes like mango and looks like ginger; [bot.] ''Curcuma amada'' of the Zingiberaceae family; this is related more to turmeric than to either mango or ginger;
మామిడి చెట్టు, mAmiDi ceTTu
-n.
--mango tree; [bot.] ''Mangifera indica;''
-- [Sans.] రసాలం;
మామిడి పండు, mAmiDi paMDu
-n.
--mango fruit; [bot.] ''Mangifera indica;''
-- రత్నగిరి (Alphonso); కేసరి; దశేరి; హిమసాగర్; బాదామి; బంగినపల్లి; తోతపురి; మల్గోబా; ఇమామ్ పసంద్; అమరపాలి; మల్లిక; ముంత మామిడి; కొత్తపల్లి కొబ్బరి; పెద్ద రసాలు; చిన్న రసాలు; చెరుకు రసాలు; సువర్ణరేఖ; నీలాలు;
మాయ, mAya
-n.
--(1) placenta;
--(2) illusion; trick; artifice; deceit; sorcery; jugglery; the unreal stuff; that which is ephemeral;
--(3) the power of God that creates, preserves, and destroys the Universe;
--(4) spiritual ignorance; (ety.) మా = not, య = this;
మాయదారి, mAyadAri
-adj.
--deceitful; wretched;
మాయావి, mAyAvi
-n.
--cheater; conjurer;
మాయు, mAyu
-v. i.
--become dirty, soiled or stained;
మారకం, mArakaM
-n.
--(1) fatal sign; impending danger of death, big financial loss, or loss of reputation, as predicted by a horoscope;
--(2) fatality;
--(3) exchange; exchange rate;
---విదేశ మారకపు ద్రవ్యం = foreign exchange money.
మారటితల్లి, mAraTitalli
-n.
--step-mother;
మార్కండేయుడు, maarkanDEyuDu
- n.
-- మృకండు మహర్షి కొడుకు, మహాభక్తుడు, షోడశవర్ష ప్రాయుడు.
-- లోకానికి మృత్యుంజయ స్తోత్రం అనుగ్రహించాడు మృకండు మహర్షి. "చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః" అని వీడని ధైర్యంతో ఆత్మనిష్ఠుడయ్యాడు. ఈ నాటికీ ఎవరికైనా అకాలమరణబాధా నివృత్తికి ఆ చంద్ర శేఖర అష్టకమే దివ్యౌషధం అయింది.
మార్గం, mArgaM
-n.
--(1) way; path; route; track;
--(2) course of action;
మార్గదర్శి, mArgadarSi
-n.
--guide; heralder; one who shows the way;
మార్గసాహిత్యం, maargasaahityaM
- n.
-- Classical literature;
మారాముచేయు, mArAmu cEyu
-v .i.
--behave obstinately;
మార్జాలం, mArjAlaM
- n.
-- cat;
-- పిల్లిని సంస్కృతంలో మార్జాలము అంటారు. 'మార్జనమ్' అంటే శుభ్రం చేసుకోవడము. కాబట్టి పిల్లి పేరులోనే ఉంది అది 'పరిశుభ్రమయినది ' అని.
మారు, mAru
-n.
--time; turn; occasion;
మారు, mAru
-v. i.
--change;
మారుగుళ్లదొడ్డి, mAruguLLladoDDi
-n.
--marshaling yard; switching yard; the place the bogies of a train are assembled and re-assembled into the specified sequence;
మారుపేరు, mArupEru
-n.
--alias; nickname; epithet;
మార్కులు, mArkulu
-n. pl.
--marks; points scored in an examination;
మార్చు, mArcu
-v. t.
--change; alter;
మార్పు, mArpu
-n.
--change; conversion; alteration;
మారేడు, mArEDu
-n.
--bael; hog plum; golden apple; [bot.] ''Aegle marmelos'' of the Rutaceae family;
-- The tree is considered to be sacred by the Hindus;
-- [Sans.] బిల్వ; సిరిఫలమ్;
మాల, mAla
-adj.
--belonging to one of the untouchable castes of India;
-n.
--(1) garland; wreath;
--(2) a stanza (in a poem) with four lines, such as చంపకమాల and ఉత్పలమాల;
--(3) one of the untouchable castes of India;
మాలకాకి, mAlakAki
-n.
--raven; a black crow;
-- బొంతకాకి; కాకోలం;
మాల గద్ద, mAla gadda,
- n.
-- the pariah kite; [bio.] ''Milvus migrans'';
మాలతి, mAlati
-n.
--jasmine creeper; [bot.] ''Aganosma roxburghii; Aganosma caryophyllata; Jasmin grandiflorum;''
మాల్కంగుని, mAlkaMguni
-n.
--[bot.] ''Celastrus paniculeta;''
మాలాకారి, mAlAkAri
-n.
--(1) florist;
--(2) a person who makes garlands;
మాల్గాడీ, mAlgADI
-n.
--goods train;
మాలి, mAli
-n.
--gardener; తోటమాలి;
మాలిక, mAlika
- n.
-- (1) a stanza in a poem with many lines; (2) a garland;
మాలిన, mAlina
-suff.
--sans; without; devoid of; not; -less;
---అలవిమాలిన = beyond the reach of accomplishment;
---పనికిమాలిన = useless.
---బుద్ధిమాలిన = thoughtless.
---వల్లమాలిన = unreal;
---దయమాలిన = merciless;
---దిక్కుమాలిన = aimless; orphan;
---నీతిమాలిన = amoral;
---గతిమాలిన = directionless; trackless;
---సిగ్గుమాలిన = shameless;
---తెలివిమాలిన = thoughtless;
మాలిన్యం, mAlinyaM
-n.
--filth; foulness; pollutant; pollution;
మాలిమి, mAlimi
-n.
--(1) familiarity; getting used to;
--(2) navigator; pilot;
మాలీసు, mAlIsu
-n.
--(1) grooming; rubbing; cleaning; (2) kneading;
మాలు, mAlu
-- adj.
--- spoil; ruin; lose;
మావి, mAvi
-n.
--placenta; amniotic sac;
మాసం, mAsaM
-n.
--month;
--అమంత మాసం = the duration from one new moon day to the next new moon day, in one type of reckoning a month,
--పూర్ణిమాంత మాసం = the duration of time from one full moon day to the next full moon day, in one type of reckoning a month.
మాస, mAsa
-adj.
--monthly;
మాసిక, mAsika
-n.
--patch; patch on a garment;
మాసిపోవు, mAsipOvu
-v. i.
--become soiled; become dirty;
మాహిషం, mAhishaM
- n.
-- cow;
-- మాహిషం అనేది మూడో ఈత ఆవు; "మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధి" కాళిదాసు ఆభాణకానికి ఈ అర్థమే!
మింగు, miMgu
-v. t.
--swallow; devour;
మించు, miMcu
-v. t.
--surpass; exceed; excel; transgress;
మిక్కిలి, mikkili
-adj.
--much;
మిగులు, migulu
-n.
--(1) remainder; balance;
--(2) excess;
--(3) [math.] carry; (ant.) తగులు = deficit; borrow; in the decimal number system, for example, when two digits are added and if the sum exceeds ten, we put one of the digits of the total as the sum and the other digit is "carried" into the next higher position. Similarly, during subtraction, a "borrow" arises.
మిగుల్చు, migulcu
-v. t.
--save; preserve; retain; keep;
మిట్ట, miTTa
-n.
--(1) high ground;
--(2) hillock; (ant.) పల్లం;
మిట్టమధ్యాహ్నం, miTTamadhyAhnaM
-n.
--high noon;
మిటారి, miTAri
- n.
-- an attractive woman; a fashionable woman; an enticing woman;
మిఠాయి, miThAyi
-n.
--sweet; confection;
మిడత, miData
-n.
-- (1) common grasshopper; vegetable grasshopper; [biol.] ''Atractomorpha similis'' of the Pyrgomorphidae family;
-- (2) tobacco grasshopper; [biol.] ''Atractomorpha crenulata''
--locust; cricket; mantis;
-- (rel.) ఇలకోడి; కీచురాయి;
మిడిమిడి, miDimiDi
-adj.
--slight; meagre;
---మిడిమిడి జ్ఞానం = half-baked knowledge.
మిడిసిపాటు, miDisipATu
-n.
--haughtiness; insolence;
మిణుగురు పురుగు, miNuguru purugu
-n.
--glowworm; glow fly; firefly;
మితం, mitaM
-n.
--moderate;
మిత, mita
-adj.
--moderate;
మితవ్యయం, mitavyayaM
-n.
--economy;
మితవాది, mitavAdi
-n.
--political moderate;
మిత్ర, mitra
-adj.
--friendly; allied;
మిత్రమండలి, mitramaMDali
-n.
--friendly group; allies;
మిత్రస్థానం, mitrasthaanaM
- n.
-- favorable location; friendly location;
-- జ్యోతిషంలో ఒకే వర్గానికి చెందిన గ్రహాలు ఒకరికొకరు మిత్రులు అవుతారు. ఎదుటి వర్గానికి చెందిన గ్రహాలు శత్రువులు అవుతారు. ఒక గ్రహం తనకు మిత్రుడైన గ్రహానికి చెందిన రాశిలో (ఉదాహరణకు కుజుడి రాశి అయిన మేషంలో గురుడు ఉండటం) ఉన్నప్పుడు అది మిత్ర స్థానం అవుతుంది. ఇక్కడ గ్రహం ప్రశాంతంగా, అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది. ఒక గ్రహం తనకు శత్రువైన గ్రహానికి చెందిన రాశిలో (ఉదాహరణకు సూర్యుడి రాశి అయిన సింహంలో శని ఉండటం) ఉన్నప్పుడు అది శత్రు స్థానం అవుతుంది. ఇక్కడ గ్రహం ఒత్తిడికి లోనై, శుభ ఫలితాలను ఇవ్వడంలో ఇబ్బందులను సృష్టిస్తుంది.
మితి, miti
-n.
--(1) limit; bound;
--(2) a measure; a measuring device;
---మితిమీరి = exceeding the limit.
---భారమితి = a pressure gauge.
---ఉష్ణమితి = a temperature gauge.
మితిమీరు, mitimIru
-v. i.
--exceed the limit;
మిత్తి, mitti
- n.
- interest;
-- అడ్డికి పావుశేరు మిత్తి = అడ్డ అంటే రెండు శేర్లు. "అడ్డకి పావుశేరు మిత్తి" అంటే ఎనిమిదో వంతు వడ్డీ. పన్నెండున్నర శాతం.
మిత్రుడు, mitruDu
-n. m.
--friend; ally; pal; (ant.) శత్రువు;
మిథ్య, mithya
-n.
--unreal; imaginary; illusion; something that cannot be definitively identified as such;
మిథునం, mithunaM
-n.
--(1) the couple Shiva and Parvathi of Hindu mythology;
--(2) wife and husband; couple; esp. old couple;
--(2) Gemini; a zodiacal sign;
మిథునరాశి, mithunarASi
-n.
--Gemini, the constellation; one of the twelve signs of the Zodiac;
మిద్దె, midde
-n.
--the upper part of a flat-roofed house; terrace;
మిద్దెటిల్లు, middeTillu
-n.
--a house with a terraced roof;
మినప, minapa
-adj.
--pertaining to black gram dal; see also మినుగులు;
మినప్పప్పు, minappappu
-n.
--black gram dal; split urid dal;
మినహా, minahA
-adv.
--with the exception of;
మినహాయించి, minahAyiMci
-adv.
--not counting; omitting; not including;
మిన్న, minna
-adj.
--better; superior;
మిన్నక, minnaka
-adv.
--quietly; coolly; without making any overt moves;
మినుకు, minuku
-n.
--twinkle;
మినుకు మినుకు, minuku minuku
-adj.
--twinkling;
మినుగులు, minugulu
-n.
--whole black gram; "urid dal"; [bot.] ''Vigna mungo'' (old name: Phaseolus radiatus); Phaseolus minimum of Leguminosae (pea) family;
మిన్ను, minnu
-n.
--sky;
---మిన్ను విరిగి మీద పడుతోంది = [idiom] the sky is falling.
మిరప, mirapa
-adj.
--pertaining to cayenne pepper;
-n.
--cayenne; pepper; chili; chilli; this plant, a native to Brazil, came to India after the late fifteen hundreds;
-- మిర్చి అన్నా మిరప అన్నా ఒక్కటే; గుంటూరు మిర్చి ఎర్ర తోలుతో ఉంటే గొల్లప్రోలు మిర్చి నారింజ రంగులో ఉంటుంది;
--- కొండ మిరప = Bird eye chillies;
--- ఎర్ర మిరప = red pepper; [bot.] ''Capsicum fastigiatum; Capsicum annuum''of the Solanaceae family;
--- పచ్చ మిరప = green pepper; [bot.] ''Capsicum frutescens'';
--- ఎండుమిరప, = dried chilli;
--- బుంగ మిరప = bell peppers = sweet peppers = Simla peppers;
--- పాప్రికా = paprika = కారం తక్కువ ఉన్న మిరప;
--- పిమెంటో = red pimento = కారం లేని మిరప;
మిరాసీ, mirAsI
-n.
--hereditary right;
మిరియాలు, miriyAlu
-n.
--black pepper; [bot.] ''Piper nigrum'' of Piperaceae family;
--చల్ల మిరియాలు = తోక మిరియాలు = [bot.] ''Piper cubeba'' of Piperaceae family;
-- త్రికటువులు = శొంఠి, మిరియాలు, పిప్పళ్లు;
--[Sans.] మరిచం; శ్యామం; వల్లీజం;
మిలమిల, milamila
-adj.
--sparkling; onomatopoeia for sparkling looks;
మిల్లిగరిటె, milligariTe
-n.
--very small spoon;
మిల్లీ, millI
-adj.
--pref. one-thousandth; (ant.) కిలో = kilo;
మిల్లీమీటరు, millImITaru
-n.
--millimeter; one-thousandth of meter; a measure of length in the metric system;
మిల్లీలీటరు, millIlImITaru
-n.
--milliliter; one-thousandth of a liter; a measure of volume of liquids in the metric system;
మిశ్రమం, miSramaM
-n.
--mixture;
మిశ్రమ లోహం, miSrama lOhaM
-n.
--composite; (rel.) alloy;
మిష, misha
-n.
--excuse; pretense; trick;
మిషను, mishanu
-n.
--machine;
---కుట్టు మిషను = sewing machine.
మిసిమి, misimi
-n.
--luster; polish;
మీ, mI
-pos. pron.
--your; genitive of మీరు;
మీగడ, mIgaDa
-n.
--the skin of milk; cream on the surface of heated milk;
మీట, mITa
-n.
--switch; lever;
మీటలమాల, mITalamAla
-n.
--a bank of switches;
మీటరు, miTaru
-n.
--(1) meter; a measuring instrument such as the volt meter;
--(2) meter; metre; a standard measurement of length in the metric system of units. One meter equals 100 centimeters (cm). 1000 meters is a kilometer (km);
---థర్మామీటరు = thermometer.
మీటు, mITu
-v. t.
--pluck with fingers; pull; fling;
మీది, mIdi
-adj.
--upper;
---మీది భాగం = upper portion
-pos. pron.
--yours;
---ఇది మీది = this is yours
మీదుమిక్కిలి, mIdumikkili
-adv.
--in addition to; over and above; besides;
మీమాంస, mImAmsa
-n.
--(1) investigative examination; discussion to find the truth;
--(2) one of the six systems of Indian philosophy, called Darshanas;
మీమాంసకుడు, mImAmsakuDu
-n.
--investigator; examiner; detective;
మీనం, mInaM
-n.
--Pisces, the constellation; one of the twelve signs of the Zodiac; మీనరాశి;
మీనమేషాలు లెక్కపెట్టడం, mInamEshAlu lekka peTTaDaM
-ph.
--[idiom] wasting too much time analyzing; procrastination;
మీను, mInu
-n. s.
--fish;
మీనురూపురిక్క, mInurUpurikka
-n.
--(lit.) the constellation in the shape of a fish; Piscum; రేవతీ నక్షత్రం;
మీరు, mIru
-pron.
--you;
-v. i.
--exceed;
మీలు, mIlu
-n. pl.
--fish;
మీసం, mIsaM
-n.
--(1) man's moustache;
--(2) animal's whiskers; vibrissae; these are not hairs and should not be trimmed; these are sensors of vibrations;
--(3) insect's antenna;
ముంగిలి, muMgili
-n.
--courtyard; frontyard;
ముంగిస, muMgisa
-n.
--mongoose; [bio.] ''Herpestes sp''.;
-- నకులిక; అహి-నకులిక బంధం = పరస్పర విరోధంతో ఎపుడూ ప్రవర్తించే జాతి వైరం. ఒకరిని చూడగనే మరొకరికి అతణ్ణి చంపివేయాలనేటంత కోపం;
ముంగురులు, muMgurulu
- n. pl.
-- forelocks;
ముంచు, muMcu
-v. t.
--dip; plunge; immerse; (ant.) తేల్చు;
ముంజ, muMja
-n.
-- దర్భతో పేడిన ముప్పేట తాడును ముంజ అంటారు. ముంజ అనే గడ్డి(దర్భ)తో పేడినది — మౌంజి. దీన్ని మేఖల అని గూడా అంటారు. బ్రహ్మచారి ఎపుడూ ధరించవలసినవిగా చెప్పిన వాటిలో ఈ మౌంజి ఒకటి.
ముంజె, muMje
-n.
--soft and tender kernel inside the stone of a palm fruit;
ముండ, muMDa
-n.
--(1) widow; a woman whose head is shaven;
--(2) prostitute;
ముండ్లతోటకూర, ముళ్లతోటకూర, muMDlatOTakUra, muLlatOTakUra
-n.
--[bot.] ''Amarantus spinosus'';
ముండ్లపంది, muMDlapaMdi
-n.
--porcupine; [bio.] ''Hystrix indica'';
ముండ్లపొన్నగంటి కూర, ముళ్లపొన్నగంటి కూర, muMDlapaMdi, muLlaponnagaMTi kUra
-n.
-- [bio.] ''Alternanthera pungens'' HBK
ముండ్లముస్తె, muMDlamuste
-n.
--three-lobed nightshade; [bot.] Solanum trilobatum; [Sans.] అలర్కము;తెల్లజిల్లేడు;
ముండ్లు, ముళ్లు, muMDlu, muLlu
-n.
--thorns; setal;
ముంత, muMta
-n.
--pot; vessel;
ముంత, తప్పేలా, muMta tappElA
-n.
--pots and pans;
ముంతగజ్జనం, muMtagajjanaM
-n.
--[bot.] ''Ichnocarpus frutescens'';
ముంతమామిడి, muMtamAmiDi
-n.
--cashew; [bot.] ''Anacardium occidentale''; ''Semecarpus anacardium'';
-- జీడిమామిడి; మొక్కమామిడి;
ముందర, muMdara
-p.p.
--before; in front of;
ముందుకు, muMduku
-adv.
--forwards;
ముందుకు వచ్చు, muMduku vaccu
-v. i.
--come forward; emerge;
ముక్క, mukka
-n.
--(1) piece; fragment; cube;
--(2) word; message;
---మంచుముక్క = piece of ice.
---ముక్కలుగా కొయ్యి = dice into cubes.
---ఆ ముక్క చెప్పలేక పోయావా? = why didn't you tell me that word?
ముక్కర, mukkara
- n.
-- a nose-stud, often made of gold, with a colorful precious or semi-precious stone;
ముక్క వాసన, mukkavAsana
-n.
--stale smell; musty smell;
ముక్త, mukta
-adj.
--(1) united; unified;
--(2) leftover; previously used;
---ముక్త కంఠం = with one voice.
---ముక్తపదగ్రస్తం = a figure of speech in which the previous word or syllable is picked up in the next word.
ముక్తసరి, muktasari
-adj.
-- (1) brief; succinct; abbreviated, abridged; contracted; summarized; (2) mean; trivial; small; a trifle.
-- ముక్త అంటే 1."విడిచిన" అని, 2. "ముత్యము" అని రెండు అర్థాలు ఉన్నాయి; ముక్త సరి —అంటే ముత్యంతో సమానంగా, అనగా అతి సూక్ష్మంగా, చిన్నదిగా, అందంగా అని. ముక్త సరి సమాధానం = brief response. ముక్త కంఠంగా అంటే "నోరంతా తెరచి అని, అంటే నోరారా;"
-- (ety.) ముఖ్తసర్ (مختصر) అన్నదానికి సంగ్రహించు, సంగ్రహం అన్న అర్థం అరబ్బీలో ఉంది;
ముక్కాలిపీట, mukkAlipITa
-n.
--tripod; త్రిపాది;
ముక్తానుషంగాలు, muktAnushaMgAlu
- n. pl.
--free associations;
ముక్తాయింపు, muktAyiMpu
-n.
--summary; conclusion;
ముక్కాలు, mukkAlu
- n.
-- the fraction 3/4;
ముక్కిడి, mukkiDi
-n.
--[bot.] ''Schrebera swietenioides'';
ముక్కు, mukku
-n.
--nose; నాసిక;
---బురమ్రుక్కు = stout nose.
ముక్కుతుమ్ముడు తీగ, mukkutummuDu tIga
-n.
--[bot.] ''Leptadenia reticulata'';
ముక్కుతో, mukkutO
-adj.
--nasal; twangy;
ముక్కుదూలం, mukkudUlaM
-n.
--nose bridge; the hard, bony part of the nose;
ముక్కుపచ్చలారలేదు, mukkupaccalAralEdu
-ph.
--[idiom] still wet behind the ears;
ముక్కుముంగర, mukkumuMgara
-n.
--[bot.] Asystasia coromandeliana;
ముఖం, mukhaM
-n.
--face; countenance;
ముఖపరిచయం, mukhaparicayaM
-n.
--nodding acquaintance;
ముఖమల్, mukhamal
-n.
--velvety cloth;
ముఖరితం, mukharitaM
- n.
-- resonance;
ముఖవచనం, mukhavacanaM
-n.
--oral communication; word of mouth;
ముఖస్తుతి, mukhastuti
-n.
--flattery; sycophancy;
ముఖ్యం, mukhyaM
-n.
--important; fundamental; basic; central; primary; key;
ముఖాముఖీ, mukhAmukhI
-n.
--(1) interview; face to face; in front;
--(2) rendezvous; tryst;
ముగ్గు, muggu
-n.
-- an ornamental pattern, drawn on the ground or floor with rice flour or chalk, especially at the front of a Hindu household;
ముగ్గురు, mugguru
-pron.
--three people;
ముచ్చటించు, muccaTiMcu
-v. t.
--talk about; discuss about;
ముచ్చిక, muccika
-n.
--calyx of a fruit or flower; structure near the stem of a fruit or flower;
ముచ్చిలిగుంట, mucciliguMTa
-n.
--the small dent-like depression at the back of the head, just below the cranium;
ముట్టడి, muTTaDi
-n.
--attack;
ముట్టడించు, muTTaDiMcu
-v. t.
--attack;
ముట్టించు, muTTiMcu
-v. t.
--kindle; light; touch with fire;
ముట్టు, muTTu
-n.
--menses; period; menstruation; the period of monthly discharge in adult females;
ముట్టుకొను, muTTukonu
-v. t.
--touch;
ముట్టె, muTTe
-n.
-- (1) snout; the forward projecting part of an animal's head; (2) the hard "stone" inside mango and palm fruits;
-- ముట్టె అనేది మామిడి టెంకకు వాడుక; అలాగే తాటి ముట్టె (తాటిచెట్టు నాటేదానికి గింజ); తలకూ పర్యాయపదం (సన్నివేశాన్ని బట్టి), వాడికి ముట్టె పొగురు (తల పొగరు అనే అర్థంలో); విడిగా ముట్టె అంటే తల అని కాదు.
ముఠా, muThA
-n.
--gang; clique;
ముడత, muData
-n.
--wrinkle; fold; pleat;
ముడి, muDi
-adj.
--raw;
---ముడి పదార్థం = raw material.
---ముడి పట్టు = raw silk.
-n.
--knot;
ముడిగాళ్లు, muDigALlu
-n.
--knock knees; the shape of legs that causes the knees to knock as a person walks;
ముడ్డి, muDDi
-n.
--(1) rump;
--(2) anus;
ముడుగుదామర, muDugudAmara
-n.
--[bot.] Marsilia quadrifolia;
ముడుచు, muDucu
-v. t.
--fold;
ముడుచుకొను, muDucukonu
-v. i.
--fold up; curl up;
ముతక, mutaka
-adj.
--coarse; rough; crude; unrefined;
ముతక చమురు, mutaka camuru
-n.
--crude oil, when referring to petroleum;
ముతకనూనె, mutakanUne
-n.
--unrefined oil, when referring to edible oils;
ముత్త, mutta
-adj.
--elderly; old;
---ముత్తాత = great grandfather; (lit.) old grandfather;
---ముత్తైదువ = (1) an elderly woman whose husband is still alive; (ety.) ఆ + విధవ = అవిధువ --> ఐదువ; ముది + ఐదువ = పెద్ద వయస్సులో ఉన్న పెళ్ళి అయినా స్త్రీ; (2) ముత్తు అంటే ముద్దు; (తమిళంలో నేటికీ ఈ అర్థంలో ఉంది.) కాబట్టి అందమైన అనే అర్థంలో ముత్తు + ఐదువ = ముత్తైదువ కావచ్చు.
ముత్యం, mutyaM
-n.
--pearl; the solidified excretion of a sea mussel; మౌక్తికం;
ముత్యపుచిప్ప, mutyapucippa
-n.
--mother-of-pearl; pearl oyster; ముక్తాస్పోటం; శుక్తి;
ముత్తాత, muttAta
-n.
--great grandfather;
ముదం, mudaM
-n.
--happiness;
ముదనష్టపు, mudanashTapu
-adj.
--ill-fated; unlucky;
ముదర, mudara
-adj.
--(1) mature; not tender;
--(2) dark; not light;
--(3) thick; not thin;
---ముదర కాయ = a green vegetable that is reaching the stage of ripening.
---ముదర రంగు = dark color.
---ముదర పాకం = thick syrup.
---రోగం ముదిరిపోయింది = the disease has taken root, it is no longer acute.
ముదరా, mudarA
-n.
--refund; rebate; compensation; reduction in price;
ముద్ద, mudda
-n.
--(1) paste;
--(2) morsel; bolus; dollop; see also కరడు;
---పప్పుముద్ద = a dollop of dal.
ముద్ర, mudra
-n.
--(1) stamp; imprint; print;
--(2) posture in dance;
---చెరగని ముద్ర = indelible imprint.
ముద్రణ, mudraNa
-n.
--printing;
---ముద్రణ యంత్రం = printing press.
ముదావహం, mudAvahaM
-n.
--commendable;
ముద్దాయి, muddAyi
-n.
--defendant;
ముద్రాపకులు, mudrApakulu
-n. pl.
--printers;
ముద్రారాక్షసం, mudrArAkshasaM
-n.
--printing error; printer's devil;
ముదిమి, mudimi
-n.
--old age; decrepitude;
ముద్రించు, mudriMcu
-v. i.
--print;
ముదురు, muduru
-adj.
--(1)mature; fully grown; not tender;
--(2) dark
---ముదురు రంగు = dark color;
ముద్దు, muddu
-n.
--(1) kiss; caress;
--(2) love; fondness; affection;
--(3) charmingness;
ముద్దుచేయు, mudducEyu
-v. i.
--dote on; adore; love and affection expressed by adults toward children;
ముద్దుపేరు, muddupEru
-n.
--pet name; nickname; sobriquet;
ముద్దువచ్చు, mudduvaccu
-v. i.
--to be cute; to be adorable; kissable;
మునగ కాడ, munaga KADa
-n.
--drumstick; Moringa; the long, rod-like fruit of drumstick tree; [bot.] ''Moringa oleifera'' of the Moringaceae family;
-- [Sans.] శిగ్రుః; శోభాంజనః: ఆక్షీబః;
మునగ చెట్టు, munaga ceTTu
-n.
--drumstick tree; [bot.] ''Moringa pterygosperma; Moringa oleifera;''
-- మునగ ఆకులలో క్లోరోజెనిక్ ఆమ్లం (chlorogenic acid), క్వెర్సెటిన్ (quercetin) వంటి ఏంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కర్బనోదకాల విచ్ఛిన్నాన్ని నెమ్మదిస్తూ, రక్తంలో గ్లూకోజ్ శోషణను నియంత్రిస్తాయి. మునగ పొడి పాన్క్రియాస్లోని బీటా కణాలను సురక్షితంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది.
మునసబు, munasabu
- n.
-- Munsiff: a village-level officer of justice, usually a rank below a magistrate and above the rank "karanam."
ముని, muni
-n.
--hermit; seer; thinker; an ascetic observing silence;
-- సంస్కృతంలో "మౌనం పాటించేవాడు" లేదా "తపస్వి" అనే అర్థం; మౌనంగా ఉంటూ ఆత్మ జ్ఞానాన్ని సాధించేవారు; "మౌనం చైవాస్మి గుహ్యానాం" అంటాడు భగవానుడు గీతలో.
-- ఋషులు మునులు ఒకటే. అందరూ భగవద్ధ్యాన పరాయణులే. ఋషులు త్రికాల జ్ఞానం కలవారు. అలాంటి దర్శనం వాళ్లకు కలుగుతుంది. వాళ్లు వశ్య వాక్కులు; ఋషుల నోట మాట అసంకల్పితంగా వస్తుంది. అది అట్లే జరుగుతుంది;
మునిమాపు, munimApu
-n.
--twilight; early evening;
--మునిచీకటి;
మునిశ్వేతం, munisvEtaM
-n.
--cloudy white;
మున్నీరు, munneeru
- n.
-- sea; ocean; the first waters; మొదటినీరు (= సముద్రం)
-- మున్- అన్న ధాతువుకు ముందు, తొలి అన్న అర్థాలున్నాయి. ఉదాహరణకు, ముంగురులు అంటే ముందున్న కురులు. మున్నుడి అంటే తొలిపలుకు, పుస్తకానికి ముందు ఉండే నుడి. ముత్తాత తాత కన్నా ముందున్న వాడు. అలాగే, ముచ్చెమటలు ముఖం మీద కనిపించే చెమటలు. కారు అంటే పంట అన్న అర్థం అయితే, ముంగారు అంటే తొలి పంట. అట్లాగే ముంజేయి, ముంగాలు మొదలైన పదాలు. ఈ పదాలన్నిటిలోనూ మున్- అన్న ఉపసర్గ ‘ముందు’ అన్న అర్థాన్ని సూచించేవే.
-- ముల్లోకాలు, ముమ్మారు, ముజ్జగములు, ముమ్మూర్తుల - ఈ పదాలన్నింటిలో మూన్-/మున్- అన్న ధాతువుకు మూడు అన్న అర్థమే ఉన్నా, మున్- అంటే ముందు అన్న అర్థం ఉన్న ధాతువు వేరే ఉంది.
మునుగు, munugu
-n.
--sink; go down; get inundated; (ant.) తేలు;
ముప్పాతిక, muppAtika
-n.
--three-fourths; three-quarters;
ముప్పావు, muppAvu
-n.
--three-quarters;
ముప్పిరి, muppiri
-adj.
--triple; three-fold;
ముప్పు, muppu
-n.
-- (1) calamity; danger; urgency; విపత్తు; (2) old age; వార్థకము;
ముప్ఫయ్, mupphai
-n.
--thirty;
ముబ్బడి, mubbaDi
-adj.
--triple; three times; three-fold;
ముభావం, mubhAvaM
-n.
--aloofness; reserved; indifference;
ముమ్మడించు, mummaDiMcu
-v. i.
--increase three-fold;
ముమ్మాటికీ, mummATikI
-adv.
--on all (three) counts;
ముయ్యాకుపొన్న, muyyAkuponna
-n.
--[bot.] ''Pseudarthria viscida;''
మురకుండాకు, murakuMDAku
-n.
--[bot.] ''Acalypha indica;''
మురబ్బా, murabbA
-n.
--candied preserve; fruit pieces preserved in honey or sugar syrup with no additional preservatives; this is different from jam or jelly or an electuary;
---అల్లం మురబ్బా = candied ginger.
-- Clean ginger: peel skin, dice into pieces, and blend into a paste. Heat sugar until it melts and begins to caramelize (ఉండ పాకం వచ్చేదాకా). Add a dash of salt and a spoonful of Cardamom powder, and mix well. Transfer to a buttered plate. Cut into bite-size pieces;
మురమురాలు, muramurAlu
- n. pl.
- puffed rice;
-- [rel.] పేలాలు = popped rice or pop corn
మర్త్యలోకం, martyalOkaM
- n.
-- the abode of humanity; the Earth; (lit.) the land of the mortals;
మురికి, muriki
-n.
--dirt; sewage;
మురికి చేయు, muriki cEyu
-v. t.
--soil;
మురికి నీళ్లు, muriki nILlu
-n.
--sewage water; dirty water;
మురికివాడ, murikivADa
-n.
--slum;
మురిపిండ, muripiMDa
- n. [bot.] Acalypha indica Linn. Euphorbiaceae
-- Indian acalypha;
మురుగు కాలువ, murugu kAluva
-n.
--sewer;
మురుదొండ, murudoMDa
-n.
--[bot.] ''Bryonia epigaea'';
మురుపిండి, murupiMDi
-n.
--[bot.] ''Acalypha indica'';
ముర్రుపాలు, murrupAlu
-n.
--beestings; colostrum; milk of domestic cattle (cow, buffalo, goat, etc.) that has recently calved; this substance is rich in nutrients and antibodies and are essential for the calf; In humans, such items are supplied to the growing infant via the umbilical cord; apparently, in cattle such supply is not done. so drinking these besstings is essential for the calf;
--same as జన్నుపాలు;
ములక, mulaka
-n.
--plunger;
ములగ, mulaga
- n.
-- [bot.] ''Moringa oleifera'';
ముల్లంగి, mullaMgi
-n.
--(1) carrot;
--(2) radish; [bot.] Raphanus sativus; Brassica rapa Linn.;
ములికినాట్లు, mulikinaaTlu
- n. pl.
-- a sub-sect among Brahmins;
-- కేవలం వైదికవృత్తి వ్యవసాయం మాత్రమే చేసేవారు వైదికులు; వైదీకులలో వెలనాట్లు అనగా కోనసీమ ఇంకా పైకి వున్నవారు; ములికినాట్లు అనగా రాయలసీమ వైపు వారు; తెలగాణ్యులనగా తెలంగణా ప్రాంతం వారు. ఈవిధంగా వృత్తిపరంగా, ప్రాంతీయతాపరంగా వచ్చినవి ఈ భేదాలు.
ముల్కీ, mulkI
- n.
-- native; a person belonging to a region;
ములు, mulu
-pref.
--indicates thorn or rough celia on leaves;
ములుకు, muluku
-n.
--sharp point; thorn;
ములుకోల, mulukOla
-n.
--goad; a stick with a needle at its end;
ములుగు చేప, mulugu chEpa
- n.
-- eel fish; Eels are ray-finned fish belonging to the order Anguilliformes, which consists of eight suborders, 20 families, 164 genera, and about 1000 species;
ములుగొలిమిడి, mulugolimiDi
-n.
--[bot.] ''Leonotis toefolia;''
ములుగోగు, mulugOgu
-n.
--[bot.] ''Hibiscus suratensis'';
ములుగోరంట, mulugOraMTa
-n.
--[bot.] ''Barleria prioatis;''
ములుదోస, muludOsa
-n.
--[bot.] ''Cucumis muricatus;''
ములుమోదుగు, mulumOdugu
-n.
--[bot.] ''Erythrima sublabota;''
ములువెంపలి, muluveMpali
-n.
--[bot.] ''Tephrosia spinosa;''
ముల్లు, mullu
-n.
--(1) thorn; prick;
--(2) fishbone;
ముళ్లతోటకూర, muLlatOTakUra
-n.
--[bot.] Amaranthus spinosus Linn. of the Amaranthaceae family;
ముళ్లపంది, muLlapaMdi
-n.
--porcupine; same as ఏదుపంది; ముండ్లపంది;
ముళ్లవంకాయ, మొలుగుకాయ, muLlavaMkAya, molugukAya
- n.
-- [bot.] ''Solanum hirsutum'' of Solanaceae Family (Potato family)
--- ఇది వంగ, పొగాకు జాతికి చెందిన మొక్క;
మువ్వీసం, muvvIsaM
- n.
-- the fraction 3/16;
ముష్కరుడు, mushakruDu
- n.
--obstinate person; stubborn person; rude person;
ముషిణి, mushiNi
-n.
--strychnine; Strychnos nux vomica; a poisonous substance from a plant;
ముష్టి, mushTi
-n.
--(1) fist;
--(2) alms; a fistful of alms;
ముష్టికాయ, mushTikAya
-n.
--[bot.] Nux Vomica, Strychonys Nuxvomica; a natural drug useful in reducing fever;
ముష్టిది, mushTidi
-n. f.
--beggar; panhandler; a person seeking a fistful of alms;
ముష్టివాడు, mushTivADu
-n. m.
--beggar; panhandler;
ముష్టి యుద్ధం, mushTi yuddhaM
-n.
--fist fight; boxing;
ముసద్దీ, musaddI
- n.
-- (1) writer; (2) accountant; (3) clerk;
ముసరపప్పు, musarapappu
-n.
--Masur dal; [bot.] ''Lens culinaris'';
ముసలకం, musalakaM
-n.
--piston;
ముసలి, musali
-adj.
--old;
ముసాంబ్రం, musAMbraM
-n.
-- dried juice of aloeswood, or Indian aloe; [bot.] ''Aloe barbadensis;''
-- Agarwood, aloeswood, eaglewood or gharuwood is a fragrant dark resinous wood used in incense, perfume, and small carvings. It is formed in the heartwood of Aquilaria trees when they become infected with a type of mold (''Phialophora parasitica'');
ముసిముసి, musimusi
-adj.
--onomatopoeia for smile;
ముసుగు, musugu
-n.
--veil; mask;
ముసురు, musuru
-n.
--nagging rain; slow, nagging low-grade rain and lasts for a couple of days;
-- [see also] జడివాన;
ముసురు, musuru
-v. t.
--hover about;
---ఈగలు ముసురుతున్నాయి = the flies are hovering around.
ముస్తె, muste
-n.
--[bot.] ''Cyperus rotundus; Cyperus spectosus;''
ముహూర్తం, muhUrtaM
-n.
--(1) an auspicious time to perform an important thing;
--(2) a duration of time equal to 48 minutes; 1 మూహూర్తం = 2 ఘడియలు = 48 నిమిషాలు;
-- (3) ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు.
-- (4) అమావాస్య నాడు సూర్యుడి తో కలిసి ఉదయించిన చంద్రుడు 30 రోజుల పాటు, తిథికి 48 నిముషాలు చొప్పున ముందర ఉదయించి 30 తిథుల అనంతరం మళ్లి సూర్యుడి తో ఉదయిస్తాడు. 48 నిమిషాల కాలం ఒక ముహూర్త కాలం; కాల గమనానికి ముహూర్తం ఒక ఏకకం (Unit);
మూక, mUka
-n.
--crowd;
మూకుడు, mUkuDu
-n.
--deep fryer; chip pan; a bowl-shaped pan for deep frying;
-- బాండి;
మూకుమ్మడిగా, mUkammaDigA
- adv.
-- lock, stock and barrel;
మూగు, mUgu
-v. i.
--surround; gather and hover around;
మూట, mUTa
-n.
--bundle; pack; bag;
మూటా ముల్లె, mUTA mulle
-ph.
--bag and baggage;
మూడు, mUDu
-n.
--three;
మూడు ముడులు, mooDu muDulu
- ph. the three knots;
-- In a traditional Hindu wedding, the groom ties a sacred necklace, around the neck of the bride, with three knots. This three symbolizes the union of their three bodies: the gross, the subtle, and the Pure Consciousness;
-- మానవుల యొక్క స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి. ఈ సమయంలో వేసే ఒక్క ముడి ఒక్కో శరీరానికి సంబంధించినది… వధూవరులో కేవలం బాహ్య శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలని ఉద్దేశంతో మూడు ముళ్ళు కలుపుతారు…
మూడొంతులు, mUDoMtulu
-adv.
--three out of four; in all probability;
మూఢం, mUDhaM
-n.
--[astro.] obscuration of a planet by Sun's rays; Heliacal rising of a planet; [astrol.] a planet moving into the same house as the Sun;
-- మూఢము అనగా ఒక గ్రహం సూర్యునికి దగ్గరగా రావడం. లేదా ఒకే రాశి యందు ఉండడం; శుభకార్యము చేయఁగూడని కాలము;
మూఢత, mUDhata
-n.
--stupidity; foolishness;
మూఢుడు, mUDhuDu
-n. m.
--stupid;
మూఢమతి, mUDhamati
-n.
--stupid;
మూత, mUta
-n.
--lid; cover; cap; top;
మూత్రం, mUtraM
-n.
--urine;
మూత్రపిండం, mUtrapiMDaM
-n.
--kidney; nephram;
మూత్రాణి, mUtrANi
-n.
--purine; a type of molecule found in the DNA;
మూతి, mUti
-n.
--mouth;
మూపు, mUpu
-n.
--shoulder; bull's hump;
మూపురం, mUpuraM
-n.
--shoulder of a bull; cow; or camel;
మూయు, mUyu
-v. t.
--shut; close;
మూర, mUra
-n.
--cubit; a measure of length equal to the span from the tip of the elbow joint to the tip of the middle finger of the open hand;
---పిడిమూర = a length measure equal to the span from the tip of the elbow joint to the tip of the closed first;
-- 1 అంగుళం = 2.54 సెంటీమీటర్లు; 1 బెత్త = 3 అంగుళాలు; 1 జాన = 3 బెత్తలు; 1 అడుగు = 12 అంగుళాలు; 1 మూర = 2 జానలు; see also బార;
మూర్ఛ, mUrCha
-n.
--epilepsy; petit mal; grand mal; fainting spell; swoon;
మూర్ఛన, mUrChana
-n.
--derived musical scale;
--సప్తస్వరముల యొక్క ఆరోహణావరోహణములను మూర్ఛనలందురు;
మూర్ధన్యాక్షరాలు, mUrdhanyAksharAlu
- n.
-- The letters ట,ఠ, డ, ఢ, ణ, ళ, ఴ లు of the Telugu alphabet;
--ద్రావిడ భాషలలో మూర్ధన్యాక్షరాలు (ట,ఠ, డ, ఢ, ణ, ళ, ఴ లు), ర-ఱ-లలు ప్రథమాక్షరంగా ఉండడానికి వీలులేదు. విశేషణంగా తెలుగులోనూ, ఇతర ద్రావిడ భాషలలోనూ హల్లుల ముందు ఇరు-, అచ్చులముందు ఈరు- అన్న రూపాలే కనిపిస్తాయి. ఇరువంకలు అంటే రెండు పక్కలు. ఇరువురు అంటే ఇద్దరు.
మూర్తి, mUrti
-n.
--(1) character;
--(2) statue;
--(3) shape;
---అక్షరమూర్తి = alphabetic character.
---అక్షరాంకికమూర్తి = alphanumeric character.
మూర్తిత్వం, mUrtitvaM
-n.
--embodiment; characterization;
మూర్తీభవించు, mUrtIbhaviMcu
-v. i.
--embody; personify;
మూరుకొండ, mUrukoMDa
-n.
--[bot.] ''Acalpha indica'';
మూర్కొను, mUrkonu
-v. t.
--smell; put to the nose;
మూలం, mUlaM
-n.
--beginning; root; basis; base; foundation; crux;
మూల, mUla %updated
-adj.
--basic; proto;
-n.
--(1) Lambda Scorpii; Shaula; Yoga tara of the 19th lunar mansion; located in the constellation Scorpio; one of the brightest stars in the night sky;
--(2) The 19th of the twenty seven star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) corner; nook;
మూలకం, mUlakaM
-n.
--element; chemical element;
మూలగ, mUlaga
-n.
--marrow; bone marrow;
మూలధనం, mUladhanaM
-n.
--capital; original investment; principal;
మూలపదార్థం, mUlapadArthaM
-n.
--elemental matter; element;
మూలపురుషుడు, mUlapurushuDu
-n.
--patriarch; (ant.) మూలమగువ;
మూలబిందువు, mUlabiMduvu
-n.
--base point; radix point; decimal point in a base-ten system and a binary point in a base-two number system;
మూలమట్టం, mUlamaTTaM
-n.
--set-square; an instrument to set things at right angles;
మూలవిరాట్టు, mUlavirATTu
-n.
--(1) main idol located in the inner sanctum of a temple; a stand-in idol (ఉత్సవ విగ్రహం) is often used in street parades while the real idol is left in the inner sanctum;
--(2) patriarch or matriarch of a family;
మూలశంక, mUlaSaMka
-n.
--piles; hemorrhoids; (lit.) doubt at the bottom;
మూల్యం, mUlyaM
-n.
--price;
మూలాధారం, mUlAdhAraM
-n.
--basis; source;
మూలాధారచక్రం, mUlAdhAracakraM
-n.
--according to Kundalini Yoga, one of the centers of energy in the human body, believed to be located at the base of the spinal column;
మూల్యాంకనం, mUlyAMkanaM,
-n.
--evaluation; assessment; estimation;
-- ఒక విషయం/సమాధానం లోని సత్తా ఏమిటో అంచనా వేయడం; పరీక్షలో ఎన్ని మార్కులు ఇవ్వవచ్చునో చెప్పడం మూల్యాంకనమే.
మూలిక, mUlika
-n.
--medicinal root; medicinal herb;
మూలుగ, mUluga
-n.
--bone marrow;
మూలుగు, mUlugu
-n.
--groan; groaning with pain;
మూస, mUsa
-n.
--(1) crucible;
--(2) mold;
మూసివేయు, mUsivEyu
-v. t.
--close; shut;
'''%మృ - mR, మె - me, మే - mE, మై - mai'''
మృగం, mRgaM
-n.
-- (1) animal; beast; wild animal; (2) deer;
మృగతృష్ణ, mRgatRshNa
-n.
--mirage;
మృగయుడు, mRgayuDu
-n.
--hunter;
మృగవ్యాధుడు, mRgavyAdhuDu
-n.
--Sirius; the brightest star as seen from the Earth in Canis Major; % to e2t
మృగనాభి, mRganAbhi
-n.
--musk; the secretion from a gland of musk deer;
-- మృగనాభి అంటే కస్తూరి. కస్తూరి మృగం నాభిలో స్రవించేది కస్తూరి. % to e2t
మృగశిర, mRgaSira %updated
-n.
--(1) Beta Tauri; Elnath; Yoga tara of the fifth lunar mansion;
--(2) Orion; the star cluster that looks like a hunter; The fifth of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar; Represents the head of an animal in the Vrishabha rAsi of the Hindu calendar;
మృణ్మయము,
- n.
-- made of clay; full of clay;
-- మృత్ శబ్దానికి మయట్ ప్రత్యయం చేరి మృణ్మయమ్ అయింది. ఇది సంస్కృత పదం. "యరోఽనునాసికేఽనునాసికోవా" అన్న పాణినీయ సూత్రం ప్రకారం హకారం కాక మరేదైనా హల్లుకు పిదప అనునాసికాక్షరం వచ్చినప్పుడు ఆ హల్లుకు బదులు దాని వర్గం లోని అనునాసికాక్షరం ఆదేశం ఔతుంది.
మృత్ + మయమ్ => మృణ్ + మయమ్ => మృణ్మయమ్; ఇక్కడ మ ముందు వచ్చిన తకారానికి బదులు అనునాసికమైన ణకారం వచ్చింది.
--ఋ, ర, ష ల తరువాత వచ్చే న, ణగా మారుతుంది. 'రషాణాం నోణః సమానపదే' అని సూత్రం. అలా మృత్/మృద్ + మయ --> మృన్ + మయ --> మృణ్ + మయ --> మృణ్మయ అయింది.
వాక్ + మయం => వాఙ్మయం, సత్ + మార్గం => సన్మార్గం , వంటివి ఈ సూత్రం ప్రకారం ఏర్పడిన పదాలే;
మృత, mRta
-adj.
--dead;
మృత్తిక, mRttika
-n.
--earth; clay; soil;
మృత్యువు, mRtyuvu
-n.
--death;
మృదంగం, mRdaMgaM
-n.
--a drum used in Indian musical performances;
మృదులాస్థి, mRdulAsti
-n.
--cartilage;
మృదువు, mRduvu
-adj.
--tender; gentle; soft;
మృష్ట, mRshTa
-adj.
--wholesome; healthy; clean;
మృష్టాన్నం, mRshtAnnaM
-n.
--wholesome food;
మెంతులు, meMtulu
-n. pl.
--fenugreek; [bot.] ''Trigonella foenum graecum;'' Here, ''foenum graecum'' means Greek Hay; greens of this plant were used in Greece to feed horses;
--these seeds, widely used in Indian cooking, have been reported to possess hypoglycemic and hypolipidemic properties in animal experiments, as well as in human and clinical cases;
-- కసూరి మెంతి = [bot.] ''Trigonella corniculata;'' కసూర్ అనే ప్రదేశం నుండి మొదట లభ్యం అయినది అని కసూరి మెంతి కి ఆ పేరు వచ్చింది. దీనిని ఎండబెట్టి ఎండిన ఆకులని వాడతారు;
--[Sans.] రుచిప్రదా; మిశ్రం; తాళపర్ణికా:
మెంతికూర, meMtikUra
-n.
--fenugreek greens; fenugreek leaves; [bot.] ''Trigonella foenum-graecum'' Linn.;
మెకం, mekaM
- n.
-- (1) animal; (2) tiger;
మెగిడి, megiDi
-n.
--smoke; a word used by Chenchu tribes;
మెగిడిపెట్టు, megiDipeTTu
-v. t.
--to smoke (a fish);
మెగా, megA
-adj.
--pref. million; big; huge; (ant.) మైక్రో;
మెట్ట, meTTa
-n.
--(1) upland; elevated land; land with no irrigation; (ant.) పల్లం; పుంజె; మాగాణి;
--(2) hillock;
మెట్ట జలగ, meTTa jalaga
-n.
-- slug, land slug;
-- నత్తలలాగే ఇవి కూడా అతి మెల్లగా ప్రయాణిస్తాయి. అయితే నత్తలకి ఉన్నట్లు వీటికి గుల్లలు (Shells) ఉండవు. నత్తలలాగే మెట్ట జలగలు కూడా గాస్ట్రోపోడా (Gastropoda) తరగతిలోని సిగ్మురెత్రా (Sigmurethra) కుటుంబానికి చెందుతాయి. నీటి జలగల (Leeches) లాగా వీటికి రక్తం పీల్చే స్వభావం లేదు;
మెట్ట తామర, meTTa tAmara
-n.
--ground lotus; Indian shot; [bot.] ''Canna indica'' of the Cannaceae family;;
-- దీని ఆకుల పసరు తామర, గజ్జి, చిడుము వంటి మొండి చర్మవ్యాధులకు, సర్పి ( Herpes zoster) వంటివాటికి దివ్యౌషధంగా పనిచేస్తుంది;
-- see also సీమ మెట్ట తామర = [bot.] ''Cassia alata'';
మెట్ట సేద్యం, meTTa sEdyaM
-n.
--dry cultivation;
మెటికలు, meTikalu
-n.
--knuckles;
---మెటికలు విరవకు = do not crack knuckles.
మెట్రిక్ టన్ను, meTrik Tannu
-n.
--metric ton; one million grams; mega garm; 2205 pounds;
మెట్రిక్ పద్ధతి, meTrik paddhati
-n.
--metric system; an internationally agreed system of measuring weights and measures using units like meters for length, kilograms for weight and seconds for time; the MKS system;
మెట్టు, meTTu
-n.
--(1) step, as in step of a stair;
--(2) rung, as in rung of a ladder;
మెడ, meDa
-n.
--nape; neck; the back part of the neck; (ant.) పీక;
మెడిదము, meDidamu
-n.
--noise; sound;
మెతక, metaka
-adj.
--dank;
---మెతక వాసన = dank smell.
మెతక, metaka
-n.
--dullard; softy; a person with no initiative;
మెతనాలు, metanAlu
-n.
--methanal; formaldehyde;
మెతనోలు, metanOlu
-n.
--methanol; methyl alcohol;
మెతల్ గుంపు, metal guMpu
-n.
--methyl group; methyl radical;
మెతల్ రాసి, metal rAsi
-n.
--methyl radical; methyl group;
మెత్త, metta
-n.
--cushion; pad; padding; pillow;
మెత్తన, mettana
-n.
--softness;
మెదడు, medaDu
-n.
--(1) brain; మస్తిష్కం;
--(2) cerebrum;
మెదులు, medulu
-v. i.
--stir; move a little;
మెరక, meraka
-n.
--upland; refers to a land with no or scarce water resources; (ant.) మాగాణి; పల్లం;
మెరుగు, merugu
-n.
--(1) shine; polish; glitter;
--(2) better;
మెరుగులు దిద్దు, merugulu diddu
-v. t.
--to give finishing touches;
మెరుపు, merupu
-n.
--(1) flash;
--(2) lightning;
మెలిక, melika
-n.
--twist; turn;
మెల్ల, mella
-n.
--cross-eye; Strabismus; a condition where one of the eyes drifts from focusing;
--- మెల్లకన్ను = కళ్ళు ఒకే దిశలో చూడలేని స్థితి;
మెల్లగా, mellagA
-adv.
--slowly; steadily; (ant.) త్వరగా; శీఘ్రంగా;
మెల్లనైన, mellanaina
-adj.
--slow;
మెస్మరించు, mesmariMcu
-v. t.
--mesmerize; to hypnotize; to enchant; (named after German physician Franz Anton Mesmer);
మెస్సయ్య, messiah
- n.
-- protector;
-- రక్షకుడు;
మేక, mEka
-n.
--goat; she-goat;
మేకపోతు, mEkapOtu
-n. m.
--he goat;
మేకపిల్ల, mEkapilla
-n.
--kid; baby goat;
మేకపోతు గాంభీర్యం, mEkapOtu gAMbhIryaM
- ph.
-- showing external courage although scared inside;
మేకమాంసం, mEkamAmsaM
-n.
--mutton;
మేకమేయని ఆకు, mEkamEyani Aku
-n.
--[bot.] ''Tylophora indica;''
మేకీవిల్లీయం, mEkIvillIyaM
-n.
--Machiavellian; crafty; deceitful; artful; named after the Florentine writer Nicolo Machiavelli (1469-1527 A.D.); కౌటిల్యం; కుటిలత్వం;
మేకు, mEku
-n.
--nail;
మేఘం, mEghaM
-n.
--cloud;
---అలకామేఘం = cirrus cloud; "hairy" cloud.
---అలకాపుంజ మేఘం = cirrocumulus cloud.
---అలకాస్థార మేఘం = cirrostratus cloud.
---మధ్యస్థార మేఘం = altostratus cloud.
---పుంజమేఘం = cumulus cloud.
---సమాచిమేఘం = cumulous cloud; "heapy" cloud.
---స్థారమేఘం = stratus cloud.
---వృష్టికమేఘం = nimbus cloud; "rainy" cloud.
---వాడు మేఘాల్లో ఉన్నాడు = [idiom] he is in cloud nine.
మేఘాచ్ఛాదితం, mEghAcchAditaM
-n.
--overcast;
మేట, mETa
-n.
--sandbar; shoal;
మేట్నీ, mETnI
-n.
--matinee; పగటాట;
మేటు, mETu
-n.
--heap; pile;
మేజా, mEjA
-n.
--desk; a table with drawers;
మేజువాణీ, mEjuvANI
- n.
-- a group dance performed by a clan of prostitutes with indecent language and exposure; it was customary to have such performances at weddings in bygone days; (see also) నాచ్ పార్టీ; భోగంమేళం;
మేజోళ్లు, mEjOllu
-n. pl.
--socks; stockings;
మేడ, mEDa
-n.
--a building with at least one floor above the ground floor; palace;
మేడమీద, mEDamIda
-n.
--upstairs;
మేడమెట్లు, mEDameTlu
-n.
--stairs;
మేడి, mEDi
-n.
-- cluster fig; a species of the fig tree; [bot.] ''Ficus glomerata; Ficus racemosa; Ficus palmata;''
--(note) It is a common belief that this fruit is pretty outside with worms inside;
-- మేడిపండు అంటే మేడి చెట్టు కాయ. దీని హైబ్రిడ్ రకాలను అత్తిపండు, అంజీర అంటారు. మన దేశంలో చాలా చోట్ల ఈ చెట్లు కనిపిస్తాయి. మేడిపండు చూడడానికి గుండ్రంగా ఉంటుంది. పచ్చగా ఉన్నప్పుడు కాస్త పుల్లగా, చేదుగా ఉంటుంది. పండి పసుపు రంగులోకి మారిన తరువాత తీపిగా ఉంటుంది. మేడి పండు పండడం మొదలైనప్పుడు, మేడిపండులోని చిన్న చిన్న గుబ్బల వంటి కండ కోసం పురుగులు పండులోకి చేరి పండుని తింటాయి. నాటు పండయిన మేడిపండ్లలో పురుగులు ఉంటాయి. ఇది అత్తిపండ్లు పెంచబడిన మొక్కల నుంచి వస్తాయి. వీటి పెంపకంలో పురుగుమందుల కారణంగా పురుగులుండవు.
-- ఉదుంబరం;
మేదస్సు, mEdassu
- n.
- fat; body fat; lipid;
మేదిని, mEdini
- n.
-- the Earth;
-- మధుకైటభుల మేధస్సుచేత తడుపబడుటచేత మేదిని అయింది;
మేన, mEna
-- pref.
-- related by the body; related by blood;
--- మేనమామ = an uncle related by blood = mother's brother;
--- మేనత్త = an aunt related by blood = father's sister;
--- వేలువిడచిన మేనమామ = mother's cousin (brother); mother's sister's son;
మేను, mEnu
-- n.
-- body;
మ్లేచ్ఛులు, mlEcChulu
-n. pl.
-- (1) Barbarians; uncivilized;
-- foreigners who do not speak our language (Sanskrit), who eat beef, and who do not follow our customs and traditions;
--"గోమాంసం తినేవారు, సంస్కృతం కాక పలురకాల భాషలు మాట్లాడేవారు, మన ఆచారాలను వేటినీ పాటించని వారిని మ్లేచ్ఛులని అంటారు" అని బౌధాయనుడు మ్లేచ్ఛ శబ్దాన్ని నిర్వచించాడు;
మైదా పిండి, maidA piMDi
- n.
-- all-purpose flour; the flour made from a mixture of hard and soft varieties of white wheat;
-- గోధుమ పిండి = wheat flour made from red wheat, without removing the skin and germ;
-- గోధుమలు పిండిమరలో పిండి పట్టించినప్పుడు అందులో గోధుమ పొట్టు, గోధుమ రవ్వ, బొంబాబు రవ్వ (సమొలిన), వగైరాలతోపాటు, చివరకు మెత్తగా మిగిలిన మైదాను కొన్ని రసాయనాలతో శుద్ధి చేసి తెల్లగా తీర్చిదిద్దుతారు. మిల్లులో బాగా పోలిష్ చేయబడిన గోధుమల నుండి వచ్చిన పిండికి Azodicarbonamide, Chlorine gas, మరియూ Benzoyl peroxide అనే రసాయనాలను ఉపయోగించి తెల్లగా చేస్తారు. అందువల్ల మైదా పిండి ముట్టుకోవడానికి మెత్తగాను, చూడటానికి తెల్లగానూ ఉంటుంది. మైదాతో ఆరోగ్య ప్రయోజనాలేవీ లేవు. మైదా వినియోగం ఆరోగ్యకరం కూడా కాదు;
మైరేయం, mairEyaM
- n.
-- intoxicating liquor made of date-palms;
మైలతుత్తం, mailatuttaM
- n.
-- copper sulfate; CuSO<sub>4</sub>;
-- చికీగ్రీవం;
మొక్కుబడి, mokkubaDi
- n.
-- votive; vow;
-- దేవతల కిచ్చెదనని చెప్పిన కానుక;
మొగమాటం, mogamATaM
- n.
-- complaisance; civility courtesy; conciliatory conduct; feeling delicate; a desire or willingness to please others, or to be agreeable and willing; a reluctance to refuse a request or to wound another's feelings by not complying;
-- దాక్షిణ్యం; మొహమాటం;
మొగలి, mogali
- n.
-- Screw pine; [bot.] ''Pondonus tectorius'';
-- ఇది ఆవృతబీజ జాతి (Angiosperms) సతత హరిత వృక్షం; ఇది 15-20 అడుగుల ఎత్తుకు పెరుగుతుంది.
-- మొగలిపువ్వు వాసనకు పాములు వస్తాయని అంటారు కానీ దీనికి శాస్త్రీయమైన రుజువు లేదు; ఈ పూల వాసనకి ఆకర్షింపబడి వచ్చాయనేదానికి ఇదమిద్ధంగా ఋజువులేమీ లేవు.
మొదలు, modalu
- n.
-- (1) beginning; starting point; (2) principal; initial investment
-- మొదలు చెడ్డ బేరము = loss of principal; మొదటికే మోసం = the primary resources were not available to do a job
మొర్రి పండు, morri panDu
- n.
-- Chironji fruit; [bot.] ''Buchanania latifolia; Buchanania lanzan;''
-- These small, sweet, and tangy wild berries, (seasonal summer fruits) are often foraged in forest areas and are highly regarded for their unique taste and medicinal properties;
మొలలు, molalu
- n.
-- piles; hemorrhoids;
-- దానిమ్మ తొక్కల పొడి (Powdered pomegranate peel). ఆయుర్వేద మందుల దుకాణాల్లోనూ, ఆన్లైన్ లోనూ దొరుకుతుంది. ఉదయం సాయంత్రం ఒకో చెంచాడు చూర్ణం నీటితో కలిపి తాగితే విరేచనం అయేటప్పుడు రక్తం పోకుండా ఆపుతుంది.
మోకు, mOku
- n.
-- a stout rope; a heavy-duty rope;
మోక్షం, mOkshM
- n.
-- liberation; cessation of suffering; attainment of Supreme Bliss; Liberation of the soul from the body; Deliverance from the bonds of sense; Beatitude;
-- the Hindu equivalent of Buddhist నిర్వాణం;
మోచెయ్యి, mOcheyyi
- n.
-- elbow;
-- మోచేతి నీరు త్రాగడం = (1) ఒకరి ఆశ్రయంలో, లేదా పరుల పోషణలో, సహాయం వల్ల జీవించడాన్ని మోచేతికింద నీళ్ళు తాగడం అనే జాతీయంతో వ్యక్తపరుస్తారు; (2) తనకు గతిలేక ఒకరి పెట్టు పోతల మీద ఆధారపడి / ఒకరి సహాయంతోనే బతకడాన్ని * మోచేతి నీళ్ళు తాగడం* అంటారు. దుస్థితి సూచనకంగా వాడే జాతీయం ఇది;
మోట, mOTa
- n. A water pump, a water wheel, or a device for drawing water from wells to irrigate the fields.
మోటబావి, mOTabAvi
- n.
-- a wide-mouthed well suitable for lifting water with a specially shaped bucket, called 'mota' used for watering irrigated fields;
-- కపిలబావి, మోటనుయ్యి; నీళ్ళు తోడటానికి మోట అమర్చిన బావి;
మోడు, mODu
- n.
-- a tree stump;
మోత, mOta
- n.
-- (1) burden; load; (2) sound; loudness;
మోతిబిందు, mOtibiMdu
- n.
-- cataract; an eye disease in which the lens gets clouded;
మోపు, mOpu
- n.
-- bundle;
మోయు, mOyu
- v. i.
-- carry;
మోహం, mOhaM
-n.
-- attachment; సాంగత్యం వల్ల ఒక వస్తువు తనదే అనే భావన;
మొహమాటం, mohamATaM
- n.
-- doing something with a sense of discomfort so as not to make a host uncomfortable;
-- మొగము + ఓటమి = మొగమోటమి = ఉచ్చారణ లో గూడా మొహమాటం అయి పోయింది. అంటే మొగం చూడడానికి చెల్లకపోవడం; ఇప్పటి వాడుకలో — మారుమాట చెప్పలేక, ఒప్పుకోవడం అనే అర్థం లో వాడుతున్నాం; అయిష్టంగానే ఎదుటివాడి మాటను అంగీకరించడం మొహమాటమౌతుంది. దీనిమీద సంస్కృత ఉపసర్గ ^నిర్^ చేర్చి "నిర్మొహమాటం" గా అనేది గూడా వాడుకలోకి వచ్చింది.
-- ఆహారే వ్యవహారే చ త్యక్త లజ్జః సుఖీ భవేత్ = ఆహారం విషయంలోను, వ్యవహారం విషయంలోనూ మొహమాట పడకూడదు;
మౌళి, mouLi
- n.
-- (1) coiffured hair; ornamented hairdo; (2) crown; (3) leader; best of the tribe;
-- సిగ; కొప్పు; చంద్రమౌళి = one who has the moon as a hair ornament = Lord Shiva;
</poem>
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]]
kr4o1re6mgfq16r1339aa3ey9qhffw2
వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు/వ-శ-ష
0
3023
39210
39114
2026-06-02T00:55:27Z
Vemurione
1689
/* Part 2: శం - SaM, శ - Sa */
39210
wikitext
text/x-wiki
* This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made and needs to be corrected.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
* American spelling is used throughout.
* There is no clearly established, standardized alphabetical order in Telugu. The justification for the scheme used here would be too long for discussion here.
16 March 2016.
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
==Part 1: వం - vaM, వ - va==
<poem>
'''వం - vaM'''
వంక, vaMka
-n.
--(1) side; direction;
--(2) excuse; pretext;
--(3) fault;
--(4) curve; bend;
---నెలవంక = crescent moon.
వంకర, vaMkara
-adj.
--curved; crooked;
వంకరతనం, vaMkaratanaM
-n.
--curvature; curvedness; crookedness;
-- వక్రత;
వంకాయ, vaMkAya
-n.
--brinjal; eggplant; aubergine; a vegetable; [bot.] ''Solanum melongena'' of the Solanaceae family;
-- ''Solanum serpentinum''; ''Solanum depresum''; ''Solanum incanum'' is reportedly poisionous;
-- [Sans.] వార్తాకమ్; పీతఫలమ్;
వంకీ, vaMkI
-n.
--(1) curvature; (2) a curvey ornament worn on the upper arm by women;
వంగం, vaMgaM
-n.
--tin; the chemical element tin;
వంగ, vaMga
-adj.
