వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.4 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/515 104 212238 557516 557491 2026-05-30T03:44:03Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557516 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> పోతనవలెనే అభినవ పోతన కూడా తన మహాకావ్యాన్ని శ్రీరామాంకితం చేశారు. సొమ్ములయాసలో బడక క్షుద్రకృపాలుర నీవడించి చొక్కమ్మగు భక్తి భాగవత కావ్యరమన్ గృతినిచ్చె నీకు శ్రీ బమ్మెర పోతరాజుతని భవ్యచరిత్రమునే మహాప్రబంధమ్ము నొనర్చి నిన్ను కృతినాథునిగా నానరించి చెప్పెదన్. <poem> “సుతుని గొప్పలగీర్తింప నతిముదమున వినుచు దనుదాన చెడి జనకుని వలె నాలకింపవె దేవ! మహానుభావ! జనవినుతకీర్తి శ్రీరామచక్రవర్తి"</poem> అనే పద్యాల్లో తనకూ పోతన్నకూ ఉన్న సమాన లక్షణాలైన నిరీహ, నిత్య సంతృప్తి, భగవద్భక్తి వంటి వాటిని వరదాచార్యులు ధ్వని గర్భితం చెయ్యడం గమనార్హం. ఇలా ఎంత చెప్పినా సరిపోలని వరదాచార్యులు పోతన చరిత్రము ప్రకృతి చిత్రణకూ మానవ స్వభావ చిత్రణకూ మంచికీ మానవతకూ ఒక రత్నదర్పణం. తెలుగు సాహిత్యంతో పరదాచార్యుల వారు వెలయించిన మహానాటకం 'వైశాలిని' వారికున్న 'అభినవ కాళిదాస' బిరుదాన్ని అన్వర్ధం చేస్తున్నది. రచనలో, పాత్రచిత్రణలో, సంభాషణా వైఖరిలో దానికదే సాటి. శ్రేయోరాజ్యస్థాపన జరగాలనే ఆకాంక్షతో రచించిన ఈ తొమ్మిదంతాల మహానాటకానికి మూలకథ మార్కండేయపురాణంలో కొంత ఉన్నది. అవీక్షితుడు, వైశాలినిని పెండ్లి ఆడటం ప్రధాన కథ. చాలా కల్పనలతో మిశ్రకథగా ఆచార్యుల వారు రూపొందించిన ఈ నాటకంలోని సన్నివేశ కల్పనం, సంవిధాన చాతుర్యం, రసపోషణం, కవితా సౌందర్యం అద్వితీయాలు. <poem> "ప్రాణమేగుట మృత్యువు కానె కాదు నరుడు అభిమానహతుడైన నాడె చచ్చు, మనుపుట్టుట జన్మము కానేకాదు. కీర్తి యుదయించునాడె యామూర్తి పుట్టు!"</poem> వంటి పంక్తులు ఉత్తమ మానవతా ప్రతిపాదకాలు. ఈ నాటకం శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎం.ఎ.కు పాఠ్యగ్రంథంగా కొంతకాలం ఉన్నది. కులమతాలకు అతీతమైన మానవతా ప్రబోధంతో వెలువడిన సుమధుర గేయ కావ్యం 'విప్రలబ్ధ'. ఏటిలో కొట్టుకొని పోతున్న ఒక మహ్మదీయ బాలికను ఒక విప్రుడు కాపాడి ఆమెకు 'లక్ష్మి' అని పేరు పెట్టి, అల్లారు ముద్దుగా. పెంచుతాడు. ఆమెకు 'రాముడు' అనే ఒక రైతుతో వివాహం జరిపిస్తాడు. కులమతాల సంకుచితత్వాలకు అతీతంగా వెలసిన ఈ విప్రలబ్ధ కావ్యం అంతా గేయమయమే! <poem> నీవెవడవు నీవెవడవు నిజం చెప్పుమానవుడా! నిజముగ మానవుడ వీవు నీజాతీయ మానవత ఆలరంగదేదియైన పొలరంగు ఒక్కటియే!"</poem> అని ప్రబోధించే సర్వమానవ సౌభ్రాతృత్వ రచన ఇది. "వచ్చెను వచ్చెను వర్షాలు మానసుధారాణికి తలంబ్రాలు పంటచేలకు ప్రాణాలు” అని ముగ్ధమనోహరంగా వర్ణిస్తూనే వాటిని, "వరికంకులనోళ్లకు చనుబాలు" అని మాతృ మధుర హృదయంతో విరచించడం కేవలం వరదాచార్యులకే సాధ్యమేమో! చంద్రుడట, చుట్టూ చుక్యులతో కలిపి "చదల పిల్లలకోడి తిరిగినట్టుంటాడట!" ఈ భావనకు గొప్ప కృషీవల హృదయం కావాలి. చదలు అంటే ఆకాశం. చదలు అంటే కోడి, తన పిల్లలతో కలిసి ఏరుకొని తినే చదలు. ఎంతటి విశ్లేషరమ్యం ఇది! <poem> “ఎవ్వరీ చిన్నది ఎంతబాగున్నది? కన్ను ఇక్కడనుండి కదలనంటున్నది! పెదవి చెలియలికట్ట నొదుగు సిగ్గుల కడలి నవ్వు ముత్యాల్ బోసి నా గుండె కొన్నది"</poem> అని నాయిక లక్ష్మిని చూసి నాయకుడు రైతు రాముడనుకోవడం ఎంతటి సహజ పల్లీయ వర్ణన! "సిగ్గుల కడలి నవ్వు ముత్యాలు" అనే ప్రయోగం మన అలంకార శాస్త్రంలో పూర్ణోపమ! వాళ్లిద్దరికీ అదేమి తెలియదు పరిపూర్ణ స్నిగ్ధ ప్రణయం తప్ప. అరవైకి పైగా ఇలా అత్యద్భుతంగా అభినవ పోతన డా. వానమామలై వరదాచార్యులు సృష్టించిన మహోన్నత సాహిత్యంలో మరికొన్ని - మణిమాల, ఆహ్వానం, జయధ్వజం, స్తోత్రరత్నావళి, గీతరామాయణం, సూక్షి వైజయంతి, స్తవరాజ పంచశతి, అభ్యుదయ నాటికా సంపుటి,<noinclude><references/> {{rh|తెలంగాణ |494| తేజోమూర్తులు}}</noinclude> bydkgm7roy1y228lo2ea9b8mwdlawqj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/516 104 212239 557518 553455 2026-05-30T03:47:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557518 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> రైతుబిడ్డ, దాగురింతలు, వ్యాసవాణి వంటి మేటి రచనలు వాటికవే సాటి. <poem> "వరదాచార్యులు మద్గురూత్తములు శ్రీవాగీశ్వరీలబ్ధి దివ్యరసోల్లాస కవిత్వ విద్యులు తలంపన్ పోతనామాత్యులే కరుణన్ రెండవసారి బుట్టిణ తెలంగాణమ్మునన్ వానమా మల వంశాంబుధి చంద్రులై సుక విరాణ్మందార బృందారులై!"</poem><noinclude><references/> {{rh|తెలంగాణ |495| తేజోమూర్తులు}}</noinclude> i1buoni4bhbmdeqitycji987z4j6cz3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/517 104 212240 557521 553456 2026-05-30T03:57:06Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557521 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''144. వందేమాతరం రామచంద్రారావు '''</p>}} {{right|- డా౹౹ యం. దేవేంద్ర}} వందేమాతరం రామచంద్రారావు అసలు పేరు వావిలాల రామచంద్రారావు. ఆనాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అనేకసార్లు జైలుకు వెళ్ళిన ధీశాలి. 'వందేమాతరం' తన ఊపిరిగా నినదించిన సత్యాగ్రహి, అంతేకాదు గొప్పవక్త, ఆర్య సమాజ కార్యకర్త,nఅధికార భాషాసంఘం అధ్యక్షులుగా ఉండి తెలుగు భాష ఉన్నతి కోసం తపించిన సంస్కర్త. వందేమాతరం రామచంద్రారావు 1917లో ఏప్రిల్ 25వ తేదీన, మహబూబ్ నగర్ జిల్లాలో, రామలక్ష్మమ్మ రామారావు దంపతులకు జన్మించారు. వీరిది సంప్రదాయ కుటుంబం. వీరి అన్న వీరభద్రరావు కూడా నిజాంకు ఎదురొడ్డి నిలిచిన ధీరుడు. రామచంద్రరావుకు తల్లిదండ్రుల సాహచర్యం వలన బాల్యదశయందే సంస్కార భావాలు అలవడ్డాయి. విద్యార్థి దశలోనే ఆర్య సమాజ కార్యకర్తగా శిక్షణ పొందారు. ఆనాడు హైదరాబాదు మర్షణలు జరుగుతుండేవి. ఒకవైపు ఆర్యసమాజం హిందూమతంలో దురాచారాలను నిర్మూలిస్తూనే మరొకవైపు హిందువుల ఐక్యత కోసం పాటుపడేది. నిజాం ప్రభుత్వం మాత్రం ఆర్య సమాజాన్ని మతవిరోధ సంస్థగా భావించేది. వందేమాతరం గారు హిందువులందరినీ ఒక త్రాటిపై నడిపించడానికి ఎంతో ప్రయత్నించారు. హైందవ సమాజంలో కుల, వర్ణ వ్యవస్థవల్ల ఐకమత్యం కొరవడిందని గ్రహించి కులరహితమైన ఆర్య సమాజ సిద్ధాంతాలపట్ల ఆకర్షితుడై వాటిని అనుసరించారు. ప్రజలందరిని ఆర్య సమాజంవైపు మళ్ళించారు. ఒక వారందరిని ఒక సంఘటిత శక్తిగా రూపొందింపచేశారు. హైదరాబాదులోనే గాక ఢిల్లీలోని ఆర్యసమాజ ప్రధాన కేంద్రాల్లో కూడా అనేక కీలక పదవులను నిర్వహించి దేశవ్యాప్తంగా ఆర్య సమాజాన్ని ప్రచారం చేశారు. దేశభక్తిని చాటారు. ఆనాడు భారతదేశమంతటా స్వాతంత్య్రొద్యమం దశలవారిగా బలవడుతుంటే స్వయం ప్రతిపత్తి కలిగిన హైదరాబాదు రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి. బ్రిటిషు పరిపాలనతో సంబంధం లేకుండా నిజాం తనదైన శైలిలో పరిపాలనను కొనసాగిస్తున్నాడు. కాబట్టి తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్ర కాంక్ష ఉన్నప్పుడు నిర్బంధంలో ఉండి పోవల్సిన పరిస్థితి. నిజాం రాష్ట్రంలో అన్ని విద్యాసంస్థల్లో ప్రార్థనాగీతం నిజాంకు సంబంధించినదే పాడేవారు. కాని 1938 నవంబరు 30వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివే విద్యార్థులు సాహసించి 'వందేమాతరం' గీతం ప్రార్థన గీతంగా ఆలపించారు. ఆ రోజు చరిత్రలో కీలకమైన రోజుగా చెప్పవచ్చు. ఆలపించడమే కాకుండా ఆనాటి యువ విద్యార్థులు అచ్యుతరెడ్డి, హరిహరరావు దేశపాండే, వి.కె. రెడ్డి నాయకత్వంలో ఉస్మానియా విద్యార్థులు ఒక కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అనతికాలంలో 'వందేమాతరం' ఉద్యమంగా<noinclude><references/> {{rh|తెలంగాణ |496| తేజోమూర్తులు}}</noinclude> 6u16hdma1qa85t6al74cenynppbywd7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/518 104 212241 557522 553457 2026-05-30T07:27:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557522 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మారి తెలంగాణ వ్యాప్తంగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. అంతకంటే ముందే 1938 అక్టోబరు 22వ తేదీన గౌలిగూడలో హిందూ పౌరహక్కుల సంఘం తరపున యశ్వంతరావు, దిగంబరరావు జోషి, జుక్కల్కర్ తదితర నేతలు నిజాం సర్కారు వైఖరికి నిరసనగా ఒక గొప్ప ప్రజాప్రదర్శనకు పిలుపునిచ్చారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కొంతమంది ఉత్సాహంతో ప్రసంగించారు. వారిలో రామచంద్రారావు ఒకరు. ఊహించిన విధంగానే ప్రభుత్వం ప్రదర్శనకారుల్ని అదుపులోకి తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అట్లా అరెస్టయిన వారిలో రామచంద్రారావు కూడా ఉన్నారు. జైల్లో తనతోపాటు స్వామి రామానంద తీర్థ ఉన్నారు. శిక్షను అనుభవించే ఆర్యసమాజ కార్యకర్తల జంధ్యాలన్నీ తీసివేశారు. రామచంద్రారావు గారి నాయకత్వంలో జైల్లో నిరసన దీక్షకు కూర్చున్నారు. తమకు జంధ్యాలు వేస్తేనే భోజనం చేస్తామని ప్రకటించారు. అప్పుడు జైలు అధికారులు దిగిరాక తప్పలేదు. దానితో రామచంద్రారావు సామాన్యుడు కాడని అధికారులకు తెలిసివచ్చింది. సత్యాగ్రహులైన ఖైదీలు రోజూ సంధ్యావందనం ఆచరించేవారు. అటు తర్వాత వందేమాతరం అంటూ నినదించే వారు. ఈ విషయంలో జైలు అధికారులకు తీవ్రమైన అసహనం ఉండేది. వారు ఈ నినాదాన్ని పలకవద్దని పలుమార్లు ఖైదీలను హెచ్చరించారు. ఖైదీలు ఈ హెచ్చరికల్ని ఎంతమాత్రం ఖాతరుచేయలేదు. ఈ విషయం కాస్తా నిజాం రాష్ట్ర జైళ్ళ డైరెక్టర్ జనరల్ హెచ్.బి. హాలిన్స్ వరకు చేరింది. ఆయన చంచల్గూడ వచ్చి సత్యాగ్రహులైన ఖైదీలకు హెచ్చరికలు జారీ చేశాడు. అయినప్పటికీ ఖైదీలు వందేమాతరం నినదించడం మానలేదు. వారి నాయకుడి గా ఉన్న రామాచంద్రరావు మీదికి జైలు అధికారుల దృష్టి మళ్ళింది. ఆయనను తీవ్రంగా హింసించాలను కున్నారు. కట్టి వేశారు. కరడుగట్టిన నేరస్తుడితో ఆయనను కొట్టించారు. కొట్టిన ప్రతికొరడా దెబ్బకు వందేమాతరం అంటూ నినదిస్తూనే ఉన్నాడు. కొట్టిన దెబ్బల కారణంగా శరీరమంతా రక్తం కారుతున్నప్పటకీ వందేమాతరం గొంతెత్తి పలుకుతూనే ఉన్నారు. రామచంద్రారావు స్పృహతప్పి పడిపోయేవరకు కొడుతూ పోయారు జైలు అధికారులు. నిజాం సర్కారు ఎంతగా హింసించినా రామాచంద్రారావులోని పోరాట పటిమ ఎదుగుతూ వచ్చిందేకానీ బలహీనం కాలేదు. చంచల్ గూడ జైలు నుండి విడుదలైన కొంతకాలానికే తిరిగి ఉద్యమంలో చేరారు. గౌలిగూడ రామమందిరం ప్రాంతంలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి "బాధ్యతాయుత ప్రభుత్వాన్ని సాధించితీరుతాను” అంటూ ప్రతిజ్ఞ చేశారు. ప్రభుత్వం అతడిని తిరిగి అరెస్టు చేసింది. రాజద్రోహ నేరాన్ని మోపింది. 1941లో రామచంద్రా రావు జైలు నుండి విడుదలయ్యారు. హైదరాబాదు సంస్థానంలో కె.ఎం. మున్నీ భారత ఏజెంట్ జనరల్గా ఉన్నరోజుల్లో ఆయనకు సహకరిస్తూ వందేమాతరం సోదరులు ఎన్నో సాహసాలు చేశారు. ఈ విషయాన్ని దాశరథి రచించిన యాత్రాస్మృతిలో ఒకచోట పేర్కొన్నారు. "తన రాష్ట్రాన్ని స్వతంత్ర రాష్ట్రంగా. నిలబెట్టుకోవడానికి నిజాం నవాబు చేస్తున్న సన్నాహాలలో కొత్త కొత్త ఆయుధాల ఉత్పత్తి ఒకటి. ముఖ్యంగా జపాన్ టైవ్ త్రీనాట్ త్రీ రైఫిల్ బ్లూప్రింట్ శ్రీ మున్నీకి కావలసి వచ్చింది. ఆ పని మేం చేస్తామని వందేమాతరం సోదరద్వయ ముందుకు వచ్చారు. ఒక చీకటిరాత్రి, నిజాం సైన్యాల అధిపతి ఎల్.ఎ. డ్రూస్ విశ్వాసపాత్రుడైన జె.సి.ఓ. ఒకడు ఉండేవారు. అతడు గోల్కొండలోని మోతీమహల్లో ఉన్న ఆయుధ నిర్మాణశాలకు అధికారి, ఎలాగో అతని కన్నుగప్పి ఈ ఇద్దరు సోదరులు ఆయుధ నిర్మాణశాలలో ప్రవేశించారు. పులినోట్లో తలపెట్టినట్లే. పద్మవ్యూహంలో ప్రవేశించినట్టే. ప్రశాంతచిత్తంతో వజ్ర సంకల్పంతో నిర్దుష్టమైన పథకం ప్రకారం ఆ రహస్యాన్ని సాధించారు. శ్రీ మున్నీకి అందించారు." ఎంతటి సమయస్ఫూర్తి ఉంటే తప్ప ఇట్లాంటి సాహసకృత్యాలు సాధిస్తారు. ఈ విధంగా అఖిల భారతస్థాయిలో కె.ఎం. మున్షీ వీరసావర్కర్ వంటి ప్రశంసల్ని అందుకున్నవారు వందేమాతరం సోదరులు, రామచంద్రారావు తొలుత హైదరాబాదు రాష్ట్రంలోనూ, అటు తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ క్రియాశీలంగా పనిచేశారు. శాసనసభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి గెలిచారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమాన్ని బలపరిచారు. చిన్నరాష్ట్రాలు ఏర్పడాలని కోరుకున్నారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |497| తేజోమూర్తులు}}</noinclude> 41jwchu2ag13x26xd1ak4y7ujafao45 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/519 104 212242 557523 553458 2026-05-30T07:30:50Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557523 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>1980 ప్రాంతంలో ఇప్పటి మర్రిచెన్నారెడ్డి ప్రభుత్వం వీరిని అంతర్జాతీయ తెలుగు కేంద్రానికి ఛైర్మన్ గా నియమించింది. ఆ హోదాలో వీరు రాష్టేతర ప్రాంతాలలో విదేశాలలో ఉన్న తెలుగువారికి అనేక భాషా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ తర్వాత 1981లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమించింది. తెలుగు భాష అమలు కోసం నిరంతరంగా కృషి చేశారు. ఈ విధంగా జీవితంలో అనేక సాహసాలు చేసి, ఉద్యమం ఊపిరిగా జీవించి అనేక పదవులను అలంకరించి ప్రజావ్యక్తిగా చరిత్రలో నిలిచిన సాహసి వందేమాతరం రామచంద్రారావు.<noinclude><references/> {{rh|తెలంగాణ |498| తేజోమూర్తులు}}</noinclude> g90qchtgyo76hlh2dwsibelpenhafnu పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/520 104 212243 557524 553459 2026-05-30T08:48:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557524 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|gs150}}'''145. వాంకుడోత్ జోగ్యా నాయక్ '''</p>}} {{right|- డా॥ వి. రామకోటి}} తనువులోను అణువణువున తర తరాల పోరాటం...భూమి కోసం, భుక్తికోసం, చైతన్యం కోసం, రేపటితరానికి మంచి భవిష్యత్ కావాలనే తపనతో పోరాటం నాడు తెలంగాణాలో కన్పించిన వాతావరణం. ప్రజా వ్యతిరేకంగా పాలన సాగించిన నైజాం రాజ్యంలో ప్రజల ఆర్తి, ఆరాటం, బలిదానాలు, త్యాగాలు ప్రజల దుస్థితికి తార్కాణాలు. ఒకరకంగా చెప్పాలంటే తెలంగాణ మొత్తం చీకటి కాలంగా పేర్కొనవచ్చును. ఆ రోజుల్లో ప్రజలందరు నిజాంకు కొమ్ముకాస్తున్న దొరలకూ, దేశ్ ముఖ్ కు తల వంచి హీనంగా బతకవలసి వచ్చింది. ఇంతటి గడ్డుపరిస్థితి తెలంగాణలో నెలకొని ఉండటం విచారకరం. అయితే దీనిని ఎదిరించడంలో ఎందరో మహానీయులు హింస, అహింసా (గాంధేయ) మార్గాలతో తమ తమ పోరాటశక్తిని చూపారు. అయితే కాలం చెరిపేసిన జ్ఞాపకాలలో నైజాం రాజు పాలనను ఎదిరించిన వారిలో పేరున్నవారు మాత్రమే ఈనాటికీ పోరాట యోధులుగా నిలచిపోయారు. కాని చరిత్ర పుటలకెక్కని వారిని శోధించి సమాజానికి అందించవలసిన అవసరం పరిశోధకులపై ఉంది. నైజాం రాజ్యంలో దొరలు, దేశముఖ్ ఆగడాలు భరించలేని బడుగు, బంజార తెగలవారు అణచబడ్డ చరిత్రకు సాక్షీ భూతంగా నిలిచారు. అయితే వారిని మనుష్యులుగా మలిచిన నాటి నిప్పు కణాలు చరిత్రలో మణిపూసలుగా నేటికీ తళుకులీనుతునే ఉన్నాయి. తెలంగాణాలో గ్రామాల అభ్యున్నతి కోసం సమాజ వికాసం కోసం జాతి ఔన్నత్యం కోసం బంజారాలు ఆజన్మాంతం శ్రమించారన్నది స్పష్టపడే విషయం. ఈ నేపథ్యంలో నిజాం రాజుకు కొమ్మకాస్తున్న దొరలను, దేశముఖ్ ను ఎదిరించి లంబాడ జాతికి మరో గాంధీలా వెన్నుదన్నుగా నిలిచి పోరాడిన అహింసామూర్తి జోగ్యా నాయక్ వాంకుడోత్, జోగ్యా నాయక్ నేటి జనగాం జిల్లా లక్ష్మక్కపల్లి గ్రామ నివాసి. ఈయన తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాకుండా ఆ గ్రామ తండా వాసులతోపాటు ఇతర గ్రామ ప్రజల బాగోగులను చూసుకునేవాడు. ఈ బంజారాలు బంజరు భూములను సాగులోకి తీసుకొచ్చి పుట్లకు పుట్లు పంటదీస్తుంటే దీనిని చూసి భరించలేని ఆ గ్రామ దొర పుసుకూరి రాఘవరావు ఆ భూమిని తీసుకొని వీరిని మరో చోటుకు పంపించేవాడు. ఈ విధంగా ఆ గ్రామంలోనే అనేకచోట్లు తిరిగిన లంబాడాలు జోగ్యా నాయక్ ఆధ్వర్యంలో దొరను ధిక్కరించడంతో భూ పోరాటానికి బీజం పడింది. ఈయన ఆధ్యర్యంలో అనేకమంది బంజార యువకులు దొరలను తీవ్రంగా వ్యతిరేకించి పోరాటాలకు సన్నద్ధులయ్యారు. ఆ సమయంలో ఉన్న క్రిమినల్ ట్రైబ్స్ (Criminal Tribes) (CT) యాక్టుతో దొరలు వీరిని దొంగలుగా ముద్రవేశారు. ఈ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ<noinclude><references/> {{rh|తెలంగాణ |499| తేజోమూర్తులు}}</noinclude> rk06ydf7pfvcg3yy060onut9uzd522c పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/521 104 212244 557525 553460 2026-05-30T09:02:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557525 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> జోగ్యా నాయక్ భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా హైదరాబాదుకు వచ్చిన గాంధీ గారిని కలిశారు. గాంధీగారి సలహాతో తన పోరాటాన్ని గాంధేయ (అహింసా) మార్గంలో నడిపించిన ఉద్యమ యోధుడు బంజార నాయకుడు శ్రీ జోగ్యా నాయక్. ఒకసారి విసునూరి రామచంద్రారెడ్డి బండిలో తాను కూర్చొని ఇద్దరు దళితులతో బండి లాగిస్తూ బండి వెనకాల మరొక దళితున్ని చేతులు కట్టేసి చెన్నూరు నుండి మంచుప్పుల రోడ్డుపై కొట్టుకుంటూ పరుగెత్తిస్తుంటే, దీనిని గమనించిన జోగ్యానాయక్ బండికి అడ్డంగా పరుగెత్తి బండిముందు అడ్డంగా పడుకున్నాడు. నన్ను చంపిన తర్వాతే వారికి శిక్ష వేయమని దొరకు సవాల్ విసిరాడు. ఆనాటి నుండి ఆయన ధైర్యసాహసాలకు నాటి జనం జేజేలు పలికారు. ఆ తరువాత గ్రామ ప్రజలు జోగ్యానాయకున్ను తమ నాయకునిగా ఎన్నుకున్నారు. కమ్యూనిస్టులకు, నిజాం రాజుకు దొరల ఆగడాలను వివరించే బాధ్యతను ఆయనకప్పగించారు. నాయకత్వ లక్షణాలు, మాట్లాడే చతురత, సమయస్ఫూర్తి, గాంధీ స్ఫూర్తితో దొరలను ధిక్కరిస్తూ నాటి జనం గుండెల్లో శాశ్వత కీర్తిని సంపాదించు కున్నాడు. దొరలు తనను అంతమొందించడానికి పన్నే కుట్రలను భగ్నం చేస్తూ సమయస్పూర్తితో మెలిగేవాడు. జోగ్యానాయక్ ప్రేరణ నాటి బంజార యువకులపై బలంగా పడింది. కమ్యూనిస్టులు తండాలకు వచ్చి సమకాలీన పరిస్థితులను వివరించి పోరాటాలకు సిద్ధం చేసేవారు. అటువంటి వారిలో పాలకుర్తి సమీపంలో కొండాపురం గ్రామంలో లకావత్ హేమ్లా బంజార తెగలో పాలకుర్తి ఏరియా తొలి కమ్యూనిస్టు నాయకుడు గండర గండరాలుగా పిలువబడ్డ జాటోతు తాన్యా నాయక్, దర్యా నాయక్లు కర్రలు, గొడ్డళ్ళు, కత్తులు, తుపాకుల (303)తో రజాకార్లపై రౌడీలపై విరుచుకపడ్డారు. ఒక సందర్భంలో రౌడీలను నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి చంపినట్లుగా చంపారని ఈ ప్రాంత వాసులు ఇప్పటికి కథల కథలుగా చెప్పుకుంటారు. జాటోతు కాన్యా నాయక్ పోరాటపటిమ లంబాడ సమాజానికి ఒక స్ఫూర్తి. ధరావత్ బగ్యానాయక్, ధరావత్ పంతుల్యాలు కూడా మొండ్రాయి గ్రామంలో దొరలను తీవ్రంగా ప్రతిఘటించి తరిమికొట్టారు. తమ భూములను కాపాడుకోగలిగారు. సింహం కడుపున సింహమే పుడుతుందన్నట్లుగా జోగ్యానాయక్ కడుపున ధైర్యానికి నిలువెత్తు దర్పణమైన తార్వా నాయక్ను ఈ సందర్భంగా ప్రస్తావించడం అనివార్యం. ఇతని పోరాట పటిమ అమోఘం. లంబాడజాతి పోరాట యోధుల కీర్తి కిరీటంలో కలికితురాయి. తార్యా నాయక్ను తుపాకి తార్య అనడం ఇప్పటికి ఒక రివార్డే అవుతుంది. పోరాటయోధులు ఆరుట్ల రామచంద్రారెడ్డినిలక్ష్మక్క పల్లి గ్రామానికి తీసుకు వచ్చి నిజాం వ్యతిరేక పోరాటంలో ఆ గ్రామ దొర అయిన రాఘవరావుకు వ్యతిరేకంగా ఎడ్లబండ్లతో ఊరేగించి ఆ దొర ఇంటిముందు వ్యతిరేక నినాదాలు చేస్తూ అనేక గ్రామ ప్రజలను ఒక్క త్రాటిపైకి తీసుకు వచ్చిన జోగ్యానాయకు తోడుగా నిలబడ్డాడు తనయుడు తార్యానాయక్. జోగ్యానాయక్ నిజాం వ్యతిరేకంగా భూపోరాటం చేసిన కాలంలో లక్ష్మక్క పల్లిగ్రామం దొరపై కేసుపెట్టడానికి తన గ్రామం నుండి భువనగిరి కోర్టుకు సుమారు 70 కి.