వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.23 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/5 104 37937 583778 233794 2026-10-06T23:05:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 583778 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}ప్రాత నిబంధన కథలు-3
{{p|fs150|ac}}81. యోనా కథ
ప్రభువు యోనా ప్రవక్తను నీనివే పౌరులకు పశ్చాత్తాపాన్ని బోధించమని ఆజ్ఞాపించాడు. వీళ్లు అన్యజాతివాళ్లు. యిస్రాయేలు దేశానికి శత్రువులు. కనుక వీళ్లు పరివర్తనం చెంది దేవుని శిక్షను తప్పించుకోవడం యోనాకు ఇష్టంలేదు. కావున అతడు ఓడనెక్కి నీనివేకు పోక, దానికి ఇంకో వైపున వున్న తర్షీషు నగరానికి ప్రయాణమయ్యాడు. కాని దేవుడు సముద్రంలో పెద్ద తుఫాను రేపాడు. ఓడ మునిగిపోయేలా వుంది. నావికులు ఎవని పాపంవలన తుఫాను పట్టుకొందో తెలుసుకుందా మనుకొని చీట్లువేయగా యోనా తుఫానుకి కారకుడని తేలింది. వాళ్లు యోనాను వివరాలు అడగ్గా అతడు నేను దేవుని నుండి పారిపోతున్నానని చెప్పాడు. నావికులు భయపడి నీవు ఎంత పని చేశావు! మాకింత కీడు తెచ్చిపెట్టావు కదా అన్నారు. యోనా ఈ వుపద్రవానికి కారణం నేనే. నన్నెత్తి సముద్రంలో పడచేయండి. ఈ తుఫాను శాంతిస్తుంది అని చెప్పాడు. నావికులు అలాగే చేయగా తుఫాను వెంటనే సమసిపోయింది. ప్రభువు ఆజ్ఞపై ఓ తిమింగిలం యోనాను మ్రింగివేసింది. అతడు మూడు రోజులు చేపకడుపులో వుండిపోయాడు. అటు తర్వాత అది యోనాను ఒడ్డున వెళ్లగ్రక్కింది. రెండవసారి ప్రభువు యోనాను నీనివే నగరానికి వెళ్లి పశ్చాత్తాపాన్ని బోధించమన్నాడు. ఆ పట్టణం చాల పెద్దది. దాన్ని దాటిపోవాలంటే మూడురోజులు పడుతుంది. యోనా ఆ నగరానికి వెళ్లి మీరు పశ్చాత్తాప పడండి. లేకపోతే నలభైరోజుల్లో ఈ నగరం నాశమై పోతుంది అని బోధించాడు. అతని బోధను నమ్మి ఆ ప్రజలు పరితాపం చెందారు. రాజు, ప్రజలు, పశువులు గోనె తాల్చి ఉపవాసం చేసి తమ్ము క్షమించమని దేవుణ్ణి<noinclude><references/> {{c|2}}</noinclude> guiv3ehd3ivuucz0slcpn5j6tsm7yoo పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/6 104 37940 583780 233795 2026-10-06T23:12:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 583780 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>వేడుకొన్నారు. దేవుడు ఆ జనం మీద జాలి చెంది వారిని శిక్షించకుండ వదిలివేశాడు. కాని వాళ్లు ఆలా శిక్షను తప్పించుకోవడం యోనాకు ఇష్టంలేదు. పట్టణం నాశంగావాలనే అతని కోరిక. అతడు నీ వెప్పడూ ఈలాగే దయతో పాపులను శిక్షించక వదలి వేస్తుంటావులే అని దేవునికి పిర్యాదు చేశాడు. దేవుడు నీ కోపాన్ని అణచుకో అని చెప్పాడు. యోనా ఆగ్రహంతో నీనివేకు దూరంగా వెళ్లిపోయి ఓ గుడిసె వేసికొని, ఒకవేళ పట్టణం నాశమైపోతుందేమో చూద్దామని దానిలో కూర్చున్నాడు. దేవుడు ఎండలో యోనాకు నీడనీయడానికి ఓ సౌర తీగను మొలపింపగా అతడు ఎంతో సంతోషించాడు. కాని మరుసటిరోజు ఓ పురుగు దాన్ని కొట్టివేసింది. ఇక నీడ లేదు. ప్రవక్త ఎండ తీవ్రతను భరించలేక నేను చావడమే మేలు అని ఆపసోపాలు పడ్డాడు. అప్పుడు దేవుడు ఓయి! నీవు ఒక తీగ పోయినందుకే ఇంతగా విచారిస్తున్నావు. నీ మట్టుకు నీవు ఈ తీగను నాటలేదు, పెంచలేదు. ఈ పట్టణంలో లక్షా యిరవైవేలమంది జనం ఉన్నారు, ఇంకా లెక్కలేనన్ని జంతువులున్నాయి. ఈ ప్రాణులన్నీ నాశమైపోతే నాకు బాధ కలగదా అన్నాడు. దేవుడు కరుణగల వాడనీ, ఒక్క యూదులనేగాక అన్యజాతి వారిని గూడ రక్షించేవాడనీ ఈ కథ భావం. {{p|fs125|ac}}82. ఉజ్జీయా గర్వం - 2రాజుల దినచర్య 26, 16-23
ఉజ్జీయా గొప్ప రాజు. అతడు యుద్ధంలో చాల విజయాలు సాధించి పేరు తెచ్చుకొన్నాడు. మారణయంత్రాలు కూడ కనిపెట్టి తెలివైన రాజు అనిపించుకొన్నాడు. దానితో అతనికి గర్వం పట్టుకొంది. దేవళంలో సాంబ్రాణి పొగ వేయడం యాజకుల పని. ఐనా ఆ రాజు పొగరుతో దేవళంలోకి వెళ్లి తానే దేవుని ముందు ధూపం వేశాడు. ఎనభైమంది<noinclude><references/> {{c|3}}</noinclude> msk609yde4ow5i6e99vkm1n8ngp14tv పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/7 104 37944 583781 233796 2026-10-06T23:18:04Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 583781 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>యాజకులు అతనికి అడ్డు వచ్చి అయ్యా! ఇది యాజకులు చేయవలసిన పని అని వారించారు. ఐనా అతడు వారి పలుకులు ఆలింపక మండిపడ్డాడు. వెంటనే దేవుడు అతని నొసటి మీద కుష్ఠ సోకేలా చేశాడు. యాజకులు అతన్ని దేవాలయం నుండి వెళ్లగొట్టారు. ఉజ్జీయా చనిపోయే వరకు కుష్ఠరోగి గానే వుండిపోయాడు. మళ్లా దేవాలయంలో అడుగు పెట్టక ఏకాంతంగా జీవించాడు. {{p|fs125|ac}}83. యెషయాకు పిలుపు -యెష 6,1-8
యెషయా మాపటివేళ ధూపారాధన జరిగే సమయంలో యెరూషలేము దేవాలయానికి వెళ్లాడు. అక్కడ, ప్రభువు అతనికి సింహాసనం మీద కూర్చుండి వున్న మహారాజులాగ దర్శన మిచ్చాడు. అతని చుట్టూ దేవదూతలు కొలువు చేస్తూ ప్రభువు పవిత్రుడు, ఈ లోకమంతా అతని సాన్నిధ్యంతో నిండివుంది అని పాడుతున్నారు. యెషయా నావన్నీ పాపపు మాటలే. నేను పాపపు నరుల మధ్య వసిస్తున్నాను. ఇప్పడు నేను దేవుణ్ణి కంటితో చూచాను. ఇక నేను చనిపోతానేమో నని భయపడ్డాడు. అప్పుడు దేవదూత బలిపీఠం మీది నుండి నిప్ప కణికను తీసికొని వచ్చి అతని పెదవులకు అంటించి దీని వల్ల నీ పాపం తొలగిపోయింది అని చెప్పాడు. ఈ దర్శనంలో యెషయాకు ప్రవచనం చెప్పే శక్తి వచ్చింది. దేవుడు ఎవడు నా దూతగా వెళ్లి ప్రజలకు నా సందేశం విన్పిస్తాడు అని దేవదూతలను సలహా అడుగుతుండగా యెషయా విన్నాడు. అతడు మీరు ఇప్పడే నా పెదవులు కాల్చి శుద్ధిచేశారు కదా! నన్ను పంపండి అన్నాడు. దేవుడు నీవు వెళ్లి జనానికి నా చిత్తాన్ని తెలియజేయి అన్నాడు. ఈలా యెషయా ప్రపక్త అయ్యాడు. ఆనాటి నుండి అతడు జనానికి ప్రభువు వాక్కులు విన్పించడం మొదలు పెట్టాడు.<noinclude><references/> {{c|4}}</noinclude> h6d8jwymol213hbvaz4486kkkx28hze పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/8 104 37948 583782 233797 2026-10-06T23:26:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 583782 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}84. హిస్కియా ప్రార్ధనం - యెష 37
అస్సిరియా రాజు సన్హెరీబు యూదియా మీదికి దండెత్తాడు. హిస్మియా రాజుకి జాబు పంపాడు. అందులో మా పూర్వులు నేను చాల రాజ్యాలను జయించాం. ఆరాజ్యపు దేవుళ్లు వాటిని మా నుండి కాపాడలేక పోయారు. ఇప్పడు నీ దేవుడు మాత్రం నిన్ను నా బారి నుండి ఏలా రక్షిస్తాడు? కనుక నీవు నాకు లొంగిపో అని వ్రాసివుంది. హిస్కియా రాజు దేవాలయం ప్రవేశించి జాబుని దేవుని సన్నిధిలో విప్పిపెట్టి భక్తితో దేవునికి ప్రార్థన చేశాడు. అస్సిరియా రాజునుండి నన్ను కాపాడు అని మనవి చేశాడు. ఈ సంగతి విని యెషయా రాజు వద్దకు మనిషిని పంపి దేవుడు నీ మొర విన్నాడు. నీవు భయపడవద్దు. సన్హెరీబు ఈ పట్టణంలో ప్రవేశించలేడు. అతడు తాను వచ్చిన దారినే తిరిగిపోతాడు అని సందేశం చెప్పించాడు. ఆ రాత్రే దేవదూత అస్సిరియా సైన్యంలో లక్షయెనభై యైదు వేలమందిని చంపివేశాడు. దానితో గుండె చెదరి సన్హెరీబు ముట్టడిని ఆపివేసి అస్సిరియాకు తిరిగిపోయాడు. అక్కడ ఆ రాజు దేవాలయంలో తన దేవుణ్ణి ఆరాధిస్తుండగా కుమారులే అతన్ని చంపివేశారు. {{p|fs125|ac}}85. యిర్మీయాకు పిలుపు - యిర్మీ 1,4-10
ప్రభువు యిర్మీయాను తన సేవకు పిల్చాడు. నీవు తల్లి కడుపున పడకమునుపే నేను నిన్ను ఎన్నుకొని జాతులకు ప్రవక్తగా నియమించాను అని చెప్పాడు. ఆ రోజుల్లో ప్రజలు ప్రవక్తల పలుకులు వినేవాళ్లు కాదు. కనుక యిర్మీయా దడిశాడు. నేను పసివాణ్ణి. ప్రవక్తగా పనిచేయలేను అని వెనుకాడాడు. కాని ప్రభువు అతన్ని ప్రోత్సహించి అభయమిచ్చాడు. నేను నీకు తోడుగా వుండి నీకు విజయాన్ని ప్రసాదిస్తాను అని చెప్పాడు. తన వాక్కు నెత్తి అతని నోటిలో పెట్టాడు. నీవు ప్రజలను భవనంలాగ పడగొట్టి మళ్లా కడతావు అని చెప్పాడు. ఈ దర్శనంలోనే యిర్మీయా ప్రవక్తయై ప్రభువు సందేశాన్ని చెప్పడం మొదలుపెట్టాడు.<noinclude><references/> {{c|5}}</noinclude> jeu0a0b2472ylmh8vkbjfukxhw6ty34 పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/9 104 37950 583798 233798 2026-10-07T06:50:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 583798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}86. పూడికబావిలో యిర్మీయా - యిర్మీ 38,1-13
సిద్కియా రాజు కాలంలో యిర్మీయా చెరలో వున్నాడు. అప్పడు బాబిలోనీయులు యెరూషలేము నగరాన్ని ముట్టడిస్తున్నారు. యిర్మీయా మీరు బాబిలోనియా రాజుకి లొంగిపొండి. లేకపోతే యుద్ధం, ఆకలి, అంటురోగాల వలన నాశమైపోతారు అని చెప్పాడు. అతని పలుకులు అధికారులకు నచ్చలేదు. ఇతడు బాబిలోనీయుల పక్షాన జేరి మన ప్రజలను నిరుత్సాహ పరుస్తున్నాడు అని రాజుకి ఫిర్యాదు చేశారు. ప్రవక్తనుచెరనుండి కొనిపోయి పూడిక బావిలోకి దింపారు. అప్పడు నగరంలో ఆహారంలేదు. ప్రవక్త ఆ బావిలోనే ఆకటితో చనిపోయేవాడే. రాజప్రాసాదంలో పనిజేసే ఏబెద్మేలెకు అనే నీగ్రో బానిస యిర్మీయా మీద దయగలిగి అతనికి త్రాళ్లు ప్రాత గుడ్డలు అందించాడు. ప్రవక్త ఆ గుడ్డలను చంకలక్రింద పెట్టుకోగా త్రాళ్లతో అతన్ని వెలుపలికి లాగారు. {{p|fs125|ac}}87. యెహెజ్కేలు ప్రభువు వాక్కుని భుజించడం - యోహె 2,8-3, 4
దేవుడు యెహెజ్కేలుని ప్రవక్తగా ఎన్నుకొన్నాడు. అతనికి దర్శనం కలిగింది. ఒక చేయి అతనికి పుస్తకపు చుట్టను అందించింది. దేవుడు నీవు దీన్ని భుజించు అని చెప్పాడు. ప్రవక్త దాన్ని తినగా అది అతని నోటికి తేనెలగ తీయగా వుంది. నీవు ఈ సందేశాన్ని భుజించావు కదా! ఇక వెళ్లి ప్రజలతో మాటలాడు అని దేవుడు చెప్పాడు. ప్రవక్త మొదట దేవుని వాక్కుని విని తర్వాత దాన్ని ప్రజలకు తెలియజేస్తాడని ఈ దర్శనం భావం. యెహెజ్కేలు ఈ దర్శనం వలన ప్రబోధం చెంది ప్రజలకు ప్రభువు పలుకులు విన్పించాడు. {{p|fs125|ac}}88. నెబుకద్నెసరు కల - దాని 2
యిస్రాయేలు బాలురైన దానియేలు, హనన్యా, మిషాయేలు,<noinclude><references/> {{c|6}}</noinclude> khyfj9f6yn6bokgs0lqg8mbjbaax69a పుట:Narasabhupaleeyamu.pdf/80 104 120228 583775 376825 2026-10-06T21:14:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 583775 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|80|కావ్యాలంకారసంగ్రహము|}}</noinclude>{{p|al|fwb}}బింబప్రతిబింబోపమ —
{{Telugu poem|type=క.|lines=<poem>గురుశౌర్యయుతము నాయక, కరవాలము నగునృసింహుఘనభుజ మలరున్ దరళఫణామణికిరణ, స్ఫురణము జిహ్వాల మైనభోగియుఁ బోలెన్.</poem>|ref=28}} {{p|al|fwb}}అనన్వయము —
{{Telugu poem|type=క.|lines=<poem>సరసం బగు నొక్కటికే, ధర నుపమానోపమేయధర్మము దిర మై పరఁగిన ననన్వయం బగు, నరయంగా దీనిలక్ష్య మాపాదింతున్.</poem>|ref=29}} {{Telugu poem|type=క.|lines=<poem>నీదయకు నీడుజో డగు, నీదయ నీజయముసాటి నీజయ మిలలో నీదానమునకు నెన యగు, నీదానము నీకు సాటి నీవె నృసింహా.</poem>|ref=30}} {{p|al|fwb}}ఉపమేయోపమ —
{{Telugu poem|type=క.|lines=<poem>నిపుణస్థితి నుపమేయం, బుపమానముఁ బోల మఱియు నుపమానం బా యుపమేయముఁ బోలఁగఁ దగు, నుపమేయోపమ యనంగ నొగి నె ట్లన్నన్.</poem>|ref=31}} {{Telugu poem|type=క.|lines=<poem>శరణాగతభరణంబున, నరసింహునిసాటి వచ్చు నరసాహసుఁ డీ నరసింహుఁ డితని కెన యా, నరసింహుఁడె కాక యితరనరులకు వశమే.</poem>|ref=32}} {{p|al|fwb}}స్మరణము —
{{Telugu poem|type=క.|lines=<poem>ధర నొకవస్తువుఁ గనుఁగొని, వరుసం దత్సదృశ మైనవస్తువు దలఁపన్ స్మరణం బని పాటింపుదు, రరయ నలంకారవేత్త లది యె ట్లన్నన్.</poem>|ref=33}} {{Telugu poem|type=క.|lines=<poem>ఇల యంత్రమత్స్య మేయను, విలు పూనినశ్రీనృసింహవిభుఁ గాంచి జనుల్ తలఁపుదురు ద్రుపదకన్యా, కలితకరగ్రహణనమితకార్ముకుఁ బార్థున్.</poem>|ref=34}} {{p|al|fwb}}రూపకము —
{{Telugu poem|type=మ.|lines=<poem>అల సందేహముమాడ్కి గాక యుపమేయం బెన్న నచ్చన్న మై యలఘూత్ప్రేక్షయు నా నభిన్నమతిజం బై యుండ కారోప మిం పలరంగాఁ బ్రకృతోపమోగిపరిణామారోపతుల్యంబుగా కలయారోపిత మిందు రంజనము సేయన్ రూపకం బై తగున్.</poem>|ref=35}} {{Telugu poem|type=క.|lines=<poem>అరయ రసజ్ఞులమతమున, నరు దగునీరూపకంబు సావయవంబు న్నిరవయవంబును వరుసం, బరంపరిత మనఁగఁ ద్రివిధభావము నొందున్.</poem>|ref=36}} {{Telugu poem|type=చ.|lines=<poem>అరయ సమస్తవస్తువిషయంబును నేకతలప్రవర్తి యై యరుదుగఁ బొల్చుసావయవ మవ్వలఁ గేవలమాలికాఖ్య మౌ నిరవయవంబు శ్లిష్టమును నేర్పున శ్లేషవిహీన మౌ పరం పరితము తత్ప్రభేదములఁ బాయక కేవలమాలికాఖ్య మౌ.</poem>|ref=37}} {{Telugu poem|type=క.|lines=<poem>కావున రూపక మష్టవి, ధావహ మగులక్షణంబు లలలక్ష్యంబుల్ వావిరి నొనర్తు వీనికి, భావజధనురసమరసవిభాసితఫణితిన్.</poem>|ref=38}}<noinclude><references/></noinclude> dw2m55cyy3714r78vu6y5i0bcvde29q పుట:Narasabhupaleeyamu.pdf/81 104 120229 583786 376827 2026-10-07T01:39:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 583786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh||నరసభూపాలీయము. ఆ. 5|81}}</noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అవయవియు నవయవంబులు, వివరింప సమస్తవస్తువిషయం బిలలో నవయవి యవయవగమ్యం, బవునది యేకతలవర్తి యగు నె ట్లన్నన్.</poem>|ref=39}} {{p|al|fwb}}సమస్తవస్తువిషయసావయవరూపకము —
{{Telugu poem|type=మహాస్రగ్ధర.|lines=<poem>హిమశైలద్వీపదీప్తం బినమణిమహితం బిందుశంఖాభిరామం బమరాంభోమర్త్యయుక్తం బహిపలహరికం బభ్రశైవాలజాలం బమితాశాకుంభినక్రం బజహదుడుకణం బాత్తసంధ్యాప్రవాళం బమరున్ శ్రీనారసింహోద్యతవిశదయశోహారిదుగ్ధాబ్దివేడ్కన్.</poem>|ref=40}} {{p|al|fwb}}ఏకదేశవర్తిసావయవరూపకము —
{{Telugu poem|type=క.|lines=<poem>ధర నొఱ యనువల్మీకము, సరభసగతి వెడలి నీదుచటులాసి మదో ద్ధుచరదరిధరణిధురం, ధరజీవానిలముఁ గ్రోలు నరసింహనృపా.</poem>|ref=41}} {{Telugu poem|type=క.|lines=<poem>అవయవమాత్రంబున నే, కవిమతి విశ్రాంత మైనఁ గన నిరవయవం బవని నిది కేవలంబును, ద్వివిధత మాలికయు నయ్యె విను మె ట్లన్నన్.</poem>|ref=42}} {{p|al|fwb}}కేవలనిరవయవరూపకము —
{{Telugu poem|type=క.|lines=<poem>ఇల నీదు కీర్తిచంద్రిక, యలఘుతరస్ఫూర్తి నలినజాండకరండం బులు నిండి వెల్లివిరిసే, న్నలనహుషసమానశీల నరసనృపాలా.</poem>|ref=43}} {{p|al|fwb}}మాలానిరవయవరూపకము—
{{Telugu poem|type=క.|lines=<poem>హరశిఖరిదరులభాషా, తరుణీకుచగిరుల నమరతరులం జెలఁగున్ ఝరు లై సరు లై విరు లై, నరనుత మగునీదుకీర్తి నరసింహనృపా.</poem>|ref=44}} {{Telugu poem|type=క.|lines=<poem>రూపకకారణ మై తగు, రూపకము పరంపరితము రూపింపఁగ నిం దేపగు నాల్గువిభేదము, లాపాదించెద నుదంచితాయతఫణితిన్.</poem>|ref=45}} {{p|al|fwb}}శ్లిష్టకేవలపరంపరితరూపకము —
{{Telugu poem|type=క.|lines=<poem>నిరతంబు రాజహంసలఁ, బరువెత్తఁగఁ జేయు నౌర పటుచటులభవ త్కరకరవాలకరాళ, స్ఫురితాంభోదము నృసింహభూపాలమణీ.</poem>|ref=46}} {{p|al|fwb}}శ్లిష్టమాలాపరంపరితరూపకము —
{{Telugu poem|type=క.|lines=<poem>కువలయవికసనహిమకరుఁ, డవిరళదానాంబుదిగ్గజాగ్రణిపద్మో త్సవసౌభాగ్యదివాకరుఁ, డవనిని నరసింహుఁ డితని కన్యులు సరియే.</poem>|ref=47}} {{p|al|fwb}}అశ్లిష్టకేవలపరంపరితరూపకము —
{{Telugu poem|type=క.|lines=<poem>కాతరతరవిమతధ్వజి, నీతతకాంతారతతికి నీచేతిమహా హేతి దవజ్వలనోజ్జ్వల, హేతి సుమీ యోబధారుణీశ్వరునరసా.</poem>|ref=48}}<noinclude><references/></noinclude> m4yu0fsaq40jbqho97oorn88ffzrfuz పుట:Narasabhupaleeyamu.pdf/82 104 120237 583794 376841 2026-10-07T06:16:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 583794 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh|82|కావ్యాలంకారసంగ్రహము|}}</noinclude>{{p|al|fwb}}అశ్లిష్టమాలాపరంపరితరూపకము —
{{Telugu poem|type=మ.|lines=<poem>వనితానేత్రచకోరచంద్రిక యశోవల్లీవసంతోదయం బనిదంపూర్వకథాసుధాబ్ధిభుజగర్వాదిత్యపూర్వాచలం బనఘోద్యద్గుణరత్నరోహణము నీయాకార మెవ్వారికిన్ వినుతింప న్వశమే నృసింహకరుణావిన్యాసధన్యాత్మకా.</poem>|ref=49}} {{p|al|fwb}}పరిణామము —
{{Telugu poem|type=క.|lines=<poem>ధరలో నుపమేయమునను, నరుదుగ నారోప్యమాణ మగునుపమానం బరయఁ బ్రకృతోపయోగా, కరముగఁ బరిణామ మయ్యెఁ గను మె ట్లన్నన్.</poem>|ref=50}} {{Telugu poem|type=క.|lines=<poem>నైలింపసతుల కౌఁగిటఁ, దేలుటకై దివికి నేఁగుదృప్తారులకున్ నీలాల నిచ్చె నాయెను, నీలాలితహేతి యోబనృపనరసింహా.</poem>|ref=51}} {{p|al|fwb}}సందేహము —
{{Telugu poem|type=తే.|lines=<poem>విషయివిషయంబుఁ గవిమతి విహితసామ్య, దీప్తసందేహ మొంద సందేహమదియు గరిమశుధ్ధంబు నిశ్చయగర్భితంబు, నిశ్చయాంశంబు నగుదీని నిశ్చయింతు.</poem>|ref=52}} {{p|al|fwb}}శుద్ధసందేహము —
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇంద్రుఁడొ యాయుపేంద్రుఁడొ బలీంద్రుఁడొ పార్వణచంద్రుఁడో హరి శ్చంద్రుడొ రామచంద్రుఁడొ రసాభరణప్రవణాత్ముఁ డైన నా గేంద్రుడొ యానగేంద్రుఁడొ మృగేంద్రుడొ యంచుఁ దలంతు రార్యు లీ సాంద్రభుజప్రతాపరణసాహసు నోబయనారసింహునిన్.</poem>|ref=53}} {{p|al|fwb}}నిశ్చయగర్భితసందేహము —
{{Telugu poem|type=మ.|lines=<poem>హరుఁడో యీఘనుఁ డైన మౌళిధృతతోయం బెద్ది దైతేయసం హరుఁడో యీనృపుఁడైన నవ్విహగవాహం బెద్ది వాణీమనో హరుఁడో యివ్విభుఁ డైన సారసనివాసాధ్యాసనం బెద్దియం చు రసజ్ఞు ల్వినుతింతు రాత్మ నరసక్షోణీశు వీక్షించుచున్.</poem>|ref=54}} {{p|al|fwb}}నిశ్చయాంతసందేహము —