--(1) related to eggplant; see వంకాయ; (2) related to Bengal;
వంగదేశం, aMgadESaM
-n.
--ancient name for the region now called Bengal;
వంగమామిడి, vangamaamiDi
- n.
-- Mangosteen; [bot.] ''Garcinia mangostana'' of the Clusiaceae family; is a tropical evergreen tree with edible fruit native to Southeast Asia; Its round, purple fruit is about the size of a tangerine, with smooth, firm skin that appears impenetrable;
-- దివ్యద్రాక్ష;
వంగడం, vaMgaDaM
- n.
-- family; lineage; strain; a family of seeds;
-- వంగసం; పశుజాతినుండిగాని వృక్షజాతినుండిగాని యెంచబడిన ప్రత్యేక లక్షణములుగల తరగతి (వంశము); ప్రత్యేక లక్షణములను కలిసియున్న ఉపజాతిలోని రకము.
వంగరెడ్డికూర, vaMgareddikUra
-n.
--[bot.] ''Sesuvium repens;''
వంగు, vaMgu
-v. i.
--bend; stoop;
వంచన, vaMcana
-n.
--fraud; deceit;
వంచు, vaMcu
-v. t.
--bend; deform;
వంజులం, vaMjulaM
-n.
--[bot.] ''Hibiscuc mutabilis'';
వంట, vaMTa
-n.
-- the act of cooking; the art of cooking;
వంటకం, vaMTakaM
-n.
--food; food dish; an item on the menu; the product of cooking;
వంటకత్తె, vaMTakatte
-n. f.
--cook; chef; a female professional cook;
వంటచూర్ణం, vaMTacUrnaM
-n.
--baking powder; a 1:2:1; mixture of sodium bicarbonate; tartaric acid and a leavening like starch;
వంటచెరకు, vaMTaceraku
-n.
--firewood;
వంటయిల్లు, vaMTayillu
-n.
--kitchen;
వంటరి, vaMTari
-n.
--cook; chef;
వంటరితనం, vaMTaritanaM
-n.
--cooking talent;
వంటవాడు, vaMTavADu
-n. m.
--cook; chef; a professional cook;
వంటసాల, vaMTasAla
-n.
--kitchen;
వంటసోడా, vaMTasODA
-n.
--baking soda; sodium bicarbonate; see also చాకలి సోడా and వంటచూర్ణం;
వండడం, vaMDaDaM
-v. t.
--cooking;
వండలి, vaMDali
-n.
--river silt; alluvium; alluvial soil;
వండు, vaMDu
-v. t.
--cook;
వంతగాడు, vaMtagADu
-n.
--sidekick;
వంతు, vaMtu
-n.
--share; part; portion;
వంతుడు, vaMtuDu
- suff.
-- having the property of;
-- -మంతం అనాలా?, -వంతం అనాలా? -వంతుడు, -వతి అని ఎక్కడ చేర్చాలి, -మంతుడు,-మతి అని ఎక్కడ చేర్చాలి అనే విచికిత్స తరచు కలుగుతుంది.
-- అ-కారాంత, ఆ-కారాంత పదాలకు – వంతుడు, వంతము, వానుడు, వతి - ప్రత్యయాలుగా అమరుతాయి.
-- ఉదా: సౌభాగ్య -> సౌభాగ్యవతి; గుణ -> గుణవంతుడు; బల -> బలవంతం; విద్యా -> విద్యావంతుడు; అమరా -> అమరావతి
వంతెన, vaMtena
-n.
--bridge;
--అట్టెడ; పాలి; వారధి; సేతకము; సేతువు;
వంద, vaMda
-n.
--hundred;
-- [Sans.] బృంద > వృంద > వంద
వందనం, vaMdanaM
-n.
--salutation;
వంద్యము, vaMdyamu
-n.
--praiseworthy; laudable;
వందిమాగధులు, vaMdimaagadhulu
- n. pl.
-- వంది and మాగధుడు are the titles of "praisers" in a king's court; their job is to constantly praise the king for all his good deeds; వందిమాగధులు ఎవరివద్ద కొలువు చేస్తున్నారో వారిని మాత్రమే స్తుతిస్తుంటారు. శృంగేరీ మఠంలో వారు గురువులను, దేవుళ్ళను స్తుతిస్తుంటారు; క్షత్త్రియ స్త్రీకిని వైశ్యునకును బుట్టినవాఁడు; వంశావళిఁ జదువువాఁడు;
వంపు, vaMpu
-n.
--curvature;
-v. t.
--spill; empty; decant;
వంశము, vaMSamu
-n.
--race; family; lineage; dynasty;
వక్క, vakka
-n.
--betel nut; [bot.] ''Areca catechu''; (note) the phenolics in this nut cause desensitization of the oral issue, especially the tongue, and makes it difficult to pronounce words correctly; excessive use of this nut could cause leukoplakia;
-- వక్కలో arecoline, arecaidine అనే alkaloid పదార్ధాలు ఉన్నాయి.
-- same as పోకచెక్క; చెక్క; (rel.) కాచు;
వక్కాణించు, vakkANiMcu
-v. i.
--state; utter; say;
---నొక్కి వక్కాణించు = emphasize
వక్కాణము, vakkANamu
-n.
--information; news;
వక్ర, vakra
-adj.
--curved;
వక్రరేఖ, vakrarEkha
-n.
--curve; curved line;
వక్తవ్యం, vaktavyaM,
- n.
-- what that is fit or proper to be said, spoken, or uttered;
వకీలు, vakIlu
-n.
--lawyer;
వక్రీభవనం, vakrIbhavanaM
-n.
--refraction (of light;)
వక్రోక్తి, vakrOkti
- n.
-- irony; a figure of speech; Irony is a mode of speech in which the real meaning is exactly the opposite of that which is literally conveyed; In Julius Ceaser Mark Antony says several times "'Brutus is an honorable man" is an example of irony;
-- మమ్మటుడు వక్రోక్తిని ఇలా నిర్వచించాడు: 'యదుక్తమన్యథా వాక్యమన్యథాన్యేన యోజ్యతే. శ్లేషేణ కాకా వా జ్ఞేయా సా వక్రోక్తిస్తథా ద్విధా' (కావ్య ప్రకాశ -9).
--'అందరూ పెద్దమనుషులే! మరి గల్లా పెట్టెలో చిల్లర ఏమైంది?' వంటి ప్రయోగాలలోని 'వక్రోక్తి' ని గమనించండి.
వగ, vaga
-n.
--grief; sorrow;
వగచు, vagacu
-v. i.
--grieve; lament; feel sorry;
వగరు, vagaru
- n.
--astringent taste; (Note: ఒగరు is not correct usage)
వగర్చు, vagarcu
-v. i.
--gasp; pant; breathe hard;
వగలాడి, vagalADi
- n.
-- an attractive woman; a fashionable woman; an enticing woman;
వగైరా, vagairA
-n.
--et cetera; and other things;
వచనం, vacanaM
-n.
--(1) word; speech; affirmation; promise;
--(2) prose;
వచస్సు, vacassu
- n.
-- (1) speech, word, utterance; (2) advice, counsel; (3) order, command;
వచ్చీరాని, vaccIrAni vbl.
-adj.
--scarcely coming; scarcely understandable;
---వచ్చీరాని తెలుగు = scarcely understandable Telugu.
---వచ్చీరాని నవ్వు = scarcely discernable smile.
వచ్చు, vaccu
-v. i.
-- (1) come; (2) know;
--- వచ్చిన పనేమిటో చెప్పు = tell the reason for your coming;
--- నీకొచ్చింది చెప్పు = tell what you learned;
--- వచ్చీ రాని మాటలు = baby talk; incomplete words;
వచ్చుబడి, vaccubaDi
-v. i.
--income;
-- రాబడి;
వజ్రం, vajraM
-n.
--diamond;
వజ్ర, vajra
-adj.
--hard; harsh; fierce; steely;
వజ్రకంద, vajrakaMda
- n.
-- a wild variety of corm tubers; [bot.] ''Amorphophallus sylvaticus''; [Sans.] వజ్రమూల; వనసూరణ;
వజ్రగుణకారం, vajraguNakAraM
-n.
--[math.] cross-multiplication;
వజ్రదంతి, vajradaMti
-n.
--[bot.] ''Barleria prionitis'';
-- a decorative perennial with many medicinal uses with potential in cancer treatment; the bark has been traditionally used in preparing Ayurvedic tooth powder;
వజ్రమల్లి, vajramalli
-n.
--Adamant creeper; [bot.] ''Cissus quadrangularis;''
-- Cissus quadrangularis is commonly used for bone health and weight loss. It is also used for conditions such as diabetes, high cholesterol, hemorrhoids, and many others, but there is no good scientific evidence to support these uses.
వజ్రలేపనం, vajralEpanaM
-n.
--adamantine glue; a material used before cement was invented;
వక్రశుంఠుడు, vakraSuMThuDu
-n.
--steely stupid; big blockhead;
వజ్రసంకల్పం, vajrasaMkalpaM
-n.
--fierce determination;
వట్ట, vaTTa
-n.
--(1) testicle;
--(2) turnstile; a device typically consisting of 3 or 4 horizontal arms supported by and radially projecting from a vertical post, that is used for controlling passage from one public area to another and perhaps facilitating a count of the number of people passing through;
వట్టి, vaTTi
-adj.
--empty; vacant;
వట్టివేరు, vaTTivEru
-n.
-- cuss-cuss; [bot.] straw of ''Andropogon muriaticum'';
-- కురువేరు; అవురుగంట వేరు; ఉసీరం; లఘులయము; అవదాహం;
వట్టివేళ్ల తడకలు, vaTTivELla taDakalu
-n. pl.
--screens made out of the straw of ''Andropogon muriaticum'';
వట్రుతలం, vaTrutalaM
-n.
--curved surface;
వట్రువ, vaTruva
-adj.
--globular;
వణిజుడు, vaNijuDu
-n.
--merchant; trader;
వడ, vaDa
-n.
-- a toroidal-shaped (doughnut-shaped), palm-sized, deep-fried savory dish popular in South India; this item is typically made from black gram ("Urid dal") although variations exist; If it has a hole in the center, then it is called "గారె;"
వడగట్టు, vaDagaTTu
-v. t.
--strain; filter through a cloth or paper; same as వడబోయు;
వడగళ్ల వాన, vaDagaLla vAna
-ph.
--hailstorm;
వడగళ్లు, vaDagaLlu
-n.
--hailstones; hail; (lit.) cool stones;
వడగాడ్పు, vaDagADpu
-n.
--a blast of hot summer air; this is an anomalous use of వడ;
వడగాలి, vaDagAli
-n.
--hot summer air; this is an anomalous use of వడ;
వడగిన్నె, vaDaginne
-n.
--filter; a pot used in a filter;
-- వడపోత గిన్నె;
వడజ, vaDaja
-n.
--[bot.] ''Acorus calamus;''
వడపప్పు, vaDapappu
-n.
--split mung dal (a type of pulses) soaked in water, and lightly salted or sugared; (lit.) cool dal;
వడపోత, vaDapOta
-n.
--filtration;
వడబోయు, vaDabOyu
-v. t.
--filter;
వడదెబ్బ, vaDadebba
-n.
--sunstroke; heatstroke;
వడలు, vaDalu
-n. pl.
--spiced deep-fried cakes made of black gram;
-v. i.
--wilt; dry up; fade;
వడ్డన, vaDDana
-n.
--serving of food; food service;
వడ్రంగి, vaDraMgi
-n.
--carpenter;
వడ్రంగి పిట్ట, vaDraMgi piTTa
-n.
--woodpecker;
వడేలురాలు, vaDElurAlu
-n.
--[bot.] ''Hiptage madablota'';
వడి, vaDi
-n.
--speed; quickness;
వడియాలు, vaDiyAlu
- n. pl.
-- fryams; a dried vegetable (often mixed with batter before drying) used as a deep-fried dish;
వడిశ చెట్టు, vaDiSa ceTTu
-n.
--[bot.] ''Christanthus colinus''; extract from the bark of this tree is used by Chenchu tribes to stun fish in spearfishing;
వడ్డించు, vaDDiMcu
-v. t.
--serve;
వడ్డీ, vaDDI
-n.
--interest; interest collected on a loan or a bank deposit;
వడ్డీ వ్యాపారం, vaDDI vyApAraM
-n.
--money lending business;
వడ్లు, vaDlu
- n. pl.
-- paddy; whole, unhusked grains of rice;
-- వడ్ల చిలక = [bio.] Sitoroga cereallela; వరి, గోదుమ, ఇతర ధాన్యాలను ఆశ్రయిస్తూ బ్రతికే ఒకరకమైన చిన్న రెక్కల పురుగును 'వడ్లచిలుక' అంటారు. వడ్లు అంటే ధాన్యం కాబట్టి ఈ కీటకాలకు ఆ పేరు వచ్చింది.ఇవి బూడిద రంగులో, మాడు ఎరుపు, లేత నలుపు రంగుల్లో కనబడుతుంటాయి. వీటి లార్వాలు (క్రిమి దశ) కూడా ధాన్యాలలోనే సాగుతుంది. ఇవి ధాన్యాలలో సారాన్ని పూర్తిగా పీల్చేసి నిస్సారం చేస్తాయి;
వడ్డెరవాడు, vaDDeravADu
-n.
--stonesmith;
వత్సము, vatsamu
-n.
-- young child; calf;
-- గోవత్సము = calf;
వత్సలం, vatsalaM
-n.
--vaccine; (ety.) In Sanskrit, "vatsa" is cow; in Latin vacca is cow; the word vaccination is derived from vacca. % to e2t
వత్తాసు, vattAsu
-n.
--support; backing;
వత్సా, vatsA
-inter.
--you lad!; hello young man!; (lit.) you, young bull! ( a highly respectful way of addressing in classical times);
వత్తి, vatti
-n.
--wick;
వదనం, vadanaM
-n.
--face;
వదలు, vadalu
-n.
--loose; slack; not tight;
-v. t.
--(1) omit; leave;
--(2) depart; వదలిపెట్టు;
వదలిపెట్టు; వదలుకొను, vadalipeTTu, vadalukonu
-v. t.
--give up; abandon; relinquish;
వదాన్యత, vadAnyata
- n.
-- generosity; the quality of giving;
వద్దు, vaddu
--aux. verb. used as a suffix
--do not; must not; no;
---వినవద్దు = do not listen.
వధ, vadha
-n.
--slaughter; killing;
వధించు, vadhiMcu
-v. t.
--kill; slay;
వధువు, vadhuvu
-n.
--bride;
వనచంద్ర, vanacaMdra
-n.
--[bot.] ''Flagellaria indica'';
వనతులసి, vanatulasi
- n.
-- sweet basil; [bot.] ''Ocimum basilicum'';
-- రుద్రజెడ; దీని గింజలనే సబ్జా గింజలు అంటారు;
వనపాలి, vanapAli
-n.
--forest ranger;
వనమల్లిక, vanamallika
- n.
-- Chinese box tree; [bot.] ''Murraya exotica''; used in making wooden grips and geometrical instruments like scales;
-- పూల వెలగ;
వనమాలి, vanamAli
-n.
--epithet for Krishna;
వనరులు, vanarulu
-n.
--resources;
వనశృంగాటం, vanaSRuMgATaM
-n.
--[bot.] ''Reuellia longifolia'';
వనస్పతి, vanaspati
-n.
--(1) tree; plant; (2) hydrogenated vegetable oil with no admixture of animal-based fats like tallow; (3) margarine;
వనస్పతీకరణం, vanaspatIkaranaM
-n.
--[chem.] hydrogenation;
వనిత, vanita
-n.
--woman, (lit.) one who caters to the taste of men;
వన్నెలాడి, vannelADi
- n.
-- an attractive woman; a fashionable woman; an enticing woman;
వయలిన్, vayalin
-n.
--violin; a stringed instrument played with a bow, and characterized by four strings and frets. Although originating in the West, it has become an indispensable part of classical music concerts of south India; violin is different from a fiddle; also వాయులీనం;
వయస్సు, vayassu
-n.
--age;
వయ్యారిభామ, vayyaaribhaama
- n.
-- Congress grass; [bot.] ''Parthenium hysterophorus;'' a weed native to N. America;
-- అమెరికా నుంచి దిగుమతైన పి.ఎల్.480 గోధుమలతో పాటు ఈ కలుపు మొక్క విత్తులు దిగుమతయ్యాయి. అక్కడ ఈ కలుపు మొక్కను తినే పురుగులు ఉన్నాయి. ఇక్కడ లేవు. ఏటికేడు విస్తరిస్తోంది. దీని పుప్పొడి ఉబ్బసం వ్యాధిని కలిగిస్తుంది. పూత సమయంలో దీన్ని పెరికి తగలబెట్టడమే పరిష్కారం.
-- This is notorious for causing severe health issues, including dermatitis, asthma, and allergies, as well as ecological damage by inhibiting native plant growth.
-- నక్షత్ర గడ్డి మొక్క, క్యారెట్ గడ్డి మొక్క, కాంగ్రెస్ గడ్డి మొక్క, ముక్కు పుల్ల మొక్క, మాచర్ల కలుపు మొక్క, గొల్లభామ మొక్క;
వయినము, vayinamu
-n.
--details; method; system;
వరం, varaM
-n.
--boon; gift from God;
వరండా, varaMDA
-n.
--verandah; hallway; corridor;
వరకట్నం, varakaTnaM
-n.
--dowry; award; the dowry paid by a girl's parents to a boy at the time of wedding;
వరకు, varaku
-adv.
--till; until; up to;
వరగ, varaga
-n.
--[bot.] ''Panicum miliaceum'';
వరగోగు, varagOgu
-n.
-- (1) Pride of India; Giant Crape-myrtle; Queen's crepe-myrtle; this is a large tree; [bot.] ''Lagerstroemia speciosa'' of the Lithraceae family; ''Lagerstroemia reginae''; (2) Common Crepe-myrtle; this is a small bush; [bot.] ''Lagerstroemia indica''; (3) [bot.] ''Salvodora indica'';
-- రోడ్లకిరువైపులా విరగబూసిన వరగోగు వృక్షాలు గువాహాటి నగరానికి ఎంతో శోభను తెచ్చాయి; ఆ వృక్షం గువాహాటిలో సర్వ సాధారణం;
-- ఫిలిప్పీన్స్, వియత్నాం దేశాలలో స్థానికులు ఈ వృక్షం లేత ఆకుల్ని ఆకుకూరగా వండుకుంటారు. ఈ ఆకులు వైద్యపరంగా విరేచనకారిగా, మూత్రకారిగా పేరొందాయి. వీటి ముదురు ఆకులలో చేదుగా ఉండే ఇన్సులిన్ వంటి పదార్ధం ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు రుజువుచేశాయి. పండుటాకుల్నీ, ముదురు కాయల్నీ అక్కడి స్థానికులు వైద్య చికిత్సలో ఉపయోగిస్తారు. వీటి ముదురు ఆకులు చక్కెర వ్యాధిగ్రస్థులలో రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని తగ్గించడానికి పనిచేస్తాయట. బౌద్ధంలో ఈ వృక్షాలకు పవిత్రమైన స్థానముంది.
వరణం, varaNaM
-n.
--covering;
---వాతావరణం = atmosphere; (lit.) air-covering.
వరద, varada
-n.
--flood;
వరదగుడి, varadaguDi
- n.
-- an atmospheric phenomenon in which one sees a circular, cloud-like formation around the moon or sun; folk wisdom says that a larger ring indicates a high probability of rainfall in the near future and a smaller ring indicates probable rainfall in the far future; This is not a rainbow;
-- సింగిడి;
వరస, varasa
-n.
--(1) row; array;
--(2) attitude;
--(3) styling a relationship according to kinship structure;
---నీ వరస ఏమీ బాగులేదు = your attitude is no good at all.
---ఆమె నీకు అత్త వరస అవుతుంది = she will be an aunt for you, according to kinship rules.
---వరస కలుపడం = assuming a non-existent relationship and addressing people with that assumed relationship, such as addressing un-related people as uncles and aunts, a common practice in India.
---వరసా, వావి = order and coordination.
వరహా, varahA
-n.
--gold coin; typically 33.7 grams of 22 karat gold coin; (ety.) a coin possibly with the imprint of a boar or pig; in 17th century
Andhra, these coins carried the imprint of a temple;
వర్గం, vargaM
-n.
--(1) square; a quantity raised to the power of two; a quantity multiplied by itself;
--(2) group; class;
వర్గత్రయం, vargatrayaM
- n.
-- three ancestors; father, grandfather, and great grandfather;
వర్గపోరాటం, vargapOrATaM
-n.
--class struggle; class conflict;
వర్గమూలం, vargamUlaM
-n.
--[math.] square root;
వర్గసమీకరణం, vargasamIkaraNaM
-n.
--[math.] quadratic equation;
వర్చస్సు, varcassu
-n.
--luster; glow;
వర్జ్యం, varjyaM
- న.
-- an inauspicious time; a time to be avoided;
-- వర్జ్యం అంటే వర్జించ(విడిచిపెట్టవలసిన) ఘడియలు. ఒక రోజుకు 60ఘడియలు. ఈ అరవై ఘడియల కొక నక్షత్రం అనుకొంటే, ఆ నక్షత్రానికి అమృత ఘడియలు, విషఘడియలూ కూడా ఉంటాయి. ఉదాహరణకు అశ్వనీ నక్షత్రానికి అది మొదలైన తర్వాత 50 ఘడియలకు ఈ విషఘటికలు మొదలై సుమారో మూడు, మూడున్నర ఘడియల వరకూ ఉండవచ్చు. ఈ విషఘటికల్నే "వర్జ్యం"అని పిలుస్తారు. ఇవి నక్షత్ర, నక్షత్రానికీ మారుతూ ఉంటాయి కనుక పంచాంగం చూసి తెలుసుకోవాలి;
వర్ణం, varNaM
-n.
--(1) language character that can be uttered in one unit; అచ్చులు, అచ్చు కలవని హల్లులు 'వర్ణములు' అనబడతాయి. వర్ణముల సంఖ్య చాలా పరిమితంగా వుంటుంది.తెలుగులో 36. సంస్కృతం నుండి అప్పు తెచ్చుకున్నవాటితో కలిపి 56.
--(2) color;
--(3) characteristic; inherent property; [Note] caste and social class are not వర్ణం; the word also has no religious connotation; this word does not mean కులం; the words వర్ణం (characteristic), జాతి and కులం (group, caste) are not synonyms;
-- (4) హిందూ సాంఘిక వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు వర్ణాలు ఉన్నాయి. శూద్ర వర్ణంలో అనేక జాతులు (కులాలు) ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రదేశంలో ఉన్న శూద్రులలో ఉన్న కొన్ని కులాల పేర్లు: కమ్మ, రెడ్డి, కాపు, వెలమ, తెలగ, గవర, సాలె, మొదలైనవి; బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలలో విడివిడిగా కులాలు ఉన్నాయో లేదో తెలియదు.
వర్ణక్రమం,
-n.
--(1) alphabetical order;
--(2) spelling;
వర్ణపటం, varNapaTaM
-n.
--spectrum;
---శోషణ వర్ణపటం = absorption spectrum.
వర్ణమాపకం, varNamApakaM
-n.
--[phy.] spectrometer; an instrument to study the properties of the various colors of light
వర్ణమాల, varNamAla
-n.
--(1) alphabet; (lit.) a string of characters;
--(2) spectrum; a band of colors;
వర్ణన, varNana
-n.
--description;
వర్ణనాత్మక, varNanAtmaka
-adj.
--descriptive;
వర్ణపాతలేఖనం, varNapAtalEkhanaM
-n.
--chromatography; (lit.) color writing;
వర్ణపాతలేఖిని, varNapAtalEkhini
-n.
--[chem.] chromatograph; an instrument to study the properties of chemical mixtures;
వర్ణలేఖిని, varNalEkhini
-n.
--(1) spectrograph;
--(2) chromatograph; (comment.) Perhaps we need distinct words for chromatograph and spectrograph;
వర్ణసంధానం, varNasaMdhAnaM
-n.
--staining; a process used in microscopy to make parts of an object stand out against a background;
వర్తకం, vartakaM
-n.
--trade; business;
వర్తకుడు, vartakuDu
-n. m.
--trader; businessman;
వర్తన,
-n.
--behavior;
వర్తమానం, vartamAnaM
-n.
--(1) news; tidings; message;
--(2) communication;
--(3) present tense; contemporary time;
వర్తమానకాలం, vartamAnakAlaM
-n.
--[gram.] present tense; (ant.) భూతకాలం;
వర్ధంతి, vardhaMti
- n.
-- (1) birth anniversary; (2) death anniversary;
-- (note) In all other Indian languages, including Sanskrit, the correct meaning is "birth anniversary." For some unknown reason the meaning morphed into "death anniversary" and this meaning is currently in widespread usage;
-- వర్ధంతి అను శబ్దము వృధు, వృద్ధా అను ధాతువులనుండి నిష్పన్నమైనది. అది వృద్ధి అను అర్థమును చెప్పును. ఆయుర్వృద్ధికి హోమాదులు ఒనరింతురుగావున వర్ధంతి అను పదము "పుట్టినరోజు" కి వాడుట యోగ్యము;
వర్ధకం, vardhakaM [suff.] one that promotes; promoter;
---బలవర్ధకం = tonic; promoter of strength.
---క్షీరవర్ధకం = promoter of milk production.
---కాంతివర్ధకం = promoter of a healthy glow.
వర్ధమాన, vardhamAna
-adj.
--one that is growing; one that is progressing; (lit.) one that is capable of growing beyond belief;
---వర్ధమాన దేశం = developing country.
వర్ర, varra
-n.
--(1) pungent taste;
--(2) chili powder;
వర్జ్యం, varjyaM
-n.
--eschewed time of a day because it is not auspicious;
వర్షం, varshaM
-n.
--(1) rain; shower; వాన; (2) cloud; మేఘం;
--(3) year; సంవత్సరం;
--(4) country; దేశం;
వర్షపాతం, varshapAtaM
-n.
--rainfall; (rel.) హిమపాతం;
వరాహం, varAhaM
-n.
--pig; wild boar;
వరాహమిహిరుడు, varAhamihuruDu
-n.
--Varahamihira; the great Indian scientist, of the 4th - 5th century A.D., who made lasting contributions to astronomy and atmospheric sciences;
వర్ణాంధత్వం, varNAMdhatvaM
-n.
--color blindness;
వర్ణావరణం, varNAvaraNaM
-n.
--chromosphere; the bright region around the sun; can be applied to any other bright region surrounding an object;
వర్షాకాలం, varshAkAlaM
-n.
--monsoon; rainy season;
వరి, vari
-n.
--rice paddy; [bot.] ''Oryza sativa'';
--ప్రాసంగులు (రాజనాలు), కర్పూర భోగులు, వంక సన్నాలు, కుంకుమ పూలు, గుండ్ర సాంబవలు, మొలకొలుకులు, కుసుమలు, సన్న కొనామణులు, చిన్న పిషాణీలు, పెద కాకిరెక్కలు, పిన్న కుసుమలు, పాలాట్రగడ్డలు, బంగారు తీగలు, సన్న ముత్యాలు, జున్నుబాలు, వంకెలు, పగడాలు, ఢిల్లీ భోగాలు, రామసాగరాలు వంటి పలు ఇతర జాతులు కూడా ఉన్నాయి; ఇవికాక సాంబవ (సాంబ) మషూరీ, జీలకర్ర సన్నాలు, కృష్ణ కాటుకలు, సన్న కృష్ణ కాటుకలు, అక్కుళ్ళు, నెంబర్లు, ముదుగులు, బుడమలు, కోడి బుడమలు, జిలమలు, ఎరడాములు, కిచిడీలు, ఆట్రగడ్డలు, సన్నాట్రగడ్డలు, జయపూరు సన్నాలు, వంక సన్నాలు, కర్నూలు సోనా మషూరీ, చిట్టిముత్యాలు, కాకి రెక్కలు, ఈత గొల్లలు,గొర్తివడ్లు, స్వర్ణ, హంస, జయ, కేసరి, చెన్నంగి, రాజభోగాలు, బాస్మతి వంటి వరి వంగడాలు ఇంకా ఎన్నో; వరి ధాన్యంలో కొన్ని వేల రకాలు ఉన్నాయి;
వరిగడ్డి, varigaDDi
-n.
--hay; straw;
వర్తించు, vartiMcu
-v. i.
--apply; to be in force; be applicable;
వర్తిల్లు, vartillu
-v. i.
--exist;
వర్ధిల్లు, vardhillu
-v. i.
--grow; flourish; increase; develop;
వరుగు, varugu
-n.
--sun-dried food item; sun-dried vegetables;
వరుగు చేప, varugu cEpa
-n.
--sun-dried fish;
వరుమానం, varumAnaM
-n.
--income;
--(2) allowance; money given for maintenance;
--(3) income from an allowance;
వరవడి, varuvaDi
- n.
-- పిల్లలు కాపీ పుస్తకంలో మొదట రాసే ఆరంభ పంక్తిని 'వరువడి' లేదా 'వరవడి' అంటారు;
వరువాయి, varuvaayi
- n.
-- morning; first part of the day;
-- 'వరుస + వాయి' అని విడదీస్తారు; తెలుగులో 'వరుస' అంటే అనుక్రమం లేదా క్రమ పద్ధతి. 'వాయి' అనే పదానికి సమయం, తరుణం, పరిధి లేదా భాగం అనే అర్థాలు ఉన్నాయి (ఉదాహరణకు: ఈ వాయికి, మొదటి వాయి).
వర్గు, vargu
-n.
--(1) list; categorized list; (2) [math.] squared value;
వర్గు రూపం, vargu rUpaM
-n.
--[math.] quadratic form;
వరేణ్యుడు, varENyuDu
-n.
--great person;
వలంబిరికాయ, valaMbirikAya
-n.
--[bot.] I''sora corylifloia'';
వల, vala
-n.
--net;
వలచు, valacu
-v. t.
--to fall in love;
వలపక్షం, valapakshaM
-n.
--partiality;
వలపలి, valapali
-adj.
--on the right side (of a vehicle, while facing forward); starboard side; (ant.) దాపల;
వలయం, valayaM
-n.
--ring; circle;
వలయాకార, valayAkAra
-adj.
--circular; round;
వలవల, valavala
-adj.
--onomatopoeia for the sound of
--(1) crying, possibly out of sorrow;
--(2) landing sound of a flock of birds;
వలస, valasa
-n.
--migration; emigration; going from one part of the world to another;
వలస వీధులు, valasa vIdhulu
-n.
--migratory routes; వలస మార్గాలు;
వల్ల, valla
-n.
--possibility; feasibility;
వల్లకాడు, vallakADu
-n.
--burial or cremation ground; cemetery;
-- వల్ల + కాడు > ఒలికి + కాడు = సొద (చితి) పేర్చెడి చోటు
-- ఒలికికాడు → ఒలిక్కాడు → వలిక్కాడు → వలక్కాడు → వల్లకాడు.
-- 'ఒలికికాడు' లేదా 'ఒలుకులమిట్ట' అనే పదానికి 'చితిపేర్చెడు చోటు' / 'సొదపేర్చెడు చోటు' అని అర్థం.
వల్లమాలిన, vallamAlina
-adj.
--excessive; impossible;
వల్లరసి, vallarasi
-n.
--[bot.] ''Walsura piscidia'';
వల్లవ, vallava
-n.
--cook; chef; the head of a kitchen;
వలిసె, valise
-n.
--[bot.] ''Verbisina sativa'';
వల్మీకం, valmIkaM
-n.
--ant-hill;
వలువు, valuvu
-n.
--(1) fine garment;
--(2) skin of a nut or vegetable;
వలె, vale
-prep. adv.
--(1)like; similar to; in imitation of; resembling;
-- (2) as though; as if;
-- కరణి; మాడ్కి;
వల్లె, valle
-inter.
--yes; affirmation;
---వల్లెయని అతడు బయలుదేరెను = he said, 'yes' and started.
-n.
--rote; repetition;
వల్లెవేయు, vallevEyu
-v. t.
--repeat with the intention of memorizing;
వశం, vaSaM
-n.
--(1) possession; custody;
--(2) control; supremacy;
వశిష్ఠ, vaSishTha
--[astron.] Mizar and Alcor are two stars forming a naked-eye double in the handle of the Big Dipper (or Plough) asterism in the constellation of Ursa Major. Mizar is the second star from the end of the Big Dipper's handle, and Alcor its fainter companion. Mizar is really four stars, and Alcor is really two stars. So what we see as two stars are really six in one!
వసంతం, vasaMtaM
-n.
--spring;
వసంతదూత, vasaMtadUta
-n.
--messenger of spring; [bot.] ''Gaetnera racemosa'';
వసంత విషువత్, vasaMta vishuvat
-n.
--spring equinox; vernal equinox; approximately March 21; equinox = the day on which nights and days are of equal length at the Equator; the equality doesn't happen everywhere on Earth; some astrological traditions consider this point as the "starting point" of the zodiacal chart; such a chart is called "Sayana zodiacal chart" (Tropical Zodiac); this point slowly moves backwards, (about one degree in every 72 years), due to the precession of the spinning globe, and makes a full circle in approximately 26,000 years; this phenomenon is called the Precession of the Equinoxes"; Indian astrological tradition does not take into account this shifting tropical zodic; instead it uses an absolute reference frame, defined by a fixed point in the sky. A chart made with this fixed reference is called "nirayaNa zodiacal chart." The difference between these two charts now stands at about 23 degrees and this difference is called "ayanAMSa";
వస, vasa
-n.
--calamus; root of calamus; Sweet Flag; a medicinal root; [bot.] ''Acorus calamus'' of the Acoraceae family;
---వస పోసిన పిట్ట వలె మాట్లాడుతున్నాడు = he is talking like a bird overdosed with vasa; the belief is that "vasa" has the ability to assist in the latent powers of speech, both in people and birds like parrots and mynas.
-- [Sans.] చవచా; ఉగ్రగంధా;
వసనాభి, vasanAbhi
-n.
--[bot.] ''Aconitum ferox; Aconitum chasmanthum'';
వసపిట్ట, vasapiTTa
-n.
--[idiom.] a talkative person;
వసారా, vasArA
-n.
--verandah; corridor;
వస్తాదు, vastAdu
-n.
--(1) master;
--(2) strong person;
--(3) wrestler;
వస్తుగుణదీపిక, vastuguNadIpika
-n.
--Materia Medica; % to e2t
వస్తు ప్రపంచం, vastu prapaMcaM
-n.
--material universe;
వస్తువినిమయ పద్ధతి, vastu vinimaya paddhati
-n.
--barter system;
వస్తువు, vastuvu
-n.
--thing; item; substance; topic;
వషత్కారాలు, vashatkArAlu
-n.
--fireballs; sparks; చివాట్లు;
వ్యక్తం, vyaktaM
-n.
--revealed; expressed; manifested;
వ్యక్తి, vyakti
-n.
--person; character; individual;
వ్యక్తిత్వం, vyaktitvaM
-n.
--personality; characteristic; individuality;
వ్యంగ్యం, vyaMgyaM
-n.
--sarcasm;
వ్యంగ్య చిత్రం, vyaMgya citraM
-n.
--cartoon;
వ్యగ్రత, vyagrata
-n.
--bewilderment;
వ్యత్యాసం, vyatyAsaM
-n.
--difference; gap; discrepancy;
వ్యతిక్రమం, vyatikramaM
-n.
--transgression; deviation from tradition;
వ్యతిరేకం, vyatirEkaM
-n.
--contradiction; opposite position;
వ్యథ, vyatha
-n.
--pain; suffering; agitation;
వ్యభిచారం, vyabhicAraM
-n.
--adultery; transgression;
వ్యయం, vyayaM
-n.
--(1) destruction;
--(2) expenditure;
---అనుత్పాదక వ్యయం = non-productive expenditure.
వ్యర్ధ, vyardha
-adj.
--useless; wasted; unproductive; unprofitable; vain;
వ్యవకలనం, vyavakalanaM
-n.
--subtraction;
వ్యవధానం, vyavadhAnaM
-n.
--duration; interval; time;
వ్యవధి, vyavadhi
-n.
--duration; interval; time;
వ్యవస్థ, vyavastha
-n.
--system; organization; a set of rules;
వ్యవసాయం, vyavasAyaM
-n.
--agriculture; cultivation;
వ్యవహర్త, vyavaharta
-n.
--manager; organizer; one who controls a business or transaction;
వ్యవహారం, vyavahAraM
-n.
--(1) business; transaction;
--(2) dispute;
--(3) use; usage; custom; practice;
వ్యసనం, vyasanaM
-n.
--bad habit; addiction;
వ్యస్తాక్షరి, vyastAkshari
- n.
-- one of the eight items in a literary gymnastic event called "ashTAvadhAnaM;" the person conducting the event is required to compose a poem that contains a specified set of words;
వ్యష్టిగా, vyashTigA
-adv.
-- separately; in an isolated fashion;
వ్రణం, vraNaM
-n.
--(1) ulcer; carbuncle; boil;
వ్రతం, vrataM
-n.
--a religious ritual worshp with a single-minded devotion, usually officiated by a priest;
వ్రతశీలి, vrataSIli
-n.
--(1) duty bound person;
--(2) a person devoted to a cause;
'''వా - vA, వ్యా - vyA'''
వాంగ్మయం, vAMgmayaM
-n.
--literature; literary heritage; వాఙ్మయం is the only place I have seen the use of ఙ. For simplification, I have decided to use this spelling although it is frowned upon by purists.
వాంఛ, vAMcha
-n.
--desire;
వాంఛనీయం, vAMchanIyaM
-n.
--desirable;
వాంతి, vAMti
-n.
--vomit;
వాక్, vAk
-adj.
--vocal; speech;
వాక, vAka
-n.
--a tropical thorny bush; Karaunda; Jasmine-flowered carissa; Bengal currants; [bot.] ''Carissa carandas'' of Apocynaceae family;
--[Sans.] సుషేణ; కరమర్దకః; అవిగ్నః; కృష్ణపాక ఫలమ్;
వాకట్టు, vAkaTTu
-n.
--gag; a long piece of cloth stuffed in the mouth and tied around the head to prevent a person from talking;
వాక్యం, vAkyaM
-n.
--sentence;
వాక్కాయ, వాకల్వి కాయ, vAkkAya, vAkalvikAya
- n.
-- [bot.] ''Caris carandas; Carissa spinarum;(Apocynaceae or Milkwort Family.)
-- (Apocynum cannabinum)అపోసైనం కన్నబియం అనే హోమియో మందు ఉంది;
వాకిలి, vAkili
-n.
--front yard; (ant.) పెరడు;
---నాలుగిళ్ల వాకిలి = courtyard.
వాకుడు, vAkuDu
-n.
--a type of prickly nightshade; [bio.] ''Solanum jacquinii'' of the Solanaceae family; the root of this medicinal plant is used in Ayurveda;
== ముళ్ల వంగ; వాకుడుకాయ;
వాక్కు, vAkku
-n.
--word; utterance; speech; voice;
వాకేతం, vAkEtaM
-n.
--signal; a coded signal; (def.) వార్తలని మోసే సంకేతం;
వాగ్వ్యవహారం, vAgvyavahAraM
- n.
-- conversational transaction; oral transaction;
వాగ్దానం, vAgdAnaM
-n.
--promise; (lit.) giving a word;
వాగ్వాదం, vAgvAdaM
-n.
--argument; oral dispute;
వాగ్మి, vAgmi
-n.
--orator; eloquent speaker;
వాగ్విలాసం, vAgvilAsaM
-n.
--gracefulness of speech;
వాగ్వివాదం, vAgvivAdaM
-n.
--debate; argument;
వాగు, vAgu
-n.
--mountain stream;
-v. i.
--(1) babble; prattle; talk without much forethought; talk with no regard to the rank and status of the other person;
--(2) make sounds;
వాగుడు, vAgUDu
-n.
--garrulousness; talkativeness;
వాగ్రూపం, vAgrUpaM
-adj.
--oral; (ety.) వాక్ + రూపం = in the form of words uttered; (rel.) లిఖితపూర్వకం;
వాగ్గేయం, vAggEyaM
-n.
--lyric and its composition; (ety.) వాక్ + గేయం;
వాగ్గేయకారుడు, vAggEyakAruDu
-n. m.
--one who writes the lyrics as well as composes the music;
వాఙ్మయము, vaa~mmayamu
- n.
-- (1) consisting of speech, depending on speech, whose essence is speech, relating to speech; (2) literature; rhetoric;
-- వాక్ + మయం = వాఙ్మయం; వాక్కులతో నిండినది; సాహిత్యం, సారస్వతం, వాఙ్మయం అనేవి మూడు; ఇవి ఒక దానికంటే మరొక దాని పరిధిని బట్టి విస్తృతమైనవి. హితబోధ లక్ష్యంగా కలది సాహిత్యం; ఉదా. కావ్య నాటకాదులు. సరస్వతీ సంబంధమైనది సారస్వతం. ఉదా. సినిమాల భాష సినీ సారస్వతం అనవచ్చు. సంగీత సారస్వతం అంటే కృతులూ, పదాలూ, ఆలాపనలూ. వైదీక సారస్వతం అంటే వేదాలూ, మంత్రాలూ, వాటి వ్యాఖ్యానాలూ. ఉపన్యాసాలూ మొదలైనవన్నీ. వాఙ్మయం అంటే పైవన్నీ. వినోదం కోసం ఆనందం కోసం ఉన్న రచనలే కాక, నిత్య జీవితానికి ఉపకరించే అనేక విషయాల సమాహారం వాఙ్మయం ఔతుంది. వివిధ శాస్త్ర గ్రంథాలూ, జీవిత చరిత్రలూ, పత్రికలూ, వార్తలూ, చర్చలూ, అన్నీ. తెలుగు భాషలో కనబడేవీ, వినబడేవీ సమస్తమూ - వాగ్రూపం లో ఉండేవన్నీ — తెలుగు వాఙ్మయమే.
వాచకం, vAcakaM
-n.
--reader; a collection of important works for reading;
వాచవి, vAcavi
-n.
--flavor;
వాచాలత, vAcAlata
-n.
--talkativeness;
వాచ్యార్థం, vAcyArthaM
-n.
--literal meaning;
వాచు, vAcu
-v. i.
--(1) swell;
--(2) crave; (ety.) by associating pregnant women's craving for foods and the swelling of their face and feet;
వాజపేయం, vAjapEyaM
-n.
--a ceremony during the inauguration of an emperor; see also రాజసూయం;
వాజమ్మ, vAjamma
- n.
--incompetent person; fool; simpleton; useless fellow;
వాజిగంధ, vAjigaMdha
-n.
--[bot.] ''Physalis flexuosa'';
వాజీకరి, vAjIkari
-n.
--aphrodesiac;
వాటం, vATaM
-adj.
--attitude; direction; tenor; trend;
---వాడి వాటం బాగా లేదు = his attitude is no good.
---గాలి వాటం = direction of wind; the trend in the air.
వాడ, vADa
-n.
--a row of houses; a street; a colony;
వాడకట్టు, vADakaTTu
-n.
--neighborhood; a street; a row of houses; an apartment complex; % to e2t
వాడగన్నేరు, vADagannEru
-n.
--[bot.] ''Plumiera acuminta;''
వాడాంబ్రం, vADAMbraM
-n.
--[bot.] ''Eranthemum nervosum;''
వాడు, vADu
-pron.
--he;
-v. t.
--use; avail;
- v. i.
--fade; wither; whittle;
వాడుక, vADuka
-n.
--usage; custom; habit; a habitual practice;
వాడుకరి, vADukari
-n.
--user;
వాడి, vADi
-adj.
--sharp; keen; pointed;
వాపు, vApu
-n.
--swelling; inflammation; edema;
వాణిజ్యం, vANijyaM
-n.
--trade;
వాతం, vAtaM
-n.
--(1) air;
--(2) One of the three balancing body conditions in Ayurveda, the ancient Indian medical science;
-- "వాత" అనేది గాలి మూలకంతో తయారు చేయబడుతుంది; వాత ఆధిపత్యం ఉన్న వారు సన్నగా, శక్తివంతంగా, సృజనాత్మకంగా ఉంటారు, కానీ సులభంగా పరధ్యానం చెందుతారు. వారి మానసిక స్థితి వాతావరణం, వారి చుట్టూ ఉన్న వ్యక్తులు, తినే ఆహారాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది;
వాత, vAta
-n.
--brand; cautery; a mark left by a burning iron rod;
వాతపోధం, vAtapOdhaM
-n.
--[bot.] ''Butea frondosa;''
వాతహరి, vAtahari
-n.
--carminative; a medicine that subdues any gas in the stomach;
వాత్సల్యం, vAtsalyaM
-n.
--affection; love; the affection shown by an adult toward a youngster;
వాతావరణం, vAtAvaraNaM
-n.
--(1) atmosphere, a region of space surrounding the Earth, నభోవరణం;
--(2) weather; short- term behavior of the atmosphere in terms of temperature, wind, cloudiness, rainfall, etc. A better Telugu word needs to be coined for this. (see వాలిమండ);
--(3) climate; long-term behavior of the atmosphere in terms of general trends in heating, cooling, greenhouse effects, glaciation, etc. A better Telugu word needs to be coined for this;
వాదం, vAdaM
-n.
-- theory; supposition;
-- గౌతమ మహర్షి తన న్యాయ సూత్రాలలో ఈ మాటని నిర్వచించాడు. భారతీయ తర్క శాస్త్రానికి కూడా గౌతముని న్యాయ సూత్రాలే ప్రాతిపదిక. తనకు తెలియని దానిని తెలుసుకొనటానికి లేదా ఒక విషయంలోని అన్ని పార్శ్వాలు స్పష్టంగా గ్రహించటానికి చేసే చర్చకు 'వాదం' అని పేరు.
-- తనకు తెలిసినదే నిజం. ఇతరులంటున్నది యథార్థం కాదు అని ముందే ఒక నిర్ణయానికొచ్చేసి, నిశ్చయంతో చేసే సంవాదాన్ని 'జల్పం' అంటారు.
-- మూడవది 'వితండం'. తనకంటూ ఒక స్వంత అభిప్రాయం, విషయజ్ఞానం ఏదీ లేకపోయినా, ఎదుటి వాడు చెప్పేది అంతా తప్పు అని మొండిగా వాదించడం వితండ వాదం.
వాదన, vAdana
-n.
--argument; pleading;
వాద్యం, vAdyaM
-n.
--musical instrument; (rel.) జంత్రవాద్యం;
వాద్యబృందం, vAdyabRMdaM
-n.
--orchestra;
వాది, vAdi
-n.
--plaintiff; the person who filed a suit in court; (ant.) ప్రతివాది;
వాదించు, vAdiMcu
-v. t.
--argue; plead;
వాదోడు, vAdODu
-n.
--verbal assistance; support using words; see also చేదోడు;
వాదోస్పదం, vAdOspadaM
-n.
--arguable;
వాన, vAna
-n.
--rain; shower;
వానకోయిల, vAnakOyila
-n.
--swallow; a type of bird;
వానపాము, vAnapAmu
-n.
--earthworm; dew-worm; segmented worm; angleworm; [bio.] ''Megascolex mauritii'' of the Megascolecidae family; మన దేశం లో ప్రధానంగా రెండు రకాలు ఉన్నాయి 1. ఫెరేటిమ పోస్తుమ ''Pheretima posthuma;'' 2. లుంబ్రికాస్ టేర్రెస్త్రిస్ ''Lumbricus Terrestris;''
--130 కుటుంబాలకు పైగా ఉన్న వానపాములలో 12 వేలకు పైగా జాతులున్నాయి. మెగాస్కోలెసిడే కుటుంబానికి చెందిన మెగాస్కోలెక్స్ మారిటీ అనే శాస్త్రీయ నామం కలిగిన వానపాములు మన ప్రాంతంలో సర్వసాధారణంగా కనిపిస్తాయి. ఎర్రలకు రెండువైపులా తలలుంటాయి; మూడు గుండెకాయలుంటాయి. అంచేత మధ్యలో ఎక్కడ తెగకోసినా, రెండు ముక్కలు విడివిడిగా బతికి, కావలసిన అవయవాలను మళ్ళీ అభివృద్ధి పరచుకొంటాయి; నేలలో వానపాములు ఎంత ఎక్కువగా ఉంటే రైతుకు అంత మేలు జరుగుతుంది.
-- ఎర్ర; ఎర్రటి రంగులో ఉంటాయి కనుక "ఎర్రలు" అంటారో, చేపలు పట్టడానికి వేటిని ఎరలు (baits) గా వాడతారు కనుక ఎర్రలంటారో తెలియదు;
వానమట్ట, vaanamaTTa
- n.
-- Bombay Duck; [bio.] ''Harpadon nehereus;'' is a species of lizardfish popular in Mumbai, India;
వానరం, vAnaraM
-n.
--monkey; ape; any animal of the simian family;
-- [వా + నర, వా వికల్పితః నరః] నరునివలె తోచునది, కనబడునది = వానరము; a creature that looks like a human;
వానర, vAnara
-adj.
--simian;
వాపు, vApu
-n.
--swelling;
వాపోవు, vApOvu
-v. i.
--lament; deplore; bewail;
వామ, vAma
-pref.
--levo; sinistral; left-handed;
---వామ నవామ్లం = L-amino acid.
---వామోజు = levulose; levose.
వామపక్షం, vAmapakshaM
-n.
--left wing;
వామింట, vAmiMTa
- n.
-- [bot.] ''Cleome gynandra'' Linn.; see also వాయింట; కుక్క వాయింట;
-- ఇది వర్షాకాలంలో ఎక్కడ చూసినా తెల్ల పువ్వులు, పసుపు పూవులతో కనిపిస్తుంది. ఇది ఆవాల మొక్కని పోలి ఉంటుంది. ఈ ఆకు ఇంగువ వాసనను కలిగి ఉంటుంది. దీనిని సాధారణంగా సాంప్రదాయ వైద్యంలో వివిధ రకాల శరీర నొప్పులని తగ్గించడానికి ఉపయోగిస్తారు.
వాము, vAmu
-n.
--(1) seed of Bishop's weed; Ajwa seeds; [bot.] ''Carum copticum''; Trachispermumm ammi;
-- అజామోద వాము = [bot.] Trachispermumm roxburghianum;
--కురాసాని వాము = henbane; [bot.] Hyoscyamus niger of the Solanaeceae family;
-- [Sans.] యువానీ; దీపక; దీప్య; ఓమము; శూల హంత్రీ;
--(2) stack;
---గడ్డివాము, = haystack.
వాము ఆకుల మొక్క, vAmu Akula mokka
- n.
-- [bot.] Coleus aromanticus;
వాముపువ్వు, vAmupuvvu
-n.
--thymol; an aromatic colorless crystalline, camphor-like, compound extracted from the volatile oils of thyme; [bot.] ''Thymus vulgaris'' or ''Carum copticum''; probably a misonomer; C<sub>10</sub>H<sub>14</sub>O; crystals of thymol resemble camphor tablets;
వాయ, vAya
-n.
--batch;
వాయింట, vAyiMTa
-n.
--a shrub whose leaves have medicinal value; [bot.] ''Cleome pentaphylla''; see also వామింట;
వాయిదా, vAyidA
-n.
--(1) installment;
--(2) postponement;
---వాయిదాల పద్ధతి = installment plan.
---కోర్టువారు కేసు వాయిదా వేసేరు = the case is postponed by the court.
వాయుదండం, vAyudaMDaM
-n.
--loom; నేతకు వాడే తాకుపలక;
వాయులీనం, vAyulInaM
-n.
--violin;
వాయవ్యం, vAyavyaM
-n.
--North-West;
వాయువిడంగం, vAyuviDaMgaM
-n.
--a medicinal root; a paste made from this root is believed to assist the development of speech in children; [bot.] ''Embetia ribes;''
వాయువు, vAyuvu
-n.
--(1) gas;
--(2) wind;
వాయిదా, vAyidA
- n.
-- (1) postponement; (2) installment;
-- (ety.) in Arabic, వా-ఇదా = agreement; contract;
వారం, vAraM
-n.
--(1) week;
--(2) day of the week; వాసరం;
--(3) collection; set;
---వారం వారం రా = come every week.
---ఈవేళ ఏమి వారం = what day of the week is today?
---కిరణవారం = beam of light.
వార, vAra
-n.
--side; corner;
వారధి, vaaradhi
- n.
-- causeway; a raised road or track across a low or wet ground; ex. "an island reached at low tide by a causeway;"
-- సేతువు; అడ్డకట్ట; వంతెన;
వారవనిత, vAravanita
-n.
--prostitute; courtesan; వారకాంత;
-- వార వనిత అంటే ఒక రోజు వరకు గడపఁదగ్గ మగువ (వెలయాలు);
వారడి, vAraDi
-n.
--(1) interval; difference;
--(2) lacuna; defect; deficiency;
వారధి, vAradhi
-n.
--bridge;
వారసత్వం, vArasatvaM
-n.
--heredity;
వారసవాహిక, vArasavAhika
-n.
--[bio.] chromosome; (lit.) chromo = color; soma = body; the word chromosome is a misnomer because chromosomes have no inherent color; వారసవాహిక means carrier of hereditary information; these are string-like substances found in the nuclei of cells;
వార్త, vArta
-n.
--news; tidings; intelligence;
వార్ధక్యం, vArdhakyaM
-n.
--old age;
వారాహి, vaaraahi
- n.
-- (1) one of the seven deities; (2) a female wild boar;
-- (1.) సప్తమాతలలో ఒకరైన దేవత; (2.) ఆడ అడవి పంది;
-- బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ - వీరు సప్తమాతలు. దుర్గా సప్తశతిలో వీరు దుర్గాదేవి ప్రతిరూపాలుగా వచ్చి రాక్షస సంహారం కావిస్తారు;
వార్తాపత్రిక, vArtApatrika
-n.
--newspaper;
వారించు, vAriMcu
-v. t.
--stop; prevent; hinder; obstruct;
వార్షికం, vAtshikaM
- n.
-- (1) a yearly payment; an annuity; (2) annual; yearly; (3) belonging to or produced in the rainy season;
వార్చు, vArcu
-v. t.
--decant; drain; to pour off liquid from the top of a vessel without disturbing the contents at the bottom;
వార్డు, vArDu
-n.
-- (1) ward; (2) a wing of a hospital or prison; (3) an administrative unit in a city; (4) The smallest administrative unit of Gram Panchayats in India;
వాలం, vAlaM
-n.
--tail; suffix; extension;
---కరవాలం = sword. (lit.) an extension of the hand.
---సౌధవాలం = annex. (lit.) an extension of a building.
వాలకం, vAlakaM
-n.
--attitude; demeanor; sly behavior;
వాలా, vAlA
-suff.
--a suffix added to the end of a name to indicate the place of origin, profession or activity;
---జట్కావాలా = the driver of a horse-drawn cart.
---ఢిల్లీవాలా = the person from Delhi.
-- సైకిలు వాలా = the person on the bicycle.
వాలిమండ, vAlimaMDa
-n.
--weather; (ety.) వాన, గాలి, మబ్బు, ఎండల సముదాయం;
వాలు, vAlu
-adj.
--slanting; inclined;
వాలు, vAlu
-n.
--slope; incline;
వాలు, vAlu
-v. i.
--(1) tilt; lean;
--(2) land; perch;
వాలు చూపులు, vAlu cUpulu
-n.
--slanting glances;
వాలుక, vAluka
-n.
--sand;
వాలుకాయంత్రం, vAlukAyaMtraM
- n.
-- (1) any contraption that uses sand in its operation
-- (2) sand-clock
వాలుకుర్చీ, vAlukurcI
-n.
--easy chair; relaxing chair; lounging chair;
వాలుగ, vAluga
-n.
--catfish;
వాలుబల్ల, vAluballa
-n.
--inclined plane; inclined plank;
వాల్చు, vAlchu
-v. t.
--turn an object from an upright to a flat position as in మంచం వాల్చు; see also చేరబెట్టు;
వావి, vAvi
-n.
--blood relationship; consanguinity;
వావిడికం, vAviDikaM
-n.
--incest; relationship prohibited for a wedded life;
వావివరుస, vAvivarusa
-n.
--relationship suitable for a wedded life; consanguinity;
వావిలి చెట్టు, vAvili ceTTu
-n.
--[bot.] ''Vitex negundo'' of the teak (Verbenaceae) family;
-- వావిలి మొక్కలో అనేక ఔషధ ప్రయోజనాలున్నాయి; చవితి పూజకు ఉపయోగించే పత్రిలో వావిలి ఆకు (సింధురవార పత్రి) ఉంది;
-- నల్ల వావిలి; సింధువారం; నిర్గుండీ;
వాసం, vAsaM
-n.
--beam; a longitudinal (main) beam of a house; see also పెండె;
వాసంతి, vAsaMti
-n.
--[bot.] ''Jasmimum auriculatum;''
వాసన, vAsana
-n.
--(1) odor; smell; fragrance; aroma;
--(2) memory; subconscious memory from a previous birth (aacording to Abhinava Gupta's philosophy); పూర్వజన్మలోని కర్మలు మరుజన్మలో వాసనా రూపంలో ఉంటాయని, ఎవరి కర్మకి వారే కర్తలు అనీ సిద్ధాంతం;
వాస్తవం, vAstavaM
-n.
--fact; reality; truth;
వాస్తవ్యం, vAstavyaM
-n.
--habitat; house;
వాస్తవవాది, vAstavavAdi
-n.
--realist;
వాస్తవ్యుడు, vAstavyuDu
-n.
--inhabitant; resident; dweller;
వాసి, vAsi
-n.
--(1) quality; (rel.) రాసి = quantity;
--(2) extent;
---రాసి కంటే వాసి ఎక్కువ = quality surpassed quantity.
---వెంట్రుక వాసిలో తప్పిపోయింది = missed by a hair's breadth.
వాసుకి, vAsuki
-n.
--(1) Hydra, the Water Snake; a cluster of stars;
--(2) name of a legendary snake in Hindu lore;
వాస్తు, vAstu
-n.
--architecture; science of building construction;
వాస్తుకం, vAstukaM
-n.
--[bot.] ''Chenopodium album;''
వాస్తుశిల్పి, vAstuSilpi
-n.
--architect;
వాహనం, vAhanaM
-n.
--vehicle; mount; a device to ride on;
వాహ్యాళి, aahyaaLi
- n.
-- (1) a road for horses; (2) a pleasure ride on horseback; (3) leisurely walking; strolling;
-- Reduplication అనే morphological change ప్రక్రియ వలన రెండవ అక్షరానికి వున్న 'య-ఒత్తు' మొదటి అక్షరానికి కూడ చేర్చి వ్రాయడం ద్వారా 'వ్యాహ్యాళి'ని కొంతమంది వాడడం జరిగింది. కాని అది సరియైన ప్రయోగం కాదు.
వాహిని, vAhini
-n.
--(1) river;
--(2) army;
--(3) conductor of heat, electricity, etc.;
వ్యాకరణం, vyAkaraNaM
-n.
--grammar; analysis;
వ్యాకర్త, vyAkarta
-n.
--(1) grammarian;
--(2) parser;
వ్యాకరించు, vyAkariMcu
-v. t.
--analyze; parse; decompose;
వ్యాకీర్ణం, vyAkIRNaM
-n.
--scatter; disorder;
---వ్యాకీర్ణ పటం = [stat.] scatter diagram.
వ్యాకులత, vyAkulata
-n.
--anxiety;
వ్యాకోచం, vyAkOcaM
-n.
--expansion; (ant.) సంకోచం,;
వ్యాఖ్య, vyAkhya
-n.
--comment; (ant.) నిర్వాఖ్య = no comment;
వ్యాఖ్యానం, vyAkhyAnaM
-n.
--commentary;
-- ప్రామాణిక వ్యాఖ్యానం = standard (regular) commentary; ప్రామాణిక వ్యాఖ్యానంలో గ్రంథంలో కవి ఉపయోగించిన కష్టమైన ప్రయోగాలను, సూత్రాలను (అనగా కుదించి వ్రాసిన విషయాలను) విడమరచి విపులంగా వివరించడం జరుగుతుంది
-- సర్వంకష వ్యాఖ్యానం = interpretation with word-for-word translation and purport; శిశుపాలవధ అనే మాఘకావ్యానికి (మాఘుడు వ్రాసినది) మల్లినాథుడు వ్రాసిన వ్యాఖ్యానమును సర్వంకషము అంటారు. అనగా పదచ్ఛేము, పదార్థోక్తి (అందులో వాడిన పదాల యొక్క వివిధ అర్థాలు, విగ్రహం (విడి విడి పదాలను కలిపినపుడు వచ్చే సమాస పదానికి ఏర్పడే ప్రత్యెక అర్థపు వివరణ), వాక్యయోజన (వాక్యాలు విడి విడిగా ఉన్నపుడు వేర్వేరు అర్థాలను సూచించినప్పటికీ వాటిని ప్రక్క ప్రక్కన వ్రాయడం వలన వాటి సమూహానికి కొత్త అర్థం ఏర్పడవచ్చు), ఆపేక్ష - సమాధానం (వ్యాఖ్యాకారుడే స్వయంగా ప్రశ్నలు వేసి, వాటికి తనే సమాధానం ఇవ్వడం ద్వారా వివరణను ఇవ్వడం), ఇలా వివిధ రకాలుగా గ్రంథం యొక్క విషయాన్ని కూలంకషంగా చర్చించి వివరించేదే 'సర్వంకష' వ్యాఖ్యానము.
-- సంజీవినీ వ్యాఖ్యానం = continuous commentary; టీకా అనగా నిరంతర వ్యాఖ్యానం. గ్రంథంలోని ఏ ఒక్క పదాన్ని విడిచిపెట్టకుండా కఠినమైన పదాలకూ, తేలికైన పదాలకూ కూడా అర్థాన్ని వివరించేదానిని టీకా అంటారు. మల్లినాథుడు కాళిదాసు యొక్క వివిధ కావ్యాలకు వ్రాసిన టీకాలకు 'సంజీవనీ' టీకా అని పేరుపెట్టాడు.
వ్యాఘాతం, vyAghAtaM
-n.
--contradiction;
---పరస్పర వ్యాఘాతాలు = mutual contradictions;
వ్యాధి, vyAdhi
-n.
--disease; illness; sickness; malady; ailment;
వ్యాధుడు, vyAdhuDu
-n.
--hunter;
---మృగవ్యాధుడు = Orion, the constellation.
వ్యాపకం, vyApakaM
-n.
--avocation;
వ్యాపారం, vyApAraM
-n.
--(1) trade; business; occupation; vocation;
--(2) activity;
---సృజన వ్యాపారం = creative activity.
వ్యాపార దక్షత, vyApAra dakshata
-n.
--business skill;
వ్యాపార పవనాలు, vyApAra pavanAlu
-n.
--trade winds;
వ్యాపారస్తుడు, vyApArastuDu
-n. m.
--trader; business person;
వ్యాపారి, vyApAri
-n.
--trader; business person;
వ్యాపారులు, vyApArulu
-n.
--people belonging to a subsect of Telugu Brahmins;
వ్యాపించు, vyApiMcu
-v. t.
--extend; expand; pervade;
వ్యాప్తి, vyApti
-n.
--range; extent; spread; widespread distribution; universality; omnipresence;
వ్యామోహం, vyAmOhaM
-n.
--(1) lust; carnal desire;
--(2) excessive desire;
వ్యాయామం, vyAyAmaM
-n.
--physical exercise; calisthenics;
వ్యాళములు, vyALamulu
- n. pl.
--ovoviviparous; born of an egg inside the body; some reptiles lay their eggs but the eggs are hatched inside their bodies and baby reptiles come out;
-- also called అండయోనిజములు; Boa constrictor and Green Anaconda are examples;
వ్యాళి, vyaaLi
- n.
-- a non-existing imaginary animal, like the dragon or Sphinx, mentioned in Hindu puranas and found in Indian temple sculptures;
-- ఒక మిశ్రమ జంతువు. ఇందులో కొమ్ములు, కోరలు, ఏనుగు తొండం, సింహపు జూలు, పాము తోక, ఇలా అనేక జంతువుల లక్షణాలు కలిసి ఉన్న ప్రత్యెక జంతువు. ఒకవేళ ఏనుగు తొండం ఉంటే గజ వ్యాళి అని, సింహం ముఖం తో ఉంటే సింహ వ్యాళి అనీ, మనిషి ముఖం ఉంటే నర వ్యాళి అనీ ఇలా విభిన్న రూపాల్లో శిల్పాలు చెక్కటం మనం గమనించ వచ్చు. కొందరి సిద్ధాంతం ప్రకారం మొహెంజుదారో M-౩౦౦ ముద్రలో ఉన్నది వ్యాళి జంతువు. ఎందుకంటే కొమ్ములు, కోరలు, ఏనుగు తొండం, సింహపు జూలు, జింక శరీరం, పులి కాళ్ళు ,పాము తోక అందులో కనిపిస్తాయట . గుప్తులకాలంలో,ఇంకా గుజరాత్ ,మధ్య దేశం అంతటా ఈ జంతువు గుడులలో కనిపిస్తుంది. అయితే దేవాలయ శిల్ప కళలో మాత్రం పల్లవ రాజుల కాలం నుండి ఇవి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మామల్లపురం లో వ్యాళ/యాళి మండపం ఉంది. నాయక రాజుల కాలంలో ఇవి ముంగాళ్ళ మీద నించుని నోరు తెరచిన రూపంలో ఉంటాయి. విజయనగర రాజులు, కన్నడ నాట, ఇలాంటి జంతువు దేవాలయ శిల్పాలలో చెక్కడం సాధారణమే. బౌద్ధంలో కూడా వ్యాళ జంతువు ఉంది.
వ్యావహారికం, vyAvahArikaM
-n.
--colloquial; in common use;
వ్యావృత్తి, vyAvRutti
-n.
--hobby;
వ్యాసం, vyasaM
-n.
--(1) diameter; divider;
--(2) essay; analysis;
--(3) compilation;
వ్యాసంగం, vyasaMgaM
-n.
--pursuit; pursuit of of literature, art, science, etc.
-- రచనా వ్యాసంగం; పరిశోధనా వ్యాసంగం;
వ్యాసఘట్టం, vyAsaghaTTaM
-n.
--a tough to untangle passage; a difficult to understand passage in a long narrative; It is believed that Vyasa, while composing the epic Bharatha, used difficult passages now and then to slow down Vinayaka, his amanuensis;
-- గ్రంథగ్రంథి;
వ్యాసపీఠం, vyasapIThaM
-n.