మీ. నడిచి వచ్చిన సంఘటన తార్వానాయక్పై చూపింది. లంబాడా జాతిని ఉద్దరించడానికి, సామాజిక న్యాయం, గౌరవం, రక్షణ వంటి వాటికై అనునిత్యం శ్రమించిన శక్తిశాలి. తండ్రి ఆశయం, చైతన్య స్పూర్తిని మనసు నిండా నింపుకొని దొరలపై యుద్ధం ప్రకటించాడు. నిజాం ప్రభుత్వంలో పెద్ద వర్గానికే పరిమితమైన తుపాకిని తన చతురతతో లైసెన్స్ తుపాకి సంపాదించి తుపాకి తార్యగా ప్రసిద్ధుడయ్యాడు. మనం మనం జనం జనం కలిసి కదిలితే బలం బలగం అన్నట్లు అందరి కోసం బతకడమే సిద్ధాంతంగా ముందుకు సాగాడు. తార్యానాయక్ తండ్రి నుండి వచ్చిన వారసత్వం, పోరాడేతత్వం అతనిని మానవతవాదిగా మార్చాయి. బలం అంటే తార్యానాయక్ తన కులం, తన జాతియే కాకుండా మానవత బలమని చాటాడు. ఈ తత్వమే ఈయనను వెనుకబడిన జాతులకు ఆప్తుణ్ణి చేసింది. చదువుతో<noinclude><references/> {{rh|తెలంగాణ |500| తేజోమూర్తులు}}</noinclude> 71datmvxhhjkjc17j1uy6uh39f9h259 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/522 104 212245 557526 553461 2026-05-30T09:07:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557526 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> పని ఏమి హృదయమున్న చాలు అన్నట్లు తల్లిదండ్రుల నుండి తెచ్చుకున్న పరోపకార జ్ఞానం పరమాత్మ జ్ఞానంగా మలుచుకున్నాడు. శ్రమను నమ్ముకున్న తార్య ఆశ్రమఫలం పరాయి పరం కాకుండా ఉద్యమాలకు ఊపిరి పోశాడు. హైదరాబాద్ సంస్థానంలో జాగీరుదారులు, భూస్వాములు, జమిందారులు చేసే దౌర్జన్యాలను ఎదిరించడంలో తార్యనాయక్ ముఖ్య భూమికను పోషించాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డి నాయకత్వంలో పోరాటం చేస్తూ పుస్కూరు రాఘవరావు, విసునూరి రామచంద్రా రెడ్డిలు చేసే దుర్మార్గాలను ముందే పసిగట్టి వారిచేత ఆక్రమించబడ్డ భూములను తిరిగి బంజారాలకు ఇప్పించిన పోరాటయోధుడు. ఆరుట్ల రామచంద్రారెడ్డిపై జరిగే హత్యాయత్యాన్ని పసిగట్టి, భగ్నంచేసి ఆయనకు దన్నుగా నిలబడ్డాడు. లంబాడ ప్రజల హక్కులను నేల రాస్తున్న దొరలపై కర్మశంగా ప్రవర్తించాడు. అజ్ఞానం, అమాయకత్వం, ఆవిద్య ఏ జాతి ఎదుగుదలకైనా అవరోధాలని భావించి, వాటిని రూపుమాపడానికి జీవితాంతం కృషి చేశాడు. బిరుదులు, గుర్తింపులకు అతీతంగా సమాజ సేవ చేసే మహనీయుల సరసన సగౌరంగా నిలబడగలిగిన వ్యక్తి తార్యా నాయక్ తండ్రి జోగ్యానాయక్. లంబాడ జాతి ఉద్ధరణ కోసం తమ జీవితాలను తరింపచేసిన వ్యక్తులు. బంజార యోధులు జోగ్యా నాయక్, తార్యా నాయర్లు. తెలంగాణ ప్రజలు నిజాం రాజ్యం నుండి విముక్తులై స్వాతంత్ర భారతావనిలో కలిసినపుడు ప్రజాస్వామ్యంలో లంబాడాలకు లభించిన హక్కులను చూసిన జోగ్యా నాయక్ 1987లోను, తార్యానాయక్ 2015లోను తెలంగాణ చరిత్ర శిఖరాలను చేరారు. తెలంగాణ చరిత్రలో మరచిపోలేని పుటలు వాంకుడోత్ జోగ్యానాయక్. :"మీకు మీరై జన్మించారు :ఎందరి కోసమో జీవించారు”<noinclude><references/> {{rh|తెలంగాణ |501| తేజోమూర్తులు}}</noinclude> 657t66qny7g2fq8kmrlxpdc46tg6dzg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/523 104 212246 557527 553462 2026-05-30T09:14:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557527 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''146. వరహాల భీమయ్య '''</p>}} {{right|- డా॥ రంగి కమల}} పుణ్యదంపతులు శ్రీ వరహాల రాజన్న, శ్రీమతి అంబక్కగార్ల ఏకైక పుత్రుడు వరహాల భీమయ్య గారు. 1911, అక్టోబర్లో ఆయన జన్మించారు. మంథనిలో 7వ తరగతి వరకు విద్యాభ్యాసము చేసి, 8వ తరగతి కరీంనగర్లో 9, 10 తరగతులు హన్మకొండలో పూర్తి చేసారు. హైద్రాబాదులోని సిటీ కళాశాల నుండి ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి బి.ఎస్సీ., తర్వాత రసాయనశాస్త్రంలో ఎం.ఎస్సీ. పట్టా సంపాదించారు. ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఫస్టుర్యాంకు సంపాదించి గోల్డ్ మెడల్ స్వంతం చేసుకొన్నారు. వీరు కరీంనగర్ హైస్కూల్లో టీచరుగా కొద్దిరోజులు ఉద్యోగం చేసి ఆ తర్వాత హన్మకొండలోని హైస్కూలుకు బదిలీ అయినారు. తెలంగాణాలోని ఒక మారుమూల అగ్రహారంలో, సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన బాల్యం, విద్యాభ్యాసం అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. 1949 - 50 ప్రాంతంలో హైద్రబాదులోని సుల్తాన్ బజార్ విఠల్ మారుతిగల్లీలో నివాసముండే గట్టు పురుషోత్తం గారింటికి సాయంత్రం వేళల్లో మంథని విద్యార్థులు, ఉద్యోగులు చేరుకునేవారు. అక్కడ ఆనాటి వివిధ రాజకీయ, విద్యారంగ విషయాల గురించి ఆసక్తికర చర్చలు జరిగేవి. ముఖ్యంగా శ్రీ భీమయ్యగారు ఆ సందర్భంలో చెప్పే విశేషాలతో చాలామంది ప్రభావితమయ్యేవారు. గ్రామాల నుండి విద్యార్జనకు వచ్చే విద్యార్థులకు ఉచితవసతి కల్పించాలని గౌలిగూడ అక్బర్బగ్లోని శంకర్సేర్ హెూటలు వద్ద నరసిన బుచ్చయ్య అనే షావుకారు ఒక ధర్మశాలను ఉచితంగా యిచ్చారు. ఇప్పటికి దాన్ని మంథని గ్రామస్థులు ఉపయోగించుకుంటున్నారు. పోలీస్ యాక్షన్ తర్వాత నిజాం నవాబు భారత సేనలకు లొంగిపోయి, అప్పటి కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలతో ముఖ్యంగా ఉక్కుమనిషి సర్దారు వల్లభభాయి పటేల్ గారితో ఒప్పందం చేసుకొని తన అధికారాలను మిలటరీ అధికారి జె.ఎస్. చౌదరికి అప్పజెప్పిన రోజులవి. ఆ మిలటరీ ప్రభుత్వంలో అప్పటి హైద్రాబాదు రాష్ట్రంలో కర్ణాటక, మరాఠ్వాడా మరియు తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులను గవర్నింగ్ కౌన్సిల్లోకి తీసుకోవటం జరిగింది. అలా అధికారం చేపట్టిన వ్యక్తుల్లో శ్రీ ధోండేరాజ్ బహదూర్ గారు, శ్రీ డి.జి. బిందు, శ్రీరామాచారి, శ్రీ వి.బి. రాజు వంటి ప్రముఖులుండిరి. శ్రీ ధోండేరాజ్ మహారాజ్ గారు తన పి.ఏ.గా శ్రీ వరహాల భీమయ్యగారిని నియమించు కున్నారు. కొద్ది రోజులకే ఈ మిలటరీ ప్రభుత్వంపైన అనేక ఆరోపణలు<noinclude><references/> {{rh|తెలంగాణ |502| తేజోమూర్తులు}}</noinclude> 2xnx21zpyx9hnsr8knrdip8o9fh3c2r పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/524 104 212247 557530 553463 2026-05-30T09:33:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557530 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వెల్లువెత్తిన నేపథ్యంలో అప్పటి భారత ప్రధాని శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు సివిల్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సి.యం. వెల్లోడిగారికి అధికారాలప్పజెప్పారు. శ్రీ ధోండేరాజ్ బహదూర్, శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు వంటి ప్రముఖులు అధికారపగ్గాలు చేపట్టారు. విద్యాశాఖ నిర్వహించిన శ్రీ ధోండేరాజ్ నమ్మకస్తుడు నీతిమంతుడైన వరహాల భీమయ్యగారిని పి.ఏ.గా నియమించు కున్నారు. ఆ తర్వాత శ్రీ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే ఏర్పడిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లో నిజాయితీ, ముక్కుసూటిగా వ్యవహరించే తత్త్వం వంటి సద్గుణాలు నచ్చినందున ముఖ్యమంత్రిగారికి మంచిసలహాదారుగా భీమయ్యగారిని నియమించారు. మంచి పనిచేసి, ప్రశంసలందు కున్నారు. 1950-51లో అప్పటి ప్రభుత్వం విద్యా సంస్కరణలకు నాంది పలికింది. పాఠశాలల్లో ఉర్దూమీడియంలో విద్యా బోధన జరిగే రోజులవి. తెలుగులో విద్యాబోధన జరగాలనే చారిత్రక నిర్ణయం తీసుకోబడినది. దీనికి శ్రీ వరహాల భీమయ్యగారి అకుంఠిత కృషి, దూరదృష్టి ఎన్నటికీ మరువరానిది. మంథనిలో మొట్టమొదటి మిడిల్ స్కూలును హైస్కూలుగా అప్ గ్రేడ్ చేయించిన ఘనత శ్రీ భీమయ్య గారిదే. హైస్కూల్ హెడ్మాస్టరుగా శ్రీ వేంకటాచారి తర్వాత శ్రీ గోవిందాచారి హెచ్.ఎమ్ ఉండిరి. 1954లో శ్రీ లోకే కిషన్గావుగారు మంథని హైస్కూల్లో గణితం బోధించేవారు. ఆయన హైద్రాబాదుకు బదిలీ అయినారు. అప్పుడు, గణితం బోధించటానికి శ్రీ డి. రాజన్నగారిని, ఇంగ్లీషు బోధించటానికి శ్రీ రంగయ్య నాయుడుగారిని శ్రీ భీమయ్యగారు బదిలీ చేయించినారు. శ్రీ రంగయ్యనాయుడు హెచ్.ఎం.గా ఉన్న సమయం లొ ఓల్డ్ బాయిస్ మీటింగ్ వారు 3 రోజులు ఒక పెద్ద ఉత్సవం జరుపుకున్నారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసి అందరిని ప్రోత్సహించి, ఆశీస్సులందించారు. శ్రీ భీమయ్యగారు హై క్వాలిఫయిడ్ మరియు జీనియస్. యువకులెందరికో ఆయన రోల్ మోడల్గా నిలిచారు. ఎందరో ఆయనను ఆరాధ్య భావంతో గౌరవించేవారు. వారి మాటలనెంతో శ్రద్ధగా విని ఉన్నత స్థానాలకు చేరుకోగలిగారు. ఆ రోజుల్లో కరీంనగర్ జిల్లా మొత్తంలో రెండే పాఠశాలలుండేవి. ఒకటి కరీంనగర్లో, మరొకటి మంథని. ఎక్కడెక్కడో సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసేవారిని, కుటుంబాలకు దగ్గరగా రప్పించారు. పాఠశాల అభివృద్ధికి వారు తోడ్పడేలా చేసారు. మిలట్రీ గవర్నమెంట్లో మెంబర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు నూతన విధానలనెన్నిటినో ప్రవేశపెట్టారు. రీజినల్ లాంగ్వేజ్ ప్రాంతీయ భాష ఉర్దూ నుండి తెలుగుకు మార్పించారు. ఆడపిల్లలకు చదువులు చెప్పించటం శుద్ధ దండగ అని భావించే ఆ రోజుల్లో, వీరు ప్రభుత్వ బాలుర హైస్కూలు శ్రీ వేంకటరాజన్న అవధాని కూతురు ప్రేమలతాదేవి శ్రీలోకే లక్ష్మణశర్మ కూతురు క్రాంతికుమారి ఉన్నతపాఠశాలలో ధరఖాస్తు పెట్టుకుంటే ఆడపిల్లలకు అడ్మిషన్స్ ఇవ్వటానికి రూల్సు ఒప్పుకోవన్నారు. రాజన్న అవధాని హైద్రాబాద్ వచ్చి శ్రీ భీమయ్యగారిని కలిసి విషయం వివరించారు. వెంటనే ఒక ప్రభుత్వ ఉత్తర్వు జి.ఓ. ద్వారా బాలుర హైస్కూల్లో బాలికలకు విద్యాభ్యాసానికి అనుమతి ప్రసాదించారు. ఆ తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు చదువుకొని ఉన్నతస్థానాల్లో రాణించారు. భీమయ్యగారు స్వయంగా తన కూతుర్లు రాధ, కమలలని మాడపాటి హన్మంతరావు స్కూల్లో ఆ రోజుల్లో చదివించారు. శిఖాం (పర్దా బండ్లల్లో) ఆడపిల్లలు వచ్చి చదువుకునేవారట. భీమయ్యగారా పద్ధతిని మార్పించి, స్వేచ్ఛగా స్త్రీలు చదువుకునేటట్లు చేశారు. ఇలా శ్రీ భీమయ్యగారు స్త్రీ విద్యావ్యాప్తికి ఎనలేని కృషి చేసిన మహనీయులు. హైద్రాబాద్ స్టేట్ ప్రజలందరికి ప్రాతఃస్మరణీయుడు. 1938లో ఆయన సిటీ కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు అనేకమంది విద్యార్థుల కాయన యింట్లో ఆశ్రయమిచ్చి అన్నంపెట్టి ఆదుకున్నారు. ఆ సమయంలో ఆయన మార్గదర్శకత్వంలో, ప్రోత్సాహంతో ఎదిగిన వారెందరో. భీమయ్యగారి మాతృమూర్తి అంబక్క అర్ధరాత్రి అతిథులు వచ్చినా వండి వార్చి అరుసుకునే మంచిగుణమున్న మనీషి. భీమయ్య గారికి జన్మనిచ్చిన తల్లి అన్న, జన్మభూమి మంతని అన్నా ఎనలేని గౌరవం.<noinclude><references/> {{rh|తెలంగాణ |503| తేజోమూర్తులు}}</noinclude> 5ei0w94fe5i3eehpo63nd46a6c8oz8w పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/525 104 212248 557532 553464 2026-05-30T09:48:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557532 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుగారి పర్సనల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిని మంథని దర్శింప తీసుకొని వచ్చారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల షెడ్లను, చదువుకుంటున్న విద్యార్థుల స్థితిగతులను తెలియజేశారు. ఆయన ద్వారా ప్రాథమిక స్థాయి నుండి హైస్కూలు వరకు అభివృద్ధి చేసారు. బూర్గుల వారు వెంటనే లారీలలో వందలాది రేకులను పంపగా, తిరిగి షెడ్లను వేయించి స్కూలు నడిపించారు. ఇప్పటికి ఆ షెడ్లు చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. వాటి నీడన చదువుకున్న వెయ్యిమంది విద్యార్థులీనాడు దేశ, విదేశాల్లో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారంటే అది భీమయ్యగారి భిక్షే. ఉద్యమకాలంలో రఘనాథ్ కాబే, పనకంటి గణపతిరావు అవధానుల (హకీం) కిష్టయ్య వంటి స్వాతంత్య్ర సమర యోధులను ఔరంగాబాద్, నిజామాబాద్ జైళ్ళకు వెళ్ళి పరామర్శించి వచ్చిన ధైర్యశాలి. విద్యావంతులు, వివేక వంతులైన మంథని వారికెందరికో జీవనాధారం కల్పించిన కల్పతరువాయన. ఆనాడు హైస్కూలే లేకుంటే పొరుగు ప్రాంతాలకు వెళ్ళి చదువుకునే స్థోమత ఎందరికుండేది? అక్కడ చదువుకున్నవారంతా ఇంజనీర్లు, డాక్టర్లై పిల్లపిల్లతరం వాడున్నారంటే దాని వెనుక త్యాగశీలి భీమయ్యగారి హస్తమే అనటం నిర్వివాదాంశము. కోఠిలోని వై.యం. ఐ.ఎస్.లో ప్రతి సాయంత్రం ఉండేవారని, విద్యావిషయాల్లో గ్రామీణ పరిస్థితులను మెరుగు పరచాలనే తపన ఆయన మాటల్లో ఉండేదని సమకాలికు లంటుంటారిప్పటికి. ఆయన నిస్వార్ధ సేవను తలచుకొని కృతజ్ఞతలర్పిస్తున్నారంటే ఆయనెంతగొప్ప వ్యక్తో ఇప్పటి తరానికి తెలుస్తున్నది. హైదరాబాదుకు పరీక్ష రాయటానికి వచ్చే బంధుమిత్రులెందరో వారింట్లో నెలలుండేవారట. 1934లో ఉస్మానియా యూనివర్శిటీ కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ నుండి బంగారు పతకాన్ని పొందారు. అనేక కార్యక్రమాలు అతి చిన్న వయసులో ముగించి, 6.1.1956 లో అకస్మాత్తుగా మరణించారు. అప్పటికే 6 గురు పిల్లలు, భార్య 6 నెలల గర్భవతి. ఆయన జ్ఞాపకార్థం మంథనిలో వరహాల భీమయ్య టోర్నమెంట్సుని డిసెంబర్ నెలలో విద్యార్థులచే ఆడించి, జనవరి 26కు బహుముతులందిస్తున్నారు. ఇంతకుముందీ ఆటలు తాలూకా లెవల్ నుండి జిల్లా స్థాయివరకుండేవి. వరహాల భీమయ్య మెమోరియల్ గోల్డ్ మెడల్ వారి కుటుంబ సభ్యులిప్పటికి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్కిస్తున్నారు. 1973లో ఆ పతకం అందుకున్న వారిలో వైస్ ఛాన్సలర్ శ్రీ జె. అనంతస్వామి ఉన్నారు. ఇన్ని ప్రశంసలందుకొని, ఎంతోమందికి నిస్వార్థంగా సహాయపడిన మహామనీషి శ్రీ వరహాల భీమయ్యగారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |504| తేజోమూర్తులు}}</noinclude> affedqgp9tm70ho7ktpqrz2i30bp5ms పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/526 104 212249 557534 553465 2026-05-30T09:55:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557534 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''147. వట్టికోట ఆళ్వారుస్వామి '''</p>}} {{right|- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ}} తెలంగాణా నవలా సాహిత్యం... అనగానే స్ఫురించే మొదటి పేరు వట్టికోట ఆళ్వారుస్వామి. 'అబద్ధాసురుని పాలిట తల్వార్ ఆళ్వార్' అంటూ ఆళ్వారు స్వామిని కాళోజి అభివర్ణించాడు. దాశరథి తమ 'అగ్నిధార' కావ్యాన్నీ, కేతవరపు రామకోటిశాస్త్రి తమ పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథాన్నీ, దాశరథి రంగాచార్య 'జనపదం' నవలనూ శ్రీ వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితమిచ్చి తమ గౌరవాన్ని ప్రకటించారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ సమీపాన గల 'మాధవరం' అనే గ్రామంలో 1915 నవంబర్ ఒకటిన నిరుపేద శ్రీవైష్ణవ బ్రాహ్మణ దంపతులు శ్రీమతి సింహాద్రమ్మ, శ్రీమాన్ రామచంద్రాచార్యులకు పుట్టిన బిడ్డ ఆళ్వార్ స్వామి. నిరుపేద కుటుంబం, దుర్భర దారిద్య్రం, బాల్యంలో చదువు వంటబట్టలేదు. బడిమాని, ఇంట్లోంచి పారిపోయి వచ్చి, హెూటల్ సర్వర్గా పనిలో కుదిరాడు. నెలకు నాలుగు రూపాయల జీతం. చాలీచాలని జీతంతో జీవితయాత్ర కొనసాగిస్తున్న ఆళ్వార్ స్వామి పన్నెండవ ఏట, వారి తండ్రి మరణించారు. నకిరేకల్ వాస్తవ్యులు శ్రీ కంచినేపట్టి సీతారామారావనే ఉపాధ్యాయుడికి వంట చేసి పెడుతూ, ఆళ్వార్ అతని వద్ద విద్యాభ్యాసం కొనసాగించాడు. ఆ ఉపాధ్యాయుడు సూర్యాపేటకు బదిలీ కావటంతో ఆళ్వార్ స్వామి కూడా గ్రామం నుండి తాలూకా కేంద్రానికి నివాసాన్ని మార్చాడు. కొత్త వాతావరణం, కొత్త పరిచయాలు అతనిలో నూతన ఉత్తేజాన్ని నింపాయి. 1928-29 సంవత్సరాల నడుమ శ్రీ కోదాటి నారాయణరావుగారితో సూర్యాపేటలో పరిచయం ఏర్పడింది. కొంతకాలం గడిచాక కందిబండ గ్రామానికి చెందిన శ్రీ నారపరాజు రాఘవరావుగారింటికి అళ్వార్ స్వామి తన మకాం మార్చాడు. రాఘవరావు గారిది సంపన్న కుటుంబం. అతిథి, అభ్యాగతులకు ఆదరణ, గౌరవమిచ్చే కుటుంబంతో అతనికి అతి స్వల్పకాలంలోనే సాన్నిహిత్యం ఏర్పడింది. రాఘవరావుగారి సోదరుల్లో ఒకడిగా ఆళ్వార్ స్వామి కలిసిపోయాడు. నారపరాజు సోదరులు తమ తండ్రి జ్ఞాపకార్థం 'సీతారామ గ్రంథాలయాన్ని' నెలకొల్పారు. విలువైన గ్రంథాలనూ, అందుబాటులో ఉన్న పత్రికలనూ తమ గ్రంథాలయానికి తెప్పించడం ప్రారంభించారు. దీంతో సహజంగానే ఆళ్వారా స్వామి పఠనాసక్తి, పత్రికా పఠనం పెంపొందించాయి. 