{{Telugu poem|type=సీ.|lines=<poem>తలపోయ వల్లీమతల్లి కేగతిఁ గల్గె, నలసాలసానూనయావకలన భావింప మణిసాలభంజిక కెటు లబ్బె, లాలితాలాపలీలాకలాప మూహింప విమలవిద్యుల్లేఖ కేలీల, నొదవె ధాత్రీభాగయోగగరిమ మరయంగ మదనమంత్రాదిదేవతకు నే, గతిఁ గల్గె నంగసంగప్రసంగ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మనుచు శబరులు సందియం బంది యంది, తెలియుదురు తోనె నీధాటికలికితలఁకి యహితవనితలు వనవాటి నడలు చునికి, నరనుతాటోప యోబయనరసభూప.</poem>|ref=55}}<noinclude><references/></noinclude> 4eivf4jw5ysz5mm83bqymrm83g18wnd పుట:Narasabhupaleeyamu.pdf/83 104 120238 583805 376846 2026-10-07T08:53:05Z దేవీప్రసాదశాస్త్రి 4290 583805 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh||నరసభూపాలీయము. ఆ. 5|83}}</noinclude>{{p|al|fwb}}భ్రాంతిమంతము —
{{Telugu poem|type=క.|lines=<poem>అల యుపమేయము ఛన్నత, నలరఁగ నారోప్యమాణ మగునుపమానం బిల నెఱుకపడగ భ్రాంతిమ, దలంకరణ మయ్యె దీని నాపాదింతున్.</poem>|ref=56}} {{Telugu poem|type=శా.|lines=<poem>చూడం జూడ నృసింహకీర్తిచయ మీక్షోణీనభోమధ్యమం దేడం జూచినఁ దాన యై నెగడఁగా నీక్షించి మిన్నేట నీ రాడం బోయెడిబేసితాపసులు మే లౌ మ్రోల సిద్ధించెఁ గా యాడం బోయినతీర్థ మంచు మదిలో హర్షింతు రశ్రాంతమున్.</poem>|ref=57}} {{p|al|fwb}}అపహ్నవము —
{{Telugu poem|type=క.|lines=<poem>ఉపమేయము గా దని యిది, యుపమానమె యనఁగ నెంతయు నపహ్నవ మౌ నపు డది ప్రాగారోపము, నపహ్నవారోపమును ఛలాదియు నయ్యెన్.</poem>|ref=58}} {{p|al|fwb}}త్రివిధాపహ్నవములు —
{{Telugu poem|type=మ.|lines=<poem>గురుచక్రప్రభగాని శౌర్యసుషమాంకూరంబు గా దిందుభా స్వరకీర్తిద్యుతిపంక్తి గాదు నిబిడాంచత్పాంచజన్యప్రభా భర మౌఁగా నటుగాన విశ్వభరణప్రారంభముం గోరి యీ నరసేంద్రాకృతి నుద్భవించెఁ గమలానాథుండు విశ్వంభరన్.</poem>|ref=59}} {{p|al|fwb}}ఉల్లేఖము —
{{Telugu poem|type=క.|lines=<poem>అలరఁగ గృహీతృభేదం, బుల నొకటియె పెక్కురూపముల నెడ నెడలం దలపోయఁగ నుల్లేఖం, బలంకరణరాజ మయ్యె నది యె ట్లన్నన్.</poem>|ref=60}} {{Telugu poem|type=క.|lines=<poem>బాణుఁ డని బుధులు మురజి, ద్బాణుం డని విమతభూమిపాలురు సుమనో బాణుఁ డని సతులు దలఁపుదు, రేణాంకసమాను నోబళేంద్రు నృసింహున్.</poem>|ref=61}} {{p|al|fwb}}ఉత్ప్రేక్ష —
{{Telugu poem|type=క.|lines=<poem>ఉపమేయమునకుఁ గలిగిన, యుపమానగుణక్రియాదియోగముచే నా యుపమానమె యని తలఁచిన, నపు డది యుత్ప్రేక్ష యయ్యె నదియును ధరణిన్.</poem>|ref=62}} {{Telugu poem|type=క.|lines=<poem>క్రమమున వాచ్యయును బ్రతీ, యమానయును నగుచు ద్వివిధ యగువాచకశ బ్దము గలుగ వాచ్య యనఁ దగు, నమరఁగ లేనియెడ గమ్య యనఁదగు వరుసన్.</poem>|ref=63}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అలరెడు నీరెంటియందు జాతిగుణక్రి, యాద్రవ్యము లవాచ్యయబ్ధిసంఖ్య యవి నాల్గు వరుస భావాభావములఁ జెంద, నిల వసుసంఖ్య యాయెనిమిదియును నిరువదినాలు గౌ హేతుఫలస్వరూ, పముల వేర్వేఱఁ ద్రిభంగిఁ జెంద నందు నెన్మిది యెన్మి దగుహేతువుఫలంబు, నలరు వాచ్యగుణక్రియానిమిత్త</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ములఁ బదాఱు పదాఱు నౌ నలస్వరూప, గతనిమిత్తంబులకు వాచ్యగమ్యగతులు గాగఁ బదియాఱు నగువాచ్యస్వరూప, మరయ గమ్యస్వరూప మష్టాఖ్యయయ్యె.</poem>|ref=64}}<noinclude><references/></noinclude> nwbg2bwtvcre4shfjk8l7zks1gw93hk సూచిక:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf 106 141830 583817 422239 2026-10-07T11:51:50Z Rajasekhar1961 50 583817 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[బ్రహ్మోత్తరఖండము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:శ్రీధరమల్లె వేంకటరామార్యుడు|శ్రీధరమల్లె వేంకటరామార్యుడు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ |చిరునామా=చెన్నపురి |సంవత్సరం=1901 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 8=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు={{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/4}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/5}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/6}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/7}} |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} cwg4955ecv3go8wwcmwqfwbfdr2th75 583820 583817 2026-10-07T11:54:16Z Rajasekhar1961 50 583820 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[బ్రహ్మోత్తరఖండము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:శ్రీధరమల్లె వేంకటరామార్యుడు|శ్రీధరమల్లె వేంకటరామార్యుడు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ |చిరునామా=చెన్నపురి |సంవత్సరం=1901 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 4to7="విసూ" 8=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు={{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/4}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/5}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/6}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/7}} |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} ney7gmwo15v8s56319pzgd51m9m67kk 583821 583820 2026-10-07T11:55:22Z Rajasekhar1961 50 583821 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[బ్రహ్మోత్తరఖండము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:శ్రీధరమల్లె వేంకటరామార్యుడు|శ్రీధరమల్లె వేంకటరామార్యుడు]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ |చిరునామా=చెన్నపురి |సంవత్సరం=1901 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=MS |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2to3="పీఠిక" 4to7="విసూ" 8=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు={{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/4}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/5}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/6}} {{:పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/7}} |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} nknl231343eovzb2p5wvta8y7dg2eo5 పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/5 104 142526 583811 422875 2026-10-07T11:08:50Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 583811 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము|గోపబాలునిచరిత్రము]]}} |{{DJVU page link|88|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము|హనుమంతుడు రాజులకు బ్రత్యక్షంబై గోపబాలునికథ జెప్పుట]]}} |{{DJVU page link|98|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము|సత్యమహారాజుకథ]]}} |{{DJVU page link|101|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము|శివపూజావిధానము]]}} |{{DJVU page link|110|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము|వసంతఋతువర్ణనము]]}} |{{DJVU page link|119|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము|చిత్రరథుం డనుగంధర్వరాజు ధర్మగుప్తునకు దనకూతు నిచ్చి వివాహం బొనర్చుట]]}} |{{DJVU page link|122|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/ద్వితీయాశ్వాసము|ధర్మగుప్తమహారాజు తనశత్రువైన దుర్మర్షణుని వధించి తనరాజ్యంబు మరల గైకునుట]]}} |{{DJVU page link|125|7}} }} {{Center| [[బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము|తృతీయాశ్వాసము]] }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము|సోమవారవ్రతప్రభావము]]}} |{{DJVU page link|130|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము|చిత్రవర్మమహారాజు చరిత్రము]]}} |{{DJVU page link|131|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము|చిత్రవర్మ సీమంతినికి వివాహం బొనర్చుట]]}} |{{DJVU page link|138|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము|సీమంతినీ పునర్వివాహఘట్టము]]}} |{{DJVU page link|163|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము|సుమేధ సోమవంతులచరిత్రము]]}} |{{DJVU page link|172|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/తృతీయాశ్వాసము|ఆశ్వాసాంతము]]}} |{{DJVU page link|194|7}} }} {{Center| [[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|చతుర్థాశ్వాసము]] }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|మందరుండను బ్రాహ్మణుని చరిత్ర]]}} |{{DJVU page link|196|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగి మందరుండను బ్రాహ్మణుగృహంబునకు వచ్చుట]]}} |{{DJVU page link|196|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|వజ్రబాహుడు తనజ్యేష్ఠభార్యయైన సుమతిని పుత్త్రసహితంబుగా నరణ్యంబున కనుచుట]]}} |{{DJVU page link|199|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|సుమతి దైవవశంబున బద్మాకరుండను వైశ్యునిపట్టనంబు జేరి యతనిచే మన్ననల బొందుట]]}} |{{DJVU page link|200|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|మృతుండైన కుమారునిం గూర్చి సుమతి విలపించుట]]}} |{{DJVU page link|202|7}} }}<noinclude><references/></noinclude> 1nisj9v38pitkc016rkmbs25e7i0ihy పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/356 104 142600 583818 421996 2026-10-07T11:52:50Z Rajasekhar1961 50 583818 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh||పంచమాశ్వాసము|349}}</noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>చిత్తముల భక్తి వెలయ బ్రహ్మోత్తరాఖ్య ఖండ మాంధ్రప్రబంధంబుగా ఘటించి యెలమి నంబాపురము పార్థివేశ్వరునకు భాసురముగ సమర్పణ చేసి రపుడు.</poem>|ref=349}} {{Telugu poem|type=శా.|lines=<poem>శ్రీనారాయణుఁ డార్తరక్షకుఁడు రాజీవాయతాక్షుండు వి జ్ఞానానందమయస్వరూపుఁ డగుకృష్ణస్వామి రక్షించు న క్షీణప్రజ్ఞుల సుబ్బనార్యుసుతులన్ శ్రీజ్యోతిరామన్న ల క్ష్మీనారాయణుల న్వదాన్యమణియౌ చెంగల్వరాయాగ్రణిన్.</poem>|ref=350}} {{c|'''బ్రహ్మోత్తరఖండము సంపూర్ణము'''}} {{rule|4em}}<noinclude><references/></noinclude> 9sdr9ao2pzln12ynxd35qui6bcgb780 పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/123 104 161972 583762 466418 2026-10-06T16:52:54Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583762 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|120|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>అధ్యక్షతక్రింద సమావేశమైనది. మహాత్మా గాంధి, లోకమాన్య బాలగంగా ధరతిలకుగారలు కూడ ఆ సభకు విచ్చేసిరి. ఆంధ్రరాష్ట్రమునుండి కొండా వెంకటప్పయ్యగారు, ఓరుగంటి వెంకటసుబ్బయ్యగారు, నేను మాత్రము అఖిలభారత కాంగ్రెసుకమిటీసభ్యులముగా వెళ్ళితిమి. ఆ సభలో ఎట్టి షరతులు లేకుండ బ్రిటిషువారికి ఇండియాప్రజలందరు తోడ్పడవలెనని యొక తీర్మానమును సి. పి. రామస్వామిఅయ్యరుగారు ప్రతిపాదించినారు. మితవాదియగు గోవిందరాఘవయ్యరుగారు దానిని బలపరచినారు. కాని లోకమాన్య బాలగంగాధరతిలకుగారు యుద్ధము జయప్రదముగా ముగియగనే హిందూదేశమునకు స్వరాజ్యమిచ్చెదమని బ్రిటిషువారు వాగ్దత్తముచేసినచో మాత్రమే బ్రిటిషుప్రభుత్వమునకు ఈ యుద్ధములో హిందూదేశప్రజలు, ప్రభువులు సహాయముచేయవలెననియు, అటుల వాగ్దత్తముచేయనిచో సహాయముచేయనక్కరలేదనియు నొక సవరణ నుపపాదించిరి. ఆ సవ రణను చిత్తరంజన్‌దాసుగారు బలపరచిరి. మహాత్మా గాంధీగారు బ్రిటిషు వారు ఆపత్తులోనున్న సమయములో ఎట్టిషరతులు లేకుండ సహాయముచేసి తీరవలెనని గట్టిగా వాదించిరి. న్యాపతి సుబ్బారావుపంతులు, జి.ఎ. నటేశన్ మొదలైన మితవాదులుకూడ అటులనే చెప్పిరి. మేము కొందరము తిలకు గారిసవరణను బలపరచితిమి. ఓట్లు తీసుకొనబడగా అసలుతీర్మానముకంటె తిలకుగారిసవరణకు నాలుగు ఓట్లు ఎక్కువవచ్చెను. ఆంధ్రదేశమునుంచి వెళ్ళిన ముగ్గురు ప్రతినిధులు - కొండా వెంకటప్పయ్య, ఓరుగంటి వెంకట సుబ్బయ్యగార్లును, నేనును తిలకుగారిపక్షముననే ఓటుచేసితిమి. కాని యిట్టి అత్యంత ప్రాముఖ్యమైనసమస్యమీద అఖిలభారత కాంగ్రెసు కమిటీలో నాలుగుఓట్లతో మాత్రమే తాను గెలుచుటవల్ల ప్రయోజన మేమియు నుండదనియు, తాను తనసవరణ సుపసంహరించు కుంటున్నాననియు, ఇష్టమువచ్చినవారు సహాయముచేయవచ్చుననియు తిలకుమహాశయుడు చెప్పి తనసవరణ నుపసంహరించుకొనెను. అసలు తీర్మానమే ఎట్టి వ్యతిరేకతలేకుండ మంజూరుచేయబడినది. తిలకుగారును, వారితోపాటు సవరణకనుకూలముగ సమ్మతులనిచ్చినవారమును తటస్థముగ యూరకుంటిమి, అంతటితో ఆ సభ ముగిసెను. ఆమరునాడుదయమున<noinclude><references/></noinclude> q67s6bsx4e1qklzomq7w2mx99dd19yi పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/124 104 161973 583763 466537 2026-10-06T16:56:53Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583763 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|16]|వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|121}}</noinclude>కొండా వెంకటప్పయ్యపంతులుగారు, ఓరుగంటి వెంకటసుబ్బయ్యగారు, నేను కలసి సర్దారుగృహములో బసచేసియున్న లోకమాన్య బాలగంగాధర తిలకుగారి దర్శనముచేసితిమి. వారు మమ్ముల నెంతో దయతో ఆదరించెను. ప్రత్యేకాంధ్రరాష్ట్ర కాంగ్రెసుకమిటీనిర్మాణతీర్మానమునకు కలకత్తాకాంగ్రె సులో మద్దతునిచ్చి ఆ తీర్మానమును గెలిపించి, ఆంధ్రులకు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రకాంగ్రెసుకమిటీని ప్రసాదించినందుకు తిలకమహాశయునికి ఆంధ్రుల పక్షమున కృతజ్ఞత తెలిపితిమి. అచిరకాలములో ప్రత్యేక ఆంధ్రరాష్ట్రము కూడ ఏర్పాటుజరుగుటకు తిలకుమహాశయుని యాశీర్వచనమును, సహా యమును అభ్యర్థించితిమి. వారు తమకు ఆంధ్రులపట్ల చాల సానుభూతి యున్నదనియు, ఆంధ్రులు, మహారాష్ట్రులు, కన్నడులు ఒకప్పుడు ఒకేజాతి వారనియు, ఆంధ్రరాష్ట్రనిర్మాణవిషయములో తాను శక్తివంచనలేకుండ సహాయముచేసెదననియు, కాని అది యంతయు మనకు స్వరాజ్యమురానం దున బ్రిటిషువారిచేతిలోనే యున్నదనియు సెలవిచ్చిరి. అప్పటికే వారికి దేహములో కొంత అస్వస్థతగనుండెను. వారివద్ద సెలవుతీసుకొని మేము ముగ్గురము ఆంధ్రదేశమునకు వచ్చితిమి. 1918 వ సంవత్సరము జూన్‌లో ఏ ఏ సంస్కరణములను ప్రసా దించుటకు తాము యోచించుచున్నారో ఆ రిపోర్టును మాంటేగ్యు, చెమ్సుఫర్డ్ గారలు ప్రకటించిరి. అందులో భారతకేంద్రప్రభుత్వములో భారతీయుల కెట్టి యధికారము నొసంగకుండగనే రాష్ట్రములలోమాత్రము కొన్నిశాఖ లను ప్రజలచే ఎన్నుకొనబడిన శాసనసభకు బాధ్యతవహించెడి మంత్రులకు వశముచేసెదమనియు, మిగిలినశాఖలను కొన్నిసంవత్సరములవరకు ఆంగ్లేయప్రభుత్వప్రతినిధులగు ఎగ్జిక్యూటివుకౌన్సిలరులచేతిలోనే యుంచెద మనియు, పదిసంవత్సరములపిమ్మట సంస్కరణలను వృద్ధిచేయువిషయము లలో విచారణచేసి యిపు డివ్వబోయెడు సంస్కరణములను బాగుగ ప్రజా నిధులు పాలించినారని ఋజువైనచో రాష్ట్రములలోని మిగతాశాఖలనుకూడ మంత్రులవశముచేయుటకు యోచించెదమనియు అందులో వ్రాసిరి. అది వరకు కలకత్తాకాంగ్రెసుఅధ్యక్షురాలుగా అనిబిసెంటమ్మగారు తన యధ్యక్షోప న్యాసములో బ్రిటిషుకామన్వెల్తులో నొకభాగముగా భారతదేశమునకు<noinclude><references/></noinclude> gn7hqc6zf2fhljmf7nnagjzbcgsy1wf పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/125 104 161974 583764 466538 2026-10-06T17:00:16Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583764 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|122|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>డొమినియనుప్రతిపత్తి — (సంపూర్ణస్వపరిపాలన)ను 1923 వ సంవత్సరము లోపలనే - ఆఖరుకు 1928 వ సంవత్సరములోపలనైనను స్థాపించునట్లు బ్రిటిషుపార్లమెంటులో ఒకబిల్లును 1918 సంవత్సరములోనే ప్రవేశపెట్టవలె నని బ్రిటిషుప్రభుత్వమును కోరెను. అందువల్ల మాంటేగ్యు, చెమ్సుఫర్డ్ గార్ల రిపోర్టు బయటపడగానే అందులో సూచించబడిన సంస్కరణలప్రణా ళిక బ్రిటిషువారు యివ్వదగినవి కాని, భారతీయులు పుచ్చుకొనదగినవి కాని కావని ప్రకటనచేసెను. 1918 వ సంవత్సరము ఆగస్టు 29 వ తేదీన ప్రత్యేక కాంగ్రెసుమహాసభ బొంబాయిలో హసను ఇమాంగారిఅధ్యక్షతను జరిగినది. ఈయనసోదరుడైన, ఆలీ ఇమాంగారు కొంతకాలము హైదరా బాదు నైజాంగారివద్ద దివానుగా పనిచేసి, ఆకాలములోనే కార్యనిర్వాహక శాఖనుండి న్యాయవిచారణశాఖను విడదీసెను. బొంబాయి ప్రత్యేక కాంగ్రెసు మహాసభకు ఆంధ్రదేశమునుండి జాతీయవాదులమైన కొండా వెంకట ప్పయ్య. పట్టాభిసీతారామయ్యగార్లు. నేను వెళ్ళి విషయనిర్ణయకసభలో పాల్గొంటిమి. న్యాపతి సుబ్బారావు. మోచర్ల రామచంద్రరావు, జి. ఏ. నటేశన్‌గార్లు మొదలైన మితవాదనాయకులు మాంటుఫర్డ్ రిపోర్టును అంగీక రించవలెనని వాదించిరి. ఆ సంస్కరణములు అసంతృప్తికరముగను, ఆశాభంగకరముగను వున్నందున తిరస్కరించవలెనని జూతీయవాదులము చెప్పితిమి. అవి కొన్నివిషయములలో బాధ్యతాయుతప్రభుత్వమును స్థాపిం చుటకు యత్నించినను మొత్తముమీద ఆశాభంగకరముగను అసంతృప్తికర ముగను వున్నవి గాన భారతకేంద్రప్రభుత్వములోకూడ దేశరక్షణ, విదేశ వ్యవహారములు, సంస్థానాధీశులతో సంబంధములు అను మూడుశాఖలు మాత్రము 15 సంవత్సరములకాలము బ్రిటిషుప్రభుత్వపుచేతిలో నుంచుకొని. మిగతశాఖలన్నియు శాసనసభకు బాధ్యతవహించెడి మంత్రులకు వెంటనే నప్పగింతచేయవలెననియు, రాష్ట్రములలో న్యాయశాఖ, పోలీసుశాఖలను ఆరుసంవత్సరములవరకు మాత్రము బ్రిటిషుప్రభుత్వముక్రింద నుంచుకొన వచ్చుననియు, మిగతశాఖలన్నియు వెంటనే మంత్రులవశముచేయవలెననియు నొక రాజీతీర్మానము ఏకగ్రీవముగా మంజూరుచేయబడెను. రౌలటుకమిటీ ఏర్పాటు తీవ్రముగా ఖండించబడెను.