--lectern; a short stand that helps support a book with opened pages - often used by speakers giving a lecture while sitting;
వ్యాసుడు, vyasuDu
-n.
--sage Vyasa; the divider of the Vedas; the editor of Vedas;
వ్యాసార్ధం, vyAsArdhaM
-n.
--radius;
వ్యాళం, vyaaLaM
- n.
-- an imaginary hybrid animal whose sculptures are found on trmple walls in Southern India;
-- దక్షిణ భారతదేశ దేవాలయాల్లో (ముఖ్యంగా హంపి, మధురై వంటి చోట్ల) స్తంభాల మీద వింత జంతువుల విగ్రహాలు కనిపిస్తాయి. వీటిని 'వ్యాళం' అంటారు. ఇందులో సింహం ముఖం, ఏనుగు తొండం లేదా పులి శరీరం వంటి వింత కలయికలు ఉంటాయి. ఇది ప్రాచీన శిల్పులకు జంతువుల కలయికల మీద ఉన్న ఊహాశక్తికి నిదర్శనం.
వ్రాయసకాడు, vrAyasakADu
-n.
--scribe; amanuensis; one who takes dictation;
వ్రాయి, vrAyi
- n.
-- a syllable; ఒక అక్షరం;
వ్రాలు, vrAlu
- n. pl.
-- a chain of syllables; అక్షర సముదాయం;
-- చేవ్రాలు = hand-written letters; signature;
'''వి - vi, వీ - vI, వు - vu, వూ - vU'''
వింశాంశ, viMSAMSa %e2t
-adj.
--vegesimal; related to the method of counting using base twenty;
వింగడించు, viMgaDiMcu
-v. t.
--separate; divide;
వింత, viMta
-adj.
--curios; odd; strange; unusual;
-n.
--curiosity; oddity; marvel; something unusual;
విందు, viMdu
-n.
--feast;
వింశతి, viMSati
-n.
--twenty;
వి, vi
-adj.
--pref. one that tends to expand into everything; సర్వత్ర వ్యాపించునది; (def.) వ్యాపక స్వభావం కలవాడు విష్ణువు;
వికర్బన రసాయనం, vikarbana rsAyanaM
-n.
--inorganic chemistry;
వికర్మ, vikarma
-n.
--illegal act; unacceptable act;
వికలాంగుడు, vikalAMguDu
-n.
--cripple; a man with maimed limbs;
వికసించు, vikasiMcu
-v. t.
--bloom; open up;
విక్రమం, vikramaM
-n.
--valor; courage;
విక్రమ, vikrama
-adj.
--high-speed; one that moves fast; can be used for the prefix turbo in computer software;
విక్రయం, vikrayaM
-n.
--sale;
విక్రయ పత్రం, vikraya patraM
-n.
--sale deed;
వికారం, vikAraM
-n.
--(1) nausea;
--(2) changed form; secondary form derived from a primary form;
---వికారపు చేష్టలు = nauseating deeds.
---నిర్వికారం = unchnageable
వికాసం, vikAsaM
-n.
--(1) blooming; blossoming; brightness;
--(2) exposition;
--(3) development;
-- (4) evolution;
వికృతి, vikRti
-n.
--alteration; deformed shape; [gram.] corrupted form;
విక్రేత, vikrEta
-n.
--vendor; the person who sells; (ant.) క్రాయిక = buyer;
విఖ్యాతి, vikhyati
-n.
--fame;
విఖ్యాపన, vikhyApana
-n.
--ekphrasis; in poetry, the use of detailed description of a work of visual art as a literary device;
విగ్రహం, vigrahaM
-n.
--(1) statue; idol; icon; image;
--(2) physical stature; personality; figure; shape; form; body;
---విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి = physical stature is impressive, but it is only good for making the plate empty.
-- (3) వి + గ్రహం = diffusing; distributing; radiating; repulsion;
-- (4) quarrel; fight; opposite of సంధి;
విగ్రహవాక్యం, vighrahavaakyaM
- n.
-- సమసనం (summing) అంటే కలపడం. వివిధ నియమాలను అనుసరించి నామవాచక పదాలను కలపడం ద్వారా 'సమాసములు' ఏర్పడతాయి. ఆ సమాసపదాలను విస్తరించినపుడు 'విగ్రహవాక్యము' ఏర్పడుతుంది;
విగ్రహారాధన, vigrahArAdhana
- n.
-- idolatory; idol worship;
విఘాతం, vighAtaM
-n.
--heavy blow; hindrance; setback; impediment;
విచక్షణ, vicakshaNa
-n.
--discrimination; ability to tell right from wrong;
విచక్షణ జ్ఞానం, vicakshaNa j~nAnaM
-n.
--the power of discrimination; the ability to tell the difference between good and bad;
విచ్చలవిడిగా, viccalaviDigaa
-adv.
--irresponsibly; irresponsibly; liberally; unconstrained movement;
-- "విచ్చల విడిగా తిరుగుతున్నారు" అనే వాడుక పొగరుబోతుతనంతో/ బాధ్యత లేకుండా అనే అర్థంలో ఉంది; విడి విడిగా అనేటప్పుడు వచ్చే అర్థం విచ్చలవిడి అన్నపుడు రాదు;
విచారం, vicAraM
-n.
--sadness;
విచారణ, vicAraNa
-n.
--investigation; inquiry;
విచారణ చేయు, vicAraNa cEyu
-v. t.
--inquire; investigate;
విచారించు, vicAriMcu
-v. i.
--feel sad; lament; bemoan;
విచారించు, vicAriMcu
-v. t.
--investigate; inquire; find out;
విచికిత్స, vicikitsa
-n.
--doubt; uncertainity;
విచిత్రం, vicitraM
-n.
--strange event; strange happening;
విచిలకం, vicilakaM
-n.
--[bot.] Vangueria spinosa;
విచ్ఛిత్తి, vicchitti
-n.
--disintegration; breaking up; splitting;
విచ్ఛిన్నం, vicchinnaM
-n.
--disintegration; breaking up; splitting;
విజయం, vijayaM
-n.
--victory; success;
విజయసారం, vijayasAraM
-n.
--an Ayurvedic medicinal plant advocated for diabetes mellitus; in the form of water decoction has been reported to have a protective and a restorative effect in alloxan-induced diabetic rats; [bot.] Pterocarpus marsupiu;
విజాత, vijAta
-adj.
--heterogeneous;
విజ్ఞానం, vij~nAnaM
-n.
--knowledge; scientific knowledge;
విజ్ఞాపన, vij~nApana
-n.
--petition; request; memorandum;
విజేత, vijEta
-n.
--victor;
విజ్జోడు, vijjODu
-n.
--discordanrt pair; unmatched pair;
విజిగీష, vijigeesha
-n.
-- desire to win; extreme desire win;
--- గెలుపు సాధించాలనే బలమైన కోర్కె;
విటమిను, viTaminu
-n.
--vitamin; nutrients, necessary in minute quantities, for the maintenance of good health; About 13 vitamins have been recognized. The body can manufacture some of these, but the others must be supplied through the diet; (ety.) vital + amine = vitamine, from which the last letter 'e' is dropped; this is a misnomer because amines are not a part of all vitamins;
విటమిన్లకూర, viTaminlakUra
-n.
-- [bot.] ''Sauropus androgynus'' Merrill;
విడత, viData
-n.
--release; installment;
విడదీయు, viDadIyu
-v. t.
--separate;
విడాకులు, viDAkulu
-n.
--divorce;
-- పూర్వం భార్యాభర్తలు ఒకే విస్తరాకు లో భోజనం చేసేవారు; వారు విడిపోయినప్పుడు మాత్రమే వేర్వేరు విస్తరాకుల్లో భోజనం చేసేవారు. అందుచేత జీవితంలో శాశ్వతముగా విడిపోయినప్పుడు "విడాకులు" తీసుకున్నారు అనే మాట ప్రచారం లోకి వచ్చింది;
విడిగా, viDigA
-adv.
--separately;
విడిది, viDidi
-n.
--camp. halt; lodge;
విడుదల, viDudala
-n.
--release; liberation;
విడ్డూరం, viDDUraM
-n.
--curiosity; oddity; marvel; strange event; unusual event;
వితండవాదం, vitaMDavAdaM
-n.
--illogical argument; circular argument;
-- చదువుకొనే శ్రద్ధ లేకుండా విజ్ఞులతో మొండిగా వాదం చేయడం;
వితంతువు, vitaMtuvu
-n.
--widow;
వితంతువు, vitaMtuvu
-n.
--widow; (lit.) one without the (sacred) thread;
వితథుడు, vitathuDu
- n.
-- liar; useless fellow;
-- "వితథం తు అనృతం వచః" అని అమరం;
వితరణ, vitaraNa
-n.
--(1) distribution;
--(2) charity;
వితరణి, vitaraNi
-n.
--distributor;
విత్తం, vittaM
-n.
--money;
విత్తనం, vittanaM
-n.
--seed;
వితాకు, vitAku
-n.
--absentmindedness;
విత్తు, vittu
-n.
--seed;
-v. t.
--seed; sow the seed;
విద్య, vidya
-n.
--education; learning;
విదారక, vidAraka
-adj.
--splitting; rending;
---హృదయ విదారక = heart-rending.
విదారి, vidAri
- n.
-- an Ayurvedic herb; [bot.] ''Ipomoea digitata''; విదారి తో కలిసిన అశ్వగంధాది చూర్ణం శరీరానికి రోగ నిరోధక శక్తి తో పాటు ధాతుపుష్టినీ, సత్తువనూ ఇస్తుంది. సుఖనిద్రను కలిగిస్తుంది;
విదాహం, vidAhaM
- n.
--మంట; భగభగ మండుతూన్నట్లు అనుభూతి; burning sensation;
విద్యార్థి, vidyArthi
-n.
--student; pupil; (lit.) a person begging for an education;
విద్యార్థి వేతనం, vidyArthi vEtanaM
-n.
--student stipend; scholarship;
విద్యాలయం, vidyAlayaM
-n.
--school; college;
విద్వాంసుడు, vidvAMsuDu
-n.
--scholar;
---నిలయ విద్వాంసుడు = resident scholar.
విద్వాన్, vidvAn
-n.
--a degree conferred on a Sanskrit scholar after achieving a certain level of education;
విదియ, vidiya
-n.
--the second day of the lunar half-month;
విదీను, vidInu
-n.
--[chem.] ethene; a hydrocarbon with two carbon atoms and one double bond; C<sub>2</sub>H<sub>4</sub>;
విదుషీమణి, vidusheemaNi
- n. f.
-- బహు శాస్త్ర జ్ఞానం కలిగినది; మణి, రత్నం, తిలకం, మొదలైన పదాలు శ్రేష్ఠతా వాచకాలు. ఈ రెండవ పదానికి వాచ్యార్థం చెప్పకూడదు. "విద్వాంసురాండ్రలో శ్రేష్ఠురాలు" అని మాత్రమే చెప్పాలి;
విధ్యుక్తధర్మం, vidhyuktadharmaM
- n.
-- devine responsibility; duty prescribed by scriptures;
-- విధి + ఉక్త + ధర్మము = విధ్యుక్త ధర్మం.
-- విధి = బ్రహ్మ, ఉక్త = చెప్పబడిన, బ్రహ్మ చేత చెప్పబడిన ధర్మము; ఎవరు ఏ స్థితిలో ఏ పని చేయవలెనని వేదం నిర్దేశించిందో ఆ పని వాడికి బ్రహ్మ నిర్దేశించిన పని;
విద్యుత్, vidyut
-n.
--electricity; విద్యుత్తు;
విద్యుత్ ఘాతం, vidyut ghAtaM
-n.
--electrical shock;
విద్యుత్ పీడనం, vidyut pIdanaM
-n.
--electrical potential;
విద్యుత్ పీడన తారతమ్యం, vidyut pIdana tAratamyaM
-n.
--electrical potential difference;
విద్యుదయస్కాంతం, vidyudayaskAMtaM
-n.
--electromagnet;
విద్యుదావేశం, vidyudAvESaM
-n.
--electrical charge;
విద్యుల్లత, vidyullata
-n.
--lightning; మెరుపు;
విదేను, vidEnu
-n.
--[chem.] ethane; a hydrocarbon with two carbon atoms and all single bonds; C<sub>2</sub>H<sub>6</sub>;
విదేశం, vidESaM
-n.
--foreign country; foreign land;
విదేశ, vidESa
-adj.
--foreign; alien;
విదేశీ మారకం, vidESI mArakaM
-n.
--foreign exchange;
విదైను, vidainu
-n.
--ethyne; a hydrocarbon with two carbon atoms and one triple bond; C<sub>2</sub>H<sub>2</sub>;
విధం, vidhaM
-n.
--(1) way; manner; method;
--(2) kind; sort; category;
విధ్వంసక, vidhvaMsaka
-adj.
--destructive;
విధ్వంసకాండ, vidhvaMsakAMDa
-n.
--(1) carnage;
--(2) wholesale destruction;
విధవ, vidhava
-n. f.
--widow; see also వెధవ; (ety.) విగత + ధవ = one who does not have a husband;
విధాత, vidhAta
-n.
--Lord Brahma of the Hindu Trinity; (lit.) fate giver;
విధానం, vidhanaM
-n.
--procedure;
విధాన సభ, vidhAna sabha
-n.
--Legislative Assembly; (lit) an ssembly where procedures are followed;
విధాయకం, vidhAyakaM
-n.
--obligatory; duty; obligatory duty;
విధి, vidhi
-n.
--(1) fate;
--(2) duty;
--(3) rule;
--(4) order; command;
విధిగా, vidhigA
-adv.
--without fail; perforce; in a duty-bound manner;
విధిలేక, vidhilEka
-adv.
--having no alternative;
విధివాచకం, vidhivAcakaM
-n.
--[gram.] imperative; imperative mood;
విధురుడు, vidhuruDu
-n.
--widower; a man whose wife died;
విధ్యుక్త, vidhyukta
-adj.
-- obligatory; duty-bound; with a civic sense;
విధ్యుక్త ధర్మం, vidhyukta dharmam
- n.
-- ఎవరు ఏ స్థితిలో ఏ పని చేయవలెనని (శాస్త్రం) నిర్దేశించిందో - ఆ పని; కొడుకుగా, తండ్రిగా, భర్తగా, గృహస్ధుగా పౌరుడుగా …..ఈ విధంగా. వివిధ పరిస్థితులలో, దశలలో ఒక వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలో అది;
విధేయత, vidhEyata
-n.
--obedience; obedience out of respect;
విధేయుడు, vidhEyuDu
-n.
--obedient person;
వినడం, vinaDaM
-v. i.
--listening; also వినటం;
వినబడు, vinabaDu
-v. i.
--audible;
వినతి, vinati
-n.
--salutation;
వినతిపత్రం, vinatipatraM
-n.
--memorandum; application; petition;
వినయం, vinayaM
-n.
--modesty; humility; obedience;
విన్నపం, vinnapaM
-n.
--plea; petition;
వినాళగ్రంధి, vinALagraMdhi
-n.
--endocrine gland; ductless gland;
వినా, vinA
-adv.
--without taking into account; except; sans;
విన్యాసం, vinyAsaM
-n.
--display (of a talent); configuration; arrangement;
వినికిడి, vinikiDi
-n.
--rumor; hearsay; one that was heard;
వినిపించు, vinipiMcu
-v. i.
--audible;
-v. t.
--make one hear; read out; narrate aloud;
వినిమయం, vinimayaM
- n.
--(1) consumption; use;
--(2) exchange; interchange; barter;
--- భావ వినిమయం = exchange of ideas
--- రేణు వినిమయం = exchange of particles
వినిమయదారుడు, vinimayadAruDu
- n.
-- consumer; user;
వినియుక్త, viniyukta
- adj.
-- used; utilized; employed;
వినియోగం, viniyOgaM
-n.
--use; utility;
వినియోగదారుడు, viniyOgadAruDu
-n.
--user; consumer;
వినియోగించు, viniyOgiMcu
- v. t.
-- make use; utilize;
విను, vinu
-v. t.
--(1) listen; obey; follow an advice;
--(2) hear; recognize a sound being made;
వినూతన, vinUtana
-adj.
--modern; ultra modern;
వినిమయం, vinimayaM
- n.
-- transaction; exchange; give-and-take;
వినోదం, vinOdaM
-n.
--pleasing pastime; amusement;
విపక్షం, vipakshaM
- n.
-- opposition party;
విపణి వీధి, vipaNi vIdhi
-n.
--market street; bazaar;
విపర్యం, viparyaM
-n.
--contradictory theorem; converse;
విపర్యోక్తి, viparyOkti
-n.
--paradox; contradiction; an epigram that presents seemingly contradictory ideas;
విపక్షం, vipakShaM
- n.
-- opposition party; opposing political group;
విప్ప చెట్టు, vippa cheTTu
- n.
-- honey tree, butter tree; [bot.] ''Madhuca longifolia'' of the Sapotaceae family;
-- The flowers, also known as ఇప్ప పువ్వు, are highly nutritious and are used extensively by tribal communities for food, medicinal, and cultural purposes. They are often dried and used to make sweets (laddus), medicinal drinks, or tea.
విప్రకృష్ట, viprakRshTa
- adj.
-- not near; late; recent; bygone; erstwhile; foregone; former; old; onetime; other; past; sometimes;
-- (ant.) సన్నికృష్ట;
విప్రలంభం, vipralaMbhaM
-n.
-- (1) deceit; misleading statement;
-- (2) separation of lovers;
-- (3) the sentiment of love in separation;
విప్రుడు, vipruDu
- n.
-- a person who studied the Vedas;
--శ్లో. జన్మనా జాయతే శూద్రః |కర్మణా జాయతే ద్విజః |వేదపాఠం తు విప్రాణాం |బ్రహ్మజ్ఞానం తు బ్రాహ్మణః
విప్లవం, viplavaM
-n.
--revolution;
---పారిశ్రామిక విప్లవం = industrial revolution.
విపీతం, vipItaM
-n.
--voltage; potential difference; (ety.) విద్యుత్ పీడనతారతమ్యం;
విపులంగా, vipulaMgA
-adj.
--thoroughly; in detail;
విపులీకరణ, vipulIkaraNa
-n.
--explanation;
విప్పు, vippu
-v. t.
--open; untie; loosen; undo; unroll; unwind;
విభక్తం, vibhaktaM
-n.
--divided; partitioned; separated;
విభక్తి, vibhakti
-n.
--[gram.]
--(1) case;
--(2) preposition;
--(3) declension;
విభక్తి ప్రత్యయం, vibhakti pratyayaM
-n.
--[gram.] preposition;
విభజన, vibhajana
-n.
--(1) separation; discrimination;
--(2) [math.] division; (ant.) గుణకారం;
విభ్రమం, vibhramaM
-n.
--confusion; wandering mind;
విభాగం, vibhAgaM
-n.
--division; sub-division; portion;
విభావరి, vibhAvari
-n.
--night;
విభాష, vibhAsha
-n.
--option; alternative;
విభీతికం, vibhItikaM
-n.
--[bot.] Terminalia belerica;
విభూతి, vibhUti
-n.
--sacred ashes;
విభూతిపత్రి, vibhUtipatri
-n.
--[bot.] ''Ocimum basilicum'';
విభేదాలు, vibhEdAlu
-n. pl.
--differences; disagreements;
విమర్శ, vimarSa
-n.
--(1) critique; review;
--(2) criticism;
విమానం, vimAnaM
-n.
--(1) plane; aircraft;
--(2) the tower of the innermost part of a temple; the dome of any tall structure;
--(3) celestial flying car described in ancient Hindu lore;
--(4) disrespect; insulting one's self-respect;
--(5) size;
--(6) horse;
విముక్తి, vimukti
-n.
--(1) release;
--(2) release from sins;
---దాస్య విముక్తి = emancipation.
విమోచనం, vimOcanaM
-n.
--redemption; liberation;
వియ్యం, viyyaM
-n.
--marriage alliance;
వియ్యంకుడు, viyyaMkuDu
-n. m.
--father of a son-in-law or daughter-in-law; (ety.) వియ్యము (వివాహ శబ్దం భవము) ద్వారా ఏర్పడిన సంబంధీకుడు;
వియ్యపరాలు, viyyaparAlu
-n. f.
--mother of a son-in-law or daughter-in-law;
వియోగం, viyOgaM
-n.
--separation; (ant.) సంయోగం;
విరంజన చూర్ణం, viraMjana cUrnaM
-n.
--bleaching powder;
విరక్తి, virakti
-n.
--absence of love or attachment; disinterest; disgust toward worldly pleasures;
విరగ్గొట్టు, viraggoTTu
-v. t.
--break;
విరజిమ్ము, virajimmu
-v. t.
--scatter; also చెదరగొట్టు;
విరమించు, viramiMcu
-v. i.
--(1) cease; stop; desist;
--(2) withdraw; retire; give up; put an end to;
--(3) discontinue; abandon;
విరసం, virasaM
-n.
--discordance; ill-will;
విరహం, virahaM
-n.
--(1) separation; separation of lovers;
-- (2) the sentiment of love in separation;
విరహవేదన, virahavEdana
-n.
--pangs of separation between lovers;
విరామం, virAmaM
-n.
--rest; intermission;
విరామ బిందువు, virAma biMduvu
-n.
--resting point;
విరాళం, virALaM
-n.
--donation;
విరిగి, virigi
-n.
--aloeswood; [bot.] ''Cordia sebestena'';
విరివి, virivi
-adj.
--widespread; plenty;
విరుగడ, virugaDa
-n.
--riddance;
---పీడ విరుగడ అయింది = got rid of the pest.
విరుగు, virugu
-v. i.
--break;
--curdle (as milk);
విరుగుడు, viruguDu
-n.
--(1) antidote;
--(2) black wood; [bot.] Dalbergia sissoo;
విరుచు, virucu
-v. t.
--break;
విరుద్ధ, viruddha
-adj.
--contradictory; contrary; at variance;
విరేచనం, virEcanaM
-n.
--motion; bowel movement; stool; often misspelled as విరోచనం;
విరోచనం, virOcanaM
-n.
--one that shines brightly;
విరోచనుడు, virOcanuDu
-n.
--the father of Emperor Bali of Indian legends;
విరోధం, virOdhaM
-n.
--enmity; hostility;
విరోధవికాసం, virOdhavikAsaM
-n.
--dialecticism; a type of philosophy propounded by Hegel; Believed to be the basis for communism;
విరోధాభాసం, virOdhAbhAsaM
-n.
--paradox; a figure of speech containing opposing views in verbal expression but not in substance; % to e2t
విరోధి, virOdhi
-n.
--enemy;
విలక్షణం, vilakshaNaM
-adj.
--different; not in the main stream;
విలపించు, vilapiMcu
-v. i.
--lament; speak with sorrow;
విల్లంగం, villaMgaM
-n.
--claim; reservation; dispute;
విల్లంగశుద్ధిగా, villaMgaSuddhigA
-adv.
--without any claim; without any reservation; without any dispute;
విలాపం, vilApaM
-n.
--lamentation;
విలాసం, vilAsaM
-n.
--(1) address;
--(2) luxury;
--(3) grace;
---విలాస పురుషుడు = luxury loving man.
---విలాసవతి = luxury loving woman.
విలాసభరిత, vilAsabharita
-adj.
-- epicurean;
విలీనం, vilInaM
-n.
--merge; merger; amalgamation; absorption;
విలీన, vilIna
-adj.
--merged; amalgamated; absorbed;
విలుప్తం, viluptaM
-n.
--obsolete;
విలువ, viluva
-n.
--value;
విలువిద్య, viluvidya
-n.
--archery;
విలువైనది, viluvainadi
-n.
--valuable; dear; precious;
---ఇది చాలా విలువైనది = this is much too dear.
విల్లు, villu
-n.
--(1) bow;
--(2) will; the document that spells out the inheritance rights; వీలునామా;
విలేకరి, vilEkari
-n.
--journalist; news reporter; correspondent;
విలేపనం, vilEpanaM
-n.
--ointment; balm; a paste suitable for rubbing on the skin, used esp. to relieve pain;
విలోమ, vilOma
-adj.
--pref. inverse; against the grain;
---విలోమ అనుపాతం = inversely proportional.
విలోమ వర్గం, vilOma vargaM
-n.
--inverse square;
వివక్ష, vivaksha
-n.
-- వివక్ష అంటే ఒక స్పష్టమైన ఉద్దేశ్యంతో వ్యాకరణ నియమాన్ని ఉపయోగించడం అని అర్థం. ఉదాహరణకు, లింగవివక్ష అంటే పురుష లింగం లేదా స్త్రీలింగాన్ని సూచించాలనే ఉద్దేశ్యంతో చేసిన వ్యాకరణ మార్పు.
-- స్త్రీత్వవివక్ష అంటే స్త్రీలింగాన్ని వ్యక్తపరిచే ఉద్దేశంతో నామవాచక పదానికి లేదా తత్సమ శబ్దానికి స్త్రీలింగ రూపాన్ని కలిగించడం.
-- గార్గ్య → గార్గీ; గార్గ్య = ఒక బ్రాహ్మణుని పేరు (పురుషలింగం); గార్గీ = ఆ బ్రాహ్మణుని కుమార్తె పేరు (స్త్రీలింగం) ఇక్కడ "య" కారాన్ని తీసేసి "ఈ" ని కలిపారు: గార్గ్య → గార్గీ;
వివక్షత, vivakshata
-n.
--discrimination; ability to distinguish good from bad;
వివరం, vivaraM
-n.
--(1) hole; window;
--(2) detail;
వివరణ, vivaraNa
-n.
--explanation; description; detailed account;
వివర్ణం, vivarNaM
-n.
--pale; pallid; colorless;
వివాదం, vivAdaM
-n.
--dispute;
వివాహం, vivAhaM
-n.
--marriage;
---అనులోమ వివాహం = hypergamus marriage.
---ప్రతిలోమ వివాహం = hypogamus marriage.
---వివాహ ఉత్సవం = wedding ceremony.
వివాహిత, vivAhita
-n.
--married woman;
వివిక్త, vivikta
-adj.
--(1) solitary, lonely;
--(2) retired;
వివిధ, vividha
-adj.
-- varied; diverse;
వివేకం, vivEkaM
-n.
--intelligence; power of discrimination; wisdom;
విశ్, viS
-pref.
--(1) enter;
--(2) create;
---విశ్వకర్త = (lit) creator of the universe; సృష్టించువాడు;
విశల్యకరణి, viSalyakaraNi
- n.
-- a herb used in treating broken bones; [bot.] ''Echites dichotoma''; [see also] సంధానకరణి, సౌవర్ణకరణి, సంజీవకరణి;
విశ్రమస్థానం, viSrama sthAnaM
-n.
--resting place; point of equilibrium;
విశాంక, viSaMka
-n.
--suspicion; doubt;
విశదీకరించు, viSadIkariMcu
-v. t.
--explain; elucidate; expound;
విశ్వ, viSva
-adj.
--universal;
విశ్వ కిరణాలు, viSva kiraNAlu
-n.
--cosmic rays; the radiation that bombards the Earth from outer space;
విశ్వతోముఖ, viSvatOmukha
-adj.
--omnidirectional; in all directions; spreading everywhere;
విశ్వశాస్త్రం, viSva SAstraM
-n.
--cosmology; Cosmology (from the Greek κόσμος, kosmos "world" and -λογία, -logia "study of"), is the study of the origin, evolution, and eventual fate of the universe;
విశ్వసనీయ, viSvasanIya
-adj.
--trustworthy; believable;
విశ్రమించు, viSramiMcu
-v.i.
--rest; relax;
విశాఖ, viSAkha
-n.
--(1) Beta Libre; Yoga tara of the 16th lunar mansion; located in the constellation Libra;
--(2) The 16th of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) చేటిరిక్క;
విశాల, viSAla
-adj.
--spacious; roomy; broad;
విశాల హృదయుడు, viSAla hRdayuDu
-n.
--broad-minded person; liberal person;
విశ్వాసం, viSvAsaM
-n.
--(1) trust; faith; belief;
--(2) gratitude;
విశ్రాంతి, viSrAMti
-n.
--(1) rest;
--(2) intermission; break;
విశేష, viSEsha
-adj.
--special; not general; not normal;
విశేష్యం, viSEshyaM
-n.
--noun;
విశిష్ట, viSishTa
-adj.
--special; specific; qualified
---విశిష్ట అద్వైతం = qualified dualism;
విశిష్ట గురుత్వం, viSishTa gurutvaM
-n.
--specific gravity;
విశిష్ట సాపేక్ష సిద్ధాంతం, viSishTa sApEksha siddhAMtaM
-n.
--special theory of relativity;
విశిష్టాద్వైతము, viSishTaadvaitamu
- n.
-- special non-dualistic philosophy expounded by Ramanauja;
-- వీరు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి వేరు వేరుఅంటారు - మూడు దండాలు కలిపి పట్టుకుంటారు కనుక త్రిదండులు.
విశృంఖలం, viSRMkhalaM
-adj.
--unrestrained; unfettered;
విశేషం, viSEshaM
-n.
--(1) feature; featured item;
--(2) news of special interest; particulars; details;
విశేష, viSEsha
-adj.
--special; not general; not normal;
విశేషణం, viSEshaNaM
-n.
--[gram.] adjective;
---సంబంధ విశేషణం = possessive adjective; attribute; quality;
విశ్లేషక, viSlEshaka
-adj.
--analytical;
విశ్లేషణ, viSIEshaNa
-n.
--analysis; breaking down; (ant.) సంశ్లేషణ;
విశ్లేషణాత్మక, viSIEshaNAtmaka
-adj.
--analytical;
విషం, vishaM
-n.
--poison; toxin; venom;
విషకన్య, vishakanya
- n.
-- (1) poisonous woman; young women reportedly used as assassins, often against powerful enemies, in Ancient India. Their blood and bodily fluids were purportedly poisonous to other humans, as was mentioned in the ancient Indian treatise on statecraft, Arthashastra, written by Chanakya, an adviser, and a prime minister to the first Maurya Emperor Chandragupta (c. 340–293 BCE); (2) a decorative foliage plant; [bot.] ''Dieffenbachia seguine'' of the Araceae family;
విషఘ్నము, vishaghnamu
- n.
-- a poison-killing substance; an antidote for poison.
విషపూరిత, vishapUrita
-adj.
--poisonous; venomous;
విషమ, vishama
-adj.
--(1) uneven; irregular;
--(2) critical;
విషమించు, vishamiMcu
-v. i.
--become critical; dangerous; get worse;
విషముష్టి, vishamushTi
-n.
--[bot.] ''Strychnos nux vomica''; ముషిణి;
విషయం vishayaM
-n.
--(1) subject; issue; topic; matter;
--(2) sensual object;
విషయాసక్తి, vishayAsakti
-n.
--interest in sensual objects and activities;
విషణ్ణము, vishaNNamu
-adj.
--dejected; grieved; sorrowful;
విషాణం, vishANaM
-n.
--horn; tusk;
విషాదం, vishAdaM
-n.
--grief; sorrow; sadness;
విషాద, vishAda
-adj.
--sad; piteous; deplorable;
విషువత్, vishuvat
-n.
--equinox; విషువం; These are the times of the year when the Sun arrives at the intersection of its path (the Ecliptic) with the Great Circle formed by extending the Equator. On these days, the lengths of day and night are approximately equal; (ety.) equi = equal, nox = nights;
---వసంత విషువత్ = spring equinox; March 21.
---శరద్ విషువత్ = autumnal equinox; September 23.
విషువత్ చలనం, vishuvat calanaM
-n.
--precession of the equinoxes. The axis on which the Earth spins does not always point in the same direction relative to the stars; once every 25,800 years it completes a small circular motion; As a result of this, the Earth does not always point toward the Pole Star. Several hundred years from now, the axis would be pointing toward the star Vega; This motion is called the precession of the equinoxes. Because of this, the equinoxes appear to move backward among the constellations at the rate of one constellation in every 2150 years.
విషువచ్ఛాయ, vishuvacchAya
-n.
--the shadow cast by a gnomon when the sun is at one of the two equinoxes;
విషూచి, vishoochi
- n.
-- amebiasis; infection with amoebas, especially as causing dysentery;
--వాంతిభేది; విషూచిక; మరిడి వ్యాధి;
విష్ణుకాంతం, viShNukAMtaM
- n.
-- [bot.] ''Evolvulus alsinoides, Evolvulus hirsutus'';
విష్ణువు, vishNuvu
-n.
--Lord Vishnu of the Hindu trinity; (ety.) the one who expands and fills the universe;
విషూచి, vishUci
-n.
--cholera;
విసనకర్ర, visanakarra
-n.
--hand-held fan typically made of a palm leaf; see also చామరం;
విసరణ, visaraNa
-n.
--diffusion; the inherent property of spreading;
విసర్గ, visarga
-n.
--the two small circles found in words such as, అః; అంతఃపురం; ప్రాతఃకాలం;
విసర్జించు, visarjiMcu
-v. t.
--give up; abandon; shun;
విస్తరణ, vistaraNa
-n.
--expansion;
విస్తరించు, vistariMcu
-v. i.
--spread out; extend;
విస్తరి, vistari
-n.
--leaf-plate;
విస్పష్టం, vispashTaM
-n.
--very clear; quite obvious;
విస్పష్ట సత్యం, vispashTa satyaM
-n.
--axiom; obvious fact;
విస్మయం, vismayaM
-n.
--surprise; amazement;
విస్తారం, vistAramu
-n.
--abundance;
విస్తీర్ణం, vistIrNamu
-n.
--area;
విసుగు, visugu
-n.
--(1) boredom;
--(2) impatience; annoyance;
--(3) weariness; tiredness;
విసురు, visuru
-n.
--(1) rashness in behavior; lack of respect;
--(2) repartee;
-v. t.
--(1) grind; dry grind;
--(2) fling; toss; throw;
--(3) fan; flip a fan to blow air;
విసురురాయి, visururAyi
-n.
--grindstone; తిరుగలి;
విస్తు, vistu
-n.
--surprise;
విస్ఫులింగం, visphuliMgaM
-n.
--spark;
విహంగం, vihaMgaM
-n.
--bird; (lit.) one that moves on air;
విహంగావలోకనం, vihaMgAvalOkanaM
-n.
--bird’s eye view; overview;
విహారం, vihAraM
-n.
--(1) stroll; a walk in fresh air;
--(2) a Buddhist monastery;
విహిత, vihita
-adj.
--directed; showing a direction; prescribed; stipulated;
విహితరేఖ, vihitarEkha
-n.
--directed line; phasor, vector;
విహీన, vihIna
-suff.
--devoid of;
---కళా విహీన = devoid of brightness.
వీడు, vIDu
-pron.
--sing. he; this person;
వీడ్కోలు, vIDkOlu
-n.
--send-off;
వీథి, vIthi
-n.
--street; way;
వీను, vInu
-n.
--ear;
-- వీనుల విందు = a feast to the ears; a festival of sounds;
వీపు, vIpu
-n.
--back; upper back; (rel.) నడుము = lower back;
వీరంగం, vIraMgaM
- n.
-- naughty and mischievous behavior by chidren;
వీరపూజ, vIrapUja
-n.
--hero worship;
వీర్యం, vIryaM
-n.
--(1) sperm; semen; శుక్ర కణం;
--(2) prowess; heroism; valor; (ant.) నిర్వీర్యం;
వీర్యపటుత్వం, vIryapaTutvaM
-n.
--virility;
వీర్యకణం, vIryakaNaM
-n.
--sperm cell; spermatozoa;
వీరు, vIru
-pron. pl.
--(1) this person; this plural version is used to show respect;
--(2) these people;
వీలు, vIlu
-n.
--convenience;
---వీలు చూసుకొని రాండి = come at your convenience.
వీలునామా, vIlunAmA
-n.
--will; the document that spells out the final wishes of a person that must be fulfilled; విల్లు;
వీసం, vIsaM
-n.
--one-in-sixteenth; the fraction 1/16;
-- వందలో నాలుగో వంతు పాతిక; పాతికలో సగం పరక; పరకలో సగం వీసం; వీసం అనగా 100లో 16 వ వంతు;
వీశ, vI-Sa
-n.
--a measure of weight in pre-independence India; 1 వీశ = 5 శేర్లు = 40 పలములు = 120 తులములు;
వూడూ లిలీ, vooDU lilI
- n.
-- Voodoo lily; snake plant; [bot.] ''Amorphophallus bulbifer'' of the Araceae family;
-- కంద, చేమ కుటుంబానికి చెందిన ఈ ఆకర్షణీయమైన మొక్కలు మీటర్ ఎత్తు వరకూ పెరుగుతాయి. కొన్నేళ్ళు పెరిగిన తరువాత ఈ మొక్కలు పుష్పిస్తాయి. అస్సాం, ఇండోనేషియాలలోని చిత్తడి అడవులలో ఇవి కనిపిస్తాయి;
వ్యుత్పత్తి, vyutpatti
-n.
--production; derivation;
వ్యుత్పన్న, vyutpanna
-adj.
--derived; produced;
వ్యుత్పన్నం, vyutpannaM
-n.
--derivative;
వ్యూహము, vyUhamu
-n.
--(1) plan; strategy;
--(2) array; arrangement; structure, the formation of soldiers in a battlefield into defensive and offensive postures;
'''వృ - vR, వె - ve, వే - vE, వై - vai'''
వృంతం, vRMtaM
-n.
--pedicel; the structure at the base of a leaf or flower; తొడిమ;
వృకం, vRkaM
-n.
--wolf;
వృక్వకం, vRkvakaM
-n.
--pancreas;
వృక్షం, vRkshaM
-n.
--tree;
వృక్షవాటిక, vRkshavATika
-n.
--grove; arboretum;
వృత్తం, vRttaM
-n.
--(1) circle;
--(2) a style of writing a poem in Sanskrit and Telugu; If there are n alphabetical characters, then one can create 2^n వృత్తములు;
-- తెలుగులో కొన్ని వృత్తాల పేర్లు: చంపకమాల, ఉత్పలమాల, శార్దూల విక్రీడితము, మత్తేభ విక్రీడితము, తరళం, తరలము, తరలి, మాలిని, మత్తకోకిల, ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము, కవిరాజవిరాజితము, తోటకము, పంచచామరము, భుజంగప్రయాతము, మంగళమహశ్రీ, మానిని, మహాస్రగ్ధర, లయగ్రాహి, లయవిభాతి, వనమయూరము, స్రగ్ధర;
వృత్తలేఖిని, vRttalEkhini
-n.
--compass; a V-shaped drafting instrument to draw circles;
వృత్తాంతం, vRttAMtaM
-n.
--episode; story; news; (lit.) end of a circle;
వృత్తి, vRtti
-n.
--(1) nature; స్వభావం;
--(2) profession; line of work; occupation;
--(3) figure of speech;
--(4) modification; mode of expression; In Indian theory of dance, there are several types of expression such as the examples shown next.
---భారతి వృత్తి = expression where speech predominates.
---సాత్వతి వృత్తి = expression where mental response and delicate action predominates;
---ఆరభి వృత్తి = expression where violent action predominates.
వృథా, vRthA
-n.
--waste; vain effort;
వృద్ధులు, vRddhulu
-n. pl.
--(1) seniors; old people;
--(2) [gram.] the vowels ఐ and ఔ;
వృద్ధి, vRddhi
-n.
--growth;
వృద్ధి సంధి, vRddhi saMdhi
-n.
--[gram.] the union of two words at which the original vowels are replaced by vowels ఐ and ఔ;
వృశ్చికం, vRscikaM
-n.
--(1) scorpion;
--(2) Scorpio; one of the twelve signs of the Zodiac;
వృషభం, vrshabhaM
-n.
--(1) Taurus; one of the twelve signs of the Zodiac; వృషభరాసి;
--(2) bull;
వృషణం, vrshaNaM
-n.
--testicle; scrotum;
వృషణాయాసం, vRshaNAyAsaM
-n.
--wasted effort;
వృష్టి, vRshTi
-n.
--rain;
---అతివృష్టి = excessive rain.
---అనావృష్టి = drought.
వెంట, veMTa
- adj.
-- behind;
వెంటనే, veMTanE
-adv.
--immediately; at once; soon after;
వెంటాడు, veMTADu
-v. t.
--follow; tail; stalk; chase; pursue; hunt;
వెంటి, veMTi
-n.
--rope made by twisting hay;
వెంట్రుక, veMTruka
- n.
-- hair; a single strand of hair;
వెంట్రుక వాసి, veMTruka vAsi
- ph.
-- hair's breadth;
వెండి, veMDi
-n.
--silver;
వెండితెర, veMDitera
- n.
-- silver screen;
-- వెండితెర అనే ప్రయోగం ఆంగ్లం లోని Silver Screen నుండి వచ్చించి. 1910 లో బొమ్మను సిల్క్ గుడ్డపై ప్రదర్శించేవారు. బొమ్మ స్ఫుటంగా కనిపించడానికి తెరపై సిల్వర్ మెటాలిక్ పెయింట్ వేసేవారు. ఈ పద్ధతిలో తెరపై పడిన బొమ్మ తెరకు దగ్గరగా, ఎదురుగా కూరుచున్న వారికి మాత్రమే కాకుండా రెండు ప్రక్కల ఉన్నవారికి, దూరంగా బాల్కనీలో ఉన్నవారికీ కూడ ఒకేలా కనిపిస్తుంది.
వెంపలి, veMpali
-n.
-- Purple Galega; Wild indigo; [bot.] ''Tephrosia purpurea'' of the Papilionaceae family;
-- గ్రీకు భాషలో టెఫ్రోస్ ( Tephros) అంటే 'బూడిద వర్ణపు' అని అర్థం. ఈ ప్రజాతిలోని కొన్ని మొక్కలలో ఆకుపచ్చని ఆకులపై ఉండే బూడిదవర్ణపు పూత కారణంగా ఆ పేరు. పూల Purple colour ని బట్టి purpurea అనే పేరు ఏర్పడింది.
-- ఇది ఖాళీ స్థలాలలో, బాటల వెంబడి పిచ్చి మొక్కగా పెరిగే ఒక బహువార్షిక మొక్క; వెంపలి మొక్కలలో నూగు వెంపలి, ములు వెంపలి, జిడ్డు వెంపలి, వెలి వెంపలి, పెద్ద వెంపలి వంటి పలు రకాలున్నాయి; వెంపలికి వైద్యపరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి;
-- కుందేటి కొమ్ము (శశవిషాణం), గాడిద గుడ్డు సాధించటంలాగే "వెంపలి చెట్టుకు నిచ్చెనలు వేయటం" కూడా అసాధ్యం;
-- [Sans.] శరపుంఖా; బాణపుంఖా; మణికాచము;
వెంబడించు, veMbaDiMcu
-v. t.
--follow; track; shadow;
వెంబడి, veMbaDi
-prep.
--with; along with; behind; after;
వెంబడించు, veMbaDiMchu
- v. t.
-- follow; chase;
వెకిలినవ్వు, vekilinavvu
- n.
-- smirk;
వెక్కిరించు, vekkiriMcu
-v. t.
--mock; ridicule;
వెక్కుడుతీగ, vekkuDutIga
-n.
--[bot.] ''Cardiospermum halicacabum'';
వెచ్చం, veccaM
-n.
--expense; expenditure; allowance;
---దిన వెచ్చం = daily expense allowance.
వెచ్చదనం, veccadanaM
-n.
--warmth;
వెచ్చబెట్టు, veccabeTTu
-v. t.
--warm up; heat;
వెచ్చించు, vecciMcu
-v. t.
--expend;
వెజ్జు, vejju
- n.
-- physician; doctor;
వెట్టిపని, veTTipani
-n.
--unpaid work; drudgery; thankless job;
వెడల్పు, veDalpu
-n.
--width; breadth;
వెణుతురు, veNuturu
-n.
--[bot.] Dichrostachys cinerea;
వెతుకు, vetuku
-v. t.
--search;
వెదురు, veduru
-n.
--bamboo; [bot.] ''Bambusa bambos; Bambusa vulgaris; Bambua spinosa; Gigantochola albociliata'';
--కోల్ కాతా వెదురు = [bot.] ''Bambusa tulda'';
--మగ వెదురు = male bamboo; solid bamboo; [bot.] ''Dendrocalamus strictus''; సాధనపు వెదురు;
--బొంగు వెదురు = Hollow bamboo; [bot.] ''Bambusa arundinacea''; ముళ్ల వెదురు; పెంటి వెదురు;
-- పులి వెదురు = tiger bamboo; [bot.] ''Bambusa vulgaris'';
-- లక్కీ వెదురు = lucky bamboo; Chinese water bamboo; [bot.] Dracaena braunii of the Asperagacae family;
-- (Note) లేత వెదురు చిగుళ్ళు ఆకుకూరగా వాడతారు. ఈ చిగుళ్ళు అజీర్తిని తొలగించి, ఆకలిని పెంచుతాయి. కొందరు ఈ చిగుళ్ళతో ఊరగాయ పచ్చళ్ళు కూడా పడతారు. ఏనుగులు, అడవి దున్నలు ఈ వెదురు చిగుళ్ళను ఆసక్తిగా తింటాయి.
-- (Note) వైద్యంలో ఈ చిగుళ్ళను స్త్రీలకు ఋతురక్త స్రావం సక్రమంగా అయ్యేందుకు, క్రిమిదోష నివారణకు, జ్వర నివారణకు ఉపయోగిస్తారు. అతిసార వ్యాధిని నయం చేసేందుకు ఈ వెదురు చిగుళ్ళను మిరియాలు, ఉప్పుతో కలిపి నూరి పశువులచే తినిపిస్తారు. ఈ వెదురు చిగుళ్ళను ఆయుర్వేద వైద్యంలో రక్తశుద్ధికి, శ్వేత కుష్ఠు (ల్యూకో డెర్మా) నివారణకూ వినియోగిస్తారు. ఈ ఆకుల పసరును బ్రాంకైటిస్, గనేరియా, జ్వరం నివారణకు ఉపయోగిస్తారు. ఈ వేళ్ళను కాల్చి, తామరకు పైపూత మందుగా ఉపయోగిస్తారు.
వెధవ, vedhava
-n. m.
--rascal; a somewhat amicable rebuke; see also విధవ;
వెనక, venaka
-n.
--back side;
వెనకపడు, venakapaDu
-v. i.
--fall behind; lag;
వెనకాడు, venakADu
-v. i.
--hesitate;
వెనువెంటనే, venuveMTanE
-adv.
--immediately;
వెన్న, venna
-n.
--butter;
వెన్నదేవికూర, vennadEvikUra
-n.
--[bot.] ''Commelina communis; Commelina benghalensis'' Linn.;
వెన్నాడు, vennADu
-v. t.
--follow; shadow;
వెనుక, వెనుక
- adj.
-- back;
వెన్ను, vennu
-n.
--(1) spine; backbone; back;
--(2) seedhead; ear of corn; the cob on which corn-like grains grow;
--(3) Lord Vishnu; one of the trinity of Hindu gods;
వెన్నుపాము, vennupAmu
-n.
--(1) spine; spinal cord;
--(2) the serpent Sesha on which Lord Vishnu lies;
వెన్నుపూస, vennupUsa
-n.
--vertebra;
వెన్నుపూసలు, vennupUsalu
-n. pl.
--vertebrae;
వెన్నెముక, vennemuka
-n.
--backbone; spine;
వెన్నెల, vennela
-n.
--moonlight; (def.) నెల (చంద్రుడు) యొక్క వెలుగే వెన్నెల;
వెయ్యి, veyyi
-n.
--thousand;
వెయ్యి వరహాలు, veyyi varahAlu
-n.
--[bot.] ''Plumeria acuminata'';
-- (see also) నూరు వరహాలు;
వెరగుపాటు, veragupATu
-n.
--astonishment; surprise;
వెరవు, veravu
-n.
--method; way; means; technique;
వెరసి, verasi
-n.
--total amount; grand total; sum;
వెర్రి, verri
-n.
--(1) insanity; madness;
--(2) naiveté, see also పిచ్చి;
---ఓరి వెర్రి వెధవా! = you naïve fellow!
వెర్రిచెరకు, verriceraku
-n.
--[bot.] Sacharum spontaneum;
వెర్రితుమ్మ, verritumma
-n.
--[bot.] Phlomis zeylanica;
వెర్రిపుచ్చ, verripucca
-n.
--[bot.] Citrullus colosynthis;
వెర్రిమేడి, verrimEDi
-n.
--[bot.] Ficus appositifolia;
వెర్రి వెధవ, verri vedhava
-n.
--naïve person; (not a mad person);
వెల, vela
-n.
--price; cost; value;
వెలకిల, velakila
-adj.
--on the back;
వెలగ, velaga
-n.
--wood apple; elephant apple; bael fruit; Bengal quince; [bot.] ''Aegle marmelos; Feronia elephantum''; ''Limonia acidissima'';
-- కపిత్థ;
వెలనాడు, velanADu
- n.
-- a geographical region in the Telugu speaking parts of coastal Andhra Pradesh;
-- కృష్ణకు దక్షిణంగా, పెన్నకు ఉత్తరంగా ఉన్న ప్రాంతానికి వెలనాడు అని పేరు. నేటి రేపల్లె తెనాలి చుట్టూ ఉన్న ప్రాంతం. కాకతీయ సామ్రాజ్యం పడిపోయిన తర్వాత తిరిగి తెలుగు వారి రాజ్యం ఏర్పరచే ప్రయత్నం చేసిన ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు ఈ ప్రాంతం వారే.
వెలపల, velapala
-n.
--the right side; a word used to refer to the right side of a bullock cart; the starboard side as opposed to the port (left) side; far side; outside; see also వలపటి;
వెలపల తోక, velapala tOka
-n.
--suffix;
వెలలేని, velalEni
-adj.
--priceless; invaluable;
వెలసిన, ve-la-si-na
-adj.
--one that came into being;
వెలయు, velayu
-v. i.
--come into existence; come into being;
వెల్ల, vella
-n.
--whitewash;
వెల్లడియగు, vellaDiyagu
- v. i.
--reveal;
వెల్లడి చేయు, vellaDi cEyu
-v. t.
--reveal; expose;
వెల్వరించు, velvariMcu
-v.i.
--emit; force out; send out; publish;
వెలార్చు, velArcu
-v. t.
--make public; expose;
వెల్లాటకం, vellATakaM
-n.
--(1) publicity;
--(2) publication % to e2t
వెలికి, veliki
-n.
--[bot.] Vangueria spinosa;
వెలిగారం, veligAraM
-n.
--borax; sodium borate; % to e2t
వెలిగించు, veligiMcu
-v. t.
--light up a lamp; kindle;
వెలితి, veliti
-n.
--deficiency; insufficiency; lacuna; (ant.) నిండు;
వెలిబుచ్చు, velibuccu
-v. i.
--reveal; make known;
వెలిబూడిద, velibUDida
-n.
--ashes of dried cow-dung cakes; కచిక;
వెలివేయు, velivEyu
-v. t.
--ostracize; socially excommunicate;
వెలిసిన, velisina
-adj.
--faded;
వెలిసిపోవు, velisipOvu
-v. i.
--fade; fadeout; washout;
వెల్లివిరియు, velliviriyu
-v. i.
--flourish; spread; become known;
వెలుగు, velugu
-n.
--glow; illumination; light;
వెలుతురు, veluturu
-n.
--illumination; light;
వెలుపల, velupala
-adv.
--outside;
వెలుపలి, velupali
-adj.
--outer;
వెలువడు, veluvaDu
-v. i.
--come out; exit; release; publish;
వెలువరించు, veluvariMcu
-v. t.
--bring out; publish;
వెల్లువ, velluva
-n.
--flood; inundation;
వెల్లుల్లి, vellulli
-n.
--garlic; [bot.] ''Allium sativum'' of Liliaceae family; (rel.) అడవి వెల్లుల్లి;
-- తెల్ల గడ్డ; వెల్లిపాయ; చిన్న ఉల్లి;
-- నల్ల వెల్లుల్లి = తెల్ల వెల్లుల్లిని పులియబెట్టగా వస్తుంది;
--[Sans.] రసోన; లశున; మత్స్యగంధా; మహౌషధ;
వెళ్లగొట్టు, veLlagoTTu
-v. t.
--drive out; chase away;
వెళ్లు, veLlu
-v. i.
--go; proceed;
వేంచేయు, vEMcEyu
-v. i.
--come; visit;
వేకువ, vEkuva
-n.
--dawn;
వేకువజాము, vEkuvajAmu
-n.
--the early hours of the morning;
వేగం, vEgaM
-n.
--speed; velocity;
వేగపడు, vEgapaDu
-v. i.
--hurry; hasten;
వేగాలు, vEgAlu
-n. pl.
--uncontrollable bodily reflexes like sneezes, coughs and yawns;
వేగిస, vEgisa
-n.
--Indian Kino; [bot.] Pterocarpus marsupium;
వేగిరం, vEgiraM
-n.
--speed; quickness; velocity;
వేగు, vEgu
-v. i.
--(1) fry; (2) grieve; (3) endure;
వేగుచుక్క, vEgucukka
-n.
--morning star; the planet Venus when seen in the morning sky;
వేగులవాడు, vEgulavADu
-n.
--spy; scout;
వేచు, vEcu
-v. t.
--(1) fry;
--(2) roast;
వేట, vETa
-n.
--hunt;
వేటకత్తె, vETakatte
-n. f.
--huntress;
వేటగాడు, vETagAdu
-n. m.
--hunter;
వేటాడు, vETADu
-v. t.
--hunt; fish;
వేడి, vEDi
-n.
--heat; warmth;
వేడుక, vEDuka
-n.
-- (1) curiosity;
--(2) a festivity celebrating a specific occasion;
--(3) fun; celebration;
--(4) desire;
వేడుకొను, vEDukonu
-v. i.
--pray; request; entreat; beseech;
వేతనం, vETanaM
-n.
--wage; stipend;
---కనీస వేతనం = minimum wage.
---విద్యార్థి వేతనం = scholarship; stipend to a student.
వేత్త, vEtta
-n.
--scholar;
---శాస్త్రవేత్త = scientist; scientific scholar.
వేదం, vEdaM
-n.
--(1) knowledge;
--(2) one of the four Vedas; the books expounding the essence of early Hindu philosophy and thought;
--(3) truth;
-- నిగమము;
వేదాంతం, vEdAMtraM
- n.
-- (lit.) the last part of the Vedas; Upanishads; the books expounding the essence of Hindu philosophy and thought;
-- నిగమాంతములు; ఉపనిషత్తులు;
వేదన, vEdana
-n.
--agitation; anxiety; agony; suffering; distress;
వేదవాసరం, vEdavAsaraM
-n.
--a powdery concoction made from a mixture of equal parts by weight of the following substances; turmeric, salt; dried ginger; black peppers, long peppers, coriander, cumin seed, pomegranate seed, and asafetida; a teaspoon of this powder with hot rice and a spoon of clarified butter is considered a good way to start a meal;
వేదాంతం, vEdAMtaM
-n.
-- (1) that part of Hindu philosophy based on the Upanishads; (lit.) the end of the Vedas; (2) philosophizing talk with no practical basis;
-- మెట్ట వేదాంతం = కార్యరంగంలోకి ఉరకనీయకుండా నిరాశగా మాట్లాడి, పని చేసేవాళ్ళ ఉత్సాహం తగ్గించడం; పనిలోకి దిగే చొరవ లేకుండా గట్టున కూర్చొని అన్నిటికీ అడ్డుపుల్లలు వేయడం;
వేదిక, vEdika
-n.
--platform; podium; dais; stage;
వేధించు, vEdhiMcu
-v. t.
--penetrate; tease; torment;
వేప, vEpa
-n.
--neem; margosa; mwarubaine; Indian lilac; [bot.] Azadirachta indica A. Juss. Meliaceae; [Persian] Fever bark of India; a tree widely found in all parts of India; it has bitter leaves and small bitter fruits and all parts of this tree are known to have many medicinal properties;
--[Sans.] there are 32 names in Sanskrit; some of them are, నింబ; వేము; శుకప్రియ; జ్వరత్వచ; సూతిక; పిచుమర్దని; హింగునిర్యాన;
వేపపవ్వు, vEpapuvvu
-n.
--(1) flower of neem tree;
--(2) chicken pox;
వేపి, vEpi
-n.
--dog; hunting dog; % to e2t
వేపుడు, vEpuDu
-n.
--stir-fried food item as opposed to deep-fried; (rel.) sauteed means lightly fried or దోర వేపుడు;
వేమదొండ, vEmadoMDa
-n.
--[bot.] Echinops echinatus;
వేయించు, vEyiMcu
-v. t.
--(1) fry;
--(2) roast;
వేర్పడు, vErpaDu
-v. i.
--separate;
వేర్పాటు, vErpATu
-n.
--separation; dissociation;
-- వేర్పాటువాదం = ప్రత్యేకమైన పాలనా ప్రాంతం (దేశం లేదా రాష్ట్రం) గా విడిపోవాలని చేసే ఆందోళన = secessionism;
వేరు, vEru
-n.
--(1) root;
--(2) separate; another;
వేరుపనస, vErupanasa
-n.
--[bot.] ''Artocarpus intigrifolia;''
వేరుమల్లె, vErumalle
-n.
--[bot.] ''Ipomoca cymosa;''
వేరుసంపెంగ, vErusaMpeMga
-n.
--[bot.] ''Polyanthes tuberosa;''
వేరుశనగ, vEruSanaga
-n.
--peanut; groundnut; monkey nut; earthnut; pignut; Manila gram; [bot.] ''Arachis hypogea'' of the Leguminosae family; (note.) Peanut is originally from S. America; it is not a pea, and it is not a nut; so, the word "peanut" is a misnomer; it is related to the fava bean; Some of the proteins in peanuts can cause allergies; Out of the 13 allergens Ara h1, h2, h3, h6, h8 are the more important ones;
-- [alt.] శనగ పిక్కలు; పల్లీలు;
వేలంపాట, vElaMpATa
-n.
--auction;
వేలాడడం, vElADaDaM
-v. i.
--hanging;
వేలాడతీయడం, vElADatIyaDaM
-n.
--suspending;
వేలాడు, vElADu
-v. t.
--hang; suspend;
వేలు, vElu
-n.
--(1) finger;
--(2) toe;
--(3) plural form of వెయ్యి;
వేలుపు, vElupu
-n.
--god; goddess; oracle; celestial being;
వేలువిడచిన,
-adj.
--once-removed; a kinship term describing distance in a relationship;
వేలువిడచిన మేనమామ
-n.
--consanguineous uncle, once-removed; your mother's cousin brother;
వేళ, vELa
-n.
--time; time of the day;
వేళాకోళం, vELAkOLaM
-n.
--teasing behavior; practical joke; jest; derision;
వేళావిశేషం, vELAviSEshaM
-n.
--significance of a specific time;
వేళ్లు, vELlu
-n. pl.
--(1) roots;
--(2) fingers;
వేవిళ్లు, vEviLlu
-n.
--morning sickness; nausea that a woman feels in the early stages of pregnancy;
వేశ్య, vESya
-n.
--prostitute;
వేషం, vEshaM
-n.
--(1) costume; disguise; pretence;
--(2) role in a play or cinema;
వేషధారి, vEshadhAri
-n.
--imposter;
వేసంగి, vEsaMgi
-n.
--summer;
వేసడం, vEsaDaM
-n.
--mule; % to e2t
వేసవి, vEsavi
-n.
--summer; వేసవికాలం;
వేసారు, vEsAru
-v. i.
--get tired; get frustrated;
---విసిగి వేశారు = get tired due to frustration.
వైకల్యం, vaikalyaM
- n.
-- mutilation; defect; impairment; state of incompleteness;
-- వికలత్వం; వికలత;
వైకల్పికం, vaikalpikaM
-adj.
--optional; having one or more alternatives;
వైఖరి, vaikhari
-n.
--attitude;
వైచిత్రి, vaicitri
-n.
-- manifoldness; strangeness; wonder; peculiarity;
వైజయంతం, vaijayaMtaM
-n.
--banner; flag;
వైడూర్యం, vaiDUryaM
-n.
--lapis-lazuli; cat's-eye; (lit.) lapis = stone; lazuli = blue; beryl; a semi-precious stone;
-- రాజావర్తం; పిల్లికన్నుల రాయి;
వైతాళికుడు, vaitALikuDu
-n. m.
--heralder; harbinger; trend setter; trail blazer; avantgarde;
-- వివిధ తాళాలతో, మంగళ వాయిద్యాలతో మేలుకొలుపు వాడు; ఒక జాతి మొత్తం నిద్రావస్థలో ఉన్నప్పుడు వారిని మేల్కొలిపి కొత్త దా
వైదగ్ధ్యం, vaidagdhyaM
- n.
-- skill; expertise; subtlety;
వైద్యం, vaidyaM
-n.
--treatment; medical treatment;
వైద్య, vaidya
-adj.
--medical;
వైద్యశాల, vaidyaSAla
-n.
--clinic; hospital; dispensary;
వైద్య సౌకర్యాలు, vaidya saukaryAlu
-n.
--medical services, medical facilities;
వైదికులు, vaidikulu
- n. pl.
-- a sub-sect among Brahmins;
-- కేవలం వైదికవృత్తి వ్యవసాయం మాత్రమే చేసేవారు వైదికులు;
-- ఇక వైదీకులలో వెలనాట్లు అనగా కోనసీమ ఇంకా పైకి వున్నవారు, ములికినాట్లు అనగా రాయలసీమ వైపు వారు; తెలగాణ్యులనగా తెలంగణా ప్రాంతం వారు. ఈవిధంగా వృత్తిపరంగా, ప్రాంతీయతాపరంగా వచ్చినవి ఈ భేదాలు.
వైదుష్యం, vaidushyaM
-n.
--scholarship;
వైద్యుడు, vaidyuDu
-n.
--doctor; physician; surgeon;
వైద్యుత, vaidyuta
-adj.
--electronic; % to e2t
వైపరీత్యం, vaiparItyaM
-n.
--(1) abnormality
--(2) calamity;
వైఫల్యం, vaiphalyaM
-n.
--failure;
వైభవం, vaibhavaM
-n.
--glory; grandeur; wealth;
వైభాషికం, vaibhAshikaM
-adj.
--optional;
వైమనస్యం, vaimanasyaM
-n.
--strife; discord; estrangement; dislike; ill-will; discord; aversion;
వైమానికుడు, vaimAnikuDu
-n.
--pilot; a person who flies a plane;
వైముఖ్యం, vaimukhyaM
-n.
--reluctance;
వైయక్తిక, vaiyaktika
-adj.
--individual;
వైరం, vairaM
-n.
--enmity;
వైరాగ్యం, vairAgyaM
-n.
--asceticism; (note) ప్రాపంచిక సుఖాలపై విరక్తి; పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, స్మశాన వైరాగ్యం అని మూడు రకాల వైరాగ్యాలు ఉన్నాయి;
వైరి, vairi
-n.
--enemy;
వైవస్వత నౌక, vaivasvata nauka
-n.
--Argo Navis; a constellation of stars visible in the southern skies; % to e2t
వైవాహికం, vaivAhikaM
-adj.
--related to marriage; matrimonial; nuptial;
వైవాహిక, vaivAhika
-adj.
--married; marital; conjugal;
వైవిధ్యత, vaividhyata
-n.
--variety; diversity;
వైశ్వదేవం, vaiSvadEvaM
- n.
-- విశ్వేదేవతలను ఉద్దేశించి చేసే హోమం వైశ్వ దేవం. ఈ దేవతలకు అన్నం హోమంలో బలి ఇస్తారు. (బలి అంటే బలకరమైనది.) దీనితోబాటు ఇతర దేవతలకు గూడా భోజనానికి ముందు బలి ఇస్తారు. దీనివల్ల అన్నం పవిత్రమై భోజన యోగ్యం అవుతుంది. ప్రతి దినమూ గృహస్థులు కొన్ని దోషాలు చేస్తూనే ఉంటారు. ఉదాహరణ: వంట చేయడంలో కట్టెలను ఆశ్రయించి క్రిమి కీటకాలు ఉండవచ్చు. ఈ హింస లు జరగనిదే వంట సాగదు. ఈ దోషాలు అన్నాన్ని చేరుతాయి గాబట్టి పరిహారంగా పంచ మహాయజ్ఞాలు, వైశ్వదేవమూ చేసి భోజనం చేయాలి.
వైశేషికం, vaisEshikaM
-n.
--one of the six systems of Hindu philosophical thought, founded by కాణాద;
వైశాల్యం, vaiSAlyaM
-n.
--area;
వైషమ్యత, vaishamyata %e2t
-n.
--(1) inequality;
--(2) dissimilarity;
</poem>
==Part 2: శం - SaM, శ - Sa==
<poem>
శంక, SaMka
-n.
--doubt; hesitation; scruple;
శంకుమల్లె, SaMkumalle
- n.
-- Butterfly Pea; Asian Pigeon Wings; [bot.] ''Clitoria ternatea'' of the Fabaceae family;
శంకువు, SaMkuvu
-n.
--peg; stake; stump; pole;
శంకుస్థాపన, SaMkusthApana
-n.
--groundbreaking ceremony; (lit.) driving a peg into the ground to commemorate the commencement of construction work;
శంఖం, SaMkhaM
-n.
--conch shell; conch; seashell with a spiral three-dimensional structure to it; see also ఆలిచిప్ప;
శంఖం పువ్వు, saMkhaM puvvu
-n.
-- [bot.] ''Clitoria ternatea;''
-- అద్భుతమైన ఔషధ మొక్క. దీన్ని మనం సాధారణంగా "అపరాజిత పువ్వు", ", "శంఖ పుష్పి" అని కూడా పిలుస్తాం.
శంఖపుష్పి, SaMkhapushpi
-n.
-- speedwheel; [bot.] ''Chrysopogon acicularis''; ''Convolvulus pluricaulis'' Choisy; a perennial herb that resembles morning glory. All parts of the herb are known to possess therapeutic benefits. The plant is used locally in Indian and Chinese medicine to cure various diseases. It is used in Ayurvedic formulations for chronic cough, sleeplessness, epilepsy, hallucinations, anxiety etc.;
-- భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా బీహార్‌లో కనిపించే అందమైన, శాశ్వతమైన, అడవి మొక్క. పువ్వులు సాధారణంగా తెలుపు, లేత గులాబీ లేదా నీలం రంగులో ఉంటాయి. శంఖపుష్పి వేద కాలం నుండి వైద్యంలో ఉపయోగించబడింది. ఇది ఆయుర్వేదంలో కూడా తరచుగా ప్రస్తావించబడింది. ఆయుర్వేదంలో ఈ మొక్కను రసాయనం అని పిలుస్తారు,
-- విష్ణుగంధీ అని కూడా పిలుస్తారు.