1933 ప్రాంతంలో శ్రీ యామనాచార్యుల ప్రోద్బలంతో ఆళ్వార్ స్వామి హైదరాబాద్ పట్టణానికి తన మకాం మార్చాడు. అప్పటికే హైదరాబాద్ కు చేరి, అక్కడ గోలకొండ పత్రికలో శ్రీ కోదాటి నారాయణరావు ఫ్రూఫ్ రీడర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఉద్యోగాన్ని మానేయాలని కోదాటి<noinclude><references/> {{rh|తెలంగాణ |504| తేజోమూర్తులు}}</noinclude> myx14k7mi8flai0j5foaece3b54k1mk పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/527 104 212250 557548 553466 2026-05-30T11:55:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> వారు భావిస్తున్న రోజుల్లో వారికి ఆళ్వారస్వామి కన్పించాడు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సిఫారసు చేసి, కోదాటి నారాయణరావుగారు ఆళ్వార్ స్వామికి గోలకొండ పత్రికలో ప్రూఫ్ రీడర్ గా ఉద్యోగం ఇప్పించారు. నెలకు పదిహేను రూపాయల జీతం. అతికష్టంగా సరిపోయేది. జీతం సంగతి ఎలా ఉన్నా పత్రికాఫీసులో పనిచేయడం వలన సమాజాన్ని, జీవితాన్ని, సాహిత్యాన్ని అధ్యయం చేసే అవకాశం ఆళ్వార్కి దొరికింది. కొంతకాలానికి ఆళ్వారస్వామి ఈ ఉద్యోగం మానేసి, మళ్ళీ కందిబండలోని రాఘవరావు గారి కుటుంబాన్ని ఆశ్రయించాడు. అక్కడి గ్రంథాలయంలోని అనేక గ్రంథాలను ఆసక్తిగా వరించాడు. అంతేకాదు క్రమంగా రచనా వ్యాసంగం ప్రారంభించాడు. ఆంగ్ల భాషాధ్యయనంపై అతని దృష్టి మళ్లింది. స్వయంకృషితో ఆంగ్లం నేర్చుకోవడం ప్రారంభించాడు. నారపరాజు వారి కుటుంబం తరచుగా బెజవాడ వెళ్లి వస్తూ ఉండేది. ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసి పోయిన ఆళ్వార్ కూడా మివాడకు వెళ్తూ ఉండడంతో, అక్కడి 'వెల్కం హెూటల్' వారితో ఇతనికి పరిచయమేర్పడింది. హెూటల్ యాజమాన్యంతో మాట్లాడి, అక్కడ సర్వర్ ఉద్యోగంలో చేరాడు. ఉచిత భోజన వసతులతో పాటు అరవై రూపాయల నెల జీతానికి కుదిరాడు. తన సంపాదన నుండి ఎనిమిది రూపాయల ఫీజు చెల్లించి, ఇంగ్లీషు తరగతులకు హాజరయ్యాడు. జీతం రాళ్లను పొదుపుగా ఖర్చు పెడుతూ, కొంత డబ్బు మిగిల్చి పుస్తకాలనూ, పత్రికలనూ కొని చదవడం కొనసాగించాడు. 1934-36 నడుమ రెండేళ్ళపాటు బెజవాడ హెూటల్ కార్మికుడిగా పని చేయడంతో ఆళ్వార్స్వమి జీవితం కొత్తమలుపు తిరిగింది. అప్పటి బెజవాడ, మద్రాసు రాజధానిగా బ్రిటిష్ పరిపాలనలో ఉండేది. నిజామాంధ్ర ప్రాంతంతో పోలిస్తే సాంస్కృతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రాంతం. పత్రికాస్వేచ్ఛ, సభా స్వేచ్ఛలుండేవి. వెట్టి చాకిరి ఉండేదికాదు. ఏదో ఒక మేరకు ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుండేవి. నారపరాజు రాఘవరావుగారి కుటుంబ సభ్యుల అవసరాల నిమిత్తం 1986లో ఆళ్వారస్వామి తన నివాసాన్ని బెజవాడ నుండి హైదరాబాదుకు మార్చాల్చి వచ్చింది. హైదరాబాదులో ఉన్నత విద్య చదువుకుంటున్న నారపరాజు కుటుంబ సభ్యులకు వంట చేసి పెడుతూ, తీరిక సమయంలో వారి వద్ద ఇంగ్లీషు విద్యను కొనసాగించాడు. ప్రజాహిత సంస్థలతో, సంఘసేవకులతో, సాహితీవేత్తలతో క్రమంగా ఆళ్వార్ స్వామి పరిచయాలు పెంచుకున్నాడు. సికింద్రాబాద్లోని యువకులను సమీకరించి, చైతన్యపరచి, వారిని సామాజిక సేవా రంగంవైపు ఆకర్షించాడు. గ్రంథాల యోద్యమంతో, ఆంధ్రోద్యమంతో సంబంధాలు ఏర్పడ్డాయి. నిజామాబాద్లో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభలో సికింద్రాబాద్ ప్రాంతం నుండి ఏకైక ప్రతినిధిగా హాజరయ్యాడు. 'ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం'లో కొంతకాలం పాటు కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు. శ్రీమతి రాచమల్ల సత్యవతీదేవి సంపాదకత్వాన ప్రారంభమైన 'తెలుగుతల్లి' పత్రికను కొంతకాలం పాటు ఆళ్వార్ స్వామి నిర్వహణ బాధ్యతలు చేపట్టి వెలువరించాడు. 1938లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు స్ఫూర్తితో 'దేశోద్ధారక గ్రంథమాల'ను ఆళ్వార్స్వమి నెలకొల్పాడు. ఆరవ ఆంధ్ర మహాసభలో అతివాదుల పక్షం వహించిన ఆళ్వార్స్వామి, చిలుకూరులో జరిగిన ఎనిమిదవ ఆంధ్ర మహాసభలో మితవాదుల వెనక నిలిచాడు. 1942 నాటి క్విట్ ఇండియా ఉద్యమ ప్రేరణతో సికింద్రాబాద్ లో జరిగిన సత్యాగ్రహంలో కాంగ్రెస్ వాదిగా పాల్గొన్న ఆళ్వారస్వామిని నిజాం ప్రభుత్వం అరెస్టు చేసింది. సికింద్రాబాద్ జైలులో ఏడాదిపాటు జైలు జీవితాన్ని గడిపాడు. అక్కడే కమ్యూనిస్టు పార్టీ నాయకులతో సాన్నిహిత్యం ఏర్పడింది. కమ్యూనిజం ఆదర్శాలు, లక్ష్యాలు, పోరాట నిబద్ధతలతో ప్రభావితుడైనాడు. జైలు నుండి విడుదల కాగానే ఆంధ్ర మహాసభకు ఆర్గనైజర్ గా పనిచేస్తూ హైదరాబాద్ జిల్లా శాఖకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1944లో మీ స్మాయిల్ ప్రధానిగా నియమింపబడ్డాడు. కమ్యూనిస్టు పార్టీపై విరుచుకుపడ్డాడు. పెద్ద ఎత్తున కార్యకర్తల అరెస్టులు జరిగాయి. ఆళ్వార్స్వేమిని అరెస్టు చేసిన నిజాం పోలీసులు రెండేళ్ళ పాటు సంగారెడ్డి, గుల్బర్గా, హైదరాబాద్, వరంగల్ రైళ్ళలో తిప్పారు. కారాగార జీవితాన్ని గ్రంథపఠనానికి, మేధోవికాసానికి ఉపయోగించుకున్నాడు. జైల్లో తోటి ఖైదీలకు చక్కని విజ్ఞానాన్ని అందించడంతోపాటు,<noinclude><references/> {{rh|తెలంగాణ |506| తేజోమూర్తులు}}</noinclude> c5vjr1tb0zkx2l6oxuoqsuxx6vn1svn పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/115 104 212560 557517 557473 2026-05-30T03:46:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 557517 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. మహోగ్రపు = మిక్కిలిదుస్సాధ్యములగు; నోములు నోచుచున్న = వ్రతములు చేయుచున్న; సేమమునన్ = నియమమువలన; ఉల్లము = మనస్సు; హృద్రాగ...ప్రవర్తికిన్ = మించినప్రేమతో గోపకన్యకలను= కౌఁగిలించుటలో నేర్పుకలవానికి; చతుర్ముఖవంచితధూర్తకీర్తికిన్ = బ్రహ్మను వంచించినకీర్తి కలవానికి, (ఇట 'వంచితచతుర్ముఖ' అనుటకు మాఱుగా 'చతుర్ముఖవంచిత' అను సమాసము ˈఅహితాగ్నిˈ వంటిది.] వత్సాహరణసమయమున బ్రహ్మను కృష్ణుఁడు వంచించుట ప్రసిద్ధము. {{Telugu poem|type=సీ.|lines=<poem>యతిమనోహరదీపికాంకూర మగులీల గోవర్ధనాచలగుహ మెలఁగుచు గిరికూటతటరటత్కేకిరాజమురీతి రాధచన్గవమీఁద వ్రాలి నగుచుఁ జిత్రాభ్రముల నేలు సుత్రాముకైవడి బలువన్నెయాలమందల మెలఁపుచు కమలకాననమధ్యకల<ref>చ. హంసము విభాతి</ref>హంసవిభుభాతిఁ గూర్మినెచ్చెలిపిండు గొని చెలఁగుచుఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>జంద్రబింబంబునకు మృదుస్వనము గఱపు రచనసంజ్ఞార్హశంఖ మూఁదుచు నొనర్చు నాఁట లన్నియుఁ జాలించి యరిగెఁ దపసి పర్ణశాలకు దేవకీతర్ణకంబు.</poem>|ref=31}} '''టీక'''. యతిమనోగృహదీపికాంకూరము = యతుల మనస్సు లను గృహములందలి దీపకళికలు; గిరి...రీతిన్ = కొండచరియప్రదేశములందు కేకలు వేయు నెమిలిరాజువలె; వ్రాలి = ఒఱఁగి; [ఇట రాధచన్గవ కొండలతోఁ బోల్పఁబడినది.] చిత్రాభ్రముల నేలు = రంగురంగులమేఘములను పాలించు; సుత్రాముకైవడిన్ = ఇంద్రునివలె; కూర్మినెచ్చెలిపిండున్ = తోడిమిత్రులసమూహమును; మృదుస్వనమున్ = మధురధ్వనిని; కఱపురచనన్ = నేర్పురీతిని; సంజ్ఞార్హశంఖము = తత్తత్సంకేతమును బోధచేయు శంఖము; [ఇచట కృష్ణునిముఖము చంద్రబిలమువలె నున్నదనియు, నతఁడు శంఖమును పూరింపఁగా చంద్రబింబమునకు మధురధ్వని యబ్బినట్లున్నదనియు పోలిక.] దేవకీతర్ణకంబు = దేవకీదేవిబిడ్డ - శ్రీకృష్ణుఁడు; '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=చ.|lines=<poem>లలితశిరీషపుష్పమృదులంబులు నీచరణంబు లక్కటా! యిల యిది రూక్ష మిట్టు లలయించుట <ref>ర. గాదేని</ref>గా దని పార్ధనామృదూ క్తులు సెలఁగంగ <ref>చ.శ.ర. వేపొదలి</ref>వెన్ పొదివి తొల్చదువుల్ తగువిన్నపంబులం బలుమఱుఁ జేయుచందమున బంగరుటందియ లుగ్గడింపఁగన్.</poem>|ref=32}} '''టీక'''. లలిత...లంబులు = చక్కనితిరిసెనపూవువలె మెత్తనివి; నీచరణంబులు = నీపాదములు; ఇల = నేల; రూక్షము = కఠినము; ఇట్టు లలయించుట కాదు = (ఆపాదములను) ఇట్లు కష్టపెట్టుట తగదు; అని; ప్రార్థనామృదూక్తులు = ప్రార్థించు నొప్పిదపుమాటలు; చెలఁగంగన్ = ప్రకాశింపఁగా; వెన్{{ZWNJ}}పొదివి = వెంటనంటి, తొల్చదువుల్ = వేదములు; పలుమఱు = పెక్కుసారులు; ఉగ్గడించఁగన్ = మ్రోఁగఁగా; శ్రీకృష్ణుఁడు పరుగిడి పుండరీకునియొద్దకుఁ బోవునపుడు కాలియందెలు మధురముగ ధ్వని చేయుచుండెను; ఆ చప్పుడు 'కఠినమైన నేలమీఁద మెత్తని నీయడుగు లిడుట న్యాయము కా'దని వేదములు వెంటఁబడి మొఱపెట్టుచున్నట్లున్నదని ఉత్ప్రేక్ష. {{Telugu poem|type=క.|lines=<poem>మెత్తఁగ నూఱిన<ref>చ. మట్టుం</ref>చుట్టుం గత్తిన్ మధుకైటభోరుకంఠము లలనాఁ డొత్తిన హత్తిన చెన్నుం దిత్తులక్రియఁ దొడలయడ్డతిత్తులు వ్రేలన్.</poem>|ref=33}} '''టీక'''. మెత్తగ నూఱిన = చక్కఁగా సానఁబట్టిన; చుట్టుంగత్తిన్ = చక్ర మను నాయుధముచే; మధు...ములు = మధుకైటభు లను రాక్షసుల గొప్పకంఠములను; అలనాఁడు = పూర్వము; ఒత్తినన్ = ఖండింవఁగా; హత్తిన = అంటుకొన్న; చెన్నుందిత్తులక్రియన్ = సొగసైన సంచులవలె నున్న; తొడలయడ్డలిత్తులు = తొడలప్రక్కల నున్న గ్రచ్చకాయల సంచులు, [చక్రముచే మధుకైట<noinclude><references/></noinclude> 5qgrp3tl5n4hb39r862aqovnqv4dz6z పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/116 104 212561 557519 557479 2026-05-30T03:47:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 557519 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>భుల కంఠములను తెగవ్రేయునపుడు ఆభాగములందున్న తిత్తులు చక్రమున కంటుకొని రాగా, వానినే కృష్ణుఁడు గ్రచ్చకాయల సంచులఁగాఁ జేసికొన్నాఁడని వర్ణింపఁబడినది.] అలం. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>మాయావృతుఁ డగు నాత్ముని సోయగమునఁ <ref>చ. దెగడి</ref>దెగడి తీఁగసోగల ముచ్చు ట్టై యునికి సంగరహితం <ref>చ. బయ్యున్</ref>బయ్యెన్; గాకున్న జఘన మభిరామ మగున్.</poem>|ref=34}} '''టీక'''. మాయావృతుఁడగు = మాయచే ఆవరింపఁబడిన; సోయగమునన్ = చక్కఁదనముచేత; తెగడి = తిరస్కరించి; ముచ్చుట్టై = మూఁడుచుట్టులు కలదై; ఆత్మ మాయచే ఆవరింపఁబడియుందును; శ్రీకృష్ణునికటిని మాయను బోలిన వసనము ఆవరించియుండలేదు. [అతఁడు దిగంబరుఁడు.] అది ఈకటిని ఆవరింపకుండునట్లు మూఁడుచుట్లుగా తీగ కట్టఁబడియున్నది. కాన మాయావృతాత్మను శ్రీకృష్ణుకటి మీఱియున్నదని వర్ణితము. '''అలం'''. వ్యతిరేకము. {{Telugu poem|type=క.|lines=<poem>ఇట నభ మిట భూవలయం బిట బలిసద్మంబు నుండు నిరవు లని యనన్ బటువు లగు వళులచెలువునఁ బుటపుటనై యున్నచిన్నిబొజ్జ గదలఁ<ref>చ. గాన్</ref>గన్.</poem>|ref=35}} '''టీక'''. భూవలయంబు = భూగోళము; బలిసద్మంబు = పాతాళము; ఇరవులు = చోటులు; బటువులగు = గుండ్రని; వళులచెలువునన్ = ముడుతల (త్రివళుల) యందముచేత; పుటపుటనై యున్న = వృద్ధిపొందియున్న. '''అలం'''. ఉత్ప్రేక్ష. {{Telugu poem|type=చ.|lines=<poem>తులసికిఁ బచ్చరాకుదురు తోయదవాహనరత్నవేది య క్కలిమిమెఱుంగుఁబోఁడికిని గౌస్తుభఘర్మగభస్తికిన్ నభ <ref>స్థలము</ref>స్తలము ననంగఁ బొల్చి నిరతంబు కృపావిభవంబు <ref>చ. నిట్టిచో</ref>నింటి బో ర్తలుపుఁ దలంపు సేయుచు నురంబు కరంబు పరిస్ఫురింపఁగన్.</poem>|ref=36}} '''టీక'''. పచ్చరాకుదురు = పచ్చలు తాచిన కుదురు; తోయదవాహనరత్నవేది = ఇంద్రనీలములతిన్నె: కౌస్తుభఘర్మగభస్తికిన్ = కౌస్తుభ మను వేఁడివెలుంగు (సూర్యు)నట్టి; నభస్తలము = ఆకాశప్రవేశము; పొల్చి = ప్రకాశించి; నిరతంబున్ = ఎల్లపుడును; కృపా...లుపున్ = దయాసంపదయను నింటియొక్క వీథి (పెద్ద)తలుపును; తలంపు సేయుచున్ = సరిపోలుచు; కరంబు = మిక్కిలి; పరిస్ఫురించఁగన్ = ప్రకాశింపఁగా. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=క.|lines=<poem>కలుష<ref>చ. జగ</ref>ఖగవధవిధానా కలితఘుటిక లనఁగ గ్రచ్చకాయలు వలచే నెలకొను నల జిలిబిలి వ న్నెల వన్నెలసంచి నిండి యిం పలరారన్.</poem>|ref=37}} '''టీక'''. కలుష...ఘుటికలు = పాపములను పిట్టలను చంపుటకు సంగ్రహించినగుండ్లు; జిలిబిలివన్నెల = ముద్దుముద్దురంగులుగల; వన్నెలసంచి = అందమైనసంచి. '''అలం'''. ఉత్ప్రేక్ష. {{Telugu poem|type=క.|lines=<poem>లలితనిజ<ref>చ. ధామ. సూర్య</ref>వామకరతల కలిత<ref>చ. కరత్కం</ref>కనత్కంబుకాంతి కలకల నవ్వన్ గలువలచెలిగిలిగింతల నలువగు ఱాలన్ బిసాళినలువగుఱాలన్.</poem>|ref=38}} '''టీక'''. లలిత...కాంతి = అందమైన తనయెడమచేతియందుండి ప్రకాశించు శంఖముయొక్క కాంతి; కలువల...ఱాలన్ = చంద్రకాంతిప్రసారమున ఒప్పిదములగు చంద్రకాంతములను; పిసాళినలువగుఱాలన్ = ప్రకాశించునట్టి హంసలను; కలకల నవ్వన్ = తిరస్కరింపఁగా. '''అలం'''. ఉపమ, యమకము. {{Telugu poem|type=క.|lines=<poem>నిజధైర్యౌచార్యములను గజములకుం బొడము నిడుదకరములఁ బోలెన్</poem>|ref=}}<noinclude><references/></noinclude> 9ydxg49yeyo3p9d6fhtk1yfqbnxm9nr పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/117 104 212562 557509 554782 2026-05-29T21:49:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557509 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>భుజములు పోషితభక్త వ్రజములు కరవిజితపుష్కరజములు పొదలన్.</poem>|ref=39}} '''టీక'''. పొడము = పుట్టిన; నిడుదకరములఁబోలెన్ = పొడవైన తొండములవలె; పోషిత...ములు = భక్తులసమూహమును పోషించు(రక్షించు)నవి; కరవిజితపుష్కరజములు = తామరపూవులను జయించు (తామరపూలను మించు) అఱచేతులు కలవి. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>వదనైకస్తంభకనక సదనము <ref>చ. కిరికొర</ref>సిరికొఱ కొనర్చు స్రష్ట నిలుపు న మ్మొదలింటిశంఖశంకువొ యిది యనఁగాఁ గంబుకంఠ మింపు వహింపన్.</poem>|ref=40}} '''టీక'''. వదనైకస్తంభకనకసదనము సిరికొఱకున్ = ముఖమును నొంటికంబపుబంగారుమేడ శోభకయి; స్రష్ట = సృష్టి చేయువాఁడు - బ్రహ్మ; మొదలింటిశంఖశంకువొ = మొదటి శంకుస్థాపన చేయుటకొఱకగు శంఖమువంటి మేకో; కంబుకంఠము = శంఖమువలె నున్న మెడ. '''అలం'''. ఉత్ప్రేక్ష. {{Telugu poem|type=క.|lines=<poem>బింకపు<ref>క. వ్రాఁతల, శ.ర. వ్రేఁతల</ref>వ్రేఁతల వాతెఱ మంకెనపూఁదేనెతేట మానక <ref>క. పైపై</ref>పైఁ బై నింకఁగ నింకఁగఁ <ref>శ.ర. బలుమఱు</ref>బల్మఱుఁ బంకించుటఁబోలె మోవి బచ్చెన హెచ్చన్.</poem>|ref=41}} '''టీక'''. బింకపు...తేట = బింకమైన గొల్లఁతల ఎఱ్ఱనిపెదవులందలి మంకెనపూఁదేనెవంటి అమృతము; పంకించుటఁబోలెన్ = పూయుటచేతనో యనునట్లు; బచ్చెన = రంగు - ఎఱుపురంగు. '''అలం'''. ఉత్ప్రేక్ష. {{Telugu poem|type=క.|lines=<poem>తళుకుమొగము నెలపదకము నెలవున నిడుతీరు గాఁగ నిలిపిన యాఖం డలనీలకళికక్రియ ని ట్టలమై స్ఫుటనాసికాపుటము దీపింపన్.</poem>|ref=42}} '''టీక'''. తళుకు...నెలవులన్ = ప్రకాశించు ముఖమును నెలపదకమునందు; ఇడుతీరుగాఁగన్ = నెలకొల్పుపద్ధతిగా; నిలిపిన = ఉంచిన; అఖండలనీలకళికక్రియన్ = ఇంద్రనీలపుమొగ్గవలె; నిట్టులమై = హెచ్చుగానుండి; నాసికాపుటము = ముక్కు. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=తే.|lines=<poem>తళుకుఁజె<ref>క. క్కులు</ref>క్కుల మకరకుండలకలాప మరకతద్యుతిరింఛోళి హరిణ<ref>క. లక్ష్మి, చ. లక్ష్మ</ref>లక్ష్మి మండలంబున లాంఛనమంజిమములు గానిపించువిధంబునఁ గలయఁ బ్రాఁక.</poem>|ref=43}} '''టీక'''. మకర...రింఛోళి = చెవులయందలి మకరకుండలములందలి మరకతమణుల కాంతిసమూహము; హరిణమండలములన్ = చంద్రబింబములందు; లాంఛనమంజిమములు = చిహ్నములమనోజ్ఞతలు; కలయఁబ్రాఁకన్ = అంతటను వ్యాపింపఁగా, చెక్కిళ్లు చంద్రబింబములవలెను, వానిపై వ్రేలాడు మకరకుండలములలోని మరకతమణులు చంద్రునిలోని మచ్చలవలెను ఉన్నవని భావము. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=చ.|lines=<poem>తరళమసారసారనిభతారకముల్ సితపద్మపత్రబం ధురములు రాధికాహృదయతోయజకోరకబోధనక్రియా తరుణతరార్కరుగ్విలసితస్ఫుటరక్తిమసక్తకోణభా స్వరములు సూక్ష్మపక్ష్మములు వాలికకన్నులు చెన్ను మీఱఁగన్.</poem>|ref=44}} '''టీక'''. తరళ...కముల్ = చలించు నింద్రనీలములవంటి కనుపాపలు కలవి; సిత...ములు = తెల్లతామరఱేకులవలె ఒప్పిదమైనవి; రాధికా...భాస్వరములు = రాధయొక్క హృదయమనెడి తామరమొగ్గను వికసింపఁజేయుటకైన లేఁతయెండయొక్క ప్రకాశమువలె స్ఫుటమైన ఎఱ్ఱనికాంతితోఁ గూడిన కనుగొలుకులచేఁ బ్రకాశించునవి; వాలికకన్నులు = వెడఁద లగు కన్నులు; చెన్ను మీఱఁగన్ = ప్రకాశింపఁగా. '''అలం'''. ఉపమ, రూపకము.<noinclude><references/></noinclude> 35qjbkrxgdefch1pw951rasalbhpmiz పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/118 104 212563 557511 554783 2026-05-29T23:56:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557511 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>అలకతిమిరంబు తనుఁగప్పునను భయమున ముఖసుధాసూతి నునువెల్గు ములికిఁ గూర్చి నవదరించిన సింగిణిచాయ నొసలి వంకచూపునఁ <ref>క. దగ, చ. దగె</ref>దగెఁ గఱివంకబొమలు.</poem>|ref=45}} '''టీక'''. అలకతిమిరంబు = ముంగురులనెడి చీఁకటి; ముఖసుధాసూతి = ముఖచంద్రుఁడు; నునువెల్గుములికిన్ కూర్చి = లేఁతవెన్నెల యను బాణమును సంధించి; సవదరించిన = పట్టిన; సింగిణిచాయన్ = వింటివలె; వంకచూపునన్ = ఓరచూపున; కఱివంకబొమలు = నల్లనై వంకరగనున్న కనుబొమలు; తగెన్ = ప్రకాశించెను. '''అలం'''. రూపకము, ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>బలభిదుపలాద్రిమౌళిన్ బలపలగాఁ బొదువు ముదిరపటలముపగిదిన్ లలితోత్తమాంగతలమున జిలుగుం <ref>క. దళుకొత్తు, చ. దొలుక్రొత్త, శ.ర. దెలిక్రొత్త</ref>దెలిక్రొత్తచలిదిచిక్కము దనరన్.</poem>|ref=46}} '''టీక'''. బలభిదుపలాద్రిమౌళిన్ = ఇంద్రనీలములకొండకొమ్మున; పలపలగాన్ = విరళముగా; పొదువు = వ్యాపించు; ముదిరిపటలముపగిదిన్ = మేఘములగుంపువలె; లలితోత్తమాంగతలమునన్ = మనోజ్ఞమగుతలపైని; '''అలం.''' ఉపమ. {{Telugu poem|type=శా.