వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.16
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/685
104
154741
571170
448553
2026-08-23T13:55:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
571170
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కాటయ వేమా రెడ్డి||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
యుండునని కొంద రూహించినారు. కాని యా యభిప్రాయము సరికాదని విమర్శకులు నుడివినారు. కాటయ వేమారెడ్డి పెద్ద కుమారుడగు కాటయకు విజయనగర ప్రభువగు హరిహరరాయలు తన పుత్రిక నిచ్చి యుద్వాహము చేసెను. ఈ వియ్యము రాజకీయ ప్రాముఖ్యము గలదియై కొండవీటి రాజ్యములో కాటయ వేమునికి గల విశిష్ట స్థానమును సూచించుచున్నది. కొందరు చరిత్రకారులు కాటయవేమునకు కాటయయను పుత్రుడున్నట్లు విశ్వసించక కాటయవేమునకే హరిహరరాయలు తన దుహిత నిచ్చి పెండ్లిచేసెనని వ్రాసినారు. కాని యది యసంగతమనియు, కాటయ వేమునకు కాటయ యను
పుత్రుడుండెనని గోదావరి మండలములోని సర్పవరము నందు లభించిన యొక శాసనము వలన (దక్షిణ హిందూ దేశ శాసన సంపుటము 5. సంఖ్య 2.) స్పష్టపడుచున్న దనియు ఆంధ్రకవి తరంగిణి కర్త నిర్ధరించెను. కాటయ వేముని కొడుకైన కాటయకు హరిహరాంబయను నొక పుత్రిక యుండెననియు, ఆమె అల్లాడ రెడ్డి పెద్దకుమారుడైన వేమా రెడ్డి భార్యయనియు తెలియుచున్నది. కాటయ వేముడు తన బిడ్డయైన అనితల్లిని రెడ్డిరాజ బంధువర్గములో ప్రముఖమైన దువ్వూరి రెడ్డిశాఖకు చెందిన దేసటి అల్లాడ
రెడ్డి కుమారులలో రెండవవాడైన వీరభద్రారెడ్డి కిచ్చి, పాణిగ్రహణము గావించెను. ఈతడే కాటయవేముని
పిమ్మట రాజమహేంద్రవర రాజ్యమునకు ప్రభువై శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండమును కృతిగా గొన్న సుకృతి. కాటయ వేముని ద్వితీయ పుత్రుడైన కొమరగిరి వివాహితుడైన కొలది కాలమునకే దివంగతుడై నందున కాటయవేముని రాజ్యము అతని కూతురైన అనితల్లికి చెంది తన్మూలమున వీరభద్రా రెడ్డికి సంక్రమించెను.
{{Css image crop
|Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
|Page = 685
|bSize = 600
|cWidth = 271
|cHeight = 158
|oTop = 585
|oLeft = 38
|Location = center
|Description =
}}
{{Css image crop
|Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
|Page = 685
|bSize = 600
|cWidth = 273
|cHeight = 225
|oTop = 63
|oLeft = 301
|Location = center
|Description =
}}
'''కొమరగిరిరెడ్డి రాజ్యములో కాటయవేముడు :''' కొండవీటి నేలిన రెడ్డిరాజులలో అసపోతా రెడ్డి రెండవవాడు. ఈతడు తన తండ్రియైన ప్రోలయ వేముని వలెనే మహాశూరుడు. అనేక యుద్ధములు చేసి రాజ్యమును విస్తరింప జేసెను. ఈతడే అద్దంకి నుండి కొండవీటికి రాజధానిని మార్చినవాడు. అనపోతా రెడ్డి క్రీ.శ.1353 నుండి 1364 వరకును రాజ్యమేలెను. ఈతని యల్లుడే కాటయవేముడు. ఈ
అనపోతా రెడ్డి కుమారుడైన కొమరగిరి రెడ్డి తండ్రి చనిపోవు నప్పటికి చిరుతప్రొయమువాడు. ఆనాటికి రెడ్డి రాజ్యము స్థిరపడుచు నుండెను. గట్టిగా వేరూన లేదు. ఒక వైపు విజయనగరరాజులు, వేరొకవంక రాచకొండ వెలమరాజులు కొంతకొంతగా ఆక్రమించుచుండిరి. అట్టి స్థితిలో బాలుడైన కొమరగిరిని రాజుగా చేయుట ప్రమాదకరమని మంత్రులును, దండనాథులును తలచిరి. కావున అనపోతా రెడ్డి తమ్ముడును, మహావీరుడు నగు అన వేమారెడ్డిని రాజుగా నెన్ను కొనిరి. కొమరగిరి యువరాజుగనే యుండెను. ఈ వ్యవస్థ అనపోతారెడ్డి బావయైన కాటయ రెడ్డికిని, అతని కుమారుడును కొమరగిరికి బావయునైన కాటయ వేమునకును అంత యిష్టమైనది కాకపోయెను. కానీ అప్పటి ప్రమాదపరిస్థితులను బట్టి దూరదృష్టితో వారా పద్ధతికి తను యంగీకారమును చూపుటయే గాక, అన వేమునకు చేదోడై రెడ్డి రాజ్య విస్తృతి స్థైర్యములకు కారకులైరి. అన వేముడు క్రీ. శ. 1364 నుండి 1386 వరకును రెడ్డిరాజ్యమును ప్రశంసనీయముగా పరిపాలించెను.<noinclude><references/></noinclude>
c1xha8livhh907xl1hef31uu3pae3jj
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/686
104
154742
571173
448554
2026-08-23T14:13:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
571173
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కాటయ వేమారెడ్డి}}</noinclude>
అనవేమారెడ్డి యనంతరము కొమరగిరి రెడ్డి క్రీ.శ. 1386 ప్రాంతమున కొండవీటి రాజ్యమునకు రాజాయెను. తాను రాజుకాగనే కొమరగిరి రెడ్డి తనకు పట్టుగొమ్మయు తన సోదరీభర్తయు, మహాశూరుడు నగు కాటయవేముని ప్రధాన మంత్రిగా నియమించెను. కాటయ వేముడు ప్రధాన మంత్రిపదవికి సర్వధా అర్హుడు, అమాత్య శేఖరున కుండవలసిన సర్వ లక్షణములు నాతనికి గలవు. అతడు కాకలు దీఱిన కదనవీరుడు. రాజనీతిలో అందెవేసిన చేయి. వివేకము గలవాడు, మహా పండితుడు. ఆర్య ధర్మరక్షణైక
దీక్షితుడు. ప్రభుభక్తి పరాయణుడు. తరతరములుగా రాజవంశముతో ననుబద్ధమైనదాతనివంశము. అన్నిటికిని పైన ఆతడు కొమరగిరిని ప్రాణాధికముగా ప్రేమించువాడు. తన శ్యాలకునిపై కాటయవేము నకు గల ప్రేమ యెంత గాఢమైనదనగా ఆతడు తన కుమారునకు కొమరగిరి పేరు పెట్టుకొని ఆనందించినాడు. ఆతని పేర నెన్ని యో గ్రామములను దానము చేసినాడు. కొమరగిరి ప్రభువునకును
తన బావపై అట్టి ప్రేమవిశ్వాసములుండుట సహజము. కావుననే కాటయవేముని తన రాజ్యమునకు ప్రధానమంత్రిగాను, సర్వసేనాధ్యక్షునిగాను చేసి అతడు గౌరవించినాడు.
నిజమునకు కొమరగిరికి రాజ్యప్రాప్తికూడ కాటయవేముని మూలముననే కల్గినది. శ్రీకృష్ణుడు ధర్మరాజును
కౌరవ సింహాసనాధిష్ఠితుని గావించినట్లు కాటయవేమ శూరుడు కొమరగిరిని రెడ్డి రాజ్యశ్రీకి పట్టభద్రుని గావించెనని శాసనమున ప్రశంసింపబడినాడు. ఈ శాసన వాక్యము కేవల ప్రశంసాపరము కాదు. కొమరగిరి రాజౌట అంత సుకరముగా జరిగిన పనికాదని ఇది సూచించుచున్నది.దాయాదులవలన ఎన్నియో యడ్డంకులు వచ్చినట్లును, వాని నెల్ల సమర్థుడగు కాటయవేమ శౌరి తన బాహు, ధీపాటనములతో తొలగించి కొమరగిరిని రెడ్డి రాచగద్దెపై నిల్పినట్లును చరిత్రకారులూహించుచున్నారు. కొనురగిరికి గాక తనకే రెడ్డి రాజ్యాధిపత్యము సంక్రమింపవలసి యున్నదని యెదురుతిరిగినవాడు కోమటి వేమారెడ్డి.
ఈతడు రెడ్డి రాజ్యస్థాపకుడైన ప్రోలయ వేమా రెడ్డి అన్నయగు మాచారెడ్డి మనుమడు, మహా విద్వాంసుడు; శూరుడు. ఈతని తాతతండ్రులు చందవోలు ముఖ్య పట్టణముగా కొంత ప్రదేశమునకు రాజప్రతినిధులై కొండ వీటి రాజ్యమునకు పెట్టనికోటలై యుండిరి. అన వేమ భూపాలునకు సంతతి లేనందున అతని పిమ్మట రాజ్యాధికారము, రాజవంశములో పెద్దకుమారుడైన మాచా రెడ్డి మనుమడగు తనకే సంక్రమించుట న్యాయమని కోమటి వేమా రెడ్డి వాదులాడదొడగెను. తాను ప్రభువునకు పౌరసు
డగుటచే తనదేరాజ్యమని కొమరగిరి పట్టు. ఈతగవులాటలో కొందరు దండనాథులు కోమటివేముని పక్షమున నిల్చిరి. కాటయవేమారులు కొమరగిరికి ప్రాపై యుండిరి.
రెడ్డి రాజ్యసింహాసనము కొరకై బయలుదేరిన యీ దాయాదులు కలహములు పెరుగుటకు ముఖ్యహేతువు
కొమరగిరి కాటయవేముని ప్రధానమంత్రిగా నియమించుటయై యున్నది. మొదటినుండియు 'రెడ్డి రాజులకు బ్రాహ్మణులే ప్రధానమంత్రులై యుండిరి. ప్రోలయ వేమారెడ్డిక్ రామాప్రెగ్గడ, మల్ల నాథులను వారు మంత్రులుగా నుండిరి. అనపోతరాజునకు సోమయ ప్రెగ్గడ మంత్రి. అనవేమ మహీపాలునకు ఇమ్మడిమంత్రి ప్రధానిగాను, పెద్దనమంత్రి దండనాథుడుగాను ఉండిరి. ఇట్టి పూర్వాచారమునకు విరుద్ధముగా కొమరగిరి కాటయ వేముని ప్రధానిగావించుట బ్రాహ్మణమంత్రులకు కోపకారణమై వారు కోమటి వేముని పక్షము వహించుటకు దారితీసి యుండును. మొత్తముమీద రాజ్యములో పలుకుబడిగల
వర్గము రెండు పక్షములుగా చీలి యొక పక్షమువారు పెదకోమటిని, మరియొక పథమువారు కొమరగిరివి
బలపరచుస్థితి యేర్పడెను. ఇట్టి విషమపరిస్థితులలో కాటయ వేమసింహుడు ధీరుడై కొనురగిరి పక్షమున నిల్చినందుననే యా యావదను గడచి యాతడు రెడ్డి రాజ్యసింహాసనము నెక్కగల్గెను. అప్పటికి కోమటి వేమునకు కాటయవేము సంతటి ప్రజ్ఞాశాలితో ఢీకొనజాలినంత అంగబలము గాని, అర్థబలము గాని లేనందున అతడప్పటికీ కాటయ వేమ పక్షమువారు తనకొసగిన పరిమిత స్వాతంత్య్రము నంగీకరించి చందవోలు ప్రభువుగా నుండజొచ్చెను. కాని యాతని డెందమునమాత్రము పగ నివురుగప్పిన నిప్పై
యుండెను. కాటయవేముని పలుకుబడి హెచ్చి యాతడు మహామంత్రియై ప్రాభవము గనుట కోమటి వేమునకు కంటిలో నలుసైయుండెను.<noinclude><references/></noinclude>
4rjibgemdx8qqjuf607ypfphx8uwvkr
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/178
104
216580
571164
565510
2026-08-23T12:25:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571164
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>మానవతి విమలాంగి మానభంగము జేసి । జీవ మెడలించితివి స్త్రీహత్య గోరి॥
శాపంబు గావించి తాపసేంద్రుడు నీకు । స్త్రీచేత మరణంబు చెందియుండుటకు॥
ఆశాప మపుడు నీ కనుకూలమై యుండె । తాపసిశాపంబు తప్పించరాదు॥
తాపసిశాపంబు తప్పిపోకుండంగ । సీతామహాదేవిచేత గూలెదవు॥
అదిగాక నీవు మది నధికబలశాలినని । విర్రవీగుచునుందు వెల్ల శౌర్యమున॥
బలశాలితనమెల్ల దెలియంగనీరాద । దానిచే గూలితే దాఖలాపడును॥
రాక్షసా నాకు శౌర్యం బేల తెలిపేవు । నీతోటి పోరాడ నియతి గా దికను॥
జానకీదేవితో చెలరేగి యుద్ధంబు । సలిపి నీప్రఖ్యాతి బల మెల్ల జూపు॥
గెలువు జానకిదేవి గెలువలేకుంటివా । శరణు గైకొను నిన్ను శరణు జూచెదను॥
అట్లు నీకు సహింప కాత్మలో నుండినను । భామశరమున గూలి ప్రాణము ల్విడుము॥
నెలతవిలుబాణములు నే నందు టిక లేదు । అసుర నీతోడ పోరాడేది లేదు॥
జానకితో పోరజాలలే కీరీతి । నేల నాకును శౌర్య మెన్నజొచ్చెదవు॥
మాయవాదివి నీదుమార్గ మే నెరుగుదును । చాలు నీమాటలకు సంతసం బయ్యె॥
బలుపాతకుడ నీతొ భాషించ పాపంబు । కనరాదు నీమొగము దనుజాధముండ॥
అని రాఘవేశ్వరుం డసురుతోడుత బలికి । సరస వెలుగుచునున్న జానకిని జూచి॥
రమణి జాలం బేల రాక్షసుని బరిమార్చు । మఖిలలోకంబులకు నానంద మొదవు॥
కడుదురాత్ము దృంప తడవు సేయగరాదు । అమృతంబు విష మౌను ఆలస్యమైన॥
అని ప్రాణనాయకుడు తనతోడ దెలుపంగ । పాదారవిందముల బడి మ్రొక్కి లేచి॥
శ్రీరాముశల వంది సీతామహాదేవి । ఖ్యాతి మీరగ విల్లు చేత ధరియించి॥</poem>
{{p|ac|fwb}}సీత శతముఖుని యేకముఖునిగ జేయుట</p>
<poem>కోటిసూర్యలభంగి కొమ్మ తా వెలుగుచును । పొదిలో బ్రహ్మాస్త్రంబు పొందుగా దీసి॥
పొదిలో బ్రహ్మాస్త్రంబు పొందుగా చేబట్టి । అభిమంత్ర మొనరించి అతివ యిట్లనియె॥
జగతిలో శ్రీరాము సత్యవాక్యాధురం । ధరు డన్నమాటలును తథ్యమైతేను॥
వసుధలో నే పతివ్రతధర్మమహిమచే । నెగడుచుండినమాట నిశ్చయంబైతె॥</poem><noinclude><references/></noinclude>
q04ehtv4oy2gpjzcw045wdq8jixx1jl
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/179
104
216581
571178
565511
2026-08-23T21:31:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571178
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తలయొకటి రెండుచేతులు దక్క దనుజునకు । కొదువ శతశిరములును గూలుగా కనుచు॥
దివ్యశరముకు జెప్పి ధీరతలు దీపింప । భామయును వడి వేసె బ్రహ్మాస్త్ర మపుడు॥
ప్రళయకాలాగ్నియో భైరవయుగ్మమో । ముజ్జగంబుల మ్రింగు మృత్యువో యనగ॥
భూనభోంతరములను బొదవుచు మండుచును । సురవైరి వెర గంద శర మేగుదెంచె॥
