వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.4
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
రచయిత:కోట వెంకటాచలం
102
14749
557458
557402
2026-05-28T17:00:30Z
Rajasekhar1961
50
/* రచనలు */
557458
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = కోట
|అసలుపేరు = వెంకటాచలం
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు = 1885
|గిట్టిన_యేడు = 1959
|వివరణ =
|బొమ్మ= Kota venkatachalam rarebooksocietyofindia org 001.png
|వికీపీడియా_లంకె = కోట వెంకటాచలం
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ఆంధ్రుల పుట్టుపుర్వోత్తరములు]]<references/>
* [[కలియుగ రాజవంశములు]]
* [[జంబూద్వీపము (అందలి వర్షవిభాగములు)]]
{{authority control}}
ofx42yy7z0djhbfzmz0c9kna5dypv74
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/498
104
212221
557444
553437
2026-05-28T16:14:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557444
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
తుర్రెబాజ్ బ్రిటిష్ రెసిడెన్సీ మీద దాడి చేసి హైదరాబాద్ సంస్థానంలో ఆంగ్లేయుల పాలన అంతమొందించాలను
కున్నాడు. ఇదిలా ఉండగా జూన్ 10, 1857 నాడు బ్రిటిష్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాడనే నెపంతో మౌల్వీ ఇబ్రహీంను
బెదిరించారు, నిఘా పెట్టారు. జూన్ 12 నాడు అతన్ని అరెస్టు చేసారు. 1857, జూన్ 23న డఫేదార్ మీర్ ఫిడాలీ
కెప్టెన్ అబ్బాట్ను కాల్చివేయడానికి ప్రయత్నించాడు. ఆంగ్లేయులు మిర్ ఫిడాలీని పట్టుకొని ఉరి తీసారు. బ్రిటిష్
వారిపై దాడిచేసినట్లు రికార్డయిన జమేదార్ చీతాఖాన్లో పాటు 13 మంది భారతీయ సైనికులు ఔరంగాబాద్ నుండి
తప్పించుకొని హైదరాబాద్ చేరుకొని నిజాంను శరణు జొచ్చారు. నిజాం తన దివాన్ సలార్జింగ్ సలహాప్రకారం
చీతా ఖాన్ బృందాన్ని రెసిడెంటుకు అప్పజెప్పాడు. అలా వాళ్ళు రాకాసి ఒడికి చేరిపోయారు. కోరీ రెసిడెన్సీలోని
నేలమాళిగలో వాళ్ళను బందీ చేసి చిత్రహింసలకు గురిచేసారు. బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసిన
దేశభక్తులు చిత్ర హింసలకు గురికావడం తుర్రెబాజ్ ఖాన్ ను కలచి వేసింది. ఆ దేశభక్తులను విడిపించడం కోసమైనా
రెసిడెన్సీ మీద దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. తుర్రెబాజ్ మౌల్వీ అల్లా ఉద్దీన్తో చర్చించాడు. ఇతర రోహిల్లా
వీరులను పోరాటానికి సంసిద్దపరిచాడు. ముహూర్తం నిర్ణయించబడిందో లేదో కాని దాడి చేయాలనే నిర్ణయం
జరిగిపోయింది. రెసిడెన్సీ మీద దాడికి నాలుగు రోజుల ముందు మొగిలిగిద్దకు వెళ్ళి కొన్ని ఆయుధాలను తెచ్చు
కున్నాడు, గుర్రాలకు దాణాకోసం వెళ్తున్న నెపంతో.
జులై 17 రోజున మక్కా మజీదులో ప్రార్థన సమయం ఉద్రిక్తంగా మారింది. ఇమామ్ చేస్తున్న శాంతి ప్రవచనాలను
యువత అడ్డుకొంది. మక్కా మజీదు గోడల మీద పోస్టర్లు వెలసాయి. మజీదు మినార్ల నుండి ఆకుపచ్చ జండాలు
జారిపడ్డాయి. ప్రజలంతా ఆ జెండాలను చేతబూనారు. తుర్రెబాజ్ ఖాన్ చేతిలో జెండా పూని గుర్రం మీద ముందు
భాగాన దౌడు తీసాడు. మక్కా మజీదు నుండి బేగం బజారు దిశగా ప్రయాణించి మౌల్వీ అల్లాఉద్దీన్ సిద్ధపరచిన 500
మంది రోహిల్లా వీరులను కలుసుకున్నాడు.
మజీదు వద్ద నమాజు పూర్తి చేసుకున్న పెద్దమనుషులు ఉపద్రవ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. నలుగురు మౌల్వీలు ప్రతినిధి బృందాన్ని నిజాం వద్దకు పంపి రెసిడెన్సీలో బందీలుగా ఉన్న చీతాఖాన్ బృందాన్ని విడిపించుటకు ప్రయత్నించాలని భావించింది. నలుగురు మౌల్వీలు వెళ్ళారు. నిష్ప్రయోజకంగా వెనుదిరిగారు. ఆ నలుగురు మౌల్వీలలో అల్లా ఉద్దీన్ కూడా ఒకరు. రాయబారం ఫలించదని ఆయనకు ముందే తెలుసు. అందుకే రోహిల్లా వీరులను సంసిద్ధం చేసే వెళ్ళారు. వెనక్కు తిరిగి రాగానే రెసిడెన్సీ దిశగా కదలిక ప్రారంభించారు.
రాయబారం విఫలం కాగానే ఏదైనా దాడి జరిగే అవకాశం ఉందని పసిగట్టి దీవాన్ సాలార్జింగ్ రెసిడెంటుకు
సమాచారమిచ్చి జాగరూకపరిచాడు. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రెసిడెంట్ డేవిడ్సన్ తనకు అందుబాటులో
ఉన్న సైన్యాన్ని సంసిద్ధపరిచాడు. సాలార్ జంగ్ను కొంత సైన్యంకోసం అర్థించాడు కాని వాళ్ళు వచ్చేదాకా ముహూర్తం
ఆగదని డేవిడ్సనక్కు తెలిసిపోయింది.
మొదట తుర్రెబాజ్ ఇతర రోహిల్లా వీరులు పుత్లిబౌలీ దిశగా నడిచి అబ్బాన్ సాహెబ్ ఇంటి ముందుకు చేరారు. అబ్బాన్ సాహెబ్ ఇంటి ఎదురుగా ఉన్న రెసిడెన్సీ గేటులోపల సైనికులు మరఫిరంగితో సిద్ధంగా ఉన్నారు. అంతలో మౌల్వి అల్లాఉద్దీన్ అతని అనుచరులలో సహావచ్చి తుర్రెబాజన్ను కలుసుకున్నాడు. మాక్కామజీదు వద్ద జన సమూహం మాయమైంది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో 500 మంది ప్రజలు రెసిడెన్సీ నైరుతి గేటు వద్ద గుమిగూడారు. సమయం చూసుకొని రోహిల్లాలు రెసిడెన్సీ పడమటి గోడకు ఎదురుగా ఉన్న అబాన్ సాహెబ్, జైగోపాలన్ దాసులు రెండంతస్తుల భవనాలను ఎక్కేసారు. అబ్బాన్ సాహెబ్ ఇంట్లోకి చేరుకోగానే మూమెంట్ కోసం అబ్బాస్ సాహెబ్, జైగోపాల్ దాస్, ఆజం అలీ ఖాన్ల ఇండ్లమధ్య అడ్డుకోడల్ని కూలగొట్టారు. రెసిడెంటు నైరుతి గేటును పగులగొట్టి షావుకార్ల ఇండ్లమీద నుండి దాడి చేద్దామని తుర్రెబాజ్, అల్లాఉద్దీన్ పథకం. సాయంత్రం 6.30 గం॥లకు తుర్రెబాజ్ నాయకత్వంలోని రోహిల్లాలు రెసిడెన్సీ గార్డెన్ గేటును కూలగొట్టారు. ఇంకొక గేటును అల్లా ఉద్దీన్ ధ్వంసం చేసాడు. ఈ దశలో రెసిడెన్సీ నుండి కమాండర్ బ్రీవెట్ కాల్పులు ప్రారంభించాడు. ఏడు రౌండ్లు కాల్చాడు. రోహిల్లాలు చెదిరిపోయారు. ఫైరింగ్ ఇరవై నిమిషాలపాటు నడిచింది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |477 | తేజోమూర్తులు}}</noinclude>
g0tzmx5vb6ytfhnqy941k2fzc09wvn1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/499
104
212222
557447
553438
2026-05-28T16:23:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557447
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
రాత్రి 8.30 గం౹౹ల వరకు దాదాపు తిరుగుబాటు దారులంతా చెదిరి పోయారు. తుర్రెబాజ్, అల్లాఉద్దీన్ మరికొద్దిమంది
అనుచరులు షావుకార్ల ఇండ్లల్లో వేచి ఉన్నారు. చివరి కాల్పులు తెల్లారగట్ల 4 గంటల దాకా సాగాయి. దాడి విఫలమైంది. 32 మంది చనిపోయారు. 25 మంది శవాలను తీసుకొని రోహిల్లాలు తప్పించుకున్నారు. 7 శవాలు రోడ్డుమీద పడి ఉన్నాయి. అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా శవాలై పోయారు. తెల్లవారగట్ల 6 గంటలకు మిగిలిన వీరులంతా బేగంబజార్ లోని తుర్రెబాజ్ ఇంటికి చేరారు. నగరంలో ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళిపోయారు.
తుర్రెబాజ్ కొత్వాల్ గూడ ద్వారా షాద్ నగర్ కు దగ్గరలో ఉన్న మొగిలిగిద్దకు పారిపోయాడు. అక్కడి నుండి ఇతర
రోహిల్లా వీరులు ఉంటున్న సాత్కల్య ప్రాంతానికి చేరాడు. తుర్రెబాజ్, అల్లా ఉద్దీన్లను అరెస్టు చేయమని అందరు
కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీలు అయినాయి. జమేదార్ బుద్దఖాస్కు జవానులుగా ఉన్నవాళ్ళు తుర్రెబాజ్న
గుర్తించి కాల్పులు జరిపారు. ఒక తూటా తొడలో, మరొక తూటా మోకాలు పైభాగాన తగిలింది. తుర్రెబాజ్ గుర్రాన్ని
చంపివేసారు. జాన్ మహ్మద్ అనే సహచరుణ్ణి చంపి తుర్రబాజ్ను అరెస్టు చేసారు. తుర్రిబాజక్కు ఒక కంటి కింద
ఉన్న మచ్చవల్ల ఆయనను గుర్తుపట్టి అరెస్టు చేయగలిగారని జులై 22, 1857న సాలార్జంగ్ బ్రిటిష్ రెసిడెంటుకు రాసిన లేఖ నెం. 1061 ద్వారా తెలుస్తుంది.
తుర్రెబాజ్ ను హైద్రాబాద్ కు తరలించి విచారణ చేసి అండమాన్లో యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించాలని
నిర్ణయించారు. యావజ్జీవ కారాగార శిక్షను ఉరిశిక్షగా మార్చమని రెసిడెంటు డేవిడ్సన్ గవర్నరు జనరల్ను కోరాడు.
గవర్నరు జనరల్ కు ఆ అధికారం ఉన్నా హైదరాబాద్ కోర్టు విధించిన శిక్షను తాను మార్చ బోనన్నాడు. అండమాను
తరలించక ముందు హైద్రాబాద్లో కస్టడీ నుండి జనవరి 18, 1858న తుర్రెబాజ్ తప్పించుకోగలిగాడు. తుర్రెబాజ్
తలకు 5000 రూ॥ల నజరానా ప్రకటించింది ప్రభుత్వం. తుర్రేబాజ్ మెదక్ జిల్లా తూప్రాన్లో ఖుర్బాన్ అలా, జమేదార్
మహ్మద్ ఖాన్ కంటబడి తప్పించుకోబోయాడు. కత్తితో పోరాటం చేయబోగా ఖుర్బాన్ అలీ తుపాకితో కాల్చి చంపాడు.
తుర్రెబాజ్న. అలా 23-1-1859న చనిపోయిన తుర్రెబాజ్ ఖాన్ మృతదేహాన్ని హైద్రాబాద్ తీసుకు వచ్చి తలను
మొండాన్నీ వేరు చేసి కోఠీలో భీభత్సంగా కొన్ని రోజులపాటు ప్రదర్శనకు పెట్టారు. తెలంగాణ త్యాగానికి, నిజాయితీకి మహా సంకేతం తుర్రెబాజ్ ఖాన్. వీరత్వానికి పర్యాయపదం తురుంఖాన్.
ఆనాటి బ్రిటిష్ రెసిడెంట్ చెప్పినట్లు కొద్దిపాటి ఆర్ధిక వెన్నుదన్ను, ఒకింత ప్రణాళిక ఉండి ఉంటే బ్రిటిష్
సామ్రాజ్యవాదం ఉద్వాసన హైదరాబాద్ నుండే ఆరంభమయి ఉండి ఉండేది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |477 | తేజోమూర్తులు}}</noinclude>
ef3sglaxjqe93pxrr73bo38dbadbyvi
557453
557447
2026-05-28T16:49:52Z
A.Murali
3019
557453
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
రాత్రి 8.30 గం౹౹ల వరకు దాదాపు తిరుగుబాటు దారులంతా చెదిరి పోయారు. తుర్రెబాజ్, అల్లాఉద్దీన్ మరికొద్దిమంది
అనుచరులు షావుకార్ల ఇండ్లల్లో వేచి ఉన్నారు. చివరి కాల్పులు తెల్లారగట్ల 4 గంటల దాకా సాగాయి. దాడి విఫలమైంది. 32 మంది చనిపోయారు. 25 మంది శవాలను తీసుకొని రోహిల్లాలు తప్పించుకున్నారు. 7 శవాలు రోడ్డుమీద పడి ఉన్నాయి. అందులో ఇద్దరు చిన్న పిల్లలు కూడా శవాలై పోయారు. తెల్లవారగట్ల 6 గంటలకు మిగిలిన వీరులంతా బేగంబజార్ లోని తుర్రెబాజ్ ఇంటికి చేరారు. నగరంలో ఉండడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి వెళ్ళిపోయారు.
తుర్రెబాజ్ కొత్వాల్ గూడ ద్వారా షాద్ నగర్ కు దగ్గరలో ఉన్న మొగిలిగిద్దకు పారిపోయాడు. అక్కడి నుండి ఇతర
రోహిల్లా వీరులు ఉంటున్న సాత్కల్య ప్రాంతానికి చేరాడు. తుర్రెబాజ్, అల్లా ఉద్దీన్లను అరెస్టు చేయమని అందరు
కలెక్టర్లకు, అధికారులకు ఆదేశాలు జారీలు అయినాయి. జమేదార్ బుద్దఖాస్కు జవానులుగా ఉన్నవాళ్ళు తుర్రెబాజ్న
గుర్తించి కాల్పులు జరిపారు. ఒక తూటా తొడలో, మరొక తూటా మోకాలు పైభాగాన తగిలింది. తుర్రెబాజ్ గుర్రాన్ని
చంపివేసారు. జాన్ మహ్మద్ అనే సహచరుణ్ణి చంపి తుర్రబాజ్ను అరెస్టు చేసారు. తుర్రిబాజక్కు ఒక కంటి కింద
ఉన్న మచ్చవల్ల ఆయనను గుర్తుపట్టి అరెస్టు చేయగలిగారని జులై 22, 1857న సాలార్జంగ్ బ్రిటిష్ రెసిడెంటుకు రాసిన లేఖ నెం. 1061 ద్వారా తెలుస్తుంది.
తుర్రెబాజ్ ను హైద్రాబాద్ కు తరలించి విచారణ చేసి అండమాన్లో యావజ్జీవ కారాగార వాస శిక్ష విధించాలని
నిర్ణయించారు. యావజ్జీవ కారాగార శిక్షను ఉరిశిక్షగా మార్చమని రెసిడెంటు డేవిడ్సన్ గవర్నరు జనరల్ను కోరాడు.
గవర్నరు జనరల్ కు ఆ అధికారం ఉన్నా హైదరాబాద్ కోర్టు విధించిన శిక్షను తాను మార్చ బోనన్నాడు. అండమాను
తరలించక ముందు హైద్రాబాద్లో కస్టడీ నుండి జనవరి 18, 1858న తుర్రెబాజ్ తప్పించుకోగలిగాడు. తుర్రెబాజ్
తలకు 5000 రూ॥ల నజరానా ప్రకటించింది ప్రభుత్వం. తుర్రేబాజ్ మెదక్ జిల్లా తూప్రాన్లో ఖుర్బాన్ అలా, జమేదార్
మహ్మద్ ఖాన్ కంటబడి తప్పించుకోబోయాడు. కత్తితో పోరాటం చేయబోగా ఖుర్బాన్ అలీ తుపాకితో కాల్చి చంపాడు.
తుర్రెబాజ్న. అలా 23-1-1859న చనిపోయిన తుర్రెబాజ్ ఖాన్ మృతదేహాన్ని హైద్రాబాద్ తీసుకు వచ్చి తలను
మొండాన్నీ వేరు చేసి కోఠీలో భీభత్సంగా కొన్ని రోజులపాటు ప్రదర్శనకు పెట్టారు. తెలంగాణ త్యాగానికి, నిజాయితీకి మహా సంకేతం తుర్రెబాజ్ ఖాన్. వీరత్వానికి పర్యాయపదం తురుంఖాన్.
ఆనాటి బ్రిటిష్ రెసిడెంట్ చెప్పినట్లు కొద్దిపాటి ఆర్ధిక వెన్నుదన్ను, ఒకింత ప్రణాళిక ఉండి ఉంటే బ్రిటిష్
సామ్రాజ్యవాదం ఉద్వాసన హైదరాబాద్ నుండే ఆరంభమయి ఉండి ఉండేది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |478 | తేజోమూర్తులు}}</noinclude>
cx58pwhzrrg5eyfmck63dhvomic60t7
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/500
104
212223
557449
553439
2026-05-28T16:30:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557449
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''139. ఉత్పల సత్యనారాయణాచార్య '''</p>}}
{{right|- ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి}}
క్రీ॥ శే॥ శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్య జగమెరిగిన కవులు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్రప్రభుత్వ 'హంస' అవార్డులను పొందిన వారు. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కార గ్రహీతలు దత్తపీఠ (గణపతి సచ్చిదానంద స్వామి) ఆస్థానకవులు. ఇవికాక మరెన్నో పురస్కారాలు అందుకొన్నారు. కలం పట్టిన నాటి నుంచి అరవయ్యేళ్లకు పైగా అవిశ్రాంతంగా రచనా వ్యాసంగం సాగించి, దాదాపు డెబ్భై గ్రంథాలు రచించిన కవిశేఖరులు.
ఉత్పల ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో 4-7-1928న జన్మించారు. 2007 సంవత్సరంలో హైదరాబాదు లో పరమపదించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి అలివేలమ్మ, శ్రీమాన్ రఘునాథాచార్యులు.
పేదరికం వల్ల ఆయన చదువు ఒడిదుడుకులతో సాగింది. స్వయంకృషితో ఉన్నత విద్యనభ్యసించారు. తొలి
నాళ్లలో సర్దార్ జమలాపురం కేశవరావు అనుయాయి అయి రాజకీయాల్లోను, ఉద్యమాల్లోను పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిగా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. మధ్యలో కొంతకాలం తెలుగు అకాడమీలో పనిచేసి,
జూనియర్ కళాశాల ఉపన్యాసకునిగా రిటైరైనారు. 'భువన విజయం' ట్రూపులో అష్టదిగ్గజ కవులలో ఒకడుగా ఉండి,
యావదాంధ్ర దేశమంతా పర్యటించి పలు ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో కూడా పర్యటించి తన తీయని కంఠంతో తెలుగు పద్యాల మాధుర్యాన్ని విదేశాంధ్రులు వీనులకు విందొనరించినారు. చిత్రసీమలో ప్రవేశించి కొన్ని మధురమైనపాటలు రాశారు. అయితే ఆ రంగం ఆయన తత్త్వానికి సరిపడకపోతే త్వరలోనే బయటపడ్డారు.
ఉత్పల కిశోర ప్రాయంలోనే కుమార సంభవం, దక్షయజ్ఞం, గంగావతరణం వంటి గేయక ృతులను రాశారు. అవి చందమామ, బాలమిత్ర మాసపత్రికలలో ప్రచురిత "మైనందువల్ల వాటిని బాల సాహిత్యంగా భావించారు.
ఉత్పల పద్యరచనలలో పేర్కొనదగినవి కీచుని వీడ్కోలు, గాంధారి, ఉత్పలని, తపతి, ఈ జంటనగరాలు-హేమంతశి
శిరాలు, పాతబస్తీవిలాసం, శతరూప, స్వప్నాల దుప్పటి, రాసపూర్ణిమ, శ్రీ కృష్ణ చంద్రోదయం, శైవలినీ రాగాలు-
ఉత్తలినే పరాగాలు మొదలైనవి.
నవలలో పేర్కొనదగినవి విష బిందువు(ఇది సామాజిక రాజకీయ నవల), రాజమాత. 'రాజమాత ఆంధ్రభూమి
వార పత్రికలో చాలాకాలం సీరియల్గా వచ్చి సంచలనాన్ని కలిగించిన నవల.<noinclude><references/>
{{rh|తెలంగాణ |478 | తేజోమూర్తులు}}</noinclude>
0gn0ucsavnl9iqoqbd23ejcdb0457nf
557456
557449
2026-05-28T16:50:52Z
A.Murali
3019
557456
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''139. ఉత్పల సత్యనారాయణాచార్య '''</p>}}
{{right|- ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి}}
క్రీ॥ శే॥ శ్రీమాన్ ఉత్పల సత్యనారాయణాచార్య జగమెరిగిన కవులు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, రాష్ట్రప్రభుత్వ 'హంస' అవార్డులను పొందిన వారు. తెలుగు విశ్వవిద్యాలయం విశిష్ట పురస్కార గ్రహీతలు దత్తపీఠ (గణపతి సచ్చిదానంద స్వామి) ఆస్థానకవులు. ఇవికాక మరెన్నో పురస్కారాలు అందుకొన్నారు. కలం పట్టిన నాటి నుంచి అరవయ్యేళ్లకు పైగా అవిశ్రాంతంగా రచనా వ్యాసంగం సాగించి, దాదాపు డెబ్భై గ్రంథాలు రచించిన కవిశేఖరులు.
ఉత్పల ఖమ్మం జిల్లా చింతకాని గ్రామంలో 4-7-1928న జన్మించారు. 2007 సంవత్సరంలో హైదరాబాదు లో పరమపదించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి అలివేలమ్మ, శ్రీమాన్ రఘునాథాచార్యులు.
పేదరికం వల్ల ఆయన చదువు ఒడిదుడుకులతో సాగింది. స్వయంకృషితో ఉన్నత విద్యనభ్యసించారు. తొలి
నాళ్లలో సర్దార్ జమలాపురం కేశవరావు అనుయాయి అయి రాజకీయాల్లోను, ఉద్యమాల్లోను పాల్గొన్నారు.
ఉపాధ్యాయుడిగా ఆయన ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. మధ్యలో కొంతకాలం తెలుగు అకాడమీలో పనిచేసి,
జూనియర్ కళాశాల ఉపన్యాసకునిగా రిటైరైనారు. 'భువన విజయం' ట్రూపులో అష్టదిగ్గజ కవులలో ఒకడుగా ఉండి,
యావదాంధ్ర దేశమంతా పర్యటించి పలు ప్రదర్శనలిచ్చారు. అమెరికాలో కూడా పర్యటించి తన తీయని కంఠంతో తెలుగు పద్యాల మాధుర్యాన్ని విదేశాంధ్రులు వీనులకు విందొనరించినారు. చిత్రసీమలో ప్రవేశించి కొన్ని మధురమైనపాటలు రాశారు. అయితే ఆ రంగం ఆయన తత్త్వానికి సరిపడకపోతే త్వరలోనే బయటపడ్డారు.
ఉత్పల కిశోర ప్రాయంలోనే కుమార సంభవం, దక్షయజ్ఞం, గంగావతరణం వంటి గేయక ృతులను రాశారు. అవి చందమామ, బాలమిత్ర మాసపత్రికలలో ప్రచురిత "మైనందువల్ల వాటిని బాల సాహిత్యంగా భావించారు.
ఉత్పల పద్యరచనలలో పేర్కొనదగినవి కీచుని వీడ్కోలు, గాంధారి, ఉత్పలని, తపతి, ఈ జంటనగరాలు-హేమంతశి
శిరాలు, పాతబస్తీవిలాసం, శతరూప, స్వప్నాల దుప్పటి, రాసపూర్ణిమ, శ్రీ కృష్ణ చంద్రోదయం, శైవలినీ రాగాలు-
ఉత్తలినే పరాగాలు మొదలైనవి.
నవలలో పేర్కొనదగినవి విష బిందువు(ఇది సామాజిక రాజకీయ నవల), రాజమాత. 'రాజమాత ఆంధ్రభూమి
వార పత్రికలో చాలాకాలం సీరియల్గా వచ్చి సంచలనాన్ని కలిగించిన నవల.<noinclude><references/>
{{rh|తెలంగాణ |479 | తేజోమూర్తులు}}</noinclude>
exrj18setj7dvt0yzx03ltmckw1orgp
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/501
104
212224
557451
553440
2026-05-28T16:39:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557451
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
భాసుని ప్రతిఙ్ఞయే గంధరాయణీయమ్' అనే సంస్కృత నాటకాన్ని తెనిగించినారు. రామనాంశ్ త్రిపాఠి హిందీలో
రాసిన 'మిలన్'కు 'జ్యోత్స్న' అనే పేరుతో స్నేచ్ఛానువాదం చేశారు.
ఆధునిక పద్యకవుల్లో ఉత్పలకు అగ్రేసర స్థానమున్నది. దాశరథి, మధునాపంతుల, వానమామలై వంటి వారి కోవలో
నిలుస్తారు.అలంకార శాస్త్రాలను కంఠదఘ్నంగా చదువుకొన్న సంస్కారం వారి కావ్యాలలో ఎల్లెడలా ప్రతిబింబిస్తుంది.
'ఆలోచనామృతం' అనే పేరుతో అలంకార శాస్త్ర గ్రంథాన్నే రాశారు. ఉత్పల పద్యరచనలలో 'ఈ జంట నగరాలు-
హేమంత శిశిరాలు', 'పాతబస్తీ విలాసం' ఆధునిక సమాజానికి సంబంధించినవి. పద్యం ప్రాచీన సమాజానికి,
సంప్రదాయానికి సంబంధించిన కవితా రూపమని, ఆధునిక సమాజం, సమస్యల చిత్రణకు పనికిరాదనే అభిప్రాయాన్ని పరాప్తం చేసి, పస కలిగిన, పసందైన, పకపకనవ్వించగలిగే 'ఈ జంటనగరాలు-హేమంత శిశిరాలు', 'పాతబస్తీ విలాసం' రాసి పదుగురి చేతా మెప్పింపు పొంది, పద్యరచనకు పట్టుగొమ్మ అయినారు.
