వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.22
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
రచయిత:చివుకుల అప్పయ్య శాస్త్రి
102
70237
583107
570537
2026-10-03T10:25:49Z
Rajasekhar1961
50
583107
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = చివుకుల
|అసలుపేరు = అప్పయ్య శాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = చ
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ = సంస్కృతాంధ్ర పండితులు, పత్రికా సంపాదకుడు.
|బొమ్మ= Chivukula Appayya Shastri (page 6 crop).jpg
|వికీపీడియా_లంకె = చివుకుల అప్పయ్యశాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* బాలనీతి (1914) {{small scan link|Bala Neethi.pdf}}
{{authority control}}
oq1q49lj1el8qyvl8v6u1cnspus5jyb
పుట:Aananda-Mathamu.pdf/244
104
108709
583084
352183
2026-10-03T07:12:00Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
583084
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{c|2}}</noinclude>and call off the two officers who commanded them. One was Captain Thomas, whom you know. Four battalions of the brigade Sepoys are now in pursuit of them, but they will not stand any engagement,
and have neither camp equipage nor even clothes, to retard their flight. Yet I hope we shall yet make an example of some of them as they are shut in by rivers which they cannot pass when closely
pursued.
The history of these people is very curious. They inhabit or rather possess the country lying south of the hills of Tibbet from Kaubul to China. They go mostly naked; they have neither towns, houses nor families, but rove continually from place to place recruiting their number with the healthiest children they can steal in the countries through which they pass. Thus they are the stoutest and the most active men in India. Many are merchants. They are all pilgrims, and held by all castes of Gentoos in great veneration. This
infatuation prevents our obtaining any intelligence of their motion or aid from the country against them, notwithstanding very rigid orders which have been published for these purposes in so much that
they often appear in the heart of the province as if they dropt from heaven. They are hardy; bold and enthustiasic to a degree surprising credit. Such are the Sannyasis, the Gipsies of Hindustan.
We have dissolved all Pargunn Sepoys and fixed stations of the brigade Sepoys on our frontiers, which are to be employed only in the defence of the provinces, and to be relieved every three months. This I hope will secure the peace of the<noinclude><references/></noinclude>
09ypbzt1lg4x2zo8qygfwtvoxsgqlja
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/115
104
144952
583051
466366
2026-10-02T16:08:11Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583051
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|112|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>రావుబహద్దరు బిరుదును ప్రసాదించుచు ఆయన బెజవాడ మ్యునిసిపలు
చైరుమనుగ చాల పనిచేసినాడనియు, అంతేగాక బెజవాడలో కొందరు
బ్రిటిషుప్రభుత్వమును పడగొట్టి ఒక రిపబ్లికును స్థాపించవలెనని ప్రయత్న
ములు చేయగా వాటిని ఆయన ప్రతిఘటించి బ్రిటిషుప్రభుత్వమునకు చాల
సహాయముచేసినాడనియు, అందువలన ఆయనకు ప్రభుత్వమువారు రావు
బహద్దరుబిరుదమును ప్రసాదించుచున్నారనియు చెప్పి, ఆ బిరుదమును
ప్రసాదించెను. రాజారాంరావుగారికి రావుసాహేబు బిరుదమును
ప్రసాదించుచు ఆయనకూడ బెజవాడలోని కొందరు దుండగీడులు బ్రిటిషు
ప్రభుత్వమును పారద్రోలీ రిపబ్లికును స్థాపించుటకు చేసిన కుట్రలను కను
క్కొని ఎప్పటికప్పుడు ప్రభుత్వయుద్యోగస్తులకు తెలుపుచు ప్రభుత్వమునకు
గొప్పసేవచేసినందున ఆ బిరుదమొసంగబడినదని చెప్పెను. బ్రిటీషు
సామ్రాజ్యవాదియగు ఆ ఉద్యోగస్తుడు అంత పొగరుబోతుతనముతో చెప్పిన
మాటలను శాంతముగా విని యింటికి వచ్చినాము.
1908 లో తెనాలివద్ద కఠేవరములో నొక బాంబు ప్రేల్చబడెను.
ఎవరికిని దెబ్బలు తగులలేదు. దానిని కోటంరాజు రాజేశ్వరరావు తయారు
చేసి ప్రేల్చినాడని పోలీసువారు అనుమానపడి ఆయనను, మరోయిద్దరిని
అరెస్టుచేసి కొంతకాలము జైలులోఉంచిరి. పిమ్మట సాక్ష్యములేనందున
విడుదలచేసిరి.
1909 సంవత్సరం ఫిబ్రవరిలో నరసారావుపేటతాలూకా కోటప్ప
కొండవద్ద జరిగిన శివరాత్రియుత్సవమునకు అదివర కేటేట జరిగినటులే
వేలకువేలప్రజలు పోగైరి. వారిలో చాలమంది మంచి మంచి ఎద్దులను
బాగుగా నలంకరించి ప్రభలుకట్టుకొని వచ్చిరి. అటులనే చిన్నప్పరెడ్డియను
రెడ్డినాయకుడు అతనిమిత్రులు మంచిఎద్దులతో గొప్పప్రభలను కట్టుకొని
వచ్చినారు. పోలీసు హెడ్డుకానిస్టేబిలు ఇతర కానిస్టేబిలులు లాఆర్డరు అను
పేరుతో ప్రభలుకట్టితెచ్చినవారిమీద అనవసరముగ దౌర్జన్యముచేయుచు
త్రోవలు సరిగానుండవలెనని మనుష్యులను, ఎడ్లను బెత్తములతో కొట్ట
సాగిరి. ఈవిధముగనే చిన్నప్పరెడ్డిమీద దౌర్జన్యముచేసి అతనిఎద్దులను
కొట్టగా అవి బెదరి స్వాధీనముతప్పేస్థితిలోకి రాసాగినవి. అందుమీద<noinclude><references/></noinclude>
o8l8q4yivfnhwlv3eoudgyspn5uxpw6
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/116
104
144953
583052
466406
2026-10-02T16:13:21Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583052
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|15]|వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|113}}</noinclude>పోలీసులు తుపాకులుకాల్చి చిన్నప్పరెడ్డిఎడ్లను చంపినారు. అపుడు చిన్నప్ప
రెడ్డి. అతనిమిత్రులు పోలీసులమీద గొప్ప తిరుగబాటుచేసినారు. పోలీసులు
ప్రజలమీద కాల్చినారు. కొందరు హతులైనారు. ప్రజలందరు చిన్నప్ప
రెడ్డితో చేరినారు. స్త్రీలుకూడ ఇనుపకడ్డీలతో పోలీసులమీదికి పోయినారు.
పోలీసు హెడ్డుకానిస్టేబిలును, ఇంకా కొంతమంది కానిస్టేబిల్సును పట్టుకొని
మంటలలోవేసి హత్యగావించినారు. తక్కిన పోలీసువారు, మేజస్ట్రేటు,
ఉద్యోగస్తులు పారిపోయినారు. ఆసమయములో "వందేమాతరం" "బ్రిటిషు
గవర్నమెంటును పారత్రోలండి, స్వరాజ్యము కావాలి" అనే నినాదాలు నలు
దిశల మారుమ్రోగినవి. అల్లర్లు ముదరగానే ఎక్కడివారక్కడ వెళ్ళిపోయి
నారు. చిన్నప్పరెడ్డి గొప్ప ధీరుడైనాడు. తరువాత ఆయనను, ఇంకా కొంత
మందిని అరెస్టుచేసి ఉరితీసినారు. మరికొందరికి దీర్ఘశిక్షలు వేసినారు.
అపుడు కెరషాస్సు సబుకలెక్టరుగ నుండెను. రాజీనామానిచ్చి వెళ్ళిపోయి
నాడు. కొందరు వుద్యోగస్తులను పిరికితనముక్రింద తమపనిని సకాలములో
సక్రమముగా నెరవేర్చనందుకు క్రింది ఉద్యోగములలోనికి వేసినారు. ఇది
కూడ స్వరాజ్యోద్యమమునకు తోడ్పడినది. చిన్నప్పరెడ్డిని మహాధీరుడని
పొగడుచు ఉద్రేకమైన కీర్తనలు కట్టబడినవి. ఇప్పటికీ ఆవైపుల ప్రజలచే
పాడబడుచున్నవి.
1908 వ సంవత్సరము డిశెంబరులో మద్రాసునగరమున డాక్టర్
రనవిహారిఘోఘగారి అధ్యక్షతను కాంగ్రెసుమహాసభ, సూరతుకాంగ్రెసు
విచ్ఛిన్నమైనతరువాత అలహాబాదు కన్వెన్షనులో మితవాదులేర్పరచిన అంగ
విధానప్రకారమే జరిగెను. మాకందరికీ అసంతృప్తికరముగానున్నను గత్యం
తరములేక దానికి వెళ్ళితిమి. 1909 వ సంవత్సరములో బ్రిటిషుప్రభుత్వము
వారు ప్రసాదించబోవుచున్న మింటో మార్లే సంస్కరణములకు సంతోష
మునువెల్లడించుచు సురేంద్రనాధబెనర్జీ మొదలగు నాయకులు గంభీరోపన్యాస
ములుచేసిరి. ఆ సంస్కరణములప్రకారము రాష్ట్రశాసనసభలలో కొంత
భాగముగా మాత్రము మ్యునిసిపలుసభ్యుల, జిల్లాబోర్డుసభ్యులవల్ల ఎన్ను
కొనబడెడి ప్రజాప్రతినిధు లుందురు. మద్రాసు, బొంబాయి, పశ్చిమబంగాళం
అను మూడురాష్ట్రప్రభుత్వాలలో ఎగ్జిక్యూటివ్‌కౌన్సిలర్లుగా ఒక్కొక్క<noinclude><references/></noinclude>
cpbp3lcigpu7vex46nbnm3ptqwhp1n0
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/114
104
161944
583050
466365
2026-10-02T16:03:33Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583050
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|111}}</noinclude>వ్రాయుచుండెను. ఇవి హింసావిధానమునుకూడ సమర్ధించెను. ఈ రెండు
పత్రికలమీద కూడ జప్తువారంట్లు వచ్చెను. నవయుగపత్రిక సంపాదకు
లైన చిల్ల రిగ శ్రీనివాసరావుగారు ఒక సంవత్సరమువరకు వారంటుకు
అందక ఎక్కడకో పోయిరి. కృష్ణాపత్రికకు ముట్నూరి కృష్ణారావుగారు
సంపాదకులైనను అది కృష్ణాజిల్లా కాంగ్రెసుకమిటీయొక్క యాజమాన్య
మున నడుపబడుచుండిన పత్రిక. ఆ కమిటీకి అపుడు అధ్యక్షులుగానున్న
శిడింబి హనుమంతరావుపంతులుగారు గవర్నమెంటు పబ్లికు ప్రాసిక్యూట
రుగా నియమింపబడిరి. అందువల్ల వారు కృష్ణాజిల్లా మేజస్ట్రేటుగారితో
మాట్లాడి కృష్ణాపత్రికనుండి ముట్నూరి కృష్ణారావుగారిని తొలగించి, మరి
యొక సంపాదకుని నియమించెదమనియు పత్రికను జాగ్రత్తగా నడిపెద
మనియు వాగ్దానముచేసి కృష్ణాపత్రికమీద వారంటును రద్దుచేయించిరి. అటు
లనే నవయుగపత్రికను పూర్తిగా నాపివైచితిమని వ్రాయించి పుచ్చుకొని
చిల్ల రిగ శ్రీనివాసరావుగారిమీద జారీచేయబడిన వారంటునుకూడ రద్దుపర
పించిరి. మూడుసంవత్సరములకాలము కృష్ణాపత్రికకు ముట్నూరు కృష్ణా
రావుగారు సంపాదకులుగానుండి పత్రికను నిర్వహించిరి. డాక్టరు పట్టాభి
సీతారామయ్యగారు దానినిర్వహణలో సహాయముచేయుచుండిరి. మూడు
సంవత్సరములైనపిదప కృష్ణాపత్రికమీద యాజమాన్యమును కృష్ణాజిల్లా
కాంగ్రెసుకమిటీవారు వదలుకొని యావత్తు హక్కుబాధ్యతలను సంపూర్ణ
ముగా ముట్నూరి కృష్ణారావుగారికి వదలివేసిరి. అప్పటినుంచి ముట్నూరి
కృష్ణారావుగారు మరణించేవరకు కృష్ణాపత్రికకు సంపాదకులుగా
నుండి దానిని మిగుల తేజోవంతముగా నడిపిరి. గాంధియుద్యమ
మును బలపరచిరి. 1930 లోను 1932 లోను స్వతంత్రపోరాటములో
జైలుకువచ్చిరి. ఇటీవల స్వర్గస్థులైరి.
1909 వ సంవత్సరములో బెజవాడలో సబుకలెక్టరుఆఫీసుహాలులో
జిల్లాకలెక్టరు కోలురెడ్జి యొక దర్భారుజరిపి బిరుదముల ప్రదానమును
చేసెను. మా లాయర్లలో చేరిన తాడంకి వెంకటనరసయ్య, యం. రాజా
రాంరావుగార్లకు బిరుదులొసంగబడునని ఆహ్వానము వచ్చినందున లాయ
ర్లలో చాలమందిమి ఆ సభకు వెళ్ళినాము. తాడంకి వెంకటనరసయ్యగారికి<noinclude><references/></noinclude>
fe78p16rf3t8ocl4016ipf3a5w21bqn
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/117
104
161966
583053
466407
2026-10-02T16:21:38Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583053
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|114|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>భారతీయుని తీసుకొనెదరు. పిమ్మట బీహారురాష్ట్రము ప్రత్యేకించబడిన
తరువాత దానికికూడ నొక భారతీయుడు ఎక్జిక్యూటివ్ కౌన్సిలరుగా నియ
మింపబడినాడు. కేంద్రప్రభుత్వములో నొక భారతీయుడు' ఇంగ్లాండులోని
ఇండియామంత్రియొక్క కౌన్సిలులో ఇద్దరుభారతీయులు సభ్యులుగా నుందురు.
ఇంతమాత్రమునకే బ్రిటిషుప్రభుత్వపుతలుపులు భారతీయులకు తెరువబడి
నటుల అప్పటి కాంగ్రెసునాయకులు హర్షమును వెలిబుచ్చిరి. ఆ కాంగ్రెసు
నా కేమిన్ని రుచించలేదు. లోకమాన్య బాలగంగాధరతిలకుగారు బైటికివచ్చి
1916 వ సంవత్సరపు లక్నోకాంగ్రెసులో పాల్గొనేవరకు కాంగ్రెసుమహా
సభలో ప్రాణమే లేకుండెను. ఆకాలములో ఆకారణముచేత నేను కాంగ్రెసు
మహాసభలకు చాలవరకు పోవుట మానివేసితిని. 1911 వ సంవత్సరములో
నూతనముగా రాజ్యమునకువచ్చిన పంచమ జార్జిచక్రవర్తియొక్క పట్టాభి
షేకదర్బారు ఢిల్లీ లో జరిగినపుడు నేను దానికి వెళ్ళితిని. ఆ దర్భారు ముగి
సినపిమ్మట చక్రవర్తిగారు లేచి బంగాళావిభజనమును రద్దుపరచినామనియు,
బంగాళీమాటలాడు బంగాళమును, హిందీమాటలాడు బీహారును, అస్సామీస్
మాటలాడు అస్సామును నిర్మాణము చేయుచున్నామనియు కేంద్రప్రభు
త్వముయొక్క రాజధానిని కలకత్తానుంచి ఢిల్లీకి మార్చితిమనియు హర్షధ్వాన
ములమధ్య ప్రకటించిరి. అపుడు హార్డింజ్ ప్రభువు రాజప్రతినిధిగానుండెను.
ఆయనమీద ఒక బాంబు వేసిరి. కాని అదిగురితప్పి ఆయన బ్రతికెను.
1911 డిశంబరులో కలకత్తాలో బిపిన్ నారాయణధారుగారి అధ్యక్షతక్రింద
జరిగిన కాంగ్రెసుకుకూడ హాజరైతిని. కలకత్తాలో బ్రహ్మసమాజమువా
రేర్పాటుచేసిన సర్వవర్ణభోజనమునకు వెళ్ళి భుజించితిని. సాధారణ బ్రహ్మ
సమాజమందిరమునకు ప్రక్కసందులో వరుసగా కాపురమున్న మహానాయ
కులగు మాడరన్‌రివ్యూ పత్రికాధిపతి రామానందచటర్జీ, శశిపాదబెనర్జీ, సీతా
నాథ తత్వభూషణ్‌గార్ల దర్శనముచేసి అనేకవిషయములు చర్చించితిని.
బ్రహ్మసమాజ ప్రార్థనలో పాల్గొంటిని. ఆప్పుడు కలకత్తాలో విద్యార్థులుగానున్న
బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, దంటు సుబ్బావధాని, ఎర్రమిల్లి జగ్గన్నశాస్త్రి,
నోరి వెంకటేశ్వర్లు, ఘంటసాల శీతారామశర్మ మొదలగు ఆంధ్రయువకులు
నన్నుకలసిరి. వారందరు తీవ్రవాదులుగానుండిరి. పోలీసువారు మమ్ములనందరినీ<noinclude><references/></noinclude>
qrqhqus27yzhqe36m252i1di0ro7dvj
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/118
104
161967
583054
466408
2026-10-02T16:26:32Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583054
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|115}}</noinclude>వెంబడించుచునేయుండిరి. 1914 వ సంవత్సరము డిశంబరులో భూపేంద్రనాథ
బాసుగారి అధ్యక్షతక్రింద మద్రాసులో జరిగిన కాంగ్రెసుకుహాజరైతిని. 1917వ
సంవత్సరమునుండి, నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభస్పీకరైన పిమ్మట
1958 లో నేను మానుకొనేవరకు, అఖిలభారత కాంగ్రెసుకమిటీకి సభ్యు
డుగా విడువకుండా ఎన్నుకొనబడితిని. 1918 నుండి ఎప్పుడో తప్ప సాధా
రణముగా కాంగ్రెసుమహాసభలన్నిటికి హాజరగుచుంటిని, 1906 మొదలు
1920 వరకు బెజవాడ డివిజనలు కాంగ్రెసుకమిటీకి కొంతకాలము కార్య
దర్శిగాను. కొంతకాలము అధ్యక్షుడుగాను చురుకుగా పనిచేసితిని.
హరిసర్వోత్తమరావుగారు జైలునుంచి విడుదలైవచ్చిన 1911 నుండి
మద్రాసులో నివసించుచుండిరి. కొంతకాలము కాశీనాథుని నాగేశ్వరరావు
పంతులుగారిచే నడుపబడుచుండిన ఆంధ్రదినపత్రికలో సంపాదకులుగ నియ
మింపబడిరి. పింగళి లక్ష్మీనారాయణ, బోడి నారాయణరావుగార్లుకూడ
బెజవాడ విడచివెళ్ళిరి.
అనిబిసెంటమ్మగారు 1914 వ సంవత్సరమున ప్రపంచ దివ్యజ్ఞాన
సమాజమునకు అధ్యక్షురాలై తీవ్ర సంఘసంస్కరణములను బోధించెను.
ఆమె కాంగ్రెసుమహాసభకు అనుకూలముగా నుండెను. దానితో మా బెజ
వాడలోని తాడంకి వెంకట నరసయ్య, తుర్లపాటి శేషాచలపతిరావు గార్లు
మొదలైన దివ్యజ్ఞానసామాజికులు కాంగ్రెసులో చేరి తీవ్ర సంఘసంస్కర్త
లైరి. కొంతకాలము తాడంకి వెంకటనరసయ్యగారిని బెజవాడ డివిజనలు
కాంగ్రెసుకమిటీకి అధ్యక్షుడుగా ఎన్నుకొని నేను కార్యదర్శిగా పనిచేసితిని.
చుట్టుపట్టు గ్రామములకు పోయి కాంగ్రెసుసంఘములను స్థాపించుచుంటిమి.
మా డివిజినలు కాంగ్రెసుకమిటీ బలమైనసంస్థగా నుండెను. మేము హరిజను
లనుకూడ కాంగ్రెసులో సభ్యులుగా చేర్చుకుంటిమి. గున్ననపూడి కాపుర
స్తుడు బి.ఏ. వరకు చదువుకున్న యొక హరిజన క్రైస్తవుడు మా వర్కింగు
కమిటీలో నుండెను. ఉప్పులూరు సుబ్బారావుగారిని జీతమిచ్చి సంచారకార్య
దర్శిగా నియమించితిమి. ఆయన శ్రద్ధగా పనిచేసెను. 1915 మొదలు 1918
వరకు నేను విజయవాడ మ్యునిసిపలుకౌన్సిలుకు సభ్యుడుగా ఎన్నుకొనబడి
పనిచేపితిని. అప్పుడు దినవహి హనుమంతరావుగారు చైర్మను. 1918 వ<noinclude><references/></noinclude>
oxqps6wfr54z3jhunu40zwn9ehi2mi7
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/119
104
161968
583055
466410
2026-10-02T16:30:49Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583055
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|116|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>సంవత్సరమునకు పిమ్మట వచ్చిన మ్యునిసిపలు ఎన్నికలలో మరల పాల్గొన
కుండా వదలివేసితిని.
{{c|(7)}}
1916 వ సంవత్సరములో అనిబిసెంటమ్మగారు అఖిలభారత హోమ్
రూలులీగును స్థాపించినది. బ్రిటిషు సామ్రాజ్యములో నంతర్భాగముగ
ఇండియాదేశమునకు డొమినియనుప్రతిపత్తి కలుగచేయుటయే దాని యుద్దే
శ్యము. దానికి భాషాప్రయుక్తరాష్ట్రములుగా శాఖలేర్పరచి ఆంధ్రశాఖను
నెలకొల్పినది. ఆంధ్రశాఖకు హరిసర్వోత్తమరావుగారు జనరలుకార్యదర్శిగా
నుండి ఆంధ్రదేశమంతయు సంచారముచేసిరి. బెజవాడలోని మా దివ్యజ్ఞాన
సమాజనాయకులు, ఇతర కాంగ్రెసువాదులము అందరమూ కలసి హోమ్
రూలులీగులో పనిచేసితిమి. అనిబిసెంటమ్మగారు ఒకసారి విజయవాడ వచ్చి
రామమోహనగ్రంథాలయములో నొక గొప్ప యుపన్యాసమిచ్చి వెళ్ళినది.