<noinclude><references/></noinclude> istxr2f9w42xinrdtdoa21ree7tlrze పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/126 104 161975 583765 466539 2026-10-06T17:06:05Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583765 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|123}}</noinclude>పిమ్మట 1918 సంవత్సరము డిశంబరులో పండిత మదనమోహన మాలవ్యాగారి అధ్యక్షతన జరిగిన కాంగ్రెసుమహాసభలో రౌలటుకమిటీ యేర్పాటు ఏకగ్రీవముగ ఖండించబడినది. కాని సంస్కరణములవిషయ ములో జాతీయవాదులకును, మితవాదులకును అభిప్రాయభేదములు ఎక్కు వైనవి. బొంబాయి కాంగ్రెసుతీర్మానములో ఆశాభంగకరముగను అసం తృప్తికరముగను వున్నవనుమాటలను తీసివేయవలెనని మితవాదులు కోరగా అత్యధికసంఖ్యాకులు ఒప్పుకొనలేదు. రాష్ట్రములలో ఆరు సంవత్సరముల వరకు న్యాయ పోలీసుశాఖలు బ్రిటిషుప్రభుత్వముక్రింద వుండవచ్చునను మాటలను తీసివేసి అన్నిశాఖలను వెంటనే మంత్రులవశముచేయవలెనను సవరణను జాతీయవాదులు పెట్టగా, మితవాదులు దీనిని ప్రతిఘటించినను ఆ సవరణ అత్యధిక సంఖ్యాకులచే ఆమోదించబడినది. కాంగ్రెసు మితవాదుల చేతులలోనుంచి పోయినటుల స్పష్టపడినది. అపుడు తిలకుగారు సర్ వాలంటైన్ షిరాలు మీద దాఖలుచేసిన మాననష్టపుదావాలో పనిచేయుచు ఇంగ్లాండులో నుండిరి. అయినను జాతీయవాదులు తేలికగా కాంగ్రెసులో నెగ్గిరి. {{c|(9)}} హోంరూలు ఉద్యమకాలములో ఆంధ్రదేశప్రజలలో విజ్ఞానమునే గాక రాజకీయచైతన్యమునుకూడ పెంపొందింపచేయుటలో ఆంధ్ర గ్రంథా లయోద్యమము మిగుల తోడ్పడినది. గ్రంథాలయోద్యమము 1914వ సం॥లో సూరి వెంకటనరసింహశాస్త్రి, అయ్యంకి వెంకటరమణయ్యగారల యాజ మాన్యముక్రింద ప్రారంభింపబడినది. వారిద్దరు ఆ ఉద్యమమునకు ప్రాణము లని చెప్పతగిన వారు. 1919 వ సంవత్సరములో మహాత్మా గాంధీగారి సత్యాగ్రహోద్యమములో చేరువరకు నేనుకూడ ఆ ఉద్యమమునకు ఎక్కు వగా తోడ్పడితిని, దాని కేంద్రస్థానము బెజవాడ గవర్నరుపేటలోని రామ మోహన ఉచిత గ్రంథాలయము, దాని చరిత్ర, అభివృద్ధి గ్రంథాలయోద్యమ చరిత్రలో ప్రధానస్థానమాక్రమించుచున్నది. కనుక దానిచరిత్ర క్లుప్తముగా నిచట చెప్పుట యావశ్యకము.<noinclude><references/></noinclude> 7ib1tx6rk4gr6l6hdaup6wc6aw1h49b పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/127 104 161976 583766 466540 2026-10-06T17:11:04Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583766 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|124|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>రామమోహన ఉచిత గ్రంథాలయమును 1911 వ సం॥లోనే కొందరు మిత్రులము కలసి స్థాపించినాము. సూరి వెంకటనరసింహశాస్త్రిగారిని అధ్యక్షుడుగను, అయ్యంకి వెంకటరమణయ్యగారిని కార్యదర్శిగను ఎన్ను కున్నాము. నేను, శంకర వెంకట్రామయ్య, గోపరాజు బ్రహ్మానందం, పాటిబండ్ల సుబ్రహ్మణ్యం మొదలైనవారము కార్యనిర్వాహకవర్గముగా నేర్పడితిమి. దానిని కొంతకాలము ఆరండల్ సత్రమునకు సమీపమున యొక కొట్టులో సాగిచింతిమి. 8-5-13 వ తేదీన దానిని రిజిస్టరుచేయించి తిమి, 10-4-13 వ తేదీన బెజవాడ మ్యునిసిపాలిటీవారు గవర్నరుపేటలోని తమస్థలమును బహిరంగవేలమునకు పెట్టగా మావద్ద ధనమేమీ లేకపోయినను 2 వేల 191 చతురపుగజములస్థలమును 3 వేల 324 రూపాయలకు గ్రంథా లయముపేర కొట్టివేయించుకొంటిమి. వెంటనే మూడవవంతు క్రయధనము మునిసిపాలిటీకి కట్టవలసియున్నందున బెజవాడలో ప్రముఖ న్యాయవాది యగు బొడ్డపాటి వెంకటప్పయ్యగారివద్ద నేను ప్రామిసరీనోటు వ్రాసి ఆరు వందలరూపాయలు అప్పుతీసుకొనివచ్చి యివ్వగ దానిని, చందాలవల్ల వసూలయిన మిగతసొమ్మును కలిపి మునిసిపాలిటీకి కట్టితిమి. మిగత క్రయధనమును మునిసిపాలిటీకి చెల్లించుటకును, ఇతర చిల్లరఖర్చులకును సొమ్ము కావలసివచ్చినది. అందుకుగాను నావద్ద కక్షిదారుగానున్న దూప గుంట వెంకటపిచ్చయ్య అను షాహుకారువద్ద నేను ప్రామిసరీనోటు వ్రాసి 2.500 ల రూప్యములను అప్పుతెచ్చి గ్రంథాలయకమిటీవారి కిచ్చితిని. దానితో మునిసిపలుస్థలము గ్రంథాలయముపేర విక్రయదస్తావేజు పుట్టి గ్రంథాలయమునకు స్వాధీనమైనది. ఆ సంవత్సరమే నవంబరులో గవర్నరుపేటలోని యొకేవార్డుకు మునిసిపలుసభ్యత్యముకొరకై అభ్యర్థులముగా బొడ్డపాటి వెంకటప్పయ్యగారు నేను నామినేషన్లు దాఖలుచేసితిమి. అపుడు ఎన్నికలు రాజకీయపార్టీల పక్షమున జరుగుటలేదు. వ్యక్తిపరముగానే నామినేషనులు దాఖలుచేసి ఎన్ని కలప్రచారము సాగించితిమి. నాకే జయము తధ్యముగ కనపడినది. కాని గ్రంథాలయపుఋణము తీరవలసియున్నది. బొడ్డపాటి వెంకటప్పయ్యగారు కూడ సమర్థులు, మంచివారు, నాకంటె ఎక్కువ శ్రద్ధగా మునిసిపలుకౌన్సి<noinclude><references/></noinclude> pher8i5mxmjns5zslhchus0oo8martt పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/128 104 161990 583767 466626 2026-10-06T17:14:36Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583767 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|125}}</noinclude>లరువిధులను నిర్వహించెదరు. నాకు బహువ్యాపకమున్నది. ఆయన బస్తీ లోనిపనులు శ్రద్ధగాను, బాగుగాను చెయ్యగలరని తలచి నేను సూరి వెంకటనరసింహశాస్త్రిగారితోను, అయ్యంకి వెంకటరమణయ్యగారితోను సంప్రతించి వెంకటప్పయ్యగారు గ్రంథాలయమునకు అయిదువందలరూప్య ముల నిచ్చినట్లయిన, నేను నా మునిసిపలుకౌన్సిలు అభ్యర్థిత్వమును వదలు కొందునని వెంకటరమణయ్యగారిద్వారా కబురంపితిని. వారు సంతోషముగ అయిదువందలరూప్యములను నేను వారికి వ్రాసియిచ్చిన ప్రామిసరీనోటు క్రింద జమకట్టుటకంగీకరించిరి. వెంకటప్పయ్యగారికి మిగిలిన అసలు నూరు రూప్యములబాకీని గ్రంథాలయపు నా చందా క్రింద నేనే వారికిచ్చి ఆ నోటును రద్దుచేయించి తీసుకొంటిని. వారు వడ్డీని వదలుకొనిరి. నేను నా అభ్యర్థిత్వ మును వదులుకొంటిని. ఆయన పోటీలేకుండా మునిసిపలుకౌన్సిలుసభ్యులుగా ఎన్నుకొనబడిరి. తదనంతరము కొన్నినెలలకు వెంట్రప్రగడ ఎస్టేటుదివా నుగానున్న వారణాశి రామమూర్తిగా రొక వ్యవహారములో చిక్కుకొనెను. అవతలిపార్టీవారు నాకు కక్షిదారులుగా నుండిరి. నేను ఉభయపక్షములమధ్య రాజీచేసి తనను చిక్కులలోనుంచి తప్పించవలెనని రామమూర్తిగారును, వెంట్రప్రగడరాజాగారిబంధువులుసు నావద్దకు వచ్చి బ్రతిమిలాడిరి. రామ మూర్తిగారు వెయ్యిన్నూటపదహారురూపాయలు రామమోహనగ్రంథాల యమున కిచ్చినట్లయిన నా పార్టీతో చెప్పి ఎటులనో యొప్పించి రాజీచేసి రామమూర్తిగారి కెట్టి యిబ్బందిలేకుండ చేసెదనని చెప్పితిని. వారు రు. 1,116 లు రామమోహనగ్రంథాలయాధ్యక్షుల కిచ్చిరి. అందుమీద నేను ఆ వ్యవహారమును రాజీపరచి రామమూర్తిగారిని చిక్కులలోనుంచి తప్పించి తిని. ఇది కాక మేమందరము చందాలనిచ్చియు వసూలుచేసియు సొమ్ము భర్తీచేసి స్థలముయొక్క క్రయధనమునకుగాను దూపగుంట వెంకటపిచ్చయ్యగారివద్ద తెచ్చిన రుణమునంతను తీర్చివేసినాము. మేము ఆయనకుకూడ వడ్డీ చెల్లించలేదు. ఆ వడ్డీ మొత్తమును గ్రంధాలయమునకు ఆయనచందాక్రింద జమకట్టుకుంటామని నేను చెప్పగ ఆయన నా మాటను తోసివేయక ఒప్పుకున్నాడు. అసలుసొమ్ము చెల్లించి ఆ నోటును రద్దుపర్చు కున్నాము. ఆ వడ్డీని ఆయన చెల్లించినచందాయని జమకట్టుకున్నాము.<noinclude><references/></noinclude> g602clwzytrbxcpbpmzh7y5fqiezmp7 పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/129 104 161991 583768 466647 2026-10-06T17:18:42Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|126|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>ఆ సంవత్సరముననే తిరువూరుజమీందారగు రాజా వెల్లకి చినవెంకట రామారావుబహద్దూరుగారు ఆ స్థలములో గ్రంథాలయభవనమును తమ స్వంత ఖర్చుమీద కట్టించియిచ్చెదమని వాగ్దానముచేసిరి. వారు బొడ్డపాటి వెంక టప్పయ్యగారి కక్షిదారు. అది వెంకటప్పయ్యగారిప్రోత్సాహమువలన జరిగి నది. 1-9-1913 తేదీన మద్రాసుగవర్నరుగారి కార్యనిర్వాహక సభ్యు లగు శ్రీ పి. ఎన్. శివస్వామిఅయ్యరుగారిచేత గ్రంథాలయభవనమునకు పునాదిరాతిని వేయించితిమి. తిరువూరుజమీందారుగారు రెండువేల నూరు రూపాయలు విరాళమునివ్వగా భవననిర్మాణము ప్రారంభింపబడి సాగుతూ వచ్చినది. ఆ సమయములో దురదృష్టవశాత్తు ఆ జమీందారుగారు పిన్న వయస్సులోనే దివికేగుట తటస్థించినది. వారు దయచేసిన సొమ్ముకాక ఇంకను అయిదువేలరూపాయలవరకు భవననిర్మాణముకొరకు కావలసియుం డెను. ఒక వెయ్యిరూపాయలు వెంటనే విరాళములవల్ల వసూలుచేసితిమి. మిగతా నాలుగువేలరూప్యములను నేను, సూరి వెంకటనరసింహశాస్త్రిగారు, అయ్యంకి వెంకటరమణయ్యగారు కలసి ప్రామిసరీనోటు వ్రాసి బొడ్డపాటి వెంకటప్పయ్యగారివద్ద ఋణముతెచ్చి ఖర్చుపెట్టి గ్రంథాలయభవనమును పూర్తిచేయించితిమి. కొలదికాలములోనే చందాలను వసూలుచేసి ఆ ఋణ మును తీర్చినాము. వెంకటప్పయ్యగారు మరల వడ్డీ తీసివేసిరి. 1914 వ సంవత్సరము ఆఖరుకు గ్రంథాలయ భవననిర్మాణము చాలవరకు పూర్తియైనది. ఆ స్థితిలో గ్రంథాలయమును నూతనభవనములోనికి మార్చినాము. దాని నిర్మాణము పూర్తియైన తదుపరి నూతనభవనప్రవేశమహోత్సవమును వరంగ ల్లుకు సమీపముననున్న వడ్డేపల్లి దేశముఖులును, నా కక్షిదారులును, నాకు మిత్రులునగు పింగళి వెంకటరామరెడ్డిగారి అధ్యక్షతక్రింద 13 - 1 - 1916 వ తేదీన చాలా వైభవముగా జరిపినాము. వారుకూడ అయిదువందల రూప్యముల విరాళము నిచ్చిరి. ఆ మహోత్సవసందర్భములోనే రాయప్రోలు సుబ్బారావు గారు తాము రచించిన ఆంధ్రాభిమానపూరితమైన పద్యములను శ్రావ్యముగా పాడి సభికులందరిని ఆనందింపచేసినారు. అప్పటినుంచి ఆ గ్రంథాలయము నకు సూరి వెంకటనరసింహశాస్త్రిగారు అధ్యక్షులుగను, అయ్యంకి వెంకట రమణయ్యగారు కార్యదర్శిగను, గోపరాజు బ్రహ్మానందంగారు సహాయ<noinclude><references/></noinclude> fckv8aqtfhiqprlv6j2njeymd4pemqp పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/130 104 161992 583769 466655 2026-10-06T17:22:14Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583769 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|127}}</noinclude>కార్యదర్శిగను, నేను, దంటు సుబ్బావధాని, బొడ్డపాటి వెంకటప్పయ్య మొద లైనవారము కార్యనిర్వాహకవర్గసభ్యులుగాను 1919 వ సంవత్సరముఆఖరు వరకు పనిచేసితిమి. రామమోహనగ్రంథాలయ వార్షికోత్సవములు వైభవ ముగ జరిగెను. మోచర్ల రామచంద్రరావు, కొండా వెంకటప్పయ్య, బయ్యా నరసింహేశ్వరశర్మగార్లు మొదలగు పేరుగన్న ప్రముఖులు వచ్చి అధ్యక్షతవహించిరి. 1917 వ సంవత్సరములో జరిగిన వార్షికోత్సవసభలో బెజవాడ కాపురస్తులు, ధనికులు నగు కౌతా సూర్యనారాయణరావుగారు గ్రంథాలయము మీద రెండవయంతస్తునంతను తాము కట్టించియిచ్చెదమని వాగ్దానమొనరిం చిరి. వారు నాకు ముఖ్యస్నేహితులే కాక, వారివ్యవహారములన్నిటిలోను నేను వారికి వకీలుగా నుంటిని. తమతల్లి గారిపేర కొంత దానధర్మముచేయ వలెనని వారు నాతో చెప్పగా రామమోహనగ్రంథాలయముమీద మేడను కట్టించి యివ్వవలసినదని నేను వారికి సలహానిచ్చితిని. నా మాటమీద వారు అటుల వాగ్దానము చేసిరి. ఏడువేలరూప్యములవరకు ఖర్చుపెట్టి వారు మేడలో చాలభాగము కట్టించిరి. కాని ఆ మేడకు వారిపేరుపెట్టువిషయములో శంకర వెంకట్రామయ్యగారు, మరి కొందరుసభ్యులు గ్రంథాలయ సర్వసభ్య సమావేశములో తగవులుపెట్టుటయే గాక, వారిపేరు పెట్టకూడదని శంకర వెంకట్రామయ్యగారు కోర్టులో దావావేసిరి. మొదటి రెండుకోర్టులలో వారే గెలిచిరి. హైకోర్టులో సూర్యనారాయణరావుగారే గెలిచిరి, గాని సూర్య నారాయణరావుగారు. మిగిలినసొమ్ము యివ్వడం మానివేసిరి. నేను వారిపేరు పెట్టుటయే న్యాయమని చెప్పినవాడను. ఇంక కొంతసొమ్మును గ్రంథాలయసంఘమువారే ఖర్చుపెట్టి మేడను పూర్తిచేసిరి. సూర్య నారాయణరావుగారిపేరులతో వ్రాయబడిన బోర్డులు ఇప్పటికిని అలాగే ఉన్నవి. కాని సూర్యనారాయణరావుగారి ధర్మమువల్ల కట్టబడిన మేడ మాత్రము ప్రజలందరు వినియోగించుకొని సభలుచేయుచున్నారు. సూర్య నారాయణరావుగారి దాతృత్వము మిగుల ప్రశంసనీయము. 1914 వ సంవత్సరములో ఆంధ్రప్రజలలో జ్ఞానాభివృద్ధిని, రాజకీయ సాంఘికచైతన్యమును కలుగచేయునుద్దేశ్యముతో ఆంధ్రదేశ గ్రంథాలయో<noinclude><references/></noinclude> 428nvjabbilvhgwrj1mwlu40un8x0hn పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/131 104 161993 583770 466663 2026-10-06T17:25:01Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583770 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|128|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>ద్యమమును స్థాపించుటకు నిశ్చయించితిమి. అప్పటికే ఆంధ్రభాషలో నవీన విజ్ఞానము నిచ్చుటకు విజ్ఞానచంద్రికామండలి స్థాపింపబడి బహుచక్కగా పనిచేయుచుండెను. చారిత్రకగ్రంథములును, ప్రకృతిశాస్త్రగ్రంథములును, చరిత్రాత్మకనవలలును వెలువడుచుండెను. ఇంకా కొన్ని గ్రంథమండలులు కూడ పనిచేయుచుండెను. విజ్ఞానచంద్రికాపరిషత్తుక్రింద పల్లెటూళ్లలోని స్త్రీ పురుషులలో నవీన ఆంధ్రగ్రంథముల విజ్ఞానమును వ్యాపింపచేయుటకై పరీక్షలనుకూడ పెట్టితిమి. బహుమతుల నిచ్చితిమి. 1914 వ సంవత్సరము వేసంగిలో రెండవ ఆంధ్రమహాసభ సమావేశము బెజవాడలో జరుగనున్నది. ఆ కాలముననే ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమ ప్రథమసమావేశము బెజ వాడలో జరుపుటకు నిశ్చయించితిమి. కందుకూరి వీరేశలింగంపంతులుగారి కుడిభుజము, సుప్రసిద్ధ కవి, నవలారచయిత, జాతీయనాయకుడునైన చిలక మర్తి లక్ష్మీనరసింహంగారిని అధ్యక్షుడుగా ఎన్నుకొంటిమి. బెజవాడలో ద్వితీయ ఆంధ్రమహాసభతోపాటు ప్రథమాంధ్రగ్రంథాలయమహాసభకూడ ఉత్సాహముగ జరిగెను. గాని నా కపుడు చాల జబ్బుచేసి వైద్యచికిత్సకొరకు మద్రాసుకు, అచ్చటినుండి నీలగిరికి పోవలసివచ్చినది. నేను బెజవాడలో ఆ శుభసమయమున లేను. ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమభారమునంతను సూరి నరసింహము, అయ్యంకి వెంకటరమణయ్యగారలు తమమీద పెట్టుకొనిరి. దానిని వారిద్దరు జీవితపరమావధిగా చేసుకొనిరి. అప్పటినుంచి ఆంధ్ర గ్రంథాలయమహాసభలు, జిల్లామహాసభలు, తాలూకామహాసభలుకూడ ఏటేట ఆంధ్రదేశములో జరుగుచూవచ్చినవి. అనేక వందల గ్రంథాలయ ములు, పఠనమందిరములు ఆంధ్రదేశమంతట స్థాపింపబడినవి. ప్రతి చోటను యువకులు ఉత్సాహముతో పనిచేసినారు. నేను, దంటు సుబ్బావ ధానిగారుకూడ ప్రధమమునుంచి 1919 వ సంవత్సరమువరకు గ్రంథాలయోద్యమమునకు చాలా తోడ్పడితిమి. అనేకచోట్లకు బెజవాడ నుంచి మా నలుగురిని కాని, వీలువెంట మాలో ఎవరినో ఇద్దరిని కాని గ్రంథాలయకార్యకర్తలు తీసుకొనివెళ్ళి గ్రంథాలయములను తెరపించు టయో, వార్షికోత్సవములు కాని, సభలుకాని జరిపించుటయో గావించిరి. నేను అధ్యక్షుడుగనుండుట గాని, ప్రారంభోత్సవముచేయుట కాని, ఉపన్యసిం<noinclude><references/></noinclude> e9r49nyouadeu0q89srmlac9qiupu64 పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/132 104 161994 583771 466712 2026-10-06T17:27:46Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|17]|వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|129}}</noinclude>చుట కాని చాలా చోట్ల జరిగెను. ఆకాలములో హోంరూలు ఉద్యమము తీవ్రముగ సాగుచుండెను. అందులో నేను బెజవాడలో ప్రధానపాత్ర వహించియుంటిని. నేను గ్రంథాలయములసందర్భంలో వెళ్ళినచోట్లనెల్ల హోంరూలుఉద్యమమును, స్వరాజ్యసంపాదనాప్రయత్నమును బలపరచి ఉపన్యసించితిని. స్వరాజ్యోద్యమమును వ్యాపింపచేయుటకు నే నా అవ కాశమును తప్పకుండా వినియోగించితిని. బాగుగా జ్ఞాపకమున్న కొన్ని ఉదాహరణము లిచ్చుచున్నాను. పశ్చిమ గోదావరిజిల్లా భీమవరములోని టౌనుహాలులో నన్నయభట్టారక గ్రంథాలయ మునకు నాచేత ప్రారంభోత్సవము చేయించిరి. అక్కడ ప్లీడరుగానున్న ములుకుట్ల సుబ్బారాయుడుగారు అధ్యక్షతవహించిరి. ఆత్మకూరి గోవిందా చార్యులుగా రుపస్యసించిరి. కుముదవల్లిలోని వీరేశలింగం గ్రంథాలయం వార్షికోత్సవమున కధ్యక్షతవహించితిని. భీమవరములోని మరియొక గ్రంథా లయముకూడ నాచేతనే తెరిపించిరి. నెల్లూరుజిల్లాలోని పొట్లపూడిలో పొణ కావారిసంస్థానము మిగుల ప్రసిద్ధికెక్కినది. విదుషీమణి యగు శ్రీమతి పొణకా కనకమ్మగారు గ్రంధాలయఉద్యమమునందును, హోంరూలుఉద్యమ మునందును మిగుల శ్రద్ధాభక్తుల కలిగియుండెను. నన్ను, సూరి వెంకట నరసింహశాస్త్రిగారిని, అయ్యంకి వెంకటరమణయ్యగారిని, దంటు సుబ్బావధాని గారిని తీసుకొనివెళ్ళి గ్రంథాలయవార్షికోత్సవమును కడు వైభవముగా జరి పించినది. మేమందరము ఉపన్యాసముల నిచ్చినాము. వారు మాకు చేసిన సత్కారము మరువరానిది. ఆమె తన జీవితమును దేశసేవకు అంకితముచేసిన సాధ్వి, కాంగ్రెసుఉద్యమములో ధీరత్వముతో పాల్గొని పెక్కుసార్లు కారా గృహములకు జని, యిపుడు నెల్లూరులోని కస్తూరిబా స్త్రీల యున్నతపాఠ శాలను మిగుల ప్రశస్తముగ నిర్వహించుచున్నది. ఒకసారి మేము -- నేను, సూరి వెంకటనరసింహశాస్త్రి, అయ్యంకి వెంకటరమణయ్య, దంటు సుబ్బా వధాని.... నలుగురము భీమవరముతాలూకాలో కాలువమీద పడవలో సంచా రముచేసి కొన్నిగ్రామములను దర్శించి గ్రంధాలయములు లేనిచోట్ల గ్రంథాలయములు స్థాపించియు, గ్రంధాలయములున్నచోట్ల వాటిని దర్శించి సభలుజరిపి కార్యకర్తలను ప్రోత్సహించియు గొప్ప సంచలనము కలుగ<noinclude><references/></noinclude> mv4dkbce5j2etf3qyar0un3glcw4oh9 పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/133 104 161995 583772 466713 2026-10-06T17:30:59Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583772 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|130|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>జేసినాము. మేమపుడు దర్శించిన గొల్లలకోడేరు, యండగండి, గరగపర్రు, పిప్పర, చిన్న కాకినాడ మొదలైన గ్రామములు ఇప్పటికిని నాకు జ్ఞాపక మున్నవి. పిప్పరలో మంగిపూడి వెంకటశర్మగారు మాకు బాగా స్నేహితు లైరి. వారు మంచికవీశ్వరులు, దేశాభిమానులు. సంఘసంస్కర్త. చిన్న కాకినాడ వెళ్ళినపుడు అచటి గ్రామమునసబు రాజుగారు పాముమంత్రములో ప్రసిద్ధిచెందియుండిరి. పాములు కరిచినవారందరును వారిమంత్రమువల్ల ఆరోగ్యమును పొందిరి. ఒకసారి గుంటూరుజిల్లాలోని కొన్ని గ్రంధాలయ ములను దర్శించితిమి. కుప్పా శ్రీరామశర్మగారు తమ గ్రామమైన అనంత వరముకు మమ్ములను తీసుకొనివెళ్ళి గ్రంధాలయవార్షికోత్సవమును జరిపిరి. అది వేనంగి. అక్కడినుంచి ఆ మరునాడు సాయంత్రము చల్లనివేళ కృష్ణా నదిలోని ఇసుకలో మేము చాలమంది మిత్రులము నడచి అవతలి ఒడ్డున నున్న కృష్ణాజిల్లాలోని దివితాలూకాకు చేరిన ప్రయాణం నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. త్రోవలో మిత్రులగు శరణు రామస్వామి చౌదరిగారు తమ గ్రామమైన అమృతలూరుకు తీసుకొనివెళ్లి అచటిగ్రంధాలయమును, అన్ని వర్ణములకు విద్యనిచ్చుచున్న సంస్కృతపాఠశాలను చూపిరి. శరణు రామ స్వామిచౌదరిగారు మంచి గ్రంధకర్త, సుప్రసిద్ధ కాంగ్రెసువాది. 