శంఖాకార, SaMkhAkAra
-adj.
--conical;
శంఖావర్తం, SaMkhAvartaM
-n.
--spiral;
శంఖావర్తుల, SaMkhAvartula
-adj.
--spiral;
శంపాకం, SaMpAkaM
-n.
--[bot.] ''Cassia fistula'';
శంబరవల్లి, SaMbaravalli
-n.
--[bot.] ''Vitis indica'';
శకం, SakaM
-n.
--era; age; epoch; eon;
శకటం, SakaTaM
-n.
--cart; carriage;
శకటు, SakaTu
-n.
--bishop in chess;
శకము, Sakamu
- n
-- an historical era;
--- క్రీస్తు శకము = the Christian era;
--- శాలివాహన శకము = the era named after శాలివాహనుడు; this era starts from 78 AD of the Western calendar; Some southern states in India use this for their official calendar;
శకలం, SakalaM
-n.
--fragment;
---గ్రహ శకలం = asteroid.
---అణు శకలం = ion; particle.
---విద్యుదావేశ శకలం = electrically charged particle.
---కాంతి శకలం = light particle.
---ధనావేశ శకలం = positively charged particle.
శకలార్భకం, SakalArbhakaM
-n.
--yearling; baby fish; young fish;
శక్త్యనుసారం, SaktyanusaaraM
- adv.
-- as per one's capability;
-- శక్తికి అనుగుణంగా
శకునం, SakunaM
-n.
-- (1) omen; augury;
-- (2) presage; portent; foretelling; prognostication;
శకులి, Sakuli
-n.
--fish;
శక్తి, Sakti
-n.
--(1) energy; effort; power; ability; faculty; capacity; strength; prowess;
--(2) the active power of a deity;
---స్థితిజశక్తి = potential energy.
---గతిజశక్తి = kinetic energy.
---ప్రేషశక్తి = pressure energy.
---శక్తి వంచన లేకుండా = [idiom.] without sparing any effort.
---శక్తి నిత్యత్వ నియమం = law of conservation of energy.
శక్తిమంత, SaktimaMta
-adj.
--strong; energetic;
శఠగోపం, SaThagOpaM
- n.
-- శఠము + అరి = శఠారి = మాయకు శత్రువు; గుడికి వెళ్లినప్పుడు తీర్థం అయ్యాక ఈ శఠారి పెట్టేటప్పుడు "స్వామీ! నా శఠాన్ని తొలగించి నీ నిజ రూపం చూపించు. నాకు ఈ మాయ నుంచి విముక్తి కలిగించి జ్ఞానం కలిగించు" అని మనస్ఫూర్తిగా వేడుకోవాలి. శఠగోపం విష్ణుని ఆలయాలలో మాత్రమే ఉంటుంది;
శత, Sata
-pref.
--hundred;
శతకం, SatakaM
-n.
-- (1) a collection of a hundred verses on the same theme; almost all these collections have 108 verses; (2) a collection of one hundred items;
శతకోటి, SatakOTi
-n.
--hundred crores; billion; one followed by nine zeros; This is the American billion; The English billion is one followed by twelve zeros;
శతఘ్ని, Sataghni
-n.
--cannon; (lit.) a weapon that can kill hundreds at once;
శతపాది, SatapAdi
-n.
--centipede; one with hundred feet;
శతపుష్పం, SatapushpaM
-n.
--dill; a herb used widely in European cusine and in pickling; [bot.] ''Aniethum graveolens'' of the Apiaceae family;
-- సోయికూర;
శతభిషం, SatabhiShaM %updated
-n.
--(1) Lambda Aquarii; Hydor; Yoga tara of the 24th lunar mansion; located in the constellation Aquarius;
--(2) The 24th of the 27 star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(3) నీటిరేని రిక్క;
శత్రర్థకం, SatrarthakaM
-n.
--[gram.] verbs in present continuous tense, such as వచ్చుచు, తాగుచు;
శతాంశం, SatAmSaM
-n.
--a hundredth part; one percent; percentage;
శతావరి, SatAvari %e2t
-n.
--asparagus; [bot.] ''Asparagus racemosus;'' పిల్లిపీచర; పిల్లితేగ; పిల్లిపీచరగడ్డ;
-- శతావరి కి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మొక్క ను తవ్వి, లాగితే తేగల్లాగా సన్నంగా వేళ్ళు వస్తాయి. ఈ వేళ్ళని చిన్న ముక్కలుగా తరుగుతారు. తరిగిన ముక్కల్ని తొక్క నుండి వేరు చేస్తారు. ఈ ముక్కల్ని ఎండలో ఎండబెడతారు. ఎండిన ముక్కలు మార్కెట్ లో అమ్ముతారు. ఇందులో "శతావరిన్" అనే పదార్ధం ఉంటుంది. ఇది పాలు పెరగటానికి ఉపయోగ పడుతుంది. దీంతో తయారు చేసిన మందు కొన్ని హర్మోన్లను ప్రేరేపించి పాలను పెంచుతుంది.
శత్రుత్వం, SatrutvaM
-n.
--enmity; antagonism;
శత్రువు, Satruvu
-n.
--enemy; foe; adversary;
శనగపప్పు, Sanagapappu
-n.
--Bengal gram dal; split chickpeas; chana dal;
శనగపిండి, SanagapiMDi
-n.
--Bengal gram flour; chickpea flour; besan;
శనగలు, Sanagalu
-n.
--Bengal gram; chick pea; [bot.] Cicer arietinum of Leguminosae (pea) family; హరిమంధజం; శనగ;
శనిగ్రహం, SanigrahaM
-n.
--Saturn;
శని మహాదశ, SanimahAdaSa
-n.
--the long period of Saturns influence on a horoscope;
శపించు, SapiMcu
-v. t.
--imprecate; curse;
శపథం, SapathaM
-n.
--vow; oath; solemn pledge;
శబ్దం, SabdaM
-n.
--sound; (ant.) నిశ్శబ్దం;
శబ్దపల్లవం,
- n.
-- సందర్భాన్ని బట్టి, వ్యక్తి స్వభావమూ, మాట్లాడే వైఖరిని బట్టి పదాల అర్థాలు మారిపోతుంటాయి. ఇలాంటి పదబంధాలను తెలుగులో శబ్దపల్లవములు అంటారు.
-- వ్యక్తిని బట్టి, సందర్భాన్ని బట్టి "దయచేయండి" అనే దాని అర్థం చెప్పవలసి ఉంటుంది. లోపలికి రండి, మా ఆతిథ్యం స్వీకరించండి అని మర్యాదగా ఆహ్వానించేటప్పుడూ ఇంక పోయిరండి, చేసింది చాలు అని అమర్యాద చేసేటప్పుడు గూడా ఈ పదబంధం వాడుకలో వినిపిస్తూ ఉంటుంది.
శబ్దశాస్త్రం, SabdaSAstraM
-n.
--philology;
శమనం, SamanaM
-n.
--relief; tranquility;
శని, Sani
- n.
-- (1) the planet Saturn; (2) euphemism for anyone who bothers;
శనైశ్చరుడు, SanaiScharuDu
- n.
-- Saturn, viewed as a god; (lit.) slow moving object;
-- శనైః + చోరుడు = శనైశ్చరుడు; శనైః అంటే నెమ్మదిగా, చరః అంటే చరించే (అంటే కదిలే);
శయ్య, Sayya
-n.
--couch; bed;
శయ్యాళువు, SayyALuvu
-n.
--[idiom] couch potato; slothful, sluggish person; a person who spends a lot of time in front a TV set, rather than being active;
శరత్, Sarat
-adj.
--autumnal; Fall; related to autumn;
శరత్కాలం, SaratkAlaM
-n.
--Autumn; Fall; the season in which the moon shines the brightest, the days are cool and in the northern latitudes, the trees shed their leaves;
శరద్ విషువత్, SaraD vishuvat
-n.
--autumnal equinox;
శరం, SaraM
-n.
--arrow;
శరణం, SaraNaM
-n.
--protection; shelter;
శరభము, Sarabhamu
- n.
-- (1) a young elephant;(2) a camel; (3) a grasshopper; (4) a locust;
-- (5) a fabulous animal - described in Hindu Puranas - said to have eight legs and to be stronger than a lion or tiger; "వేయి చేతులతో, జడధారియై, చంద్రరేఖాజూటుడై, సువిశాలమైన రెండు రెక్కలతో, పొడవైన ముక్కుతో, పెద్ద పెద్ద కోరలతో, వజ్రభాలైన గోళ్ళతో, నీలకంఠంతో, నాలుగు కాళ్లతో, మూడు కళ్ళతో, హుంకారాలు చేస్తూ విజృంభించాడు. అటువంటి శరభ రూపాన్ని కనబడగానే తన బల సామర్థ్యాలను కోల్పోయాడు నరసింహుడు. అతని శక్తులన్నీ లాగేసాడు. శరభవతారుడైన ఆ వీరభద్రుడు ఆ నరసింహుని చేతులు పట్టుకున్నాడు. రెక్కలతో అతని నాభిని, పాదాలను తాడిస్తూ, పుచ్ఛంతో అతనిని బంధించాడు."
-- (6) హిందూ పురాణాల్లో సింహం, పక్షి మరియు ఇతర జంతువుల కలయికతో కూడిన 'శరభ మూర్తి' ప్రస్తావన ఉంది. ఇది భౌతికంగా సాధ్యం కాకపోయినా, జంతువుల లక్షణాలను కలపడం అనే ఆలోచన వారికి ఉందని తెలుస్తుంది.
శరవేగం, SaravEgaM
-adj.
--very fast; as fast as an arrow;
శర్మ, Sharma
- adj.
-- "శర్మ" అనేది సంస్కృత పదం. ఈ పదం యొక్క అర్థం "దేవునిచే రక్షించబడినవాడు." నిజానికి "శర్మ" అనే పదం గుణవాచకం, ఇంటిపేరు కాదు. ఇది బ్రాహ్మణుని ఏ పేరునైనా సూచించడానికి ఉపయోగించబడుతుంది.
శరీరం, SarIraM
-n.
--body;
-- స్థూల శరీరం = కంటికి కనబడేది; సూక్ష్మ శరీరం = మనస్సు, బుద్ధి, అహంకారం; కారణ శరీరం =
శరీరి, SarIri
-n.
--the soul dwelling inside the physical body;
శలభం, SalabhaM
-n.
--cricket; locust; moth; మిడుత;
శలవు, Salavu
-n.
--leave;
---శలవు తీసికొంటాను = Ill take leave.
---శలవు పెడతాను = Ill apply for leave.
శల్యం, SalyaM
-n.
--bone;
శల్యపరీక్ష, SalyaparIksha
-n. idiom
--thorough examination; thorough inspection; this idiom used to refer to thorough investigation to locate a fault, knowing such fault doesn't exist;
-- శల్యపరీక్ష అనే జాతీయం పూర్తిరూపం స్తనశల్యపరీక్ష. స్తనంలో శల్యం (ఎముక) ఉండదు. లేదు అని తెలిసి కూడా అతిజాగ్రత్తపరులు కొందరు సోదా చేస్తూ ఉంటారు. ఫలితం తెలిసి కూడా చేసే వృథా పరీక్ష అనే అర్థంలో పై జాతీయాన్ని ఉపయోగిస్తారు.
శల్యసారధ్యం, SalyasAradhyaM
-n.
--[idiom] discouragement by planting a doubt;
శలాకం, SalAkaM
-n.
--thin rod; ramrod; rib of an umbrella; probe; used to refer to an investigation for deeper understanding;
శలాక పరీక్ష, SalAka parIksha %e2t
-n.
--deep probing; in-depth examination;
శవం, SavaM
-n.
--corpse; the dead body of a human;
శవపరీక్ష, SavaparIksha
-n.
--autopsy;
శవసంరక్షకుడు, SavasaMrakshakuDu
-n.
--mortician; the person who prepares a body for rites such as viewing by friends and relatives and for eventual burial or cremation;
శశము, SaSamu
-n.
--rabbit;
శషబిషలు, Sashabishalu
- n.
-- acts; put-ons;
-- వేషాలు;
శశవిషాణము, SaSavishANamu
-n.
--absurdity; (lit.) the horn of a rabbit, which is an impossibility;
శశాంకం, SaSAMkaM
-n.
--crude camphor; పచ్చకర్పూరం;
శశాంకుడు, SaSAMkuDu
-n. m.
--moon;
శశి, SaSi
-n.
--moon; camphor;
శషబిషలు, Sashabishalu
-n. pl.
-- (1) purposeless and impeding discussions; (2) warnings, threats and bullying;
-- (1) ప్రయోజనం లేని తిరకాసులతో కూడిన చర్చలు; (2) హెచ్చరికలు; బెదిరింపులు;
శస్త్రం, SaStraM
-n.
--weapon; an ordinary weapon like a bow and arrow or a gun;
-- [rel] అస్త్రం = a weapon that only works with the assistance of a "mamtram" - sacred phrase;
శస్త్రచికిత్స, SaStracikitsa
-n.
--surgical treatment; surgery;
శస్త్రజీవి, SastrajIvi
-n.
--surgeon; (ety.) a person whose implements are surgical tools;
శ్రద్ధ, Sraddha
-n.
--faith; attention;
శ్రద్ధాంజలి, SraddhAMjali
-n.
--tribute;
శ్రద్ధాళువు, SraddhALuvu
-n.
--diligent person;
శ్రమ, Srama
-n.
--(1) labor; toil;
--(2) trouble;
--(3) fatigue;
శ్రమజీవి, SramajIvi
-n.
--a person who works hard for a living;
శ్రవణం, SravaNaM %updated
-n.
--(1) Altair; Aquila; these stars are about 16.5 light years from us;
--(2) Beta Capricorni; Dabih; Yoga tara of the 22nd lunar mansion; located in the constellation Capricorn;
--(3) The 22nd of the 27-star groups (or asterisms or lunar mansions) of the Hindu calendar;
--(4) కరివేలుపు రిక్క;
శ్రవణనాడి, SravaNanAdi
-n.
--auditory nerve;
శ్రవణపేయ, SravaNapEya
-adj.
--pleasing to the ear; melodious; charming to hear;
శ్రవ్య, Sravya
-adj.
--audible;
%శా - SA, శ్రా - SrA
శాంతి, SAMti
-n.
--(1) peace; tranquility;
--(2) propitiation; a rite to pacify unfriendly planets in a horoscope;
శాంతించు, SAMtiMcu
-v.i.
--quiet down; settle down;
శాంతింపచేయు, SAMtiMpacEyu
-v. t.
--quiet one down;
శాంతియుతంగా, SAMtiyutaMgA
-adj.
--peacefully;
శాకం, SAkaM
-n.
--vegetable;
శాకాహారం, SAkAhAraM
-n.
--vegetarian food;
శాకాహారి, SAkAhAri
-n.
--(1) vegetarian;
--(2) herbivore;
శాకిని, SAkini %e2t
-n. f.
--fiend;
శాకినీ డాకినీలు, SakinI DakinIlu
-n. pl.
--fairies and elves; spirits and goblins;
శాఖ, SAkha
-n.
--(1) branch; bow;
--(2) arm; sub-division;
-- (3) sect; a subdivision in the Hindu caste system;
శాఖానగరం, SAkhAnagaraM
-n.
--suburb; % to e2t
శాఖాచంక్రమణం, SakhAcaMkramaNaM
-n.
--shifting from place to place without settling down; (lit.) moving from branch to branch;
శాఖోపశాఖలుగా, SAkhOpaSAkhalugA
-adv.
--dendritic; abundantly;
శాతం, SAtaM
-n.
--percentage; percent;
శాతవాహనుడు, ShaatavaahanuDu
- n.
-- శాతవాహనులు దక్షిణ భారతదేశాన్ని, ముఖ్యంగా దక్కన్ ప్రాంతాన్ని (ఆధునిక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర) పాలించిన ఒక ప్రాచీన రాజవంశం (క్రీ.పూ. 3వ శతాబ్దం - క్రీ.శ. 3వ శతాబ్దం). వీరి పాలన గురించి శాసనాలు (ఉదాహరణకు, నానాఘాట్ శాసనం), నాణేలు మరియు పురాణాలు (మత్స్య పురాణం, వాయు పురాణం) వంటి చారిత్రక ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. శాతకర్ణి I, గౌతమీపుత్ర శాతకర్ణి, వశిష్టీపుత్ర పుళుమావి వంటి రాజులు ఈ వంశంలో ముఖ్యులు. వీరు తెలుగు ప్రాంతంలో తొలి సామ్రాజ్యాన్ని స్థాపించి, భారతీయ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు
శాపం, SApaM
-n.
--imprecation; curse;
శాబకం, SAbakaM
-n.
--yearling; fledgeling; the young one of an animal;
శాబరం, SAbaRaM
-n.
--[bot.] Symplocos racemosus;
శారది, Saradi
-n.
--[bot.] Jussiena repens;
శాల, SAla
-n.
--house; place; hall; shed;
---అశ్వశాల = stable.
---చెర శాల = jail house.
---టంకశాల = mint.
---పశువుల శాల = cattle shed.
---పాకశాల = kitchen.
---పాఠశాల = school; school house.
---పానశాల = bar; a place where people gather to drink.
---పురిటి శాల = delivery room; delivery ward.
---ముద్రాక్షర శాల = printing house.
---వైద్త్యశాల = hospital; clinic.
శాలి, SAli
-suff.
--a person possessing the trait of the preceding adjective;
---బలశాలి = strong person.
---బుద్ధిశాలి = wise person
శాలివాహనుడు, ShaalivaahanuDu
- n.
-- ఒక పౌరాణిక/జానపద వ్యక్తిత్వానికి సంబంధించిన పేరు; ఇతను ఉజ్జయిని పాలకుడైన విక్రమాదిత్యుని ఓడించి, శక యుగాన్ని ప్రారంభించినట్లు కథలు ప్రచారంలో ఉన్నాయి. కాని శాలివాహనుడు అనే వ్యక్తి ఈ శకాన్ని ప్రారంభించాడని చెప్పడానికి ప్రత్యక్ష చారిత్రక ఆధారాలు లేవు. శక యుగాన్ని కుషాణు రాజు కనిష్కుడు ప్రారంభించి ఉంటాడని కొందరు చరిత్రకారులు భావిస్తారు. ఆయన పేరుతోనే క్రీ.శ. 78 నుండి ప్రారంభమయ్యే శాలివాహన శకము (శక యుగం) ముడిపడి ఉంది;
-- కాశ్మీర రాజతరంగిణిలో ఉన్న కథనం ప్రకారం "సప్తర్షయే మఘాయుక్తాః కాలే పరిక్షితే శతం|| ఆంధ్రాంశేస చతుర్వింశే భవిష్యంతి మతే మమ" అనగా, "పరీక్షిత్తు జనన సమయంలో మఘ నక్షత్రంలో ఉన్న సప్తర్షి మండలం ఒక చుట్టు తిరిగి మళ్ళీ మఘ నక్షత్రంలోకి వచ్చేసరికి మగధలో ఆంధ్ర రాజులు రాజ్యం చేస్తున్నారు.
శాలిహోత్రశాస్త్రం, SAlihOtra SAstraM
-n.
--science dealing with the diseases of horses and elephants;
శాలిహోత్రుడు, SalihOtruDu
-n.
--Salihotra; a great Indian veterinary physician of ancient India;
శాల్తీ, SAItI
-n.
--character; item;
---అక్షర శాల్తీ = alphabetical character.
---అక్షర మూర్తి = alphabetical character.
---అక్షరాంకిక శాల్తీ = alphanumeric character.
---దశాంశ శాల్తీ = decimal character.
---మూడు శాల్తీలు = three items.
శాలువా, SaluvA
-n.
--shawl; a piece of cloth, usually of wool, of oblong shape and used as a covering for the head or shoulders;
శాలేయం, SAlEyaM
-n.
--[bot.] Anethum panmorium;
శాశ్వతం, SASvataM
-n.
--permanent;
శాసనం, SASanaM
-n.
--(1) inscription;
--(2) edict; legislation;
---తామ్ర శాసనం = inscription in copper.
శాసన మండలి, SASana maMDali
-n.
--Legislative Council; the upper house of parliament in Indian states;
--ఎగువసభ, శాసననిర్మాణమునకు అనుభవజ్ఞులతో కూడిన సభ; (రాష్ట్రానికి పరిమితమైన) విధానసభ;
శాసనసభ, SASanasabha
-n.
--Legislative Assembly; the lower house of parliament in Indian states;
--ఎన్నికైన ప్రజాప్రతినిధులు చట్టాలు చేసి, ప్రభుత్వ విధానాలను రూపొందించి నిర్ణయించే (రాష్ట్రానికి పరిమితమైన) విధానసభ;
శాస్త్రం, SAStraM
-n.
--science; theory; rule;
శాస్త్రోక్తంగా, SAStrOktaMgA
-adv.
--(1) lawfully;
--(2) by the rule book;
శాస్తి, Sasti
-n.
--lesson of punishment; lesson in chastisement; గుణపాఠం,
శాస్త్రి, Saastri
- n.
-- శాస్త్రి అంటే శాస్త్రాలను అధ్యయనం చేసినవాడు అని అర్థం. మొదట "శర్మ," "శాస్త్రి" గుణ వాచకాలు కానీ కాలక్రమేణా నామ వాచకాలు అయ్యాయి.
శాస్త్రీయ దృక్పథం, SastrIya dRkpathaM
-n.
--scientific perspective;
శాస్త్రీయ విధానం, SastrIya vidhAnaM
-n.
--scientific method;
శాస్త్రీయ వైఖరి, SastrIya vaikhari
-n.
--scientific attitude;
శ్యామసీమలు, SyAmaSImalu
-n.
--[astron.] Coal Sacks; dark regions of our Milky Way galaxy;
శ్రాద్ధం, SraaddhaM
- n. religious rites performed on the death annivesary of a parent;
-- పితృ కార్యాలకు దైవ కార్యాలకంటే నియమాలు ఎక్కువ. అందుచేత శ్రాద్ధం (శ్రద్ధతో చేసేది) అంటాం.
శ్రామిక, SrAmika
-adj.
--laboring; working; toiling;
---శ్రామిక వర్గం = working people; labor force; blue collar workers.
శ్రామికుడు, SrAmikuDu
-n.
--laborer; worker;
శ్రావ్య, SrAvya
-adj.
--melodious;
శ్లాఘనీయ, SIAghanIya
-adj.
--praiseworthy; (ant.) గర్హనీయ;
శ్వాస, SvAsa
-n.
--breath; respiration;
శ్వాసక్రియ, SvAsakriya
-n.
--respiration;
శ్వాసనాళం, SvAsanALaM
-n.
--trachea; windpipe;
శ్వాసమండలం, SvAsamaMDalaM
-n.
--respiratory system;
శ్వాస వ్యవస్థ, SvAsa vyavastha
-n.
--respiratory system;
%శిం -SiM, శి - Si, శీ - SI, శ్రీ - SrI
శింశుపా వృక్షం, SiMsupaa vRkshaM
-n.
--see ఇరుగుడు చెట్టు;
శింశుమారం, SiMsumAraM
-n.
--porpoise, dolphin;
శిక్ష, Siksha
-n.
--punishment;
శిక్షణ, SikshaNa
-n.
--training;
శిక్షించు, SikshiMcu
-v. t.
--punish;
శిఖరం, SikharaM
-n.
--peak; pinnacle; crest; summit;
శిఖరాగ్రం, SikharAgraM
-n.
--summit; peak; pinnacle; crest;
---శిఖరాగ్ర సమావేశం = summit conference.
శిగ్రువు, Sigruvu
-n.
--[bot.] Hyyperanthera morunga;
శిథిలం, SithilaM
-n.
--ruined object; ruined structure; dilapidated building;
శిరస్త్రాణం, SirastrANaM
-n.
--helmet;
శిరస్సు, Sirassu
-n.
--head;
శిరీషం, SirIshaM
-n.
--[bot.] ''Albezia lebbeck''; ''Mimosa lebbeck''; ''Acacia sirisa'';
-- దిరిసెన; దిరిసెన పువ్వు; శృ + ఈషన్ అని వ్యుత్పత్తి. తొందరగా వాడిపోయేది అని దాని అర్థం; ఈ చెట్టుకు, దాని ఆకులు, కాయలు, పూవులకు ఆయుర్వేదంలో విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఎన్నో రోగాలకు దివ్యౌషధంగా ఈ చెట్టు తాలూకు భాగాలు పనిచేస్తాయి.
శిరోబిందువు, SirObiMduvu
-n.
--[astron.] zenith; the point on the celestial sphere that is directly above the observer; ఊర్ధ్వబిందువు;
శిరోబిందు కోణం, SirObiMdu kONam
-n.
--[astron.] the angle subtended at the observers eye by the lines drawn between the observer and the zenith and the line between the observer and a celestial object.
శిరోమణి, SirOmaNi
-n.
--a degree conferred on a Sanskrit scholar after achieving a certain level of educatin;
శిరోవారం, SirOvAraM
-n.
--[math.] overbar; viniculum; a small line drawn over a letter to indicate the nature of the variable it represents;
శిల, Sila
-n.
--stone; lithos;
శిలతైలం, SilatailaM
-n.
--petroleum; crude oil;
శిలతైల ఖమీరం, Silataila khamIraM
-n.
--petroleum jelly;
శిల్పం, SilpaM
-n.
--(1) sculpture; statue; artistic work;
--(2) technique;
శిలాజం, SilAjaM
-n.
--fossil;
శిలాజ, SilAja
-adj.
--petrified; fossilized;
శిలాజిత్, SilAjit
-n.
--(1) red chalk; bitumen; It is the gummy substance that exudes from the mountain rocks;
-- ఇది నల్లగా, మెరుస్తూ, మైనంలా ఉంటుంది. శిలాజిత్ నీటిలో వేయగానే ఆ నీళ్ళు ఎర్రగా మారతాయి. శిలాజిత్ గాయాలు మాన్పుతుంది. విరిగిన ఎముకలను బాగుచేస్తుంది. ఎముకలు విరిగిన వారికి త్వరగా కట్టుకొనడానికి, నొప్పులు తగ్గడానికి గురిగింజ ఎత్తు శిలాజిత్ ని నేతిలో కలిపి కొన్ని రోజులపాటు తీసుకోవాలి. దానినే కాస్త విరిగిన ఎముకలమీద రాస్తే మరింత ప్రయోజనం; అలసట, నిస్సత్తువ వంటివి మధుమేహం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వాటిని తగ్గించడానికి సిలాజిత్తును వాడుతుంటారు;
-- సిలాజిత్తు; రాతిమదము; మొమ్మాయి; మోమియా;
--(2) a medicinal herb; [bot.] ''Oppdlia elegans; Opquelia multiflora'';
శిలాద్రవం, SilAdravaM
-adj.
--lava;
శిలాపుష్పం, SilApushpaM
-n.
--storax; the balsam of liquid amber tree used in medicines and perfumes; % to e2t
శిలావరణం, SilAvaraNaM
-n.
--[geol.] lithosphere;
శిలాస్థి, SilAsthi
-n.
--[geol.] fossil; % e2t
శిల్పి, Silpi
-n.
--sculptor; the artisan who creates sculptures; designer; architect;
శిలీంధ్రం, SilIMdhraM
-n. s.
--fungus; mushroom;
శిలీంధ్ర శాస్త్రం, SilIMdhra SastraM
-n.
--micology; % to e2t
శిలువ, Siluva
-n.
--Cross; a sacred symbol of Christianity;
శివవేము, SivavEmu
-n.
--[bot.] ''Indigofera aspalathoides'' of the Fabacaeae family;
శివరాత్రి, శివరాత్రి
- n.
-- ప్రతినెలా అమావాస్య ముందు చతుర్దశిని శివరాత్రిగా పరిగణిస్తారు. కాని, మాఘమాసంలో అమావాస్యకు ముందు రాత్రిని మహాశివరాత్రి అంటారు. మాసశివరాత్రి: ప్రతినెలా కృష్ణపక్షంలో వచ్చే చతుర్దశి (అనగా అమావాస్యకు ముందురోజు). మహాశివరాత్రి: మాఘబహుళ చతుర్దశి.
శివార్లు, SivArlu
-n. pl.
--outskirts; suburbs;
శిశ్నము, SiSnamu
-n.
--penis; the external male genital organ;
శిశువు, SiSuvu
-n.
--infant; baby; child;
శిశుత్వం, SiSutvaM
-n.
--infancy; childhood;
శిశుసంకల్పన, SiSusaMkalpana
- n.
-- conception; fertilization of egg with sperm;
శిష్టం, SishTaM
-n.
--remainder; remnant; leftover item;
శిష్ట, SishTa
-adj.
--trained; disciplined; learned; wise;
-- శిష్టజనులు అంటే విద్యావంతులు, రచయితలు, అధ్యాపకులు వంటివాళ్ళు;
శిష్ట వ్యావహారికం, SishTa vyAvahArikaM
-n.
--the vernacular of the learned;
-- విద్యావంతులు, రచయితలు, అధ్యాపకులు వంటివాళ్ళు వాడేభాష.
శిష్యుడు, SishyuDu
-n. m.
--disciple; student; pupil;
శిష్యురాలు, SishyurAlu
-n. f.
--disciple; student; pupil;
శిష్టోక్తి, SishTOkti
-n.
--euphemism; % to e2t
శిశువు, SiSuvu
- n.
--infant; a child from the time of delivery until the child speaks;
-- (note).మానవులలో యుగాండం (zygote) అన్న పేరు శిశుసంకల్పన (conception) సమయం నుండి ఐదో వారం వరకు వర్తిస్తుంది. ఐదవ వారం నుండి పదవ వారం వరకు దీనిని పిండం (embryo) అని పిలుస్తారు. పదకొండవ వారం నుండి ప్రసవం అయి బిడ్డ భూపతనం అయేవరకు భ్రూణం (ఇంగ్లీషులో ఫీటస్, fetus) అంటారు. ప్రసవం అయినప్పటినుండి మాటలు వచ్చేవరకు శిశువు (infant) అంటారు - ఇంగ్లీషులో ఇన్^ఫెంట్ అంటే మాటలు రాని పసిబిడ్డ అని అర్థం. మాటలు మాట్లాడడం మొదలు పెట్టిన తరువాత బిడ్డ (child) అంటారు. బిడ్డ అనే మాట ఆడ, మగ కి వర్తిస్తుంది.
శిశుమేధం, SiSumEdhaM
-n.
--infanticide; mass killing of infants;
శిస్తు, Sistu
-n.
--rent on land given to farming;
శీఘ్రం, SigraM
-adj.
--quick; swift; rapid; fast;
శీతలం, SitalaM
-n.
--cold;
శీతకన్ను, SItakannu
-n.
--cold-eye; act of ignoring; benign neglect;
---మామీద శీతకన్ను వేశావేమిరా? = why did you ignore us?
శీతశ్వాసం, SItaSvAsaM
-n.
--hibernation; % to e2t
శీతాకాలం, SItAkAlaM
-n.
--winter;
శీతువు, SIthuvu
-n.
--a potent potable made from sugarcane juice; rum;
శీర్షం, SIrshaM
-n.
--head; end; terminal; vertex;
---ఆమ్ల శీర్షం = acid end; acid terminal.
---నవ శీర్షం = amine end.
శీర్ష, Sirsha
-pref.
--head; prefix;
శీర్షబిందువు, SIrshabiMduvu
-n.
--[math.] dot placed over a variable;
శీర్షరేఖ, SIrsharEkha
-n.
--[math.] line placed over a variable;
శీర్షిక, SIrshika
-n.
--title; heading; headline;
శీర్షోన్నతి, SIrshOnnati
-n.
--altitude;
శీలం, SIlaM
-n.
--(1) nature; character; inherent quality;
--(2) chastity;
శీలవంతుడు, SilavaMtuDu
-n. m.
--a man of good character;
శీలవతి, SIlavati
-n. f.
--a chaste woman;
శీలి, SIli
-suff.
--a person possessing the character described by the preceding adjective;
---వ్రతశీలి = a person with impeccable character.
---వితరణశీలి = charitable person.
---పఠనశీలి = voracious reader.
---రచనాశీలి = prolific writer.
శీధు, SIdhu
-n.
--rum; a fermented liquor made from sugarcane juice;
శ్రీఖండ్, SreekhanD
- n.
-- a sweet dish made from milk, curds, cream and sugar;
-- ఈ పదానికి అర్థం "శ్రేష్ఠమైన తీపి పదార్థం." పాలను చిలకడం ద్వారా వచ్చే పాల మీగడ లేదా వెన్నను "శ్రీఖండ" అని పిలిచేవారు. కాలక్రమేణా, అదే పేరు చిక్కటి పెరుగుతో చేసే ఈ మధురమైన వంటకానికి స్థిరపడింది.
శ్రీరంగనీతులు, SrIraMganItulu
- ph.
-- (lit.) the moral precepts taught by the temple at Srirangam; a proverbial expression for precpts the precher himself does not follow; hypocricy;
శ్రీవేష్టం, SrIvEshTaM
-n.
--turpentine; దేవదారు మొక్కలనుండి కారే రసం;
%శుం - SuM, శు - Su, శూ - SU
శుంఠ, SuMTha
-n.
--dullwit; stupid; blockhead; (rel.) వజ్రశుంఠుడు;
శుకం, SukaM
-n.
--parrot;
శుకనాశం, SukanASaM
-n.
--[bot.] Biguonia indica;
శుక్రం, SukraM
-n.
--sperm; see also శుక్లం;
శుక్రలోపం, SukralOpaM
-ph.
--defective sperm.
శుక్రవాహకి, SukravAhaki
-n.
--[anat.] vas deferens;
శుక్రుడు, SukruDu
-n.
--the planet Venus; the second planet from the Sun in the solar system.
శుక్ల, Sukla
-adj. pref.
--white; (ant.) కృష్ణ;
---శుక్లపదార్ధం = [astron.] white matter.
---శుక్లపక్షం = the waxing half of a lunar month.
శుక్లాలు, SuklAlu
-n.
--cataract; an eye disease;
శుచి, Suci
-n.
-- godliness; tidiness;
-- శుచి అంటే అగ్ని. అది అన్నిటినీ పవిత్రం చేస్తుంది. ప్రదేశమూ, వస్తువూ, ఆర్జన ఇవన్నీ పవిత్రం అయినపుడే ఆ వస్తువు శుచి ఔతుంది. పుణ్య కార్యానికీ వాడదగినది శుచి యైన వస్తువే.. మంత్రం చేత అభిమంత్రితమైనది శుచి. చక్కగా చేసిన వంట శుభ్రం.. అది భగవన్నివేదితమై శుచి ఔతుంది.
-- Neatness is next to Godliness అంటారు గదా! Godliness అనేది శుచి, Neatness అనేది శుభ్రత.
శుచి, శుభ్రం, Suci, SubhraM
-ph.
--[idiom] tidy, clean అండ్ godly;
శుద్ధ, Suddha
-adj.
--white; pure; clean; stainless; spotless;
శుద్ధిచేయు, SuddhicEyu
-v. t.
--clean and purify;
శునకం, SunakaM
-n.
--dog;
శుని, Suni
-n. f.
--bitch; female dog;
శుభం, SubhaM
-n.
--auspicious thing; good thing; (rel.) అభం, శుభం = good or bad;
శుభముహూర్తం, SubhamuhUrtaM
-n.
--auspicious moment;
శుభశ్య శీఘ్రం, SubhaSya SIghraM
- ph.
-- a Sanskrit phrase meaning, "the sooner the better";
శుభసూచకం, SubhasUcakaM
-n.
--good omen;
శుభ్రం, SubhraM
-adj.
--clean; tidy; bright; white; neat;
శుభ్రం చేయు, SubhraM cEyu
-v. t.
--make something white, bright and shiny; by implication, to clean;
శుభ్రత, Subhrata
-n.
--cleanliness;
శుభాకాంక్షలు, SubhAkAMkshalu
-n.
--greetings;
---నూతన సంవత్సర శుభాకాంక్షలు = new year greetings.
శురూ, shuroo (pronounced as షురూ from Urdu)
- n.
- beginning; the start;
శుల్కం, SulkaM
-n.
--(1) tax; duty; toll; fee;
--(2) dowry; 'శుల్కం' అన్నది ఒక వెల, డిపాజిట్, టాక్స్. వేశ్యకు ఆమె సేవలకు గాను ఇచ్చే డబ్బును కూడా శుల్కం అంటారని నిఘంటువులు చెబుతున్నాయి. 'కన్యా శుల్కం' అంటే ఒక కన్యను తెచ్చుకోవడానికి ఆమెను కన్నవారికి ఇచ్చే ధర, లేక డిపాజిట్; కన్యాశుల్కం ఇచ్చి కొన్నాడు కనుక ఆ కన్యపై సర్వాధికారాలు ఆ పురుషుడికి జమ అయిపోయాయి. అదే వరకట్నం విషయంలో అది వెల యిచ్చి పురుషుని కొనడం కాదు. అతనికి భక్తితో సమర్పించుకొన్న కానుక. కనుక వరకట్నం ఎంత ఇచ్చినా అది ఆ మగవాడి 'ఎంటైటిల్మెంట్' అవుతుంది కానీ అతడు అమ్ముడు పోయినట్లు కాదు.
శుల్భం, SulbhaM
-n.
--a string without any twist; a wire; copper wire;
శుశ్రుతుడు, SuSrutuDu
-n.
--Susruta; the great Indian surgeon of the 6th century B.C. whose book, SuSruta SalyataMtra, was an authoritative treatise on surgery;
శుష్కించు, SushkiMcu
-v. i.
--emaciate; become dry;
శుష్క వచనం, Sushka vacanaM
-n.
--empty words; useless promise;
శ్రుతం, SrutaM
-n.
--(1) the Vedas; (lit.) one that was heard;
--(2) hearsay;
శ్రుత, Sruta
-adj.
--heard;
శ్రుతపాండిత్యం, SrutapAMDityaM
-n.
--superficial knowledge; knowledge acquired through the grapevine; knowledge acquired by listening to others;
శ్రుతి, Sruti %replacement for old entry
-n.
--(1) one that was heard;
--(2) [music] a singer's signature pitch; starting frequency of a singer's octave;
--(3) frequency; pitch; tone;
-- శ్రుతి అంటే వినబడేది. స్మృతి అంటే జ్ఞాపకం పెట్టుకునేది;
శ్రుతిదండం, SrutidaMDaM
-n.
--[phys.] tuning fork;
శూన్యం, SUnyaM
-n.
--(1) vacuum;
--(2) zero; nothing; నివర్తం; (rel.) ఖాళీ;
శూన్యనాళిక, SUnyanALika
-n.
--vacuum tube;
శూన్యవాదం, SUnyavAdaM
-n.
--nihilism; relativity; (exp.) this word is especially used while referring to Nagarjuna's మాధ్యమిక వాదం. The central premise of this theory is that everything is interdependent. There is nothing absolute. Here శూన్య should be translated as relative;
శూరత్వం, SUratvaM
-n.
--heroism; bravery; valor;
శూరుడు, SUruDu
-n. m.
--hero; champion; warrior;
శూలం, SUlaM
-n.
--(1) a weapon comprised of a long stick with a sharp tip; ఈటె; బల్లెం;
---త్రిశూలం = trident; Shivas weapon.
శూల, SUla
-n.
--(1) a stabbing type of pain;
--(2) sharp peg; కొర్రు;
--(3) evil eye of a planet on a horoscope; గ్రహశూల;
%శృ - SR, శె - Se, శే - SE, శై - Sai, శొ - So, శో - SO, శౌ - Sau
శృంఖలం, SRMkhalaM
-n.
--chain; fetter; cuff;
శృంగం, SRMgaM
-n.
--(1) peak; tip; apex;
--(2) horn;
---ఏకశృంగం = one-horned one; rhinoceros.
శృంగభంగం, SRMgabhaMgaM
-n.
--humiliation; to cut one down to size; (lit) de-horning;
శృంగాటకం, SRMgATakaM
-n.
--crossroads; a meeting place of four roads;
శృంగారం, SRMgAraM
-n.
--(1) eroticism;
--(2) romance;
--(3) grace; elegance; beauty;
శృంగారోద్దీపకం, SRMgArOddIpakM
- n.
-- aphrodisiac;
శృంగారోద్దీపకి, SRMgArOddIpaki
- n.
-- aphrodisiac;
శృంగి, SRMgi
-n.
--horned animal;
శృతి, sRti
- n.
-- musical drone sound; a drone is essential in a practice session or concert of Indian classical music;
--సుతి;
శృతి పెట్టి, sRti peTTi
- n.
-- musical drone box; It is similar to a harmonium and is used to provide a drone in a practice session or concert of Indian classical music.
శేఫాలిక, SephAlika
-n.
--[bot.] Nyctanthes arbortristis;
శేముషి, SEmushi
-n.
--intellect; intellectual eminence;
శేషం, SEshaM
-n.
--[math.] remainder; what is left after a division;
---సశేషం = with a remainder; something left over after division.
---నిశ్శేషం = without a remainder; nothing left over after division.
శేషతోలన పట్టి, SEshatOlana paTTI
-n.
--(econ.) trial balance sheet;
శ్వేత, SvEta
-adj.
--white;
శ్వేతకం, SvEtakaM
-n.
--[biol.] albumin; a white protein found in blood, milk, eggs, and so on.
శ్వేతకుబ్జ తార, SvEtakubja tAra
-n.
--[astron.] white dwarf; a type of star;
శ్వేతకుష్టు, SvEtakushTu
-n.
--leucoderma; vitiligo; this is a misnomer as there is no connection between leucoderma and leprosy;
శ్వేతపత్రం, SvEtapatraM
-n.
-- a white paper; a statement containing proposals for action;
-- A white paper is an informational document issued by a company or not-for-profit organization to promote or highlight the features of a solution, product, or service that it offers or plans to offer.
White papers are also used as a method of presenting government policies and legislation and gauging public opinion;
శ్రేఢి, SrEDhi
-n.
--[math.] progression; sequence;
శ్రేణి, SrENi
-n.
--(1) [math.] series;
--(2) line; row; range;
---పర్వతశ్రేణి = mountain range.
శ్రేణీకరణం, SrENIkaraNaM
-n.
--ranking; putting in a specified order;
శ్రేయస్సు, SrEyassu
-n.
--welfare;
శ్రేయోరాజ్యం, SrEyOrAjyaM
-n.
--welfare state;
శ్రేయోభిలాషి, SrEyObhilAshi
-n.
--wellwisher;
శ్రేష్టం, SrEshThaM
-n.
--excellent; best of all;
శ్లేష, SlEsha
-n.
--language with a double meaning; (rel.) double entendre is where the second meaning has sexual or obscene overtones;
శైత్యం, SaityaM
- n.
-- (1) cold; coldness; chilliness; (2) common cold; upper respiratory tract infection consisting of rhinorrhea, nasal congestion, and sore or scratchy throat is familiar to all adults;
శైలి, Saili
-n.
--style; manner of expression;
శైలూషం, SailUshaM
-n.
--[bot.] Argle mormelos; బిల్వవృక్షం; మారేడు;
శైవలం, saivalaM
-n.
--an aquatic plant;
శొంఠి, SoMThi
-n.
--dried ginger;
-- [Sans.] విశ్వభేషజం; మహౌషధం; కటుభద్ర; ఆర్ద్రక; శృంగిబేర;
-- [ety.] శృంగిబేర > {Gr.] జింజిబెరి > [ Lat. ] జింజిబర్ > [Eng. ] జింజిర్
శోచనీయం, SOcanIyaM
-n.
--lamentable; sorrowful;
శోణం, SONaM
-n.
--(1) crimson; a shade of red;
--(2) blood;
శోణితం, SONitaM
-n.
--covered with blood;
శోధకుడు, SOdhakuDu
-n.
--investigator; detective;
శోధన, SOdhana
-n.
--(1) search; investigation;
--(2) resolution; see also పరిశోధన;
---శోధన నాళిక = test tube; పరీక్ష నాళిక.
శోఫ, Sopha
-n.
--inflammation; swelling;
-suff.
---itis;
---ఆంత్రశోఫ = inflammation of the intestines; enteritis.
---క్రిమికశోఫ = inflammation of the appendix; appendicitis.
శోభ, SObha
-n.
--glory; luster; radiance;
శోభనం, SObhanaM
- n.
-- nuptials; శోభ కలిగించేది /ఆనంద దాయకము అని శబ్దార్థం;
శోభించు, SObhiMcu
-v. i.
--shine;
శోభి, shObhi
- n.
-- Tinea versicolor; A rash of small red and sometimes scaly spots. People often confuse it with ''guttate psoriasis.'' Tinea versicolor can also cause patches of light or dark skin, which some people might confuse with vitiligo; This is an overgrowth of a type of yeast (fungus) naturally found on your skin. Hot weather, humidity, and sun exposure can make tinea versicolor worse. It's not harmful or contagious. It can be mildly itchy. Tinea versicolor is commonly found on your shoulders, back, and upper chest.
శోష, SOsha
-n.
--fainting spell; tiredness;
శోషణం, SOshaNaM
-n.
--absorption; drying; the act of making something dry either by absorption or evaporation;
శ్రోత, SrOta
-n.
--listener; hearer;
శ్రోతలు, SrOtalu
-n. pl.
--listeners; audience;
శ్లోకం, SlOkaM
- n.
-- a Sanskrit poem with a specified prosody rule;
-- శ్లోకం అనుష్టుప్ అనే 8 మాత్రల ఛందోవర్గానికి చెందిన ఒక రూపం. ఉత్పలమాల, శార్దూల విక్రీడితం లాగా అది కూడా ఒక కావ్య రచనకు ఉపయోగపడే పద్యం. శ్లోకంలో నాలుగు పాదాలు. ప్రతీ పాదంలోనూ ఐదవ అక్షరం లఘువు అయి ఉండాలి. రెండు, నాల్గవ పాదాలలో ఏడవ అక్షరం లఘువు అయి ఉండాలి. ప్రతీ పాదంలోనూ ఆరవ అక్షరం గురువు అయి ఉండాలి. మిగిలిన చోటులలో నియమమేమీ లేదు. అంటే, నియమం 5,6,7 అక్షరాలలోనే కనపడుతుంది. దీనిని ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు - బేసిపాదాలలో 5,6,7 అక్షరాలు యగణం (లఘువు-గురువు-గురువు) కావాలి. సరిపాదాలలో జగణం(లఘువు-గురువు-లఘువు) కావాలి. పాదం చివరి అక్షరం (ఎనిమిదవది) కూడా గురువే కావాలి. ఇలాంటి లక్షణాలున్న పద్యాన్ని 'శ్లోకం' అంటారు. రామాయణం శ్లోకాలతోనే వ్రాయబడింది. కాలిదాసు రఘువంశం ఎక్కువ భాగం శ్లోకాలలోనే వ్రాయబడింది.
-- మంత్రం శ్లోకం రూపంలో కూడా ఒక్కోసారి ఉండవచ్చు. ఐతే అన్ని మంత్రాలూ శ్లోక ఛందస్సులోనే ఉండనవసరం లేదు. అలాగే శ్లోకాలన్నీ మంత్రాలు కావు. మంత్రానికి గురూపదేశం అవసరం;
-- స్తోత్రం అనేది దేవత లేదా ఆధ్యాత్మిక వ్యక్తికి అంకితం చేయబడిన శ్లోకం. శ్లోకాల కంటే పొడవుగా ఉంటాయి మరియు బహుళ శ్లోకాలు లేదా చరణాలను కలిగి ఉండవచ్చు.
శౌరి, Sauri
-n.
--[astron.] Hercules; a star constellation; M13, a magnificent globular cluster, can be seen in this constellation;
శ్రౌత, Srauta
-adj.
--audible;
</poem>
==Part 3: ష - sha, షా - shA, షి - shi, షో - shO==
<poem>
షట్, shaT
-adj.
--six;
షట్కం, ShatkaM
- n.
-- a set of six; sextet; six;
షట్కర్మలు, shaTkarmalu
- n.
-- the six functions suitable for a Brahmin;
-- అధ్యయనము, అధ్యాపనము, యజనము, యాజనము. దానము, ప్రతిగ్రహము అనేవి ఆరూ బ్రాహ్మణ విధులు.
-- 1. వేద శాస్త్రాలను గురుముఖంగా నేర్చుకోవడం, 2. నేర్చుకొన్న విద్యలను విద్య నేర్పమని ఆశ్రయించిన విద్యార్థులకు వాళ్ల యోగ్యతననుసరించి బోధించడం, 3. యజ్ఞాలు చేయడం, వైశ్వదేవము, అగ్ని ష్టోమము, సోమయాగము వంటివి. 4. తనను యజ్ఞం చేయించమని అడిగినపుడు యాజకత్వం వహించడం. యజ్ఞ దక్షిణలు ప్రతిఫలంగా గ్రహించడం. 5. దానములు చేయడం, గో భూ హిరణ్యాది దానాలు కాలోచితంగా చేయడం. 6. ఇతరులు ఇచ్చే దానాలు స్వీకరించి, వాళ్లను దోష విముక్తులను చేసి, జప తపాదులతో తనలో ఆ దోషం లేకుండా చేసుకోవడం — ఇవన్నీ బ్రాహ్మణుడు తప్పక చేయవలసినవి;
షట్‌కోణి, shaT^kONi
-n.
--[math.] hexagon; (lit.) the six-angled one;
షడ్‌చక్కెర, shaD^cakkera
-n.
--[chem.] hexose sugar;
షడ్దర్శనాలు, shaD^darSanAlu
- n. pl.
-- the six schools of orthodox Indian philosophy;
షడ్‌భుజి, shaD^bhuji
-n.
--[math.] hexagon; (lit.) the six-sided one;
షడోజు, shaDOju
-n.
--[chem.] hexose; a type of chemical substance that goes under the generic name of sugar, but not related to table sugar or sucrose;
షర్బత్, sharbath
-n.
--syrup;
షరా, sharA
-n.
--(1) note below; post script;
--(2) status; situation;
షరాబు, sharAbu
-n.
--merchant;
షరాయి, shrAyi
-n. s.
--trousers;
షవన దినం, Shavana dinaM %e2t
-n.
-- civil day;
షష్టి, shashTi
-n.
--sixty;
షష్టిపూర్తి, shashTipUrti
-n.
--completion of sixty years of life; celebration of the sixtieth birthday;
-- షష్టిపూర్తి రోజున మనం పుట్టినప్పటి తిథి + పక్షం + మాసం + సంవత్సరం అన్నీ మళ్ళీ కలసి వస్తాయి. ప్రభవ, విభవ, … నుండి మొదలై లెక్కించగలిగిన సంవత్సరాలు మనకు మొత్తం 60 ఉన్నాయి. ఆ 60 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ మనం పుట్టినప్పటి తిథి + పక్షం + మాసం + సంవత్సరాల కలయిక వచ్చే సందర్భమే షష్టిపూర్తి.
-- ఈ విధంగా ఆనందంతో అత్యంత వైభవంగా జరుపుకొనే పుట్టినరోజున ఆనందంతో పాటు జీవితంలో సగానికి పైగా గడచిపోయింది, ఇక అంతిమ ప్రయాణానికి రోజులు దగ్గర పడుతున్నాయి అనే ఆలోచన కూడా రాక మానదు. ఈ ఆలోచనవల్ల కలిగే భీతిని సమాధాన పరచడానికి కొన్ని కార్యాలు చేయడం పరిపాటి. అవి ఉగ్రరథ శాంతి, మహా మృత్యుంజయ హోమం, నవగ్రహ, చండి, సుదర్శన, లక్షినారసింహ మొదలగు హోమ క్రతువులు చేయడం, పెద్దల ఆశీర్వాదాలు తీసుకుని దానధర్మాలు చేయడం. ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం: మనిషి పూర్తి జీవితంలో జరుపవలసినవిగా నిర్ధారించిన 16 సంస్కారాలలో 'షష్టిపూర్తి' అనేది లేదు! దానిని మరో వివాహ దినోత్సవంలా జరుపుకోవడం అనేది అసలే లేదు!!
షష్ఠి, shashThi
-n.
--six; the sixth day of the lunar half-month;
షష్ఠేంద్రియం, shashThEMdriyaM
-n.
--the sixth sense organ;
షష్ఠేంద్రియజ్ఞానం, shashThEMdriya j~nAnaM
-n.
--sixth sense; extra sensory perception;
షామియానా, shAmiyAnA
-n.
--awning; tent; a temporary structure made of canvas;
షావుకారు, shAvukAru
-n.
--merchant; money lender;
షికారు, shikAru
-n.
--stroll; pleasure walk; pleasure boat ride; pleasure trip;
షురూ, shuroo
- n.
-- beginning; start;
-- ప్రారంభం; సినిమా మొదటి ఆట షురూ అయింది;
షోకు, shOku
-n.
--fashion;
షోకులాడి, shOkulADi
-n. f.
--fashionable woman;
షోడశం, shODaSaM
-adj.
--sixteen; sixteenth;
</poem>
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN: 0-9678080-2-2
[[వర్గం:వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు]]
29vk25bref4wmrf1507gb12zpiynkqc
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/Q-R
0
3028
39208
39091
2026-06-01T19:36:46Z
Vemurione
1689
/* Part 2: R */
39208
wikitext
text/x-wiki
=నిఘంటువు=
*This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
* This dictionary uses American spelling for the primary entry. Equivalent British spellings are also shown as an added feature.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
19 Aug 2015.
==Part 1: Q==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
* Q, n. గణితంలో భిన్న సంఖ్యలు (-1/3, 0, 1/2, 2/9, 3/60, వగైరా) యొక్క సమితి; the set of quotinet numbers; అనగా లవము, హారము ఉన్న భిన్నాలు;
* QED, n. (1) Quantum Electrodynamics, (a quantum field theory that describes the interactions between charged particles and the electromagnetic field, explaining how light and matter interact at the quantum level; it's considered one of the most precisely tested theories in physics; 2) "Quod Erat Demonstrandum," which was to be demonstrated;
* '''quack, n. కపటవైద్యుడు; తరిఫీదు లేకుండా వైద్యం చేసే వ్యక్తి;
* quackery, n. విద్య నేర్వని వ్యక్తి చేసే వైద్యం;
* quad, n. చతుశ్శాల; నాలుగిళ్ళ వాకలి; చౌకి; ముంగిలి; చత్వరం; పాఠశాలలో నాలుగు భవనాల మధ్య ఉండే ప్రదేశం;
* quadrangle, n. చతుర్కోణి; చతుర్భుజం; నాలుగు కోణాలు గల రేఖాగణిత చిత్రం;
* quadrant, n. (1) పాదం; పాదుక; చరణం; వృత్త చరణం; వృత్తంలో నాల్గవ భాగం; (2) కాష్ఠ; ఒక చదునైన ప్రదేశంలో రెండు పరస్పర లంబ రేఖలు గీయగా ఏర్పడే నాల్గవ భాగం; (3) తురీయం; నభోమూర్తుల కోణాలు కొలవటానికి వాడే పరికరం;
* quadratic, adj. వర్గ; ద్విఘాత;
** quadratic equation, ph. వర్గ సమీకరణం; ద్విఘాత సమీకరణం;
** quadratic surd, ph. వర్గ కరణి; ఒక పూర్ణాంకపు వర్గ, ఘన మూలాదులని నిష్ప సంఖ్యల వలె రాయలేనప్పుడు వాటిని కరణీయ సంఖ్యలు అనేవారు కాని ఇటీవల ఈ మాట వాడుకలో లేదు;
* quadrature, n. వర్గీకరణం; వైశాల్యం కట్టడం;
* quadrifoliate, quadrifoliolate, adj. చతుర్ధళ; నాలుగు ఆకుల గుత్తులు కల;
* quadrilateral, n. చతుర్భుజం; చతుర్కోణి; నాలుగు భుజాలు గల రేఖాగణిత చిత్రం; (rel.) square;
* quadrillion, n. (అమెరికాలో) మహాపద్మం; ఒకటి తర్వాత పదిహేను సున్నలు వెయ్యగా వచ్చే సంఖ్య; 10<sup>15</sup>
* quadruped, n. చతుష్పాది; నాలుగు కాళ్లు కలది;
* quadruple, adj. నాలుగింతలు;
* quadriplegic, n. రెండు కాళ్లు, రెండు చేతులు పనికిరాకుండా పోయిన వ్యక్తి;
* quadruplets, n. pl. చతుష్కులు; జంట కవలలు; ఒకే కాన్పులో పుట్టిన నలుగురు పిల్లలు;
* quadruplex, adj. నాలుగు పేటల; నాలుగు వాకేతాలని ఒకే తీగ మీద కాని, ఒకే రేడియో చానల్ మీద కాని పంపేటప్పుడు వాడే ఒక నియమం;
* quadruplex, n. ఒకే చూరు కింద నాలుగు వాటాలు కలసి ఉన్న ఇల్లు;
* quadruplication, n. నాలుగింతలు చెయ్యడం;
* quagmire, n. ఊబి; చిత్తడి నేల;
* quail, n. గిన్నెకోడి; పూరీడు పిట్ట;
* quaint, adj. వింతైన; అపురూపమైన; ముచ్చటైన; కొంచెం వింతగా, కొంచెం ఆకర్షణీయంగా పాత కాలపు పద్ధతిలో ఉన్న;
* quaint, adj. వింతయైన; అపురూపమైన;
* quake, n. కంపం; వణకు;
** earthquake, n. భూకంపం;
** moonquake, n. చంద్రకంపం;
* qualification, n. అర్హత; తాహతు; యోగ్యత;
* qualified, adj. (1) అర్హతలు కల; (2) పరిమితం చేసే; (note) విరుద్ధార్థములు కల మాట;
* qualifier, n. ఒక మాట యొక్క అర్థాన్ని పరిమితం చేసే విశేషణం;
* qualitative, adj. గుణాత్మక; గుణప్రధాన;
** qualitative analysis, ph. గుణాత్మక విశ్లేషణ;
** qualitative laws, ph. గుణాత్మక నియమాలు;
* quality, n. (1) గుణం; లక్షణం; స్వభావం; (2) నాణ్యత; శ్రేష్టత; వాసి;
** quality control, ph. నాణ్యతా నియంత్రణ;
* qualm, n. మనోవ్యధ; తప్పుచేసేమేమో నన్న బెంగ;
* quantitative, adj. పరిమాణాత్మక; రాశికి సంబంధించిన;
* quandary, n. ఇరకాటం; ఇబ్బంది; చిక్కు; సందిగ్ధం; ఎటూ తోచని అయోమయ స్థితి;
* quarantine, n. పరదేశం నుండి వచ్చే యాత్రికులని కాని, జంతువులని కాని నలభయి రోజుల పాటు విడిగా ఉంచే పద్ధతి;
* quantity, n. పరిమాణం; రాసి; రాశి; మాత్ర;
** an arbitrary measure of quantity , ph. పాటి; మాత్రం;
** do you want quality or quantity?, ph. రాసి కావాలా? వాసి కావాలా?
** unknown quantity, ph. అవ్యక్త రాసి;
* quantum, adj. (1) ఒక్కుదుటున జరిగిన పని; (2) గణనీయమైన; చెప్పుకోదగ్గ; గుళిక మాత్రపు; గుళిక; పరిమాణిక;
* quantum leap, ph. గణనీయమైన గంతు;
* quantum, n. చిటికెడు; గుళిక; మాత్ర; పరిమాణం; క్వాంటం;
** quantum theory, ph. గుళిక వాదం; పరిమాణిక వాదం;
* quarrel, n. కయ్యం; దెబ్బలాట; తగవు; జగడం; పెనకువ; కలహం; కుమ్ములాట; కజ్జా; రగడ, ragaDa
** quarrelsome person, ph. పేచీకోరు; కజ్జాకోరు;
* quarry, n. (1) రాతిగని; అశ్మాగారం; అశ్మాశయం; (2) వేటాడబడే జంతువు;
* quart, n. గేలనులో నాల్గవ వంతు; రెండు పైంట్లు;
* quarter, n. నాల్గవ భాగం; పావలా;
* quartet, n. (1) చతుష్టయం; చతుష్కం; నాలుగింటి సమాహం; నలుగురు; (2) నలుగురు కలసి పాడే పాట;
* quarters, n. ఇల్లు; బసచేసే స్థలం; ఆగారం; ఉద్యోగం ఇచ్చినవాడు ఉండడానికి ఇచ్చే ఇల్లు;
** inner quarters, ph. గర్భాగారం;
* quarterly, adj. త్రైమాసిక; ఏడాదికి నాలుగు సార్లు వచ్చే;
* quartic, adj. ద్వివర్గ; చతుర్‌ఘాత;
** quartic equation, ph. ద్వివర్గ సమీకరణం; చతుర్‌ఘాత సమీకరణం;
* quartz, n. శిలాస్ఫటికం;
* quasar, n. (క్వేజార్) నభోమండలంలో, చాల దూరంలో, చాల కాంతితో ప్రకాశించే సూర్యుడు వంటి తేజోగోళం;
* quash, v. t. అణగదొక్కు; నొక్కు; నొక్కిపెట్టు;
* quasi, adj. pref. కాల్పనిక; కృతక; సదృశ; ప్రాయ; వంటి;
* quasi-stellar object, ph. నక్షత్రాన్ని పోలిన శాల్తీ; నక్షత్రాన్ని పోలిన నభోమూర్తి; a massive and extremely remote celestial object, emitting exceptionally large amounts of energy, and typically having a starlike image in a telescope. It has been suggested that quasars contain massive black holes and may represent a stage in the evolution of some galaxies;
* quay, n. (కీ), నావికా ఘట్టం; రేవు;
* queen, n. (1) రాణి; పట్టపుదేవి; (2) [in chess] మంత్రి;
* queen bee, n. రాణి ఈగ;
* queer, adj. విచిత్రమైన; వింతయైన; విపరీతమైన, వికారమైన, అద్భుతమైన;
* quell, v. t. అదుపులో పెట్టు; శాంతింపజేయు;
* quench, v. t. ఆర్పు; చల్లార్చు; తీర్చు;
* query, n. ప్రశ్న; పృచ్ఛకం;
* query, v. t. ప్రశ్నించు;
* quesadilla, n. (కేసదీయా) పరోటా వంటి మెక్సికో దేశపు వంటకం; పరోటాలో కూరకి బదులు చీజు పూర్ణంగా పెట్టి చేసిన వంటకం;
* querulous, adj. అభియోగించే; ఫిర్యాదులు చేసే; తప్పులు పట్టే;
* quest, n. తపన;
* question, n. ప్రశ్న; పన్నం; అడుక్కోలు; మల్క;
** question mark, ph. ప్రశ్నార్థకం;
** question paper, ph. ప్రశ్న పత్రం;
* question, v. t. ప్రశ్నించు;
* questionable, adj. ప్రశ్నార్థకమైన; అనుమానాస్పదమైన;
* questionable, n. ప్రశ్నార్థకం; అనుమానాస్పదం;
* quiddity, n. సూక్ష్మం; ధర్మ సూక్ష్మం;
* quizzical, adj. ప్రశ్నగర్భితమైన;
* questionnaire, n. ప్రశ్నావళి;
* questioner, n. ప్రష్ట; అడిగే వ్యక్తి; అడగరి;
* queue, n. వరుస; బారు; పాళిక; పౌజు; ఆళి; ఓలి;
* quibble, n. చిన్న విషయం మీద వాగ్వాదం;
* quick, adv. త్వరగా; తొందరగా; వేగిరి; చప్పున; గభాల్న; చురుగ్గా;
* quicklime, n. పొడి సున్నం; సున్నం; చురుకుసున్నం; దాహక చూర్ణం; నీటి తాకిడి వలన త్వరగా శిథిలమయే సున్నం; see also slaked lime;
* quickly, adv. త్వరగా; తొందరగా; వేగిరం; వడిగా; చప్పున; దబ్బున; గభాల్న; గ్రక్కున; చయ్యన; రివ్వున; దిగ్గున; శీఘ్రంగా; చరచర; గబగబ; బిరబిర;
** very quickly, ph. అతి త్వరగా; ఆఘమేఘాలమీద;
* quickness, n. లాఘవం; నెవ్వడి;
* quicksand, n. ఊబి;, త్వరగా లోనికి లాగే ఇసక;
* quicksilver, n. పాదరసం;
* quid-pro-quo, ph. పరస్పర వీపుగోకుడు; నువ్వు నా వీపు గోకు, నేను నీ వీపు గోకుతాను అనే బేరం; ఇచ్చినమ్మ వాయినం, పుచ్చుకున్నమ్మ వాయినం;
* quiescent, adj. నిశ్చల; నిలకడ;
* quiet, n. స్థిమితం; ప్రశాంతం;
* quietly, adj. చడీచప్పుడు కాకుండా; పెద్ద హడావిడి చెయ్యకుండా;
* quill, n. ఈక;
* quilt, n. బొంత; జమిలి దుప్పటి;
* quilting, n. బొంతకుట్టు;
* quince, n. సీమదానిమ్మ;
* quinine, n. క్వినైను; క్వైనా;
* quinoa, n. కినోవా; దక్షిణ అమెరికాలో పెరిగే, జొన్న గింజల వంటి, మెట్ట పంట; బలవర్ధకమైన పోషక పదార్ధాలు కల ఈ గింజలని భృహదాహార పదార్థమని కొనియాడుతూ బియ్యము, గోధుమ వలె వాడుతున్నారు;
* quintessence, n. సారాంశం; (lit.) the fifth essence; the fifth element;
[[File:Quintic polynomial.svg|thumb|right|233px|polynomial of degree 5, with 4 [[critical point (mathematics)|critical points]]]]
* quintic, adj. పంచఘాత;
** quintic equation, ph. పంచఘాత సమీకరణం; ఉ: :<math>g(x)=ax^5+bx^4+cx^3+dx^2+ex+f = 0,\,</math>
** quintic function, ph. పంచఘాత ప్రమేయం; ఉ: :<math>g(x)=ax^5+bx^4+cx^3+dx^2+ex+f,\,</math>
* quintillion, n. శంఖం; అమెరికాలో ఒకటి తర్వాత18 సున్నలు వెయ్యగా వచ్చే సంఖ్య; 10<sup>18</sup>; బ్రిటన్ లో ఒకటి తర్వాత 30 సున్నలు వెయ్యగా వచ్చే సంఖ్య; 10<sup>30</sup>;
* quintuplets, n. pl. పంచకులు; పంచకం; ఒకే కాన్పులో పుట్టిన అయిదుగురు పిల్లలు;
* quip, n. ఛెణుకు; ఛలోక్తి; ద్వర్థి; వాక్బలం; చమత్కారపు మాట;
* quire, n. దస్తా; ఇరవై నాలుగు ఠావు కాగితాల లెక్క;
* quisling, n. దేశద్రోహి; పంచమాంగదళ సభ్యుడు;
* quit, v. i. విరమించు;
* quit, v. t. వదలిపెట్టు;
* quiver, n. అమ్ముల పొది; పొది;
* quiver, v. i. కంపించు; వణుకు;
* quixotic, adj. (క్విహాటిక్) వెర్రి ప్రయత్నం చేసెడు;
* quiz, n. చిన్న పరీక్ష;
* quorum, n. కోరం; కనీస సభ్యుల సంఖ్య;
* quota, n. వాటా; భాగం; వంతు; హిస్సా; కోటా;
* quotation, n. (1) అమ్మదలుచుకున్న ధర; ఇచ్చే ధర; (2) ఉల్లేఖనం; సంవాదాంశం;
** quotation marks, n. ఉల్లేఖన చిహ్నాలు;
* quote, n. ఉల్లేఖన; ఉటంకన;
* quote, v. t. (1) ధరలు తెలియబరచు; (2) మరొకరి మాటలని దృష్టాంతంగా ఎత్తి చూపు; ఉల్లేఖించు; ఉటంకించు;
* quotidian, adj. రోజూ; ప్రతిరోజూ; రోజువారీ; అనుదినము; దైనందినం; దైనిక;
** quotidian fever, ph. ప్రతిరోజూ వచ్చే జ్వరం;
* quotient, n. విభక్తం; భాగలబ్దం; భాగహార లబ్దం; భాగించగా లభించిన సంఖ్య;
** intelligence quotient, ph. వివేక విభక్తం; వివేక లబ్ధం; మానసిక వయస్సుని భౌతిక వయస్సుతో భాగించగా వచ్చిన లబ్దం;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 2: R==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
* R, n. గణితంలో నిజ సంఖ్యలు యొక్క సమితి; the set of all real numbers;
* '''rabbit, n. సీమచెవులపిల్లి; సీమకుందేలు; [see also] hare; Generally speaking, hares are bigger than rabbits; Rabbits and hares also have different diets, with rabbits preferring grasses and vegetables with leafy tops, such as carrots, and hares enjoying harder substances like plant shoots, twigs, and bark; Baby rabbits are called kits and baby hares are called leverets;
* rabid, adj. వెర్రి; పిచ్చిపట్టిన; హింసాత్మకమైన;
** rabid dog, ph. పిచ్చి కుక్క;
* rabies, n. కుక్కవెర్రి; పిచ్చికుక్క వ్యాధి; జలభీతి వ్యాధి; రభస వ్యాధి; కుక్కలు, నక్కలు, గబ్బిలాలు, వంటి మాంసం తినే కొన్ని జంతువులకి వచ్చే ఒక రకమైన వైరస్ వ్యాధి; ఈ విధంగా వ్యాధిగ్రస్తులైన జంతువులు కరిచినప్పుడు ఈ వ్యాధి మనుష్యులకి సోకుతుంది; వెనువెంటనే చికిత్స చేయించకపోతే ప్రాణహాని కలుగుతుంది; ఒకసారి రేబిస్ బారినపడితే ప్రాణాలతో బయటపడటం చాలా కష్టం. కాబట్టి రేబిస్ రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అదృష్టవశాత్తూ ఈ ఒక్క వ్యాధి విషయంలోనే వైరస్ మన శరీరంలో ప్రవేశించిన తర్వాత కూడా వాటిని సమర్థంగా అడ్డుకునే టీకాలున్నాయి. కాబట్టి సకాలంలో స్పందిస్తే రేబిస్ రాకుండా చూసుకోవటం సాధ్యమేనన్న విషయం మర్చిపోకూడదు. ఇది ఒకరినుండి మరొకరికి సులభంగా అంటుకునే రోగం కాదు; see also hydrophobia; ఈ వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా, ఏటా, దరిదాపు 60,000 మరణాలు సంభవిస్తున్నాయి;
* race, n. (1) పందెం; పరుగు పందెం; (2) ప్రజాతి; జాతి; తెగ; వంశం;
** horse race, ph. గుర్రపు పందెం;
** human race, ph. మానవజాతి;
** race horse, ph. పందెపు గుర్రం;
** racial discrimination, ph. జాతి విచక్షణ; జాతి వివక్ష;
* raceme, n. గెల; పెడ; గుత్తి;
* rachis, n. తొడిమ;
* racist, n. జాత్యహంకారి; పరజాతి ద్వేషి;
* rack, n. చట్రం; మంచె; మలారం;
* racket, n. (1) కోలాహలం; అల్లరి; (2) చెండు చట్రం; కొన్ని రకాల ఆటలలో బంతిని కొట్టు సాధనం; (3) కుంభకోణం; కూటవ్యవహారం;
* raconteur, n. కథకుడు; కథలు బాగా చెప్పే వ్యక్తి;
* radar, n. రేడార్; acronym for Radio Detection and Ranging;
* radial, adj. (1) త్రైజ్య; త్రిజ్య; (2) ప్రకోష్టీయ;
* radian, n. మెట్రిక్ పద్ధతిలో కోణాలని కొలిచే కొలమానం; ఒక రేడియన్ ఉరమరగా 57.3 డిగ్రీలకి సమానం;
* radiance, n. తేజం; కళ; దృశానం; జ్యోతిర్మయం; భాతి; భర్గం;
* radiant, adj. ఉజ్వలమానమైన; భాసమానమైన; తేజోవిరాజితమైన; సముజ్వల; వికీర్ణ; కళకళలాడే; జ్యోతిర్మయమైన;
* radiate, v. i. ప్రసరించు; విరజల్లు; వ్యాపించు;
* radiation, n. వికిరణం; వికీర్ణం; జ్యోతం; ప్రభ; ప్రణితద్యుతి; భాసం; దృశానం; తేజస్సు; జ్యోతిస్సు; అర్చి; అర్చస్సు; ప్రసరణ; కిరణవ్యాప్తి; డాలు; త్విట్టు; రస్ముద్గారత;
** background radiation, ph. నేపధ్య వికిరణం; నేపధ్య వికీర్ణం;
** cosmic residual background radiation, ph. విశ్వావశిష్ట నేపధ్య వికిరణం;
** electromagnetic radiation, ph. విద్యుదయస్కాంత వికీర్ణం; విద్యుదయస్కాంత వికిరణం;
** heat radiation, ph. ఉష్ణ వికిరణం; ఉష్ణ వికీర్ణం;
** light radiation, ph. కాంతి వికిరణం; కాంతి వికీర్ణం;
* radiative transfer, n. [phy.] భాసబ్బదిలీ; భాసిత బదిలీ;
* radiator, n. ప్రభాకరి; ప్రసారిణి; తాపప్రసారిణి;
** heat radiator, ph. తాప ప్రసారిణి;
* radical, adj. (1) మౌలిక; మౌలికమైన; ప్రాథమిక; ప్రాథమికమైన; సమూల; సామూల్య; ముఖ్యమైన; సంపూర్ణమైన; (2) అసాధారణమైన; విపరీతమైన; (3) విప్లవాత్మకమైన;
** radical changes, ph. మౌలికమైన మార్పులు;
** radical leaf, ph. వేరు నుండి మొలిచే ఆకు; సామూల్య పత్రం;
** radical surgery, ph. సామూల్య శస్త్రచికిత్స;
* radical, n. (1) [chem.] రాశి; అణు సమూహం; ముఖ్యంగా ఒక ఎలక్‍ట్రాను తక్కువైన లేదా ఎక్కువైన అణుసమూహం; (2) మౌలికం; మూలానికి సంబంధించినది; (3) [math.] మూలానికి (root కి) సంబంధించినది; వర్గమూలానికి గుర్తు; (4) సంప్రదాయానికి విరుద్ధమైనది; (4) ప్రజాదరణ లేని విపరీత రాజకీయ భావం కల వ్యక్తి;
** free radical, ph. విడి రాశి; స్వేచ్ఛా రాశి; విశృంఖల రాశి;
* radicalize, v. t. ప్రజాదరణ లేని విపరీత రాజకీయ భావాలని నూరిపోయడం;
* radio, adj. (1) రేడియోకి సంబంధించిన; (2) రేడియం అనే మూలకానికి సంబంధించిన; కిరణ ప్రసార శక్తి గల; ఉత్తేజిత;
** radio carbon, ph. ఉత్తేజిత కర్బనం; (short for radioactive carbon)
* radio, n. (1) రేడియో; గగనవాణి; ఆకాశవాణి; (2) నిస్తంతి;
** radio receiver, ph. రేడియో; రేడియో తరంగ గ్రాహకి; కిరణగ్రాహకి;
* radioactive, adj. రేడియోధార్మిక; వికిరణ ఉత్తేజిత; వికీర్ణ ఉత్తేజిత; అకస్మాత్తుగా, బాహ్య శక్తుల ప్రేరేపణ లేకుండా అణుగర్భం విచ్ఛిన్నమయే లక్షణ గల;
** radioactive carbon, ph. ఉత్తేజిత కర్బనం; వికీర్ణ ఉత్తేజిత కర్బనం;
* radioactivity, n. రేడియోధార్మికత్వం; వికిరణ ఉత్తేజం; వికీర్ణ ఉత్తేజితం; కిరణ విసర్జనం; అకస్మాత్తుగా అణుగర్భం విచ్ఛిన్నమయే లక్షణం; ఈ లక్షణం రేడియం అనే మూలకంలో చూడడం తటస్థించింది కనుక దీనికి పేరు వచ్చింది. కానీ, వార్తలు వచ్చే రేడియోకీ, ఈ మాటలోని రేడియోకీ ఏమీ సంబంధం లేదు.