అపుడే గుంటూరుకూడ వెళ్ళి కొండా వెంకటప్పయ్యగారిఇంట బసచేసి
యుపన్యాసమిచ్చినది. అంతకుముందే లోకమాన్య బాలగంగాధరతిలకుగారు
మహారాష్ట్ర హోమ్‌రూలులీగును స్థాపించియుండిరి. దానిలో వారికి ప్రియ
మిత్రులగు జోసెఫ్ బాప్టిస్టాగారు ప్రముఖపాత్రవహించిరి. అలహాబాదులో
సుప్రసిద్ధ లాయరగు మోతీలాల్ నెహ్రూగారు అనిబిసెంటమ్మగారి అఖిల
భారత హోంరూలులీగులోనే పనిచేసిరి. ఆమె నడుపుచుండిన ఆంగ్లేయ దిన
పత్రిక 'న్యూ ఇండియా', వారపత్రిక 'కామన్ వీల్' తీవ్రముగా వ్రాయు
చుండెను. ఆమె ఉపన్యాసములు చాలా తీవ్రముగానుండెను. హిందూదేశ
మంతట స్వరాజ్యవాంఛ అధికమయ్యెను. ఆమె జాతీయవాదులకు, మిత
వాదులకు రాజీ కుదిర్చి కాంగ్రెసులో ఐక్యతను కలుగచేసెను. 1916 వ
సంవత్సరము డిశంబరులో కాంగ్రెసుమహాసభ, దానితోపాటు ముస్లింలీగు
లక్నోలో సమావేశమైనవి. దానికి లోకమాన్య బాలగంగాధరతిలకుగారు
కూడ హాజరైరి. శాసనసభలలో ముస్లిములకు ప్రత్యేకప్రాతినిధ్యము అంగీక
రించబడినది. కాంగ్రెసు-లీగు సంస్కరణముల ప్రణాలిక నొకదానిని
కాంగ్రెసుమహాసభయును, ముస్లిములీగు మహాసభయును ఏకగ్రీవముగా<noinclude><references/></noinclude>
povy8zewohs7lr554k23tf1lvhhy2z9
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/120
104
161969
583086
466411
2026-10-03T07:24:43Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583086
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|117}}</noinclude>అంగీకరించినవి. ఆ కాంగ్రెసు-లీగు సంస్కరణములే కావలెనని యావద్భా
రతదేశముయొక్క అన్ని రాష్ట్రములలోను జనసామాన్యముచేత మహజ
రులమీద దస్కతులుచేయించసాగితిమి. ఆంధ్రదేశములో హోంరూలులీగు
చాల బలముగా నుండెను. రాయలసీమలో రంగనాధమొదలియారు, గుత్తి
కేశవపిళ్ళె, శివశంకరం పిళ్లె, హత్తి శివరావు, హత్తి శంకరరావు, దొర
స్వామి అయ్యంగార్, పార్థసారధి అయ్యంగార్, రాజా రామారాయణంగారు,
బొల్లిన మునిసామి నాయుడు, మద్రాసులో కాశీనాధుని నాగేశ్వరరావు,
గద్దె రంగయ్య నాయుడు, నెల్లూరులో అమంచర్ల కృష్ణారావు, ఉత్తర
సర్కారులలో కొండా వెంకటప్పయ్య, ఉన్నవ లక్ష్మీనారాయణ, భోగరాజు
పట్టాభి సీతారామయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, ముట్నూరు కృష్ణారావు,
బెజవాడలో మేము, మోచర్ల రామచంద్రరావు. కూర్మా వెంకటరెడ్డి
నాయుడు. న్యాపతి సుబ్బారావు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, బులుసు
సాంబమూర్తి, భూపతిరాజు వెంకటపతిరాజు, చింతలపాటి నరసింహరాజు,
పూసపాటి వెంకటపతిరాజు, ఏ పి. పాత్రో మొదలైన కాంగ్రెసునాయకు
లెల్లరము హోంరూలులీగులో చేరి పనిచేసినాము.
అనిబిసెంటమ్మయొక్క పలుకుబడి తమప్రభుత్వమునకే మిగుల
అపాయకరమని బ్రిటిషుప్రభుత్వమువారు భావించిరి. ఆమెపత్రికలమీద
అనేకసార్లు ధరావతులు విధించి వాటిని స్వాధీనపర్చుకొని మొత్తముమీద
ఇరవై వేలరూప్యములను ఆమెవద్దనుండి ప్రభుత్వమువారు వసూలుచేసిరి.
తుదకు 1917 సంవత్సరము జూన్ 16వ తేదీన అనిబిసెంటమ్మను,
ఆమెకు కుడిభుజముగా పనిచేయుచున్న అరండేల్, వాడియాగారలను
అరెస్టుచేసి ఉదకమండలములోని వారిగృహముననే నిర్బంధవాసములో
నుంచిరి. 1917 వ సంవత్సరము ఆగస్టు 20 వ తేదీన భారతదేశమునకు
బాధ్యతాయుతప్రభుత్వము నిచ్చుటయే బ్రిటిషువారి ఆశయమనియు, దాని
మొదటి ముఖ్యమెట్టును వెంటనే యివ్వదలచినామనియు ఇండియా మంత్రి
మాంటేగ్యుగారు లండనులోని పార్ల మెంటులో ప్రకటించిరి. మొదటి
మెట్టుగా ఏ సంస్కరణముల నివ్వవలయుననువిషయమై విచారించుటకు
1917 వ సంవత్సరము ఆఖరుభాగములో మాంటేగ్యుగారు హిందూదేశమం<noinclude><references/></noinclude>
4ys7aa0wabt55xg0gdbd4s796u1hrjp
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/121
104
161970
583087
466416
2026-10-03T07:28:57Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583087
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|118|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>తటను సంచారముచేయునట్లు నిర్ణయించబడెను. కాని అనిబిసెంటమ్మ,
అరండేలు, వాడియాగార్లను ప్రభుత్వమువారు విడచిపెట్టనందున వారివిడు
దలకై గొప్ప ఆందోళనసాగించితిమి. వారిని త్వరలో విడుదలచేయనిచో
సాత్త్వికనిరోధమును అవలంబించవలెనను ఆలోచిన వివిధ రాష్ట్రకాంగ్రెసు
కమిటీలయెదుట చర్చించబడెను. మద్రాసు రాష్ట్రకాంగ్రెసు కమిటీలో
సాత్త్వికనిరోధము నవలంబించవలెననియే ఆగస్టు 14 వ తేదీన
తీర్మానముచేసితిమి. మద్రాసులో సాత్త్వికనిరోధప్రతిజ్ఞాపత్రమొకటి తయారు
చేయబడి వివిధప్రాంతములకు దస్కతులనిమిత్తము పంపబడెను. మద్రాసు
హైకోర్టుజడ్జిగానుండి ఉపకారవేతనము పొందిన ఎస్. సుబ్రహ్మణ్య
అయ్యరుగారు ఆ సాత్త్వికనిరోధకపత్రములో దస్కత్తుపెట్టిన ప్రథములు.
ఆయన అదివరకే అనిబిసెంటు, అరండేలు, వాడియాగార్ల నిర్బంధమునకు
అసమ్మతిసూచకముగా తన సర్ బిరుదమును విసర్జించియుండెను. ఆయన
దివ్యజ్ఞానసమాజములో ప్రముఖనాయకుడు. ఆయన అమెరికా అధ్యక్షుడైన
ప్రెసిడెంటు విల్సనుకు, హిందూదేశములోని ప్రజలు బ్రిటిషుప్రభుత్వము
క్రింద పడుచున్న యిక్కట్టులనుగూర్చి తీవ్రముగా నొకలేఖను వ్రాసి
పంపెను. దానిమీద ఆయనతోపాటు ఆంధ్రనాయకులైన కొండా వెంక
టప్పయ్య, కాశీనాధుని నాగేశ్వరరావుగార్లుకూడ దస్కతులుచేసి సంపిరి.
ఆయనతరువాత హిందూపత్రికాధిపతులైన కస్తూరి రంగయ్యంగారుకూడ
ఆ సాత్త్వికనిరోధకపత్రముమీద దస్కతుపెట్టిరి. పత్రమును అనిబిసెం
టమ్మగారిశిష్యులగు శ్రీరామ్ శివకామమ్మగార్లు విజయవాడ తీసుకొని
వచ్చిరి. తక్కిన మా మిత్రులందరునూ దానిమీద దస్కతులు చేయలేదు.
కాని తాడంకి వెంకటనరసయ్యగారును, నేనును దానిమీద దస్కతులుచేసి
సాత్త్వికనిరోధమును సాగించుటకు సిద్ధముగానున్నామని బహిరంగసభలో
ప్రకటించితిమి. ఇంకా అనేకచోట్ల అనేకమంది దస్కతులు పెట్టిరి. తుదకు
1917 వ సంవత్సరము సెప్టెంబరు 16 వ తేదీన సాత్త్వికనిరోధము ప్రారం
భించకముందే అనిబిసెంటమ్మ, అరండేలు, వాడియాగారలు నిర్బంధప్రవా
సమునుంచి విడుదలచేయబడిరి.<noinclude><references/></noinclude>
cmbizf4veh7j9khxu7coe7a2sfdux5m
పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/122
104
161971
583088
466417
2026-10-03T07:33:50Z
Vickyganti
7066
/* మూల్యాంకన చేసారు */
583088
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|119}}</noinclude>ఆ పిమ్మట 1917 వ సంవత్సరము డిశెంబరులో కలకత్తాలో జరి
గిన కాంగ్రెసుకు అనిబిసెంటమ్మగారిని అధ్యక్షరాలుగా ఎన్నుకొనిరి. ఆ
కాంగ్రెసుమహాసభలోనే అఖిలభారత కాంగ్రెసుకమిటీసభ్యులుగా వెళ్ళిన
డాక్టరు భోగరాజు పట్టాభిసీతారామయ్యగారి ప్రతిపాదనమీద లోకమాన్య
బాలగంగాధర తిలకుగారి సహాయమువల్ల మద్రాసురాష్ట్రములోని ఆంధ్ర
ప్రాంతములకు ఒక ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసుకమిటీ నేర్పాటుచేసుకొను
హక్కు ప్రసాదించబడెను. 1918 వ సంవత్సరమునుండి ఆంధ్రరాష్ట్రకాంగ్రెసు
కమిటీ ప్రత్యేకముగా ఏర్పడి పనిచేయుచుండెను. దీనివల్ల ఆంధ్ర
రాష్ట్ర సంపాదనాయత్నములో నొక పెద్ద మెట్టునెక్కితిమి. 1917వ సంవ
త్సరము ఆఖరునెలలో మాంటేగ్యు చెమ్సుఫర్డు గార్లు భారతదేశములోని
ముఖ్యపట్టణములను దర్శించిరి. అఖిలభారత కాంగ్రెసు, అఖిలభారత ముస్లిం
లీగు, అఖిలభారత హోంరూలులీగు, ఆంధ్రమహాసభ, మద్రాసు బ్రాహ్మ
ణేతరసంఘము, జాతీయ బ్రాహ్మణేతరసంఘము, అదిఆంధ్రమహాసభ మొద
లైన సంస్థలవారందరుసు వారికి తమతమ నివేదికలను అందచేసి చర్చలు
జరిపిరి. కాంగ్రెసు-లీగు సంస్కరణములు కావలెనని కోరుచు దేశములోని
అన్నిరాష్ట్రములనుండియు కొన్ని లక్షలమంది ప్రజలచేత దస్కతులుచేయ
బడిన మహజర్లు వారికి సమర్పింపబడెను. మా డివిజనలు కాంగ్రెసుకమిటీ
పక్షమున మా అయిదుతాలూకాలలో పదివేలమంది చేత దస్కతులుచేయించి
పంపితిమి.
{{c|(8)}}
1918 వ సంవత్సరారంభములో మొదటి ప్రపంచయుద్ధము తీవ్ర
రూపము దాల్చినపుడు జర్మనులు తురుష్కము. పారశీకము, ఆఫ్ఘనిస్థాన
ములగుండ ఇండియామీద దండెత్తుదురని గొప్పభయము ఆంగ్లేయప్రభుత్వ
మునకు కలిగినందున, ఇండియాలోని రాజప్రతినిధియైన చెమ్సుఫర్డ్ ప్రభువు,
ఇండియాప్రభువులును ప్రజలును బ్రిటిషుప్రభుత్వమునకు ఎక్కువగ తోడ్ప
డవలెనని యొక విన్నపమును పంపెను. దానిని గూర్చి ఆలోచించి తీర్మానిం
చుటకు బొంబాయిలో అఖిలభారత కాంగ్రెసుకమిటీ అనిబిసెంటమ్మగారి<noinclude><references/></noinclude>
3yh61iq0g7x6kh7u2fcdqckr9nvbalc
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/315
104
209106
583108
572837
2026-10-03T11:06:19Z
Ramesam54
3001
583108
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 296 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{p|ac|fwb}}బ్రహ్మాండపంచీకరణచక్రమునందు స్థూలశరీరనిర్ణయము</p>
అద్వితీయపరబ్రహ్మమువలన అవ్యక్తమును, దానివలన మహత్తత్వమును, అందున మహదహంకారమును, దానివలన పంచతన్మాత్రలును, వానివలన పంచభూతములును, వానివలన చతుర్దశభువనములును అది బాగుగఁ దెలియుటకై కలిగినవి. ఈ బ్రహ్మాండపంచీకరణచక్రము తెలుపఁబడుచున్నది. స్థూలజగత్సృష్టికి ముందు పంచభూతములు ప్రకృతత్యవచ్ఛిన్నములై యున్నవి.
{{p|ac|fwb}}పంచ తన్మాత్రలు</p>
{{Css image crop
|Image = సీతారామాంజనేయ సంవాదము.pdf
|Page = 315
|bSize = 600
|cWidth = 272
|cHeight = 801
|oTop = 102
|oLeft = 280
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
gw3thp7kc9is2l1ivoj2r4c6pl8wqeu
పుట:Sangitarasataran022902mbp.pdf/18
104
212200
583056
553305
2026-10-02T17:16:53Z
Vjsuseela
1850
/* మూల్యాంకన చేసారు */
583056
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude>{{left margin|5em}}<poem>ఇంతయుసందియమందకయెందు౯
వింతలెల్లఁగడువేడ్క జనింప౯
విలసిలుమనసుల వేమరుఁనుగొన॥ . . . నె౹౹ </poem></div>
{{dialogue/begin}}
{{dialogue|రాజులు:|నయవిశారదులును నీతిపొరగులును రాజకులాగ్రగణ్యులునైన మియట్టి వారలకీమర్యాదలు సహజములేకదా! రాజా! మాకెల్లరకును నేకొఱంతయునులేదు, అందఱము నాసీనులమైతిమి. (అని కూర్చుందురు.)}}
{{dialogue|మంత్రి:|మహాప్రభూ! విచ్చేసియున్న పెద్దలకెల్లరకు శ్రవణానందకరంబుగాఁ గన్యకామణుల, గానరసామృతముల నిచ్చపుట్టుచున్నది
కదా!}}
{{dialogue|శుద్ధో:|అట్లయిన సిద్ధార్థా! నీస్థానమును నీవుగ్రహింపుము. కన్యలారా! కిన్నరలంబోలు మీమృదుకంఠశనాళంలులతో గానంబుచేసి
యెల్లరనానందింపంజేయుడు.}}
{{dialogue|కన్యకలు:|(వరుసగానిల్చి)}}
{{Div end}}
{{Center|{{p|fs125}}పాట.యమున-ఏక తాళము.</p>}}
{{left margin|5em}}<poem>మంగళ మోహనశౌరీ - మంజులకంజవిహారీ
రంజితగోకులనారీ – భంజితనిర్జరివైరీ
నందసుతమురాహారీ - బంధుర మురళీధారీ
బృందావనసంచారీ - మందరభూధరధారీ॥</poem> </div>
{{dialogue/begin}}
{{dialogue|మంత్రి:|బాలికలారా! గంధర్వకాంతలకును నందరానిస్థాయిప్రచారముచేసి మీరుపొడినపాటలకీ సభికులహృదయంబు లానంద పారవశ్యంబుమెందియున్నవి. రాజకుమారా! వీరలకింక యథావిధిఁబారితోషికములీయవేఁడెదను.}}
{{dialogue|సర్వా:|మంత్రి! అట్లేకావించెదఁగాక. (కన్నెలతో) కన్యకలారా! మీరెల్లరు నొక్కరొక్కరుగాసేతెంచి మీరుచదివిన పొత్తంబులంగల
కొత్తపద్యము లెవ్వియైన మీయిచ్చవచ్చినవానింబఠంచి బహుమానంబులంగైకొనఁడు.}}
{{dialogue|కన్య:|<poem>గీ॥సింగమునకునోట శిరముఁబెట్టఁగవచ్చుఁ
ద్రాచుబాముకోఱఁ దాకవచ్చుఁ
గఱకుటమ్ముపైనఁ గన్ను మోపఁగవచ్చుఁ
జెడిపతోడి చెల్మిసేయరాదు॥</poem></div>}}
{{dialogue/begin}}
{{dialogue|సర్వా:|బాలికామణీ!ఈయంగుళీయకముఁగొమ్ము.}}
{{Div end}}<noinclude><references/></noinclude>
t688c6ahsxhgdg76mppy1jcny8vhf02
583057
583056
2026-10-02T17:19:00Z
Vjsuseela
1850
583057
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude>{{left margin|10em}}<poem>ఇంతయుసందియమందకయెందు౯
వింతలెల్లఁగడువేడ్క జనింప౯
విలసిలుమనసుల వేమరుఁనుగొన॥ . . . నె౹౹ </poem></div>
{{dialogue/begin}}
{{dialogue|రాజులు:|నయవిశారదులును నీతిపొరగులును రాజకులాగ్రగణ్యులునైన మియట్టి వారలకీమర్యాదలు సహజములేకదా! రాజా! మాకెల్లరకును నేకొఱంతయునులేదు, అందఱము నాసీనులమైతిమి. (అని కూర్చుందురు.)}}
{{dialogue|మంత్రి:|మహాప్రభూ! విచ్చేసియున్న పెద్దలకెల్లరకు శ్రవణానందకరంబుగాఁ గన్యకామణుల, గానరసామృతముల నిచ్చపుట్టుచున్నది
కదా!}}
{{dialogue|శుద్ధో:|అట్లయిన సిద్ధార్థా! నీస్థానమును నీవుగ్రహింపుము. కన్యలారా! కిన్నరలంబోలు మీమృదుకంఠశనాళంలులతో గానంబుచేసి
యెల్లరనానందింపంజేయుడు.}}
{{dialogue|కన్యకలు:|(వరుసగానిల్చి)}}
{{Div end}}
{{Center|{{p|fs125}}పాట.యమున-ఏక తాళము.</p>}}
{{left margin|5em}}<poem>మంగళ మోహనశౌరీ - మంజులకంజవిహారీ
రంజితగోకులనారీ – భంజితనిర్జరివైరీ
నందసుతమురాహారీ - బంధుర మురళీధారీ
బృందావనసంచారీ - మందరభూధరధారీ॥</poem> </div>
{{dialogue/begin}}
{{dialogue|మంత్రి:|బాలికలారా! గంధర్వకాంతలకును నందరానిస్థాయిప్రచారముచేసి మీరుపొడినపాటలకీ సభికులహృదయంబు లానంద పారవశ్యంబుమెందియున్నవి. రాజకుమారా! వీరలకింక యథావిధిఁబారితోషికములీయవేఁడెదను.}}
{{dialogue|సర్వా:|మంత్రి! అట్లేకావించెదఁగాక. (కన్నెలతో) కన్యకలారా! మీరెల్లరు నొక్కరొక్కరుగాసేతెంచి మీరుచదివిన పొత్తంబులంగల
కొత్తపద్యము లెవ్వియైన మీయిచ్చవచ్చినవానింబఠంచి బహుమానంబులంగైకొనఁడు.}}
{{dialogue|కన్య:|<poem>గీ॥సింగమునకునోట శిరముఁబెట్టఁగవచ్చుఁ
ద్రాచుబాముకోఱఁ దాకవచ్చుఁ
గఱకుటమ్ముపైనఁ గన్ను మోపఁగవచ్చుఁ
జెడిపతోడి చెల్మిసేయరాదు॥</poem></div>}}
{{dialogue/begin}}
{{dialogue|సర్వా:|బాలికామణీ!ఈయంగుళీయకముఁగొమ్ము.}}
{{Div end}}<noinclude><references/></noinclude>
cs397anm86maaozxb40btzux44s5dn2
583058
583057
2026-10-02T17:24:47Z
Vjsuseela
1850
583058
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Vjsuseela" /></noinclude>{{left margin|5em}}<poem>ఇంతయుసందియమందకయెందు౯
వింతలెల్లఁగడువేడ్క జనింప౯
విలసిలుమనసుల వేమరుఁనుగొన॥ . . . నె౹౹ </poem></div>
{{dialogue/begin}}
{{dialogue|రాజులు:|నయవిశారదులును నీతిపొరగులును రాజకులాగ్రగణ్యులునైన మియట్టి వారలకీమర్యాదలు సహజములేకదా! రాజా! మాకెల్లరకును నేకొఱంతయునులేదు, అందఱము నాసీనులమైతిమి. (అని కూర్చుందురు.)}}
{{dialogue|మంత్రి:|మహాప్రభూ! విచ్చేసియున్న పెద్దలకెల్లరకు శ్రవణానందకరంబుగాఁ గన్యకామణుల, గానరసామృతముల నిచ్చపుట్టుచున్నది
కదా!}}
{{dialogue|శుద్ధో:|అట్లయిన సిద్ధార్థా! నీస్థానమును నీవుగ్రహింపుము. కన్యలారా! కిన్నరలంబోలు మీమృదుకంఠశనాళంలులతో గానంబుచేసి
యెల్లరనానందింపంజేయుడు.}}
{{dialogue|కన్యకలు:|(వరుసగానిల్చి)}}
{{Div end}}
{{Center|{{p|fs125}}పాట.యమున-ఏక తాళము.</p>}}
{{left margin|5em}}<poem>మంగళ మోహనశౌరీ - మంజులకంజవిహారీ
రంజితగోకులనారీ – భంజితనిర్జరివైరీ
నందసుతమురాహారీ - బంధుర మురళీధారీ
బృందావనసంచారీ - మందరభూధరధారీ॥</poem> </div>
{{dialogue/begin}}
{{dialogue|మంత్రి:|బాలికలారా! గంధర్వకాంతలకును నందరానిస్థాయిప్రచారముచేసి మీరుపొడినపాటలకీ సభికులహృదయంబు లానంద పారవశ్యంబుమెందియున్నవి. రాజకుమారా! వీరలకింక యథావిధిఁబారితోషికములీయవేఁడెదను.}}
{{dialogue|సర్వా:|మంత్రి! అట్లేకావించెదఁగాక. (కన్నెలతో) కన్యకలారా! మీరెల్లరు నొక్కరొక్కరుగాసేతెంచి మీరుచదివిన పొత్తంబులంగల
కొత్తపద్యము లెవ్వియైన మీయిచ్చవచ్చినవానింబఠంచి బహుమానంబులంగైకొనఁడు.}}
{{dialogue|కన్య:|<poem>గీ॥సింగమునకునోట శిరముఁబెట్టఁగవచ్చుఁ
ద్రాచుబాముకోఱఁ దాకవచ్చుఁ
గఱకుటమ్ముపైనఁ గన్ను మోపఁగవచ్చుఁ
జెడిపతోడి చెల్మిసేయరాదు॥</poem></div>}}
{{dialogue/begin}}
{{dialogue|సర్వా:|బాలికామణీ!ఈయంగుళీయకముఁగొమ్ము.}}
{{Div end}}<noinclude><references/></noinclude>
t688c6ahsxhgdg76mppy1jcny8vhf02
సూచిక:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf
106
218288
583098
570292
2026-10-03T10:15:30Z
Rajasekhar1961
50
583098
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=గర్గ భాగవతం
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:చివుకుల అప్పయ్య శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
6="బొమ్మ"
7to11="విసూ"
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
3cq0g9vrcq8ka5883dw351uxwt88rbq
583099
583098
2026-10-03T10:16:31Z
Rajasekhar1961
50
583099
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=గర్గ భాగవతం
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:చివుకుల అప్పయ్య శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
6="బొమ్మ"
7to15="విసూ"
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
59d7xbnn7j5expzkk88bilourpm9gbk
583101
583099
2026-10-03T10:19:06Z
Rajasekhar1961
50
583101
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=గర్గ భాగవతం
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:చివుకుల అప్పయ్య శాస్త్రి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist
6="బొమ్మ"
7to15="విసూ"
16to22="ఉపో"
23=1
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
rgy0lqe9zddh7dvepm4y1du698mp90r
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/526
104
219176
583035
572055
2026-10-02T12:12:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583035
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ర్యము నగము గెల్పు ననఁగా
నమరెడు సతిమేను మించు హసియించు ననన్.</poem>|ref=48}}
వాక్యము నందలి కర్తృకర్మములయందు సంశయము గలిగి తన్మూలమున నర్థమున సంశయము గలుగుట దోషము. “ధరణీవరు ధైర్యము నగము గెల్చు” “సతిమేను మించు హసియించు” అను వాక్యములలో 'ధైర్యనగములు' అనుచోటను, ‘మేనుమించులు' అనుచోటను గర్త యేదో, కర్మ యేదో నిర్ణయింపరాకున్నది. కాన సంశయము. దీనిని దర్పణకార, ప్రకాశకారులు సందిగ్ధ మనిరి.