1915 మొదలు 1919 వరకు గ్రంథాలయోద్యమము ఆంధ్రదేశములో తీవ్రముగా పనిచేసినది. రాజకీయచై తన్యమును, దేశాభిమానమును దేశసేవాభిలాషను గ్రామములలో బాగుగా పెంపొందచేసినది. సూరి వెంకటనరసింహ శాస్త్రిగారు మంచి పండితుడు, విజ్ఞుడు. దంటు సుబ్బావధానిగారు మంచి వైద్యుడే గాక హృద్యమైన పద్యములను రచించి శ్రావ్యముగ పాడేవారు. నేను ఎక్కువగా రాజకీయచై తన్యము కలుగజేయుటకు ప్రయత్నించేవాడను. వెంకటరమ ణయ్యగారు గ్రంథాలయనిర్మాణమునుగురించి శ్రద్ధవహించేవారు. రామమోహనగ్రంథాలయములో స్త్రీలశాఖ, పిల్లలశాఖకూడ ఏర్ప డ్డవి. గ్రంథములను స్త్రీలకొరకు యిండ్లకు పంపునట్లుకూడ ఏర్పాటు చేసినాము. రామమోహనగ్రంథాలయముక్రింద ఒక హరిజనపాఠశాలను స్థాపించినాము. దాని సాంవత్సరికోత్సవములు 1916 వ సంవత్సరమునుంచి రామమోహనగ్రంథాలయములోనే జరుపబడుచువచ్చినవి. పల్లెటూళ్ళలోని<noinclude><references/></noinclude> a4e6m1r0ub0d9ujl3iksgnrlrjdn6s5 పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/134 104 161996 583807 466714 2026-10-07T09:04:36Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583807 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|131}}</noinclude>గ్రంథాలయములు నిర్వర్తించిన కార్యక్రమములు (1) స్త్రీలకొరకు ఇండ్లకు గ్రంథములుపంపుట, (2) హరిజనుల విద్యావ్యాపకమునకై రాత్రిపాఠ శాలలు పెట్టుట, (3) జాతీయపండుగలను జరుపుట. ఈ మూడును ముఖ్యకార్యక్రమముగా ప్రకటించినాము. శ్రీరామనవమి, శ్రీకృష్ణజయంతి, దసరాతోపాటు మహమ్మదుప్రవక్తయొక్కజన్మదినము కూడ జాతీయపండు గలలో చేర్చినాము. మహమ్మదుప్రవక్తయొక్క జన్మదినోత్సవముచేయుట వల్ల హిందూముస్లిము ఐక్యత దృఢపడినది. మహమ్మదీయులు మాతో హిందువులపండుగలలో కూడ కలసివచ్చేవారు. నేను ప్రత్యేకముగ మహ మ్మదుప్రవక్తజీవితమును చదివినాను. వారి జన్మదినోత్సవము చేసినపుడు నన్ను తీసుకొనిపోయేవారు. బెజవాడ, బందరు, ఏలూరు, గుంటూరు మొద లైనపట్టణములలో నేను మహమ్మదుప్రవక్త జన్మదినోత్సవసందర్భములో ఉపన్యాసముల నిచ్చుచుంటిని. కొంతమంది సుప్రసిద్ధులైన మహమ్మదీయ నాయకులు కూడ ఆ ఉత్సవములలో పాల్గొనుచుండిరి. పిఠాపురము కాపు రస్తులగు కీర్తిశేషులైన ఉమర్ ఆలీషా సాహెబుగారు తెలుగులో గొప్ప కవీశ్వరులు. వారు తరచుగ మాతో కలియుచుండిరి. రామమోహనగ్రంథా లయవార్షికోత్సవములలో అప్పుడప్పుడు వారు పాల్గొని మనోజ్ఞములైన వారిపద్యములను చదువుచుండిరి. నేను ఇంగ్లీషులో ఖురానును కూడ చదివి నాను. లాహోరులోని విశ్వవిద్యాలయములో ఆచార్యులగు ప్రొఫెసరు మహమ్మదాలీగారు ఇంగ్లీషులోకి భాషాంతరీకరించిన ఖురానును ఇరవై యొక్కరూప్యములు పెట్టి తెప్పించి చదివినాను. దానిని కొన్నాళ్ళకు మిత్రు లెవరో ఎరువుతీసుకొని మరల యివ్వలేదు. ఇప్పటికిని ఖురానులోనుంచి ఎత్తి వ్రాయబడిన రత్నములను మంత్రములసంపుటి ఇంగ్లీషుది, కాశింఖాన్ గారు ఖురానుకు చేసిన తెనుగుతర్జుమా నా వద్ద ఉన్నవి. నేను వాటివి చదువుచుందును. ఒకరిని చూచి ఒకరు ఉత్సాహవంతులైన పల్లెటూళ్ల యువకులు గ్రంథాలయములను తమంత తామే స్థాపించుకొని బెజవాడనుంచి కాని, యితరచోట్లనుంచి కాని పెద్దలను తీసుకొనివెళ్ళి బహిరంగసభలు చేసు కొనేవారు. బెజవాడలో రామమోహన ఉచిత గ్రంథాలయము గాక దుర్గా<noinclude><references/></noinclude> qfrx1o4yqs5fe88eie9uagqyhttc6ho పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/135 104 161997 583808 466715 2026-10-07T09:07:48Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583808 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|132|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>మల్లేశ్వరగ్రంథాలయము, కోడి రామమూర్తి గ్రంధాలయము, ముస్లిమ్ యువజనగ్రంధాలయము, రామచంద్రగ్రంధాలయము. వెలిదండ్ల హను మంతరాయగ్రంథాలయము, డాక్టర్ అన్సారీగ్రంధాలయములు స్థాపింపబడి నేటికిని విజ్ఞానాభివృద్ధికి తోడ్పడుచున్నవి. వీటిలో రామచంద్రగ్రంధాలయము గాంధీపార్కులోను, డాక్టర్ అన్సారీగ్రంధాలయము అన్సారీపార్కులోను బెజవాడ మునిసిపాలిటీవారిచే స్థాపింపబడి నిర్వహించబడుచున్నవి. హిందూ దేశములోకెల్ల బరోడా సంస్థానాధీశ్వరుల యాజమాన్యమున సాగింపబడు చున్న బరోడా గ్రంథాలయోద్యమము ప్రధమస్థానము వహించినది. కాని అది సంస్థానాధీశ్వరులయొక్క పోషణక్రిందను, ప్రోత్సాహమువల్లను పూర్తియైన ధనసహాయమును పొందుచు అభివృద్ధిచెందినది. అటులగాక ఆంధ్రదేశములోని గ్రంధాలయోద్యమము ప్రభుత్వముయొక్క కాని, ప్రభు వులయొక్క గాని, జమీందారులయొక్కగాని ఎట్టి సహాయము లేకుండగనే కేవలము దేశాభిమానులును, విజ్ఞానవ్యాపకమునందు దీక్షగలవారునునగు నాయకులచేతను, యువజనులచేతను నడుపబడుచు భారతదేశములో రెండవ స్థానమును వహించినది. కొలది సంవత్సరములకు పిమ్మట సూరి వెంకట నరసింహశాస్త్రిగారును, అయ్యంకి వెంకటరమణయ్యగారును ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమమును అఖిలభారత గ్రంథాలయోద్యమముగా విస్తరిల్ల చేసినారు. 1944 లో అఖిలాంధ్ర - విశాలాంధ్ర - గ్రంథాలయమహాసభ సింగరేణిలో బూర్గుల రామకృష్ణారావుగారి అధ్యక్షతక్రింద జరిగెను. ఆంధ్ర దేశ గ్రంధాలయోద్యమమునకు ఇపుడు గాడిచర్ల హరిసర్వోత్తమరావు, పాతూరి నాగభూషణంగారు ముఖ్యులుగ నున్నారు. పటమటలోని హరి సర్వోత్తమభవనములో కేంద్రకార్యస్థాన మున్నది. 1916 సంవత్సరము నవంబరు 1 వ తేదీన కృష్ణానదికి పాతూరు వద్ద పెద్ద గండిపడినది. కృష్ణవరద అనేక గ్రామములను నీళ్ళమయము చేసినది. లెక్కలేనన్ని ఇండ్లు కూలిపోయినవి. మనుష్యులు కొట్టుకొని పోయినారు. పశువులు నశించినవి. ఆస్తినష్టమునకు మేరలేదు. బెజవాడలో రామమోహనగ్రంధాలయమును నిర్వహించుచుండిన మిత్రులము ఈ స్థితి చూచి వరదబాధితులైన గ్రామములవారికి చేతనైన సహాయముచేయవలెనని<noinclude><references/></noinclude> ri0x7ooxh250pceu1wa9qs87is5ps9d పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/136 104 161998 583809 466759 2026-10-07T09:14:11Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583809 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh||వందేమాతరం - హోంరూలు - గ్రంథాలయోద్యమము|133}}</noinclude>సంకల్పించితిమి. అయ్యంకి వెంకటరమణయ్య, కావలి శంకరరావు, దంటు సుబ్బావధాని, నోరి వెంకటేశ్వర్లు, గోటేటి లక్ష్మీనారాయణ, సీతం రాజు వెంకట్రామయ్యగార్లు ఆయాగ్రామములకు స్వయముగ స్వచ్ఛందసేవ కులను వెంటగొనిపోయి అచటి మనుష్యులకు, పశువులకు ఆహారపదార్థ ములు, యిండ్లు కట్టుకొనుటకు వలయు కర్రలు, వెదుళ్లు, తాటాకులు మొద లైనవాటిని పంచియిచ్చుటకు తయారై వచ్చిరి. బెజవాడ హిందూ హైస్కూలు నుండి చాలమంది విద్యార్థులు ఇంక నితరయువకులు స్వచ్ఛంద సేవకులుగ చేరిరి. వారినందరిని జట్టులు జట్టులుగ విభజించి, వివిధ సేవాశిబిరములకు పై నాయకులు తమవెంట గొనిపోయిరి. ఆంధ్రపత్రికాధిపతులు ప్రతిరోజు వరదలవల్ల కలిగిన యిక్కట్టులనుగూర్చి, స్వచ్చంద సేవకులు గావించుచున్న సహాయమునుగూర్చి పత్రికలో వ్రాయుటకుకర్రా నరసింహంగారను ప్రత్యేక విలేఖరినివంపగ ఆయన దానినంతను ఆంధ్రపత్రికలో వర్ణనచేయుచుండెను. వరదబాధితుల సేవచేయుటకు బందరు జాతీయకళాశాలనుండియు, ఇతరగ్రా మములనుండియు కూడ పలువురు ఐచ్ఛికసేవకులు వచ్చిరి. వారినికూడ వరదప్రాంతములకు పై నాయకులవద్దకు పంపితిమి. కీర్తిశేషులైన ప్రముఖ వకీలు సి. రాజగోపాలాచార్యులుగారును, నేనును ముఖ్యముగ వసూళ్ళపనికి పూనుకుంటిమి. ఇతరమిత్రులుకూడ మాతో వచ్చిరి. బెజవాడలో పదిన్నర బియ్యపుబస్తాలు, ఆరు తవుడుబస్తాలు సుమారు రెండువేలరూప్యములు నగదు వసూలైనవి. ఉయ్యూరురాజాగారు మూడువందల రూప్యములను మా కొసంగినారు. ఆంధ్రపత్రికద్వారా వసూళ్లుచేసి 1,800 రూపాయలను కాశీనాథుని నాగేశ్వరరావుపంతులుగారు మాకు పంపినారు. ఇంకను సుమారు 450 రూపాయలు ఇతర గ్రామములనుండి వచ్చినవి. మొత్తము రు. 4,553 -2-0 ల నగదు మాకు వసూలైనది. బెజవాడలోని మిత్రులము కలసి సేవకసంఘముగా ఏర్పడినాము. ఈ మొత్తముతో కావలసిన సామా నులను కొని, పైన చెప్పబడిన నాయకులద్వారాను వారిక్రింద పనిచేసిన ఐచ్ఛిక సేవకులద్వారాను పంచిపెట్టించినాము. ఆ లెఖ్కలను ప్రచురించి నాము. పైన చెప్పబడిన నాయకులు, వారితో పనిచేసిన సేవకులు చేసినసేవ అతి శ్లాఘనీయమైనది. నీళ్ళలో, బురదలో, ముళ్ళలో నడిచి బాధి<noinclude><references/></noinclude> mqo9yin5n3e5elau92gnmqshhe46mi3 పుట:Na-Jevitha-Katha-Navyandramu.pdf/137 104 161999 583810 466761 2026-10-07T09:16:18Z Vickyganti 7066 /* మూల్యాంకన చేసారు */ 583810 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Vickyganti" />{{rh|134|నా జీవితకథ - నవ్యాంధ్రము|}}</noinclude>తులవద్దకు చేరి వారికి తగుసహాయము చేసినారు. తరచుగ వారు ఉప వాసములు చేయవలసివచ్చినది. కొన్నిసమయములలో పైనుండి జోరున వర్షముకురియుచునే యుండెను. సీతానగరము. త్రిలోచనపురము, రేవేంద్ర పాడు, ఇబ్రహీంపట్టణము, వెల్లటూరులలో సహాయకశిబిరములు తెరచి ఆ చుట్టుపట్ల గ్రామములకుపోయి పంచిపెట్టి వచ్చుచుండిరి. నాయకులు, సేవ కులు బహు ఉత్సాహముతో పనిచేసినారు. ఎప్పటికప్పుడు రామమోహన గ్రంథాలయములోని మా సేవకసంఘపు కార్యస్థానమునకు వారు చేసినపనిని గూర్చి, ప్రజలయిబ్బందులనుగూర్చి నివేదికలు పంపుచుండిరి. ఈవిధముగ వారు పన్నెండుదినములు గుంటూరు, కృష్ణాజిల్లాలలో కృష్ణవరదలవల్ల బాధి తులైన గ్రామీణులకు సహాయముచేసి బెజవాడకు తిరిగి వచ్చేసరికి, కైక లూరుతాలూకాలో కొల్లేటివరదలువచ్చి అక్కడి గ్రామములకు చాలా నష్టము కలిగినదని తెలియుటతోడనే ఈ ఐచ్ఛికసేవకులలో చాలమందిని వెంటపెట్టుకొని అయ్యంకి వెంకటరమణయ్య. నోరి వెంకటేశ్వర్లుగారలు ఆ ప్రాంతములకు పోయి అనేక యిబ్బందులకు లోనై పదిదినములు అపార మైన సహాయముచేసి తిరిగివచ్చినారు. అపుడు వా రే గ్రామములను దర్శించి ఎట్టి సహాయముచేసిరో ఒక రిపోర్టును మేము సేవకసంఘముపక్ష మున ప్రకటించియున్నాము. ఆంధ్రపత్రిక ప్రత్యేకవిలేఖరికూడ వ్యాసము లను వ్రాసెను.<noinclude><references/></noinclude> pmhladfkdfp0ivwzlcpl2jvr7ct1a01 పుట:Pratha Nibandhana Kathalu 3.pdf/1 104 172187 583796 487087 2026-10-07T06:40:47Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 583796 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{Css image crop |Image = Pratha_Nibandhana_Kathalu_3.pdf |Page = 1 |bSize = 369 |cWidth = 339 |cHeight = 536 |oTop = 23 |oLeft = 18 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> os9ymi7m9zw8o4w0y8dkwh5m0ztsvs4 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/37 104 217482 583755 567880 2026-10-06T15:01:36Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 583755 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}5
{{p|fs125|ac}}హైస్కూలులో
{{Largeinitial|వి}}వాహకాలమున నేను హైస్కూలులో చదువుకొనుచుంటినని లోఁగడనే వ్రాసియుంటిని. మేము మూవురు సోదరులము ఒకపాఠశాలయందే చదువుచుంటిమి. జ్యేష్ఠునిది చాలపయితరగతి. నాతోపాటు పెండ్లి అయిన రెండవ సోదరుఁడు నాకు పైతరగతిలోనే ఉండెను. మాకు ఒకయేఁడు వివాహముతో విద్యానాశమాయెను. ఈ నాఅన్న పని మఱీ అన్యాయము. ఆయన బడి మానెను. ఎందఱు పిన్నవాండ్రు ఆతని అవస్థకు పాలుపడిరో దైవమునకే ఎఱుక! నేఁటి మన హిందూసంసారములందు మాత్రము విద్యావివాహములు రెండును సమముగా నడచును. నాచదువు ఎడతెగకసాగుచుండెను. హైస్కూలున నాకు మొద్దబ్బాయి అని గణన లేదు. నాయెడ ఉపాధ్యాయులకు వాత్సల్యము. కుఱ్ఱని నడవడిఁగూర్చియు, విద్యను గూర్చియు తలిదండ్రులకు ప్రతియేఁడును ఉల్లాకు (certificate) పంపుచుండుట మామూలు. నాకు ఎపుడును చెడ్డ ఉల్లాకు లేదు. అదియటుండ, నేను రెండవతరగతి గెలుపొందినపిదప బహుమతులుకూడ సంపాదించితిని. అయిదవ తరగతిలో నాలుగును, ఆఱవతరగతిలో పదియును రూపాయలు విద్యార్థి వేతనము పడసితిని. ఇది కేవలము నాప్రజ్ఞవలనఁ గాదు; మఱి అదృష్టమువలన, ఏలన, ఈవేతనములు అందఱకుఁ గావు; అవి కేవలము కాఠియావాడులోని సోరకు డివిజనునుండి వచ్చువారిలో శ్రేష్ఠులకుమాత్రము.<noinclude><references/> {{c|19}}</noinclude> f7wk9ypqb5ud7vx20n6xurjlbfp9y5u పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/44 104 217659 583756 568349 2026-10-06T15:07:44Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 583756 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}6
{{p|fs125|ac}}దుర్వార్త (1)
{{di|హై}}స్కూలులో వేఱువేఱుసమయములందు నాకుఁగల కొలఁది మిత్రులలో ముఖ్యులు ఇద్దఱు. వీరి మైత్రులలో ఒకటి చాలకాలము మనలేదు. ఆయినను నేను నామిత్రుని పరిత్యజింప లేదు. నేను మఱియొకని సావాసము పట్టితి నని అతఁడు నన్ను పరిత్యజించెను. ఈ రెండవవానిమైత్రి నాజీవితమున చింతాకరమైన ప్రకరణము. అది చాలకాలము ఉండెను. సంస్కారదృష్టితో నేను ఆచెలిమి చేసితిని. ఇతఁడు తొలుత మా చిన్నన్న చెలికాఁడు. వారు ఇరువురును సహాధ్యాయులు,అతనిలోటులు నే నెఱుఁగుదుఁగాని అతఁడువిశ్వాస్యుఁడని నా తలఁపు. మా అమ్మయు, పెద్దఅన్నయు, ధర్మపత్నియు చెడు సావాసము పట్టుచుంటినని నన్ను మందలించిరి. అభిమానము కల నేను ఆలి ఎచ్చరికను సరకుగొందునా? అయితే నేను మా అమ్మగారియు, అన్నగారియు మాటను ఉల్లంఘింప సాహసింపను. అయినప్పటికిని, 'మీరు ప్రతిపాదించు దోషములు అతనియందు ఉన్నమాట నిక్కమే కాని అతనిగుణము మీరు ఎఱుఁగరు. ఆతఁడు నన్ను చెడుదారికి త్రిప్పలేఁడు; ఏల యనఁగా, అతనిని మంచిత్రోవలోనికి తెచ్చుటకే నే నతని చెలిమి చేయుచుంటిని. అతఁడు తన దోషములను సంస్కరించుకొనుచో ఉత్తముఁడు కాఁగలఁడు. మీరు నాకొఱకు దిగులుపడవలదు' అని వారికి నచ్చఁబలికితిని.<noinclude><references/> {{c|26}}</noinclude> siwdbsgcgzuwpkyh719l0etaaaagu5g 583757 583756 2026-10-06T15:09:20Z Rajasekhar1961 50 583757 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}6
{{p|fs125|ac}}దుర్వార్త (1)
{{di|హై}}స్కూలులో వేఱువేఱుసమయములందు నాకుఁగల కొలఁది మిత్రులలో ముఖ్యులు ఇద్దఱు. వీరి మైత్రులలో ఒకటి చాలకాలము మనలేదు. ఆయినను నేను నామిత్రుని పరిత్యజింప లేదు. నేను మఱియొకని సావాసము పట్టితి నని అతఁడు నన్ను పరిత్యజించెను. ఈ రెండవవానిమైత్రి నాజీవితమున చింతాకరమైన ప్రకరణము. అది చాలకాలము ఉండెను. సంస్కారదృష్టితో నేను ఆచెలిమి చేసితిని. ఇతఁడు తొలుత మా చిన్నన్న చెలికాఁడు. వారు ఇరువురును సహాధ్యాయులు, అతనిలోటులు నే నెఱుఁగుదుఁగాని అతఁడువిశ్వాస్యుఁడని నా తలఁపు. మా అమ్మయు, పెద్దఅన్నయు, ధర్మపత్నియు చెడు సావాసము పట్టుచుంటినని నన్ను మందలించిరి. అభిమానము కల నేను ఆలి ఎచ్చరికను సరకుగొందునా? అయితే నేను మా అమ్మగారియు, అన్నగారియు మాటను ఉల్లంఘింప సాహసింపను. అయినప్పటికిని, 'మీరు ప్రతిపాదించు దోషములు అతనియందు ఉన్నమాట నిక్కమే కాని అతనిగుణము మీరు ఎఱుఁగరు. ఆతఁడు నన్ను చెడుదారికి త్రిప్పలేఁడు; ఏల యనఁగా, అతనిని మంచిత్రోవలోనికి తెచ్చుటకే నే నతని చెలిమి చేయుచుంటిని. అతఁడు తన దోషములను సంస్కరించుకొనుచో ఉత్తముఁడు కాఁగలఁడు. మీరు నాకొఱకు దిగులుపడవలదు' అని వారికి నచ్చఁబలికితిని.<noinclude><references/> {{c|26}}</noinclude> p4yn60ytmlkbd112o0upk7jz8pt4g1z పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/49 104 217666 583758 568365 2026-10-06T15:13:10Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 583758 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude> {{p|fs150|ac}}7
{{p|fs125|ac}}దుర్వార్త (2)
నియతదినము వచ్చెను. నాఁటి నాస్థితిని వర్ణింప నలవి కాదు, ఒక వంక సంస్కరణమునందు ఉత్సాహము, జీవితమునందు ఒక మహా పరివర్తనము చేయు వింత; ఇంకొకవంక దొంగవలె చాటుగా చేయు సిగ్గు. ఈరెంటిలో దేనికి ప్రాధాన్యమో నేను చెప్పఁజాలను. నదియొడ్డున ఏకాంతస్థలము వెదకుచు వెళ్లితిమి. దూరమున ఎవరికి కనరాని స్థలము లభించినది. అచట నాజీవితమున తొలిసారి మాంసమును చూచితిని. అచట కల్లు రొట్టెయు కలదు. నాకు రెంటిలో నేదియు రుచింప లేదు. మాంసము తోలువలె బిఱుసుగా ఉండెను. దాని తినుట అశక్యమాయెమ. నాకు నమనమగునట్లుండుటచే దానిని పరిహరించితిని. ఆరాత్రి నాకు ఇంతయైన నిద్రలేదు. ఏవేవో పీడకలలు, కన్నుమూఁతపడఁగనే నాకడుపులో బ్రతికియున్న ఒక మేఁక 'మే మే' యని అఱచినటులు కాఁగా సంతాపముతో త్రుళ్లిపడి లేచుచుంటిని. అయితే మాంసాశనము ఒక విధి గదా యని తెలివి తెచ్చుకొని క్రమ్మఱ రెండింతలు ధైర్యము తెచ్చుకొనుచుంటిని. నామిత్రుఁడు అంతంతమాత్రమున వదలిపెట్టువాఁడు కాఁడు. అతఁడు మాంసముతో పలురకముల పాకముల రుచికరములుగ తయారుచేయ మొదలిడెను. ఇఁక తినుటయు నదీతీరమందు ఏకాంతమునఁ గాదు; ఒక గొప్పభవనమున. అందు భోజనశాలలు, మేజాబల్లలు, కుర్చీలు<noinclude><references/> {{c|31}}</noinclude> p9t6tgl51prkhr74qn0osu1xklz8kov 583759 583758 2026-10-06T15:15:32Z Rajasekhar1961 50 583759 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude> {{p|fs150|ac}}7