ఈ జంట కావ్యాలు- జంట నగరాల జీవితానికి సంబంధించినవి. 'జంట నగరాలు-హేమంతశిశిరాలు' సికింద్రాబాదు, మూనీకి ఎడమవైపునున్న హైదరాబాదు వాసులకు సంబంధించినదైతే, 'పాత బస్తీ విలాసం' పూర్తిగా మూసీకి కుడివైపునున్న పాతబస్తీ వాసుల జీవితానికి సంబంధించినది. ఈ రెండు కావ్యాల రచనా విధానం క్రీడాభిరామాన్ని తలపిస్తుంది. 'ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు' కావ్యానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు
లభించింది.
ఈ కావ్యంలో నాయకుడు, సాహిత్యాభిమానమున్న చిరుద్యోగి. పేవ్మెంటు మీదున్న పుస్తకాల షాపులో మనుచరిత్ర కనబడితే, కొని ఇంటికి తీసుకొని వెళ్లి చూస్తే, అసలైన రసవంతమైన వరూధిని-ప్రవరుని వృత్తాంతం కత్తిరింపుకు గురికావడం రోడ్డు మీద నడుస్తుంటే కాలి జోడు తెగిపోవడం, ఆ తెగిన జోడు ఎలా ఉన్నదంటే "దెబ్బతిని
విలవిలలాడి డ్రైళ్లు పక్షిపగిచి పూర్తిగా తెగనది పాదరక్ష' చెప్పులరిగియరిగి చీలలే మిగిలెను. ముచ్చెవాడు గూడ
ముట్టడేదేమో' అని అనుకొంటూ, బాగు చేయించడానికి టేబులు వెదికితే, డబ్బులు కనిపించకపోవడంతో అట్లాగే
ఈడ్చుకొంటూ, ముచ్చెటమలు పట్టిన ముఖంతో ముచ్చెవాడికి తన గోడు చెప్పుకొని, మరుసటిరోజు ఇస్తానని, బాగు
చేయించుకొని, మరుసటి రోజు వెళ్లితే, ఆ ముసలి ముచ్చెవాడు అచ్చోట లేకపోతే ఆ రుణాన్ని తీర్చడానికి
ఇప్పటికీ వెతుకుతున్నారని కరుణామయ, హాస్యపూరిత వృత్తాంతం. తన బదిలీ కోసం ఒక మిత్రుడు, 'పదవులు
ద్యోగాలు పైరసీ వల్లేనే ప్రాప్తించుగాని, అర్హతను గాదు, పైరవీ వల్ల నా ఫీసుఫైళ్లు కదలు, కార్డు రైళ్లు విమానలోకమ్ము
కదలు, పైరవీ చేయకున్నవే పనియుగాదు, పైరవీ చేయకెవ్వండు పైకి రాడు' అని ఇచ్చిన హితవుతో, తన
బదిలీ కోసం ఒక పైరవీ సుందరిని ఆశ్రయిస్తే ఆమె టాక్సీ తెమ్మంటే తీసుకొని రాగా, టాక్సీలో పోతున్నప్పుడు ఆయన
హృదయ స్పందన ఎలా ఉన్నదంటే...
<poem>
"ఉన్నవి ఐదు రూప్యములు, ఒప్పులకుప్పడు
రుద్రాక్షపండ్లకై
చన్నవి రెండు, మీటరు వెసన్ పరువెత్తుచుండె, జేబులో
నున్నవి మూడు, డ్రైవరడహెూ కఠినాత్మడు, కారులో
గూ,
ర్చున్నను దాని క్రిందబడి రూప యేపనట్లు కుందితిన్</poem>
ఆ పైరవీ సుందరి ఒక ఆఫీసులో ఆఫీసరుతో మాట్లాడటానికి వెళ్లినపుడు, టాక్సీ కిరాయిని భరించలేనని, తన బదిలీ సంగతిని గాలికొదిలేము చల్లగా జారుకోవటం అందులో వృత్తాంతం. ద్వ్యర్థి కావ్యంలోని అచ్చుతప్పుల వల్ల అది త్య్రర్థి కావ్యమైందని ఒక చెణుకు పద్యం చెణికినాడు.
కోనసీమనుంచి ఒక మిత్రుడు నెలాఖరు రోజుల్లో పచ్చి ఇంట తిష్ఠ వేయడం, ఆయనకు జంట నగరాలను చూపుతూ,
దారిలో తారసిల్లిన ఉస్మానియా విశ్వవిద్యాలయం, అసెంబ్లీ హాలు వంటి భవనాలను, వ్యక్తులను, విగ్రహాలను వర్ణిస్తూ
చెప్పిన పద్యాలతో నడిచిన కావ్యమిది.
'శతరూప' కావ్యానికి బీజం ప్రథమ మిధునం. ఆ స్త్రీ పురుషులక్రమానుషంగాన్ని వ్యంగ్యమధురంగా చిత్రించారు.
ఉత్పలవారు. సి.నారాయణరెడ్డి గారన్నట్లు 'ఈ కావ్యం ప్రౌఢ పద్య విద్యకే కాదు, పరిణత భావుకతకు కూడా రత్న
ముకురం'.<noinclude><references/>
{{rh|తెలంగాణ |480 | తేజోమూర్తులు}}</noinclude>
qytza7mer4y6i7lvazjkkk1mecec47i
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/502
104
212225
557452
553441
2026-05-28T16:48:49Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557452
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
'రాస పూర్ణిమ' కావ్యం నుంచి ఉత్పల పూర్తిగా కృష్ణభక్తుడే. కృష్ణునికి సంబంధించిన ఇతివృత్తాల మీద కావ్యాలు రచిస్తూపోయారు. ఆ ఉత్సలా, ఈ ఉత్సలా పూర్తిగా భిన్నంగా కనిపిస్తారు. మొదటి ఉత్సల పద్యరూపంలో కవిత
చెప్పినా ఎంతో సామాజిక స్పృహ ఉన్న సమకాలీన ఆధునిక మహాకవి, రెండో ఉత్సల పూర్తిగా తన మనస్సునూ,
వచస్సునూ, కర్మలనూ కృష్ణార్పణం చేసిన పరమ భాగవతోత్తముడు.
'రాస పూర్ణిమ' పండ్లమ్ముకొనే వృద్ధ పుళిందాంగన కథ. కృష్ణుడు ఆమె నుంచి పండ్లను తీసుకోగా, బదులిమ్మని
అడిగితే, కృష్ణుడు వడ్లగింజలిస్తే అవే దారిలో నవరత్నాలైతే, వాటిని యమునానది ఒడ్డుననే పొరబోసి, కృష్ణభక్తితో తానూ ఒక గోపికయై 'మంజరి' అయిన ఇతివృత్తం.
తర్వాత రచించిన 'శ్రీ కృష్ణచంద్రోదయం' కావ్యానికే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినది. ఆరాధ్యుడు
శ్రీకృష్ణుడు, ఆరాధిక రాధ, వారిదగు లీలావి-స్తారమెలో కాద్భుత సంసారము- ఈ సర్వ భువన సామర్థ్యంబున్'
అనే సందేశమే ఇతివృత్తం. దీన్ని 'శ్రీ గణపతి సచ్చిదానంద స్వామికి అంకితమిచ్చారు. నవ్వువన్నెలలు చిమ్మే శ్రీకృష్ణుడు ఈకృతిలో చంద్రుడయ్యాడు.' శ్రీ అంటే రాధ అని ఉత్పల వ్యాఖ్యానం.
<poem>
"నవ్వుము స్వామి! నీనగవు నంగల మోహకతన్
భజించి దవ్వుల వారు నీముడు పదంబుల ప్రాలుదు
రంతరాత్మలన్
నెవ్వగ దీర, ఏక స నిషమునై కనుపట్టునట్టినీ
నవ్వది నందనందన! అనాదిగ
సాగుననంతకాలమున్</poem>
దీనికి పీఠిక రాసిన జి.బి. సుబ్రహ్మణ్యంగారు ఉత్పల వారి శ్రీకృష్ణకావ్యాలలో ఇది ఉజ్వల నీలమణి! శ్రీ కృష్ణ
కావ్యకర్తలలో ఉత్పలవారు కవి శిఖామణి అన్న మాటలు అక్షరసత్యాలు.
ఇక కృష్ణుని మీదనే భాగవత దశమస్కందంలోని చిన్నచిన్న ఇతివృత్తాలను తీసుకొని ఎంతో పెంచి, 'వేణుగీతం',
'యశోదానందపాని', 'గోపీగీతం', 'భ్రమరగీతం', 'యుగళ 'గీతం' వంటి వచనకృతులను రాశారు. ఈ వచన కృతులలో ప్రతివాక్యం కవితాత్మకం, కృష్ణభక్తి భరితం, కృష్ణశాస్త్రి వచనంలోని 'తడి', చలం వచనంలోని 'వడి' పడుగు పేకల్లాగా అల్లుకున్నట్లుగా ఉంటుంది ఈ కృతులలోని వచనం. ఉదాహరణకు.
"శ్రీ కృష్ణుని మురళీరవం మర్త్యలోకం నుంచి సుషిరసోపాన పంక్తుల ద్వారా నారమయమైన ఇంధ్రధనస్సు ద్వారా అమరలోకానికి చేరుకొని, అక్కడి నుంచి, ఆనందఝురిని పృథ్యీతలం మీదికి ప్రవహింపజేస్తుంది. సమస్త జీవకోటికి అలౌకిక స్ఫూర్తిని కలిగిస్తుంది. మనమే కాదు ప్రౌఢకైన ప్రజాంగనలు సైతం ఆ వంశీనాదాన్ని బిని, ఉత్కంఠిత నయనాలతో బృందావన వీధులలో, సందులలో, నికుంజ పుంజాలలో ఆ వేణుమాధవుని చూడాలని ఎదురుతెన్నులు చూస్తుంటారు. అపార ప్రేమ మిశ్రితమైన ఆనందం అతని పిల్లనగ్రోవి పాటలో అభివ్యక్తమవుతుంది.”
ఎంతటి కవితాత్మకమైన, లయాత్మకమైన పచనమిది. వేణు ధరుని గురించి వేసటేలేకుండా వేయి విధాలుగా
అలివేణులు వేనోళ్ల చెప్పుకోవడం చదువముచ్చటగా ఉంటుంది ప్రతిపంక్తీ.
ఉత్పల వారి హృదయపుటం ఉత్పలిని పరాగ కోశం, అనురాగ భరితం, ఆయన మనిషిని ప్రేమిస్తారు. మమతను
పూజిస్తారు. మానవుని మనుగడకు దోహదం చేసే మంచి సంస్థలను మనసారా మెచ్చుకొంటారు. మనిషిలోను,
సంస్థలోను ఏ కొంత మంచి ఉన్నా, ఏ కొంత మంచి చేసినా, జరిగినా కొండంత పులకించిపోయి ప్రశంసలు కురిపిస్తారు. పుష్పద ృష్టిలా పద్యాలను, అలా కురిపించిన పద్యాలను ఏరి కూర్చినమాల 'శైవలిని రాగాలు - ఉత్పలినీ వరాగాలు' దాశరథి చెప్పిన పద్యం చిత్తగించండి.
<poem>
"ఓ కమనీయ కోమల మహోదయ! దాశరథీ త్వతీయ
మా
ద్వీక ఝరీ ధురీణ పదవీధులలో అనవద్య పద్య వి
ద్యా కృషి సల్పి, నీరునవదాత యశః
కలమాంకురంబులన్
లోకమునందు నాటెదన్ అననుగ్రహమెప్పటివోలె</poem>
"పద్య రచనా శిల్పంలో సమకాలిక ఆంధ్రకవులలో<noinclude><references/>
{{rh|తెలంగాణ |481 | తేజోమూర్తులు}}</noinclude>
6znriulhx4iajgkvo0drnzhm7avjlv0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/503
104
212226
557457
553442
2026-05-28T16:53:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557457
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఉత్పలతో సమానులు ఒకరిద్దరు ఉందురేమో కాని, ఆయనను మించినవారు నిస్సందేహంగా లేరు. శృంగార, హాస్య, కరుణ రసాలను పోషించడంలో ఉత్పలకు ఉత్పలయే సాటి" అన్న దేవులపల్లి రామానుజరావుగారి మాటలలో
అతిశయోక్తి ఏ మాత్రం లేదు. అంతా సత్యమే!
బాలసాహిత్యం నుండి భాగవత సాహిత్యం దాకా సాగిన ఆయన కవితాప్రస్థానంలో ప్రతి అడుగూ, ప్రతినుడుగూ భావ బంధురం, సుమసుందరం, నాదమయం, జగన్నాథమయం, ఎనభై ఏళ్ళ పాటు మనమధ్య మసలి వెళ్లినవారు మరెవరో కాదు లీలాశుకులే, పోతన్ననే. వీరందరి మూర్తి ఉత్పల వారిలోనే దర్శించాం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |482 | తేజోమూర్తులు}}</noinclude>
lf0tzskrt61fbc9sxua6k6jcv68oizf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/504
104
212227
557459
553443
2026-05-28T17:00:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557459
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''140. వడ్డేపల్లి సోదరులు '''</p>}}
{{right|- డా॥ బెల్లంకొండ సంపత్ కుమార్}}
ఇరవయో శతాబ్ది తొలినాళ్ళలో లబ్ద ప్రతిష్ఠులైన కవులు, రచయితలు, పత్రికా సంపాదకులలో వడ్డేపల్లి సోదరులు పేరెన్నిక గలవారు. వారిది మెదక్ జిల్లాలో ఏ వసతులు లేని మారుమూల గ్రామమైన మక్తా వడ్డేపల్లి. వడ్డేపల్లి సోదరులలో పెద్దవాడు - బెల్లంకొండ నరసింహాచార్యులు. 1896లో జన్మించాడు. చిన్నవాడు బెల్లంకొండ
వెంకటాచార్యులు. 1905లో జన్మించాడు. తల్లిపేరు రుక్మిణమ్మ. తండ్రి లక్షణాచార్యులు. ఆ పూటకు సర్దుకు
పోయే బీదరిక కుటుంబం.
కవి పండిత కుటుంబమైనా ఛాందస భావాలు గలవారు కాదు. వ్యవసాయం చేస్తూ జీవించారు. తెలంగాణా ప్రాంతంలో ఒద్దిరాజు, దాశరథి, కాళోజి మొదలయిన సోదరుల కృషి అనివార్యంగా వస్తున్నది. వారిలో బెల్లంకొండ
సోదరులు చెప్పుకోదగినవారు. సురవరం ప్రతాపరెడ్డి గారు “వడ్డేపల్లి సోదరులని” పిలవడం వలన వారికి ఆ
ఊరిపేరిటనే పేరు సార్థకమైంది.
తండ్రి చిన్నతనంలోనే మరణించడం వలన తల్లి కుటుంబ భారాన్ని వహించింది. ఆమె ఆనాటికే విద్య నేర్చుకొని ఉండటం వల్ల సాయం పాఠశాల నిర్వహించింది. నాటి పాలనా భాష ఉర్దూ కావడం వలన పిల్లలిద్దరికీ స్థానికంగా ఉండే మోల్సాబ్ దగ్గర ఉర్దూ నేర్పించింది. సిద్దిపేటలో సూర్యనారాయణ శాస్త్రి వద్ద శిష్యరికానికి పంపించి సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లభాషలు నేర్పించింది. అక్కడి నుండి నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యుల వద్దకు
పంపించి తమిళ, కన్నడ భాషలు, తిరువాయి మొజి పాశురాలు, సేవాకాలం అభ్యసింప జేసింది. అక్కడనే సంస్కృత కావ్యాలు, అమరం నేర్చుకున్నారు. రుక్మిణమ్మ దగ్గరి బంధువుల దగ్గర బెల్లంకొండ నరసింహాచార్యులు ఆయుర్వేదం, వెంకటాచార్యులు శిల్పం, చిత్రలేఖనం నేర్చుకున్నారు. వెంకటాచార్యులు నఖచిత్రాలు వేయడంలో నేర్పరి. విద్య అభ్యసిస్తున్న దశలోనే ఇరువురూ అవధాన ప్రక్రియ సాధన చేశారు.
ఇంటికి పెద్దదిక్కయిన తల్లి అంటువ్యాధుల బారినపడి మరణించడం వలన సోదరులపై కుటుంబ భారం పడ్డది.
సోదరులిద్దరికీ వ్యవసాయమంటే, ఊరంటే వదలలేని ప్రేమ. తల్లి మరణానికి వగచి వారు “మాతృనివేదన” ఆశు పద్యాలు చెప్పారు. అక్కడి నుండి వారు జంట కవులుగా రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. కలిసి కథలు, అనువాదాలు, దేశబంధు పత్రిక నిర్వహణ చేశారు.
గోలకొండ కవుల సంచికలో బెల్లంకొండ నరసింహాచార్యులు, వెంకటాచార్యుల కవిత్వం, ఇతర వివరాలు పేర్కొనబడ్డాయి. ఇరువురు కలిసి చేసిన రచనలేకాక స్వతంత్ర రచనలు చేశారు. వారి పద్యరచన నాటకీయంగా కనుల ముందు కదలాడినట్టుగా ఉంటుంది. రామభార్గవ సంవాదం<noinclude><references/>
{{rh|తెలంగాణ |483 | తేజోమూర్తులు}}</noinclude>
9ik8v5ltm7ry0u42ga6hi62jgbxsd2t
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/505
104
212228
557461
553444
2026-05-28T17:09:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557461
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
లో బెల్లంకొండ నరసింహాచార్యుల రచనను ఇందుకు ఉదహరించవచ్చు. సందర్భానికి అవసరమైన ఛందస్సును
వాడారు. వృత్తపద్యాలయిన చంపక, ఉత్పల, మత్తేభ, శార్దూలాలు సంస్కృత సమాసయుక్తంగా వీరరసంతో కూడి
ఉన్నాయి. సీసగీతం, కందం, తేటగీతులు సరళంగా ఉన్నాయి.
బెల్లంకొండ నరసింహాచార్యుల సంపాదకత్వంలో......
సోదరులు ఇద్దరూ 1926లో దేశబంధు పత్రికకు శ్రీకారం చుట్టారు. 'దేశబంధు' పేరు పట్ల ఆనాటి నిజాం ప్రభుత్వం, మంజీర కావర్తనం, నిజాం రాష్ట్రాభ్యుదయ పరమార్ధమే తప్ప రాజకీయ దురుద్దేశ్యం లేదని, లిఖిత పూర్వక హామీ పత్రం మీద చిన్ననాడు ఉర్దూ నేర్పించిన మోల్సాబ్ జమానత్ సంతకం చేయడం వలన చాలా కాలానికి అనుమతి వచ్చింది. రాజకీయ, పాలనాజొక్యం లేకుండా పత్రిక నడువుకోవచ్చని వెంటవెంటనే నివేదికలు సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
సోదరులిద్దరూ మదరాసు నుండి ముద్రణాలయం సామగ్రి పోగు చేసుకొని 1927లోనే దేశబంధు పత్రికను
ప్రారంభించారు. సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు వంటివారు దేశబంధును ప్రోత్సహించారు.
పత్రికా నిర్వహణకు కాగితం అవసరమైనందున ప్రాంతాల నుండి కాగితం తెచ్చుకోవడం శ్రమ, అధిక వ్యయంతో కూడుకొని ఉండటం వలన స్థానికంగా గూడూరు పల్లెలో కాగితం పరిశ్రమను కుటీర పరిశ్రమగా తీర్చిదిద్దారు.
కాగితం రవాణాకు గుర్రం బండిని వాడడంతో నవాబులు ఆగ్రహించి జరిమానా విధించారు. ప్రత్యామ్నాయంగా
గాడిదను ఉపయోగించారు. అభ్యంతరకరమైన విషయాలు ప్రస్తావించారని ప్రతులు నిలుపుదల చేసి జరిమానా
విధించారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ వారు పత్రిక నడవడం సాహసోపేతమైంది. పత్రికలో ధార్మిక విషయాలతో పాటు సమకాలీన విషయాలకు ప్రాధాన్యత నిచ్చారు. సాహిత్యానికి పెద్దపీట వేశారు. తోకచుక్క దేశానికి అరిష్టమని జ్యోతిషులు చెప్పేవార్తలను “పిచ్చివార్తలు”గా ప్రకటించారు. పునర్వివాహాలు ప్రోత్సహించారు. దేవాలయ ప్రవేశాన్ని దాని అవసరాన్ని ప్రచురించారు. శేషభట్టర్లాంటి వారి “అంటరాని వాడు” పద్యాలను ఈ పత్రికలో ప్రథమంగా
ప్రచురించి మన్ననలందుకున్నారు. వేద విషయాలు శాసన పాఠం వివరాలు, యోగతరంగిణి, సంస్కృత పాఠాలను వివిధ శీర్షికలుగా నిర్వహించారు. వ్యవసాయ పనులలో ఆటంకాలను, నక్కలదాడిని, జాగ్రత్తలను తెల్పారు. స్త్రీ విద్య పాఠశాలల స్థాపన, సర్వమత జనుల ఐక్యత, గ్రంథాలయాల స్థాపన, మత్తు వస్తువుల నిరాకరణ, స్త్రీ పురుషుల వివాహ వయసు, వివాహకాలంలో నిరర్థక వ్యయం తీసివేయుట, విధవా వివాహాలు, పిల్లల ఆరోగ్యం, బహిరంగ సభలను ప్రభుత్వం ఆపకుండా ఉండుట, అనాధ వికలాంగులకు తప్పక సహాయం చేయుట ఖాన్లీ పాఠశాలలపై ప్రభుత్వ నిర్బంధం నివారించుట వంటివి పరమ శ్రేయంగా తలచి సంపాదకీయంలో సమర్ధించారు.
దేశబంధు సోదరులు "సర్వజన సమ్మతములై దేశ హితముగా" ఉన్న విషయ వ్యాసాలను ఆహ్వానిస్తూ ప్రకటన
చేశారు. పరస్పర కలహాస్పద విషయాలకు, మత విషయాలకు చోటులేదని పత్రికలో స్పష్టంగా తెలియపర్చారు.
1927లో వెలువడిన దేశబంధు పత్రికలో మొదటిసారిగా మెదక్ జిల్లా కథకుల రచనలు అచ్చు వేశారు. కథలో వెనకబడి లేమని ఈ పత్రిక రుజువు చేసింది. శేషభట్టర్ వెంకట రామానుజాచార్యులు, వానమామలై లక్ష్మణాచార్యులు, హకీం అడవయ్య, పెద్దమందడి కృష్ణకవి, గుప్తయోగ, మేఘాద్రి పెరుమాళ్ళు, మిట్టదొడ్డి రామదాసకవి, వెంకట రాజన్న లాంటి పండితుల రచనలను ప్రచురించారు.
బెల్లంకొండ సోదరుల కథలు, నవలలు, అనువాదాలు చేశారు. బెల్లంకొండ నరసింహాచార్యులు, 'సియాసీ సభలు
కథ రాశారు. ఇది చారిత్రాత్మక సందర్భంలో వచ్చిన రాజకీయ కథ. ఈ కథ దొంతి దొరల పరిసరాలలోని
పాములబండ కేంద్రంగా మొదలవుతుంది. కుల వ్యవస్థను, భూస్వామ్య విధానాన్ని నిరసించిన కథ సియాసీ సభ అంటే ఏమిటనే ప్రశ్నకు 'నిజాం రక్కసి ఫర్మానాలను ధిక్కరించి మెదులుకొను వ్యూహమని జవాబు పలికించాడు. నిజాం ఉత్తర్వులను ధిక్కరించి బతుకుతామా? అన్నంత నిర్బంధంలో రచయిత సాహసంగా కథను మలిచాడు. ఈ కథలో జనులందరి ఐక్యతను కోరాడు. కుల వివక్షతను ప్రశ్నించాడు. "పుట్టకమైల, చావు మైల, మట్టి మైల మనం మనుషులం<noinclude><references/>
{{rh|తెలంగాణ |484 | తేజోమూర్తులు}}</noinclude>
soaglqkxq0ol937004mjbwg2atuu8ic
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/506
104
212229
557462
553445
2026-05-28T17:17:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557462
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మైలకాము. దేవుడు చెప్పింది ముక్తి" అని గణేంద్రమోక్ష ఘట్టాన్ని మొసలి నుండి చక్రాయుధం ఏనుగును ముక్తి
చేసిన సందర్భాన్ని రచయిత ప్రస్థావించాడు. "తెలుగు సాహిత్యంలో వెట్టికి వ్యతిరేకంగా రాసిన తొలికథలలో దీనికి
ప్రత్యేకస్థానం ఉందని" సంగిశెట్టి శ్రీనివాస్ మెతుకు కథల ముందు మాటలో పేర్కొన్నారు. ఈ కథ గస్తి నిషాన్ తిర్చన్ ను వ్యతిరేకిస్తుంది.
బెల్లంకొండ వెంకటాచార్యులు రాసిన "భక్త విజయము" కథ వడ్డేపల్లి నుండి ప్రారంభమవుతుంది. భక్తజనుల సమీకరణ నరసింహావతారమెత్తి రాజ్యం దుర్మార్గాలను ఎదిరించడం కథలోని ఇతివృత్తం.
వడ్డేపల్లి సోదరులు ఇద్దరు కలిసి రాసిన కథ "సంఘ సంస్కార సభ. గ్రంథాలయం స్థాపించినందుకు, ఇంట్లో
గ్రంథాలు దొరికినందుకు ఎదురైన నిర్బంధాన్ని ఈ కథలో చిత్రించారు. బాలింత స్త్రీ అని కూడా చూడకుండా ఆమె
డొక్కలో తన్నినందుకు విలవిలలాడడం ఆనాటి దౌర్జన్యాన్ని కండ్లకు కడుతుంది. రఫియొద్దీన్ గ్రంథాలయాలను, అణా గ్రంథమాలను, ప్రజల విద్యను ప్రోత్సహించే ఆలోచనాపరుడు. ఆ జాగీరు ప్రాంతంలోనే నౌకరుగా ఉంటూ
ప్రభుత్వం ఇచ్చిన ఇల్లును కాదని ఊరూరా తిరుగుతూ గ్రంథాలయాలు నిర్వహించడం పట్ల ఆయన పై జహంగీర్
సేన గిరఫ్తార్ ఉత్తర్వులు జారీ చేశారు. పెద్ద జంగు జరిగే సూచన కనబడడం వలన సేనలు వెనుదిరగడం, శతసహస్ర గూడాలకు విజ్ఞాన వ్యాప్తి జరగడం, శారీరక దారుఢ్యం, కుస్తీ, సారస్వత గ్రంథాలయ స్థాపనకు అందరూ ఉద్యుక్తం కావడం ఒక ఆశావహ దృక్పథంగా ఈ కథ సాగింది. ఏ ప్రాంత ప్రత్యేకతలు ఆ ప్రాంత రచనల ద్వారా తెలుసుకోగల వీలును గల కథలుగా డా. నందిని సిధారెడ్డిగారు మెతుకు కథలకు తొలిమాట రాశారు. స్థలకాలాల చారిత్రక కోణంలోంచి ఆడెపు లక్ష్మీపతి ఈ కథలను పరిశీలించారు.