కాని యిట్టియెడలఁ బ్రకరణమువలన సంశయము దొలఁగును. రాజవర్ణనప్రకరణమున "ధరణీవరు ధైర్యము నగము గెల్చు” అని యున్నచో ధైర్యము కర్తయు 'నగము' కర్మ యని తేలును. స్త్రీవర్ణనప్రకరణమున 'సతిమేను' కర్త యనియు 'మించు' కర్మ యనియును నిస్సంశయముగాఁ దేలును. ప్రకరణము లేనపుడే యిది దోషము. ప్రకరణ మున్నచో దోషము గాదు.
{{p|ac|fwb}}9. అపక్రమము</p>
వాక్యదోషములలో 'అక్రమ'దోషము శబ్దార్థభేదముచే ద్వివిధమని చెప్పి యర్థాక్రమమును నుదాహరించియుంటిమి. "తురంగ మధ మాతంగం ప్రయచ్ఛాస్మై మదాలసం" అనుదానినిఁ జూచుకొనవలెను.
ఈ యపక్రమదోషము శాస్త్రవిరుద్ధరూపముగాఁ గూడ నుండును. ఎట్లను,
{{left margin|3em}}<poem>"కారయిత్వా క్షౌరం గ్రామవృద్ధో మంక్త్వా భుక్త్వా చ
నక్షత్రం తిథివారౌ జ్యౌతిషికం ప్రష్టుం చలితః”</poem> </div>
గ్రామవృద్ధుఁడు క్షౌరమును జేయించుకొని స్నానమాడి భుజించి తిథివారనక్షత్రములు దెలిసికొనుటకై జ్యోతిషికునికడకు బయలు వెడలెను.
ఇటఁ దిథివారాదులు దెలిసికొని క్షౌరమును వేయించుకొనుట శాస్త్రసంప్రదాయము. విపరీతముగాఁ జేయుట యపక్రమము.
{{p|ac|fwb}}10. విరుద్ధము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>క్రమ మెడలి దేశకాలా
సముచితము విరుద్ధ మయ్యె; “సమదవిలోల
భ్రమరము చంపకవన” మన
'సముదంచితకైతకంబు చైత్రం’ బనఁగన్.</poem>|ref=49}}<noinclude><references/></noinclude>
40utirrzwgcz6tzrfgmr0mcrla843df
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/527
104
219177
583038
572056
2026-10-02T15:06:04Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583038
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దేశ లాదుల కుచితము గానిది యనఁగా లోకవిరుద్ధమైనది విరుద్ధదోషము. దర్పణకార ప్రకాశకారులు దీనినిఁ బ్రసిద్ధివిరుద్ధ మనిరి. చంపకమునకును భ్రమరమునకును విరోధము ప్రసిద్ధము. కానఁ జంపకవనమున భ్రమరము చరించుచున్నదన్నచో దోషము. ఇది కవిసమయవిరుద్ధము. కైతకము (మొగిలి) చైత్రమాసమున నుండదు. ఇది కాలవిరుద్ధము. దేశవిరుద్ధమన “దక్షిణదేశమున హస్తినాపుర మనుపట్టణము గలదు" అనునది. “వయసు మొగ్గలు దొడిగిన వయసుటనఁటి" ఇది స్వభావవిరుద్ధము. (ఇది కవిభూషణ రాయప్రోలు సుబ్బారావుగారి ప్రయోగము.) అరఁటి మొగ్గలు దొడఁగదు. 'అరఁటి పువ్వు వేసె' ననవలెను. ఇట్లే ధర్మ, అర్థ, కామ, మోక్ష, శాస్త్రవిరుద్ధములగు నర్థములన దెలిసికొనవలెను.
లోకవిరుద్ధము లయినను కవిసమయప్రసిద్ధము లయినచో నుపాదేయములే యగును. ఎట్లనఁ గీర్తి తెల్లగా నుండుట లోకప్రసిద్ధము గాకున్నను గవిసమయప్రసిద్ధము. కాన నుపాదేయమే యగును. <ref>{{p|ac|fwb}}కవిసమయములు</p>
సమయ మనఁగా సంప్రదాయము. అనగా నాచారము లేక మర్యాద. ఈ సంప్రదాయములు దేశాచారములపలె నెప్పుడో యేర్పడినవి. సంఘముతో సంబంధమున్నంతవఱకు దేశాచారములను జనులు పాటింపవలసినవిధమునఁ గవులును నౌచిత్యముతో సంబంధము గలిగియుండవలసినపుడు వీనిని బాటింపవలసినదే. నేఁడు వీనిని మార్పవీలులేదు. మార్చినచో భాషయే తలక్రిందులగును. ఔచిత్యదృష్టితోఁ గ్రొత్తవి సృష్టించుకొనవచ్చును.<br>
<br>
ఈ సమయములు మూఁడు విధములు. 1. ఉన్న ధర్మమును నిబంధింపకుండుట, 2. లేని ధర్మమును నిబంధించుట, 3. నియతముగాఁ గొన్నింటికిఁ గొన్నియెడల యునికిని నిబంధించుట.<br>
ఈ క్రింది వస్తువులందున్నను నాయాధర్మములను నిబంధింపరాదు.
# మాలతీలత వసంతమున బుష్పించుచున్నట్లు వర్ణింపరాదు.
# చందనద్రుమములకు ఫలపుష్పములున్నట్లు వర్ణింపరాదు.
# అశోకమునకు ఫలములున్నట్లు వర్ణింపరాదు.
# కృష్ణపక్షమున వెన్నెల యున్నట్లు వర్ణింపరాదు.
# శుక్లపక్షమున నంధకారమున్నట్లు వర్ణింపరాదు.
# మల్లెమొగ్గలకును గాముకుల దంతములకును (తాంబూలచర్వణముచే నెఱ్ఱగా నున్నను) నెఱ్ఱఁదనమున్నను వర్ణింపరాదు.
# కమల ముకుళములకుఁ బచ్చఁదనమున్నను వర్ణింపరాదు.
# ప్రియంగు పుష్పములకుఁ బచ్చఁదనమున్నను వర్ణింపరాదు.
# పగటిపూట నీలోత్పలవికాసమును వర్ణింపరాదు.
# పగటిపూట వావిలిచెట్టు పూలు రాలిపోయినట్లు వర్ణింపరాదు.
# స్త్రీలకు నల్లఁదనమును, స్తనపాతమును వర్ణింపరాదు.
{{left|ఈ క్రింది వస్తువులందు లేని ధర్మమును నిబంధింపవచ్చును.}}
# నదుల యందుఁ బంకజనీలోత్పలాదులు లేకున్నను వర్ణింపవచ్చును.
# ప్రతి తటాకమునందును హంసలు లేకున్నను వర్ణింపవచ్చును.
# ప్రతి పర్వతమునందును బంగారము, రత్నములు, గజములు లేకున్నను వర్ణింపవచ్చును.
# చీకటిని ముష్టిగ్రాహ్యమనియు (పిడికిటితోఁ బట్టఁదగినది), సూచీభేద్యమనియు (సూదులచేఁ భేదింపఁదగినది) వర్ణింపవచ్చును.
# ఆకాశగంగలో దిగ్గజములు స్నానమాడుచున్నట్లు వర్ణింపవచ్చును.
# ప్రతాపమున రక్తత్వము, ఉష్ణత్వమును వర్ణింపవచ్చును.
# వెన్నెలను నంజలిగ్రాహ్యముగాఁ (దోసిళ్ళతోఁ దీసి యెత్తఁదగినది) గుంభోపవాహ్యముగా (కడవలతోఁ ముంచికొని పోఁదగినది) వర్ణింపవచ్చును.
# పురాతనుఁడైనను శివుని శిరశ్చంద్రుని బాలునిగా వర్ణింపవచ్చును.
# కీర్తిని, పుణ్యమును, హాసమును దెల్లఁగా వర్ణింపవచ్చును.
# అపకీర్తిని, పాపమును నల్లగా వర్ణింపవచ్చును.
# కోపమును, అనురాగమును నెఱ్ఱఁగా వర్ణింపవచ్చును.
# స్త్రీకి రోమావళి, త్రివళులు (లేకున్నను) వర్ణింపవచ్చును.
# చక్రవాకదంపతులకు రాత్రి వియోగము గలుగునట్లు వర్ణింపవచ్చును.
# చంపకభ్రమరములకు విరోధమున్నట్లు వర్ణింపవచ్చును.
{{left|ఈ క్రిందియెడల నాయా ధర్మమాలు నియతములంగా నుండును.}}
# సముద్రమునందే మొసళ్ళను వర్ణింపవలెను.
# తామ్రపర్ణీనదియందే ముత్యములు లభించునట్లు వర్ణింపవలెను.
# హేమంత శిశిరములను విడిచి సర్వదా కమలము లుండునట్లు వర్ణింపవలెను.
# ధ్వజ, చామర, హంస, హార, బక, భస్మములకుఁ దెల్లఁదనమే వర్ణింపవలెను.
# శైల, వృక్షాది, మేఘ, సముద్ర, లతలకును, రాక్షస, ధూప, పంక, కేశములకును నల్లఁదనమే వర్ణింపవలెను.
# మలయపర్వతమందే చందనవృక్షముల యుత్పత్తిని వర్ణింపవలెను.
# హిమవత్పర్వతమునందే భూర్జవృక్షముల యుత్పత్తిని వర్ణింపవలెను.
# వసంతముననే కోకిల ధ్వనిని వర్ణింపవలెను.
# వర్షాకాలముందే మయూరనృత్యమును, వాని కేకలను వర్ణింపవలెను.
# విశేషించి చెప్పకున్నచోఁ బున్నములకును, జలములకు, ఛత్రమునకు, వస్త్రములకును దెల్లఁదనమే వర్ణింపవలెను.
# శాలి, మండూక, వల్కల, పరాగములకుఁ బీతత్వమునే వర్ణింపవలెను.
# విశేషించి చెప్పకున్నచో మాణిక్య, జపాపుష్ప, రత్న, సూర్య, పద్మ, పల్లవ, బంధూక (మంకెన), దాడిమి, నఖములకు శోణవర్ణమే వర్ణింపవలెను.
{{left|ఈక్రిందివాని కైక్యమును వర్ణింపవచ్చును (భేదమును బాటింపనక్కఱలేదు)}}
# కృష్ణ (నలుపు) నీల (ఆకాశవర్ణము) హరిత (ఆకుపచ్చ) శ్యామ (ముదురు పచ్చ)
వర్ణముల కార్యము చెప్పవచ్చును. భేదమును బాటింపనక్కఱలేదు.
# స్వర్ణ, పరాగ, అగ్నిశిఖాదులందున్న పీత (పసుపుపచ్చన) రక్తము(ఎఱుపు)లకు నైక్యము వర్ణింపవచ్చును.
# శుక్ల (అచ్చతెలుపు) గౌరములకు (బూడిదరంగు) నైక్యము వర్ణింపవచ్చును.
# చంద్రునియందు శశ, మృగముల కైక్యమును వర్ణింపవచ్చును.
# మదనకేతనమున మకర మత్స్యముల కైక్యమును వర్ణింపవచ్చును.
# సముద్రము నుండియు నత్రినేత్రమునుండియుఁ బుట్టిన చంద్రుల కైక్యము వర్ణింపవచ్చును.
# ద్వాదిశాదిత్యులకు నైక్యమును వర్ణింపవచ్చును.
# క్షీర లవణ సముద్రముల కైక్యమును వర్ణింపవచ్చును.
# నాగసర్పముల కైక్యమును వర్ణింపవచ్చును.
# దైత్య, దానవ, అసురులకు నైక్యమును వర్ణింపవచ్చును.
# మన్మథుని మూర్తత్వ (శరీరముండుట) అమూర్తత్వములకు నైక్యము వర్ణింపవచ్చును.
# నేత్రములకుఁ దెలుపు, నలుపు, ఎఱుపులు ప్రత్యేకముగాను, గలిసియున్నట్లు వర్ణింపవచ్చును.
# కమలా సంపదల కైక్యము వర్ణింపవచ్చును.
# శబ్దముచేఁ బర్వతములు బ్రద్దలగునట్లు వర్ణింపవచ్చును.
# వెన్నెలను జకోరములు పానము చేయుచున్నట్లు వర్ణింపవచ్చును.
# వర్షాకాలమున హంసలు మానససరస్సునకుఁ బోవునట్లు వర్ణింపవచ్చును.
# మానవులను శిరస్సు మొదలుకొనియు, దేవతలను బాదములు మొదలుకొనియు వర్ణింపవచ్చును. (దేవతలు పూజ్యులు గానఁ బాదములనుండి వర్ణింపవలెను)
# భువనములను 3, 7, 14 అనియును వర్ణింపవచ్చును.
# దిక్కులు, 4, 8, 10, అనియును వర్ణింపవచ్చును.
# సముద్రములు 4, 7, అనియును వర్ణింపవచ్చును.
# విద్యలు 4, 14, 18, అనియును వర్ణింపవచ్చును.
# స్థలమునందున్న జీవులు జలమునందును గలవని వర్ణింపవచ్చును.
# రణహతులు సూర్యమండలమును భేదించుకొని పోవుదురని వర్ణింపవచ్చును.
# శివుని శూలి (శూలము గలవాఁడు) యనవచ్చును. సర్పి (సర్పములు గలవాఁడు)
అనరాదు.
# చంద్రుని 'శశి’ (శశము గలవాఁడు) అనవచ్చును. కాని మృగి, హరిణి, అనరాదు.
# శంకరుని వృషభవాహనుఁడు, వృషాంకుఁడు, వృషధ్వజుఁడు, అవి యా యా యుపాధినిఁబట్టి చెప్పవచ్చును.
# శివుని 'ఇందుమౌళి' యనవచ్చును. కాని 'గంగామౌళి' యనరాదు.
# పద్మినీజాతి స్త్రీల తాఁకులవలనఁ బ్రియంగువృక్షము, వారి పుక్కిటి మద్య ముమియుటచేఁ బొగడచెట్టు, వారి కౌఁగిలిచే గోరంట, వారి కాలితన్నులచే నశోకవృక్షము, వారి చూపులచే బొట్టుగు చెట్టు, వారి నర్మవాక్యములచే మందారము, వారి హాసముచే సంపెంగ, వారి ముఖానిలముచే మామిడిచెట్టు, వారి సంగీతముచే సురపొన్న, వారి నర్తనముచేఁ గొండగోఁగుచెట్టును, వికసించును. (ఇది మల్లినాథుని యుదాహరణముల ననుసరించి వ్రాయబడినది. వసుచరిత్ర వ్యాఖ్యాత యీషద్భేదముతో నుదాహరించెను. భేదించినవి మాత్రము చూపుదుము.) మాకందము కరస్పర్శచేతను, సంపెంగ ముఖరాగముచేతను, గొండగోఁగు సల్లాపముచేతను, వావిలి ముఖానిలముచేతను, ప్రియాళువు సంగీతముచేతను వికసించును.
{{left|కావ్యమార్గమును నేయే వస్తువు లేయేవర్ణములుగా వర్ణింపఁబడునో తెలుపుదుము.}}
# చంద్ర, ఉచ్చైశ్శ్రవ, శంకర, నారద, భార్గవ, బలరామ, శేషసర్ప, ఐరావత, సింహ, సౌధ, శారదమేఘ, ఇందుకాంత, నిర్మోక (కుబుసము), మందార, హిమాద్రి, హిమ, హాస, మృణాళ, స్వర్గంగా, గజదంత, అభ్రక, సికతా (కలకండ), అమృత, లోధ్ర, గుణ, కైరవ, శర్కరలు శ్వేతములు.
# కృష్ణ-చంద్రాంక-వ్యాస-రామ-ధనంజయ-శని-ద్రౌపదీ-కాళీ-విష-ఆకాశ-అమావాస్యా-శస్త్ర-అగురు-పాప-అంధకార-నిశలును, మద-తమాల, రాహువులును — అద్భుత శృంగారములును నీలములు.
# క్షాత్రధర్మము-త్రేతాయుగము-రౌద్రరసము-చకోర-కోకిలా-పారావతనేత్రములును, వానరముఖము - తేజస్సు - అంగారకుఁడు - కుంకుమము - తక్షకుఁడును, జిహ్వా- ఇంద్రగోప- ఖద్యోత- విద్యుత్ - కుంజర బిందువులును (ఏనుఁగు నొడలిమీఁది బిందువులు) శోణములు.
# దీప- జీవ- ఇంద్ర - గరుడ - హరిలోచనములును, హర జటాజూటమును, బ్రహ్మయును. వీరరసమును - స్వర్ణము - కపి - ద్వాపరయుగము - గోరోచనలును, కింజల్కము- చక్రవాకి- హరితాళము- మనశ్శిల యివి పీతములు
# రజస్సు – సాలెపురుగు— ఒంటె - బల్లి- కపోతము - మూషకము- దుర్గ - కాకకంఠస్వరము మొ. ధూసరములు.
# సూర్యతురగములు హరితములు
{{p|ac|fwb}}ఋతువర్ణనము</p>
కవులు కాలౌచిత్యమును బాటింపవలెను. వారు దమ కావ్యములయం దా యా ఋతువులను వర్ణింపవలయును. ఆ వర్ణనములందు వారు ప్రమాదపడకుంటకై ఈ ఋతువర్ణనమును జూపుదుము. జ్యౌతిషికులు, సంవత్సరము చైత్రమాసముతో నారంభించుననియు, లోకయాత్రావేత్తలు శ్రావణమాసముతో నారంభించుననియును జెప్పుదురు.
{{p|ac|fwb}}వర్షర్తువు</p>
శ్రావణ భాద్రపద మాసములు వర్షర్తువు. ఈ ఋతువున, అందుగు, వరి, పుట్టగొడుగు, అడవిమొల్లలు, తఱిగొఱ్ఱ, గిరిమల్లిక, కడిమి, మద్ది, ఏఱుమద్ది, మొగలి మొదలగు చెట్లు పుష్పించును. ఆర్ద్రపురుగులు - వెన్నెలపులుగులు - చాతకములు - లేళ్లు-గోదురుకప్పలు- నెమిళ్లు-నీరుకాకులు-గ్రద్దలు వీనికిఁ గ్రొవ్వు పట్టును. బలాకాపక్షులు (బెగ్గురుపిట్టలు) గర్భము ధరించును. (గర్భాధానక్షణ పరిచయాత్ఖే భవంతం బలాకాః అని మేఘసందేశము). రజస్సు (ధూళి) శమించును. రాజులు యాత్రలనుండి నివర్తిల్లుదురు. వనభూములు శ్యామలములై యుండును. జలాసారములసలనఁ బర్వతములు గడఁగఁబడినట్లు రమ్యముగా నుండును. నదు లొడ్డులొరసి ప్రవహించుచు నొక్కొక్కచో గట్లు దెగుట లోకోపద్రవము గలిగించును. యతులును, చారులును దిరిగి వత్తురు. ప్రోషితభర్తృకలు భర్తలకై దారులు చూచుచుందురు. పాంథులు గృహములకు మఱలుదురు. మేఘబృందముచే నాకాశము చీఁకట్లు గ్రమ్మును. దిఙ్ముఖముల మెఱుఁగుఁదీఁగలు పరుగిడుచుండును. మేఘగర్జనములచే వైడూర్యభూములందు రత్నాంకురములు పొటకరించును. కామినీకాముకు లుద్యానయాత్రను జేయుదురు. సౌధోపరిభాగముల శయ్యలఁ గల్పింతురు. కస్తూరీమిశ్రమగు చతుస్సమవిలేపనమును (చందన, కుంకుమ, కర్పూర, అగురు మిశ్రితమగు మైపూఁత) బూసికొందురు. కృషీవలకుటుంబినీబృందములు రాసక్రీడలాడుదురు. కడిమిపూల వాసనగల పడమటిగాలి గాని తూరుపుగాలి గాని వీచును.
{{p|ac|fwb}}శరదృతువు</p>
ఆశ్వయుజ కార్తిక మాసములు శరదృతువు. ఈ ఋతువున లకుముకిపిట్టలకు, దుమ్మెదలకు - కన్నెలేళ్ళకు - హంసలకు - కాటుకపిట్టలకు చక్రవాకములకు - బెగ్గురుపిట్టలకు - కొక్కెరలకు - వృషభములకు - ఏన్గులకు - తాఁబేళ్లకు - కొంగలకు - బేడిసచేఁపలకును గ్రొవ్వు పట్టును. తామర లు - తెల్లకలువలు - నల్లకలువలు - ఎఱ్ఱకలువలు - మంకెనలు - కుంకుమవృక్షములు - ఏఁడాకులరఁటి - రెల్లు - మాలతీ లతలును బుష్పించును. మయూరముల క్రొవ్వడఁగును. హంసలు మానససరస్సునుండి మరలివచ్చును. అగస్త్యోదయముచే జలములు కలఁకఁదేఱును. ముత్తెపుఁజిప్పలు గర్భముఁ దాల్చును. మింటఁ దెల్లని మబ్బులుండును. మహానవమియందు శస్త్రాస్త్రపూజలు జరుగును. గుఱ్ఱములకును, ఏనుఁగులకును నీరాజనములు సేయుదురు. రాజులు యుద్ధయాత్రకు వెడలుదురు. బాటలయందు బురద యెండును. సూర్యకిరణములు దుస్సహములుగా నుండును. శ్రీమహావిష్ణువు నిద్రనుండి మేలుకొనును. పొలములలో వరి పండును. గోపికలు గీతములు పాడుదురు. ఈ ఋతువున నియతముగా వాయు వొకదిక్కునుండి వెడలక యన్నిదిక్కులనుండియును వీచును.
{{p|ac|fwb}}హేమంతర్తువు</p>
మార్గశీర్ష పౌష మాసములు హేమంతర్తువు. ఈ ఋతువున మల్లె - ముచుకుందము - లవలి - ప్రేంకణము - లొద్దుగ - సురపొన్నలు పుష్పించును. తుమ్మెదలకుఁ - బాములకు - మయూరములకును గ్రొవ్వడఁగును. కామినులు కుంకుమపువ్వును - గంధ తైలములను సేవింతురు. పెరుగు రుచ్యముగా నుండును. కామినీకుచములు నులివెచ్చగా నుండును. జనులు నులివెచ్చని జలముల స్నానమాడుదురు. స్త్రీలకు గాఢాలింగనసౌఖ్యమబ్బును. ఆడుపులులు ప్రసవించును. కూపజలములు గోరువెచ్చగా నుండుము. రేఁగులు, నారింజలును బాగుగా ఫలించును. చెఱుకున రసము చిప్పిలుచుండును. మందిరగర్భములందు శయనము; సరసులు గబ్భిగుబ్బలు గల ప్రియురాండ్ర భుజపంజరముల శయనింతురు. పగటిప్రమాణము తగ్గును. ఈ ఋతువునఁ బడమటిగాలి గాని యుత్తరపుగాలి గాని వీచును.