తిరిగె భూచక్రంబు ఒరిగె కులశైలములు । కడుతారకలు డుల్లె గగనంబు వణకె॥
సూర్యుండు గతి దప్పె శోకించె రాక్షసులు । చిట్టచీకటి గ్రమ్మె దిట్టముగ నపుడు॥
చిచ్చు లొలుకుచు నేగి శరము శతకంధరుని । బాహువులు శరములును బడగూలనేసె॥
తలయొకటి రెండుచేతులు దక్కగా జేసి । కొదువకరశిరములును గూల్చె బాణంబు॥
దనుజు కరశిరములును తక్షణంబును గూల్చి । శరము తూణీరంబు జేరె వేగమున॥
అష్టదిక్పాలకులు అమరాదిదేవతులు । వినువీథి జయజయధ్వనులు జేసిరిగ॥
తలయొక్కటియు నిలచి దనుజనాథుం డపుడు । చావు నిజ మని యెంచె సాహసంబునను॥
తల యూచి శ్రీరాముతరుణిపై కోపంబు । బెనగొనుచు రాక్షసుడు ఘనశరము లందె॥
ఘనశరంబులు బూని వనితసీతాసతిని । గని కోపమున బలికె ఘనుడు శతముఖుడు॥
నీవిభుడునా కంట నిర్వహింపగ లేక । విల్లుబాణము లిచ్చె వెలదిరో నీకు॥
మగని వెనుకకు ద్రోచి తగుదునని నాతోడ । కయ్యాని కెదురించి కాలుద్రువ్వితివి॥
మగనిమగతనము నేలపాలైపోయె । బలవిహీనుడు వానిబ్రతు కేమిబ్రతుకు॥
ఇదుగొ గూల్చెద నిన్ను నీఘోరశరమునను । యని ఘోరశరములును నతివపై వేసె॥
దనుజుశరములు గాంచి తరుణి జానికిదేవి । ఒక్కశరమున గూల్చె వానిబాణములు॥
మరియొకశరమంది ఉరువడిని రాక్షస । వరునికరతల మొకటి బరిమార్చివేసె॥
ఒకచెయ్యి గూలి తా నొకచేతితో కత్తి । బట్టి వడివడి వచ్చె బలురక్కసుండు॥
బలుబాణ మొకటంది భామ సీతాదేవి । దనుజురెండోచెయ్యి దునుమాడె నపుడు॥</poem><noinclude><references/></noinclude>
iz4ymmqax1wyxf8xd0svc9gyw6jwjkt
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/180
104
216582
571179
565512
2026-08-23T21:42:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571179
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>రెండుచేతులు గూలి మొండియై బలుతాటి । బొందవలె రాక్షసుడు భూరికోపమున॥
ఘోరంబుగా తనదునోరు దెరచుచు వచ్చి । మెలత సీతాసతిని మ్రింగబోవుచును॥
నోరు దెరచుచు వచ్చు ఘోరదనుజుని జూచి । సీతామహాదేవి చిరునవ్వు వెలయ॥
చండప్రతాపమౌ చక్రబాణము వింట । సంధించి యానిశాచరునిపై వేసె॥
పటువిక్రమంబుగను బలుమంట లెగయుచును । నెలమిగా సూర్యమండలము బోలుచును॥
కాలదండము బోలి కాలానలము బోలి । వజ్రాయుధము బోలి వాడి మీరుచును॥
అలసుదర్శనచక్రములు వేయి బోలుచును । ఫాలలోచనుచేతిశూలంబువలెను॥
హరుడు బ్రహ్మయు సురలు నాకాశవీథి । నందరు సంతోష మంది చూడగను॥
భూనభోంతరములను బొదవుచు మండుచును । పటుశరం బేతెంచె బ్రహ్మాండ మదర॥
వసుధ కుమ్మరిసానవలె దిర్దిరం దిరిగె । వేయిశిరసులనాగవిభుడు తలవంచె॥
జగము తల్లడమందె శైలముల్ మొగ్గతిలె । సప్తసముద్రము లొక్కసరణి ఘోషించె॥</poem>
{{p|ac|fwb}}సీతాదేవిచే శతకంఠుడు చచ్చుట</p>
{{Css image crop
|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 180
|bSize = 600
|cWidth = 454
|cHeight = 301
|oTop = 473
|oLeft = 78
|Location = center
|Description =
}}
<poem>అఖిలదానవకోటి అంధకారం బనగ । శర మేగి శతకంఠుయురముపై గాడె॥
ఉరము భేదించి సత్వరగతిని దేహంబు । చించి దనుజునిశిరము దృంచి వేగమున॥</poem><noinclude><references/></noinclude>
7ksryz1hp0iuizaz3q53t4azqvzwjze
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/181
104
216583
571180
565513
2026-08-23T22:02:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571180
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పూని దివ్యశరంబు వానిప్రాణము గ్రోలి । ధరణి బేధించి పాతాళంబు జొచ్చె॥
అచట నిముషము నిల్చి అతివేగ జానకీ । తూణీరమును జేరె బాణ మవ్వేళ॥
శ్రీరాఘవులదేవిసితశరంబుల దూలి । కొండవలె రాక్షసుడు గూలె రణమందు॥
తద్భరము కోర్వకను తల్లడంబును బొంది । ఫణిరాజు తల వంచె పాతాళమునకు॥
గరుడకిన్నరయక్షగంధర్వచారణ । సురసిద్ధు లానందభరితులై రపుడు॥
పొలుపొంద మకరందపుష్పవరషము గురిసి । రావధూవరులపై యమరాదిసురలు॥
వాయుదేవుడు విసరె వసుధ చల్లనిగాలి । తరుచుగా దుందుభిధ్వానంబు చెలగె॥
అంత విభీషణుడు హనుమంతు జాంబవుడు । చాల సంతోషముల నోలలాడిరిగ॥
అప్సరాంగన లెల్ల నాడి రతిముదమునను । విమలమై విలసిల్లె వెలయంగ దిశలు॥
వలనొప్ప కార్యనిర్వాహకం బాయెనని । సంతోషమును జెంది జానకీరమణి॥
శ్రీరామచంద్రుండు శ్రితలోకపాలుండు । అధికబ్రహ్మానందు డాయె నవ్వేళ॥
విలుబాణములు నేల విడిచి సీతాదేవి । పతిపాదపద్మముల ప్రణమిల్లె నపుడు॥
ప్రణమిల్లియున్నట్టి భామినీమణి జూచి । తనయక్కునను జేర్చె వనజలోచనుడు॥
ముదితచెక్కిలి బట్టి ముద్దాడి పలుమారు । పరమపురుషుడు రాము పలికె మోదమున॥
నీకతంబున గాదె నేడు యీవైరంబు । గెలువ సమకూడె నోజలజాతనేత్రి॥
అఖిలజగముల మెచ్చ నసురు దునుమాడితివి । ముల్లోకములవారు ముచ్చటించగను॥
వెలది దనుజుని దృంప విపరీతచందంబు । గలుగజేసితివి యీకాలంబునందు॥
నగుబాటు రాకుండ నాప్రజ్ఞ నిలిపితివి । వసుధలోపల నాకు వన్నె దెచ్చితివి॥
అని రాఘవేశ్వరుడు తనసుందరీమణిని । వినతు లొనరింపుచును వెలయు నంతటను॥
వాసిష్ఠనారదవాలఖిల్యమహాము । నీంద్రసంఘము లెల్ల నేతెంచి రపుడు॥
ప్రమథగణములు గొల్వ పార్వతీనాథుండు । జానకీప్రియు జూడ జనుదెంచె నపుడు॥
బ్రహ్మపట్ణమునుంచి భారతీనాథుండు । శంకరునితో గూడ జనుదెంచె నపుడు॥
అమరావతీనాథు డతిసుగుణశీలుండు । వేయుకన్నులు గల్గువేల్పు జనుదెంచె॥</poem><noinclude><references/></noinclude>
t3my6wa9ryvse0s8gzm8oa50wuiu7jj
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/182
104
216584
571181
565514
2026-08-23T22:07:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571181
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}బ్రహ్మేంద్రాదులు రాముని జూడవచ్చుట</p>
{{Css image crop|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 182
|bSize = 600
|cWidth = 473
|cHeight = 592
|oTop = 143
|oLeft = 59
|Location = center
|Description =
}}
<poem>అమరాదిదేవతలు అష్టదిక్పాలకులు । సర్వగీర్వాణులును జనుదెంచి రపుడు॥
భోరునను దివినుండి చేరి రఘువరుని । కనులపండువుగాను ఘనులు వారంత॥
శంక యేమియు లేక శారదానాథుండు । జానకీసతి జూచి సంతోషమునను॥</poem><noinclude><references/></noinclude>
3zdvz2nsvh30svgzosmhxr0yn0g49d1
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/183
104
216585
571182
565515
2026-08-23T22:29:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571182
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పలువిధంబుల చేత ప్రార్ధనలు గావించి । వోతల్లి జానకీ వోలోకమాత॥
ముజ్జగంబులకెల్ల ముద మొందజేసితివి । పరగ సత్కీర్తులను బరగితివి తల్లి॥
కంటకుండైన శతకంఠుని బరిమార్చి । జగ ముద్ధరించితివి సఖియ మాతల్లి॥
నిండె లోకములెల్ల నీదుఘనకీర్తులను । ఆపద ల్గడతేరె నఖిలజీవులకు॥
అష్టదిక్పాలకులు అఖిలమునిసంఘములు । నమరాదిదేవతులు యానందులైరి॥
నీబాణసారమున నిల గూలె శతముఖుడు । అఖిలలోకంబులకు ఆపదల్ దొలగె॥
దశకంఠు బరిమార్చి ధరణీతలము బ్రోచె । నీప్రాణనాయకుడు నీరజేక్షణుడు॥
శతకంఠు బరిమార్చి జగ ముద్ధరించితివి । నిఖిలంబు బ్రోచితివి నీవు మాతల్లి॥
సతిపతులు మీ రొక్కసమముగా ముల్లోక । కంటకులనిద్దరిని మంట గలిపితిరి॥
ఇక లోకులకు బాధ యేకాలమున లేదు । కడుక్రూరు లిద్దరును గడతేరినారు॥
నీకు వర మిచ్చెదము నీవు కోరినరీతి । దయ జూచి కోరు మాతల్లిరో నీవు॥
అని బ్రహ్మదేవుండు తనతోడ బలుకంగ । పతిమోము వీక్షించి పరమకల్యాణి॥
జీవితేశునియాజ్ఞ జెంది పరమేష్టితో । పలికె సీతాదేవి పరమహర్షమున॥
చెప్పన్నదేశాధిజనవరులు యావత్తు । మానిమిత్తము వచ్చి మడసి రిచ్చోట॥
మము నమ్మి సుగ్రీవుమర్కటబల మెల్ల । రక్కసునిచేత నీరణములో జచ్చె॥
మూలబలములు వచ్చి ముప్పదక్షోహిణులు । కడురాక్షసునిచేత మడసిపోయిరిగ॥
ద్వాదశాక్షోహిణులు దనుజబలములు వచ్చి । దనుజుతో బోరాడి ధరణి గూలిరిగ॥
మరిది లక్ష్మణవరుడు భరతశత్రుఘ్నులును । కొమరులగు కుశలవులు కూలిపోయిరిగ॥
అతిధైర్యగాంభీర్యు డైనట్టివిజయుండు । దనుజుచేతను గూలి ధరణి వ్రాలెనుగ॥
రణరంగమున నిందరును నేలపాలైరి । సాకేతపురమునకు జనుదెంతు మెట్లు॥
వారు జీవస్తువై వర్ధిల్లి యుండుటకు । వనజసంభవ నాకు వర మియ్యవయ్య॥
పూర్ణాయువుల జెంది పొలుపొందియుండుటకు । కరుణించవయ్య ఓకమలసంభవుడ॥
ఇతర మేమైన మా కివ్వనక్కరలేదు । బలములన్నియు మాకు బ్రతుకుటలు చాలు॥</poem><noinclude><references/></noinclude>
h2fmqreynbg9q9t9ccu3poq7a7v90z0
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/184
104
216586
571185
565516
2026-08-23T22:51:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571185
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అనుచు సీతాదేవి ఆబ్రహ్మతో బలుక । పరమహర్షము నొంది భారతీవిభుడు॥
అమరాదులకు జెప్పి అఖిలబలములపైని । కనకవర్షము ముందుగా గురియజేసి॥
తరువాత తా నమృతవరషంబు గురిపించె । కలకలంబులు బొందె బలము లన్నియును॥
కత్తిగురుతులు మేన గానరాకుండంగ । సకలసేనలు లేచె క్షణములోపలను॥
అమృతవర్షపుమహాత్యం బెట్టిదో గాని । అఖిలబలములు బ్రతికి రాక్షణంబునను॥
వారియానందంబు వర్ణన ల్సేయంగ । వశ మెవ్వరికి నౌను వసుధలోపలను॥
సకలసేనలు మహాసంతోషభరితులై । యెలమి బెంపొందిరి యింక నేమి చెప్పుదుము॥
శతముఖుని బరిమార్చి జగములను రక్షించ । కలకాలమును రాముఘనకీర్తి నిండె॥
ఆటలందుననైన పాటలందుననైన । పరగ రామునికథలు పాపహరణములు॥
చదువులందుననైన శాస్త్రములయందైన । పరగ రామునికథలు పాపహరణములు॥
ఏకథలలో రాముయోగ్యతలు గలుగునో । ఆకథలు పుణ్యకథ లవి మానవులకు॥
మానవజన్మంబు మహి నెత్తినందులకు । వినవలెను శ్రీరామవిభునిచరితములు॥
కలదు జీవన్ముక్తి కడుభోగభాగ్యములు । సకలసుఖములు గలుగు సర్వజీవులకు॥
పనసజంబూద్రాక్షఫలరసంబులకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
కదళికామకరందఖర్జూరములకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
మధుశర్కరాక్షీరదధిఘృతంబులకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
నవసుధాపరమాన్ననవనీతములకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
ఇంతమధురంబైన యేపదార్థము లేదు । నారాయణునిదివ్యనామామృతంబు॥
నారాయణునిదివ్యనామామృతము గ్రోలి । మోక్షదాయకులైరి మునిగణంబెల్ల॥
సర్వజనములకెల్ల సాయుజ్యపద మబ్బు । నారాయణునిదివ్యనామామృతమున॥
భవరోగహరణంబు పరమపదవాసంబు । సరసిజాక్షునికథలు సర్వజీవులకు॥
వనిత సీతాదేవిఘనశరంబులు సోకి । బలుకొండవలె నేల బడియె శతముఖుడు॥<noinclude><references/></noinclude>
2vjr49lx0flkj5ktdwh3u57uolq8yb6
571186
571185
2026-08-23T22:51:38Z
దేవీప్రసాదశాస్త్రి
4290
571186
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అనుచు సీతాదేవి ఆబ్రహ్మతో బలుక । పరమహర్షము నొంది భారతీవిభుడు॥
అమరాదులకు జెప్పి అఖిలబలములపైని । కనకవర్షము ముందుగా గురియజేసి॥
తరువాత తా నమృతవరషంబు గురిపించె । కలకలంబులు బొందె బలము లన్నియును॥
కత్తిగురుతులు మేన గానరాకుండంగ । సకలసేనలు లేచె క్షణములోపలను॥
అమృతవర్షపుమహాత్యం బెట్టిదో గాని । అఖిలబలములు బ్రతికి రాక్షణంబునను॥
వారియానందంబు వర్ణన ల్సేయంగ । వశ మెవ్వరికి నౌను వసుధలోపలను॥
సకలసేనలు మహాసంతోషభరితులై । యెలమి బెంపొందిరి యింక నేమి చెప్పుదుము॥