బెల్లంకొండ సోదరులు సాహిత్యాన్ని, పత్రికలను ఊపిరిగా నమ్ముకొని జీవించారు. తాముగా నేర్చుకున్న ఉర్దూభాష పాలకులతో వ్యవహరించడానికి, సంస్కృతం పరిజ్ఞానానికి, సాహిత్య అవగాహనకు ఉపయోగపడింది. వారు మూఢ నమ్మకాలను వ్యతిరేకించారు. విదేశాలలో సంస్కృత ప్రభావం. సంస్కృత సాహిత్యానికి విదేశీయుల సేవ వారిని ప్రాథమికంగా ఆలోచింపజేసింది. స్వభాష కోసం ఏదైనా చేయాలని తపనపడ్డారు. "మనము సల్చునట్టి కృషియే
చరిత్రము జనుల జీవనమే చరిత్రము ఇంతకన్నా ఇంకేమి కావలయునని పత్రికా సంపాదకుల గోష్టి సభ ట్రూప్ బజారు హైదరాబాదు నందు 1927వ సంవత్సరం సమావేశంలో ప్రకటించారు. ఆ ఆలోచనా విధానమే “దేశబంధు" పత్రికను అనివార్యంగా నడిపింపజేసింది.
బెల్లంకొండ నరసింహాచార్యులు, తమ్ముడు వెంకటా చార్యులు పలు ప్రాంతాలకు వెళ్ళి అవధానాలు చేశారు.
అవధానాలు చేయగా వచ్చిన అభిమాన పూర్వక పారితోషికాన్ని పత్రిక కోసం ఉపయోగించారు. బెల్లంకొండ వెంకటాచార్యుల నఖ చిత్రాల వలన పోగైన ధనం దేశబంధు నిర్వహణకు ఉపయోగించారు.
బెల్లంకొండ సోదరులలో నరసింహాచార్యులు బహుగ్రంధ కర్త, ఆయన రామాశ్వమేథం, ఆంధ్రవిశ్వ గుణదర్పణం, ప్రభావతీ ప్రద్యుమ్నం, మండోదరి పరిణయము, భాగవత సంగ్రహము, రామాయణ సంగ్రహము, మీనాక్షి
సత్యభామ గర్వాపహరణము, ఉత్తర కళ్యాణము, కుశలవ వివాహము, అభిమన్యు వివాహము, కీచక వధ, తులసీ
వివాహము, కనకసేన విజయము, ఉగ్రపాండ్య చరిత్రము, చీనా సుందరి నవల, మల్లికార్జున కీర్తనలు, శ్రీ శివభక్త
విజయము ఐదుభాగాలు రచించాడు.
సోదరులు 'ఋణ సంపాదనే కన్నడ అనువాదం. 'లవంగి' మరాఠి అనువాదం, అకారాది కథల ప్రయోగం
చేశారు. ఆ కథలలో ఎనిమిది మాత్రమే లభ్యమైనాయి. వీరి పట్ల ఇంకా సమగ్ర కృషి జరగవలసి ఉన్నది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |485 | తేజోమూర్తులు}}</noinclude>
4n9nzeszih9rzh0sh2r1wrd0apr4hvu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/507
104
212230
557474
553446
2026-05-29T09:38:00Z
A.Murali
3019
557474
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''141. వడ్లకొండ నరసింహారావు '''</p>}}
{{right|- డా౹౹ చీదెళ్ళ సీతామహాలక్ష్మి}}
ఉర్దూ రాజభాషగా ఉన్న నిజాం నిరంకుశ పరిపాలనలో తెలుగు భాషా సంస్కృతులు వెలవెలబోతున్న సమయంలో మాతృభాషలో అందులోనూ స్త్రీ విద్యక ప్రాధాన్యతనివ్వడం, సాంస్కృతిక పరంగా ప్రజలను చైతన్యపర్చడం, నాటి జనాభాలో అత్యధికంగా ఉన్న బలహీన, బడుగు వర్గాలు. తాడిత, పీడిత, దళిత జనోద్ధరణకు, వారి అభ్యున్నతికి నిరంతరం కృషిచేసిన సంఘసేవా తత్పరుడు.. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పి, కలం నడిపిన సంఘ సంస్కర్త, తెలంగాణలో జరిగిన ఉద్యమాలకు అపారమైన సేవలు చేసి ప్రజలలో చైతన్యం కలిగించిన
నవయుగ వైతాళికుడు వడ్లకొండ నరసింహారావు గారు.
ఆచార కట్టుబాట్లు ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో 1893 జనవరి 20వ తేదీన హన్మకొండలో శివరామయ్య, రత్నమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించారు. వరంగల్ రంగశాయిపేట పాఠశాలలో మెట్రిక్ వరకు చదివిన
వడ్లకొండ విద్యార్థి దశలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1908లో విద్యార్థి సంఘాన్ని స్థాపించిన సంవత్సరమే మూసీ నదికి వరదలు వచ్చినపుడు బాధితుల కోసం విద్యార్థుల పక్షాన నిలబడి విరాళాలు సేకరించారు. బందరు జాతీయ కళాశాల సహాయనిధికి విరాళాలు సేకరించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లుగా బాల్యం నుంచే సమాజ
సేవాతత్పరత మొగ్గ తొడిగింది. మేనమామ కూతురు వేంకటమ్మతో వివాహం జరిగింది. ముగ్గురు కుమారులు,
ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నందగిరి ఇందిరాదేవి రచయిత్రిగా పేరు గడించడమే కాక, నైజాం ప్రభుత్వ
కాలంలో ఏర్పాటైన 'దక్కన్ రేడియో' కార్యక్రమాల్లో పాల్గొన్న తొలి మహిళ.
మెట్రిక్ చదివేతే చాలు ఆ రోజుల్లో ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా వచ్చేది. తాను చదువుకొన్న పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. తర్వాత నిజాం రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఆడిటర్ ఉద్యోగం
రావడం వల్ల 1910లో హైదరాబాద్కు మకాం మార్చారు. ఆ శాఖలో 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేసి
అంచెలంచెలుగా ఎదిగి రిజిస్ట్రార్ స్థాయి వరకు చేరి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు
ఉద్యోగంలో కొనసాగారంటే ఆనాటి నిజాం ప్రభుత్వానికి ఈయన పట్ల ఉన్న విశ్వాసానికి, పనితనానికి గొప్ప
నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అకౌంట్లు, ఆడిట్, పరిపాలనా విషయాలలో వడ్లకొండకు గొప్ప పరిజ్ఞానముండేది.
నిజాం పరిపాలన కాలంలో ఉర్దూ తప్ప మిగతా మాతృభాషలు బోధించే పాఠశాలలపై 1925లో గస్తీ నిషాన్- 53 చట్టం నిషేధాన్ని ప్రకటిస్తూ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉంటూ స్వీయ సంస్కృతి, భాషపట్ల అభిమానంతో వడ్లకొండ వారు మొక్కవోని ధైర్యంతో తన సమకాలీకుడు మాడపాటి హనుమంతరావు గారితో<noinclude><references/></noinclude>
28ykk5u98dy21mf4gzg3k3f3j8axtif
557477
557474
2026-05-29T09:39:34Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557477
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''141. వడ్లకొండ నరసింహారావు '''</p>}}
{{right|- డా౹౹ చీదెళ్ళ సీతామహాలక్ష్మి}}
ఉర్దూ రాజభాషగా ఉన్న నిజాం నిరంకుశ పరిపాలనలో తెలుగు భాషా సంస్కృతులు వెలవెలబోతున్న సమయంలో మాతృభాషలో అందులోనూ స్త్రీ విద్యక ప్రాధాన్యతనివ్వడం, సాంస్కృతిక పరంగా ప్రజలను చైతన్యపర్చడం, నాటి జనాభాలో అత్యధికంగా ఉన్న బలహీన, బడుగు వర్గాలు. తాడిత, పీడిత, దళిత జనోద్ధరణకు, వారి అభ్యున్నతికి నిరంతరం కృషిచేసిన సంఘసేవా తత్పరుడు.. సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా గళం విప్పి, కలం నడిపిన సంఘ సంస్కర్త, తెలంగాణలో జరిగిన ఉద్యమాలకు అపారమైన సేవలు చేసి ప్రజలలో చైతన్యం కలిగించిన
నవయుగ వైతాళికుడు వడ్లకొండ నరసింహారావు గారు.
ఆచార కట్టుబాట్లు ఉన్న బ్రాహ్మణ కుటుంబంలో 1893 జనవరి 20వ తేదీన హన్మకొండలో శివరామయ్య, రత్నమ్మ దంపతులకు తృతీయ సంతానంగా జన్మించారు. వరంగల్ రంగశాయిపేట పాఠశాలలో మెట్రిక్ వరకు చదివిన
వడ్లకొండ విద్యార్థి దశలోనే సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1908లో విద్యార్థి సంఘాన్ని స్థాపించిన సంవత్సరమే మూసీ నదికి వరదలు వచ్చినపుడు బాధితుల కోసం విద్యార్థుల పక్షాన నిలబడి విరాళాలు సేకరించారు. బందరు జాతీయ కళాశాల సహాయనిధికి విరాళాలు సేకరించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్లుగా బాల్యం నుంచే సమాజ
సేవాతత్పరత మొగ్గ తొడిగింది. మేనమామ కూతురు వేంకటమ్మతో వివాహం జరిగింది. ముగ్గురు కుమారులు,
ఇద్దరు కుమార్తెలు. పెద్దకుమార్తె నందగిరి ఇందిరాదేవి రచయిత్రిగా పేరు గడించడమే కాక, నైజాం ప్రభుత్వ
కాలంలో ఏర్పాటైన 'దక్కన్ రేడియో' కార్యక్రమాల్లో పాల్గొన్న తొలి మహిళ.
మెట్రిక్ చదివేతే చాలు ఆ రోజుల్లో ఏదో ఒక ఉద్యోగం తప్పకుండా వచ్చేది. తాను చదువుకొన్న పాఠశాలలోనే ఉపాధ్యాయునిగా, ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. తర్వాత నిజాం రాష్ట్ర వ్యవసాయ శాఖలో ఆడిటర్ ఉద్యోగం
రావడం వల్ల 1910లో హైదరాబాద్కు మకాం మార్చారు. ఆ శాఖలో 30 సంవత్సరాలకు పైగా ఉద్యోగం చేసి
అంచెలంచెలుగా ఎదిగి రిజిస్ట్రార్ స్థాయి వరకు చేరి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు
ఉద్యోగంలో కొనసాగారంటే ఆనాటి నిజాం ప్రభుత్వానికి ఈయన పట్ల ఉన్న విశ్వాసానికి, పనితనానికి గొప్ప
నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అకౌంట్లు, ఆడిట్, పరిపాలనా విషయాలలో వడ్లకొండకు గొప్ప పరిజ్ఞానముండేది.
నిజాం పరిపాలన కాలంలో ఉర్దూ తప్ప మిగతా మాతృభాషలు బోధించే పాఠశాలలపై 1925లో గస్తీ నిషాన్- 53 చట్టం నిషేధాన్ని ప్రకటిస్తూ అమల్లోకి వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగంలోనే ఉంటూ స్వీయ సంస్కృతి, భాషపట్ల అభిమానంతో వడ్లకొండ వారు మొక్కవోని ధైర్యంతో తన సమకాలీకుడు మాడపాటి హనుమంతరావు గారితో<noinclude><references/>
{{rh|తెలంగాణ |486 | తేజోమూర్తులు}}</noinclude>
sjb0ov5ywabipj5ym3zcw7nc30xoles
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/508
104
212231
557478
553447
2026-05-29T09:47:28Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557478
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
కలిసి ఇంటింటికీ తిరిగి చందాలు వసూలు చేయడం, విద్యార్థులను సేకరించి ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలను
స్థాపించడంలో, నిర్వహించడంలో అహర్నిశలు కృషిచేశారు. బాలికల కోసం పాఠశాలను స్థాపించడం అట్టి దుర్బర
పరిస్థితుల్లో సాహస కార్యంగానే చెప్పక తప్పదు. వ్యయప్రయాసల కోర్చుకోవడమే గాక, అద్దె కట్టలేని పరిస్థితుల్లో
అద్దెకున్న తన ఇంటిలోని నాలుగు గదుల్లో మూడు గదులను స్కూలు ఇచ్చి ఒక్క గదిలోనే సంసారం నడిపిన పరోపకారి వడ్లకొండ, పరిచారికలను పెట్టుకొనే స్తోమత లేక పాఠశాల గదులను తెల్లవారకముందే ఊడ్చి ఆ విషయం ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడిన సేవాతత్పరుడు, నిగర్వి, అపర గాంధీ మహాత్ముడు.
ఈనాడు అభ్యున్నతి పొందిన మాడపాటి హనుమంతరావు ఉన్నత పాఠశాలగా ఉన్నా ఆనాటి నిజాం ప్రభుత్వం వారు
గుర్తింపు ఇవ్వలేదు. తెలంగాణలో ఉన్నందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు గుర్తింపు ఇవ్వనపుడు వడ్లకొండ
వారు ప్రయత్నం చేసి పుణెలోని కార్వే మహిళా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా విద్యార్థుల చేత పరీక్షలు
రాయించారు.
స్త్రీ విద్య కోసం పరితపించే వడ్లకొండ పరోపకారిణీ బాలికా పాఠశాల ఏర్పాటులో భాగ్యరెడ్డి వర్మ గారికి సహాయం
చేశారు.
వెట్టిచాకిరి నిర్మూలనకు కృషిచేశారు. శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం కోసం రజతోత్సవాలు, స్వర్ణోత్సవాల్లో కార్యదర్శిగా ఉండి చక్కగా నిర్వహించారు.
హైదరాబాద్ రాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు అధ్యక్షులు. వడ్లకొండ పైసా పైసాకు
లెక్కచూపి ఖర్చు విషయంలో కచ్చితంగా ఉండి 'ఐరన్ ఫైనాన్షియర్' అని పేరు తెచ్చుకున్నారు.
రజాకార్ల దమనకాండ ఎదుర్కోవడానికి ప్రభుత్వోద్యోగి అయిఉండి కూడా స్వాతంత్య్ర సమర యోధులకు అండగా
ఉండి కావలసిన సహాయం అందించారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా, హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయ కార్యదర్శిగా వివిధ హెూదాల్లో పనిచేశారు. ఆయుర్వేదం పట్ల అభిమానంతో 1950లో ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ యూనియన్ గౌరవ సలహాదారునిగా ఉండి 'ప్రజాసేవాసక్త' బిరుదును పొందారు. ఆంధ్రోద్యమం, ఆయుర్వేదోద్యమం, ఆంధ్ర వైద్యులు అను పుస్తకాలను ప్రచురించారు. విశాల దృక్పథం, మానవత్వం కలిగిన మహనీయులు వడ్లకొండ.
అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా బలహీన వర్గాల వారికి ఎంతో సేవచేసిన సంఘసేవా తత్పరుడు. మాల మాదిగ కులానికి చెందినవారు ఎలా నిర్బంధ శ్రమకు గురవుతున్నారో 'బలోతా ఇనాం' పేరుతో గ్రామంలోని మాలమాదిగలకు ఇచ్చిన ఇనాం భూములకు ప్రతిఫలంగా 'దౌరా'కు వచ్చిన అధికారులు ఉచితంగా ఊడిగం చేయించుకోవడం న్యాయసమ్మతం కాదని, అందుకు చట్టాలు అంగీకరించవని అర్థమయ్యే భాషలో 'వెట్టిచాకిరి' అనే పుస్తకాన్ని రచించి, తెలంగాణ వికాసోద్యమంలో ఒక ముఖ్యపాత్రను పోషించిన గొప్ప అభ్యుదయవాది వడ్లకొండ చేసిన సేవ చిరస్మరణీయం.
వెనుకబడిన కులాల వారికి సంఘాలు ఏర్పాటు చేసుకోవడంలో, సమావేశాలు నిర్వహించుకోవడంలో, తెలుగు భాష విద్యా బోధనలో, సహపంక్తి భోజనాలు చేసి సమీకరించడంలో కొండంత అండగా ఉన్న గొప్ప కృషీవలుడు వడ్లకొండ. అనుకున్న పని ఎంత కష్టమైనా సాధించే పట్టుదల కలవాడు, ఉదార స్వభావి.
ఎంత కష్టపడ్డా శ్రమకు తగ్గ గుర్తింపు మాత్రం వడ్లకొండకు దక్కలేదు. ఆయన అజ్ఞాత కార్యశూరుడు. 1955 అక్టోబర్ 28వ తేదీన తుదిశ్వాస విడిచినను తెలంగాణ ప్రజల మనసులో చెరగని ముద్రవేసిన గొప్పమనీషి, చైతన్యదీప్తి, ధైర్యశాలి, భావి తరాలకు స్ఫూర్తి, ప్రజలు మరిచిపోలేని మహనీయుడు. కీర్తిశేషులు, తెలంగాణ ముద్దుబిడ్డ, నిశ్శబ్ద సంస్కర్త, నవయుగ వైతాళికుడు శ్రీ వడ్లకొండ నరసింహారావు గారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |487| తేజోమూర్తులు}}</noinclude>
leur8zs2dtnkug6v409r82bc5xcndyv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/509
104
212232
557481
553448
2026-05-29T09:56:50Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557481
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''142. వానమామలై జగన్నాథాచార్యులు '''</p>}}
{{right|- ఆచార్య రావికంటి వసునందన్}}
రైతు వాల్మీకి - ప్రజాకవి శేఖర్" బిరుదాంకితులైన మహాకవి శ్రీ వానమామలై జగన్నాథాచార్యుల వారు. వరంగల్ జిల్లా మడికొండ వీరి స్వగ్రామం. తల్లి సీతాంబ. తండ్రి బక్కయ్యశాస్త్రి. శ్రీ బక్కయ్య శాస్త్రిగారిది అమోఘమైన అద్భుత కంఠస్వరం. మైకులులేని ఆ కాలంలో మూడూ మైళ్ళ దూరం వినపడేలా గంభీరస్వరంతో బక్కయ్య శాస్త్రిగారు పురాణం చెబుతుంటే - దూర దూరాల ప్రజలు కూడా ఎక్కడి వారక్కడే కూర్చొని ఆలకించేవారట!
"బ్రతికి బక్కయ్య శాస్త్రిగారి పురాణం వినవలె, చచ్చి స్వర్గానికి పోవలె” అనేదట. ఆనాటి ప్రజానీకం, అలాంటి
మహనీయుని పుత్రరత్నం - మన ప్రజాకవి శేఖర శ్రీ వానమామలై జగన్నాథాచార్యులవారు. వీరి తమ్ముడే అభినవ పోతన బిరుదాంకితులైన "పోతన చరిత్రము” రచించిన మహాకవి డా. వానమామలై వరదాచార్యులవారు.
శ్రీ జగన్నాథాచార్యుల వారి అత్యద్భుత సృష్టి "రైతు రామాయణము”. 3000 పద్యాలపై చిలుకు మహాకావ్యం. తెలుగు కవిత్వంలోని అన్ని పోకడలు పోయిన అలంకార పరిచం. తెలంగాణా గ్రామీణ, రైతాంగ వ్యవహారంలో ఉన్న వేల పదాల రాశి ఇది. పల్లె జీవనశైలిని ప్రత్యక్షం చేసే అపూర్వమైన ఆశ్చర్యకర కావ్యం. వీరి రైతు వాల్మీకి - ప్రజాకవి శేఖర - బిరుదులను సార్థకం చేసిన కృతి. శ్రీ వ్రతగీతి, తెలుగుబిడ్డ శతకం, కార్పాస లక్ష్మి వంటివి వీరి ఇతర రచనలు.
వీటిలో 'శ్రీవ్రతగీతి' - ధనుర్మాసంలో శ్రీ ఆండాళ్ వ్రతం సందర్భంగా చెప్పిన 'తిరుప్పావై' తమిళ గేయ కావ్యానికి తెలుగు అనుసరణం. ఆమె రోజూ సుప్రభాతాన్నే ఒక పాట శ్రీరంగనాథుని మీద అల్లి ఆయన సేవగా ఆలపించేది. అలా ఒక నెల రోజులపాటు ప్రతిదినమూ శ్రీ ఆండాళ్ ఆల్వార్ ఆశువుగా రచించిన ఆ గేయాలను 'పాశురాలు' అంటారు. ఇవి ముప్ఫై కలసి 'తిరుప్పావై' అన్న పేరుతో ప్రపంచ ప్రసిద్ధాలైనవి. వాటికి మక్కీకి మక్కీ అనువాదంగా కాక, చాలావరకు స్వతంత్ర భావాలు సంతరించుకొన్న అనుసరణ కావ్యం ఆచార్యుల వారి తెలుగు శ్రీవ్రతగీతి.
దీనిలో తెలుగు సంస్కృత శబ్దములు పడుగు - పేకవలె కలదిరిగి ఉన్నవి. “నాళాతుంగఘనస్త తటిపై నిద్రించు
భద్రాత్మ గోపాలుని మెల్లగ మేలుకొల్పు శ్రుతిదీప్త" అనే ఆచార్యులవారి మొదటి పద్యంలోనే వారి సంస్కృతపద
వైభవం, ఆండాళ్ ఆరాధనా సంప్రకటితములైనాయి. ఇది “నీళాతుంగస్తనగిరితటీ!” అనే సుప్రసిద్ధ శ్లోకానికి అనుసరణ మైనా స్వతంత్రమై సాగింది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |488| తేజోమూర్తులు}}</noinclude>
guhxti6r0ayzz7r7mt906gy9dyr0ugf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/510
104
212233
557483
553449
2026-05-29T10:08:30Z
A.Murali
3019
557483
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
ఇక ఆచార్యుల వారి తెలుగు పలుకుబడల వరుస
"మాగిదినపు తొలి నెలలో మంచు మరియు వెన్నెలలో అంటూ ధనుర్మాసాన్ని వర్ణించడం” తేనె వలపు చెలులూర!
అని ఆండాళ్ తన తోటి కన్యలను సంబోధించడం కావ్యాదిలోనే కలకండ పలుకులవంటి కమ్మని తెలుగు పదాలు.
చిలిపివాడైన శ్రీకృష్ణుని చూపులలో "కలువలు చెలగి పూసినవట. ఆవ్రత దినములలో ఆండాళ్ నెరికురులు
మూడవలేదట - కనుల కాటుక దిద్దలేదట.” ఐనా సహజ సౌందర్యశోభ-
<poem>
పెందలకడ తీర్థమాడి కందొర గాటుక దిద్దము
అందాల కురుల సన్నని మందారములను ముడువము
మా పెద్దలొనర్చని మరి యే పనులును సేయబోము
కొండెములను చాడీలను గోరంతము చెప్పబోము
చేతనైన దానమ్మును జేతుము ధర్మము జేతుము
ఖ్యాతిగ మను జీవితమును గలిగి వెలిగి జీవింతుము”</poem>
అంటూ కవి ఎంతటి ముద్దు ముద్దు తెలుగు పలుకులలో చిత్రించినారో!
<poem>
"కొండెత్తున - కడవలకొలదిగ -ఒడువని సిరి
తిరుమేన - పిడుగుట - కాలుమేను - పులుగు జతలు
పిల్చా! ఇటులే చిరమ్ము' వంటి ప్రయోగాలు ఆచార్యుల
వారికే సాధ్యం.</poem>
వీరి జీవన సాఫల్యకృతి- Life work - “రైతు రామాయణము”. కవిత్రయానికి భారతంవలె, పోతనకు భాగవతంవలె! ఇది రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రునికి పోలికగా రైతు రాముడిని చిత్రించిన కృతి. కర్షక జీవనరీతి ప్రధానమైన ఆరాశ్వాసాల అద్భుత పద్యప్రబంధం. రామాయణంలోనూ కాండలు ఆరేకదా! ఐతే ఇది శ్రీ జగన్నాథాచార్యుల వారి ఊహా సంజనిత కల్పిత కథా కావ్యం.
"వస్తానని రావైతివి సుస్తీ చేసినది" వంటి అచ్చ తెలంగాణ పల్లె పదాలతో కూర్చినది. ఎక్కడనో ఒక్కచోట పల్లీయ పదాల పోహళింపు, నుడికారం వెయ్యడమే గొప్ప అలాంటిది కావ్యమంతా తెలంగాణా జానపద శబ్దమయం చెయ్యడం ఎంత గొప్ప అంతటి 'రామనక్కందనపు' కృతి ఇది. నిజానికి సీత చక్కందనము మీదనే రామరావణయుద్ధం,
మొత్తం రామాయణమే నడిచింది. మరి "రామచక్కందనము" నుడికారానికి ఎలా ఎక్కిందో తెలియదు. ఇలాంటివన్నీ ఎన్నో తెలిసిన పల్లె పదాల మయబ్రహ్మ జగన్నాథాచార్యులవారు.
వాల్మీకి రామాయణంలో వలెనే ఈ రైతువాల్మీకి రైతు
రామాయణంలోనూ ఆరు కాండాలున్నాయి. అవి వరుసగా
శిశుకాండము, శిక్షణ కాండము, కళ్యాణ కాండము,
కృషికాండము, నిర్బంధకాండము, విజీయకాండము అనేవి.
వీటిలో రామాయణంలోని అరణ్యకాండ బదులు 'కృషి
కాండము వచ్చింది. రామాయణ అరణ్యకాండలోని
శ్రీరాముడు చేసింది - రాక్షస సంహార రూపమైన కృషేకదా!
ఇక్కడ రైతు రాముడు చేసింది పాడిపంటల అభివృద్ధి.
రైతుజన సంఘాభ్యుదయమనే కృషి. అందుకని ఇక్కడ ఇది
కృషి కాండమైనది. రైతుల అభివృద్ధి వోర్వలేక, వారికి
వెన్నుపూసవంటి రైతు రాముని సత్కార్య నిరతి సహించలేక
పాపాల పుట్టఐన పాపారావు, రావణుని ప్రతిరూపం - ఈ
కావ్యంలోని రైతు రాముని భార్య సీతను అవహరించి
నిర్బంధిస్తాడు. అందుకని రామాయణంలోని 'సుందరకాండ'
ఇక్కడ 'నిర్బంధకాండ' అయింది.
దీనికి మూలకారణం కూడా శూర్పణఖ వంటి
పాపారావు చెల్లెలు 'సుందరమ్మ. రాముని తమ్ముడు లక్ష్మణుని
వలచి విఫలురాలౌతుంది. దానితో రైతురాముని భార్య సీత
సౌందర్యాన్ని పూసగుచ్చినట్టు, కైపు తలకెక్కునట్టు అన్న
పాపారావుకు వర్ణించి చెప్పి సీత నిర్బంధానికి కారకురా
లైంది. ఇది రైతు రామాయణం కథా విలక్షణత! మరి, ఇన్ని
మాటల తర్వాత అసలీ కావ్యం కథ ఏమిటో తెలుసుకోవాలని
ఈ కావ్య కథానాయకుడు రైతు రాముడు. అతని
తమ్ముడు లక్ష్మణుడు. వారిద్దరి భార్యలు వరుసగా సీత,
ఊర్మిళ. బంటు హనుమన్న. సీతజాడలు తీయించిన
రైతురాముని స్నేహితుడు ధర్మారావు - సుగ్రీవునికి ప్రతీక.