{{p|fs125|ac}}దుర్వార్త (2)
{{di{ని}}యతదినము వచ్చెను. నాఁటి నాస్థితిని వర్ణింప నలవి కాదు, ఒక వంక సంస్కరణమునందు ఉత్సాహము, జీవితమునందు ఒక మహా పరివర్తనము చేయు వింత; ఇంకొకవంక దొంగవలె చాటుగా చేయు సిగ్గు. ఈరెంటిలో దేనికి ప్రాధాన్యమో నేను చెప్పఁజాలను. నదియొడ్డున ఏకాంతస్థలము వెదకుచు వెళ్లితిమి. దూరమున ఎవరికి కనరాని స్థలము లభించినది. అచట నాజీవితమున తొలిసారి మాంసమును చూచితిని. అచట కల్లు రొట్టెయు కలదు. నాకు రెంటిలో నేదియు రుచింప లేదు. మాంసము తోలువలె బిఱుసుగా ఉండెను. దాని తినుట అశక్యమాయెమ. నాకు నమనమగునట్లుండుటచే దానిని పరిహరించితిని. ఆరాత్రి నాకు ఇంతయైన నిద్రలేదు. ఏవేవో పీడకలలు, కన్నుమూఁతపడఁగనే నాకడుపులో బ్రతికియున్న ఒక మేఁక 'మే మే' యని అఱచినటులు కాఁగా సంతాపముతో త్రుళ్లిపడి లేచుచుంటిని. అయితే మాంసాశనము ఒక విధి గదా యని తెలివి తెచ్చుకొని క్రమ్మఱ రెండింతలు ధైర్యము తెచ్చుకొనుచుంటిని. నామిత్రుఁడు అంతంతమాత్రమున వదలిపెట్టువాఁడు కాఁడు. అతఁడు మాంసముతో పలురకముల పాకముల రుచికరములుగ తయారుచేయ మొదలిడెను. ఇఁక తినుటయు నదీతీరమందు ఏకాంతమునఁ గాదు; ఒక గొప్పభవనమున. అందు భోజనశాలలు, మేజాబల్లలు, కుర్చీలు<noinclude><references/> {{c|31}}</noinclude> 4zf4l5mumjjfdg0pk5zqmnq9u217n9i 583760 583759 2026-10-06T15:15:56Z Rajasekhar1961 50 583760 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude> {{p|fs150|ac}}7
{{p|fs125|ac}}దుర్వార్త (2)
{{di|ని}}యతదినము వచ్చెను. నాఁటి నాస్థితిని వర్ణింప నలవి కాదు, ఒక వంక సంస్కరణమునందు ఉత్సాహము, జీవితమునందు ఒక మహా పరివర్తనము చేయు వింత; ఇంకొకవంక దొంగవలె చాటుగా చేయు సిగ్గు. ఈరెంటిలో దేనికి ప్రాధాన్యమో నేను చెప్పఁజాలను. నదియొడ్డున ఏకాంతస్థలము వెదకుచు వెళ్లితిమి. దూరమున ఎవరికి కనరాని స్థలము లభించినది. అచట నాజీవితమున తొలిసారి మాంసమును చూచితిని. అచట కల్లు రొట్టెయు కలదు. నాకు రెంటిలో నేదియు రుచింప లేదు. మాంసము తోలువలె బిఱుసుగా ఉండెను. దాని తినుట అశక్యమాయెమ. నాకు నమనమగునట్లుండుటచే దానిని పరిహరించితిని. ఆరాత్రి నాకు ఇంతయైన నిద్రలేదు. ఏవేవో పీడకలలు, కన్నుమూఁతపడఁగనే నాకడుపులో బ్రతికియున్న ఒక మేఁక 'మే మే' యని అఱచినటులు కాఁగా సంతాపముతో త్రుళ్లిపడి లేచుచుంటిని. అయితే మాంసాశనము ఒక విధి గదా యని తెలివి తెచ్చుకొని క్రమ్మఱ రెండింతలు ధైర్యము తెచ్చుకొనుచుంటిని. నామిత్రుఁడు అంతంతమాత్రమున వదలిపెట్టువాఁడు కాఁడు. అతఁడు మాంసముతో పలురకముల పాకముల రుచికరములుగ తయారుచేయ మొదలిడెను. ఇఁక తినుటయు నదీతీరమందు ఏకాంతమునఁ గాదు; ఒక గొప్పభవనమున. అందు భోజనశాలలు, మేజాబల్లలు, కుర్చీలు<noinclude><references/> {{c|31}}</noinclude> cvosh6fti5kniausjt7fmd5wb8duki5 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/55 104 217731 583761 568615 2026-10-06T15:19:04Z Rajasekhar1961 50 583761 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}8
{{p|fs125|ac}}దొంగతనము - ప్రాయశ్చిత్తము
ఈనా మాంసాహారకాలమునను, తత్పూర్వమునను నా అకార్యములు చెప్పుటకు కొంచెము బాకీఉన్నది. అవి నా వివాహమునకు కొంచెము ముందో, లేక వెనువెంటనో అయియుండును. నా చుట్ట మొకఁడును, నేనును పొగత్రాగుటకు వేడుకపడితిమి. పొగత్రాగుటయందు మేలు కలదనికాదు; దానిపరిమళమునకు మోహపడి కాదు. మా పినతండ్రికి ఈ యలవాటు కలదు. అతఁడు పొగద్రావు చుండఁగా చూచి మేముకూడ సిగరెట్లతో చిన్న మబ్బులు తయారు చేయవలయునని తలంచితిమి. మావద్ద ధనము లేదు. కాన మా పినతండ్రి కాల్చిపాఱవైచిన సిగరెట్టు ముక్కలను తీసి దాఁచ మొదలిడితిమి. అవి అనుకొన్నపుడు దొరకెడివికావు; దొరకినను ఎక్కువ పొగవచ్చెడిది కాదు. కావున నౌకరుల సొంతసొమ్ములో నుండి డబ్బులు మ్రుచ్చిలించి బీడీలు (దేశవాళీ సిగరెట్లు) కొన మొదలిడితిమి. పిమ్మట వానిని దాఁచుట ఎచట అనునది ఒక పెద్దవిషయము. పెద్దల యెదుట మేము కొల్పలేము గదా! ఈ దొంగడబ్బులతో కొన్ని దినములు ఎటులో కడపితిమి. ఈ లోపుగా కొన్ని మొక్కలకాడలకు సన్నని బెజ్జములు కలవనియు, అవి సిగరెట్ల పని చేయుననియు వింటిమి. మేము వానిని తెచ్చి ఈక్రొత్తధూమపానము మొదలు పెట్టితిమి.<noinclude><references/> {{c|37}}</noinclude> elhbdjdj21mtc2j8flrha4qeboasrc6 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/627 104 219280 583773 572159 2026-10-06T20:59:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583773 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నది? (లక్ష్మణుఁడు) అందుఁ గురంగమున్నది. (రాముఁడు) హా కురంగనయనా! సీతా! ఎటనుంటివి. ఇటఁ గురంగపదశ్రవణముచేఁ దత్సంబంధి నయనస్మరణమును దానిచే సీతాస్మరణమును గలిగినది. {{p|ac|fwb}}5. రూపకము
{{Telugu poem|type=మ.|lines=<poem>అల సందేహముమాడ్కి గాక యుపమేయం బెన్న నచ్చన్న మై యలఘూత్ప్రేక్షయు నా నభిన్నమతిజం బై యుండ, కారోప మిం పలరంగాఁ బ్రకృతోపమోగిపరిణామారోపతుల్యంబుగా కలయారోపిత మిందు రంజనము సేయన్ రూపకం బై తగున్.</poem>|ref=35}} అన్యత్ర అన్యధర్మారోపమారోప మనఁబడును. ఎట్లనఁ జంద్రత్వము చంద్రధర్మము. దానిని ముఖమునం దారోపించుట యారోపము. సందేహాలంకారమున నుపమేయము ఛన్నమై యనఁగాఁ దిరోహితమై యుండును. ఎట్లన “ఇది ముఖమా? చంద్రుఁడా?” అనుచో నుపమేయమగు ముఖము సందేహవిషయ మగుటవలన నుపమానమగు చంద్రునిచేఁ దిరోహితమగును. రూపకమున నట్లుపమానముచేఁ దిరోహితము గాదు. ఉత్ప్రేక్ష యధ్యవసాయగర్భము. అనఁగాఁ బైకభేదము దోఁపకున్నను లోపల నభేద మిమిడియే యున్నది. రూపకమున నభేదమే కాని యధ్యవసాయము లేదు. అధ్యవసాయమన నభేదప్రతిపత్తి. ప్రకృతాప్రకృతముల కభేదజ్ఞానము. పరిణామమున నారోపము ప్రకృతోపయోగి యగును. అనఁగా నప్రకృతము ప్రకృతస్వరూపముతో నుపయోగపడును. రూపకమున నట్లు ప్రకృతాత్మముగాఁ బరిణమింపదు. రూపకమున నారోపము రంజనమాత్రమే. రంజనమన రంగువేయుట యని వ్యుత్పత్త్యర్థము. రంగు వేసినపుడు మొదటిదగు తెల్లరంగుమాత్రమే రెండవరంగుచేఁ గప్పివేయఁబడును. వస్తువే కప్పివేయఁబడకు. అట్లే రూపకమునఁ బ్రకృతవస్తువునం దప్రకృతవస్తువుయొక్క ధర్మారోపము చేయఁబడును. ఆ యా యలంకారములు వచ్చినపుడు దృష్టాంతములమీఁదఁ జూపఁబడి విభేదము విస్పష్టముగాఁ దెలియును. రూప ఏవ రూపకం. రూపముయొక్క యారోపణమే రూపకము. దీని కాంగ్లమున Metapher అని వ్యవహారము. {{Telugu poem|type=క.|lines=<poem>అరయ రసజ్ఞులమతమున నరుదగు నీరూపకంబు సావయవంబున్</poem>|ref=}}<noinclude><references/></noinclude> adzkpsker2btrmtwgn3lpqzdahyms86 583774 583773 2026-10-06T21:01:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 583774 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నది? (లక్ష్మణుఁడు) అందుఁ గురంగమున్నది. (రాముఁడు) హా కురంగనయనా! సీతా! ఎటనుంటివి. ఇటఁ గురంగపదశ్రవణముచేఁ దత్సంబంధి నయనస్మరణమును దానిచే సీతాస్మరణమును గలిగినది. {{p|ac|fwb}}5. రూపకము
{{Telugu poem|type=మ.|lines=<poem>అల సందేహముమాడ్కిఁ గాక యుపమేయం బెన్న నచ్చన్న మై యలఘూత్ప్రేక్షయు నా నభిన్నమతిజం బై యుండ, కారోప మిం పలరంగాఁ బ్రకృతోపమోగిపరిణామారోపతుల్యంబుగా కలయారోపిత మిందు రంజనము సేయన్ రూపకం బై తగున్.</poem>|ref=35}} అన్యత్ర అన్యధర్మారోపమారోప మనఁబడును. ఎట్లనఁ జంద్రత్వము చంద్రధర్మము. దానిని ముఖమునం దారోపించుట యారోపము. సందేహాలంకారమున నుపమేయము ఛన్నమై యనఁగాఁ దిరోహితమై యుండును. ఎట్లన “ఇది ముఖమా? చంద్రుఁడా?” అనుచో నుపమేయమగు ముఖము సందేహవిషయ మగుటవలన నుపమానమగు చంద్రునిచేఁ దిరోహితమగును. రూపకమున నట్లుపమానముచేఁ దిరోహితము గాదు. ఉత్ప్రేక్ష యధ్యవసాయగర్భము. అనఁగాఁ బైకభేదము దోఁపకున్నను లోపల నభేద మిమిడియే యున్నది. రూపకమున నభేదమే కాని యధ్యవసాయము లేదు. అధ్యవసాయమన నభేదప్రతిపత్తి. ప్రకృతాప్రకృతముల కభేదజ్ఞానము. పరిణామమున నారోపము ప్రకృతోపయోగి యగును. అనఁగా నప్రకృతము ప్రకృతస్వరూపముతో నుపయోగపడును. రూపకమున నట్లు ప్రకృతాత్మముగాఁ బరిణమింపదు. రూపకమున నారోపము రంజనమాత్రమే. రంజనమన రంగువేయుట యని వ్యుత్పత్త్యర్థము. రంగు వేసినపుడు మొదటిదగు తెల్లరంగుమాత్రమే రెండవరంగుచేఁ గప్పివేయఁబడును. వస్తువే కప్పివేయఁబడకు. అట్లే రూపకమునఁ బ్రకృతవస్తువునం దప్రకృతవస్తువుయొక్క ధర్మారోపము చేయఁబడును. ఆ యా యలంకారములు వచ్చినపుడు దృష్టాంతములమీఁదఁ జూపఁబడి విభేదము విస్పష్టముగాఁ దెలియును. రూప ఏవ రూపకం. రూపముయొక్క యారోపణమే రూపకము. దీని కాంగ్లమున Metapher అని వ్యవహారము. {{Telugu poem|type=క.|lines=<poem>అరయ రసజ్ఞులమతమున నరుదగు నీరూపకంబు సావయవంబున్</poem>|ref=}}<noinclude><references/></noinclude> hb9brmrbiro2wi25i93f50dpafp2zeu పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/628 104 219281 583776 572160 2026-10-06T21:49:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583776 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నిరవయవంబును వరుసం బరంపరితమనఁగఁ ద్రివిధభావమునొందున్.</poem>|ref=36}} ఈ రూపకము సావయవము (అవయవములు గలది) నిరవయవము (అవయవములు లేనిది) పరంపరితము అని మువ్విధములు. {{Telugu poem|type=చ.|lines=<poem>అరయ సమస్తవస్తువిషయంబును, నేకతలప్రవర్తి యై యరుదుగఁ బొల్చుసావయవ; మవ్వలఁ గేవల, మాలికాఖ్య మౌ నిరవయవంబు; శ్లిష్టమును, నేర్పున శ్లేషవిహీన మౌ, పరం పరితము; తత్ప్రభేదములఁ బాయక కేవలమాలికాఖ్యయౌౝ.</poem>|ref=37}} సావయవరూపకము సమస్తవస్తువిషయరూపకము, ఏకదేశవివర్తిరూపకము అనియు, నిరవయవము కేవలరూపకము, మాలారూపక మనియుఁ, బరంపరితము కేవలశ్లిష్టపరంపరితము, కేవలాశ్లిష్టపరంపరితము, శ్లిష్టమాలాపరంపరితము, అశ్లిష్టమాలాపరంపరితము అనియు మొత్త మెనిమిదివిధములు. {{Telugu poem|type=క.|lines=<poem>కావున రూపక మష్టవి ధావహ మగు; లక్షణంబు లలలక్ష్యంబుల్ వావిరి నొనర్తు వీనికి భావజధనురసమరసవిభాసితఫణితిన్.</poem>|ref=38}} స్పష్టము. {{Telugu poem|type=క.|lines=<poem>అవయవియు నవయవంబులు వివరింప సమస్తవస్తువిషయం; బిలలో నవయవి యవయవగమ్యం బవునది యేకతలవర్తి యగు నె ట్లన్నన్.</poem>|ref=39}} అవయవియు దాని యవయవములును సమగ్రముగా నిరూపింపఁబడినచో సమస్తవస్తువిషయసావయవరూపకము. అవయవనిరూపణచే నవయవి గమ్యమాన మగుచో నేకదేశవివర్తిరూపకము. {{p|al|fwb}}1. సమస్తవస్తువిషయసావయవరూపకము
{{Telugu poem|type=మహాస్రగ్ధర.|lines=<poem>హిమశైలద్వీపదీప్తం, బినమణిమహితం, బిందుశంఖాభిరామం, బమరాంభోమత్స్యయుక్తం, బహిపలహరికం, బభ్రశైవాలజాలం</poem>|ref=}}<noinclude><references/></noinclude> g8xyhlsq20ayvu2zo3akqv4mbyehfm9 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/629 104 219282 583779 572161 2026-10-06T23:06:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583779 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బమితాశాకుంభినక్రం, బజహదుడుకణం, బాత్తసంధ్యాప్రవాళం బమరున్ శ్రీనారసింహోద్యతవిశదయశోహారిదుగ్ధాబ్దివేడ్కన్.</poem>|ref=40}} హిమవంతమను ద్వీపముతో, సూర్యుఁడను మణితోఁ, జంద్రుఁడను శంఖముతో, గంగానది యను మత్స్యముతో, నాదిశేషుఁ డను తరంగముతో, మేఘమను శైవాలముతో, దిగ్గజములను నక్రములతో, నక్షత్రము లను కణములతో, సంధ్యాకాలమును పగడముతో, నరసభూపాలుని కీర్తియను పాలసముద్ర మమరును. పాలసంద్ర మవయవి. దాని సమస్తావయవములును నిరూపింపఁబడినవి. ఇట రూపకము సమస్తావయవవ్యాప్తమైయున్నది. {{p|al|fwb}}2. ఏకదేశవివర్తిసావయవరూపకము
{{Telugu poem|type=క.|lines=<poem>ధర నొఱ యనువల్మీకము సరభసగతి వెడలి నీదుచటులాసి మదో ద్ధుచరదరిధరణిధురం ధరజీవానిలముఁ గ్రోలు నరసింహనృపా!</poem>|ref=41}} నీఖడ్గ 'మొఱ' యను పుట్టనుండి వెడలి మదమత్తులగు శత్రురాజుల ప్రాణానిలములను గ్రోలును. అవయవి యగు ఖడ్గము సర్పరూపమని యవయవములచేఁ గమ్యమగుచున్నది. ఎట్లన, నిట ఖడ్గము సర్పముగా వాగ్రూపమున రూపింపఁబడలేదు. ఒఱ యను పుట్ట, జీవానిలములు, అను నవయవరూపకములచే నవయవి యగు ఖడ్గము సర్పరూప మని గమ్యమగుచున్నది. {{Telugu poem|type=క.|lines=<poem>అవయవమాత్రంబున నే కవిమతి విశ్రాంత మైనఁ గన నిరవయవం బవని నిది కేవలంబును ద్వివిధత మాలికయు నయ్యె విను మె ట్లన్నన్.</poem>|ref=42}} అవయవనిరూపణము చేయక యవయవిమాత్రమునే కవి నిరూపించినచో నిరవయవరూపకము. అది కేవలనిరవయవము, మాలానిరవయవము అనిద్వివిధము. {{p|al|fwb}}3. కేవలనిరవయవము
{{Telugu poem|type=క.|lines=<poem>ఇల నీదు కీర్తిచంద్రిక యలఘుతరస్ఫూర్తి నళినజాండకరండం</poem>|ref=}}<noinclude><references/></noinclude> j8slwcdyajl4sgwyxgl2xzedocfkjph పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/630 104 219283 583783 572162 2026-10-07T01:18:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583783 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బులు నిండి వెల్లివిరిసె న్నలనహుషసమానశీల! నరసనృపాలా!</poem>|ref=43}} కీర్తి యనునది యవయవి. అదిమాత్రమే చంద్రికగా నారోపింపఁబడింది. కానఁ గేవలనిరవయవరూపకము. {{p|al|fwb}}4. మాలానిరవయవరూపకము
{{Telugu poem|type=క.|lines=<poem>హరశిఖరిదరుల, భాషా తరుణీకుచగిరుల, నమరతరులం జెలఁగున్ ఝరులై, సరులై, విరులై, నరనుత మగునీదుకీర్తి నరసింహనృపా!</poem>|ref=44}} కైలాసగుహలందు, సరస్వతీదేవి స్తనములందుఁ, గల్పవృక్షములందుఁ నీ కీర్తి ప్రవాహములై, ముత్యాలసరులై, పువ్వులై చెలఁగును. ఇటఁ గీర్తి యను నవయవి ఝరులుగా, సరులుగా, విరులుగా నారోపింపఁబడినది. వెనుకటి పద్యమున నొక్కటే నిరవయవరూపకము. ఇటఁ బెక్కు నిరపయవరూపకములు. ఇదే మాలానిరవయపరూపకము లేక మాలారూపకము. ఇట 'యథాసంఖ్యము లేక శ్రమము' అను నలంకారము గూడఁ గలదు. "ప్రాధాన్యేన వ్యపదేశా భవంతి” అను న్యాయముచే నిట రూపకముచేతనే విచ్ఛిత్తివిశేషము. కాన రూపకమనియే వ్యవహారము. {{p|al|fwb}}5. శ్లిష్టకేవలపరంపరితరూపకము
{{Telugu poem|type=క.|lines=<poem>రూపకకారణ మై తగు రూపకము పరంపరితము రూపింపఁగ నిం దేపగు నాల్గువిభేదము లాపాదించెద నుదంచితాయతఫణితిన్.</poem>|ref=45}} ఒకరూపకమునకుఁ గారణముగా మరొకరూపకము నిబద్ధమయ్యెనేని నది పరంపరితరూపకము. (పరంపరా + ఇత = పరంపరితము; పరంపర గలది ― తారకలు గలవి ‘తారకితము’ అను విధమున సిద్ధము.) ఇది నాలుగుభేదములు గలది. {{Telugu poem|type=క.|lines=<poem>నిరతంబు రాజహంసలఁ బరువెత్తఁగఁజేయు నౌర! పటుచటులభవ</poem>|ref=}}<noinclude><references/></noinclude> rs7t767dsd4zc4hhiyrudb4bx7v9jzf 583784 583783 2026-10-07T01:22:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 583784 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బులు నిండి వెల్లివిరిసె న్నలనహుషసమానశీల! నరసనృపాలా!</poem>|ref=43}} కీర్తి యనునది యవయవి. అదిమాత్రమే చంద్రికగా నారోపింపఁబడింది. కానఁ గేవలనిరవయవరూపకము. {{p|al|fwb}}4. మాలానిరవయవరూపకము
{{Telugu poem|type=క.|lines=<poem>హరశిఖరిదరుల, భాషా తరుణీకుచగిరుల, నమరతరులం జెలఁగున్ ఝరులై, సరులై, విరులై, నరనుత మగునీదుకీర్తి నరసింహనృపా!</poem>|ref=44}} కైలాసగుహలందు, సరస్వతీదేవి స్తనములందుఁ, గల్పవృక్షములందుఁ నీ కీర్తి ప్రవాహములై, ముత్యాలసరులై, పువ్వులై చెలఁగును. ఇటఁ గీర్తి యను నవయవి ఝరులుగా, సరులుగా, విరులుగా నారోపింపఁబడినది. వెనుకటి పద్యమున నొక్కటే నిరవయవరూపకము. ఇటఁ బెక్కు నిరవయవరూపకములు. ఇదే మాలానిరవయవరూపకము లేక మాలారూపకము. ఇట 'యథాసంఖ్యము లేక క్రమము' అను నలంకారము గూడఁ గలదు. "ప్రాధాన్యేన వ్యపదేశా భవంతి” అను న్యాయముచే నిట రూపకముచేతనే విచ్ఛిత్తివిశేషము. కాన రూపకమనియే వ్యవహారము. {{p|al|fwb}}5. శ్లిష్టకేవలపరంపరితరూపకము
{{Telugu poem|type=క.|lines=<poem>రూపకకారణ మై తగు రూపకము పరంపరితము రూపింపఁగ నిం దేపగు నాల్గువిభేదము లాపాదించెద నుదంచితాయతఫణితిన్.</poem>|ref=45}} ఒకరూపకమునకుఁ గారణముగా మరొకరూపకము నిబద్ధమయ్యెనేని నది పరంపరితరూపకము. (పరంపరా + ఇత = పరంపరితము; పరంపర గలది ― తారకలు గలవి ‘తారకితము’ అను విధమున సిద్ధము.) ఇది నాలుగుభేదములు గలది. {{Telugu poem|type=క.|lines=<poem>నిరతంబు రాజహంసలఁ బరువెత్తఁగఁజేయు నౌర! పటుచటులభవ</poem>|ref=}}<noinclude><references/></noinclude> j188txpu5qey9gsb45m20be9gdm6952 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/631 104 219284 583785 572163 2026-10-07T01:38:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583785 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>త్కరకరవాలకరాళ స్ఫురితాంభోదము నృసింహభూపాలమణీ!</poem>|ref=46}} నీ చేతి ఖడ్గమను మేఘము రాజశ్రేష్ఠులను రాజహంసలను బరుగెత్తించును. ఇట రాజహంసపదము శివరూపకము. 'రాజహంసలు' అను శ్లిష్టరూపకమునకుఁ గారణముగాఁ “గరవాలకరాళస్ఫురితాంభోదము” అను రూపకము నిబద్ధమై యున్నది. ఇది నిరవయవము. 'రాజహంస' పదము శ్లిష్టము. కాన నిరవయవశ్లిష్టపరంపరితము. {{p|al|fwb}}6. శ్లిష్టమాలాపరంపరితము