శతముఖుని బరిమార్చి జగములను రక్షించ । కలకాలమును రాముఘనకీర్తి నిండె॥
ఆటలందుననైన పాటలందుననైన । పరగ రామునికథలు పాపహరణములు॥
చదువులందుననైన శాస్త్రములయందైన । పరగ రామునికథలు పాపహరణములు॥
ఏకథలలో రాముయోగ్యతలు గలుగునో । ఆకథలు పుణ్యకథ లవి మానవులకు॥
మానవజన్మంబు మహి నెత్తినందులకు । వినవలెను శ్రీరామవిభునిచరితములు॥
కలదు జీవన్ముక్తి కడుభోగభాగ్యములు । సకలసుఖములు గలుగు సర్వజీవులకు॥
పనసజంబూద్రాక్షఫలరసంబులకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
కదళికామకరందఖర్జూరములకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
మధుశర్కరాక్షీరదధిఘృతంబులకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
నవసుధాపరమాన్ననవనీతములకన్న । మధురంబు శ్రీరాముకథలు లోకులకు॥
ఇంతమధురంబైన యేపదార్థము లేదు । నారాయణునిదివ్యనామామృతంబు॥
నారాయణునిదివ్యనామామృతము గ్రోలి । మోక్షదాయకులైరి మునిగణంబెల్ల॥
సర్వజనములకెల్ల సాయుజ్యపద మబ్బు । నారాయణునిదివ్యనామామృతమున॥
భవరోగహరణంబు పరమపదవాసంబు । సరసిజాక్షునికథలు సర్వజీవులకు॥
వనిత సీతాదేవిఘనశరంబులు సోకి । బలుకొండవలె నేల బడియె శతముఖుడు॥</poem><noinclude><references/></noinclude>
9ckmfn2ln6h8jyxbh4i5in76q6afb0f
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/185
104
216587
571191
565517
2026-08-24T01:18:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571191
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>రణములో శతకంఠు వ్రాల నిట్లు ప్రతాప । లంకాపురమునందు రాక్షసస్త్రీలు॥
శతముఖుడు కొండవలె సమరమున దూలెనని । వార్తలు విన్నారు వార లవ్వేళ॥
అంతఃపురములోను ఆచిత్రగంధియును । దనుజుభార్యాలెల్ల తగమూర్ఛ బొంది॥
భామలందరు మహాపరవశంబును బొంది । కొంతసేపుకు దెలసి ఘోరదుఃఖమునను॥
పరమసాధువు దనుజుభార్య మొదలైనట్టి । వెలదు లందరు లింక వెడలివచ్చిరిగ॥
పదయుగంబులు దొట్రుపడ కౌను లల్లాడ । వరరత్నభూషణావళులెల్ల వ్రాల॥</poem>
{{p|ac|fwb}}శతకంఠుని భార్యలు విలపించుట</p>
{{Css image crop
|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 185
|bSize = 600
|cWidth = 452
|cHeight = 242
|oTop = 367
|oLeft = 71
|Location = center
|Description =
}}
<poem>జడలు మడిమెలపైని చలగి నటియింపంగ । బాష్పపూరములచేత పయ్యదలు దడియ॥
మొగములు నురములును మోదుకొని పొరలుచును । ఘోరశోకమున గగ్గోలు పెట్టుచును॥
దారి గానక రాళ్లు దగిలిపడి లేచుచును । హానాథ యని మూర్ఛ నవని వ్రాలుచును॥
రణభూమి కరుదెంచి రాక్షసస్త్రీలంత । రణనిద్ర జెందు రాక్షసుని గనిరి॥
రఘువరునిదేవిచే రాక్షసుడు వెస దూలి । విరిపాన్పు బొరలాడువిధి నేల నుండె॥
రథకేతనంబులును రథచక్రములు గూలి । హంసతూలికపాన్పు లమరినట్లుండె॥</poem><noinclude><references/></noinclude>
n9qcaqun6l9d96vovq2f7bagkpvb3bh
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/186
104
216588
571192
565518
2026-08-24T02:15:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571192
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>కనకమణితొడవులు కరయుగంబుల గూడి । దనుజనాథుని కమరె తలగడలరీతి॥
గాయము లతనమేన గారురక్తము రక్త । చందనాకృతి బోలి అం దమరియుండె॥
ధరణీపరాగంబు తనమేనుపై బరగి । శాలు గప్పినరీతి జెందియుండెనుగ॥
కాకఘూకంబులును కంకాదిఖగములును । పరిచారకులరీతి బరిఢవిల్లెనుగ॥
తెలివేమియును లేక దీర్ఘనిద్దుర బొంది। ధరణి బడియున్నట్టిదనుజు బొడగనిరి॥
మదగజము బడగూల్చుమ్రాలు పైటలు బారి । యున్నతీగెలరీతి నువిదలందరును॥
శోగములు బెనగొనగ లోకకంటకుడైన । శతముఖునిపై బడిరి సఖియలందరును॥
పడి మోముపై మోము పలుమారు జేర్చుచును ! బలుమేను కౌంగిటను బట్టి రందరును॥
బలుమేను కౌంగిళ్ల బట్టి సతులందరును । పలువిధంబుల చాల విలపించి రిట్లు॥
హానాథ శతకంఠ హానీదుశూరత్వ । మెచ్చోటు కేగె నిం కెచ్చోట గలిసె॥
సురవర్గముల నెల్ల చెరలు బట్టినయట్టి । నీదుదివ్యాజ్ఞ యేయేట గలసెనుగ॥
అష్టదిక్పాలకుల హతమార్చు నీబలిమి । శౌర్యమంతయును యేజలధి గలసెనుగా॥
త్రిపురసంహరునైన తెరచి నీమొగ మెత్తి । వెరపించులావు యేవీట గలసెనుగా॥
తపమహత్వంబునకు తగ బ్రహ్మ నీ కిచ్చు । వరములన్నియును యేవనట గలసెనుగ॥
నీరూపు నీరేఖ నీసొంపు నీపెంపు । నెల్లప్రాభవ మిపుడు యెందు గలసెనుగ॥
నిలుచు నాప్రాణములు నిముషంబు నిను బాసి । పిలచినా యొకమారు పలుకవేమయ్య॥
తప్పేమియును లేదు దయ జూచి మాపైని । ఘనుడ నీ వొకమారు కను లెత్తిచూడు॥
భయ మెవ్వరికినైన భయ మనగ నీ కేమి । వీరుడవు జగదేకశూరుడవు నీవు॥
అసమానబలశాలి వానందపూర్ణుడవు । రవికోటితేజుడవు రాజితుండవుగ॥
తొలగి నీశిరము యీధూళి భృంగుండగా । శయనింప ధర్మమా జగదేకవీర॥
మము విడనాడుటకు మనసు నీ కెటు తాళె । ధవుడ మ మ్మెడబాయ ధర్మమా నీకు॥
ఎన్నెన్నిజన్మంబు లెత్తి పుట్టినా గాని । బలశాలి నీవంటిపతి మాకు గలడు॥
ఎట్లు భరియింతు మిం కేమి తాళుదుము । నిను బాసి ప్రాణములు నిలుచునా మాకు॥</poem><noinclude><references/></noinclude>
0yy7omdb7ag6e6tbclolsho03925qt5
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/187
104
216589
571193
565519
2026-08-24T03:28:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571193
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ప్రాణేశ నిను యడబాసి తాళగలేము । సెలవిమ్ము నీవెంట జనుదెంతు మిపుడు॥
ఏది గతి యేది కృతి యేది ది క్కిక మాకు । నేదారి యేతెరవు యేమి జెప్పవుగ॥
అలగితివొ మామీద నధికబలసంపన్న । పిలచితే పలుకవు ప్రియ మెందు బోయె॥
కలనైన మేము నీశలవు దప్పగ లేదు । యింత కఠినపుబుద్ధి యేమి ప్రాణేశ॥
అని పెక్కుభంగులను యతివలందరు చాల । పతిమీద బడి విలాపము నొంది రపుడు॥
తనదుకోడ ళ్లిట్లు తనయు శతకంఠుపై । బడి మ్రొర్ర లిడి రిట్లు పలువిధంబులను॥</poem>
{{p|ac|fwb}}చిత్రగంధి కుమారునికై దుఃఖించుట</p>
<poem>తగ చిత్రగంధి సయ్యన పుత్రు దరిజేరి । అతనిపై బడి యిట్లు ననియె శోకమున॥
హాశతాస్యకుమార హాశౌర్యగంభీర । హాసుందరాకార హామేరుధీర॥
శతకోటిమన్మథుల సరిబోలు నీరూపు । పొలసెనా జానకీబలుశరంబులను॥
వనజసంభవు డిచ్చు వరమహత్వము లెల్ల । నిర్మూలమాయెనా నేటితో నీకు॥
దిగ్గజంబుల గెలచి డీకొన్న నీబలిమి । కటకటా భువిలోన గలసెనా నేడు॥
ఎంతగతి వచ్చెరా హీనబుద్ధి దలంచి । శతముఖ నామాట చెవి బెట్టవైతి॥
వెలయ రాఘవు డాదివిష్ణు డని చెప్పితిని । సుదతి జానకి పరంజ్యోతి యంటిని॥
కపులు సురవరు లంటి కడుజయము గాదంటి । కలనైన వైరంబు దలపవద్దంటి॥
నామాట చెవి పెట్టినావుగా వెంతైన । వినక నీ వీగతిని యిటు బొందవలసె॥
రాఘవేంద్రుని జంపి రమణి జానకి దెత్తు । నని పల్కితివి నీవు నన్యాయముగను॥
ఆమాటయే నీకులాంగనలకే వత్తు । సహజవైధవ్య మీక్షణములో గలిగె॥
అగ్ని కొంగున ముడువ నాపేక్ష పడ్డావు । ముందు వచ్చేటట్టిమోస మెరుగకను॥
వద్దువద్దని యెంత వాదించి చెప్పితిని । వినక నీ వీకతంబున పొందినావు॥
అరగడియ నిను బాయ నది నాకు యుగ మాయె । నిను బాయ నాగుండె నిలచు నేరీతి॥
నీతండ్రి విశ్వవసు నీరజాప్తుని గోరి । తపము జేసిన మెచ్చి తనయ ని న్నిచ్చె॥
వరమహత్వమున నీ వరయ నా ర్భమున । జనన మొందితివిగా శతకంఠములను॥</poem><noinclude><references/></noinclude>
m7wwv0c55ovxs8wgsylt0uohjg5b2ed
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/188
104
216590
571194
565520
2026-08-24T04:17:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571194
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>శతకంఠముల నీవు జనన మొందినవల్ల । శతకంఠనామంబు జెన్నారె నీకు॥
సీతామహాదేవి సితశరంబుల నిన్ను । కనికరము లేకుండ గడతేర్చివేసె॥
ఆదినారాయణుం డారాఘవుండైన । దయ నిన్ను జూడగా దలపడాయెనుగ॥
వారి నన బని యేమి క్రూర బుద్ధివి నీవు । కయ్యమున కెదిరించి కాలు ద్రువ్వితివి॥
దుర్మార్గముల నీవు తులదూగుచుండంగ । కనికారబు ద్ధెట్లు గలుగు వారలకు॥
తా జేయకుండంగ తనకు లభ్యము గాదు । కీ డైన మే లైన కేవలంబుగను॥
తనకు నిర్మలవృత్తి దనరంగ గలిగితే! సిద్ధింప దెన్నడును చేటుమార్గంబు॥
కడుఘోరపాపముల కొడిగట్టినందునను । గలిగె నీమరణంబు కడుయుద్ధమందు॥
ఏమి సేయుదును నే నేలాగు భరియింతు । ది క్కేది తెర వేది తె న్నేది యికను॥
పొంకమైనప్రతాపలంకాపురంబెల్ల । బలుపీడ వేటాడు నలువీథులందు॥
నీవు గూలకముందె నిఖిలబలముల దెచ్చి । సమరంబు గావించి జలధి గలిపితివి॥
వినలేను విధవలవీరశోకారవము! నొకరిద్దరును గారు వారించుటకును॥
కడుపురం బందరును గగ్గోలుబెట్టుదురు । నిండు సేయగ నాకు గుండె తాళదుగ।
ఒక్కపురుషుండైన నూర లేకుండంగ । మొనసి పురస్త్రీలు ముండమోసిరిగ॥
గతి యేది వారలకు ధృతి యేది మా కికను । దయ జూచి చెప్పరా ధైర్యపుత్రుండ॥
చలమున వారింపజాలనైతిని నేను । ఇంతగతి గలుగగా నేల తాళుదును॥
ధాతవ్రా లీలాగు తథ్యమై యుండగా । నీ వేల వినియెదవు నే జెప్పినట్లు॥
నుదుట వ్రాసినవ్రాత నులిమితే చెడిపోదు । అనుభవించిక తీర దనుభవంబెల్ల॥
అని యెదురుగా నున్న ఆరాఘవుల గాంచి । కరయుగంబులు మోడ్చి కాంత యిట్లనియె॥</poem>
{{p|ac|fwb}}చిత్రగంధి రాముని నిష్టురోక్తు లాడుట</p>
<poem>శ్రీరామ రఘురామ శ్రీజానకీరామ । చారుసుగుణోద్ధామ సంగ్రామభీమ॥
తనయుడగుశతముఖుని దయమాలి చంపితివి । దైవరాయా నీకు ధర్మమా యిట్లు॥
తనజ్ఞాతులైన రావణకుంభకర్ణులను । బరిమార్చినారన్నపంతమున వీడు॥</poem><noinclude><references/></noinclude>
l1v2ffswb087fu30dnfkyu0a1kdjuui
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/189
104
216591
571195
565521
2026-08-24T04:50:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571195
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పడుచుబుద్ధిని మీతొ పగబూనియున్నాడు । గద్దరింపుచు వీడు బుద్ధిహీనతను॥
అవతారపురుషుండ వగు నిన్ను యెరుగకను । మారుకొనినతోడ మత్సరంబునను॥
గర్వవంతుడు వీనిగర్వంబు తూలంగ । తివిరి చేతులు తీట దీర్చంగరాద॥
తలయొకటి చేతులును రెండు దక్కగ జేసి । కొదువకరశిరములను గూల్చంగరాద॥
అటుమీద బలుగర్వ మణగి మీపాదముల । మరుగు చొరడా బుద్ధిమంతుడై వీడు॥
ప్రాణములు సరిపుచ్చి పడగూలవేసితిరి । దైవరాయా మీరు ధర్మంబు విడచి॥
అతులప్రతాపలంకాపట్నవాసులకు । ప్రాపకం బిక నేది బ్రతికియుండుటకు॥
వాడు దుష్టుం డైతె వాని జెందినయట్టి । జీవకోటులు యేమి జేసె పాపములు॥
ప్రాపకం బెడదూలి బ్రతుకుమార్గము లేక । వానిపురమున యెట్లు వర్తిల్లగలము॥
పురవాసులందరిని బరిమార్చివేసితిరి । తరుణులందరికి వైధవ్యంబు గలిగె॥
వాడిసహవాసమున వడిబలంబులు గూలె । వనితలందరు శోకవని నుండగలిగె॥
పురవాసులందరికి తెర వేది ది క్కేది । గతి యేది ధృతి యేది మతి దలంపగను॥
తలయొకటి రెండుచేతులతోడ దానవుని । విడువరాదా జ్ఞానవిధి నుండుమనుచు॥
గర్వమెంతయు దూలి కడుబుద్ధిమంతుడై । వెలగడా మీవద్ద మిగులభక్తిగను॥
కొండవలె రణమందు గూలంగ జేసితిరి । కటకటా యొక్కింతకనికరము లేక॥
భరియింతు మెట్లు యీపురములోపల మేము । అతివలందరము మా కాధార మేది॥
నీవె యాధారంబు నీదె మాభారంబు । నీవె తల్లివి మాకు నీవె తండ్రివిగ॥
ఎట్లు రక్షింతువో యేదరిని జేర్తువో । ఎల్లభారంబు నీదే శ్రీరామచంద్ర॥