రైతుల అభ్యుదయం పోరాటలో పాపారావుకు బుద్ధిచెప్పి
రాముడు సీతను తెచ్చుకొనుట, రైతురాజ్య స్థాపనము, ఆ
ఊరు రామాపురానికి రైతురాముని గ్రామపెద్దగా పాపారావు
స్థానంలో ఎన్నుకోవడంవంటి కథా ఘట్టాలు. అచ్చం
రామాయణేతి వృత్తాన్నే స్ఫురణకు తేవడంలేదా?
చేతులు తెలంగాణ (489 తేజోమూర్తులు విడు
ఆ<noinclude><references/>
{{rh|తెలంగాణ |489| తేజోమూర్తులు}}</noinclude>
h386fbzpw17ikm46a2xr85uv6ikjcfn
557486
557483
2026-05-29T11:20:25Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557486
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఇక ఆచార్యుల వారి తెలుగు పలుకుబడల వరుస
"మాగిదినపు తొలి నెలలో మంచు మరియు వెన్నెలలో అంటూ ధనుర్మాసాన్ని వర్ణించడం” తేనె వలపు చెలులూర!
అని ఆండాళ్ తన తోటి కన్యలను సంబోధించడం కావ్యాదిలోనే కలకండ పలుకులవంటి కమ్మని తెలుగు పదాలు.
చిలిపివాడైన శ్రీకృష్ణుని చూపులలో "కలువలు చెలగి పూసినవట. ఆవ్రత దినములలో ఆండాళ్ నెరికురులు
మూడవలేదట - కనుల కాటుక దిద్దలేదట.” ఐనా సహజ సౌందర్యశోభ-
<poem>
పెందలకడ తీర్థమాడి కందొర గాటుక దిద్దము
అందాల కురుల సన్నని మందారములను ముడువము
మా పెద్దలొనర్చని మరి యే పనులును సేయబోము
కొండెములను చాడీలను గోరంతము చెప్పబోము
చేతనైన దానమ్మును జేతుము ధర్మము జేతుము
ఖ్యాతిగ మను జీవితమును గలిగి వెలిగి జీవింతుము”</poem>
అంటూ కవి ఎంతటి ముద్దు ముద్దు తెలుగు పలుకులలో చిత్రించినారో!
<poem>
"కొండెత్తున - కడవలకొలదిగ -ఒడువని సిరి
తిరుమేన - పిడుగుట - కాలుమేను - పులుగు జతలు
పిల్చా! ఇటులే చిరమ్ము' వంటి ప్రయోగాలు ఆచార్యుల
వారికే సాధ్యం.</poem>
వీరి జీవన సాఫల్యకృతి- Life work - “రైతు రామాయణము”. కవిత్రయానికి భారతంవలె, పోతనకు భాగవతంవలె! ఇది రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రునికి పోలికగా రైతు రాముడిని చిత్రించిన కృతి. కర్షక జీవనరీతి ప్రధానమైన ఆరాశ్వాసాల అద్భుత పద్యప్రబంధం. రామాయణంలోనూ కాండలు ఆరేకదా! ఐతే ఇది శ్రీ జగన్నాథాచార్యుల వారి ఊహా సంజనిత కల్పిత కథా కావ్యం.
"వస్తానని రావైతివి సుస్తీ చేసినది" వంటి అచ్చ తెలంగాణ పల్లె పదాలతో కూర్చినది. ఎక్కడనో ఒక్కచోట పల్లీయ పదాల పోహళింపు, నుడికారం వెయ్యడమే గొప్ప అలాంటిది కావ్యమంతా తెలంగాణా జానపద శబ్దమయం చెయ్యడం ఎంత గొప్ప అంతటి 'రామనక్కందనపు' కృతి ఇది. నిజానికి సీత చక్కందనము మీదనే రామరావణయుద్ధం,
మొత్తం రామాయణమే నడిచింది. మరి "రామచక్కందనము" నుడికారానికి ఎలా ఎక్కిందో తెలియదు. ఇలాంటివన్నీ ఎన్నో తెలిసిన పల్లె పదాల మయబ్రహ్మ జగన్నాథాచార్యులవారు.
వాల్మీకి రామాయణంలో వలెనే ఈ రైతువాల్మీకి రైతు రామాయణంలోనూ ఆరు కాండాలున్నాయి. అవి వరుసగా
శిశుకాండము, శిక్షణ కాండము, కళ్యాణ కాండము, కృషికాండము, నిర్బంధకాండము, విజీయకాండము అనేవి.
వీటిలో రామాయణంలోని అరణ్యకాండ బదులు 'కృషి కాండము వచ్చింది. రామాయణ అరణ్యకాండలోని శ్రీరాముడు చేసింది - రాక్షస సంహార రూపమైన కృషేకదా! ఇక్కడ రైతు రాముడు చేసింది పాడిపంటల అభివృద్ధి. రైతుజన సంఘాభ్యుదయమనే కృషి. అందుకని ఇక్కడ ఇది కృషి కాండమైనది. రైతుల అభివృద్ధి వోర్వలేక, వారికి వెన్నుపూస వంటి రైతు రాముని సత్కార్య నిరతి సహించలేక పాపాల పుట్టఐన పాపారావు, రావణుని ప్రతిరూపం - ఈ
కావ్యంలోని రైతు రాముని భార్య సీతను అవహరించి నిర్బంధిస్తాడు. అందుకని రామాయణంలోని 'సుందరకాండ'
ఇక్కడ 'నిర్బంధకాండ' అయింది.
దీనికి మూలకారణం కూడా శూర్పణఖ వంటి పాపారావు చెల్లెలు 'సుందరమ్మ. రాముని తమ్ముడు లక్ష్మణుని వలచి విఫలురాలౌతుంది. దానితో రైతురాముని భార్య సీత సౌందర్యాన్ని పూసగుచ్చినట్టు, కైపు తలకెక్కునట్టు అన్న
పాపారావుకు వర్ణించి చెప్పి సీత నిర్బంధానికి కారకురాలైంది. ఇది రైతు రామాయణం కథా విలక్షణత! మరి, ఇన్ని
మాటల తర్వాత అసలీ కావ్యం కథ ఏమిటో తెలుసుకోవాలని ఈ కావ్య కథానాయకుడు రైతు రాముడు. అతని
తమ్ముడు లక్ష్మణుడు. వారిద్దరి భార్యలు వరుసగా సీత, ఊర్మిళ. బంటు హనుమన్న. సీతజాడలు తీయించిన
రైతురాముని స్నేహితుడు ధర్మారావు - సుగ్రీవునికి ప్రతీక. రైతుల అభ్యుదయం పోరాటలో పాపారావుకు బుద్ధిచెప్పి
రాముడు సీతను తెచ్చుకొనుట, రైతురాజ్య స్థాపనము, ఆ ఊరు రామాపురానికి రైతురాముని గ్రామపెద్దగా పాపారావు
స్థానంలో ఎన్నుకోవడంవంటి కథా ఘట్టాలు. అచ్చం రామాయణేతి వృత్తాన్నే స్ఫురణకు తేవడంలేదా?<noinclude><references/>
{{rh|తెలంగాణ |489| తేజోమూర్తులు}}</noinclude>
cdxudps311ghrxrqy68c16dv0dur1np
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/511
104
212234
557487
553450
2026-05-29T11:29:37Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557487
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఇది రైతు రామాయణం కాబట్టి కవి- దీనిలోని ఆశ్వాసాలకు కాండములనే పేరు పెట్టారు. శిశుకాండలో వృద్ధులైన రైతురాముని తల్లిదండ్రులు దైవపూజాదికాలు చేసి సంతానం పొందడం పిల్లల అభివృద్ధి వర్ణితాలు. శిక్షణ కాండలో రామలక్ష్మణుల విద్యాభ్యాసం, రామాపురం గ్రామాభ్యున్నతికై దీక్షబూని రాముడు నిరక్షరాస్యులైన రైతులను చేరదీసి వారికి ఇతోధిక విద్యాబుద్ధులు నేర్చి, కాపు సంఘాన్ని స్థాపించి వారిలో చైతన్యం తీసుకురావడం, నూత్న వ్యవసాయ పద్ధతులను నేర్పి వారిని శాంతియుత హరిత విప్లవ యోధులుగా మార్చడం కథాంశాలు.
ఇక కల్యాణ కాండలో సీతా ఊర్మిళలతో రామలక్ష్మణుల వివాహం, కృషి కాండలో దుర్భిక్షం, కరువు కాటకాల నుండి రైతాంగాన్ని తన పలుకుబడితో రైతు రాముడు అధికార ఆర్థిక సహాయం చేయించి, వారిని నిరాశా నిప్పుృహల నుండి మరల్చడం వర్ణితాలు. అంతలో విధవయైన పాపారావు చెల్లెలు సుందరమ్మ లక్ష్మణుని మోహించి, తిరస్కృతురాలై ఆ కసితో సీతను పాపారావుచేత నిర్బంధింప జేస్తుంది.
విజయకాండలో సుగ్రీవుని స్ఫురణకు తెచ్చే ధర్మారావు సాయంతో రైతురాముడు పాపారావు గుట్టు రట్టుచేసి, నలుగురిలో ఛీ అనిపించి సీత చెఱ విడిపిస్తాడు. ఆ తర్వాత రామాపురానికి రైతు రాముడు గ్రామపెద్దగా అభిషిక్తుడు.
కావడం వంటి అచ్చం రామాయణ కథాంశాలను రైతు జీవితానికి అన్వయించిన శ్రీ వానమామలై జగన్నాథాచార్యుల వారి కావ్యం 'రైతు రామాయణం" సార్ధక నామ ధేయాన్ని సంతరించుకున్నది.
ఇక ఇందులోని పల్లీయత, రైతు జన సాధారణమైన పదాల, నుడికారాల, సమాసాల ప్రయోగం-
<poem>
"పచ్చతి పేర్చి తీర్చిన తివాచులు పచ్చిక బీళ్ళు,
కొండలో
దిచ్చలు గొట్టుచున్ పరుగు దీసెడి మేల్ సెలయేళ్ళు,
నింగికిన్
నిచ్చెన లెత్తినట్లుగ వనీస్థలి నిల్చిన బట్టతాళ్ళు, పైర్
పచ్చలచుట్టు కోట దరబాగులు దీర్చిన కొండ
చాళ్ళునున్”</poem>
అని రామాపురాన్ని వర్ణించడంలో ప్రకృతి వర్ణన - అంచులు దిద్దుకొన్నది.
"చేయురెక్కలు నాలుగోయన నిమ్మది
పాల్గొనర్చెడి చతుర్భాహుడతడు
నలుమూలలగల పంట పొలాల దానమై
నలు ముఖాలన్ జూచు నలువయతడు
పశుపోషణమ్మునన్ బ్రత్యేకమాయొక
కనుగల్లి వెలుగు ముక్కంటి యతడు
పూని వేగన్నులన్ జేని మొక్కల సదా
రక్షించుకొను సహస్రాక్షుడతడు
చిట్టిగొడ్డలింగాని జట్టు గొట్టునపుడు
అపర పరశురాముడు, దండిహులమనుగాని
కదల బలధాముడును బాలికాపువెంట
రమణి కూడిరాన్ శ్రీ రఘురాముడతడు”</poem>
అంటూ రైతుని రాముడిగా వరుసగా నారాయణుడు, బ్రహ్మ, శంకరుడు, ఇంద్రుడు, పరశురాముడు, బలరాముని
తో పోల్చి చివరికి సీతతో కూడిన శ్రీరాముడని వర్ణించడం అత్యద్భుతం.
<poem>
"పంటలక్ష్మికి తొలియాట పట్టులబక్క
కాపుజనముల పాలి బంగారు గట్టు
కదుపు మొత్తాలు పురికట్టు కాటకాలు
కరువులరికట్టు పెరటికల్పకపు చెట్టు
పట్టణముల యాయువుపట్టు పల్లిపట్టు
అదియెలేక నగరజీవి యాటకట్టు</poem>
అంటూ పల్లెను గాంధీజీ భావించిన గ్రామ స్వరాజ్య భావనతో, కర్షక ప్రాధాన్యత చిత్రించిన తీరు అనన్య సామాన్యం, అలాంటి పల్లెలో
<poem>
“పచ్చ చేమంతి పూదోట, పసిడికోట,
పడుచు పరువాల పాల మీగడల తేట
చిలిపి సిగ్గు సింగారాల జిలుగుమూట
పల్లె చెలిమోర్తు జను వరి పంపునాట”</poem>
అంటూ నాట్ల ఘట్టాన్ని పరమ రమణీయంగా వర్ణించడం కవిగారి మరోకృతి "కార్పాసలక్ష్మి'ని స్ఫురణకు తెస్తుంది. అంతేకాదు పాపారావు రాక్షస బలగాలను<noinclude><references/>
{{rh|తెలంగాణ |490| తేజోమూర్తులు}}</noinclude>
dskhpui124wbb1swd4w6vdon6fk2n6t
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/512
104
212235
557488
553451
2026-05-29T11:31:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557488
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><poem>
"అతని పటాలముల్ యమభటావళితిం బ్రతిరూప
మచ్చ మా
కుతుకలదాక సంజుళుల కూరలు మెక్కుచు నల్లగల్లు
తలకు బోసుకోదగిన వెళ్ళినపాటున వస్తు
దూలుచున్
గుతుపల వోలె నా యినుప గలిండ్లటులుండ్రుణ నా
మొదల్'</poem>
సరై అంటూ చేసిన రచన పల్లె పదాల మూటకదా? అలా ఎన్నని చెప్పడం? చెప్పుబూనితే కావ్యమంతా జానపద
భాషారీతికి ఉదాహరణగా చెప్పాలి!
రైతు రామాయణం పరువానికి వచ్చిన ఇక్షుర్సిండం అమృత భాండం! అది తెలుగు జాతికి అందించిన మధురకవి శ్రీ వానమామలై జగన్నాథాచార్యుల వారు పల్లె కవితకు ప్రాతఃస్మరణీయుడు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |491| తేజోమూర్తులు}}</noinclude>
8pdrq5akumqddx1w7uh0q5ox8s4xatb
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/513
104
212236
557489
553452
2026-05-29T11:42:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557489
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''143. వానమామలై వరదాచార్యులు '''</p>}}
{{right|- ఆచార్య రావికంటి వసునందన్}}
<poem>
ఉత్తమ కవితాలేఖన
చిత్తమ్మెల్లారకు మరక చిక్కునె కూర్పన్
విత్తమ్మా? నేరిచికా
పొత్తమ్మా? పూర్వజన్మ పుణ్యమెకాకన్”</poem>
అని కంఠోక్తిగా కవిత్వం గురించి తమ అభిప్రాయం ప్రకటించిన మహాకవి అభినవ పోతన డా. వానమామలై వరదా చార్యులు గారు. వీరి మహాకావ్యం "పోతన చరిత్రము” 5 వేల పై చిలుకు పద్యగద్యాల సమాహారం. శ్రీమాన్
వానమామలై మహాకవే కాక, పోతనవలెనే మహాభక్తుడు. వాగీశ్వర మహామంత్రోపాసనచే సాక్షాత్ శ్రీ సరస్వతీ దేవిని
ప్రసన్నం, ప్రత్యక్షం చేసుకొన్న ధన్యాత్ములు, పుణ్యాత్ములు.
వీరి తల్లి సీతమ్మ, తండ్రి బక్కయ్య శాస్త్రి. మైకులులేని పూర్వకాలంలో మూడు మైళ్లు వినబడే కంచుకంఠంతో,
మేఘగంభీరస్వరంతో పురాణ ప్రవచనం చేసేవారట వీరు. "తింటే గారెలే తినాలె, వింటే బక్కయ్య శాస్త్రి పురాణమే
వినాలె” అనేది ఆనాటి నానుడి.
వరంగల్ దగ్గరి మడికొండ వరదాచార్యుల జన్మస్థలం. చిరకీర్తి నార్జించిన కాళోజీ, పల్లా దుర్గయ్య, బిరుదరాజు
రామరాజు గారి వంటి ప్రసిద్ధ వ్యక్తులందరూ మడికొండవారే! వీరికి సమకాలికులే! కలిసిమెలిసి ఆడుకొన్నవారే! వీరి పుట్టిన తేదీ పరీధావి నామ సం౹౹ శ్రావణ బహుళ ఏకాదశి -సరియైన ఇంగ్లీష్ తేదీ 16 ఆగస్టు, 1912. పరమపదించిన
తేదీ రక్తాక్షి నామ సం౹౹ అశ్వయుజ శుద్ధ అష్టమి, 31 అక్టోబర్, 1984. బిరుదులు : అభినవ పోతన, అభినవ
కాళిదాసు, ఆంధ్రకవి వతంస, మధురకవి, కవి కోకిల, ఉత్ప్రేక్షా కవి చక్రవర్తి, మహాకవి శిరోమణి, కవి శిరోవతంస
మొదలైనవి.
ఎన్నెన్నో మధురకృతులు వెలయించిన శ్రీమాన్ వరదాచార్యుల వారి జీవితం నిరంతర వీడామయం. యౌవనంలో తీవ్రక్షయవ్యాధితో మైసూరు శానిటోరియంలో పదిసార్లు ఆపరేషన్లు, చెడిపోయిన ఒక ఊపిరితిత్తి తీసివేత, అంతిమ సమయంలో పక్షవాతం, 26 మాసాలపాటు కోమాలో ఉండటం వీరనుభవించిన బాధలు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు, స్వర్ణాభిషేకం, స్వర్ణకంకణం, స్వర్ణగండ పెండేరం, వారణాసి విశ్వవిద్యాలయం వారి డి.లిట్.,తెలుగుదేశం నిండా అనేక సన్మాన సత్కారాలు, ఎం.ఎల్.సి. పదవి వీరందుకొన్న వైభవాలు. సుమధుర, సంగీత స్వర సంయుతంగా కోకిల గళంతో కావ్యగానం చేయడం వీరి ప్రత్యేకత!
వయః పరిమితినీ, విద్యార్హతలనూ సడలించి రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారి ముఖ్యమంత్రిత్వంలో
వీరికి ఉపాధ్యాయ పదవీ నియామకం చెయ్యడం వీరి “సహజ పాండిత్యానికి నిదర్శనం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |492| తేజోమూర్తులు}}</noinclude>
09itf5q00elie5i078sdwlzzx2098kn
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/514
104
212237
557490
553453
2026-05-29T11:55:50Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557490
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
పోతన వలెనే సహజ పాండిత్య విభాసితులైన అభినవ పోతన శ్రీమాన్ వానమామలై వరదాచార్యులు వ్యవసాయమూ
చేసిన కృషీవలులు కూడా. సాహిత్యంలో, వ్యక్తిత్వంలో ముమ్మార్తులా పోతన మూర్తీభవించిన అభినవ పోతన -
మహాకావ్యం "పోతన చరిత్రము”. ఈ మహాకావ్య రచనకు వీరికి పన్నెండేళ్లు పట్టింది. ఇందులోని "భోగినీలాస్యం”
కూర్చున్న చోటునుండి లేవకుండా రాత్రంతా సమాధిస్థితిలో విరచించిన అత్యద్భుత సంగీత సాహిత్య నాట్యమయ ఘట్టం.
పన్నెండు స్కంధాలతో పరిపూర్ణమైన పోతన శ్రీమహాభాగవతం వలెనే; అభినవ పోతన విరచితమైన “పోతన
చరిత్రము” కూడా ద్వాదశాస్వాస విలసితం. అంతగా ఇతివృత్త పటుత్వంలేని పోతన జీవన ఘట్టాలను ఒక మహా కావ్యంగా, మలచడం వరదాచార్యులవారు చేసిన గొప్ప తపస్సు! "విన్ననఖింత భాగవత విశ్రుత వీఠికలోన తాను
పోతన్న వచించినంతను... మనమ్మున దోచినంత - అనే పద్యం మూడు మార్గాల కూడలిగా పోతనకావ్యం ఉన్నదని
తెలుపుతున్నది.
ఓరుగల్లు 'బమ్మెర పోతన్న కడపజిల్లా “ఒంటిమిట్ట" వాడని ఒక వాదం. పోతన చరిత్ర రచనా కాలంలో ఉండేది. ఆ ప్రవాదాన్ని కూడా తోసివేయక వరదాచార్యుల వారు - 'పోతన తన ప్రవాసకాలంలో, సర్వజ్ఞ సింగ భూపాలుని ధాటికి స్వస్థలం విడిచిపోయిన సమయంలో తన భాగవతాన్ని ఒంటిమిట్టలోని కోదండ రామస్వామికి అంకితం చేసినాడని వ్రాసి ఒక అద్భుతమైన సమన్వయదృష్టిని ప్రదర్శించారు. ఆ సమయలో వ్రాసిన ఒక పద్య్ం-
"చిన్ననటంచు నెంచకయె సిగ్గొక ఇంచుకలేక భక్తపో
తన్నను గూడి భాగవతతత్త్వముబాడ గళము విప్పితిన్
నన్నిక దిట్టిపొండు కరుణంగని దీవెనలిండునాల్గుకో
ట్లన్నల మంగళార్ధమయి ఆంధ్రపదాల
నివాళిబట్టితిన్.”</poem>
ఈ పద్యాన్ని బహుశా, తర్వాత వానమామలై పీఠికల్లో చేర్చి ఉంటారు. ఇందులో తన “అభినవ పోతన" తనంతో
పాటు - మంగళార్థమయి అనే ప్రయోగంలో "కావ్యం యశసేవృతే శివతరక్షతయే” అనే పూర్వాలంకారిక నిర్వచన దృష్టి కూడా ఉన్నది.
<poem>
"ముందర నీకు మ్రొక్కి కలముంగయిబూనితి, దాని
జిహ్వపై
నందము చిందగా బదములందు సువర్ణపుటందెలూని
తద్ధింధిమితైతతోమ్మనుచు దివ్యరసధ్వనులూరె
నాట్య మిం
పొందగజేయవే! సహృదయుల్ విబుధుల్ వినుతింప
భారతీ!"</poem>
అనే కావ్య ప్రారంభ సరస్వతీస్తోత్రంలో సంగీతసాహిత్య నాట్య వైభవాల ధ్వని ఉన్నది.
పోతన్న భాగవత రచనా సందర్భంలోని ఈ పద్యంలో 'స్వభావోక్తి' అనే అలంకారం అంచులు దిద్దుకున్నది. ప్రక్కన
నున్న ముల్లుగొని, పచ్చలు విచ్చెడి తాటికమ్మపై జెక్కదొడంగె ముత్తియపు చేరుల దీరుచు నక్షరాళి, పై కెక్కిడు బొమ్మలన్ నుదుట నేర్పడు రేఖలు - భావవాహినిస్ జక్కని యానకట్టన సౌరులు దిద్దగ దన్మయాప్తతన్.
ఈ పదాల పోహళింపులో పోతన్నమూర్తి చెక్కిన శిల్పంలా దర్శనమియ్యడం లేదా? రుచిరార్థసూక్తులకు పోతన చరిత్రము పెన్నిధి.
<poem>
"ధరనుపాధ్యాయుడెదా యొక్క తరుణమందు
భ్రాంత పరిమిత జనులకు పాఠమిపను
కాని సత్కవి వాణి శిక్షణ మొసంగు
సకలకాలమ్ములందు విశ్వప్రకృతికి”</poem>
వంటి పద్యాలు వరదాచార్యుల సూక్తి నిధిత్వానికి ఆనవాలు.
వ్యక్తుల, పాత్రల చిత్రణం - వర్ణనమే కాక తదితర సందర్భాల్లోని కవిత్వ వైచిత్రి కూడా అద్భుతం. ఒక ఎద్దుల
బండి ఎక్కి శ్రీనాథుడు పోతన్న దగ్గరికి వస్తాడు. ఆ సందర్భంలో చేసిన వర్ణనం
<poem>
"చకచకగిత్తల కదముకు
త్రకిట ధికి ధకిటగా మృదంగధ్వని టక్
టికుమనుకేదారాహతి
నికటతటిని శకటమొకటి నిలిచినయంతన్.”</poem>
దీనిలోని మృదంగధ్వని పూర్వక అక్షర విన్యాసం అభినవపోతనకు ఉన్న మహాశబ్దాధికారాన్ని వెల్లడించడం లేదా?<noinclude><references/>
{{rh|తెలంగాణ |493| తేజోమూర్తులు}}</noinclude>
ai8gzotswb2845oh12j74wljdplo8e3
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/515
104
212238
557491
553454
2026-05-29T11:56:38Z
A.Murali
3019
557491
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>పోతనవలెనే అభినవ పోతన కూడా తన మహాకావ్యాన్ని
శ్రీరామాంకితం చేశారు.
సొమ్ములయాసలో బడక క్షుద్రకృపాలుర నీవడించి
చొక్కమ్మగు భక్తి భాగవత కావ్యరమన్ గృతినిచ్చె నీకు
శ్రీ బమ్మెర పోతరాజుతని భవ్యచరిత్రమునే మహాప్రబంధమ్ము
నొనర్చి నిన్ను కృతినాథునిగా నానరించి చెప్పెదన్.
“సుతుని గొప్పలగీర్తింప నతిముదమున
వినుచు దనుదాన చెడి జనకుని వలె
నాలకింపవె దేవ! మహానుభావ!
జనవినుతకీర్తి శ్రీరామచక్రవర్తి"
అనే పద్యాల్లో తనకూ పోతన్నకూ ఉన్న సమాన
లక్షణాలైన నిరీహ, నిత్య సంతృప్తి, భగవద్భక్తి వంటి వాటిని
వరదాచార్యులు ధ్వని గర్భితం చెయ్యడం గమనార్హం. ఇలా
ఎంత చెప్పినా సరిపోలని వరదాచార్యులు పోతన చరిత్రము
ప్రకృతి చిత్రణకూ మానవ స్వభావ చిత్రణకూ మంచికీ
మానవతకూ ఒక రత్నదర్పణం.
తెలుగు సాహిత్యంతో పరదాచార్యుల వారు వెలయించిన
మహానాటకం 'వైశాలిని' వారికున్న 'అభినవ కాళిదాస'
బిరుదాన్ని అన్వర్ధం చేస్తున్నది. రచనలో, పాత్రచిత్రణలో,
సంభాషణా వైఖరిలో దానికదే సాటి. శ్రేయోరాజ్యస్థాపన
జరగాలనే ఆకాంక్షతో రచించిన ఈ తొమ్మిదంతాల
మహానాటకానికి మూలకథ మార్కండేయపురాణంలో కొంత
ఉన్నది. అవీక్షితుడు, వైశాలినిని పెండ్లి ఆడటం ప్రధాన
కథ. చాలా కల్పనలతో మిశ్రకథగా ఆచార్యుల వారు
రూపొందించిన ఈ నాటకంలోని సన్నివేశ కల్పనం,
సంవిధాన చాతుర్యం, రసపోషణం, కవితా సౌందర్యం
అద్వితీయాలు.