{{Telugu poem|type=క.|lines=<poem>కువలయవికసనహిమకరుఁ డవిరళదానాంబుదిగ్గజాగ్రణి; పద్మో త్సవసౌభాగ్యదివాకరుఁ; డవనిని నరసింహుఁ డితని కన్యులు సరియే?</poem>|ref=47}} నరసభూపాలుఁడు కువలయ (భూవలయము) మను కువలయమును (కలువను) వికసిల్లఁజేయు చంద్రుఁడు. దాన (ఈవి) జలమను దాన (మద) జలమునకు దిగ్గజము. పద్మోత్సవ ( పద్మా + ఉత్సవ) మను పద్మోత్సవమునకు (పద్మ + ఉత్సవ) సూర్యుఁడు. నరసభూపాలుఁడు ‘హిమకరుఁడు' అన్నచో 'హిమకరుఁడు' అను రూపకమునకుఁ గారణము 'కువలయమను కువలయము' అను శ్లిష్టరూపకము. 'నరసభూపాలుఁడు దిగ్గజాగ్రణి' అన్న రూపకమునకుఁ గారణము ‘దానాంబువులు అను దానాంబువులు' అను శ్లిష్టరూపకము. ‘నరసభూపాలుఁడు దివాకరుఁడు' అను రూపకమునకుఁ గారణము ‘పద్మోత్సవ మను పద్మోత్సవము' అను శ్లిష్టరూపకము. ఇవి పెక్కురూపకములు. కాన శ్లిష్టమాలాపరంపరితము. {{p|al|fwb}}7. అశ్లిష్టకేవలపరంపరితరూపకము
{{Telugu poem|type=క.|lines=<poem>కాతరతరవిమతధ్వజి నీతతకాంతారతతికి నీచేతిమహా హేతి దవజ్వలనోజ్జ్వల హేతి సుమీ! యోబధారుణీశ్వరునరసా!</poem>|ref=48}}<noinclude><references/></noinclude> rk6kb6fwpp4ufw8i07aa60puydqrn5o పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/632 104 219285 583787 572164 2026-10-07T04:35:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583787 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పిఱికిపంద లైన నీశత్రుసేనయను కాంతారమునకు నీచేతిఖడ్గము దావాగ్నిశిఖ. ఇట 'ఖడ్గ మగ్నిశిఖ' అను రూపకమునకు ‘సేనాకాంతారము’ అను రూపకము హేతువు. వెనుకటివానియందువలె నిందు శ్లేషలేదు. కాన నశ్లిష్టము. {{p|al|fwb}}8. అశ్లిష్టమాలాపరంపరితరూపకము
{{Telugu poem|type=మ.|lines=<poem>వనితానేత్రచకోరచంద్రిక; యశోవల్లీవసంతోదయం; బనిదంపూర్వకథాసుధాబ్ధి; భుజగర్వాదిత్యపూర్వాచలం బనఘోద్యద్గుణరత్నరోహణము; నీయాకార మెవ్వారికిన్ వినుతింప న్వశమే నృసింహ! కరుణావిన్యాస! ధన్యాత్మకా.</poem>|ref=49}} నీ 'యాకారము చంద్రిక’ అను రూపకమునకు ‘నేత్రచకోరము’ అను రూపకము హేతువు. ఇట్లే మిగిలిన గీటులుంచినయెడలను దెలిసికొనవలెను. ఇవియేకాక రశనారూపకాది పెక్కుభేదములును గలవు. {{left margin|3em}}<poem>కిశలయకరైర్లతానాం కరకమలై ర్మృగదృశాం జగజ్జయతి నళినీనాం కమలముఖైర్ముఖేందుభిర్యోషితాం మదనః</poem>
లతలయొక్క చిగురాకులను హస్తములచేతను, యువతుల కరములను కమలములచేతను, తామరతీఁగలయొక్క కమలములను ముఖములచేతను, తరుణుల ముఖములను చంద్రులచేతను మన్మథుఁడు జగమును జయించుచున్నాఁడు. ఇటఁ గిసలయములు కరములుగాఁ గరములు కమలములుగాఁ గమలములు ముఖములుగా ముఖములు చంద్రులుగా నారోపింపఁబడిరి. ఇది రశనారూపకము. రశనాకారము రూపకములు గూర్పఁబడినవగుట నామము సార్థకము. మరియు సమస్తరూపకము, వ్యస్తరూపకము అని రూపక మెల్ల ద్వివిధము. ‘ముఖచంద్రుఁడు’ సమస్తరూపకము (సమాసమునున్న రూపకము.) ‘ముఖము చంద్రుఁడు’ వ్యస్తరూపము (విడిగానున్న రూపకము.) సిద్ధాంతమున వ్యస్తరూపకమేకానీ సమస్తరూపక మనునది లేదు. సమస్తరూపక మనినపుడు చెప్పుకొను నలంకారము ఉపమాలంకారమే. "ముఖచంద్రాదీనాంతు ఉపమాసమాసాత్ న రూపకత్వం యుక్తం” అని వామనుఁడు. అనఁగా ముఖచంద్రాది పదములందు ‘చంద్ర ఇవ ముఖం’ అని యుపమాసమాసమునే చేయవలెను. రూపకము చేసినచో నుత్తరపదార్థప్రాధాన్యముచే వర్ణనీయమగు ముఖాదులకు గౌణత్వము వచ్చును. కాన నుపమాసమాసమునే చేసి యుపమాలంకారమునే చెప్పుకొనవలెను. ఇది కాక “చతుర్ధశలోకవల్లికందః” ఇత్యాదికమను పరంపరితరూపక<noinclude><references/></noinclude> ra97gzrxpyghcwcu5orxgqz2sz7int5 583788 583787 2026-10-07T04:37:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 583788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పిఱికిపంద లైన నీశత్రుసేనయను కాంతారమునకు నీచేతిఖడ్గము దావాగ్నిశిఖ. ఇట 'ఖడ్గ మగ్నిశిఖ' అను రూపకమునకు ‘సేనాకాంతారము’ అను రూపకము హేతువు. వెనుకటివానియందువలె నిందు శ్లేషలేదు. కాన నశ్లిష్టము. {{p|al|fwb}}8. అశ్లిష్టమాలాపరంపరితరూపకము
{{Telugu poem|type=మ.|lines=<poem>వనితానేత్రచకోరచంద్రిక; యశోవల్లీవసంతోదయం; బనిదంపూర్వకథాసుధాబ్ధి; భుజగర్వాదిత్యపూర్వాచలం బనఘోద్యద్గుణరత్నరోహణము; నీయాకార మెవ్వారికిన్ వినుతింప న్వశమే నృసింహ! కరుణావిన్యాస! ధన్యాత్మకా.</poem>|ref=49}} నీ 'యాకారము చంద్రిక’ అను రూపకమునకు ‘నేత్రచకోరము’ అను రూపకము హేతువు. ఇట్లే మిగిలిన గీటులుంచినయెడలను దెలిసికొనవలెను. ఇవియేకాక రశనారూపకాది పెక్కుభేదములును గలవు. {{left margin|3em}}<poem>కిశలయకరైర్లతానాం కరకమలై ర్మృగదృశాం జగజ్జయతి నళినీనాం కమలముఖైర్ముఖేందుభిర్యోషితాం మదనః</poem>
లతలయొక్క చిగురాకులను హస్తములచేతను, యువతుల కరములను కమలములచేతను, తామరతీఁగలయొక్క కమలములను ముఖములచేతను, తరుణుల ముఖములను చంద్రులచేతను మన్మథుఁడు జగమును జయించుచున్నాఁడు. ఇటఁ గిసలయములు కరములుగాఁ గరములు కమలములుగాఁ గమలములు ముఖములుగా ముఖములు చంద్రులుగా నారోపింపఁబడిరి. ఇది రశనారూపకము. రశనాకారము రూపకములు గూర్పఁబడినవగుట నామము సార్థకము. మరియు సమస్తరూపకము, వ్యస్తరూపకము అని రూపక మెల్ల ద్వివిధము. ‘ముఖచంద్రుఁడు’ సమస్తరూపకము (సమాసమునున్న రూపకము.) ‘ముఖము చంద్రుఁడు’ వ్యస్తరూపము (విడిగానున్న రూపకము.) సిద్ధాంతమున వ్యస్తరూపకమేకానీ సమస్తరూపక మనునది లేదు. సమస్తరూపక మనినపుడు చెప్పుకొను నలంకారము ఉపమాలంకారమే. "ముఖచంద్రాదీనాంతు ఉపమాసమాసాత్ న రూపకత్వం యుక్తం” అని వామనుఁడు. అనఁగా ముఖచంద్రాది పదములందు ‘చంద్ర ఇవ ముఖం’ అని యుపమాసమాసమునే చేయవలెను. రూపకము చేసినచో నుత్తరపదార్థప్రాధాన్యముచే వర్ణనీయమగు ముఖాదులకు గౌణత్వము వచ్చును. కాన నుపమాసమాసమునే చేసి యుపమాలంకారమునే చెప్పుకొనవలెను. ఇది కాక “చతుర్ధశలోకవల్లికందః” ఇత్యాదికమను పరంపరితరూపక<noinclude><references/></noinclude> 5cmpk4dxawfkemf94ukmfcadg7k7mlu పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/633 104 219286 583789 572165 2026-10-07T04:49:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మును నుపమారూపకమనియు వామనుఁ డుదాహరించెను. 'చతుర్దశలోకవల్లికందః’ ‘వల్లులవంటి పదునాలుగులోకములకును గందభూతుఁడు’ అని యర్థము. అంతేకాని “చతుర్దశలోకములు అను వల్లులకుఁ గందము” అని కాదు. శ్లిష్టపరంపరితమునఁ దక్క అశ్లిష్టపరంపరితమున నెల్లెడ నుపమాసమాసమునే చెప్పుకొనవలెను. మొదట నుపమయుఁ బిమ్మట రూపకమును నుంట నుపమారూపకము. {{p|al|fwb}}9. పరిణామము
{{Telugu poem|type=క.|lines=<poem>ధరలో నుపమేయమునను నరుదుగ నారోప్యమాణ మగునుపమానం బరయఁ బ్రకృతోపయోగా కరముగఁ బరిణామ మయ్యెఁ గను మె ట్లన్నన్.</poem>|ref=50}} ఉపమేయమం దారోపింపఁబడిన యుపమానము. ప్రకృతరూపమున ననఁగా నుపమేయరూపముగానే పరిణమించి యుపయోగించుచోఁ బరిణామాలంకారము. {{Telugu poem|type=క.|lines=<poem>నైలింపసతులకౌఁగిటఁ దేలుటకై దివికి నేఁగు దృప్తారులకున్ నీలాలనిచ్చె నాయెను నీలాలితహేతి యోబనృపనరసింహా!</poem>|ref=51}} దేవతాస్త్రీల ననుభవించుటకై దివి కేగు నీ శత్రురాజులకు నీ ఖడ్గము నీలమణిమయమైన 'నిచ్చెన’ యయ్యెను. ఇట నుపమేయమగు ఖడ్గము మొదట నిచ్చెనగా నారోపింపఁబడినది. ఆ యారోప్యమాణమగు 'నిచ్చెన’ స్వతంత్రముగా స్వర్గారోహణసాధనము కాఁజాలదు. ఏలన, స్వర్గమునకు నిచ్చెనతో వెళ్ళుటెట్లు? కానఁ బ్రకృతస్వరూపమున ననఁగా ఖడ్గాభిన్నస్వరూపముననే సాధనమగును. ఖడ్గహతులయినవారు స్వర్గమునకుఁ బోవుదురుగదా! కాన నిచ్చెన ఖడ్గరూపమునఁ బరిణమించినచో నపుడు స్వర్గారోహణసాధన మగుచున్నది. ఇట నారోప్యమాణము ప్రకృతాత్మకముగాఁ బరిణమించుటచేఁ బరిణామాలంకారము. ఈ యలంకారము సామానాధికరణ్య వైయధికరణ్యభేదములచే ద్వివిధము. సామానాధికరణ్యమన నుపమానోపమేయములు సమానవిభక్తియం దుండుట, 'నీహేతి నీలాలనిచ్చెన' అనుచో నుపమామోపమేయములు సమానవిభక్తికములు. కాన సామానాధికరణ్యము గలదు. వైయధికరణ్యోదాహరణమును గనుఁడు.<noinclude><references/></noinclude> i9ygqup02rjyesqhn9uwln1vu9eqmuv 583792 583789 2026-10-07T06:02:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 583792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మును నుపమారూపకమనియు వామనుఁ డుదాహరించెను. 'చతుర్దశలోకవల్లికందః’ ‘వల్లులవంటి పదునాలుగులోకములకును గందభూతుఁడు’ అని యర్థము. అంతేకాని “చతుర్దశలోకములు అను వల్లులకుఁ గందము” అని కాదు. శ్లిష్టపరంపరితమునఁ దక్క అశ్లిష్టపరంపరితమున నెల్లెడ నుపమాసమాసమునే చెప్పుకొనవలెను. మొదట నుపమయుఁ బిమ్మట రూపకమును నుంట నుపమారూపకము. {{p|ac|fwb}}6. పరిణామము
{{Telugu poem|type=క.|lines=<poem>ధరలో నుపమేయమునను నరుదుగ నారోప్యమాణ మగునుపమానం బరయఁ బ్రకృతోపయోగా కరముగఁ బరిణామ మయ్యెఁ గను మె ట్లన్నన్.</poem>|ref=50}} ఉపమేయమం దారోపింపఁబడిన యుపమానము. ప్రకృతరూపమున ననఁగా నుపమేయరూపముగానే పరిణమించి యుపయోగించుచోఁ బరిణామాలంకారము. {{Telugu poem|type=క.|lines=<poem>నైలింపసతులకౌఁగిటఁ దేలుటకై దివికి నేఁగు దృప్తారులకున్ నీలాలనిచ్చె నాయెను నీలాలితహేతి యోబనృపనరసింహా!</poem>|ref=51}} దేవతాస్త్రీల ననుభవించుటకై దివి కేగు నీ శత్రురాజులకు నీ ఖడ్గము నీలమణిమయమైన 'నిచ్చెన’ యయ్యెను. ఇట నుపమేయమగు ఖడ్గము మొదట నిచ్చెనగా నారోపింపఁబడినది. ఆ యారోప్యమాణమగు 'నిచ్చెన’ స్వతంత్రముగా స్వర్గారోహణసాధనము కాఁజాలదు. ఏలన, స్వర్గమునకు నిచ్చెనతో వెళ్ళుటెట్లు? కానఁ బ్రకృతస్వరూపమున ననఁగా ఖడ్గాభిన్నస్వరూపముననే సాధనమగును. ఖడ్గహతులయినవారు స్వర్గమునకుఁ బోవుదురుగదా! కాన నిచ్చెన ఖడ్గరూపమునఁ బరిణమించినచో నపుడు స్వర్గారోహణసాధన మగుచున్నది. ఇట నారోప్యమాణము ప్రకృతాత్మకముగాఁ బరిణమించుటచేఁ బరిణామాలంకారము. ఈ యలంకారము సామానాధికరణ్య వైయధికరణ్యభేదములచే ద్వివిధము. సామానాధికరణ్యమన నుపమానోపమేయములు సమానవిభక్తియం దుండుట, 'నీహేతి నీలాలనిచ్చెన' అనుచో నుపమామోపమేయములు సమానవిభక్తికములు. కాన సామానాధికరణ్యము గలదు. వైయధికరణ్యోదాహరణమును గనుఁడు.<noinclude><references/></noinclude> dt3ctfcvvuguvsjb6fauoyod6svwt9o పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/634 104 219287 583790 572166 2026-10-07T05:45:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left margin|3em}}<poem>పున్నాగజాలకైర్హారాౝ కాంచీః కేసరదామభిః కర్ణికాః కర్ణికారైశ్చ విహర్తుం విదధుర్వనే.</poem>
ఆ యువతులు (వనదేవతలవలె) వనమున విహరించుటఁ బున్నాగజాలకములచే (సురపొన్నమొగ్గలు) హారములను, కేసరదామకములచే (పొగడదండలు) మొలనూలులను, కర్ణికారములచే (కొండగోఁగుపూలు) కర్ణికలను (చెవికమ్మలు) జేసికొనిరి. ఇట హారాదులు స్వతంత్రముగా వనవిహరణోపయోగులుగాక పున్నాగజాలకాది రూపమున నుపయోగపడుచున్నవి. హారాదు లేల స్వతంత్రముగా విహరణోపయోగులు గావు? అన్నచో నవి రతికేళియం దుపయోగపడును. కాని యిట యువతుల వనదేవతాస్వరూపముతోడి వనవిహరణమున కవి యుపయోగపడవు. కాన నిట నారోప్యమాణములగు హారాదులు జాతికాదిరూపమునఁ బరిణమించి యుపయోగించుచున్నవి. పున్నాగజాలకాద్యుపమేయములును హారాద్యుపమానములును భిన్నవిభక్తికములు. కాన వైయధికరణ్యపరిణామము. రూపకమునందును వైయధికరణ్యము గలదు. {{left margin|3em}}<poem>తారానాయకశేఖరాయ, జగదాధారాయ, ధారాధర ఛ్ఛాయాధారకకంధరాయ, గిరిజాసంగైకశృంగారిణే నద్యాశేఖరిణే, దృశాతిలకినే, నారాయణేనాస్త్రిణే, నాగైః కంకణినే, నగేన గృహిణే, నాధాయ సేయం నతిః.</poem>
చంద్రశేఖరుఁడును, జగదాధారుఁడును, నీలకంఠుఁడును, గిరిజాసంగతిచే శృంగారియు, నదిచే శేఖరియు (శేఖరము గలవాఁడు), కంటిచేఁ దిలకియు (తిలకము గలవాఁడు), నారాయణునిచే నస్త్రియు (అస్త్రము గలవాఁడు), సర్పములచేఁ గంకణియు ( కంకణములు గలవాఁడు), నగముచే గృహియు (గృహము గలవాఁడు) నగు నాథునకు నమస్కారము. ఇట నుత్తరార్థమున 'నద్యాశేఖరిణే' ఇత్యాదులు “నదీరూపశేఖరము గలవాఁడు; నేత్రరూపతిలకము గలవాఁడు, నారాయణరూపాస్త్రము గలవాఁడు, నాగరూపకంకణములు గలవాఁడు, నగరూపగృహము గలవాఁడు” అని రూపకములు. నదీ, దృక్, నారాయణ, నాగ, నగశబ్దము లుపమేయములు. శేఖర, తిలక, అస్త్ర, కంకణ, గృహశబ్దము లుపమానములు. ఇవి భిన్నవిభక్తికములు. కాన వైయధికరణ్యరూపకము. ఈ పరిణామాలంకారమును మమ్మటుఁ డుదాహరింపలేదు. దీనిని రూపకమునందే యంతర్భావము సేసిన ట్లగపడును.<noinclude><references/></noinclude> 4cl6g3sahqjnhp2fqpl17fc0q8siuws పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/635 104 219288 583791 572167 2026-10-07T05:58:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}7. సందేహము
{{Telugu poem|type=తే.|lines=<poem>విషయి, విషయంబుఁ, గవినుతి విహితసామ్య దీప్తసందేహ మొంద సందేహ; మదియు గరిమ శుధ్ధంబు, నిశ్చయగర్భితంబు నిశ్చయాంశంబు నగు; దీని నిశ్చయింతు.</poem>|ref=52}} ఉపమానోపమేయంబులు రెండును గవి ప్రతిభోత్థాపితమగు సాదృశ్యముచే సందేహింపఁబడినచో సందేహాలంకారము. వర్ణ్యమానమగు నుపమేయముయొక్క యుత్కర్షార్థమే యీ సందేహము పర్యవసన్నమగును. ఈ కనఁబడునది స్థాణువా? పురుషుఁడా? అనుచోటనున్న సందేహము వర్ణ్యోత్కర్షార్థము పర్యవసింపలేదు. కాన నిది సందేహాలంకారము గాదు. ఈ సందేహాలంకారము శుద్ధము, నిశ్చయగర్భము, నిశ్చయాంతము అని ముత్తెఱఁగులుగా నుండును. {{p|al|fwb}}శుద్ధసందేహము
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇంద్రుఁడొ? యాయుపేంద్రుఁడొ? బలీంద్రుఁడొ? పార్వణచంద్రుఁడో? హరి శ్చంద్రుడొ? రామచంద్రుఁడొ? రసాభరణప్రవణాత్ముఁ డైన నా గేంద్రుడొ? యానగేంద్రుఁడొ? మృగేంద్రుడొ? యంచుఁ దలంతు రార్యు లీ సాంద్రభుజప్రతాపరణసాహసు నోబయనారసింహునిన్.</poem>|ref=53}} పై సందేహాలంకారలక్షణమునఁ గవి ప్రతిభోత్థాపితమగు సాదృశ్యముచే నుపమానోపమేయములు సందేహింపఁబడవలెనని చెప్పితిమి. నరసభూపాలునిఁ జాచి “ఇంద్రుఁడా? ఉపేంద్రుఁడా?” మొదలగువిధమునఁ జేయఁబడిన సందేహమున సాదృశ్యము చెప్పఁబడలేదు. కొన్నియెడలఁ జెప్పఁబడినది. (నాగేంద్రుఁడొ? ఇత్యాదులందు రసాభరణప్రవణత్వాదులు సాదృశ్యము) కాన వేనికి సాదృశ్యము చెప్పబడలేదో వానికి సాదృశ్యమూహ్యము. ఎట్లన, భోగమున నింద్రుఁడో? కరుణయం దుపేంద్రుఁడో? ఇట్లు మిగిలిన వూహ్యములు. ఇది శుద్ధసందేహము. {{p|al|fwb}}నిశ్చయగర్భితసందేహము
{{Telugu poem|type=మ.|lines=<poem>హరుఁడో యీఘనుఁ? డైన మౌళిధృతతోయం బెద్ది? దైతేయసం హరుఁడో యీనృపుఁ? డైన నవ్విహగవాహం బెద్ది? వాణీమనో</poem>|ref=}}<noinclude><references/></noinclude> adnjl1mby088bq66h3gtifrjfxanavv 583793 583791 2026-10-07T06:03:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 583793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}7. సందేహము
{{Telugu poem|type=తే.|lines=<poem>విషయి, విషయంబుఁ, గవినుతి విహితసామ్య దీప్తసందేహ మొంద సందేహ; మదియు గరిమ శుధ్ధంబు, నిశ్చయగర్భితంబు నిశ్చయాంశంబు నగు; దీని నిశ్చయింతు.</poem>|ref=52}} ఉపమానోపమేయంబులు రెండును గవి ప్రతిభోత్థాపితమగు సాదృశ్యముచే సందేహింపఁబడినచో సందేహాలంకారము. వర్ణ్యమానమగు నుపమేయముయొక్క యుత్కర్షార్థమే యీ సందేహము పర్యవసన్నమగును. ఈ కనఁబడునది స్థాణువా? పురుషుఁడా? అనుచోటనున్న సందేహము వర్ణ్యోత్కర్షార్థము పర్యవసింపలేదు. కాన నిది సందేహాలంకారము గాదు. ఈ సందేహాలంకారము శుద్ధము, నిశ్చయగర్భము, నిశ్చయాంతము అని ముత్తెఱఁగులుగా నుండును. {{p|al|fwb}}1. శుద్ధసందేహము
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇంద్రుఁడొ? యాయుపేంద్రుఁడొ? బలీంద్రుఁడొ? పార్వణచంద్రుఁడో? హరి శ్చంద్రుడొ? రామచంద్రుఁడొ? రసాభరణప్రవణాత్ముఁ డైన నా గేంద్రుడొ? యానగేంద్రుఁడొ? మృగేంద్రుడొ? యంచుఁ దలంతు రార్యు లీ సాంద్రభుజప్రతాపరణసాహసు నోబయనారసింహునిన్.</poem>|ref=53}} పై సందేహాలంకారలక్షణమునఁ గవి ప్రతిభోత్థాపితమగు సాదృశ్యముచే నుపమానోపమేయములు సందేహింపఁబడవలెనని చెప్పితిమి. నరసభూపాలునిఁ జాచి “ఇంద్రుఁడా? ఉపేంద్రుఁడా?” మొదలగువిధమునఁ జేయఁబడిన సందేహమున సాదృశ్యము చెప్పఁబడలేదు. కొన్నియెడలఁ జెప్పఁబడినది. (నాగేంద్రుఁడొ? ఇత్యాదులందు రసాభరణప్రవణత్వాదులు సాదృశ్యము) కాన వేనికి సాదృశ్యము చెప్పబడలేదో వానికి సాదృశ్యమూహ్యము. ఎట్లన, భోగమున నింద్రుఁడో? కరుణయం దుపేంద్రుఁడో? ఇట్లు మిగిలిన వూహ్యములు. ఇది శుద్ధసందేహము. {{p|al|fwb}}2. నిశ్చయగర్భితసందేహము
{{Telugu poem|type=మ.|lines=<poem>హరుఁడో యీఘనుఁ? డైన మౌళిధృతతోయం బెద్ది? దైతేయసం హరుఁడో యీనృపుఁ? డైన నవ్విహగవాహం బెద్ది? వాణీమనో</poem>|ref=}}<noinclude><references/></noinclude> 77susfkt7y31mxrcsp0p0cctal578ql పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/636 104 219289 583795 572168 2026-10-07T06:18:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>హరుఁడో? యివ్విభుఁ? డైన సారసనివాసాధ్యాసనం బెద్ది? యం చు రసజ్ఞుల్ వినుతింతు రాత్మ నరసక్షోణీశు వీక్షించుచున్.</poem>|ref=54}} ఈ నరసభూపాలుడు హరుఁడా? అయినచో శిరస్సున గంగ యేది? శ్రీమహావిఃష్ణువా? అగుచో గరుడవాహన మేది? బ్రహ్మయా? పద్మాసన మేది? అనుచోట్ల నరసభూపాలుఁడు హరాది రూపమున మొదట సందేహింపఁబడి గంగాదులులేమిఁ గాఁడని నిశ్చయింపఁబడినను నరసభూపాలుఁడే యనియును వాగ్రూపమున నిశ్చయింపఁబడలేదు. కాన నిది నిశ్చయగర్భసందేహము. {{p|al|fwb}}3. నిశ్చయాంతసందేహము
{{Telugu poem|type=సీ.|lines=<poem>తలపోయ వల్లీమతల్లి కేగతిఁ గల్గె నలసాలసానూనయానకలన? భావింప మణిసాలభంజిక కెటు లబ్బె లాలితాలాపలీలాకలాప? మూహింప విమలవిద్యుల్లేఖ కేలీల నొదవె ధాత్రీభాగయోగగరిమ? మరయంగ మదనమంత్రాదిదేవతకు నే గతిఁ గల్గె నంగసంగప్రసంగ?</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మనుచు శబరులు సందియం బంది యంది తెలియుదురు తోనె నీధాటికలికితలఁకి యహితవనితలు వనవాటి నడలు చునికి నరనుతాటోప! యోబయనరసభూప!</poem>|ref=55}} శబరులు శత్రుకాంతలను గాంచి “లత యెట్లు నడవనేర్చినది? సాలభంజిక యెట్లు మాటలాడుచున్నది? మెఱపుఁదీఁగ యెట్లు నేలపైకి వచ్చినది? మదనమంత్రాధిదేవత శరీరము నెట్లు ధరించినది? అని సంశయించి నీ ధాటికి భయపడి తిరుగుచున్న శత్రుకాంతలని నిశ్చయించిరి. మొదట సందేహింపఁబడిన విషయము తుదికి నిశ్చయింపఁబడినది. కాన నిశ్చయాంతసందేహము. ఈ సందేహాలంకారమునకు ససందేహమనియు నామాంతరము.<noinclude><references/></noinclude> 5akwya5k10mjcldazk8wdwzxvkjnkuh పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/637 104 219290 583797 572169 2026-10-07T06:50:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583797 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}8. భ్రాంతిమంతము