భువనంబులో నీవు పొలుపార జెలగుదువు । భువనములు నీయందు బూనియుండెదవు॥
కపటనాటకసూత్రనిపుణుండవై నీవు । మాయాప్రపంచంబు జేయుచున్నావు॥
మమ్మునందరిని యేమార్గమున దయ చేసి । కాపాడి బ్రోతువో కమలలోచనుడ॥
నీదివ్యపదయుగము నెర నమ్మియున్నాము ।సకలలోకేశ్వరా జానకీరమణ॥
అని పాదపద్మము వనిత తా వ్రాలంగ । కనికరంబున రామజనవరుం డపుడు॥</poem><noinclude><references/></noinclude>
dkf5aph6q2k72ufmhgeyl6spvq4523x
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/190
104
216592
571196
565522
2026-08-24T05:08:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571196
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}శ్రీరాములు చిత్రగంధి నూరడించుట</p>
<poem>పాదములపై బడ్డపణతి లేవగ నెత్తి । దయ బెనంగగ బలికె దాశరథి యపుడు॥
ఓసతీ వగువంగ వలదు శోకం బుడుగు । అసమానవిక్రముం డైననీసుతుడు॥
ధరణి బడినందార తగ నొక్కరీతిగా । పోరె నాతో నొక్కయీర్ష్యత నతండు॥
ఈరేడులోకముల నెవ్వరైనను గాని । వీనితో సరిబోలువీరుండు లేడు॥
వీరుండు జగదేకశూరుండు రణరంగ । ధీరుండు నీతండు ధీరసాహసుడు॥
ఇతడు ధీరుం డనుచు నెల్లలోకమునందు । దలచుమాటలు మాకు దాఖలాపడెను॥
మర్కటబల మెల్ల మద మణచి సరిపుచ్చె । దేశాధిరాజులను తేజంబు లణచె॥
మూలబలములనెల్ల నేల గలయగగొట్టె । కడువిభీషణుబలము కడతేర్చివైచె॥
అనుజులను కుశులవుల నావిజయులను బట్టి । యేపెల్ల దూలించి యిల గూలవైచె॥
నాకు సాధ్యముగాక నాపైని బలువేడి । శరము లుగ్రత వేసి శక్తి గనపర్చె॥
అంతలో జానకి అడ్డంబుగా వచ్చి । దనువుతూపులు బట్టి దనుజుతో బోరె॥
అతనిదోర్గర్వంబు అగపర్చి కాంతతో । రణము జేసెను పరాక్రమవిక్రమముగ॥
కరములును శిరములును ఖండించినాగాని । వదలకుండగ ధైర్యవశు డగుచు బోరి॥
తలయొకటి రెండుచేతులు దక్కగా జేసి । కాంత సీతాదేవి గనుగొనుచు నిలచె॥
తను గావు బ్రోవుమని అణుమాత్రమైనను । తననోట రాదాయె దనుజవీరునకు॥
అంతకంతకు కోప మధికమై పోరంగ । కోపమున జానకి గూల్చె దానవుని॥
తను గావుమని పల్కు తననోట రాదాయె । మము నేల నిష్టూర్యమాట లాడెదవు॥
అతనిపరమాయువయు యాసన్నమై యుండ । నత డేల మాశరణు కాశించి వచ్చు॥
ఏల విలపించేవు యెంతవారలకైన । యిల జయాపాజయము లెవ్వరికి గలుగు॥
దేహ మనిత్యమని దెలియ దెవ్వారలకు । మరణ మొందుచునుండ మానుదురు యెవరు॥
సీతామహాదేవిచేత నీకొమరుండు । ఘోరరణరంగమున గూలియున్నాడు॥
ఘోరరణరంగమున గూలువీరులు నెల్ల । వైకుంఠవాసులై వర్థిల్లగలరు॥</poem><noinclude><references/></noinclude>
f0b21vlppyz3xa6m9ob9srj9lant7t5
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/191
104
216593
571197
565523
2026-08-24T06:02:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571197
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సుదతి నీ వాతనికి శోకింప బని లేదు । వైకుంఠపురమందు వర్తించు నతడు॥
ధరలోను జీవులకు మరణములు దప్పవు । యెంతకాలమ్ముకైన యెన్నాళ్లకైన॥
మాచేత నాతండు మడసినా డిచ్చోట । సొరది వైకుంఠంబు జూరగొన్నాడు॥
స్థిరముగా వైకుంఠపురమునం దున్నాడు । వగువంగ బని లేదు వానికై నీవు॥
హనుమంతు దెలిపినా డతివ నీవర్తనలు । బహుయోగ్యురాలవని పలువిధంబులను॥
మాతోడ కలహంబు మానుమని నీసుతుని । వారించుటలు నాకు వాయుజుడు జెప్పె॥
వనిత నీ వెంత చెప్పిన వినక నాతోడ । చలమునను యుద్ధముకు జనుదెంచె నతడు॥
కరములు శిరములును కండలై కూలెను । తెరి పేమి లేకుండ ధీరుండపోలె॥
అతనిభుజబలిమియును ఆమహిమశౌర్యంబు । వర్ణింపగా దరమె వసుధ నెవ్వరికి॥
తను గావు మనిపల్కు తననోట రాదాయె । యేమి జెప్పుదు వానితామసంబెల్ల॥
దైవయత్నం బెవరు తప్పింపగా లేరు । అతని కాయుర్దాయ మెంత యున్నదియొ॥
ఆయు వేమియు లేనియతనికై నీ విట్లు । విలపించ మర్యాద యిది గాదు సుమ్మీ॥
నీతికోవిదురాల నీమదిని భావించు । గతమునకు దుఃఖింపగారాదు యెవరు॥
దిక్కు లేదని నీవు దీనతను బొందేవు । బలువుగా శోకింప పని లేదు నీకు॥
నీయొక్కబుద్ధికిని నీభక్తియుక్తికిని । కలికిరో నామది కరికరం బొదవె॥
ఇటుమీద నీభాగ్య మేమి చెడిపోకుండ । దయ మాకు బెనగొనియె తలపులోపలను॥
నీపురము చెడకుండ నీకుమారునిసుతుడు । కడుబుద్ధిశాలొకడు కలడంచు వింటి॥
బాలకుడు నిజముగా ప్రహ్లాదునిం బోలి । హరిభక్తి నుండుటయు నన్నివేళలను॥
వానిపై నా కిపుడు వాత్సల్యతయు బొడమె । తప్పక రక్షింతు తరుణిరో వినవె॥
బాలకునిపై నీకు బహుముద్దు గలుగునట । కట్టింతు పట్నంబు కరుణ నాతనికి॥
ఘనముగా పురము శృంగారంబు గావింతు । వేగ నగరికి బొమ్ము వెలదిరో నీవు॥
అలవిభీషణు బోలి యాతండు వర్ధిల్లు । మీ కెల్ల ది క్కౌను మిమ్ము బ్రోచునుగ॥
బలుగుణవతి నీవు విలపింప కిటుమీద । నీలకేతుని జూడు నీసుతునిరీతి॥</poem><noinclude><references/></noinclude>
1wcgph5fvjln2mwte6oojqmorqvzzp4
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/192
104
216594
571198
565524
2026-08-24T07:11:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571198
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సందేహ మిక మాని సంతోషమున నీవు । పురము శృంగారింప బొమ్ము వేగముగ॥
అని రాఘవేశ్వరుడు కనికరంబున బలుక । బలుదుఃఖమంతయును బాసె నాతరుణి॥
సీతామహాదేవి శ్రీరామచంద్రునకు । సాష్టాంగదండములు సమకొల్పె నపుడు॥
ఆవధూవరులచే అతివ శలవందుకొని । తనదుఃఖములు బాసె తరుణీలలామ॥
తనదుకోడళ్ల నందరి నప్పు డోదార్చి । తనవెంట దోడుకొని తనపురికి జనియె॥
తనపురికి నేతెంచి తరుణీలలామంబు । దాసీల రప్పించి తనసముఖమునకు॥
ఆదినారాయణుం డారాఘవేశ్వరుడు । నీలకేతుని బ్రోవ నిర్ణయించెనుగ॥
అన్నమాటలు దప్ప డాపుణ్యవంతుండు । సత్యవాక్యుడు రామజగతీవరుండు॥
మనకోర్కె లీడేరు మగువలారా మీరు । ఘనముగా పురము శృంగారించి రండి॥
అని చిత్రగంధి చయ్యన వారలకు జెప్ప । పురమునలుదిక్కులను బరిగి రాస్త్రీలు॥
గంధకస్తూరికాకర్పూరములు మార్చి । పన్నీట కల్లాపు బట్టి వేసిరిగ॥
కస్తూరిఘనసారకలితోదకంబులను । అలికిరా వేదికల నన్నిదిక్కులను॥
చొక్కాణిముత్యములు సొగసైనమ్రుగ్గులను । ప్రతియింట వేదికల బెట్టి రాస్త్రీలు॥
పరగ వీథులయందు ప్రతియింట ద్వారముల । పచ్చతోరణము లేర్పడగట్టి రపుడు॥
కనకశోభితముగా ఘనరత్నమయముగా । పూర్ణవైభవ మొప్ప పురము జెన్నొందె॥
ఘుమఘుమారావమున కొమరొందె పురమెల్ల । పరిమళద్రవ్యసంభరితమార్గమున॥
వీణకిన్నెరమురజవీరమృదంగములు । వరుస మంగళఘోషవాద్యము ల్వెలసె॥
పుర మిట్లు శృంరంగారపరిచి దాసీజనము । లావధూమణి జేరి రానందు లగుచు॥
అచట రణభూమిలో నారాఘవేశ్వరుడు । ప్రేమ విభీషణుని బిలచి యిట్లనియె॥</poem>
{{p|ac|fwb}}విభీషణుడు శతకంఠునకు అగ్నిసంస్కారము జేయుట</p>
<poem>నీకు పరమజ్ఞాతి నిజముగా శతముఖుడు | కొండకైవడి నేల గూలియుండెనుగ॥
అగ్నిసంస్కారంబు లవి నీవు గావించి । కర్మాదిక్రియలన్ని కడతేర్చవయ్య॥
నీకు కొమరుండౌను నీలకేతుడు వాని । అధిపతిని జేయించు యాపట్టణముకు॥</poem><noinclude><references/></noinclude>
cxk6cu8049i2aynvpebj2lr9qx2m7qw
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/193
104
216595
571199
565525
2026-08-24T08:58:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571199
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అని రాఘవేశ్వరుడు తనతోడ బలుకంగ । హస్తములు జోడించి యనె విభీషణుడు॥
అఖిలేశ మీశలవు కడ్డు జెప్పగజాల । గాని నామనవొకటి గలదు చెప్పెదను॥
అఖిలలోకంబులకు నాపదలు గావించు । బలుదురాత్ముడు వీడు పరమద్రోహుండు॥
అగ్నిసంస్కారముల కర్హనీయుడు గాడు । కర్మాదిక్రియ లేల కడుదురాత్మునకు॥
ఎట్టిసోదరుడు నా కీదుష్టచరితుండు । పరమచండాలుండు బలుపాతకుండు॥
దానవుం డెపుడు నాతల దృంచునో యనుచు । తారకాచలగుహల దాగి నే నుందు॥
వీనిమార్గము లెల్ల విశ్వసించకపోతె । పరమశత్రువుడు నాపాలింట వీడు॥
నిన్న యుద్ధములోను నన్ను బడగూల్చెను । పరమాత్మ నీకరుణ బ్రతికితిని నేను॥
కర్మాదిక్రియలన్ని గావించుటకు నాకు । అర్హనీయుడు గాడు అఖిలేశ వీడు॥
అగ్నిసంస్కారంబు లసురునకు జేయంగ । మనసు పుట్టదు నాకు మానవేశ్వరుడ॥
శత్రువునకును యగ్నిసంస్కారములు జేయ । శల విచ్చెదరు నాకు జానకీరమణ॥
అని విభీషణు డిట్లు తనతోడ బలుకంగ । సర్వజ్ఞు డారామచంద్రు డిట్లనియె॥
ఓవిభీషణ నీవు ఊహించు నీమదిని । శతముఖుడు నాచేత సమరమున గూలె॥
మాచేత శతముఖుడు మడయుచందంబున । కడతేరె నాతనికి కలుషజాలములు॥
పాపముల నెడబాసి పరమపుణ్యండయ్యె । దనుజుదోషము లెన్న బని లేదు యికను॥
అనివీరులకు గల్గు సమరవైకుంఠంబు । అది గాక మాచేత నణగె శతముఖుడు॥
వైకుంఠవానుడై వర్తిల్లె నిజముగా । నతడు పుణ్యుం డయ్యె నతిసుకృత మబ్బె॥
అతను దుశ్చేష్టుడైనను పాపుడైనను । జ్ఞాతిగాడా నీకు కర్మంబు సలుప॥
దిక్కుమాలినవానితెరవుగా శతముఖుని । విడిచిపెట్టగ రాదు వీరరణమునను॥
నీలకేతుండు పసిబాలకుడు యేకర్మ । చేయు టెరుగడు యతనిచేత గా దేమి॥
అతనికి పినతండ్రి వితనికి తమ్ముడవు । నీవు దప్పు నటింప నింద వచ్చునుగ॥
ఇతడు సామాన్యుడా యెల్లలోకములందు । నేకచక్రత్వమున నేలియున్నాడు॥
కూలినాడని వాని కొంచింపగా తగదు । ఇల జయాపజయంబు లెవ్వరికి గలవు॥</poem><noinclude><references/></noinclude>
ccqzd8i0iktf1gvcqeajqw11npfwqsg
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/194
104
216596
571201
565526
2026-08-24T09:29:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571201
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఘనముగా నీతనికి కర్మాదిక్రియలన్ని । గావించుటకు నీకు కర్తవ్య మొదవు॥
సంశయింపక నీవు జని వేగ యాతనికి । కర్ణాదిక్రియలన్ని గావించవయ్య॥
అని రాఘవేశ్వరుడు తన కిట్లు జెప్పంగ । మారు జగదీశునకు మరి జెప్పలేక॥
భవదాజ్ఞ తప్ప నాతల చాలునా యనుచు । నతనియాజ్ఞాబద్ధుడై విభీషణుడు॥
మాల్యవంతప్రముఖమంత్రికోవిదు లొప్ప । జనె విభీషణుడు శతకంధరునిదరికి॥
మేను విస్తారముగ మేరుశైలమురీతి । ఘోరాంగుడై ధాత్రి గూలియుండెనుగ॥
అతని గొనిపోవంగ నసురవీరుల బిలచి । కనకశిబికొకటి తా గట్టించుమనియె॥
నవరత్నజాలములు నలుదిశల జెన్నొంద । చెలువైనబంగారుశిబిక గట్టిరిగ॥
తూర్యనాదము లెల్ల తొడిబడుచు మ్రోయంగ । శాస్త్రచోదితవిప్రజనము లేతేర॥
శిబికపై శతముఖుని జేర్చి దనుజావళులు । గొనిపోయి రాశిబిక కొంతదూరముకు॥
కొంతదూరంబునకు గొనిపోయి యచ్చోట । నిలిపి శాస్త్రక్రియానిర్ణయంబునను॥
బ్రాహ్మణోత్తములు మంత్రము లుచ్చరింపంగ । కర్మాదిక్రియలన్ని గావించి రపుడు॥
గంధతరువులు దెచ్చి గగనంబు పొడవుగా । జితి బేర్చి శతముఖుని జేర్చి రందునను॥
అనలంబు సమకొల్పి రాకాష్టమంతయును । వినువీథి నంటంగ పెనుమంట లెగసె॥
శతకంఠుదేహంబు సర్వంబు సాంగమై । దందహ్యమానమై తగ మంట గలసె॥
అచ్చోట వీడుకొని ఆవిభీషణు డపుడు । సరయూనదీయందు స్నానములు జేసె॥
వచ్చి శ్రీరాములకు వందనంబులు జేసి । కడుభక్తి మీరంగ ఘనవిభీషణుడు॥
కడుమోదమున బల్కె ఘనుడు శ్రీరాములతొ । శలవుప్రకారంబు శతకంఠునకును॥
పరలోకకర్మ నే భక్తితో జరిగిస్తి । పరమాత్మ నే జేయుపని శలవు లిమ్ము॥
అనిన లక్ష్మణుతోడ నారాఘవేంద్రుండు । రావోయి తమ్ముడా రమ్ము వేగమున॥
నీవు విభీషణుడు నెమ్మితోడ ప్రతాప । లంకాపురము కేగి లావణ్యముగను॥
నీలకేతుం డనెడి బాలునకు వేగమున । ఘనతతో పట్నంబు గట్టి రం డిటకు॥