"ప్రాణమేగుట మృత్యువు కానె కాదు
నరుడు అభిమానహతుడైన నాడె చచ్చు,
మనుపుట్టుట జన్మము కానేకాదు.
కీర్తి యుదయించునాడె యామూర్తి పుట్టు!" వంటి
పంక్తులు ఉత్తమ మానవతా ప్రతిపాదకాలు. ఈ నాటకం
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎం.ఎ.కు పాఠ్యగ్రంథంగా
కొంతకాలం ఉన్నది.
కులమతాలకు అతీతమైన మానవతా ప్రబోధంతో
వెలువడిన సుమధుర గేయ కావ్యం 'విప్రలబ్ధ'. ఏటిలో
కొట్టుకొని పోతున్న ఒక మహ్మదీయ బాలికను ఒక విప్రుడు
కాపాడి ఆమెరు 'లక్ష్మి' అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా.
పెంచుతాడు. ఆమెకు 'రాముడు' అనే ఒక రైతుతో వివాహం
జరిపిస్తాడు. కులమతాల సంకుచితత్వాలకు అతీతంగా
వెలసిన ఈ విప్రలబ్ధ కావ్యం అంతా గేయమయమే!
నీవెవడవు నీవెవడవు నిజం చెప్పుమానవుడా!
నిజముగ మానవుడ వీవు నీజాతీయ మానవత
ఆలరంగదేదియైన పొలరంగు ఒక్కటియే!"
అని ప్రబోధించే సర్వమానవ సౌభ్రాతృత్వ రచన ఇది.
"వచ్చెను వచ్చెను వర్షాలు మానసుధారాణికి తలంబ్రాలు
పంటచేలకు ప్రాణాలు” అని ముగ్ధమనోహరంగా వర్ణిస్తూనే
వాటిని, "వరికంకులనోళ్లకు చనుబాలు" అని మాతృ
మధుర హృదయంతో విరచించడం కేవలం వరదాచార్యులక
సాధ్యమేమో!
చంద్రుడట, చుట్టూ చుక్యులతో కలిపి "చదల పిల్లలకోడి
తిరిగినట్టుంటాడట!" ఈ భావనకు గొప్ప కృషీవల హృదయం
కావాలి. చదలు అంటే ఆకాశం. చదలు అంటే కోడి, తన
పిల్లలతో కలిసి ఏరుకొని తినే చదలు. ఎంతటి విశ్లేషరమ్యం
ఇది!
“ఎవ్వరీ చిన్నది ఎంతబాగున్నది?
కన్ను ఇక్కడనుండి కదలనంటున్నది!
పెదవి చెలియలికట్ట నొదుగు సిగ్గుల కడలి
నవ్వు ముత్యాల్ బోసి నా గుండె కొన్నది"
అని నాయిక లక్ష్మిని చూసి నాయకుడు రైతు రాముడ
సుకోవడం ఎంతటి సహజ పల్లీయ వర్ణన! "సిగ్గుల కడలి
నవ్వు ముత్యాలు" అనే ప్రయోగం మన అలంకార శాస్త్రంలో
పూర్ణోపమ! వాళ్లిద్దరికీ అదేమి తెలియదు పరిపూర్ణ స్నిగ్ధ
ప్రజయం తప్ప.
అరవైకి పైగా ఇలా అత్యద్భుతంగా అభినవ పోతన
డా. వానమామలై వరదాచార్యులు సృష్టించిన మహోన్నత
సాహిత్యంలో మరికొన్ని - మణిమాల, ఆహ్వానం,
జయధ్వజం, స్తోత్రరత్నావళి, గీతరామాయణం, సూక్షి
వైజయంతి, స్తవరాజ పంచశతి, అభ్యుదయ నాటికా సంపుటి,
యువతులు తెలంగాణ 494 తేజోమూర్తులు ఉ<noinclude><references/>
{{rh|తెలంగాణ |494| తేజోమూర్తులు}}</noinclude>
cfxvufv8j2o25hkaisxenkki1z7dorg
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/111
104
212556
557445
554776
2026-05-28T16:14:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557445
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. గురుభక్తి = పెద్దలయందుభక్తి; ఊరుకత్తి = ఎక్కువైన ప్రేమ; పుటము గాఁగన్ = అధికము కాఁగా; యోగీంద్రశిఖాభరణము = యోగులకు తలమానిక మగువాఁడు - మిగులశ్రేష్ఠుఁడు; ముక్తామయతాన్ఫురణము = ముత్యములచే అలంకరింపబడుట - లావణ్యము, విడువఁబడిన రోగభావమును; భువనప్రశస్తముగన్ = ప్రసిద్ధముగా; జిగి = కాంతి; మీఱెన్ = అతిశయించెను.
{{Telugu poem|type=సీ.|lines=<poem>మును మీ నగుటఁ <ref>చ. బట్ట, క. బట్టి</ref>బట్ట మునులు వైచిన బత్తి
వలఁబోలెఁ జిక్క మౌదలఁ దలిర్ప
<ref>చ. వెలితిచి</ref>వెలితిగాఁ జవిగొన్న వెన్నముద్దయుఁబోలె
శంఖంబు వామహస్తమునఁ దనర
జగదండవహకాలచక్రభ్రమణహేతు
దండమై నిజధేనుదండ మమర
సంచిఁబట్టిన పద్మజాతాండములలీల
వలకేల గ్రచ్చకాయలు ఘటిల్లఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కలయఁ బూచిన కల్పవృక్షంబుచాయ
సరసవనపుష్పమాలికాభరసమగ్ర
విగ్రహముతోడ విలసిల్లు విప్రు నెదుట
మందప్రోయాండ్రకూరిమిమ్రానిపండు.</poem>|ref=14}}
'''టీక'''. మీ నగుటన్ = మత్స్యరూపమును ధరించుటచే; పట్టన్ = పట్టుకొనుటకు; బత్తివల = భక్తి యనువల; చిక్కము = చలిది చిక్కము; ఔదలఁ దలిర్పన్ = తలపై ప్రకాశింపఁగా; వెలితిగాఁ జవి గొన్న = కొంత కొఱికిన; జగదండ...దండమై - బ్రహ్మాండభాండమును మోయు కాలచక్రము తిరుగుటకు కారణమగు కఱ్ఱయై; నిజధేనుదండము = తన పసులను తోలెడికఱ్ఱ; వలకేలన్ = కుడిచేతియందు; కలయఁబూచిన = బాగుగాఁబూచిన; మందప్రోయాండ్రకూరిమిమ్రానిపండు = గొల్లపడుచులప్రేమఫలము - శ్రీకృష్ణుఁడు. '''అలం'''. ఉదాత్తము, స్వభావోక్తి, ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>నియమాంకంబున సత్యా, ప్రియరూపముతోడఁ గూడఁ బెనచిన యంత
ర్నయనము సడలిచి పితృపా, దయు గార్చాధీనబుద్ధిఁ దహతహ వెఱుఁగన్.</poem>|ref=}}
'''టీక'''. నియమాంకంబునన్ = సమాధి ముగిసినపిదప; సత్యాప్రియరూపముతోడన్ = (సాక్షాత్కరించిన) శ్రీకృష్ణుని స్వరూపముతోఁ గూడ; అంతర్నయనము = లోపలిచూపు - యోగదృష్టి; సడలించి = విడుచునట్లు చేసి; పితృ...బుద్ధిన్ = తలిదండ్రుల పాదసేవకు లొంగిన బుద్ధిలో; తహతహ = తమకము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పావనదృగ్విలాసములు బాహ్యగతిం బచరించి చంద్రికా
శ్రీవిభవంబులం బలుచసేయు మఖప్రభ లుల్లసిల్లఁగా
మై వదలించి పూర్వమగు<ref>క. మట్టున, ట. మట్టువ</ref>మట్టును గాడ్పును సాగనిచ్చి పైఁ
గావలి యిడ్డ శక్తుల సగౌరవదృష్టిఁ బరిగ్రహించుచున్.</poem>|ref=16}}
'''టీక'''. పావనదృగ్విలాసములు = పవిత్రములగు తళుకుఁజూపులను; బాహ్యగతిన్ పచరించి = బాహ్యప్రపంచమున వ్యాపింపఁజేసి; చంద్రికాశ్రీవిభవంబులన్ = నిండువెన్నెల సొబగును; పలుచ సేయు = తేలిక చేయు - తిరస్కరించునట్టి; ముఖప్రభలు = ముఖకాంతులు; మై వదలించి = దేహమును ఆసనబంధమునుండి తప్పించి; పూర్వమగుమట్టునున్ = (సమాధికి) పూర్వపు సంకోచమును; కావలి యిడ్డ శక్తులన్ = లోనికి రాకుండ ఆటంకపఱచి యుంచిన యిచ్ఛాదిశక్తులను; సగౌరవదృష్టిన్ = మర్యాదతో; పరిగ్రహించుచున్ = తిరిగి తీసికొనుచు. ముందున కన్వయము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>తనువుతోఁ జరియించు ధర్మదేవతఁబోలె
మెలఁపున వనవాటిఁ గలయఁ దిరిగి
గణన మీఱిన శార్ఙ్గిగుణములు హృదయసం
పుటి నించుక్రియ విరుల్ <ref>ట. జుట్టి</ref>బుట్టిఁ బెట్టి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
i2tduxjqyzi8jwikci81gik0mb435zk
557446
557445
2026-05-28T16:16:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557446
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. గురుభక్తి = పెద్దలయందుభక్తి; ఊరుకత్తి = ఎక్కువైన ప్రేమ; పుటము గాఁగన్ = అధికము కాఁగా; యోగీంద్రశిఖాభరణము = యోగులకు తలమానిక మగువాఁడు - మిగులశ్రేష్ఠుఁడు; ముక్తామయతాన్ఫురణము = ముత్యములచే అలంకరింపబడుట - లావణ్యము, విడువఁబడిన రోగభావమును; భువనప్రశస్తముగన్ = ప్రసిద్ధముగా; జిగి = కాంతి; మీఱెన్ = అతిశయించెను.
{{Telugu poem|type=సీ.|lines=<poem>మును మీ నగుటఁ <ref>చ. బట్ట, క. బట్టి</ref>బట్ట మునులు వైచిన బత్తి
వలఁబోలెఁ జిక్క మౌదలఁ దలిర్ప
<ref>చ. వెలితిచి</ref>వెలితిగాఁ జవిగొన్న వెన్నముద్దయుఁబోలె
శంఖంబు వామహస్తమునఁ దనర
జగదండవహకాలచక్రభ్రమణహేతు
దండమై నిజధేనుదండ మమర
సంచిఁబట్టిన పద్మజాతాండములలీల
వలకేల గ్రచ్చకాయలు ఘటిల్లఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కలయఁ బూచిన కల్పవృక్షంబుచాయ
సరసవనపుష్పమాలికాభరసమగ్ర
విగ్రహముతోడ విలసిల్లు విప్రు నెదుట
మందప్రోయాండ్రకూరిమిమ్రానిపండు.</poem>|ref=14}}
'''టీక'''. మీ నగుటన్ = మత్స్యరూపమును ధరించుటచే; పట్టన్ = పట్టుకొనుటకు; బత్తివల = భక్తి యనువల; చిక్కము = చలిది చిక్కము; ఔదలఁ దలిర్పన్ = తలపై ప్రకాశింపఁగా; వెలితిగాఁ జవి గొన్న = కొంత కొఱికిన; జగదండ...దండమై - బ్రహ్మాండభాండమును మోయు కాలచక్రము తిరుగుటకు కారణమగు కఱ్ఱయై; నిజధేనుదండము = తన పసులను తోలెడికఱ్ఱ; వలకేలన్ = కుడిచేతియందు; కలయఁబూచిన = బాగుగాఁబూచిన; మందప్రోయాండ్రకూరిమిమ్రానిపండు = గొల్లపడుచులప్రేమఫలము - శ్రీకృష్ణుఁడు. '''అలం'''. ఉదాత్తము, స్వభావోక్తి, ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>నియమాంకంబున సత్యా
ప్రియరూపముతోడఁ గూడఁ బెనచిన యంత
ర్నయనము సడలిచి పితృపా
దయుగార్చాధీనబుద్ధిఁ దహతహ వెఱుఁగన్.</poem>|ref=}}
'''టీక'''. నియమాంకంబునన్ = సమాధి ముగిసినపిదప; సత్యాప్రియరూపముతోడన్ = (సాక్షాత్కరించిన) శ్రీకృష్ణుని స్వరూపముతోఁ గూడ; అంతర్నయనము = లోపలిచూపు - యోగదృష్టి; సడలించి = విడుచునట్లు చేసి; పితృ...బుద్ధిన్ = తలిదండ్రుల పాదసేవకు లొంగిన బుద్ధిలో; తహతహ = తమకము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>పావనదృగ్విలాసములు బాహ్యగతిం బచరించి చంద్రికా
శ్రీవిభవంబులం బలుచసేయు మఖప్రభ లుల్లసిల్లఁగా
మై వదలించి పూర్వమగు<ref>క. మట్టున, ట. మట్టువ</ref>మట్టును గాడ్పును సాగనిచ్చి పైఁ
గావలి యిడ్డ శక్తుల సగౌరవదృష్టిఁ బరిగ్రహించుచున్.</poem>|ref=16}}
'''టీక'''. పావనదృగ్విలాసములు = పవిత్రములగు తళుకుఁజూపులను; బాహ్యగతిన్ పచరించి = బాహ్యప్రపంచమున వ్యాపింపఁజేసి; చంద్రికాశ్రీవిభవంబులన్ = నిండువెన్నెల సొబగును; పలుచ సేయు = తేలిక చేయు - తిరస్కరించునట్టి; ముఖప్రభలు = ముఖకాంతులు; మై వదలించి = దేహమును ఆసనబంధమునుండి తప్పించి; పూర్వమగుమట్టునున్ = (సమాధికి) పూర్వపు సంకోచమును; కావలి యిడ్డ శక్తులన్ = లోనికి రాకుండ ఆటంకపఱచి యుంచిన యిచ్ఛాదిశక్తులను; సగౌరవదృష్టిన్ = మర్యాదతో; పరిగ్రహించుచున్ = తిరిగి తీసికొనుచు. ముందున కన్వయము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>తనువుతోఁ జరియించు ధర్మదేవతఁబోలె
మెలఁపున వనవాటిఁ గలయఁ దిరిగి
గణన మీఱిన శార్ఙ్గిగుణములు హృదయసం
పుటి నించుక్రియ విరుల్ <ref>ట. జుట్టి</ref>బుట్టిఁ బెట్టి</poem>|ref=}}<noinclude><references/></noinclude>
6fhwfwzpe1pvykcow7mer8enk9xb2jq
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/112
104
212557
557468
554777
2026-05-28T23:08:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557468
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>తనకుఁ బవిత్రవర్ధనమె కృత్యం బను
కరణి నూతనకుశోత్కరముఁ గూర్చి
యపవర్గఫలసిద్ధి హదనైనఁ జేపట్టు
కైవడి బహుఫలోత్కరము <ref>క. ఒడిచి, శ.ర. ఒడిసి</ref>లొడిసి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యోగయాగంబు సలుపుచో నూర్మిపశువి
శసన మొనరించుకొనుటకు యూపసమితిఁ దెచ్చు
భాతి <ref>క. సమిధలు</ref>సమిధలఁ గొని మహాప్రాజ్ఞుఁ డతఁడు
వచ్చు లేఁబగటికి నిజావాసమునకు.</poem>|ref=17}}
'''టీక'''. మెలపునన్ = మెలకువతో; గణనమీఱిన = లెక్కకు మిక్కిలియైన; హృదయసంపుటిన్ = మనస్సనెడి పెట్టెయందు; బుట్టిన్ = బుట్టయందు; కుశోత్కరమున్ = దర్భలసమూహమును; ఒడిసి = కోసి; అపవర్గఫలసిద్ధి = మోక్షప్రాప్తి; హదను = అదను - తఱి; ఊర్మిపశువిశసనము = షడూర్ములు అను పశువులను చంపుట; [స్థూలశరీరము నాశ్రయించిన జరామరణములును, సూక్ష్మశరీరము నంటియఁన్న క్షుత్పిపాసలును, కారణశరీరము నాశ్రయించిన శోకమోహములును ఆఱు ఊర్ములు,] [పూర్వటీకలో ఇచట ˈఊర్మిపశువిశసనము = శ్వాసమనెడి పశువును చంపుటనుˈ అని యున్నది. అది తప్పు.] యూపసమితిన్ = యజ్ఞపశువులను కట్టెడి స్తంభములగుంపును; లేఁబగటిన్ = తెల్లవాఱికి
ఎక్కువకాలము కాకమునుపే; నిజావాసమునకున్ = తనయింటికి. '''అలం'''. ఉపమ, రూపకము.
{{Telugu poem|type=క.|lines=<poem>విహితమతిం బరిచారక
సహస్రమయి పితృయుగంబు సంభావించున్
గృహమేధివతంసము నిజ
మహిళామణి యప్రతీపమతిఁ దోడ్పడఁగన్.</poem>|ref=18}}
'''టీక'''. విహితమతిన్ = అనుకూలించుబుద్ధితో; పరిచారకసహస్రమయి = తానొక్కఁడే వేయిమంది సేవకులపెట్టయి; పితృయుగంబు = తలిదండ్రులిద్దఱిని; గృహమేధోవతంసము = గృహస్థులలో ఉత్తముఁడు; నిజమహిళామణి = తనభార్య; అప్రతీపమతిన్ = ఎదురు తిరుగనిబుద్ధితో.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఆపాదమస్తంబు నంటు నూనియ గాచి
స్వయముగా నుద్వర్తనం బొనర్చు
జలకమార్చు నఖంపచస్వచ్ఛజలములఁ
దడియొత్తుఁ గడుమెదుగుడులఁ <ref>క. పొదవి</ref>బొదివి
లఘుధౌతవసనపల్లవములు గట్టించు
శిరసార్చు మృదులీల సురటి విసరి
చేయూఁత యొసఁగి వేంచేయించు లోనికి
ద్వారావతి <ref>ట. గరంచి</ref>గలంతి దానె యొసఁగుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>దెలుపు సంధ్యాసమాధివిధిప్రయుక్తి
నగ్ని వేల్పించు విష్ణుసహస్రనామ
పాఠ మొనరించుతఱిఁ దోడుపడుగురునకుఁ
<ref>క. కవలు</ref>గవలువోకుండఁ బుత్రుఁ డో కలువకంటి.</poem>|ref=19}}
'''టీక'''. ఆపాదమస్తంబు = నఖశిఖపర్యంతము దేహమంతయు; నయముగాన్ = ఒద్దికతో; ఉద్వర్తనం బొనర్చున్ = నలుగు పెట్టును; జలకమార్చున్ = స్నానము చేయించును; నఖంపచస్వచ్ఛజలములన్ = గోరువెచ్చని తేటనీటితో; మెరుగుడులన్ = మెత్తనిగుడ్డలతో; పొదివి = కప్పి; లఘు...పములు = తేలికయై నిగనిగలాడు మడతవస్త్రములు; సురఁటి =వీవన; ద్వారావతి గలంతిన్ = జారీచెంబును; కవలువోకుండన్ = క్రమము తప్పకుండునట్లు; కలువకంటి! = కలువలవంటి కన్నులుగల పార్వతీ!
{{Telugu poem|type=తే.|lines=<poem>చూపు చాలమి వివిధరూపోపకరణ
వితతిఁ దడవాడు జనకునానతి శిరమునఁ
దాల్చి నిద్దంపుబుద్ధిఁ దద్దారకుండు
చక్రహస్తార్చనమున కుపక్రమించు.</poem>|ref=20}}
'''టీక'''. వివిధరూపోపకరణవితతిన్ = పెక్కువిధములగువస్తువులసమూహమును; తడవాడు = తడవుగొను - వెదకు; నిద్దంపుబుద్ధిన్ = ప్రేమతో; తద్దారకుండు = అతనికొడుకు; చక్రహస్తార్చనకున్ = విష్ణుని పూజించుటకు; ఉపక్రమించున్ = ప్రారంభించును.<noinclude><references/></noinclude>
rfaqfteweza2cptvq8ao9kojxvwyt7f
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/113
104
212558
557469
554778
2026-05-28T23:56:34Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557469
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>అభిషేక మొనరించు నాకాశవాహినీ
జననకారణపాదజలరుహునకు
వైచుఁ దో<ref>ట. మాలిక</ref>మాలియ వైజయంతీకాంతి
వలయితవక్షఃకవాటునకును
గౌశేయ మర్పించుఁ గాంచనమయ<ref>క. పట, చ. పటీ</ref>పటీ
పల్లవారుణ<ref>కటీ</ref>కటిబంధురునకుఁ
జందనం బలఁదు నీళేందిరాకుచకుంభ
సంగికుంకుమపంకిలాంగునకును</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>రత్నహారంబు సాతు నిర్యత్న<ref>చ. సిద్ధి</ref>సిద్ధ
కౌస్తుభోదర్చిరభిరామకంధరునకు
ధూపకల్పన మున్నుగా దీప మిచ్చుఁ
దెఱవ! యాతఁడు త్రైలోక్య<ref>ట. దీపమునకు</ref>దీపకునకు.</poem>|ref=21}}
'''టీక'''. ఆకాశ...జలరుహునకున్ = గంగ పుట్టుటకుఁ గారణమగు పాదపద్మములు కలవానికి; తోమాలియ = వనమాల; వైజ...వాటునకును = వైజయంతి యను పూలమాలయొక్క కాంతిచే నావరింపఁబడిన, తలుపువంటి ఱొమ్ము కలవానికి; కౌశేయము = పట్టువస్త్రము; కాంచన...రునకున్ = చిగురువంటి బంగరువస్త్రముచే నెఱ్ఱనైన మొలచే చక్కనగువానికి; అలఁదున్ = పూయును; నీళేందిరా...నకును = నీళాలక్ష్మీదేవులకుచములయందలి గుంకుమ మంటిన దేహము కలవానికి; చాతున్ = సమర్పించును; నిర్యత్న...రునకున్ = అప్రయత్నముగా లభించిన కొస్తుభమణియొక్క కాంతిపుంజముచే ఇంపైన మెడ కలవానికి; మున్నుగాన్ = మొదలు చేసి - అనఁగా - మొదట ధూప మిచ్చి తెఱవ! = పార్వతీ!
{{Telugu poem|type=క.|lines=<poem>నిడుదచిగురనఁటియాకున
నిడి వివిధాన్నములు భూసురేశ్వరుఁ డొసఁగున్
<ref>చ. పిడి</ref>బడి ఘంట మొరయఁజేయుచు
జడనిధితల్పునకుఁ బూర్ణసంకల్పునకున్.</poem>|ref=22}}
'''టీక'''. నిడుదచిగురనఁటియాకున్ = పొడవైన లేఁతయరఁటియాకులో; బడిన్ = వరుసఁగా - వెంబడిని; మొఱవఁ జేయును = వాయించును; జడనిధికల్పనకున్ = సముద్రము పడుకగాఁ గలవానికి - విష్ణునకు.
{{Telugu poem|type=క.|lines=<poem>భూమిసురసూతి సాల
గ్రామశిలావారి కంబుగర్బస్థము ది
వ్యామోదశ్రీతులసీ
కోమలదళసురభితంబు గురునకు నొసఁగున్.</poem>|ref=23}}
'''టీక'''. కంబుగర్భస్థమున్ = శంఖములో పోయఁబడినదానిని; గురునకున్ = తండ్రికి.
{{Telugu poem|type=మ.|lines=<poem>తిరువారాధన మి ట్లొనర్చి ధరణీదేవాన్వయశ్రేష్ఠుఁ డా
హరి కర్పించుటఁ బావనంబు లగు శాల్యన్నంబులు న్నేతులున్
వరుగుల్ <ref>క. చేరులు, ట. చారులు</ref>చారులు పప్పు లప్పడములన్ దాలింపులుం <ref>చ. లాపూపముల్</ref>బూపముల్
పరమాన్నంబులుఁ బెట్టు నెట్టన భుజింపం దల్లికిం దండ్రికిన్.</poem>|ref=24}}
'''టీక'''. తిరువారాధనము = దేవతార్చన; ధరణీ...శ్రేష్ఠుఁడు = ఉత్తమబ్రాహ్మణుఁడు; అర్పించుటన్ = నైవేద్యము పెట్టుటవలన; పావనంబులు = పవిత్రములు; తాలింపులున్ = తాలింపు చేసినకూరలను; పూపముల్ = అప్పములు - పిండివంటలు; నెట్టనన్ = సమృద్ధిగా.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు కడువృద్ధులు శిథిలబుద్ధులు నగు జనయిత్రీజనకులం గని మని నడచుచు నడుగు
లకు మడుగు <ref>చ. లొత్తుచు</ref>లొడ్డుచు నడుగునెడఁ బులిజున్నేనియుం దెచ్చి యిచ్చుచు నిచ్చఁ
గ్రొత్త యగు మచ్చికం గచ్చు వదలక గోము మెఱసి యోమనగాయలంగా
నోముచు గాలో<ref>చ. చితంబులుగా</ref>చితంబులగు నోములు నోమించుచు నద్ధరామరనందనుండు
జగదభినందింతుండై యుండి వెండియు.</poem>|ref=25}}<noinclude><references/></noinclude>
to0trdpa8zrfo728qn57q94tl5v5pk5
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/114
104
212559
557472
554779
2026-05-29T04:50:35Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557472
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. శిథిలబుద్ధులు = బుద్ధిపటుత్వము తగ్గినవారు; మనినడచుచున్ = వసించుచు; అడుగు...లొడ్డుచున్ = ఉత్తనేలపైఁ నడిపింపక - గౌరవముగా; మచ్చికన్ = ప్రేమచేత; కచ్చు వదలక = ప్రీతి విడువక; ఓమనగాయలంగాన్ = ఓమనగుంటలాడు గింజలనుగా - చేతులమీఁదనే తిరుగునట్లుగా; ఓముచున్ = పోషించుచు; ధరామరనందనుండు = బ్రాహ్మణపుత్రుఁడు; జగదభినందితుండై = లోపల మెప్పును పొంది.
{{Telugu poem|type=క.|lines=<poem>పరలోకావాససుఖా
దరపరతం జనిన తల్లిదండ్రుల కొసఁగెన్
గురుభక్తి నిగుడు కొడు కతి
కరుణామతి గంగ నస్థి గయఁ బిండంబున్.</poem>|ref=26}}
'''టీక'''. పరలోకావాససుఖాదరపరతం జనిన = లోకాంతరమున కేఁగిన మరణించిన; ఒసఁగున్ = అర్పించును.