|lines=<poem>దిగ్వాసుం డురుపింఛలాంఛితశిఖోదీర్ణుండు వర్షాపయో ముగ్వర్ణుండు నవాంబుజాహితలతాముక్తాంగదుండున్ సుధా రుగ్విస్మేరముఖుం డనంగ శతజిద్రూపాధికుం డగ్రభూ <ref>క. వాగ్గర్వో, చ. వాగ్వర్గో</ref>వాగ్వర్గోద్భవభూమి శ్రీవిభుడు శ్రీవత్సాంకవక్షుండునై.</poem>|ref=47}} '''టీక'''. దిగ్వాసుడు = దిగంబరుఁడు; వర్షపయోముగ్వర్ణుండు = వానకాలపుమేఘమువలె (నల్లని)రంగు కలవాఁడు; నవాంబు...గదుండు = లేఁతనెలవంకవంటి ముత్యాలభుజకీర్తి కలవాఁడు; సుధారుగ్విస్మేరముఖుండు = చంద్రునివలె వికాసముకలముఖము కలవాఁడు; అనంగశతజిద్రూపాధికుండు = వందలకొలదిగ నుండు మన్మథులను మించిన చక్కఁదనము కలవాఁడు; అగ్ర...భూమి = తొలిపలుకులగు వేదములు పుట్టుటకు కారణమైనవాఁడు; [పూర్వటీకలో 'అగ్రభూబాగ్గర్వోద్భవభూమి = బ్రాహణుల మాటగర్వమునకుఁ బుట్టినచోటు" అని కలదు. ఆ మూలము, వ్యాఖ్యానము అయుక్తములు.] '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem><ref>శ.ర. నుడువు</ref>నొడువుల పడఁతుక మగనికిఁ బొడచూపని తనదురూపు పొడ గనిపించెన్ జడనిధిశయనుఁడు కొంగున <ref>చ. ముడి</ref>ముడిచినమణి గాదె భక్తముఖ్యుల కెల్లన్.</poem>|ref=48}} '''టీక'''. నొడువుల...మగనికిన్ = సరస్వతికి భర్తయగు బ్రహ్మకు; పొడసూపని = చూపని; పొడగనిపించెన్ = కనుపడునట్లు చేసెను - చూపెను; జడనిధిశయనుఁడు = సముద్రమున నిద్రించువిష్ణువు; '''అలం'''. కావ్యలింగము. {{Telugu poem|type=క.|lines=<poem>నిగనిగనివిదళకదళి యుగళిన్నగి జిగిదొలంకు నూరులఁ గని చొ క్కు గదురఁజేయు జగత్పతి దగిలి కనుంగొనుచు మునిమదావళ మెలమిన్.</poem>|ref=49}} '''టీక'''. నిగనిగని = కళకళలాడు; విదళకదళీయుగళిన్ = ఆకులు లేని రెండనఁటిబోదెలను; నగి = నవ్వి - తిరస్కరించి; జిగి దొలంకు = కాంతులనీను; చొక్కున్ = పరవశతను; కదురఁజేయున్ = కల్గించును; మునిమదావళము = మునిశ్రేష్ఠుఁడు; ఎలమిన్ = ప్రీతితో; ['చొక్కుఁ గదురన్ = పరవశత్వము కలుఁగగా' అని పూర్వటీక. అది యనుచితము.]<noinclude><references/></noinclude> o1iwmmbav3lggdnmfnjtogmuxok41gb 557520 557511 2026-05-30T03:52:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 557520 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>అలకతిమిరంబు తనుఁగప్పునను భయమున ముఖసుధాసూతి నునువెల్గు ములికిఁ గూర్చి నవదరించిన సింగిణిచాయ నొసలి వంకచూపునఁ <ref>క. దగ, చ. దగె</ref>దగెఁ గఱివంకబొమలు.</poem>|ref=45}} '''టీక'''. అలకతిమిరంబు = ముంగురులనెడి చీఁకటి; ముఖసుధాసూతి = ముఖచంద్రుఁడు; నునువెల్గుములికిన్ కూర్చి = లేఁతవెన్నెల యను బాణమును సంధించి; సవదరించిన = పట్టిన; సింగిణిచాయన్ = వింటివలె; వంకచూపునన్ = ఓరచూపున; కఱివంకబొమలు = నల్లనై వంకరగనున్న కనుబొమలు; తగెన్ = ప్రకాశించెను. '''అలం'''. రూపకము, ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>బలభిదుపలాద్రిమౌళిన్ బలపలగాఁ బొదువు ముదిరపటలముపగిదిన్ లలితోత్తమాంగతలమున జిలుగుం <ref>క. దళుకొత్తు, చ. దొలుక్రొత్త, శ.ర. దెలిక్రొత్త</ref>దెలిక్రొత్తచలిదిచిక్కము దనరన్.</poem>|ref=46}} '''టీక'''. బలభిదుపలాద్రిమౌళిన్ = ఇంద్రనీలములకొండకొమ్మున; పలపలగాన్ = విరళముగా; పొదువు = వ్యాపించు; ముదిరిపటలముపగిదిన్ = మేఘములగుంపువలె; లలితోత్తమాంగతలమునన్ = మనోజ్ఞమగుతలపైని; '''అలం.''' ఉపమ. {{Telugu poem|type=శా.|lines=<poem>దిగ్వాసుం డురుపింఛలాంఛితశిఖోదీర్ణుండు వర్షాపయో ముగ్వర్ణుండు నవాంబుజాహితలతాముక్తాంగదుండున్ సుధా రుగ్విస్మేరముఖుం డనంగ శతజిద్రూపాధికుం డగ్రభూ <ref>క. వాగ్గర్వో, చ. వాగ్వర్గో</ref>వాగ్వర్గోద్భవభూమి శ్రీవిభుడు శ్రీవత్సాంకవక్షుండునై.</poem>|ref=47}} '''టీక'''. దిగ్వాసుడు = దిగంబరుఁడు; వర్షపయోముగ్వర్ణుండు = వానకాలపుమేఘమువలె (నల్లని)రంగు కలవాఁడు; నవాంబు...గదుండు = లేఁతనెలవంకవంటి ముత్యాలభుజకీర్తి కలవాఁడు; సుధారుగ్విస్మేరముఖుండు = చంద్రునివలె వికాసముకలముఖము కలవాఁడు; అనంగశతజిద్రూపాధికుండు = వందలకొలదిగ నుండు మన్మథులను మించిన చక్కఁదనము కలవాఁడు; అగ్ర...భూమి = తొలిపలుకులగు వేదములు పుట్టుటకు కారణమైనవాఁడు; [పూర్వటీకలో 'అగ్రభూబాగ్గర్వోద్భవభూమి = బ్రాహ్మణుల మాటగర్వమునకుఁ బుట్టినచోటు" అని కలదు. ఆ మూలము, వ్యాఖ్యానము అయుక్తములు.] '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem><ref>శ.ర. నుడువు</ref>నొడువుల పడఁతుక మగనికిఁ బొడచూపని తనదురూపు పొడ గనిపించెన్ జడనిధిశయనుఁడు కొంగున <ref>చ. ముడి</ref>ముడిచినమణి గాదె భక్తముఖ్యుల కెల్లన్.</poem>|ref=48}} '''టీక'''. నొడువుల...మగనికిన్ = సరస్వతికి భర్తయగు బ్రహ్మకు; పొడసూపని = చూపని; పొడగనిపించెన్ = కనుపడునట్లు చేసెను - చూపెను; జడనిధిశయనుఁడు = సముద్రమున నిద్రించువిష్ణువు; '''అలం'''. కావ్యలింగము. {{Telugu poem|type=క.|lines=<poem>నిగనిగనివిదళకదళి యుగళిన్నగి జిగిదొలంకు నూరులఁ గని చొ క్కు గదురఁజేయు జగత్పతి దగిలి కనుంగొనుచు మునిమదావళ మెలమిన్.</poem>|ref=49}} '''టీక'''. నిగనిగని = కళకళలాడు; విదళకదళీయుగళిన్ = ఆకులు లేని రెండనఁటిబోదెలను; నగి = నవ్వి - తిరస్కరించి; జిగి దొలంకు = కాంతులనీను; చొక్కున్ = పరవశతను; కదురఁజేయున్ = కల్గించును; మునిమదావళము = మునిశ్రేష్ఠుఁడు; ఎలమిన్ = ప్రీతితో; ['చొక్కుఁ గదురన్ = పరవశత్వము కలుఁగగా' అని పూర్వటీక. అది యనుచితము.]<noinclude><references/></noinclude> myq97yvmord5zihq5nk7voqk2p3a2of పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/119 104 212564 557512 554784 2026-05-30T03:28:31Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557512 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>విపులవీక్షణశక్తిచే <ref>ట. వేడు, క. వెండి</ref>వెండికుండ లీంద్రతలిమాంగరుచిసుధ యెత్తి గ్రోలి సంతతవ్రతకల్పనాజాయమాన దుస్తరక్లేశమంతయుఁ దొలగఁ ద్రోచి.</poem>|ref=50}} '''టీక'''. వెండి = మఱల; కుండలీంద్రతలిమాంగరుచిసుధ = శేషశాయి యగు విష్ణుని దేహకాంతి యను నమృతమును. పుండరీకుఁడు తనివితీఱ శ్రీకృష్ణుని దివ్యతేజమును తిలకించెనని భావము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆవు నదల్చు పచ్చవెదు రంఘ్రియుగాంతరవీథి నూఁది య గ్రావనిఁ దేజరిల్లు కటిహస్తసమన్వితుఁ గౌస్తుభాంకు నిం దీవిభు నింద్రనీలనిభదేహుఁ గనుంగొని హర్షవర్షధా రావిలమానసుం డగుచు నమ్ముని కృత్యవిమూఢబుద్ధియై.</poem>|ref=51}} '''టీక'''. పచ్చవెదురున్ = ఆరుపచ్చని పచ్చివెదురుకఱ్ఱను; అంఘ్రియుగాంతరవీథిన్ = రెండుకాళ్లకును నడుమను; ఊఁది = గట్టిగా ఇరికించి; అగ్రావనిన్ = ఎదుటిభాగమున; ఇందీవిభున్ = లక్ష్మీదేవికి భర్తయైనవానిని - విష్ణుని; హర్ష...మానసుండగుచున్ = సంతోష మను వర్షధారఁ దడుపఁబడి ఉక్కిరిబిక్కిరియైన మనస్సు కలవాఁడై; కృత్యవిమూఢబుద్ధియై = స్తంభించినవాఁడై. '''అలం'''. స్వభావోక్తి. {{Telugu poem|type=చ.|lines=<poem>విలిఖితమో శిలాకృతియొ విస్మృతిరూపు వహించెనో యనన్ జలనవిదూరుఁ డయ్యుఁ దొలుసావిపయోధరధారఁ దోఁగు న య్యిలఁ <ref>క. తళుకొత్తు, శ.ర. తలయెత్తు</ref>దలయెత్తుక్రొత్తపులునేపున వే పులకల్ తనూలతన్ మొలఁవగ నున్న నవ్వి యదుముఖ్యుఁడు తాపసముఖ్యు ని ట్లనున్.</poem>|ref=52}} '''టీక'''. విలిఖితమో = వ్రాయఁబడినదో - చిత్తరువో; శిలాకృతియొ = ఱాతివిగ్రహమో; విస్మృతి రూపు వహించెనో = మూర్తీభవించిన మఱపో; చలనవిదూరుఁ డయ్యున్ = కదలిక లేనివాఁడైనను; తొలుసావిపయోధరధారన్ = తొలుకరివర్షధారలచేత; తొఁగు = తడియు; ఇలన్ = భూమిపై; తలయెత్తు = మొలచు; క్రొత్తపులునేపునన్ = చిగురుగడ్డిసౌరున; పులకల్ = గగుర్పాటు; '''అలం'''. ఉత్ప్రేక్ష, ఉపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>నిచ్చలు నిచ్చలోఁ బొదలు నీపితృభక్తికి జ్ఞానశక్తికిన్ మెచ్చితి నిచ్చితిం గరము నీయెడ నీయెడ యేల? వేడుకొ మ్మిచ్చెదఁ జెచ్చెరన్ వలయు నీప్సితముల్ శతమేని దీననే పొచ్చెము నొచ్చెముం జొరదు భూసురకేసరి! నమ్ము నావుడున్.</poem>|ref=53}} నిచ్చలు నిచ్ఛలోఁ బొదలు నీపితృభక్తికి జ్ఞానశక్తిజా మెము <ref>శ.ర. నియ్యెడ నియ్యెడ</ref>నీయెడ నీయెడ యేల వేడుకొ మిచ్చెదఁ జెచ్చెరణ వలయునీప్సితమ ల్ శతమేని దీన నే పొచెము నొచ్చెముం జొరదు భూసుర కేసరి! నము నావుడున్. '''టీక'''. నిచ్చలు = ఎల్లపుడు; ఇచ్చలోన్ = మనస్సునందు; కరము = అభయహస్తము; ఎడ = ఎడము - జాలము, భేదము; శతమేని = నూఱైనను; పొచ్చెము = లోపము; ఒచ్చెము = అనుమానము. '''అలం'''. అనుప్రాసము. {{Telugu poem|type=శా.|lines=<poem>భస్మోద్ధూలనపాండురాంగము రమాప్రాణేశుపాదద్వయిన్ విస్మేరాంబుజగామిహంస మిది నాచే వ్రాల్చుచున్ లేచి 'దే వాస్మాకం శరణం త్వమేవ; గతి రన్యో నాస్తి; దుర్వాసనా పస్మారం హర' యంచుఁ బల్కి మఱియున్ భక్తుండు భక్తిస్పృహన్.</poem>|ref=54}} '''టీక'''. భస్మో...గము = బూడిద పూసికొనుటచే తెల్లనైన దేహము; విస్మేరాంబుజగామి హంసము = వికసించు పద్మమునుగూర్చి పోవు హంస; నాన్ = అనునట్లు; వే = వేగముగ; వ్రాల్చు<noinclude><references/></noinclude> o5oq7vmduff16rpmetfbb00885ytmo9 557513 557512 2026-05-30T03:30:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 557513 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>విపులవీక్షణశక్తిచే <ref>ట. వేడు, క. వెండి</ref>వెండికుండ లీంద్రతలిమాంగరుచిసుధ యెత్తి గ్రోలి సంతతవ్రతకల్పనాజాయమాన దుస్తరక్లేశమంతయుఁ దొలగఁ ద్రోచి.</poem>|ref=50}} '''టీక'''. వెండి = మఱల; కుండలీంద్రతలిమాంగరుచిసుధ = శేషశాయి యగు విష్ణుని దేహకాంతి యను నమృతమును. పుండరీకుఁడు తనివితీఱ శ్రీకృష్ణుని దివ్యతేజమును తిలకించెనని భావము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆవు నదల్చు పచ్చవెదు రంఘ్రియుగాంతరవీథి నూఁది య గ్రావనిఁ దేజరిల్లు కటిహస్తసమన్వితుఁ గౌస్తుభాంకు నిం దీవిభు నింద్రనీలనిభదేహుఁ గనుంగొని హర్షవర్షధా రావిలమానసుం డగుచు నమ్ముని కృత్యవిమూఢబుద్ధియై.</poem>|ref=51}} '''టీక'''. పచ్చవెదురున్ = ఆరుపచ్చని పచ్చివెదురుకఱ్ఱను; అంఘ్రియుగాంతరవీథిన్ = రెండుకాళ్లకును నడుమను; ఊఁది = గట్టిగా ఇరికించి; అగ్రావనిన్ = ఎదుటిభాగమున; ఇందీవిభున్ = లక్ష్మీదేవికి భర్తయైనవానిని - విష్ణుని; హర్ష...మానసుండగుచున్ = సంతోష మను వర్షధారఁ దడుపఁబడి ఉక్కిరిబిక్కిరియైన మనస్సు కలవాఁడై; కృత్యవిమూఢబుద్ధియై = స్తంభించినవాఁడై. '''అలం'''. స్వభావోక్తి. {{Telugu poem|type=చ.|lines=<poem>విలిఖితమో శిలాకృతియొ విస్మృతిరూపు వహించెనో యనన్ జలనవిదూరుఁ డయ్యుఁ దొలుసావిపయోధరధారఁ దోఁగు న య్యిలఁ <ref>క. తళుకొత్తు, శ.ర. తలయెత్తు</ref>దలయెత్తుక్రొత్తపులునేపున వే పులకల్ తనూలతన్ మొలఁవగ నున్న నవ్వి యదుముఖ్యుఁడు తాపసముఖ్యు ని ట్లనున్.</poem>|ref=52}} '''టీక'''. విలిఖితమో = వ్రాయఁబడినదో - చిత్తరువో; శిలాకృతియొ = ఱాతివిగ్రహమో; విస్మృతి రూపు వహించెనో = మూర్తీభవించిన మఱపో; చలనవిదూరుఁ డయ్యున్ = కదలిక లేనివాఁడైనను; తొలుసావిపయోధరధారన్ = తొలుకరివర్షధారలచేత; తొఁగు = తడియు; ఇలన్ = భూమిపై; తలయెత్తు = మొలచు; క్రొత్తపులునేపునన్ = చిగురుగడ్డిసౌరున; పులకల్ = గగుర్పాటు; '''అలం'''. ఉత్ప్రేక్ష, ఉపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>నిచ్చలు నిచ్చలోఁ బొదలు నీపితృభక్తికి జ్ఞానశక్తికిన్ మెచ్చితి నిచ్చితిం గరము <ref>శ.ర. నియ్యెడ నియ్యెడ</ref>నీయెడ నీయెడ యేల? వేడుకొ మ్మిచ్చెదఁ జెచ్చెరన్ వలయు నీప్సితముల్ శతమేని దీననే పొచ్చెము నొచ్చెముం జొరదు భూసురకేసరి! నమ్ము నావుడున్.</poem>|ref=53}} '''టీక'''. నిచ్చలు = ఎల్లపుడు; ఇచ్చలోన్ = మనస్సునందు; కరము = అభయహస్తము; ఎడ = ఎడము - జాలము, భేదము; శతమేని = నూఱైనను; పొచ్చెము = లోపము; ఒచ్చెము = అనుమానము. '''అలం'''. అనుప్రాసము. {{Telugu poem|type=శా.|lines=<poem>భస్మోద్ధూలనపాండురాంగము రమాప్రాణేశుపాదద్వయిన్ విస్మేరాంబుజగామిహంస మిది నాచే వ్రాల్చుచున్ లేచి 'దే వాస్మాకం శరణం త్వమేవ; గతి రన్యో నాస్తి; దుర్వాసనా పస్మారం హర' యంచుఁ బల్కి మఱియున్ భక్తుండు భక్తిస్పృహన్.</poem>|ref=54}} '''టీక'''. భస్మో...గము = బూడిద పూసికొనుటచే తెల్లనైన దేహము; విస్మేరాంబుజగామి హంసము = వికసించు పద్మమునుగూర్చి పోవు హంస; నాన్ = అనునట్లు; వే = వేగముగ; వ్రాల్చు<noinclude><references/></noinclude> 64b2up66oovz9210nnctbn9cyezyhhx 557514 557513 2026-05-30T03:30:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 557514 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>విపులవీక్షణశక్తిచే <ref>ట. వేడు, క. వెండి</ref>వెండికుండ లీంద్రతలిమాంగరుచిసుధ యెత్తి గ్రోలి సంతతవ్రతకల్పనాజాయమాన దుస్తరక్లేశమంతయుఁ దొలగఁ ద్రోచి.</poem>|ref=50}} '''టీక'''. వెండి = మఱల; కుండలీంద్రతలిమాంగరుచిసుధ = శేషశాయి యగు విష్ణుని దేహకాంతి యను నమృతమును. పుండరీకుఁడు తనివితీఱ శ్రీకృష్ణుని దివ్యతేజమును తిలకించెనని భావము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆవు నదల్చు పచ్చవెదు రంఘ్రియుగాంతరవీథి నూఁది య గ్రావనిఁ దేజరిల్లు కటిహస్తసమన్వితుఁ గౌస్తుభాంకు నిం దీవిభు నింద్రనీలనిభదేహుఁ గనుంగొని హర్షవర్షధా రావిలమానసుం డగుచు నమ్ముని కృత్యవిమూఢబుద్ధియై.</poem>|ref=51}} '''టీక'''. పచ్చవెదురున్ = ఆరుపచ్చని పచ్చివెదురుకఱ్ఱను; అంఘ్రియుగాంతరవీథిన్ = రెండుకాళ్లకును నడుమను; ఊఁది = గట్టిగా ఇరికించి; అగ్రావనిన్ = ఎదుటిభాగమున; ఇందీవిభున్ = లక్ష్మీదేవికి భర్తయైనవానిని - విష్ణుని; హర్ష...మానసుండగుచున్ = సంతోష మను వర్షధారఁ దడుపఁబడి ఉక్కిరిబిక్కిరియైన మనస్సు కలవాఁడై; కృత్యవిమూఢబుద్ధియై = స్తంభించినవాఁడై. '''అలం'''. స్వభావోక్తి. {{Telugu poem|type=చ.|lines=<poem>విలిఖితమో శిలాకృతియొ విస్మృతిరూపు వహించెనో యనన్ జలనవిదూరుఁ డయ్యుఁ దొలుసావిపయోధరధారఁ దోఁగు న య్యిలఁ <ref>క. తళుకొత్తు, శ.ర. తలయెత్తు</ref>దలయెత్తుక్రొత్తపులునేపున వే పులకల్ తనూలతన్ మొలఁవగ నున్న నవ్వి యదుముఖ్యుఁడు తాపసముఖ్యు ని ట్లనున్.</poem>|ref=52}} '''టీక'''. విలిఖితమో = వ్రాయఁబడినదో - చిత్తరువో; శిలాకృతియొ = ఱాతివిగ్రహమో; విస్మృతి రూపు వహించెనో = మూర్తీభవించిన మఱపో; చలనవిదూరుఁ డయ్యున్ = కదలిక లేనివాఁడైనను; తొలుసావిపయోధరధారన్ = తొలుకరివర్షధారలచేత; తొఁగు = తడియు; ఇలన్ = భూమిపై; తలయెత్తు = మొలచు; క్రొత్తపులునేపునన్ = చిగురుగడ్డిసౌరున; పులకల్ = గగుర్పాటు; '''అలం'''. ఉత్ప్రేక్ష, ఉపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>నిచ్చలు నిచ్చలోఁ బొదలు నీపితృభక్తికి జ్ఞానశక్తికిన్ మెచ్చితి నిచ్చితిం గరము <ref>శ.ర. నియ్యెడ నియ్యెడ</ref>నీయెడ నీయెడ యేల? వేడుకొ మ్మిచ్చెదఁ జెచ్చెరన్ వలయు నీప్సితముల్ శతమేని దీననే పొచ్చెము నొచ్చెముం జొరదు భూసురకేసరి! నమ్ము నావుడున్.</poem>|ref=53}} '''టీక'''. నిచ్చలు = ఎల్లపుడు; ఇచ్చలోన్ = మనస్సునందు; కరము = అభయహస్తము; ఎడ = ఎడము - జాలము, భేదము; శతమేని = నూఱైనను; పొచ్చెము = లోపము; ఒచ్చెము = అనుమానము. '''అలం'''. అనుప్రాసము. {{Telugu poem|type=శా.|lines=<poem>భస్మోద్ధూలనపాండురాంగము రమాప్రాణేశుపాదద్వయిన్ విస్మేరాంబుజగామిహంస మిది నాచే వ్రాల్చుచున్ లేచి 'దే వాస్మాకం శరణం త్వమేవ; గతి రన్యో నాస్తి; దుర్వాసనా పస్మారం హర' యంచుఁ బల్కి మఱియున్ భక్తుండు భక్తిస్పృహన్.</poem>|ref=54}} '''టీక'''. భస్మో...గము = బూడిద పూసికొనుటచే తెల్లనైన దేహము; విస్మేరాంబుజగామి హంసము = వికసించు పద్మమునుగూర్చి పోవు హంస; నాన్ = అనునట్లు; వే = వేగముగ; వ్రాల్చు<noinclude><references/></noinclude> sy6hgdzn8lhuzb0is1my83cksyhzrzp 557515 557514 2026-05-30T03:43:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 557515 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>విపులవీక్షణశక్తిచే <ref>ట. వేడు, క. వెండి</ref>వెండికుండ లీంద్రతలిమాంగరుచిసుధ యెత్తి గ్రోలి సంతతవ్రతకల్పనాజాయమాన దుస్తరక్లేశమంతయుఁ దొలగఁ ద్రోచి.</poem>|ref=50}} '''టీక'''. వెండి = మఱల; కుండలీంద్రతలిమాంగరుచిసుధ = శేషశాయి యగు విష్ణుని దేహకాంతి యను నమృతమును. పుండరీకుఁడు తనివితీఱ శ్రీకృష్ణుని దివ్యతేజమును తిలకించెనని భావము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆవు నదల్చు పచ్చవెదు రంఘ్రియుగాంతరవీథి నూఁది య గ్రావనిఁ దేజరిల్లు కటిహస్తసమన్వితుఁ గౌస్తుభాంకు నిం దీవిభు నింద్రనీలనిభదేహుఁ గనుంగొని హర్షవర్షధా రావిలమానసుం డగుచు నమ్ముని కృత్యవిమూఢబుద్ధియై.</poem>|ref=51}} '''టీక'''. పచ్చవెదురున్ = ఆరుపచ్చని పచ్చివెదురుకఱ్ఱను; అంఘ్రియుగాంతరవీథిన్ = రెండుకాళ్లకును నడుమను; ఊఁది = గట్టిగా ఇరికించి; అగ్రావనిన్ = ఎదుటిభాగమున; ఇందీవిభున్ = లక్ష్మీదేవికి భర్తయైనవానిని - విష్ణుని; హర్ష...మానసుండగుచున్ = సంతోష మను వర్షధారఁ దడుపఁబడి ఉక్కిరిబిక్కిరియైన మనస్సు కలవాఁడై; కృత్యవిమూఢబుద్ధియై = స్తంభించినవాఁడై. '''అలం'''. స్వభావోక్తి. {{Telugu poem|type=చ.|lines=<poem>విలిఖితమో శిలాకృతియొ విస్మృతి రూపు వహించెనో యనన్ జలనవిదూరుఁ డయ్యుఁ దొలుసావిపయోధరధారఁ దోఁగు న య్యిలఁ <ref>క. తళుకొత్తు, శ.ర. తలయెత్తు</ref>దలయెత్తుక్రొత్తపులునేపున వే పులకల్ తనూలతన్ మొలవఁగ నున్న నవ్వి యదుముఖ్యుఁడు తాపసముఖ్యు ని ట్లనున్.</poem>|ref=52}} '''టీక'''. విలిఖితమో = వ్రాయఁబడినదో - చిత్తరువో; శిలాకృతియొ = ఱాతివిగ్రహమో; విస్మృతి రూపు వహించెనో = మూర్తీభవించిన మఱపో; చలనవిదూరుఁ డయ్యున్ = కదలిక లేనివాఁడైనను; తొలుసావిపయోధరధారన్ = తొలుకరివర్షధారలచేత; తోఁగు = తడియు; ఇలన్ = భూమిపై; తలయెత్తు = మొలచు; క్రొత్తపులునేపునన్ = చిగురుగడ్డిసౌరున; పులకల్ = గగుర్పాటు; '''అలం'''. ఉత్ప్రేక్ష, ఉపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>నిచ్చలు నిచ్చలోఁ బొదలు నీపితృభక్తికి జ్ఞానశక్తికిన్ మెచ్చితి నిచ్చితిం గరము <ref>శ.