{{Telugu poem|type=క.|lines=<poem>అల యుపమేయము ఛన్నత నలరఁగ, నారోప్యమాణ మగునుపమానం బిల నెఱుకపడగ భ్రాంతిమ దలంకరణ మయ్యె దీని నాపాదింతున్.</poem>|ref=56}} కవిసమ్మతమగు సాదృశ్యముచే నుపమేయము ఛన్నమై యుపమానముయొక్క యనుభవము గలిగినచో (ఉపమానం బిల నెఱుకపడఁగ) నది భ్రాంతిమంతము. {{Telugu poem|type=శా.|lines=<poem>చూడం జూడ నృసింహకీర్తిచయ మీక్షోణీనభోమధ్యమం దేడం జూచినఁ దానయై నెగడఁగా నీక్షించి మిన్నేట నీ రాడంబోయిన బేసితాపసులు మేలౌ; మ్రోల సిద్ధించెఁగా నాడం బోయినతీర్థ మంచు మదిలో హర్షింతు రశ్రాంతమున్.</poem>|ref=57}} నరసభూపాలుని కీర్తినిఁ జూచి యాకాశగంగలో స్నానమాడఁబోవుచున్న సప్తర్షులు ఆకాశగంగగానే తలంచి హర్షపడిరి. ఇటఁ గీర్తి యుపమేయము; ఆకాశగంగ యుపమానము. దానిఁ గాంచి హర్షపడుట యుపమానానుభావము. స్మరణాలంకారమన స్మరణమే కాని యనుభవము లేదు. ఇందు భ్రాంతిచేఁ గలుగు ననుభవముగూడ నిబద్ధమై యుండవలెను. "ఉ. అంకముఁ జేరి శైలతనయాస్తనదుగ్ధము” అనుచోటఁగూడ భ్రాంతిమంతమే. అన్యోన్యవిషయకభ్రాంతిమదలంకారము, ఉత్తరోత్తరభ్రాంతిమదలంకారము అని దీనిలో నవాంతరభేదములు గలవు. {{left margin|3em}}<poem>పలాశముకుళభ్రాంత్యా శుకతుండే పతత్యలిః సో౽పి జంబూఫలభ్రాంత్యా తమళిం ధర్తు మిచ్ఛతి.</poem>
తేఁటి మోదుగుపువ్వని భ్రమించి చిలుకముక్కుమీఁదఁ బడుచున్నది. అదియు నేరేడుపండని భ్రమించి యా తేఁటిని పట్ట నుంకించుచున్నది. ఇటఁ బరస్పరభ్రాంతి. {{left margin|3em}}<poem>చ. వదనసరోజవాసనకు వచ్చిన తేఁటి వదల్చి చూడఁగా నది యసితోత్పలంబులని యక్షుల వ్రాలఁగఁ, జేనిదుర్పఁగా నది మరలంబయోజమని హస్తయుగంబున వ్రాల నవ్వె న మ్మదవతి యేమి సేసినను మాన ది దేమియటంచు నెంతయుౝ.</poem>
ఒకజవరాలు తన ముఖగంధమునకై వచ్చిన తేఁటి నదలించి చూచెను. ఆ తేఁటి యా చూవులు నల్లగలువలని కన్నులమీఁద వ్రాలెను. మరల నామె చేయి<noinclude><references/></noinclude> n09oxtbc2kfkyzir0rw7r4e8uur8yot 583799 583797 2026-10-07T06:54:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 583799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}8. భ్రాంతిమంతము
{{Telugu poem|type=క.|lines=<poem>అల యుపమేయము ఛన్నత నలరఁగ, నారోప్యమాణ మగునుపమానం బిల నెఱుకపడగ భ్రాంతిమ దలంకరణ మయ్యె దీని నాపాదింతున్.</poem>|ref=56}} కవిసమ్మతమగు సాదృశ్యముచే నుపమేయము ఛన్నమై యుపమానముయొక్క యనుభవము గలిగినచో (ఉపమానం బిల నెఱుకపడఁగ) నది భ్రాంతిమంతము. {{Telugu poem|type=శా.|lines=<poem>చూడం జూడ నృసింహకీర్తిచయ మీక్షోణీనభోమధ్యమం దేడం జూచినఁ దానయై నెగడఁగా నీక్షించి మిన్నేట నీ రాడంబోయిన బేసితాపసులు మేలౌ; మ్రోల సిద్ధించెఁగా నాడం బోయినతీర్థ మంచు మదిలో హర్షింతు రశ్రాంతమున్.</poem>|ref=57}} నరసభూపాలుని కీర్తినిఁ జూచి యాకాశగంగలో స్నానమాడఁబోవుచున్న సప్తర్షులు ఆకాశగంగగానే తలంచి హర్షపడిరి. ఇటఁ గీర్తి యుపమేయము; ఆకాశగంగ యుపమానము. దానిఁ గాంచి హర్షపడుట యుపమానానుభావము. స్మరణాలంకారమన స్మరణమే కాని యనుభవము లేదు. ఇందు భ్రాంతిచేఁ గలుగు ననుభవముగూడ నిబద్ధమై యుండవలెను. "ఉ. అంకముఁ జేరి శైలతనయాస్తనదుగ్ధము” అనుచోటఁగూడ భ్రాంతిమంతమే. అన్యోన్యవిషయకభ్రాంతిమదలంకారము, ఉత్తరోత్తరభ్రాంతిమదలంకారము అని దీనిలో నవాంతరభేదములు గలవు. {{left margin|3em}}<poem>పలాశముకుళభ్రాంత్యా శుకతుండే పతత్యలిః సో౽పి జంబూఫలభ్రాంత్యా తమళిం ధర్తు మిచ్ఛతి.</poem>
తేఁటి మోదుగుపువ్వని భ్రమించి చిలుకముక్కుమీఁదఁ బడుచున్నది. అదియు నేరేడుపండని భ్రమించి యా తేఁటిని పట్ట నుంకించుచున్నది. ఇటఁ బరస్పరభ్రాంతి. {{left margin|3em}}<poem>చ. వదనసరోజవాసనకు వచ్చిన తేఁటి నదల్చి చూడఁగా నది యసితోత్పలంబులని యక్షుల వ్రాలఁగఁ, జేనిదుర్పఁగా నది మరలంబయోజమని హస్తయుగంబున వ్రాల నవ్వె న మ్మదవతి యేమి సేసినను మాన ది దేమియటంచు నెంతయుౝ.</poem>
ఒకజవరాలు తన ముఖగంధమునకై వచ్చిన తేఁటి నదలించి చూచెను. ఆ తేఁటి యా చూవులు నల్లగలువలని కన్నులమీఁద వ్రాలెను. మరల నామె చేయి<noinclude><references/></noinclude> mh0acrl7te8t2u8vj0mhkixcuh03cei పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/638 104 219291 583800 572170 2026-10-07T07:18:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583800 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విదిలింపఁగా నది యా చేతినిఁ దామరపువ్వని బ్రమసి దానిపై వ్రాలెను. అంత నామె యేమి చేసినను నిది మానదని నవ్వెను. ఇట నుత్తరోత్తరభ్రాంతి నిబద్ధము. ఈ రెంటనుగూడ భ్రాంతిచేఁ గలిగిన యనుభవము నిబద్ధమైయున్నది. {{p|ac|fwb}}9. అపహ్నుతి
{{Telugu poem|type=క.|lines=<poem>ఉపమేయము గా దని యిది యుపమానమె యనఁగ నెంతయు నపహ్నవమౌ; నపు డది ప్రాగారోపము నపహ్నవారోపమును, ఛలాదియు నయ్యెన్.</poem>|ref=58}} ఇది యుపమేయము (ముఖాదులు) గాదు. ఉపమానమే (చందాదులే) అని చెప్పినచో నది యపహ్నవాలంకారము. అది ప్రాగారోపము ― అనఁగా నారోపించి యపహ్నవించుట; ఆపహ్నవారోపము ― అనఁగా నపహ్నవించి యారోపించుట; ఆకృతి, ఛల, మిష, కైతవాది పదప్రయోగము సేయుట; అని యీ విధముగాఁ ద్రివిధము. {{Telugu poem|type=మ.|lines=<poem>గురుచక్రప్రభగాని శౌర్యసుషమాంకూరంబుగా; దిందుభా స్వరకీర్తిద్యుతిపంక్తి గాదు నిబిడాంచత్పాంచజన్యప్రభా భర మౌఁగా; నటుగాన విశ్వభరణప్రారంభముం గోరి యీ నరసేంద్రాకృతి నుద్భవించెఁ గమలానాథుండు విశ్వంభరన్.</poem>|ref=59}} శౌర్యసుషమాంకూరమును గాంచి “యిది చక్రప్రభగాని శౌర్యసుషమాంకూరంబు గాదు” అని శౌర్యనుషమాంకూరమునందు మొదటఁ జక్రప్రభ నారోపించి పిమ్మట "శౌర్యసుషమాంకూరంబు గాదు” అని యపహ్నవింపఁబడినది. ఇది ప్రాగారోపము. 'ఇది కీర్తిద్యుతి గాదు. ‘పాంచజన్యప్రభ’ అనుచో ముం దపహ్నవమును, పిమ్మట నారోపమును జెప్పఁబడినది. ఇది యపహ్నవారోపము. ‘నరసేంద్రాకృతి' ఆకృతి పదము ప్రయుక్తమై యున్నది. ఈ త్రివిధములందును నుపమేయ మపహ్నవింపఁబడి యది యుపమానమే యని తెలుపఁబడినది. {{p|ac|fwb}}10. ఉల్లేఖము
{{Telugu poem|type=క.|lines=<poem>అలరఁగ గ్రహీతృభేదం బుల నొకటియె పెక్కురూపముల నెడనెడలం</poem>|ref=}}<noinclude><references/></noinclude> k15ltt0wje3f6fv04p8ogxxyb2z6upj 583801 583800 2026-10-07T07:39:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 583801 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విదిలింపఁగా నది యా చేతినిఁ దామరపువ్వని బ్రమసి దానిపై వ్రాలెను. అంత నామె యేమి చేసినను నిది మానదని నవ్వెను. ఇట నుత్తరోత్తరభ్రాంతి నిబద్ధము. ఈ రెంటనుగూడ భ్రాంతిచేఁ గలిగిన యనుభవము నిబద్ధమైయున్నది. {{p|ac|fwb}}9. అపహ్నుతి
{{Telugu poem|type=క.|lines=<poem>ఉపమేయము గా దని యిది యుపమానమె యనఁగ నెంతయు నపహ్నవమౌ; నపు డది ప్రాగారోపము నపహ్నవారోపమును, ఛలాదియు నయ్యెన్.</poem>|ref=58}} ఇది యుపమేయము (ముఖాదులు) గాదు. ఉపమానమే (చందాదులే) అని చెప్పినచో నది యపహ్నవాలంకారము. అది ప్రాగారోపము ― అనఁగా నారోపించి యపహ్నవించుట; అపహ్నవారోపము ― అనఁగా నపహ్నవించి యారోపించుట; ఆకృతి, ఛల, మిష, కైతవాది పదప్రయోగము సేయుట; అని యీ విధముగాఁ ద్రివిధము. {{Telugu poem|type=మ.|lines=<poem>గురుచక్రప్రభగాని శౌర్యసుషమాంకూరంబుగా; దిందుభా స్వరకీర్తిద్యుతిపంక్తి గాదు నిబిడాంచత్పాంచజన్యప్రభా భర మౌఁగా; నటుగాన విశ్వభరణప్రారంభముం గోరి యీ నరసేంద్రాకృతి నుద్భవించెఁ గమలానాథుండు విశ్వంభరన్.</poem>|ref=59}} శౌర్యసుషమాంకూరమును గాంచి “యిది చక్రప్రభగాని శౌర్యసుషమాంకూరంబు గాదు” అని శౌర్యనుషమాంకూరమునందు మొదటఁ జక్రప్రభ నారోపించి పిమ్మట "శౌర్యసుషమాంకూరంబు గాదు” అని యపహ్నవింపఁబడినది. ఇది ప్రాగారోపము. 'ఇది కీర్తిద్యుతి గాదు. ‘పాంచజన్యప్రభ’ అనుచో ముం దపహ్నవమును, పిమ్మట నారోపమును జెప్పఁబడినది. ఇది యపహ్నవారోపము. ‘నరసేంద్రాకృతి' ఆకృతి పదము ప్రయుక్తమై యున్నది. ఈ త్రివిధములందును నుపమేయ మపహ్నవింపఁబడి యది యుపమానమే యని తెలుపఁబడినది. {{p|ac|fwb}}10. ఉల్లేఖము
{{Telugu poem|type=క.|lines=<poem>అలరఁగ గ్రహీతృభేదం బుల నొకటియె పెక్కురూపముల నెడనెడలం</poem>|ref=}}<noinclude><references/></noinclude> 7i26bocx11eh2ykx2cc1euj8ky1fze2 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/639 104 219292 583802 572171 2026-10-07T08:16:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583802 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దలపోయఁగ నుల్లేఖం బలంకరణరాజ మయ్యె నది యెట్లన్నన్.</poem>|ref=60}} గ్రహీతృభేదముచే నొకేవస్తువు పెక్కురూపములతో గ్రహింపఁబడినచో నుల్లేఖము. {{Telugu poem|type=క.|lines=<poem>బాణుఁ డని బుధులు; మురజి ద్బాణుం డని విమతభూమిపాలురు, సుమనో బాణుఁ డని సతులు, దలఁపుదు రేణాంకసమాను నోబళేంద్రు నృసింహున్.</poem>|ref=61}} ఒకే నరసభూపాలుఁ డిటఁ బెక్కండ్రచేఁ బెక్కువిధముల గ్రహింపఁబడెను. {{left margin|3em}}<poem>"గ్రహీతృభేదాభావే౽పి విషయాశ్రయ భేదతః ఏకస్యానేకధోల్లేఖ మప్యుల్లేఖం ప్రచక్షతే”</poem>
గ్రహీతృభేదము లేకున్నను విషయభేదమును బట్టి యొకవస్తు వనేకవిధములుగా వర్ణింపఁబడినను నుల్లేఖమే. {{left margin|3em}}<poem>మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండముౝ నిండుచోౝ.</poem>
ఇట గ్రహీతృభేదము లేదు. ఒకేసూర్యుఁడు విషయము నాశ్రయించిన భేదముచే నానావిధములుగ వర్ణింపఁబడెను. {{p|ac|fwb}}11.
ఉత్ప్రేక్ష {{Telugu poem|type=క.|lines=<poem>ఉపమేయమునకుఁ గలిగిన యుపమానగుణక్రియాదియోగముచే నా యుపమానమె యని తలఁచిన నపు డది యుత్ప్రేక్ష యయ్యె; నదియును ధరణిన్.</poem>|ref=62}} {{left margin|3em}}<poem>"యత్రా౽న్యధర్మసంబంధా దన్యత్వేనోపతర్కితం ప్రకృతం హి భవేత్ప్రజ్ఞాస్తాముత్ప్రేక్షాం ప్రచక్షతే.”</poem>
అనుదానికిఁ బై పద్య మాంధ్రీకరణము, ఉపమానముయొక్క (అప్రకృతము లేక అన్యము) గుణము, క్రియ వెంబడ మదలగువాని సంబంధముచే నుపమేయము (ప్రకృ<noinclude><references/></noinclude> ng0vt0dmf7gktyrs99l3ygdr7gt5cnq 583803 583802 2026-10-07T08:16:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 583803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దలపోయఁగ నుల్లేఖం బలంకరణరాజ మయ్యె నది యెట్లన్నన్.</poem>|ref=60}} గ్రహీతృభేదముచే నొకేవస్తువు పెక్కురూపములతో గ్రహింపఁబడినచో నుల్లేఖము. {{Telugu poem|type=క.|lines=<poem>బాణుఁ డని బుధులు; మురజి ద్బాణుం డని విమతభూమిపాలురు, సుమనో బాణుఁ డని సతులు, దలఁపుదు రేణాంకసమాను నోబళేంద్రు నృసింహున్.</poem>|ref=61}} ఒకే నరసభూపాలుఁ డిటఁ బెక్కండ్రచేఁ బెక్కువిధముల గ్రహింపఁబడెను. {{left margin|3em}}<poem>"గ్రహీతృభేదాభావే౽పి విషయాశ్రయ భేదతః ఏకస్యానేకధోల్లేఖ మప్యుల్లేఖం ప్రచక్షతే”</poem>
గ్రహీతృభేదము లేకున్నను విషయభేదమును బట్టి యొకవస్తు వనేకవిధములుగా వర్ణింపఁబడినను నుల్లేఖమే. {{left margin|3em}}<poem>మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండముౝ నిండుచోౝ.</poem>
ఇట గ్రహీతృభేదము లేదు. ఒకేసూర్యుఁడు విషయము నాశ్రయించిన భేదముచే నానావిధములుగ వర్ణింపఁబడెను. {{p|ac|fwb}}11. ఉత్ప్రేక్ష
{{Telugu poem|type=క.|lines=<poem>ఉపమేయమునకుఁ గలిగిన యుపమానగుణక్రియాదియోగముచే నా యుపమానమె యని తలఁచిన నపు డది యుత్ప్రేక్ష యయ్యె; నదియును ధరణిన్.</poem>|ref=62}} {{left margin|3em}}<poem>"యత్రా౽న్యధర్మసంబంధా దన్యత్వేనోపతర్కితం ప్రకృతం హి భవేత్ప్రజ్ఞాస్తాముత్ప్రేక్షాం ప్రచక్షతే.”</poem>
అనుదానికిఁ బై పద్య మాంధ్రీకరణము, ఉపమానముయొక్క (అప్రకృతము లేక అన్యము) గుణము, క్రియ వెంబడ మదలగువాని సంబంధముచే నుపమేయము (ప్రకృ<noinclude><references/></noinclude> kbdlzivl04a5256ymhgek4b2rcx2hmk 583804 583803 2026-10-07T08:18:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 583804 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దలపోయఁగ నుల్లేఖం బలంకరణరాజ మయ్యె నది యెట్లన్నన్.</poem>|ref=60}} గ్రహీతృభేదముచే నొకేవస్తువు పెక్కురూపములతో గ్రహింపఁబడినచో నుల్లేఖము. {{Telugu poem|type=క.|lines=<poem>బాణుఁ డని బుధులు; మురజి ద్బాణుం డని విమతభూమిపాలురు, సుమనో బాణుఁ డని సతులు, దలఁపుదు రేణాంకసమాను నోబళేంద్రు నృసింహున్.</poem>|ref=61}} ఒకే నరసభూపాలుఁ డిటఁ బెక్కండ్రచేఁ బెక్కువిధముల గ్రహింపఁబడెను. {{left margin|3em}}<poem>"గ్రహీతృభేదాభావే౽పి విషయాశ్రయ భేదతః ఏకస్యానేకధోల్లేఖ మప్యుల్లేఖం ప్రచక్షతే”</poem>
గ్రహీతృభేదము లేకున్నను విషయభేదమును బట్టి యొకవస్తు వనేకవిధములుగా వర్ణింపఁబడినను నుల్లేఖమే. {{left margin|3em}}<poem>మ. రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై శ్రవణాలంకృతియై, గళాభరణమై, సౌవర్ణకేయూరమై ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచద్ఘంటయై, నూపుర ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండముౝ నిండుచోౝ.</poem>
ఇట గ్రహీతృభేదము లేదు. ఒకేసూర్యుఁడు విషయము నాశ్రయించిన భేదముచే నానావిధములుగ వర్ణింపఁబడెను. {{p|ac|fwb}}11. ఉత్ప్రేక్ష
{{Telugu poem|type=క.|lines=<poem>ఉపమేయమునకుఁ గలిగిన యుపమానగుణక్రియాదియోగముచే నా యుపమానమె యని తలఁచిన నపు డది యుత్ప్రేక్ష యయ్యె; నదియును ధరణిన్.</poem>|ref=62}} {{left margin|3em}}<poem>"యత్రా౽న్యధర్మసంబంధా దన్యత్వేనోపతర్కితం ప్రకృతం హి భవేత్ప్రజ్ఞాస్తాముత్ప్రేక్షాం ప్రచక్షతే.”</poem>
అనుదానికిఁ బై పద్య మాంధ్రీకరణము, ఉపమానముయొక్క (అప్రకృతము లేక అన్యము) గుణము, క్రియ వెంబడ మొదలగువాని సంబంధముచే నుపమేయము (ప్రకృ<noinclude><references/></noinclude> bpqjrrru1gfaf0u87shty302ubfvxle పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/640 104 219293 583806 572172 2026-10-07T08:54:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583806 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>తము) ఉపమానముగానే (అప్రకృతముగానే లేక యన్యముగానే) తర్కింపఁబడినచో నది యుత్ప్రేక్ష యనఁబడును. ఉత్ప్రేక్ష యధ్యవసాయగర్భము. అధ్యవసాయమన నభేదప్రతిపత్తి. అనఁగాఁ బ్రకృతాప్రకృతములకు నభేదజ్ఞానము. కాఁబట్టి యిటఁ బ్రకృతమున కప్రకృతదాత్మ్యసంభావన (ఊహ) సేయఁబడును. అనఁగాఁ బ్రకృత మప్రకృతముగానే తర్కింపఁబడును. ఉత్ప్రేక్షయందుఁ బ్రకృతమున కప్రకృతాదాత్మ్యసంభావన యుండునన్నమాట స్మృతియందుంచుకొనవలెను. తాదాత్మ్యమన్నను నధ్యవసాయమన్న నొకటియే. {{Telugu poem|type=క.|lines=<poem>క్రమమున వాచ్యయును బ్రతీ యమానయును నగుచు ద్వివిధ యగు; వాచకశ బ్దము గలుగ వాచ్య యనఁ దగు; నమరఁగ లేనియెడ గమ్య యనఁదగు వరుసన్.</poem>|ref=63}} ఆ యుత్ప్రేక్ష వాద్య, గమ్య అని ద్వివిధము. సంభావనాప్రతిపాదకము లైన (ఊహను లేక వితర్కమును దెలుపు పదములు) నూనము, ధ్రువము, ప్రాయము, అనేకా, శంకించు, కాఁబోలు, ఊహించు, భావించు, అనుమానించు మొదలగు పదములను బ్రయోగించుటచే వాచ్య యనియు, నట్టి పదములు లేనిచో గమ్య యనియుఁ జెప్పఁబడును. {{Telugu poem|type=సీ.|lines=<poem>అలరెడు నీరెంటియందు జాతిగుణక్రి యాద్రవ్యము లవాచ్యయబ్ధిసంఖ్య; అవి నాల్గు వరుస భావాభావములఁ జెంద నిల వసుసంఖ్య; యాయెనిమిదియును నిరువదినాలుగౌ హేతు, ఫల, స్వరూ పముల వేర్వేఱఁ ద్రిభంగిఁ జెంద; నందు నెన్మిది యెన్మి దగుహేతువు, ఫలంబు, నలరు వాచ్యగుణక్రియానిమిత్త</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ములఁ బదాఱు పదాఱు నౌ; నలస్వరూప గతనిమిత్తంబులకు వాచ్యగమ్యగతులు గాగఁ బదియాఱు నగువాచ్యస్వరూప; మరయ గమ్యస్వరూప మష్టాఖ్యయయ్యె.</poem>|ref=64}}<noinclude><references/></noinclude> 8qzr1n2wjq3aoc7kqm6chk6q6z8gw03 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/641 104 219294 583812 572173 2026-10-07T11:11:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583812 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ వాచ్యా, గమ్యాభేదములలో వాచ్య, ఉపమానపదము జాతివాచకమని గుణవాచకమని క్రియావాచకమని ద్రవ్యవాచకమనియు భేదములు సహించియుంట నాలుగువిధములు (అనఁగా జాత్యుత్ప్రేక్ష, గుణోత్ప్రేక్ష, క్రియోత్ప్రేక్ష, ద్రవ్యోత్ప్రేక్ష.) శబ్దము జాతి గుణ క్రియా ద్రవ్య వాచకభేదముచేఁ జతుర్విధమని తెలిపితిమి. ఈ చతుర్విధోత్ప్రేక్షయు భావము, అభావము, అను భేదములనుబట్టి యెనిమిదిభేదములు (జాతిభావోత్ప్రేక్ష, జాత్యభావోత్ప్రేక్ష మొ.) ఈయెనిమిదిభేదములలో నొక్కొక్కటియు హేతువుగా, ఫలముగా, స్వరూపముగా నుత్ప్రేక్షింపఁబడినచో నిఱువదినాలుగుభేదము లగును (జాతిహేతూత్ప్రేక్ష, జాత్యభావహేతూత్ప్రేక్ష మొ.) ఇందు హేతూత్ప్రేక్ష లెనిమిదియు, పలోత్ప్రేక్ష లెనిమిదియు గుణ, క్రియా, నిమిత్తభేదములను బట్టి యొక్కొక్కటియుఁ బదునాఱుభేదములు గాన మొత్తము ముప్పదిరెండుభేదము లగును. ఇక స్వరూపోత్ప్రేక్షలో నిమిత్తములు (గుణ, క్రియలు) వాచ్యమనియును, గమ్యమనియును ద్వివిధము. అనఁగా స్వరూపోత్ప్రేక్ష యుపాత్తనిమిత్త యనియు, ననుపాత్తనిమిత్త యనియును ద్వివిధము. ఉపాత్తనిమిత్త యగు నష్టవిధస్వరూపోత్ప్రేక్ష గుణ, క్రియా నిమిత్తద్వయభేదమును బట్టి పదునాఱుభేదము లగును. అనుపాత్తనిమిత్త యెనిమిదిభేదములే యగును. ఏలన, వనపాత్రనిమిత్తలో గుణ క్రియా భేదము లుండవు. అనఁగా ననుపాత్తగుణనిమిత్త, అనుపాత్తక్రియానిమిత్త అను భేదము లుండవు. అట్లు భేదము సూపుట పుట్టనివానికిఁ బేరు పెట్టుటవంటిది. మొత్తము వాచ్యోత్ప్రేక్ష 56 విధములు (హేతూత్ప్రేక్ష 16 విధములు; ఫలోత్ప్రేక్ష 16 విధములు; ఉపాత్తనిమిత్తస్వరూపోత్ప్రేక్ష 16 విధములు; అనుపాత్తనిమిత్తస్వరూపోత్ప్రేక్ష 8 విధములు.) {{Telugu poem|type=క.