{{Telugu poem|type=క.|lines=<poem>ప్రేయసివలన బ్రబోధవి
ధేయ<ref>చ. నుతుల</ref>మతుల సుతులఁ గాంచి తీర్చెఁ బితౄణం
బాయయ్య తదీయం బగు
ప్రాయపుఁబ్రొద్దంతఁ గొంత పడమర దిరిగెన్.</poem>|ref=27}}
'''టీక'''. ప్రేయసివలనన్ = ధర్మపత్నివలన; ప్రబోధవిధేయమతులన్ = విశేషజ్ఞానము, అడఁకువ కలవారిని; పితౄణము = పితృదేవతలఋణమును; “జీవతోర్వాక్యకరణాత్పుత్రసంపాదనేన చ, గయాయాం పిండదానేన త్రిభిః పుత్రస్య పుత్త్రతా." అను పెద్దలమాటను పుండరీకుఁడు సార్థకపఱచినాఁడని భావము.
{{Telugu poem|type=క.|lines=<poem>భాషావిభునిభుఁ డమ్ముని
<ref>చ. యీషద్దూషణ</ref>యీషణదూషణ మొనర్చి యిలు మఱచి మదిన్
శేషఫణిశయనుఁ గను నభి
లాషోన్నతిఁ జేయుఁ దప మిలాధరతనయా!</poem>|ref=28}}
'''టీక'''. భాషావిభునిభుఁడు = బ్రహ్మతో సమానుఁడు; ఈషణదూషణ మొనర్చి = భార్యాపుత్రులయందును, ధనమున గల వ్యామోహమును విడిచి; ఇలాధరతనయా! = పార్వతీ!
{{Telugu poem|type=సీ.|lines=<poem>మిసిమింతుఁడునుగాక వసియించుఁ గుత్తుక
బంటినీటను బుండువంటి చలిని
మోముదమ్మికిఁ దేఁటిమొత్త మై పొగ పర్వ
వ్రేలుఁ గ్రిందల గాఁగ వృక్షశాఖ
వేరువెల్లఁకి కాయగూర పండని కోర
కుదరాగ్నిగాడ్పుచే నుజ్జగించు
నేచి యీచెవిగాడ్పు నాచెవి <ref>చ. బోయంగ</ref>బోవంగ
నుబ్బి లింగమువోలె నుండు నెండ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నంతరాయాంధకారంబు నలమికొనిన
నడచు నిజధైర్యసూర్యోదయంబుచేత
దానవారి<ref>చ. న గురు చేసి, ట. న గురి చేసి</ref>ని గుఱి చేసి తనకుఁ బోదు
నాకుఁ బోదని నమ్మి సుశ్లోకుఁ డగుచు.</poem>|ref=29}}
'''టీక'''. మిసిమింతుఁడునుగాక = అలసిపోక; పుండువంటి = శరీరమును బాధించునట్టి; క్రిందల గాఁగన్ = తలక్రిందుగ; ఉదరాగ్నిన్ = ఆఁకలిని; గాడ్పుచేన్ = వాయువుచే; ఉజ్జగించున్ = పోఁగొట్టును - అణఁచివేయును; ఏచి = బాధించి; లింగమువోలెన్ = స్థాణువువలె; అంతరాయాంధకారంబులు = విఘ్నము లనెడి చీఁకట్లు; తనకుబోఁదు, నాకుఁబోదు, అని = తపము చేయక తనకుఁ దప్పదు, వర మీయక దేవునికిని తప్పదని; నమ్మి = ఆ విష్ణువునే నమ్మి. [పయిది లోకోక్తి.] సుశ్లోకుఁడు = సత్కీర్తి కలవాఁడు.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఓగజరాజగామిని! మహోగ్రపునోములు నోఁచుచున్న య
య్యోగివరేణ్యునేమమున నుల్లము వెన్నవలెం <ref>శ.ర. గరంగి</ref>గరంగె హృ
ద్రాగసమగ్ర<ref>చ. కోప</ref>గోపవనితాజనతాపరిరంభసంభ్రమో
ద్యోగకళాప్రవర్తికిఁ జతుర్ముఖవంచితధూర్తకీర్తికిన్.</poem>|ref=30}}<noinclude><references/></noinclude>
r8ju20023fn5txuddmeixhbe9s07l0p
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/115
104
212560
557473
554780
2026-05-29T05:58:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557473
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. మహోగ్రపు = మిక్కిలిదుస్సాధ్యములగు; నోములు నోచుచున్న = వ్రతములు చేయుచున్న; సేమమునన్ = నియమమువలన; ఉల్లము = మనస్సు; హృద్రాగ...ప్రవర్తికిన్ = మించినప్రేమతో గోపకన్యకలను= కౌఁగిలించుటలో నేర్పుకలవానికి; చతుర్ముఖవంచితధూర్తకీర్తికిన్ = బ్రహ్మను వంచించినకీర్తి కలవానికి, (ఇట 'వంచితచతుర్ముఖ' అనుటకు మాఱుగా 'చతుర్ముఖవంచిత' అను సమాసము ˈఅహితాగ్నిˈ వంటిది.] వత్సాహరణసమయమున బ్రహ్మను కృష్ణుఁడు వంచించుట ప్రసిద్ధము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>యతిమనోహరదీపకాంకూర మగులీల
గోవర్ధనాచలగుహ మెలఁగుచు
గిరికూటతటరటత్కేకిరాజమురీతి
రాధచన్గవమీఁద వ్రాలి నగుచుఁ
జిత్రాభ్రముల నేలు సుత్రాముకైవడి
బలువన్నెయాలమందల మెలఁపుచు
కమలకాననమధ్యకల<ref>చ. హంసము విభాతి</ref>హంసవిభుభాతిఁ
గూర్మినెచ్చెలిపిండు గొని చెలఁగుచుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>జంద్రబింబంబునకు మృదుస్వనము గఱపు
రచనసంజ్ఞార్హశంఖ మూఁదుచు నొనర్చు
నాఁట లన్నియుఁ జాలించి యరిగెఁ దపసి
పర్ణశాలకు దేవకీతర్ణకంబు.</poem>|ref=31}}
'''టీక'''. యతిమనోగృహదీపకాంకూరము = యతుల మనస్సు లను గృహములందలి దీపకళికలు; గిరి...రీతిన్ = కొండచరియప్రదేశములందు కేకలు వేయు నెమిలిరాజువలె; వ్రాలి = ఒఱఁగి; [ఇట రాధచన్గవ కొండలతోఁ బోల్పఁబడినది.] చిత్రాభ్రముల నేలు = రంగురంగులమేఘములను పాలించు; సుత్రాముకైవడిన్ = ఇంద్రునివలె; కూర్మినెచ్చెలిపిండున్ = తోడిమిత్రులసమూహమును; మృదుస్వనమున్ = మధురధ్వనిని; కఱపురచనన్ = నేర్పురీతిని; సంజ్ఞార్హశంఖము = తత్తత్సంకేతమును బోధచేయు శంఖము; [ఇచట కృష్ణునిముఖము చంద్రబిలమువలె నున్నదనియు, నతఁడు శంఖమును పూరింపఁగా చంద్రబింబమునకు మధురధ్వని యబ్బినట్లున్నదనియు పోలిక.] దేవకీతర్ణకంబు = దేవకీదేవిబిడ్డ - శ్రీకృష్ణుఁడు; '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=చ.|lines=<poem>లలితశిరీషపుష్పమృదులంబులు నీచరణంబు లక్కటా!
యిల యిది రూక్ష మిట్టు లలయించుట <ref>ర. గాదేని</ref>గా దని పార్ధనామృదూ
క్తులు సెలఁగంగ <ref>చ.శ.ర. వేపొదలి</ref>వెన్ పొదివి తొల్చదువుల్ తగువిన్నపంబులం
బలుమఱుఁ జేయుచందమున బంగరుటందియ లుగ్గడింపఁగన్.</poem>|ref=32}}
'''టీక'''. లలిత...లంబులు = చక్కనితిరిసెనపూవువలె మెత్తనివి; నీచరణంబులు = నీపాదములు; ఇల = నేల; రూక్షము = కఠినము; ఇట్టు లలయించుట కాదు = (ఆపాదములను) ఇట్లు కష్టపెట్టుట తగదు; అని; ప్రార్థనామృదూక్తులు = ప్రార్థించు నొప్పిదపుమాటలు; చెలఁగంగన్ = ప్రకాశింపఁగా; వెన్{{ZWNJ}}పొదివి = వెంటనంటి, తొల్చదువుల్ = వేదములు; పలుమఱు = పెక్కుసారులు; ఉగ్గడించఁగన్ = మ్రోఁగఁగా; శ్రీకృష్ణుఁడు పరుగిడి పుండరీకునియొద్దకుఁ బోవునపుడు కాలియందెలు మధురముగ ధ్వని చేయుచుండెను; ఆ చప్పుడు 'కఠినమైన నేలమీఁద మెత్తని నీయడుగు లిడుట న్యాయము కా'దని వేదములు వెంటఁబడి మొఱపెట్టుచున్నట్లున్నదని ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=క.|lines=<poem>మెత్తఁగ నూఱిన<ref>చ. మట్టుం</ref>చుట్టుం
గత్తిన్ మధుకైటభోరుకంఠము లలనాఁ
డొత్తిన హత్తిన చెన్నుం
దిత్తులక్రియఁ దొడలయడ్డతిత్తులు వ్రేలన్.</poem>|ref=33}}
'''టీక'''. మెత్తగ నూఱిన = చక్కఁగా సానఁబట్టిన; చుట్టుంగత్తిన్ = చక్ర మను నాయుధముచే; మధు...ములు = మధుకైటభు లను రాక్షసుల గొప్పకంఠములను; అలనాఁడు = పూర్వము; ఒత్తినన్ = ఖండింవఁగా; హత్తిన = అంటుకొన్న; చెన్నుందిత్తులక్రియన్ = సొగసైన సంచులవలె నున్న; తొడలయడ్డలిత్తులు = తొడలప్రక్కల నున్న గ్రచ్చకాయల సంచులు, [చక్రముచే మధుకైట<noinclude><references/></noinclude>
cs8yquio9j5339fqq67g1mfovur68fy
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/116
104
212561
557479
554781
2026-05-29T09:49:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557479
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>భుల కంఠములను తెగవ్రేయునపుడు ఆభాగములందున్న తిత్తులు చక్రమున కంటుకొని రాగా, వానినే కృష్ణుఁడు గ్రచ్చకాయల సంచులఁగాఁ జేసికొన్నాఁడని వర్ణింపఁబడినది.] అలం. ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>మాయావృతుఁ డగు నాత్ముని
సోయగమునఁ <ref>చ. దెగడి</ref>దెగడి తీఁగసోగల ముచ్చు
ట్టై యునికి సంగరహితం
<ref>చ. బయ్యున్</ref>బయ్యెన్; గాకున్న జఘన మభిరామ మగున్.</poem>|ref=34}}
'''టీక'''. మాయావృతుఁడగు = మాయచే ఆవరింపఁబడిన; సోయగమునన్ = చక్కఁదనముచేత; తెగడి = తిరస్కరించి; ముచ్చుట్టై = మూఁడుచుట్టులు కలదై; ఆత్మ మాయచే ఆవరింపఁబడియుందును; శ్రీకృష్ణునికటిని మాయను బోలిన వసనము ఆవరించియుండలేదు. [అతఁడు దిగంబరుఁడు.] అది ఈకటిని ఆవరింపకుండునట్లు మూఁడుచుట్లుగా తీగ కట్టఁబడియున్నది. కాన మాయావృతాత్మను శ్రీకృష్ణుకటి మీఱియున్నదని వర్ణితము. '''అలం'''. వ్యతిరేకము.
{{Telugu poem|type=క.|lines=<poem>ఇట నభ మిట భూవలయం
బిట బలిసద్మంబు నుండు నిరవు లని యనన్
బటువు లగు వళులచెలువునఁ
బుటపుటనై యున్నచిన్నిబొజ్జ గదలఁ<ref>చ. గాన్</ref>గన్.</poem>|ref=35}}
'''టీక'''. భూవలయంబు = భూగోళము; బలిసద్మంబు = పాతాళము; ఇరవులు = చోటులు; బటువులగు = గుండ్రని; వళులచెలువునన్ = ముడుతల (త్రివళుల) యందముచేత; పుటపుటనై యున్న = వృద్ధిపొందియున్న. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=చ.|lines=<poem>తులసికిఁ బచ్చరాకుదురు తోయదవాహనరత్నవేది య
క్కలిమిమెఱుంగుఁబోఁడికిని గౌస్తుభఘర్మగభస్తికిన్ నభ
<ref>స్థలము</ref>స్తలము ననంగఁ బొల్చి నిరతంబు కృపావిభవంబు <ref>చ. నిట్టిచో</ref>నింటి బో
ర్తలుపుఁ దలంపు సేయుచు నురంబు కరంబు పరిస్ఫురింపఁగన్.</poem>|ref=36}}
'''టీక'''. పచ్చరాకుదురు = పచ్చలు తాచిన కుదురు; తోయదవాహనరత్నవేది = ఇంద్రనీలములతిన్నె: కౌస్తుభఘర్మగభస్తికిన్ = కౌస్తుభ మను వేఁడివెలుంగు (సూర్యు)నట్టి; నభస్తలము = ఆకాశప్రవేశము; పొల్చి = ప్రకాశించి; నిరతంబున్ = ఎల్లపుడును; కృపా...లుపున్ = దయాసంపదయను నింటియొక్క వీథి (పెద్ద)తలుపును; తలంపు సేయుచున్ = సరిపోలుచు; కరంబు = మిక్కిలి; పరిస్ఫురించఁగన్ = ప్రకాశింపఁగా. '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=క.|lines=<poem>కలుష<ref>చ. జగ</ref>ఖగవధవిధానా
కలితఘుటిక లనఁగ గ్రచ్చకాయలు వలచే
నెలకొను నల జిలిబిలి వ
న్నెల వన్నెలసంచి నిండి యిం పలరారన్.</poem>|ref=37}}
'''టీక'''. కలుష...ఘుటికలు = పాపములను పిట్టలను చంపుటకు సంగ్రహించినగుండ్లు; జిలిబిలివన్నెల = ముద్దుముద్దురంగులుగల; వన్నెలసంచి = అందమైనసంచి. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=క.|lines=<poem>లలితనిజ<ref>చ.
ధామ. సూర్య</ref>వామకరతల
కలిత<ref>చ. కరత్కం</ref>కనత్కంబుకాంతి కలకల నవ్వన్
గలువలచెలిగిలిగింతల
నలువగు ఱాలన్ బిసాళినలువగుఱాలన్.</poem>|ref=38}}
'''టీక'''. లలిత...కాంతి = అందమైన తనయెడమచేతియందుండి ప్రకాశించు శంఖముయొక్క కాంతి; కలువల...ఱాలన్ = చంద్రకాంతిప్రసారమున ఒప్పిదములగు చంద్రకాంతములను; పిసాళినలువగుఱాలన్ = ప్రకాశించునట్టి హంసలను; కలకల నవ్వన్ = తిరస్కరింపఁగా. '''అలం'''. ఉపమ, యమకము.
{{Telugu poem|type=క.|lines=<poem>నిజధైర్యౌచార్యములను
గజములకుం బొడము నిడుదకరములుఁ బోలెన్</poem>|ref=}}<noinclude><references/></noinclude>
tb0y3nctgsbp9lnk8romaq6cf8ff3ef
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/43
104
213492
557436
557206
2026-05-28T13:16:48Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557436
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
వివిధ రసము లిట్టు లనుభవించి నీర
సించి యింక నాపైన దర్శింపనోప
కొక్కపరి మహా వేశము నొందినట్లు
నిక్కిముక్కు తిమ్మనగారి చక్కి కరిగె"
</poem>
ఇలాంటి పరమ పచ్చి శృంగార చేష్టను విశ్వామిత్రుడు చూడలేకపోతాడు. పట్టరాని కోపంతో వుంటాడు. విశ్వామిత్రుని కోపం శాపంగా పరిణమించక మునుపే, తిమ్మన తీయని కంఠంతో గాధేయుని ముందు ప్రాధేయపడి ఇలా పలుకుతాడు.
<poem>
{{left margin|5em}}
"ఓ మేనా మధురాంతరంగ రస రాజ్యోద్దామ గామీ! ముని
స్వామీ! నేనొక లాతివాడనటె | యుష్మద్గోత్రసంజాతుడన్
మా ముత్తాతలు తాము నేర్పినవి గదా మాకీ రసజ్ఞత్వముల్
ఈ మేనంబడి యిట్టు లచ్చినవి మౌనీ। నన్ను మన్నింపుమా! "
</poem>
ఇన్నాళ్ళు మేనకను ఏలితిరి. ఇక మీ మనుమలమైన మాకిచ్చి విశ్వామిత్రులు "విశ్వమిత్రులు" అగుదురుగాక! మీ రసజ్ఞత ఎలాంటిదో కాని మేనక మిమ్ములను తలవని గడియలేదు నమ్మండి. ఒడలు నా యొడిలో వున్నను, ఎడద మీకు ముడుపుగట్టింది, పారిజాతం పై ఓట్టు. మీ వలె నేను మేనక కంటికి కన్పించాలని అప్పుడు అనుకున్నాను. ఇలా అనే సరికి విశ్వామిత్రుడు పొంగిపోయాడు. మేనకను బుజ్జగిస్తాడు.
<poem>
{{left margin|5em}}
“ఓ లలితేంద్ర నీల శకలోపమకైశిక ! మేనకా! స్పృహ
జ్జాల మహేంద్ర జాలమున జాగిలి దక్షిణ నాయికా యశో
జాల జగత్ప్ర్పలుబ్ధవయి సాగకు మింక రసప్రసిద్ధినా
గ్పాలకు గుండెలోన గుడి కట్టిన యీతని నమ్మియుండుమా"
</poem>
అని ప్రభోదించి పారిజాత ప్రమానాన్ని వరంగా ప్రసాదించి, హర్షంతో విశ్వామిత్రుడు వెళతాడు. ఈ జంట ఆనందంలో వుంటారు.
తిమ్మన, మేనకతో కలిసేటప్పుడు మునికొరకే చూశాడట. కాబట్టి తాను మేనక కంటికి ఋషివలె కన్పించాలని వరం కోరుకున్నాడట. ఆమాటలకు ఋషి పరవశించి పోయాడు. ఈ మువ్వురి మధ్య నారదుని మాటలు కల్పించి, జోగారావుగారు అద్భుతమైన శృంగారరసాన్ని చక్కగా పోషించారు.<noinclude><references/>
{{c|28}}</noinclude>
dmei6tbl51nxha7z7nb9res159koa2x
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/44
104
213493
557437
557207
2026-05-28T13:32:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557437
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>'''6. మోక్షగామి :'''
"మోక్ష గామి"లో ధూర్జటి, శ్రీనాథుని వలె, సర్వభోగాల్ని అనుభవించి ఆనందాన్ని పొందినట్లు ఇందులో వర్ణించారు రావుగారు. "ప్రేమాభిమానం"లో శ్రీనాథుడు ఒక్క ఊర్వశితో మాత్రమే శృంగారం నడుపుతాడు. "మోక్షగామి"లో ధూర్జటి అనేక అప్సరసలతో శృంగారంచేస్తాడు. ధూర్జటి వ్రత సిద్ధాంతమే అది. అ
నియమానికి ఆవ్రతానికి శుక్రుడు హడలిపోతాడు. దేవ వనితలను వున్నవారు వున్నట్లుగా ధూర్జటి వద్దకు పంపుతాడు. అతనిది చిత్ర విచిత్రమైన వ్రతం. అదే మన్మథ వేదదీక్ష. ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ధూర్జటితో కలిసి వుండాలి.
<poem>
{{left margin|5em}}
ప్రౌఢ తిలోత్తమా గాఢ పరిష్వంగ
మూర్ణనాభము గూటి యొరిమదనర
ఉద్దీప్త కోపన యూర్వశి జడవ్రేటు
కాలాహి పూత్కారలీల గ్రాల
రంభోరు సంబంధ గుంభిత రతికేళి
గజతుండ బంధన గరిమ బరగ
మేనక యల్క బమ్మిన వాడి చూపులు
తిన్నని యమ్ముల తెగువ నెసగ
అప్సరశ్శత కోపగూహనము బడుల
నతడు నేర్చిన మన్మథాంకిత రతిప్ర
బంధములని బ్రహ్మానంద బంధురోప
మాయత పరమానంద సంధాయకములు”
</poem>
దీనితో ధూర్జటికి రాత్రులన్నీ, శివ రాత్రులు అవుతాయి. కంటికి కునుకు వుండదు. అది ఒక రతి వినోద శాంభవ సమారాధనం. అప్సరసలతో శివమెత్తి ఆడుతాడు ధూర్జటి. దానితో కవి అర్ధ నారీశ్వరుడు అవుతాడు. ధూర్జటి రూపు సత్కవీంద్ర శివ లింగమని జోగారావు గారు వర్ణిస్తారు.
<poem>
{{left margin|5em}}
"కాంతా శ్లేషము పానవవట్ట మభిషేకంబుల్ ప్రమోదాశ్రువుల్
దంతాళి ప్రభ లిద్దదీపములు మధ్యదూప ముచ్ఛ్వాసమే
కాంతాలాపము స్తోత్రపాఠము నమస్కారంబు నైవేద్యమున్
</poem><noinclude><references/>
{{c|29}}</noinclude>
posa38nl8kaue8gcxob8cy0z4yshr46
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/45
104
213494
557438
557208
2026-05-28T13:43:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557438
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
కంతు క్రీడగ సత్కవీంద శివలింగం బొప్పెనప్పట్టునన్".
</poem>
అని చెప్పడం వల్ల శృంగార వర్ణనా విలక్షణ వైశారద్యానికి పెట్టిని కోట అయింది.
'''7. కామధేనువు :'''
“కామదేనువు”లో తెనాలి రామకృష్ణుడు దేవతల రాజధానిలో తిరుగుతుంటాడు. దారిలో ఒక శిరోజం దొరుకుతుంది. దాని దైర్ఘ్యం, నైగనిగ్యం, వంపు సొంపు, చూస్తాడు. ఆ శిరోజం ఏ సరోజముఖిదో అని అనుకుంటాడు. అంతే కాదు అ సౌందర్యరాశినే పొందాలని అనుకుంటాడు. నిరంతరం ఆ పని మీద
వుంటాడు. చివరకు ముద్దుపళని కన్పిస్తుంది. తనకు దొరికన శిరోజం ముద్దుపళనిది అని గ్రహిస్తాడు. ఆమెకూడా రామకృష్ణుని గుర్తించింది. వెంటనే “వర సారస్వత భద్ర! సుందర శృంగార సుధాసముద్ర" అని సంబోధిస్తుంది.
<poem>
{{left margin|5em}}
“నా కవనమ్మునందు మదనప్రతిమున్ గనుగొంటి కృష్ణునిన్
నాక వనమ్ము నందు మదన ప్రతిమున్ గనుగొంటి నిన్ను నా
హ! కవనమ్ము జీవనము నయ్యెడ నియ్యెడ ధన్యమయ్యె మా
న్యా! కవి రామకృష్ణ! మణినన్ను భవత్ప్రియగాదలంపుమా"
</poem>
అని ముద్దుపళని ప్రార్ధిస్తుంది. స్వర్గానికి వచ్చినా, మానవ కాంతే ఏనా? పండగనాడు కూడా పాతమొగుడేనా అన్నట్లు అని చాలా బాధపడతాడు. దూరం దూరంగా వుంటాడు వికటకవి. అప్సరసలను పొందాలనుకుంటాడు. అతని కోరిక నెరవేరదు. అతని శృంగార వాంఛకు శృంగ భంగం జరుగుతుంది. వికవికనవ్వి చకచక సాగిపోతాడు. కవి చేష్టలకు పళని బాధపడుతుంది. ప్రణయం ప్రళయంగా మారుతుంది. తెనాలి రామకృష్ణకవిపై ముద్దు పళని అభాండం వేస్తుంది. ఏది ఏమైన
అప్సరసను పొందాలి అని అనుకున్న కవి కోరికనెరవేరలేదు. చివరకు కవి మనసు, పళనినే కోరుతుంది. అయితే పళని దగ్గరకు వెళ్లడానికి మొగం చెల్లదు. తన ప్రియశిష్యుడు నిగమశర్మను పిలిచి దౌత్యం నెరపమంటాడు.
<poem>
{{left margin|5em}}
"కనులతోడ వానిని గౌగలించి
చేతి తోడన వానిని సేమ మడిగి
మనసుతో వానికెల్ల మర్మముదెలిసి
</poem><noinclude><references/>
{{c|30}}</noinclude>
bnpz32cw5lh1zh3d4ny6r5di8exy9oz
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/46
104
213495
557441
557209
2026-05-28T13:53:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557441
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
పంపె దూతగ కవిరాజు పళని కడకు"
</poem>
నిగమశర్మ దౌత్యం విజయవంతమవుతుంది. పళని, రామకృష్ణుని రమ్మంటుంది. రామకృష్ణుడు గుండె గుప్పిట పట్టుకొని, గుట్టు చప్పుడు కాకుండా ముద్దుపళని భవనంలోనికి దూకుతాడు.
<poem>
{{left margin|5em}}
“దాసరి తప్పు లెల్లనొక దండముతోసరి, రాధికా సమా
శ్వాస మొనర్చె నీదయిన స్వామి, భవత్పరిచారకుండనీ
కోసము నిప్పులో దుముక గోరిన దూకెద నూఱడిల్లుమా
సాసల వచ్చినాడ మధురాశయ వాసిత హృత్కు కేశయా!"
</poem>
అని చేతులు జోడిస్తాడు. కవయిత్రి కనికరిస్తుంది. కథమంచి రసపట్టులో నడుస్తుంది. కవిపై పగ తీర్చుకోవాలన్న పళనికి చివరకు యింపైన పొందు లభిస్తుంది. ఇద్దరూ శృంగారాన్ని అనుభవిస్తూ తన్మయత్వం చెందుతారు.
రాజీపడి ఇద్దరూ కలిసినప్పుడు మతానికీ, శృంగారానికీ చమత్కార చారువుగా ముడిపెట్టడం జరిగింది.