* radish, n. ముల్లంగి;
* Radium, n. రేడియం; రదం; కిరణం; ఒక రసాయన మూలకం; (అణు సంఖ్య 88, సంక్షిప్త నామం, Ra); [Lat. radius = ray];
* radius, n. (1) వ్యాసార్థం; కర్కటం; (2) రత్ని; బాహ్య ప్రకోష్టిక; త్రిజ్య; ముంజేతిలో ఒక ఎముక;
** radius vector, ph. సృతి; కేంద్రం నుండి పరిధి వైపు గీసిన గీత; కిరణరేఖ;
* radix, n. [math.] అంశ; మూలం; base;
** radix point, ph. అంశ బిందువు; మూల బిందువు;
** radix eight, ph. అష్టాంశ;
** radix sixteen, ph. షోడశాంశ;
** radix ten, ph. దశాంశ;
** radix two, ph. ద్వియాంశ;
* Radon, n. రాడాన్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 86, సంక్షిప్త నామం, Rn);
* raft, n. బల్లకట్టు; కట్టుమాను; తెప్ప; దోనె; తారకం;
** raft made of skin, ph. అరిగోలు; హరిగోలు; పుట్టి;
* rafter, n. (1) వాసం; సరంబి; త్రావి; కప్పుకి వేసే దూలం; (2) దంతె; అడ్డుగా వేసే పట్టె;
* rag, n. చింకి గుడ్డ; గుడ్డ పేలిక;
* raga, n. రాగం; సప్త స్వరముల సమ్మేళనం; స్వరములు ఏడే అయినా వాటి నుండి పుట్టే రాగాలు ఎన్నో ఉన్నాయి; స, రి, గ, మ, ప, ద, ని, స అనే స్వరములని ఎన్నో విధాలుగా సమ్మిశ్రమం చేసి రాగాలు పుట్టించవచ్చు; 5 స్వరాలు, 6 స్వరాలు, 7 స్వరాలు మాత్రమే వాడి రాగాలు పుట్టించవచ్చు; ఆరోహణంలో కొన్ని స్వరాలని, అవరోహణంలో మరికొన్ని స్వరాలని కూడ వాడవచ్చు; సర్వసాధారణంగా ఒక రాగంలో కనీసం 5 స్వరాలైనా ఉంటాయి; ప్రతి రాగంలోను స ఉండి తీరుతుంది. ప్రతి రాగంలో కనీసం మ కాని ప కాని ఉండాలి; రెండూ ఉండవచ్చు;
* rage, n. కోపోద్రేకం; ఆగ్రహం; ఉగ్రత;
* ragi, n. pl. రాగులు; చోళ్లు, [bot.] Eleusine coracana;
* rags, n. చిరిగిన బట్టలు; చింపిరి బట్టలు; జీర్ణవములు; గుడ్డ పేలికలు;
* raid, n. దాడి;
* raid, v. t. దాడిచేయు; దండెత్తు; మోహరించు;
* rail, n. (1) పట్టా; కమ్మి; గ్రాది; (2) రైలు; రైలు బండి; కమ్మిబండి;
* railings, n. కటకటాలు;
* railroad, n. రైలుకట్ట; రైలుమార్గం; ఇనుపదారి;
* railway, n. రైలుమార్గం; అమోమార్గం;
** railway line, ph. ఇనుపదారి; రైలుమార్గం; అయోమార్గం;
** railway tracks, ph. రైలు పట్టాలు;
** railway train, ph. రైలు బండి;
** railway station, ph. రైలు స్థావరం;
* rain, v. i. కురిపించు;
* rain, n. వాన; వర్షం; వృష్టి;
** continuous rain, ph. జిలుగు వాన;
** torrential rain, ph. జడి వాన; కుంభవృష్టి;
** rain drops, ph. చినుకులు;
** rain gauge, ph. వర్షమితి; వర్షమాపకం; వానమితి;
* rainbow, n. ఇంద్రధనుస్సు; అరివిల్లు; వానవెల్లి; సురచాపం; హరిచాపం; (ety.) అరి అంటే చివర అని అర్థం. అరివిల్లు అంటే ఆకాశం చివర కనిపించేది అని కాని వాన చివర కనిపించేదని కాని అర్థం;
* rainfall, n. వర్షపాతం; వానౙల్లు;
* rainforest, n. వర్షారణ్యం;
** tropical rainforest, ph. ఉష్ణమండల వర్షారణ్యం;
* rainstorm, n. గాలివాన; ఝంఝం;
* raise, n. పెరుగుదల; పెంపు; జీతంలో పెరుగుదల;
* raise, v. t. (1) ఎత్తు; లేపు; లేవనెత్తు; పైకి ఎత్తు; (2) పెంచు; వర్థిల్లజేయు;
* raisins, n. కిస్‌మిస్ పళ్లు; గింజలులేని ఎండిన ద్రాక్షపళ్లు; సా. శ. పూ 2000 నుండీ ఈ పండ్ల గురించి మానవులకి తెలుసు;
* raising, n. పెంపకం;
* rake, n. (1) దంతెన; పళ్ళకర్ర; పండ్లకోల; గడ్డిని కాని మట్టిని కాని తిరగెయ్యడానికి వాడే పళ్ళకర్ర; (2) మలారం; వీధులని తుడవడానికి, ఆకులని కుప్పలా వెయ్యడానికి వాడే పళ్ళ చీపురు;
* rally, n. (1) బహిరంగ సమావేశం; (2) కారులతో వీథుల మీద వేసే పరుగు పందెం;
* rally, v. i. పుంజుకొను;
* rally, v. t. సమావేసపరచు;
* ram, n. పొట్టేలు; గొర్రెపోతు; తగరు; హుడు; ఉరణం;
* ram, v. t. గుద్దు; బలంగా పొడుచు;
* rambunctious, adj. పెంకి; అల్లరి;
* ramp, n. తొంగలి; నతిగతి; తటం; వాలుబల్ల; వాలువీధి;
* rampart, n. ప్రాకారం; కోట బురుజు; కొత్తళం; అలంగము;
* rancid, adj. కుళ్లిన; కంపుకొట్టే; కొవ్వు పదార్థాలు ఆమ్లజని సమక్షంలో ఆక్షీకరణ చెంది పాడవడం వలన వచ్చే చెడ్డ వాసనతో కూడిన;
* random, adj. క్రమరహిత; అనిర్ధిష్ట; తకపిక; యాధృచ్ఛిక;
** random access, ph. [comput.] అనిర్ధిష్ట ప్రవేశం;
* range, n. (1) మేర; వ్యాప్తి; (2) పంక్తి; వరుస; శ్రేణి; (3) పొయ్యి; గాడి పొయ్యి;
** mountain range, ph. పర్వత పంక్తి;
** range finder, ph. ఒక స్థలం నుండి గమ్యానికీ ఉండే దూరాన్ని కొలిచి చెప్పే సాధనం;
* ranger, n. అడవుల మీద ప్రభుత్వం వారి అధికారి; అరణ్య పాలకుడు;
* Rangoon creeper, n. గౌరీమనోహరి పూవు; రాధామనోహరి పూవు; [bot.] ''Combretum indicum'';
* rank, n. (1) తరగతి; అంతస్తు; పదవి; హోదా; శ్రేణి; కోటి; (2) చతురంగంలో అడ్డు వరుస;
** first rank, ph. ప్రథమ శ్రేణి;
* rank and file, ph. పిన్న, పెద్ద; అధికారులుకాని సిబ్బంది; పనివారు;
* rank, v. t. శ్రేణీకరించు; వరుసక్రమంలో పెట్టు;
* ranking, n. శ్రేణీకరణ;
* ransack, v. t. గాలించి వెదకు; మూలమూలలా వెదకు; చిందరవందర చేయు;
* ransom, n. బంధవిమోచన ధనం; విడుదల కొరకు చెల్లించే డబ్బు;
* rant, v. t. తిట్టు; నిందించు; కూతలు కూయు;
** rants and raves, ph. నిందలు, అభినందనలు;
* rap, v. t. దబదబా కొట్టు; తలుపు దబదబా కొట్టు; తలుపుని టకటకా కొట్టు;
* rape, n. మానభంగం;
* rape, v. t. మానభంగం చేయు; చెరుచు;
* rapeseed, n. సరసు; కనోలా; [bot.] Brassica napus;
* rapid, adj. తొందరగా; త్వరగా; వేగం; అవిలంబన; ఆశు;
** rapid poetry, ph. ఆశు కవిత్వం;
* rapid, n. ఝరి; ఉరకలు వేసే కొండ కాలువ;
* raptor, n. వేటాడే పక్షి; ఉదాహరణకి [[గద్ద]], డేగ, సాళువ, గూళి, మొదలైనవి.
* rapture, n. (1) మహదానందం; ఆనందం; తన్మయత్వం; (2) నిర్వాణం;
* rapport, n. (రపోర్) సన్నిహితత్వం; సామరస్యం; సౌహార్దత; a relationship characterized by agreement, mutual understanding, or empathy that makes communication possible or easy;
* rare, adj. (1) అపురూపమైన; విలువైన; (2) అరుదైన; సామాన్యంగా దొరకని; విరళ; దుర్లభం; సకృత్తు; (3) పూర్తిగా పచనం కాని; బాగా కాలని; పచ్చి పచ్చి;
** rare gases, ph. విరళ వాయువులు; helium (He); neon (Ne); argon (Ar); krypton (Kr); xenon (Xe); radon (Rn);
** rare thing, ph. తాయం; తాయిలం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''USAGE NOTE: rare, scarce
* Use ''rare'' to talk about something that is valuable but is not in abundance: Stamps and coins of the British era are rare. Use ''scarce'' to talk about something that is not available in abundance at a particular time: In 2002 water became very scarce throughout Southern India.'''
|}
*
* rare-earth elements, ph. విరళ మృత్తిక మూలకాలు; అణు సంఖ్య 57 లగాయతు 71 వరకు గల రసాయన మూలకాలు; ఇవి అరుదైన (విరళ) మూలకాలు కాదు కాని ఆ పేరు అలా స్థిరపడిపోయింది;
* rarefaction, n. విరళీకరణం;
* rarely, adv. అరుదుగా; కదాచిత్తుగా; సకృత్తుగా; అప్పుడప్పుడు; ఎప్పుడో ఒకప్పుడు;
* rascal, n. తుంటరి;
* rash, adj. తొందరపాటుతనం; దుడుకైన;
* rash, n. చర్మం కందినట్లవడం; పేత పొక్కుల వంటి పొక్కులు; పేత;
* rasp, n. ఆకురాయి;
* raspberry, n. కోరింద పండు; రసనక్కెరల;
* raspy, adj. గరుగ్గా ఉండు; గరగరలాడు;
* rat, n. ఎలుక; మూషికం; 20-40 సెంటీమీటర్లు పొడుగు, చిన్న చెవులు ఉంటాయి;
* rate, n. (1) దల; చొప్పు; తరబడి; ఏసి; రేటు; (2) ధర; (3) ప్రమాణము; నిష్పత్తి;
** rate of change, ph. మార్పుదల; మార్పేసి;
* ratification, n. అంగీకారం; సమ్మతి; ధ్రువపరచడం; ధ్రువీకరణ; ఆమోదం;
* ratify, v. t. ఆమోదించు; స్థిరపరచు; ధ్రువపరచు; నిశ్చయించు;
* rating, v. t. విలువని నిర్ణయించు;
* ratio, n. నిష్పత్తి; రెండు సంఖ్యల మధ్యనున్న ఒక రకమైన గణిత సంబంధం;
** direct ratio, ph. అనులోమ నిష్పత్తి;
** inverse ratio, ph. విలోమ నిష్పత్తి;
* rational, adj. (రేషనల్) (1) హేతుబద్ధమైన; వివేచనాత్మక; తర్కబద్ధ; యుక్తియుక్తమైన; (2) నిష్పత్తిలా రాయగల; కరణీయ;
** rational number, ph. నిష్పసంఖ్య; మూలక సంఖ్య; అకరణీయ సంఖ్య;
* rationale, n. (రేషనేల్) సోపపత్తిక వివరణం; కారణ వివరణం; సమర్ధించదగ్గ కారణం;
* rationalism, n. హేతువాదం; కారణవాదం; రెనే డెకా, స్పినోజా, గలెలియా, కాంట్, మొదలైన వారి సిద్ధాంతాలకి పునాదిగా అలరారిన వాదం;
* rattan, n. పేపబెత్తం; పేము;
* rattle, n. (1) గిలక; పసిపిల్లలు ఆడుకొనే ఒక ఆటవస్తువు; (2) ఆఘాటం;
* rattle, v. ఆఘాటించు;
* rattlesnake, n. గిలకపాము; ఆఘాట సర్పం; ఉత్తర అమెరికా నైరుతి ఎడారులలో విరివిగా కనిపించే ఒక విషసర్పం; ఈ పాము తోక గిలకలా చప్పుడు చేస్తుంది;
* Rauwolfia serpentina, n. సర్పగంధి;
* rave, v. t. పొగుడు; అభినందించు;
* raven, n. కృష్ణశకుని; ద్రోణకాకం; అసురకాకోలం; ఇది ఎక్కువ ఆస్ట్రేలియా, ఆఫ్రికా, యూరోపు, అమెరికా దేశాల్లో కనపడుతుంది. భారతదేశంలో హిమాలయాల్లో కూడా ఉంది. పరిమాణంలో పెద్దది. దీని శరీరం అంతా నల్లటి నలుపే; పెద్ద రెక్కలు ఉండటం, పరిమాణంలో కుడా పెద్దది అవటం మూలాన గుర్తు పట్టడం సులభం; [bio.] corvus corax; (see also) మాలకాకి; బొంతకాకి;
* ravine, n. (రెవీన్) లోతైన లోయ; కోన; కనుమ;
* raw, adj. (1) పచ్చి; పండని; కసరు; (2) అపక్వపు; ఉడకని; (3) ముడి; ముతక; కోరా; చలువ చేయని;
** raw fruits, ph. పచ్చి కాయలు; కసరు కాయలు;
** raw materials, ph. ముడి పదార్థములు; ముడి సరుకులు;
** raw silk, ph. ముడి పట్టు;
** raw sugar, ph. ముడి చక్కెర; ముతక పంచదార;
* ray, n. (1) కిరణం; అంశువు; మయూఖం; (2) ఒక జాతి చేప; టెంకి చేప; టెంకి;
** ray of light, ph. కాంతి కిరణం; మరీచి; అంశువు; త్విట్టు;
** ray of sunlight, ph. తరణి కిరణ వారం;
* rays, n. కిరణాలు;
** collection of rays, ph. కిరణజాలం; అంశుజాలం;
** pencil of rays, ph. కిరణపుంజం; కిరణశలాకం;
* raze, v. t. నేలమట్టం చేయు;
* razor, n. అసి; మంగలి కత్తి; క్షురిక;
* razor blade, n. క్షురిక;
* razor's edge, n. అసిధార;
* reach, v. i. చేరు; పొందు; అందుకొను;
* react, v. t. ప్రతిస్పందించు;
* reaction, n. (1) ప్రతిస్పందన; ప్రతిచర్య; చర్య; ప్రతీకార శక్తి; ఇది ప్రతీకారాన్ని పోలి ఉంటుంది. ఒకరు మనకు నచ్చని మాటంటే వెంటనే మాటకు మాట సమాధానం ఇవ్వడం రియాక్ట్ అవటం.(2) ప్రక్రియ; అభిక్రియ;
** chain reaction, ph. శృంఖల ప్రక్రియ; శృంఖలా క్రియ; శృంఖలిత చర్య;
** chemical reaction, ph. రసాయన ప్రక్రియ; రసాయన అభిక్రియ;
** combination reaction, ph. సంయోగ ప్రక్రియ; రెండు రసాయనాల కలయిక వల్ల ఒకే రసాయనం పుట్టడం;
** decomposition reaction, ph. వియోగ ప్రక్రియ; ఒక రసాయనం రెండింటిగా విడిపోవడం;
** displacement reaction, ph. స్థానభ్రంశ ప్రక్రియ;
** double reaction, ph. జంట ప్రక్రియ; తారుమారు ప్రక్రియ;
** immune reaction, ph. రక్షక ప్రతిస్పందన;
** redox reaction, ph. ??
** vital reaction, ph. జీవన ప్రతీకార శక్తి;
* reactionary, n. మార్క్స్ సిద్ధాంతంలో ప్రగతి నిరోధక వాది;
* reactionary, adj. అభివృద్ధి నిరోధక; సామాజిక; రాజకీయ మార్పులకి విముఖత చూపే;
* reactivity, n. ప్రతిచర్యాశీలత; చర్యాశీలత;
* reactor, n. క్రియాకలశం; ప్రక్రియ కలశం;
** atomic reactor, ph. అణు క్రియాకలశం;
* read, v. i. (రీడ్) చదువు;
* read, v. t. (రీడ్) చదువు; పఠించు; నేర్చుకొను;
* readers, n. pl. (1) చదువరులు; పాఠకులు; వాచకులు; (2) చదివే పుస్తకాలు;
* reading, n. విలోకనాంకం; కొలత కొలవగా వచ్చిన సంఖ్య; ఉపలక్షణం;
* readiness, n. సంసిద్ధత; సన్నద్ధత;
* ready, n. తయారు; సిద్ధం; సంసిద్ధం; ఆయత్తము; సమాయత్తము;
** ready to use, ph. సిద్ధాన్నం;
* readymade, adv. సైకట్టుగా;
* reagent, n. కారకి; కారకం; ఒక రసాయనిక ద్రవ్యమందు మార్పుతేగల ఇంకొక రాసాయనిక ద్రవ్యము;
* real, adj. నిజమైన; వాస్తవమైన; సత్యమైన; సహజమైన; యదార్థమైన; (ant.) false; imaginary;
** real variable, ph. [math.] నిజ చలనరాసి; వాస్తవ చలరాసి;
* realism, n. స్వభావోక్తి; వాస్తవికత; వాస్తవికతావాదం; వాస్తవవాదం; ఇంద్రియములకు గోచరమైనదే వాస్తవమైనది అను మతము; అనగా, స్థావరజంగమాత్మకమైన భౌతిక ప్రపంచం యొక్క ఉనికికి పరిశీలనశీలి (observer) తో నిమిత్తం లేదు. అనగా, బల్ల మీద పెట్టిన పండు మనం చూసినా, చూడకపోయినా అక్కడ బల్ల మీదనే ఉంటుంది. అడవిలో చెట్టు కూలినప్పుడు అక్కడ వినడానికి ఒక జీవి ఉన్నా, లేకపోయినా పడుతూన్న చెట్టు చప్పుడు చేస్తుంది. the doctrine that the objects perceived are real; Realism is the view that a "reality" of material objects, and possibly of abstract concepts, exists in an external world independently of our minds and perceptions; see also idealism;
** literary realism, ph. సాహిత్య వాస్తవవాదం;
** philosophical realism, ph. తాత్త్విక వాస్తవవాదం;
** theoretical realism, ph. సైద్ధాంతిక వాస్తవవాదం;
* realist, n. వాస్తవవాది; వాస్తవికవాది;
* reality, n. నైజం; వాస్తవికత; సత్యం;
* realize, v. i. గ్రహించు; గుర్తించు;
* realize, v. t. పొందు; రాబట్టు; సాధించు;
* really!, inter. నిజంగా;
* realm, n. రంగం; రాజ్యం; ప్రపంచం; హయాం;
* ream, n. కాగితాల పరిమాణం; ఇరవై దస్తాలు;
* reap, v. t. (1) కోయు; పంటని కోయు; (2) అనుభవించు;
* rear, v. t. పెంచు; పోషించు;
* rear, n. వెనుక భాగం;
* rearguard, n. దుమ్‌దారు;
* rearrangement, n. పునరమరిక;
* reason, n. కారణం; హేతువు;
* reason, v. t. నచ్చజెప్పు; తర్కించు; వాదించు;
* reasonable, adj. సబబైన; తగిన; సమంజస; హేతుపూర్వక; న్యాయమైన;
** reasonable doubt, ph. సబబైన అనుమానం; రాదగిన అనుమానం;
** reasonable opportunity, ph. తగిన అవకాశం;
** reasonable to believe, ph. నమ్మదగిన కారణం;
* reasoning, n. వాదం; వాదసరళి; హేతువాదం; అనుమానం; అవమర్షం; తర్కించడం;
* rebate, n. ముజారా; ముదరా; ధరలో తగ్గింపు; వస్తువు కొన్న తర్వాత వ్యాపారి తిరిగి ఇచ్చే పైకం;
* rebel, n. తిరుగుబాటుదారు;
* rebellion, n. తిరుగుబాటు; పితూరీ;
* rebuke, n. తిట్టు; నిందావాచకం;
* rebuke, v. t. తిట్టు; చివాట్లుపెట్టు; కోప్పడు;
* rebut, v. t. పూర్వపక్షం చేయు;
* recalcitrant, adj. మొండి;
* recall, v. t. (1) వెనుకకు పిలచు; అమ్మకానికి పెట్టిన సరకులని వెనుకకు పిలచు; రద్దు చేయు; (2) జ్ఞాపకం తెచ్చుకొను;
* recapitulate, v. t. పునశ్చరణ చేయు; జ్ఞప్తికి తెచ్చు; క్రోడీకరించు;
* receipt, n. రసీదు; చెల్లుపత్రం; చలానా;
** receipt of payment to the treasury, ph. చలానా;
* receivables, n. రావలసినవి; రాబడులు;
* receive, v. t. అందుకొను; గ్రహించు; పుచ్చుకొను;
** receive into custody, ph. అందుకొను; కైవశం చేసుకొను;
* receiver, n. గ్రాహకం; గ్రాహకి; గ్రహీత; గ్రాహకుడు; గ్రాహి;
* recension, n. శాఖ; పరిష్కృత గ్రంథం; పాఠాంతరం;
* recent, adj.ఇటీవలి; అర్వాచీన; ఆధునిక; తాజా;
* recently, adv. ఈమధ్య; మొన్నమొన్న;
** very recently, ph. మొన్ననీమధ్య; మొన్నమొన్న; ఇటీవల;
* receptacle, n. గ్రాహకి; మరొక వస్తువుని తనలోకి తీసుకొనేది;
* reception, n. ఎదురు సన్నాహం; స్వాగతం; సన్మానం; ఉద్గ్రాహం
* receptor, n. గ్రాహకి;
** sense receptor, ph. ఇంద్రియ గ్రాహకి; జ్ఞానేంద్రియ గ్రాహకి;
** touch receptor, ph. స్పర్శ గ్రాహకి;
* recess, n. (1) మారుమూల; వెనకకి జరిగి ఉన్న; గూడు; (2) పాఠశాలకి వచ్చు శలవు కాలం;
* recessive, adj. తిరోగమన; అంతర్గత;
* recession, n. వాణిజ్యమాంద్యం; ఆర్ధికమాంద్యం; తగ్గుదల; a recession is a general decline in a country’s production of goods and services, measured usually as two consecutive quarters of shrinking growth; see also depression, bear market;
* recharge basins, ph. pl. ఇంకుడు గుంటలు; భూజల మట్టం అడుగుకి దిగిపోకుండా ఉపరితలపు జలాన్ని భూమిలోకి ఇంకడానికి తవ్విన గుంటలు;
* recidivism, n. నిత్యాపరాధం; పాత అలవాటు ప్రకారం అపరాధం చెయ్యడం;
* recipe, n. (రిసపీ) ఉపాయం; వంటకాలని చేసే పద్ధతి; పచన యోగం; ఔషధ యోగం;
* recipient, n. గ్రహీత;
* reciprocal, adj. (1) అన్యోన్యమైన; పరస్పర; ఇచ్చి పుచ్చుకొనే; అనుగుణ; (2) తిరగబెట్టిన; తిరగబడ్డ; (3) విలోమ;
** reciprocal arrangements, ph. పరస్పరమైన ఏర్పాట్లు;
** reciprocal causes, ph. అన్యోన్యమైన కారణాలు; పరస్పరమైన కారణాలు;
** reciprocal fraction, ph. తిరగబడ్డ భిన్నం; విలోమ భిన్నం;
** reciprocal promises, ph. పరస్పరమైన వాగ్దానాలు;
* reciprocal, n. విలోమాంకం;
* reciprocate, v. t. ఇచ్చిపుచ్చుకొను;
* reciprocity, n. ఆదాన ప్రదానం; అదలు బదులు; అన్యోన్యత;
* recitation, n. పఠన; పారాయణ;
* recital, n. (1) అప్పగింత; (2) సంగీత కచేరీ;
* recite, v. t. అప్పచెప్పు; వల్లించు;
* reckon, v. t. పరిగణించు; లెక్కించు; అభిప్రాయపడు;
* reclamation, n. పునరుద్ధరణ;
* recline, v. i. వాలు; ఒరుగు; ఆనుకొను;
* recluse, n. ఏకాంగి; ఏకాకి; ఒంటరి; కోరి ఒంటరిగా జీవించే వ్యక్తి;
* recollection, n. యాది; జ్ఞాపకం;
* recognition, n. (1) గుర్తింపు; ప్రతిపత్తి; అభిజ్ఞానం; (2) పోలిక;
* recognize, v. i. గుర్తించు; పోల్చు; పోలిక పట్టు;
* recollect, v. i. జ్ఞాపకం తెచ్చుకొను; స్మరణకి తెచ్చుకొను;
* recollection, n. జ్ఞాపకం; స్మరణం;
* recommendation, n. సిఫార్సు; ప్రశంశ;
* recompense, n. పాపపరిహారం; చెల్లుకి చెల్లు;
* reconcile, v. i. రాజీపడు; సమాధానపడు; సమన్వయపడు;
* reconcile, v. t. సఖ్యపరచు; పునర్ ఘటించు; సమన్వయం చేయు;
* reconciliation, n.రాజీ; సయోధ్య;
* reconstruction, n. పునర్మిర్మాణం; పునరుద్ధరణ;
* record, n. (రెకర్డ్) కవిలె; కవిలెకట్ట; దస్తావేజు; పుస్తకం;
* record, v. t. (రికార్డ్) నమోదు చేయు; రికార్డ్ చేయు;
* recorder, n. లేఖరి; కాయస్థుడు; ముద్రాపకం; రికార్డరు;
** sound recorder, ph. శబ్ద ముద్రాపకం; ధ్వని ముద్రాపకం;
* recording, n. గ్రహణం;
** photo recording, ph. ఛాయాగ్రహణం;
** sound recording, ph. శబ్దగ్రహణం; ధ్వని ముద్ర్రణ;
* recover, v. i. (1) కోలుకొను; తేరుకొను; తెప్పరిల్లు; (2) సంగ్రహించు; రాబట్టు;
* re-creation, n. ప్రతిసృష్టి;
* recreation, n. కాలక్షేపం; వ్యాపకం;
* recruiter, n. నియోక్త;
* recruitment, n. లావణం; నియామకం; కొల్గారం;
** recruitment officer, ph. కోల్కాడు; నియామకుడు;
* rectal, adj. పురీష;
* rectangle, n. దీర్ఘచతురస్రం; రెండు జతల ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉండి, నాలుగు సమ కోణాలు ఉన్న చతుర్భుజం;
* rectangular, adj. దీర్ఘచతురస్రాకార;
* rectification, n. దిద్దుబాటు; సరిచేయుట; సవరించుట; చక్కబెట్టుట;
* rectified, adj. చక్కబడ్డ; దిద్దబడ్డ;
* rectifier, n. దిద్దరి; పరిష్కర్త; సరిచేరి; సరిచేయునది;
* rectify, v. t. దిద్దు; సరిచేయు; సరిదిద్దు; సవరించు; చక్కబెట్టు;
* rectum, n. పురీషనాళం; మలాశయం;
* recurring, adj. పునరావృత; ఆవర్తక; తిరిగివచ్చు;
** recurring decimal point, ph. పునరావృత దశాంశ బిందువు;
* recursive, adj. పునరావృత్తంగా;
** recursive process, ph. పునరావృత్త ప్రక్రియ;
* recycle, n. పునరావృత్తం; పునర్వినిమయం; పునరోపయోగం; ఒకసారి వాడి పారెయ్యకుండా మళ్లా వాడడం;
* red, adj. ఎర్రనైన; అరుణ; పింగళ; జేగురు;
** red corpuscles, ph. ఎర్ర కణములు;
** red frangipani, ph. దేవగన్నేరు పూవు; [bot.] ''Plumeria rubra'';
** red giant, ph. అరుణ మహాతార;
** red oxide of lead, ph. గంగ సింధూరం;
** red oxide of mercury, ph. రస సింధూరం;
** Red sorella, ph. పుల్ల గోంగూర;
* redhead, n. m. రాగితలవాడు; f. రాగితలది; రాగిరంగు జుత్తు గల మనిషి; (rel.) blond; brunette;
* red, n. ఎరుపు; కెంపు; తొగరు; కెంజాయ;
** saffron red, ph. చెంగావి;
* redact, v. t. పరిష్కరించు;
* redden, v. i. ఎర్రబడు; కందు; కమలు; తొగరించు; రంజిల్లు; జేవురించు;
* red-eye, n. (1) జేవురుగన్ను; (2) [idiom] రాత్రల్లా చేసే ప్రయాణం;
* redeem, v. t. విమోచన చేయు; విలువని రాబట్టు;
* redemption, n. విమోచన; విడుదల; విలువను రాబట్టడం;
* redness, n. ఎరుపు; రక్తిమ; జేగురు;
* redolent, adj. ఘుమఘుమలాడే; మంచి లేక ఘాటైన వాసనతో కూడిన;
* redoubled, adj. ద్విగుణీకృతమైన;
* redox, adj. రసాయన సంయోగ ప్రక్రియలో ఆమ్లజనిని ఎక్కువ చెయ్యడం (కలపడం)ఉదజనిని తక్కువ చెయ్యడం (తీసివేయ్యడం) ఒకేసారి జరగడం;
** redox reaction, ph. రసాయన ప్రక్రియలో ఆమ్లజనిని ఎక్కువ చెయ్యడం (కలపడం),ఉదజనిని తక్కువ చెయ్యడం (తీసివేయ్యడం) ఒకేసారి జరగిన సందర్భం; ఉదా: CuO + H<sub>2</sub> --> Cu + H<sub>2</sub>O;
* redress, v. t. దిద్దు; సరిదిద్దు; నష్టం భర్తీ చేయు;
* reduce, v. t. తగ్గించు; కోయు; హరించు; సంగ్రహించు;
* reduced, adj. తగ్గింపు; క్షయీకృత;
* reduced prices, ph. తగ్గింపు ధరలు;
* reducing, adj. క్షయకరణ;
** reducing agent, ph. ఆమ్లక్షయకరణి; ఆమ్లజని హారిణి; ఆమ్లజనిని హరించునది;
* reductio ad absurdum, ph. అనిష్టాపత్తి; అభిషవ శశవిషాణం; అభిషవం అంటే మరగ బెట్టడం. శశవిషాణం అంటే కుందేటి కొమ్ము. కనుక దిగమరిగించి కుందేటి కొమ్ముని సాధించడం అన్నమాట. తర్కశాస్త్రంలో ఒక ప్రవచనాన్ని రుజువు చెయ్యవలసి వచ్చినప్పుడు, సదరు ప్రవచనానికి విరుద్ధమైన ప్రవచనంతో మొదలుపెట్టి, దానిని మర్ధించి, మర్ధించి చివరికి ఆ విరుద్ధ ప్రవచనం అసాధ్యం అని రుజువు చెయ్యడం; తార్కిక గణితంలో ఈ రుజువు పద్ధతి ఎక్కువ ప్రచారంలో ఉన్న పద్ధతులలో ఒకటి; అర్ధప్రసంగం;
* reduction, n. (1) తగ్గింపు; కోత; (2) [chem.] క్షయీకరణం; ఆమ్లజని వాటాని తగ్గించడం; ఆమ్లజనిని తొలగించడం; ఉదజనీకరణ; ఉదజని వాటాని పెంచడం; (ant.) oxidation;
* redundant, n. రెండోసారి; చర్విత చర్వణం; దుబారా; అధికం; అనావశ్యకం;
* reed, n. రెల్లు;
* reef, n. సముద్రంలో మెరక ప్రదేశాలు;
** coral reef, ph. పగడపుదిబ్బ;
* reel, n. చుట్ట; రీలు;
* reel, v. i. తిరుగు;
* reel, v. t. తిప్పు;
* re-establish, v. t. పునర్ ప్రతిష్ట చేయు;
* reference, n. (1) ప్రసక్తి; అనూకాశం; (2) ఉపప్రమాణం;
** bibliographic reference, ph. ఆకరం; ఉపప్రమాణం;
* refine, v. t. శుద్ధిచేయు; శుభ్రపరచు;
* refined, adj. శుద్ధిచేయబడ్డ; చక్కీ;
** refined oil, ph. చక్కీ నూనె; చక్కీ తైలం;
** refined sugar, ph. చక్కీ చక్కెర; చక్కీ పంచదార;
* refinery, n. శుద్ధిచేసే కర్మాగారం;
* oil refinery, ph. నూనె శుద్ధికర్మాగారం;
* sugar refinery, చక్కెర శుద్ధికర్మాగారం;
* reflect, v. t. (1) ప్రతిబింబించు; (2) వితర్కించు;
* reflection, n. (1) పరావర్తనం; వెనకకి మళ్ళడం; (2) ప్రతిబింబం; ప్రతికృతి; అభివ్యక్తి; (3) మీమాంస; తార్కికంగా ఆలోచించడం;
** angle of reflection, ph. పరావర్తన కోణం;
** total internal reflection , ph. సంపూర్ణాంతర పరావర్తనం; ఎండమావి ఏర్పడినప్పుడు ఇటువంటి పరావర్తనమే జరుగుతుంది;
* reflector, n. పరావర్తకం; దర్పణం; అద్దం;
* reflex, adj. ప్రతివర్తిత; ప్రతీకార;
** reflex action, ph. ప్రతీకార చర్య; అనిచ్ఛా ప్రవర్తన;
* reflex, n. ప్రతివర్తిత; ప్రతీకార చర్య;
** conditioned reflex, ph. నియమబద్ధ ప్రతీకార చర్య;
** involuntary reflex, ph. అసంకల్ప ప్రతీకార చర్య;
* reflexes, n. ప్రతివర్తితలు; ప్రతీకార చర్యలు;
* reflexive, n. ఆత్మార్థకం;
* reform, n. సంస్కరణ; దిద్దుబాటు;
* reform, v. t. సంస్కరించు; దిద్దు; చక్కబెట్టు;
* reformer, n. సంస్కర్త; దిద్దరి;
* refracted, adj. వక్రీభవన; వక్రీభూతమైన; వక్రీభవనమైన;
* refraction, n. వక్రీభవనం; వంకర కావడం;
** angle of refraction, ph. వక్రీభవన కోణం;
** coefficient of refraction, ph. వక్రీభవన గుణకం;
** index of refraction, ph. వక్రీభవన గుణకం; వక్రీభవన సూచకి; వక్రీభవన తర్జని;
* refractoriness, n. మొండితనం; దుర్గలనీయత; రాపిడిలో పుట్టిన వేడిని తట్టుకో గలిగే స్థోమత;
* refractory, adj. మొండి;
** refractory child, ph. మొండి పిల్లాడు; మొండి పిల్ల; మొండి ఘటం;
** refractory substance, ph. ఎంతో వేడికి కాని కరగని పదార్థం;
* refrain, n. పల్లవి; పాటలో మొదటి చరణం; వంతపాట; పునరావర్తన;
* refreshment, n. ఉపాహారం; శ్రాంతి; శ్రాంతి పానీయం;
* refrigerant, n. శిశిరోపద్రవ్యం; శిశిరోపద్రవం;
* refrigeration, n. శిశిరోపచారం; శీతలీకరణ;
* refrigerator, n. శిశిరోపచారి; శీతలీకరణి; హిమకరి; మంచుబీరువా; చలిమర;
* refuge, n. శరణం; శరణాలయం; ఆశ్రయం; ఏడుగడ;
** wildlife refuge, ph. వన్యజీవ శరణాలయం; వన్యమృగ శరణాలయం;
* refugees, n. కాందిశీకులు; శరణాగతులు;
* refund, n. వాపసు; ముజరా;
* refusal, n. అసమ్మతి; నిరాకరణం; తిరస్కారం; నిరసన; ఉపాలంభం;
* refuse, n. (1) చెత్త; పెంట; (2) పిప్పి; పిప్పిరి;
* refuse, v. t. నిరాకరించు; తిరస్కరించు;
* refute, v. t. పూర్వపక్షం చేయు;
* regard, v. t. పరిగణించు;
* regard, n. గౌరవం; అనూకాశం;
* regeneration, n. పునర్జాతం; see also reproduction;
* regent, n. ప్రభుత్వ ప్రతినిధి; వకీలు;
* regime, n. పరిపాలన; పాలన; హయాం; ఏలుబడి;
* regiment, n. దళం; సైనిక దళం;
* region, n. ప్రాంతం; ప్రదేశం;
* regional, adj. ప్రాంతీయ;
* register, n. (1) [comp.] పల్టీపేరు; (2) పద్దుపుస్తకం; పట్టిక; కవిలె; దండకవిలె;
** mask register, ph. ప్రచ్ఛాదక పల్టీపేరు;
* register, v. t. నమోదు చేయు;
* registration, n. నమోదు చెయ్యడం; గ్రంథస్థం చెయ్యడం;
* regression, n. విగతి; విగతిపథం; అపకర్షకం;
** infinite regression, ph. అనంత అపకర్షకం; కౌపీన సంరక్షణార్థ న్యాయం;
** linear regression, ph. సరళ విగతిపథం;
* regressive, adj. తిరోగమన; అధోగమన; అపకర్షక;
* regret, n. విచారము; ఖేదం;
* regret, v. i. చింతించు; విచారించు; ఖేదపడు; పస్తాయించు;
* regular, adj. క్రమ; సమ; సాధారణ; నియతమైన; నియమానుసార; అనుస్యూత;
** regular hexagon, ph. క్రమ షడ్భుజి; ఆరు భుజాల పొడుగు సమానంగా ఉన్న షడ్భుజి;
** regular solids, ph. [math.] సక్రమ ఘన రూపాలు;
** at regular intervals, ph. నియతికాలికంగా;
* regularity, n. సక్రమత; అలవాటు;
* regularization, n. క్రమబద్ధీకరణ;
* regularly, adv. వతనుగా; క్రమవశాత్తూ; అలవాటు ప్రకారం; నియమానుసారంగా; నియతంగా; సాధారణంగా; నియతికాలికంగా; యథావిధిగా;
* regulation, n. కట్టుబాటు; నిబంధన; నియంత్రణ; నియతి;
* regulations, n. కట్టుబాట్లు; నిబంధనలు; నియమావళి; ప్రభుత్వ పద్ధతులు; చట్టములు; శాసనములు; వ్యవస్థాపనలు;
* regulator, n. వ్యవస్థాపకి; నియంత్రకం;
* Regulus, n. మఘ; మఖ; సింహ రాసిలో మొదటి నక్షత్రం;
* rehabilitation, n. పునరావాసం;
* rehearsal, n. ఒద్దిక; పూర్వప్రయోగం; పూర్వనటనం;
* reign, n. (రెయిన్) ఏలుబడి; ఏలిక; రాజ్యం;
* reign, (రెయిన్) v. i. ఏలు;
* regression, n. తిరోగమనం;
** linear regression, ph. సరళ తిరోగమనం; దత్తాంశ బిందువుల స్థానంలో, వాటికి సమదూరంలో, ఉజ్జాయింపుగా ఒక సరళ రేఖని గీసే పద్ధతి;
* rein, n. పగ్గం; కళ్లెం; (rel.) bridle;
* reinstate, v. t. తిరిగి స్థాపించు;
* reiterate, n. పునరుద్ఘాటించు; ద్విరుక్తించు; ఆమ్రేడించు; మళ్లా మళ్లా చెప్పు;
* reiteration, n. పునరుద్ఘాటన; వీసనం; ముహుర్భాష; పౌనఃపున్యం; పౌనరుక్త్యం; ద్విరుక్తం;
* reject, v. t. తిరస్కరించు; వదలిపెట్టు; నిరాకరించు; నిరసించు; త్రోసివేయు; ఆక్షేపించు;
* rejection, n. తిరస్కారం; నిరసన; నిరాకరణ;
** rejection of food, ph. నిరసన వ్రతం;
* rejoice, v. i. రమించు;
* rejoinder, n. ప్రత్యుత్తరం; సమాధానం; ఎదురు జవాబు; బదులు;
* rejuvenate, v. i. కొత్తగా బలం పుంజుకొను;
* rejuvenation, n. కాయకల్పం;
* relapse, n. తిరగబెట్టు; పునర్ ప్రకోపించు;
* relation, n. బంధువు; చుట్టం;
* relationship, n. (1) సంబంధం; సంపర్కం; ఇలాకా; (2) బంధుత్వం; చుట్టరికం;
** far-fetched relationship, ph. బాదరాయణ సంబంధం;
* relative, adj. సాపేక్ష; పరస్పర; బాంధవ్య;
** relative address, ph. [comp.] సాపేక్ష విలాసం;
* relative, n. బంధువు; చుట్టం;
** distant relative, ph. దూరపు బంధువు; అత్తప్పగారి పిత్తప్ప; అంతల పొంతల వాడు;
* relativism, n. దృక్పథవాదం; ఒక రకం సాహిత్య విమర్శ;
* relativistic, adj. సాపేక్ష;
** relativistic collapse, ph. సాపేక్ష సమాధి;
* relativity, n. సాపేక్షత్వం; పరస్పరత్వం; పరస్పర సంబంధం;
** theory of relativity, ph. సాపేక్ష వాదం; సాపేక్షత్వ సిద్ధాంతం;
* relax, v. t. సడలించు;
* relaxation, n. సడలింపు;
* release, n. విడుదల; విడత; విమోచన;
** release from sin, ph. పాప విమోచన;
* released, adj. విడుదల చేయబడ్డ; ప్రోత్సారిత;
* relevance, n. సుసంగతం; సుసంగత్వం; ప్రాసంగికత;
* relevant, adj. సుసంగత;
* release, v. t. విడుదల చేయు; విడుచు; విమోచన చేయు;
* reliability, n. విశ్వసనీయత;
* reliable, adj. విశ్వసనీయ;
** relied upon, ph. ఉపాశ్రిత;
* relief, n. తెరిపి; ఉపశమనం;
* relic, n. అవశిష్టం;
* religion, n. మతం; (lit.) linking back the phenomenal to its source;
* religious, adj. మత సంబంధమైన;
** Religious endowment, ph. దేవాదాయం;
* relinquish, v. i. వర్జించు; త్యజించు;
* relish, n. ఉపదంశం; నంచుకోడానికి వీలయిన పచ్చడి వంటి పదార్థం;
* reluctance, n. (1) అయిష్టత; (2) అయస్కాంత రేఖల ప్రయాణానికి అయిష్టత; విద్యుత్తు యొక్క ప్రయాణానికి చూపే అయిష్టతని resistance అన్నట్లే అయస్కాంత రేఖల ప్రయాణానికి చూపే అయిష్టతని reluctance అంటారు;
* remainder, n. శేషం; శిష్టపదం; బాకీ; మిగిలినది;
* Remainder Theorem, n. శేష సిద్ధాంతం; The remainder theorem states that when a polynomial, f(x), is divided by a linear polynomial, x - a, the remainder of that division will be equivalent to f(a). ... It should be noted that the remainder theorem only works when a function is divided by a linear polynomial, which is of the form x + number or x - number;
* remaining, adj. తక్కిన; తరువాయి; మిగిలిన; మిగత; తతిమ్మా;
* remains, n. అవశేషములు; అస్థికలు;
* remand, v. t. ఆజ్ఞాపించు;
* remarriage, n. పునర్వివాహం;
* remedy, n. మందు; చిట్కా; పరిహారం;
** home remedy, ph. గోసాయి చిట్కా; గృహ వైద్యం;
* remind, v. i. స్మరించు;
* remind, v. t. స్మరణకు తెచ్చు; జ్ఞాపకం చేయు;
* reminiscence, n. స్మరణ; సంస్మరణ; స్మృతి;
* remission, n. తగ్గుదల; తగ్గించుట; తగ్గింపు; తగ్గుముఖం;
* remit, v. t. కట్టు; ఇరసాలు;
* remittance, n. ఇరసాలు;
* remission, n. సడలింపు; తగ్గుదల; ఉపశమనం;
* remonstrate, v. t. మందలించు;
* remorse, n. పశ్చాత్తాపం; శోకం; అనుతాపం; ఖేదం;
* remote, adj. విదూర; సుదూర; దవిష్ఠ;
** remote control, ph. విదూర నియంత్రణ;
* removal, n. తొలగింపు; నివారణ; నివృత్తి; నివర్తనం; హరణ;
* remove, v. t. తొలగించు; వదలించు; ఊడ్చు; విఘటన చేయు; హరించు;
* remuneration, n. ప్రతిఫలం; ప్రత్యుపకారం; చెల్లింపు; ముట్టింపు;
* renaissance, n. (రినసాన్స్) పునరుద్ధరణ; పునరుజ్జీవనం; కొత్త జన్మ; కొత్త జీవితం; నవజాగృతి;
* rendering, n. వర్ణన; వ్యాఖ్య; పాటని పాడడం; బొమ్మని గియ్యడం; భాషాంతరీకరణం చెయ్యడం;
* rendezvous, n. (రాండెవూ) ముఖాముఖీ; కలిసే స్థానం; సంకేత ప్రదేశంలో కలుసుకోవడం;
* renegade, n. మతభ్రష్టుడు;
* rent, n. అద్దె; అద్దియ; బాడుగ; బేడిగ; భాటకము; కిరాయి; మక్తా; శిస్తు;
* renter, n. అద్దెకున్నవాడు; మక్తేదారు; ముస్తాజరు; భాటకుడు;
* renounce, v. t. త్యజించు; పరిత్యజించు; ఒదలిపెట్టు;
* renovation, n. జీర్ణోద్ధరణ; మేల్కటం;
* renown, n. పేరు; కీర్తి; ఖ్యాతి;
* reorganization, n. పునర్వ్యవస్థీకరణ;
* repairs, n. pl. మరమ్మత్తులు;
* reparation, n. పరిహారం;
* repartee, n. ఎదురుదెబ్బ; చతురోక్తి; బ్రహాణకం;
* repeal, v. t. రద్దుచేయు; నిషేధించు;
* repeat, v. t. ఆమ్‌రేడించు; మామరించు;
* repeated, adj. పునరుక్త; జప;
* repeatedly, adv. మళ్ళీ మళ్ళీ; మాటిమాటికీ; పునరుక్తంగా;
* repentance, n. పశ్చాత్తాపం; నొచ్చుకోలు;
* repertoire, n. సంగీత కచేరీలు; నాటకాలు, మొదలైన కళాఖండాలకి కాణాచి అయిన వ్యాపార బృందం; (see also) repertory
* repertory, n. సముదాయ మంజరి; నిధి; ప్రాప్తిస్థానం; all the things that someone can do, all the methods that someone can use, etc.; (see also) repository; repertoire;
* repetition, n. పునరుక్తి; వల్లె; జపం; చర్వితచర్వణం; ద్విరుక్తం; పర్యాయోక్తి; అనుప్రాస;
** futility of repetition, ph. పునరుక్తి దోషం;
* replacement, n. స్థానచ్యుతి;
* replication, n. ప్రతిసృజన; తనని తాను తనంతగా సృష్టించుకోగలిగె సత్తా;
* reply, n. సమాధానం; జవాబు; బదులు; ప్రత్యుత్తరం; ప్రతివచనం; ప్రతివాదం; తరువల్కు; మాటకి తిరుగు మాట చెప్పడం;
* report, n. (1) నివేదిక; నివేదన; (2) శబ్దం;
** preliminary report, ph. ప్రథమ నివేదిక;
** press report, ph. పత్రికా నివేదిక;
** progress report, ph. పురోగమన నివేదిక;
* reporter, n. విలేకరి; అనుకర్త, anukarta, అనువక్త, anuvakta
** press reporter, ph. పత్రికా విలేకరి;
* repose, n. విశ్రమం;
** angle of repose, ph. విశ్రమ కోణం; The angle at which a pile of rocks, sand, or dirt settles after a while;
** position of repose, ph. విశ్రమ స్థానం;
* repose, v. i. నడ్డి వాల్చు; విశ్రాంతికై జేరగిలబడు;
* repository, n. అగారం; భాండాగారం; కాణాచి;
* reprehend, v. t. కోపించు; నిందించు; అభిశంసించు;
* represent, v. t. (1) ప్రాతినిధ్యం వహించు; (2) వర్ణించు; నివేదించు; సంకేతించు;
* representative, adj. ప్రాతినిధ్యపు;
** representative government, ph. ప్రాతినిధ్యపు ప్రభుత్వం;
* representative, n. ప్రతినిధి; ప్రతిహస్తకుడు; హేజీబు;
* repress, v. t. అణగదొక్కు;
* repression, n. అణగదొక్కడం; దమనం; దమననీతి;
* reprimand, v. t. తిట్టు; చివాట్లుపెట్టు; కోప్పడు; కసురు; మందలించు; నిందించు;
* reprint, n. (1) పునర్ముద్రణ; (2) పునర్ముద్రణ పత్రం;
* reprisal, n. ప్రతీకారం; ఎదురుదెబ్బ;
* reproach, v. t. నిందించు; దూషించు;
* reproach, n. గర్హనం; నింద; దూషణ; ఆడిక;
* reproachable, n. గర్హనీయం;
* reproduction, n. పునరోత్పత్తి; సంతానోత్పత్తి; ప్రత్యుత్పత్తి; పిల్లలు పుట్టుట; see also regeneration;
* reproductive, adj. పునరోత్పాదక; ప్రత్యుత్పత్తి;
** reproductive hormones, ph. ప్రత్యుత్పత్తి హార్మోనులు; ప్రత్యుత్పాదక హార్మోనులు;
* reprove, v. t. కోప్పడు; కూకలేయు; చివాట్లు పెట్టు; గద్దించు;
* reptile, n. సరీసృపం; ఉరోగామి;
* republic, n. గణరాజ్యం; గణతంత్ర రాజ్యం;
** Republic Day, ph. గణరాజ్య దినోత్సవం;
** Republic of India, ph. భారత గణతంత్రం; భారత గణరాజ్యం;
* repudiate, v. t. నిరాకరించు; సమర్థించకుండా ఉండు; తోసిపుచ్చు; విడనాడు;
* repudiation, n. నిరాకరణ;
* repulse, v. t. ఓడించు; తోసివేయు; వికర్షించు;
* repulsion, n. (1) వికర్షణ; (2) ప్రతిహతం; అసహ్యం; ఏవగింపు;
* repulsive, n. వికర్షక; అసహ్యకరమైన;
* reputation, n. పరపతి; పరువు; ప్రతిష్ట; కీర్తి; ఖ్యాతి;
* reputed, adj. కీర్తికెక్కిన; కీర్తివంతమైన; వాసికెక్కిన;
* request, v. t. కోరు; అడుగు; మనవి చేయు; విన్నపించు; అభ్యర్ధించు;
* requiem, n. సంతాప గీతం; శోక గీతం; చనిపోయిన వారి యెడల సంతాపం ప్రకటిస్తూ చదివేది;
* request, n. మనవి; విన్నపం; నివేదన; ప్రార్థన; కోరిక; అభ్యర్థన;
* required, adj. కావలసిన; ఆపేక్షిత;
* requirements, n. కావలసినవి; ఆపేక్షితాలు; కాంక్షితాలు;
* rescue, n. పరిత్రాణం; రక్షించడం;
* research, n. పరిశోధన; శోధన; పునస్సంశోధన; కృషి; అన్వేషణ; అన్వీక్షణ: అరయిక;
** research paper, ph. పరిశోధనా పత్రం;
** research methodology, ph. పరిశోధనా పద్ధతి;
* researcher, n. జిజ్ఞాసువు; m. పరిశోధకుడు; పునస్సంసోధకుడు; f. పరిశోధకురాలు; ఆదిత్సువు;
* resemblance, n. పోలిక; సారూప్యం; తౌల్యం;
* reservation, n. ప్రత్యేకింపు; కేటాయింపు; రిజర్వేజన్;
* reserved, adj. (1) ప్రత్యేకింపబడ్డ; రిజర్వు చెయ్యబడ్డ; (2) ముభావంగా ఉన్న;
* reserves, n. pl. నిల్వలు;
* reservoir, n. (1) నిధి; టెంకి; తొట్టి; ఆశయం; (2) తటాకం; చెరువు; కొలను; సరస్సు; సముద్రం; జలాశయం; సాగరం; తొట్టి;
** reservoir of mercy, ph. కరుణానిధి; కరుణాసముద్రుడు;
** reservoir of urine, ph. మూత్రాశయం;
** reservoir of virus, ph. విషాణుటెంకి; విషాణాశయం;
** reservoir of water, ph. జలాశయం; నీరుటెంకి;
* reside, v. i. నివసించు; ఉండు;
* residence, n. నివాసం; నివేశనం; ఉండేచోటు; ఉనికిపట్టు; ఇల్లు; ఇరవు; అవస్థానము;
* resident, n. నివాసి; స్థాత; వాస్తవ్యుడు; ఉండువాడు; సాకీను;
* residential, adj. నివాస; నివసించే;
* residents, n. pl. నివాసులు; వాస్తవ్యులు; మనికులు; ఉండువారు;
* residual, adj. అవశేష; అవశిష్ట; మిగిలిన;
* residue, n. మిగిలినది; లోతక్కువ; అవశేషం; అవశిష్టం; అవక్షేపం; శేషం; ఉచ్ఛేషం; గసి; పిప్పి;
** residue class, ph. [math.] శేషవర్గం;
* resign, v. i. రాజీనామాచేయు; విసర్జించు; వదలుకొను;
** resign oneself to, ph. ఆశ వదలుకొను; రాజీపడు;
* resignation, n. రాజీనామా;
* resin, n. సర్జరసం; సర్జం; సజ్జం; రాల; రాళ; అరపూస; లాక్ష; గుగ్గిలం; Material science and polymer chemistry define resin as a highly viscous and solid substances obtained from plants or synthetically produced; It itself is the mixture of several organic compounds namely terpenes. It is produced by most of the woody plants when these plants get an injury in the form of cut.