అని రాము బలుకంగ నతనిశల వందుకొని । లక్ష్మణవిభీషణులు తక్షణంబునను॥</poem><noinclude><references/></noinclude>
hdik911xdoyc9r6oclq19kp8iwqia6t
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/195
104
216597
571212
565527
2026-08-24T11:21:17Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571212
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పొంకమైన ప్రతాపలంకాపురము కేగి । రెల్లరాక్షసవర్గ ముల్లాస మొంద॥
అలకాపురముకంటె నమరావతియుకంటె । నందమై విలసిల్లె నామహావురము॥
వెలయ నగరముచుట్టు వినువీథి నంటుచును । గలవు తొమ్మిదికోట లెలమి బొందుచును॥</poem>
{{p|ac|fwb}}నీలకేతనుపట్టాభిషేకము</p>
<poem>పదహారువన్నెమేల్పసిడికాంతులు వెలయ । భాసిల్లుచును నవప్రాకారములును॥
తారాపథం బంటి తళతళ ల్మీరుచును । మేలైనబంగారుమేడలును గలవు॥
ఘనరథంబులు గంధకరితురంగంబులును । బరిఢవింపుచు నుండె పురము నిండగను॥
ఏదిక్కు జూచినా యేవీథి జూచినా । హేమమయమై యుండె నెల్లచోటులను॥
కడువింత పుర మెల్ల గని విభీషణు గూడి । ఆస్థానమున కేగె నపుడు లక్ష్మణుడు॥
ఆస్థానమున కేగి అచ్చటికి బాలకుని । కడువేగ దెప్పించి కరుణ మీరగను॥
వెలయ నానాతీర్ధములు పుణ్యజలములను । అసురవీరుల బంపి అపుడు దెప్పించి॥
పుణ్యజలములు యిట్లు పొలుపార దెప్పించి । అఖిలభూసురగణము లాశీర్వచింప॥
మణికనకమంటపముమధ్య సంతోషమున । భద్రమంటపముపై బాలుణ్ని జేర్చి॥
ఘనతూర్యనాదములు కడువింత రంజిల్ల । పంచమహవాద్యములు మించి మ్రోయగను॥
సకలజనములు చాల సంతోషమును బొంద । సూతమాగధులెల్ల స్తుతులు జేయగను॥
నీలకేతుడు సార్వకాలంబు వర్ధిల్ల । నభిషేక మొనరించి రాపుణ్యవరులు॥
అష్టదిక్పాలకులు నమరాదిదేవతులు । జలనిధులు కూర్మంబు చంద్రభాస్కరులు॥
యుగములో రాముకథ యున్నంతకాలంబు । వర్ధిల్లుమనుచు దీవన లిచ్చిరపుడు॥
అతులప్రతాపలంకాపట్టణేశుడై । నీలకేతుడు వెలసె నిఖిలభాగ్యమున॥
పురవాసులందరును పరమసంతోషమున । నెలమి బొందిరి కోర్కె లీడేరె ననుచు॥
అంతఃపురములోప లాచిత్రగంధియును । తనదుకోడళ్లంత తనివినుండిరిగ॥
తనకు పట్నము గట్టిరని నీల కతుండు । సంతోషమును బొందె చాలగా నపుడు॥</poem><noinclude><references/></noinclude>
e5b6d7qsriqhzrwcaxezf7mxn07bfd6
పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/196
104
216598
571213
565528
2026-08-24T11:58:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
571213
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>రామానుజుండైన లక్ష్మణవీరునకు । సాష్టాంగదండములు సమకొల్పె నపుడు॥
శాశ్వతంబుగ విభీషణు బోలి వర్ధిల్లు । మని దీవనలు నిచ్చె ఘనుడు లక్ష్మణుడు॥
పినతండ్రి యగువిభీషణునకు మ్రొక్కంగ । నతడు దీవించె దీర్ఘాయువులు గలుగ॥
అంతఃపురము కేగి అవ్వగారికి మ్రొక్కి । తల్లులందరికి తాతగు మ్రొక్కులిడియె॥
దేవులందరు గూడి దీవనలు గావించి । ఆరాముపదభక్తి అతనికిని గలుగ॥
పట్టణాధీశుడై బాలుండు వెలసెనని । పతిబాయుదుఃఖములు బాసి రందరును॥
నీలకేతను డపుడు నీరజాక్షునిపాద । దర్శనము గావింప దలచె వేడుకను॥
మాణిక్యములు మంచిమౌక్తికహారములు । కనకనిర్మితమైనమణిభూషణములు॥
పసిడివస్త్రంబులును పట్టుపీతాంబ్రములు । పరిమళద్రవ్యసంభరితజాలములు॥
ఘనవస్తుజాలములు కానుకలుగా గొనుచు । తనయీడుబాలకులు తనవెంట గొలువ॥</poem>
{{p|ac|fwb}}నీలకేతనుడు రాముని స్తుతి జేయుట</p>
{{Css image crop
|Image = శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf
|Page = 196
|bSize = 600
|cWidth = 232
|cHeight = 248
|oTop = 484
|oLeft = 189
|Location = center
|Description =
}}
<poem>భానుకులదీపకునిపదదర్శనము జేయ । బాలకుడు జనుదెంచె పాదచా రగుచు॥
అల్లంతదూరమున నఖిలేశుబొడ గాంచి । నేత్రపర్వం బొంది నీలకేతనుడు॥
పాణితలములు రెండుఫాలమున జేర్చుకొని । పాహి రామప్రభో పరమాత్మ యనుచు॥</poem><noinclude><references/></noinclude>
79izois0tfzq9sf4xwzxhrc5l1cpbj4
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/78
104
218519
571165
2026-08-23T13:02:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571165
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>కుఁగూడ నీవ్యాధి యెక్కడ అంటుకొనిపోవునో అని మేమే నివారించితిమి.
రోగులకు మాటిమాటికి బ్రాందినిమ్మని మా కాదేశము. 'మీరు గూడ బ్రాందిని కొంచెముకొంచెము పుచ్చుకొను చుండినచో వ్యాధి అంట' దని చెప్పుచు నర్సు తాను త్రాగుచుండెడిది. కాని మేము దానిని తాక కుంటిమి. రోగుల కయినను బ్రాంది ఉపయోగించునని నాకు నమ్మిక లేదు. బ్రాంది పుచ్చుకొనక యుండుటకు మూవు రంగీకరించిరి. డాం గాడ్ ఫ్రేగారి అనుమతితో ఈమూవురిపై నేను మట్టిని ప్రయోగించితిని. తలమీఁదను ఱొమ్ముమీఁదను నొప్పిగల చోటులను మట్టిపట్టీలు వేసితిని. వీరిలో నిరువురు బ్రతికిరి, మిగిలిన వారందఱును
మేనులువిడిచిరి. ఇరువదిమంది ఆ గిడ్డంగులలోనే మృతిజెందిరి.
మునిసిపాలిటీవా రితరోపాయములు చేయఁదొడఁగిరి. జొహాన్సుబర్గుకు ఏడుమైళ్లదూరమున ఒక లేజ్ రేటో అనఁగా అంటురోగుల కాసుపత్రి కలదు. అచట డేరాలు వేసిరి. పోఁగా మిగిలిన మూవురిని అచటకుఁ గొంపోయిరి. క్రొత్తరోగులను అచటికే కొనిపోవ నిశ్చయించిరి. మే మాపనినుండి విముక్తుల మయితిమి. పిదప ఆమేలి యుపచారికకుఁగూడ నల్లమారి తగిలెననియు, దేహము చాలించెననియు కొలఁది దినములకే వింటిమి. ఆరోగు లెటులు బ్రతికిరో మా కా మారి యేల తగులలేదో యెవరు చెప్పఁగలరు? దీనివలన మృచ్చికిత్స యెడల నాకు నమ్మిక ప్రబలెను. మరియు బ్రాంది మందునకుఁగూడ గొఱగాదు అని బ్రాందిపై అశ్రద్ధ ప్రబలెను. కాని నా యీ శ్రద్ధాశ్రద్ధలు నిరాధారము లనవచ్చునని నాకుఁ దెలియును. కాని ఆరోజులలో ఈ రెండు విషయములను నామానసమున హత్తుకొనిపోయి నేఁటివఱకు ఆరీతిగనే నిలిచియుండెను గాన నిది యుదాహర్తవ్యమాయెను.<noinclude><references/>
{{c|66}}</noinclude>
65u0dvaffncwrahwi6gpbxnt3vfp7m2
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/79
104
218520
571166
2026-08-23T13:17:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571166
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||16 మహామారి - 2}}</noinclude>ఈమహామారి బయలువెడలఁగనే మునిసిపాలిటీవారు లొకేషనును స్వాధీనముచేసికొనినపిదప దానియెడ ఔదాసీన్యము వహించుటను గూర్చియు, వచ్చిన మహామారికి మునిసిపాలిటీవారే పూఁటకాపులనియు పత్రికలో కఱకుగా వ్రాసితిని. ఈవ్రాఁతవలన మి. హెన్రీపోలకు గారును నేఁడు స్వర్గీయులగు మి. జోసెఫ్ డోక్ గారును<ref>వీరి విషయమున Partly Responsble అని ఆంగ్లప్రతి - అను.</ref> మిత్రు లయిపోయిరి.
నే నొకనిరామిషభోజనాలయమున భుజించుటకు వెళ్లుచుంటి నని వెనుకటి ప్రకరణమున చెప్పితిని. అచట నాకు మి. ఆల్‌బర్టు వెస్టుగారితో కలయిక కలిగెను. మే మిరువురమును గలిసి భోజనాలయమున కరుగుచుంటిమి. భుజించిన పిదప నిరువురమును కలిసియే షికారు వెళ్లుచుంటిమి. మి. వెస్టు ఒక చిన్న అచ్చుకూటముని భాగస్వామి. మారినిగుఱించి నా వ్రాసిన లేఖ నతఁడు చదివెను. నేనిపుడు
భోజనాలయమున కానిపింపమిచే ఆదుర్దాపడెను.
నేనును, నాసహచరులును ప్లేగురోజులలో ఆహారమును తగ్గించితిమి. మరియు నీయంటు తెగులు ప్రకోపించియున్నంతవఱకు పొట్టను ఎంత తేలికగా నుంచుకొనిన అంత మేలని చాలకాలమువఱకు ఆ నియమముననుసరించితిమి. దీనివలన నేను రాత్రి తినుట మానితిని. మరియు నితరులకు నావలన భయము కలుగకుండుటకు ఎవ్వరును రాకముందే నామధాహ్నభోజనమును ముగించుకొని పోవుచుంటిని. ఆ భోజనాలయపు యజమానితో నాకు చాల పరిచయము. 'నే నీ ప్లేగురోజులలో రోగులకు పరిచర్య చేయుచుంటిని గాన ఇతరులకు నాస్పర్శతగుల కుండ చూచుకొందు'నని అతనికి చెప్పియుంచితిని.<noinclude><references/>
{{c|67}}</noinclude>
gewkr68fcl88h8c8nxeavuw03fyf5hs
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/80
104
218521
571167
2026-08-23T13:28:27Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571167
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>భోజనాలయమున నన్నుఁ గానక మి. వెస్టు రెండవనాటి ప్రొద్దుననో, మూడవనాఁటిప్రొద్దుననో నాతలుపు తట్టెను. నేనును బయటికి వచ్చుటకు సంసిద్ధుఁడ నయియుంటిని. ఇంతలో నితఁడువచ్చి నాగదితలుపు కటకట లాడించెను. తలుపు తీయఁగనే 'మీరు నాకు భోజనాయలమున కానిపింపమిచే మీకును ప్లేగు సోఁకెనేమో యని బేజారయితిని. ఈసమయమున వచ్చుచో తప్పక మీరు దొరుకుదురని ఇపుడు వచ్చితిని. నావలన నేమియేని పని కావలయుచో తప్పక చెప్పుఁడు. నేను రోగులకు పరిచర్యచేయుటకుఁ గూడ సంసిద్ధుఁడను. నాపొట్ట నే నిండించుకొనుటదక్క ఇతరుల పొట్టలను నిండింపవలసిన పని నాకు లేదని మీరెఱుఁగనే యెఱుఁగుదు' రని అతఁ డనెను.
మి. వెస్టు ఇందులకు నాకు మాన్యుఁడు. ఒక నిముసమేని ఆలోచించినటులు గుఱుతు చాలదు. ఇటు లంటిని:
'మిమ్ములను నేను నర్సుగా తీసికొనను. ఇఁక కొత్తలు లేనిచో మాపని ఒకటి రెండు రోజులలో తీరిపోవును. కాని మీవలన ఒకపని కావలసియున్నది. అది యేమి?'
'తాము డరబను దయచేసి ఇండియన్ ఒపినియనును చేతఁ దీసికొనవలయును. మదనజిత్తుగారి కింకను ఇచట పనిగలదు. మీరచటికి వెళ్లినచో అచటి పనులయెడల నా చింత తీరిపోవును.
'నా యధీనమున నొక ముద్రాలయము కలదని మీ రెఱుఁగుదుర. పలువిధముల నే నచటికి వెళ్లఁగలనుగాని ఏసంగతియు ఆలోచించి మాపటివేళ చెప్పుదు నన్నచో నీలోపుగా చిక్కేమియు లేదు కద? మాపటి షికారువేళ దీనిగుఱించి మాటలాడుకొందము' అని మి. వెస్టు జవా బిచ్చెను.<noinclude><references/>
{{c|68}}</noinclude>
2hwhe4l6zuxbwoc226zj3f75vyme5n3
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/81
104
218522
571168
2026-08-23T13:35:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571168
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||16 మహామారి - 2}}</noinclude>నేనును వల్లె యంటిని. నాఁటి మాపటింతల మాటయు, మంతియు నాయెను. నెలకు పదిపౌనుల జీతమును లాభమున కొంతపాలును ఇచ్చునటులు మాటలాడితిని. జీతముకొఱకు వెస్టుగారచటికి పోవఁ
గూర్చుండలేదు. జీతముగొను నుద్దేశమే వారికిలేదు. వారికి రావలసిన బాకీలు సాకీలు నా కప్పగించి ఆమఱునాఁటి రాత్రి మెయిలులో వెస్టుగారు డరబనుకు రవాణా అయిరి. నాఁటిమొదలు నేను దక్షిణ-
ఆఫ్రికాను విడనాడువఱకు అతఁడు నా సుఖదుఃఖములకు తోడాయెను. సీమలో లౌత్ అను నొక గ్రామమున మి. వెస్టు జన్మించెను. అతఁ డొక రైతు బిడ్డ. పాఠశాలలో సామాన్య విద్యను నేర్చెను. తన సొంత పూనికచే అనుభవపాఠశాలలో చదివి విజ్ఞుఁడును, శుద్ధుఁడును, సంయమియు, ఈశ్వరభీరువును, ధీరుఁడును పరోపకారియు ఆయెను. ముందరి ప్రకరణములలో నితనిని, ఇతని కుటుంబమును గుఱించియు వ్రాయుటకు బాకీ యున్నది.<noinclude><references/>
{{c|69}}</noinclude>
hne4kvmix5o6k6vf5ndbjnno7pviky8
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/82
104
218523
571169
2026-08-23T13:47:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571169
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}17</p>
{{p|fs125}}లొకేషనును తగులఁబెట్టుట</p>
{{Largeinitial|ఈ}}రోగుల యుపచారమునుండి నాకును నాతోడివారలకును విముక్తి కలిగినను మారెమ్మ పనులు కొన్ని మానెత్తిపయిఁ బడెను.