ర. నియ్యెడ నియ్యెడ</ref>నీయెడ నీయెడ యేల? వేడుకొ మ్మిచ్చెదఁ జెచ్చెరన్ వలయు నీప్సితముల్ శతమేని దీననే పొచ్చెము నొచ్చెముం జొరదు భూసురకేసరి! నమ్ము నావుడున్.</poem>|ref=53}} '''టీక'''. నిచ్చలు = ఎల్లపుడు; ఇచ్చలోన్ = మనస్సునందు; కరము = అభయహస్తము; ఎడ = ఎడము - జాలము, భేదము; శతమేని = నూఱైనను; పొచ్చెము = లోపము; ఒచ్చెము = అనుమానము. '''అలం'''. అనుప్రాసము. {{Telugu poem|type=శా.|lines=<poem>భస్మోద్ధూలనపాండురాంగము రమాప్రాణేశుపాదద్వయిన్ విస్మేరాంబుజగామిహంస మిది నాచే వ్రాల్చుచున్ లేచి 'దే వాస్మాకం శరణం త్వమేవ; గతి రన్యో నాస్తి; దుర్వాసనా పస్మారం హర' యంచుఁ బల్కి మఱియున్ భక్తుండు భక్తిస్పృహన్.</poem>|ref=54}} '''టీక'''. భస్మో...గము = బూడిద పూసికొనుటచే తెల్లనైన దేహము; విస్మేరాంబుజగామి హంసము = వికసించు పద్మమునుగూర్చి పోవు హంస; నాన్ = అనునట్లు; వే = వేగముగ; వ్రాల్చు<noinclude><references/></noinclude> gugfzdhxsi7h5217mfcze4cwf34l4vh పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/120 104 212565 557528 554785 2026-05-30T09:26:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557528 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చున్ = పడవేయుచు; దేవాస్మాకం శరణం త్వమేవ = దేవా! మాకు నీవే దిక్కు; గతి రన్యోనాస్తి = వేఱుగతి లేదు; దుర్వాసనాపస్మారం హర = చెడ్డవిషయములయందలి కోరికయను పిచ్చిని పోగొట్టుము; భక్తిస్పృహన్ = భక్తియందలి ఇచ్ఛచేత - భక్తితమకముచేత; ['దేవాస్మాకం' అని సంబుద్ధిపయి సంధి.] {{Telugu poem|type=సీ.|lines=<poem>పొదలు నీపొక్కిటిపువ్వుకాన్పునఁ గదా పెనుమాయ పిల్లలఁ బెట్టు టెల్లఁ బొడము నీమొదలియూర్పులనేర్పులన కదా చదువుసంధ్యలు గల్గి జగము మనుట కెరలు నీయడుగుఁదామరలతేనియఁ గదా పాపంపుఁబెనురొంపి <ref>చ. పలచన</ref>పలుచ నగుట పొసఁగునీతెలిచూపుపస గదా యిది రాత్రి యిది పగ లనుమేర లెఱుఁగఁబడుట</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భవనఘటనకు మొదలికంబమునుబోలె భువనమునకెల్ల నీ వాది<ref>చ. భూతివగుచు</ref>భూతుఁ డగుట నిట్టనిలుచున్కిచేఁ గాదె నెట్టికొనియె గెంటుఁగుంటును లేక లక్ష్మీకళత్ర.</poem>|ref=55}} '''టీక'''. పొదలు = వర్ధిల్లు; కాన్పునన్ = ప్రసవముచేత ; ఊర్పులు = నిశ్శ్వాసములు; కెరలు = అతిశయించు; తెలిచూపు = తేటతెల్లమగు దృష్టి; భవనఘటనకున్ = ఇల్లు కట్టుటకు; ఆదిభూతుఁడు = మొదటివాఁడవు - ప్రధానుఁడవు; నిట్టనిలుచున్కిచేన్ = నిటారుగా నిలుచుండుటచేత; నెట్టుకొనియెన్ = అతిశయించెను - తేటపడియెను; గెంటు గుంటును లేక = కదలిక తగ్గు లేక నిరాటంకముగ. [ఇచట 'నీ వాదిభూతుఁడ వగుట' అనుటకు బదులు 'నీ వాదిభూతుఁ డగుట' అని ప్రయోగింపఁబడినది.] విష్ణుని నాభికమలమునఁ బుట్టిన బ్రహ్మ సృష్టిఁ జేయఁబూనెననియు, విష్ణుని తొలియూర్పులే వేదములయి జనుల విద్యాబుద్ధుల కవకాశము కలిగించెననియు, విష్ణువుపాదములనుండి గంగానది యుద్భవిల్లి ప్రజలపాపములను పటాపంచలు చేసి, వారికి పుణ్యగతులను కలిగించుచున్నదనియఁ, విష్ణుని కన్నులగు సూర్యచంద్రులవలననే యహర్నిశలను విభజింప వీలగుచున్నదనియు, విష్ణువు భువనముల కెల్ల మూలమనియు నభిప్రాయము. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=చ.|lines=<poem>ముదమున సోమకాసురుఁడు మ్రుచ్చిలి యచ్చలమారఁగొన్న ప్రాఁ జదువులు తెచ్చి తజ్ఙఠరసాంద్రత<ref>చ. గాత్రము, శ.ర. రాంత్రములంటికట్టు</ref>రాంత్రము లంట నంటు బల్ <ref>చ. గదరు</ref>గదురు దొలంగఁ గీర్తి యను గంగఁ దొలంచి విధాతృవిస్పుర ద్వదనసరోజగంధలలితంబులు చేసితిగా జగన్నిధీ!</poem>|ref=56}} '''టీక'''. మ్రుచ్చిలి = దొంగిలించి; అచ్చలమారన్, కొన్న = పూనికతో అపహరించిన; ప్రాఁజదువులు = వేదములను; తెచ్చి; తజ్జఠరసాంద్రతరాంత్రములు = అతనిపొట్టలో ఎక్కువగ నుండు ప్రేవులు; అంటన్ = అట్టకట్టఁగా - అంటుకొనఁగా; అంటు బల్ గదురు = వ్యాపించిన ఎక్కువైన కంపును; తొలఁచి = కడిగి; విధాతృ...కంబులు = వికసించిన కమలములవంటి బ్రహ్మముఖములందలి పరిమళముచే సువాసన గలవి. '''అలం'''. రూపకము. (ఇది మత్స్యావతారవర్ణనము) {{Telugu poem|type=ఉ.|lines=<poem>కోపనశాపనవ్యశిఖిఁ<ref>క. గోర్మన, చ. గోల్మన, సూర్య. కోల్మన</ref>గోల్మసఁగం గ<ref>చ. సుగంధ</ref>సుగంది మ్రంది త త్తాపము నాఁపలేక తిమిధామజలభ్రమిఁ గూలి తూలు జం భాపహరాజ్యలక్ష్మి వెఱవాఱఁగఁ దెల్పవె యీఁతకాయరూ పై పృథుకర్పరం బమర నాశ్రితరక్షణదక్షిణేక్షణా!</poem>|ref=57}}<noinclude><references/></noinclude> ln4zolwxdf7dpf75rdlk6676u5as96x పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/121 104 212566 557537 554789 2026-05-30T10:01:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557537 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. కోపనశాపనవ్యశిఖిన్ = కోపస్వభావముకల దుర్వాసునిశాప మనెడి కనకనలాడు నిప్పుచే; కోల్మసఁగన్ = వెన్ను కాలునట్లుగా [ˈగోర్మసఁగన్ = మిక్కిలి రేఁగఁగాˈ అని పూర్వటీక.] కసుగంది = మిక్కిలి తపించి; మ్రంది = సోలి; తిమి...భ్రమన్ = జలచరములకు నివాసమగు సముద్రపుమడులలో; కూలు = పడు; జంభాపహరాజ్యలక్ష్మిన్ = జంభునిఁ జంపిన యింద్రుని రాజ్యసంపదను; అరఁగన్ = ఉపాయమున; ఈఁతకాయరూపై = ఈఁదుటకు అనుకూలమగు సొరకాయరూపు కలదయిన; పృథుకర్పరంబు = గొప్పవీఁపుచిప్ప; అమరన్ = అనుకూలము గాఁగా; తేల్చవె = తేలునట్లు చేయలేదా? ఆశ్రిత...క్షణా! = ఆశ్రితులను రక్షించుటలో దయతోడి చూపు కలవాఁడా! (ఇది కూర్మావతారవర్ణన) '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆపెను వెల్లిఁ ద్రెళ్లుమకరాకరమేఖల నీవు దేర్చి య ష్టాపదటంకవిభ్రమవిడంబినియౌ నిజదంష్ట్రఁ గూర్చు త ద్రూపము దీపితం బగు సరోరుహలోచన! సప్తజిహ్వజి హ్వోపరిభాగధూమవలయోపమమై విలయోపలబ్ధులన్.</poem>|ref=58}} '''టీక'''. ఆపెనువెల్లిన్ = ఆ(ప్రళయకాలపు) పెద్దప్రవాహమున; త్రెళ్లు = పడిన; మకరాకరమేఖలన్ = సముద్రము మొలనూలుగాఁగల భూమిని; అష్టాపదటంకవిభ్రమవిడంబినియౌ = బంగారుపిడియొక్క విలాసము ననుకరించునట్టి [ఇచటఁ 'బంగారును నఱకునట్టి యులియొక్క విలాసమును పోలినది' అని పూర్వటీకయందు కలదు. అది సరికాదు.] నిజదంష్ట్రన్ = నీకోఱయందు; తద్రూపము = అప్పటి భూమిరూపము; విలయోపలబ్ధులన్ = ప్రళయకాలములందు; సప్త...సమమై = అగ్నిజ్వాలలచివఱలందు వలయాకారమున నుండు పొగలగుంపును పోలినదై; దీపితంబగున్ = ప్రకాశించును. (ఇది వరాహావతారవర్ణనము) '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=చ.|lines=<poem>అలఘుజగద్ద్విషద్ద్విపఘటాంకుశశాతనఖాంకురాగ్రలాం గలముల మున్ను నీ వసురఘస్మర! వైరిభుజాంతరాళజాం గలమహిఁ జాలుపట్టి పయిఁ గ్రమ్మెడునెత్తురు నీరు పెట్టి యం దలుకవె కీర్తిపూర్తికలమాంకుర మింద్రరమాఫలార్ధివై.</poem>|ref=59}} '''టీక'''. అలఘు...లాంగలములన్ — అలఘు = గొప్ప; జగద్ద్విషద్ధ్విపఘటా = లోకశత్రువులగు రాక్షసులనెడి ఏనుఁగులగుంపునకు; అంకుశ = అంకుశములైన; శాతనఖాంకురాగ్రలాంగలములన్ = వాఁడిగోళ్లకొనలనెడి నాగళ్లచేత; అసురఘస్మర! = రాక్షసులను నశింపఁజేయువాఁడా! వైరి...మహిన్ = శత్రువుల ఱొమ్ములనెడి అడవినేలను; చాలుపట్టి = చాళ్లు ఏర్పడునట్లు దున్ని; కీర్తిపూర్తికలమాంకురము = గొప్పకీర్తి యను వరిమొలకను; ఇంద్రరమాఫలార్థివై = ఇంద్రుని సంపదను నిలంపఁదలఁచి; అలుకవె = నాఁటవా. '''అలం'''. రూపకము. నాఁగేళ్లతో తొలుత పొలము దున్ని, చాలు పట్టి, నీరు పెట్టి, విత్తనములు చల్లుట, అవి ఫలించుట లోకపరిపాటి. (ఇందు నృసింహావతారము వర్ణితము.) {{Telugu poem|type=క.|lines=<poem>దండితబలివై జగములు నిండఁ బెరుగుచున్నవేళ నీయడుగున భూ మండల మతిసూక్ష్మాకృతిఁ గొండికమచ్చయును బోలెఁ గొమరొందు హరీ!</poem>|ref=60}} '''టీక'''. దండితబలివై = బలిని దండించి; కొండికమచ్చయునుబోలెన్ = చిన్నమచ్చవలె; కొమరొందున్ = ప్రకాశించును. '''అలం'''. అధికము, ఉపమ. (ఇది వామనావతారవర్ణనము.) {{Telugu poem|type=ఉ.|lines=<poem>మాతృకఠోరకంఠబిలమార్గగళద్రుధిరారుణాననం బై తళుకొత్తు దోఃపరశుహంసికి మేఁత యొసంగవే రిపు</poem>|ref=}}<noinclude><references/></noinclude> qqzb1qaknbrbjo1pbf23ldk7ur412e5 557538 557537 2026-05-30T10:02:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 557538 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. కోపనశాపనవ్యశిఖిన్ = కోపస్వభావముకల దుర్వాసునిశాప మనెడి కనకనలాడు నిప్పుచే; కోల్మసఁగన్ = వెన్ను కాలునట్లుగా [ˈగోర్మసఁగన్ = మిక్కిలి రేఁగఁగాˈ అని పూర్వటీక.] కసుగంది = మిక్కిలి తపించి; మ్రంది = సోలి; తిమి...భ్రమన్ = జలచరములకు నివాసమగు సముద్రపుమడులలో; కూలు = పడు; జంభాపహరాజ్యలక్ష్మిన్ = జంభునిఁ జంపిన యింద్రుని రాజ్యసంపదను; అరఁగన్ = ఉపాయమున; ఈఁతకాయరూపై = ఈఁదుటకు అనుకూలమగు సొరకాయరూపు కలదయిన; పృథుకర్పరంబు = గొప్పవీఁపుచిప్ప; అమరన్ = అనుకూలము గాఁగా; తేల్చవె = తేలునట్లు చేయలేదా? ఆశ్రిత...క్షణా! = ఆశ్రితులను రక్షించుటలో దయతోడి చూపు కలవాఁడా! (ఇది కూర్మావతారవర్ణన) '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆపెను వెల్లిఁ ద్రెళ్లుమకరాకరమేఖల నీవు దేర్చి య ష్టాపదటంకవిభ్రమవిడంబినియౌ నిజదంష్ట్రఁ గూర్చు త ద్రూపము దీపితం బగు సరోరుహలోచన! సప్తజిహ్వజి హ్వోపరిభాగధూమవలయోపమమై విలయోపలబ్ధులన్.</poem>|ref=58}} '''టీక'''. ఆపెనువెల్లిన్ = ఆ(ప్రళయకాలపు) పెద్దప్రవాహమున; త్రెళ్లు = పడిన; మకరాకరమేఖలన్ = సముద్రము మొలనూలుగాఁగల భూమిని; అష్టాపదటంకవిభ్రమవిడంబినియౌ = బంగారుపిడియొక్క విలాసము ననుకరించునట్టి [ఇచట 'బంగారును నఱకునట్టి యులియొక్క విలాసమును పోలినది' అని పూర్వటీకయందు కలదు. అది సరికాదు.] నిజదంష్ట్రన్ = నీకోఱయందు; తద్రూపము = అప్పటి భూమిరూపము; విలయోపలబ్ధులన్ = ప్రళయకాలములందు; సప్త...సమమై = అగ్నిజ్వాలలచివఱలందు వలయాకారమున నుండు పొగలగుంపును పోలినదై; దీపితంబగున్ = ప్రకాశించును. (ఇది వరాహావతారవర్ణనము) '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=చ.|lines=<poem>అలఘుజగద్ద్విషద్ద్విపఘటాంకుశశాతనఖాంకురాగ్రలాం గలముల మున్ను నీ వసురఘస్మర! వైరిభుజాంతరాళజాం గలమహిఁ జాలుపట్టి పయిఁ గ్రమ్మెడునెత్తురు నీరు పెట్టి యం దలుకవె కీర్తిపూర్తికలమాంకుర మింద్రరమాఫలార్ధివై.</poem>|ref=59}} '''టీక'''. అలఘు...లాంగలములన్ — అలఘు = గొప్ప; జగద్ద్విషద్ధ్విపఘటా = లోకశత్రువులగు రాక్షసులనెడి ఏనుఁగులగుంపునకు; అంకుశ = అంకుశములైన; శాతనఖాంకురాగ్రలాంగలములన్ = వాఁడిగోళ్లకొనలనెడి నాగళ్లచేత; అసురఘస్మర! = రాక్షసులను నశింపఁజేయువాఁడా! వైరి...మహిన్ = శత్రువుల ఱొమ్ములనెడి అడవినేలను; చాలుపట్టి = చాళ్లు ఏర్పడునట్లు దున్ని; కీర్తిపూర్తికలమాంకురము = గొప్పకీర్తి యను వరిమొలకను; ఇంద్రరమాఫలార్థివై = ఇంద్రుని సంపదను నిలంపఁదలఁచి; అలుకవె = నాఁటవా. '''అలం'''. రూపకము. నాఁగేళ్లతో తొలుత పొలము దున్ని, చాలు పట్టి, నీరు పెట్టి, విత్తనములు చల్లుట, అవి ఫలించుట లోకపరిపాటి. (ఇందు నృసింహావతారము వర్ణితము.) {{Telugu poem|type=క.|lines=<poem>దండితబలివై జగములు నిండఁ బెరుగుచున్నవేళ నీయడుగున భూ మండల మతిసూక్ష్మాకృతిఁ గొండికమచ్చయును బోలెఁ గొమరొందు హరీ!</poem>|ref=60}} '''టీక'''. దండితబలివై = బలిని దండించి; కొండికమచ్చయునుబోలెన్ = చిన్నమచ్చవలె; కొమరొందున్ = ప్రకాశించును. '''అలం'''. అధికము, ఉపమ. (ఇది వామనావతారవర్ణనము.) {{Telugu poem|type=ఉ.|lines=<poem>మాతృకఠోరకంఠబిలమార్గగళద్రుధిరారుణాననం బై తళుకొత్తు దోఃపరశుహంసికి మేఁత యొసంగవే రిపు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 8juvsi7djirw16p553x3hepqk1na9k1 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/61 104 213510 557492 557224 2026-05-29T12:59:25Z శ్రీరామమూర్తి 1517 557492 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem> {{left margin|5em}} ఖ్యదమై శీతగభస్తెబింబశివలింగం బొప్పె బ్రాచీదిశన్" </poem> మూలం ఎంత భక్తి భావంతో వుందో, ఎంత సందర్భసుందరంగా వుందో, ఎంత శృంగార భరితంగా వుందో, అంతే సందర్భసభగంగా జోగారావుగారు రాశారు. '''అర్ధగత చమత్కారం :''' కవి తన ప్రతిభతో అర్ధంలో ఒకవిధమైన మెఱుపును స్ఫురింప చేయడం అర్థగత చమత్కారం. "రమణీప్రియ దూతిక"లో మాయా హరిణియైన దూతికకు పెద్దన వశుడవుతాడు. ఆ సయమంలో దూతికను కూడిన పెద్దన శృంగారాన్ని గూర్చి చెప్పుతూ - <poem> {{left margin|5em}} "ఆ విప్రోత్తము నుక్కు కచ్చడము నుగ్గైపోయె నవ్వాని స ద్భావం బంగభవాన్ని బారి నవనీతంబై పునీతంబునై భావ ప్రోద్భవ మారభద్ర భవన ప్రాకార నీకాశత న్నీ వీ బంధ ముముక్షువై మరుని పన్నీరై కరంగెన్ వెనన్" </poem> ఇలా అర్థగత చమత్కారం ఒక విలక్షణ వైఖరిలో సాగుతుంది. '''శబ్ద చమత్కారం:''' ఉద్యోగ విజయంలో తిరుపతి వేంకటకవులు “మంజు పుంజులను” కవితాగానంతో సాధించి, భోగింపగా వారితో ఆ కాంతల అనుభవంలో కంతుడే కాముకుడైనాడు అక్కడ. జోగారావుగారు - {{left margin|5em}} "సారసాక్షు లిర్వురును సీసాల వెనుక తేటగీతము కైవడి నాటవెలది పోల్కి కవులతో జేయు కాపురమునందు కైపుమీరి కాముకు డయ్యె గంతు డపుడు" </poem> అని అన్నారు. మధువునిండిన సీసాలు సేవించిన తర్వాత తేట తేటగా వచ్చు గీతాలు, ఆపై ఆటవెలదులతో కాలక్షేపం లాంటి కాముక చర్యలకు సంబంధించిన అర్ధంవుంది. మరో అర్ధంకూడా ఇక్కడ వుంది. వారు కవులు కాబట్టి సీసపద్యాలకు ఎత్తుగీతాలు, ఆటవెలదులవలె మంజుపుంజులున్నాయని మరో అర్ధం. "వైజయంతి"లో రంభావరిభాగంలో సూరనాదులు పొందిన అనుభూతిని చెప్పేసన్నివేశంలో -<noinclude><references/> {{c|46}}</noinclude> otxw5z0j6vrzrl4l8yh0y6nt1vbh934 557493 557492 2026-05-29T12:59:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557493 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem> {{left margin|5em}} ఖ్యదమై శీతగభస్తెబింబశివలింగం బొప్పె బ్రాచీదిశన్" </poem> మూలం ఎంత భక్తి భావంతో వుందో, ఎంత సందర్భసుందరంగా వుందో, ఎంత శృంగార భరితంగా వుందో, అంతే సందర్భసభగంగా జోగారావుగారు రాశారు. '''అర్ధగత చమత్కారం :''' కవి తన ప్రతిభతో అర్ధంలో ఒకవిధమైన మెఱుపును స్ఫురింప చేయడం అర్థగత చమత్కారం. "రమణీప్రియ దూతిక"లో మాయా హరిణియైన దూతికకు పెద్దన వశుడవుతాడు. ఆ సయమంలో దూతికను కూడిన పెద్దన శృంగారాన్ని గూర్చి చెప్పుతూ - <poem> {{left margin|5em}} "ఆ విప్రోత్తము నుక్కు కచ్చడము నుగ్గైపోయె నవ్వాని స ద్భావం బంగభవాన్ని బారి నవనీతంబై పునీతంబునై భావ ప్రోద్భవ మారభద్ర భవన ప్రాకార నీకాశత న్నీ వీ బంధ ముముక్షువై మరుని పన్నీరై కరంగెన్ వెనన్" </poem> ఇలా అర్థగత చమత్కారం ఒక విలక్షణ వైఖరిలో సాగుతుంది. '''శబ్ద చమత్కారం:''' ఉద్యోగ విజయంలో తిరుపతి వేంకటకవులు “మంజు పుంజులను” కవితాగానంతో సాధించి, భోగింపగా వారితో ఆ కాంతల అనుభవంలో కంతుడే కాముకుడైనాడు అక్కడ. జోగారావుగారు - {{left margin|5em}} "సారసాక్షు లిర్వురును సీసాల వెనుక తేటగీతము కైవడి నాటవెలది పోల్కి కవులతో జేయు కాపురమునందు కైపుమీరి కాముకు డయ్యె గంతు డపుడు" </poem> అని అన్నారు. మధువునిండిన సీసాలు సేవించిన తర్వాత తేట తేటగా వచ్చు గీతాలు, ఆపై ఆటవెలదులతో కాలక్షేపం లాంటి కాముక చర్యలకు సంబంధించిన అర్ధంవుంది. మరో అర్ధంకూడా ఇక్కడ వుంది. వారు కవులు కాబట్టి సీసపద్యాలకు ఎత్తుగీతాలు, ఆటవెలదులవలె మంజుపుంజులున్నాయని మరో అర్ధం. "వైజయంతి"లో రంభావరిభాగంలో సూరనాదులు పొందిన అనుభూతిని చెప్పేసన్నివేశంలో -<noinclude><references/> {{c|46}}</noinclude> 6rykvfknz4ta5pswb256nwtna0jc76p పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/62 104 213511 557494 557226 2026-05-29T13:09:58Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557494 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem> {{left margin|5em}} “ఒక్కొక్కరి పాకమ్ములు నొక్కొక్కరి బంధములు నొకొక్కరి శయ్యల్ ఒక్కొక ఫక్కిని, మక్కికి మక్కిని గా వన్నియు దగుమార్గముల యగున్" </poem> ఇందులో పాకబంధశయ్యా పదాలు, రతి విషయంలోనూ, కవితా విషయంలో కూడా సార్థకాలై సురచిరబంధురంగా ప్రయోగించబడ్డాయి. ఇక్కడ శ్లేషతో పాటు శబ్దాలంకారాలను చెప్పడం వల్ల, శబ్ద చమత్కారం ఇమిడి వుంది. '''శబ్దార్ధోభయగత చమత్కారం :''' శబ్దం అర్ధం రెండింటిని ఆశ్రయించి సాగేది శబ్దార్దోభయగత చమత్కారం “ప్రేమాభిరామం”లో ఊర్వశికి శ్రీనాథులకు జంటకుదురుటలో జోగారావుగారు వారిరువురి రసపట్టభద్రయోగ్యతకు సామీప్యం చెప్పుతూ- <poem> {{left margin|5em}} “ఆమె కమల నాభోరు జాతాబ్జవదన కమలనాభుని పౌత్రశేఖరు డతండు మారదారరూపోపమాకార యామె మారయామాత్యు కూర్మి కుమారు డతడు" </poem> అని అన్నారు. ఇక్కడ శ్రీనాథుని తండ్రి మారయ తాత కమలనాభుడు అనే విషయాలను తీసుకొని వారి ఇరువురకు ఆ శబ్దాన్ని వర్తింపచేసి చక్కగా అర్ధాన్ని, శబ్దాన్ని చమత్కార వంతంగా రావుగారు వర్ణించారు. '''కవిసమయగత చమత్కారం :''' “కృష్ణార్పణం”లో మాధవుని, క్షేత్రయ్య జయదేవులు ఘృతాచి రమ్మని వేడినప్పుడు - <poem> {{left margin|5em}} "మగువ కుచంబులు పట్టిన నగధరులము, ఘనజఘనము వాచికొనంగన్ అగుదుము చక్రధరుల, మొక పగిదిగ మొలనూల్ మెడబడ వనమాలులమున్" </poem> ఇక్కడ కుచములకు, జఘనాలకు, మొలనూలుకు సాధారణ ఉపమానాలుగా నగలు, చక్రాలు, మాలలు చమత్కారంగా చెప్పబడ్డాయి. నగధరులు, చక్రధారులు,<noinclude><references/> {{c|47}}</noinclude> 9hhkrtwl42z93rwaw0jzw798gkcjlzo 557495 557494 2026-05-29T13:10:18Z శ్రీరామమూర్తి 1517 557495 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem> {{left margin|5em}} “ఒక్కొక్కరి పాకమ్ములు నొక్కొక్కరి బంధములు నొకొక్కరి శయ్యల్ ఒక్కొక ఫక్కిని, మక్కికి మక్కిని గా వన్నియు దగుమార్గముల యగున్" </poem> ఇందులో పాకబంధశయ్యా పదాలు, రతి విషయంలోనూ, కవితా విషయంలో కూడా సార్థకాలై సురచిరబంధురంగా ప్రయోగించబడ్డాయి. ఇక్కడ శ్లేషతో పాటు శబ్దాలంకారాలను చెప్పడం వల్ల, శబ్ద చమత్కారం ఇమిడి వుంది. '''శబ్దార్ధోభయగత చమత్కారం :''' శబ్దం అర్ధం రెండింటిని ఆశ్రయించి సాగేది శబ్దార్దోభయగత చమత్కారం “ప్రేమాభిరామం”లో ఊర్వశికి శ్రీనాథులకు జంటకుదురుటలో జోగారావుగారు వారిరువురి రసపట్టభద్రయోగ్యతకు సామీప్యం చెప్పుతూ- <poem> {{left margin|5em}} “ఆమె కమల నాభోరు జాతాబ్జవదన కమలనాభుని పౌత్రశేఖరు డతండు మారదారరూపోపమాకార యామె మారయామాత్యు కూర్మి కుమారు డతడు" </poem> అని అన్నారు. ఇక్కడ శ్రీనాథుని తండ్రి మారయ తాత కమలనాభుడు అనే విషయాలను తీసుకొని వారి ఇరువురకు ఆ శబ్దాన్ని వర్తింపచేసి చక్కగా అర్ధాన్ని, శబ్దాన్ని చమత్కార వంతంగా రావుగారు వర్ణించారు. '''కవిసమయగత చమత్కారం :''' “కృష్ణార్పణం”లో మాధవుని, క్షేత్రయ్య జయదేవులు ఘృతాచి రమ్మని వేడినప్పుడు - <poem> {{left margin|5em}} "మగువ కుచంబులు పట్టిన నగధరులము, ఘనజఘనము వాచికొనంగన్ అగుదుము చక్రధరుల, మొక పగిదిగ మొలనూల్ మెడబడ వనమాలులమున్" </poem> ఇక్కడ కుచములకు, జఘనాలకు, మొలనూలుకు సాధారణ ఉపమానాలుగా నగలు, చక్రాలు, మాలలు చమత్కారంగా చెప్పబడ్డాయి. నగధరులు, చక్రధారులు,<noinclude><references/> {{c|47}}</noinclude> dfoojiy5jelgthcj50uibgpiccf4knw పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/63 104 213512 557496 557227 2026-05-29T13:21:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557496 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వనమాలలు ఈ మూడు కృష్ణ పర్యాయపదాలు, క్షేత్రయ్య జయదేవులు శ్రీహరి భక్తులు, వీరు ఈ ఘట్టంలో భక్తిలో శృంగారాన్ని, శృంగారంలో భక్తిని దర్శించారు. ఇక్కడ కవి సమయాన్ని ఆశ్రయించి చమత్కారం చెప్పబడింది. '''అలంకారగత చమత్కారం:''' “దక్షిణ నాయిక”లో మేనక తిమ్మనలు రతికేళిలో వుండగా, విశ్వామిత్రుడు కోపంతో వచ్చి, రసభంగం చేస్తాడు. అతని రాకతో గదిలోపలి శృంగార మూర్తుల ఎడబాటును - <poem> {{left margin|5em}} "తరుణి గుండె దట్టిన యట్లు తలుపు దట్టె నతడు, వారుపొందులు వీడునట్లు తెఱచు కొనియె దల్పుచెక్కలు రెండు, మునివరుండు రుసరుసలు వోవు చిట్లని బుసలు గొట్టె" </poem> అని వర్ణించారు జోగారావుగారు. విశ్వామిత్రుడు మేనక గుండె తట్టినట్లు, తలుపుతటతాడు. వారి పొందులు విడిపోయినట్లు రెండు తలుపు చెక్కలు విడిపోయాయి. విశ్వామిత్రుని రాకతో మేనక గుండె జల్లు మన్నది. వెంటనే ఇద్దరూ విడిపోయారు. తీయబడిన తలుపులు మరల మూయబడతాయని కవి అన్నాడు. అదే విధంగా మరల మేనక తిమ్మనలు కలుసుకుంటారు. ఈ పద్యంలో ఉపమాన వస్తువులు కూడా వర్తమాన సన్నివేశానుగుణంగా ఉపమేయంగా అన్నట్లు చక్కని చమత్కారాన్ని కలిగిస్తుంది. '''ధ్వని చమత్కారం :''' <poem> {{left margin|5em}} “కామధేనువు”లో ముద్దు పళని- “నగవులోపల సిగ్గులు వానవైచి చూపులోపల వలపులు చూరలిచ్చి”నట్టి మగువ" </poem> ఇక్కడ నవ్వులో సిగ్గులు నానవైచుట, చూపులో వలపులు చూరలిచ్చుట సంభవం కాదు. సహజం కూడా కాదు. కాబట్టి ఇక్కడ ధ్వని స్ఫురిస్తుంది. సిగ్గులు వానినవి అన్నప్పుడు బింకం తగ్గి ప్రియునిపై మనసు చూపిందన్నమాట. ఆ విషయం ఆమెనవ్వు సూచిస్తుంది. చూపులో వలపులు బహూకరించుట అంటే తన్నుతాను సమర్పించుకోవడానికి సిద్ధమై ఎదురు చూస్తున్నదని భావన. ఎదురుచూచుటను<noinclude><references/> {{c|48}}</noinclude> dd681licc1zlsk8tti087642qbxe0a6 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/64 104 213513 557497 557228 2026-05-29T13:32:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557497 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>చూపుల్లో చూపించింది. ముద్దు పళని నగవులో చూపులో తెనాలి రామకృష్ణ కవిని పొందాలన్న భావాలే కన్పిస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అవివక్షిత వాచ్యధ్యని వ్యక్త మవుతుంది. రామకృష్ణ కవి నిగమశర్మను పళని యొద్దకు ఘటకునిగా పంపేటప్పుడు - <poem> {{left margin|5em}} "కనుల తోడన వానిని గౌగిలించి చేతితోడన వానిని సేమ మడిగి మనసుతో వాని కెల్ల మర్మమ్ము దెలిపి పంపె దూతగా కవిరాజు పళని కడకు" </poem> ఇందులో కూడా వాచ్యం వివక్షితమైంది. మనసు నిండుగా తనవాడు కన్పించే సరికి కన్నులు పెద్దల చేసికొని తృప్తిదీర చూచినాడనీ, హస్త స్పర్శతో తనువు నిమిరినాడనీ, నిగమశర్మకు తన మనోభావాలను ఏకాగ్రతతో విశదం చేసినాడనీ తెలుస్తుంది. ఈ అవివక్షిత వాచ్యధ్వనినే, లక్షణామూల ధ్వని అని కూడా అంటారు. ఈ కావ్యంలో జాతీయాలు, సామెతలు, లోకోక్తులు వున్నాయి. ఉదాహరణకు గడును బుఱ్ఱ, వేయిగుళ్ళ పూజారిలు, వేయి కాళ్ళ జెఱ్ఱులు, బుద్ధి గడ్డితిను, కుక్కకాటుకు చెప్పుదెబ్బ, స్వర్గమున గూడ తప్పదా సవతి పోరు, దాసరి తప్పులెల్ల నొక దండముతోసరి, గొంతెమ్మ కోర్కె మొ॥ వీరి భాష ఎక్కువుగా సంస్కృత సమాసాలతో వుంటుంది. ఛందస్సు విషయంలో రావుగారు తన ప్రతిభను చూపించారు. “ఇందలి ప్రతిపద్యము నందును వక్రోక్తియో, వైచిత్రియో చమత్కారమో, రసమో, ధ్వనియో, రమణీయసమాసవివ్యాసమో, కమనీయకల్పనావిలాసమో విరాజిల్లుచు అభిజ్ఞులైన రసజ్ఞుల అంత రంగములకు గిలిగింతలు పెట్టుచునే యున్నవి. ఈ హేతువుచే ప్రతి పద్యహృద్యమైన ఈ కావ్య మొకమహాకావ్యమై రచయిత శ్రీజోగారావుగారిని మహాకవిశ్రేణిలో కూర్చుండబెట్టగలదనుటలో నా కెట్టి సందేహము లేదు. తథాస్తు" {{right|- "కరుణశ్రీ"}}<noinclude><references/> {{c|49}}</noinclude> rpd8vjnvzt3m6pvg36wwnjmfolughew పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/65 104 213514 557498 557229 2026-05-29T13:43:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557498 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><big>'''4. అడిగొప్పుల హోరుగాలి :'''</big> "జోగారావుగారికొక విలక్షణమగు పదప్రయోగనైపుణ్యము కలదు. "అడిగొప్పుల హోరుగాలి"లో అది కలదు. ప్రతి పద్యమున సాక్షాత్కరించును. భావచాలనములో ఒక వైచిత్రిసంవిధానము పదపదమున గోచరించును....." {{right|- '''డా॥ ప్రసాదరాయ కులపతి'''}} ఈ ఖండకావ్యం సెప్టెంబర్ 1979లో వెలువడింది. ఇందులో 46 పద్యాలు వున్నాయి. పేజీలు 36. ముందుమాట ప్రసాదరాయకులపతి గారు రాశారు. వై.బి.రెడ్డి గారికి అంకితం ఇచ్చారు. త్రివేణి ఫ్రెస్ మచిలీపట్నం వారు దీన్ని ప్రచురించారు. <poem> {{left margin|5em}} "గుడి మీద కోతి తోడను గుడిలోపలి నంబి వారి కోడలితోడవ్ నడివీధి లంజెతోడను "అడిగొప్పుల హోరుగాలి" నడిగితి ననుమీ" </poem> శ్రీనాథుని పేర ప్రసిద్ధమైవున్న చాటువు ఇది. ఈ చాటువుకు పూర్వరంగ పరికల్పనం "అడిగొప్పుల హోరుగాలి". ఒక కవియొక్క చాటువును ఆధారంగా తీసుకొని, దానికి పూర్వ రంగ కావ్యం అల్లడం, తెలుగు సాహిత్యంలో అపూర్వమైన ఘట్టం. సంప్రదాయ సిద్ధంగా పురవర్ణనతో కథ ప్రారంభమౌతుంది. ఈ కావ్య కథా మాత్రంతో ముడిపడిన సన్నివేశాలన్నింటికీ కూడలి "అడిగొప్పుల హోరుగాలి” ఆ పేరునే కావ్యానికి పేరు పెట్టారు "శృంగార యోగి" రావు గారు. జోగారావుగారి వినూతన సృష్టి “అడిగొప్పుల హోరుగాలి". ఇది ఊహ అనే పునాదిపై పుట్టింది. ఇది శృంగార రసప్రధానమైన కావ్యం. ఈ కావ్యానికి మూలం శ్రీనాథుని ప్రసిద్ధ చాటువు. ఈ పద్యాన్ని శ్రీనాథుడు ఎందుకు చెప్పాడని ఊహించి, ఆ మాటల వెనుక ఒక కథ వుంటే ఆ కథ ఇలాంటిది అయితే, ఎలావుంటుందని భావించి ఈ ఖండ కావ్యాన్ని రావుగారు రాశారు. ఈ కావ్యంలో కళా ప్రయోజనాన్ని గూర్చి నిరుపమానంగా విశదీకరించారు. జీవితంలోని కష్ట నష్టాలను పారద్రోలి సరసం, విలక్షణం, వినూత్నం, పరిపూర్ణమైన<noinclude><references/> {{c|50}}</noinclude> 19uz5cibmq915n2j677x9g5jq6kz5dh పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/66 104 213515 557499 557230 2026-05-29T13:57:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557499 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుభూతిని మానవునకు ప్రసాదించేది అసలు సిసలైన కళాతత్త్వమని జోగారావుగారు "స్వాగతం"లో తెలియజేశారు. <poem> {{left margin|5em}} "అతకనిబొంత లీ బ్రదుకు అందనిదైన సుఖానుభూతికై సతతము నఱ్ఱుసాచు నరసంజ్ఞితు డింత యుదాత్తుడైనచో బ్రతుకుల బాటలం దఱగొఱల్ కడతేరగ వేదనాకళం కితమతిగాక యుండగ నొకింత కళాంకితబుద్ధి కావలెన్" "సతత మనేక సమస్యల సతమతమగు నీసమాజ సంసారములన్ మతి మఱపించి యలౌకిక గతిని రసానంద మొసగగనెపుట్టె కళల్" </poem> లౌకికమైన బాధలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చి మనసును రసానుభూతితో ఆహ్లాదమయంచేసేదేకళ. అనేక లౌకిక విషయాల్లో బాధపడుతున్న మానవుని ఆత్మ సుఖసమగ్రం కాదు. మానవుడు తన జీవితంలోని సుఖ సంతోష సంతృప్తుల లోపపూరణకై సహజంగా మముఖుడు అవుతాడు. ఆ ప్రయత్నంలో అవ్యక్తమైన రసానుభూతి పొందడానికి అతడు సృష్టించు కొన్నదే కళ. ఈ కళ సత్యమా? అసత్యమా? కళ కలకాదు కల్లయునుకాదు. అవ్యక్త మధురమైన రసానందాన్ని మానవుడు ఎన్ని క్షణాలు తన జీవితంలో పొందగలడో ఆమధుర క్షణాలే అతని జీవితానికి స్థార్థకతనిస్తాయంటారు జోగారావుగారు. <poem> {{left margin|5em}} "కళ కలకాదు. కల్లయును గాదు. మనోఙ్ఞకవిత్వ మో, మహో జ్జ్వల కలగానమో, మధుర భంగిమతల్పము శిల్పమో, మన మ్ముల కనువిప్పు చిత్రపటమో, అపురూపము రూపకంబొ, ఉ ల్లల దనుభూతి నూచి హృదులన్ రసరమ్య మొనర్చు వేళలవ్" "అదె మధురక్షణం బొకరుడర్వది కాదొక వంద వత్సరాల్ బ్రదికెనయేని యట్టి మధురక్షణముల్ సకలమ్ము లెక్కిడన్ పద పదునై దయౌనపుడు వానిది తద్దశవత్సరంబులే బ్రదుకనగాదగున్ కడమ భాగము కాలము పుచ్చుటే యగున్" </poem> సహృదయలు, పరమభావుకపట్టభద్రులైన జోగారావు గారు చెప్పింది శతశతాంశం సత్యం. అందరూ ఇలా నిస్పంకోచంగా వున్నది ఉన్నట్లు చెప్పలేరు.<noinclude><references/> {{c|51}}</noinclude> srwa32uaumrqcd26obnu0353awcmqqn 557500 557499 2026-05-29T13:58:18Z శ్రీరామమూర్తి 1517 557500 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అనుభూతిని మానవునకు ప్రసాదించేది అసలు సిసలైన కళాతత్త్వమని జోగారావుగారు "స్వాగతం"లో తెలియజేశారు. <poem> {{left margin|5em}} "అతకనిబొంత లీ బ్రదుకు అందనిదైన సుఖానుభూతికై సతతము నఱ్ఱుసాచు నరసంజ్ఞితు డింత యుదాత్తుడైనచో బ్రతుకుల బాటలం దఱగొఱల్ కడతేరగ వేదనాకళం కితమతిగాక యుండగ నొకింత కళాంకితబుద్ధి కావలెన్" "సతత మనేక సమస్యల సతమతమగు నీసమాజ సంసారములన్ మతి మఱపించి యలౌకిక గతిని రసానంద మొసగగనెపుట్టె కళల్" </poem> లౌకికమైన బాధలతో కొట్టుమిట్టాడుతున్న ప్రజలకు అలౌకికమైన ఆనందాన్ని ఇచ్చి మనసును రసానుభూతితో ఆహ్లాదమయంచేసేదేకళ. అనేక లౌకిక విషయాల్లో బాధపడుతున్న మానవుని ఆత్మ సుఖసమగ్రం కాదు. మానవుడు తన జీవితంలోని సుఖ సంతోష సంతృప్తుల లోపపూరణకై సహజంగా మముఖుడు అవుతాడు. ఆ ప్రయత్నంలో అవ్యక్తమైన రసానుభూతి పొందడానికి అతడు సృష్టించు కొన్నదే కళ. ఈ కళ సత్యమా? అసత్యమా? కళ కలకాదు కల్లయునుకాదు. అవ్యక్త మధురమైన రసానందాన్ని మానవుడు ఎన్ని క్షణాలు తన జీవితంలో పొందగలడో ఆమధుర క్షణాలే అతని జీవితానికి స్థార్థకతనిస్తాయంటారు జోగారావుగారు. <poem> {{left margin|5em}} "కళ కలకాదు. కల్లయును గాదు. మనోఙ్ఞకవిత్వ మో, మహో జ్జ్వల కలగానమో, మధుర భంగిమతల్పము శిల్పమో, మన మ్ముల కనువిప్పు చిత్రపటమో, అపురూపము రూపకంబొ, ఉ ల్లల దనుభూతి నూచి హృదులన్ రసరమ్య మొనర్చు వేళలవ్" "అదె మధురక్షణం బొకరుడర్వది కాదొక వంద వత్సరాల్ బ్రదికెనయేని యట్టి మధురక్షణముల్ సకలమ్ము లెక్కిడన్ పద పదునై దయౌనపుడు వానిది తద్దశవత్సరంబులే బ్రదుకనగాదగున్ కడమ భాగము కాలము పుచ్చుటే యగున్" </poem> సహృదయలు, పరమభావుకపట్టభద్రులైన జోగారావు గారు చెప్పింది శతశతాంశం సత్యం. అందరూ ఇలా నిస్పంకోచంగా వున్నది ఉన్నట్లు చెప్పలేరు.<noinclude><references/> {{c|51}}</noinclude> ssevobs7gy20k34vusuvop3dcxe8kzx పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/67 104 213516 557501 557231 2026-05-29T17:02:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557501 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సహృదయ సార్వభౌముడైన యస్వీగారికే ఈ ఘనత దక్కుతుంది. సకల కళాధిరాజమై కవిత్వం ఎలా విరాజిల్లుతుందో జోగారావుగారు విపులీకరించారు. <poem> {{left margin|5em}} "సర్వ భావనాభి వ్యక్తి శక్తి మంత మైన శబ్దము పరికరమగుట, చిరము స్థిరము తదనుభూతి వరము పరమ మగుట కవితయ కళాధిరాజమై క్రాలుచుండు" </poem> నీతులు, నినాదాలు కవిత్వం కాదు. శ్రావ్యమైన శబ్దంతో రమ్యమైన అర్థాన్ని హృద్యమైన అనుభవంగా మలచేది సాహిత్యం అని జోగారావుగారు అన్నారు. ఈ సాహిత్య ప్రపంచ సృష్టిలో ఒక్కొక్క కవిది ఒక్కొక్క దృక్పథం. అందరి దృష్టి ఒకేలా వుండదు, వుండకూడదుకూడా. ఈ కవి ఇలాగే ఎందుకు రాశాడన్నది వెర్రిప్రశ్న అని రావుగారు అన్నారు. ఆ కవిత్వం సద్యోహృద్యం, సహృదయనైవేద్యమై చక్కగా వున్నదా? లేదా? అనేదే చూడాలని జోగారావుగారి అభిప్రాయం. <poem> {{left margin|5em}} "ఎక్కవి యిష్టము వానిది అక్కైవడి నేల వ్రాసెనన్నది ప్రశ్నా? చక్కగ వ్రాసెన లేదా? చొక్కిడు కవిత గలద యని చూడగవలయున్॥ </poem> కావ్య కళారహస్య వివేచనాశక్తిని ఎంతో అందంగా చెప్పారు యస్వీగారు. మనిషి ప్రతీరోజు జీవితానుభవంలోని లోటుపాట్లు, పాత వాసనలు విస్మరించి, సరసం. వినూత్నం, విలక్షణం, పరిపూర్ణమైన అనుభూతిని పొందడానికే రసికులు కలలు గని, కళలు గనినారనీ, దాన్ని తన కావ్యంలో రసజ్ఞులు నిండార పొందుతారని జోగారావు గారు కావ్యం యొక్క గొప్పతనాన్ని గూర్చి "స్వగతం"లో తెలియజేశారు. <poem> {{left margin|5em}} "అనుదిన జీవితానుభవమందలి లోటులు పాట్లు ప్రాతవా సనలును విస్మరించి సరసంబు విలక్షణమున్ వినూతనం బును పరిపూర్ణమైన యనుభూతి నొసంగుటకే కదా కల ల్లని రసికుల్ కళల్గనిరి కందురుగాక రసజ్ఞు లిందునున్" </poem> ఇందులో జోగారావుగారు కావ్య కళా పరమార్థాన్ని నిర్వచించారు. భావంలో, భావనలో, భాషలో, ఛందస్సులో, శైలిలో అన్నింటా ఒక కవితా వైలక్షణ్యం ఈ "అడిగొప్పుల హోరుగాలి" కావ్యంలో కన్పిస్తుంది.<noinclude><references/> {{c|52}}</noinclude> 0t2b0ygujfrzoedm08f0bxkkwpiqmpx పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/68 104 213517 557502 557232 2026-05-29T17:14:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557502 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఈ ఖండకావ్యం పురవర్ణనతో ప్రారంభమవుతుంది. హోరుగాలికి అడిగొప్పుల పురంలోని విషయపరిస్థితుల్ని జోగారావుగారు మనకళ్ళకు కట్టినట్లు వర్ణించారు. <poem> {{left margin|5em}} “ఉఱుములై యూర్పులై యెఱపులుచ్చిన క్రేగను గెంపు సొంపులై ఈలలువేసి పర్వులిడు నీదురుగాలులె చీదరింపులై పిడుగులపాట్లు వాలుజడ వ్రేట్లునునై జడియశ్రుధారయై వచ్చెన్ వర్షము కొండెకృష్ణుపయి కోపం బూను నచ్చామనాన్” </poem> శ్రీనాథుడు అప్పుడే పురంలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో హోరుగాలి వీస్తుంది. గడ గడ లాడెడు మ్రానులతో, వడ వడ వడకెడి మేనులతో, దడ దడ లాడెడి తలుపులతో, చిడి ముడి పడి యెడు తలపులతో, చిత్త చూపులతో ఊరంతా అల్లకల్లోలమవుతుంది. ఊరంతా పరమ విషమస్థితిలో వుంటుంది. ఆహోరుగాలికి ప్రజలు కాందిశీకులవుతారు. ఆసమయంలో జోగారావుగారు ఎన్నో కొత్త వింతలు కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. <poem> {{left margin|5em}} “సుసర భేత్తును విల్చి బసకేగు జవరాలు చకచక ఎక్కె సౌచికుని గడప రామకోటిని వ్రాసి వ్రాసి నామాలయ్య కోటిరామల దల్చుకొని పరుండె స్వాముల వారి సవర్య నప్పటి కప్డు భగవంతు దర్శించె బాల విధవ మంచి మొగ్గినరోగి మకరధ్వజముమాత్ర మిసి మింతుడునుగాక మ్రింగినాడు". </poem> ఊరంతా చీకటి. చుక్కలు కూడా కన్పించడం లేదు. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరియై ఆ ఊరిలో చుక్కలన్నీ నక్కినవో చొక్కినవో అన్పిస్తుంది. శ్రీనాథునికి ఏ తలుపును స్వాగతం ఇవ్వలేదు. పరిస్థితులు చాలా భయంకరంగా వున్నాయి. ఎవడిగోల వాడిది. ఎవరి తిప్పలు వాడివి. ఏది ఏమైన చివరకు శ్రీనాథుడు ఊరి చివర శివాలయానికి చేరుతాడు. దేవాలయ ద్వారాలు మూసివుంటాయి. అయితే ఆ దేవాలయం లోపల నుండి "ఘ్రాణపుటీకుంబక" సుగంధం వాసన వస్తుంది. శ్రీనాథుని నోరు ఊరింది. లోపల గుడిలో నంబి అర్చకుని కోడలు శివుని వేదనకై రుచి పదార్థాలు తెస్తుంది. "కొప్పెర” అనే కోతి ఎత్తుకొని వీధిలోకి పోతుంది. ఆమె<noinclude><references/> {{c|53}}</noinclude> 1580tsnvl1fsn6t6xekr2hjexisbyhp పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/69 104 213518 557503 557233 2026-05-29T17:26:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557503 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>తలుపులు తెరుస్తుంది. కోతి, పాత్రను విడిచి పరుగెడుతుంది. శ్రీనాథ కవి దేవాలయంలోకి వెళతాడు. గుడిలోని శివ పార్వతులకు దండం పెట్టుకుంటాడు. ఆమె, లింగని ప్రసాదాన్ని, కవి లింగనికి ఇస్తుంది. ఆ ప్రసాదాన్ని తిని శ్రీవాథుడు ఎంతగానో మెచ్చుకుంటాడు. శ్రీనాథుడు అదే పనిగా, ఆమెవైపు కరదీపిక చూసిన రీతి చూస్తాడు. ఆమె శ్రీనాథుని భావాన్నికనిపెడుతుంది. వెంటనే “రసజ్ఞేంద్ర! ఇది శివాలయము క్షమింపు" మని అంటుంది. అప్పుడు శ్రీనాథుడు - <poem> {{left margin|5em}} “అల్లోనేరెళ్ళు లాత్మ లింగమున కవ్వా! గుండెలో లోపలన్ గుళ్ళున్ గోపురముల్ రచించితిని సాకుల్మాను, మావంకనే విల్లున్ వంచుక విఱ్ఱవీగునతడున్ వేం చేసి యున్నాడహో బుల్లీ! పూజరిపూవుబోడి ! దయ కఱ్వోనేను శ్రీనాథడన్! " </poem> "బుల్లీ! పూజారి పూవుబోడీ! నా గుండెలోనే గుళ్లును గోపురములను రచించితిని, సాకులు మానుము. మన్మథుడు విల్లువంచి విర్రవీగుచున్నాడు. నేను శ్రీనాధుడను దయకర్వో" అని అంటాడు ఇలా అనడం వల్ల మనకు "తల్లీ కన్నడ రాజ్యలక్ష్మి! దయ లేదా! నేను శ్రీనాథుడన్" అనే పద్యం ఈ సందర్భంలో స్పురిస్తుంది. ఆమె “మగనాలనురా" అని పల్కి వెళ్ళిపోతుంది. శ్రీనాథుడు సిగ్గుతో చితికిపోతాడు. ధర్మపు హద్దు హెచ్చరించింది. శ్రీనాథుడు నిగ్రహించుకుంటాడు. పంచబాణునకు నమస్కరించి "అయ్యా! ఈమె పరదార! ఇది పాపము" అని విన్న వించుకుంటాడు. ఇలా జరగడంతో శ్రీనాథుని శృంగార కథా తంతు ముగింపు అయిందా అని సహృదయ పాఠకునకు అన్పిస్తుంది. అప్పుడే కథ ముగిస్తే అది శ్రీనాథుని కథకాదు. జోగారావుగారి రచనా కాదు. ఇక్కడే అద్భుతమైన క్రొత్త మలుపు వుంది. ఆ మలుపు చెప్పుకోదగ్గది. అప్పుడే వినుకొండ వేశ్య ఒకతె తన వృత్తికి సంబంధించిన పనిమీద వస్తుంది. ముత్యాల పల్లకిమీద అంగరంగ వైభంతో వస్తుంది. అయినప్పటీ హెూరుగాలి వానవల్ల ముప్పుతప్పలేదు. సుడిగాలి, జడివానవల్ల పల్లకీ బోయలు కకావికలవుతారు. ఆమె మాత్రం గుడి లోకి వెళుతుంది.. నంబిగారి కోడలితో శ్రీనాథుడు జరిపిన సంభాషణ వింటుంది. ఆమె శ్రీనాథుని చేరి తనను తాను పరిచయం చేసుకుంటుంది.