{{p|ac|fwb}}శిశిరర్తువు</p>
మాఘ ఫాల్గునములు శిశిరర్తువు. ఈ ఋతువు హేమంతమువలెనే యుండును. విశేషించి యేనుఁగులకు, లేళ్ళకు, పందులకు, దున్నలకుఁ గ్రొవ్వుపట్టును. కామినులు విచిత్రసురతోపభోగయోగ్యలుగా నుందురు. చందనమునం దరుచి గలుగును. జలములకు మిక్కిలి శైత్యము గలుగును. మరువకములును గుందములును బుష్పించును. కేళాకూళులయం దనాదర మేర్పడును. ఎల్లరును వెచ్చవెచ్చగాఁ గుంపట్లవద్దఁ గూర్చుండ నభిలషింతురు. ప్రచండవాయువు వీచును. కుంకుమపూతను బూసికొని యా చలినిఁ గామినులు సహింతురు.
{{p|ac|fwb}}వసంతర్తువు</p>
చైత్ర వైశాఖమాసములు వసంతర్తువు. ఈ ఋతువునఁ జిలుకలు, గోరువంకలు, తుమ్మెదలు, గండుగోయిలలును లెస్సగాఁ గ్రొవ్వును. దాదాఁ పన్నివృక్షములును జిగిరించును. ఎల్ల యుద్యానములందును నుయ్యాల లూఁగుట, పుష్పాపచయము, మధుపానము, మన్మథపూజ, గౌరీచరిత్రగానము, చంపకపుష్పాభరణము, కోకిలనాదములును బిక్కటిల్లుచుండును. దక్షిణవాయువు వీచును.
{{p|ac|fwb}}గ్రీష్మర్తువు</p>
జ్యేష్ఠాషాఢములు గ్రీష్మర్తువు. ఈ ఋతువున నవమాలికలు, శిరీషములు, చంపకములు, గేదంగులును బుష్పించును. ఖర్జూరములు, నేరేళ్ళు, పనసలు, మామిళ్లు, పోకలును బండును. ఒంటెలు, శరభమృగములు, కంచరగాడిదలును గ్రొవ్వును. నదీసరఃకూపాదు లెండిపోవును. చలిపందిరులందు బాటసారులు మూఁగియుందురు. పందిళ్ళలో మధ్యాహ్ననిద్ర సేయుదురు. దివసావసానమున స్నానము సేయుదురు. వేకువజామున సురతక్రీడలు సేయుదురు. చందనాది శీతలద్రవ్యములను సేవింతురు. రాత్రులందుఁ జంద్రికాసేవనము సేయుదురు. శరీరములకుఁ జందన మలఁదికొని భోగింతురు. భూతము లుడుకుచున్నట్లు, జలములు సెగలు లేచుచున్నట్లు, దుమ్ము కాలుచున్నట్లు, పర్వతములు మండుచున్నట్లును, మండును.
{{p|ac|fwb}}సంఖ్యానియమము</p>
ఏ యే వస్తువుల కేసంఖ్య నియతమో యా సంఖ్యానియమమును దెలుపుదును.
* ఏకసంఖ్యాకములు:— ఇంద్రగజము, ఇంద్రాశ్వము, గజాననదంతము, శుక్రాచార్యుని నేత్రము.
* ద్విసంఖ్యాకములు:— పక్షములు, నదీతీరములు, నరుని కర్ణములు, భుజములు, నేత్రములును.
* త్రిసంఖ్యాకములు:— కాలములు, అగ్నులు, భువనములు, గంగామార్గములు, హరుని నేత్రములు, గుణములు, కంఠరేఖలు, మహీకోణములు, శూలముయొక్క శిఖలు, సంధ్యలు, పురములు, రాములు (బలరామ, పరశురామ, శ్రీరాములు), విష్ణుజ్వరముయొక్క పాదములు.
* చతుస్సంఖ్యాకములు:— వేదములు, బ్రహ్మముఖములు, వర్ణములు (జాతులు), సముద్రములు, విష్ణహస్తములు, ఐరావతదంతములు, సేనాంగములు, ఉపాయములు, జాములు, యుగములు, ఆశ్రమములు.
* పంచసంఖ్యాకములు:― పాండవులు, హరుని ముఖములు, ఇంద్రియములు, దేవతరువులు, పంచవ్రతములు, పంచాగ్నులు, పంచభూతములు, పంచమహాపాపములు, పంచకావ్యములు, పంచయజ్ఞములు, పంచప్రాణములు.
* షట్సంఖ్యాకములు:― వజ్రకోణములు, పట్తర్కములు, షడంగములు, షడ్దర్శనములు, అరిషడ్వర్గము, షట్చక్రవర్తులు, షడ్గుణములు, షడ్రసములు, షట్కృత్తికలు.
* సప్తసంఖ్యాకములు:— సప్తపాతాళములు, సప్తభువనములు, సప్తమునులు, సప్తద్వీపములు, సప్తాశ్వములు (సూర్యునివి), సప్తవారములు, సప్తస్వరములు, సప్తరాజ్యాంగములు, సప్తజిహ్వలు (అగ్నివి), కులపర్వతములు.
* అష్టసంఖ్యాకములు:— యోగాంగములు, వసువులు, అష్టమూర్తులు, దిక్కులు, సిద్ధులు, అష్టదిక్పాలురు.
* నవసంఖ్యాకములు:— నవరంధ్రములు, నవఖండములు, వ్యాఘ్రీస్తనములు, సుధాఖండములు, నవనిధులు, నవరసములు, నవాంకములు (పుట్టుమచ్చలు), నవగ్రహములు.
* దశసంఖ్యాకములు:— హస్తాంగుళులు - శివహస్తములు - రావణశిరస్సులు - అవతారములు - దశదిక్కులు - విశ్వేదేవతలు - దశమన్మథావస్థలు.
* ఏకాదశసంఖ్యాకములు:― ఏకాదశరుద్రులు - ఏకాదశాక్షాహిణులు.
* ద్వాదశసంఖ్యాకములు:― సూర్యులు - రాసులు - మాసములు - కుమారస్వామి హస్తములు, నేత్రములును.
* త్రయోదశసంఖ్యాకములు: తాంబూలగుణములు.
* చతుర్దశసంఖ్యాకములు:― విద్యలు - అప్సరల వంశములు - మనువులు - చతుర్దశ భువనములు - ధ్రువతారలు.
* పంచదశసంఖ్యాకములు:― తిథులు
* షోడశసంఖ్యాకములు :— ఇందుకళలు - అంబికలు.
* అష్టాదశసంఖ్యాకములు:― ద్వీపములు - విద్యలు - పురాణములు- స్మృతులు - ధాన్యములు.
* వింశతిసంఖ్యాకములు:― రావణభుజములు - రావణనేత్రములు.
* శతసంఖ్యాకములు :— ధార్తరాష్ట్రులు - శతభిషక్తారలు - పురుషాయుషము - రావణాంగుళులు - శతపత్త్రిదళములు - శతయజ్ఞములు - సముద్రముయొక్క యోజనములు. (హనుమంతుఁడు నూరామడలు గల సముద్రమును దాఁటెను)
* సహస్రసంఖ్యాకములు:— గంగాముఖములు - శేషుని శీర్షములు- సహస్రపత్రపత్రములు - సూర్యకిరణములు - బాణాసుర కార్తవీర్యార్జునుల హస్తములు - వేదశాఖలు - ఇంద్రనేత్రములు.</ref>కవిసమయముల నీ క్రింద నుదాహరింతుము. చూచుకొనుఁడు.<noinclude><references/></noinclude>
kn4f9d8651kd30mo54fi78luwdi90qq
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/528
104
219178
583039
572057
2026-10-02T15:08:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583039
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
l9eg65gj596btg1lbcn6577gblt631p
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/529
104
219179
583040
572058
2026-10-02T15:09:21Z
దేవీప్రసాదశాస్త్రి
4290
[[WP:AES|←]]Replaced content with ''
583040
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
4bsu7gycf74s1bb8shxurzk4htk18gl
583041
583040
2026-10-02T15:09:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583041
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
l9eg65gj596btg1lbcn6577gblt631p
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/530
104
219180
583042
572059
2026-10-02T15:09:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583042
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
l9eg65gj596btg1lbcn6577gblt631p
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/531
104
219181
583043
572060
2026-10-02T15:10:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583043
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
l9eg65gj596btg1lbcn6577gblt631p
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/532
104
219182
583044
572061
2026-10-02T15:10:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583044
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
l9eg65gj596btg1lbcn6577gblt631p
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/533
104
219183
583045
572062
2026-10-02T15:10:52Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583045
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
l9eg65gj596btg1lbcn6577gblt631p
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/534
104
219184
583046
572063
2026-10-02T15:11:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583046
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><noinclude><references/></noinclude>
l9eg65gj596btg1lbcn6577gblt631p
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/535
104
219185
583047
572064
2026-10-02T15:33:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583047
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}11. విరసము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ధర ననుచితరసభావము
విరసం బగు నితనిసమదవిద్వేషితలో
దరులు దరులందుఁ గుందఁగ
సరసము లాడుదురు ప్రేమ శబరు లఁటన్నన్.</poem>|ref=50}}
అనుచితమగు రసభావము గల యర్థము విరసము. ఇతని శత్రుకాంతలు గుహలలోఁ గుందుచుండఁగాఁ గిరాతులు వారితో సరసము లాడుచున్నారు. 'మగఁడు చచ్చి యేడ్చుచుండ రంకుమగఁడు చళ్లు పిసికె నన్నట్లు కిరాతులు రాజకాంతలతో, నందును వారు దుఃఖించుచుండ, సరసము లాడుట యనౌచిత్యగ్రస్తము. ఔచిత్యము లేకుంటయే యిట దోషము. ధ్వనికారుఁడు
{{left margin|3em}}<poem>‘అనాచిత్యాదృతే నాన్యద్రసభంగస్యకారణం
ప్రసిద్ధౌచిత్యబంధస్తు రసస్యోపనిషత్పరా’</poem> </div><noinclude><references/></noinclude>
t4qy3hyae8gshyiroqsn17e1atsc2hr
583048
583047
2026-10-02T15:34:00Z
దేవీప్రసాదశాస్త్రి
4290
583048
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}11. విరసము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ధర ననుచితరసభావము
విరసం బగు నితనిసమదవిద్వేషితలో
దరులు దరులందుఁ గుందఁగ
సరసము లాడుదురు ప్రేమ శబరు లఁటన్నన్.</poem>|ref=50}}
అనుచితమగు రసభావము గల యర్థము విరసము. ఇతని శత్రుకాంతలు గుహలలోఁ గుందుచుండఁగాఁ గిరాతులు వారితో సరసము లాడుచున్నారు. 'మగఁడు చచ్చి యేడ్చుచుండ రంకుమగఁడు చళ్లు పిసికె’ నన్నట్లు కిరాతులు రాజకాంతలతో, నందును వారు దుఃఖించుచుండ, సరసము లాడుట యనౌచిత్యగ్రస్తము. ఔచిత్యము లేకుంటయే యిట దోషము. ధ్వనికారుఁడు
{{left margin|3em}}<poem>‘అనాచిత్యాదృతే నాన్యద్రసభంగస్యకారణం
ప్రసిద్ధౌచిత్యబంధస్తు రసస్యోపనిషత్పరా’</poem> </div><noinclude><references/></noinclude>
m7vwxk4jlrritnd9izd1kgxoe3mq9b7
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/536
104
219186
583049
572065
2026-10-02T15:59:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583049
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>‘అనౌచిత్యముకన్న రసభంగకారణము మరొకటి లేదు. ఔచిత్యబంధము గల కావ్యము రసోపనిషత్తే' అని నుడివెను.
ఈ విరసదోషము రసాభాసముననే చేరును. రాజకాంతలన నెల్లరకును దల్లులవంటివారు. అట్టి యగమ్యలగు కాంతలతో సరసము లాడుట యనుచితముగదా!
{{p|ac|fwb}}12. అతిమాత్రము - 13. హేతురహితము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>క్షితిలో లోకాతీతం
బతిమాత్రము; నింగి నిండె నబ్జాక్షికుచ
ద్వితయ మన; హేతుశూన్యము
సతి గనుఁగొనె భృంగపంక్తి చనుదెంచె ననన్.</poem>|ref=51}}
లోకాతీతమగు నర్థము ‘అతిమాత్రదోషము'. ఆ యువతి స్తనద్వయము నింగి నిండెను. ఇట్టిదే యీక్రింది శ్లోకము
{{left margin|3em}}<poem>పాతాలమివ నాభిస్తే పర్వతా వివ చస్తనా
వేణీదండః పునరయం కాళిందీపాత సన్నిభః</poem> </div>
నీనాభి పాతాళమువలె నున్నది నీ స్తనములు పర్వత మాలవలె నున్నవి. నీ వేణీదండము కాళిందీప్రవాహమువలె నున్నది. (ఆంధ్రప్రబంధములలో ‘చనుగొండలు’ అని పెక్కండ్రు ప్రయోగించిరి)
దీని ననుచితదోషమని దర్పణకార ప్రకాశకారులు తెలిపిరి.
హేతువురు జెప్పకుండుట హేతుశూన్యము. దీనినే యితరులు నిర్హేతువనిరి. భృంగపంక్తి వచ్చుటకు హేతువు “తదానన పరిమళాభిరామ" అని చెప్పఁబడలేదు.
ప్రఖ్యాతార్థమున హేతురహితదోషము లేదు. ఎట్లన
{{left margin|3em}}<poem>శ్లో॥ చంద్రం గతా పద్మగుణాన్నభుంక్తే పద్మాశ్రితా చాంద్రమసీ మభిఖ్యాం
ఉమాముఖంతు ప్రతిపద్య లోలా ద్విసంశ్రయాం ప్రీతి మవాప లక్ష్మీః</poem> </div>
చంచలురాలగు లక్ష్మి చంద్రుని నాశ్రయించి పద్మగుణములను (సౌరభాదులను) ననుభవింపదయ్యెను. పద్మము నాశ్రయించి చంద్రశోభను ననుభవింపదయ్యెను. కాని యుమాముఖము నాశ్రయించి చంద్రపద్మోభయగతమగు శోభ ననుభవించి ప్రీతినిఁ బొందెను.
ఇట లక్ష్మి 'చంద్రుని నాశ్రయించి పద్మగుణముల ననుభవింపదయ్యెను’ అన్నపు డేల యనుభవింపదయ్యెనో హేతువు చెప్పఁబడలేదు. కాన దోష మనవచ్చును. కాని యిట హేతువు ప్రసిద్ధము.రాత్రి పద్మము ముకుళించును. కావునఁ,<noinclude><references/></noinclude>
6qa9xhfcub3tso2cbgktdgbdliio6qb
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/537
104
219187
583059
572066
2026-10-02T19:02:55Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583059
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బద్మగుణములగు సౌరభాదుల ననుభవింపదయ్యెను. రాత్రియందుఁ బద్మముకుళనము ప్రసిద్ధము కావున గవి యాహేతువును బేర్కొనలేదు. “పద్మము నాశ్రయించి పగటఁ జంద్రశోభ ననుభవింపదయ్యెను" అనుచో నేల చంద్రశోభ ననుభవింపదయ్యెమోనో హేతువు చెప్పఁబడలేదు. ఇట హేతువగు చంద్రుని నిష్ప్రభత్వము ప్రసిద్ధము. పగటఁ జంద్రుఁడు వెలవెలఁ బోవుచుండును గదా!
ఇట్లే 'సతిఁ గనుగొని భృంగపంక్తి చనుదెంచె ననన్’ అనుచోఁ గూడ సమాధానమును జెప్పుకొనవచ్చును. భృంగములు పరిమళార్థ మేగుదెంచుట ప్రసిద్ధముగదా! కాన నిట దోషము లేదు.
{{p|ac|fwb}}14. నిరాలంకృతి ― 15. అశ్లీలము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ధర జాతిమాత్రశూన్యము
నిరలంకృతి; బాహుయుతుఁడు నృపుఁ డన; లజ్జా
కర మశ్లీలము; పద్మిని
సరసాంగజగృహము పద్మసౌరభ మనఁగన్.</poem>|ref=52}}
నిరలంకృతి యనఁగా నలంకారరహితము. రమణీయతాశూన్యమని భావము. జాతిమాత్రిశూన్యమన స్వభావోక్త్యలంకారముగూడ లేనిది. (స్వభావోక్తికి జాత్యలంకార మని పేరు) ‘ఈ రాజు బాహుయుతుఁడు' ఇం దేయలంకారమును లేదు. ఇది స్వభావోక్తిగాదా? అన్నచో శ్లాఘ్యమగు విశేషణము లున్ననే స్వభావోక్తి యగును. ఈక్రిందిది స్వభావోక్తి గాదు.
{{left margin|3em}}<poem>దీర్ఘపుచ్ఛశ్చతుష్పాదః కకుద్మాన్ లంబకంబలః
గోరపత్యం బలీవర్ద సృణమత్తి ముఖేన సః</poem> </div>
"పొడవైన తోకయు, నాలుగు కాళ్లును, మూఁపురమును గంగడోలును గల యావుబిడ్డయగు నెద్దు మూఁతితో గడ్డి తినుచున్నది" ఇందు శ్లాఘ్యమగు విశేషణములుగాని, శ్లాఘ్యమగు క్రియావిశేషణముగాని లేదు. శ్లాఘ్యమగు విశేషణమున కీ క్రింది పద్యమును గనుఁడు.
{{left margin|3em}}<poem>సీ. యమదండములఁబోని హస్తదండముల భీతినిఁగొల్పు జగజెట్టి "తిప్పరాజు”
ప్రణకిణాంకం బైన వక్షశ్శిలావేదిఁ గత్తులనూఱు "శ్రీకంఠరాజు”
భుజవిక్రమముఁ పైకిఁ బొంగినచందాన నిక్కుమూఁపుల "పెద్దచొక్కరాజు”
బడుగుమేనికి కల్గువలువయే కవచంబుగాఁ దాల్చు “గయికొండ గంగరాజు”
గీ. తనదు డాచేతినిం గేడెమునఁగఁజేసి । యాలములయందు మార్కొను “అచ్చిరాజు”
వాఁడిగోరులఁ నరసింహుపగిదిఁ జీల్చు । “బసవరాజును” వచ్చిరి బవరమునకు.</poem> </div><noinclude><references/></noinclude>
ajkiykcbih12re3uqmxigd5at2wnfuw
583060
583059
2026-10-02T19:03:27Z
దేవీప్రసాదశాస్త్రి
4290
583060
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బద్మగుణములగు సౌరభాదుల ననుభవింపదయ్యెను. రాత్రియందుఁ బద్మముకుళనము ప్రసిద్ధము కావున గవి యాహేతువును బేర్కొనలేదు. “పద్మము నాశ్రయించి పగటఁ జంద్రశోభ ననుభవింపదయ్యెను" అనుచో నేల చంద్రశోభ ననుభవింపదయ్యెమోనో హేతువు చెప్పఁబడలేదు. ఇట హేతువగు చంద్రుని నిష్ప్రభత్వము ప్రసిద్ధము. పగటఁ జంద్రుఁడు వెలవెలఁ బోవుచుండును గదా!
ఇట్లే 'సతిఁ గనుగొని భృంగపంక్తి చనుదెంచె ననన్’ అనుచోఁ గూడ సమాధానమును జెప్పుకొనవచ్చును. భృంగములు పరిమళార్థ మేగుదెంచుట ప్రసిద్ధముగదా! కాన నిట దోషము లేదు.
{{p|ac|fwb}}14. నిరలంకృతి ― 15. అశ్లీలము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>ధర జాతిమాత్రశూన్యము
నిరలంకృతి; బాహుయుతుఁడు నృపుఁ డన; లజ్జా
కర మశ్లీలము; పద్మిని
సరసాంగజగృహము పద్మసౌరభ మనఁగన్.</poem>|ref=52}}
నిరలంకృతి యనఁగా నలంకారరహితము. రమణీయతాశూన్యమని భావము. జాతిమాత్రిశూన్యమన స్వభావోక్త్యలంకారముగూడ లేనిది. (స్వభావోక్తికి జాత్యలంకార మని పేరు) ‘ఈ రాజు బాహుయుతుఁడు' ఇం దేయలంకారమును లేదు. ఇది స్వభావోక్తిగాదా? అన్నచో శ్లాఘ్యమగు విశేషణము లున్ననే స్వభావోక్తి యగును. ఈక్రిందిది స్వభావోక్తి గాదు.
{{left margin|3em}}<poem>దీర్ఘపుచ్ఛశ్చతుష్పాదః కకుద్మాన్ లంబకంబలః
గోరపత్యం బలీవర్ద సృణమత్తి ముఖేన సః</poem> </div>
"పొడవైన తోకయు, నాలుగు కాళ్లును, మూఁపురమును గంగడోలును గల యావుబిడ్డయగు నెద్దు మూఁతితో గడ్డి తినుచున్నది" ఇందు శ్లాఘ్యమగు విశేషణములుగాని, శ్లాఘ్యమగు క్రియావిశేషణముగాని లేదు. శ్లాఘ్యమగు విశేషణమున కీ క్రింది పద్యమును గనుఁడు.
{{left margin|3em}}<poem>సీ. యమదండములఁబోని హస్తదండముల భీతినిఁగొల్పు జగజెట్టి "తిప్పరాజు”
ప్రణకిణాంకం బైన వక్షశ్శిలావేదిఁ గత్తులనూఱు "శ్రీకంఠరాజు”
భుజవిక్రమముఁ పైకిఁ బొంగినచందాన నిక్కుమూఁపుల "పెద్దచొక్కరాజు”
బడుగుమేనికి కల్గువలువయే కవచంబుగాఁ దాల్చు “గయికొండ గంగరాజు”
గీ. తనదు డాచేతినిం గేడెమునఁగఁజేసి । యాలములయందు మార్కొను “అచ్చిరాజు”
వాఁడిగోరులఁ నరసింహుపగిదిఁ జీల్చు । “బసవరాజును” వచ్చిరి బవరమునకు.</poem> </div><noinclude><references/></noinclude>
knrxz5knytlp6n5frlkc2l9p33qimaw
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/538
104
219188
583061
572067
2026-10-02T19:20:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583061
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'హస్తదండములు గల తిప్పరాజు’ అన్నచో స్వభావోక్తి గాదు. 'యమదండములఁబోని' అను శ్లాఘ్యమగు విశేషణము వేయఁబడియున్నది. మిగిలిన యెడల నిట్లే యూహించుకొనవలెను.
శ్లాఘ్యమగు క్రియావిశేషణమున కీ క్రింది పద్య ముదాహరణము.
{{left margin|3em}}<poem>క. కలియఁబడ రదనకాంతులు,
మెలిపడఁ గ్రేఁగనులు, పెనయ మెయిదోయియు, మో
ములు క్రిందుమీఁదులంబడ,
విలాసిమిథునంబు వెలసె విరిపాన్పుపయిౝ.</poem> </div>
అశ్లీలమన లజ్జాకరమగు నర్థము. పద్మినియొక్క (తామరతూఁటియొక్క) సరసాంగజగృహము (తన సరసమైన యంగము పుట్టినచోటు అనఁగా సరస్సు) పద్మసౌరభము (పద్మములయొక్క పరిమళము గలది). తామరతూఁటియొక్క జన్మస్థానమగు సరస్సు పద్మపరిమళము గలది అని తాత్పర్యము. "పద్మినీజాతి స్త్రీయొక్క సరసమైన మన్మథగృహము తామరపూవు పరిమళమువంటి పరిమళము గలది” అనియు నశ్లీలార్థము తోఁచుచున్నది. ఇది దోషము.