లొకేషను విషయమున మునిసిపాలిటీవారికి కడు నశ్రద్ధయే యయినను తెల్లవారల మనికిపట్ల యెడల ఇరువది నాలుగు గంటలును జాగరూకతయే యుండెను. వారి యారోగ్యమును కాపాడుటకు రూపాయలు తక్కువ వెదఁజల్లబడలేదు. వారుండు తావులందు ప్లేగు చొఱకుండుటకుఁగాను నీళ్ల వలె రూపాయలు ప్రవహింపఁజేయబడెను. భారతీయుల యెడల మునిసిపాలిటీ కడు లోటుచేసెను. అయినను తెల్లవారియెడల వారు చూపిన శ్రద్ధయెడల నే నాదరము చూపియుండఁజాలకపోతిని. వీరి యీ శుభప్రయత్నములకు నాచేత నయినంత సాయమును నేనును చేసితిని. నేను సాయ మొనరింపకయే యుండినచో మునిసిపాలిటికి ఇబ్బంది కలిగెడిది. ఇంతియకాక తుపాకులు పేల్చి బలము నుపయోగింపవలసి వచ్చెడిది. తమయిష్టము నెఱవేఱుటకు వా రిట్టి పనులలో వెనుకాడెడివారు కారనుకొందును.
కాని అట్టిది తొలఁగెను. నాఁటి భారతీయుల ప్రవర్తనకు మునిసిపాలిటీ అధికారి సంతుష్టుఁ డాయెను. ఆ పిదప పనులు తేలిక ఆయెను. మునిసిపాలిటీవారు చెప్పిన చొప్పున హిందూస్తానీయులను<noinclude><references/>
{{c|70}}</noinclude>
dvn3uawz7dioka4ir5b0hyk94b2mnqa
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/83
104
218524
571171
2026-08-23T13:59:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571171
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||17 లొకేషనును తగులఁబెట్టుట}}</noinclude>నడిపించుటలో నాపలుకుబడి నంతయును ధారపోసితిని. ఇది భారతీయులకు చాల దుష్కర మయినను ఒకరైనను నామాట టలాయించి నటులు గుర్తు లేదు.
లొకేషనుకు నలుదెసలను పహరా పెట్టిరి. ఆజ్ఞ లేకుండ లోపలికి పోవుటకుఁ గాని, బయటికి వచ్చుటకుఁ గాని వీలు లేదు. నాకును, నా సహచరులకును మాత్రము సెలవుచీటి కలదు. జొహాన్సుబర్గుకు పదమూడుమైళ్ల దూరమున నున్న మైదానమున వేసిన డేరాలలో ఈ లొకేషనులోనివారి నందఱను ఉంచి ఆ లొకేషనును తగులఁబెట్టవలయునని మునిసిపాలిటీవారు తలఁచిరి. డేరాలతో నొకక్రొత్తగ్రామము నిర్మించుటకును అచట తినుబండము లన్నియు సమకూర్చుటకును కొంతకాలము పట్టుట స్వాభావికము. అంతవట్టును ఇచట పారా పెట్టిరి.
వీరు చాల గాబరాపడిరి. నేను వారిపట్టున నుండుటచే ఊఱట గొనిరి. వారిలో పలువురు నిఱుపేదలు తాము కూడఁబెట్టుకొనిన ధనమును ఇండ్లలో పాఁతిపెట్టుకొనిరి. దానిని పెల్లగించి ఒకచోటున దాఁచికొనవలయును. వారికి బాంకు లేదు. వారు బాంకు అనుమాటయు నెఱుఁగరు. నేనే వారికి బాంకు. నాయిల్లు రూకలతో నిండిపోయెను. అట్టితఱి నేను నా చేసిన దొడ్డపనికి వీరికడ ఏమయినను తీసికొనవచ్చునా ? ఎటులో ఆయాపద గడఁపితిని. బాంకు మానేజరుకును నాకును గాఢ పరిచయము కలదు. ఈ డబ్బంతయు బాంకులో జమ కట్టింపఁ గోరితిని. రాగి నాణెములను వెండి నాణెములను పుచ్చుకొనుటకు బాంకువా రిష్టపడరు. మరియు మారిమసఁగిన చోటులనుండి వచ్చిన నాణెములను గుమాస్తాలు ముట్టుకొన నొల్లక పోవచ్చును. కాని బాంకుమేనేజరు సమస్త సదుపాయములను జేసెను. పురుగుల జంపు
ద్రావకములో ఈ నాణెములను కడిగించి పట్టుకొనిరండు అని<noinclude><references/>
{{c|71}}</noinclude>
jnckisu3kyellh2k8d59zx572gi6b73
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/84
104
218525
571172
2026-08-23T14:10:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571172
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>చెప్పెను. ఈ రీతిగా 60000 పౌనులు బాంకులో కట్టినటులు గుఱుతు. ఎక్కువ డబ్బు కలవారికి ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేయుఁడని సలహా ఇచ్చితిని. ఈ రీతిగను పెక్కుడిపాజిట్లు కట్టుకొనఁబడెను. దీనికి ఫలముగా చాలమందికి బాంకులలో ధనము దాఁచికొన నభ్యాసము కలిగెను. ఈ లొకేషనులోనివారి నందఱను జొహాన్సుబర్గుకు సమీపమున నున్న క్లిప్ స్ప్రుట్ ఫారమునకు స్పెషల్ రయిలుమీఁద తీసికొనిపోయిరి. అచట మునిసిపాలిటీవారు తమ సొంతఖర్చుతో వారికి కావలసిన సదుపాయముల నన్నిఁటిని సమమార్చిరి. ఈ డేరాలబారు సేనాశిబిరమువలె నుండెను. వీరికి ఆకాశముక్రింద ఆడేరాలలో నుండు నలవాటు లేమి కొంచెము చిక్కుగనే యుండెను, కొంచెము కొత్త చేసెను, కాని వారి కచట నెట్టి యిబ్బందియు కలుగలేదు. నేను నిత్యమును సైకిలుమీఁద వెళ్లి వచ్చుచుంటిని. ముయ్యేడునాళ్ల వఱకు ఈరీతిగా మంచిగాలిలో నుండుటవలన వారి యారోగ్యము చక్కఁబడెను. మొదటి ఇరువదినాలుగుగంటలు గడఁచుసరికి క్రొత్తయు గిత్తయు ఎగిరిపోయెను. మరల నానందమున నోలలాడఁగడఁగిరి. నే నచటికి వెళ్లినపుడెల్ల వారి భజనకీర్తనలును ఆటపాటలను జూచుచునే యుంటిని.
లొకేషను ఖాళీ చేయించిననాఁడో, ఆమఱునాఁడో దానికి నిప్పంటించిరి. మునిసిపాలిటీవా రం దొకవస్తువునేని తీసికొన లోభపడ లేదు. ఈ దినములలోనే, ఈ కారణముచేతనే మునిసిపాలిటీవారు మార్కెటులో నున్న కలప నంతయుఁ తగులఁ బెట్టించి పదివేలపౌనుల నష్టమును భరించిరి. మార్కెటులో చచ్చిన యెలుకలు కానిపించుటచే మునిసిపాలిటీవా రీసాహసమునకు దిగిరి. మిక్కిలి వ్యయమాయెను గాని దీనికి ఫలముగా మారి వ్యాపింపలేదు. నగరము నిర్భయ మాయెను.<noinclude><references/>
{{c|72}}</noinclude>
ikkebilvld6yae91s7unsawmc3tamyc
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/85
104
218526
571174
2026-08-23T14:20:05Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571174
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}18</p>
{{p|fs125}}ఒక - గ్రంథప్రభావము</p>
{{Largeinitial|ఈ}} మారిమూలమున దిక్కు లేని భారతీయులయందు నా పలుకుబడియు, నా వకాలతును, నా పూచీయును చాల హెచ్చెను. మరియు తెల్లవారలతో నాకుఁగల పరిచయ మినుమడించెను. దానఁజేసియు నా నైతిక మయిన జవాబుదారి హెచ్చఁదొడఁగెను.
భోజనాలయమున వెస్టుగారు పరిచితు లయినటులే పోలకుగారును నాకు పరిచితు లయిరి. ఒకనాఁడు నా భుజించు మేజాబల్లకు దూరముగా నున్న మఱియొక మేజాబల్లకడ నొక క్రొత్త పిన్నవాఁడు భుజించుచుండెను. అతఁడు నాతో మాటలాడఁగోరి తన పేరు వ్రాసి నా కొకచీటి నంపెను. నేను నా బల్లకడకు రమ్మంటిని, అతఁడు వచ్చెను.
'నేను క్రిటిక్ పత్రికకు ఉపసంపాదకుఁడను. మీరు ప్లేగును గూర్చి వ్రాసిన వ్యాసము చూచితిని. మి మ్మెపుడు చూతునా అని అనుకొనుచుంటిని. ఇపుడు చూడఁగలిగితిని' అని అతఁ డనెను.
పోలకుగారి నిష్కాపట్యము న న్నాకర్షించెను. ఆ రాత్రియే మా యిరువురికిని పరిచయము కలిగెను. జీవితమునకు సంబంధించిన మా పరస్పర భావములకును పోలిక యున్నటులు కానిపించెను. నిరాడంబర జీవితము అతని కిష్టము. ఏమాటయేని తనమదికి లెస్సయని తోఁచుచో దానిని వెంటనే అనుష్ఠానమునఁ బెట్టుకొను నతనిశక్తి<noinclude><references/>
{{c|73}}</noinclude>
e4gacy08a7xg4wky17mivbvfnxbdash
వాడుకరి చర్చ:LINGAM AMANJANEYULU
3
218527
571175
2026-08-23T14:21:44Z
శ్రీరామమూర్తి
1517
[[WP:AES|←]]Created page with '{{Subst:స్వాగతం}}'
571175
wikitext
text/x-wiki
== స్వాగతం ==
<div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;">
<div class="center"><span style="font-size:large; color:black;">{{PAGENAME}} గారు, తెలుగు వికీసోర్స్ కు <span style="color:white;">స్వాగతం!</span>! [[దస్త్రం:Wikisource-logo.svg|40px]]</span></div></div>
<div style="align: left; padding: 1em; border: solid 2px Orange; background-color: white;">
{{PAGENAME}} గారు, [[w:వికీసోర్స్|తెలుగు వికీసోర్స్]] కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.
*ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ [[సహాయము:Contents|సహాయ పేజీలు]] చూడండి.(ముఖ్యంగా [[సహాయం:గ్రంథాలను చేర్చటం|గ్రంథాలను చేర్చటం]] మరియు [[Wikisource:శైలి మార్గదర్శిని|వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని]] కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను [[Wikisource:రచ్చబండ|రచ్చబండ]]లో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా [[Wikisource:సముదాయ పందిరి|సముదాయ పందిరి]]లో ఉన్నది.
* తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [[w:వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం|తెలుగులో రచనలు చెయ్యడం]] మరియు [[w:వికీపీడియా:టైపింగు సహాయం|టైపింగు సహాయం]] మరియు [[w:కీ బోర్డు|కీ బోర్డు]] చదవండి.
* దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
* వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikisource.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit§ion=new&preload=template:helpme-preload&preloadtitle=సందేహం ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
* తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే [http://groups.google.com/group/teluguwiki తెవికీ గూగుల్ గుంపు]లో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే [http://www.facebook.com/pages/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80/319640018072022 తెవికీ సముదాయ పేజీ] ఇష్టపడండి.
* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు [[వికీసోర్స్:అభిప్రాయాలు| ఇక్కడ]] వ్రాయండి
తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]] [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 14:21, 23 ఆగస్టు 2026 (UTC)
</div>
725njizcvnabmy80egp4w3lvftgh248
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/86
104
218528
571176
2026-08-23T15:11:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571176
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>చాల ఆశ్చర్యకరము. అతఁడు తన జీవితమునందు పెక్కులు మార్పు లొక చిటికలోఁ జేసికొనెను.
ఇండియన్ ఒపీనియన్ పత్రికకు వ్యయము చాలఁ బెరుఁగుచుండెను. వెస్టుగా రంపిన మొదటి రిపోర్టు చూడఁగా భయ మాయెను. 'ఈ పనిలో మీరు చెప్పినంత లాభము కానిపింపదు. పైఁగా నష్టము వచ్చు ననిపించుచున్నది. లెక్కలు-డొక్కలు సరిగా లేవు. బాకీలు బోలెఁడు; వానికిని తలయుఁ దోఁకయు లేవు. కడు సవరింపవలసి యున్నది. కాని ఈ రిపోర్టువలన మీరు గాబరా పడకుఁడు. నా శక్తికొలఁది సర్దుబాటు చేసెదను. లాభము రాదని ఈ పనిని విడనాడను' అని వెస్టుగారు వ్రాసిరి.
లాభము రాదని తెలియఁగనే వెస్టుగా రాపనిని మానుకొనవచ్చును. దాన నే నాతనిపై నిసుమంతయును నేరమును మోపలేక పోవుదును. పైఁగా నాతఁడే నాపై నేరము మోపవలసి యుండును. ఏలన తిన్నగా విచారింపక లాభము రాఁగలదని చెప్పి నేనే దోషభాగి నయతిని. ఇటులయినను ఇతఁ డెన్నఁడును పెదవినెత్తలేదు. ఎవ రేమాట చెప్పినను ఆమాటను నమ్ము వెట్టివానిగా నన్ను వెస్టుగారు పరిగణింతు రనుకొంటిని. మదనజిత్తుగారి అంచనాను నమ్మి లాభము రాఁగలదని వెస్టుగారికి మాట యిచ్చితిని. ప్రజాసేవకుఁ డెవఁడేని స్వయముగా చూచుకొనక ఇతరులమాట నమ్మరాదు. సత్యారాధకునకు చాల మెలకువ ఉండవలయును. తాను తిన్నగా తెలిసికొనక మఱి యొకని నమ్మించుట సత్యమునకు డాగు. ఇది యంతయు తెలిసియు వెంటనే నమ్మి పనిచేయు నా ప్రకృతిని తిన్నగా మార్చుకొనజాలక పోవుచున్నానని చెప్పుచు వగచుచున్నాను. శక్తికి మించిన<noinclude><references/>
{{c|74}}</noinclude>
fzr45iiyr7x5dq51ghnn5x2bljeq7e0
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/87
104
218529
571177
2026-08-23T15:22:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571177
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||18 ఒక-గ్రంథప్రభావము}}</noinclude>పనిని నెత్తిని బెట్టుకొనులోభము దీనికి కారణము. ఈ లోభమువలన నేనును నాకంటె నాతోడివారలును ఎక్కువ వగచిరి.
వెస్టుగారి ఉత్తరము రాఁగనే నేటాలుకు బయలుదేఱితిని. పోలకుగారి కీసంగతి యంతయుఁ దెలిపితిని. అతఁడు నన్ను వీడ్కొల్పుటకు స్టేషనుకడకు వచ్చి రస్కిన్-రచిత మగు 'అన్ టు ది లాస్ట్' అను గ్రంథమును నాచేతఁ బెట్టి 'ఈ గ్రంథము ప్రయాణములో చదువుటకు బాగుండును, మీకుఁ జాల రుచించును. అని
చెప్పెను.
పుస్తకము విప్పితిని, మూయఁజాలకపోతిని. అది నా మనస్సును ఆకర్షించెను. జొహాన్సుబర్గునుండి నేటాలుకు 24 గంటల ప్రయాణము. రైలు రాత్రికి డరబను చేరెను. ఆరాత్రి నాకు నిదురపట్టలేదు. ఆ గ్రంథములోని పద్ధతుల ప్రకారము నాజీవితమును ద్రిప్పికొను ఏర్పాటు చేసికొంటిని.