<noinclude><references/> {{c|54}}</noinclude> 8ddki6ui8qrogvkkg2hcuskawzyezd7 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/70 104 213519 557504 557234 2026-05-29T18:02:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557504 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>విన్నవాడు ప్రవరుడు కాడు, శ్రీనాథుడు. కోరి వచ్చి అర్పించుకొన్న కాంతను, ధన్యను చేస్తాడు. శ్రీనాథుడనే శివునకు ఆమె తన శరీరాన్ని మనస్ఫూర్తిగా అర్పించుకుంటుంది. వారిద్దరి కలయకలో పరమశివునకు భక్తురాలు శరీరాన్ని అర్పించి మోక్షమొందినదని జోగారావుగారు వ్యంగంగా చెప్పుతారు. ఇలా చెప్పడంలో ఆశృంగారానికి ఒక పవిత్ర వైశిష్ట్యం ఏర్పడింది. వారిద్దరి కలయికలో, వాళ్ళకు జోగారావుగారు వేసిన అద్భుతమైన విశేషణాల్లో ఈ విషయం మనకు తెలుస్తుంది. అయితే ఇది శివాలయంలో జరిగిన కామ కలాపన కథకాదు. ఆమె సామాన్య వేశ్యకాదు. ఆమె పరమశివభక్తురాలు, కవితా కళాసురభిళమైన వ్యక్తిత్వం కలది ఆమె. శ్రీనాథుడు పరమ శివభక్తుడు. ఈశ్వరార్చన కళాశీలుడు. అందుకే “కాశీ ఖండంలో "శివుడే నేను. వేశివుండ ననుచున్ చింతింతునశాంతమున్" అని శ్రీనాథుడు ప్రకటించుకున్నాడు. శివాద్వైతి శ్రీనాథుడు. ఇద్దరూ శివభక్తులే. అందుకే వేశ్య శ్రీనాథుని పొందుకై తహతహలాడుతుంది. అర్రులు చాచింది, తలచింది, వలచింది. తానుఅనుకున్న పని చేసింది. శివభక్తుడైన శ్రీనాథునితో కలవడం ఆమె ఆనందానికి అవధులు లేవు. శ్రీనాథునితో ఆమె పొందిన క్షణిక సుఖం, తన జీవితానికి శాశ్వతత్వాన్ని ప్రసాదింపగలదని అభిప్రాయపడింది. కొండవీటిలో పెద కోమటి వేమారెడ్డి చేత మదనార్చితుడైన మహేశ్వరుని వలె సన్మానించబడిన దృశ్యం గుర్తుకు తెస్తుంది. అప్పటి నుండి ఆయనపై మరుల కొనియుంటినని, ఆ కవీంద్రుని కౌగిటిలో కరిగిపోవుక్షణం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పుతుంది. వరూధిని చెప్పినట్లు తన పేరు ప్రతిష్ఠలు చెప్పుతుంది. వినుకొండ బంగారుగనులను కనుల కరిగించు కనకాంగియా తన్వంగి. ఈ సంఘటన మన్మథ మాయకాదు. ఆ మహేశుని అనుగ్రహం అని భావించి పలుకుతుంది. దివాంధ జీవితంగా, నిశాచరవృత్తిలో గడుపు తనకు, బ్రతుకులో ఒక మధుర క్షణం ప్రసాదింపుమని ప్రార్ధిస్తుంది. శ్రీనాథుడు ప్రవరుడుకాడు. అలా అని ధర్మవిరుద్ధ వర్తనుడుకాదు. కోరివచ్చి అర్పించుకొన్న కాంతను ధన్యను చేసినాడు శ్రీనాథుడు. వారి పరిష్వంగంలో గంగాస్నానానుభవం, సౌపర్వ స్వాదుసుఖం స్పురిస్తాయి. "తాను శివుని కలిసిన గంగా పావన జీవననౌదు" అని అంటుంది. వారిద్దరు కలిసి నప్పటి స్థితిని జోగారావుగారు అద్భుతంగా వర్ణించారు.<noinclude><references/> {{c|55}}</noinclude> gy2f44to4m7x8xgirr99ds0qwtk9rwz పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/71 104 213520 557505 557235 2026-05-29T21:11:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557505 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem> {{left margin|5em}} "సర్వాంగీణ తదీయబంధుర పరిష్వంగంబులో నీశవా సోర్వీ ధ్రోన్నత సాను నిర్గళిగంగోదాహగాహమ్ము సౌ పర్వ స్వాదు సుఖాను భూతియు స్ఫురింపబోలునప్పాటవా శర్వప్రాణుల పారవశ్యము రసజ్ఞా! నీకు నే చెప్పనా” </poem> శ్రీనాధుడు తన కవిత్వాన్ని, హృదయాన్ని శివపరంచేశాడు. సహజంగా శివభక్తిగల ఆ వేశ్య తన హృదయాన్ని శివ స్వరూపుడైన శ్రీనాథునికి అంకిత మిచ్చింది. శ్రీనాథకవిలో శివుని దర్శించింది వేశ్య. కవితా కళా శిఖామణి ఆమె. వేశ్యను గంగగా తలచి, ఆమెను ధన్యను చేసిన కవీశ్వరుడు శ్రీనాథుడు. కావ్యకళా రసఙ్ఞ, శివ భక్తి తత్పరురాలైన వేశ్యకు, శ్రీనాథకవీశ్వరుడు మోక్షమిచ్చాడు. ఆమె మోక్షంపొంది మాయమవుతుంది. <poem> {{left margin|5em}} “సాధు రసాధిరాజ సరసాభినివేశము తద్గతంబు ఝం ఝాదుర లెక్కలేక నరసాగెను. వేగినదాక కానిశ్రీ నాథ శివార్పి తమ్మయిన నవ్యలతాంతము మాయమయ్యెభా మాధరశీదు పాన మదమత్తుని చిత్తము తత్త ఱింపగన్" </poem> "శ్రీనాథ శివార్పితమయిన నవ్యలతాంతము మాయమయ్యెనట" అంటూ అద్భుతమైన ముగింపుతో కథ ముగుస్తుంది. ఈ కావ్యంలో అద్వైత భావన బాగా ఇమిడి వుంది. ఇందులో శివభక్తి స్పష్టంగా కన్పిస్తుంది. భక్తిలో శృంగారం, శృంగారంలో భక్తి చోటు చేసుకున్నాయి. జోగారావుగారు బహు చిత్ర విచిత్ర ప్రయోగాల్ని ఈ కావ్యంలో వాడారు. “చుక్క” శబ్దంపై విచిత్ర ప్రయోగం చేశారు రావుగారు. ఆపురానికి వచ్చిన శ్రీనాథునకు చుక్కెదురైంది. "ఊపిరాడక యుక్కిరి బిక్కిరి యౌట నీపురిన్ జుక్కలవెల్ల నక్కినవో చొక్కినవో" అని పించుట అని అన్నారు. అదేవిధంగా "లింగ” శబ్దంమీద ప్రయోగం కూడా. <poem> {{left margin|5em}} "లింగని జూచి, లింగని చెలింగని చేతుల మోడ్చి నంబియా లింగని, దాని రొమ్మున త్రిలింగ మహీభర ధూర్వహ ప్రణా ళిం, గని యిచ్చమెచ్చి మనలింగనిదైవ ప్రసాదమిచ్చియా లింగన మేనిముట్ట గవిలింగని గావు మటంచు వేడగన్" </poem><noinclude><references/> {{c|56}}</noinclude> 6hcuup8fg7eeq9q828wcz2jciz0d7mo పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/72 104 213521 557506 557236 2026-05-29T21:21:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557506 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సంస్కృతాంధ్ర భాషల్లో కడుసమర్థులు జోగారావుగారు అని చెప్పడానికి ఇలాంటి పద్యాలు ఎన్నో ఈ కావ్యంలో వున్నాయి. <poem> {{left margin|5em}} "కావ్య వస్తువు చాటువులోని మాట. రసజగన్నాథుడైన శ్రీనాథుడు నాయకుడు. ఈ వినూత్న సృష్టిలో కవి యొక్క సాహిత్య సౌందర్యోపాసనా లబ్ధమైన దివ్య దార్శనికత్వము స్పష్టమగును. కృతి ఖండకృతి గాని కల్పనలో, భావనలో, ఛందః స్వీకరణలో, శైలిలో, అన్నిట ఒక విలక్షణత, ఒక విశిష్టత, అఖండముగ సాగినవి. ఈ కావ్యమున వారి కవితా వైమర్శిక విధానము, కావ్య ప్రయోజన దృక్పథము, కవిత్వ తత్త్వ విచారము వంటి విషయములెన్నియో చక్కగా చెప్పబడినవి. ఈ అడిగొప్పుల హోరుగాలి పరిమాణమున చిన్నదైనను ప్రమాణమున మిన్నదై, రసభానుర భావసంపదతో, విశిష్ట పద ప్రయోగ దక్షతతో, సురుచిరసుమధుర శృంగార లావణ్య కావ్య కన్యకగా సహృదయ మనః ఫలకముల చెరగని ముద్రవేయుచున్నది. పూర్వకవి వాక్ప్రయోగదక్షత, ప్రతిపద సార్ధకత, ఈ కావ్యమున పద పదమున గోచర మగును. ఒక విలక్షణ పదప్రయోగ నైపుణ్యము దర్శనమిచ్చును. భావ చాలనములో ఒకవైచిత్రీ సంవిధానము కన్పడును. కథ శ్రీనాథము కనుక రచనకు ప్రౌఢత్వము చేర్చి ప్రతి పంక్తిలో శ్రీనాథునే దర్శింప చేసిన కవిత ప్రజ్ఞ కాన నగును". {{right|'''డాక్టర్ తటవర్తి రాజగోపబాలం'''}} </poem> '''5. శృంగార సర్వజ్ఞం :''' <poem> {{left margin|5em}} "ఈ కావ్యంలో ఎంతమునిగిపోయానో చెప్పలేను, మీరు దాసుగారిలో పరకాయ ప్రవేశం చేసి ఆ దేశ కాలపాత్రలతో సహ ఆ మహానుభావుని ఆత్మను నాలో ప్రవేశింపచేసినారు. నాలో ఆ సౌరభం అంతా నిండిపోయింది. సంగీతంతో, మీ </poem><noinclude><references/> {{c|57}}</noinclude> qvsmj7762ern2oehp3n9wokhsawq2c9 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/73 104 213522 557507 557237 2026-05-29T21:31:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557507 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem> {{left margin|5em}} కావ్యం చరితార్థం అయిందనటానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఇప్పటి వాళ్ళల్లోనే కాదు. మొత్తం తెనుగు భాషలోని గొప్ప కవులలో మీది విశిష్టస్థానం. మీ పద్యరచనలో ఉన్న విచ్ఛిత్తి గొప్ప వైవిధ్యం కలది. మీ మార్గానికి మీరు “మాష్టరు". ఇన్నాళ్ళకు మీ శక్తికి తగిన వస్తువూ, నాయకుడూ దొరికారు. నాకు “ప్రాత -క్రొత్త” అనే మాటలమీద నమ్మకం లేదు. 'ప్రతిభ'మీద నమ్మకం ఉంది. ప్రతిభ ప్రతిదాన్నీ ప్రతిక్షణమూ క్రొత్తగా జేస్తుంది. అది మీలో పుష్కలంగా ఉంది. నాకు నచ్చటం అంటే ఏమిటో మీకు తెలుసు గదా! అయినా మీ పద్యమే ఒకటి ఉదాహరిస్తాను. "కనులన్ కజ్జలరేఖయై తెలివి, దృజ్నైశిత్యమై ప్రాయ, మా ననసీమన్ దిలకంబయై చెలవు, మేనన్‌గల్గు వెల్లై కళా ర్జనకౌశల్యము, బొందిలోని యుసురై రాసిక్య, మమ్మత్తకా శినికిం బొల్బు మనస్సులోని మరుడై చెల్వొందు వా డెవ్వడో!" పద్యం అంటే యిలా ఉండాలి" {{right|'''- మల్లంపల్లి శరభయ్య'''}} </poem> హరికథా పితామహుడు అజ్జాడ ఆదిభట్లనారాయణ దాసు గారి స్వీయ చరిత్ర “నా యెఱుక”. దీనిలోని శృంగార సన్నివేశాలు జోగారావుగారి "శృంగార సర్వజ్ఞం" కావ్యానికి కథా భూమిక అయింది. దాసుగారి జీవితంలోని శృంగార సంగీతాన్ని తన రసిక ప్రతిభతో "శృంగార సర్వజ్ఞం"గా తీర్చి దిద్దారు రావుగారు. 1981లో ఇది అచ్చు అయింది. పేజీలు 89. దీన్ని త్రివేణి ప్రెస్, మచిలీపట్నం వారు ప్రచురించారు. జోగారావుగారికి ఆదిభట్ల నారాయణ దాసుగారి ఎడల గొప్ప గౌరవ భావం వుంది. "శృంగార సర్వజ్ఞం" అనే పేరు వినగానే ఈ గ్రంథం శృంగార రసానికి సంబంధించిందిగా మనకు అర్ధమవుతుంది. అటుదాసుగారు ఇటు జోగారావుగారు ఇద్దరూ శృంగార సర్వజ్ఞులే. ఈ గ్రంథానికి ముందుమాట ఆవుల సాంబశివరావు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి, సంజీవ దేవ్ గార్లు రాశారు. కావ్య విశిష్టతను మల్లం పల్లి శరభయ్య, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి లాంటి ప్రముఖులు ఎందరో మెచ్చుకున్నారు.<noinclude><references/> {{c|58}}</noinclude> na17lep1naj2uiup6gne3kr1hkenwgm పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/74 104 213523 557508 557238 2026-05-29T21:42:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557508 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>దాసుగారు తన జీవితంలోని తొలి ముప్పై సంవత్సరాల గాథలనే ఈ స్వయం చరిత్రలో రాశారు. “ముప్పై దాటిన పిదప ఆయన తానుగా తననుగూర్చి లోకమునకు చెప్పవలసిన దేమియు లేదు. జగత్ప్ర సిద్ధులైనారు. తాను చెప్పిన గాని, లోకమునకు తెలియని విశేషములనే స్వీయ చరిత్రలో వ్రాయవలెనని, తరువాతి వారి అర్ధ శతాబ్ద జీవిత విశేషములకు లోకమే ప్రమాణమని నట్లు వ్రాసినారు". (నా యెఱుక -పీఠిక -పుట 4.5). నారాయణ దాసుగారికి ఇరవై ఒకటవ సంవత్సరంలో పెళ్ళి అయింది. తన జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను వున్నవి వున్నట్లు రాశారు. దాసుగారి సత్య సంధత, కళాభిజ్ఞత, రాసిక్యం జోగారావుగారి హృదయాన్ని కదిలించింది. ఎప్పుడో ఏనాడో జరిగిన ఆ శృంగార సన్నివేశాలను వర్తమానాన్ని దృష్టిలో వుంచుకొని దాసుగారి శృంగార జీవనాన్ని చక్కగా రాశారు రావుగారు. “నాయెఱుక"లో ఉత్తి పొడిమాటల్లో వున్న ఘట్టాలను రసపేశలంగా సురుచిరకళాకౌశలంగా ఇందులో అద్భుతంగా జోగారావు గారు మలిచారు. ఈ కావ్యానికి "శృంగార సర్వజ్ఞం" అని పేరుపెట్టడంలోనే జోగారావు గారి ఆంతర్యం మనకు తెలుస్తుంది. కళలలో సంగీతం, నవరసాలలో శృంగారం సద్యో హృద్యాలు, సహృదయ నైవేద్యాలు, సర్వప్రాణి హృదయగోచరాలు. సంగీత, శృంగారాలకు అవినాభావ బంధురభావబంధంతో అరాధించి, సంగీత సరస్సులో శృంగార సౌరభాన్ని గుబాళింపచేసిన రసజ్ఞ వసంతుడు దాసుగారు. 70 సంవత్సరాల వయసులో విశాఖలో శ్రీమహాదేవ అయ్యర్ కలెక్టర్ గారిచే "శృంగార సర్వఙ్ఞ" బిరుదును పొందారు దాసుగారు. వీరి జీవితంలోని శృంగార సంగీతాన్ని గ్రహించి దాన్ని ఒక మధుర కావ్యంగా "శృంగార సర్వఙ్ఞం”ను తీర్చిదిద్దారు. కావ్య నాయకుని శృంగార ప్రజ్ఞకు, కృతి కవితా ప్రతిభకు, కల్పనా శిల్పానికి, ఈ కావ్యం ప్రతి బింబం. "ఏ తాదృశ మనోజ్ఞ భావములతో సన్నివేశ కల్పనా చాతుర్యముతో చమత్కార సంభాషణా రాసిక్యముతో ఈ కావ్యము మెఱుగులు దిద్దు కున్నది. యస్వీ కవితా వైదుష్యమునకు సరియైన నాయకుడు లభించినాడు. భక్తి సంగీతములు మూర్తీభవించిన మహామనీషి దాసుగారు. కామ పరాయత్తతగాక, కావ్య రసపోషణకు అనుగుణమైనది ఆయన శృంగారము. దాసుగారి సత్యనిష్ఠకు దీటైనది యస్వీ కావ్య సృష్టి" ప్రసన్నకుసుమాయుధ మహాకావ్య ప్రత్యేక సమీక్ష - డాక్టర్ తటవర్తి<noinclude><references/> {{c|59}}</noinclude> c6xc9zc4313wdle00zzfrcmsfp3hszk పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/75 104 213524 557510 557239 2026-05-29T21:52:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557510 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>రాజగోపబాలం). ఈ గ్రంథంలో పుణ్యం - పురుషార్ధం, తదుపరి, విప్రవిటత్వం, రంకులరాట్నం, అరవింద - నీలోత్పల, మధురక్షణం, భగవద్భంగిచోటుచేసుకున్నాయి. వీటికి “సరిగమ పదని” అని సప్త స్వర సంజ్ఞలచే సూచించడంవల్ల శృంగారంలో సంగీతాన్ని చూశారని చెప్పవచ్చు. వెంపరాల సూర్య నారాయణ శాస్త్రి గారు పీఠికలో ఈ కావ్యగొప్పతనం గూర్చి తెలియజేశారు. అది ఇది. "స్వగతం"లో జోగారావుగారు - <poem> {{left margin|5em}} “నేనా నేననమాన మానసభవానేక ప్రకారావతా రానూనప్రతిభాను భావుడ, సదాసాక్షాత్కృతానంగుడన్ శ్రీనాథ ప్రభృతి ప్రసిద్ధ కవితా శృంగార భృంగారుడన్ నా నా దేశ విటీకటాక్ష తటి దంత స్ఫూర్తినుడ్డోలుడన్" </poem> ఇందులో “నేనా? అని ఎవరో తన్ను అడిగినట్లు దానికి సమాధానంగా “నేను” అనడంలో ఎంతో వ్యంగ్యం కన్పిస్తుంది. సాక్షాత్కృతానంగుడన్, శృంగార భృంగారుడన్, ఉడ్డోలుడన్ మున్నగు పద ప్రయోగాలు ఆత్మ ప్రత్యయాలకు స్ఫోరకాలు. <poem> {{left margin|5em}} "కల్పించితిని "పంచక ల్యాణి" లోవైక విధ నవీన ప్రత్న పథకములను ఆడించి పాడించి వాడ “నప్సరస”లో ఛందశ్శిఖుల శబ్ద శారికలను సవరించితి “నుపనిషత్తు" న బహుజన్మ జరజీవుని భావజాలములను ప్రకటించితిని "ప్రసన్న కుసుమాయుధము"లో గజకర్ణ గోకర్ణ కౌశలముల నాది రసరాజ మార్గము నాదుగమ్య మది కళాసురభిళ రసికాంతరంగ మసలు ప్రతిభా సముద్ర సాంయాత్రికుడను ప్రాత యనిపించు సరిక్రొత్త పథమునాది" </poem><noinclude><references/> {{c|60}}</noinclude> kdinwvxirt7sxr6qufhccinmsvsqrdq పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/76 104 213525 557529 557240 2026-05-30T09:27:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557529 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>జోగారావుగారి “ప్రాతయనిపించు సరి క్రొత్త పథమునాది" అని ప్రతిజ్ఞ చేశారు. వీరు ఛందస్సులోనూ విలక్షణమైన సమాస ఘటనలోనూ, విచిత్ర సంస్కృతాంధ్ర పద ప్రయోగాల్లోనూ కడు దిట్ట. "పంచకళ్యాణి”, “అప్పరస” “ఉపనిషత్తు" ప్రసన్నకుసుమాయుధం" కావ్యాలు ఎలా రసవత్తరంగా రాశారో వివరించారు. <poem> {{left margin|5em}} "వామలూరు భవుని రామాయణ ప్రహిం బ్ర విమల వారిపూరములు గ్రోవి బాద రాయణ మహాభారత పాధోది దిగ్దిగంతములకు దిగిరి తిరిగి కాళిదాస కవితా కైలాస గంగలో స్వైర విహారముల్ సలిపి సలిపి బాణ కాదంబరీ స్వాదు రసాచ్ఛోద సరసి నభ్యంజన స్నాన మాడి తిక్క యజ్ఞ్య శిల్పపు బుగ్గదీర్ధమాడి దాసహరికథా జలధార దడిసిభార తాంధ్ర భావుకుల్ పావనులైరి వార లంటరాని వారేని నేనంతెయగుదు" </poem> పై సీసపద్యంలో వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు, బాణుడు మున్నగు కవుల వాఙ్మయాన్ని, తిక్కన, నారాయణదాసు వాఙ్మయాన్ని ఆస్వాదించి "భారతాంధ్ర భావుకుల్ పావనులైరి" అని అన్నారు. ఇలా పాత ధోరణిలోనే పద్యం నడిచింది. చివరలో “వారలంటరాని వారేని నేనంతెయగుదు" అని అన్నారు జోగారావుగారు. ఇలా అనడంలో రావుగారి కవితలో వక్రత చాలా స్పష్టంగా కన్పిస్తుందని వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు అన్నారు. వాల్మీకి, వ్యాసుడు మున్నగు వారిని పరమ పూజ్యులని మీరు అనకున్నచో నేనును పూజ్యుడనే అని అన్నారు. ఇలా అనడానికి ఎంత ధైర్యం వుండాలి కవికి, ఆధైర్యమూ ఆదమ్మూ సాహితీమూర్తి జోగారావుగారికి వున్నాయి. ఇక్కడ వ్యంగ్యం మాత్రమే కాదు, నేను కూడా వాల్మీకి, వ్యాసుడు మున్నగు వారి సంస్కృత సారస్వతాన్ని, తిక్కన, నారాయణ దాసుల సారస్వతాన్ని మధించి అందులోని సారాన్ని ఆస్వాదించిన వాడినే అని అర్థం వుంది. ఈ కావ్యంలో వక్రత కన్పిస్తుంది. “క్రొత్త పథము నాది”<noinclude><references/> {{c|61}}</noinclude> 3zta1f89mu1aqj9p2nl4t6pk7aye028 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/77 104 213526 557531 557241 2026-05-30T09:43:03Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557531 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అన్న ప్రతినకు ఇది మంచి ఉదాహరణగా వెంపరాల వారు తెలియజేశారు. ఈ కావ్యం "పుణ్యము - పురుషార్ధము"తో ప్రారంభమవుతుంది. “నాయెఱుక”లో దానికి మూలమిది. "............... మా జట్టుదారులలో నొక డప్పటి షోళంగిముచ్చులలో నగ్రేసరుడు. వానిం గన్న కొడుకువలె నొకధర్మాత్ముడు చూచుచు వానికిష్టమువచ్చినట్లెల్ల ధనమిచ్చుచుండెను. “ధనమేమిషనువచ్చిను భోగార్హముకదా!" అతడు పెచ్చురేగి విచ్చలవిడి సొమ్ము వెచ్చపుచ్చుచుండెను. అతని వెలయాలు నా చేత నొక నెలవరకు భాస్కరరామాయణము చదివించి పట్టాభిషేకము చేయించి ఒక పంచలచాపు. ఒక చీర పదిరూప్యములు కట్న మొసంగెను. అంతసొమ్ము నాచేతి కదివరకొక్కసారి చిక్కలేదు. ఆచీర మాత్రమే నాకు యమషట్పది నుపదేశంచిన మారెండవమేనమామ పెద్దకొడుకునకిచ్చి వేసినాడ. సాయంకాలము బడివిడిచినతోడనే జట్టు దార్ల కడకేగుట, వారు కరుణించి దయచేసి చిన్న గురుని సేవించుట, చిల్లరిపాటలు బాడుచు వెలపొలతుల యింట నచ్చుగిత్తలవలె వారి వెంట దిరుగుచుండుటయు నావని ...... అంతట నా యెడమపార్శ్వమునందండవాతము మెండయ్యెను.... అది కనిపెట్టి మారెండవయన్న ఒకపిసినితురకను బిలిపించి .. పిండికట్టున మాన్పెను. అదివరకు నాకు మిక్కిలి పరిచితయగు నొక వెలచేడియ యింటికి దాని యప్పకూతురు వచ్చెను. నే నచటికిబోయి మన్మథబాణమువలె నున్న దానింజూచి యూట లూరుచు జావళీలు బాడుచు నాపెయెదకు బాత్రుడనై నాకుంగల వ్యాధికి దానిబాగునకు లక్ష్యము నీయకుంటిని. నాడే నాకలవిగాని జ్వరముతగిలి సంధికి కుదించెను.... దేవుని కృపవలన నాకాజ్వరము మళ్ళెను. మరువాడు చినవెలయాలు పినతల్లిని తోడుతెచ్చుకొని నన్ను జూడవచ్చెను. “మొన్న నీయొద్ద పాడిన జావళీ యింత జేసె" నని నవ్విన నన్నుంజూచి "ఇంత శ్రమపడుచున్నను నీపోకిరితనము మాన వైతివి” అని యొక కంటకోపము మఱియొక కంట సంతోషము నభినయించిన సొగసెట్లు వర్ణింపగలను?" "నా యెఱుక సే. 