|lines=<poem>అల హేతు, ఫల, నిమిత్తం బులకుౝ గమ్యత్వమైన భువిహేతుఫలం బులు లేక రుచిర మగునని యలవడ గమ్యత్వ మిందు నగదిత మయ్యెన్.</poem>|ref=65}} (లేక + అరుచిరము). పై వివరణమున స్వరూపోత్ప్రేక్షకే యనుపాత్తనిమిత్త (గమ్యనిమిత్త), ఉపాత్తనిమిత్త (వాచ్యనిమిత్త) యను భేదములు తెలిపితిమి. కాని హేతుఫలోత్ప్రేక్షల కీ భేదములు దెలుపలేదు. ఏలయన, హేతూత్ప్రేక్షలో నిమిత్తము ఫలము; ఫలోత్ప్రేక్షలో నిమిత్తము హేతువు; ఇవి చెప్పఁబడకున్నచో<noinclude><references/></noinclude> onlpeo7uu3hc7w49kzngdmo7tq1ciea 583814 583812 2026-10-07T11:20:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 583814 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ వాచ్యా, గమ్యాభేదములలో వాచ్య, ఉపమానపదము జాతివాచకమని గుణవాచకమని క్రియావాచకమని ద్రవ్యవాచకమనియు భేదములు సహించియుంట నాలుగువిధములు (అనఁగా జాత్యుత్ప్రేక్ష, గుణోత్ప్రేక్ష, క్రియోత్ప్రేక్ష, ద్రవ్యోత్ప్రేక్ష.) శబ్దము జాతి గుణ క్రియా ద్రవ్య వాచకభేదముచేఁ జతుర్విధమని తెలిపితిమి. ఈ చతుర్విధోత్ప్రేక్షయు భావము, అభావము, అను భేదములనుబట్టి యెనిమిదిభేదములు (జాతిభావోత్ప్రేక్ష, జాత్యభావోత్ప్రేక్ష మొ.) ఈయెనిమిదిభేదములలో నొక్కొక్కటియు హేతువుగా, ఫలముగా, స్వరూపముగా నుత్ప్రేక్షింపఁబడినచో నిఱువదినాలుగుభేదము లగును (జాతిహేతూత్ప్రేక్ష, జాత్యభావహేతూత్ప్రేక్ష మొ.) ఇందు హేతూత్ప్రేక్ష లెనిమిదియు, ఫలోత్ప్రేక్ష లెనిమిదియు గుణ, క్రియా, నిమిత్తభేదములను బట్టి యొక్కొక్కటియుఁ బదునాఱుభేదములు గాన మొత్తము ముప్పదిరెండుభేదము లగును. ఇక స్వరూపోత్ప్రేక్షలో నిమిత్తములు (గుణ, క్రియలు) వాచ్యమనియును, గమ్యమనియును ద్వివిధము. అనఁగా స్వరూపోత్ప్రేక్ష యుపాత్తనిమిత్త యనియు, ననుపాత్తనిమిత్త యనియును ద్వివిధము. ఉపాత్తనిమిత్త యగు నష్టవిధస్వరూపోత్ప్రేక్ష గుణ, క్రియా నిమిత్తద్వయభేదమును బట్టి పదునాఱుభేదము లగును. అనుపాత్తనిమిత్త యెనిమిదిభేదములే యగును. ఏలన, వనపాత్రనిమిత్తలో గుణ క్రియా భేదము లుండవు. అనఁగా ననుపాత్తగుణనిమిత్త, అనుపాత్తక్రియానిమిత్త అను భేదము లుండవు. అట్లు భేదము సూపుట పుట్టనివానికిఁ బేరు పెట్టుటవంటిది. మొత్తము వాచ్యోత్ప్రేక్ష 56 విధములు (హేతూత్ప్రేక్ష 16 విధములు; ఫలోత్ప్రేక్ష 16 విధములు; ఉపాత్తనిమిత్తస్వరూపోత్ప్రేక్ష 16 విధములు; అనుపాత్తనిమిత్తస్వరూపోత్ప్రేక్ష 8 విధములు.) {{Telugu poem|type=క.|lines=<poem>అల హేతు, ఫల, నిమిత్తం బులకుౝ గమ్యత్వమైన భువిహేతుఫలం బులు లేక రుచిర మగునని యలవడ గమ్యత్వ మిందు నగదిత మయ్యెన్.</poem>|ref=65}} (లేక + అరుచిరము). పై వివరణమున స్వరూపోత్ప్రేక్షకే యనుపాత్తనిమిత్త (గమ్యనిమిత్త), ఉపాత్తనిమిత్త (వాచ్యనిమిత్త) యను భేదములు తెలిపితిమి. కాని హేతుఫలోత్ప్రేక్షల కీ భేదములు దెలుపలేదు. ఏలయన, హేతూత్ప్రేక్షలో నిమిత్తము ఫలము; ఫలోత్ప్రేక్షలో నిమిత్తము హేతువు; ఇవి చెప్పఁబడకున్నచో<noinclude><references/></noinclude> 6d5p881k3cuoqcgpyg3fzg98yjze57l 583816 583814 2026-10-07T11:35:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 583816 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ వాచ్యా, గమ్యాభేదములలో వాచ్య, ఉపమానపదము జాతివాచకమని గుణవాచకమని క్రియావాచకమని ద్రవ్యవాచకమనియు భేదములు సహించియుంట నాలుగువిధములు (అనఁగా జాత్యుత్ప్రేక్ష, గుణోత్ప్రేక్ష, క్రియోత్ప్రేక్ష, ద్రవ్యోత్ప్రేక్ష.) శబ్దము జాతి గుణ క్రియా ద్రవ్య వాచకభేదముచేఁ జతుర్విధమని తెలిపితిమి. ఈ చతుర్విధోత్ప్రేక్షయు భావము, అభావము, అను భేదములనుబట్టి యెనిమిదిభేదములు (జాతిభావోత్ప్రేక్ష, జాత్యభావోత్ప్రేక్ష మొ.) ఈయెనిమిదిభేదములలో నొక్కొక్కటియు హేతువుగా, ఫలముగా, స్వరూపముగా నుత్ప్రేక్షింపఁబడినచో నిఱువదినాలుగుభేదము లగును (జాతిహేతూత్ప్రేక్ష, జాత్యభావహేతూత్ప్రేక్ష మొ.) ఇందు హేతూత్ప్రేక్ష లెనిమిదియు, ఫలోత్ప్రేక్ష లెనిమిదియు గుణ, క్రియా, నిమిత్తభేదములను బట్టి యొక్కొక్కటియుఁ బదునాఱుభేదములు గాన మొత్తము ముప్పదిరెండుభేదము లగును. ఇక స్వరూపోత్ప్రేక్షలో నిమిత్తములు (గుణ, క్రియలు) వాచ్య మనియును, గమ్య మనియును ద్వివిధము. అనఁగా స్వరూపోత్ప్రేక్ష యుపాత్తనిమిత్త యనియు, ననుపాత్తనిమిత్త యనియును ద్వివిధము. ఉపాత్తనిమిత్త యగు నష్టవిధస్వరూపోత్ప్రేక్ష గుణ, క్రియా నిమిత్తద్వయభేదమును బట్టి పదునాఱుభేదము లగును. అనుపాత్తనిమిత్త యెనిమిదిభేదములే యగును. ఏలన, ననుపాత్రనిమిత్తలో గుణ క్రియా భేదము లుండవు. అనఁగా ననుపాత్తగుణనిమిత్త, అనుపాత్తక్రియానిమిత్త అను భేదము లుండవు. అట్లు భేదము సూపుట పుట్టనివానికిఁ బేరు పెట్టుటవంటిది. మొత్తము వాచ్యోత్ప్రేక్ష 56 విధములు (హేతూత్ప్రేక్ష 16 విధములు; ఫలోత్ప్రేక్ష 16 విధములు; ఉపాత్తనిమిత్తస్వరూపోత్ప్రేక్ష 16 విధములు; అనుపాత్తనిమిత్తస్వరూపోత్ప్రేక్ష 8 విధములు.) {{Telugu poem|type=క.|lines=<poem>అల హేతు, ఫల, నిమిత్తం బులకుౝ గమ్యత్వమైన భువిహేతుఫలం బులు లేక రుచిర మగునని యలవడ గమ్యత్వ మిందు నగదిత మయ్యెన్.</poem>|ref=65}} (లేక + అరుచిరము). పై వివరణమున స్వరూపోత్ప్రేక్షకే యనుపాత్తనిమిత్త (గమ్యనిమిత్త), ఉపాత్తనిమిత్త (వాచ్యనిమిత్త) యను భేదములు తెలిపితిమి. కాని హేతుఫలోత్ప్రేక్షల కీ భేదములు దెలుపలేదు. ఏలయన, హేతూత్ప్రేక్షలో నిమిత్తము ఫలము; ఫలోత్ప్రేక్షలో నిమిత్తము హేతువు; ఇవి చెప్పఁబడకున్నచో<noinclude><references/></noinclude> hqaspd7hy39cnh6ajfntp9k0bu124o2 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/642 104 219295 583819 572174 2026-10-07T11:53:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 583819 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నుత్ప్రేక్ష యసుందరము. కాన హేతుఫలోత్ప్రేక్షలలో ననుపాత్తనిమిత్తభేదము లేదు. కానఁ జెప్పఁబడలేదు. {{Telugu poem|type=క.|lines=<poem>కావున నేఁబదియా ఱగు నావాచ్యోత్ప్రేక్ష; గమ్య యటువలెనే భే దావహ మగును; నిమిత్త ద్వైవిధ్యమునందు గమ్యదాస్థితిలేమిన్.</poem>|ref=66}} {{Telugu poem|type=క.|lines=<poem>హేతుస్వరూపఫలములు నాతతగతి నెన్మిదెన్మిదయి యవియు నిమి త్తాతివ్యాప్తిఁ బదాఱుగ నేతఱి గమ్యయును నల్వదెనిమిది యయ్యెన్.</poem>|ref=67}} కావున వాచ్యోత్ప్రేక్ష యేఁబదియాఱు భేదములు గలది. గమ్యోత్ప్రేక్ష నలుబదెనిమిదిభేదములు మాత్రమే గలది. ఎట్లన, వాచ్యోత్ప్రేక్షవలెనే గమ్యోత్ప్రేక్షయు జాతి, గుణ, క్రియా, ద్రవ్య భేదములచేఁ దొలుత నాలుగుభేదములు. అవి భావాభావములచే నెనిమిదిభేదములు. వానిని హేతువుగా, ఫలముగా, స్వరూపముగా నుత్ప్రేక్షించినచో మూఁడెనిమిదు లిఱువదినాలుగుభేదము లగును. అవియు గుణ క్రియా నిమిత్త ద్వైవిధ్యముచే నలువదెనిమిదిభేదము లగును. వాచ్యమగు స్వరూపోత్ప్రేక్షలోనే కాని గమ్యమగు స్వరూపోత్ప్రేక్షలో ననుపాత్తనిమిత్త యుండదు. ఏలన, గమ్యోత్ప్రేక్షయందు సంభావనాప్రతిపాదకపదము ప్రయోగింపఁబడదని చెప్పియుంటిమి. సంభావనావాచకమును బ్రయోగింపకయు నిమిత్తమును బ్రయోగింపకయు సున్నచో నుత్ప్రేక్షయే యసంభవము. కాన గమ్యోత్ప్రేక్షలో ననుపాత్తనిమిత్త యుండదు. వాచ్యోత్ప్రేక్షా గమ్యోత్ప్రేక్షలు వెరసి తొంబదియాఱు. {{Telugu poem|type=వ.|lines=<poem>ఇందు నేఁబదియాఱుభేదంబులం బొల్చు వాచ్యోత్ప్రేక్షకుం గొన్నినామధేయంబు లెఱింగించెద. 1. ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షయు, 2. ఉపాత్తక్రియానిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షయు, 3. ఉపాత్తగుణనిమిత్తజాత్యభావస్వరూపోత్ప్రేక్షయు, 4. ఉపాత్తక్రియానిమిత్తజాత్యభావస్వరూపోత్ప్రేక్షయు, 5. అనుపాత్తనిమిత్తజాతిభావస్వరూ</poem>|ref=}}<noinclude><references/></noinclude> 6q09y2vd3zd4zsxpuvawbeykqisc53a 583822 583819 2026-10-07T11:56:43Z దేవీప్రసాదశాస్త్రి 4290 583822 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నుత్ప్రేక్ష యసుందరము. కాన హేతుఫలోత్ప్రేక్షలలో ననుపాత్తనిమిత్తభేదము లేదు. కానఁ జెప్పఁబడలేదు. {{Telugu poem|type=క.|lines=<poem>కావున నేఁబదియా ఱగు నావాచ్యోత్ప్రేక్ష; గమ్య యటువలెనే భే దావహ మగును; నిమిత్త ద్వైవిధ్యమునందు గమ్యదాస్థితిలేమిన్.</poem>|ref=66}} {{Telugu poem|type=క.|lines=<poem>హేతుస్వరూపఫలములు నాతతగతి నెన్మిదెన్మిదయి యవియు నిమి త్తాతివ్యాప్తిఁ బదాఱుగ నేతఱి గమ్యయును నల్వదెనిమిది యయ్యెన్.</poem>|ref=67}} కావున వాచ్యోత్ప్రేక్ష యేఁబదియాఱు భేదములు గలది. గమ్యోత్ప్రేక్ష నలుబదెనిమిదిభేదములు మాత్రమే గలది. ఎట్లన, వాచ్యోత్ప్రేక్షవలెనే గమ్యోత్ప్రేక్షయు జాతి, గుణ, క్రియా, ద్రవ్య భేదములచేఁ దొలుత నాలుగుభేదములు. అవి భావాభావములచే నెనిమిదిభేదములు. వానిని హేతువుగా, ఫలముగా, స్వరూపముగా నుత్ప్రేక్షించినచో మూఁడెనిమిదు లిఱువదినాలుగుభేదము లగును. అవియు గుణ క్రియా నిమిత్త ద్వైవిధ్యముచే నలువదెనిమిదిభేదము లగును. వాచ్యమగు స్వరూపోత్ప్రేక్షలోనే కాని గమ్యమగు స్వరూపోత్ప్రేక్షలో ననుపాత్తనిమిత్త యుండదు. ఏలన, గమ్యోత్ప్రేక్షయందు సంభావనాప్రతిపాదకపదము ప్రయోగింపఁబడదని చెప్పియుంటిమి. సంభావనావాచకమును బ్రయోగింపకయు నిమిత్తమును బ్రయోగింపకయు నున్నచో నుత్ప్రేక్షయే యసంభవము. కాన గమ్యోత్ప్రేక్షలో ననుపాత్తనిమిత్త యుండదు. వాచ్యోత్ప్రేక్షా గమ్యోత్ప్రేక్షలు వెరసి తొంబదియాఱు. {{Telugu poem|type=వ.|lines=<poem>ఇందు నేఁబదియాఱుభేదంబులం బొల్చు వాచ్యోత్ప్రేక్షకుం గొన్నినామధేయంబు లెఱింగించెద. 1. ఉపాత్తగుణనిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షయు, 2. ఉపాత్తక్రియానిమిత్తజాతిభావస్వరూపోత్ప్రేక్షయు, 3. ఉపాత్తగుణనిమిత్తజాత్యభావస్వరూపోత్ప్రేక్షయు, 4. ఉపాత్తక్రియానిమిత్తజాత్యభావస్వరూపోత్ప్రేక్షయు, 5. అనుపాత్తనిమిత్తజాతిభావస్వరూ</poem>|ref=}}<noinclude><references/></noinclude> tv2aperkq3ckdnmlxw6tlmeun8nypxq వర్గం:అలంకారశాస్త్రములు 14 224313 583754 583228 2026-10-06T12:01:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 583754 wikitext text/x-wiki *[[అప్పకవీయము]] ― కాకునూరి అప్పకవి *[[అలంకారచంద్రోదయము]] ― ఇమ్మానేని శరభలింగ కవి *[[అలంకారమకరందః]] ― కొల్లూరి రాజశేఖర సుధీ *అలంకారశేఖరము ― *అలంకారసర్వస్వమ్ ― రుయ్యకుడు *[[ఆనందరంగరాట్ఛందము]] ― కస్తూరి రంగయ *ఏకావలీ ― విద్యాధరుడు *[[కవికల్పలత]] ― దేవేశ్వరుడు **ఆంధ్రవివరణము ― కల్లూరి వెంకటసుబ్రహ్మణ్యదీక్షితులు *[[శ్రీరంగమహత్త్వము/అనుబంధము|కవిగజాంకుశము]] ― భైరవుడు *కవిచింతామణి (కవిలోకచింతామణి) - వెల్లంకి తాతంభట్టు *[[కవిజనసంజీవని]] ― ముద్దరాజు రామభద్రుడు *[[కవిజనాశ్రయము]] ― వేములవాడ భీమన *[[కవిరాక్షసీయము]] ― కవిరాక్షసుడు *[[కవిశిరోభూషణము]] ― అహోబలపండితుడు *[[కావ్యదర్పణము]] ― శ్రీరాజచూడామణి దీక్షితులు *[[కావ్యప్రకాశము]] ― మమ్మటుడు **బాలానందిని (తెలుగు వ్యాఖ్యానము) ― పుల్లెల శ్రీరామచంద్రుడు *[[కావ్యమీమాంసా]] ― రాజశేఖరుడు *కావ్యాదర్శము (కావ్యలక్షణము) ― దండి **ఆంధ్రకావ్యాదర్శము ― అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రి *కావ్యానుశాసనము ― హేమచంద్రుడు *[[కావ్యాలంకారచూడామణి]] ― విన్నకోట పెద్దన *కావ్యాలంకారము ― భామహుడు *కావ్యాలంకారసారసంగ్రహము ― ఉద్భటుడు *[[కావ్యాలంకారసంగ్రహము]] ― రామరాజభూషణుడు *కావ్యాలంకారసూత్రాణి ― వామనుడు *కువలయానందః ― అప్పయ్యదీక్షితుడు *చమత్కారచంద్రికా ― విశ్వేశ్వరుడు *[[చంద్రాలోకము]] ― జయదేవుడు *చిత్రమీమాంసా ― అప్పయ్యదీక్షితుడు *[[ఛందోదర్పణము]] ― అనంతుడు *[[ధ్వన్యాలోకము]] ― ఆనందవర్ధనుడు *[[ప్రతాపరుద్రీయమ్]] ― విద్యానాథ *[[భరతరసప్రకరణము]] ― నీడామంగలం తిరువేంకటాచార్యులు *[[యమకరత్నాకరమ్]] ― కూరత్తాళ్వార్ *[[నవరసగంగాధరము|రసగంగాధరము]] ― జగన్నాథ పండితరాయలు *[[రసతరఙ్గిణీ]] ― భానుసూరి *[[రసమఞ్జరీ]] ―భానుసూరి *[[రసార్ణవసుధాకరము]] ― *[[రసార్ణవాలంకారము]] ― ప్రకాశవర్షుడు *[[రసాభరణము]] ― అనంతామాత్యుడు *లక్షణచంద్రిక ― చిల్లరిగె యోగానందకవి *లక్షణదీపిక ― గౌరన *[[లక్షణశిరోమణి]] ― పొత్తపి వేంకటరమణ *[[లక్షణసారసంగ్రహము]] ― చిత్రకవి పెద్దన *వక్రోక్తిజీవితము ― కుంతకుడు *వాగ్భటాలంకారము ― వాగ్భటుడు *[[వికృతివివేకము]] ― *వైజయంతీ ― యాదవప్రకాశుడు *[[వ్యక్తివివేకము]] ― మహిమభట్టు *శబ్దకల్పద్రుమః ― చౌఖాంబాసంస్కృత సీరీస్ *[[శృంగారరసాలవాలము]] ― వెణుతుర్ల వడ్డికవి *శ్రీధరచ్ఛందము ― శ్రీధరుడు *[[సరస్వతీకంఠాభరణము]] ― భోజుడు *[[సర్వలక్షణసారసంగ్రహము]] ― కూచిమంచి తిమ్మన *సాహిత్యకల్పద్రుమః ― రాజశేఖరుడు *[[సాహిత్యచింతామణి]] ― *సాహిత్యదర్పణః ― విద్యానాథుడు *[[సాహిత్యదర్పణము]] ― శ్రీరాజచూడామణి దీక్షితులు **ఆంధ్రసాహిత్యదర్పణము ― *[[సాహిత్యరత్నాకరము]] ― ధర్మసూరి *[[సుకవి మనోరంజనము]] ― కూచిమంచి వేంకటరాయ *[[సులక్షణసారము]] ― లింగమకుంట తిమ్మన హనుమచ్ఛందము, అధర్వణచ్ఛందము, అనంతచ్ఛందము, కవిరాక్షసచ్ఛందము, జయదేవచ్ఛందము, శ్రీధరచ్ఛందము, గోకర్ణ చ్ఛందము, నీలకంఠచ్ఛందము, ఆదిమకవిభీమనచ్ఛందము [[వర్గం:సాహిత్యం]] kzzgew46umto32uqw5r31df8cq9gplw ప్రతాపరుద్రీయమ్ 0 227846 583752 2026-10-06T11:59:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[ప్రతాపరుద్రీయమ్]] | రచయిత = విద్యానాథ | అనువాదం= ఉత్పల వేంకటనరసింహాచార్య (పరిష్కర్త) | విభాగము = | ముందరి = | తదుపరి = [[ప్రతాపరుద్రీయమ్/ఉపోద్ఘాతః|ఉపోద్ఘాతః]] |...' 583752 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ప్రతాపరుద్రీయమ్]] | రచయిత = విద్యానాథ | అనువాదం= ఉత్పల వేంకటనరసింహాచార్య (పరిష్కర్త) | విభాగము = | ముందరి = | తదుపరి = [[ప్రతాపరుద్రీయమ్/ఉపోద్ఘాతః|ఉపోద్ఘాతః]] | వివరములు = |సంవత్సరం = 1934 }} <pages index="ప్రతాపరుద్రీయమ్ (విద్యానాథ)..pdf" from=1 to=1 /> libpmoj0xhgve82919q4bh2elzmy1de 583753 583752 2026-10-06T11:59:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 583753 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ప్రతాపరుద్రీయమ్]] | రచయిత = విద్యానాథ | అనువాదం= ఉత్పల వేంకటనరసింహాచార్య (పరిష్కర్త) | విభాగము = | ముందరి = | తదుపరి = [[ప్రతాపరుద్రీయమ్/ఉపోద్ఘాతః|ఉపోద్ఘాతః]] | వివరములు = |సంవత్సరం = 1934 }} <pages index="ప్రతాపరుద్రీయమ్ (విద్యానాథ).pdf" from=1 to=1 /> k4gxobbq6k55u6sh472z1gwd4y6gwz7 దస్త్రం:ఆంధ్ర సాహిత్యదర్పణము.pdf 6 227847 583777 2026-10-06T22:53:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 583777 wikitext text/x-wiki == లైసెన్సింగ్ == {{PD-India}} hj0sf97r04cynfx14q7glftdni7a88z పుట:బ్రహ్మోత్తరఖండము (శ్రీధరమల్లె వేంకటరామార్యుఁడు).pdf/6 104 227848 583813 2026-10-07T11:14:57Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగి సుమతికి దత్వోపదేశంబు చేయుట]]}} |{{DJVU page link|203|7}} }} {{dotted TOC page listing| |{{sc|బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగీశ్వరుండు మృతుండైన...' 583813 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగి సుమతికి దత్వోపదేశంబు చేయుట]]}} |{{DJVU page link|203|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగీశ్వరుండు మృతుండైన రాజకుమారుని బ్రదికించుట]]}} |{{DJVU page link|208|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగీశ్వరుడు భద్రాయువునకు నష్టాదశపురాణరహస్యంబు లుపదేశించుట]]}} |{{DJVU page link|212|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగి భద్రాయువునకు శివకవచం బుపదేంబు చేయుట]]}} |{{DJVU page link|217|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|వజ్రబాహుని మగధదేశపురాజు జయించుట]]}} |{{DJVU page link|224|7}} }}<noinclude><references/></noinclude> t3p18qd54dhi5pvh5zr507kn21c5e00 583815 583813 2026-10-07T11:28:30Z Rajasekhar1961 50 583815 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగి సుమతికి దత్వోపదేశంబు చేయుట]]}} |{{DJVU page link|203|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగీశ్వరుండు మృతుండైన రాజకుమారుని బ్రదికించుట]]}} |{{DJVU page link|208|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగీశ్వరుడు భద్రాయువునకు నష్టాదశపురాణరహస్యంబు లుపదేశించుట]]}} |{{DJVU page link|212|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|ఋషభయోగి భద్రాయువునకు శివకవచం బుపదేంబు చేయుట]]}} |{{DJVU page link|217|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/చతుర్థాశ్వాసము|వజ్రబాహుని మగధదేశపురాజు జయించుట]]}} |{{DJVU page link|224|7}} }} {{Center| [[బ్రహ్మోత్తరఖండము/పంచమాశ్వాసము|పంచమాశ్వాసము]] }} {{dotted TOC page listing| |{{sc|[[బ్రహ్మోత్తరఖండము/పంచమాశ్వాసము|విభూతిమహత్వము-వామదేవోపాఖ్యానము]]}} |{{DJVU page link|273|7}} }}<noinclude><references/></noinclude> o5fcu9mdxycldtnpb6h4xtum63862n9