{{p|ac|fwb}}16. సహచరచ్యుతము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>సరిగా సరిగా నిది యు
ర్వరపైఁ బొందింప సహచరభ్రష్టంబౌఁ;
బరఁగు నెలచేత గగనం
బరుదుగ ఫేనంబుచేత నంబుధి యనఁగన్.</poem>|ref=53}}
అతుల్యములగువాని నిబంధించినచో సహచరచ్యుతము లేక సహచరభ్రష్టము. చంద్రునిచే నాకాశము, ఫేసముచే సముద్రుఁడును వెలుఁగును.
ఆకాశము చంద్రునిచే శోభిల్లు విధమున ఫేనముచే సముద్రుఁడు శోభిల్లఁడు. ఇట నీ వాక్యద్వయమునకును సాహచర్యము బాగుగా లేదు.
{{p|ac|fwb}}17. భిన్నము</p>
{{Telugu poem|type=క.|lines=<poem>భిన్నం బగుసంబంధవి
భిన్నం; బీతనివిరోధి పృథివీశ్వరుఁ డా
పన్నుం డై తననుదురున
నన్నలినజువ్రాఁత శూన్య మని పల్కు ననన్.</poem>|ref=54}}<noinclude><references/></noinclude>
piegporr0dnxd1ghqy7cdtndyknvwwk
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/539
104
219189
583062
572068
2026-10-02T20:15:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583062
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సంబంధవర్జితమైన యర్థము భిన్నము. ఇతని శత్రురా జాపన్నుఁడై తననుదుట బ్రహ్మవ్రాఁత లేదని తలఁచును. బ్రహ్మవ్రాత లేమికిని నాపన్నత్వమునకును సంబంధము లేదు. (బ్రహ్మయొక్క చెడువ్రాఁతకును నాపన్నతకును సంబంధ ముండును.)
ప్రతాపరుద్రీయమున ‘అపార్థము' అను దోష మీయఁబడినది. "సముదాయార్థశూన్యం యదపార్థం తదుచ్యతే” సముదాయార్థము లేని దపార్ధము.
{{left margin|3em}}<poem>కుతః శుష్యదపోనద్యః? కా వార్తా చోళమండలే?
ఫణాసహస్రం శేషస్య భారః; కతి కులాచలాః?</poem> </div>
నదులలో నీ రేల యెండెను? చోళమండలవిశేషము లేమి? శేషునికి వేయితలలు భారము. కులశైలము లెన్ని?
ఇట వాక్యార్థము స్ఫురింపదు.
సరసభూపాలీయమునఁ జెప్పఁబడనియు, దర్పణకార, ప్రకాశకారులు పేర్కొన్నవియునగు పదుమూఁడు దోషములు గలవు. వానినిఁగూడ నుదాహరింతుము.
{{p|ac|fwb}}1. వ్యాహతము</p>
{{left margin|3em}}<poem>ఉత్కర్షో వాపకర్షోవా ప్రాగ్యస్యైవ నిగద్యతే
తస్యైవాథ తదన్యశ్చే ద్వ్యాహృతో౽ర్థ స్తదాభవేత్</poem> </div>
ప్రథమమున నొకదాని కుత్కర్షము గాని యపకర్షము గాని చెప్పి మరల దానికి భిన్నముగాఁ జెప్పినచో వ్యాహతార్థమను దోషమగును.
{{left margin|3em}}<poem>క. ... ... ... కుందనపుటొడల్
కసుగందిన కందుకమన । వసివాళ్వాడెన్ నిదాఘపరపీడనచేౝ. అనిచెప్పి</poem> </div>
{{left margin|3em}}<poem>గీ. కన్నెగేదంగిచెండు నాఁ గళుకు లొలయు । నా వెలందియొడల్ ... అని వర్ణించెను.</poem> </div>
మొదటఁ గసిగందినకందుకమన వసివాళ్వాడిన శరీరము (అపకర్షము) కన్నెగేదంగిచెండునాఁ గళుకులొలయుచున్నదఁట (ఉత్కర్షము). ఇట వ్యాహతార్ధము స్పష్టము. ఇది మహాకవి రాయప్రోలు సుబ్బారావుగారిది.
{{p|ac|fwb}}2. గ్రామ్యము</p>
{{left margin|3em}}<poem>"స గ్రామ్యో౽ర్థోరిరంసాదిః పామరైర్యత్ర కథ్యతే
వైదగ్ధ్య వక్రిమబలం హిత్వైన వనితాదిషు”</poem> </div>
పామరులాడు రిరంసాద్యర్థము గ్రామ్యము. వైదగ్ధ్యముగల వక్రోక్తులతో వనితలతో మాటలాడవలయును. వారలును నట్లే ముచ్చటింపవలయును. అట్లుగాక గ్రామ్యోక్తులతోడనే చేయు సంభాషణము గ్రామ్యము.<noinclude><references/></noinclude>
pgv3crlnn3frtv8156be1eplfv6339z
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/540
104
219190
583063
572069
2026-10-02T20:32:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583063
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|3em}}<poem>క. సుదతీ! నీ కుచగిరు లిటు
గదిసివడిం గూలినట్టి కారణమేమే!
చెదరి గిరులైనఁ గూలవె?
కదిసి వడిం గ్రిందఁ ద్రవ్వఁగాఁ జెలువుండా!</poem> </div>
నాయికానాయకు లిరువురును నవిదగ్ధులు. ఇది సురతగోష్ఠిలో గుణమే యగును.
{{left margin|3em}}<poem>క. కలకలుపుగ నలుపెఱుపులు
వెలయఁగఁ గ్రొమ్మావిచిగురు వెలువడి టెంకన్
గొలుపునిదె కనులు పండువు
వెలదీ! తామేటిచిప్ప వెడలు తలవలెౝ.</poem> </div>
ఇట నాయకుఁడు వ్యంగ్యముగా గుహ్యాంగవర్ణనము సేయుచున్నాఁడు. వీఁడు విదగ్ధుఁడు. కాన నిది గ్రామ్యము గాదు.
{{p|ac|fwb}}3. అనవీకృతము</p>
ప్రకారాంతముచే నూతనత్వము సహింపని యర్థము.
ప్రాప్తాశ్శ్రియస్సకలకామదుఘాస్తతః కిం।
దత్తం పదం శిరసి విద్విషతాం తతః కిమ్?
సంతర్పితాః ప్రణయినో విధవైస్తతః కిం।
కల్పం స్థితం తనుభృతాం తనుభిస్తతః కిం?
ఎల్లకామములను బిండు సిరులు లభించినవి. దాన నేమగును? శత్రుశిరస్సులపైఁ గాలు మోపితిని. దాన నేమగును? యాచకులు ధనములచేఁ దృప్తులయిరి. దాన నేమగును? ప్రాణులు కల్పాంతముదాఁక జీవింతురు. దాన నేమగును?
ఇట ‘తతఃకిం' అనువానినిఁ బ్రకారాంతమునఁ జెప్పక దానినే పలుసారులు చెప్పినాఁడు. ఇది పునరుక్తి కాఁజాలదు. ఏలన నిట ‘తతఃకిం' అను శబ్దమును గూర్చి తదర్ధమును బోధించు నితర శబ్దములకు ననఁగా 'కిం తస్మాత్’ ‘ఏతస్మాత్ కిo’ 'ఇతః కిం' అని చెప్పినను దోషము దొలఁగదు. అనఁగా నర్థమునఁ గ్రొత్తఁదనము లేదు. ఇట్లే
{{left margin|3em}}<poem>గీ. చక్కఁదనమున కొకవింత చక్కఁదనము
జవ్వనంబున కొకవింత జవ్వనంబు
విభ్రమంబున కొకవింత విభ్రమంబు
గలిగె నద్దివ్యకుసుమంబుకతనఁ జెలికి. (పారిజాతాపహరణము)</poem> </div><noinclude><references/></noinclude>
htpvnxoerku0toexf2l8u29e5z1fhbl
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/541
104
219193
583064
572072
2026-10-02T21:25:03Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583064
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఇట 'ఒకవింత' అను పదము నవీకృతముగా లేదు. కాన ననవీకృతదోషజుష్టము. పునరుక్తిదోషమున నా శబ్దమును దొలఁగించినచో దోషమును దొలఁగును. కావున నీకింది శ్లోకమున నున్నవిధమున నవీకృతత్వ ముండవలెను.
{{left margin|3em}}<poem>యది దహత్యనలో౽త్ర కి మద్భుతం । యది చ గౌరవమద్రిషు కిం తతః
లవణమంబు సదైవ మహోదధేః । ప్రకృతిరేవ సతామవికారితా॥</poem> </div>
అగ్ని కాల్చునన్న నద్భుతమేమి? పర్వతములు బరువుగా నుండునున్న విశేషమేమి? సమద్రోదక మెప్పుడును లవణమే. సజ్జనుల కెప్పుడును నవికారిత్వమే (సంకటములలో దఃఖింపకుంటయే) ప్రకృతి. (అగ్నియుఁ బర్వతములును సముద్రములును నెప్పుడును వికారమును బొందనివిధమున సజ్జనులును వికారమును బొందరు.)
ఈ శ్లోకమున కిమద్భుతం, కిం తతః, సదైవ, అనువానిచే నర్థము నవీకృతమైనది. ఇట్లే
{{left margin|3em}}<poem>చ. సురపతి నొంచితిన్; జముని చొప్పడఁగించితి; శ్రీదు మాఁపితిన్;
వరుణుని గెల్చితిౝ; శశిదివాకరులం బనిగొంటి; నాకు నీ
వరుఁ డొకలెక్కయే? యొకయనంగుని కోఁపఁగఁజాల నింక నీ
చరణములాన యింతదయ సల్పఁగరాదె? త్రిలోకసుందరీ!</poem> </div>
ఇట నొంచితిన్, చొప్పడఁగించితిన్, మాఁపితిౝ, గెల్చితిన్, పనిఁగొంటిౝ అనువానిచే నర్థము నవీకృతమైనది.
{{p|ac|fwb}}4. సనియమపరివృత్తము</p>
సనియమముగాఁ జెప్పవలసినచోట ననియమముగాఁ జెప్పుట
"ఆపాతసరసే భోగే నిమగ్నాః కిన్న కుర్వతే?" ఆపాతముగానే సరసమైన భోగమున మగ్నులగువా రేమిసేయరు?
ఇట ‘ఆపాతసరసే’ అనుచో ‘ఆపాతమేవసరసే’ అను నియమమును జెప్పవలెను. ఆపాతముగానే సరసముగాని పరిణామమున ‘విరసము' అనునర్థము రావలయును. అప్పుడు నియమమును చెప్పుకొనవలయును.
{{p|ac|fwb}}2. అనియమపరివృత్తము</p>
అనియమమును చెప్పుకొనవలసియుండఁగా నియమముఁ జెప్పుట దోషము.
ఆవర్త ఏవనాభిస్తే । క్షేత్రే నీలసరోరుహే
భంగాశ్చవళయనేన । త్వం లావణ్యాంబువాపికా
నీనాభి యావర్తమే, నీ నేత్రములు నల్లవలువలు, నీవళులు తరంగములు, నీవు లావణ్యనదివి.<noinclude><references/></noinclude>
k3qx6xn4yukgc9fev0ot7fjd8wz34sz
583065
583064
2026-10-02T21:25:41Z
దేవీప్రసాదశాస్త్రి
4290
583065
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఇట 'ఒకవింత' అను పదము నవీకృతముగా లేదు. కాన ననవీకృతదోషజుష్టము. పునరుక్తిదోషమున నా శబ్దమును దొలఁగించినచో దోషమును దొలఁగును. కావున నీకింది శ్లోకమున నున్నవిధమున నవీకృతత్వ ముండవలెను.
{{left margin|3em}}<poem>యది దహత్యనలో౽త్ర కి మద్భుతం । యది చ గౌరవమద్రిషు కిం తతః
లవణమంబు సదైవ మహోదధేః । ప్రకృతిరేవ సతామవికారితా॥</poem> </div>
అగ్ని కాల్చునన్న నద్భుతమేమి? పర్వతములు బరువుగా నుండునున్న విశేషమేమి? సమద్రోదక మెప్పుడును లవణమే. సజ్జనుల కెప్పుడును నవికారిత్వమే (సంకటములలో దఃఖింపకుంటయే) ప్రకృతి. (అగ్నియుఁ బర్వతములును సముద్రములును నెప్పుడును వికారమును బొందనివిధమున సజ్జనులును వికారమును బొందరు.)
ఈ శ్లోకమున కిమద్భుతం, కిం తతః, సదైవ, అనువానిచే నర్థము నవీకృతమైనది. ఇట్లే
{{left margin|3em}}<poem>చ. సురపతి నొంచితిన్; జముని చొప్పడఁగించితి; శ్రీదు మాఁపితిన్;
వరుణుని గెల్చితిౝ; శశిదివాకరులం బనిగొంటి; నాకు నీ
వరుఁ డొకలెక్కయే? యొకయనంగుని కోఁపఁగఁజాల నింక నీ
చరణములాన యింతదయ సల్పఁగరాదె? త్రిలోకసుందరీ!</poem> </div>
ఇట నొంచితిన్, చొప్పడఁగించితిన్, మాఁపితిౝ, గెల్చితిన్, పనిఁగొంటిౝ అనువానిచే నర్థము నవీకృతమైనది.
{{p|ac|fwb}}4. సనియమపరివృత్తము</p>
సనియమముగాఁ జెప్పవలసినచోట ననియమముగాఁ జెప్పుట
"ఆపాతసరసే భోగే నిమగ్నాః కిన్న కుర్వతే?" ఆపాతముగానే సరసమైన భోగమున మగ్నులగువా రేమిసేయరు?
ఇట ‘ఆపాతసరసే’ అనుచో ‘ఆపాతమేవసరసే’ అను నియమమును జెప్పవలెను. ఆపాతముగానే సరసముగాని పరిణామమున ‘విరసము' అనునర్థము రావలయును. అప్పుడు నియమమును చెప్పుకొనవలయును.
{{p|ac|fwb}}2. అనియమపరివృత్తము</p>
అనియమమును చెప్పుకొనవలసియుండఁగా నియమముఁ జెప్పుట దోషము.
{{left margin|3em}}<poem>ఆవర్త ఏవనాభిస్తే । క్షేత్రే నీలసరోరుహే
భంగాశ్చవళయనేన । త్వం లావణ్యాంబువాపికా</poem> </div>
నీనాభి యావర్తమే, నీ నేత్రములు నల్లవలువలు, నీవళులు తరంగములు, నీవు లావణ్యనదివి.<noinclude><references/></noinclude>
pnup2pd2bgs3crwwbrpiboxmssksrvv
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/542
104
219194
583067
572073
2026-10-02T23:40:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583067
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఇట నీ నాభి యావర్తమే! అను నియమము గూడదు.
{{left margin|3em}}<poem>చ. ...తన్మయయోగ్యమైన మా ।
నుషదశయే కృతార్థమ యనున్.</poem> </div>
ఇట “కృతార్థమ” అను నవధారణవాచకప్రయుక్తమగు నియమము గూడదు. ఇది కవిభూషణ రాయప్రోలు సుబ్బారావుగారి పద్యము.
{{p|ac|fwb}}6. సువిశేషపరివృత్తము</p>
సవిశేషముగాఁ జెప్పవలసియుండఁగా నవిశేషముగాఁ జెప్పుట దోషము.
“యాంతి నీలనిచోలిన్యో రజనీష్వభిసారికాః” రాత్రులయం దభిసారికలు నల్లని తొడుగులు దాల్చి పోవుచున్నారు.
ఇట 'రజనీషు” అని యవిశేషము గాక 'తమిస్రాసు' (చీఁకటిరాత్రులందు) అని చెప్పవలెను. అప్పుడు నల్లదొడవులకుఁ బ్రయోజనము సంఘటిల్లును.
{{p|ac|fwb}}7. అవిశేషపరివృత్తము</p>
అవిశేషముగాఁ జెప్పవలసినయెడల సవిశేషముగాఁ జెప్పుట.
"హీరకాణాం విధే రస్య సింధోః కిం వర్ణయామహే?” వజ్రములకు నిధి యగు నీ సముద్రమును నేమి వర్ణింపఁగలము?
ఇట సముద్రము రత్నాకరము కాన 'రత్ననిధి' యని “రత్నానాం నిధేః” యని యవిశిష్టముగాఁ జెప్పవలెను. కాని రత్నవిశేషమగు "వజ్రముల నిధి” అని చెప్పరాదు.
{{p|ac|fwb}}8. సాంకాంక్షము</p>
ఆకాంక్షతోఁ గూడినది.
{{left margin|3em}}<poem>చ. క్రమమని యక్రమంబని పరస్పరభిన్నమనోవికారసం
భ్రమములఁ గొన్నినాళ్ళు వలవంతలఁ జిక్కితి; దేశకాలపా
త్రములని కొన్నినాళ్లు నిశితవ్యధ నొందియుఁ దాళుకొంటి నా
కమలదళాక్షిపై మమత... (కవిభూషణ రాయప్రోలు సుబ్బారావుగారిది).</poem> </div>
“దేశకాలపాత్రములు” అనునది యాకాంక్షను గోరుచున్నది. దేశకాలముల యానుకూల్యమునకై యనునర్థము గావలయును. మరియు నిటఁ బాత్రపద మనవసరము.<noinclude><references/></noinclude>
px09wnpy9cjklhznjba919kk6mjb6qv
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/543
104
219195
583068
572074
2026-10-03T00:00:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583068
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}9. అపదయుక్తము</p>
అస్థానసంబద్ధమైన యర్థము. ప్రకృతార్థమునకు విరుద్ధమైన యర్థము గలిగియుండుట యపదయుక్తము.
{{left margin|3em}}<poem>సీ. ఎవని యాజ్ఞాపనం బెల్లవేల్పుల నేలు దేవేంద్రుతలమీఁది పూవుదండ;
ఎవ్వానికాపురం బివ్వసుంధర సాటి చూపఁగారాని లంకాపురంబు;
ఎవనిభక్తిపరత్వ మీశ్వరేశ్వరునందుఁ బార్వతీపతియందుఁ బాయకుండు
ఎవనిక్రొంగన్నులు వివిధశాస్త్రంబు; లుత్పత్తి వేనికి బ్రహ్మవంశమందు;
గీ. వాఁడు వరుఁడౌట మెచ్చఁగావలయు; నదియ
కాని రావణుఁ డనుమాట కాని మాట;
యుర్వి నెందునేఁగాని సర్వగుణము
లొక్కచోఁ గూడియుండుట చిక్కదుగద. (బాలరామాయణనాటకము)</poem> </div>
సీతాస్వయంవరమునకు రావణుఁడు గూడ వచ్చుచున్నాఁడని తెలిసి జనకశతానందులు మాటలాడుకొనుచున్నారు.
శతానందుఁడు:― "ఆహాహా! ఆశ్చర్యము! ఒక్కటైనను గొప్పతప్పిదము గుణసముదాయమును బాడుచేయును. అంతేకదా!” అని నుడివి యీ పై సీసపద్యమును జదువుచున్నాఁడు. ఆతఁడు "కాని రావణుఁ డనుమాట కానిమాట” (స్యాచ్చేదేష న రావణః) అన్నంతవఱకే సమాప్తిచేసియుండవలసినది. 'ఉర్విలో నెందునేకాని' ఇత్యాది వచనము సమాధానముగాఁ బర్యవసించుచు రావణోపేక్షాప్రతీతినిఁ గప్పివేయుచున్నది. 'ఇతఁడు రావణుఁడుమాత్రము గాకున్నచో బాగుగా నుండెడిది. మిగిలిన పరణీయ గుణము లన్నియును గలవు' అన్నఁ జాలును. 'ఎవనికి లోకములో సర్వగుణములును నుండును? అనువచనము రావణున కీ కన్య నీయవచ్చుననియే తోఁపింపఁజేయుచున్నది. అంతవఱకే సమాప్తి చేసినచో నీ గుణము లున్నను వీఁడు రావణుఁడు గానఁ గన్య నీయఁగూడదు' అనునర్థము వచ్చును.
{{p|ac|fwb}}10. ప్రకాశితవిరుద్ధము</p>
ఏవాక్యముచేఁ బ్రతిపాదింపఁబడినట్టియు వివక్షితమైనట్టియు నర్థమునకుఁ బ్రతికూలమగు నర్థము గోచరించునో యది ప్రకాశితవిరుద్ధము.
"కుమారస్తే నరాధీశ! శ్రియం సమధిగచ్ఛతు” ఓరాజా! నీ పుత్త్రుఁడు నీసిరినిఁ బొందుఁగాక.<noinclude><references/></noinclude>
b659jbs28mbmwudyrx8g2mw72vk7ukl
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/544
104
219196
583070
572075
2026-10-03T01:04:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583070
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{nop}}
ఇట 'నీవు మరణింపుము' అను విరుద్ధార్థము ప్రకాశించుటవలనఁ బ్రకాశితవిరుద్ధము.
{{p|ac|fwb}}11. విధ్యయుక్తము</p>
విధింపవలసినదానిని విధింపకుండుట. అయుక్తమగు విధినిఁ జేయుట.
"ఆనందితే స్వపక్షో౽సౌ పరపక్షాన్ హనిష్యతి" ఆనందింపఁజేయఁబడిన స్వపక్షముగల యితఁడు పరపక్షములను జంపును.
ఇట 'పరపక్షములను జంపి స్వపక్షము నానందపఱచును’ అని విధింపవలయును.
{{p|ac|fwb}}12. అనువాదాయుక్తము</p>
విధి కననుగుణనుగు ననువాద్యమును చెప్పుట. అయుక్తమగు ననువాదము చేయుట.
{{left margin|3em}}<poem>అరే! రామాహస్తాభరణ! భసలశ్రేణిశరణ!
స్మరక్రీడావ్రీడాశమన! విరహిప్రాణదమన!
సరోహంసోత్తంస! ప్రచలదల! నీలోత్పల! సఖే!
సఖేదో౽హం మోహం శ్లధయ! కధయ క్వేందువదనా!</poem> </div>
ఓమిత్రమా! నీలోత్పలమా! నేను ఖిన్నుఁడనైయున్నాను. నా మోహమును వదలింపుము. నాప్రియురా లెట నున్నది?
విరహియగువాఁడు స్వమోహశ్లధనమునకై చేయు ప్రార్థనారూపవిధిలో విరహిప్రాణదమనత్వరూపానువాదము యుక్తము గాదు. ఏలన విరహిప్రాణిదమనమును జేయునది విరహిమోహశ్లధన మెట్లు చేయలగలదు?