* resist, v. i. ఎదిరించు; ప్రతిఘటించు; నిరోధించు; మొరాయించు;
* resistance, n. (1) అవరోధం; ప్రతిఘటన; నిరోధం; అడ్డగింత; (2) భౌతిక చలనంలో ఎలా ఐతే ఘర్షణ చలనాన్ని నిరోధిస్తుందో, అలాగే పదార్థములందు ఎలక్ట్రాన్ల చలనాన్ని కూడా నిరోధించే గుణాన్ని రెసిస్టెన్స్ అంటారు;
* resistivity, n. అవరోధకత్వం; నిరోధకత్వం; ఒక ధాతువు ఎంత మేరకు కరెంటు పంపగలదు (పంపలేదు) అన్నదానికి కొలమానం ఈ రెసిస్టివిటీ;
** electrical resistivity, ph. విద్యున్నిరోధకత్వం; విద్యున్నిరోధక గుణం;
* resistor, n. అవరోధకి; నిరోధకి; నిరోధకం;
* resolution, n. (1) నిశ్చయం; నిశ్చితార్థం; నిర్ణయం; పరిష్కారం; తీర్పు; తీర్మానం; సంకల్పన; (2) వియోజనం;
** resolution of forces, ph. బలాల వియోజనం; శక్తులని విడగొట్టడం;
* resolve, n. సంకల్పం; కృతనిశ్చయం;
** political resolve, ph. రాజకీయ సంకల్పం;
* resolve, v. i. (1) సంకల్పించు; (2) పరిష్కరించు; పొక్తుపరచు; (3) విడదీయు;
* resolved, n. నిశ్చితం; నిర్ణయించబడినది;
* resolver, n. పరిష్కర్త;
* resonance, n. అనుకంపం; అనునాదం; ముఖరితం;
** resonant circuit, ph. ముఖరిత వలయం; అనుకంప వలయం;
* resort, n. ఠికానా;
* resound, n. ప్రతిధ్వని; మారుమోత;
** resourceful idea, ph. ఉపాయం;
* resourcefulness, n. సమయస్పూర్తి;
* resources, n. వనరులు;
** energy resources, ph. శక్తి వనరులు;
** water resources, ph. నీటి వనరులు;
* respect, n. గౌరవం; అభిమానం; ప్రతిపత్తి; పరువు; పేరిమి;
** self respect, ph. ఆత్మగౌరవం; ఆత్మాభిమానం;
* respectable, adj. గౌరవించదగిన; గౌరవనీయమైన; మాననీయమైన; మర్యాద చూపదగిన;
** respectable man, ph. గృహమేధి; గృహస్థు;
* respectful, adj. గౌరవం తెలిపే; మర్యాద గల; సాదర;
* respectfully, adv. సాదరంగా;
* respectively, adv. ఆదిమధ్యాంత్య మంత్యంగా; యథాసంఖ్యానుసారంగా; క్రమానుసారంగా; వరుసగా;
* respiration, n. శ్వాసప్రక్రియ;
* respiratory, adj. శ్వాసకి సంబంధించిన;
** respiratory center, ph. శ్వాస కేంద్రం;
** respiratory process, ph. శ్వాసక్రియ;
** respiratory system, ph. శ్వాసమండలం;
* respite, n. తెరిపి;
* resplendent, adj. ఉజ్జ్వల; జిగేలుమనే; మిరుమిట్లుగొలిపే;
* respondent, n. ఉత్తరవాది;
* response, n. ప్రతిస్పందన; జవాబు; ప్రత్యుత్తరం; ప్రతికార్యం; ప్రతికరం; ప్రతికర్మం; ప్రతిక్రియ; ఆలోచన, వివేచనతో కూడిన ప్రతిస్పందన;
* responsible, adj. పూచీగల; బాధ్యతగల;
** responsible person, ph. ధురంధరుడు; జవాబుదారుడు;
* responsibility, n. (1) కర్తవ్యం; (2) బాధ్యత; పూచీ; జవాబుదారీ; ధుర్యత; ధుర; మోపుదల; ఉత్తరవాదం;
** without responsibility, ph. నిష్‌పూచీ; పూచీ లేకుండా; బాధ్యత లేకుండా;
* rest, adv. మిగతా; మిగిలిన; తతిమ్మా;
* rest, n. (1) విరామం; విశ్రాంతి; విశ్రమం; విరతి; ఊరట; ఉడుకువ; (2) నిశ్చలత్వం; (3) తరవాయి; మిగిలినది;
* rest, v. i. విశ్రమించు; విరమించు;
* restlessness, n. సమరతి;
** resting point, ph. విరామస్థానం;
* restaurant, n. ఫలహారశాల; భోజనశాల; భోజనాలయం; (rel.) hotel;
* restoration, n. పునస్థాపనం; పునఃస్థాపనం;
* restraint, n. నిగ్రహం; అదుపు; సంయమనం;
* restricted, adj. పరిచ్ఛిన్న; సంకుచితమైన;
* restriction, n. ఆంక్ష; కట్టడి;
* result, n. (1) ఫలం; ఫలితం; పర్యవసానం; (2) సమాధానం;
** bad result, ph. దుర్విపాకము;
* resultant, n. తత్ఫలితం; ఫలితాంశం;
* resume, n. (రెసుమే) సంక్షిపంగా, ఒక పేజీ మించకుండా, సొంత అర్హతలని వివరించే పత్రం; (note) C.V. విస్తారంగా అర్హతలని వివరించే పత్రం; కంపెనీలలో ఉద్యోగాలకి resume వాడతారు, విద్యాసంస్థలలో ఉద్యోగాలకి CV వాడతారు;
* resume, v. i. (రెసూం) తిరిగి ప్రారంభించు; మధ్యలో ఆపిన పనిని తిరిగి చేయడం మొదలు పెట్టు;
* resurrection, n. పునరుత్థానం;
* retail, adj. చిల్లర; టోకు కానిది;
* retain, v. t. (1) ఉంచు; (2) మిగుల్చు; అట్టేపెట్టు;
* retaliation, n. ప్రతీకారం; ప్రతిఘటన; కసితీర్చుకొనడం; ప్రతిహింస; దెబ్బకు దెబ్బ తియ్యడం;
* retard, v. i. మందించు; మందగింపజేయు;
* retardation, n. మాంద్యత;
** mental retardation, ph. బుద్ధి మాంద్యత;
* retarded, adj. మందించిన;
** retarded brain, ph. మందగించిన మెదడు;
* retentivity, n. ధారణ; ధారణశక్తి;
* reticence, n. మాట్లాడకుండా తటస్థంగా ఊరుకోవడం; మౌనం వహించడం; గుట్టుగా ఉండడం;
* reticent, adj. గుట్టు; ముభావం; తటస్థం; బయటకి తేలకుండా ఉండే స్వభావం వ్యక్తం చెయ్యడం;
* retina, n. అక్షపటలం; మూర్తీపటలం;
* retinitis, n. అక్షపటలదాహం; అక్షపటలం వాపు;
* retinue, n. భృత్యబృందం; భృత్యవర్గం; పరిజనం; మంది; బలగం; మందిమార్బలం; పరివారం; వందిమాగదులు;
* retire, n. విరమించు; నిష్ర్కమించు; పదవీవిరమణ చేయు;
* retort, n. (1) బట్టీ; (2) తోకబుడ్డి; ఝారీ; (3) ప్రత్యాక్షేపం; తిరుగు జవాబు;
* retreat, v. i. తగ్గు; సన్నగిల్లు; వెనుకంజ వేయు;
* retribution, n. పాపఫలం; ప్రతిఫలం;
* retroflex, adj. [ling.] ప్రతివేష్టిత; మూర్థన్య; ఒంచిన; ఒంపు తిరిగిన; వెనక్కి తిరిగిన; ఉచ్చరించేటప్పుడు నాలుకని వెనక్కి తిప్పి పై పంటి ఎగువని ఆనించడం; ఉ: ట ఉచ్చారణ;
** retroflex flap, ph. ప్రతివేష్టిత తాడితం; మూర్థన్య తాడితం;
** retroflex fricative, ph. మూర్థన్య ఈషత్ స్పృష్టం;
** retroflex stop, ph. ప్రతివేష్టిత స్పర్శం; మూర్థన్య స్పర్శం;
* retroflex, n. మూర్థన్యం;
* retroflexes, n. మూర్థన్యములు; ప్రతివేష్టితములు; నాలుకని మడత పెట్టి నోటి కప్పుకి తగిలించి పలికేవి; ట, ఠ, డ, ఢ, ణ;
** retrograde motion, ph. తిరోగమనం; పశ్చగమనం; వక్రగతి; వక్రించిన గమనం; వెనక్కి నడవడం;
* retrogressive, adj. అధోగమన; తిరోగమన;
* retrogressive, adj. అధోగమన; తిరోగమన;
* retrospection, n. సింహావలోకనం; పునర్విమర్శ; పునఃపరిశీలన; వెనక్కి చూడడం;
* rev. v. t. తిరిగే చక్రం యొక్క జోరు పెంచడం; యంత్రం యొక్క జోరు పెంచడం;
* reveal, v. i. వెలరించు; వెలార్చు; బయటపెట్టు;
* revelation, n. వెలరింపు; వెలవరింపు; ద్యోతకం; శృతి;
* revel, v. i. కులుకు;
* revenge, n. ప్రతీకారం; ప్రతిహింస; కసితీర్చుకొనడం; పగ సాధించడం;
* revenue, n. కోశాదాయం; ఆయం; రాజస్వం; పరుపతం; ప్రభుత్వ కోశానికి వచ్చే ఆదాయం;
** land revenue, ph. శిస్తు;
** revenue inspector, ph. పరుపతం సంధాత;
* reverberate, v. i. ప్రతిధ్వనించు; పిక్కటిల్లు;
* reverberation, n. ప్రతికంపం; ప్రకంపన; ప్రతిశృతి;
* reverse, adj. ప్రత్యవాయ; వ్యతిరేక;
** reverse order, ph. వ్యతిరేక క్రమం;
* reverse, n. ఉల్టా; వెనక్కి; తిరగేసి; (ant.) obverse;
* reverse, v. t. తిరగవేయు;
* reversible, adj. ఉత్క్రమణీయ; తిరగెయ్యడానికి వీలైన;
* revetment, n. రాతిచపటా; రాతిమలామా; నెలకట్టు; బందోబస్తు చెయ్యడానికి కట్టే రాతికట్టడం;
* review, n. (1) సమీక్ష; పరిశీలన; గ్రంథ పరిచయం; (2) పునర్విచారణ; పునర్విమర్శ; పునశ్చరణ; పునరావలోకనం; ప్రత్యాలోచన;
* review, v. t. (1) సమీక్షించు; (2) పునర్విచారణ చేయు; చింతన చేయు;
* revise, v. t. సవరించు; సంస్కరించు;
* revision, n. సవరింపు; సవరణ; సంస్కరింపు; సంస్కరణ;
* revive, v. i. పుంజుకొను; తేరుకొను;
* revival, n. పునరుజ్జీవనం;
* revolt, n. విప్లవం; తిరుగుబాటు; పితూరి;
* revolt, v. i. తిరుగబడు;
* revolution, n. (1) విప్లవము; తిరుగుబాటు; (2) పరిభ్రమణం; చుట్టుతిరగడం;
** clockwise revolution, ph. ప్రదక్షిణం; గడియారపు ముల్లు తిరిగే దిశలో చుట్టి రావడం; గుడుల చుట్టూ గానీ, అగ్ని హోత్రుని చుట్టూగానీ, మహనీయుల చుట్టూగానీ కుడివైపుగా తిరగడం;
** counter clockwise revolution, ph. అప్రదక్షిణం; గడియారపు ముల్లు తిరిగే దిశకి ఎదురు దిశలో చుట్టి రావడం;
** green revolution, ph. హరిత విప్లవం;
** industrial revolution, ph. పారిశ్రామిక విప్లవం;
* revolve, v. t. చుట్టుతిరుగు; ప్రదక్షిణచేయు;
* revolver, n. తిరుగుడు పిస్తోలు; ప్రయత్నం లేకుండా తూటాలను ప్రక్షేపణ స్థానానికి సరఫరా చేసే పిస్తోలు;
* revulsion, n. ఏహ్యభావం; అసహ్యం; ఏవగింపు;
* reward, v. t. అనుగ్రహించు; బహూకరించు;
* reward, n. (1) ప్రతిఫలం; ఫలం; (2) పారితోషికం; పసదనం;
* Rh-factor, n. రీసస్ కారణాంశం; రక్తంలోని ఎర్ర కణాల మీద కనిపించే ఒక రకం ప్రాణ్యపు బణువు (protein molecule); ఈ రకం ప్రాణ్యపు బణువు రీసస్ జాతి కోతులలో కనిపించింది కనుక ఈ పేరు పెట్టేరు;
* rhapsody, n. అసంగతకావ్యం; తల తోకలేని కావ్యం;
* rheumatism, n. కీళ్లవాతం;
* rhetoric, n. భాషాలంకార శాస్త్రం; అలంకార శాస్త్రం; సలక్షణ పదాల ఎంపిక, చాతుర్యయుక్తమైన వాక్య నిర్మాణం, గుణ-రసాదులు సాహిత్యంలో ఉండేలా చూడడమంటే ఆ వ్రాతను సాహిత్య ఆభరణాలతో అలంకరించడమే! అందుకే ఈ శాస్త్రాన్ని 'అలంకార శాస్త్రం' అంటారు;
* rhetorical, adv. అలంకారయుక్తంగా; భాషాభేషజం తప్ప భావశూన్యంగా ఉండడం; కేవలం తన వాదనని బలపరచడానికి మాత్రమే వాడబడిన భాషావిశేషాలతో కూడి ఉండిన;
* rhino, adj. ముక్కుకి సంబంధించిన;
* rhinoceros, n. ఖడ్గమృగం; గండ మృగం; ముక్కొమ్మమెకము; ఏకశృంగం; శ్వేతవరాహం;
* rhizoid, n. దుంప; నులివేరు; మూల తంతువు;
* rhizome, n. భూగర్భకాండం; కొమ్ము;
* rhombus, n. రాంబస్; సమాంతర చతుర్భుజం; ఎదురెదురు భుజాలు సమాంతరంగాను, సమంగానూ ఉన్న చతుర్భుజం;
[[File:Rhombohedron.svg|thumb|right|Rhombohedron]]
* rhombohedral, adj. సమాంతరచతుర్ముఖ; ఎదురెదురు ముఖాలు సమాంతరంగాను, సమంగానూ ఉన్న చతుర్భుఖం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''--USAGE NOTE: rhombohedron
* In solid geometry, a rhombohedron is a three-dimensional figure like a cube, except that its faces are not squares but rhombi. It is a special case in which a parallelepiped has all its edges have the same length. Trigonal trapezohedron, Right rhombic prism, and oblique rhombic prism are special shapes that lie between a cube and a rhombohedron.'''
|}
*
* rhubarb, n. రేవలచిన్ని; రేవల్చిన్ని; తోటకూర వంటి ఈ ఆకుకూర కాడలు వండుకు తినవచ్చు కానీ, ఆకులు తినకూడదు; ఆకులలో ఆగ్జాలిక్ ఆమ్లం అత్యధికంగా ఉండడం వల్ల అవి విష తుల్యం;
* rhyme, n. అంత్యప్రాస; అంత్యానుప్రాస; ఇంగ్లీషు పద్యాల పాదాల చివరలో కనిపించే ప్రాస;
* rhythm, n. లయ; తాళగతి;
** rhythmic cycle, ph. తాళం;
* rib, n. పక్క ఎముక; పర్శుక; పార్శ్వాస్తి; డొక్క;
** rib cage, ph. పర్శుక పంజరం;
* ribbon, n. కంగోరు; నాడా; రిబ్బను;
* ribosome, n. రైబోకాయం; (ety.) composite of ribonucleic acid (RNA) and microsome;
* rice, n. (1) బియ్యం; తండులం; దంచిన ధాన్యం; (2) అన్నం; ఉడకబెట్టిన అన్నం;
** broken rice, ph. నూకలు;
** cooked rice, ph. వరి అన్నం; అన్నం; శాల్యోదనం; ఓగిరం; బోనాలు; అత్తు;
** flattened rice, ph. అటుకులు;
** parboiled rice, ph. ఉప్పుడు బియ్యం; partially boiled rice; ఇది మూడు దశల్లో జరుగుతుంది: నానబెట్టడం, ఉడికించడం, మరియు ఎండబెట్టడం. వడ్లను పొట్టుతో సహా నీటిలో నానబెట్టి, ఉడికించి, ఆ తర్వాత ఎండబెట్టి మిల్లు పడతారు.
** popped rice, ph. పేలాలు;
** pounded rice, ph. దంపుడు బియ్యం;
** puffed rice, ph. మురమరాలు; బొరుగులు;
**. raw rice, ph. పచ్చి బియ్యం; పండించిన వడ్లను ఎండబెట్టిన తర్వాత, నేరుగా మిల్లులో పోసి పైన ఉన్న పొట్టు తీసివేస్తారు. దీనికి ఎలాంటి ఉష్ణ ప్రక్రియ ఉండదు.
** steamed rice, ph. ఆవిరి బియ్యం; వడ్లను మిల్లుకు పంపే ముందు, వాటికి వేడి ఆవిరి పట్టిస్తారు. దీనివల్ల వడ్ల పొట్టు కొంచెం వదులై, బియ్యం గింజ గట్టిపడుతుంది. ఆ తర్వాత ఎండబెట్టి మిల్లు పడతారు.
** wild rice, ph. నీవారం; నీవారాలు;
** rice cooked in milk, ph. పొంగలి;
* rich, adj. గొప్ప; మోతుబరు; సంపన్నమైన;
* ricinus, n. ఆముదపుచెట్టు;
* rickettsiae, n. pl. రికెట్సియే; బేక్టీరియాకీ, వైరసులకీ మధ్యగా ఉండే సూక్ష్మ జీవులు; వీటివల్లనే టైఫస్ జ్వరం వస్తుంది;
* rickets, n.అస్థిమార్దవం; (lit.) softening of the bones;
* riddles, n. పొడుపు కథలు; తలబీకరకాయలు; కైపదాలు; ప్రహేళికలు; చిక్కు సమస్యలు; కుమ్ముసుద్దులు; బురక్రి బుద్ధిచెప్పే సమస్యలు; మెదడుకి మేతవేసే మొండి సమస్యలు;
* ride, n. సవారీ;
* ride, v. t. సవారీ చేయు;
* rider, n. (1) రౌతు; సవారీ చేసేవాడు; (2) తాజాకలం; అనుబంధ సిద్ధాంతం;
* ridge, n. మిట్ట;
* ridicule, n. కోడిగం; పరిహాసం; ఎగతాళి;
* ridicule, v. t. పరిహసించు; అపహసించు; ఎకసక్కేలాడు; ఎద్దేవాచేయు;
* ridiculous, adj. హాస్యాస్పదమైన; నవ్వు పుట్టించే;
* rift, n. బీట; పగులు; చీలిక; భ్రంశం;
** rift valley, ph. చీలిక లోయ; భ్రంశ లోయ; భూమి పగిలి, విడిపోయినప్పుడు ఏర్పడే లోయ;
* rigmarole, n. తతంగం;
* Rigel, n. (రైజెల్) వృత్రపాద నక్షత్రం;
* right, n. (1) ఒప్పు; తప్పుకానిది; (2) హక్కు; స్వామ్యం; (3) సమమైన; సరి అయిన; (4) కుడి; వల; వలవల; దక్షిణ;
** birthright, n. జన్మ హక్కు;
** fundamental right, ph. ప్రాథమిక హక్కు;
** right angle, ph. సమకోణం; లంబ కోణం; రుజు కోణం;
** right-angled triangle, ph. సమకోణ త్రిభుజం; లంబకోణ త్రిభుజం; సమ త్రిభుజం;
** right ascension, ph. [astronomy] విష్ణువాంశ; ఆకాశగోళం మీద రేఖాంశం వంటిది; the longitude on the celestial sphere; the east-west coordinate by which the position of a celestial body is ordinarily measured; more precisely, the angular distance of a particular point measured eastward along the celestial equator from the Sun at the March equinox to the point in the question above the earth; [see also] declination;
** right hand, ph. కుడిచేయి; వల కేలు; దక్షిణ హస్తం;
** right-handed, ph. కుడిచేతి వాటం; దక్షిణ కర;
** right side, ph. వలపల;
** right triangle, ph. లంబకోణ త్రిభుజం;
** right-wing, ph. దాక్షిణ్య భావాలున్న పక్షం;
* righteous, adj. ధార్మిక;
* rights, n.హక్కులు; స్వామ్యములు;
* rigid, adj. కక్కస;
* rigmarole, n. సోది; గొడవ; తల, తోక లేని వాక్ ప్రవాహం;
* rigor mortis, n. మరణావష్టంబనం; శవం కొయ్యబారడం;
* rim, n. (1) అంచు; (2) నేమి; టైరు అతికించడానికి వాడే చట్రం; (3) కప్పీ;
* rind, n. పండ్లయొక్క తొక్క;
* rinderpest, n. కింక;
* ring, n. (1) వలయం; వర్తులం; (2) ఉంగరం; అంగుళి; అంగుళీయకం; (3) శబ్దం; (4) [Math.] చక్రం; గణితంలో వచ్చే ఒక ఊహనం; ఉదాహరణకి పూర్ణాంకముల సమితి (అనగా, ... -3, -2, -1, 0, 1, 2, 3,...) ని చక్రం అంటారు. మరొక విధంగా చెప్పాలంటే ఒక సమితిలోని సభ్యులతో కూడికలు, గుణకారాలు చెయ్యగా వచ్చే సమాధానం కూడ ఆ సమితిలోనే ఉంటే ఆ సమితిని "చక్రం" అంటారు; ఉదాహరణకి పైన చూపిన సమితిలో ఏ రెండు సభ్యులని తీసుకుని కలిపినా, గుణించినా వచ్చే సమాధానం ఆ సమితిలోనే దొరుకుతుంది;
* ring, v. i. మోగు;
* ring, v. t. మోగించు; కొట్టు;
* ringer, n. నాగవాసం; ఘంటా ప్రతీకం; గంటలో మధ్య వేలాడే కాడవంటి లోహ విశేషం; (2) ముమ్మూర్తులా మరొక వ్యక్తి రూపంలో ఉన్న మనిషి;
* ringing, n. హోరు; గింగురుమను శబ్దం; మారుమోత;
* ringworm, n. తామర; ఒక చర్మరోగం;
* rinse, v. t. జాడించు; తొలుచు; ప్రక్షాళించు; పుక్కిలించు; గండూషించు;
* rinsing, n. ప్రక్షాళనం; తొలచడం;
* riot, n. దొమ్మీ;
* rip, v. t. చింపు; చించు; చీల్చు; విదారించు;
* riparian, adj. నదీతీరానికి సంబంధించిన;
** riparian rights, ph. నదీజలాలపై నదీతీరవాసుల హక్కులు;
* ripe, adj. పండిన; ముగ్గిన; మాగిన; పక్వమైన; పరిపక్వం చెందిన;
** half ripe, ph. దోరగా పండిన; దోరగా ముగ్గిన;
* ripen, v. i. పండబారు; ముగ్గు; మాగు;
* ripen, v. t. పండబెట్టు; ముగ్గించు; ముగ్గబెట్టు; మాగబెట్టు;
* ripple, n. అల; చిరు అల;
* rise, v. i. లేచు; ఉదయించు; పొంగు;
* rise, n. ఉత్థానం; పెరుగుదల; పెంపు;
** rise and fall, ph. లేవడం, పడడం; ఉదయాస్తమయాలు; ఎగుడు, దిగుళ్లు; హెచ్చుతగ్గులు; నిమ్నోన్నతలు; ఉత్థానపతనాలు;
* risk, n. నష్టభారం; నష్టాన్ని భరించగలిగే స్థోమత; తెగింపు; తెగించగలిగే స్థోమత;
* rite, n. కర్మకాండ; విధి; కర్మ;
** funeral rite, ph. ఉత్తరక్రియ; కర్మకాండ;
* ritual, n. కర్మకాండ; తంతు; సంస్కారవిధి; ఆచారం;
* rival, n. ప్రతిద్వంది; ప్రత్యర్థి; ప్రతిస్పర్ధి; స్పర్ధాళువు; పోటీదారుడు; దంట;
* rivalry, n. పోటీ; విజిగీష; ప్రతిస్పర్ధ; దంటతనం;
* river, n. నది; నదము; వాక; ఏఱు; సావిని; స్రవంతి; తరంగిణి; ధుని; వాహిని; see also tributary;
** perennial river, ph. నిత్య తరంగిణి; నిత్య ప్రవాసిని; జీవనది; ఎల్లసావిని; ఎల్లేఱు;
** river basin, ph. నదీక్షేత్రం;
* rivet, n. ఉట్టచీల; కీలితం;
* rivetted, adj. ఉత్కీలితం;
[[File:Rock_armour_revetment_Hampton-on-Sea.JPG|right|thumb|330px-Rock_armour_revetment_Hampton-on-Sea.JPG]]
* rivettment, n. కరకట్ట; జల ప్రవాహానికి ఒడ్డు కోసుకుపోకుండా ఉండడానికి వేసే తాపడం;
* rivulet, n. వాఁగు; ఏరు;
* roach, n. బొద్దింక;
* road, n. వీధి; మార్గం; దారి; తోవ; తెరువు; తెన్ను; తెరుగు; రహదారి; బాట; రస్తా; రోడ్డు;
** main road, ph. పెద్దవీధి; ప్రతోళి; రహదారి;
* roam, v. i. వలితిరుగు; తిరుగు; చరించు; అభిచరించు;
* roamer, n. అభిసంచారి;
* roar, n. (1) గర్జన; బిగ్గరైన నవ్వు; (2) హోరు;
** roar of a lion, ph. సింహ గర్జన;
** roar of a sea, ph. సముద్రపు హోరు;
* roar, v. i. (1) గర్జించు; గాండ్రించు; బిగ్గరగా నవ్వు; (2) హోరు పెట్టు;
* roaring, n. గర్జించడం; హోరు పెట్టడం; బిగ్గరగా నవ్వడం;
** roaring in the ear, ph. చెవిలో హోరు పెట్టడం;
* rob, v. t. దోచు; కాజేయు; దొంగిలించు;
* robber, n. దోపరి; బందిపోటు; తెరువాటుకాడు; కొల్లరి; (rel.) burglar; thief;
* robbery, n. దోపిడీ;
* robot, n. కూకరు; చాకరు; గణకరు; రోబాట్; కూలి పనిచేసే కంప్యూటరు; చాకిరీ చేసే కంప్యూటరు; see also automaton, android, bot
* rock, n. రాయి;
** rock salt, ph. రాతి ఉప్పు; గనులలో దొరికే ఉప్పు; NaCl;
** crushed rock, ph. కంకర రాయి;
* rock, v. i. ఊగు;
* rock, v. t. ఊపు;
* rocky, adj. శిలామయం; రాతిపారు;
* rocket, n. అవాయి; రాకెట్టు;
* rod, n. దండం; చువ్వ; ఊస; కమ్మి; కోపు; కోల; పాళా; శలాకం;
* rodent, n. పళ్లతో కొరికే సామర్ధ్యం ఉన్న ఎలుక, ఉడుత జాతి చిన్న జంతువు;
* rods and cones, n. శలాకాలు, శంకువులు;
* rogue, adj. శరండు; దగుల్బాజీ; మదించిన;
** rogue elephant, ph. మదించి, పిచ్చెక్కిన ఏనుగు; మంద కట్టడికి దూరంగా ఉండి విచ్చలవిడిగా తిరిగే ఏనుగు;
** rogue nation, ph. శరండ దేశం; కట్టుబాట్లలో ప్రవర్తించని దేశం;
* rogue, n. త్రాష్టుడు; వెధవ; శరండుడు; దగుల్బాజీ; కట్టుబాటుని తోసిపుచ్చి ప్రవర్తించు వ్యక్తి;
* role, n. పాత్ర; భూమిక;
* roll, n. చుట్ట;
* roll, v. t. చుట్టు; దొర్లించు; పొర్లించు; ఉరలించు;
* roll, v. i. చుట్టుకొను; దొర్లు; పొర్లు; ఉరలు;
* roller, n. లోఠీ; రోలరు;
* rolling, adj. ఘూర్ణితం;
** rolling waters, ph. తరంగ ఘూర్ణితం;
** rolling pin, ph. అప్పడాల కర్ర; లట్టనిక; లత్తపిడి; కొడుపు;
* Roman candle, n. మతాబా; పువ్వోత్తి;
* romance, n. (1) ప్రేమగాథ; (2) భావుకత; రసాస్వాదన;
* romantic, adj. (1) ప్రేమ; (2) కాల్పనిక; భావనాత్మక; రసాస్వాదక;
* romanticism, n. కాల్పనికవాదం; కాల్పనికోద్యమం; భావుకత ఉద్యమం; ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి, ఆనందించే ఉద్యమం;
* rome, n. రోమా నగరి; ఇటలీదేశ రాజధాని నగరం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''--USAGE NOTE: Roman, romance
..."The group of words with the root "roman" in the various European languages, such as "romance" and "Romanesque", has a complicated history, but by the middle of the 18th century "romantic" in English and "romantique" in French were both in common use as adjectives of praise for natural phenomena such as views and sunsets, in a sense close to modern English usage but without the amorous connotation. The application of the term to literature first became common in Germany, where the circle around the Schlegel brothers, critics August and Friedrich, began to speak of "romantische Poesie" ("romantic poetry") in the 1790s, contrasting it with "classic" but in terms of spirit rather than merely dating. In Telugu, someone with better sense, instead of a literal translation, came up with a nice term (భావ, భావుకత) that reflects the spirit of this movement!" (Dr. Suresh Kolichala)
... "Romantic poetry in English is essentially a rebellion against the classical or neoclassical norms of literature. ‘Romantic’ has the connotation of giving prime importance to imagination/emotions of the poet/writer. W. Wordsworth, ST Coleridge, and William Blake are the first generation poets. Byron, Shelley, and Keats are second-generation poets. These poets, of course, have their own uniqueness, they didn’t follow a manifesto. The rebellion is a two-pronged attack on classicism: both in content and form. In essence, subjectivity gained currency over objectivity. One consequence: English drama almost disappeared. Common people and their language got accepted as worthy of literature. The background is the French Revolution." - Mani Sarma'''
|}
*
* roof, n. (1) కొప్పు; కప్పు; ఇంటి కప్పు; నీధ్రం; (2) మిద్దె;
** roof garden, ph. మిద్దె తోట;
** roof overhang, ph. చూరు;
* rook, n. (1) చదరంగంలో ఒక పిక్క (ఏనుగు); (2) సితనీల చంచు కాకం; తెలుపు, నలుపు కలిసిన చంచువు (ముక్కు) కల ఒక రకం కాకి; [biol] Corvus frugilegus;
* room, n. గది; చోటు; ఖాళీ; శాల; ఇల్లు;
** bed room, ph. పడక గది;
** drawing room, ph. ముందు గది; ఆవిందకం; నట్టిల్లు;
** guest room, ph. చుట్టిల్లు;
** living room, ph. మసిలే గది; నట్టిల్లు;
** reading room, ph. పఠనశాల;
* root, n. (1) మూలం; మొదలు; మాతృక; ధాతువు; కుదురు; (2) వేరు; (3) అంశ;
** adventitious root, ph. ఊడ;
** aerial root, ph. అబ్బురపు వేరు;
** bulbous root, ph. దుంప; గడ్డ;
** complex root, ph. సంక్లిష్ట మూలం;
** cube root, ph. ఘన మూలం;
** imaginary root, ph. కల్పిత మూలం;
** real root, ph. నిజ మూలం; వాస్తవ మూలం;
** square root, ph. వర్గ మూలం;
** strike root, ph. నాటుకొను; వేరూను;
** root cap, ph. వేరు ఒర;
* root, v. i. వేరూను;
* roots, n. pl. వేళ్లు;
* rope, n. మోకు; తాడు; రజ్జువు; పాశం; see also cord, string;
* rosary, n. జపమాల; అక్షమాల; అక్షసరం; అక్షసూత్రం;
* rose, n. గులాబీ;
* roselle, n. గోగు; తమరత చెట్టు;
* roseola, n. వేపపువ్వు; పసితనంలో వచ్చే ఒక జబ్బు; గులాబీ రంగులో ఉన్న పేత వంటి రోగ విశేషం; see also rubbeola and rubella;
* rosewater, n. హిమాంబువు;
* rosewood, n. నూకమాను; జిట్రేగు;
* rosemary, n. రస్మేరీ; [bot.] Rosemrinus officinalis; పాశ్చాత్యదేశాలలోని వంటలలో వాడే ఒక ఆకు సుగంధ ద్రవ్యం;
* roster, n. ఆసామీవారీ; సిబ్బంది జాబితా;
* rostrum, n. వేదిక;
* rot, n. కుళ్లు;
* rot, v. i. కుళ్లు;
* rotary, adj. తిరిగెడు; భ్రమణ; ఘూర్ణ;
** rotary furnace, ph. ఘూర్ణ కొలిమి; తిరుగుడు కొలిమి;
* rotation, n. భ్రమణం; ఆత్మభ్రమణం; ఆత్మప్రదక్షిణం; తిరుగుడు; చక్రగతి; (rel.) revolution;
** rotation of earth, ph. భూభ్రమణం; భూమి యొక్క ఆత్మప్రదక్షిణం;
** rote learning, ph. బట్టీ పట్టడం;
* rotor, n. కదురు;
* rotor, n. కదురు; యంత్రంలో గిరగిర తిరిగే భాగం;
* rouge, n. (రూజ్) బుక్కా; బుగ్గలకి రాసుకొనే ఎరన్రి గుండ;
* rough, adj. (రఫ్) రూక్ష; స్థూల; చిత్తు; గరుకు; కచ్చా; ముతక; మొరటు; బరక;
** rough account, ph. కచ్చా కిర్దీ; చిత్తు లెక్క;
** rough surface, ph. గరుకు తలం; గరుకైన ప్రదేశం;
* roughly, adv. (రఫ్‌లీ) స్థూలంగా;
* round, adj. గుండ్రం; గుండ్రని; ఉండ్రం; అల్లి; హల్లి; గుబ్బ; బొండు; బటువు;
** round trip, ph. రానూ, పోనూ ప్రయాణం;
* round, n. దఫా; సారి; తూరి; చుట్టు; ఆవృత్తి; ఆవర్తనం;
** second round, ph. రెండవ దఫా; రెండవ సారి; రెండవ తూరి; రెండవ ఆవృత్తి; రెండవ ఆవర్తనం;
* roundabout, adj. చుట్టుతిరుగుడు; డొంకతిరుగుడు;
* roundabout, n. నాలుగైదు రోడ్ల కూడలిలో వాహనాలు సజావుగా మలుపు తిరగడానికి ఏర్పాటు చెయ్యబడ్డ వలయాకారపు రోడ్డు;
* round-headed, adj. గుండ్రని; గుబ్బ;
** round-headed nails, ph. గుబ్బ మేకులు;
** round-off error, ph. అర్ధాధికేన దోషం;
* rounds, n. చుట్లు; ఆవృతులు; ప్రహార్లు; వైద్యులు రోగులను చూడడానికి తిరిగే తిరుగుళ్లు;
** three rounds, ph. మూడు చుట్లు; మూడు ఆవృతులు;
* route, n. దారి; మార్గం; అయనం;
** northern route, ph. ఉత్తరాయనం;
* routine, n. (1) రివాజు; పరిపాటి; నిత్యవిధి; నిత్యకృత్యం; (2) క్రమణిక; చర్యాక్రమం; పరిపాటి; కంప్యూటరు ప్రోగ్రాం;
* routing, n. వెళ్ళగొట్టడం; మళ్ళించడం;
** flood routing, ph. వరదలని మళ్ళించడం; ప్రవాహాన్ని మళ్లించడం;
* rovibronic, adj. [phys.] భ్రమణకంపన; ఎలక్ట్రానిక్ స్థితి లోని కంపన మట్టంలో భ్రమణ ఉపమట్టం; రెండు బంతులని ఒక రబ్బరు తాడుతో కట్టి వాటిని గిరగిర తిప్పితే ఆ రెండు బంతుల మధ్య భ్రమణం (తిప్పడం వల్ల), కంపనం (రబ్బరు తాడు వల్ల) కలిసిన భ్రమణకంపనం ఉంటుంది; a rotational sublevel of a vibrational level of an electronic state;
* row, n. (1) పంక్తి; బంతి; బారు; బరి; వరుస; శ్రేణి; క్రమం; ఒగి; ఓలి; ఓజ; ఆవలి; ఆళి; రాజి; ధారణి; తతి; ఛటం; (2) జట్టీ; తగువులాట;
** rows and columns, ph. ఛటాపటాలు;
* rowdy, n. పోకిరి;
* royal poinciana, n. తురాయి పూవు [bot.] ''Delonix regia;''
* rub, v. t. పాము; తోము; పిసుకు; రాయు; రుద్దు; మాలీసు చేయు; మర్దనా చేయు; ఉద్వర్తించు;
* rubber, n. రబ్బరు; రుద్దు;
** rubber cork, ph. కార్క్ తో చేసిన బిరడా;
** rubber stopper, ph. రబ్బరు బిరడా;
* rubbing, n. ఉద్వర్తనం;
** rubbing alcohol, ph. మర్దనోలు; ఉద్వర్తన ఒలంతం; కషణాలంతం; కషణోల్; ఐసో ప్రొపైల్ ఆల్కహాలు;
* rubeola, n. మీజిల్స్; జ్వరం, దగ్గు, రొంప మొదలైన రోగ లక్షణాలు కనిపించేసరికి పదిరోజులు పడుతుంది. తర్వాత కళ్లు పుసి కట్టడం, తర్వాత కళ్లలోనూ, బుగ్గలమీద, చిన్న చిన్న తెల్లని మచ్చలు వస్తాయి. తర్వాత ఒళ్లంతా పేత పేసినట్టు; చిన్న చిన్న పొక్కులు వస్తాయి; see also rubella and roseola;
* rubella, n. జర్మన్ మీజిల్స్; గర్భవతులకి ఈ జబ్బు వస్తే పుట్టబోయే పిల్లకి చాలా ప్రమాదం. కనుక రజస్వల అయేలోగానే ఆడపిల్లలు వేక్సినేషన్ చేయించుకోవాలి. see also rubbeola and roseola;
* rubbish, n. చెత్తా చెదారం; తుక్కూ దూగరా; చెత్త;
* ruby, n. కెంపు; మాణిక్యం; నవరత్నములలో ఒకటి; కెంపు యొక్క నాణ్యతను, రంగులోని స్వచ్ఛతను బట్టి 'పద్మ రాగం', 'కురువిందం', 'సౌగంధికం', 'నీలగంధి' అన్న పేర్లతో కూడా పిలుస్తారు;
* rudder, n. చుక్కాని; పీలి; కర్ణం; అరిత్రం;
* rudimentary, adj. ప్రాయికమైన; ప్రాథమిక; మూల; ముఖ్య;
** rudimentary property, ph. తన్మాత్ర; హిందూ శాస్త్రాల ప్రకారం శబ్ధం ఆకాశం యొక్క, స్పర్శ వాయువు యొక్క, రూపం అగ్ని యొక్క, గంధం పృధ్వి యొక్క, రసం జలం యొక్క తన్మాత్రలు;
* rudiments, n. ప్రాథమిక సూత్రాలు; మూల సూత్రాలు; తన్మాత్రలు; బీజాలు;
* ruff, v. t. కోయు; కోసు; తురుపు ముక్కతో కోయు;
* rug, n. (1) కంబళి; (2) తివాసీ;
* ruin, v. t. రూపుమాపు; నాశనం చేయు;
* ruins, n. ఉత్సన్నముల; శిధిలములు;
* rule, v. t. ఏలు; పాలించు; పరిపాలించు;
* rule, n. (1) సూత్రం; నియమం; నియతి; నిబంధన; కట్టడి; అనుశాసనం; విధి; విధాయకం; ఖాయిదా; చౌకట్టు; రూలు; (2) తిన్నని గీత; కాగితం మీద రాత సౌలభ్యానికి గీసిన గీత; పంక్తి;
** according to rule, ph. నియమానుసారం; చౌకట్టు ప్రకారం; చౌకట్టును బట్టి;
** ruled paper, ph. రూళ్ళ కాగితం; తిన్నని గీతలుతో ఉన్న కాగితం;
* ruler, n. (1) ఏలిక; పాలకుడు; పరిపాలకుడు; (2) రూళ్ళకర్ర; (3) కొలబద్ద;
* rules, n. విధులు; నియమాలు; నిబంధనలు;
* ruling, adj. పాలక;
** ruling class, ph. పాలక వర్గం;
** ruling party, ph. పాలక పక్షం;
* rum, n. శీధు; మైరేయం; ఆసవం; చెరకు రసాన్ని పులియబెట్టి చేసే సారా;
* ruminant, n. రోమంధము; నెమరువేయు జంతువు;
* ruminate, v. t. నెమరువేయు; రోమంధించు; ఒక విషయాన్ని గురించి నిదానంగా ఆలోచించు;
* rumination, n. నెమరు; రోమంధము;
* rumor, n. పుకారు; వినికిడి; వదంతి; లోకవార్త; ప్రవాదం; లోకప్రవాదం; గాలికబురు; నీలివార్త; పోవిడి;
* rump, n. పిర్ర; పిరుదు; నితంబం;
* rumpus, n. అల్లరి;
* rumpus room, n. ఆట గది;
* run, n. పరుగు;
* run, v. i. పరుగెత్తు; పారు; ఉడాయించు;
* run, v. t. నడుపు;
** run a department, ph. డిపార్టుమెంటుని నడుపు;
* rung, n. మెట్టు; సోపానం; నిచ్చెన మెట్టు;
* runway, n. పరుగుబాట; విమానాలు ఎగిరే ముందు; వాలిన తర్వాత వాడుకునే పరుగు బాట;
* rupee, n. రూపాయి;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''---Usage Note: rupee
* ---Say "a two lakh rupee debt" or "ten rupee loan", but write "a Rs. 2 lakh debt" or "a Rs.10 loan"; '''
|}
*
* rupture, v.i. పగులు; చితుకు; బద్దలవు; పేలు;
* rural, adj. గ్రామీణ; జానపద; పల్లెటూరి;
* ruse, n. కుయుక్తి;
* rush, n. (1) రద్దీ; ఉరవడి; సంరంభం; వేగం, ఆధిక్యం; (2) రెల్లు, తుంగ, a kind of grass;
* rushes, n. సంరంభ ప్రదర్శనం; సినిమాలో భాగాలు తియ్యగానే ఎలా వచ్చిందో చూడడానికి వేసే ప్రదర్శన;
* Russell's viper, n. రక్తపొడ; ఒక జాతి పాము;
* rust, n. (1) తుప్పు; ఆశ్మరాగం; (2) చార తెగులు;
** black rust, ph. నల్లచార తెగులు;
** red rust, ph. ఎర్రచార తెగులు;
* rustic, adj. పామర; గ్రామీణ; అసభ్య; సంస్కృతి లేని; పల్లెటూరి తరహా;
* rustic, n. పామరుడు; పల్లెటూరు ఆసామీ; బైతు;
* rusticles, n. తుప్పొడి; (ety.) తుప్పు + పొడి;
* rut, n. (1) రుతుకాలం; జంతువులలో లైంగిక ప్రకోపన జరిగే రుతువు; see also estrus; (2) విసుగు పుట్టించే దైనందిన కార్యక్రమం;
* ruthlessly, adv. జాలి లేకుండా, నిర్దయగా;
* rye, n. రై; ఒక రకం ధాన్యం; [bot.] Secale cereale;
** rye grass, ph. ఒక రకం గడ్డి మొక్క; ఈ గడ్డికి, రై ధాన్యానికి ఏ విధమైన సంబంధము లేదు; [bot.] Lalium temulentum;'''
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
8fwnca2p6bljdj128bkn3pl8qbp0nfh
వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు/T-U
0
3029
39205
39141
2026-06-01T15:21:54Z
Vemurione
1689
/* Part 1: T */
39205
wikitext
text/x-wiki
చూడటం
=నిఘంటువు=
*This dictionary is an improved version over the print version (expanded, errors corrected, new features are continually being added) published by Asian Educational Services, New Delhi in 2002.
*T The entries use American spelling. Where possible, British spellings are also given.
* You are welcome to add. BUT PLEASE DO NOT DELETE entries until you are absolutely, positively SURE a mistake has been made.
* PLEASE do not delete entries or their meanings simply because you personally did not agree with the meaning given there. Thanks
25 Aug 2015.
==Part 1: T==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
* table, n. (1) బల్ల; మేజా; భోజనాల బల్ల; (2) పట్టిక; పట్టీ; సారణి; సరణి; (3) ఎక్కం;
** addition table, ph. కూడిక పట్టీ; కూడిక ఎక్కం;
** experience table, ph. అనుభవ సారణి; యాంత్రిక అభ్యాసంలో దత్తాంశాలని అమర్చే ఒక పద్ధతి;
** multiplication table, ph. ఎక్కం; గుణకార ఎక్కం;
** water table, ph. జలమట్టం; భూమిలో ఈ మట్టానికి దిగువ నీరు సంతృప్తంగా ఆవరించి ఉంటుంది; నుయ్యి తవ్వినప్పుడు నీరు ఈ మట్టానికి నిలుస్తుంది;
** table of contents, ph. విషయసూచిక;
** table salt, ph. ఉప్పు; వంటలో వాడే ఉప్పు; కూర ఉప్పు;
** table spoon, ph. పెద్ద చెంచా;
** table sugar, ph. చక్కెర; రోజూ వాడుకునే పంచదార;
* tableland, n. పీఠభూమి; సానువు;
* tablet, n. (1) బిళ్ల; గుటిక; మాత్ర; మింగడానికి అనుకూలంగా ఉన్న మోతాదు మించని మాత్ర; (2) పలక; కర్రతో కాని, మట్టితో కాని, రాయితో కాని చేసి, రాతకి అనుకూలంగా చదునుగా ఉన్న వస్తువు;
** clay tablet, ph. మట్టి పలక;
* taboo, n. అశ్లీలం; బూతు; సాధు సమ్మతం కానిది; చెయ్యకూడని చేత; రాయకూడని రాత;
* tabular, adj. విన్యాస; సారణ్య విన్యాస;
** tabular arrangement, ph. సారణీబద్ధమైన విన్యాసం:
* tabula rasa, n. ఖాళీ పలక; తెల్ల కాగితం; అలేఖ్యం; అలేఖం;
* tabulation, n. సారణీకరణం;
* tacit, adj. అనుక్త; ప్రత్యేకంగా చెప్పని; ఉద్ఘాటించని; ముభావంగా ఊరుకున్న; అంతర్లీనమైన;
* tacit assumption, ph. అనుక్త ఉపపాదన; ఉద్ఘాటించని తలంపు;
* taciturn, adj. ముభావంగా ఉన్న; తక్కువగా మాట్లాడే తత్వం కల; మితభాషియైన; మౌనశీల;
* tack, n. పూతిక నాటు; చిన్న మేకు;
** thumbtack, ph. బొత్తాం నాటు; సుత్తి అవసరం లేకుండా వేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు;
* tact, n. యుక్తి; ఒడుపు; వెరవు; నేర్పు; చాతుర్యం;
** tact and talent, ph. శక్తియుక్తులు;
* tactic, n. లఘుయుక్తి; లఘుతంత్రం; పన్నాగం; సమీప భవిష్యత్తుకి కావలసిన ఎత్తు; టాక్టికల్ వ్యూహాలు అంతిమ లక్ష్యానికి చేర్చే వ్యక్తిగత దశలు లేదా చర్యలు. టాక్టిక్స్ ఆచరణకు సంబంధించినవి. టాక్టిక్స్ "ఎలా", "ఎవరు" అనే ప్రశ్న మీద ఆధారపడి ఉంటుంది. "ఎలా" చేస్తున్నారు, "ఎవరు" చేస్తున్నారు అనేది మాత్రం అందరికి కనిపిస్తుంది. see also stratagey;
* tactile, adj. స్పర్శకి సంబంధించిన;
* tadpole, n. తల కప్ప; భేకడింభం; చిరు కప్ప; పిల్ల కప్ప;
* tail, n. (1) తోక; పక్షి తోక; జంతువుల తోక; విమానపు తోక; (2) వాలం; లాంగూలం; జంతువుల తోక; (3) బొరుసు;
** hairy tail, ph. లాంగూలం; గురప్రు తోక లాంటి కుచ్చు తోక;
* tail, v. t. వెంటాడు; తోకలా వెంటాడు; వెన్నంటి వెళ్లు;
* tail-lights, n. pl. తోకదీపాలు;
* tailor, n. దర్జీ; తున్నవాయుఁడు; కుట్టరి;
* tailwind, ph. వాలుగాలి;
* taint, n. కళంకం; కల్తీ;
* taint, v. t. కల్తీ చేయు; కళంకం తీసుకొని వచ్చు;
* tainted, adj. కల్తీ అయిన;
* take, v. t. (1) తీసుకొను; కైకొను; చేపట్టు; (2) సేవించు; తిను; తాగు;
* takeoff, n. (1) ఎత్తుగడ; (2) పైకి లేచు; గాలిలోకి లేచు; (ant.) conclusion; landing;
** takeoff of a story, ph. కథ ఎత్తుగడ;
* take up, v. t. చేపట్టు;
* talc, n. మెత్తని అభ్రకం; మెత్తని కాకిబంగారం; a clay mineral, composed of hydrated magnesium silicate with the chemical formula Mg<sub>3</sub>Si<sub>4</sub>O<sub>10</sub>(OH)<sub>2</sub>; Talc in powdered form, often combined with corn starch, is used as baby powder. Its use in baby powder is now prohibited because it is suspected to contain traces of asbestos;
* tale, n. కథానకం; ఉపాఖ్యానం;
* talent, n. నేర్పు; కుశలత; కౌశల్యం; ప్రతిభ; ప్రజ్ఞ; ‘జన్మతః సంక్రమించే నైసర్గిక లక్షణం’ అనేదే ప్రతిభ అన్నారు దండి; అభినవ గుప్తుడు ‘అపూర్వ వస్తు నిర్మాణ ప్రజ్ఞ’గా చెప్పారు;
* talisman, n. తావీజు; తాయెత్తు; రక్షామణి; రక్ష; మైరేకు;
* talk, n. మాట; పలుకు; ప్రసంగం;
** parrot talk, ph. చిలక పలుకు;
** talk of the town, ph. కింవదంతి;
* talk, v. t. మాట్లాడు; భాషించు;
* talkies, n. మాట్లాడే బొమ్మలు; సినిమాలు;
** talkative person, ph. వాగుడుకాయ; వాచాలుడు; వాచాటుడు; జల్పకుడు;
* talkativeness, n. వాచాలత;
* tall, adj. పొడవైన; పొడుగైన; ఎత్తయిన;
* tallow, n. కొవ్వు; నెమరు వేసే జంతువుల శరీరం నుండి తీసిన కొవ్వు; see also lard;
* tally, n. బేరీజు; తైపారు;
* tally, v. t. బేరీజు వేసి చూడు; తైపారు వేసి చూడు;
* talons, n. pl. పక్షి గోళ్లు; పంజా;
* tamari, n. Tamari is a Japanese soy sauce made primarily from fermented soybeans and contains little to no wheat; Tamari is a versatile, umami-rich soy sauce alternative that enhances many dishes, often found in marinades, dipping sauces, stir-fries, and dressings.
* tamarin, n. మీసాలకోతి;
* tamarind, n. చింతపండు; తింత్రిణీకం; (ety.) tamar-e-Hind = Indian date = భారతీయ ఖర్జూరం;
** tamarind tree, ph. చింతచెట్టు; తింత్రిణీ వృక్షం;
** tamarind seed, ph. చింతగింౙ; చింతపిక్క;
* tame, adj. మచ్చిక అయిన; పెంపుడు; సాధు; (ant.) wild; (rel.) domesticated;
* tame, v. t. మచ్చిక చేయు;
* tamp, v. t. దట్టించు; కూరు;
* tamper, n. పోఁపు; తాలింపు; తిరగబోత;
* tamper, v. t. జోలికి పోవు; జోక్యం కలుగజేసుకొను; లంచం ఇచ్చు;
* tan, n. (1) లేత గోధుమ రంగు; కడారు వన్నె; (2) పదును; కురటము; చర్మాన్ని తోలుగా మార్చే పద్ధతి;
* tan, v. t. (1) ఎండలో కూర్చుని శరీరాన్ని లేత గోధుమ రంగు లోకి మార్చు; (2) ఊను; ఊన్‌చు; పదును పట్టు; కురటించు; చర్మాన్ని తోలుగా మార్చు;
* tangent, n. (1) స్పర్శరేఖ; (2) స్పర్శాంశం; త్రిభుజంలో ఒక కోణానికి ఎదురుగా ఉన్న భుజం లవంలోనూ, పక్కగా ఉన్న భుజం హారంలోనూ వేసినప్పుడు వచ్చే నిష్పత్తి; లంబకోణ త్రిభుజంలో లంబకోణం కాని ఒకకోణానికి ఎదురుగా ఉన్నభుజం లవం లోను, ప్రక్కగా ఉన్న( కర్ణం కాని) భుజం హారం లోను వేసినప్పుడు వచ్చే నిష్పత్తి;
* tangible, adj. స్పర్శనీయ; అనుభవనీయ; సాకారమైన; స్పష్టమైన;
* tangle, n. చిక్కు;
* tank, n. (1) చెరువు; తటాకం; కోనేరు; టెంకి; పుష్కరిణి; (2) తొట్టి;
* tanner, n. కురటుడు; చర్మాన్ని తోలుగా మార్చే వ్యక్తి;
* tanner's cassia, n. తంగేడు చెట్టు; [bot.] ''Senna auriculata'';
* tannery, n. కురట శాల; తోళ్లని పదును చేసే కర్మాగారం;
[[File:Tangent_to_a_curve.svg|right|thumb|Tangent_to_a_curve]]
[[File:Academ_Base_of_trigonometry.svg|thumb|right|Academ_Base_of_trigonometry]]
* tantalizing, adj. ఆశ పెట్టే; ఆశాజనకమైన; ఊరించే;
** tantalizing clues, ph. ఆశాజనకమైన సంకేతాలు; ఆశాజనకమైన ఆచూకీలు; ఊరించే ఊహలు;
* tantamount, adj. నిజానికి; వాస్తవానికి; మొత్తంమీద; సమానార్ధకమైన;
* tap, v. t. (1) తట్టు; (2) చిన్న గంటు పెట్టి వెలికి తీయు;
* tap, n. (1) కుళాయి; నల్ల; గొట్టానికి గంటు పెట్టి నీళ్లని బయటకు తీసే సాధనం; పంపు; (2) [phonetics] అల్ప కంపితం;
** water tap, ph. నీళ్ళ కుళాయి;
** tap root, ph. తల్లి వేరు; కూకటి వేరు;
* tapaculo, n. వెందాపు పక్షి;
* tape, n. పట్టెడ; నవారు; బద్దీ; నాడా; టేపు;
* taper, adj. కూచిగా ఉన్న; ఆదోక; (ety.) ఆవుతోక వలె;
** taper joint, ph. ఆదోక బందు; ఆదోక బంధం;
* taperingly, adv. అదోకగా;
* tapestry, n. చిత్ర యవనిక; గుడ్డ మీద వేసిన వర్ణ చిత్రం;
* tapeworm, n. బద్దె పురుగు; మనుష్యుల చిన్న ప్రేగులలో పెరిగే ఒక జాతి పరాన్నభుక్కి; an invertebrate of the platyhelminth family;
* tapioca, n. సగ్గుబియ్యం; కఱ్ఱపెండలం (cassava) జాతి పిండి పదార్థంతో చేసే ఒక ధాన్య విశేషం; తాళజాతి చెట్ల నుండి వచ్చే పిండితో చేస్తే దానిని "సేగో" అంటారు; [see also] sago;
* tar, n. తారు; కీలు; గంజిత్తు; (ety.) గని + జిత్తు;
* tardy, adj. ఆలస్యం చేసెడు;
* tare, n. తారం; తారా; పడికట్టు ఎత్తు; తూనిక తోపుడు; సరుకులు బుట్టలో వేసి తూచేటప్పుడు ఖాళీ బుట్ట బరువు;
* target, n. లక్ష్యం;
* targeted, adj. లక్షిత;
** targeted reader, ph. లక్షిత పాఠకుడు;
* tariff, n. (1) సుంకం; ఎగుమతి దిగుమతుల మీద ప్రభుత్వం వేసే సుంకం; (2) హొటేలు గదులకి పుచ్చుకొనే అద్దె; (3) సుంకాల పట్టీ; సుంకసూచిక;
* tarnish, n. మెరుపు తగ్గుట; కిలుం పట్టుట;
* taro root, n. చేమ దుంప;
* tarpaulin, n. కీలుచాప; తారుగుడ్డ;
* tart, adj. పుల్లని;
* tartar, n. (1) ద్రాక్ష ఉప్పు; (2) పండ్లమీద చేరే మలినం; పాచి;
[[File:Tartaric_acid.svg|thumb|right|తింత్రిణికామ్లం]]
** tartaric acid, n. తింత్రిణికామ్లం; C<sub>4</sub>H<sub>6</sub>O<sub>6</sub>
* task, n. పని;
* taste, n. (1) రుచి; స్వాదనం; చవి; రసం; (rel.) aroma; flavor; (2) రసజ్ఞత; (3) అభిరుచి;
* taste, v. t. రుచిచూడు; చవిచూడు; ఆస్వాదించు;
* taste, adj. రుచి; స్వాదు; చవి;
** taste buds, ph. రుచిబొడిపెలు; స్వాదుముకుళాలు;
* tasteless, adj. చప్పిడి; రుచిలేని; రసహీనమైన;
* tasty, adj. కమ్మని; రుచికరమైన;
* tattle, v. t. వదరుట; పేలుట; వాగుట; ఉపయోగం లేని కబుర్లు, చాడీలు;
* tattletales, n. పనికిమాలిన కబుర్లు; గుసగుసలు;
* tattoo, n. పచ్చబొట్టు;
* taunt, n. దెప్పు; ఎత్తిపొడుపు; ఉపాలంభం;
* taunt, v. t. దెప్పు; ఎత్తిపొడుచు;
* taupe, n. తోపు; తోపురంగు; ముదర ఎరుపు;
* Tauri Beta, n. అగ్ని నక్షత్రం; వృషభ రాశి లోని ప్రకాశవంతమైన నక్షత్రాలలో రెండవది;
* Tauri Gamma, n. రోహిణి నక్షత్రం; వృషభ రాశిలోని ప్రకాశవంతమైన చుక్కలలో మూడవది;
* Tauri Pi, n. కృత్తిక [[నక్షత్రం]]; వృషభ రాశిలో ఒక తార;
* Taurus, n. వృషభ రాశి;
* tautology, n. అనులాపం; పునరుక్తి దోషం; అనవసరంగా ఒకే భావాన్ని ఒకే వాక్యంలో మరొకసారి చెప్పడం; ఉదా. చొక్కా ఇరుకుగా ఉండి పట్టడం లేదు;
* tawny, adj. చామనచాయ; ధూసరవర్ణం; గోధుమ రంగు; సింహం రంగు; tan color;
* tax, n. పన్ను; సుంకం; కరం; same as cess; see also duty; (Note) duty అనేది సరుకుల మీద పడే సుంకం, tax అనేది మనుష్యుల మీద పడే సుంకం;
** death tax, ph. మరణ సుంకం;
** excise tax, ph. ఒక ప్రత్యేకమైన జాబితా ఉన్న అంశాల మీద వేసే అమ్మకపు పన్ను; ఈ జాబితాలో సాధారణంగా అత్యవసరం కాని విలాస వస్తువులు ఉంటూ ఉంటాయి; ఉదా. నగలు, అత్తరులు, సిగరెట్లు, మద్య పానీయాలు, కార్లు, వగైరా; అబ్కారి పన్ను; వ్యాపారపు పన్ను; వ్యాపారపు పన్ను; అబ్కారీ పన్ను;
** house tax, ph. ఇంటి పన్ను; ఇల్లరి;
** income tax, ph. ఆదాయపు పన్ను;
** inheritance tax, ph. వారసత్వపు పన్ను;
** property tax, ph. ఆస్తి పన్ను;
** sales tax, ph. అమ్మకపు పన్ను;
** tax collector, ph. సుంకరి; కర గ్రాహి;
* taxes, n. పన్నులు; కప్పములు;
* tax-free, adj. పన్నులు లేని;
* taxi, n. కిరాయికారు; టేక్సీ; టేక్సీకేబ్ అన్న మాటని కత్తిరించగా వచ్చిన మాట;
* taxonomy, n. వర్గీకరణ; వర్గీకరణ శాస్త్రం;
* tea, n. తేనీరు; చా; టీ;
* tea leaf, n. తేయాకు;
* teach, v. t. నేర్పు; బోధించు; బోధన చేయు; బోధపరచు; ప్రబోధించు;
* teacher, n. గురువు; అఖ్యాత; బోధకుఁడు; m. పంతులు; ఉపాధ్యాయుఁడు; ఒజ్జ; అధ్యాపకుఁడు; ఆచార్యుఁడు; దేశకుఁడు; అయ్యవారు; f. పంతులమ్మ; గుర్వి; ఉపాధ్యాయిని; ఒజ్జసాని;
** teacher's teacher, ph. ప్రాచార్యుడు; (note)similar to ప్రపితామహుడు
* teaching, n. బోధ; బోధన; అధ్యాపనం;
* teak, n. [[టేకు]]; టేకు కర్ర; టేకు చెట్టు;
* teakwood, n. టేకు; టేకు కర్ర;
* teal, n. నీలపచ్చం; నీలహరితం;
* teal, adj. నీలంపచ్చ; నీలహరిత;
* team, n. జట్టు; గుంపు;
* tear, v. t. చింపు; చించు;
* tear, n. (1) కన్నీరు; అశ్రువు; అశ్రుజలం; బాష్పం; బాష్పజలం; (2) చిరుగు;
** tear gland, ph. అశ్రుగ్రంథి; కన్నీటి కంతి;
* teardrop, n. అశ్రుబిందువు; అశ్రుకణం; కన్నీటిబొట్టు;
* teargas, n. బాష్పవాయువు; కన్నీరువాయువు;
* tears, n. అశ్రువులు; అశ్రుబిందువులు; కన్నీటిబొట్లు; కన్నీళ్లు; కన్నీరు; బాష్పములు;
** tears of joy, ph. ఆనంద ఆశ్రువులు; ఆనంద బాష్పములు;
* tease, v. t. (1) చిక్కులు విడదీయు; (2) ఏడిపించు; ఉడికించు; ఆగడం చేయు;
** tease the hair, ph. చిక్కులు విడదీయడానికి చిక్కట్టతో జుత్తుని దువ్వడం;
* teaser, n. చిక్కట్ట;
* teaspoon, n. మిళ్లిగరిటె; చాచెంచా; చిన్నచెమ్చా;
* teat, n. (1) ౘన్ను; ౘనుమొన; (2 ) తిత్తి;
* technical, adj. సాంకేతిక; తాంత్రిక; పారిభాషిక;
** technical terminology, ph. పారిభాషిక పదజాలం; సాంకేతిక పదజాలం;
* technicality, n. నిమిత్తమాత్రపు లొసుగు; పారిభాషికత;
* technician, n. తాంత్రికుఁడు;
* technique, n. పద్ధతి; కిటుకు; సంవిధానం; శిల్పం; విద్యామర్మం; కళాత్మకమైన ప్రయోగ విధానం;
* technology, n. సాంకేతికం; సాంకేతికత; సాంకేతిక తంత్రం; సంవిధాన శాస్త్రం;
** biotechnology, ph. జీవసాంకేతికం;
* tectonics, n. విరూపణం;
** plate tectonics, ph. పలక విరూపణం;
* tedious, adj. విసుగు పుట్టించే; బోరు కొట్టించే; ఎప్పటికీ తెమలని;
* teen-age, n. కౌమారం; మలిపదుల వయసు;
* teeth, n. pl. పళ్లు; పండ్లు; దంతాలు;
** canine teeth, ph. రదనికలు; కోరపళ్ళు;
** deciduous teeth, ph. పాల పళ్లు;
** incisor teeth, ph. కుంతకాలు; కత్తెర పళ్ళు;
** molar teeth, ph. చర్వణకాలు; దంతాలు;
** permanent teeth, ph. శాశ్వత దంతాలు; ప్రౌఢ దంతాలు;
* teething troubles, ph. [idiom] బాలారిష్టాలు; వాచ్యర్థం చిన్నపిల్లలకి వచ్చే రోగాలే అయినప్పటికీ ఏ పని చెయ్యడానికైనా మెదట్లో ఎదురయే ఇబ్బందులని సూచించడానికి గౌణ్యర్థంతో వాడే మాట;
* teetotaler, n. [idiom] మద్యం ఎన్నడూ ముట్టని వ్యక్తి; మాదక పానీయాలు ముట్టని వాడు; మందు ముట్టని మందభాగ్యుడు;
* tejpat, n. తేజపత్రి;
* telegram, n. తంతి; తంతివార్త; టెలిగ్రామ్; same as wire;
* teleological, adj. ప్రయోజన సంబంధమైన; ప్రయోజనాత్మక;
* telepathy, n. దూరానుభూతి; దివ్యానుభూతి; ఇంద్రియముల ప్రమేయం లేకుండా రెండు మనస్సులకు మధ్య జరిగే వార్తా ప్రసరణ;
* telephone, n. దూరవాణి; దూరశ్రవణి; శ్రవణి; టెలిఫోను;
* telescope, n. దుర్భిణి; దూరదర్శని; ఓఁకుమర; చుక్కీ; టెలిస్కోప్;
* television, n. దూరదర్శని; టెలివిజన్; టీవీ; దూరదర్శని;
* tell, v. t. చెప్పు; నుడువు;
* Tellurium, n. తెల్లురం; టెల్లూరియం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 52, సంక్షిప్త నామం, Te); [Lat. tellus = earth];
* telo, pref. అంత్య;
* telophase, n. అంత్యదశ;
* temerity, n. తెగువ; సాహసం;
* temp., n. కైజీతగాఁడు; తాత్కాలికంగా పనిచేసే వ్యక్తి;
* temper, n. పోఁపు; తాలింపు; తిరుగబోత; సాతాళింపు;
* temper, v. t. (1) పోఁపు పెట్టు; సాతాళించు; తాళించు; (2) గట్టిపరుచు; మలుచు; (3) మెత్తపరచు; ఇక్కడ ఒకే మాటకి రెండు వ్యతిరేక అర్థాలు గమనించునది;
* temperate, adj. మితమైన; సమశీతోష్ణ;
* temperature, n. ఉష్ణోగ్రత; తాపమానం; తాపక్రమం; తాప తీక్షణాన్ని తెలిపే సంఖ్య; శీతోష్ణ పరిమాణం; శీతోగ్రత;
** temperature gauge, ph. ఉష్ణమితి;
* tempered justice, ph. దయతో కూడిన శిక్ష;
* tempered steel, n. గట్టిపరచబడ్డ ఉక్కు;
* template, n. మూస; అది; తోడు; తోడిక; starter;
* temple, n.(1) గుడి; కోవెల; దేవాలయం; దేవళం; మందిరం; (2) కణత; నుదిటికి ఇరువైపులా ఉండే శిరోభాగం;
** temple without a roof, ph. దద్దళం;
* tempo, n. గమనం; జోరు; బిగి;
** tempo of a story, ph. కథాగమనం;
* temporal, adj. (1) కర్ణాస్థులకి సంబంధించిన; (2) ఐహికమైన; (3) కాలానికి సంబంధించిన;
** temporal lobes, ph. కర్ణావృత్తములు;
* temporary, adj. తాత్కాలిక; అసత్; తైంతిక; హంగామీ;
** temporary crew, ph. హంగామీ సిబ్బంది; కై సిబ్బంది;
** temporary residence, ph. మకాం;
** temporary staff, ph. కైజీతగాళ్లు;
* temporary, n. తాత్కాలికం;
* tempt, v. t. పురిగొలుపు; ఊరించు; ఆశపెట్టు; ఉసిగొలుపు; ప్రేరేపించు;
* temptation, n. ప్రలోభం;
* tempting, adj. ఆకర్షించెడు;
* ten, n. పది;
* ten, adj. దశ; పది;
* tenacity, n. జిగి; హఠం;
* tenancy, n. కౌలుదారితనం;
* tenant, n. నెలసరి; అద్దెకున్నవాఁడు; భూమి కౌలుకి తీసికొన్నవాఁడు;
* tend, v.i. ఒక వైపునకు జరుగు; మొగ్గుచూపు;
* tendency, n. వాటం; ప్రవృత్తి; ఉన్ముఖత; పోబడి; జాడ; ధోరణి; ఆసక్తి;
* tender, adj. లేత; కవట; కసు; మృదువైన; ఎల; (ant.) mature; ripe;
** tender vegetables, ph. కసుగాయలు; లేత కాయలు;
** tender age, ph. ఎలప్రాయము; చిరుతప్రాయము;
** tender leaf, ph. కవటాకు;
** tender shoots, ph. లేత చిగుర్లు;
* tender, n. కొనుగోలుకి సిద్దంగా ఉన్నామని తెలియజేసే లాంఛన పత్రం;
* tender, v. t. ఇచ్చు; లాంఛనంగా ఇచ్చు; దఖలు పరచు;
* tendon, n. స్నాయువు; స్నాయుబంధనం; కండరాన్ని ఎముకలతో బంధించే తాడు వంటి సాధనం; ప్రతి కండరానికి చివర ఈ పోగుల లాంటి టెండాన్ ఉండటం వల్ల అది ఎముకతో అతుక్కుని వాటిని మనం సులువుగా కదపగలుగుతూ ఉన్నాం;
* tendril, n. నులితీగ; లేత తీగ;
* tenement, n. చిన్న చిన్న వాటాలుగా కట్టిన అద్దె కొంపలు;
* ten-fold, n. పదింతలు; పదిరెట్లు;
* tenet, n. సిద్ధాంతం; సూత్రం;
* ten million, n. కోటి;
* tenon, n. కుసి; వడ్రంగంలో రెండు కర్రలని అతకడానికి ఒక కర్రకి ఉండే ముక్కు; రెండవ కర్రకి ఉండే బెజ్జాన్ని కుసి బెజ్జం అంటారు;
* tenor, n. (1) సారాంశం; (2) తారస్వరం;
* tense, n. [gram.] కాలం; కాలార్థకం;
** future tense, ph. భవిష్యత్ కాలం; భవిష్యదర్థకం;
** future indefinite tense, ph. తద్ధర్మ కాలం;
** past tense, ph. భూత కాలం; భూతార్థకం;
** present tense, ph. వర్తమానకాలం; వర్తమానార్ధకం;
** present perfect tense, ph. తద్ధర్మార్ధకం;
** present indefinite tense, ph. తద్ధర్మకాలం;
* tense, adj. బిర్రుగా; ఆరాటంగా; (ant.) lax;
* tension, n. బిగి; బిగితం; బిర్రు; జిగి; పట్టు; తన్యత; ఆతతి; ఉద్రిక్తత;
** emotional tension, ph. ఉద్రేకం;
** surface tension, ph. తలతన్యత;
* tension bar, ph. బిగిబద్ద;
* tent, n. డేరా; గుడారం; పటకుటిరం; షామియానా;
* tentative, adj. ప్రస్తుతానికి ఉపయోగపడే విధంగా;
* tenth, adj. దశమ; పదో; పదియవ;
* tepid, adj. నులివెచ్చ; గోరువెచ్చ; కదుష్ణ; కోష్ణమైన;
* tepidity, n. కోష్ణం;
* tera, pref. టెరా; ట్రిలియనుని సూచించడానికి వాడే పూర్వ ప్రత్యయం;
* term, n. (1) పదం; మాట; (2) నియత కాలం; కందాయం; ఏల్తరి; (3) విశ్వవిద్యాలయాల్లో "అర్ధ" సంవత్సరం కాని పావు సంవత్సరం కాని; (4) గణితంలో చలరాశి కాని చలరాశుల సముదాయం కాని;
** analogous term, ph. తుల్య పదం;
** antecedent term, ph. పూర్వ పదం;
** common term, ph. సమాహారక పదం;
** first term, ph. మొదటి కందాయం; మొదటి పదం; మొదటి అంశం;
* terminal, adj. శీర్ష; అవసాన; అంత్య; అంతిమ;
** multi terminal, ph. బహుశీర్ష;
** two terminal, ph. ద్విశీర్ష;
** terminal disease, ph. అవసాన రోగం; చివరి రోగం;
** terminal phase, ph. అంతిమ దశ;
** terminal stage, ph. అవసాన దశ; అవసాన కాలం;
* terminal, n. కడ; కాడు; కొస; కొన; చివరకు; అంతు; అంతం; అడంగు; అవధి; అవసాని; అవసానిక; గణి; శీర్షం; కోటి;
** cell terminal, ph. అంత్యకణం;
** computer terminal, ph. కలనావసాని; గణక అవసానిక; అవసాయకం;
** positive terminal, ph. ధన గణి; ధన శీర్షం;
* terminate, v. t. కడతేర్చు; కొసముట్టించు; అంతుచూడు; ఉపసంహరించు; చంపు; చాలించు;
* termination, n. ఉపసంహారం; ముగింపు; కడతేర్చడం; కొసముట్టించడం; అంతుచూడడం; పూర్తిచేయడం;
* terminator, n. ఉపసంహార రేఖ; ఒక గ్రహం మీద పగటికి, రాత్రికి మధ్య ఉండే ఊహాత్మక రేఖ;
* terminology, n. పదజాలం; పరిభాష;
* termite, n. చెదపురుగు; ఘణ; ఇవి చూడడానికి తెల్లటి చీమలలా ఉంటాయి కాని, ఇవి చీమలు కావు, బొద్దెంక జాతివి, చీమలకీ చెద పురుగులకీ మధ్య వైరం, చీమలు చెదపురుగులని తినేయ గలవు;
** termite hill, ph. చెదల పుట్ట;
* terms, n. pl. (1) అంశాలు; పదాలు; (2) నిబంధనలు; షరతులు;
* turpentine, n. శ్రీవేష్టం;
* terrace, n. డాబా; అలిందం; బోడిమిద్దె; గదులు లేని మీది అంతస్థు;
* terrestrial, adj. (1) అధిభౌతిక; (ant.) అధిదైవిక; (2) భూమికి సంబంధించిన; భూ;
** terrestrial creatures, ph. భూచరాలు;
* terrible, adj. భీషణ; భీభత్సకరమైన; భయంకరమైన; తీవ్రమైన; దారుణమైన; ఉచ్ఛండ; ఉగ్ర;
* terrier, n. ఉడుప కుక్క; మొరసడము;
* terrific, adj. భయంకరమైన; తీవ్రమైన; అద్భుతమైన;
* territorial, adj. ప్రాదేశిక; నేలవీటు; భూభాగానికి సంబంధించిన; దేశాధికారానికి సంబంధించిన;
** territorial sea, ph. ప్రాదేశిక [[సముద్రం]];
** territorial waters, ph. ప్రాదేశిక జలాలు; నేలవీటు నీళ్ళు;
* territory, adj. దేశం; సంస్థానం; ప్రదేశం; భూభాగం;
* terror, n. విపరీతమైన భయం;
* terrorizing, adj. భయానక;
* terrorism, n. ఉగ్రవాదం; a philosophy that supports unlawful violence and intimidation, especially against civilians, in the pursuit of political aims; (rel.) extremism = తీవ్రవాదం;
* terrorist, n. ఉగ్రవాది; (rel) extremist = తీవ్రవాది;
* terse, adj. క్లుప్తమైన; సంక్షిప్త;
* tertiary, adj. తృతీయ; see also triassic;
* test, n. పరీక్ష; శోధన; పరిశీలన;
* test, v. t. పరీక్షించు; శోధించు; పరిశీలించు;
* testament, n. (1) ఒప్పందం; (2) వీలునామా; మరణశాసనం;
** New testament, ph. మలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికి, దేవుడికీ మధ్య రెండవసారి జరిగిన ఒప్పందం;
** Old testament, ph. తొలి ఒప్పందం; క్రైస్తవుల నమ్మకం ప్రకారం మానవుడికీ, దేవుడికీ మధ్య జరిగిన తొలి ఒప్పందం;
* testator, n. మరణశాసనం రాసి చనిపోయిన వ్యక్తి;
* testes, n. బీజాండాలు; వృషణాలు; వట్టలు; వట్టకాయలు; ముష్కగోణులు;
* testicle, n. వట్ట; వట్టకాయ; వట్రకాయ; బీజాండం; వృషణం; ముష్కం; కర్పూరం;
* testify, v. t. సాక్ష్యమిచ్చు;
* testimony, n. సాక్ష్యం; వాంగ్మూలం;
** deathbed testimony, ph. మరణ వాంగ్మూలం;
* test tube, n. పరీక్ష నాళిక; శోధన నాళిక;
** test tube baby, ph. కుంభ సంభవుడు; భౌతికంగా స్త్రీ పురుష సంయోగం లేకుండా ప్రయోగశాలలో పురుష బీజాన్ని స్త్రీ అండంలో ప్రవేశపెట్టి కొత్త జీవిని సృష్టించడం;
* tetanus, n. [[ధనుర్వాతం]]; గుర్రపువాతం; బేక్టీరియా వల్ల కలిగే ఒక జబ్బు; ---a disease caused by the bacterium Clostridium tetani; this bacterium makes one harmful toxin; protection against tetanus is afforded by immunity to this single toxin; so tetanus vaccine contains one single protein;
* tether, n. సందము; కట్టుతాడు; కన్నెతాడు; పగ్గం;
* tethered, n. సందానితము; తాడుతో కట్టబడ్డది;
* tetra, pref. చతుర్;
* tetrad, n. చతుష్టయం; పుంజీ; చవిత;
* tetrafluoroethylene, n. చతుర్‌ప్లవనవిదిలీను; టెఫ్లాన్ తయారీకి ముడి పదార్థం; C<sub>2</sub>F<sub>4</sub>;
* tetragonal, adj. చతుష్కోణ;
* tetrahedron, n. చతుర్ముఖి; నలుమోమి; సమత్రిభుజాకారంలో నాలుగు ఫలకాలు (ముఖాలు) గల ఘన వస్తువు;
* tetraploid, adj. చతుస్థితిక;
* tetravalent, adj. చతుర్ బల; చతుర్‌బాహు;
* text, n. (1) పాఠం; (2) పాఠ్యపుస్తకం; వాచకం;
** non-detailed text, ph. ఉపవాచకం;
* text box, ph. పాఠ పేటిక; కంప్యూటర్ తెర మీద అక్షరాలని రాయడానికి వీలుగా ఏర్పాటు చేసిన పెట్టె;
* textiles, n. నేతబట్టలు; నేతసరకులు; జవళి;
** textile industry, ph. జవళి పరిశ్రమ;
* texture, n. అల్లిక; వ్యూతి; నేత నేసిన పద్ధతి; కూర్పు; కూర్పరితనం; నారుకట్టు; ఒక ఉపరితలం ఎలా ఉందో జ్ఞానేంద్రియాల స్పర్శకి కలిగే అనుభూతి; ఉ. ముతకగా ఉంది, మెత్తగా ఉంది, పిండిలా ఉంది, మొరుంలా ఉంది, అంటూ ఆ ఉపరితలం కట్టడి ఎలా ఉందో వర్ణించడానికి వాడే మాట;
* thalamus, n. పుష్పాసనం; పర్యంకదేశము; either of two masses of gray matter lying between the brain hemispheres on either side of the third ventricle, relaying sensory information and acting as a center for pain perception;
* Thalassemia, n. (తలసేమియా) జన్యులోపం వల్ల సంక్రమించే ఒక రకం రక్తలేమి; మొట్టమొదట మధ్యధరా సముద్ర ప్రాంతాలలో ఈ వ్యాధిని గుర్తించేరు కానీ దక్షిణ భారతదేశంలో కూడా ఈ వ్యాధి తరచుగా కనిపిస్తున్నది ; ఇది తేలికగా లొంగే వ్యాధి కాదు; (Gr.) Thalassa = సముద్రం; -emia = రక్త దోషాన్ని సూచించే ఉపసర్గ;
* Thallium, n. థేలియం; రెమ్మజం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 81, సంక్షిప్తనామం, Tl); [Gr. thalos = green shoot or twig];
* than, conj. కంటె;
* thank, .v. t. కృతజ్ఞత తెలుపు; ధన్యవాదాలు చెప్పు;
* thanks, n. ధన్యవాదాలు; మెప్పిదాలు; నెనర్లు; కృతజ్ఞతలు;
* that, pron. adj. ఆది; ఆ; తత్;
** different from that, ph. తత్‌భిన్నం;
** connected with that, ph. తత్‌సంబంధమైన;
** that way, ph. అటు;
* thatched, adj. గడ్డితో నేయబడ్డ; గడ్డితో కప్పబడ్డ; పూరి;
* thaw, v. i. కరుగు; ద్రవించు; మంచుతో గడ్డకట్టుకుపోయిన వస్తువు ద్రవించు;
* the, def. art. ఆ; ఈ;
* theater, n. (1) శాల; నాటకశాల; ఆటపాక; హాలు; (2) నాటకశాస్త్రం;
* theft, n. దొంగతనం;
* their, pron. (1) remote. వాళ్ల; వారి; వాళ్ళవి; వారివి; (2) proximate. వీళ్ల; వీరి; వీళ్ళవి; వీరివి;
* theism, n. ఆస్తిక మతం; భగవంతుడనే సృష్టికర్త ఉన్నాడని, అతడు దయామయుడు, మన మంచిచెడ్డలని చూస్తూ మనని కనిపెట్టుకుని ఉంటాడనే నమ్మకం; (from ‘theos’, ‘god’ in Greek) The view that the universal order is based on a hierarchical relationship between humans and a small group of ethereal entities called gods;
* theist, n. సేశ్వర వాది;
* theistic, adj. ఈశ్వరుడు ఉన్నాడనే నమ్మకంతో; సేశ్వర;
* them, pron. వారిని; వాళ్ళని;
* theme, n. ఇతివృత్తం; భూమిక;
* themselves, pron. వారే; అవియే; తామే;
* then, adv. అప్పుడు; అంతట; అటు పిమ్మట; ఆ తర్వాత; అనవుడు;
* thence, adv. అక్కడనుండి; అప్పటినుండి;
* theocracy, n. మతవర్గాధిపత్యం; మతధర్మ స్వామ్యం;
* theology, n. మతధర్మ శాస్త్రం; దేవుడికీ, మతానికీ, మనిషికీ మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలని విచారించే శాస్త్రం;
* theorem, n. ప్రమేయం; నియమం; సిద్ధాంతం; రుజువు అయినది;
** converse theorem, ph. విలోమ నియమం;
** derived theorem, ph. వ్యుత్పన్న నియమం;
** existence theorem, ph. అస్తిత్వ నియమం;
** fundamental theorem, ph. మూల సిద్ధాంతం;
* theoretically, adj. సిద్ధాంతరీత్యా;
** theoretical physics, ph. భౌతికశాస్త్ర సూత్రాలు; భౌతికశాస్త్ర సూత్రావళి;
* theorist, n. సిద్ధాంతకర్త;
* theorize, n. సిద్ధాంతీకరించు; సూత్రీకరించు; వాదించు; ప్రతిపాదించు;
* theory, n. వాదం; అభిమతం; ప్రతిపాదించబడ్డది; చెప్పిక;
** in theory, ph. సిద్ధాంతరీత్యా; శాస్త్ర ప్రకారం;
* Theosophical Society, n. దివ్యజ్ఞాన సమాజం;
* theosophy, n. దివ్యజ్ఞానం; దైవసంబంధమైన జ్ఞానం;
* therapeutic, adj. జబ్బుని కుదిర్చే; చికిత్సకి సంబంధించిన;
* therapy, n. చికిత్స;
* there, adv. అక్కడ;
* thereabouts, adv. ఆ చుట్టుపట్ల; ఆ సమీపంలో;
* thereafter, adv. ఆతర్వాత; తదాది; తదుపరి; అనంతరం;
* thereby, adv. తద్వారా; ఆ దారి వెంబడి; ఆ మూలాన్న;
* therefore, adv. కనుక; కాబట్టి; కావున; అందువల్ల; అందుచేత; తస్మాత్;
* therein, adv. అందులో;
* thereupon, adv. అందుమీదట;
* thermal, adj. తాప; తాపీయ; ఊషణ; ఉష్ణ;
** thermal currents, ph. తాపీయ ప్రవాహాలు;
* thermals, n. తాపీయాలు; భూతాపీయాలు; తాపవనాలు; భూమి వేడిమికి భూమినుండి పైకెగసే వేడి గాలి ప్రవాహాలు;
* thermic, pref. తాప;
* thermionic, adj. ఉష్ణయానిక; తాపయానిక;
** thermionic emission, ph. ఉష్ణయానిక ప్రసరణ; తాపయానిక ప్రసరణ;
* thermo, pref. తాప; ఉష్ణ;
* thermodynamics, n. ఉష్ణగతిశాస్త్రం; తాపగతిశాస్త్రం; ఉష్ణ చలనం;
* thermometer, n. తాపమాపకం; ఉష్ణమాపకం; తాపక్రమమాపి; ఉష్ణోగ్రతని కొలిచేది;
* thermosphere, n. ఉష్ణావరణం; ఇక్కడ ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటుంది. ఈ పొర ఉష్ణోగ్రత 1,500°C వరకూ ఉండే అవకాశం ఉంది. ఈ పొరలో గాలి సాంద్రత తగ్గుతుంది . ఈ పొరలోనే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం పరిభ్రమిస్తుంటుంది;
* thermostat, n. తాపస్థాపకి; ఉష్ణోగ్రతని ఒక చోట స్థిరంగా నిలిపే ఉపకరణం;
* thesaurus, n. సంబంధి పదకోశం; పదార్థ భాండాగారం;
* these, pron. proximate. ఈ: ఇవి;