ఇంతకుముందు నేను రస్కిను వ్రాసిన పుస్తక మొక్కఁడేని చదువలేదు. విద్యార్థిదశలో బడిపుస్తకములు తక్క వేఱు పుస్తకముల నే నెఱుఁగను. కర్మభూమిలో కాలుపెట్టిన పిదప నాకు తీరికయే లేదు. కావున నేఁటివఱకు నాకుఁగల పుస్తకజ్ఞాన మత్యల్పము. అనాయాసముగాఁ గాని, బలపూర్వకముగాఁ గాని జరిగిన యీసంయమము వలన నా కెట్టి లోటును కలిగిన దనుకొనను. నా చదివిన కొలఁది పుస్తకములను నేను చక్కగా జీర్ణము చేసికొంటి ననఁగలను. నా చదివిన కొలఁది గ్రంథములలో నా జీవితమును క్రియాపూర్వకముగా
మార్పు చేయించిన దీ గ్రంథమే. పిదప దీనిని నేను గుజరాతీలోనికి అనువదించి 'సర్వోదయ' మను పేరున ప్రకటించితిని.<noinclude><references/>
{{c|75}}</noinclude>
p58udv15txv8e6vio9ywk7vyoijqgbe
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/88
104
218530
571183
2026-08-23T22:35:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571183
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>నా లోపల నేవస్తువు లుండెనో వాని ప్రతిబింబములు ఈ రస్కినుగ్రంథరత్నములోఁ గానఁబడుటచే నది నన్ను వశపఱిచికొని తనప్రకారము నన్ను నడిపించెనని నా నమ్మకము. మనలోపల నున్న భావనలను మేలుకొలుపఁ గల శక్తి కలవాఁడే కవి. కవు లందఱ ప్రభావము అందఱపైనిని ఒకరీతిగా నుండదు. ఏలయనఁగా అందఱ
భావనలును ఒకరీతిగా నుండవు.
సర్వోదయసిద్ధాంతములు నాకు ఇటు లర్థమాయెను.
1. అందఱమేలులో తనమేలు.
2. వకీలుపనికిని, మంగలవానిపనికిని వెల సమానమే. ఏలనఁగా బ్రతుకుతెఱఁ గిరువురకు నొకటియే.
3. కూలివాని జీవనమును, కర్షకుని జీవనమును సత్యజీవనములు.
మొదటి సిద్ధాంతము నే నెఱుఁగుదును. రెండవదానిని కొంచెముగా నెఱుఁగుదును. మూడవది ఇంతవట్టునా కచుంబితము. రెండవ మూడవ సిద్ధాంతములలోని విషయములు మొదటి సిద్ధాంతములో అంతర్గతములని సర్వోదయము వలననే తేటపడును. తెల్లవారుట తోడనే వీని ననుసరించి నా జీవితమును మలచుకొనఁ బ్రయత్నము చేసితిని.<noinclude><references/>
{{c|76}}</noinclude>
osvuen0u0xgcfsyaodwpbpbhsttz033
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/89
104
218531
571184
2026-08-23T22:44:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571184
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}19</p>
{{p|fs125}}ఫినిక్సు—స్థాపన</p>
{{Largeinitial|తె}}లవాఱుటతోడనే ముమ్మొదట వెస్టుగారి కీసంగతి చెప్పితిని. సర్వోదయప్రభావము న న్నెటులు మార్చినదియు తెలిపితిని. ఇండియన్ ఒపినియన్ పత్రిక నొక పొలమునకు మార్చి అచట మన
సహచరుల మందఱమును నివసించి జీవికకు మాత్రము ధనము గొని సేద్యము చేసికొనుచు తీరికలో ఇండియన్ ఒపినియన్ పనిచేయుదమని నా యభిప్రాయ మెఱిఁగించితిని. వెస్టుగారి కిది బాగుండెను.
ప్రతిమనుష్యునకును భోజనవ్యయమునకుఁగాను తక్కువలో తక్కువగా మూడుపౌను లని నిర్ణయించితిమి. ఇందు నలుపు తెలుపు భేదము లేదు.
కాని అచ్చుపనివారు పది పదియేవురు కలరు. కాని అడవిలో నుండుట వీ రందఱకును సమ్మత మగునా యని ఒక సంశయము. భోజనవ్యయము మాత్రమే పుచ్చికొని నివసింతురాయని మఱియొక సంశయము. కాని, ఎవ రి ట్లుండఁజాలరో వారు మామూలు జీతములనే గొనుచు నివసింపవచ్చు ననియు, వీరును పిదప పిదప నీయాదర్శమునకు వచ్చి ఆశ్రమమునందు ఉండిపోవలయు ననియు మే మిరువురమును ఆలోచించి తేల్చితిమ.
పనివాం డ్రందఱతో ఈ సంగతి ముచ్చటించితిని. మదనజిత్తుగా రిష్టపడ రైరి. 'ఇది వట్టి తెలివిమాలిన పని. సర్వస్వమును ధారపోసిన యీకార్యము మట్టిలో కలిసిపోవును. మరియు ఇండియన్<noinclude><references/>
{{c|77}}</noinclude>
ch2az9jy13yihdr9hjwq1sgh7smoqq0
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/90
104
218532
571187
2026-08-23T22:55:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571187
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>ఒపినియన్ పడిపోవును. ప్రెస్సుకూడ మూలఁబడును. పనివా రందఱు పాఱిపోదురు' అని వారికి భయమెత్తెను.
మా యన్న కుమారుఁడు ఛగన్‌లాల్ గాంధి ఈ ప్రెస్సులో పని చేయుచుండెను. వెస్టుగారికిఁ జెప్పునపు డితనికిని జెప్పితిని. ఇతనికి సంసారభారము కలదు. చిన్ననాఁటనుండియు నితనికి నాకడఁ బనిచేయు చుండుటయే ఇష్టము. నాపై నతనికి దొడ్డ విశ్వాసము. కావున నితఁడు మాఱుమాట లేక వల్లె యని నాఁటనుండియు నా తోడనే యుండిపోయెను.
మూడవవాఁడు గోవిందస్వామి. ఇతఁడు ముద్రాయంత్రమును నడుపువాఁడు. ఇతఁడును ఇయ్యకొనెను. తక్కినవా రొప్పుకొనలేదు గాని ముద్రాయంత్రము తోపాటు వత్తు మనిరి.
ఇటులు పనివారలతో మాటలాడుటకు రెణ్ణాళ్లకంటె నెక్కుడు పట్టినటులు లేదు. 'డరబను సమీపమున స్టేషనుకు దగ్గఱగా నొక స్థలము కావలసి యున్నది' అను నొక ప్రకటనను వెంటనే పత్రికలో ప్రకటించితిని. ఫినిక్సులో స్థలము కలదని తెలియవచ్చెను. వెస్టుగారును నేనును చూడఁబోయి ఏడురోజులలో ఇరువది యెకరములు కొంటిమి. అం దొక చిన్న నీటిబుగ్గ కలదు. కొన్ని మావులును, నారింజలును గలవు. దానికి అంటుకొని మఱియొక అరువది ఎకరముల భూఖండమున్నది. అందు ఫలవృక్షము లెక్కుడు. ఒక ప్రాఁతయిల్లుకూడ నందున్నది. కొంతకాల మయిన పిదప దానినిఁగూడఁ గొంటిమి. ఈ రెండు తునకలును గలిసి వేయి పౌనులు.
ఇట్టి సాహసకార్యములలో సేఠ్ పారసీ రుస్తుంజీగారు నాకుతోడు. నాయీపని యతనికి నచ్చెను. ఇతఁడు తనగిడ్డంగులమీఁది<noinclude><references/>
{{c|78}}</noinclude>
nru57omtynw3f4w9h6o08owbgmbqpst
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/91
104
218533
571188
2026-08-23T23:10:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571188
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||19 ఫినిక్సు-స్థాపన}}</noinclude>టిన్ రేకులు మొదలగువానిని ఇచ్చెను. బోయరుయుద్ధమున నాతోఁ బనిచేసిన కొందఱు వడ్రంగులును, తాపీపనివారును నాకు సహాయులై కారఖానాపెట్టిరి. ఒకనెలలో ముద్రాలయము తయారాయెను. దానిపొడవు 75 అడుగులు వెడలుపు 50 అడుగులు. వెస్టుమొదలగువారు తామును కష్టించి వడ్రంగులతోపాటు ఉండిరి.
ఫినిక్సులో గడ్డిఎక్కువ, ఆబాతు తిన్నగాలేదు. ఇందు పాములు మొదలగువాని ఉపద్రవము కలదు; భయమును కలదు. మొదట మేము డేరాలువేసికొని ఉండఁదొడఁగితిమి.
ముఖ్యకార్యాలయము పూర్తికాగానే ఒకయేడురోజులలో సామానులను గాడీలమీఁద వేసి ఫినిక్సుకు పోయితిమి. అది డరబనుకు 13 మైళ్లు; స్టేషనుకు 24 మైళ్లు. ఇటులు స్థలమును మార్చుటవలన ఇండియన్ ఒపీనియన్ పత్రిక ఒకతూరి మెర్కురీ ప్రెస్సులో ముద్రణ చేయింపవలసినచ్చెను.
ధనార్జనమునకు నాతోఁగూడ ఇండియానుండి వచ్చి యాయా యీవ్యాపారములలోనున్న నాబంధు మిత్రులను ఫినిక్సులో చొప్పించుటకు ప్రయత్నింప దొరకొంటిని. వా రందఱును ధనము నార్జింపఁగోరి దక్షిణ-ఆఫ్రికాకు వచ్చిరి. వీరికి నచ్చఁ జెప్పి తీసికొనివచ్చుట కడుఁ గష్టపుఁబని; కాని కొందఱకు నామాట ఇష్టమాయెను. ఇట్టి
వారిలో మగనలాల గాంధీ పేరు ఏఱి తీసికొందును. ఏలన: మిగిలినవారు కొలఁదిమాత్రమే ఫినిక్సుననుండి మరల ద్రవ్యసంచయమునకు లేచిపోయిరి. మగనలాలగాంధీమాత్రము తన పనులు విడిచి నాకడకు వచ్చెను. నేఁటివఱకు నాకడనే యుండెను. మరియు తనబుద్ధిబలమున త్యాగశక్తివలన, అనన్యభక్తివలన నా ఆంతరికపరీక్షలలో<noinclude><references/>
{{79}}</noinclude>
o0uzxkhlvjodwp3q7k1nl0rqqoo9v1y
571189
571188
2026-08-23T23:10:44Z
శ్రీరామమూర్తి
1517
571189
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||19 ఫినిక్సు-స్థాపన}}</noinclude>టిన్ రేకులు మొదలగువానిని ఇచ్చెను. బోయరుయుద్ధమున నాతోఁ బనిచేసిన కొందఱు వడ్రంగులును, తాపీపనివారును నాకు సహాయులై కారఖానాపెట్టిరి. ఒకనెలలో ముద్రాలయము తయారాయెను. దానిపొడవు 75 అడుగులు వెడలుపు 50 అడుగులు. వెస్టుమొదలగువారు తామును కష్టించి వడ్రంగులతోపాటు ఉండిరి.
ఫినిక్సులో గడ్డిఎక్కువ, ఆబాతు తిన్నగాలేదు. ఇందు పాములు మొదలగువాని ఉపద్రవము కలదు; భయమును కలదు. మొదట మేము డేరాలువేసికొని ఉండఁదొడఁగితిమి.
ముఖ్యకార్యాలయము పూర్తికాగానే ఒకయేడురోజులలో సామానులను గాడీలమీఁద వేసి ఫినిక్సుకు పోయితిమి. అది డరబనుకు 13 మైళ్లు; స్టేషనుకు 24 మైళ్లు. ఇటులు స్థలమును మార్చుటవలన ఇండియన్ ఒపీనియన్ పత్రిక ఒకతూరి మెర్కురీ ప్రెస్సులో ముద్రణ చేయింపవలసినచ్చెను.
ధనార్జనమునకు నాతోఁగూడ ఇండియానుండి వచ్చి యాయా యీవ్యాపారములలోనున్న నాబంధు మిత్రులను ఫినిక్సులో చొప్పించుటకు ప్రయత్నింప దొరకొంటిని. వా రందఱును ధనము నార్జింపఁగోరి దక్షిణ-ఆఫ్రికాకు వచ్చిరి. వీరికి నచ్చఁ జెప్పి తీసికొనివచ్చుట కడుఁ గష్టపుఁబని; కాని కొందఱకు నామాట ఇష్టమాయెను. ఇట్టి
వారిలో మగనలాల గాంధీ పేరు ఏఱి తీసికొందును. ఏలన: మిగిలినవారు కొలఁదిమాత్రమే ఫినిక్సుననుండి మరల ద్రవ్యసంచయమునకు లేచిపోయిరి. మగనలాలగాంధీమాత్రము తన పనులు విడిచి నాకడకు వచ్చెను. నేఁటివఱకు నాకడనే యుండెను. మరియు తనబుద్ధిబలమున త్యాగశక్తివలన, అనన్యభక్తివలన నా ఆంతరికపరీక్షలలో<noinclude><references/>
{{c|79}}</noinclude>
c6fk4qcdmvnilahj34hz8czxf7omm7m
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/92
104
218534
571190
2026-08-23T23:15:16Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571190
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>నాకు సహచరుఁడై యుండెను. నామూలసహచరులలో అందఱకన్న నితని స్థానము మొదట. స్వయంశిక్షుతులగు శిల్పులలోఁగూడ నా యుద్దేశమున నితఁ డద్వితీయుఁడు.
ఈరీతిగా 1904 సంవత్సరమున ఫినిక్సు నెలకొల్పఁబడెను. మరియు విఘ్నములు కష్టములు వచ్చుచున్నను ఫీనిక్సు-సంస్థయు, ఇండియన్ ఒపినియన్ పత్రికయు నేఁటికిని నడచుచున్నవి. కాని ఈసంస్థ నారంభించిననాఁటి కష్టములు, అప్పటి ఆశలు ఆశాభంగములును వినఁదగినవి. పయి ప్రకరణమున ఆవిషయమునుగూర్చి ముచ్చటింతును.<noinclude><references/>
{{c|80}}</noinclude>
333ju3mt80shmaye7r797t0li7nbs25
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/93
104
218535
571200
2026-08-24T09:22:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571200
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}20</p>
{{p|fs125}}తొలిరేయి</p>
{{Largeinitial|ఫి}}నిక్సునందు ఇండియన్ ఒపినియన్ యొక్క మొదటి అంకమును ముద్రించి పంపుట సులభము కాలేదు. రెండు విషయములలో నేను జాగ్రత్త వహింపనిచో ప్రధమసంచిక ఒకవార
మాఁపవలసివచ్చెడిదో లేక కొంచె మాలస్యమయ్యెడిదో. ఈసంస్థయందు ఎంజినుతో నడుపఁదగు యంత్రములు మొదలగువాని నుంచుట నాకు అంతగా ఇష్టముకాదు. మనము హాలికులమై చేతిపనినే కోరుకొనినపుడు చేతితో నడపఁదగిన పనిముట్టులనే పెట్టుకొనవలయు నని నాయూహ. కాని అపుడది సాగునటులు తోఁపలేదు. కాఁగా ఆయిల్ ఎంజినును పెట్టితిమి. కాని ఎపుడేని ఈ నూనెమర ఆడకుండినచో అపుడు పని జరుగుట కొకచేతిమరనుగూడ పెట్టుట మేలని వెస్టుగారికి చెప్పితిని. వెస్టుగారు నామాట విని చేతితో త్రిప్పఁదగు
చక్రము నొకటిగూడ నేర్పాటు చేసిరి. ఇండియన్ ఒపినియన్ పత్రికయొక్క ఆకారము దైనికపత్రికవలె పొడవును వెడల్పును. పెద్దమర ఆఁగిపోవుచో ఇంత పెద్ద ఆకారముగల పత్రికను వెంటనే అచ్చొత్తింప వీలుండదు. కావున పత్రిక అపుడపు డాఁగిపోవచ్చును. ఈ చిక్కును తొలఁగించుటకు, చిన్న పన్నాతో చిన్నమరవిూఁద నడపుటకు వీలుగా పత్రికఆకారమును తగ్గించితిమి.