<poem>
{{left margin|5em}}
అందుకు ఈక్రింది పద్యం మంచి ఉదాహరణ :
“నడు మంతరంపు వైష్ణవ నామముల భంగి
విషమాస్త్ర కేళికా విభ్రమములు
పూర్వవాసన వీడిపోని విధమ్మున
పరిరంభ వీరశైవమ్ము పట్టు
పవలు శైవము రేల వైష్ణవం బను భంగి
బంధ నిర్బంధమ్ము పట్టు వడుపు
హాస్య శృంగార సౌహార్ద సంగతి భంగి
నఖర దంతక్షత వైపుణంబు
హస్య చతురాస్యుడైన మహాకవీంద్రు
డంచె లంచెలుగా బ్రదర్శించు నపుడు
విరహ వీర శైవమ్మును వీడు కలిపి
సురతవైష్ణవ శృంగార శూరుడయ్యె"
</poem><noinclude><references/>
{{c|31}}</noinclude>
dai1xt99wnyovonlow9asid409k2y6i
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/47
104
213496
557442
557210
2026-05-28T14:05:19Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557442
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>'''8. కాముని పున్నమ :'''
"కాముని పున్నమ"లో తిలోత్తమ జగన్నాథ పండితుడు, రామరాజ భూషణుడుతో పొందిన శృంగారం వర్ణించబడింది. ఆ నాడు కామునిపున్నము. అనగా ఆమని పున్నమ
<poem>
{{left margin|5em}}
తిలోత్తమ చెలికత్తె ఇలా స్వాగతం పలుకుతుంది. -
“స్వాగతమో మనోజ కమలాసన మానసపుత్రులార! నే
డీ గృహమందు గొల్చును రతీశ్వరు మాదొరసాని, అమ్మహా
భాగుని గూర్చి భవ్య రసభావ చమత్కుృతి మత్కవిత్వమున్
భోగపురందరుల్ కవులు పూని వచింపరెయాశుధారలన్"
</poem>
కవిత్వం చెప్పిన వారిలో ఎవరి కవిత రసవంతంగా వుంటుందో, ఆ మహాకవిని మా దొరసాని మరుసటి మదన పున్నమ వరకు, ఇల్లరికపు వల్లభునిగా స్వీకరిస్తుంది అని చెలికత్తె అంటుంది.
పోటీ నచ్చక కొందరు పూనుకోరు. ప్రతిభలేక కొందరు సాహసించరు. రామరాజ భూషణుడు లేచి తన సహజ మధుర ధోరణిలో ఆశువుగా అద్భుతంగా తిలోత్తమపై పద్యాలు చెబుతాడు. ఆమె ఆనందానికి అవధులు వుండవు. తీయని చిరునవ్వుతో ఒయ్యారంగా చూచి, కవికి వలపుల తాంబూలం ఇప్పించింది. అంతలోనే జగన్నాధ పండిత రాయలు లేచి, ఎంతసాహనం ఇప్పుడు చదివిన పద్యాలు అన్నీ, ఇతని
సొంతం కావు. సోమన "వసంత విలాసం"లోనివి అని అంటాడు. ఆ పద్యాలన్నీ తాను మరల గడగడ విన్పిస్తాడు. అక్కడవారందరూ ఆశ్చర్యచకితులవుతారు. పాపం రామరాజ భూషణుడు బాధపడతాడు.
తిలోత్తమ బిత్తరపోయి పండిత రాయలను కడగంటి చూపుతో ఆహ్వానించి, శయనమందిరంలోకి చకచక సాగిపోతుంది. జగన్నాథుడు రసజగన్నాథుడువుతాడు.
ఇద్దరి శృంగార రసక్రీడను అద్భుతంగా వర్ణించారు రావుగారు. ఇక్కడ శృంగార భావుకతకు శాస్త్ర వైదుష్యం అడుగులకు మడుగులొగ్గింది.
<poem>
{{left margin|5em}}
"పడకింటి కేగునప్పుడు ప్రౌఢ పండిత
శ్లాఘ్య మలంకార శాస్త్ర మామె
పాన్పుపై నున్నపుడు వరమానుభవపుర
</poem><noinclude><references/>
{{c|32}}</noinclude>
n86a5svw2o4yd38mi0k4qkslo9nh8ma
557443
557442
2026-05-28T14:05:49Z
శ్రీరామమూర్తి
1517
557443
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>'''8. కాముని పున్నమ :'''
"కాముని పున్నమ"లో తిలోత్తమ జగన్నాథ పండితుడు, రామరాజ భూషణుడుతో పొందిన శృంగారం వర్ణించబడింది. ఆ నాడు కామునిపున్నము. అనగా ఆమని పున్నమ
<poem>
{{left margin|5em}}
తిలోత్తమ చెలికత్తె ఇలా స్వాగతం పలుకుతుంది. -
“స్వాగతమో మనోజ కమలాసన మానసపుత్రులార! నే
డీ గృహమందు గొల్చును రతీశ్వరు మాదొరసాని, అమ్మహా
భాగుని గూర్చి భవ్య రసభావ చమత్కుృతి మత్కవిత్వమున్
భోగపురందరుల్ కవులు పూని వచింపరెయాశుధారలన్"
</poem>
కవిత్వం చెప్పిన వారిలో ఎవరి కవిత రసవంతంగా వుంటుందో, ఆ మహాకవిని మా దొరసాని మరుసటి మదన పున్నమ వరకు, ఇల్లరికపు వల్లభునిగా స్వీకరిస్తుంది అని చెలికత్తె అంటుంది.
పోటీ నచ్చక కొందరు పూనుకోరు. ప్రతిభలేక కొందరు సాహసించరు. రామరాజ భూషణుడు లేచి తన సహజ మధుర ధోరణిలో ఆశువుగా అద్భుతంగా తిలోత్తమపై పద్యాలు చెబుతాడు. ఆమె ఆనందానికి అవధులు వుండవు. తీయని చిరునవ్వుతో ఒయ్యారంగా చూచి, కవికి వలపుల తాంబూలం ఇప్పించింది. అంతలోనే జగన్నాధ పండిత రాయలు లేచి, ఎంతసాహనం ఇప్పుడు చదివిన పద్యాలు అన్నీ, ఇతని
సొంతం కావు. సోమన "వసంత విలాసం"లోనివి అని అంటాడు. ఆ పద్యాలన్నీ తాను మరల గడగడ విన్పిస్తాడు. అక్కడవారందరూ ఆశ్చర్యచకితులవుతారు. పాపం రామరాజ భూషణుడు బాధపడతాడు.
తిలోత్తమ బిత్తరపోయి పండిత రాయలను కడగంటి చూపుతో ఆహ్వానించి, శయనమందిరంలోకి చకచక సాగిపోతుంది. జగన్నాథుడు రసజగన్నాథుడువుతాడు.
ఇద్దరి శృంగార రసక్రీడను అద్భుతంగా వర్ణించారు రావుగారు. ఇక్కడ శృంగార భావుకతకు శాస్త్ర వైదుష్యం అడుగులకు మడుగులొగ్గింది.
<poem>
{{left margin|5em}}
"పడకింటి కేగునప్పుడు ప్రౌఢ పండిత
శ్లాఘ్య మలంకార శాస్త్ర మామె
పాన్పుపై నున్నపుడు వరమానుభవపుర
</poem><noinclude><references/>
{{c|32}}</noinclude>
81kawunwbn3cmlpcay8qrpthamz9mq4
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/48
104
213497
557448
557211
2026-05-28T16:26:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557448
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
స్కార పూతము స్మర శాస్త్రమామె
నిదురలో నున్నపుడు మదన బుధోత్తమ
సదుపజ్ఞ మగు స్వప్నశాస్త్ర మామె
రతికేళికా మందిరము వెడలు నపుడు
నవ్యాఖ్యమగు శబ్ద శాస్త్రమామె.
అతివ కౌగిళ్లు కబ్బములైన నాపె
చూపుననుడీక చిఱునవ్వు చొప్పుననుతి
సలుపు, శైలివలె నొకప్డు జాఱిపోవు
కావ్యమున ధ్వని వంటిది కాంత సిగ్గు"
</poem>
కొంతకాలం గడుస్తుంది. గిరీశం తిలోత్తమను కలుస్తాడు. జగన్నాథ పండితుని గుట్టు రట్టు చేస్తాడు. రామరాజ భూషణుడు చెప్పిన కవిత, ఆశువే అని అంటాడు. అంతేకాదు. సోమన “వసంత విలాసం" గ్రంథం అసలు రాయలేదని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు గిరీశం. అప్పుడు గిరీశం -
<poem>
{{left margin|5em}}
"అతని విడుచుట నీకు శ్రేయస్కరంబు
సంస్కృతాంధ్రంబులను చెప్పజాల గాని
ఆంగ్ల కవితలో షేక్స్పియరంతవాడ
తరుణి! నన్ను బొందుటుభయతారకంబు"
</poem>
అని ఆశపెడతాడు. విషయ మంతా తిలోత్తమ తెలుసుకుంటుంది. గిరీశంకి నానా చీవాట్లు పెడుతుంది. ఈ అభియోగాన్ని నారదుని ద్వారా, ఇంద్రునివరకు తీసుకొని వెళతాడు. అన్ని విషయాలను ఇంద్రుడు గ్రహిస్తాడు. ఇంద్రుడు, జగన్నాథుని ప్రతిభకు సంతోషిస్తాడు. భట్టుమూర్తికి జరిగిన అన్యాయానికి ఓదార్చుతాడు. అంతేకాక ఆశువుగా చెప్పిన ఆరు పద్యాలకు ఆరు "కాముని పున్నమలు" మరియు తిలోత్తమతో సుఖం పొందమని నేర్పుగా తీర్పు చెప్పుతాడు. అసలు విషయం ఏమంటే భట్టుమూర్తి భోగానికి ఎలాంటి లోటు రానివ్వలేదు కవి. జోగారావుగారి అద్భుతమైన కల్పన ఇది.
తిలోత్తమ, రామరాజ భూషణుని శృంగారాన్ని, వున్నదానికి రెండింతలు చేసి వర్ణించారు రావుగారు.<noinclude><references/>
{{c|33}}</noinclude>
9wy02wkyd98vmckrxe3jj7c6epovrmn
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/49
104
213498
557450
557212
2026-05-28T16:39:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557450
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
“నిర్జ ధీవుడై నిలువెల్ల గనులౌచు
దివ్య భూమిని రూపు దిష్టి పెట్టు
తారకాధీశుడై తనువెల్ల జలవయై
పూబోడి మదనాగ్ని బొనుటు వఱచు
పుల్ల పుష్పాస్త్రుడై యుల్ల ముత్ఫలమై
తరుణికి మనసిచ్చి తనువు గొనును
మలయ మరుత్తుడై మనసెల్ల మల్లెలై
నానా శలందు గంధములు నించు
రామకును రాజ భూషణమై మెలంగు
నతని భోగము కొంత జాగైన నేమి
యద్దివెను దివిచిన వింటి యమ్ము బోలె
పట్టియడచిన రబ్బరు బంతిబోలె"
</poem>
అని కవి ఆమెతో పొందిన వివిధ అనుభవాలను ఆమె పడకింటనెత్తిన పలు అవతారాలను, శృంగార సురుచిరంగా చిత్రీకరించాడు.
'''9. ఉద్యోగ విజయం'''
“ఉద్యోగ విజయం"లో ప్రముఖ జంటకవులు తిరుపతి వేంకటకవులు మంజుఘోష, పుంజికస్థలలతో సాగించిన శృంగారం వర్ణించబడింది.
<poem>
{{left margin|5em}}
“తిరుపతి సోమముంగురుల సవరింప
వెంకన్న కొప్పులో విరుల దుఱుము
............................
ఆ కవిబ్రహ్మల సముజ్జ్వ లాను భవపు
టూపిరిని బోసికొని కాంత రూపుగొన్న
నవ్య శృంగార కావ్యం బనంగ నొప్పె
మదన కార్ముక జ్యాఘోష మంజుఘోష".
ఈ విధంగా వారికి అచ్చట సుప్రభాతాలు లేనే లేవట.
“ఆమె చూపుల సమస్యల నెల్ల పూరించి
నానాంగనానవ్యవర్ణన మొనర్చి
</poem><noinclude><references/>
{{c|34}}</noinclude>
h2pu5m3kcqhfuzpo6sin3gjul07zsbe
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/50
104
213499
557454
557213
2026-05-28T16:49:54Z
శ్రీరామమూర్తి
1517
557454
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
...............................
ఉభయ కవి మిత్రయగు లేమ యొడలి చవికె
జంటకవులొనరించు నష్టావధన
ములను దిలకించి పులకించి పోవుచుండె
చారు తరకీర్తి రతికటి చక్రవర్తి"
</poem>
అత్యద్భుత శృంగారంతో బహుచమత్కారంతో సాగుతుంది ఈకథ.
'''10. కృష్ణార్పణం :'''
“కృష్ణార్పణం”లో క్షేత్రయ్య, జయదేవులు, ఘృతాచి శృంగారం ఇందులో వర్ణించబడింది.
<poem>
{{left margin|5em}}
“వాని మనోజ్ఞ రూపము శ్రవః ప్రియగానము నక్ష రాక్షరా
దీన మనోజమానమగు దివ్య కవిత్వము గాంచి సౌఖ్యసం
ధానవనాకవైచికి ఘృతాచికి గుండె కరింగి వెన్నయై
వాని యొనర్చు పూజకు నివాళుల నెత్తగ జేరవచ్చెడిన్"
</poem>
క్షేత్రయ్య కృష్ణభక్తుడు. రసికుడు కూడా. క్షేత్రయ్య భక్తికి మెచ్చి చంద్రుడు పరిమళించు వెన్నెలలు వెదజల్లుతాడు. ఘృతాచి క్షేత్రయ్య పూజకు నివాళులు అర్పిస్తుంది. ఆమె ఏదో నెపంతో కౌగిలించుకొన్నప్పుడు, చెక్కున చెక్కు చేర్చేటప్పుడు, ఒడిలో నిడికొని పాదాలు ఒత్తు చున్నప్పుడు, క్షేత్రయ్య సర్వం “కృష్ణార్పణం" గా భావిస్తాడు. ఆమె తన ఊరువులు, కటి ప్రదేశం, వక్షోజాలు పావడ జార్చి, పైట జార్చి, ప్రదర్శించేటప్పుడు, క్షేత్రయ్యకు తన స్వామి నైన గదా, చక్రపద్మాలు దర్శించినట్లే వుంటుంది. క్షేత్రయ్య ఆవేశంతో ఆమెను ఆలింగనం చేస్తాడు. అప్పుడు నందనవనం బృందావన మవుతుంది. ఘృతాచికి కృష్ణ భక్తుడైన క్షేత్రయ్య కృష్ణుడుగా గోచరిస్తాడు.
ఒకరోజు క్షేత్రయ్య కౌగిలిలో మైమరిచివున్న ఘృతాచికి ప్రాతఃకాల మలయ మారుతాలు మోసికొనివచ్చిన ప్రణయ సందేశం వలె, ఒకానొక అద్భుత మధుర సంగీతం విన్పిస్తుంది. అప్పుడు -
<poem>
{{left margin|5em}}
"దిగ్గురనలేచి మలయూచి దెసలు చూచి
యెదను జేవైచి పయన మయ్యెను ఘృతాచి
</poem><noinclude><references/>
{{c|35}}</noinclude>
arzpq81qpovro4u4euwz0nvsbyf14rm
557455
557454
2026-05-28T16:50:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557455
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
...............................
ఉభయ కవి మిత్రయగు లేమ యొడలి చవికె
జంటకవులొనరించు నష్టావధన
ములను దిలకించి పులకించి పోవుచుండె
చారు తరకీర్తి రతికటి చక్రవర్తి"
</poem>
అత్యద్భుత శృంగారంతో బహుచమత్కారంతో సాగుతుంది ఈకథ.
'''10. కృష్ణార్పణం :'''
“కృష్ణార్పణం”లో క్షేత్రయ్య, జయదేవులు, ఘృతాచి శృంగారం ఇందులో వర్ణించబడింది.
<poem>
{{left margin|5em}}
“వాని మనోజ్ఞ రూపము శ్రవః ప్రియగానము నక్ష రాక్షరా
దీన మనోజమానమగు దివ్య కవిత్వము గాంచి సౌఖ్యసం
ధానవనాకవైచికి ఘృతాచికి గుండె కరింగి వెన్నయై
వాని యొనర్చు పూజకు నివాళుల నెత్తగ జేరవచ్చెడిన్"
</poem>
క్షేత్రయ్య కృష్ణభక్తుడు. రసికుడు కూడా. క్షేత్రయ్య భక్తికి మెచ్చి చంద్రుడు పరిమళించు వెన్నెలలు వెదజల్లుతాడు. ఘృతాచి క్షేత్రయ్య పూజకు నివాళులు అర్పిస్తుంది. ఆమె ఏదో నెపంతో కౌగిలించుకొన్నప్పుడు, చెక్కున చెక్కు చేర్చేటప్పుడు, ఒడిలో నిడికొని పాదాలు ఒత్తు చున్నప్పుడు, క్షేత్రయ్య సర్వం “కృష్ణార్పణం" గా భావిస్తాడు. ఆమె తన ఊరువులు, కటి ప్రదేశం, వక్షోజాలు పావడ జార్చి, పైట జార్చి, ప్రదర్శించేటప్పుడు, క్షేత్రయ్యకు తన స్వామి నైన గదా, చక్రపద్మాలు దర్శించినట్లే వుంటుంది. క్షేత్రయ్య ఆవేశంతో ఆమెను ఆలింగనం చేస్తాడు. అప్పుడు నందనవనం బృందావన మవుతుంది. ఘృతాచికి కృష్ణ భక్తుడైన క్షేత్రయ్య కృష్ణుడుగా గోచరిస్తాడు.
ఒకరోజు క్షేత్రయ్య కౌగిలిలో మైమరిచివున్న ఘృతాచికి ప్రాతఃకాల మలయ మారుతాలు మోసికొనివచ్చిన ప్రణయ సందేశం వలె, ఒకానొక అద్భుత మధుర సంగీతం విన్పిస్తుంది. అప్పుడు -
<poem>
{{left margin|5em}}
"దిగ్గురనలేచి మలయూచి దెసలు చూచి
యెదను జేవైచి పయన మయ్యెను ఘృతాచి
</poem><noinclude><references/>
{{c|35}}</noinclude>
q4etgfu5yu3ush16mm8d32y4780jbv4
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/51
104
213500
557460
557214
2026-05-28T17:01:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557460
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
మనసు కంటెను మదను కంటెను బిరాన
వేణు గానాధ్వనీన గోపిక విధాన”
</poem>
ఆమెకు అల్లంతదూరంలో హరిమందిరం కన్పిస్తుంది. అందులో వాసుదేవ సంకీర్తనం చేస్తున్న జయదేవుడు కనపడతాడు. అష్టపదులు గాన మొనర్చుచున్న మహాకవి చేతిలో వేణువు, శిరంలో పింఛం, ఉదరంలో కౌస్తుభం, అతడు రెండో కృష్ణునివలె, ఆమెకు కన్పిస్తాడు. ఆమె ఆయనను గట్టిగా కౌగిలించుకుంటుంది.
కృష్ణభక్తుడైన జయదేవునకు ఘృతాచి గోపికగా గోచరిస్తుంది.
ఇలా హరిభక్తులు ఇద్దరూ శృంగారంలో మునిగిపోతారు. హరిని విస్మరిస్తారు. వారికి గుణపాఠం చెప్పాలని కృష్ణుడు కావాలని ఘృతాచిని అదృశ్యం చేస్తాడు. భక్తులిద్దరూ వియోగంతో తహతహలాడుతారు. వారి బాధ వర్ణనాతీతం. “మా ఘృతాచిని మాకిమ్ము లేదా మా ప్రాణాలు గైకొమ్ము" అని కృష్ణుని వేడుకుంటారు. అంతేకాదు, అనేక విధాల బ్రతిమాలుతారు కూడా. తమ బాధను చెప్పుకుంటారు. స్వామి కరుణిస్తాడు. ఈలోపు ఘృతాచి కన్పిస్తుంది. ఉభయలు ఆమెను గాఢంగా కౌగలించుకొంటారు.
<poem>
{{left margin|5em}}
"కలకల నవ్వుచున్న హరి కౌగిట నూగిసలాడు వారికిన్
గలగలలాడె చేతులను గాజు, లురమ్ములనుబ్బె గబ్బిగు
బ్బలు, బలు సిబ్బితుల్ వొడమె, పట్టు సడల్చుకొనన్ బెనంగువా
రల హరి యక్కునం బొదివె రాధిక నేలిన రాసలీలలన్"
</poem>
మధురభక్తి మణిదర్పణం జోగారావు గారి “కృష్ణార్పణం".
'''11. వైజయంతి :'''
"వైజయంతి” చివరి ప్రకరణం. ఒక రోజు "వైజయంతి" మహా ప్రాసాదంలో మహేంద్రుడు, తెలుగు కవులతో “పది పదారు దినములలో మదన మహోత్సవము రాబోవుచున్నది ఆ పర్వమునాడు వేలుపు సానులలో మేలుబంతియైన యింతికి “స్మరవైజయంతి" బిరుదుతో సన్మానము సలుపవలెనని మా సంకల్పము. నిపుణులు నిర్ణయించి నివేదింపుడు" అని అంటాడు.
కవులందరూ తమకుతోచిన, నచ్చిన సానుల పేర్లును చెపుతారు. తెలుగురాయడు రంభ పేరు ప్రకటిస్తాడు. ముక్కు తిమ్మన మేనక పేరును<noinclude><references/>
{{c|36}}</noinclude>
qxifm7l7iftaaqis4prmtepwsn45e1a
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/52
104
213501
557464
557215
2026-05-28T21:09:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557464
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సూచిస్తాడు. శ్రీనాథుడు చిరునవ్వుతో “ఊర్వశి కన్న మిన్న ఎవ్వరున్నా”రని అంటాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్పడం వల్ల చివరకు "బుద్ధి మంతుల సంఘం” ఏర్పడుతుంది. ఈ సంఘానికి పింగళి సూరన అధ్యక్షులు. చేమకూర, శేషము, వెలిదండ్ల వెంకటకవులు సభ్యులు. అన్ని విషయాలను వీక్షించి, సమీక్షించి, పరీక్షించి, చివరకు ఊర్వశీ రమణియే “సర్వాప్సరశ్శిరోమణి" అని నిర్ధారిస్తుంది కమిటి.
మదనోత్సవ మహాసభ ఆరంభమవుతుంది. సూరన సభాముఖమున, స్వాభిప్రాయాలను వెల్లడిస్తాడు.
ఇంద్రుడు ఊర్వశిని వేదిక మీదికి ఆహ్వానిస్తాడు.
<poem>
{{left margin|5em}}
“నడిచిన యంతమేర చరణ చ్ఛవులన్ ననలెత్త మేల్ముసుం
గడలగ మేను దివ్యసభ కెత్తిన దీపము నాగవెల్గన
ల్గడలను జిమ్మ చిర్నగవులం గడకన్నుల సోగచూపులం
బడి సభదైన మేను గఱుపారగ నచ్చర నిల్చెనచ్చటన్”
</poem>
ఊర్వశికి బిరుదు పత్రాన్ని సమర్పించారు. మన్మధపూజ నిర్వహించారు. సుకవులు అందరూ సుమప్రసాదాలు పంచారు. మన్మధ స్వామి సభలో సాక్షాత్కరిస్తాడు. ఊర్వశి శిరస్సుపై పుష్పకిరీటం అలంకరిస్తాడు. సభ్యులు కరతాళ ధ్వనులు గావిస్తారు. అంతలో ఊర్వశి మదనులు అంతర్ధానమౌతారు.
సూరన, నిగమశర్మ, గిరీశంను పిలిచి మీరు శ్రీనాథాది మహాకవుల కావ్యాల్లో పాత్రలు అయినందువల్ల ఏదో రకంగా ఈ స్వర్గంలో అడుగు పెట్టారు. రేపో మాపో మరల భూలోకానికి వెళ్ళనున్నారని చెప్పుతాడు. స్వర్గంలో నేను, నా సోదరకవులు ఎన్నో అనుభవాలు పొందినామని అంటాడు.
<poem>
{{left margin|5em}}
ఆ యనుభూతులెల్ల నరయన్ సరదాపడియేర్చికూర్చియా
ప్యాయముగా ప్రసన్న కుసుమాయుధ సంజ్ఞత మొండుకామునా
మ్నాయము, గావ్య రాజము బొనర్చితిగాని ధరిత్రి కేగమా
కేయవకాశముంబొడమ దీకృతి కింత ప్రచారమీయగన్"
</poem>
వాస్తవానికి "వైజయంతి" ప్రకరణం "అవతారిక" లాంటిది. ఇది గ్రంథ ప్రారంభంలో వుండాలి కాని జోగారావు గారు అలా చేయలేదు. పింగళి సూరన రచనా విధానాన్ని అనుసరించారు. “కళాపూర్ణోదయం"లో ప్రథమాశ్వాసంలో వుండవలసిన "సరస్వతీ చతుర్ముఖ విలాస ఘట్టం" పంచమాశ్వాసంలో వుంది.<noinclude><references/>
{{c|37}}</noinclude>
49imkvx6n8dlu2zpi5vu0r8lb7s4mm5
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/53
104
213502
557465
557216
2026-05-28T21:21:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557465
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఇదే సూరన ప్రతిభకు కారణం. అందువల్లే “అభినవ సూరన" యస్వీ జోగారావుగారు అలా చేశారు. అదే రసజ్ఞ రంజకమైన రచనా వైచిత్రి.
'''వర్ణనా వైభవం:'''
ఈ కావ్యం నిండా వర్ణనలు చోటు చేసుకున్నాయి.. ఇందులో 11 కథలు వున్నాయి. ఏ కథకు ఆ కథే విడివిడిగా వున్నాయి. అన్ని కథల్లోనూ శృంగారమే విలయ తాండవం చేసింది. ఇందులోని కథ స్వర్గంలో జరిగింది.
తెలుగు, సంస్కృతభాషల్లో రావుగారు గొప్ప పండితులు, ఉభయ భాషాప్రవీణులు వీరు. "ప్రేమాభి రామం"లో -
<poem>
{{left margin|5em}}
చక్షు శ్చక్షుషి వక్షో
వక్షసి నధరాధరి మడిబాహాబాహిన్
దక్షిత నూరూర విబుం
డ్రేక్షు శరాసాహవ మొనరించిరి వారల్
</poem>
ఊర్వశీ శ్రీనాథుల సురత వర్ణనం. సురతం మన్మథ యుద్ధం, కాబట్టి యుద్ధంలో నిరువాగు యోధులు, బాహాబాహి, కచాకచి, గదాగది, ముష్టి ముష్టిగా ఎలా ప్రవర్తిస్తారో అదేవిధంగా కన్నులతో, రొమ్ములతో, అధరోష్ఠాలతో, బాహువులతో, ఊరువులతో, పరస్పరం ప్రతిఘటించి, ప్రవర్తిల్లిచున్నట్లు రావుగారు రాశారు. ఇక్కడ యుద్ధం వాచ్యం. సురతం వ్యంగ్యం.
శ్రీనాథుని భక్తి శృంగార తత్త్వాభిరామతకు ఈ క్రింది పద్యం ఒక మచ్చుతునక
<poem>
{{left margin|5em}}
చిత్తము నీకు బుట్టి నిలుశీత మయూఖ శిఖావిటంక సం
పత్తికి మెట్టినిల్లు మఱి భావన నీయది భక్తి వానిదై
జొత్తిలు నా కవిత్వమున జోద్యముగా గదెలే తదీయముల్
చిత్తమునం జిగిర్చినవి జీవకళల్ రసముల్ త్వదీయముల్"
</poem>
ఊర్వశీ వియోగాన్ని పొందిన శ్రీనాథుడు తన ఉపాస్యదైవమైన మనసిజుని స్తుతించిన విధానం కడు హృద్యంగా వుంది.