** of these, ph. వీటి;
** whose are these?, ph. ఇవి ఎవరివి?
** these things, ph. ఇవి;
** these people, ph. వీళ్లు; వీరు;
* they, pron. వాళ్లు; వారు;
* thick, adj. దట్టమైన; మందమైన; చిక్కనైన; చిక్కని; అవిరల; నిబిడ;
* thicket, n. గుబురు; తుప్ప; చిట్టడవి; చిన్న అడవి;
* thickness, n. దళసరి; మందం;
* thief, n. దొంగ; తస్కరుడు; పాటచ్ఛరుడు; తాయువు; అధశ్చరుడు; మ్రుచ్చు; హర్త; అపహర్త; కేడీ;
* thigh, n. తొడ; పెందొడ; కురువు; ఊరువు; జంఘిక; ఊర్వి; అంకం;
** lower thigh, ph. కీతొడ;
** thighbone, n. తొడ ఎముక; జంఘికాస్తి; ఊర్వికాస్తి; ఉరోస్తి;
* thin, adj. పలుచని; సన్నని; బక్కపలుచని; పేలవ; పీల;
* thing, n. (1) వస్తువు; పదార్థం; (2) సంగతి;
* think, v. i. ఆలోచించు; ఆలోచనచేయు; స్మరించు; తలపెట్టు; తలపోయు; యోచించు; భావించు;
** think tank, ph. స్మరణ తటాకం;
* thinker, n. m. భావుకుడు; ఆలోచనాపరుడు; తలపోతరి;
* thinking, adj. ఆలోచించే; ఆలోచన చేయగల;
* third, adj. మూడవ; తృతీయ; తార్తీయ;
* third, n. మూడవది; తృతీయం; తార్తీయం;
* thirst, n. దాహం; దప్పిక; దాహతి; పిపాస; తృష్ణ; ఉదన్యత;
** excessive thirst, ph. విదాహం;
* thirst for knowledge, ph. ఆదిత్స;
* thirteen, n. పదమూడు;
* thirteenth, adj. త్రయోదశ; పదమూడవ;
* thirtieth, adj. ముప్ఫయ్యవ; ముప్పదియవ; త్రింశ;
* thirty, n. ముప్పయి; ముప్పదియవ; త్రింశత్;
* this, adj. ఇది; ఈ;
* this way, ph. ఇటు;
* thorax, n. హృదయ కుహరం; ఉరహ్ పంజరం;
** thoracic cavity, ph. హృదయ కుహరం; ఉరః పంజరం;
* Thorium, n. దురం; ఒక రసాయన మూలకం; (అణసంఖ్య 90, సంక్షిప్త నామం, Th);
* thorn, n. ముల్లు; కంటకం;
* thorns, n. pl. ముళ్లు; ముండ్లు;
** thorny bush, ph. ముళ్లకంప;
** thorny fence, ph. ముళ్ల కంచె;
* thoroughbred, n. మేలుజాతి గుర్రం; రెండు వైపులా మంచి ప్రవర ఉన్న గుర్రం;
* thoroughfare, n. రహదారి;
* thoroughly, adv. క్షుణ్ణంగా; పూర్తిగా; సంపూర్ణంగా; కూలంకషంగా; సమగ్రంగా;
* those, adj. ఆ; అవి; వారు;
** those papers, ph. ఆ కాగితాలు;
** those people, ph. వాళ్లు;
** of those people, ph. వాటి;
* though, conj. (దో) అయినప్పటికి;
* thought, n. చింత; ఆలోచన; తలపు; తలపోత; భావం; మనోభావం; చిత్తం; చిత్; స్పురణ;
** purity of thought, ph. చిత్తశుద్ధి;
** thought experiment, ph. మనో ప్రయోగం; స్పురణ ప్రయోగం;
** thoughtful person, ph. ఆలోచనాపరుడు;
* thoughtfully, adv. సాలోచనగా;
* thousand, n. వెయ్యి; వేయి; సహస్రం; దశశతి;
* thousandth, adj. వెయ్యవ; వేయవ;
* thrash, v. i. కొట్టుకొను; గిలగిలలాడు;
* thrash, v. t. ఉప్పళించు; ఝాడించు;
* thread, n. (1) దారం; సూత్రం; నూలిపోగు; తంతువు; (2) కడ్డీ మీద సర్పిలాకారంలో కోయబడ్డ వెన్నుపట్టె; (3) తంతువు; కంప్యూటర్ రంగంలో ఒక చిన్న పని చేస్తూన్న ఆదేశాల వరుసక్రమం; In technology, a thread is typically the smallest set or sequence of instructions that a computer can manage and execute; it is the basic unit of processor (CPU) utilization;
* threat, v. t. బెదరింపు; భిభీషిక;
* threat, n. బెదిరింపు; బిభీషిక;
* three, n. (1) మూడు; తిగ; త్రి; ముమ్మడి; (2) ముగ్గురు; మువ్వురు;
* three people, ph. ముగ్గురు; మువ్వురు;
* three-dimensional, adj. త్రిదిశాత్మక; త్రిమితీయ; త్రిపరిమాణిక;
* three-fold, adj. ముమ్మడి; త్రివళి;
* three-fourths; n. ముప్పాతిక;
* three-times, adj. ముమ్మారు; మూడుసార్లు;
* three-way, adj. ముమ్మడి;
* thresh, v. t. నూర్చు;
* threshing, n. నూర్పు; నురుపిడి;
** threshing floor, ph. నూర్పుడు కళ్ళెం;
* threshold, n. (1) గడప; గుమ్మం; దేహళి; (2) హద్దు;
** space threshold, ph. గడప;
** time threshold, ph. గడుపు;
* thrice, n. మూడు సార్లు; ముమ్మారు; ముమ్మడి; ముబ్బడి;
* thrift, n. పొదుపు; మితవ్యయం; పోడిమి; ఊజ్జితం;
* thrill, n. ఉద్విగ్నత;
* thrilling, adj. హృదయంగమ;
* thrive, v. i. వర్ధిల్లు; బాగుపడు; వృద్ధి చెందు; నమనమలాడు;
* throat, n. గొంతుక; గళం; కంఠం; పీక;
* throbbing, n. పరిస్పందం;
* thrombosis, n. రక్త నాళంలో రక్తపు కుదువ ఏర్పడుట;
* thrombus, n. గడ్డ; బెడ్డ;
* throne, n. సింహాసనం; గద్దె; అధికార పీఠం;
* throng, n. సమూహం;
* through, prep. (త్రూ) గుండా;
* throw, v. t. విసరు; రువ్వు; గిరాటు వేయు;
* thrush, n. కస్తూరి పిట్ట; కస్తూరి పక్షి;
* thrust, v. t. తోయు; పొడుచు; గుచ్చు;
* thumb, n. (తమ్) బొటనవేలు; అంగుష్ఠం; చేతి బొటన వేలు;
** Thucydidec trap, ph. అంతర్జాతీయ రాజకీయ రంగంలో ఒక ఎదుగుతూన్న రాజ్యం, యాజమాన్యంలో స్థిరపడ్డ ఎదిగిన రాజ్యంతో పోటీ పడినప్పుడు, విజయం నాలుగింట మూడు సార్లు ఎదుగుతూన్న దేశాన్నే వరిస్తుంది అనేది గ్రీకు వేదాంతి తుసిడైడీస్ వెలిబుచ్చిన అభిప్రాయం; a political theory stating that when a rapidly rising power threatens to displace an established ruling power, the resulting structural fear and tension make war almost inevitable.
** rule of thumb, ph. బండ నియమం; అంగుష్ఠ నియమం;
** thumbnail sketch, ph. చిన్నది; క్లుప్తంగా చెప్పబడ్డది; నఖచిత్రం; అంగుష్ఠ చిత్రిక; కరరుహ చిత్రం; ఒక ఊహకి టూకీగా ఇచ్చిన రూపురేఖలు;
* thumbtack, n. బొత్తాంనాటు; సుత్తి అవసరం లేకుండా బొటనవేలితో గోడకి గుచ్చగలిగే సదుపాయం ఉన్న మేకు;
* thunder, n. ఉరుము; మేఘనాదం;
* thunderbolt, n. పిడుగు; ఆశనిపాతం; భిత్తిక;
* Thursday, n. గురువారం; లక్ష్మివారం; బృహస్పతి వారం; బేస్తవారము; బృహస్పతి వార > బిహస్త వార > బియస్తవార > బేస్తవార > బేస్తార;
* thus, adv. కావున; అని; ఇట్లు; ఈ తీరున; ఈవిధంగా;
* thyme, n. వాముపువ్వు; ఉగ్రగంథం; వంటలలో వాడే ఒక సుగంధ ద్రవ్యం; [bot.] ''Thymus vulgaris;''
* thyroid, n. కాళకగ్రంథి; గళగ్రంథి; అవటుగ్రంథి; గొంతుకలో ఉండే ఒక వినాళ గ్రంథి;
* tiara, n. లలాటపట్టం; చిన్న కిరీటం; కిరీటిక;
* tibia, n. జంఘాస్తి; అంతర్ జంఘాస్తి; తొడలో ఉండే ఒక ఎముక;
* ticket, n. టికెట్టు; కట్టిన డబ్బుకి రసీదు; చీటీ;
* Tibetan, adj. కీచక;
* tickle, n. కితకిత; చక్కలిగింత;
* tic-tac-toe, n. దాడాట;
* tidal wave, ph. ఉప్పెన; సముద్రంలో ఆటు పోట్లు, తుపాను కలిసినప్పుడు సముదమట్టంలో ఉన్న తీర ప్రాంతాలు ములిగిపోవడం; (rel.) tsunami;
* tide, n. పోటు; సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల;
** ebb tide, ph. ఆటు; నీటిమట్టం పెరుగుదల;
** flood tide, ph. పోటు; నీటిమట్టం పెరుగుదల;
** high tide, ph. పోటు; నీటిమట్టం పెరుగుదల;
** low tide, ph. ఆటు; నీటిమట్టం తరుగుదల;
** neap tide, ph. అష్టమినాడు వచ్చే ఆటుపోట్లు;
** spring tide, ph. నిండు పౌర్ణమికి, అమావాస్యకీ బాగా ఉధృతంగా వచ్చే ఆటుపోట్లు;
* tides, n. ఆటుపోట్లు; సూర్యచంద్రుల ఆకర్షణ కారణంగా భూమి, సముద్రపు మట్టాల పెరుగుదల, తరుగుదలలు; ఇవి భూమి మీద ప్రతి 24 గంటల 58 నిముషాలలో రెండుమార్లు వస్తాయి;
* tie, v. t. కట్టు; ముడిపెట్టు;
* tie up, v. t. అన్వయించు; ముడిపెట్టు; రెండింటికి మధ్య సంబంధాన్ని చూపు;
* tier, (టియర్) n. (1) మెట్టు; ఆంచె; అంతస్థు; పావంచా; సోపానం; (2) వరుసల శ్రేణి;
* tiffin, n. ఉపాహారం; ఫలహారం; breakfast; snack; light meal;
* tiger, n. పెద్దపులి; బెబ్బులి; కోలుపులి; పులి; మువ్వన్నెమెకము; శార్దూలం; పుండరీకం; పంచనఖము; భయానకము; భేలకము; మృగశ్రేష్ఠము; వ్యాఘ్రము;
* tight, adj. బిగువు; బిగువైన; బిగుతు;
* tight-fisted, ph. పితలాటకం; పిసినారితనం;
* tighten, v. t. బిగించు; ఉగ్గగట్టు; ముద్రించు;
* tightness, n. బిగి; బిగుతు;
* tigon, n. పుహం; మగ పులికి, ఆడ సింహానికి పుట్టిన కంచర జంతువు; see also liger;
* tigress, n. f. ఆడుపులి;
* tile, n. పెంకు; ఓడుబిళ్ల; పలక;
** flat tile, ph. బిళ్ళ పెంకు;
** Mangalore tile, ph. బంగాళా పెంకు; (మంగుళూరు పెంకు అనడానికి బదులు బంగాళా పెంకు అన్నారు)
** native tile, ph. నాటు పెంకు;
* till, prep. వరకు; దాక;
* till, v. t. దున్ను;
* till, n. సొమ్ము సొరుగు; గల్లాపెట్టి సొరుగు; గల్లాపెట్టి;
* tillable, n. నావ్యం; దున్నడానికి వీలైనది;
* tilt, v. t. ఒంచు; ఒరిగించు;
* tilt, v. i. ఒంగు; ఒరుగు; మొగ్గు;
* timber, n. కచ్చా కలప; పడగొట్టిన చెట్లు, వగైరా మానులు; see also lumber; logs;
** timber industry, ph. దారు పరిశ్రమ;
* timbre, n. (టేంబర్) ధ్వనిగుణం; నాదగుణం; సంగీత వాద్యవిశేషం పుట్టించే తరంగాలు చెవికి తగినలినప్పుడు మన అనుభూతిలో కలిగే వైవిధ్యత; తరచుదనం, బిగ్గతనం ఒకేలా ఉన్నా చెవికి వినబడినప్పుడు ధ్వనిలో తేడా; The unique "fingerprint" of a sound, determined by its overtone series (harmonics); the quality of a tone; When comparing different instruments playing the same note, the difference you hear is their timbre.
* time, n. (1) కాలం; వేళ; సమయం; గంట; పొద్దు; సేపు; (2) తీరిక; వ్యవధి; సేపు; అదను; (3) మారు; మాటు; తపవ; తూరి; తడవ; సారి; చుట్టు; పాలి; విడత; దఫా; పర్యాయం;
** at an earlier time, ph. మునుపు; పూర్వం; గతంలో;
** another time, ph. మరో మారు; మరొకసారి;
** at this time, ph. ఈవేళప్పుడు; ఇప్పుడు; ఈ సమయంలో;
** contemporary time, ph. వర్తమానకాలం;
** first time, ph. మొదటిసారి; మొదటి దఫా;
** from what time? ph. ఎప్పటినుండి?; (lit.) from when;
** how much time? ph. ఎంతసేపు?;
** in the meantime, ph. అందాకా;
** one time, ph. ఒక మారు; ఒక పరి; ఒక సారి; ఒక తేప; ఒక తూరి; ఒక తడవ; ఒక విడుత;
** one more time, ph. ఇంకో మారు; ఇంకోసారి; మరొకసారి;
** this time, ph. ఈ మారు; ఈ సారి; ఈ తడవ; ఈ దఫా;
** time barred, ph. కాలదోషం పట్టిన;
** time-limited, ph. కాలికం;
** time stamp, ph. కాల ముద్ర; వేళ ముద్ర; ఒక పని ఎప్పుడు మొదలయిందో ఎప్పుడు పూర్తయిందో సూచించడానికి వేసే ముద్ర;
** time table, ph. కాలదర్శిని; సమయ సారణి;
** time travel, ph. కాల ప్రస్థానం; కాల యానం;
** time zone, ph. కాల మండలం; సమయ మండలం;
* timely, adj. కాలోచిత; సమయోచిత; సందర్భానికి అనుకూలమైన;
* times, adj. సార్లు; మార్లు; చుట్లు; తడవలు; తూర్లు; ఆవర్తులు;
** at all times, ph. ఎల్లవేళల; కలకాలం; నిరంతరం;
** hundred times, ph. నూరు సార్లు; శతథా; చాలాసార్లు;
** many times, ph. చాలాసార్లు; చాలా తడవలు; చాలా చుట్లు; పలుమారులు; చాలా పర్యాయములు;
** some times, ph. అప్పుడప్పుడు;
** two times, ph. రెండు ఆవర్తులు; రెండుసార్లు; రెండు తూర్లు;
* timidity, n. పిరికితనం; భీరుత; భీరుత్వం; బేలతనం;
* tin, adj. కళాయి; తగరపు;
** tin foil, ph. తగరపు తగడు;
** tin sheet, ph. చీనారేకు; (ety.) Chinese metal sheet;
* Tin, n. తగరం; వంగం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 50, సంక్షిప్త నామం, Sn); [Lat.] stannum;
* tin, n. (1) కళాయి; (2) డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా;
* tin-can, n. డబ్బా; కళాయి పూసిన ఇనుప రేకుతో చేసిన డబ్బా;
* tincture, n. ద్రావణం; ఒలంతం (ఆల్కహాలు)తో కలిపిన మందు; అరఖు;
** mother tincture, ph. మాతృ ద్రావణం;
* tinge, n. లేశమంత రంగు;
* tinnitus, n. (టిన్నిటస్), కర్ణనాదం; బయట ప్రేరణ కారణమైన శబ్దాలు ఏవి లేకపోయినా చెవిలో శబ్దాలు (ఈలలు, వగైరా) వినిపించడం; Tinnitus is when you experience ringing or other noises in one or both of your ears. The noise you hear when you have tinnitus isn't caused by an external sound, and other people usually can't hear it. Tinnitus is a common problem. It affects about 15% to 20% of people and is especially common in older adults.
* tin-plate, n. కళాయి పూసిన ఇనుప రేకు;
* tin plating, v. t. కళాయి పెట్టుట; వంగలేపనం;
* tinsel, n. కాకి బంగారం; ముచ్చె బంగారం;
* tint, n. డౌలు; రాగము; కవురు;
** yellow tint, ph. పసుపు డౌలు;
* tintinnabulation, n. గంటారావం; టింగు మనే చప్పుడు; గంట చేసే ధ్వని;
* tiny, adj. బుల్లి; ఆణక; బుచ్చి; చిరుతుక;
* tion, n. (టియాన్) పుహం; మగపులికి ఆడసింహానికి పుట్టిన కంచర జంతువు, ఈ జాతులు(పుహాలు) పునరుత్పత్తి చేయలేవు, ఇవి సంతానహీన జాతులు; రెండు మాటలని జత చేసి కొత్త మాట సృజించటాన్ని “పోర్ట్ మాంటో“ (Portmanteau) అంటారు. ఇంగ్లీషులో ఇలాంటి పదాలు ఇంకా స్మాగ్ (smog = SMoke+Fog), బ్రంచ్(Brunch = Breakfast+Lunch); see also liger;
* tip, n. (1) మొన; కొన; కొడి; ముల్లు; అగ్రం; (2) బక్షిస్; ఈనాం;
* tirade, n. దూషణ పరంపర; దుష్ర్పచారం;
* tire, tyre (Br.) n. టైరు;
* tire, v. i. అలసిపోవు; డస్సిపోవు; డీలాపడు;
* tiredness, n. అలసట; అలసిపోవుట; డీలాపడుట;
* tireless, adj. అలుపుఎరుగని; నిర్విరామమైన;
* tissue, n. కణజాలం; కణతండము; కణసంహతి; కణరాశి; కులాయం; ధాతువు; పేసీజాలం; అంగాంశం;
** fibrous tissue, ph. పీచు ధాతువు;
** tissue paper, ph. పల్చటి మృదువైన కాగితం;
* tits, n. pl. ౘన్నులు; సళ్లు; ఉరోజాలు; స్తనాలు; వక్షోజాలు;
* Titanium, n. టైటేనియం; తితినం; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 22, సంక్షిప్త నామం, Ti); [Lat.] titans are the first sons of the Earth;
* title, n. (1) బిరుదు; పట్టం; (2) పేరు; (3) హక్కు; పట్టా; (4) శీర్షిక;
* titles, n. (1) బిరుదులు; (2) పేర్లు; (3) సినిమాలలో చూపించే నటీనటుల పేర్లు, సాంకేతిక నిపుణుల పేర్లు;
* titrant, n. అంశమాపణి;
* titration, n. అంశుమాపనం;
* titter, v. i. ఇకిలించు; భయంతో కూడిన భావంతో నవ్వు;
* titular, adj. నామకః; నామకార్థం; నామమాత్రపు; పేరుకి మాత్రం; నామ్‌కే వాస్తే;
* to, prep. కి, కు; తో; వద్దకు;
* toad, n. గోదురుకప్ప; కప్ప రూపంలో ఉండే ఒక భూచరం;
* toadstool, n. కుక్కగొడుగు; విషపూరితమైన పుట్టగొడుగు; see also mushroom;
* tobacco, n. (1) పొగమొక్క; (2) పొగాకు; [bot.] ''Nicotiana tobacum'' of the Solanaceae family;
** tobacco leaf, ph. పొగాకు; ధూమ్రపత్రి;
** tobacco plant, ph. పొగమొక్క;
* today, n. నేడు; ఈరోజు; ఈనాడు; ఈవేళ;
* toe, n. కాలివేలు;
** big toe, ph. కాలి బొటనవేలు; అంగుష్ఠం;
** toe nail, ph. కాలివేలి గోరు; కాలిగోరు;
** toe rings, ph. pl. మట్టెలు; చిట్టిబొద్దులు; స్త్రీలు ధరించే ఆభరణాలు;
* together, prep. కలసి; తో; తోడ;
* toil, n. ప్రయాస; శ్రమ;
* toil, v. i. ప్రయాసపడు; శ్రమపడు; శ్రమించు; పాటుపటు; కష్టపడు;
* toilet, n. (1) సైరంధ్రి; అలంకరణకి ఉపయోగించే గది; (2) మరుగు గది; మరుగు గదిలో మలమూత్రాదుల విసర్జనకు వాడే గది లేక ఉపకరణం;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
'''USAGE NOTE; toilet, restroom, bathroom
* Use ''bathroom'' for a room in a house where there is a toilet. Use ''restroom'', ''men’s room'', and ''ladies’ room'' to talk about a room in a public place where there are one or more toilets. On a plane or train, this room is called ''lavatory''.'''
|}
*
* toiletries, n. pl. ధావన సామగ్రి; పళ్లు, ఒళ్లు తోముకోడానికి కావలసిన పళ్లపొడి, సబ్బు, వగైరా;
* tofu, n. టోఫూ; సోయాపాల జున్ను; సోయా చిక్కుడు పాల నుండి తీసిన పెరుగు వంటి పదార్ధాలతో చేసిన జున్ను వంటి పదార్థం;
* token, n. అడియాలం; గురుతు; చిహ్నం; ఆనవాలు; సైగ; కందువ;
* tolerable, adj. సహ్య;
* tolerance, n. సహనం; సహనశక్తి; ఓర్మి; ఓర్పు; నిభాయింపు; తాళుకం; సహిష్ణుత; క్షమ;
* tolerance test, ph. తాళుక పరీక్ష; సహన శక్తి పరీక్ష;
** glucose tolerance test, ph. గ్లూకోజు తాళుక పరీక్ష;
* tolerate, v. t. తాళుకొను; తట్టుకొను; సహించు; భరించు; ఓర్చుకొను; నిభాయించు;
* toleration, n. సహనం; ఓర్పు;
* toll, n. (1) దారి సుంకం; దారి పన్ను; (2) దెబ్బ; నష్టం;
** took a toll, ph. దెబ్బ తిన్నాది;
** toll booth, ph. చవుకీ; సుంకరి మెట్టు; ఆసీల మెట్ట; ఆసీల చౌకు; ఘట్టం; రహదారిలో పన్నులు వసూలు చేసే స్థలం;
* tomahawk, n. పరశువు;
* tomato, n. టొమేటో; టమాటా; రామ్ములగ; సీమవంకాయ; తక్కాలీ; సీమతక్కలి; తర్కారి; కర్పూరవంగ; సీమబుడ్డబూసరకాయ; పుల్లవంకాయ; a fruit of the nightshade family that is native to S. America. The U.S. Supreme Court decided that this belongs to the vegetable family rather than the fruit family; [bot.] ''Lycopersicum esculatum;'' of the Solanaceae family;
* tomatillo, n. టొమేటిల్లో; జాంబెరీ పండు; [bot.] ''Physalis ixocarpa;'' ఇక్సోకార్పా అంటే జిగురుగా ఉన్న పండు అని అర్థం;
* tomb, n. (టూమ్) గోరీ; సమాధి;
* tomcat, n. m. గండుపిల్లి;
* tome, n. పెద్ద పుస్తకం; ఉద్గ్రంథం; దస్తరం;
* tomorrow, n. రేపు;
** day after tomorrow, ph. ఎల్లుండి;
* ton, n. టన్ను; బరువుని తూచే కొలత;
** long ton, ph. పెద్దటన్ను; 2,240 పౌనులు; ఇంగ్లండులోను, తదితర కామన్వెల్తు దేశాలలోను వాడుకలోనున్న కొలమానం;
** metric ton, ph. మెట్రిక్‌టన్ను; 1,000 కిలోలు; 2204.62 పౌనులు; అంతర్జాతీయ మెట్రిక్ పద్ధతిలో వాడే కొలమానం;
** short ton, ph. చిన్నటన్ను; 2,000 పౌనులు; అమెరికాలోను, కెనడాలోను వాడుకలోవున్న కొలమానం;
* tone, n. (1) స్వరం; ధ్వని; తానం; నాదం; ఒక శబ్ద తరంగం యొక్క శ్రేష్ఠత; అది ప్రకంపించే పౌనఃపున్యం యొక్క శ్రేష్ఠత; tone is the sinusoidal component of a sound wave; Everyday sounds are complex sounds, which are made up of many tonal frequency components; (2) శరీరావయవాలకి, కండరాలకి ఉండే బిగి;
* toner, n. (1) లేసరు ముద్రణ యంత్రాలలో సిరాకు బదులు వాడే ఒక రకమైన రసాయన పొడి; (2) చర్మ సౌందర్యానికి వాడే ఒక పదార్ధం;
* tongs, n. స్రావణం; చిమటా; నిరుకారు; (rel.) పటుకారు;
* tongue, n. (1) నాలిక; నాలుక; జిహ్వ; అర్రు; (2) భాష;
* foreign tongue, ph. పరదేశపు భాష;
* mother tongue, ph. మాతృభాష;
* slip of the tongue, ph. నోరు జారడం;
** tongue cleaner, ph. పాచిబద్ద;
* tonic, n. బలవర్ధకౌషధం;
** tonic water, ph. Tonic water is a carbonated soft drink in which quinine is dissolved. Originally used as a prophylactic against malaria, modern tonic water typically has a significantly lower quinine content and is often more sweetened than the original medicinal form. It is consumed for its distinctive bitter flavor. Gin and Tonic was a popular drink among the British during the colonial era;
* tonight, n. ఈ రాత్రి; ఈ రోజు రాత్రి;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
* '''---USAGE NOTE; tonight, last night
* ---Use ''last night'' for the night of yesterday. Do not say, “yesterday night.”'''
|}
*
* tonsillitis, n. గవదల వాపు; ఘశాంత దాహం;
* tonsils, n. గవదలు; నోటిలో కొండనాలుకకి ఇరుపక్కలా ఉండే కణజాలం;
* tonsure, n. గుండు చెయ్యడం; గుండు కొట్టించడం; శిరోముండనం; వపనం;
* too, adv. కూడా; సైతం; సహితం;
* tool, n. పనిముట్టు; సాధనం; కరణం; ఉపకరణం; పరికరం;
* toolbar, n. కరణపు పట్టీ;
* toolbox, n. పొది;
** barber's toolbox, ph. మంగలి పొది;
* toot, n. (1) బూరా; (2) కూత; గుడ్లగూబ అరుపు; ఘాత్కారం;
* tooth, n. పల్లు; పన్ను; దంతం; కళ్ళు-కన్ను సామ్యం వల్ల ఏకవచనంలో పన్ను ఏర్పడింది కానీ 'పన్ను' అన్న మాట ఇక్కడ సరి అయినది కాదు.
** impacted tooth, ph. అంతర్ఘటన దంతం; పూర్తిగా ఎదగకుండా ఇగుళ్ల లోనే ఉండిపోయిన పన్ను; దీనిని శస్త్ర చికిత్స చేసి బయటకి తీయాలి;
* toothache, ph. పంటినొప్పి;
* toothbrush, n. దంతమార్జని; దంతకాష్టం; పళ్ళు తోముకునే కుంచె;
* toothed, adj. దంతదారు;
* toothpaste, ph. దంతధావన ఖమీరం;
* toothpick, n. దంతకాష్టం; పళ్లు కుట్టుకునే పుల్ల;
* toothpowder, n. పళ్లపొడి; దంత ధావన చూర్ణం;
* top, adj. మీద; పైన; పై;
* top, n. బొంగరం; బ్రమరకం; విఘూర్ణి;
* topaz, n. గోమేధికం; పుష్యరాగం; పీతస్పటికం;
* topic, n. అంశం; చర్చనీయాంశం; సంగతి; విషయం;
** burning topic, ph. ప్రజ్వలిత అశం;
* topography, n. నైసర్గిక స్వరూపం; స్థలాకృతి;
* topology, n. సంస్థితి శాస్త్రం;
* topper, n. అగ్రగణ్యుడు; అగ్రగామి; అగ్రేసరుడు; అగ్రణి; చిటారి;
* topple, v. t. కూలద్రోయు; పడద్రోయు;
* topsy-turvy, adj. తలకిందైన; విటతటం;
* torch, n. దివ్వె; దివిటీ; కాగడా; దీపం; ఇలాయి;
** torch bearer, ph. దీపధారి; వైతాళికుడు;
* torch, v. t. అంటించు; ముట్టించు; నిప్పుపెట్టు;
* torment, v. t. ఆరడిపెట్టు; హింసించు; యాతనపెట్టు;
* tormentor, n. ధూర్తుడు; కంటకుడు;
* tornado, n. సుడిగాలి; చక్రవాతం; ఉత్పాత పవనం; పెనుగాలి; అతిమారుతం; నిర్ఘాతం;
* torque, n. పురిబలం; మెలిబలం; బలభ్రామకం; పురిశ; a twisting force that tends to cause rotation; imagine a wheel of radius r and a linear force F is applied on the circumference of the wheel, then torque = r x F x sine of the angle between the vector r and the vector F; What force is to linear motion, torque is to rotational motion; the unit of force is Newtons and the unit for torque is Newton-meters;
* torrential, adj. విపరీతమైన; కుండపోతగా;
** torrential rains, ph. కుంభవృష్టి; కుండపోత; విపరీతమైన వాన;
* torsion, n. పురి; మెలి; విమోటనం; పురి పెట్టినట్లు తిప్పుట; Torsion is the twisting of a beam/rod under the action of a torque (twisting moment); Torque and torsion are both related to turning effects experienced by a body. The main difference between torque and torsion is that torque describes something capable of producing an angular acceleration, whereas torsion describes the twist formed in a body due to torque;
** torsion balance, ph. పురి త్రాసు;
* torso, n. మొండెం; కబంధం;
* tort, n. వికర్మ;
* tortoise, n. (టార్డస్) తాఁబేలు; కూర్మం; కచ్చపం; కమఠం; నేల తాబేలు;
* torture, n. చిత్రహింస; వింగారియ;
** death by torture, ph. చిత్రవధ;
* torque, n. పురిబలం; Torque is a measure of how much a force (బలం) acting on an object causes that object to rotate; The unit of torque is a Newton-meter, which is also a way of expressing a Joule (the unit for energy, శక్తి). However, torque is not energy. భౌతిక శాస్త్రంలో శక్తి, బలం వేర్వేరు భావాలు;
* torus, n. వడాకారం;
* toss, v. i. అల్లాడు; అల్లల్లాడు; దొర్లు;
* toss, v. t. ఎగరవేయు; విసరు;
* tossed, adj. ఎగరవేయబడ్డ; ఉదంచిత;
* tot, n. m. కుర్రాడు; పిల్లాడు; డింభకుడు;
* tot, n. f. కురద్రి; పిల్ల;
* total, v. t. మొత్తం చేయు; కూడు;
* total, n. మొత్తం;
* totalitarianism, n. ఏకాధిపత్యం; నిరంకుశత్వం;
* totally, adv. పూర్తిగా; పరిపూర్ణంగా; ఆసాంతంగా; అచ్చంగా; బొత్తిగా; సుతరామూ; వడసారంగా;
* tottering, adj. కసిమసి;
* toucan, n. శరారి; ఆడేలు; దక్షిణామెరికా అడవులలో ఉండే ఒక పెద్దముక్కు గల పక్షి;
* touch, adj. సంస్పర్శ;
* touch, v. t. తగులు; తాకు; సోకు; అంటుకొను; ముట్టుకొను; స్పర్శించు; స్పృశించు;
** sense of touch, ph. స్పర్శ జ్ఞానం;
* touch, n. స్పర్శ; అభిమర్శం; అభిమర్శనం;
* touch-me-not, n. (1) సోకుడుముడుగు; అత్తిప్రత్తి; ఏటేటా పాతే రంగురంగుల పువ్వుల పూసే ఒక రకం మొక్క; (2) [idiom] నన్ను ముట్టుకోకు నా మాల కాకి;
* touchstone, n. (1) స్పర్శవేధి; పరసువేది; నీచలోహాలను బంగారంగా మార్చగల దివ్యశక్తి ఉన్న ఒక రాయి; (2) ఒరగల్లు; గీటురాయి; బంగారం వన్నె చూడటానికి వాడే గీకుడు రాయి;
* tough, adj. దిట్టమైన; దృఢమైన; బిరుసైన;
* toughness, n. దిట్టతనం; దృఢత్వం; బిరుసుతనం;
* toupee, n. (టూపే), మగవారి బట్ట తలని కప్పిపుచ్చే "విగ్గు";
* tour, n. పర్యటన; దేశాటన;
* tourists, n. pl. పర్యాటకులు; దేశికులు;
* toward, towards, adv. వైపు; దెసకు; యెడల; పట్ల;
* towel, n. తువ్వాలు; తుండు; తుండుగుడ్డ; తుండు రుమాలు;
* tower, n. శిఖరం; గోపురం; బురుజు; సిగము;
* town, n. పట్టణం; పట్నం; నగరం; పురం; ద్రంగం; పెద్ద ఊరు; బస్తీ;
** town planning, ph. నగర నిర్మాణ క్రమం;
** town hall, ph. పురమందిరం;
* toxin, n. బేతవిషం; శరీర జన్య విషం; కొన్నిరకాల బేక్టీరియాలచేత తయారు కాబడ్డ ప్రాణ్యములు కొన్ని ప్రాణుల యెడల విషపదార్థములుగా పనిచేస్తాయి; (rel.) poison; A toxin is a poisonous substance produced within living cells or organisms; Poisons are substances that cause harm to organisms when sufficient quantities are absorbed, inhaled or ingested;
* toxoid, n. వేడిచేత బలహీనపరచబడ్డ బేతవిషం; a chemically modified toxin from a pathogenic microorganism, which is no longer toxic but is still antigenic and can be used as a vaccine;
* toy, n. బొమ్మ; ఆటబొమ్మ;
* toy, v. i. చెలగాటాలాడు;
* toy brick, n. బొమ్మయిటుక; ఆటయిటుక;
* trace, adj. లేశ;
** trace element, ph. లేశ మూలకం; లేశ ధాతువు;
* trace, n. ( 1) పత్తా; అయిపు; ఐపు; ఆచూకీ; జాడ; ఆరా; అడా, పొడా; అజా, పతా; పొలకువ; ( 2) లేశం;
** trace element, ph. పొలకువ మూలకం;
** without a trace, ph. పత్తాలేకుండా; అయిపు లేకుండా; అడా, పొడా లేకుండా; అజా, పతా లేకుండా;
* tracer, n. పత్తాదారి;
* trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకెళ్ళే గొట్టం;
* trachea, n. శ్వాసనాళం; గాలిగొట్టం; ఊపిరితిత్తులకి గాలిని తీసుకేళ్లే గొట్టం;
* track, n. (1) మార్గము; గాడీ; (2) జాడ;
* track, v. t. వెతుకు; వెంటాడు;
* tractable, adj. సుగమం;
* traction, n. కర్షణం;
* trade, n. వ్యాపారం; వాణిజ్యం; బేహారం;
* trade, v. t. వ్యాపారం చేయు; ఇచ్చిపుచ్చుకొను; చేతులు మార్చు;
** trade winds, ph. వ్యాపార పవనాలు; రుతుపవనాలు; the wind that flows towards the equator from the north-east in the Northern Hemisphere or the south-east in the Southern Hemisphere. These are also known as tropical easterlies for their consistency in force and direction;
* trader, n. వ్యాపారి; వ్యాపారస్తుడు; సార్థవాహుడు;
* tradition, n. ఆచారం; సంప్రదాయం; ఆనవాయితీ; రివాజు;
* traditional, adj. సంప్రదాయ; సనాతన; సదాతన; శాశ్వత; ఎల్లప్పుడూ ఉండేది;
* traditionalist, n. ఆచారపరాయణుడు;
* traditionally, adv. ఆచారంగా; అనూచానంగా; సంప్రదాయంగా;
* traffic, n. సంచారం; రాకపోకలు; యాతాయాతాలు; క్రయవిక్రయాలు;
** foot traffic, ph. జన సంచారం; పాద సంచారం;
** pedestrian traffic, ph. జన సంచారం; పాద సంచారం;
* traffic jam, ph. ప్రతిష్టంబించిన సంచారం; వాహన సంచార ప్రతిష్టంభనం;
* trafficking, n. దొంగ రవాణా; మాదక ద్రవ్యాల దొంగ రవాణా;
* tragedy, n. (1) విషాద పూరితం; దుఃఖపూరితం; (2) విషాదాంతం; దురంతం;
* tragic, n. విషాదమయం;
* tragopan, n. గొఱ్ఱెకోడి;
* trail, n. జాడ; జాలు;
* train, n. (1) రైలుబండి; (2) జూటం; వెనక వేలాడేది; (3) పరంపర; పుంఖానుపుఖం; గొలుసుకట్టుగా అమర్చబడినవి; పంక్తి ; శ్రేణి; (4) పరిజనము; పరివారము; (5) పక్షి తోక; పురి; వెనుక వేళ్లాడునది;
** train of a peacock, ph. నెమలి పురి;
** train of thought, ph. ఊహా పరంపర; ఆలోచనా చయనిక;
* train, v. t. తరిఫీదు చేయు; అభ్యాసము చేయించు; శిక్షణ ఇచ్చు;
* trainee, n. అభ్యాసి;
* training, n. తరిఫీదు; శిక్షణ; సాధకం;
* trail, n. పుంతబాట; డొంక; కోన; పొద;
* trait, n. లక్షణం; చిహ్నం;
* traitor, n. దేశద్రోహి; ద్రోహి; కావైరి; కాపురుషుడు;
* tragedy, n. విషాద సంఘటన; దుస్సంఘటన; విషాద రచన; విషాద వార్త;
* trajectory, n. గతిపథం; చారగతి;
** radial trajectory, ph. త్రైజ్య సంచారగతి;
* trance, n. వివశత; వివశత్వం; సమాధిస్థితి లాంటిది; పూనకం;
* tranche, n. వాయి; దఫా; విడత; a portion, slice, or subdivision of a larger pool of funds, typically used in finance, investment, or international loans.
* trans, adj. pref. [chem.] ఎదురెదురుగా; అడ్డుగా; అను; అనుప్రస్థ; see also cis;
* trans fat, ph. అనుప్రస్థ కొవ్వు; ఒక రకం కొవ్వు పదార్థం; ఈ రకం కొవ్వులలో జంట బంధం ఉన్న కర్బనపు అణువులకి ఇటూ అటూ గొలుసు పెరగటం వల్ల ఆ గొలుసు తిన్నగా ఉంటుంది; ఈ రకం జంట బంధాలు ఉన్న కొవ్వులు తినటం గుండె ఆరోగ్యానికి మంచిది కాదు;
* transaction, n. బేరం; లావాదేవీ; ఇచ్చిపుచ్చుకొనడం; ఇచ్చిపుచ్చుకోలు; బేరసారాలు; వ్యవహారం; వాణిజ్యం; వినిమయం;
** business transaction, ph. వాణిజ్య వ్యవహారం; లావాదేవీ;
** conversational transaction, ph. వాగ్వ్యవహారం;
* transcendence, n. తారకం; అనుభవాతీతం;
* transcendental, adj. (1) బీజాతీత; (2) అత్యుత్తమ; ఉత్తమోత్తమ; లోకోత్తర; పారమార్థిక; (3) తారక; అనుభవాతీత;
** transcendental meditation, ph. లోకోత్తర జప విధానం;
** transcendental number, ph. బీజాతీత సంఖ్య; లోకోత్తర సంఖ్య;
* transgender, n. హిజ్రా; వీరు పుట్టుకతో మగ (ఆడ) వారిగా ఉన్న కూడా వీరికి ఆడ (మగ) వారికున్న లక్షణాలు , వారి ప్రవర్తన ఆలోచనలు ఆడవారి (మగవారి) లాగా ఉంటాయి;
* transgress, v. t. జవదాటు;
* transgression, n. తప్పు; పాపం; అపరాధం; వ్యతిక్రమం; అతిక్రమణం; ఉల్లంఘనం; అతిచారం;
* transient, adj. తాత్కాలిక; క్షణిక; క్షణభంగుర; అనిత్య; భంగుర; దంధన; తైంతిక; క్షర; అధ్రువ;
* transient, n. తాత్కాలికం; దంధనం; భంగురం; అనిత్యం; క్షణికం; క్షణభంగురం; తైంతికం; నశ్వరం;
* transit, adj. ప్రయాణ;
* transit, n. (1) పోక; ప్రయాణం; (2) ప్రయాణ సాధనం; (3) దాటు; దాటడం; అంతర్యానం; గోచర సంక్రమణం;
** rapid transit, ph. జోరుపోక; ఊరులోని రద్దీని దాటుకు పోవడానికి రైలుబండి వంటి సదుపాయం;
** transit of a planet across Sun's disk, ph. గ్రహం సూర్యబింబాన్ని దాటడం; గ్రహ అంతర్యానం; గ్రహ గోచర సంక్రమణం; బుధుడు, శుక్రుడు భూమి కంటే సూర్యునికి దగ్గరగా వుండే కక్ష్యలలో తిరుగుతున్నాయి కాబట్టి అప్పుడప్పుడూ ఇవి కూడా భూమి - సూర్యుల మధ్యకు వచ్చే అవకాశాలు వున్నాయి. అయితే, ఈ గ్రహాలూ రెండూ భూమి నుండి చాలా ఎక్కువ దూరం వున్నాయి కాబట్టి అవి మనకు కనిపించే పరిమాణం చాలా చిన్నది. అందుకే అవి మధ్యలోకి వచ్చినా సూర్యుడిని పూర్తిగా కప్పివేయలేవు. అవి సూర్యుడి మీదుగా ప్రయాణిస్తున్న చిన్న చుక్కలాగ మాత్రమే కనిపిస్తాయి. అలా బుధుడు గాని శుక్రుడు గాని సూర్యుని మీదుగా చేసే ప్రయాణాన్ని eclipse అనరు; transit అంటారు;
* transitive, adj. సకర్మక;
** transitive verb, ph. సకర్మక క్రియ;
* transistor, n. బదిరోధకి; (ety.) బదిలీ + అవరోధకి;
* transition, adj. సంక్రమణ; సంధి; స్థిత్యంతర; అవస్థాంతర;
** transition element, ph. అవస్థాంతర మూలకం; అవస్థాంతర ధాతువు;
** transition metal, ph. అవస్థాంతర లోహం; ఉ. zinc, copper, palladium, nickel, cobalt, titanium and chromium
* translate, v. t. (1) అనువదించు; (2) జరుపు;
* translate into Telugu, ph. ఆంధ్రీకరించు; తెలిగించు; తెలుగులోకి మార్చు;
* translation, n. (1) తర్జుమా; భాషాంతరీకరణం; అనువాదం; (2) జరుపుట;
** free translation, ph. స్వేచ్ఛానువాదం;
** literal translation, ph. శాబ్దిక అనువాదం;
** word for word translation, ph. మక్కీకిమక్కీ అనువాదం;
** translation into English, ph. ఆంగ్లీకరణం;
** translation into Telugu, ఆంధ్రీకరణం; తెలుగు సేత; ఆంధ్రానువాదం;
* translator, n. అనువాదకుడు; అనువాదకి; అనువాదకం; దుబాషీ; దుబాసీ; తొపాసి; ఒక భాషని మరొక భాషలోనికి మార్చే వ్యక్తి లేక పరికరము లేక అనువర్తనం; see also interpreter;
* transliteration, n. లిప్యంతరీకరణం; ప్రతిలేఖనం; ఒక భాషని మరొక భాషయొక్క లిపిలో రాయడం;
* translocation, n. స్థానాంతరీకరణం;
* translucent, adj. మసకైన; మసక; మునిమసక; పాల; పారభాసక; పాక్షికపారదర్శక; వెలుగు వెళుతుంది కాని అవతలి వాళ్లు కనబడరు;
** translucent glass, ph. మసక గాజు; పాలగాజు;
* trans, pref. గుండా; అడ్డుగా;
* transmission, n. ప్రేషణం; ప్రేషితం; ప్రసారం; ఒక మాధ్యమం గుండా పంపించడం, ప్రసారం చెయ్యడం, లేదా సరఫరా చెయ్యడం;
** live transmission, ph. ప్రత్యక్ష ప్రసారం;
** transmission line, ph. ప్రేషణ తంతువు; పంపించడానికి మాధ్యమంగా వాడిన తీగలు;
* transmit, v. t. పంపించు; ప్రేషించు; ప్రసరించు;
* transmitter, n. పంపేది; ప్రేషకి; ప్రసారిణి; ప్రేషకుడు;
** radio transmitter, ph. రేడియో ప్రసారిణి; రేడియో పంపు;
* transparent, n. పారదర్శకం; అడ్డుగా వెలుగుని పోనిచ్చేది; తన గుండా వెలుగుని ప్రసరించనిచ్చేది;
* transparency, n. (1) పారదర్శకత; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం; (2) పారదర్శక పత్రం; తన గుండా వెలుగుని పోనిచ్చే గుణం కల కాగితం లాంటి పత్రం;
* transpiration, n. చెమర్చడం; ఆకులు చెమర్చడం; పత్రశ్వేదనం; ఉత్‌స్వేదనం; తన గుండా చెమ్మని పోనిచ్చే పద్ధతి; చెట్లయొక్క ఆకుల గుండా చెమ్మ బయటకి వెలిగక్కబడే ప్రక్రియ;
* transplantation, n. (1) ఊడుపు; తిరగనాటడం; వరి నారుని తిరిగి నాటడం; (2) ఒకరి శరీర అవయవాలని మరొకరి శరీరంలో పొదగడం;
* transport, n. రవాణా;
** road transport, ph. రోడ్డు రవాణా; రస్తే సారిగె
* transportation, n. యానం; రవాణా పద్ధతి; ప్రజలని కాని, సరుకులని కాని, ఒక చోటు నుండి మరొక చోటుకి రవాణా చేసే పద్ధతి;
** transportation devices, ph. pl. యాన సాధనాలు; రవాణా సాధనాలు;
* transpose, n. తారుమారు; పరావర్త్యం; ఇటునుండి అటు మార్పిడి;
* transverse, adj. తిర్యక్; అడ్డు; పేక; (పడుగు పేకలో వలె); అనుప్రస్థ;
** transverse axis, ph. తిర్యక్ అక్షం;
** transverse section, ph. అడ్డు కోత; తిర్యక్ ఛేదనం;
** transversal line, ph. తిర్యక్ రేఖ; ఖండించు రేఖ;
* trap, n. బోను; వల;
* trap, v. i. బోనులోపడు; ఇరుకుకొను; చిక్కుకొను; వలలోపడు;
* trap, v. t. బోనులో పట్టుకొను; వలలో పట్టుకొను;
* trapper, n. m. వాగుఱికాఁడు; f. వాగుఱిగత్తె;
* trapezium, n. విషమ చతుర్భుజం; ఏ రెండు భుజములూ కూడ సమాంతరంగా లేని చతుర్భుజం;
* trapezoid, n. అర్థసమాంతర చతుర్భుజం; ఏవో రెండు భుజములు సమాంతరంగా ఉన్న చతుర్భుజం;
* trash, n. చెత్త; పిప్పి;
* trash bin, n. చెత్త బుట్ట; చెత్త కుండీ;
* trauma, n. క్షోభ; స్థాపం; అఘాతం;
** mental trauma, ph. మనస్ స్థాపం; మానసిక అఘాతం;
** physical trauma, ph. భౌతిక స్థాపం; భౌతిక అఘాతం;
* travails, n. pl. (1) సమస్యలు; ఇబ్బందులు; (2) నొప్పులు; ప్రసవ వేదన;
* travel, n. ప్రయాణం; పయనం;
* traveler, n. m. ప్రయాణీకుడు; బాటసారి; తెరువరి; పాంథుడు;
* traveling, adj. సంచార; ఆధ్వనీన; ప్రయాణీకులకి సంబంధించిన;
** traveling doctor, ph. సంచార వైద్యుడు;
** traveling library, ph. సంచార గ్రంథాలయం;
* traverse, n. చంక్రమణం;
** traverse along a branch, ph. శాఖాచంక్రమణం;
* trawler, n. చేపలు పట్టడానికి ప్రత్యేకంగా అమర్చబడ్డ పడవ;
* tray, n. తబుకు;
* treachery, n. ద్రోహం;
* tread, v. t. తొక్కు; మట్టు; కాలితో తొక్కు;
* tread, n. తొక్కు; మట్టు; రబ్బరు చక్రాలు భూమిని కరిచిపెట్టుకు ఉండడానికి వీలుగా వేసిన మట్టు;
* treason, n. దేశద్రోహం;
* treasure, n. సంచితం; నిధి; కాణాచి; నిక్షిప్తం;
** treasure trove, ph. నిక్షిప్తనిధి;
* treasurer, n. కోశాధికారి; ఆయతికాడు; పోతేదార్;
* treasury, n. బొక్కసం; కోశం; ఖజానా; భండారం; భాండాగారం; ధనాగారం; ఉగ్రాణం;
* treat, v. t. (1) చికిత్స చేయు; (2) చూడు; ఉపచారం చేయు;
* treatise, n. సంహితం;
* treatment, n. (1) చికిత్స; (2) చూపు; ఉపచారం; పరిపోషణ; అభిచర్య;
** heat treatment, ph. ఉష్ణోపచారం; తాపోపచారం;
** radiation treatment, ph. వికిరణ చికిత్స;
* treaty, n. ఒడంబడిక; ఒప్పందం;
* tree, n. చెట్టు; వృక్షం; ద్రుమం; తరువు; దరువు; అగం; నీవం; మహీరుహం; భూరుహం; సాలం; విటపం; మ్రాను; మ్రాకు;
** avenue tree, ph. రహదారి చెట్టు; రహదారులకి ఇరుపక్కలా ఉండే చెట్టు;
** deciduous tree, ph. పతయాళువు; ఆకులు రాల్చే స్వభావం గల చెట్టు;
** evergreen tree, ph. సతతహరితం; ఎల్లప్పుడు ఆకులు పచ్చగా ఉండే చెట్టు;
** hollow of a tree, ph. తొర్ర; కోటరం;
** invasive tree, ph. బెడద చెట్టు; బెడద వృక్షం;
** tree with branches, ph. శాఖి;
* trefoil, n. త్రైపత్రిణి; మువ్వాకి; మూడు ఆకులు తమతమ కాడల వద్ద కలిసి ఒక వలయాకారంలోనున్న గుర్తు;
* trellis, n. పాకిడ; పందిరి; పాదు పాకడానికి వీలుగా అమర్చిన చట్రం;
* tremor, n. వణుకు; కంపం; వేపథువు;
* trench, n. కందకం; అగడ్త; పరిఘ; గాడీ;
** long narrow trench, గాడీ;
* trend, n. పంథా; పథం; బాణి; ధోరణి; వరస; పోకడ; రీతి;
** trend setter, ph. పథనిర్దేశకుడు; వైతాళికుడు;
* trepidation, n. భయం; జంకు;
* tresses, n. జడలు; జటలు; జటాజూటం;
* triad, n. త్రేతం; త్రికం;
* trial, n. (1) న్యాయవిచారణ; విచారణ; (2) యత్నం; ప్రయత్నం;
** trial and error method, ph. నేతి నేతి పద్ధతి; నేతి నేతి మార్గం; ప్రయత్న వైఫల్య పద్ధతి; అవక్షేప పద్ధతి;
* trials, n. pl. తిప్పలు; పాట్లు; కష్టాలు;
** trials and tribulations, ph. తిప్పలు; పాట్లు; కష్టాలు;
* triangle, n. త్రిభుజం; ముయ్యంచు; త్రికోణి; ముక్కోణి;
** equilateral triangle, ph. సమబాహు త్రిభుజం; సమకోణ త్రిభుజం; సమ త్రిభుజం; త్రస్రం;
** isosceles triangle, ph. సమద్విబాహు త్రిభుజం;
** right-angled triangle, ph. లంబకోణ త్రిభుజం;
** scalene triangle, ph. విషమబాహు త్రిభుజం; అసమభుజ త్రిభుజం;
* triangular, adj. త్రిభుజాకారపు; ముక్కోణాకారపు;
** triangular prism, ph. ముక్కోణ పట్టకం; త్రికోణ పట్టకం;
* Triassic, adj. తృతీయ; తదియ; మూఁడవ; --see also tertiary;
** Triassic period, ph. మూఁడవ జీవయుగము;
* tribe, n. తెగ; జాతిలో ఒక భాగం;
** tribal people, ph. గిరిజనులు; పార్వతీయులు;
* tribunal, n. త్రిమూర్తి న్యాయస్థానం;
* tributary, n. ఉపనది;
* tribute, n. (1) కప్పం; ఉపప్రదానం; పెద్దలకి సంప్రదాయానుసారంగా ఇచ్చే బహుమానం; లంచం; (2) పొగడ్త; ప్రశంస;
** pay tribute to, ph. పొగుడు; ప్రశంసించు;
* triceratops, n. త్రిశృంగముఖి; three-horned face; a dinosaur that lived during the late Maastrichtian age of the Late Cretaceous period;
* tri-chloro methane, n. త్రిహరితపాడేను; క్లోరోఫారం; మత్తుమందు; తీపిగా ఉండి, వాసన లేని ఒక ద్రవపదార్థం; దీనిని మత్తుమందుగా వాడతారు; CHCl<sub>3</sub>;
* trick, n. (1) టక్కు; దందన; (2) పట్టు, పేకాటలో;
* trickery, n. టక్కరితనం;
* trickle, v. i. కారు; స్రవించు; బొట్టుబొట్టుగా కారు;
* trickster, n. టక్కరి; నమ్మరానివాడు; మాయావి; జిత్తులమారి; టక్కులమారి; దందనకాడు; దందనకత్తె;
* tricycle, n. మూడు చక్రాల సైకిలు;
* tridax, n. కుక్కబంతి;
* trident, n. త్రిశూలం; శూలం;
* triennial, adj. త్రైవార్షిక; తిస్సాలా; మూడేళ్లకి ఒకసారి;
* trifle, n. అల్పం; స్వల్పం; అలతి;
* trifle, n. కల్యవర్తం; ఒక రకమైన తీపి తినుబండారం;
* trifling, adj. పేలవంగానున్న; చాలా కొంచెం; ఇసుమంత; ఈషత్తు; తృణప్రాయం;
* trifoliate, adj. ముయ్యాకుల; మూడాకుల; త్రిపత్ర;
* triglyceride, n, ఒక గ్లిజరిన్ బణువుకి మూడు ఫాటీ ఆసిడ్ బణువులు కలిస్తే, ట్రై గ్లిజరైడ్ అవుతుంది. ట్రైగ్లిసెరైడ్స్ ని మన శరీరమే మనం తినే చక్కెరల నుండి తయారు చేసుకుంటుంది.