{{p|ac|fwb}}13. త్యక్తపునస్స్వీకృతము (నిర్ముక్తపునరుక్తము)</p>
{{left margin|3em}}<poem>లగ్నం రాగావృతాంగ్యా సుదృఢమిహ యయైవాసియష్ట్యా౽రికంఠే
మాతంగానామసీహోపరి పరపురుపై ర్యాచ దృష్టా పతంతీ
తత్సంక్తో౽యం నకించిద్గణయితి విదితం తే౽స్తు తేనాస్మి దత్తా
భృత్యేభ్యశ్శ్రీనియోగాద్గరితుమితి గతే త్యంబుధిం యస్యకీర్తిః.</poem> </div>
రాజలక్ష్మి తనతండ్రియగు సముద్రునితోఁ దన జామాతయొక్క కథను దెలుపుమని కీర్తినిఁ బంపుచున్నది. “ఖడ్గలత రాగావృతాంగియై యరికంఠముల నాలింగనము సేసికొనుచున్నది. పిమ్మట నది మాతంగతతిమీఁదఁ బడుచుండఁగా నెల్లపరపురుషులును జూచుచునే యున్నారు. అట్టి (యసతియగు ) దానియం దాసక్తుఁడై యుక్తాయుక్తవిచారము లేక వర్తిల్లుచున్నాఁడు. నీ కీసంగతి తెలియనిమ్ము. మరియు నాతఁడు నన్నుఁ దన భృత్యుల కిచ్చివేసెను” అని లక్ష్మి చెప్పిన సందేశమును గొని కీర్తి సముద్రునికడకు వెళ్ళెను.<noinclude><references/></noinclude>
8b1m0yz4jqb7w123u3p91ig2zfoftz0
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/545
104
219197
583072
572076
2026-10-03T01:18:25Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{nop}}
ఇట ‘విదితంతే౽స్తు’ అనుచోటనే వాక్యము నిరాకాంక్షముగా సమాప్తమైనది. మరల ‘తేనాస్మిదత్తా' అని కారకాంతరముచేఁ జెప్పుట దోషము.
{{p|ac|fwb}}రసదోషములు</p>
{{Telugu poem|type=క.|lines=<poem>రసములు వాచ్యము లైనను
వెస నదియును దోష మయ్యె; విపులోగ్రరణం
బసదృశబీభత్సరసో
ల్లసితము; శృంగారసహితలలన యనంగన్.</poem>|ref=55}}
రసములు విభావానుభావవ్యభిచారిభావములచే వ్యంగ్యములు గావలయును. కేవలము శృంగారాది శబ్దములు వాడినమాత్రమున నాస్వాద్యత్వము గలుగదు. రణరంగము బీభత్సరసోల్లసితము; తరుణి శృంగారసహితురాలు; అన్నచో బీభత్స, శృంగార పదములనుమాత్రము ప్రయోగించిన నారసములు స్ఫురింపకున్నవిగదా! కాన నీ విధము దోషము. దీనిని స్వశబ్దవాచ్యదోష మందురు.
ఇటఁ బెక్కువిధములైన రసదోషములను జూపుదుము.
{{left margin|3em}}<poem>వ్యభిచారి, రస, స్థాయిభాజానాం, శబ్దవాచ్యతా;
కష్ట కల్పనయౌ వ్యక్తి రనుభావ విభావయోః;
ప్రతికూల విభావాదిగ్రహో; దీప్తిః పునః పునః;
అకాండే ప్రథనచ్ఛేదా; వంగస్యాప్యతివిస్తృతిః
అంగిమో౽ననుసంధానం ప్రకృతీనాం విపర్యయః
అనంగస్యాభిధానం చ రసే దోషాస్స్యురీదృశాః.</poem> </div>
వ్యభిచారిభావములను, రసములను, స్థాయిభావములను స్వశబ్దముతోఁ దెలుపుటయు, అనుభావవిభావములు గష్టముగా గుర్తింపఁబడుటయుఁ, బ్రకృతరసవిరుద్ధములయిన విభావాదులను గ్రహించుటయుఁ, దిరిగి తిరిగి రసమునకు దీప్తి గలిగించుటయు, ఆసమయమున రసమును వర్ణించుటయు, నసమయమున రసవిచ్ఛేదము సేయుటయు, అంగభూతముగానున్న రసమును మిక్కిలియు విస్తరించుటయు, అంగిరసమును బోషింపకుంటయు, స్వభావమును సముచితముగా వర్ణింపకుంటయు, రసానుపకారకమైనదానిని వర్ణించుటయు నీ మొదలయినవి రసదోషములు. వీనినిఁ క్రమముగా నుదాహరింతును.
{{p|al|fwb}}1. వ్యభిచారిభావమును స్వశబ్దముతోఁ దెలుపుట.</p>
{{left margin|3em}}సవ్రీడా దయితాననే, సకరుణా మాతంగచర్మాంబరే, </div><noinclude><references/></noinclude>
3i3ucd0dr7h7gr3b9y0m9u4dyecqebf
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/546
104
219198
583076
572077
2026-10-03T02:42:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583076
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|3em}}<poem>పత్రాసా భుజగే, సవిస్మయరసా, చంద్రే౽మృతస్యందిని,
సేర్ష్యా జహ్నుసుతావలోకనవిధౌ, దీనా కపాలోదరే
పార్వత్యా నవసంగమప్రణయినీ దృష్టి శ్శివా యాస్తు సః.</poem> </div>
భర్తృముఖమును గాంచి (తన్నతఁడు గాంచుటచే) సిగ్గుగొన్నట్టియు, గజచర్మాంబరమును గాంచి (విభవము లేనివాఁడని) జాలినిఁ గొన్నట్టియు, సర్పమును గాంచి భయపడినట్టియు, అమృతము జాలువాఱు చంద్రునిఁ గాంచి (ఆకాశమున నుండువాఁ డిట నెట్లున్నాఁడని) విస్మయ పడినట్టియు, శిరసునందున్న గంగను గాంచి (అన్యాంగనాసక్తుఁడని) యీర్ష్యను వహించినట్టియు, (మణిహారస్థానమున) కపాలములను గాంచి చిన్నఁబుచ్చుకొన్నట్టియు పార్వతీదేవి నవసంగమకాలము నందలి ప్రణయదృష్టి మీకు మంగళము లిడుఁ గాక.
ఇట వ్రీడా, కరుణ, త్రాస, విస్మయ, ఈర్ష్యా, దైన్యములు తమతమ యనుభావములచే వ్యంగ్యములు గావలయును. ఎట్లన, నిట వ్రీడ వ్రీడాశబ్దముచేతనే వాచ్యమైనది. అనఁగా స్వశబ్దముచేత వాచ్యమైనది. అట్లుగాక వ్రీడయొక్క యనుభావము లైస (కార్యములయిన) 'తలను వాంచుట’ను బ్రయోగించి దానిచే సిగ్గును వ్యక్తము సేయవలెను. అనఁగా 'నామె సిగ్గువడినది' అని చెప్పవలసినయెడ 'ఆమె తల వంచుకొన్నది' అని ప్రయోగింపవలెను. తల వంచుకొనుట సిగ్గుయొక్క కార్యము లేక యనుభావము. 'తల వంచుకొన్నది' అను ననుభావముచే సిగ్గు వ్యక్తమగుచున్నది. 'ఆమె సిగ్గుపడినది’, ‘ఆమె తల వంచుకొన్నది' అను వాక్యములలో నేది సుందరముగా నుండునో చూడుఁడు. మొదటి చోట 'సిగ్గు' స్వశబ్దముచే గ్రహింపఁ బడుటచే సుందరముగా లేదు. ఎప్పుడును జెప్పవలసినదానిని విస్పష్టముగా విప్పి చెప్పక దానిని వ్యంగ్యముగా బోధించిన యెడలనే రమణీయముగా నుండును. కావున రెండవచోట హృద్యముగా నున్నది. ఇట్లే కరుణ, త్రాస, విస్మయ, ఈర్ష్యా,
దైన్యములను, వానివాని యనుభావములచేతినే వ్యక్తము చేయవలెను. ఎట్లన
{{left margin|3em}}<poem>వ్యానమ్రా దయితాననే, ముకుళితా మాతంగచర్మాంబరే,
సోత్కంపా భుజగే, నిమేషరహితా, చంద్రే౽మృతస్యందిని
మీలద్భ్రూస్సురసింధుదర్శనవిధా మ్లానా కపాలోదరే
పార్వత్యా నవసంగమప్రణయినీ దృష్టిశ్శివాయాస్తు సః</poem> </div>
ఇట వ్రీడా, కరుణ, త్రాస, విస్మయ, ఈర్ష్యా, దైన్య, రూప వ్యభిచారులు స్వశబ్దముచే గ్రహింపఁబడక వానివాని యనుభావములగు వ్యానమ్రత, ముకుళనము, ఉత్కంపము, నిమేషరహితత్వము, భ్రూనిమీలనము, మ్లానత ఆనువానిచే వ్యక్తము<noinclude><references/></noinclude>
sjoq2ichsfljq9o16a95cd0zkpg7b3s
583077
583076
2026-10-03T02:45:40Z
దేవీప్రసాదశాస్త్రి
4290
583077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|3em}}<poem>పత్రాసా భుజగే, సవిస్మయరసా, చంద్రే౽మృతస్యందిని,
సేర్ష్యా జహ్నుసుతావలోకనవిధౌ, దీనా కపాలోదరే
పార్వత్యా నవసంగమప్రణయినీ దృష్టి శ్శివా యాస్తు సః.</poem> </div>
భర్తృముఖమును గాంచి (త న్నతఁడు గాంచుటచే) సిగ్గుగొన్నట్టియు, గజచర్మాంబరమును గాంచి (విభవము లేనివాఁడని) జాలినిఁ గొన్నట్టియు, సర్పమును గాంచి భయపడినట్టియు, అమృతము జాలువాఱు చంద్రునిఁ గాంచి (ఆకాశమున నుండువాఁ డిట నెట్లున్నాఁడని) విస్మయ పడినట్టియు, శిరసునందున్న గంగను గాంచి (అన్యాంగనాసక్తుఁడని) యీర్ష్యను వహించినట్టియు, (మణిహారస్థానమున) కపాలములను గాంచి చిన్నఁబుచ్చుకొన్నట్టియు పార్వతీదేవి నవసంగమకాలము నందలి ప్రణయదృష్టి మీకు మంగళము లిడుఁ గాక.
ఇట వ్రీడా, కరుణ, త్రాస, విస్మయ, ఈర్ష్యా, దైన్యములు తమతమ యనుభావములచే వ్యంగ్యములు గావలయును. ఎట్లన, నిట వ్రీడ వ్రీడాశబ్దముచేతనే వాచ్యమైనది. అనఁగా స్వశబ్దముచేత వాచ్యమైనది. అట్లుగాక వ్రీడయొక్క యనుభావము లైస (కార్యములయిన) 'తలను వాంచుట’ను బ్రయోగించి దానిచే సిగ్గును వ్యక్తము సేయవలెను. అనఁగా 'నామె సిగ్గుపడినది' అని చెప్పవలసినయెడ 'ఆమె తల వంచుకొన్నది' అని ప్రయోగింపవలెను. తల వంచుకొనుట సిగ్గుయొక్క కార్యము లేక యనుభావము. 'తల వంచుకొన్నది' అను ననుభావముచే సిగ్గు వ్యక్తమగుచున్నది. 'ఆమె సిగ్గుపడినది’, ‘ఆమె తల వంచుకొన్నది' అను వాక్యములలో నేది సుందరముగా నుండునో చూడుఁడు. మొదటి చోట 'సిగ్గు' స్వశబ్దముచే గ్రహింపఁబడుటచే సుందరముగా లేదు. ఎప్పుడును జెప్పవలసినదానిని విస్పష్టముగా విప్పి చెప్పక దానిని వ్యంగ్యముగా బోధించిన యెడలనే రమణీయముగా నుండును. కావున రెండవచోట హృద్యముగా నున్నది. ఇట్లే కరుణ, త్రాస, విస్మయ, ఈర్ష్యా,
దైన్యములను, వానివాని యనుభావములచేతినే వ్యక్తము చేయవలెను. ఎట్లన
{{left margin|3em}}<poem>వ్యానమ్రా దయితాననే, ముకుళితా మాతంగచర్మాంబరే,
సోత్కంపా భుజగే, నిమేషరహితా, చంద్రే౽మృతస్యందిని
మీలద్భ్రూస్సురసింధుదర్శనవిధా మ్లానా కపాలోదరే
పార్వత్యా నవసంగమప్రణయినీ దృష్టిశ్శివాయాస్తు సః</poem> </div>
ఇట వ్రీడా, కరుణ, త్రాస, విస్మయ, ఈర్ష్యా, దైన్య, రూప వ్యభిచారులు స్వశబ్దముచే గ్రహింపఁబడక వానివాని యనుభావములగు వ్యానమ్రత, ముకుళనము, ఉత్కంపము, నిమేషరహితత్వము, భ్రూనిమీలనము, మ్లానత అనువానిచే వ్యక్తము<noinclude><references/></noinclude>
dptk7rbw7n2g2syurng9q455793iz36
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/547
104
219199
583079
572078
2026-10-03T04:54:19Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583079
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సేయఁబడుచున్నవి; ఇట్లనుభావములచే వ్యక్తపఱపక వ్రీడాదిపదములచేతనే యనఁగా స్వశబ్దముచేతనే వ్రీడాదులను జెప్పుట స్వశబ్దవాచ్యత యను రసదోషము. కాని
{{left margin|3em}}“న దోష స్స్వపదేనోక్తా వసి సంచారిణః క్వచిత్” </div>
ఒకానొకచో సంచారిభావమును స్వశబ్దముతో గ్రహించినను దోషము గాదు. చూడుఁడు.
{{left margin|3em}}<poem>ఔత్సుక్యేన కృతత్వరా, సహభువా వ్యావర్తమానా హ్రియా
తైస్యైర్బంధువధూజనస్య వచనై న్నీతాభిముఖ్యం పునః
దృష్ట్వా౽గ్రే పరమోత్తసాధ్వసరసా గౌరీనవే సంగమే
సంరోహత్పులకా హరేణ హసతా శ్లిష్టా శివాయాస్తు వః</poem> </div>
ఔత్సుక్యముచేఁ ద్వరపడియు, సిగ్గుచే వెనుకకు వచ్చుచు, నాయా బంధువధూజనవచనములచే మరల నభిముఖియై యెదుటఁ దన ప్రియునిఁ గాంచి సాధ్వసమును బొందుచుఁ బార్వతీదేవి నవసంగమకాలమున గగ్గుఱుపాటును బొందఁగా హరుఁడు నవ్వుచు నాపె నాలింగనము జేసికొనెను. అట్టి పార్వతి మీకు శుభ మిడుఁగాక.
ఇట నౌత్సుక్యము, సిగ్గు అను వ్యభిచారిభావములు స్వశబ్దోపాత్తము లయినవి; అయిననూ దోషము గాదు. ఏలన నెచ్చట స్వశబ్దముచేత నయినంత ప్రతీతి తదనుభావముచేతఁ గాదో యచ్చట వ్యభిచారిభావమును స్వశబ్దముచేఁ జెప్పుట దోషము గాదు. ఇట ఔత్సుక్యమను వ్యభిచారిభావమున కనుభావము సహసాప్రసరణము. అవియే “కృతత్వరా' యని గ్రహింపఁబడినది. 'కృతత్వరా” అను ననుభావముచే నౌత్సుక్యము స్పష్టముగా వ్యక్తము గానందున ‘ఔత్సుక్య'మను వ్యభిచారిభావము స్వశబ్దోపాత్తమై ప్రయోగింపఁబడింది. అట్లే సిగ్గున కనుభావముగా 'వ్యావర్తమానా' అని యున్నది. కాని యీవ్యావర్తమానత్వముచేత సిగ్గు విస్పష్టముగా వ్యక్తము గానందున 'హ్రియా' యని ప్రయోగింపఁబడినది. కావున నెచ్చట ననుభావముచే వ్యభిచారిభావము లెస్సగా వ్యక్తమగునో యచ్చట స్వశబ్దమును గ్రహించుట దోషము. ఎచ్చట ననుభావముచే వ్యభిచారిభావము లెస్సగా వ్యక్తము గాదో యట స్వశబ్దమును బ్రయోగించుట దోషము గాదు.
ఒకప్పుడు వ్యభిచారిభావము స్వశబ్దోపాత్తమయినను విభావాది ప్రతిపాదనముగూడ నున్నచో ననఁగా నా వ్యభిచారిభావము విభావాదులచే వ్యక్తము సేయఁబడుచున్నచో నది దోషము గాదు. అట వ్యభిచారిభావము విభావాదులచేతినే వ్యక్తమగును. అట్టిచో స్వశబ్దోపాదానము గేవల మనువాదమాత్రపరమని గ్రహింపవలెను.<noinclude><references/></noinclude>
s7fh2lvpn9hy4racrjvgp2azvey3kmr
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/548
104
219200
583089
572079
2026-10-03T07:43:28Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583089
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|3em}}<poem>యాతే ద్వారవతీం తదా మధురపౌ తద్దత్తఝంపానతాం
కాళిందీతటరూఢవంజులలతా మాలింగ్య సోత్కంఠయా
తద్గీతం గురుభాష్పగద్గదలసత్తారస్వరం రాధయా
యేనాంతర్జలచారిభిర్జలచరై రప్యుత్కముత్కూజితం.</poem> </div>
తన్ను విడిచి శ్రీకృష్ణుఁడు ద్వారావతికి వెళ్ళఁగానే యాతనిచే వంపఁబడిన (కోతికొమ్మచ్చి మొదలగు నాటలయందు వంపఁబడిన) కాళిందీతీరమునందలి వంజులలత నాలింగనము సేసికొని రాధ సోత్కంఠయై యా యమునాజలము నందలి జలచరములు గూడ జాలిపడి రుదించునట్లు బాష్పగద్గదయై బిగ్గరగా నేడ్చెను.
ఇట విభావానురావబలముచేతనే రాధయొక్క యుత్కంఠవ్యక్తమగుచున్నది. అట్లయ్యు ‘సోత్కంఠయా' యని యుత్కంఠ స్వశబ్దోపాత్తమింది. అయినను దోషము గాదు. ఉత్కంఠాశబ్దము విభావాదులచే వ్యంగ్యమైన తన్నే యనువదించుకొనుచున్నది.
2. '''రసమును స్వశబ్దముచేతఁ గాని (రసశబ్దముచేఁ గాని) శృంగారాది శబ్దముచేఁ గాని (శృంగార, కరుణాది పదములచేఁ గాని) తెలుపుట''' యనఁగా నా యాపదములను బ్రయోగించుట దోషము. రసము విభావానుభావవ్యభిచారులచే వ్యక్తము గావలెను. కాని రస, శృంగారాది పదములను వాడినమాత్రమున రసస్ఫూర్తి గలుగదు.
{{left margin|3em}}<poem>తామసంగ జయమంగళ శ్రియం
కించిదుచ్చ భుజమూలలోకితాం
క్షేత్రయోః కృతవతో౽స్య గోచరే
కో౽ప్యజాయత రసో నిరంతరః.</poem> </div>
"జనులచేఁ జూడఁబడుచున్న కక్ష మూలములు గల యా మన్మథుని జయలక్ష్మి నేత్రములకు గోచరింపఁగా నతని కొకానొకరసము పుట్టెను.”
ఇటు ‘రసము పుట్టెను' అని రసపదమే ప్రయోగింపఁబడినది.
విభావాదులచే రసము వ్యక్తము గావలయును. వానిచే రసము వ్యక్తమైనట్లు రసపదమును ప్రయోగించిన మాత్రమున వ్యక్తము గాదు.
{{left margin|3em}}<poem>ఆలోక్య కోమల కపోలతలాభిషిక్త
వ్యక్తానురాగసులభా మభిరామరూపాం
పశ్యైషబాల్య మతివృత్య వివర్తమానః
శృంగారసీమని తరంగిత మాతనోతి.</poem> </div><noinclude><references/></noinclude>
t8mdz7v0f8vk9j40fxh07taxjc26440
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/549
104
219201
583090
572080
2026-10-03T08:17:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583090
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కోమల కపోలతలము పులకించుటచేఁ దనయం దనురాగమున్నట్లు వ్యక్తము సేయుచున్న యా సుందరిఁ గాంచి యా యువకుడు శృంగారమున నోలలాడుచున్నాఁడు.
ఇట శృంగారపదము సాక్షాత్తుగాఁ బ్రయోగింపఁబడినది. పైశ్లోకమునందును దీనియందును రసము వ్యక్తము గాక వాచ్యమైనది. ఇట్లే
{{left margin|3em}}<poem>శృంగారీ గిరిజాననే, సకరుణో రత్యాం, ప్రవీరః స్మరే
బీభత్సో౽స్థిభిరత్ఫణీ చ భయకృ న్మూర్త్యా౽ద్భుతస్తుంగయా
రౌద్రో దక్షవిమర్దనే, చ హసకృన్నగ్నః ప్రశాంతశ్చిరా
దిత్థం సర్వరసాత్మకః పశుపతి ర్భూయాత్సతాం భూతయే.</poem> </div>
శివుఁడు పార్వతీముఖమును గాంచి శృంగారి యయ్యెను. రతినిఁ గాంచి కరుణరసము (జాలి) గలవాఁడయ్యెను. మన్మథునియెడల వీరరసాస్పదుఁడయ్యెను. అస్థులను దాల్చి బీభత్సరసాశ్రయుఁడయ్యెను పాములను వహించి భయానకరసమునకుఁ బట్టయ్యెను. పెద్దమూర్తినిఁ దాల్చి యద్భుతరసమును ధరించెను. దక్షాధ్వంసనావసరమున రౌద్రరసమును వహించెను. దిగంబరవేషమును బూని హాస్యరసమునకు నెలవయ్యెను. బహుకాలానంతరమునఁ బ్రశాంతరసాశ్రయుఁడయ్యెను. ఇట్టి సర్వరసాశ్రయుఁదగు పశుపతి సత్పురుషులకు సంపదలను గూర్చుఁగాక.
ఇచ్చటఁగూడ ‘శృంగారీ, సకరుణః’ ఇత్యాది పదములచే రసము వాచ్యమే యైనది. ఇందలి ‘రసము వాచ్యములైనను' అను పద్యమున ‘రణలింగము బీభత్సరసోల్లసితము, తరుణి శృంగారసహితురాలు' అను దోషములు నిట్టివియే. కావున నివి దోషములు.
ఒకానొకచో రసపదము గాని, శృంగారాదిపదము గాని ప్రయోగింపఁబడినను విభావాదులచేఁగూడ నది యభివ్యక్తమగుచున్నచో నట రసస్ఫూర్తి గలుగును. కాన నట్టిచో దోషము గాదు. ఎట్లన,
"నయనవలినీలీలాకృష్టం పిబంతి రసం ప్రియాః” ప్రియురాండ్రయొక్క చూపులను తామరతూండ్లనుండి విలాసముగాఁ బీల్పఁబడిన రసమును బ్రియులు త్రాగుచున్నారు.
‘శృంగారస్యోపనత మధునా రాజ్య మేకాతపత్త్రం' ఇపుడు శృంగారరసమున నేకచ్ఛత్రాధిపత్యము లభించినది.
ఈ లక్ష్యములందుఁ గ్రమముగా రస, శృంగార శబ్దములు ప్రయోగింపఁబడినను విభావాదులచే లెస్సగా నభివ్యక్తములయి యున్నవానికే కేవల మనువాదము సేయఁబడినది. కాన నియ్యెడల స్వశబ్దవాచ్యత దోషము గాదు.<noinclude><references/></noinclude>
fz2l6f1ity03ny0rhfn4wifq8yyutn9
583091
583090
2026-10-03T08:20:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
583091
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కోమల కపోలతలము పులకించుటచేఁ దనయం దనురాగమున్నట్లు వ్యక్తము సేయుచున్న యా సుందరిఁ గాంచి యా యువకుడు శృంగారమున నోలలాడుచున్నాఁడు.