<poem>
{{left margin|5em}}
"హరి హరాదులకంటె నతి సనాత నుడ వీ
వఖిల జీవుల కంతరాత్మ వీవు
</poem><noinclude><references/>
{{c|38}}</noinclude>
fgx8nmbvxp836qqsvuchtci44kxsgyf
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/54
104
213503
557466
557217
2026-05-28T21:33:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557466
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
శంకరాదుల యున్కి శంకించు వారుంద్రు
తెలియ నజాత నాస్తికుడవీవు
అజుడగ్ర జుండైన నగుగాక తత్కర్త
కాండ నాదేశించు ఘనుడ వీవు
అల వేల్పు లందఱి వెలగాక యడుగక
వచ్చి వరాలిచ్చు వాడ వీపు"
</poem>
ఇలా వర్ణించడంలో జోగారావు గారి ప్రతిభ మనకు అడుగడుగునా కన్పిస్తుంది. వర్ణన విషయంలోనే కాక, కథా కథనంలో కూడా ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క విధంగా తన ప్రజ్ఞను ప్రదర్శించారు రావుగారు, ప్రతీ ప్రకరణంలోనూ, ఆయా ప్రకరణ గత కవుల కవితా రీతులు, చాలా స్పష్టంగా గోచరిస్తాయి. అలా రచన సాగడం ఈ గ్రంథం యొక్క విశిష్టత. ప్రత్యేకతకూడా.
“ప్రేమాభిరామం”లో శ్రీనాథుడు గొంతెమ్మ కోర్కెను తీర్చాలని కాముడు తనుకుతానై, ఊర్వశీ రూపాన్ని ఎత్తుతాడు. అప్పుడు జోగారావుగారు -
<poem>
{{left margin|5em}}
“ఆకంపించె సమస్త లోకము, దివంబల్లాడె, నయ్యప్సరో
లోకం బాకుల పాటు జెందె, హరి యాక్రోశించె, నా నాకలో
కాకఃపల్లవ పాలి తల్లడిలి హాహాకారముల్ జేసెడిన్,
సాకల్యమ్ముగ సృష్టికాండ యది సంస్తంభించె జిత్రంబుగన్"
"కొలకులు దోటలం బొడము కోరకముల్ వికసింప బోవు, వి
చ్చల విడి పూలదారుల పచారులు సేయవు తేంట్లు, తెమ్మెరల్
గల గల సాగి రావు, పొడగట్టదు వెన్నెల, కీరశారికల్
పలుకవు, గండుకోయిలలు పాడవు నా డదియేమి చిత్రమో!".
</poem>
అని మదనభావాన్ని అత్యంత అద్భుతంగా ఊహించి వర్ణించారు. ఈ ఖండికను ప్రారంభిస్తూ కవి శ్రీనాథుని ప్రవేశపెడుతూ నందన వనంలోని సౌందర్యాన్ని వర్ణించారు. ఇందులోని పాత్రలన్నీ ఇంచుమించు రసరాజధానిలో రాణివాసం చేసినవే. జోగారావు గారి శృంగార చిత్రణ వర్ణనలో రాటుదేలి పోయారు. ఉదాహరణకు ఊర్వశీ వర్ణనం చూడండి.
<poem>
{{left margin|5em}}
"చూచెనా యొకచూపు సురుచిరోజ్జ్వలకళా
సురభిళాత్ముల యెదల్ చూరవోవు
</poem><noinclude><references/>
{{c|39}}</noinclude>
lppqna0hq9oscsgv5y13pmgdl9gvfpf
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/55
104
213504
557467
557218
2026-05-28T21:45:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557467
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
ఆడెనా యొకయాట ఆస్యబింబమునందు
హాసచంద్రికలు లాస్యములు చేయు
పాడెనా యొకపాట బడుగుస్థాణ్వాశ్రమ
పాషాణదేశముల్ పల్లవించు
కదిపెనా యొకకాలు యెదిపెనా యొక కేలు
నటరాజు సిగ్గున నానిపోవు
పెదవులొత్తి ముద్దాడగా పిలుచునట్లు
చూచుకమ్ము లెదిరి యెదల్ చూచున ట్లె
నంగు హావభావము లందచందములును
మరుడు శిరసావహించిన మకుట మామె"
</poem>
“కామధేనువు”లో వికటకవి తనకు దొరికిన శిరోజాన్ని బట్టి, ఆ కేశం ఏ సౌందర్యరాశిదో అని వెదకుచూ తిరుగుతాడు. అప్పుడు -
<poem>
{{left margin|5em}}
"చెల్వుదేవత నిండు కొల్వనందలి నిల్వు
టద్ద మచ్చరవాడ యందు నెమకి
అసమాస్త్రు పసమించు నాయుధాగారమై
వరలు నందన వనవాటి నెమకి
సంక్రందనాత్మజ స్యందనాధ్వంబైన
నట్టువ కత్తెల నగరు నెమకి
మధురాధరోష్ఠుల మధుపాన గోష్ఠుల
నెలవులు చంద్రశాలలను నెమకి
వేల్పు కాంతల జలకేళివేళ మరుడు
దేవతా వస్త్రముల పులు దీయు రేవు
లభ్రవాహినీ తీరము లందునెమకి
యెట్ట కేలకు దిట్ట కవీశ్వరుండు"
</poem>
ఆ కేశస్వరూప చిత్రణం ఇంతటితో ఆగలేదు. అది దొరుకుతుంది. “పద గుంఫన" ప్రౌఢ శిల్పియగు "పాండు రంగసుకవి" కాబట్టి దాని సౌందర్యాన్ని సర్వం తన కవితా సౌందర్యంతో తులతూచుకొన్నాడని పాత్రానుగుణంగా దాన్ని ఇలా వర్ణించారు.<noinclude><references/>
{{c|40}}</noinclude>
2yqwy8w17n1aw3kbl4o7ce0sbf159ne
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/56
104
213505
557475
557219
2026-05-29T09:38:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557475
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
"తన పదాల పటాల మన దనరిన సమా
నము బోని దాని దైర్ఘ్యమును జూచి
తన శబ్ద వార్షుకాబ్ద వితాన మైన బిం
ధము బోని వైనిగ్యమును జూచి
తనదు వైదగ్ధ్యభంగిని దులకించు సూ
క్తులబోసి, వంపు సొంపులను జూచి
తన వర్ణనలు వలచిన కల్పనల బోని
వైపు వాటముల చెల్వమును చూచి" అని
తలవెంట్రుకపై సాగిన వర్ణన ఇది.
“కాముని పున్నమ” లో తిలోత్తమను ప్రవేశపెడుతూ -
"అదివారాత్ర మనార్తవం బతిసుగంధానూన మామ్లాన మైం
ద్రధనుస్సన్నిభ వర్ణసారము మరందస్యంద మాధుర్య మం
బుదవైవిధ్య మహామనోజ్ఞము సుధాపూరై ధమానం బిర
మ్మద తుల్య వ్రతతీ ప్రసూతము సుమాత్మస్తామ మేపారుచోన్"
"తన ప్రమదావనమ్మున లతాంత వితానక కాయమాన కాం
చన కలశీ విటంకమున చందన చర్చిత చంద్రకాంత నూ
తన సరణీ వినిర్మిత వితర్దికపై నుపవిష్టయయ్యె గొ
ల్వున లలనాజనోత్తమ తిలోత్తమ యొక్క సుమాస్త్రు వున్న మన్"
అని సాగిన వర్ణన చెప్పుకోదగ్గది.
</poem>
“కృష్ణార్పణము" ఖండికలో క్షేత్రయ్య, జయదేవులు కృష్ణ భక్తితో మేళవింపబడిన శృంగారం "ఘృతాచి”తో కూడింది. ఘృతాచి, అంగాంగ ప్రదర్శనను జోగారావుగారు అద్భుతంగా వర్ణించారు. ఘృతాచి ఒక కృష్ణాష్టమి నాడు మందాకినీ తీరంలో మందార వనాంతరంలో వున్నక్షేత్రయ్య దగ్గరకు వెళుతుంది. ఆరాధన తర్వాత అక్కడే నిద్రిస్తుంది. నిద్రలో వున్న ఆమెపై ఒక మంద సమీరం వీస్తుంది. శృంగారనిధానాలైన ఆమె అంగాలు బయలు పడతాయి. అంతవరకు ఏమీ పట్టించుకోకుండా వున్న క్షేత్రయ్య మహావేశంతో ఆమెను ఆశ్లేషమొనర్చాడు. ఈసన్నివేశంలో ఘృతాచి నిద్రమునిగిన వేళను గూర్చి కవి వర్ణన అభినందించదగ్గది.<noinclude><references/>
{{41}}</noinclude>
icdlcc2zls7q38quhwm1wlzxa1h08dc
557476
557475
2026-05-29T09:39:23Z
శ్రీరామమూర్తి
1517
557476
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
"తన పదాల పటాల మన దనరిన సమా
నము బోని దాని దైర్ఘ్యమును జూచి
తన శబ్ద వార్షుకాబ్ద వితాన మైన బిం
ధము బోని వైనిగ్యమును జూచి
తనదు వైదగ్ధ్యభంగిని దులకించు సూ
క్తులబోసి, వంపు సొంపులను జూచి
తన వర్ణనలు వలచిన కల్పనల బోని
వైపు వాటముల చెల్వమును చూచి" అని
తలవెంట్రుకపై సాగిన వర్ణన ఇది.
“కాముని పున్నమ” లో తిలోత్తమను ప్రవేశపెడుతూ -
"అదివారాత్ర మనార్తవం బతిసుగంధానూన మామ్లాన మైం
ద్రధనుస్సన్నిభ వర్ణసారము మరందస్యంద మాధుర్య మం
బుదవైవిధ్య మహామనోజ్ఞము సుధాపూరై ధమానం బిర
మ్మద తుల్య వ్రతతీ ప్రసూతము సుమాత్మస్తామ మేపారుచోన్"
"తన ప్రమదావనమ్మున లతాంత వితానక కాయమాన కాం
చన కలశీ విటంకమున చందన చర్చిత చంద్రకాంత నూ
తన సరణీ వినిర్మిత వితర్దికపై నుపవిష్టయయ్యె గొ
ల్వున లలనాజనోత్తమ తిలోత్తమ యొక్క సుమాస్త్రు వున్న మన్"
అని సాగిన వర్ణన చెప్పుకోదగ్గది.
</poem>
“కృష్ణార్పణము" ఖండికలో క్షేత్రయ్య, జయదేవులు కృష్ణ భక్తితో మేళవింపబడిన శృంగారం "ఘృతాచి”తో కూడింది. ఘృతాచి, అంగాంగ ప్రదర్శనను జోగారావుగారు అద్భుతంగా వర్ణించారు. ఘృతాచి ఒక కృష్ణాష్టమి నాడు మందాకినీ తీరంలో మందార వనాంతరంలో వున్నక్షేత్రయ్య దగ్గరకు వెళుతుంది. ఆరాధన తర్వాత అక్కడే నిద్రిస్తుంది. నిద్రలో వున్న ఆమెపై ఒక మంద సమీరం వీస్తుంది. శృంగారనిధానాలైన ఆమె అంగాలు బయలు పడతాయి. అంతవరకు ఏమీ పట్టించుకోకుండా వున్న క్షేత్రయ్య మహావేశంతో ఆమెను ఆశ్లేషమొనర్చాడు. ఈసన్నివేశంలో ఘృతాచి నిద్రమునిగిన వేళను గూర్చి కవి వర్ణన అభినందించదగ్గది.<noinclude><references/>
{{c|41}}</noinclude>
bf7w8gkf8wgltggofrij8430n79v974
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/57
104
213506
557480
557220
2026-05-29T09:51:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557480
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
“ఒక సంపుల్ల సహస్రమానభర సద్యోనమ్ర మందార శా
ఖిక క్రిందన్ ఫణికుండల ప్రతిమ రాకేందూప లోత్ఫుల్ల హ
ల్లక తల్పంబున సర్వతః ప్రకటన లీలావేల చాంద్రీమనో
జ్ఞకళాముద్రిత వేళ నిద్ర మునిగెన్ కంజాక్షి కామాక్షియై.”
“మదిరాపాన విశేషమత్త విగళన్మందాక్ష వీక్షా విశా
రద గంధర్వ విటీవిటాళి తుముల ప్రద్యుమ్న సంయజ్ఞయా
భ్యుదయాఘోషణ కల్ప తన్మణిత సద్యోగర్భ సందర్భముల్
పొదవెన్‌దిక్కుల గాము గాలములు లోలోత్తాల వాతూలముల్"
ఈ శృంగార సన్నివేశాన్ని రసభావ పూరితంగా జోగారావుగారు రాశారు.
</poem>
జోగారావుగారి వర్ణనా వైదుష్యానికి "వైజయంతి” కీర్తి పతాక. ఇందులోని కథ అంతా స్వర్గంలో జరుగుతుందీ. ఆ స్వర్గం జోగారావుగారి ఊహా ప్రపంచం. అందులోని అనేక అంశాల్ని కడురమ్యంగా వర్ణించారు. నందనవనం, వివిధ వీధులు, దేవేంద్రుడు సభదీర్చుట, దేవవేశ్యల దివ్యభవనాల వైభవాలను కన్నులకు కట్టినట్లు రావుగారు వర్ణించారు. అంతేకాదు ఈ కథలో క్షేత్రయ్య, జయదేవులు గోపికలుగా మారడం చెప్పుకోదగ్గ గొప్ప విషయం. రావుగారి ఊహమహాద్భుతం. వర్ణించిన తీరు సరస మనోఙ్ఞం.
ఆ రోజు మదన మహోత్సవ పర్వదినం జరుగుతున్న స్థలం స్వర్గం. సౌందర్యమే సర్వత్ర రాశీ భూతమైన స్వర్గ సీమ అది. ఆ సభకు సురపురిలో చాలా ప్రాముఖ్యం వుంది. అది “మదన మండప మండితంబైన సభ" అని రావుగారు అన్నారు. అపూర్వంగా ఇలా వర్ణించారు.
<poem>
{{left margin|5em}}
“నందనవనములో చందనచ్ఛాయలో
నీలోత్పలపు చాందినీలు గట్టి
పారిజాతాల తోపందిళ్లు పఱిపించి
అమృతపూరము కలయంపి జల్లి
ముత్తియంబులతోడ మ్రుగ్గులు రచియించి
చెంగల్వ విరి తివాసీలు వేసి
రాంకవ సాంకవ ప్రభృతి గంధద్రవ్య
భూరి సౌరభ భుగభుగలు నించి
</poem><noinclude><references/>
{{c|42}}</noinclude>
omqzir0tvkqe7jhu4tkd77fmxreikvw
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/58
104
213507
557482
557221
2026-05-29T10:01:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557482
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
మదన మండప మండితంబైన సభను
సర్వసురుచిరాలంకార దూర్వహమున
పూర్వమును సహస్రాక్షదృక్పర్వమునగు
రీతి మఘువు లెంక అలంకరించినారు".
</poem>
అంతే కాక సభా నిసర్గరమణీయత గూర్చి జోగారావు గారు చెప్పిన విధానం చూడండి.
<poem>
{{left margin|5em}}
“సుడియు తిమ్మెర దేవలుజడ చొళ్ళెముల వ్రేలు
పూలచేరుల చాందినీలు గట్టి
కాయ కాంతుల తోడ కాయమానములెత్తి
అడుగులత్తుకల నల్గడల నలికి
తోయజాక్షుల తోడ తోరణమ్ములు గట్టి
మురిపెంపునగవులు మ్రుగ్గు వెట్టి
మలయ మారుతపు మేరలు మీఱి మలసిన
మేని తమ్ముల తావి మిగుల నించి
మదను డాత్మీయ కులదైవ, మగుట నచ్చ
రలెద మిచ్చి శక్రు పరిచారకుల మించి
సర్వరసిక సహస్రాక్ష పర్వముగను
సభను గైసేసిరి నిసర్గ సుభగముగను"
</poem>
ఇలాంటి వర్ణనలు కావ్యంలో ఎన్నో చోటు చేసుకున్నాయి.
'''చమత్కార చాతుర్యం:'''
"ప్రసన్నకుసుమాయుధం"లో అడుగడుగున పద్య చమత్కార రమణీయత కన్పిస్తుంది. ఈ చమత్కార గుణం కావ్యానికి గొప్ప పేరు తెచ్చిపెట్టింది. భారతీయాలంకారికులు ఈ చమత్కారం గూర్చి చాలా బాగా వివరించారు. విశ్వేశ్వర కవిచంద్రుడు “చమత్కార చంద్రిక" అనే గ్రంథం కూడా రాశాడు. ఈ చమత్కారంలో
అనుకరణ గతం, అర్థగతం, శబ్దగతం, శబ్దార్ధోభయగతం, కవిసమయగతం, అలంకార గతం, ధ్వనిగతం, ఐతిహ్యగతం మొదలైన భేదాలు వున్నాయి. వీటిని గూర్చి తటవర్తి రాజగోపబాలం గారు చాలా చక్కగా విపులీకరించారు.<noinclude><references/>
{{c|43}}</noinclude>
nxuadotobyquej5iaxs1iw1umm76ica
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/59
104
213508
557484
557222
2026-05-29T10:16:45Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557484
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>'''అనుకరణ గత చమత్కారం :'''
ప్రముఖ కవుల పద్యాలను అనుకరించడం "ప్రసన్నకుసుమాయుధం"లో కన్పిస్తుంది. అదే ఈ గ్రంథంయొక్క ప్రత్యేకత. ఈ అనుకరణే ఈ కావ్యంలో రాజ్యమేలింది. తెలుగులోని సుప్రసిద్ధకవులందరినీ జోగారావు గారు అనుకరించారు. ముఖ్యంగా ప్రబంధకవులను అనుకరించారు. విజయం సాధించారు. ప్రముఖులచే
ప్రశంసలు అందుకున్నారు.
"వరప్రసాదం"లో దేవేంద్రుడు సభతీర్చుతాడు. ఆ రోజును జోగారావుగారు వర్ణిస్తూ-
<poem>
{{left margin|5em}}
"రాజకులైక భూషణుడు రాజమనోహరు డద్రిరాజక
వ్యాజలజోదయార్కు డుదయార్క తనూజవచఃప్రచండకం
రాజిరకాలకూటము జటాపటలాభ్రధునీతరంగవి
భ్రాజితదివ్యలింగ మజపాకృతి దాల్చు దినమ్మునన్ దివిన్"
అని రాశారు. ఈ పద్యం నన్నయ పద్యానికి అనుకరణ.
"రాజకులైక భూషణుడు రాజమనోహరు డన్యరాజతే
జోజయశాలి శౌర్యుడు విశుద్ధయశశ్శరరిందుచంద్రికా
రాజితసర్వలోకు డపరాజితభూరిభూజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రు డున్నతిన్".
</poem>
ఇలా అనుకరించడంలో జోగారావుగారు కడు సమర్థులు.
"రమణీ ప్రియదూతిక"లో దూతిక మాయా హరిణీ రూపంలో పెద్దనను కలిసేటప్పుడు పెద్దన “మను చరిత్ర” లోని వరూధినీ ప్రవరుల ఘట్టం తలపిస్తుంది.
<poem>
{{left margin|5em}}
"ప్రాంచద్భూషణబాహుమూలరుచితో వక్షోజముల్ పొంగ బై
యంచుల్ మోవగ గౌగిలించి యధరం బాసింప నాశించె నా
పంచాస్త్రాగమపండితాగ్రణి రసబ్రహ్మం బుపాసింప ద
త్కాంచీకంకణకింకిణీకలకలధ్వానాధ్వనీనస్థితిన్"
అనే పద్యం పెద్దన “మనుచరిత్ర"లోని పద్యానికి అనుకరణ.
"ప్రాంచద్భూషణ బాహుమూలరుచితో బాలిండ్లు పొంగార పై
యంచు ల్మోవగ గౌగిలించి యధరం బాసింప 'హాశ్రీహరీ'
యంచున్ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటిపా
</poem><noinclude><references/>
{{c|44}}</noinclude>
88c54jjz8jn5r80h0kl0foy4ii0ckrt
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/60
104
213509
557485
557223
2026-05-29T10:31:51Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557485
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
మ్మంచున్ ద్రోచె; గలంచునే సతులమాయల్ ధీరచిత్తంబులన్?"
</poem>
వరూధిని తిరస్కృతమైనప్పుడు రాసిన శృంగార పద్యం ఇక్కడ పునర్జీవ మెత్తి సార్ధకత నొందింది.
“దక్షిణ నాయిక”లో మేనక తిమ్మనల శృంగారాన్ని రస భంగంచేస్తాడు విశ్వామిత్రుడు. తర్వాత తిమ్మన పొగడ్తలకు ఉబ్బిపోతాడు. ఆసన్నివేశంలో జోగారావుగారు కడురమణీయ పద్యాన్ని రాశారు. అది ఇది.
<poem>
{{left margin|5em}}
"అలినీలాలక! నీవు నీకవి రహస్య క్రీడ వర్తించు వే
ళ లతాంతాయుధు నైదుబాణముల లీలాచాకచక్యమ్ములా
శలపై నాశలు రేపి డీల్పడగ షష్ఠం బస్త్రమై పారిజా
తలతాంతంబు నితాంతసౌఖ్యపదసద్యఃప్రాప్తి గావించుతన్”
ఈ పద్యం "పారిజాతాపహరణం'లోని పద్యానికి అనుకరణ.
"పారిజాతాపహరణ”లో నారదుడు శ్రీకృష్ణుని సమక్షంలో రుక్మిణితో -
"అలినీలాలక! నీవు నీపతి రహస్యక్రీడ వర్తించువే
ళ లతాంతాయుధసంగరంబునకు నుల్లాసంబు గల్పించును.
జ్జ్వలదీపాంకురమై, రతిశ్రమతనూసంజాత ధారాళఘ
ర్మలవంబుల్ దొలగింపగా మరటియై రంజిల్లు నిచ్ఛాగతివ్"
అని పారిజాత ప్రశంప చేశాడు ముక్కు తిమ్మన,
“మోక్షగామి"లో ధూర్జటి మారహం వీరసువ్రతుడై, సర్వాప్సరసలు శివమెత్తి యాక్రమింపగా
“కాంతాశ్లేషము పానవట్ట మభిషేకంబుల్ ప్రమోదాశ్రువుల్
దంతాళి ప్రభ లిద్ధదీపములు నుధ్యద్ధూప ముచ్ఛ్వాసమే
కాంతాలాపము స్తోత్రపారము నమస్కారంబు నై వేద్యమున్
కంతుక్రీడగ సత్కవీంద్ర శివలింగం బొప్పె నప్పట్టునన్"
</poem>
అని ఆయన బ్రతుకు ఎలా అర్ధనారీశ్వరం అయిందో విశదీకరించారు ఈ పద్యం "శ్రీకాళహస్తీశ్వరమహాత్మ్యం" లోని ఈ క్రింది పద్యాన్ని తలపిస్తుంది.
<poem>
{{left margin|5em}}
"ఉదయగ్రావము పానవట్ట మభిషేకోదప్రవాహంబు వా
ర్ధి, దరీధ్వాంతము ధూపధూమము జ్వలద్దీపప్రభారాజికౌ
ముది, తారా నివహంబు అర్పితసుమంబుల్‌గా దమోదూరసౌ
</poem><noinclude><references/>
{{c|45}}</noinclude>
o7q5dxdi6pnf5k1aafstkd0y2nrac3h
సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము
106
213661
557435
557431
2026-05-28T12:01:23Z
Vandanapu Saidhiraj
7301
557435
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=కాలచక్రం బనుఫల గ్రంథము
|భాష=te
|సంపుటి=
|రచయిత=ఆలూరు ఏకామ్ర జ్యోతిష్కులు
|అనువాదకులు=
|ఎడిటర్=వాజపేయం వెంకటాద్రి శాస్త్రుల
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కృష్ణయ్య
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3to5="విసూ" 6="1" 21="14" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
akx2yjeomqtm5yh1td1cop3nwjok46p
557439
557435
2026-05-28T13:45:13Z
Vandanapu Saidhiraj
7301
Vandanapu Saidhiraj, [[సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము.pdf]] పేజీని [[సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము]] కు తరలించారు
557435
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=కాలచక్రం బనుఫల గ్రంథము
|భాష=te
|సంపుటి=
|రచయిత=ఆలూరు ఏకామ్ర జ్యోతిష్కులు
|అనువాదకులు=
|ఎడిటర్=వాజపేయం వెంకటాద్రి శాస్త్రుల
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=కృష్ణయ్య
|చిరునామా=ఏలూరు
|సంవత్సరం=1895
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3to5="విసూ" 6="1" 21="14" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
akx2yjeomqtm5yh1td1cop3nwjok46p
సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము.pdf
106
213662
557440
2026-05-28T13:45:13Z
Vandanapu Saidhiraj
7301
Vandanapu Saidhiraj, [[సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము.pdf]] పేజీని [[సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము]] కు తరలించారు
557440
proofread-index
text/x-wiki
#REDIRECT [[సూచిక:కాలచక్రం బనుఫల గ్రంథము]]
a1futsv9zeymqs1y5gqaxbbrbcghdad
వాడుకరి చర్చ:Vandanapu Saidhiraj
3
213663
557463
2026-05-28T19:41:19Z
Rajasekhar1961
50
/* సమస్య */ కొత్త విభాగం
557463
wikitext
text/x-wiki
== సమస్య ==
పుస్తకం డీలింకు అయినది మీ ఎడిటలను రద్దు చేయండి [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 19:41, 28 మే 2026 (UTC)
fktte5btskd8wovacvyz34u3xggwvx8
557470
557463
2026-05-29T00:47:58Z
Vandanapu Saidhiraj
7301
/* సమస్య */ సమాధానం
557470
wikitext
text/x-wiki
== సమస్య ==
పుస్తకం డీలింకు అయినది మీ ఎడిటలను రద్దు చేయండి [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 19:41, 28 మే 2026 (UTC)
:ఎ పుస్తకము డెలింక్ అయి8నది కాస్త చెప్తారా సార్ నేను నా ఎదుట డిలీట్ చేస్తాను. [[వాడుకరి:Vandanapu Saidhiraj|Vandanapu Saidhiraj]] ([[వాడుకరి చర్చ:Vandanapu Saidhiraj|చర్చ]]) 00:47, 29 మే 2026 (UTC)
iengfwz3rbx6ufp84v0w7kwxuz3jnrw
వాడుకరి:Vandanapu Saidhiraj
2
213664
557471
2026-05-29T00:49:28Z
Vandanapu Saidhiraj
7301
/* */పరిచయం
557471
wikitext
text/x-wiki
I am Vandanapu Saidhiraj, a CSE student interested in contributing to wiki projects.
mjo2jaqrj9mzc36vlmde56pli0yeqt3