ఆరంభకాలమునందు ఇండియన్ ఒపినియన్ పత్రికను ప్రకటించునాఁటి ముందురాత్రి మాకందఱకును జాగరణము చేయవలసి<noinclude><references/>
{{c|81}}</noinclude>
efq8mj5htquq3epmd0jfnxxaavz1xd1
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/94
104
218536
571202
2026-08-24T09:35:23Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571202
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>వచ్చెడిది. పత్రికలు మడఁచుటకు చిన్నలనక, పెద్దలనక అందఱమును పదిగంటలనక, పండ్రెండుగంటలనక పనియగువఱకు కూర్చుండువారము; కాని తొలిరేయి మఱపురాదు. చట్టము మరపై బిగింపఁబడెను. కాని
ఎంజిను బిగిసెను. నడవనని మోరాయించెను. ఎంజినును సరిచేసి సాగించుటకు ఎంజినీయరును పిలిపించితిమి. అతఁడును వెస్టుగారును పనిచేసిరి గాని వృథా. అందఱును చింతాయుక్తులై కూరుచుండిరి. తుదకు వెస్టుగారు ఆసలుడిగి నాకడకు వచ్చి కనులు తుడుచుకొనుచు 'నేఁడిఁక ఎంజిను నడచు నాసలేదు. ఈవారములో పత్రికను సకాలమునకుఁ బంపఁజాలము' అని పలికెను.
'సరియ. అందులకు మనము కనులు తడప నక్కఱలేదు. ఇంకేమేని యుపాయ మున్నచోఁ జేసి చూతము. ఆఁ; ఆచేతిచక్ర మే మయినది?' అనుచు నే నతని నూఱడించితిని.
'ఆచక్రము త్రిప్పుటకు మనకడ మనుష్యు లేరీ? మన మందఱ మేకమయినను దానిని తిప్పలేము. దానిఁ ద్రిప్పుటకు తడవకు నలుగురితో జరూరు. పోనీ మన వాండ్రో అనినచో వా రందఱు నలసియున్నారు.' అని వెస్టుగా రనిరి.
ఇఁకను వడ్రంగ మంతయు కాలేదు. కాన వడ్రంగు లందఱు ముద్రాలయముననే నిద్రించుచుండిరి. నేను వారిదెసఁ జూపి—'వీరుగో వడ్రంగులు ! మనము వీరిసాయము గొనరాదా? మన మీరాత్రి యంతయు మేలుకని ముద్రణోపాయము చూతము. ఈకర్తవ్య మింకను బాకీయున్న దనిపించుచున్నది.'
'వడ్రంగులను లేపి వీరి సాయము వేఁడుటకు నాకు ధైర్యము చాలదు. మరియు మనవారుకూడ నలసి యున్నారు; వారినిమాత్ర<noinclude><references/>
{{c|82}}</noinclude>
mg1k8npnhsjflcsxw129ie31x2qoj6e
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/95
104
218537
571203
2026-08-24T09:49:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571203
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||20 తొలిరేయి}}</noinclude>మెటులు లేపను?' అని వెస్టుగా రనిరి. 'అది నాపని' యని నే నంటి. ‘అటులగుచో మనము ఒడ్డెక్కవచ్చును.' అని వెస్టుగా రనిరి.
నేను వడ్రంగులను లేపితిని. వారి సాయము వేఁడితిని. వారిని బతిమాలవలసిన పని లేకపోయెను. వా రిటు లనిరి: 'మే మిట్టి చిక్కున నక్కఱకు రానిచో మనుష్యులమా? మీరు పడుకొనుఁడు. మేము
గుర్రములవలె పనిచేసెదము. మా కది యొక లెక్కకాదు.'
మరియు అచటి యచ్చుపనివాండ్రుగూడ సిద్ధులయియే యుండిరి.
అపుడు వెస్టుగారికి సంతోష మాఁగలేదు. అతఁడు పని చేయుచుఁ జేయుచు భజనకీర్తన లారంభించెను. నేనును వడ్రంగులలో కలిసితిని. మిగిలినవారును ఒకొక్క వరుసగా తిప్పఁదొడఁగిరి, ప్రొద్దున ఏడు కొట్టిరి. ఇంకను చాల పని మిగిలి యుండెను. 'ఇపు డింజనీయరును లేపుచో ? ఈ పగటివెలుఁగున చూచిన బాగుండును. మీఁదట ఎంజిను నడచుచో మన పని సమయమునకు నెఱవేఱఁగలదు' అని నేను
వెస్టుగారితో నంటిని.
వెస్టుగారు ఎంజినీయరును లేపిరి. అతఁడు లేచి నిలువఁబడి ఎంజినుగదిలోని కేఁగెను. కదపఁగనే ఎంజిను నడవఁదొడఁగెను. ప్రెస్సు హర్ష నాదముతో మాఱుమ్రోఁగెను. 'ఈ తెలివి రాత్రి ఎక్కడికి పోయెను? రాత్రి
ఎంతమంది కొట్టుకొన్నను మొద్దువలె కదలలేదు. ఇపుడు చేయి వేయఁగనే ఏమియు ఎఱుఁగనటులు పరుగెత్తఁదొడఁగెను' అని అంద ఱనఁ దొడఁగిరి.
అపుడు వెస్టుగారో ఎంజినీయరో ఇటులు జవాబు చెప్పిరి: 'దీనికి ఉత్తరము చెప్పుట కఠినము. యంత్రములుగూడ మనవలె విశ్రాంతి గోరును. అపు డపుడు వీనిస్థితి యిటులు కనుపట్టును.'<noinclude><references/>
{{c|83}}</noinclude>
jwxboci5vxp5sssfhlrln1l5jh14vgr
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/96
104
218538
571204
2026-08-24T09:54:53Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571204
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>ఎంజిను నడవక పోవుట మాయందఱకును పరీక్షయనియు, మఱి సమయమున నది నడచుట పరిశుద్ధమగు మాపనికి శుభఫల మనియు నాకుఁ దోఁచెను.
పత్రిక నియతవేళకు స్టేషనుకు వెళ్లెను; మే మందఱము నిశ్చింతుల మయితిమి.
మా పట్టుదలకు ఫలముగా పత్రికకు నియమ మేర్పడెను. ఫినిక్సునందు స్వయంసహాయతావాతావరణ మారంభమాయెను. తరువాత బుద్ధిపూర్వకముగా ఎంజినును విడనాడి దృఢతాపూర్వకముగా చేతి చక్రముతో పని నడపిన యుగ మొకటి ఈ సంస్థా జీవనములో ప్రవేశించెను. అది ఫినిక్సు జీవనమునందు కడు దొడ్డయగు నైతిక కాలమని నా యుద్దేశము.<noinclude><references/>
{{c|84}}</noinclude>
dmrzsxa1omgnv3ojdjkwh54tmlimk9n
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/97
104
218539
571205
2026-08-24T10:06:33Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571205
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}21</p>
{{p|fs125}}పోలాకుగూడ దిగెను</p>
{{Largeinitial|ఫి}}నిక్సులో ఆ సంస్థను స్థాపించిన పిదప కొలఁది కాలమే నే నందుండఁగలుగుట యొక విచారకారణము. దాని స్థాపించు సమయమున అచట నుండవలయు ననియు, అచటనే నా పొట్ట గడపుకొనవలయు ననియు, వకాలతు విడనాడవలయు ననియు, అచటనే యుండి నాచేతనయిన సేవ చేయవలయు ననియు, నా సేవయంతయు ఫినిక్సు - సాఫల్యమునందే పర్యవసింపవలయు ననియు నాకోరిక. కాని, ఈకోరికలు గొంతెమ్మకోరిక లాయెను. నే ననుకొనున దొకటి, జరుగున దొకటి. ఇది మొదటినుండియు నాకనుభవము. తానొకటి తలఁచిన దైవమొకటి తలఁచుఁగాక! సత్యసాధనముగాని, సత్యోపాసనముగాని
ఉద్దిష్టమగునెడల మనుజుని ప్రయత్నములు భగ్నము లయినను అవి అకుశలముగా పరిణమింపవు. మరియు కొన్ని వేళల మనము తలపోయు నంతకన్న నెక్కువ మే లొడఁగూర్చుటయు నా కనుభవము. ఫినిక్సునందు తలఁపని తలంపుగా కలిగిన పరిణామములును, తలఁపని తలంపుగా ఫినిక్సుకుఁ గలిగిన స్వరూపమును మే మనుకొనినంత మేలు తరములు కావు కాని అకుశలములు మాత్రము కావని నిక్కముగాఁ జెప్పఁగలను.
ఎవరికి వారు పనిపాట లొనరించి పొట్ట జరుపుకొనులయునని నాయుద్దేశము కావున అచ్చుకూటమునకు దాపుగా నున్న పొల మొకొక్కనికి మూఁడేసి యెకరములవంతున పంచిపెట్టఁ బడెను. అం<noinclude><references/>
{{c|85}}</noinclude>
qe7tgd7tmtsndbnwl9pq1vnyt0h2ywp
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/98
104
218540
571206
2026-08-24T10:18:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571206
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>దొక చీలిక నావంతునకు వచ్చెను. ఇష్టము లేకున్నను టిన్‌రేకుల యిండ్లను వేసికొంటిమి. రైతులవలె పూరియిండ్లలోఁగాని, ఇటుక యిండ్లలోఁగాని ఉండుటయే మా కిష్టముగాని అది నెఱవేఱలేదు. దానికి దీనికన్న వ్యయము హెచ్చు, కట్టుటకు కాలమును హెచ్చు. 'ఎపు డిండ్లు తయా రగునా? ఎపుడు పనిపాటలు చేసికొందమా ?' అని అందఱును తొందరపడిరి.
మనసుఖలాల్ నాజరుగారే నాఁటికిని ఇండియన్ ఒపినియన్ పత్రికకు సంపాదకులుగా నున్నను వారు మాలో కలియలేదు. వీరికి డరబనులో నిల్లు కలదు. డరబనులో ఇండియన్ ఒపినియన్ పత్రిక కొక చిన్న శాఖ కలదు.
అచ్చుకూటమునందు జీతము గొని పనిచేయు కంపోజిటరులు ఉన్నను ఈ సంస్థలో నున్న వా రందఱును అక్షరములు కూర్చుట మొదలగున వన్నియు నేర్చుకొనవలసియుందు రని సంకల్పింపఁ బడెను. ఏలనఁగా ఈపని చాల తేలికయేగాని ఇది కాలమును చాల మ్రింగును. కావున లోఁగడ నీపని నెఱుఁగనివా రందఱు నిపుడు నేర్చిరి. నే నీపనిలో నందఱకన్న కనిష్ఠుడనేగాని మగనలాల్ గాంధీ మాత్ర మందఱకన్న జ్యేష్ఠుఁడు. తన శక్తి తనకుఁ దెలియదని మగనలాల్ గాంధీ విషయమున నా యుద్దేశము. ఇతఁ డిది వఱ కెన్నఁడును అచ్చుపని యిసుమంతయు నెఱుఁగకున్నను చిటికలో నొక గొప్ప కంపోజిట రయిపోయెను; వడిలోఁగూడ దాఁటిపోయెను. ఇతఁడింత కొలఁదికాలములో అచ్చుపను లన్నిటిలో ప్రావీణ్యము సంపాదించి నన్ను ఆశ్చర్యచకితుని జేసెను.
మే మింకను కాలు నిలఁద్రొక్క కొనలేదు. గృహనిర్మాణ మింకను పూర్తికాలేదు. ఇట్టి స్థితిలో నా కీ నూతన కుటుంబమును<noinclude><references/>
{{c|86}}</noinclude>
9wwuxk8om7az79c5nv58tqwk4lsp396
పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/99
104
218541
571207
2026-08-24T10:28:42Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
571207
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||21 పోలాకుగూడ దిగెను}}</noinclude>విడిచి జొహాన్సుబర్గు వెళ్లవలసివచ్చెను. అక్కడి పను లన్నియు పలుకాలము పాడువెట్టి యుంచుటకు నా కవకాశము లేకపోయెను.
జొహాన్సుబర్గుకు వచ్చి పోలాకుగారితో ఈ గొప్ప మార్పునంతయుఁ జెప్పితిని. తా నొసఁగిన పుస్తకమువలనఁ గలిగిన యీ పరిణామము వినఁగా నతని యానందమున కొక యెల్ల లేకపోయెను. 'అందు ప్రవేశించుటకు నాకును వీలుండునా ?' అని అతఁ డాసక్తితో నడిగెను.
‘లేకేమి? తప్పక వీలుండును? అని నే నంటిని.
'మీరు ఊఁ యనుచో నే నిపుడే తయారు' అని పోలాకుగా రనిరి.
ఇతని దార్ఢ్యము నన్ను ముగ్ధుని గావించెను. తనను తనపనిలో నుండి ఒక నెలలో విడుదల చేయుఁడని క్రిటిక్ పత్రికాసంపాదకునకు నోటీ సిచ్చి నెల నయినపిమ్మట నతఁడు ఫినిక్సు చేరెను. తన కలుపుగోలు తనముచే నందఱకును మంచివాఁడై యతఁడు మాకుటుంబములో నొకఁ డయిపోయెను. నిరాడంబర జీవనము చాలఁ బ్రియ మగుటచే ఫినిక్సులో నుండుట ఇతనికి ఇసుమంతయుఁ గష్ట మనిపింపక స్వాభావికమును, ఇష్టతరమును ఆయెను.
కాని నే నతని నెంతోకాల మచట నుండనీయలేదు. రిచ్ గారు సీమకు వెళ్లి లాను ముగించుకొని రాఁదలఁచెను. ఆఫీసుపని యంతయు నాయొక్కని వలన తేలదు. కావున ఆఫీసులో నుండుమనియు
వకీలుగా తయారగుమనియు పోలాకుతోఁ జెప్పతిని. అతఁడు వకీలుగా తయారయిన పిదప తుదకు మే మిరువురమును ఫినిక్సులో నుండిపోవచ్చునని నాయభిప్రాయము.<noinclude><references/>
{{c|87}}</noinclude>
mdxeilw1zuijrj3qqhv15xyx2iivl2e
సూచిక:బక్సారు యుద్ధము.djvu
106
218542
571208
2026-08-24T11:12:41Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
571208
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[బక్సారు యుద్ధము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=
|అనువాదకులు=[[రచయిత:మొసలికంటి సంజీవరావు]]
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=djvu
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
tntq6envoy108iib5gwxg5b1r5j7rn1
571209
571208
2026-08-24T11:13:39Z
Rajasekhar1961
50
571209
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[బక్సారు యుద్ధము]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=
|అనువాదకులు=[[రచయిత:మొసలికంటి సంజీవరావు]]
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=djvu
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
flwiy7b7rm7f4jzm4wj3twbfpoxwe66
పుట:బక్సారు యుద్ధము.djvu/3
104
218543
571210
2026-08-24T11:16:26Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
571210
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>
సర్వ్యస్వామ్యుములు
ప్రకాశకులవి.
ప్రథమ ముదణము : 1925
ద్వితీయ ముద్రణము : 1931
తృతీయ ముద్రణము ; 1954
Saraswathi Power Press, Rajahmuudry
Printed ana Published by
A. Nageswara Rac
For Addepally & Co., Educational Publisher
Order No. 8670/1954<noinclude><references/></noinclude>
ivjkszqtgy9u15keyhsp5htw92wytg6
రచయిత:మొసలికంటి సంజీవరావు
102
218544
571211
2026-08-24T11:21:08Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = |అసలుపేరు = మొసలికంటి సంజీవరావు |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మొసలికంటి సంజీవరావు |వికీవ్యాఖ్య_లంకె...'
571211
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు =
|అసలుపేరు = మొసలికంటి సంజీవరావు
|పేరు_మొదటి_అక్షరం = మ
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = మొసలికంటి సంజీవరావు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
== రచనలు==
# [[తెలంగాణ తేజోమూర్తులు/ లక్ష్మణ్ బాపూజీ]] (2017)
[[వర్గం:తెలుగు రచయితలు]]
i56ossbusff5dlegqz77vpd5l2mlopb