ఇట శృంగారపదము సాక్షాత్తుగాఁ బ్రయోగింపఁబడినది. పైశ్లోకమునందును దీనియందును రసము వ్యక్తము గాక వాచ్యమైనది. ఇట్లే
{{left margin|3em}}<poem>శృంగారీ గిరిజాననే, సకరుణో రత్యాం, ప్రవీరః స్మరే
బీభత్సో౽స్థిభిరత్ఫణీ చ భయకృ న్మూర్త్యా౽ద్భుతస్తుంగయా
రౌద్రో దక్షవిమర్దనే, చ హసకృన్నగ్నః ప్రశాంతశ్చిరా
దిత్థం సర్వరసాత్మకః పశుపతి ర్భూయాత్సతాం భూతయే.</poem> </div>
శివుఁడు పార్వతీముఖమును గాంచి శృంగారి యయ్యెను. రతినిఁ గాంచి కరుణరసము (జాలి) గలవాఁడయ్యెను. మన్మథునియెడల వీరరసాస్పదుఁడయ్యెను. అస్థులను దాల్చి బీభత్సరసాశ్రయుఁడయ్యెను. పాములను వహించి భయానకరసమునకుఁ బట్టయ్యెను. పెద్దమూర్తినిఁ దాల్చి యద్భుతరసమును ధరించెను. దక్షాధ్వంసనావసరమున రౌద్రరసమును వహించెను. దిగంబరవేషమును బూని హాస్యరసమునకు నెలవయ్యెను. బహుకాలానంతరమునఁ బ్రశాంతరసాశ్రయుఁడయ్యెను. ఇట్టి సర్వరసాశ్రయుఁడగు పశుపతి సత్పురుషులకు సంపదలను గూర్చుఁగాక.
ఇచ్చటఁగూడ ‘శృంగారీ, సకరుణః’ ఇత్యాది పదములచే రసము వాచ్యమే యైనది. ఇందలి ‘రసము వాచ్యములైనను' అను పద్యమున ‘రణలింగము బీభత్సరసోల్లసితము, తరుణి శృంగారసహితురాలు' అను దోషములు నిట్టివియే. కావున నివి దోషములు.
ఒకానొకచో రసపదము గాని, శృంగారాదిపదము గాని ప్రయోగింపఁబడినను విభావాదులచేఁగూడ నది యభివ్యక్తమగుచున్నచో నట రసస్ఫూర్తి గలుగును. కాన నట్టిచో దోషము గాదు. ఎట్లన,
"నయనవలినీలీలాకృష్టం పిబంతి రసం ప్రియాః” ప్రియురాండ్రయొక్క చూపులను తామరతూండ్లనుండి విలాసముగాఁ బీల్పఁబడిన రసమును బ్రియులు త్రాగుచున్నారు.
‘శృంగారస్యోపనత మధునా రాజ్య మేకాతపత్త్రం' ఇపుడు శృంగారరసమున నేకచ్ఛత్రాధిపత్యము లభించినది.
ఈ లక్ష్యములందుఁ గ్రమముగా రస, శృంగార శబ్దములు ప్రయోగింపఁబడినను విభావాదులచే లెస్సగా నభివ్యక్తములయి యున్నవానికే కేవల మనువాదము సేయఁబడినది. కాన నియ్యెడల స్వశబ్దవాచ్యత దోషము గాదు.<noinclude><references/></noinclude>
cckfaq0qh6358a84xkkcpm4ki1wxc9o
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/550
104
219202
583092
572081
2026-10-03T08:43:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583092
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|al|fwb}}3. స్వశబ్దముచే స్థాయినిఁ దెలుఁపుటయు స్వశబ్దవాచ్యదోషమే.</p>
{{left margin|3em}}<poem>సంప్రహారే ప్రహరణైః ప్రహారాణాం పరస్పరం
రణత్కారై శ్శ్రుతిగతై రుత్సాహస్తవ్య కో౽ప్యభూత్.</poem> </div>
యుద్ధమందు భటుల పరస్పరప్రహారముల ఠణఠణధ్వనులచే దాని కుత్సాహము పుట్టెను.
ఇట వీరరస స్థాయిభావమగు నుత్సాహము స్వశబ్దోపాత్తమైనది. ఇది దోషము.
{{left margin|3em}}<poem>రూపనిర్జిత కందర్పే నయనానందదాయిని
అభూత్తస్యా రతిః క్వా౽పి ప్రియే చాటువిధాయిని.</poem> </div>
రూపముచే మన్మథుని జయించినట్టియు నయనానందము గలిగించుచున్నట్టియుఁ బ్రియుఁడు చాటూక్తులు పలుకుచుండగా నాపెకు రతి జనించెను.
ఇట “రతి” యను స్థాయిభావము స్వశబ్దోపాత్తమైనది. ఈ విధముగా వ్యభిచారి, రస, స్థాయిభావములను స్వశబ్దోపాత్తములు సేయుట స్వశబ్దవాచ్య మను దోషము
{{p|al|fwb}}4. అనుభావవిభావములు కష్టముగా గుర్తింపఁబడుటయు దోషము.</p>
కష్టముగా గుర్తింపఁబడుట యనఁగా నొకప్పుడు బొత్తుగా గుర్తింపఁబడకుండుటయు, నొకప్పుడుఁ గష్టముగా గుర్తింపఁబడుటయు నగును.
{{left margin|3em}}<poem>కర్పూర ధూళి ధవళద్యుతి పూరిధౌత
దిఙ్మండలే శిశిరరోచిషి తస్య యూనః
లీలా శిరో౽౦శుక నివేశ విశేషక్ల్{{ZWNJ}}ప్తి
వ్యక్తస్తనోన్నతి రభూన్నయనావనౌ సా.</poem> </div>
చంద్రుఁడు కర్పూరధూళివలెఁ దెల్లనైన కాంతిపూరమును దిఙ్మండలమున వ్యాపింపఁజేయఁగా నాయువకుని కాయువతి మేలిముసుఁగు సర్దుకొను నెపమునఁ దన స్తనోన్నతిని వ్యక్తము సేయుచుఁ గనఁబడెను.
ఇట యువతీయువకు లాలంబనవిభావములు. శశికాంతి యుద్దీపనవిభావము. ఈశ్లోకమున యువకనిష్ఠమైన శృంగారమే కవి కుద్దిష్టమైనది. ఏలన “తస్య యూనః నయనావనౌ సా అభూత్" ఆయువకుని నేత్రభూమియం దామె గోచరించెను అని యున్నది. ఆమె యతనికిఁ గనఁబడినదన్నపు డాతనియం దనుభావమును గవి చెప్పియుండవలయును. కాని యట్టి అనుభావము చెప్పఁబడలేదు. పోనిమ్ము. విభావముచే దాని నాక్షేపించుటకును వీలు లేదు. కావున నిట విభావము లనుభావమునఁ బర్యవసింపక నిలిచిపోయినవి. కావున నిట శృంగారము పరిపుష్టముగా లేదు.<noinclude><references/></noinclude>
njk0k3ww2pem6zc6dk8j9fbla96cojs
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/551
104
219203
583093
572082
2026-10-03T08:56:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583093
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{nop}}
స్త్రీనిష్ఠమగు శృంగారమన్ననో పరిపుష్టముగానే యున్నది. ఎట్లన నాయువతి యువకునిఁ జూడఁగానే తన లీలాశిరోంశుకమును సర్దుకొనుచుఁ దన స్తనోన్నతిఁ జూపుచున్నది. అనునర్థమువలన వానినిఁ జూడఁగానే యాపెకు శిరోంశుకనివేశము, స్తనోన్నతిప్రకటనము అను ననుభావములు గలిగినవి. వీనిచే నాపె రతి పరిపుష్టమై రసముగాఁ బరిణమించుచున్నది. కాని యీశ్లోకమునఁ గవికిఁ బురుషనిష్ఠ శృంగారమే యుద్దిష్టమని తెలుపఁబడెను. అది యపరిపుష్టముగానే యున్నది.
{{left margin|3em}}<poem>పరిహరతిరతిం, మతిం లునీతే, । స్ఖలతిభృశం, పరివర్తతే చ భూయః,
ఇతి బత విషమా దశాస్య దేహం । పరిభవతి ప్రసభం కి మత్రకుర్మః</poem> </div>
రతినిఁ బరిహరించుచున్నాఁడు; మతినిఁ గోల్పోవుచున్నాఁడు; మిక్కిలి తొట్రుపడుచున్నాఁడు; మిక్కిలియుఁ బొరలాడుచున్నాఁడు; అకటా! వీని దేహమును విషమదశ పరిభవించుచున్నది.
ఇటనున్న రతిపరిహారాద్యనుభావములు కరుణమునందును సంభవించును. ఇట విప్రలంభశృంగారము కవి కుద్దిష్టము. ఈ యువకునికిఁ గలిగిన యీ యనుభావములు శృంగారకార్యములో కరుణకార్యములో తెలిసికొనుట కష్టముగా నున్నది. ఇం దనుభావములు మాత్రమే కలవు గాని విభావములు చెప్పఁబడలేదు. కామినీరూపవిభావమురు జెప్పవలెను. అట్లు చెప్పఁబడకపోవుటచేఁ గష్టముమీఁద దాని నూహింపవలసి వచ్చుచున్నది. ఈ విళంబమువలన నాస్వాదమున కంతరాయము గలుగుచున్నది.
{{p|al|fwb}}5. ప్రతికూలరసముయొక్క విభావ, అనుభావ, వ్యభిచారులను గ్రహించుట దోషము.</p>
ఏ యే రసమున కేయే విభావానుభావవ్యభిచారు లుండవలెనో తెలిపితిమి. మరియు నేయే రసములు విరుద్ధములో యేవి యవిరుద్ధములో ముందు తెలియును. అట్టిచోఁ బ్రతికూలరసముయొక్క విభావాదులను గ్రహించుట దోషమేకదా! దానివలన రసభంగ మగును.
{{p|al|fwb}}(క) ప్రతికూలరసముయొక్క విభావగ్రహణము.</p>
{{left margin|3em}}<poem>ప్రసాదే వర్తస్వ । ప్రకటయ ముదం; సంత్యజ రుషం;
ప్రియే! శుష్యంత్యంగా; న్యమృతమివ తే సించతు వచః;
విధానం సౌఖ్యానాం క్షణ మభిముఖం స్థాపయ ముఖం;
న ముగ్ధే! ప్రత్యేతుం ప్రభవతి గతః కాలహరణః.</poem> </div><noinclude><references/></noinclude>
85ek0oavyjjihumkoke9o0c281mnc33
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/552
104
219204
583094
572083
2026-10-03T09:19:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583094
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఓ ప్రియురాలా! ప్రసన్నురాలవు గమ్ము! సమ్మోదముఁ బ్రకటింపుము. పొలయలుకను వదలుము. నా యవయవములు శుష్కించుచున్నవి. నీ యమృతవచనములచేఁ దడుపుము. సుఖములకు నిధియైన నీముఖము నభిముఖముగా నుంచుము. ఓ ముద్దరాలా! లేడిపిల్లవలెఁ గాలము పరువెత్తిపోవును. తిరిగి రాదుసుమా!
"మానం మాకురు తన్వంగి! జ్ఞాత్వా యౌవన మస్థిరం” ఓ తన్వంగీ! యౌవన మస్థిరమని యెఱిఁగి ప్రణయకోపమును మానుము.
ఇటఁ బ్రియుఁడు పొలయలుక వహించిన ప్రియురాలి ననునయించుచున్నాఁడు. కావున శృంగారరసము. దీనికి సర్వథా శాంతరసము ప్రతికూలమైనది. కావున శృంగారమున శాంతమును గాని దాని విభావాదులను గాని ప్రవేశపెట్టరాదు. ఇటఁ బ్రథమశ్లోకమున నాల్గవపాదమునఁ బోయినకాలము తిరిగి రాదనియుఁ గ్రింది శ్లోకమున యౌవన మస్థిరమనియును వైరాగ్యకథ లుపదేశింపఁబడినవి. కాలముయొక్కయు, యౌవనముయొక్కయు నస్థిరత్వములు శాంతరసవిభావములు. శృంగారమున వానికిఁ బ్రవేశ మనుచితము. కావున నిది దోషము.
{{p|al|fwb}}(ఖ) పతికూలరసముయొక్క యనుభావగ్రహణము.</p>
{{left margin|3em}}<poem>నిభృతరమణే లోచనపథే పతితే గురుజనమధ్యే
సకలపరిహారహృదయా వనగమన మేవేచ్ఛతి వధూః.</poem> </div>
తాను గూర్చుండియుండఁగాఁ దన మిండఁడు గంటఁబడఁగానే సకలమును బరిహరించి యా తరుణి వనగమనమును నిశ్చయించుచున్నది.
సకలపరిహారము, వనగమనము అనునవి శాంతరసానుభావములు. ఇవి శృంగారరసప్రతికూలములు. ఇంధనాదులను దెచ్చు నెపమున నాపె సకలపరిహారమును, వనగమనమును సేయఁగోరుచున్నదన్నచో దోషము లేదు.
ప్రతికూలరసముయొక్క యనుభావములను గ్రహించుట దోషమని చెప్పితిమి. కాని
{{left margin|3em}}<poem>పాండుక్షామం వదనం । హృదయం సరసం తవాలసం చ వపుః
ఆవేదయతి నితాంతం । క్షేత్రియరోగం సఖి! హృదంతః</poem> </div>
ఓ సఖీ! నీ మొగము పాలిపోయినది; కృశించినది; నీ హృదయము ద్రవించినది; నీశరీర మలసమై యున్నది; నీ కేదో కుదరని రోగము వచ్చినట్లున్నది.
ఇందలి పాండిమము, క్షామత్వము, సరసత్వము, అలసత్వము అను ననుభావమలు కరుణమునకు సంబంధించినవి. ఇట విప్రలంభరసము. కరుణ, విప్రలంభశృంగా<noinclude><references/></noinclude>
dgoub7q8u6j3v3hkoebd1srbbqx9s3v
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/553
104
219205
583100
572084
2026-10-03T10:18:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583100
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రములు విరుద్ధములు. కరుణరసోచితము లగు పాండుత్వాదివ్యాధ్యనుభావములు విప్రలంభశృంగారమున సమావేశపఱుపఁబడినవి. కావున దోషమన్నచోఁ గాదు. ఏలన నిటఁ గరుణరసానుభావములు విప్రలంభమున నారోపింపఁబడినవి. అనఁగా నిట విప్రలంభశృంగారమున కంగములుగానే తద్విరోధికరుణాంగములగు పాండుత్వాదులు నారోపింపఁబడినవి. కాన దోషము లేదు. కరుణమునవలెనే విప్రలంభమునను వ్యాధ్యాదు లుచితములే కాన నిట దోషమే లేదని కొందఱు. ఇట్లే
{{left margin|3em}}<poem>కోపాత్కించిదుపాగతో౽పి రభసాదాకృష్య కేశేష్వలం
నీత్వా మోహనమందిరం దయితయా హారేణ బద్ధ్వా దృఢం
భూయో యాస్యసితద్గృహా? నితిముహుః కంఠార్ధ రుద్ధాక్షరం
జల్పంత్యశ్రుకణోల్లభేన(?) సుకృతీ కశ్చిద్రహస్తాద్యతే</poem> </div>
ఒక యువతి కినుకతోఁ దనకడకు వచ్చిన ప్రియునిఁ గేశములఁ బట్టి లాఁగి పడకగదిలోనికిఁ గొంపోయి హారముతో ఱెక్కలు గట్టి "దాని యింటికి మరలఁ బోవుగదా!” యనుచు గొంతులో మాట లడ్డుపడుచుండఁగా వదరుచుఁ గన్నీళ్ళు గీఱుచు రహస్యముగాఁ గొట్టుచుండెను. “వాఁ డెంత ధన్యుఁడోకదా!”
ఇటఁ గేశాకర్షణము, బంధనము, తాడనము, మొదలగునవి రౌద్రరసానుభావములు. అయినను శృంగారమున నారోపింపఁబడినవి. రౌద్రశృంగారములు ప్రతికూలరసము లయినను రౌద్రరసానుభావములు రూపకబలమువలన శృంగారాంగములుగా నారోపింపఁబడినవి. కావున విరుద్ధరసానుభావము లెచ్చట నారోపింపఁబడునో యనఁగా దదంగములుగాఁ జేయఁబడునో యచ్చట దోషము గాదు. ఇట్లే
{{left margin|3em}}<poem>గీ. గోట ఱక్కుచుఁ గడుఁబంటికొనలనొక్కు
చూఁపుచు బుజంబులంబట్టి, సైఁపరాని
కౌఁగిలింతల నలుపుచుఁ, గాంత్రు శాంతి
రమణు నపరాధముం జూపి రాగవతులు</poem> </div>
రౌద్రరసానుభావములు శృంగారమున నారోపింపఁబడినవి. కొన్నియెడలఁ ప్రతికూలరసముయొక్క వ్యభిచారిభావములను గ్రహించినను దోషము లేదు. ఎట్లన,
‘సంచార్యాదే ర్విరుద్ధస్య బాధ్యస్యోక్తి ర్గుణావహా' ప్రతికూలరసముయొక్క సంచారిభావములను బాధ్యబాధకభావముతో నిరూపించినచో నది గుణమే యగును. కాని దోషము గాదు. ఎట్లన,
{{left margin|3em}}<poem>క్వాకార్యం శశలక్ష్మణః? క్వచకులం? భూయో౽పి ద్యశ్యేత సా;
దోషాణాం ప్రళమాయ మే శ్రుతమహో; కోపే౽సి కాంతం ముఖం;</poem> </div><noinclude><references/></noinclude>
eapgu10gwq1f1lhj8xontvwd6z1d187
పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/554
104
219206
583109
572085
2026-10-03T11:51:31Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
583109
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|3em}}<poem>కిం పక్ష్యంత్యపకల్మషాః కృతధియః? స్వప్నే౽పి సా దుర్లభా;
చేతః స్వాస్థ్యముపైహి! కః ఖలు యువా ధన్యో౽ధరం పాస్యతి?</poem> </div>
అకార్య మెక్కడ? చంద్రవంశ మెక్కడ? మరల నా ప్రియురాలు (ఊర్వశి) కనఁబడునా? నా చదువు దోషప్రశమమునకుఁ గాని దోషకరణమనకుఁ గాదు. ఓహో! దానిమొగము కోపమునందును మనోహరమే. కలుషదూరులగు విజ్ఞులు నన్నుఁ జూచి యేమందురో? స్వప్నమందును నాపై నా కిఁక దుర్లభము. ఓ మనసా! స్వస్థతను బొందుము. ఏ ధన్యుఁడగు యువకుఁ డా యధరమును గ్రోలునో!
ఇది విక్రమోర్వశీయము నందలి పురూరవుని వచనము. ఇందు 'అకార్య మెక్కడ? చంద్రవంశ మెక్కడ?' అనుచో వితర్క మను శాంతరసవ్యభిచారిభావము గలదు. 'మరల నా ప్రియురాలు కనఁబడునా! అనుచోట శృంగారరసవ్యభిచారి యగు నౌత్సుక్యము; “నా చదువు దోషప్రశమమునకుఁ గాని దోషకరణమునకుఁ గాదు”. అనుచో శాంతరసవ్యభిచారి యగు మతి; "దాని మొగము కోపమునందును మనోహరమే" యనుచో శృంగారరస వ్యభిచారి యగు దైన్యము; "ఓ మనసా! స్వస్థతను బొందుము” అనుచో శాంతరసవ్యభిచారి యగు ధృతి.
"ఏ ధన్యుఁడగు యువకుఁ డా యధరమును గ్రోలునో” అనుచో శృంగారవ్యభిచారి యగు చింతయుఁ గలవు.
ఇందు వితర్కమును నౌత్సుక్యము బాధించుచున్నది. కాన వితర్కము బాధ్యము. ఔత్సుక్యము బాధకము. మరల నాత్సుక్యము బాధ్యము. మతి బాధకము. తిరిగి మతి బాధ్యము. స్మరణము బాధకము. పిమ్మట స్మరణము బాధ్యము. శంక బాధకము. తరువాత శంక బాధ్యము. దైన్యము బాధకము. క్రమ్మఱ దైన్యము బాధ్యము. ధృతి బాధకము. అంతమున ధృతి బాధ్యము. చింత బాధకము ― ఈవిధముగా బరస్పరవిరుద్ధములగు శాంతశృంగారరసములయొక్క వ్యభిచారులు బాధ్యబాధకభావములతో నిరూపింపఁబడినవి. శాంతశృంగారములు పరస్పరవిరుద్ధము లయినను వాని వ్యభిచారు లీ విధముగా బాధ్యబాధకభావములతో నుండి శృంగారమును బోషించుచునే యున్నవి. అనఁగాఁ దుదికి శృంగారవ్యభిచారియగు చింతయందే పర్యవసించును. ఇట్లే
{{left margin|3em}}<poem>స్నిగ్ధశ్యామలకాంతిలిప్తవియతో వేల్లద్బలాకా ఘనాః
వాతాశ్శీకరిణః పయోదసుహృదా మానందకేకాః కలాః
కామం సంతు దృఢం కఠోరహృదయో రామో౽స్మి సర్వంసహే
వైదేహీ తు కథం భవిష్యతి? హహా హా దేవి! ధీరా భవ!</poem> </div><noinclude><references/></noinclude>
hgge9d1afp3pvwmazfvxeqj474ha3m0
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/401
104
227352
583036
2026-10-02T12:14:18Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583036
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>కోడిగ్రుడ్లరసము 376-7.
కోర్టు — ఒకత్రాసు 221;- లో నన్ను చేర్చుకొనక పోవుట 224;—నియమములు: తలపాగ 224-5;- ఫీజు రెగ్యులేషన్
202;-లో నా క్షౌరమును జూచి కోలాహలము 325.
క్రికెట్ - 20.
క్రూగర్, ప్రెసిడెంటు 196.
క్రైస్తవ - మతము 50-1, 104, 184;- మతబోధ 50;.— మతప్రాశస్త్యము 182;- మతానుసారము ఆత్మలేదు 216; —మిత్రులు న న్నే సుమతమున గలుపుకొన బ్రయత్నించుట 207, 209;- మిత్రులవలని యనుభవములు 204.
క్రైస్తవుడు 51, 104.
క్రైస్తవులు 205;—పరిచయము 186 ;- హిందువులు 217, 211;—— మాంసభోజులు 104.
క్రౌజ్ గారు, డాక్టరు రు 195-6.
క్లయింటుకు, ఇబ్బడిఖర్చు 373.
క్వారంటీన్ 283, 285, 287 - లో మాఓడల నుంచుట 283, అందుకు హేతువు 284.
{{p|fs150|ac}}ఖ</p>
ఖరసేట్ జీ, సి. యం., స్మాల్ కాజు కోర్టు జడ్జి 263.
ఖాతా (Book-keeping) 167, 210.
ఖాన్ గారు, కేసులలో నాకు సాయపడుచుండు వారు 307.<noinclude><references/>
{{c|13}}</noinclude>
h2r85a1ism7rz00e1ca699sbdn62z81
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/402
104
227353
583037
2026-10-02T14:13:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583037
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>{{p|fs150|ac}}గ</p>
గర్వగంధము - ప్రస్తా 9.
గవర్నరుగారికి అతిథిని 339.
గాంధీ, ఉత్తమచందు 1;- ఓతా 1;— కబా 1,2;- కరంచందు 1;- తులసీదాస్ 1;- మణిలాల్ 381; 377;- మగన్ లాల్ 383;- కుటుంబము 383;- కుటుంబమువారు వైష్ణవులు 29, 30;- నీ చెలిమి తగదు 245.
