Wikibooks
tewikibooks
https://te.wikibooks.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.17
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
Wikibooks
Wikibooks చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
కొమ్మూరి సాంబశివరావు రచనలు/అనామకుడి హత్య
0
4860
39353
39344
2026-08-25T14:26:02Z
రవిచంద్ర
129
39353
wikitext
text/x-wiki
భాస్కరరావు ఒక బేకరీ యజమాని. ఇతనికి ఒక వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉంటుంది. భాస్కరరావు దగ్గర నల్లా రామయ్య అనే అతను డ్రైవరుగా చేరతాడు. ఒకానొక రాత్రి భాస్కరరావు ఇంట్లో హత్య జరిగినట్లు పోలీసులకు ఫోన్ వస్తుంది. పోలీసులు అక్కడికి వెళ్ళి విచారించగా అక్కడ శవం ఏమీ కనిపించదు కానీ ఒక వ్యక్తిని చంపి అవయువాలు పొయ్యిలో కాల్చివేసినట్లుగా ఆధారాలు దొరుకుతాయి. పరిస్థితులను బట్టి ఆ చనిపోయిన వ్యక్తి నల్లా రామయ్య అని, అక్కడ దొరికిన సాక్ష్యాల ఆధారంగా పోలీసులు భాస్కరరావును అరెస్టు చేస్తారు. అతని ప్రేయసి వెళ్ళి భాస్కరరావు అమాయకుడనీ, అతన్ని కేసు నుంచి బయట పడేయమని డిటెక్టివ్ యుగంధర్ సహాయం కోరుతుంది. అసలు శవమే లేకుండా పోలీసులు భాస్కరరావు హత్య చేశాడని పోలీసులు ఎలా నిర్ధారణకు వచ్చారో తెలుసుకున్న యుగంధర్ కి ఈ కేసు ఆసక్తిగా అనిపించి పరిశోధనలోకి దిగుతాడు. అతను భాస్కరరావు జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ కేసుని ఎలా ఛేదించాడన్నది మిగతా కథ.
e7nilkr4cu3iz3hvz1jgwa67wvw0lb3