* trigonometry, n. త్రిగుణమాత్రకం; త్రికోణమితి; త్రిభుజ శాస్త్రం; త్రికోణ గణితం;
* trihedral, adj. త్రిముఖ; త్రిఫలక;
* trill, n. [phonetics] అధిక కంపితం;
* trillion, n. ట్రిలియను; ఖర్వం; ఒకటి తర్వాత పన్నెండు సున్నలు;
* trim, v. t. (1) కత్తిరించు; కురచ చేయు; త్రుంచు; తగ్గించు; పత్రించు; (2) అలంకరించు;
* trimer, n. త్రిభాగి; త్రితయాణువు;
* trimester, n. (1) ఒక కాల పరిమితిలో మూడవ భాగం; (2) తొమ్మిది నెలలలో మూడవ భాగం; గర్భిణి ఎన్నవ నెలలో ఉన్నదో చెప్పడానికి వాడతారు; (3) కందాయం; జ్యోతిషంలో సంవత్సరంలో మూడవ భాగం; నాలుగు నెలలు;
* triode, n. త్రయోడు; మూడు ముఖ్య భాగాలు ఉన్న శూన్య నాళిక; ట్రాన్సిస్టర్లు వాడుకలోకి వచ్చిన తర్వాత వీటి వాడకం తగ్గిపోయింది కాని, అంతకు పూర్వం ఇవి ఎలక్ట్రానిక్ ఉపకరణాలలో తప్పనిసరి అయిన భాగాలుగా ఉండేవి;
* trip, n. చిన్న ప్రయాణం; ప్రయాణం; పర్యటనం;
** return trip, ph. తిరుగు ప్రయాణం;
* trip, v. i. పడు; కాలితో దేన్నయినా తన్నుకుని పడు;
* tripartite, adj. త్రైపాక్షిక; త్రిపక్ష;
* triple, adj. త్రయ; త్రిక;
* triple, n. త్రయం; త్రికం;
* triplet, n. త్రికం; త్రయం; తిగలు;
* tripod, n. త్రిపాది; ముక్కాలిపీట; టీపాయి; తీపాయి;
* trisector, n. త్రిఖండిక; త్రిధాచ్ఛిత్తి; ముమ్మిడి కోట రేఖ;
* triumphant, adj. జైత్ర;
** triumphant march, ph. జైత్ర యాత్ర;
* trivial, adj. (1) వ్యర్థమైన; అల్ప; సాధారణ; (2) ఆషామాషీ;
* trochee, n. [prosody] ఛందస్సులో గురువు తరువాత లఘువు వచ్చే గణం; గలం; the first syllable is stressed and the second is unstressed, creating a DUM-da rhythm;
* troika, n. ముగ్గురి ముఠా; ముగ్గురి గుంపు; త్రిష్టయం;
* troll, n. (1) పిల్లల కథలలో వచ్చే పొట్టిగా, కురూపిగా ఉండే ఒక పాత్ర; (2) అంతర్జాలంలో జరిగే "సంభాషణలలో" మధ్యలో తలదూర్చి, అసందర్భపు వ్యాఖ్యలు చేసి దీశని మార్చడానికి ప్రయత్నించే వ్యక్తి; పానకంలో పుడక; పుల్లారిబుడ్డి;
* trolling, n. (1) అంతర్జాలంలో పిలవని పేరంటంగా మధ్యలో వచ్చి వ్యాఖ్యానాలు చెయ్యడం; (2) carefully and systematically search an area for something; "a group of companies trolling for partnership opportunities;"
* tropical, adj. ఉష్ణ; ఆయనరేఖా;
** tropical diseases, ph. ఉష్ణమండలాలలో కనబడే వ్యాధులు; ఉ: కలరా, మలేరియా, నంజు (బెరిబెరి), డెంగీ, కొంకి క్రిములు, వగైరా;
** tropical zones, ph. ఉష్ణమండలాలు; అయనరేఖా మండలం;
* tropics, n. ఉష్ణమండలాలు; అయనరేఖా మండలం; (lit.) turning points;
** Tropic of Cancer, ph. కర్కాటక రేఖ;
** Tropic of Capricorn, ph. మకర రేఖ;
* troop, n. మేళం; జట్టు; మూక; దండు; see also troupe;
** troop of monkeys, ph. కోతి మూక;
* trophic, adj. పోషక; జీవనాధార;
** trophic web, ph. పోషక వలయం; పోషక జాలం; జీవనాధార జాలం; ఆధారజాలం; ఏ జంతువుకి ఏది ఆహారమో తెలియజేసే వలయాకారపు బొమ్మ;
* trophy, n. పతకం;
* troposphere, n. చైతన్యావరణం; సామీప్యావరణం; భూ ఉపరితలం పైన 7 నుంచి 17 కి మీ వరకు విస్తరించి ఉంటుంది. దీని కింది భాగం వేడిగా ఉండి ఎత్తు పెరిగే కొద్ది ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది;
* trouble, n. ఇబ్బంది; శ్రమ; యాతన; గొడవ; కిరికిరి; ఉపహతి;
* troubles, n. pl. ఇబ్బందులు; యాతనలు; తిప్పలు; పుర్రాకులు; అగచాట్లు; కడగండ్లు; అరిష్టాలు;
** teething troubles, ph. బాలారిష్టాలు;
* trough, n. (ట్రఫ్) (1) గోలెం; తొట్టె; గాడి; (2) గర్తం; ఉద్ది; (3) ద్రోణి; తరంగం దిగువ భాగం; అల్పపీడన ప్రాంతం;
* troupe, n. మేళం; మూక; దండు; తండం; see also troop;
** troupe of Lambadis, ph. లంబాడీ తండా;
* trowel, n. తాపీ;
* truant, n. బడి ఎగ్గొట్టిన విద్యార్థి;
* truce, n. సంధి;
* true, n. నిజం; వాస్తవం;
* truffle, n. శిలీంధ్ర రత్నం; భూగత శిలీంద్రము; మట్టి లోపల పెరిగే ఒక రకం పుట్టగొడుగు; underground fungus; a kind of mushroom, of a fleshy, fungous structure and roundish in shape that is native to the wooded areas of southern Europe; much esteemed and highly prized culinary delicacy with an earthy flavor; [bot.] ''Tuber melanosporum;''
* truism, n. నిర్వివాదమైన నిజం; సర్వసాధారణమైన సత్యం;
* trump, n. పేకాటలో తురఫు;
* trumpet flower, n. అంబువాసిని; బెగోనియా;
* trumps, v. t. పేకాటలో తురఫు పెట్టి కోయు;
* trumpet, n. బాకా; బూరా;
* truncate, v. t. క్షిప్తించు;
* truncated, adj. క్షిప్తించిన; కోసేసిన;
* trunk, n. (1) పెట్టె; (2) మొండెం; (3) మాను; మోడు; స్థాణువు; స్కంధము; (4) తొండము; కరము; హస్తం;
* truss, n. (1) పటకా; ఇంటికప్పుకి ఆధారంగా దూలాలతో కట్టే పటకా; (2) ఆంత్రనిరోధక పటకా; శరీరాంగాలు జారిపోకుండా వైద్యుడు వేసే పటకా;
** trussor flap, ph. గోచీ గుడ్డ;
* trust, n. (1) నమ్మకం; విశ్వాసం; పూచీ; నమ్మిక; (2) విశ్వాస నిక్షేపం; విక్షేపం; ధర్మనిక్షేపం; (3) బ్యాంకు;
* trustee, n. ధర్మకర్త; ధర్మవ్యవహర్త;
** honorary trustee, ph. గౌరవనీయ ధర్మకర్త;
* truth, n. నిజం; సత్యం; నిక్కం; నిబద్ధం; రుతం; యథార్థం; యథాతథం; వాస్తవం; నిలవరం; సమీచీనం;
** truth table, ph. రుత పట్టీ; నిజంపట్టీ; నేటుపట్టీ; సత్యపీఠం;
** naked truth, ph. నగ్నసత్యం;
* truthfulness, n. నిజాయతీ;
* try, v. i. ప్రయత్నించు; ఉంకించు; ఉద్యోగించు; తివురు;
* tryst, n. (ట్రిస్ట్) ముఖాముఖీ;
* tryst with destiny, ph. విధితో ముఖాముఖీ;
* tsunami, n. తీరపు అల; సునామీ; (Japanese: tse = తీరపు, nami = అల)
* tub, n. తొట్టి; తొట్టె;
* tuba, n. బూరా; బాకా;
* tube, n. గొట్టం; నాళం; నాళిక; సానిక; క్రోవి; గ్రోవి;
* tuber, n. దుంప; గడ్డ;
* tuberculosis, n. క్షయ;
* tubular, adj. నాళాకార;
* Tuesday, n. మంగళవారం; భౌమ్యవారం; భౌమవాసరం;
* tumbler, n. గ్లాసు; గళాసు;
* tummy, n. బొజ్జ;
* tumor, n. కంతి; నెత్తురుగడ్డ; గడ్డ; కణిత; గుల్మం; అర్బుదం; --see also gland
* tumult, n. కకపిక;
* tundra, n. నీహారమండలం; శీతలమండలం; టండ్రా; ఆర్కిటిక్ చక్రం ప్రాంతాలలో వుండే చెట్లులేని విశాలమైన చెమ్మ మైదానాలు; see also savanna; prairie;
* tune, n. వరస; పాట పాడే వరస; ఒకదాని తరువాత మరొక స్వరం వరసగా రావడం; భారతీయ శాస్త్రీయ సంగీతంలో పాట పాడినప్పుడు ఏదో ఒక వరస ఎంచుకుని పాడతారు; (ఉదా. కేవలం అన్నం తిన్నట్లు లేదా కేవలం చపాతీ తిన్నట్లు; పాశ్చాత్య సంప్రదాయంలో అనేక వరసలు కలిసి వినిపిస్తాయి; అనంలో ముక్కల పులుసు కలుపుకుని తిన్నట్లు;)
* tune, v. t. శృతి చేయు;
* tuning fork, n. శృతిదండం;
* Tungsten, n. టంగ్‌స్టన్; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 74, సంక్షిప్త నామం, W); Swedish. tung sten = heavy stone; wolfram;
* tunnel, n. (1) సొరంగం; బిలం; (2) తొర్ర;
* tunnel, v. t. దొలుచు;
* turban, n. తలపాగా; పాగా;
* turbidity, n. కలక; ఆవిలం; మసకతనం;
* turbid, adj. మసక; ఆవిలమైన; ఆవిల;
* turbo, adj. విక్రమ; జోరుగా నడచే;
* turbulence, n. (1) ఉరవడి; సమీరితం; అనిశ్చలం; (2) వాతావరణంలో అనిశ్చలత; (3) సంక్షోభం;
* turbulent, adj. ఉరవడి; గజిబిజి; అనిశ్చల; సమీరిత;
** turbulent flow, ph. అనిశ్చల ప్రవాహం; గజిబిజి ప్రవాహం; ఉరవడి ప్రవాహం;
* turgid, adj. (1) వాచిన; బలిసిన; (2) అనవసరమైన ఉత్ప్రేక్షలతో కూడిన;
* turkey, n. (1) టర్కీ; కోడి లాంటి పక్షి; (2) [idiom] అసమర్ధుడు; చేతకానివాడు;
* turmeric, n. పసుపు; పసుపు కొమ్ము; అళది;
* turmoil, n. మథన;
* turn, n. (1) మలుపు; క్రాంతి; (2) పర్యాయం; సారి; చుట్టు; ఆవర్తి; (3) వంతు;
* turn, v. i. తిరుగు; మళ్లు;
* turn, v. t. (1) తిప్పు; మళ్లించు; మరలించు; (2) మార్పు; మార్పు చేయు; (3) చుట్టు; చుట్టబెట్టు;
* turnery, n. తరిణ; the action or skill of making objects on a lathe;
* turns, n. pl. సార్లు; చుట్లు;
** turning chair, ph. అసందిక; (see also) rotating chair
** turning point, ph. మలుపు తిరిగే స్థానం; విశ్రమ స్థానం; క్రాంతి బిందువు; పరివర్తన స్థానం;
* turnings, n. రజను; రద్దు;
* turnstile, n. కిర్రుమాను;
* turpentine, n. శ్రీవేష్టం; కర్పూరతైలం;
* turquoise, n. హరితాశ్మను వర్ణం;
* turtle, n. నీటి తాబేలు; ఇది సాధారణంగా నీటిలో నివసిస్తుంది; నేల తాబేలుకీ, దీనికి కొన్ని పోలికలు కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి;
* tutor, n. శిక్షకుడు; శిక్షకురాలు; బోధకుడు; బోధకురాలు;
* tutoring, n. శిక్షణ; బోధన; అధ్యాపన;
* tweezers, n. చిమటా; తండసం;
* twelfth, adj. ద్వాదశ; పన్నెండవ;
* twelve, n. పన్నెండు; ఇరారు; ఈరారు;
* twentieth, adj. ఇరవైయ్యవ;
* twentieth, n. ఇరవైయ్యవది;
* twenty, n. ఇరవై; ఇరువది; వింశతి;
* twenty-five, n. ఇరవై అయిదు; పంచ వింశతి; పచ్చీసు;
*
{|style="border-style: solid; border-width: 5 px"
|
* '''---USAGE NOTE; writing numbers
* ---While writing numbers, (1) hyphenate all numbers between 21-99, unless divisible by 10. Example: 51 = fifty-one, 450 = four hundred fifty. (2) Do not use and in whole numbers. Example: five hundred sixty-seven, not five hundred '''and''' sixty-seven. (3) Use "and" for the decimal point. Example: 234.2 (two hundred thirty-four and two tenths. (4) Avoid numbers at the start of a sentence. Example: Seventy-one people attended the meeting.”'''
|}
*
* Tweed, n. a misnomer for Twill;
* tweezers, n. తండసం;
* twice, adj. ఈరు; రెట్టింపు; ఇబ్బడి;
** twice five, ph. ఈరేను; 10;
** twice six, ph. ఈరారు; 12;
** twice seven, ph. ఈరేడు; 14;
* twice, n. (1) రెండు సార్లు; (2) రెండింతలు; రెట్టింపు;
* Twill, n. గెంటెం; జంటనేత బట్ట; రెండు పేటల దారంతో నేసిన గుడ్డ యొక్క వ్యాపార నామం;
* twig, n. రెమ్మ; పరిగె; ఉపశాఖ; కొమ్మ రెండుగా చీలడం వల్ల వచ్చిన ఉపశాఖ;
* twilight, n. సంధ్య;
** evening twilight, ph. మలి సంధ్య; మునిమాపు; మునిచీకటి; ప్రదోష కాలం;
** morning twilight, ph. తొలి సంధ్య;
* twine, n. జమిలిదారం; రెండు పేటలు వేసి పేనిన దారం;
* twinge, n. పోటు; a sudden, sharp, and usually brief localized pain, often compared to a quick sting or pang.
* twinkle, n. తళుకు; మినుకు;
* twins, n. కవలలు;
** identical twins, ph. సారూప్య కవలలు; ఏక రూప కవలలు; ఏక సంయుక్త బీజ కవలలు; ఇందులో ఒక అండం + ఒక శుక్ర కణం = ఒక సంయుక్త బీజం ఏర్పడుతుంది. అయితే ఏర్పడిన తర్వాత విభజన జరిగి రెండు లేదా మూడు అండాలు ఏర్పడ వచ్చు. ఇలా విభజనకు ముందే దాని లింగ నిర్ధారణ జరిగి ఉంటుంది గనక, వీరు ఒకే పోలిక ఉన్న, ఒకే లింగానికి చెందిన కవలలు. వీరి జన్యువుల్లో చాలా సామ్యం ఉంటుంది. అందుకే ఎవరు ఎవరో గుర్తు పట్టలేనంత పోలికలు ఉంటాయి;
** fraternal twins, ph. భ్రాతృ కవలలు; సోదర కవలలు; ద్వి సంయుక్త బీజ కవలలు; ఇక్కడ రెండు లేదా ఎక్కువ అండాలు +రెండు లేదా ఎక్కువ శుక్ర కణాలు = రెండు అంతకన్నా ఎక్కువ సంయుక్త బీజాలు;
* twist, n. మెలి; పురి; వెంటి;
* twist, v. t. పేను; పురి ఎక్కించు; తిప్పు;
* twisted, adj. నులి; నులి పెట్టిన;
* twisted pair, n. నులి జంట; నులి పెట్టిన తీగల జంట;
* twigs, n. pl. చితుకులు;
* twitch, v. i. కండరాలలో వచ్చే చిరు స్పందన;
* two, n. (1) రెండు; ఇరు; ఈరు; జమిలి; ఇమ్మడి; ద్వ; ద్వయం; ద్వయి; దో; (2) ఇద్దరు;
** two books, ph. రెండు పుస్తకాలు;
** two people, ph. ఇద్దరు; ఇద్దరు మనుషులు;
** two sides, ph. ఇరువైపుల;
* two-dimensional, adj. ద్వైమానిక;
** two-dimensional description, ph. ద్వైమానిక వర్ణనం;
* two-colored, n. దోరంగి;
* two-fold, adj. ఉమ్మడి;
* tycoon, n. వ్యాపార రంగాన్ని ఎక్కువగా ప్రభావితం చెయ్యగల వ్యాపారస్తుడు; see also mogul;
* tympanum, n. కర్ణభేరి; గూబ;
* type, n. (1) రకం; బాపతు; (2) టైపు; (3) ముద్రాక్షరాలు;
** linotype, ph. పంక్తి కూర్పు;
** monotype, ph. అక్షరాల కూర్పు;
** type of person who will listen, ph. మాట వినే బాపతు;
* typesetting, n. అచ్చుకూర్పు;
* typhus, n. విష జ్వరం; టైఫస్;
* typhoid, n. సన్నిపాత జ్వరం; టైఫాయిడ్;
* typhoon, n. ప్రచండ తుఫాను; ప్రచండ వాయువు; చైనాలో వచ్చే గాలివాన పేరు; ఇండియాలో వచ్చే గాలివానని సైక్లోను అనీ, అమెరికాలొ వచ్చే దానిని హరికేను అనీ అనడం ఆచారం;
* typo, n. టైపాటు; టైపు చేసేటప్పుడు దొర్లిన పొరపాటు;
* tyrant, n. నియంత; ఇరినుఁడు;
* tyranny, n. నైయంత్యం; ఇరినం;
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==Part 2: U==
{| class="wikitable"
|-
! నిర్వచనములు<!--- Do Not Change This Line --->
! ఆసక్తికర చిత్రములు<!--- Do Not Change This Line --->
|-
|width="895"|<!--- Do Not Change This Line --->
<!--- Insert ALL నిర్వచనములుAlphabetically Sorted Below This Line ( * ''' Should precede each new line) --->
*
* ubiquitous, adj. సర్వాంతర్యామి అయిన; సర్వవ్యాప్తమయిన; అన్నిచోట్లా ఉన్న; బాగా వాడుకలో ఉన్న; విభుత్వ;
* udder, n. పొదుగు; గోస్తనం;
* ugliness, n. అందవికారం; అనాకారిత్వం;
* ugly, adj. అనాకార;
** ugly person, ph. అనాకారి; కురూపి;
* uh-huh, inter. అహా; ఉహూ; ఊకొట్టడం;
* ulcer, n. గుల్మం; వ్రణం; పుండు; కొరుకుపుండు;
** chronic ulcer, ph. విలంబిత వ్రణం;
** duodenal ulcer, ph. ఆంత్రమూల వ్రణం;
* ulna, n. అరత్ని; అరత్నిక; కూర్పరాస్థి; మూరెుముక; see also radius;
* ultimate, adj. చిట్టచివరి; కడపటి; చరమ; కొస; ఆఖరు; తుది; అంతిమ; పరిపూర్ణ; కేవల;
** ultimate authority, ph. తుది తీర్పరి; అంతిమ ప్రమాణం;
** ultimate reality, ph. అంతిమ సత్యం; కఠోర వాస్తవం;
* ultimatum, n. తుది హెచ్చరిక; మాట; ఆఖరి మాట; కడపటి కబురు; ఉల్లాకి; అంత్య సందేశం;
* ultramarine, adj. అతినీల; చిక్కటి నీలిరంగు; (ety.) సముద్రాంతరాలనుండి (ఆఫ్గనిస్థాన్ నుండి) వచ్చిన నీలిరంగు;
* ultrasonic, adj. శ్రవణాతీత; అతిధ్వనీయ;
* ultrasound, n. (1) అతిధ్వని; ధ్వని తరంగాల కంటే ఎక్కువ తరచుదనంతో కంపించే తరంగాలు; (2) శబ్ద తరంగాలని ఉపయోగించి శరీరపు లోపలి భాగాలని చూసే పద్ధతి;
* ultra, pref. అతి; విపరీత; అత్యుగ్ర;
* ultraviolet, adj. అత్యూద; అతినీలలోహిత; ఊర్ధ్వనీలలోహిత; వర్ణమాలలో ఊదా రంగు కంటె ఎక్కువ పౌనఃపున్యముతో ప్రకంపించే కాంతి కిరణాలు; ఈ తరంగాల పొడుగు 10 - 400 నేనోమీటర్లు ఉంటాయి;
* umbel, n. గుత్తి;
* umbilical, adj. బొడ్డుకి చెందిన; నాభికి సంబంధించిన;
** umbilical cord, ph. బొడ్డుతాడు;
* umbilicus, n. నాభి; బొడ్డు;
* umbrage, n. (1) నీడ; నీడనిచ్చే గుబురైన పెరుగుదల; (2) కోపగించుకోవడం; చిరాకు పడడం;; resentment;
* umbrella, n. గొడుగు; ఛత్రం; ఆతపత్రం;
** umbrella tree, ph. గంగరావి; బ్రహ్మదారువు;
* umpire, n. మధ్యవర్తి; ఆటల పోటీలలో ఇరు పక్షములకి మధ్యవర్తి; అంపైరు;
* unable, adj. చేయ శక్యంకాని;
* unaccented, adj. అనుదాత్త; అస్వరిత; తేలికగా పలికే;
* unachievable, adj. అశక్య;
* unadulterated, adj. అప్పటం; కల్తీకాని; అచ్చమైన; మేలిమి;
* unaided, adj. అసహాయంగా; సహాయం లేకుండా;
* unambiguously, adv. నిర్ద్వందంగా; స్పష్టంగా; అసందిగ్ధంగా; ఎటో ఒక పక్కకి తేల్పి;
* unanimity, n. ఏకకంఠం;
* unanimously, adv. ఏకగ్రీవంగా;
* unasked, adj. అయాచితంగా;
* unaspirated, adj. అల్పప్రాణ;
* unassuming, adj. నమ్ర; అహంకారం లేని;
* unattainable, adj. అందరాని; అందుబాటులో లేని; అప్రాప్యమైన;
* unauthentic, adj. సిసలు కాని; నకలు; అప్రమాణిక;
* unavailable, n. అలభ్యం;
* unavoidable, adj. అనివార్య; అనివార్యమైన; అపరిహార్య;
* unbiased, adj. నిష్పాక్షికంగా; పక్షపాతం లేకుండా;
* unbleached, adj. కోరా; చలవ చెయ్యని;
* unblushing, adj. అభిమానం లేని; సిగ్గులేని;
* unbounded, adj. అపరిమిత; నిరవధిక; అవేల;
* unbroken, adj. అఖండ; అఖండిత; అవిచ్ఛిన్న;
* uncertain, adj. అనిశ్చిత;
* uncertainty, n. విచికిత్స; సంశయం; అశంక; అనిశ్చితత్వం; వికల్పం;
* unchanging, adj. కూటస్థ;
* unchecked, adj. అదుపులేని;
* uncircumcised, n. అసున్నతీయులు;
* unclaimed, adj. బేవారసు;
* uncle, n. (1) మావయ్య; తల్లి సోదరుడు; (2) పెదనాన్న; (3) చిన్నాన్న; బాబయ్య; కక్క; (4) అత్త భర్త; (5) భార్య తండ్రి; భర్త తండ్రి;
** maternal uncle, ph. మావయ్య; మేనమామ; తల్లి సోదరుడు;
** paternal uncle, ph. (1) పెదనాన్న; (2) చిన్నాన్న; బాబయ్య; కక్క;
** paternal elder uncle, ph. పెదనాన్న;
** paternal younger uncle, ph. చిన్నాన్న; బాబయ్య; కక్క;
* unclear, adj. అవ్యక్త; అస్ఫుట;
* unclear, n. అవ్యక్తం; అస్ఫుటం;
* uncommon, adj. అసాధారణమైన;
* uncomparable, adj. సాటి లేని; సామ్యం లేని; నిరుపమ;
* unconcerned, adj. నిర్లిప్త; పట్టించుకోకుండా;
* unconscious, adj. స్మృతివిహీన; స్మృతిలేని; స్మృతితప్పిన; మైకం కమ్మిన; అచేతన;
** unconscious presumption, ph. అచేతన అహంకారం; అచేతన పురాభావన; బహుశా అవునేమో అనే అచేతన నమ్మకం;
* unconsciously, adv. (1) అపగత చేతనంగా; అచేతనంగా; స్మృతివిహీనంగా; (2) అప్రయత్నంగా; అనుకోకుండా;
* unconditionally, adv. బేషరతుగా; షరతులు లేకుండా;
* unconventional, adj. కానువాయి;
* uncountable, adj. అగణ్య; అసంఖ్యాక;
** uncountable infinity, ph. అసంఖ్యేయ అనంతం; అగణ్య అనంతం;
* uncountably, adv. అసంఖ్యాకంగా; లెక్కించడానికి వీలుపడని;
* unction, n. లేపనం; అంజనం; తైలం;
* undaunted, adv. నిరుత్సాహ పడకుండా;
* undecidable, adj. అస్తినాస్తి;
* undeniable, adj. తిరుగులేని;
* under, adj. కింద; ఉప;
** under employment, n. అల్పోద్యోగం; చదివిన చదువుకి కాని, ఉన్న తెలివితేటలకి గాని తగని చిన్న ఉద్యోగం;
* undercurrent, n. (1) అంతర్వాహిని; (2) ధోరణి; వైఖరి; సరళి;
* underdeveloped, adj. బడుగు;
* underdog, n. పోటీలో వెనకబడ్డ వ్యక్తి; అణచబడ్డ వర్గంలోని వ్యక్తి;
* undergo, v. i. అనుభవించు;
* underground, adj. భూగత; భూగర్భ;
** underground drainage system, ph. భూగర్భ నీటిపారుదల వ్యవస్థ;
** underground fungus, ph. భూగత శిలీంద్రము; truffle;
** underground stem, ph. భూగత కాండం;
* underhand dealing, ph. దందా;
* underline, n. క్రీగీటు; క్రీగీత;
* underprivileged, adj. బడుగు; అవకాశాలు లేని;
* underscore, v. t. (1) నొక్కి వక్కాణించు; (2) అడుగున గీత గీయు
* understand, v. i. అర్థమవు; బోధపడు; తెల్లం ఆవు;
* understand, v. t. అర్థం చేసుకొను;
* understanding, n. అవగాహన; అవగతం; గ్రహణశక్తి; ఒప్పందం;
** mutual understanding, ph. పరస్పర అవగాహన;
* understatement, n. నిమ్నోక్తి; సరసోక్తి; చెప్పదలుచుకున్న దానిని బాధించకుండా చెప్పడం; "పాట బాగు లేదు" అనకుండా "పాట ఎదో కొత్త పంథాలో ఉన్నట్లు ఉంది" అనడం ఒక ఉదాహరణ; నిజాన్ని కాస్త మెత్తబరచి చెప్పడం;
* undertake, v. i. తలపెట్టు; కైకొను; పూను;
* underwater, adj. జలగత;
* underwear, n. చెడ్డీ; లోదుస్తులు; చల్లాడం;
* underwrite, v. i. పూచీపడు;
* undesirable, adj. అవాంఛనీయమైన;
* undignified, adj. లేకి;
* undivided, adj. అవిభక్త; అఖండ;
** undivided India, ph. అఖండ భారతదేశం;
* undoubtedly, adv. నిస్సంకోచంగా; నిక్కచ్చిగా;
* undue, adj. తగని;
* undulate, v. i. ఊగిసలాడు;
* unearned, adj. అనుపార్జిత;
** unearned income, ph. అనుపార్జిత ఆదాయం;
* uneasiness, n. నలత;
* unemployed, n. నిరుద్యోగి; బికారి;
* unemployment, n. నిరుద్యోగం;
** unemployment problem, ph. నిరుద్యోగ సమస్య;
* unending, adj. అంతులేని; తరగని;
* unenthusiastically, adv. నిరుత్సాహంగా; నిరాసక్తంగా;
* unequal, adj. అసమానమైన; అసమమైన; విసమ; విషమ; ప్రతిసమ;
* unequivocal, n. అసందిగ్ధంగా; నిస్సంశయంగా;
* unerring, adj. సూటిగా; తడుముకోకుండా;
* uneven, adj. ఒడిదుడుకులతో; ఎగుడు దిగుడులతో కూడిన; ఎత్తుపల్లాలతో; మిట్టపల్లాలతో; దంతుర; దంతురిత; ఉచ్ఛావచ; నిమ్నోన్నతమైన; న్యూనాధిక;
* unevenness, n. దంతురత; న్యూనాధికత;
* unexpectedly, adv. అనుకోకుండా; అవశాత్తుగా; ఉభేతుగా;
* unfailingly, adv. తప్పక; తప్పకుండా;
* unfair, adj. అన్యాయం;
** unfair tax, ph. అప్పణం;
* unfair, n. అన్యాయం;
* unfavorable, n. ప్రతికూలం;
* unfit, adj. తగని;
* unfounded, adj. నిర్హేతుక;
* unfriendliness, n. అనుపపత్తి; చెలిమి లేకపోవడం;
* ungual, adj. గోరుకి సంబంధించిన; డెక్కకి సంబంధించిన;
* unguent, n. లేపనం;
* unhappy, adj. నిస్సంతోషంగా; సంతోషం లేని; విచారంగా;
** unhappy person, ph. నిస్సంతోషి;
* unheard, n. అశ్రుతచరం; విననిది;
* unheard of, adj. విని ఎరుగని; అశృత;
* unhesitating, adj. నిస్సంశయంగా; అవిశంక;
* uni, pref. ఏక;
* unicellular, adj. ఏకకణ;
** unicellular organisms, ph. ఏకకణ జీవులు;
* unidirectional, n. ఏకదిశాత్మకం;
* unification, n. సంధానం; సంయోగం; ఏకీకరణ; ఏకీకృతం; ఏకీభూతం;
* Unification Theory, ph. సంధాన వాదం;
** Grand Unification Theory, ph. మహత్ సంధాన సిద్ధాంతం;
* unified, adj. తాదాత్మ్య; సమీకృత; తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య; ఏకరూప; ఏకీకృత;
** Unified Field Theory, ph. కూటస్థ క్షేత్ర వాదం; ఏకీకృత క్షేత్ర వాదం;
* uniform, adj. తదేక; కూటస్థ; ఏకరీతి; ఏకవాక్య; సరూప; ఏకరూప;
** uniform acceleration, ph. తదేక త్వరణం;
** uniform convergence, ph. తదేక పరిచ్ఛిన్నం;
** uniform dress, ph. సరూప దుస్తులు; ఏకరూప దుస్తులు;
** uniform velocity, ph. తదేక ధృతిగతి; ఏకరూప వేగం;
* uniformity, n. తదేకత్వం; ఏకరూపత; సమబద్ధత; సదృశత్వం; ఒకేలాంటి "తనం;"
* unify, v. t. ఏకీకరించు; ఏకంచేయు;
* unilateral, adj. ఏకపాక్షిక;
* unimaginable, adj. అనూహ్యమైన;
* unimaginable, n. అనూహ్యం;
* unimpeachable, adj. ప్రశ్నింపలేని;
* unimpeded, adj. ధారాళంగా; అవ్యాహతంగా; అడ్డు లేకుండా;
* unimportant, n. అప్రధానం;
* uninhabited, adj. నిర్జన; విజన;
* uninterrupted, adj. అవిచ్ఛిన్న; నిర్విరామ; నిరాటంకమైన; ఎడతెగని;
* uninterruptedly, adv. అవిచ్ఛిన్నంగా; నిర్విరామంగా; నిరాఘాటంగా; నిరంతరాయంగా;
* uninvitedly, adv. అనాహూతంగా; పిలవని పేరంటంలా;
* union, n. (1) సంఘం; సమాఖ్య; (2) యోగం; సంయోగం; మేళనం; సంగమం; సంధానం; సంసర్గము; సంసక్తం;
** chemical union, ph. రసాయన సంయోగం;
** labor union, ph. కార్మిక సంఘం;
** reunion, ph. పునస్సంధానం;
* uni-planar, adj. ఏకతల; సమతల;
* unique, adj. ఏకైక; అనన్య; సాటిలేని; అపూర్వ; అనన్యసామాన్య; అనన్యాదృశ్య; అద్వితీయ; అనుపమాన;
* uniqueness, n. ఏకైకత; అపూర్వత;
* un-irrigated land, n. నీటిపారుదల లేని భూమి; దేవమాతృకం;
* unreachable, adj. అగమ్య; అందని; అందుబాటులో లేని; చేరలేని;
* un-irrigated field, n. నీటిపారుదల లేని పొలం; దేవమాతృకం;
* uni-sexual, adj. ఏకలింగ;
* unit, n. (1) ఒకటి; (2) ఘటికం; మూలఘటికం; అంశం; మూలాంశం; మూర్తం; ఏకాంకం; కొల ప్రమాణం;
** Derived unit, ph. వ్యుత్పాదిత మూల-మానము.
** Physical unit, ph. భౌతికాంకము.
** unit of heat, ph. తాపాంకము.
** unit of quality, ph. గుణప్రమాణము.
** unit of quantity, ph. రాశిప్రమాణము.
** unit of resistance, ph. ప్రతిరోధాంకము.
** unit of stress, ph. పీడనాంకము.
** unit of value, ph. మూల్యప్రమాణము.
** unit of work, ph. కర్మాంకము, క్రియాంకము.
* unite, v. i. కలియు; ఏకమగు; సంఘీభవించు;
* unite, v. t. సంధించు; కలుపు; ఉజ్జీచేయు; కలుపు;
* united, adj. సమైక్య; సంయుక్త;
* unity, n. (1) ఏకత్వం; ఒరిమిక; ఐకమత్యం; ఐక్యత; సంఘీభావం; అవినాభావం; సమైక్యత; కట్టు; కలిసికట్టుతనం; (2) ఒకటి;
** unity in diversity, ph. భిన్నత్వంలో ఏకత్వం;
* universal, adj. విశ్వ; విశ్వతోముఖ; విశ్వజనీన; వసుధైక; సర్వతోముఖ; జగత్; సర్వసామాన్య; సార్వజనిక; సర్వజనీన; సర్వత్ర; సార్వత్రిక; వ్యాప్తిలోనున్న;
** universal adult suffrage, ph. సార్వజనిక వయోజన నియోజనం; సావని; విశ్వజనీన వయోజన వియోజనం;
** universal consciousness, ph. విశ్వాత్మ; జగదాత్మ;
** universal donee, ph. సర్వ దఖలుదారు;
** universal franchise, ph. సార్వజనిక నియోజన;
** universal perspective, ph. వసుధైక దృక్పథం;
** universal spirit, ph. విశ్వాత్మ; జగదాత్మ;
* universals, n. pl. సార్వత్రికలు; సార్వత్రికాలు;
* universe, n. విశ్వం; జగత్తు; జగం; జగతి; సృష్టి; బ్రహ్మాండం;
** universe of discourse, ph. ప్రసంగ విషయం;
* university, n. విశ్వవిద్యాలయం; విశ్వకళాపరిషత్తు; విద్యాపీఠం;
* unjust, adj. అన్యాయపు; ఆకపాటి;
** unjust allegation, ph. అన్యాయపు ఆరోపణ; ఆకపాటి ఆరోపణ;
* unknowable, adj. అజ్ఞేయం; తెలియరానిది;
* unknown, adj. అవ్యక్త; అజ్ఞాత;
** unknown variable, ph. అవ్యక్త రాశి; అజ్ఞాత రాశి;
* unlawful, adj. చట్టవిరుద్ధమైన; చట్టబద్ధము కాని; దొంగ;
* unlimited, adj. అపరిమితమైన; పరిమితిలేని; అమితమైన;
* unlimited, n. అపరిమితం; అనవధికం; అమితం; అపారం;
* unload, v. t. దింపు; దించు;
* unlucky, adj. ముదనష్టపు; దురదృష్టపు; అదృష్టవిహీన;
* unlucky, n. దురదృష్టం; అభాగ్యం;
* un-manifested, adj. అవ్యక్తమైన; అవ్యాకృతమైన;
* unmarried, adj. పెళ్ళికాని, అవివాహ;
* un-measurable, adj. అమిత; కొలవలేని;
* unmount, v. t. దింపు; పెట్టిన స్థానం నుండి తీయు;
* unnatural, adj. అసహజమైన; విపరీతమైన;
* unnatural, n. అస్వభావికం;
* unnecessarily, adv. అనవసరంగా; నిష్కారణంగా;
* unnecessary, adj. అనవసరం;
* unobstructed, adj. అనర్గళ; నిరర్గళ; అప్రతిహత; నిరాఘాట;
* unobstructed, n. అనర్గళం; అప్రతిహతం;
* unobstructedly, adv. అనర్గళంగా; నిరర్గళంగా; అప్రతిహతంగా; నిరాఘాటంగా;
* unofficial, adj. అనధికార; అనాధికార;
* unofficial, n. అనాధికారికం;
* unorganized, adj. అసంఘటిత;
* unparalleled, adj. అతులిత;
* unpolished, adj. కోరా; మెరుగులేని; మోటు;
* unpolluted, adj. నిర్మల;
* unprecedented, adj. అభూతపూర్వ;
* unreasonably, adv. బేసబబుగా;
* unrefined, adj. ముతక; శుద్ధికాని;
* unrepeated, n. అజప;
* unrest, n. అలజడి; అనిశ్చలత్వం;
* unripe, adj. అపక్వ; అపరిపక్వ; పచ్చి; పండని;
* unrivalled, adj. పోటీలేని; సాటిలేని; అప్రతిమాన; అప్రతిమ;
* unrivalled, n. m. అప్రతిద్వందుడు;
* unsalted, adj. ఉప్పిడి;
* unsatisfied, adj. అసంతృప్త;
* unsaturated, adj. అసంతృప్త;
** unsaturated fatty acid, ph. అసంతృప్త గోరోజనామ్లం;
* unscathed, adj. చెక్కుచెదరని;
* unscientific, adj., అశాస్త్రీయమైన;
* unscrupulous, adj. కుత్సిత; నైతిక విలువలు లేని;
* unseasonal, adj. అకాల;
* unsigned, adj. (1) సంతకం లేని; సంతకం చెయ్యని; (2) ధన, రుణ సంకేతాలు లేని;
* unsolicited, adj. అయాచిత; అడగకుండా; కోరబడని;
* unsplit, adj. ఏకాండీ; విరగ్గొట్టని; చింపని; సంయుక్త; సమైక్య;
* unspeakable, adj. అనరాని; అవాచ్య;
* unstable, adj. అస్థిర; అధ్రువ; అనిశ్చల; చంచల; తరల;
* unsteady, adj. చంచల; నిలకడ లేని; కసిమసి;
* unstoppable, adj. దుర్వార;
* unsuccessful, adj. విఫలమైన;
* unsuitable, adj. అసంగత; అనుచిత; పొసగని;
* unsuitable, n. అసంగతం; అనుచితం;
* unthinkable, n. అచింత్యం;
* until, adv. వరకు; దనుక;
* untimely, adj. అకాల; అకాండిత;
** untimely rains, ph. అకాల వర్షాలు; అకాండిత వర్షాలు;
* untouchability, n. అంటరానితనం;
* untrue, n. అబద్ధం; అసత్యం; కల్ల; నిజం కానిది; సత్యదూరం;
* unusual, adj. అసాధారణ; అసాధారణమైన;
* unutterable, adj. అవాచ్య; అనరాని; ఆడరాని; అశ్లీలమైన; ఉచ్చరింపగూడని;
* unveil, v. t. ఆవిష్కరించు;
* unwell, n. నలత; అస్వస్థత;
** unwell person, ph. నలతరి; అస్వస్థుడు; అస్వస్థురాలు; నలతరాలు;
* unwise, adj. తెలివి తక్కువ; అజ్ఞానం; లౌక్యం తెలియని;
* uphill, n. ఎగుడు;
* up, adj. (1)లేచి ఉండు; (2) పనిచేసే పరిస్థితిలో ఉండు; పడుక్కోకుండా ఉండు;
* up, adv. (1) ఎగువకెళ్లే; (2) ఉత్తర దిశలో;
* up, n. ఎగువ;
* up, prep. మీద; పైన;
* upbeat, adj. ఉత్సాహవంతమైన; ఆశాజనక;
* update, v. t. తాజించు; తాజా చేయు; తాజీకరించు; క్రొత్త + చలుపు → క్రొంజలుపు; to make anew/to better/to refine → to update;
* updated, adj. తాజీకరించిన; క్రొంజలుపించిన;
* updates, n. క్రొంజలుపులు;
* upend, v. t. తిరగబెట్టు; బోల్తాకొట్టించు; ఉల్టా-సీదా చేయు;
* upgrade, v. t. మెరుగు పరచు; నాసి రకం వస్తువులని తీసేసి, వాటి స్థానంలో మెరుగైన వాటిని ప్రతిక్షేపించు;
* uphill, n. ఎగుడు; ఎక్కుడు;
* uplift, v. t. ఉద్ధరించు;
* upliftment, n. ఉద్ధరణ; సముద్ధరణ; ఉద్ధరింపు;
* upload, v. t. ఎక్కించు; పంపించు;
* upper, adj. ఎగువ; మీది; పై; వర;
** upper arm, ph. దండ; ముంజేయి;
** upper berth, ph. ఎగువ బడ్డీ;
** upper canal, ph. ఎగువ కాలవ;
** upper price, ph. ధరవరలు;
* uprising, n. తిరుగుబాటు;
* uppercase, n. పెద్ద బడి; ఇంగ్లీషు వంటి భాషలలో రాసే A, B, C వంటి పెద్ద అక్షరాలు; same as capital letters; (rel.) lowercase;
* uppityness, n. టెక్కు; డాబు; అతిశయం;
* uproar, n. ఘోషణ; ఎలగోలు;
* uproot, v. t. పెకలించు; పెల్లగించు; పెరకు; పీకు;
* ups and downs, ph. ఒడిదుడుకులు; నిమ్నోన్నతాలు;
* upset, v. t. తలకిందులు చేయు; తిరగబెట్టు; పాడుచేయు; వమ్ముచేయు;
* upshot, n. పర్యవసానం;
* upsidedown, ph. అతలాకుతలం; తలకిందులు;
* upstairs, n. మేడమీద; ఉప్పరిగె;
* upstream, adj. ఎగుదల;
* upward, adj. ఊర్ధ్వముఖ; పైకి చూపే; ఎగ;
** upward arrow, ph. ఊర్ధ్వముఖ సాయకం; పైకి చూపే బాణం;
** upward movement, ph. ఊర్ధ్వముఖ చలనం; పైకి కదలడం;
* upwind, ph. ఎదురుగాలి; గోగంధనం;
* Uranium, n. వరుణము; ఒక రసాయన మూలకం; (అణుసంఖ్య 92, సంక్షిప్త నామం, U);
* Uranus, n. (యూరెనస్) (1) ఇంద్ర; (2) వరుణుడు; వరుణగ్రహం; (3) తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించిన గణిత ఖగోళ శాస్త్రాలు లో ఇంద్ర, వరుణ, యమ అని Uranus, Neptune Pluto ల పేర్లు ఇచ్చారు;
* urban, adj. పౌర; నాగర; నగర; నగరీణ; నైగమ; పట్టణానికి సంబంధించిన; (ant.) rural;
* urbanization, n. నగరీకరణ; పట్టణీకరణ:
* urdiea, n. పాలపళ్ళు;
* urchin, n. కుంక; కురక్రుంక; అల్లరి పిల్లాడు;
* urea, n. మూత్రిక;
* ureter, n. మూత్రనాళం;
* urethra, n. మూత్రమార్గం; మూత్రం బయటకు వెళ్లే మార్గం;
* urge, n. ప్రేరణ; కుతి;
* urge, v. t. ప్రేరేపించు;
* urgent, adj. అత్యవసరమైన; అవశ్యం; అర్జంటు;
* urinary, adj. మూత్రానికి సంబంధించిన;
** urinary bladder, ph. మూత్రాశయం;
** urinary tubules, ph. మూత్రనాళికలు;
* urinate, v. t. ఉచ్చపోయు; మూత్రవిసర్జన చేయు; అల్పాచిమానం చేయు;
* urine, n. ఉచ్చ; నీరుడు; మూత్రం; పంచితం; అల్పాచిమానం; ప్రస్రావం;
* urn, n. కూజా; కలశం; మట్టు ఉన్న చిన్న పాత్ర;
* Ursa Major, n. బృహదృక్షం; పెద్ద ఎలుగుబంటి; ఎలుగుబంటి ఆకారంలో ఉన్న ఒక నక్షత్ర సముదాయం; ఈ ఎలుగుబంటి తుంటి భాగంలోనూ, తోక భాగంలోనూ కనిపించే కొన్ని తారలని సప్తర్షి మండలం అంటారు. దీనినే big dipper అనీ plow అనీ కూడా అంటారు;
* Ursa Minor, n. లఘుదృక్షం; ఒక నక్షత్ర సముదాయం;
* usable, adj. ఉపయోగపడే; (also) useable;
* usage, n. వాడుక; వాడకం; ప్రయోగం; ప్రయుక్తం; ఎసవాడుక;
** established usage, ph. ప్రయుక్తం;
** improper usage, ph. అపప్రయోగం;
** poetic usage, ph. కవి ప్రయుక్తం;
* use, n. (యూస్) ఉపయోగం; ప్రయోజనం; వాడుక;
* use, v. t. (యూజ్ ) ఉపయోగించు; వాడు; వ్యవహరించు;
* use of force, ph. దండోపాయం;
* useful, adj. పనికొచ్చే; ఉపయోగపడే; ఉపయుక్తమైన; కార్యకారకంగా; ఉపయోగకరంగా; ఉపాదేయంగా;
* useful, n. పనికొచ్చేది; ఉపయోగపడేది; ప్రయోజనకారి; కార్యకారి;
* useless, adj. అప్రయోజనమైన; పనికిరాని; అక్కరకురాని; పనికిమాలిన; చవట; నిరుపయోగమైన; నిష్ప్రయోజనమైన; కొరగాని; చిల్ల; పుంజులూరు;
* useless, n. నిరర్థకం; నిష్ప్రయోజనం; నిరుపయోగం; వ్యర్థం; పనికిమాలినది; అక్కరకురానిది;
** useless fellow, ph. అప్రయోజకుడు; అసమర్ధుడు; చవట; తేభ్యం; వాజమ్మ; దద్దమ్మ; వ్యర్థుడు; పుంజులూరు వెధవ; పనికిరానివాడు; పనికిరాని సన్నాసి; వితథుడు; పోరంబోకు;
** useless lands, ph. పోరంబోకు భూములు; చవిటి భూములు; వ్యవసాయానికి పనికి రాని, ప్రయోజనం లేని ప్రతినేలను చవుడు లేదా చవటభూములు అనడం అలవాటయ్యింది. ఈ పనికిరాని భూముల్ని చవటలు/పోరంబోకులు అని కూడా అంటారు;
* user, n. వినియోగదారుడు; ఉపయోగించువాడు; ప్రయోక్త; ఆచరణాఖ్యుడు; ఆచరణాఖ్యి; వాడుకరి;
* usher, n. ద్వారదర్శి; నకీబు;
* usual, adj. యథాప్రకారం; ఎప్పటివలె;
** as usual, ph. యథాప్రకారం; యథావిధిగా; ఎప్పటిఉపయోక్త;
* user, n. వాడుకరి; వాడకందారు ; వినియోగదారు; ఉపయోక్త;
* user-friendly, adj. ఉపయోక్త సఖ్యత్వ; వాడుకకి వీలుగా; తేలికగా ఉపయోగించడానికి వీలయే;
* usually, adv. సామాన్యంగా; సాధారణంగా;
* usurer, n. వడ్డీ వ్యాపారస్థుడు;
* usury, n. (యూషరీ) ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారం; ఎక్కువ వడ్డీకి అప్పు ఇచ్చే వడ్డీ వ్యాపారస్థుడు;
* utilitarianism, n. ఉపయోగితా వాదం;
* usurp, v. t. అపహరించు; లాక్కొను; మింగు;
* usurper, n. అపహర్త;
* usury, n. వడ్డీవ్యాపారం; వడ్డీ వ్యాపారస్తుడు;
* utensils, n. పాత్రసామాను; వాడుక గిన్నెలు; ముంతా తప్పేలాలు; తట్టుముట్లు;
* uterine siblings, ph. ఏకోదరులు;
* uterus, n. గర్భాశయం; గర్భకోశం; బిడ్డసంచీ; జరాయువు;
* utility, n. (1) ఉపయుక్తి; ఉపయోగం; ప్రయోజనం; (2) టెలిఫోను, నీటి సరఫరా; విద్యుత్తు, మొదలైన సౌకర్యాలు;
* utilizable, adj. ఉపయోజనీయ;
* utilize, v. t. వినియోగించు; వినియోగపరచు; ప్రయుక్తపరచు;
* utmost, adj. అతి; మిక్కిలి;
* utopia, n. ఊహాస్వర్గం; కల్పనాలోకం; (ant.) dystopia = an imagined state or society in which there is great suffering or injustice, typically one that is totalitarian or post-apocalyptic.
* utter, adj. శుద్ధ; పరమ; ఘన;
** utter poverty, ph. ఘన దరిద్రం; పరమ దరిద్రం;
** utter stupid, ph. శుద్ధ మొద్దావతారం;
* utter, v. i. ఉచ్చరించు; అను; ఉటంకించు; వ్రాక్కుచ్చు;
* utterance, n. ఉటంకంపు; ఉక్తి; పలకబడ్డది; ఉదీరణం;
* uttered, n. ఉదితం; చెప్పబడ్డది;
* utterly, adv. సుతరాము; బొత్తిగా; పరిపూర్ణంగా; శుద్ధ;
* uvula, n. కొండనాలుక; చిరునాలుక; లంబిక; కాకలం; ఉపజిహ్విక; ఘంటిక; అంగిటిముల్లు; ఉపజిహ్విక; ప్రతిజిహ్వ;
* uvulitis, n. కొండనాలుక వాపు; ఉపజిహ్వాదాహం;
*
|width="65"| <!--- Do Not Change This Line --->
<!--- Insert ALL Images Below This Line (center|150px|thumb) --->
|-
|- <!--- Nothing Below This Line! --->
|}
==మూలం==
* V. Rao Vemuri, English-Telugu and Telugu-English Dictionary and Thesaurus, Asian Educational Services, New Delhi, 2002 ISBN 0-9678080-2-2
[[వర్గం:వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు]]
ez1os0xit52z1uu5r44fl17bgf9ntig
యండమూరి వీరేంద్రనాథ్ రచనలు/చెంగల్వ పూదండ
0
3345
39212
34752
2026-06-02T07:31:43Z
రవిచంద్ర
129
39212
wikitext
text/x-wiki
కృష్ణ అనే యువకుడు చేయని హత్యానేరానికి జైలు పాలవుతాడు. అతన్ని పసికందుగా ఉన్నపుడే ఎవరో అడవిలో పారేసుకుంటే అక్కడే ఉన్న ఒక మహిళ అతన్ని పెంచుకుంటుంది. కృష్ణ చిన్నతనం నుంచి అడవిలో కట్టెలు కొడుతూ జీవనం సాగిస్తుంటాడు. కృష్ణ చిన్ననాటి నుంచే పరిచయం అయిన పార్వతిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కానీ ఆమె మీద కన్నేసిన లక్ష్మీ నారాయణ అనే వ్యక్తి ఆమెను పెళ్ళి చేసుకోవడం కుదరదని కృష్ణను హెచ్చరిస్తాడు. కృష్ణ కోపంతో అతని మీద చేయి చేసుకుంటాడు. దాంతో లక్ష్మీ నారాయణ అతని మీద పగ పెంచుకుని కృష్ణ, బాబాయి అని పిలుచుకునే వ్యక్తి ద్వారా నమ్మించి మోసం చేస్తాడు. పార్వతి తండ్రిని ముందుగానే హత్య చేసి, పార్వతికి పాము కరిచిందని అబద్ధమాడి, కృష్ణను ఆమె ఇంటికి పిలిపించి తెలివిగా అతని మీద హత్యానేరం మోపి అరెస్టు చేయిస్తాడు. ఆ సమయంలో అతన్ని చూడటానికి తాను ప్రేమించిన పార్వతి, పెంచిన తల్లి ఎవరూ రారు. వారు ఏమైపోయారో కూడా అతనికి తెలియదు.
ఈ కథంతా జైలులో తనకు పరిచయమైన విప్లవకారుడు, బందిపోటుగా పేరుగాంచిన ఠాకూర్ బలదేవ్ సింగ్ కి చెప్పుకుంటాడు. ఠాకూర్ మంచి విద్యావంతుడు. పోరాటాలలో ఆరితేరిన వాడు. అతను ఇతనికి చదువు చెప్పి కొన్ని విద్యలు నేర్పిస్తాడు. వ్యక్తిగతమైన గమ్యాలు మాని విశాల ధృక్పథంతో ఆలోచించమని బోధిస్తాడు. కొంతకాలానికి ఠాకూర్ జైలు నుంచి పారిపోవడానికి ప్రయత్నించి పోలీసుల చేతిలో మరణిస్తాడు.
పది సంవత్సరాల తర్వాత కృష్ణ సత్ప్రవర్తన కారణంగా జైలు నుంచి విడుదల అవుతాడు. తిరిగి తన ఊరికి వెళ్ళి పెంపుడు తల్లి, పార్వతి కోసం గాలిస్తాడు. కానీ ఎక్కడా వారి జాడ కానరాదు. పార్వతి ఇంటి స్థానంలో లక్ష్మీనారాయణ పెద్ద ఇల్లు కట్టుకుని ఉంటాడు. అక్కడే ఉన్న తన స్నేహితుడు ఇస్మాయిల్ సాయంతో పార్వతి ఆ ఊరు విడిచి వెళ్ళిపోయిందని తెలుసుకుంటాడు. అమ్మ వేరే వ్యక్తితో లేచిపోయిందని చెబుతాడు. అది అతనికి నమ్మశక్యం కాదు. అంతకు మునుపే ఠాకూర్ ఒక రహస్య ప్రాంతంలో దాచిన కొంత ధనం గురించి చెప్పి ఉంటాడు. దాన్ని సంపాదించగా అది రాజా నరేంద్రవర్మదని తెలుస్తుంది. అది అతనికి అప్పగించడానికి ఆయన దగ్గరకు వెళ్ళగా అతనికి కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలుస్తాయి. నరేంద్రవర్మ కుమారుడు, కోడలు అడవిలోనుంచి వెళుతండగా ఠాకూర్ వాళ్ళని అటకాయించి వారిని హతమార్చాడనీ, వారి కుమారుడే తానని తెలుసుకుంటాడు. అందుకు నిరూపణగా అతని దగ్గర ఉన్న లాకెట్ ను పార్వతికి ఇచ్చేసి ఉంటాడు. అందుకని నరేంద్రవర్మ అతన్ని మోసగాడని అనుమానిస్తాడు.
ఇక అక్కడ ఉండలేక వేరే ఊరికి వెళ్ళి ఒక లాడ్జీలో ఉంటాడు. అక్కడికి హైమ అనే వేశ్య ఇతని దగ్గరికి వస్తుంది. ఆమె దగ్గర తాను గతంలో పార్వతికి ఇచ్చిన లాకెట్ ఉంటుంది. అది ఎక్కడ నుంచి వచ్చిందని ఆమెను నిలదీస్తాడు. ఆమె నేరుగా ఒక వ్యభిచార గృహానికి తీసుకువెళుతుంది. దాని యజమాని కాంతమ్మ మొదట తెలియదని బుకాయించినా పార్వతి గురించి చెబుతుంది. కానీ ఆమె అక్కడ ఉండదు. హైమ కలుగజేసుకుని దయనీయమైన స్థితిలో ఉన్న పార్వతి దగ్గరకు తీసుకువెళుతుంది. పార్వతి కృష్ణను గుర్తు పట్టి, తనకు ఈ స్థితిని కలగడానికి కారణం లక్ష్మీనారాయణ అని చెప్పి అతని చేతిలోనే కన్ను మూస్తుంది. అదే సమయంలో నరేంద్రవర్మ అనుచరుడైన శంకర్ దాదా అతన్ని అనుసరిస్తూ అతను నిజమైన వారసుడే అని నరేంద్రవర్మకు తెలియజేస్తాడు.
నరేంద్రవర్మ తన మనవడి కోరిక మేరకు అతని ఆధ్వర్యంలోనే అతను పెరిగిన గ్రామంలో విలాసవంతమైన ఇల్లు కట్టిస్తాడు. అతనికి వ్యాపారం చేసుకోమని డబ్బులు ఇస్తాడు. అప్పటికే అక్కడ ధనవంతుడిగా పేరు గాంచిన లక్ష్మీనారాయణ అతను తాను మోసం చేసినవాడే అని తెలియక అతని వ్యాపారాల్లో భాగస్వామిగా చేరతాడు. అతని కొడుకు రవిని అతని దగ్గర వ్యాపార మెలకువలు నేర్చుకొమ్మని చెబుతాడు. కృష్ణ తాను వ్యభిచార గృహం నుంచి రక్షించిన హైమను రవిని ప్రేమించినట్లు నాటకమాడమని చెబుతాడు. ఆమె నిజంగానే అతని ప్రేమలో పడుతుంది. వ్యాపారాల్లో మొదటగా లాభాలు చూపించి లక్ష్మీనారాయణ నుంచి మరింత పెట్టుబడి రాబడతాడు. చివరకు వారు చేసే వ్యాపారాల్లో నష్టం వచ్చి అతని సొమ్మంతా కరిగిపోయేలా చేస్తాడు. అతని అన్నంలో విషం కలిపి అతనికి పక్షవాతం వచ్చేలా చేస్తాడు. అతని కళ్ళ ముందే కొడుకు హైమను పెళ్ళి చేసుకునేలా చేస్తాడు. ఇదంతా చూసి లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకుంటాడు. బాబాయ్ దగ్గరకు వెళ్ళి అతని దగ్గరనే తల్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయందన్న నిజాన్ని చెప్పించి అతన్ని కూడా హతమార్చి విప్లవ నాయకుడిగా మారి అడవుల్లోకి వెళ్ళిపోతాడు.
sditfzq56it39k5vrmazu9ktr8p1ghr
కొమ్మూరి సాంబశివరావు రచనలు/లాకెట్ మర్మం
0
4839
39211
38880
2026-06-02T07:29:27Z
రవిచంద్ర
129
39211
wikitext
text/x-wiki
డిటెక్టివ్ యుగంధర్ ఆఫీసులో ఉండగానే అతని గుమ్మం మందుగా ఒక వ్యక్తిని హత్య చేస్తారు దుండగలు. అతను యుగంధర్ కి ఒక లాకెట్ గురించి చెబుతాడు. చనిపోయిన వ్యక్తి దొంగతనం చేసి జైలుకి వెళ్ళి విడుదలైన వ్యక్తి అని తెలుస్తుంది. హంతకుడు యుగంధర్ కి ఫోన్ చేసి అతని దగ్గర ఏమైనా లాకెట్ ఉందేమో అడుగుతాడు. దాన్ని ఎరగా చూపి యుగంధర్ అతన్ని పట్టుకోవడానికి చూస్తాడు. కానీ అతను ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ వారి నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. దొంగతనం చేసిన సొమ్ము దాచిపెట్టిన స్థలం గురించి సమాచారం ఉన్నఆ లాకెట్ చనిపోయిన వ్యక్తి కూతురు దగ్గర నుంచి చాలా మంది చేతులు మారి ఉంటుంది. దాన్ని యుగంధర్ కనిపెట్టే లోపు హంతకుడు ముందే పసిగట్టి దాన్ని చేజిక్కించుకుంటారు. చివరికి యుగంధర్ అతన్ని వెంబడించి చట్టానికి పట్టించడం ఈ నవల కథాంశం.
ezbz6ixhnmpmau7g045dlkhgadi11dm