గాడ్ ఫ్రే, సుభాన్ 166;- జేమ్సు 166.
గాడ్ సేవ్ ది కింగు 260-261.
గాబ్ కుమారి 185 .
గార్డు 177 ;— మొదటితరగతినుండి నన్ను వెడలగొట్టుట 178.
గిరిమిటియా 163; 232, 234, 239, 240, 307, 328, 333; - ఆసుపత్రి 306;- కరారునామా 237 - దొరల వేషము తాల్చుట 164;- పోరు 240;- బంధువు 234;- బిల్లు 236;—లతో సంబంధము ఎక్కువగుట 236 ;— లలో అన్నిరకముల భారతీయులున్నారు 164;- లకు పెట్టిన ఆశలు 237;- తలపన్ను 238;- లలో వివేకోదయము 329;- లతృప్తి 235;- శాసనషరతులు 238; - హాటు 164.
గిర్గామునందు ఇల్లు మకాము 145, 376, 381.
గీతా-అనువాదము 102, 103;- గిరిప్రవచనము 104-5 ;- పారాయణము 3;- భక్తియోగము 359.<noinclude><references/>
{{c|14}}</noinclude>
fneecjr6lyes5mud7myw3rdrvsdi1t5
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/403
104
227354
583066
2026-10-02T23:27:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583066
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>గుజరాత్ 29.
గుజరాతీ 17, 25, 52, 302;—అయిదవ తరగతివరకు మాతండ్రి చదివెను 3; - అనువాదము 102, 112, 113 ;- పలుకుల'కు నాతర్జుమా 115;-లో బోధన 301;- శిక్షకుడు 301;- నిఘంటువు పెస్తన్జీ పాదుషాగారిసేవ 268.
గుడీవ్స్ పెర్సనల్ ప్రాపర్టీ 123.
'గుమాస్తాపని' 344.
గురుదాస బెనర్జీ, సర్ 163.
గురువుకొఱకు ఆన్వేషణము 134; - మహత్వము 135.
గుఱ్ఱపుబండి-అధికారి నన్నవమానపరచుట 172-3;— అధికారి నా గూబలు పగులగొట్టుట 173; – ఏజెంటు 172, 174.
గృహ-భారము 246;- వ్యయము ఇండియన్ బారిస్టర్లకు తగినట్లు 246.
గొఱియలను క్రూరహోమమునుండి కాపాడ నా ప్రార్థన 361, ప్రాణమువెల 361;- మంద బలికిబోవు 360;- మృత్యుబాధ 361.
గోఖలేగారు, గోపాలకృష్ణ ప్రొఫెసర్ 240, 270, 271, 323, 347, 363, 365 ;-ఇచ్చిన బహుమానము 365;- గంగకు సమానులు 271;- గుఱ్ఱపుబండి 356;—గొడుగునీడ 358;—ట్రాములో పోవుట దుష్కరము 356;- నన్ను తమ బసకుగొనిపోయిరి 351;- నన్ను సాగనంపుట 365;- నా క్రొత్తను బాపిరి 354;- నాహృదయము నాక్రమించిరి<noinclude><references/>
{{c|15}}</noinclude>
bm296r6jhavnmg4yjva1sseswbwlte8
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/404
104
227355
583069
2026-10-03T01:02:02Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583069
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>271;- పనిచేయురీతి 355;- బిలియర్డ్సు ఆడఇండియన్ క్లబ్బుకువచ్చుట 351;— రానడేగారి యందు వారికిగౌరవము,
వారివార్షికోత్సవములను జరుపుట 355;- వారికోరిక 372;—వారికడ సెలవుగొనుట 366 ;- వారి ఛత్రచ్ఛాయన నాపని తేలికయైనది 364;- వారిసేలువ 323; దానికి నాఇస్త్రీ 324, 344;- వారికి నా తీర్మానము చూపితిని 347; దానిని కాంగ్రెసులో సమర్థించిరి 348;- వీరి మనస్సును వేధించునవి: 'భారతదేశదారిద్ర్యము, పారతంత్ర్యము' 355;-
స్థాపించిన సంస్థ 372.
గోమాంసము 50;- తినుట 51, 59.
గ్రాండ్ నేషనల్ హోటల్ 175.
గ్రాండ్ నైట్ 121.
గ్రిండ్లేకంపెనీ 67, 68, 69.
గ్రుడ్లు 87, 88.
గ్రేట్ ఈస్టరన్ హోటల్ 273.
గ్లాడ్ స్టన్ గారియెడ భార్యకుగల ప్రేమ 310
{{p|fs150|ac}}ఘ</p>
ఘాట్ కోపరము 381.
ఘూర్జరభాష 49.
ఘోషా 17.<noinclude><references/>
{{c|16}}</noinclude>
tenvq18yh2sx5uuai0c6iua28iea58y
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/405
104
227356
583071
2026-10-03T01:13:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583071
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>ఘోషాల్ బాబు, కలత్తాకాంగ్రెసు కార్యదర్శి 344;- హ్యూముగారితోపాటు నాకును పాలు కలదనుట 346;- సంతసించిరి 345;— మాటలప్రోవు 345;- గారికి చొక్కాగుండీలు పెట్టియిచ్చుట 346.
{{p|fs150|ac}}చ</p>
చట్టములు-భారతీయుల హక్కును సంకుచించు రెండు 297;— మంజూరాయెను 298.
చదరంగము 156-7, 252.
చర్చిగేటు 381.
చాండాల - వాటిక 258.
చాంద్రాయణము 3.
చాకలి-ఖర్చు 322-3.
చాతుర్మాస్య 3.
చార్లెస్-టౌను 171-2, 229; - బ్రూసు, మారిషస్ గవర్నరు 339.
చిత్తానందము నిచ్చునదియే సేవ 264.
చిత్రలేఖనము 22.
చిమన్ లాల్ సెతల్వాడ్ 339-40.
చివరవానిపుట్టుక 308.
చీటి—పై నాతప్పు వ్రాసి తండ్రి కిచ్చితిని 40.
చీపురుకట్ట 342.
చీవలీశిబిర ప్రాంతసంచారము 331.<noinclude><references/>
{{c|17}}</noinclude>
i0ocakc9i99hdf3misu04ane86bghkj
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/406
104
227357
583073
2026-10-03T01:25:41Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>'చెజనీ', డాక్టరు, 'పాయొనీగ్ ' ఉపసంపాదకులు 255.
చేంబర్ ఆఫ్ కామర్సు, కలకత్తాలో 351.
చేంబర్లేనుగారు 295, 382;- నేటాలు గవర్న మెంటుకు తంతి నిచ్చుట 294;- వారిని చూచుటకు డెప్యుటేషన్ 384.
చౌపాటీ 37.
చౌరంగీమహలు. 363.
చౌర్యము 39-40.
{{p|fs150|ac}}ಜ</p>
జమీయత్ రామ్, నానాభాయి 382.
జయపూరు 366.
జయరామ్‌దాసు-ప్రస్తా 1.
జర్మనీ 144.
జర్మిష్టన్ స్టేషన్ 178.
జలచికిత్స 377-8, 381.
జాంజిబారు 158-9, 167, 267.
జాకోబన్ - డి - వెట్, ప్రిటోరియా బ్రిటిషు ఏజెంటు 193.
జాతి-బహిష్కారము 131;- వైషమ్యము 238.
జాన్ బరన్ స్ 114;- రాబిన్ సన్, సర్ 215.
జాన్ స్టన్ 181, 183 ;—హోటల్ 180.
జామనగరము 372-375.
జార్జిముల్లర్ 204.<noinclude><references/>
{{c|18}}</noinclude>
0qzkgxq8da32uvajnjbnw2aouu4dt7f
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/407
104
227358
583074
2026-10-03T01:40:06Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>జీసస్ 75;— ఈశ్వరుని ఏకమాత్ర పుత్రుడు 182:-ను గుఱించి నానమ్మకము 206-7;- భగవత్సముడు 216.
జునాఘడ్ 1;- వకీలు 63-4.
జూలూ-జాతివారు 236;- తిరుగుబాటు, నేటాలులో 312-3 ;- అందు పనిజేయవలచుట 312.
జేమ్సు గాడ్ ఫ్రే-దక్షిణాఫ్రికా ప్రతినిధి సంఘసభ్యులు 166.
జైన-సాంప్రదాయము 30;- ధర్మాచార్యులు 50.
జైల్స్-పరీక్షకుడు 5.
జోషీ-మావుజీ దవే 55, 59-60, 214.
జోహాన్స్ బర్గు 316;- నందు గోఖలేగారికి విందు 323;- నుండి మకాము ఎత్తివేయుట 312.
జ్ఞానవాపి, ఇచట చెడుగవులు, నేనిచ్చిన దమ్మిడీ దక్షిణ, పండాచే తిట్లుతినుట 370.
జ్యేష్ఠ -పుత్రుడు, నా 302-3.
{{p|fs150|ac}}ట</p>
టాంగోటా 229.
టాగోరు, మహారాజా 273.
టాల్ స్టాయి, ఎఫిల్ టవర్ 118-19;- వ్రాసిన 'వైకుంఠము నీ హృదయములోనే' 135, 208. The Gospels in Briefs
What to do" 243.
టీ-కాఫీలు. మాయింట ప్రవేశించుట 138.
టెటమ్‌గారు, రేవు సూపరింటెండెంటు 289.<noinclude><references/>
{{c|19}}</noinclude>
rrj3uc6veyg5kgeivf6st8vtvna5n6y
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/408
104
227359
583075
2026-10-03T01:57:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>టైఫాయిడ్-జ్వరము రెండవపిల్లవానికి, నా జలచికిత్స 376-7.
టైమ్సు ఆఫ్ ఇండియా 218.
ట్రాన్సువాలు, 176-7, 193-4, 276, 296;- నందు అబ్దుల్లాసేటుగారి వ్యవహారము ము 160.
ట్రెయినింగు కళాశాల, రాజకోటలో 261.
{{p|fs150|ac}}డ</p>
డచ్చి-పోలీసు 197;— భాష 197.
డర్బన్—చూడు, దర్బాన్.
డాక్టరు సర్టిఫికెట్లు, రక్షకదళమునకు 327.
డిజరాలీ, మంత్రి 214.
డెక్కు-మీద పయనము 113, 116, 131, 156, 157, 252.
డెయిలీ—టెలిగ్రాఫ్ 73;- పత్రికాప్రతినిధితో పరిచితి 273;- న్యూస్ 73.
డ్రాయింగురూము - బెంగాలుక్లబ్బులో భారతీయుల ప్రవేశము 273.
{{p|fs150|ac}}త</p>
తండ్రిగారు, మా 13, 39, 42, 44, 54, 383; దివాను 12, 223;- వారికి పరిచర్య 21; వారి ఓర్పు 41, వ్యాధి ఎక్కువగుట 43, వేదన 40, మరణప్రయాణము 44, 45; వారి గౌరవము 143.
తయాబ్జీ-బదురుద్దీన్, జడ్జి 125, 141, 262-3;- వంశీయుని వాగ్దానభఁగము 267.<noinclude><references/>
{{c|20}}</noinclude>
ptgacea1teeu4z0puu42bl24kn1by0d
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/409
104
227360
583078
2026-10-03T04:14:21Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583078
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>తలపన్ను - గిరిమిటియాలపై 238-40.
తలపాగ 164-5;- మేజిస్ట్రీటుతో తగవు 162;- కోర్టు నియమములకు విరుద్ధము 224 ;- తీసివేయుమని తెల్లఅధికారి
ఆజ్ఞ 225.
తలిదండ్రులు 33, 50;- వారిపైభక్తి 48;- వారికి పరమభక్తుడను 30.
తిలకు - చూడు, లోకమాన్య.
తుపాను 61, 131, 281;- తొలగిపోవుట 281; —భయము 282.
తులసిదండ, మాఆమ్మగారి ప్రసాదము 187.
తులసీదాసు-రామాయణము 49 ;- గాంధి 1.
తెలుగు నేర్వ బ్రయత్నము 253;- వారు 163, 253, 307.
తెల్ల-అధికారులు 147, 151; వారినడత 149; వారి అజ్ఞానము, అవిచారము 383;- ఉద్యోగి ఉర్దూ చదువుటలో నన్నతిక్రమించుట 252 ;——దొరతనమందలి విశ్వాసము 326;- ఫాదరీలు 210;—బాటసారులు 178;- వర్తకులు 181—
సోల్జర్ల పొత్తు 329-30.
తెల్ల వారు 27, 153; వారిని అనుకరించుట 279; వారి ఆధిక్యము 222; వారినిజయించుటకు మాంసాహారము అవసరము 29-3౦ వారివలన రైలులో భారతీయులు పడుపాట్లు 171; వారి యోగ్యతాపత్రముల విలువ 221-2; వారు తలలు వంచుకొనిరి 297; వారిబడి 301; వారికి నల్ల వారిపై ఈసు 273.<noinclude><references/>
{{c|21}}</noinclude>
k3352uy0y4f2a7866nud8gngog6kwcj
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/410
104
227361
583080
2026-10-03T06:21:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>తైయబ్ హాజీఖాన్ మహమ్మదు, ప్రతివాది 168-9, 191, 193, 202; రాజీ కంగీకరించుట 202-3.
తైలంగుగారు, భాషాపండితులు 356.
"త్యాగనటకే”, నిష్కులానందుని 12, 314.
త్యాగిజీవనము, భోగిజీవనము 318.
త్రాగుబోతులు 117.
త్రిభువనదాసుగారి గ్రంథము 308.
త్రివేణీ సంగమము 256.
{{p|fs150|ac}}ద</p>
దక్షిణ ఆఫ్రికా 18, 122, 123, 128, 143, 153-6; 170, 251, 256, 264, 267-9, 274, 296, 299, 302-3, 307, 310, 334, 339, 341, 349, 351, 359 - ఆత్మగౌరవముగల భారతీయులకు నివాసయోగ్యము కాదు. 198;- కేసు 167;—క్లయింట్లు 381 ;—కు రెండవతూరి సకుటుంబప్రయాణము 276;—కు పోవు మహోత్సవము 155;- నాజీవితము 213;- ను గూర్చి ప్రధానవ్యాసములు 176;- నుండి పెద్దసాయము 333;—నుండి తంతి 382;- రేవులో డాక్టరు పరీక్ష 283; —లో బిడియమువదలుట 95;- లో రోమన్ డచ్చి లాలు 123;- లో ప్రఖ్యాతి 165, 225;- లోని తెల్లవారిదోషములు 275;- లో మాకిరువురు కుమారులు కలిగిరి 307;- సత్యాగ్రహము 300, 302;- సత్యాగ్రహేతిహాసము 194, 326. ప్రస్తా - 2;- భారతీయ సంఘములో<noinclude><references/>
{{c|22}}</noinclude>
4cdvblyqh8osk7zfml0qnjvimdvyhuh
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/411
104
227362
583081
2026-10-03T06:37:56Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>శుభ్రత 332, కొఱతలు 333;- భారతీయులు 231; వారి కష్టములు 176, 198; వారికి కూలీలని పేరు 163; పరస్పర భేదములు 191, 215; వారి జీవితములను సమస్తము తెలుసుకొంటిని 193; వారి విషయము లోతుగా విచారించుట 197; - ఆందోళనమువలన వారిలో నూతనప్రాణము 216; వారియెడ అసూయ 137; వీరిపైద్వేషము పెరుగుట 297; వారికి కష్టములు కలిగించు చట్టములు 297; వారిహక్కులు 298; వా రనిన భయము 297; వీరిలో నైక్యము
వృద్ధియగుట 329; వీరి ప్రతిష్ఠ హెచ్చెను 297, 329; వీరిపై నొక ఆక్షేపము 331; వీరికి సేవజేయుట 333.
దమ్మిడి—దక్షిణ 370, 373.
దయానందస్వామి, మోర్బి యనుభవము 364.
దర్బాన్ 168, 171, 210, 227, 284-5, 301, 384 ; —కోర్టు 162;— తెల్ల వారి పాతాళహోమము 283-4;- నుండి బయలుదేరుట 169; - నుండి తంతి 275;- పోర్టు నేటాలనియు పేరు 160;- భారతీయ క్రైస్తవులతో పరిచయము 166;- రేవున లంగరు 283 ;- లో తెల్ల వారికి నల్ల వారికి ద్వందయుద్ధము 284;- లో ప్లేగు 331.
దలపతరాం శుక్ల 67, 83.
దవే, కే-మా నాకు కేసులు తెచ్చియిచ్చుట 372, 374.
దస్తూరి, ఒకవిద్య 22.
దాంపత్యము 137.<noinclude><references/>
{{c|23}}</noinclude>
rjoupdp857nslcl9qkntfvct922cnxo
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/412
104
227363
583082
2026-10-03T06:52:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583082
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>దాదా అబ్దుల్లా అండ్ కంపెనీ 153, 155, 166, 214, 221-2, 286.
దాదాభాయి నౌరోజీ 67, 124-5.
దాదీ బర్ జోరుగారు, ఓడవైద్యులు 291.
దారిబత్తెము, ప్రస్తా-5.
దావా - కొఱకు తయారీచేయుట 201;- పని చూచుటయె నా ముఖ్యధర్మము 200;- లో నా కభిరుచి 200.
దావూద్ - మహమ్మద్ సేట్ 214, 217.
దిన్షా ఎడల్జి వాచా—కలకత్తా కాంగ్రెసు అధ్యక్షులు 339-40, 348; గంట వాయించుట 349.
దివ్యజ్ఞాన-సమాజము, తత్సామాజికులు 102, 103, 106, 242.
దెబ్బలు, నాకు తగిలినవి 291.
దేవళపు దుర్గంధము 259.
దేవేంద్రనాధఠాకూరు, మహర్షి 112, 363.
దేశపాండే— కేశవరావు 266-7.
దేశభాషల నాదరింపకుండుట 254.
దేశకార్యములలో వ్యాయామము 357.
దేశమునకు-మఱలుట 334, 339; మఱలునపుడు కానుకలు 335.
దేశ్యక్రైస్తవుల పరిచయము 358.
దొంగిలించితిని 39.
దొర 148, 151, 373-4; - ను చూచుట 59;-ప్రత్యుత్తరము 149;— పై కేసు 149;- ఫిలాసఫీ 374;-మాట<noinclude><references/>
{{c|24}}</noinclude>
lkm4aqtyj9ihbmlmmwu4zopf4jud418
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/413
104
227364
583083
2026-10-03T07:05:14Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583083
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>యే శాసనము 153;- గారులు, వారితో కలిసి తినుట 62, వారి వ్యయము 161; శిరస్తాదారే వారికి కన్ను 152; హిందూ అధికారి వారికి తాత 152.
దొరాబ్జి ఎడుల్జీ గిమి, హెడ్‌మాస్టరు 21-1.
ద్విపదలు 49.
{{p|fs150|ac}}ధ</p>
ధర్మజిజ్ఞాస 241.
ధర్మవిచారము, నర్మదాశంకరుని గ్రంథము 242.
ధర్మసంకటము 377, 379.
ధూమపానము 37.
ధోరాజీ. 57.
{{p|fs150|ac}}న</p>
నంబర్సు‘-బైబిలు పుస్తకము. 114.
నగలు, దేశమునకు మఱలునపుడు బహుమతిచేసినవి 335-6 ; ఇంటిలో ఉంచుకొనుటయే మానుకొంటిని; వానిపై వ్యామోహము; అవి అనవసరములు 336; కావలెనను కోడండ్రు 337; తిరిగి ఇచ్చివేయుటకు భార్య నొప్పించితిని; అవి
ప్రజాసేవకై బాంకులో వేయబడెను 338.
నరసీరామ్ 214.
నర్మదకవి 29.
నర్మదా శంకర్ రచించిన “ధర్మ విచారము” 242.
నర్సుపని, మాతండ్రికి పరిచారము 42, 50;- చేయవలెనని ప్రబలమగు నిచ్ఛ 306.<noinclude><references/>
{{c|25}}</noinclude>
58gdgy4eswbl0e914ijxss35tbgukr0
పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/414
104
227365
583085
2026-10-03T07:20:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
583085
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{p|fs150|ac}}అకారాదిపదాది సూచి</p></noinclude>నల్ల-తల, తెల్ల మంగలి అంటునా ? 325.
నల్లవారు, అడ్వకేటుగా జేర్చుకొన దగుదురా 222; వారినిగుఱించి ఆంగ్లేయుల భావన 327; వారివర్తకపు తెలివి 235; వారి ఇక్కట్టులు 374.
నవజీవన్, ప్రస్తా 2.
నాగరికత 70.
'నాదరీ', దక్షిణాఫ్రికాపోవు స్టీమరు, ఏజెంటు అబ్దుల్లాసేటుగారు 276, 282, 286, 296;
నారాయణ హేమచంద్రుడు 111-6.
నాసిక్ 136.
నాస్తికమతము 108-9.
నిద్రించుట, కూడ నొక ఫాషన్ 382.
నివేదిత, సోదరి, హిందూమతముపై నామె క గాధ ప్రేమ 363.
నిష్కులానందుడు 12, 314.
నీగ్రోలు, నల్లవారు నొకటే 197.
నీగ్రో-నౌకరులకు చీటి 195; - స్త్రీలు 158.
నీతి, సత్యము 52;—సృష్టి 52.
నృత్యము, ఒక ఫాషన్, నేను నేర్చుకొనుట 78-79.
నెక్-టై 64, 77-8, 177.
నేటాలు 160, 163, 176, 220, 222, 246, 260, 281, 286, 334, 375 ;- 'అడ్వర్టైజర్' ప్రతినిధితో నాప్రసంగము 297;——ఇండియన్, కాంగ్రెసు, జన్మ<noinclude><references/>
{{c|26}}</noinclude>
melxu9ndkjmg3pn0ovzbuy9ut4g0f9y
వాడుకరి చర్చ:MaddyQatar
3
227366
583095
2026-10-03T09:23:31Z
Rajasekhar1961
50
/* స్వాగతం */ కొత్త విభాగం
583095
wikitext
text/x-wiki
{{స్వాగతం}} [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:23, 3 అక్టోబరు 2026 (UTC)
12oq6j0pg8wn17gvhf2t47w8jrj14ll
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/3
104
227367
583096
2026-10-03T10:05:57Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
583096
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/6
104
227368
583097
2026-10-03T10:13:50Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
583097
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop
|Image = Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf
|Page = 6
|bSize = 600
|cWidth = 545
|cHeight = 767
|oTop = 71
|oLeft = 24
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
8b1s4ftvf49t2lx0ntwoin9qad2j90w
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/597
104
227369
583102
2026-10-03T10:19:36Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
583102
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/596
104
227370
583103
2026-10-03T10:19:49Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
583103
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/595
104
227371
583104
2026-10-03T10:20:11Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
583104
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/594
104
227372
583105
2026-10-03T10:22:29Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దారు */
583105
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>
{{rule}}{{rule}}
{{c|గుంటూరు: కన్యకా ముద్రాక్షరశాలయందు ముద్రింపఁబడియె.}}
{{c|20-4-1926.}}
{{rule}}{{rule}}<noinclude><references/></noinclude>
8oe4yf6i2wyk80koui49ralpd1xnhel
పుట:Shri Garga Bhagavatam by B. S. Appayya Shastri Chivukula (Telugu).pdf/590
104
227373
583106
2026-10-03T10:23:00Z
Rajasekhar1961
50
/* పాఠ్యం లేనిది */
583106
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="0" user="Rajasekhar1961" /></noinclude><noinclude><references/></noinclude>
i1sx6d49oqeeqt1mtaminthjqpvy6i2