78-79.) ఈ సన్నివేశానికి నారాయణ దాసు గారు "వ్యాధి చికిత్స" అని పేరు పెట్టారు. జోగారావుగారు కావ్యోచితంగా “పుణ్యము - పురుషార్ధము" అని శీర్షిక పెట్టారు. వేశ్య ఇంటిలో పురాణ పాఠం పూర్తి అయిన తర్వాత, చుట్టపు చూపుసాకుతో విజయనగరం వచ్చిన ఆ వెలయాలి అప్ప కూతురిపై దాసుగారు మోజుపడ్డారు.<noinclude><references/> {{c|62}}</noinclude> 66fm8bopr64yzae9bwl82nfxryqp4ak పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/78 104 213527 557533 557242 2026-05-30T09:55:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అయితే ఆమె పినతల్లి ఆయనపై ఆశపెట్టుకుంటుంది. ఈయన కోర్కెపై - <poem> {{left margin|5em}} “పాప మప్పకూతురును వాని బడుకటింట విడిచి పుస్తకమును వ్యాసపీఠము గొను చేగి లోనికి పిన్నమ్మ చిన్నబోయి పుణ్య మొకరిది పురుషార్ధ మొకరిదయ్యె " పడకటింట్లో. </poem> పిన్నమ్మది పుణ్యం, దాని అప్పకూతురిది, దాసుగారు చెప్పిన జట్టు దారులలో ఒకడు పోతురాజు వెలయాలి కొర్కెపై ఇతడు నారాయణ దాసుగారిచే భాస్కర రామాయణం చెప్పించాడు. ఆ పుణ్యం పోతురాజుది. పురుషార్ధం దాసుగారిది. కాబట్టి ఈ సన్నివేశానికి "పుణ్యము- పురుషార్ధం" అని నామకరణం చేశారు. ఇందులో ప్రారంభంలో నాయక వర్ణనలో - <poem> {{left margin|5em}} "విజయనగర గగనమ్మున విరిసిన మరివిల్లు యిది? శశాంకశేఖర శంకర జటావిటంకమువిడి జగతికి దిగజారిన జాబిల్లాయిది?" </poem> అంటూ సంగీత సత్కళాశారదా దేవి దేవళంబై భూమి తేజరిల్లు నాడు" అని నారాయణ దాసుగారిని ప్రవేశపెడతారు జోగారావుగారు. కోరమీసాలు దువ్వెడి కోడెవయసులో దాసుగారు “కోవెల వీధి కొంపలందానక దూరి కంచిగరుడాళ్వారు సేవలు జేసె" అని అన్నారు. పైసా ఇవ్వకుండా సాని సరసానికి జోగారావుగారి చమత్కారం ఇది. విజయనగరంలో సాని వీధికి (టెంపుల్ స్ట్రీట్) "కోవెల వీధి” అని పేరు. దీనికి అద్భుతమై శ్లేషతో నాటి దాసుగారి మన్మథావస్థను చక్కగా యస్వీగారు వర్ణించారు. <poem> {{left margin|5em}} "కోవెలవీధి కొమ్మకొన గోయిల కూసెన యేని వాని స ద్భావములో వసంతములు వైళమ సాగునుగాని కోవెలన్ దేవుని జూడ నెప్పుడును దీరదు దానికి, కాని డెందపుం కోవెలలోని దేవుడదిగో నడివీధిని దర్శనం బిడున్" </poem> కోవెల వీధి కొమ్మపై సాగిన ఈ భావం ఎంతో సరసమధురంగా వుంది.<noinclude><references/> {{c|63}}</noinclude> 9oaf280nwnxp32cg4m0u14b8qdl2o62 557535 557533 2026-05-30T09:55:51Z శ్రీరామమూర్తి 1517 557535 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అయితే ఆమె పినతల్లి ఆయనపై ఆశపెట్టుకుంటుంది. ఈయన కోర్కెపై - <poem> {{left margin|5em}} “పాప మప్పకూతురును వాని బడుకటింట విడిచి పుస్తకమును వ్యాసపీఠము గొను చేగి లోనికి పిన్నమ్మ చిన్నబోయి పుణ్య మొకరిది పురుషార్ధ మొకరిదయ్యె " పడకటింట్లో. </poem> పిన్నమ్మది పుణ్యం, దాని అప్పకూతురిది, దాసుగారు చెప్పిన జట్టు దారులలో ఒకడు పోతురాజు వెలయాలి కొర్కెపై ఇతడు నారాయణ దాసుగారిచే భాస్కర రామాయణం చెప్పించాడు. ఆ పుణ్యం పోతురాజుది. పురుషార్ధం దాసుగారిది. కాబట్టి ఈ సన్నివేశానికి "పుణ్యము- పురుషార్ధం" అని నామకరణం చేశారు. ఇందులో ప్రారంభంలో నాయక వర్ణనలో - <poem> {{left margin|5em}} "విజయనగర గగనమ్మున విరిసిన మరివిల్లు యిది? శశాంకశేఖర శంకర జటావిటంకమువిడి జగతికి దిగజారిన జాబిల్లాయిది?" </poem> అంటూ సంగీత సత్కళాశారదా దేవి దేవళంబై భూమి తేజరిల్లు నాడు" అని నారాయణ దాసుగారిని ప్రవేశపెడతారు జోగారావుగారు. కోరమీసాలు దువ్వెడి కోడెవయసులో దాసుగారు “కోవెల వీధి కొంపలందానక దూరి కంచిగరుడాళ్వారు సేవలు జేసె" అని అన్నారు. పైసా ఇవ్వకుండా సాని సరసానికి జోగారావుగారి చమత్కారం ఇది. విజయనగరంలో సాని వీధికి (టెంపుల్ స్ట్రీట్) "కోవెల వీధి” అని పేరు. దీనికి అద్భుతమై శ్లేషతో నాటి దాసుగారి మన్మథావస్థను చక్కగా యస్వీగారు వర్ణించారు. <poem> {{left margin|5em}} "కోవెలవీధి కొమ్మకొన గోయిల కూసెన యేని వాని స ద్భావములో వసంతములు వైళమ సాగునుగాని కోవెలన్ దేవుని జూడ నెప్పుడును దీరదు దానికి, కాని డెందపుం కోవెలలోని దేవుడదిగో నడివీధిని దర్శనం బిడున్" </poem> కోవెల వీధి కొమ్మపై సాగిన ఈ భావం ఎంతో సరసమధురంగా వుంది.<noinclude><references/> {{c|63}}</noinclude> suwjfbftvizdq665usya06zr4pu1gw9 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/79 104 213528 557539 557243 2026-05-30T10:07:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557539 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>దాసుగారి పేరుచెప్పని ఆ జట్టు దారుని పాత్రను జోగారావుగారు పోతురాజు అని పేరు పెట్టారు. ఆ పాత్ర ప్రవృత్తికి తగివుంది. నెల పర్యంతమూ సాగిన పురాణ పాఠనంలో - <poem> {{left margin|5em}} "నేన దశరథుండనేని యీకైకకు కోరిన వరములు కూర్చి వగవ నేన రాముడనేని యీ జనకజ గామువిల్లు వంచిన గాన పెండ్లి యాడ ఏనమేనకనేని యీ కౌశిక మహర్షి తపమును మెచ్చి ప్రత్యక్షమగుదు ఏన రుమారామనేని యీ వాలితో బుద్ధి పూర్తిగ లేచిపోయి యుందు". </poem> అని వారు అనుకోవడం వల్ల ఉభయుల సరస ప్రసంగానికి నిలువుటద్దం. ఇక్కడ కల్పనా శిల్పంతో పాటు పాత్రల వ్యక్తిత్వం కూడా కన్పిస్తుంది. శ్రీకాకుళం నుండి ఆమె అప్పకూతురు మధ్యలో "మధ్యాక్కర” లో వస్తుంది ఇక్కడ ఛందస్సు సన్నివేశ బద్ధమైంది. మధ్యలో వచ్చిన యువతిపై ఈయన మోజుపడ్డాడు. ఆమె పిన్నమ్మకు ఈయనపై వాంఛ పదిరూపాయలు, పంచలచాపు, చీర, పురాణ పఠనానికి కట్నంగా ఇవ్వగా, మూలంలో ఆయన ఆచీర ఎవరికిచ్చినారో తానే చెప్పుకున్నాడు. ఈ సన్నివేశాన్ని జోగారావుగారు కూడా రమణీయంగా వర్ణించారు. రావుగారి సంభాషణా కౌశలాన్ని మనం చూడవచ్చు. <poem> {{left margin|5em}} "ఇవియేల నాకు? మరెయ్యని వలతువు? ఏను వటువను, చీరేల నాకు? ఆ గుంటకియ్యది బాగుండు నిమ్ము, ప్ర త్యామ్నాయ యేమీయ మందువయ్య? చీరగట్టుకయున్న చెలియపసదనమ్ము నేగట్టు కొన్నచోనేమి సేతు? విప్పుడు చెప్పలే నప్పిన్నదైనచో వెసనొక్కజావళీ విసరిచూతు మొదటనామీద విసరుము పిదప జూచు కొంద మా బేరమిటుమార్చు కొందమనుచు వారలను కొను నంతలో వచ్చె క్రొత్త చీర చిన్నారి మారుని చిక్కటారి" </poem><noinclude><references/> {{c|64}}</noinclude> btk5kiz7bh6zpwdbwzxoz2qelysroyb పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/80 104 213529 557540 557244 2026-05-30T10:19:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557540 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సాని పిన్నమ్మ కోరిన బేరాన్ని దాసుగారు మార్చుటలో తల్లీ కూతుళ్ల వరుస తప్పి, అత్తా కోడళ్ళ వరుసవచ్చింది. ఈ కల్పన చమత్కారంగా వుంది. “పోకిరీ తనము మానవైతివేల" అని ఒక కంట కోపమును, ఒక కంట సంతోషమును అభినయించిన ఆమె సొగసును ఎలా వర్ణింపగలనని దాసుగారు అన్నారు. ఆ ఉత్తి పొడిమాటలకు జోగారావుగారు జీవంపోసి అద్భుతంగా ఆసొగసును వర్ణించారు. <poem> {{left margin|5em}} “ఈషత్తో షితరోషపోషితదర హ్రీధామ చామాకటా క్షోషశ్శోభల తోడ దాసరసరాజోత్ఫుల్ల ముల్లంబునన్ శేషా శేషఫణా మణీఘృణుల నాశ్లేషంచు వైకుంఠశై వాషీరీతిగ నాతిడెందము తదాలోకమ్ములంగ్రాలెడిన్ </poem> ఈ ఖండికలో ఈ పద్యం నడక తీరు వేరు. రసస్ఫూర్తి, అర్ధ సంపత్తిగల అపురూపమైన శబ్దావృత్తితో చాలా చక్కగా సాగింది. ఇలా అన్ని ఖండికలను సన్నివేశానికి అనుగుణంగా రాశారు. <poem> {{left margin|5em}} "భగవద్భంగి” అనే శీర్షికలో రూపవతి అనే వేశ్యను గూర్చి "రూపవతి పేరు సేయును జ్ఞాపకమును నేతి బీరకాయను "భార్యా రూపవతీ శత్రు" వనుట యాపెకు వర్తింప దెవరి యాలైనసరే" </poem> అని వుంది. ఇక్కడ నాయిక పేరు రూపవతి. పేరు మాత్రమే రూపవతి. అంటే నేతి బీరకాయలాగ. నేతి బీరకాయలో నేయి లేనట్లే రూపవతిలో కూడా ప్రశస్త రూపం లేదని భావన. “జ్ఞాపకంచేయును” అనడంవల్ల ఇక్కడ స్మరణాలంకారం చక్కగా కుదిరిందని వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు అన్నారు. ఈ పద్యంలో మరో చమత్కారం వుందని శాస్త్రి గారు విపులీకరించారు. “ఆ రూపవతి వేశ్య. దానికి పెండ్లి యనునదిలేదు. కాన ఈమె ఒకనికి ఆలగుటయు కుదరదు. మిథ్యయైన రూపవతీత్వము పురస్కరించుకొని మధ్యయగు భర్తదానికి తటస్థించినయెడల భార్యారూపవతీ శత్రువనెడి దోషము ఆమెకు వర్తింపదు అని చమత్కరింపబడినది. అనగా ఆమెకు వివాహము మిథ్యయే. భార్యా భర్తృ సంబంధము<noinclude><references/> {{c|65}}</noinclude> 4lgspcdxm1j7yheb5qt2d799bgrw5io పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/81 104 213530 557542 557245 2026-05-30T10:32:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557542 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>మిథ్యయే. ఈ రెండు మిథ్యల చేతను ఆమె రూపవతీత్వమందలి మిథ్యాత్వము స్థిరపరుపబడినదికావున "మిథ్యాధ్యవవి" త్యలంకారము" (అల్పతరమైనయట్టి మిధ్యాత్వ సిద్ధి కన్య మిథ్యాత్వ కల్పనంబయ్యెనేని యగును మిథ్యాధ్యవస్థితి" ఆంధ్ర చంద్రాలోకం పుట. 135) <poem> {{left margin|5em}} “మరోచన" శీర్షికలో ఐదవ ద్విపదలో - "ఆ దేవుడెంతెంత యరివీరునైన చచ్చి సాధించిన సత్యలిక్రముడు అతని కిల్లరికపు టల్లుండ్రువిటులు నిత్య సువాసినీ సత్య ప్రతిష్ఠ వెలయు గణికలు తద్విజయధ్వజములు" </poem> అని ధ్వని వచ్చే విధంగా జోగారావుగారు ఉత్తమ కవితను రాశారు. - "ఆ దేవుడెంతెంత యరివీరుడైన, చచ్చిసాధించిన సత్య లిక్రము" అనే దానిలో ఆదేవుడు అని అన్నాడు. ఆ దేవుడి పేరు చెప్పలేదు. తర్వాత మనకున్న విశేషణాలవల్ల తెలుస్తుంది. ఆ దేవుడు మన్మథుడని. ఇలా ధ్వని వచ్చేవిధంగా కవిత్వం రాశారు రావుగారు. అతడు "ఎంతటి అరివీరునైన”. అంటే ఇంద్రాదులకు కూడా అసాధ్యుడై తపస్సు చేశాడు. చచ్చి సాధించాడు. ఈశ్వరుని మూడో కంటి మంటలో కాలిపోయి బూడిదయ్యాడు. తాను చచ్చిన తర్వాత కూడా సాధించుకున్నాడు. ఎలా అంటే మరల ఈశ్వరుని దయచేతనే బ్రతికాడు. ఇంద్రసభలో తానుచేసిన ప్రతిష్ట ప్రకారం బ్రతికాడు. పార్వతికి తన అర్ధ దేహాన్ని ఇచ్చిన భర్త సత్యవిక్రమయుడు అని రావుగారు అన్నారు. ఇలా రాయడానికి కవికి ఎంతో ప్రతిభ కావాలని వెంపరాల వారు అన్నారు. ఈ కావ్యంలో రావుగారు క్రొత్త ప్రయోగాలు చేశారు. “ప్రరోచన"లో ఎనిమిదవ పుటలో వలరాచ శాస్త్రంపు వ్యాఖ్యాత్రులగుచు అనీ, “రంకుల రాట్నం" లో నలభై మూడో పద్యంలో అపరిచితాభ్యాగ తాహ్వాత్రులగు అనీ, ప్రయోగాలు వాడారు. మొదటిది వి+ ఆ+ఖ్యూ ధాతువుపై తృచ్‌చేయగా “వ్యాఖ్యాతృ” అని బుకారాంత ప్రాతి పదికపై స్త్రీ త్వవివక్షలో "బున్నే భ్యోజీవ్" అని పాణినీయంలో “జీప్" పత్యయం చేరి "వ్యాఖ్యాత్రీ" అనే రూపసిద్ధి పొందింది. రెండోది "ఆబ్" పూర్వక "హ్వే" ధాతువుపై “తృచో” ప్రత్యయం రాగా "హ్వే" అనేది “హ్వా”గా మారి “ఆ హ్వాతృ” అని ప్రకృతియై స్త్రీత్వ వివక్షలో "ఆహ్వాత్రీ" అనే రూపంపై దానివలెనే పొందింది.<noinclude><references/> {{c|66}}</noinclude> lngbzkxzxzylpk6rcxj1o2n70i8l5nu పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/82 104 213531 557543 557246 2026-05-30T10:45:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557543 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఇలాంటి ప్రయోగాల్ని జోగారావుగారు వాడి వ్యాకరణంలో తన పాండిత్యాన్ని వెల్లడించారని వెంపరాల వారు అన్నారు. <poem> {{left margin|5em}} "ప్రేమతో మీరంపిన “శృంగారసర్వజ్ఞము” కృతి చేకొని అంత రంగమున ఒత్తుకొన్నాడను. మొదట ఒకతూరి కబ్బము పాడుకొనుచు బోయితిని. పదపడి పట్టి చదువుకొంటిని. మీకృతి సంతతి బహిరంతారమణీయకృతిమతి అశ్వాన స్వరసప్తము రసానందాబివ్యంజకము. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహిత్య విద్యార్ధిగానున్న శైశవమున నేను కౌపీనధారియై వీణాపాణియైన నారాయణదాసుగారిని దర్శించుకొంటిని. ఇదితొలి చూపు. ఆనాటి యవక్వణము నపక్వమైన మీ చందశ్శైలిలో అనురణితమై నాస్వాంతతంత్రులను పులకింపచేయుచున్నది. మీపద్యశైలి మీది. దానికి పెఱపోలిక చెప్పుట పాడి కాదు. వయస్తః అనుకొన వచ్చు, తత్త్వమే రావచ్చు, నాళం మీ శృంగారరసోల్లసితవాక్కళకు శాంతపర్యవసాయిత్వము స్ఫురించుచుండును". {{right|'''- మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి'''}} </poem> '''6. శృంగార భృంగారువు :''' <poem> {{left margin|5em}} "పద్యమెట్లు విరిచిరాసిన ప్రాణము పోసికొనునో భావము సముజ్జ్వలితమగునో రసము అభివ్యక్తమగునో ఆ రహహ్యములు జోగారాయ కవి యెఱిగినట్లు చాలమంది యెఱుగరు. పద సంఘటనములోని అందచందము లట్టివి. అతనికి సహజములు, నిరంతర సాహితీ జగదవలోకముచేత తళతళ లాడుచున్నవి. సంస్కృతాంధ్రములలో ఈ కవివాడని శబ్దము లేదనవచ్చును. భగవంతు డీ కవిని శృంగార సామ్రాజ్య పట్టభద్రుని కావించి పుట్టించెనో కావింపనున్నాడో అని ముప్పది యేండ్ల నా పరిచయముతో నా కనిపించును". {{right|'''- కోగంటి సీతారామాచార్యులు'''}} </poem><noinclude><references/> {{c|67}}</noinclude> bfk7xz9bz917ffpbah8c8qwamjvu4ay సూచిక:రాగతాళచింతామణి.pdf 106 213665 557536 2026-05-30T09:57:36Z Ashwith nagendra 7340 [[WP:AES|←]]Created page with '' 557536 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=రాగతాళచింతామణి |భాష=te |సంపుటి= |రచయిత=టి. వి. సుబ్బారావు |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ |చిరునామా=చెన్నై |సంవత్సరం=1952 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 0dhxk7ta3vbcdsugoxs65dokmi2j0c4 557541 557536 2026-05-30T10:29:14Z Ashwith nagendra 7340 557541 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=రాగతాళచింతామణి |భాష=te |సంపుటి= |రచయిత=టి. వి. సుబ్బారావు |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ |చిరునామా=చెన్నై |సంవత్సరం=1952 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="-" 3="-" 4="పైఅలో" 5="-" 2="పైఅట్ట" 6to13="పరిచ" 14to16="తొలిప" 17="విసూ" 32="శీర్షిక" 18to31="పసూ" 33="2" 255="-" 266="వెఅలో" 256to263="ప్రకట" 264to265="చివపే" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 0su6ik5nodvrkfzzxpqpw33f7hsr4zm 557544 557541 2026-05-30T10:53:27Z Ashwith nagendra 7340 557544 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=రాగతాళచింతామణి |భాష=te |సంపుటి= |రచయిత=టి. వి. సుబ్బారావు |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ |చిరునామా=చెన్నై |సంవత్సరం=1952 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=2 |పురోగతి=X |పుటలు=<pagelist 1="-" 3="-" 4="పైఅలో" 5="-" 2="పైఅట్ట" 6to13="పరిచ" 14to16="తొలిప" 17="విసూ" 32="శీర్షిక" 18to31="పసూ" 33="2" 255="-" 266="వెఅలో" 256to263="ప్రకట" 264to265="చివపే" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} lb4mw0gwc9ja2hik70140vs3qyef09r 557545 557544 2026-05-30T10:58:57Z Ashwith nagendra 7340 557545 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=రాగతాళచింతామణి |భాష=te |సంపుటి= |రచయిత=టి. వి. సుబ్బారావు |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ |చిరునామా=చెన్నై |సంవత్సరం=1952 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=2 |పురోగతి=C |పుటలు=<pagelist 1="-" 3="-" 4="పైఅలో" 5="-" 2="పైఅట్ట" 6to13="పరిచ" 14to16="తొలిప" 17="విసూ" 32="శీర్షిక" 18to31="పసూ" 33="2" 255="-" 266="వెఅలో" 256to263="ప్రకట" 264to265="చివపే" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} ibagpet3fzxk8rzx9iuv8jyy078crw6 557546 557545 2026-05-30T10:59:53Z Ashwith nagendra 7340 557546 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=రాగతాళచింతామణి |భాష=te |సంపుటి= |రచయిత=టి. వి. సుబ్బారావు |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ |చిరునామా=చెన్నై |సంవత్సరం=1952 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=2 |పురోగతి=MS |పుటలు=<pagelist 1="-" 3="-" 4="పైఅలో" 5="-" 2="పైఅట్ట" 6to13="పరిచ" 14to16="తొలిప" 17="విసూ" 32="శీర్షిక" 18to31="పసూ" 33="2" 255="-" 266="వెఅలో" 256to263="ప్రకట" 264to265="చివపే" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} sub2jyvh712fhpuii16hu5jjkt2isf4 557547 557546 2026-05-30T11:01:31Z Ashwith nagendra 7340 557547 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=రాగతాళచింతామణి |భాష=te |సంపుటి= |రచయిత=టి. వి. సుబ్బారావు |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ప్రభుత్వ ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్స్ లైబ్రరీ |చిరునామా=చెన్నై |సంవత్సరం=1952 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=2 |పురోగతి=X |పుటలు=<pagelist 1="-" 3="-" 4="పైఅలో" 5="-" 2="పైఅట్ట" 6to13="పరిచ" 14to16="తొలిప" 17="విసూ" 32="శీర్షిక" 18to31="పసూ" 33="2" 255="-" 266="వెఅలో" 256to263="ప్రకట" 264to265="చివపే" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} lb4mw0gwc9ja2hik70140vs3qyef09r